Rice
-
బియ్యం కోసం తల్లి హత్య
భువనేశ్వర్:పది కేజీల బియ్యం కోసం జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. అది కూడా కన్నకొడుకు తల్లిని గొడ్డలితో నరికి చంపే దాకా వెళ్లింది. ఈ దారుణ ఘటన ఒడిశాలోని శరత్చంద్రాపూర్లో జరిగింది. అన్నదమ్ములైన రోహిదాస్,లక్ష్మికాంత్సింగ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో రోహిదాస్ 10 కిలోల బియ్యం కోసం తల్లి రాయ్బరిసింగ్తో గొడవ పెట్టుకున్నాడు. బియ్యం ఇవ్వడానికి ఆమె తిరస్కరించడంతో గొడవ కాస్తా సీరియస్ అయి రోహిదాస్ గొడ్డలితో తల్లిపై దాడి చేశాడు. గొడ్డలితో దాడి చేయడంతో తల్లి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.అనంతరం రోహిదాస్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి ఉపయోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: భర్త వివాహేతర సంబంధం..భార్యా,కుమారుడి ఆత్మహత్య -
15 వరకు వరికి బీమా గడువు పెంపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటల బీమా పథకం నత్తనడకన సాగుతోంది. స్వచ్ఛందంగా రైతులే నమోదు చేసుకోవాల్సి ఉన్న బీమా పథకంపై వారికి అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభు త్వం ఘోరంగా విఫలమైంది. మరోవైపు బీమా ప్రీమియం కూడా అధికంగా ఉండటంతో రైతులు ఈ పథకంలో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. వాస్తవానికి వరితో సహా అన్ని పంటలకు ప్రీమియం గడువు డిసెంబర్ 31నే ముగిసింది. అయితే వరికి మాత్రమే ప్రీమియం గడువును పెంచేందుకు బీమా కంపెనీలు ముందుకొచ్చాయి. జనవరి 15 వరకు ప్రీమియం చెల్లింపునకు అవకాశం కల్పించాయి. నోటిఫై చేసిన జీడి పంటకు గతేడాది నవంబర్ 22తో, ఇటీవల కొత్తగా నోటిఫై చేసిన మామిడితో సహా అన్ని పంటలకు డిసెంబర్ 31తో బీమా ప్రీమియం చెల్లించడానికి గడువు ముగిసింది. ఈసారి 7.46 లక్షల మందే.. నోటిఫై చేసిన పంటల సాగు లక్ష్యం 60.55 లక్షల ఎ కరాలు కాగా ఇప్పటి వరకు అతికష్టమ్మీద 9.75 లక్షల ఎకరాల్లో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. గతేడాది 43.82 లక్షలమంది రైతులకు బీమా రక్షణ లభించగా, ఈ ఏడాది రబీలో పంటలు సాగు చేసిన రైతుల్లో కేవలం 7.46 లక్షల మంది రైతులు మాత్రమే బీమా కవరేజ్ పొందగలిగారు.నమోదు చేసుకోవడం ఓ ప్రహసనం..పంటల బీమాలో స్వచ్ఛంద నమోదు రైతులకు తలనొప్పిగా మారింది. బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులు ముందుగా తాము సాగు చేసే పంటల వివరాలను జాతీయ పంటల బీమా పోర్టల్ (ఎన్సీఐసీ)లో నమోదు చేయాలి. రుణం తీసుకునేటప్పుడు బ్యాంకు వాళ్లే ప్రీమియం వసూలు చేసి సదరు బీమా కంపెనీకి చెల్లిస్తారు. ఒకవేళ బీమా వద్దనుకుంటే రాతపూర్వకంగా బ్యాంకుకు వెల్లడిస్తే సరిపోతుంది. బ్యాంకుల నుంచి రుణం పొందని రైతులు తమ వాటా ప్రీమియంను ఆన్లైన్లో చెల్లించి, ధ్రువీకరణ పత్రాలతో సచివాలయాలు/ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు/పోస్టాఫీస్‌లు/కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఎన్సీఐసీ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. కౌలు రైతులకైతే సీసీఆర్సీ కార్డులు తప్పనిసరి. రైతులు సాగు చేసిన పంటలను ధ్రువీకరిస్తూ రైతు సేవా కేంద్రాల సిబ్బంది జారీ చేసే ఏరియా షోన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఆధార్ సీడింగ్ బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో ప్రీమియం చెల్లింపు, ఎన్సీఐసీ పోర్టల్‌లో గడువులోగా అప్లోడ్ చేయడం రైతులకు కత్తి మీదసాములా మారింది. బీమా లేకపోయినా పర్వాలేదు.. పనులు మానుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగలేకపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. -
మంత్రి నాదెండ్లకు షాక్..!
-
కడుపు నింపుతున్న.. 'దోసెడు బియ్యం'
నెలలో మూడో మంగళవారం వచ్చిoదంటే..భుజాన పుస్తకాల బ్యాగే కాదు.. ప్రతి విద్యార్థి చేతిలోని బాక్సు నిండా ఇంటి వద్ద నుంచి బియ్యం నింపుకొని కాలేజీకి తెస్తారు. కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రమ్‌లో వాటిని పోస్తారు.వచ్చిన బియ్యం మొత్తాన్ని మూడు నుంచి ఐదు కేజీల చొప్పున ప్యాకెట్లుగా చేసి వాటిని పేదలకు అందజేసి వారి ఆకలిని తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలోని శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు. హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ (గుప్పెడు బియ్యం) పేరిట రెండున్నరేళ్లుగా నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. – సాక్షి, భీమవరంవిద్యార్థుల్లో మానవత్వం పెంపుదల.. కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉండగా వాటిలో 300 మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. విద్యతో పాటు ఎన్ఎస్ఎస్, రెడ్‌క్రాస్ సంబంధిత సేవా కార్యక్రమాల నిర్వహణకు ఇక్కడి అధ్యాపక బృందం, విద్యార్థులు ప్రాధాన్యమిస్తుంటారు. అందులో భాగంగానే 2022లో ‘దోసెడు బియ్యం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనం తీసుకునే ఆహారంలో కొంచెం భాగం ఇతరులకు ఇవ్వడం, విద్యార్థుల్లో మానవత్వాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రతి విద్యార్థీ నెలలో నిర్ణీత రోజున తమ ఇంటి వద్ద నుంచి గుప్పెడు బియ్యాన్ని తెచ్చి కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రమ్‌లో వేస్తే.. సేకరించిన మొత్తాన్ని అవసరమైన నిరుపేదలకు అందించాలి. ప్రతినెలా మూడో మంగళవారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైనా నెలలో ఆ రోజు సెలవు వస్తే ముందురోజున లేదా మరుసటి రోజున అమలు చేస్తున్నారు. నెలకు దాదాపు 100 నుంచి 120 కేజీల వరకు బియ్యం వస్తుండగా, వాటిని మూడు నుంచి ఐదు కేజీల వరకు బ్యాగులుగా ప్యాక్ చేసి గ్రామంలోని మార్కెట్ తదితర ప్రాంతాల్లోని నిరుపేదలకు పంపిణీ చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.నిర్మలకుమారి నేతృత్వంలో వైస్ ప్రిన్సిపల్ పి.మధురాజు, కామర్స్, బోటనీ లెక్చరర్లు బి.రాణిదుర్గ, డాక్టర్ సీహెచ్ చైతన్యల పర్యవేక్షణలో రెండున్నరేళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.మూడో మంగళవారం వచ్చిందంటే చాలు తమకంటే ముందే తమ పేరెంట్స్ బాక్సులో బియ్యం పోసి సిద్ధం చేయడం ద్వారా ఇప్పటికే తమ కళాశాలలో చేస్తున్న ఈ సేవలో భాగస్వాములయ్యారని విద్యార్థులు చెబుతున్నారు. మిగిలినచోట్ల విద్యార్థులు ప్రయత్నిస్తే ఒక పెద్ద సేవగా మారుతుందని వారు ఆశిస్తున్నారు. ఆనందంగా అనిపిస్తుంది ప్రతినెలా విద్యార్థులమంతా కలసి బియ్యం తెచ్చి పేదలకు పంచడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఈ హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ ప్రోగ్రాం మరింత విస్తరించి ప్రతి ఒక్కరూ ఇతరులకు పంచే సేవ చేయటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. – పి.హర్షిత, బీకాం సెకండియర్ బియ్యం ఇచ్చి పంపుతారు నెలలో మూడో మంగళవారం వచ్చి0దంటే చాలు కాలేజీకి ఈరోజు బియ్యం తీసుకువెళ్లాలి ఇవిగో అంటూ బాక్సులో పోసి పేరెంట్స్ పంపిస్తుంటారు. మా స్టూడెంట్సే కాదు మా పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. – కె.జాయ్, బీకాం కంప్యూటర్స్, సెకండియర్మార్పుకోసం చిన్న ప్రయత్నం ఇది కేవలం ఒక సామాజిక సేవా కార్యక్రమం కాదు. పేదరికాన్ని తగ్గించేందుకు, మానవత్వాన్ని పెంచేందుకు, సమాజంలో మార్పు కోసం మా విద్యార్థులు చేస్తున్న చిన్న ప్రయత్నం. ఈ కార్యక్రమం నిర్వహించే బాధ్యత నాకు అప్పగించడచాలా ఆనందంగా ఉంది. – బి.రాణి దుర్గ, కామర్స్ లెక్చరర్ పంచే గుణాన్ని అలవాటు చేసేందుకు తమకు ఉన్న దానిలో ఇతరులకు కొంచెం పంచే గుణాన్ని విద్యార్థులకు అలవాటు చేయడం హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ ముఖ్య ఉద్దేశం. మా కళాశాలలో ప్రిన్సిపల్ నిర్మలకుమారి మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న అత్యుత్తమ సేవా కార్యక్రమాల్లో ఇదీ ఒకటి. – డాక్టర్ సీహెచ్ చైతన్య, బోటనీ లెక్చరర్ విద్యతో పాటు విలువలు మా కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారిలో మంచి విలువలు పెంపొందించాలన్నదే మా లక్ష్యం. పేదవారి ఆకలిని తీర్చడంలో ఉండే సంతృప్తిని వారు ఆనందిస్తున్నారు. ప్రతినెలా అందరూ ఎంతో ఉత్సాహంగా హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. – డాక్టర్ పి.నిర్మలాకుమారి, ప్రిన్సిపల్ -
మంత్రి గారి బంధువు చెప్పారు.. వదిలేయండి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఆ ఓడ మనోళ్లదే.. వదిలేయండి. బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ బియ్యం ఎందుకు కలుస్తాయి? తనిఖీలు చేసి నిర్ధారించాల్సింది ఏముంటుంది? ఓడ పోర్టులో నిలిచిపోయి చాలా రోజులైంది. తక్షణం ఎగుమతికి అనుమతిచ్చి ఓడను వదిలేయండి’ అంటూ మూడు వారాలుగా కాకినాడ పోర్టులో నిలిపివేసిన నౌకకు కూటమి నేతలు ఆఘమేఘాలపై అనుమతిచ్చేశారు. మంత్రిగారి బంధువుకు చెందిన ఎక్స్‌పోర్టు కంపెనీ తరలిస్తున్న బియ్యం ఇందులో ఉందని, అందువల్లే బ్రోకెన్ రైస్ కాబట్టి అందులో పీడీఎస్ బియ్యం కలవలేదని ఎలా నిర్ధారిస్తారన్న మిగతా ఎగుమతిదారుల ప్రశ్నలకు సమాధానం రాకుండానే ఆ నౌక విదేశాలకు తరలిపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో చక్రం తిప్పిన మంత్రిమరోపక్క మంత్రి బంధువుల కన్సైన్మెంట్లు ఉండటంతో బ్రోకెన్ రైస్ అంటూ కాకినాడ నుంచే పున్నీ నౌకను పంపించేశారు. ఆఫ్రికా ఖండంలోని డక్కర్ దేశానికి కాకినాడ పోర్టు నుంచి 40 వేల మెట్రిక్ టన్నుల బ్రోకెన్ రైస్ ఎగుమతికి ఇటీవల కేంద్రం అనుమతించింది. ఈ ఎగుమతి హక్కులను పట్టాభి ఆగ్రోస్, కేఎన్ రిసోర్సెస్, మురళీమోహన్, సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. డక్కర్‌కు బ్రోకెన్ రైస్ ఎగుమతి కోసం ఎంవీక్యూ పున్నీ నౌక గత నెల 28న కాకినాడ వచ్చింది. అదే సమయానికి కాకినాడ పోర్టులో ఉన్న స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో పీడీఎస్ బియ్యంపై రాద్ధాంతం మొదలైంది. ఈ నౌకను పోర్టులో నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పున్నీ నౌకను కూడా పోర్టులో మూడు వారాలుగా నిలిపివేశారు. ఈ నౌకను పంపించేయడానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాకినాడ పోర్టు ద్వారా బియ్యం ఎగుమతుల్లో కీలకంగా ఉన్న ఒక ఎక్స్‌పోర్టర్ నేషనల్ కో–ఆపరేటివ్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్ ద్వారా లాబీయింగ్ చేశారని సమాచారం. ఇందుకోసం ఆయన తన బంధువైన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ కేబినెట్ మంత్రి ద్వారా కేంద్రంలో చక్రం తిప్పినట్లు సమాచారం. సహజంగా రా రైస్ లేదా బ్రోకెన్ రైస్‌లో పోర్టిఫైడ్ రైస్‌లోని కేర్నల్స్ (పేదలకు పంపిణీ చేసే బియ్యంలో పౌష్టికాహారం కలిపే ప్రక్రియ) ఒక శాతం అనుమతిస్తారు. అంతకు మించి ఉంటే 6ఏ కేసు అవుతుంది. డక్కర్ దేశానికి ఎగుమతికి సిద్ధం చేసిన బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ కలిసి ఉండవచ్చుననే అనుమానంతో ఇన్ని రోజులూ నిలిపివేశారు. అయినా నౌకలో తనిఖీలు లేకుండా అనుమతివ్వడం పలు సందేహాలకు తావిస్తోంది. పైగా, స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో గుర్తించిన పీడీఎస్ బియ్యం మొత్తం సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్ట్సు ప్రైవేట్ లిమిటెడ్దేనని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ స్వయంగా ప్రకటించారు. పున్నీ నౌకలో బ్రోకెన్ రైస్ ఎగుమతికి ఆర్డర్ పొందిన నాలుగు సంస్థలో సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్ట్సు కూడా ఉంది. అటువంటప్పుడు బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ కలవలేదని ఎలా నిర్థారిస్తారని, కనీసం శాంపిళ్లు తీయకుండా, కెమికల్ టెస్ట్ చేయకుండా ఎగుమతికి ఎలా అనుమతిస్తారని ఎక్స్‌పోర్టర్లు ప్రశ్నిస్తున్నారు.కాకినాడ పోర్టుపై నానాయాగీకూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి సీఎం చంద్రబాబు డైరెక్షన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిపోతోందంటూ కాకినాడ పోర్టులో యాగీ ప్రారంభించారు. రేషన్ బియ్యాన్ని ఇక్కడి నుంచి నుంచి విదేశాలకు తరలించేసి కోట్లు కొల్లగొట్టేశారని గత ప్రభుత్వంపై విషం చిమ్మారు. ఆఫ్రికా ఖండానికి స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నాయని, సినిమా స్టైల్లో ‘సీజ్ ద షిప్’ అంటూ పవన్ పెద్ద బిల్డప్పే ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి నాదెండ్ల విశాఖ పోర్టుకు వెళ్లి, అక్కడ కూడా పీడీఎస్ బియ్యం తరలిపోతోందంటూ హడావుడి చేశారు. అయితే, ఆ బియ్యం టీడీపీ నేతల అనుచరులదేనని తెలియడంతో మారు మాట్లాడలేదు. -
అన్నం సయించనప్పుడు ఇలా తీసుకుంటే మేలు..!
