భారత్ - సింగపూర్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆహార అవసరాలను తీర్చేలా భారత్ నుంచి సింగపూర్‌కు బియ్యాన్ని ఎగుమతి చేసుకునేలా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది.
భారత్, సింగపూర్ దేశాల మధ్య వ్యూహాత్మక ఒప్పందాలు, ఆర్ధికంగా బలోపేతం అయ్యేలా కొనసాగుతున్న సన్నిహిత సంబంధాల్ని దృష్టిలో ఉంచుకుని, ఆహార భద్రత అవసరాలకు అనుగుణంగా బియ్యం ఎగుమతిని అనుమతించాలని భారత్ నిర్ణయించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
Our response to media queries on export of rice to Singapore:https://t.co/RfmpXV38jR pic.twitter.com/lzqbRlzesb
— Arindam Bagchi (@MEAIndia) August 29, 2023
20 శాతం సుంకం
ఆగస్ట్ 27న దేశీయంగా బియ్యం ధరల్ని అదుపులో ఉంచేలా ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించింది. ఆగస్టు 25 నుంచే ఈ సుంకం అమల్లోకి రాగా.. ఈ ఏడాది అక్టోబరు 16 వరకు ఈ నిబంధన కొనసాగుతుందని పేర్కొంది.
వరి ఉత్పత్తిపై అంచనాలు.. అప్రమత్తమైన కేంద్రం
ప్రపంచంలోని బియ్యం ఎగుమతులలో భారత్ వాటా సుమారు 40 శాతం. భారత్ నుంచి సుమారు 140 దేశాలకు బియ్యం ఎగుమతి అవుతుంది. భారత్ తరువాత అత్యధికంగా థాయిలాండ్, వియత్నాం, పాకిస్తాన్, అమెరికా బియ్యం ఎగుమతి చేస్తున్నాయి. అయితే ఉత్తర భారతదేశంలో వరి పండించే రాష్ట్రాలలో భారీ వర్షాలు కురవడం, దేశంలోని మరికొన్ని రాష్ట్రాలలో వర్షాభావం కారణంగా ఈ ఏడాది వరి ఉత్పత్తి తగ్గనుందన్న అంచనాలున్నాయి. దానివల్ల బియ్యం ధరలు పెరగకుండా ఉరుము లేని పిడుగులా బాస్మతి బియ్యం మినహా మిగతా రకాల తెల్ల బియ్యం ఎగుమతుల్ని తక్షణమే నిషేధిస్తూ ‘ఆహారం, వినియోగదారుల వ్యవహారాల’ మంత్రిత్వ శాఖ జులై 20న ఉత్తర్వులు జారీచేసింది.
బియ్యమో రామచంద్రా
అమెరికాలో ఆసియా ప్రజల ప్రధాన ఆహారం బియ్యమే. ఎక్కవగా భారత్ నుంచే అక్కడకు ఎగుమతి అవుతుంది. బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలతో అమెరికాలోని భారతీయులు అప్రమత్తయ్యారు. బియ్యమో రామచంద్రా అనుకుంటూ.. ముందుగానే బియ్యం బస్తాల్ని కొనుగోలు చేసేందుకు సూపర్ మార్కెట్లకు పోటెత్తారు. దాంతో కొన్ని సూపర్ మార్కెట్లలలో రైస్ బ్యాగ్‌లు కొద్ది నిమిషాలలోనే అమ్ముడు పోవడం, బియ్యం లభ్యం కాకపోవడంతో క్యూ లైన్‌లలో నిలబడి ఎదురు చూపులు చూస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, బియ్యం ఎగుమతులపై తాజాగా భారత్ ఆంక్షల సడలించడంతో సింగపూర్ ప్రజలకు ఊరట కలిగినట్లైంది.
Comments
Please login to add a commentAdd a comment