చాలా మంది సరిగా భోజనం చేయరు. ఏమీ తినాలనిపించడం లేదనీ, తమకు అన్నం సయించడం లేదనీ చెబుతుంటారు. సాధారణంగా కాస్త పెద్దవయసు వచ్చాక ఇలాంటి మార్పు చాలామందిలో కనిపిస్తుంది. ఇలాంటివారు ఎలా తినాలో, ఎలా తినడం వల్ల తమకు అందాల్సిన పోషకాలు అందుతాయో తెలుసుకుందాం.అన్న సయించనివారు ఏదో తినడం కోసమంటూ చాలా తక్కువగానే తింటున్నప్పటికీ ఆ భోజనం అన్ని పోకాలూ అందేలాంటి బ్యాలెన్స్డ్ డైట్‌తో కూడిన మీల్ గా ఉండాలి. అంటే అందులో దేహానికి అవసరమైన పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు వంటివి పుష్కలంగా అందేలా కాయధాన్యాలూ, పప్పుధాన్యాలు, తినేవారైతే మాంసాహారంలోని వేటమాంసం, కోడిమాంసం, చేపలు, ఇక మిగతా అందరూ ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పాల ఉత్పాదనలు, తాజా పండ్లు ఇవన్నీ.ఎంత ఆహారం అవసరమంటే... ఓ వ్యక్తికి ఇంత ఆహారం అవసరమని నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే... ఓ వ్యక్తికి ఎన్ని క్యాలరీల ఆహారం అవసరం అన్నది... వారి వయస్సు, వారు పురుషుడా/వుహిళా, వాళ్ల బరువు, వాళ్లు రోజువారీ చేపే పనులు, అవి శ్రమతో కూడినవా, లేక ఒకేచోట కూర్చుని చేసేవా... ఇలాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.అన్నం సయించని వారు తినే వాటిల్లోనే రుచిగా... అన్నం సయించడం లేదంటూ పెద్దగా ఆహారం తీసుకోనివారు... తాము తినే ఆ కొద్దిపాటి ఆహారంలోనే వీలైనన్ని రకరకాల పదార్థాలు రకరకాల పద్ధతుల్లో కాస్తంత నాలుకకు రుచిగా వండినవి, తినేందుకు ప్రయత్నించాలి. ఆహారంలోనూ అనేక రకాలు (వెరైటీస్) వండి తీసుకోవడం వల్ల ... అవి కొన్నీ, ఇవి కొన్నీ తీసుకుంటూ చాలా రకాలు ఉండటం వల్ల తీసుకోవాల్సిన పరిమాణం అంతో ఇంతో భర్తీ అయ్యే అవకాశం ఉంది. దాంతో వారు తీసుకోవాల్సిన రోజువారీ ఆహారపు పరిమాణం చాలావరకు అందే అవకాశముంది.ఇదీ సాధారణ డైట్ ప్లాన్... అన్నం సయించనివారు ఈ కింది సాధారణ డైట్ ప్లాన్ అవలంబిస్తే మంచిది. ఇలాంటివాళ్లంతా రోజూ తమ రోజువారీ ఆహారంలో చపాతీ లేదా అన్నంతోపాటు పప్పులు (దాల్) లేదా శెనగలు, రాజ్మా వంటివి తీసుకోవడం మంచిది. వీటి కారణంగా వారికి అవసరమైన కార్బోహైడ్రేల్లు,ప్రోటీన్లు సమకూరుతాయి. భోజనం చివర్లో ఓ కప్పు పెరుగుతో పెరుగన్నం తినాలి. భోజనానికి ముందు క్యారట్, కీర, దోస వంటి కూరగాయలను సలాడ్స్‌గా తీసుకోవాలి. ప్రతిరోజూ పడుకోబోయే వుుందు ఓ కప్పు పాలు తాగితే కొద్దిమేర ఆరోగ్యకరమైన కొవ్వులు, క్యాల్షియమ్ సమకూరుతాయి. తినే పరివూణం తక్కువైనా, అందులోనే ఆ సీజన్లో దొరికేవైన తాజా పండ్లను సాధ్యమైనన్ని తీసుకోవాలి. చాలా తరచుగా అప్పుడప్పుడూ తృణధాన్యాలతో ఏవైనా వంటకాలను చిరుతిండ్లలా చేయించుకుని తినాలి. చిరుతిండి కాబట్టి ఈ శ్నాక్స్ రుచిగా ఉండి, బాగా తినాలని అనిపిస్తాయి.ఇలా ఇన్ని వెరైటీలుగా రకరకాల ఆహారాల్ని తీసుకోవడం వల్ల ఒంటికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజలవణాలూ, మైక్రో, మ్యాక్రో న్యూట్రియెంట్లు... అన్నీ అందేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ తీసుకుంటే తక్కువగానే తింటున్నప్పటికీ అవసరమైన పోషకాలన్నీ చాలావరకు దొరుకుతాయి. (చదవండి: గుండెకు మేలు చేసే పండ్లు..!) -
చికెన్ రైస్ తిన్న అథ్లెట్ మృతి!
అన్నానగర్: చైన్నెలో ‘చికెన్ రైస్’ తిన్న అథ్లెట్ విషాదకరంగా మరణించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోయంబత్తూరులోని సుకునాపురానికి చెందిన రాబిన్ డెన్నిస్(40) కుమార్తె ఎలీనా లారెట్(15) బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. ఈమె అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 8 నుంచి 15వ తేదీ వరకు అంతర్ పాఠశాలల బాస్కెట్‌బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఆడేందుకు ఎలీనా లారెట్ తన తోటి విద్యార్థులతో కలిసి రైలులో మధ్యప్రదేశ్ వెళ్లింది. పోటీ ముగించుకుని గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం చైన్నెకి వచ్చారు. రైలు ప్రయాణంలో తినేందుకు ఆన్లైన్లో ఆర్డర్ చేసి చికెన్ రైస్ కొనుగోలు చేసింది. విద్యార్థిని ఎలీనా లారెట్ తోటి విద్యార్థులతో కలిసి రైలులో చికెన్ రైస్, బర్గర్లు తిన్నట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర కడుపునొప్పితో వాంతులు, స్పృహ తప్పి పడిపోయింది. ఈ విషయాన్ని ఎలీనా లారెట్ చైన్నెలోని అన్నానగర్‌లో ఉన్న తన బంధువు డేవిడ్ విలియమ్స్‌కు చెప్పింది. రైలు చైన్నె చేరుకోగానే ఎలీనాను చికిత్స నిమిత్తం అన్నానగర్ 4వ అవెన్యూలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఎలీనా పెరవళ్లూరులోని మరో బంధువుల ఇంటికి వెళ్లింది.అక్కడికి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత ఎలీనాకు మళ్లీ కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే బంధువులు ఆమెని పెరవళ్లూరులోని పెరియార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఎలీనాను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పెరవళ్లూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలీనా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెరవళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికెన్ రైస్ తిని విద్యార్థిని మృతి చెందిందా? లేక ఆమె మరణానికి మరేదైనా కారణాలు ఉన్నాయా? అనేది పోస్టుమార్టం నివేదిక తర్వాతే తేలనుందని పోలీసులు తెలిపారు. ఆడుకోవడానికి వెళ్లిన విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబసభ్యులు, తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
ముద్ద అన్నం.. తింటే కడుపు నొస్తోంది
తిమ్మాపూర్: ‘వారం రోజులుగా హాస్టళ్లలో అన్నం నాసిరకంగా ఉంటోంది. ముద్దలు ముద్దలుగా ఉండటంతో పాటు వాసన వస్తోంది. తినలేకపోతున్నాం. ఆకలవుతోందని తింటే కడుపునొస్తోంది. దీంతో చాలా మంది విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారు. హాస్టల్ అధికారులు విషయాన్ని బయటకు తెలియనివ్వడం లేదు. మేము అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు.వారంరోజులుగా కడుపునిండా తిండిలేక నీరసించిపోతున్నాం’అంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు. బియ్యంలో కల్తీ లేదు: ప్రిన్సిపాల్ రామకృష్ణ కాలనీలోని జ్యోతిబాపూలే బాలుర గురుకులంలో 450 మంది విద్యార్థులు ఉన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచే గురుకుల భోజనం చార్జీలను ప్రభుత్వం 40 శాతం పెంచింది. తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అయినా అధికారులు మెనూ మార్చకపోగా, నాసిరకంగా అన్నం పెట్టడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికి రెండుసార్లు మాంసాహారం పెట్టాల్సి ఉండగా సరిగ్గా పెట్టడం లేదని, కోడిగుడ్లు వారానికి రెండు మూడే ఇస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా ఓపిక పట్టిన విద్యార్థులు మంగళవారం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ భోజనం ఎలా తినాలని నిలదీశారు. మీ పిల్లలకు ఇలాగే పెడుతున్నారా అని ప్రశ్నించారు. సివిల్ సప్లయ్ అధికారులు నాసిరకం బియ్యం పంపుతున్నారని, దాంతో మెత్తగా అవుతోందని, బియ్యంలో ఎలాంటి కల్తీ లేదని, కావాలనే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గురుకులంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మిగతా వాటి పరిస్థితి ఏంటని విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. -
రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్
అధిక ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు.. కేంద్ర ప్రభుత్వం మంగళవారం రెండవ దశ భారత్ బ్రాండ్ కింద సబ్సిడీ ధరలకు గోధుమ పిండి, బియ్యం విక్రయాలను ప్రారంభించింది. ఎన్సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయాలు జరగనున్నాయి.భారత్ బ్రాండ్ కింద కేజీ గోధుమ పిండి ధర రూ. 30 కాగా.. బియ్యం రూ. 34వద్ద అందుబాటులో ఉన్నాయి. గతంలో గోధుమ పిండిని రూ. 27.5కు, బియ్యాన్ని రూ. 29కే విక్రయించారు. అయితే ఇప్పుడు ఈ ధరలు కొంత పెరిగాయి. అయితే ప్రభుత్వం లక్ష్యం వ్యాపారం కాదని, మార్కెట్ ధరల కంటే తక్కువకు అందించడమే అని, ఫేజ్-2 ప్రారంభించిన సమయంలో కేంద్ర మంత్రి 'ప్రహ్లాద్ జోషి' తెలిపారు.గోధుమ పిండి, బియ్యం రెండూ కూడా 5 కేజీలు, 10 కేజీల ప్యాకెట్ల రూపంలో లభిస్తాయి. తక్కువ ధరకే గోధుమ పిండి, బియ్యాన్ని సరఫరా చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నుంచి 3.69 లక్షల టన్నుల గోధుమ, 2.91 లక్షల బియ్యాన్ని సేకరించినట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ స్టాక్ ఉన్నంత వరకు విక్రయాలు జరుగుతాయి, అవసరమైతే ఇంకా ఎక్కువ కేటాయిస్తామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలుప్రజలు కోరుకుంటే గోధుమ పిండి, బియ్యాన్ని మరింత చిన్న ప్యాకెట్ల రూపంలో కూడా అందించడానికి సిద్ధమని ప్రహ్లాద్ జోషి అన్నారు. మునుపటి దశలో కేంద్రం.. 15.20 లక్షల టన్నుల గోధుమ పిండిని, 14.58 లక్షల టన్నుల బియ్యం (అక్టోబర్ 2023 నుంచి జూన్ 30, 2024 వరకు) పంపిణీ చేసినట్లు సమాచారం.A Step Towards Food Affordability: Bharat Atta & Bharat Rice at Subsidized RatesDelighted to launch Phase II of 'Bharat Atta' & 'Bharat Rice' sales from Krishi Bhawan, New Delhi today.This latest initiative by the @narendramodi Govt aims to support consumers by providing… pic.twitter.com/iaQpUfnjjA— Pralhad Joshi (@JoshiPralhad) November 5, 2024 -
ప్రపంచంలోనే ఖరీదైన బియ్యం
జపాన్‌లో పండించే ‘కిన్‌మెమాయి’ అనే రకానికి చెందిన ఈ బియ్యం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం. జపాన్‌లోని టోయో రైస్ కార్పొరేషన్ ఐదు రకాల వరి వంగడాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసి, పండిస్తోంది. ఈ బియ్యం కిలో ప్యాకెట్లలోను, బస్తాల్లో కాకుండా, 140 గ్రాముల ఆరు సాచెట్లు నింపిన ప్యాకెట్లలో విక్రయిస్తుండటం విశేషం. టోయో రైస్ కార్పొరేషన్ పేటెంట్ పొందిన ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఈ బియ్యం గింజల పొట్టు పూర్తిగా తొలగించకుండా ప్యాక్ చేస్తుంది. ఈ కిన్‌మెమాయి’ బియ్యం గింజలు చిన్నగా ఉంటాయి. మిగిలిన రకాల బియ్యంతో పోల్చుకుంటే, కిన్‌మెమాయి రకం బియ్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని, దీని రుచి కూడా చాలా బాగుంటుందని టోయో రైస్ కార్పొరేషన్ చెబుతోంది. ఈ బియ్యం ధరలు రకాన్ని బట్టి కనీసం కిలోకు 109 డాలర్ల నుంచి 155 డాలర్ల (రూ.9,135 నుంచి రూ. 12,990) వరకు ఉంటాయి. -
సన్నబియ్యానికి ‘నూకలు’ చెల్లినట్టే!
సాక్షి, హైదరాబాద్: సన్నబియ్యంలో నూకల పేరిట మిల్లర్లు భారీ స్కెచ్ వేశారు. 100 కిలోల సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు వస్తాయని కొత్తరాగం ఎత్తుకున్నారు. నిబంధనల ప్రకారం ఖరీఫ్‌లో 100 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం లెక్కన ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఈసారి కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం (సన్నాలు) భారీ ఎత్తున వస్తాయని భావిస్తున్న మిల్లర్లు మిల్లింగ్‌లో చేతివాటం చూపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు రబీలో వచ్చే ధాన్యాన్ని రా రైస్‌గా మిల్లింగ్ చేస్తే నూకల శాతం పెరుగుతుందని చెబుతూ వచ్చిన మిల్లర్లు.. ఈసారి సన్న ధాన్యానికి కూడా ఇదే వంక పెడుతున్నారు. గతంలో ఎన్నడూ ఖరీఫ్ ధాన్యం ఔటర్న్పై ఒక్కమాట కూడా మాట్లాడని మిల్లర్లు ఎకాఎకిన 9 కిలోల బియ్యానికి టెండర్ పెడుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సన్నబియ్యం ధర కిలోకు రూ. 50 చొప్పున లెక్క వేసుకున్నా... 9 కిలోలకు రూ. 450 అవుతుంది. క్వింటాల్ సన్న ధాన్యానికి రైతుకు ప్రభుత్వం రూ. 500 బోనస్‌గా ఇవ్వాలని భావిస్తుంటే... మిల్లింగ్ పేరు మీద క్వింటాల్ ధాన్యానికి రూ. 450 విలువైన బియ్యాన్ని ఎగవేసే పన్నాగంలో మిల్లర్లు ఉన్నట్లు అర్థమవుతోంది. 9 కిలోల బియ్యానికి బదులు నూకలు ఇస్తామనడం పట్ల పౌరసరఫరాల శాఖ అధికారులే విస్తుపోతున్నారు. బ్యాంక్ గ్యారంటీలపైనా తకరారు! ఖరీఫ్ సీజన్లో మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగానే బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలలో పొందుపరిచారు కూడా. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించాల్సి ఉండగా, ముసాయిదాతోనే నిలిపివేసి, మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. రైస్‌మిల్లు కెపాసిటీకి అనుగుణంగా కేటాయించిన ధాన్యం విలువలో 25 శాతం మేర బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. మిల్లును లీజుకు తీసుకుంటే.. కేటాయించిన ధాన్యం విలువలో 50 శాతం మేర లీజుదారుడు చెల్లించాలి. అయితే ఈ బ్యాంక్ గ్యారంటీ నిబంధనలను మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం అనేది తమకు తలకు మించిన భారమని, మిల్లింగ్ చార్జీలు కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని, ఏపీ వంటి రాష్ట్రాల్లో క్వింటాల్‌కు రూ.100 చెల్లిస్తుంటే మనరాష్ట్రంలో కేవలం రూ. 10 మాత్రమే ఇస్తున్నారని మిల్లర్లు చెబుతున్నారు. అది కూడా చాలా కాలంగా ఇవ్వడం లేదని వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీలను ఎత్తివేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక సీజన్లో సీఎంఆర్ ఇవ్వకుండా డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకొని ధాన్యం కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంటే ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లర్లు తాము ఇవ్వాల్సిన బియ్యాన్ని అప్పగించడంతోపాటు అదనంగా 25 శాతం జరిమానా మొత్తానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తే వారికి ధాన్యం కేటాయిస్తారు. ఇలా ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లులు రాష్ట్రంలో 791 ఉన్నట్టు పౌరసరఫరాల సంస్థ తేల్చింది. రెండు, అంతకంటే ఎక్కువ సీజన్లలో డిఫాల్ట్ అయిన మిల్లులకు ఈసారి ధాన్యం కేటాయించమని మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో తేల్చిచెప్పారు. 386 మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా తేల్చడం గమనార్హం. మొత్తానికి బ్యాంకు గ్యారంటీల అంశం కూడా అటకెక్కినట్టేనని పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
AP: పండగపూట సరుకుల్లేవ్!
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో ‘కోతల పర్వం’ నడుస్తోంది. పేదలకు సబ్సిడీపై పంపిణీ చేసే సరుకులను కూటమి ప్రభుత్వం కుదించేస్తోంది. ఎన్నికలకు ముందు రేషన్ షాపుల్లో 18 రకాల సరుకులను ఇస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నాయకులు... అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒక్కొక్కటిగా తగ్గించేస్తున్నారు. ఇప్పటికే గోధుమ పిండి సరఫరాకు మంగళం పాడేశారు. కందిపప్పును కూడా అటకెక్కించారు. కేవలం బియ్యం పంపిణీ చేసి పేదలను పండుగ చేసుకోండని చెబుతున్నారు. వాస్తవానికి ఆ బియ్యంలో కూడా సగానికి పైగా కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద ఉచితంగా ఇస్తోంది. అంటే... కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అరకొర పంచదార మినహా సొంతంగా పేదలకు పంపిణీ చేసిందేమీ లేదు. మూడు నెలల్లో ఇచ్చిన కందిపప్పు 249 టన్నులే... టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై, ఆగస్టులో కేవలం 249 టన్నుల కందిపప్పును మాత్రమే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసింది. సెపె్టంబర్లో అసలు పంపిణీ చేయలేదు. రాష్ట్రంలో 1.48 కోట్లకుపై రేషన్ కార్డులు ఉండగా, గడిచిన మూడు నెలల్లో కేవలం 2శాతం.. అంటే 2.50లక్షల కార్డుదారులకు మాత్రమే కందిపప్పు అందింది. మొత్తం కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయాలంటే నెలకు సుమారు 15వేల టన్నులు అవసరం. కానీ, మూడు నెలల్లో ఇచ్చింది 249 టన్నులు మాత్రమే కావడం గమనార్హం. పండుగ వేళ ప్రచారం ఎక్కువ.. పంపిణీ తక్కువ సెపె్టంబర్ నెలలో వినాయక చవితి పండుగ ఉన్నప్పటికీ రేషన్‌లో కందిపప్పు పంపిణీ చేయలేదు. అదే సమయంలో అకాల వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. మూడు నెలలుగా ఇసుక దొరక్క... పనులు లేక సుమారు 45లక్షల మంది భవన నిర్మాణ కారి్మకుల కుటుంబాలు పస్తులుండే దుస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్లో రూ.160 నుంచి రూ.220 వరకు వెచ్చించి కందిపప్పు కొనుగోలు చేయలేకపోతున్నామని పేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కంటితుడుపుగా ఈ నెల ఒకటో తేదీ నుంచి కందిపప్పు పంపిణీని ప్రారంభించింది. కానీ, 11 రోజుల్లో 1.19 కోట్ల మంది కార్డుదారులు బియ్యం తీసుకుంటే... కేవలం 21.70లక్షల కార్డులకు మాత్రమే కందిపప్పు పంపిణీ చేసింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే మంత్రులు మాత్రం పండుగ వేళ ఇప్పుడే కొత్తగా కందిపప్పు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. బాబు హయాంలో ఇది కొత్తేమీ కాదుచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌లో కోతలు పెట్టడం.. నెలలు తరబడి నిత్యావసరాల పంపిణీని నిలిపివేయడం కొత్తేమీ కాదు. ఆయన అధికారంలో ఉండగా, 2014 సెపె్టంబర్ నుంచి 2015 జూలై వరకు కందిపప్పు పంపిణీని ఆపేశారు. ఇక 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రూ.1,605 కోట్ల విలువైన 0.93లక్షల టన్నుల కందిపప్పును మాత్రమే పంపిణీ చేశారు. జగన్ హయాంలో క్రమం తప్పకుండా పంపిణీ » వైఎస్ జగన్ పాలనలో ఐదేళ్లపాటు క్రమం తప్పకుండా కందిపప్పు పంపిణీ చేశారు. » బహిరంగ మార్కెట్లో కందిపప్పు రేటు రూ.170కి పైగా ఉన్నా.. రాయితీపై కిలో రూ.67లకే అందించారు. » టెండర్లలో కాంట్రాక్టర్లు ఎక్కువ కోట్ చేసినా... వారితో సంప్రదింపులు జరిపి అవసరమైతే మార్కెట్ రేటు ఇచ్చిమరీ కందిపప్పు కొనుగోలు చేసి కార్డుదారులకు రూ.67లకే అందించారు. » స్థానిక రైతుల నుంచి కందులు కొనుగోలు చేసి కందిపప్పుగా మార్చి ప్రత్యేక ప్యాకెట్ల రూపంలో వినియోగదారులకు సరఫరా చేశారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా రేటు పెంచలేదు. » జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,140 కోట్లు విలువైన 3.28లక్షల టన్నుల కందిపప్పును పేదలకు సబ్సిడీపై అందించడం విశేషం. గతంలోనే బాగుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు రేషన్ సరుకులు బాగా పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంటి వద్దకే సరుకుల పంపిణీని ప్రారంభించి విజయవంతంగా నిర్వహించారు. దీనివల్ల వేలాది మందికి ఉపాధి లభించింది. పేదలకు నాణ్యమైన సరుకులు పారదర్శకంగా అందాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు అవసరమైన నిత్యావసర సరకుల పంపిణీ సక్రమంగా జరగడం లేదు. పేదలకు అందాల్సిన బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. – మేడం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నకరికల్లు, పల్నాడు జిల్లా ప్రహసనంగా రేషన్ పంపిణీ కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ సరకుల పంపిణీ ప్రహసనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ పంపిణీ బాగుంది. అధికారంలో వచ్చిన వెంటనే కందిపప్పు, ఇతర నిత్యవసరాలు పంపిణీ చేస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించింది. పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. – కోట బూరయ్య, మాజీ సర్పంచ్, పినపళ్ల, ఆలమూరు మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 4 నెలలుగా బియ్యం మాత్రమేమేము కర్నూలులో నివాసం ఉంటున్నాం. 4 నెలలుగా కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. పంచదార, కందిపప్పు ఇవ్వాలని కోరినా స్టాక్ లేదంటున్నారు. గతంలో బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు ఇచ్చేవారు. ఇప్పుడు పండుగకు అయినా ఇస్తారనుకుంటే ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడంలేదు. – గొల్ల లలితమ్మ, కేసీ కెనాల్ ఏరియా, కర్నూలు -
పొలాన్నే కాన్వాస్‌గా మార్చి.. సరికొత్త ఆర్ట్‌కి ప్రాణం పోసిన రైతు!
కొన్ని కళలను కళ్లారా చూడాల్సిందే తప్ప వాటికి కొత్త అర్ధాలు చెప్పలేం. కానీ, తన కళతో యువతకు ఏది ముఖ్యమో వివరిస్తున్నారు కేరళలోని వాయనాడ్‌కు చెందిన ప్రసీత్కుమార్ తయ్యిల్ అనే వ్యక్తి. ఇంతకీ ఏం చేశాడా అంటారా.. ఫొటో చూడండి... ఇంకా అర్ధం కాలేదు విషయమేంటో స్వయంగా తెలసుకోండి. వాయనాడ్‌లోని సుల్తాన్ బతేరీకి చెందిన ఒక రైతు తన వరి పొలాన్ని కాన్వాస్‌గా మార్చేశాడు. వివిధ రకాలైన వరి రకాల నారు ఉపయోగించి క్లిష్టమైన శివుని రూపాన్ని ఆవిష్కరించాడు. యువతను వ్యవసాయంవైపు మళ్లించేందుకు ఈ కళను సృష్టించాను అని చెబుతున్నాడు. ఆ రైతు పేరు ప్రసీద్ కుమార్ తయ్యిల్. వరి పొలంలో వరి కళకు ప్రాణం పోసిన ఈ రైతును అభినందించకుండా ఉండలేం. పంట పొలాలతో కళను సృష్టించడాన్ని పాడీ ఆర్ట్ అంటారు. ఇన్‌స్టాలేషన్‌లో టాన్బో ఆర్ట్ లేదా రైస్ పాడీ ఆర్ట్ అని పిలువబడే జపనీస్ కళారూపం ఇది. దీనిని వ్యూహాత్మక పద్ధతిలో నాటిన వేలాది వరి నారు పెరిగి, ఆ తర్వాత రెమ్మల ద్వారా ఓ రూపం కనిపిస్తుంది. అరుదైన వరి వంగడాలను సంరక్షించడమే ధ్యేయంగా! ఈ కళాత్మక వెంచర్ కోసం తన 10 ఎకరాల వరి పొలంలో 30 సెంట్ల భూమిని అంకితం చేశాడు శ్రీ కుమార్. తన ప్రయత్నం కేవలం సౌందర్యానికి సంబంధించినది కాదని చెబుతున్నాడు. ‘అరుదైన స్థానిక వరి జాతులను సంరక్షించడం, వాటిని ప్రచారం చేస్తూనే, వ్యవసాయం ఒక ఆచరణీయ వృత్తిగా యువతకు అవగాహన కల్పించడం లక్ష్యం‘ అంటున్నాడు. ఆర్ట్‌కి నాలుగు రకాల వంగడాలువరి కళతో పాటు కుమార్ వ్యవసాయంలో ఎన్నో అద్భుతాలను పండిస్తుంటాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి సేకరించిన ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన 100 రకాల వరి వంగడాలతో పంటలు పండించాడు. ఈ కళాకృతి కోసం మాత్రం నాలుగు విభిన్న వరి రకాలను ఉపయోగించాడు: నాజర్ బాత్ రకానికి ఊదా ఆకులతో, రక్తశాలి, చిన్నార్, జీరకసాల, ముదురు– లేత ఆకుపచ్చ ఆకులతో ఉంటాయి. పర్యాటకులకు ఆకర్షణ మంత్రకుమార్ మాట్లాడుతూ– ‘ఆధునికతరం వ్యవసాయం నుండి డిస్కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వరి సాగులో తరచుగా అధిక ఖర్చులతో తక్కువ రాబడి వచ్చేదిగా భావిస్తుంటారు. అయితే, మూడు దశాబ్దాలుగా జపాన్, చైనాలోని రైతులు వరి కళ వంటి వినూత్న పద్ధతులను ఆవలంబిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. సాంప్రదాయ వ్యవసాయ రాబడితోపాటు గణనీయమైన అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. సహజ సౌందర్యంతో వయనాడ్ దేశంలోనే ప్రముఖ టూరిజం హాట్‌స్పాట్‌గా మారుతోంది. జిల్లాలోని రైతులు తమ వరి పొలాలకు పర్యాటకులను ఆకర్షించగలిగితే, వారు మరిన్ని మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధిస్తారు అని ఆయన చెప్పారు. కిందటేడాది విద్యార్థులు, రైతులు, పర్యాటకులతో సహా 10,000 కంటే ఎక్కువ మంది సందర్శకులు తన సైట్‌ను సందర్శించారని శ్రీ కుమార్ చెబుతున్నాడు.అంతేకాదు, ఈ వంగడాల ద్వారా ఆకర్షణీయమైన అదనపు ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నాడు. ఇప్పటికి పది సార్లు కుమార్ తన పొలాల్లో వరి కళాకృతిని రూపొందించాడు. ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ.20,000 ఖర్చుతో కూడుకున్నది. ప్రారంభ రూపురేఖలను ముందగా నేలపైన గీసుకని, ఆ తర్వాత 36 మంది కార్మికులతో కూడిన బృందంతో ఈ ఆర్ట్‌ను సాధించాడు కుమార్. (చదవండి: ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!) -
బియ్యం.. మరింత ప్రియం
సాక్షి, హైదరాబాద్: బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేతతో సన్నబియ్యం ధరలు మరింత ప్రియం కాబోతున్నాయి. ప్రస్తుతం అధికంగా వినియోగించే సన్న బియ్యం రకాలైన సోనా మసూరి, హెచ్ఎంటీ, జైశ్రీరాం, బీపీటీ రకాలు, తెలంగాణ సోనా వంటి మేలిమి బియ్యం ధరలు ఏకంగా కిలో రూ. 60 నుంచి రూ. 70కి చేరుకున్నాయి. బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ, కనీస ఎగుమతి ధరను విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) శుక్రవారమే నోటిఫికేషన్ విడుదల చేసింది.పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం), బ్రౌన్ రైస్‌పై ఎగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే సన్నరకాలు భారీ ఎత్తున విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశముంది. అమెరికాతో పాటు బంగ్లాదేశ్, యూరోప్ వంటి 140 దేశాలకు భారత్ నుంచి బియ్యం ఎగుమతులు పెరుగుతాయి. ఈ ప్రభావం దేశీయ బియ్యం మార్కెట్‌పై పడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది జూలైలో బియ్యంపై సర్కార్ ఆంక్షలు2022–23లో ధాన్యం ఉత్పత్తి కొంత తగ్గింది. అదే సమయంలో విదేశాల్లో బియ్యం డిమాండ్ పెరిగి, దేశీయంగా బియ్యం ధరలు భారీగా పెరిగే పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం గత సంవత్సరం జూలైలో బాస్మతీయేతర తెల్ల బియ్యం, నూకల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం), బ్రౌన్ రైస్‌లపై ఎగుమతి సుంకాన్ని 20 శాతం విధించింది. భారత్ నుంచి బియ్యం ఎగుమతి ఆగిపోవడంతో థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్తాన్ల నుంచి ఎగుమతులు పెరిగాయి. అయితే భారత్‌లో ఉత్పత్తి అయిన బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా దేశీయ బియ్యం ఎగుమతులు పెరుగుతాయని భావిస్తున్నారు. -
Intips: ఈ పదార్థాలకు పురుగు పట్టకుండా.. ఇలా చేయండి!
బియ్యం, గోధుమపిండి, కంది, పెసర, మినప్పప్పు లాంటì వాటి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, చిన్న చిన్న కీటకాలు చేరుతాయి. వీటిని తింటే కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు, కొన్నిసార్లు అలర్జీలు కూడా రావచ్చు. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటించడం ద్వారా వాటికి పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు.ఎండు వెల్లుల్లి రెబ్బలు..పప్పు, బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే, అందులో కొన్ని ఎండు వెల్లుల్లి రెబ్బలు కలపాలి. వెల్లుల్లి నుంచి వెలువడే గాఢమైన వాసన వల్ల పురుగులు పప్పు, బియ్యం గింజల వైపు రాలేవు.వాము కలపడం..బియ్యం డబ్బా లేదా బస్తాలో కాస్తంత వాము వేస్తే, అందులో పురుగులు పట్టవు. ఎందుకంటే వాము వాసన కూడా పురుగులకు పడదు.ఎండు మిరపకాయలు..బియ్యం లేదా గోధుమలు నిల్వ చేసేటప్పుడు, కాసిని ఎండు మిరపకాయలు ఉంచితే, పురుగు పట్టకుండా చాలాకాలం పాటు తాజాగా ఉంటాయి.వేపాకులు..వేపాకులకు ఉండే చేదు గుణం, ఘాటైన వాసన వల్ల పురుగులు దూరంగా ఉంటాయి. అందుకే, బియ్యం నిల్వ చేసే పాత్రలో కొన్ని వేపాకులు వేస్తే పురుగులు పట్టవు.మిరియాలు..బియ్యం నిల్వచేసే డబ్బాల్లో కొన్ని మిరియాలు వేస్తే, అందులో పురుగులు పట్టవు. మిరియాల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. వీటిని గోధుమల్లో కలిపి, వాటికి కూడా పురుగులు పట్టకుండా జాగ్రత్త పడొచ్చు.లవంగాలు..లవంగాల ఘాటు వాసనను పురుగులు, కీటకాలు భరించలేవు. అందుకే, బియ్యం నిల్వ ఉంచే పాత్రలో కాసిని లవంగాలు వేయాలి. లవంగ నూనె కూడా కీటకాలను దూరం చేస్తుంది.ఇవి చదవండి: ఇవి.. సహజసిద్ధ'మండి'! -
పత్తి కాదు..వరే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి సాగు పడిపోయింది. సాధారణ విస్తీర్ణంతో పోల్చితే గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం ఈసారి పత్తి విస్తీర్ణాన్ని సాధారణ సాగు లక్ష్యం కంటే పెంచాలని పిలుపు ఇచ్చినా రైతులు పట్టించుకోలేదు. వరివైపే మొగ్గుచూపారు. ఈ నెలాఖరుతో వానాకాలం సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ బుధవారం ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్లో ఏకంగా 60 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పేర్కొంది. సాధారణ సాగు విస్తీర్ణం ప్రకారం చూసినా కనీసం 50.48 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావాలి. కానీ సర్కారు ప్రత్యేకంగా నిర్దేశించిన లక్ష్యాన్ని పక్కనపెడితే, సాధారణ విస్తీర్ణంతో పోల్చినా 86.67 శాతానికే పత్తి సాగు పరిమితమైంది. ఈ సీజన్లో కేవలం 43.76 లక్షల ఎకరాల్లోనే ఈ పంట సాగయ్యింది. సర్కారు లక్ష్యంతో పోల్చుకుంటే.. ఏకంగా 16.24 లక్షల ఎకరాలు తగ్గగా, సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే 6.72 లక్షల ఎకరాలు తగ్గడం గమనార్హం. వరి వైపు రైతుల మొగ్గు రాష్ట్రంలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా, ఈ సీజన్లో ఇప్పటివరకు నూటికి నూరు శాతం సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 57.18 లక్షల ఎకరాలు కాగా గతేడాది 64.61 లక్ష ల ఎకరాల్లో సాగైంది. తాజా సీజన్లో దాన్ని అధిగమించి 65.49 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 114.53 శాతం పెరిగింది. ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతు లు వరి వైపు మొగ్గు చూపారని అంటున్నారు. తగ్గిన పప్పు ధాన్యాల సాగు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం మాత్రం గణనీయంగా తగ్గడం గమనార్హం. అన్ని రకాల పప్పుధాన్యాల సాధారణ సాగు విసీర్ణం 8.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.90 లక్షల (69.30 శాతం) ఎకరాల్లోనే సాగైంది. కీలకమైన కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.11 లక్షల ఎకరాలు కాగా, కేవలం 4.99 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అలాగే పెసర సాధారణ సాగు విస్తీర్ణం 1.01 లక్షల ఎకరాలు అయితే, కేవలం 68,556 (67.38 శాతం) ఎకరాల్లోనే సాగైంది. మొక్కజొన్న 6.09 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 5.46 లక్షల (89.73 శాతం) ఎకరాల్లో, సోయాబీన్ 4.29 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 4.01 లక్షల (93.47 శాతం) ఎకరాల్లో, జొన్న 70,068 ఎకరాలకు గాను 41,782 ఎకరాల్లో సాగైంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి యాసంగి పంటల సీజన్ ప్రారంభం కానుంది. -
వరి అంటే ఆహారం మాత్రమే కాదు, మన కరెన్సీ కూడా!
‘అన్నం గురించి చెప్పండి’ అని అడిగితే... ‘రోజూ తింటాం’ అనేవాళ్లే ఎక్కువ. ‘మీకు తెలిసిన వరివంగడాల గురించి చెప్పండి’ అని అడిగితే... ఒకటి, రెండు మాత్రమే చెప్పేవాళ్లు ఎక్కువ. అంతేనా! ‘కాదు... ఎంతో ఉంది’ అంటున్నాడు బెంగళూరుకు చెందిన ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్ వినయ్ వారణాసి. భారతీయ సంస్కృతిలో అన్నం, సంప్రదాయ వరి ధాన్యాల ప్రాముఖ్యతను చెబుతున్న వినయ్ ప్రసంగాలు యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి.మనం ఎప్పుడూ వినని కొత్త కథలు కాదు. అయితే వాటిని కొత్తగా ఎలా చెప్పవచ్చో వినయ్ ప్రసంగాలు వింటే అర్థం అవుతుంది. అన్నంతో సంబంధం ఉన్న వివిధ ఆచారాలు, వాటి పట్ల రుషులకు ఉన్న భక్తి, మనిషి జీవితాన్ని నిలబెట్టడంలో దాని విలువైన పాత్ర, దైవత్వానికి దాని ప్రతీకాత్మక సంబంధం గురించి వివరిస్తాడు. అన్నదానం చేసే ప్రక్రియను పౌరాణిక కథల ద్వారా చెబుతాడు. ‘మన దేశంలో బియ్యం అనేది సామాజిక, ఆర్థిక కరెన్సీ’ అంటున్న వినయ్ ‘స్పిరిట్ ఆఫ్ ది ఎర్త్’ అనే సంస్థతో కలిసి బడులను నుంచి వ్యవసాయ కళాశాలల వరకు వరి ధాన్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.‘ఎన్నో రకాల వరి వంగడాలను పునరుద్ధరించడంపై మేము దృష్టి సారించాం. ప్రతి దానికి దాని ప్రత్యేకమైన ఆకృతి. రంగు, వాసనకు పేరు ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు కన్యాకుమారిలో కనిపించే అనికొంబస్ ఇప్పుడు అంతరించిపోయింది. అనేక దేశీ రకాలు కనుమరుగు అవుతున్నాయి’ అంటుంది ‘స్పిరిట్ ఆఫ్ ఎర్త్’ ఫౌండర్ షీలా బాలాజి. ప్రాచీన వరి వంగడాల పునర్జీవానికి వాటి గురించి అవగాహన కలిగించడం అనేది కీలకం.హైబ్రిడ్ వరి వంగడాల వైపు ఎక్కువగా దృష్టి సారించడం వల్ల అనేక సంప్రదాయ వరి రకాలు క్షీణించాయి. ఎక్కువమంది ఈ పురాతన రకాలపై ఆసక్తి చూపితే సహజంగానే వాటికి డిమాండ్ పెరుగుతుంది. పెరిగిన డిమాండ్ మన వ్యవసాయ వైవిధ్యాన్ని కాపాడుతుంది. దీనికి అవగాహన కల్పించడం అవసరం. ఆ పనిని సగర్వంగా భుజాల కెత్తుకున్నాడు వినయ్ వారణాసి.ఇక వినయ్ మల్టీ టాలెంట్ విషయానికి వస్తే... ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్ మాత్రమే కాదు ఆర్కిటెక్ట్, డిజైన్ రిసెర్చర్, క్లాసిక్ మ్యూజిక్ లిరిసిస్ట్, డిజైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘అన్బైండ్’ ఫౌండర్. -
రేషన్ కార్డులకు సన్న బియ్యం ఎలా?
సాక్షి, హైదరాబాద్: రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పౌరసరఫరాల శాఖ గోడౌన్లలో సన్నబియ్యం నిల్వలు 50 వేల మెట్రిక్ టన్నులు కూడా లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి అవసరమయ్యే సన్న బియ్యాన్ని ఎలా సేకరించాలనే విషయమై సంస్థ తర్జన భర్జన పడుతోంది. ఖరీఫ్ పంట అక్టోబర్ నుంచి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఎంత మేరకు ధాన్యం వస్తుందనే విషయంలో స్పష్టత లేదు. వచి్చన సన్నాలను మరాడించి సన్న బియ్యంగా జనవరి నుంచి రేషన్ దుకాణాలకు పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. 24 ఎల్ఎంటీల బియ్యం అవసరం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో రేషన్‌కార్డులు 89.96 లక్షలున్నాయి. ఈ కార్డుల లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు నెలకు 1.80 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బియ్యం అవసరం. అంటే ఏడాదికి 21.60 ఎల్ఎంటీల సన్నబియ్యం కావాలి. ఇవికాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంక్షేమ హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకానికి కలిపి ఏటా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. అంటే ఏటా సన్నబియ్యం 24 ఎల్ఎంటీలు అవసరమవుతుంది. ఇందుకోసం 36 ఎల్ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాల్సి ఉంటుంది. విద్యార్థులకు గత ప్రభుత్వ హయాం నుంచే సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నారు. ఈ ఏడాది సన్నబియ్యం కొరత ఏర్పడటంతో గత మే నెలలో 2.2 ఎల్ఎంటీ సన్న బియ్యం కొనుగోలు కోసం టెండర్లను ఆహా్వనించిన ప్రభుత్వం తరువాత వెనకడుగు వేసింది. ఖరీఫ్‌లో వచ్చే సన్న ధాన్యం 5 ఎల్ఎంటీ లోపే.. రాష్ట్రంలో సగటున ఏటా కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని పౌరసరఫరాల శాఖ సేకరిస్తుంది. ఇందులో ఖరీఫ్‌లో మాత్రమే రైతులు సన్నాలను పండిస్తున్నారు. ఈ సీజన్లో పౌరసరఫరాల శాఖ 50 నుంచి 60 ఎల్ఎంటీల ధాన్యం మాత్రమే సేకరించగలుగుతోంది. ఇందులో 5 ఎల్‌ఎంటీలే సన్నాలు ఉంటున్నాయి. రైతులు ఈ సీజన్లో సన్నాలను పండించినప్పటికీ, తమ అవసరాలకు నిల్వ చేసుకుంటుండటంతో మార్కెట్‌కు రావట్లేదు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో పండే మేలు రకం సన్న ధాన్యం నేరుగా మిల్లులకు వెళ్లడం లేదంటే బియ్యంగా మార్చి విక్రయించడం జరుగుతోంది. రబీలో వచ్చే మరో 70 ఎల్ఎంటీల ధాన్యంలో సన్నాలు నిల్. రాష్ట్ర వాతావరణం రీత్యా రబీలో సన్న ధాన్యం పండిస్తే, నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాల పంట పంట కావడంతో రైతులు దొడ్డు ధాన్యాన్నే పండిస్తున్నారు. ఈ ఖరీఫ్సీజన్పై సర్కార్ ఆశరూ.500 బోనస్ ప్రకటనతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సన్నాలను రైతులు అధికంగా పండించినట్లు ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.2,320 ఉండగా, ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తే ఆ మొత్తం రూ. 2,820 అవుతుంది. కాగా 30 రకాలను రూ. 500 బోనస్ ఇచ్చే ఫైన్ వెరైటీలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫైన్ వెరైటీల్లో అధిక డిమాండ్ ఉన్న హెచ్ఎంటీ, సోనా మసూరి, జైశ్రీరాం వంటి రకాలు అధిక ధరలకు అమ్ముడుపోయినా, మిగతా వెరైటీలకు డిమాండ్ లేకపోవడంతో అవి మార్కెట్‌కు వస్తాయని భావిస్తోంది. అక్టోబర్ చివరి నుంచి ధాన్యం సేకరణ చేపట్టి, సన్నాలను వెంటవెంటనే మిల్లింగ్ చేస్తే జనవరి నాటికి రేషన్ దుకాణాలకు పంపవచ్చని ఓ అధికారి చెప్పారు. -
కిన్మేమై బియ్యం గురించి విన్నారా? ధర తెలిస్తే కంగుతింటారు!
మనం చూసే సాధారణ తెల్లటి బియ్యం మాదిరిగానే ఉంటాయి జపాన్‌కి చెందిన కిన్మేమై బియ్యం. అయితే దీన్ని ప్రత్యేకమైన ప్రాసెసింగ్ పద్ధతిలో తయారు చేస్తారు. జపాన్ వాళ్లు ఈ బియ్యాన్నితాము పేటెంట్ పొందిన ప్రత్యేక సాంకేతిక ప్రక్రియలోనే అభివృద్ది చేశారు. ముఖ్యంగా ఆహార ప్రియలుకు మంచి పోషాకాలను అందించే దృష్ట్యా ప్రత్యేకంగా రూపొందించిన బియ్యం. అయితే ఈ బియ్యం స్పెషాలిటీ ఏంటంటే వండే ముందు కడగాల్సిన పని ఉండదు. అంటే వీటి వాడకం వల్ల నీటి వృధాను తగ్గించొచ్చు. ఇవి రుచికి కమ్మదనంతో కూడిన స్వీట్‌నెస్‌గా ఉంటాయి. చూసేందుకు కూడా చాలా వెన్న మాదిరి సున్నితంగా ఉంటుంది. పోషకాల పరంగా సంప్రదాయ తెల్ల బియ్యం కంటే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు బ్రౌన్ రైస్ మాదిరి ప్రయోజనాలకు కూడా అందిస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేకమైన చెస్ట్నట్ రంగు ఉన్నతమైన పోషకాహార ప్రొఫైల్‌ని కలిగి ఉంటుంది. అలాగే తొందరగా ఉడికిపోతుంది.ఆరోగ్య ప్రయోజనాలు..ఇవి తెలుపు, గోధుమ వంటి రెండు రకాల్లోనూ లభ్యమవుతాయి. ఇందులో ఊక ఉంటుంది.సాధారణ బియ్యం కంటే 1.8 రెట్లు ఫైబర్, ఏడు రెట్టు విటమిన్ బీ1 కలిగి ఉంది. ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదర్కొనడంలో సహాయపడుతుంది. ఇందులో ఆరు రెట్లు లిపోపాలిసాకరైడ్లు(ఎల్పీఎస్)ను కలిగి ఉంది. ఫ్లూ, ఇన్ఫెక్షన్లు, కేన్సర్, డిమెన్షియా(చిత్త వైకల్యం) వంటి వ్యాధులతో పోరాడేలా రోగనిరోధక వ్యవస్థకు సహజమైన బూస్టర్.కడుపు ఉబ్బరం, అజీర్ణం తదితర సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే అన్నం అధిక నీటిని పీల్చుకోకుండా చేస్తుంది కాబట్టి ఇది బ్రౌన్ రైస్‌కి సమానమైన ఆరోగ్య ప్రయోజనాలను అందింగలదని చెబతున్నారు నిపుణులు. ధర..మార్కెట్లో ఈ బియ్యం కిలో ధర రూ.15 వేలు పలుకుతోంది. ధరల పరంగా అత్యంత ఖరీదైన బియ్యంగా ప్రపంచ రికార్డు సాధించింది. అయితే జపాన్‌లో ఈ బియ్యాన్ని ఒక పెట్టేలో 140 గ్రాముల చొప్పున ఆరు ప్యాకెట్లుగా ప్యాక్ చేసి విక్రయిస్తుంటారు. దీని ధర రూ. 13000/-కిన్మెమై రైస్‌ని టోయో రైస్ కార్పొరేషన్ రూపొందించింది. ఈ రైస్ కార్పొరేషన్ వాకయామాలో 1961 స్థాపించబడింది. అక్కడే ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్పొరేషన్ సాంకేతికలో మెరుగుదల ఈ కిన్మెమై రైస్ అభివృద్ధికి దారితీసిందని జపాన్ అగ్రికల్చర్ నిపుణులు చెబుతున్నారు.(చదవండి: టైటానిక్ మూవీ నటి 48 ఏళ్ల వయసులో టెస్టోస్టెరాన్ థెరపీ! మహిళలకు మంచిదేనా..?) -
కొంచెం స్మార్ట్‌గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు
వంట చేయం అనుకున్నంత ఈజీకాదు. భయపడినంత కష్టమూ కాదు. కాస్త స్మార్ట్‌గా ముందస్తు ప్రిపరేషన్ చేసుకుంటే చాలు. అన్నం వండాలా,చపాతీ చేయాలి అనేక ముందు నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి ఎలాంటి కూరలు చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. చపాతీ అయితే, పప్పు, లేదా మసాలా కూర చేసుకుంటే సరిపోతుంది. అదే అన్నం అయితే, పప్పు, కూర, పచ్చడి, సాంబారు లేదా చారు, ఇంకా వడియాలు అప్పడాలు ఇలా బోలెడంత తతంగం ఉంటుంది. అంతేకాదు వీటికి సరిపడా కూరగాయలు, ఉల్లిపాయలు కట్ చేయడం ఒక పెద్ద పని. అయితే ఎలాంటి పని అయినా, ఇబ్బంది లేకుండా కొన్ని చిట్కాలతో సులువుగా చేసుకోవచ్చు. అలాంటివి మచ్చుకు కొన్ని చూద్దాం.చిట్కాలుపచ్చిమిర్చి కట్ చేసినపుడు చేతులు మండకుండా ఉండాలంటే కత్తెరతో కట్ చేసు కోవాలి. చాకుతో కోసినపుడు చేతుల మండుతోంటే పంచదారతో చేతులను రుద్దుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలను కట్ చేయాలంటే, వాటిని ముందు కొంచెం సేపు చల్లని నీటిలో ఉంచాలి.ఉల్లిపాయలు కట్ చేసిన అనంతరం చేతులు ఉల్లి వాసన రాకుండా ఉండాలంటే, నిమ్మరసం చేతులకు పట్టిస్తే ఉల్లి వాసన పోతుంది.చపాతీగాని, పరోటాగాని, మెత్తగా ఉండాలంటే 1 స్పూన్ మైదా, ఒక స్పూన్ పెరుగుని గోధుమ పిండిలో వేసి తడిపితే మెత్తగా వస్తాయి.చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది. పచ్చకూరలు వండేటప్పుడు చిటికెడు సోడా వేసి వండితే చూడ్డానికి కంటికి మంచి ఇంపుగా కనబడ్డమే కాకుండా రుచిగా ఉంటాయి.పంచదార జార్లో రెండు లవంగాలు వేస్తే చీమల దరి చేరవు.కోడిగుడ్లను ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే వాటిని చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా వస్తుంది టమోటా ఫ్రెష్‌గా ఉండాలంటే ఉప్పునీటిలో ఒక రాత్రంతా ఉంచితేచాలు.ఒక్కోసారి గ్లాస్లు, స్టీల్ గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయి భలే ఇబ్బంది పెడతాయి. ఆ సమయంలో కంగారుపడి, కిందికి మీదికి కొట్టకుండా, పై గ్లాసును చల్లటి నీటితో నింప్పి వేడి నీటిలో కాసేపు ఉంచితే ఇరుక్కున్న గ్లాసు ఈజీగా వచ్చేస్తుంది. శుభ్రమైన వాతావరణంలో శుభ్రం చేసుకున్న చేతులతో వంటను పూర్తి చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఇదీ చదవండి : విడాకుల తరువాత పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా? -
ఈ డెజర్ట్‌తో గుండె ఆరోగ్యం పదిలం..!
మన ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే కొన్ని డెజర్ట్‌లను మన ఆహారంలో భాగం చేసుకుంటే చాల రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాంటి డెజర్ట్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఫుడ్ గైడ్ టేస్టీ అట్లాస్ వెల్లడించిన ఉత్తమ డెజర్ట్‌ల జాబితాలో రెండో స్థానం దక్కించుకున్న ఈ డెజర్ట్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉనాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మన గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుందట. అదెలాగా? దీన్ని ఎలా తయారు చేస్తారు?ఆ డెజర్ట్ పేరు మామిడి స్టిక్కీ రైస్. ఇది థాయిలాండ్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన డెడర్ట్. దీన్ని అక్కడ ప్రజలు మ్యాంగో స్టిక్కీ రైస్‌గా పిలుస్తారు. ఈ డెజర్ట్‌ని గ్లూటినస్ రైస్, తాజా మామిడిపండ్లు, కొబ్బరిపాలను మిళితం చేసి తయారు చేస్తారు. ఈ డెజర్ట్ తయారీలో ఉపయోగించే పదార్థాలన్నీ మంచి పోషక విలువలు కలిగినవి. ముందుగా ఇందులో ఉపయోగించే పదార్థాలు ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.ఇందులో ఉపయోగించే అన్నంఈ పాయసం చేయడానికి గ్లూటినస్ రైస్ ఉపయోగిస్తారు. దీనిలోని కార్బోహైడ్రేట్లకి మంచి డైట్‌కి ఉపయోగపడే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం, గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది. స్టిక్కీ రైస్‌లో కొవ్వులు, కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న ఆహారాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అదీగాక అధిక రక్తపోటు లేదా బరువు సమస్యలు ఉన్నవారికి ఈ డెజర్ట్ గొప్ప ఔషధం. కొబ్బరి పాలుకొబ్బరి పాలలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని నివారించే యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంతేగాదు ధమనులలో ఫలకం కలిగించే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. గుండె జబ్బులకు దారితీసే రక్తంలోని లిపిడ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. కొబ్బరి పాలల్లోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించి గుండె పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది. మామిడి పండ్లు..మామిడి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి . ఇవన్నీ రక్త నాళాలు విశ్రాంతి తీసుకునేలా రక్తపోటు స్థాయిలను తగ్గించి సాధారణ పల్స్‌ను ప్రోత్సహిస్తాయి. ఈ సమ్మర్ పండులో మాంగిఫెరిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ సమ్మేళనం. ఇది గుండె కణాల్లోని మంట, ఆక్సీకరణ ఒత్తిడి. కణాల నశించడం వంటి వాటి నుంచి రక్షిస్తుంది. అంతేగాదు జంతు అధ్యయనాలు మాంగిఫెరిన్ రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, కొవ్వు ఆమ్లాలను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నాయి.ఈ డెజర్ట్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలుఈ పుడ్డింగ్ కడుపులో చాలా తేలికగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ కలిగి ఉండటం వల్ల శరీరంలోని అనేక ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే గ్యాస్, ఉబ్బరం, వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుందివిటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ డెజర్ట్, మితంగా తింటే శరీరంలో తెల్ల రక్త కణాల వృద్ధి అవుతాయి.ఇది రోగనిరోధక శక్తిని పెంచి, దీర్ఘకాలంలో వివిధ కాలానుగుణ వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.కంటి చూపును వృద్ధి చేస్తుందిఇందులో విటమిన్ ఏ, బీటా-కెరోటిన్ అధికంగా ఉంటాయి డెజర్ట్ తయారీ..ఒక పాన్‌లో బెల్లం పొడితో పాటు ఒక కప్పు కొబ్బరి పాలను వేసి, రెండు పదార్థాలు కలిసే వరకు వేడి చేయండి. అయితే, పాలల్లో బెల్లం కరిగిపోయేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక పెద్ద గిన్నెలో వండిన జిగురుతో కూడిన అన్నం తీసుకుని దానిపై ఈ కొబ్బరి పాలు గ్రేవీ సగం పోయాలి. దీన్ని బాగా కలపి ఒక గంట పక్కన పెట్టండి. ఆ తర్వాత ఒక మామిడికాయ ముక్కను తీసుకుని ముక్కలు చేసి ఈ అన్నంలో వేశాక, మిగిలిన కొబ్బరిపాల గ్రేవిని ఇప్పుడు వేయాలి. చివరగా వేయించిన నువ్వులతో అందంగా అలంకరించాలి. అంతే టేస్టీ టేస్టీగా ఉండే స్టిక్కీ రైస్ మామిడి పాయసం రెడీ..!.(చదవండి: హీరో మాధవన్ ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ తెలిస్తే..నోరెళ్లబెడతారు!) -
అన్నం లేదా రోటీ: బరువు తగ్గేందుకు ఏది మంచిది?
బరువు తగ్గాలని చాలామంది తీసుకునే ఆహారం విషయంలో చాలా మార్పులు చేస్తుంటారు. ముఖ్యంగా కేలరీల తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే బరువు అదుపులో ఉంటుందన్న భావంతో రైస్‌కి తక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. చాలామంది రాత్రిపూట భోజనం మానేస్తుంటారు. చాలా వరకు చపాతీ లేదా రోటీలతో సరిపెడతారు. నిజానికి బరువు తగ్గడంలో అన్నం, రోటీలలో ఏది బెటర్. ఈ రెండింటిలో ఏదీ కీలకపాత్ర పోషిస్తుంది అంటే..వెయిట్ లాస్ జర్నీలో రెండింటిలో ఏది మంచిదంటే..ముందుగా బియ్యం, రోటీల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయో చూద్దాం.అన్నం..బియ్యం అనేది తృణధాన్యం. ఇది చాలా రకాలుగా వస్తుంది. సర్వసాధారణంగా తెలుపు, గోధుమ రంగుల్లో ఉంటుంది. వంద గ్రాముల వైట్ రైస్‌లో ఇవి ఉంటాయి:కేలరీలు: 356 కిలో కేలరీలుకార్బోహైడ్రేట్లు: 78.2గ్రాప్రోటీన్: 7.9 గ్రాఫైబర్: 2.8గ్రాగ్లైసెమిక్ ఇండెక్స్ (GI): 70-80 (అధిక)రోటీ..రోటీని సాధారణంగా గోధుమ పిండితో తయారుచేస్తారని నిపణుల చెబుతున్నారు. వంద గ్రాముల హోల్ వీట్ రోటీలో ఇవి ఉంటాయి:కేలరీలు: 320 కిలో కేలరీలుకార్బోహైడ్రేట్లు: 64.17గ్రాప్రోటీన్: 10.5 గ్రాఫైబర్: 11.3గ్రాగ్లైసెమిక్ ఇండెక్స్ (GI): 55-60 (మధ్యస్థం)క్యాలరీ కంటెంట్: రోటీలో అన్నం కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అన్నం, పోషకాలు తక్కువగా ఉండటం వలన, ఎక్కువ మొత్తంలో తినడానికి దారి తీస్తుంది. ఫలితంగా అధిక కేలరీలు తీసుకునేందుకు కారణమవుతుంది. ఫైబర్ కంటెంట్: బరువు తగ్గడానికి ఫైబర్ కీలకం. ఎందుకంటే ఇది సంపూర్ణత్వం భావనను కలుగజేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రోటీని గనుక ముఖ్యంగా సంపూర్ణ గోధుమలతో తయారు చేసినదైతే..దీనిలో తెల్ల బియ్యం కంటే చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఈ అధిక ఫైబర్ కంటెంట్ పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. రోజంతా అధిక క్యాలరీలను తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. ప్రొటీన్ కంటెంట్: బరువు తగ్గే సమయంలో కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి ప్రోటీన్ చాలా అవసరం. సంతృప్తికరమైన భావాలను కూడా పెంచుతుంది. రోటీలో అన్నం కంటే ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. ఇది మంచి ఆకలి నియంత్రణకు దోహదపడుతుంది.గ్లైసెమిక్ ఇండెక్స్: గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) అనేది ఆహారం ద్వారా రక్తంలో ఎంత వేగంగా చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయనేది కొలుస్తుంది. తక్కువ జీఐ ఉన్న ఆహారాలు సాధారణంగా బరువు తగ్గడానికి మంచివిగా పరిగణిస్తారు వైద్యులు. ఎందుకంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా చేసి, తక్కువ ఇన్సులిన్ స్పైక్‌లకు దారితీస్తాయి. రోటీ సాధారణంగా తెల్ల బియ్యం కంటే తక్కువ జీఐని కలిగి ఉంటుంది. ఇది బరువు నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.ప్రాసెసింగ్ అండ్ రిఫైన్మెంట్: వైట్ రైస్ అనేది శుద్ధి చేసిన ధాన్యం. అంటే దీనిలొ ఊక, జెర్మ్ పొరలను తొలగించడంతో దాని పోషక విలువను తగ్గుతుంది. హోల్ వీట్ రోటీని ఎక్కువ పోషకాలు, ఫైబర్‌ని ఉండేలా తక్కువ ప్రాసెస్ చేసిన పిండితో తయారు చేస్తారు. తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలు సాధారణంగా బరువు తగ్గడానికి, మొత్తం ఆరోగ్యానికి మంచివిగా పరిగణిస్తారు. మోతాదుని నియంత్రించొచ్చు: రోటీ ప్రామాణిక పరిమాణం, ఆకృతి ఎంత మేర తీసుకుంటే చాలనేది నిర్ణయించగలం. బియ్య ప్రత్యేకించి ఎంత వరకు తీసుకుంటే మంచిదని సవాలుగా ఉంటుంది. ఒక్కోసారి తెలియకుండానే ఎక్కువ తినేందుకు దారితీస్తుంది.బరువు తగ్గడానికి అన్నం కంటే రోటీకి అనేక ప్రయోజనాలు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఏ ఒక్క ఆహారం వల్ల బరువు తగ్గిపోమని గ్రహించాలని నిపుణులు చెబుతున్నారు. నాణ్యతతో కూడిన సమతుల్య ఆహారం, సాధారణ శారీరక శ్రమ ఆరోగ్యకరమైన బరువును సాధించడంలో, నిర్వహించడంలో కీలకమైన అంశాలు.రైస్ కావాలనుకుంటే..ఎక్కువ ఫైబర్, పోషకాల కోసం తెలుపు బియ్యం కంటే బ్రౌన్ రైస్ లేదా తృణధాన్యాలని ఎంచుకోండి.అలాగే మోతాదులో తీసుకునేందుకు చిన్న చిన్న కప్పులను వినియోగించండి.పోషక విలువలను పెంచడానికి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్, కూరగాయలతో బియ్యం జత చేయండి.అదే రోటీని ఎంచుకోవాలనుకుంటే:గరిష్ట పోషక ప్రయోజనాల కోసం మొత్తం గోధుమ పిండితో తయారు చేయబడిందని నిర్ధారించుకోండి.వండేటప్పుడు లేదా వడ్డించే సమయంలో జోడించిన కొవ్వుల పట్ల జాగ్రత్త వహించండి.సమతుల్య భోజనం కోసం లీన్ ప్రోటీన్లు, కూరగాయలతో జత చేయండి.బియ్యం, రోటీ రెండూ ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమే. అయితే గోధుమ రోటీలో అధిక ఫైబర్, ప్రోటీన్ కంటెంట్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, సులభమైన తక్కువ మోతాదులో తీసుకునే వెసులుబాటు కారణంగా బరువు తగ్గేందుకు కొన్ని ప్రయోజనాలను కలిగి ఉంది. కానీ ఆరర్యోకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే మాత్రం, సమతుఇఉల్య ఆహారం, మంచి జీవన శైలి తదితరాలే కీలకమైనవని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: గుండె ఆరోగ్యం కోసం ఉపయోగపడ బెస్ట్ ఆయిల్స్ ఇవే..!) -
ఉప్పుడు బియ్యం ఎగుమతి సుంకంలో మార్పులు?
ప్రభుత్వం ఉప్పుడు బియ్యం(పార్బాయిల్డ్ రైస్)పై ఎగుమతి సుంకాన్ని టన్నుకు 100 డాలర్లు(రూ.8,300)గా నిర్ణయించాలని యోచిస్తోంది. ఈ వెరైటీ బియ్యంపై ప్రస్తుతం 20 శాతం ఎగుమతి సుంకాన్ని వసూలు చేస్తున్నారు. ఇది తమకు భారంగా మారుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. దాంతో బియ్యం ఎగుమతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైస్ ఫెడరేషన్ కన్సల్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 2023 ఆగస్టు నుంచి 20 శాతం సుంకాన్ని వసూలు చేస్తున్నారు. ఇది ఎగుమతిదారులకు భారంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆ సుంకాన్ని తగ్గించాలని లేదా దాని స్థానంలో ప్రత్యేక వెసులుబాటు ఉండాలనే డిమాండ్ ఉంది. ప్రభుత్వం ప్రత్యేకంగా బియ్యం ఎగుమతుల సమస్యలను పరిష్కరించేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైస్ ఫెడరేషన్ కన్సల్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తీసుకున్న ప్రాథమిక నిర్ణయం ప్రకారం ఉప్పుడు బియ్యం ఎగుమతిపై టన్నుకు 100 అమెరికన్ డాలర్లు(రూ.8,300) వసూలు చేస్తారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు.ఇదీ చదవండి: బడ్జెట్లో రైతన్న కోరుకుంటున్నవి..దేశీయంగా బియ్యం ధరలు పెరిగిపోతున్న తరుణంలో ఇటీవల బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం అమలు చేసింది. దాంతో ఉప్పుడు బియ్యానికి డిమాండ్ పెరిగింది. దేశీయంగా వీటి నిల్వలను తగినంతగా అందుబాటులో ఉంచడంతో పాటు, రిటైల్ ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఈ సుంకం విధించింది. -
మళ్లీ కొత్త పద్ధతుల్లో ‘పనికి ఆహార పథకం’?
సాక్షి, హైదరాబాద్: మళ్లీ కొత్త పద్ధతుల్లో ‘పనికి ఆహార పథకం’ అమలు కానుందా? జాతీయ స్థాయిలో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆహార సమస్య ల పెరుగుదలతో కొత్త రూపంలో ఈ పథకాన్ని తీసుకొచ్చే అవకాశాలున్నాయనే చర్చ అధికార వర్గాల్లో జరుగు తోంది. మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈఎస్) కింద చేసే ఉపాధి పనులకు ఇచ్చే కూలీలో కొంత (పార్ట్ పేమెంట్) బియ్యం ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ నుంచి కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు చేరినట్లు తెలుస్తోంది. భారీగా పెరిగిన నిల్వలు..: గతేడాది బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషే ధం, పారాబాయిల్డ్ రైస్‌పై 20 శాతం ఎక్స్పోర్ట్ డ్యూటీ వంటి చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలతో దేశంలో బియ్యం నిల్వలు 1.4 కోట్ల టన్నులకు చేరుకోవడంతో గిడ్డంగి ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ‘పనికి ఆహార పథకం’కింద గ్రామీణభివృద్ధి శాఖకు బియ్యం కేటాయింపును ఒక మార్గాంతరంగా కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక వివిధ కాంబినేషన్లు, రూపాల్లో దీన్ని ఇచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. ప్రయోజనం ఉండదంటున్న నిపుణులు కూలీ మొత్తంలో కొంత భాగాన్ని బియ్యంగా ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కూలీలు ఈ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకొనే ఆస్కారం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపాధి హామీ పథకం అమల్లోకి రావడానికి ముందు ‘పనికి ఆహార పథకం’కింద అనేక అక్రమాలు, కుంభకోణాలు జరిగిన తీరును గుర్తుచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ‘ఫుడ్ ఫర్వర్క్ స్కీం’లో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణాలు చోటుచేసుకోవడం, ఈ పథకం కింద కేటాయించిన బియ్యం నేరుగా బహిరంగ మార్కెట్‌కు చేరుకోవడం వంటివి జరిగిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు. అదీగాకుండా ఉపాధి హామీ పథకం కింద కూలీని నగదు రూపంలో ఇవ్వాల్సి ఉండటం, ఇచ్చే బియ్యానికి లెక్క కట్టడం, ఇతర సమస్యలు ఉత్పన్నమౌతాయని చెబుతున్నారు. -
Potato Rice ఆలూ రైస్.. పిల్లలు భలే తింటారు!
దుంపకూరల్లో దాదాపు అందరికీ ఇష్టమైంది బంగాళదుంప, ఆలూ లేదా పొటాటో. బంగాళదుంపతో చేసిన వంటకాలంటే పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఆలూ కూర, ఫ్రై ఎలా చేసినా దాని రుచే వేరు. చిన్న ముక్కలుగా కోసి, నూనెల సింపుల్‌గా వేయించి ఉప్పు, కారం కాస్త జీలకర్ర చల్లినా కూడా టేస్ట్ అదిరి పోతుంది. బంగాళా దుంపతో ఆలూ ఫ్రై, కూర్మా, ఇంకా వివిధ కూరగాయలతోపాటు మిక్స్డ్ కర్రీగా.. ఇలా చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇపుడు మాత్రం వెరైటీగా ఆలూ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చేసుకోవడం తేలిక, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.కావలసిన పదార్థాలుబాస్మతి బియ్య రెండు కప్పులు (మామూలు రైస్ అయినా పరవాలేదు) చిన్నముక్కలుగా తరిగిన బంగాళా దుంప ముక్కలు అరకప్పుతరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నెయ్యి, కొత్తిమీరతయారీబియ్యాన్నిశుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టి, తరువాత పొడి పొడిగా ఉండేలా వండి పక్కన పెట్టుకోవాలి.ప్యాన్‌లో కొద్దిగా నూనె వేయాలి. బాగా వేడెక్కిన తరువాత జీలకర్ర వేసి, అవి చిటపట మన్నాక కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మరి కొద్దిసేపు వేయించాలి. ఇవి వేగాక తరిగిన బంగాళదుంపలు, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. స్పైసీ రుచి కావాలంటే కొద్దిగా మిరియాలుగానీ, కొద్దిగా మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు.బాగా వేగిన తరువాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా కలపాలి. పైన రెండు స్పూన్ల వేస్తే రైస్ పొడిగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని, చక్రాల్లా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడిగా వేడిగా ఆరగించడమే. కీరా కలిపిన రైతాతో తింటే ఇంకా బావుంటుంది. -
కేబినెట్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఇష్టపడే రెసిపీ ఇదే..!
బీహార్‌లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ నియోజకవర్గం నుంచి 6.14 లక్షల మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు. ఆయన తన తండ్రి, దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న రాజకీయనాయకుడు కూడా ఆయనే. 41 ఏళ్ల చిరాగ్ 2011లో ఓ హిందీ సినిమాలో హీరోగా నటించారు కూడా. అందులో హీరోయిన్ బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచిన బాలీవుడ్ నటి కంగానా రనౌత్ కావడం విశేషం. ఇక చిరాగ్ ఒక ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన ఆహారం గురించి షేర్ చేసుకున్నారు. బిహారీ సంప్రదాయ ఫుడ్ అయిన దాల్చావల్ లేదా దాల్ బాత్ అంటే మహా ఇష్టమైన రెసిపీ అని చెప్పుకొచ్చారు. ఇది స్పైసీ తడ్కాతో కూడిన ఒక రకమైన భోజనం. పేరు డిఫెరెంగా ఉన్నా.. ఇది మన సాధారణ భారతీయ భోజమే. మనం తెలుగు రాష్ట్రాల్లో పప్పు అన్నం ఇష్టంగా తింటామే అదేగానీ కొంచెం వెరైటీగా ఉంటుంది.ఇక్కడ దాల్ చావల్ అంటే దాల్ అంటే పప్పు, చావల్ అంటే ఉడికించిన అన్నం..మొత్తం కలిపి పప్పు అన్నం. అయితే కొన్ని ప్రాంతాల్లో పప్పు ధాన్యాలు తక్కువగా ఉండటంతో కొద్దిపాటి కూరగాయలను జోడించి.. సులభంగా పోషకాలు పొందేలా రూపొందిచిన వంటకమే ఈదాల్ చావల్. అదేనండి మనం పప్పు టమాటా, దోసకాయ పప్పు ఎలా చేసుకుంటామో అలానే అన్నమాట. కాకపోతే ఇది స్పైసీగా ఉంటుంది. దీనికి ఊరగాయ, పాపిడ్ని జతచేసి వేడివేడి అన్నంలో తింటే దీని రుచే వేరు. ఈ దాల్ చావల్ తయారీ విధానం ఎలాగో సవివరంగా చూద్దామా..!కావాల్సిన పదార్థాలు..కందిపప్పు 1 కప్పునీళ్లు 4 కప్పులుఉల్లిపాయ ఒకటిటమమోటాలు 2పచ్చిమిర్చి 2వెల్లుల్లి రెండు, లవంగాలు రెండుఅల్లం ముక్క ఒకటిఆవాలు టేబుల్ స్పూన్జీలకర్ర టేబుల్ స్పూన్నూనె రెండు టేబుల్ స్పూన్లుఅలంకరణ కోసం తాజా కొత్తిమీర ఆకులుబాస్మతి బియ్యం 1 కప్పునీరు 2 కప్పులురుచికి ఉప్పుతయారు చేయు విధానం: పప్పు బాగా కడిగి నాలుగు కప్పులు నీళ్లు, పసుపు వేసి మెత్తగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఓ గిన్నెలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేగాక, ఉల్లిపాయ ముక్కలు, టమోటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, లవంగాలు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత ఈ ఉడికించిన పప్పును వేయడమే. చివరగా కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేసుకోవాలికి. దీని కోసం రెడీ చేసి పెట్టుకున్న వేడి వేడి అన్నంలో ఈ పప్పు, ఊరగాయ, పాపిడి వేసుకుని తింటే ఆ రుచే వేరేలెవెల్. View this post on Instagram A post shared by Vani Sharma (@vaanis_lunch_table) (చదవండి: అంబానీ కుటుంబం ఆ ఆవు పాలనే తాగుతారట..లీటర్ ఏకంగా..!) -
బియ్యం నానబెట్టి వండుకుంటే షుగర్ పేషెంట్లకు మంచిదేనా?
భారతీయుల ఆహారంలో ప్రధానమైన ఆహార పదార్థాలలో బియ్యం ఒకటి. ఇండియాలో ఎక్కువగా పండించేది, భారత ప్రజలు ఎక్కువగా తినేది బియ్యమే. ప్రతి సంవత్సరం సగటున 125.038 మిలియన్ టన్నుల బియ్యాన్ని భారతదేశం మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఊబకాయం, మధుమేహ వ్యాధి బాగా విస్తరిస్తున్న నేపథ్యంలో రైస్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది ప్రచారంలో ఉంది. అయితే బియ్యాన్ని ఉడికించే ముందునీటిలో నానబెట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ నేపథ్యంలో బియ్యాన్ని నానబెట్టడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఒకసారి చూద్దాం.అనేక అధ్యయనాల ప్రకారం ఏదైనా గింజల్ని నానబెట్టినపుడు వాటిల్లోని పోషకాలు మరింత ఎక్కువగా అందుతాయి. అలాగే బియ్యాన్ని నానబెట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. బియ్యం నానబెట్టడం దాని గ్లైసెమిక్ సూచిక (GI), పోషకాహార ప్రొఫైల్‌ను ప్రభావితం చేస్తుంది. డయాబెటిక్ రోగులు సాధారణంగా అన్నం తినకూడదని సలహా ఇస్తారు. అయితే బియ్యాన్ని నానబెట్టడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచే జీఐని తగ్గిస్తుంది. ఎంజైమాటిక్ బ్రేక్‌డౌన్ చేసి జీఐని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నానబెట్టడం వల్ల సెరోటోనిన్, మెలటోనిన్ విడుదలకు సహాయపడుతుంది.బియ్యాన్ని నానబెట్టడం వల్ల అదనపు పిండిపదార్థాలు తొలగిపోతాయి. దీంతో బరువు తగ్గాలనుకునేవారికి, షుగర్ వ్యాధి గ్రస్తులకు కొంతమేరకు ఉపయోగపడుతుంది. పోషకాల శోషణను మెరుగుపరుస్తుందిబియ్యం నానబెట్టడం వల్ల పోషకాలు విచ్ఛిన్నమవుతాయి. ఈ పద్ధతిని ఉపయోగించి బియ్యంలో ఉండే ఫైటోకెమికల్స్, టానిన్లను విచ్ఛిన్నం చేయవచ్చు. అలాగే విటమిన్లు. ఖనిజాల జీవ లభ్యత పెరుగుతుంది.ఇది అన్నం సులభంగా జీర్ణం కావడానికి, అందులోని పోషకాలను గ్రహించేలా చేస్తుంది.ఉడికించే ముందు బియ్యాన్ని నానబెట్టిడం ద్వారా క్లిష్టమైన కార్బోహైడ్రేట్లను సాధారణ చక్కెరగా మార్చడానికి సహాయ పడుతుంది. శరీరంలో ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపర్చి, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.వంట సమయాన్ని తగ్గిస్తుందిఅంతేకాదు బియ్యాన్ని నీటితో నానబెట్టడం వల్ల వండే సమయం కూడా తగ్గుతుంది. బియ్యాన్ని నానబెట్టడం వల్ల గింజలు మెత్తబడి సులభంగా ఉడుకుతాయి. దీంతో వంట ఖర్చు కూడా ఆదా అవుతుంది.నోట్: ఇది అవగాహనా సమాచారం మాత్రమే. షుగర్ వ్యాధి జీవనశైలితోపాటు అనేక ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. -
వరికి ని‘బంధనాలు’
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయాలని నిర్ణయించిన పంటల బీమా పథకంలోని నిబంధనలు వరి రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఒక జిల్లాలో మొత్తం సాగువిస్తీర్ణంలో 25 శాతానికి మించి విస్తీర్ణమున్న పంటలను మాత్రమే గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకం అమలు చేయాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం సంగారెడ్డితోపాటు, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏ ఒక్క పంట కూడా 25 శాతానికి మించి సాగు కావడం లేదు. దీంతో ఈ జిల్లాల్లో గ్రామం యూనిట్‌గా అమలు చేసే అవకాశం లేకుండాపోతోంది. ఈ వానాకాలం నుంచే కొత్త పథకం అమలు అధిక వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా పంటల బీమా పథకం అమలు చేస్తారు. ఐదేళ్ల క్రితం నిలిపివేసిన ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో భాగంగా ఈ వానాకాలం నుంచే రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. నిర్మల్‌లో వరితోపాటు, సోయా కూడా.. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో ఈ పంటల బీమా పథకం అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో వరి పంటను గ్రామం యూనిట్‌గా అమలు చేసేందుకు నిబంధనలు కలిసొస్తున్నాయి. నిర్మల్ జిల్లా వరితోపాటు, సోయా పంట కూడా గ్రామం యూనిట్‌గా అమలు చేసేందుకు వీలు కలుగుతోంది. మండలం యూనిట్ అయితే వరి రైతుకు నష్టం పంటల బీమా పథకం గ్రామం యూనిట్‌గా అమలు చేస్తేనే ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు క్లెయిమ్ (పరిహా రం) అందుతుంది. మండలం యూనిట్‌గా అమలు చేస్తే చాలామంది రైతులకు ఈ క్లె యిమ్ అందదు. ఎలాగంటే.. మండలం యూనిట్‌గా తీసుకుంటే అధిక వర్షాలుగానీ, వడగండ్ల వానగానీ, ఈదురుగాలుల వర్షం కారణంగా మండలవ్యాప్తంగా అన్ని గ్రామా ల్లో మొత్తం వరి పంట నష్టపోతే మాత్రమే రైతులకు పరిహారం అందుతుంది.మండలంలో కొన్ని గ్రామాల్లో పంట నష్టం జరిగి, మరికొన్ని గ్రామాల పరిధిలో నష్టం జరగకపోతే పంట నష్టపోయిన గ్రామాల రైతులకు కూడా పరిహారం అందదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈ నిబంధనపై రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లాలకు ఒకే విధంగా నిబంధనలను సరళీకృతం చేయాలని కోరుతున్నారు. -
గింజ సన్నబియ్యం కొనలేదు.. పైసా ఖర్చు చేయలేదు: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు గింజ సన్నబియ్యం కూడా కొనుగోలు చేయలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సన్నబియ్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పైసా ఖర్చు చేయలేదన్నారు. అలాంటప్పుడు కుంభకోణానికి ఆస్కారమే ఉండదని వివరించారు. ఈ అంశంపై ఏమాత్రం అవగాహన లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అర్థరహితంగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్యం కొనుగోలులో ఏకంగా రూ.300 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏ.లక్ష్మణ్, సంజీవరెడ్డి, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రూ.30 రూపాయలకు కిలో ఉన్న సన్నబియ్యాన్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని కేటీఆర్ మాట్లాడుతున్నాడని, సన్నబియ్యం రూ.42కు కిలో చొప్పున ఎంత స్టాక్ ఉన్నా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆమేరకు సమాచారం ఉంటే ఇవ్వాలని కేటీఆర్‌కు సూచించారు. పౌరసరఫరాల శాఖలో రూ.వెయ్యికోట్ల స్కామ్ జరిగిందంటూ చేస్తున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని, సత్యదూరమైన వ్యాఖ్యలతో ప్రజల్లో లేనిపోని అనుమానాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.58వేల కోట్ల అప్పుల భారం మోపిందని, రైస్‌మిల్లర్ల వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రూ.11వేల కోట్ల బియ్యం పెట్టిందని, వాస్తవానికి ఆ స్టాకు ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని చెప్పారు. అత్యంత పారదర్శకంగా పాలన సాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని, తాము మిల్లర్ల దగ్గర బేరాలు, వసూళ్లకు పాల్పడే రకం కాదని స్పష్టం చేశారు. కొంతమంది మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించామని, కొన్నింటిని డిఫాల్టర్ జాబితాలో చేర్చామని, మరికొన్ని యాజమాన్యాలను అరెస్టు చేశామన్నారు. అరెస్టులు చేసి వేధించే విధానం తమ ప్రభుత్వానికి లేదని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కేంద్రీయ బండార్‌ను బ్లాక్ లిస్టులో పెట్టింది..ఆ తర్వాత తొలగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఏమాత్రం సంబంధం లేదన్నారు. సరైన అవగాహనతో కేటీఆర్ మాట్లాడాలని హితువు పలికారు. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్రెడ్డిఅధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు ఓవర్‌స్పీడుతో అర్థం లేకుండా మాట్లాడడం సరికాదని సూచించారు. బాధ్యతతో మాట్లాడాలని, ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు. ఢిల్లీలో డబ్బులు ఇచ్చి ఫ్లోర్‌లీడర్ పదవి తెచ్చుకున్నాడేమో...అందుకే దూకుడుతో ఉన్నాడని వ్యాఖ్యానించారు. డీఫాల్టర్ అయిన రైస్ మిల్లుల తరఫున బీఆర్ఎస్, బీజేపీ పొటాపొటీగా మాట్లాడుతున్నాయని, దీనిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు రావనే అక్కసుతో ఇష్టానుసారంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వ పనితీరే సమాధానమన్నారు.సూర్యాపేట సభకు అసలు కరెంటు కనెక్షన్ తీసుకోలేదని, జనరేటర్ల ఆధారంగానే ఆపార్టీ నేతలు ఏర్పాటు చేశారన్నారు. కరెంటు తీసుకోన్నప్పుడు కోతలు ఎలా జరుగుతాయని, అక్కడ సరైన ఏర్పాట్లు చేయకుండా డిస్కంలను బద్నాం చేయొద్దన్నారు. గతేడాది వరంగల్ ఎంజీఎంలో 121 సార్లు పవర్ బ్రేక్‌డౌన్ అయ్యిందని, రోగులను ఎలుకలు పీక్కుతిన్నాయని, వాటిపై మాట్లాడని కేటీఆర్ ఇప్పుడు డయాలసిస్ యూనిట్లో విద్యుత్ సమస్యపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. – ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరగానే ఆ పార్టీ చేసిన తప్పులు, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాలన్నీ ఒప్పులు అయ్యాయా అని ప్రశ్నించారు. పౌరసరఫరాల సంస్థ అప్పులపాలు కావడానికి గత బీఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వాలే కారణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే రుణమాఫీ చేయనుందని, ఎన్నికల కోడ్ ఉండడంతో జాప్యం జరిగిందని, ఆగస్టు 15లోగా మాఫీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. -
వరికి వడగళ్ల దెబ్బ
డొంకేశ్వర్ (ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి వరి పంట తీవ్రంగా దెబ్బతింది. వర్మి, కోటగిరి, పొతంగల్, బోధన్, మోస్రా, చందూర్ మండలాల్లో మొత్తం 2 వేల ఎకరాల వరకు వరికి నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. కోతకు వచ్చిన వడ్లు పొలాల్లోనే నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి పంటనష్ట లెక్కలను బుధవా రం వెల్లడించనున్నారు. కొన్ని ప్రాంతాల్లో అరకిలో సైజులో వడగళ్లు పడటంతో మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 15 నిమిషాల్లోపే కళ్ల ముందు పంట నేల రాలిపోయిందని రైతులు ఆవేదనం వ్యక్తం చేస్తున్నారు. -
జుట్టు మృదువుగా నిగనిగలాడలంటే గంజితో ఇలా చేయండి!
జుట్టు ఆరోగ్యం కోసం ఎన్నో క్రీమ్‌లు, కండిషనర్లు వాడి ఉంటారు. వాటన్నిటికంటే బట్టటకు పెట్టే గంజి బెటర్. ఇదేంటి గంజినా అనుకోకండి. ఎందుకుంటే బియ్యం వార్చిన గంజితో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే.. ఈ గంజిని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంటాయి. ఈ గంజినీరు జుట్టు కుదుళ్లను బలంగా పెరిగేలా చేస్తుంది. అలాగే మృదువుగా మెరిసేలా చేయడంలో గంజినీరుకి మించిది మరొకటి లేదని చెబుతున్నారు నిపుణులు. ఇది మంచి కండిషనింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా పొడి జుట్టువారికి ఈ గంజి నీటిని రోజూ తలపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు కూడా స్ట్రాంగ్‌గా మారుతుంది. ఈ గంజి జుట్టుకి సహజమైన షైనింగ్‌ని, మృదుత్వాన్ని అందిస్తుంది. ఈ గంజినీటికి మెంతికూర, అలోవెర జోడించి, పులియబెట్టి అప్లై చేస్తే జుట్ట చివర్ల చిట్లిపోవడం వంటి సమస్యలు ఉండవు. ఇది వెంట్రుకలు నెరసిపోవడాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే ఇనోసిటాల్ జుట్టుని మృదువుగా మార్చే గుణం ఉటుంది. ఫలితంగా జుట్టు మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!
మన భారతదేశంలో బియ్యమే ప్రధాన ఆహారం. ఎన్ని వెరైటీ టిఫిన్లు తిన్నా.. నాలుగు మెతుకులు కడిపులో పడితేనే హాయిగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకు మంచి శక్తినిచ్చి ఎక్కువ సేపు పనిచేయగలిగే సామర్థ్యాన్ని అందించేది బియ్యం మాత్రమే. అలాంటి బియ్యాన్ని వండటానికి ముందు తప్పనిసరిగా కడగాల్సిందేనా? మరి నిపుణులు ఏమంటున్నారు..? ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన మంచి ఆహారం. కార్బోహైడ్రైట్లకు మూలం. పైగా శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పౌష్టికమైన ఆహారం కూడా. మనల్ని శక్తిమంతంగా ఉండేలా చేసేది, చక్కగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి కసరత్తులు చేయడానికి తోడ్పడేది అయిన బియ్యంలో మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, ఫైబర్, బీ విటమిన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాంటి బియ్యాన్ని వండడానికి ముందు కడగడం అవసరమా అంటే..? ఎందుకు కడగాలంటే.. నిపుణులు తప్పనిసరిగా బియ్యాన్ని వండటానికి ముందు కడగాల్సిందేనని చెబుతున్నారు. ఆర్సెనిక్ వంటి విష పదార్థాలు ఉంటాయని, అందువల్ల కడగాలని తెలిపారు. నానాబెట్టి కడగడం ఇంకా మంచిదని, దీనివల్ల ఆ బియ్యంలో ఉన్న ఆర్సెనిక్, మట్టి వంటివి నీటిలో కరిగి సులభంగా కరిగి బయటకి వెళ్లిపోతాయని అన్నారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి హాని కలిగించే ధూళి, గులకరాళ్లు, మిగిలిపోయిన శిథిలాలు వంటి అవాంఛనీయ పదార్థాలు ఏమైనా ఉన్నా కడగడం వల్ల నీళ్ల ద్వారా బయటకు వెళ్లిపోయి బియ్యం చక్కగా క్లీన్ అవుతాయని పేర్కొన్నారు. ఇలా కడిగితే ఆ బియ్యంపై ఉండే పిండిలాంటి పదార్థం బయటకు పోయి అన్నం చక్కగా అతుక్కోకుండా పొడిపొడిగా ఉటుందని చెప్పారు. అలాగే ఇలా వాష్ చేస్తే మైక్రో ప్లాస్టిక్‌లను ఈజీగా తొలగించగలమని అన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాలు, మైనింగ్ కార్యకలాపాలు, బొగ్గును కాల్చడం వంటి వాటివల్ల భూగర్భజలాల్లోకి ఆర్సెనిక్ సులభంగా ప్రవేశిస్తుంది. పలితంగా భారీగా నీటి కాలుష్యం ఏర్పడుతుంది. అక్కడ నుంచి ఆ నీరు కాస్త పంట నీటి పారుదలకు, వంట కోసం ఉపయోగించే వాటిలోకి సరఫరా అవుతుంది. అందులోనూ వరి మరీ ఎక్కువగా ఆర్సెనిక్ కలుషితానికి గురవ్వుతుంది. ఎందుకంటే..? వరిపోలాలకు నీటి అవసరం ఎక్కువ, పైగా వరదల టైంలో ముంపునకు గురవ్వుతాయి కూడా. అలా.. ఈ ఆర్సెనిక్ వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఆర్సెనిక్ వల్ల వచ్చే సమస్యలు ఎరుపు లేదా వాపు చర్మం కొత్త మొటిమలు లేదా గాయాలు పొత్తికడుపు నొప్పి వికారం, వాంతులు అతిసారం అసాధారణ గుండె లయ కండరాల తిమ్మిరి వేళ్లు, కాలి జలదరింపు చర్మం నల్లబడటం గొంతు నొప్పి నిరంతర జీర్ణ సమస్యలు మొదలైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, దీర్ఘకాలిక లక్షణాలు మొదట చర్మంపై కనిపిస్తాయి. ఆ తర్వాత ఇలా బహిర్గతం అయిన ఐదు ఏళ్లలోపు అందుకు సంబంధించిన కేసులు, మరణాలు నమోదవ్వుతాయి. అందువల్ల ఆరోగ్యకరమైన, రుచికరమైన అన్నం తినాలనుకుంటే బియ్యాన్ని తప్పనిసరిగా శభ్రంగా కడగాలని నిపుణులు చెబుతున్నారు. గుర్తుంచుకోవలసిన విషయాలు.. ఆరోగ్యకరమైన, రుచికరమైన అన్నం తయారీకి గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు వంటి వారు గ్లూకోజ్ కంటెంట్ తక్కువగా ఉండాలనుకుంటే.. నానాబెట్టి చక్కగా కడిగి వండుకోవాలని సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు బ్రౌన్ రైస్ వంటి వాటిని తినండి. బ్రౌన్‌రైస్ వైట్‌రైస్ కంటే ఎక్కువ ఫైబర్, ప్రోటీన్లను కలిగి ఉంటుంది. (చదవండి: జైల్లో బరువు తగ్గిన కేజ్రీవాల్:మధుమేహం కారణమా?) -
సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు!
వేసవి ఎండలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎండల్ని తట్టుకునేలా మన జీవన శైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా మన శరీరానికి చల్లదనాన్ని, పోషకాలు అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి వాటిలో ప్రధానమైంది ఫర్మెంటెడ్ రైస్, లేదా పులియ బెట్టిన పెరుగున్నం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఒకసారి చూద్దాం.! పులియబెట్టినపెరుగన్నంతో ప్రయోజనాలు వేసవిలో పెరుగు అన్నం లేదా రాత్రంతా పెరుగులో పులియబెట్టిన అన్నం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో విటమిన్ సితో పాటు ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి పెరుగు అన్నంలోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తాయి. గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది ప్రయోజన కరంగా ఉంటుంది. కడుపులో చికాకు, అజీర్ణం లాంటి సమస్యలనుంచి ఉపశమనం కలుగుతుంది. కడుపులో కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇది త్వరగా, సౌకర్యవంతంగా జీర్ణమవుతుంది. కాల్షియం, బీ12 విటమిన్ డీ, ప్రోటీన్‌తో సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఎదుగుతున్న పిల్లల్లో బలమైన ఎముకలు ,దంతాలకు కాల్షియం చాలా అవసరం. పిల్లలు ఇది అలవాటు చేస్తే విటమిన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. ఈ పెరుగు అన్నం ఎలా చేసుకోవాలి ప్రోబయాటిక్ పెరుగు అన్నం చేయడం చాలా సులభం. వండిన అన్నాన్ని కొంచెం వేడిగా ఉండగానే ఒక గిన్నె (మట్టి పాత్ర అయితే ఇంకా మంచిది) లోకి తీసుకోవాలి. ఇందులో పాలు పోసి తోడు పెట్టాలి. ఇష్టం ఉన్నవాళ్లు ఇందులో ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయానికి అదనపు పోషకాలతో చక్కగా పులిసి ఉంటుంది. దీన్ని తాలింపు వేసుకొని, కొద్దిగా కొత్తిమీర చల్లుకుని తినవచ్చు. టిప్: పచ్చిమిర్చి వేయకుండా నల్లద్రాక్ష, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు లాంటివి వేసి చక్కగా గార్నిష్ చేసి ఇస్లే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాదు బోలెడన్ని పోషకాలు కూడా లభిస్తాయి. -
థైరాయిడ్ ఉంటే అన్నం తినకూడదా?
థెరాయిడ్ ఇటీవల చిన్నా, పెద్ద అందర్నీ వేధిస్తున్న సమస్య ఇది. దీని వల్ల ఎదురయ్యే సమస్యలు అంత ఇంత కాదు. విపరీతంగా బరువు పెరిగిపోయి నలుగురిలో తిరిగేందుకు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మహిళలకు ప్రెగ్నెన్సీ విషయంలో పలు సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే ఈ థెరాయిడ్ ఉన్నవారు అస్సలు అన్నమే తినకూడదంటున్నారు నిపుణులు. ఇదేంటి అన్నమే మనకు శక్తినిచ్చేది అలాంటి అన్నమే వద్దంటే ఎలా? అసలు థెరాయిడ్ ఉన్నవారు ఎందుకు అన్నం తికూడదు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా!. కొందరూ అన్నాన్నే మూడు పూటలా తింటుంటారు. ఇందులో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నందున మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది. అలాగని ఇలా ఎక్కువగా తింటే మాత్రం అమాంతం బరువు పెరుగుతారు. నిజానికి డైటింగ్ చేసి బరువు తగ్గాలనుకునేవారే అన్నాన్ని తక్కువగా తీసుకుంటారు. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా అన్నాన్ని ఎక్కువగా తీసుకోకూదట. ఒకవేళ అన్నం తినాలనుకున్నా వైట్‌రైస్ అస్సలు వద్దంటున్నారు నిపుణులు. దాని బదులు బ్రౌన్‌రైస్ తీసుకోమని సూచిస్తున్నారు. బియ్యంలో గ్లూటెన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది సమస్యను మరింత పెంచుతుంది. అందుకే థైరాయిడ్ రోగులు అన్నం తినకూడదని చెప్తుంటారు. గ్లూటెన్ మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది శరీరంలో ప్రతిరోధకాలను తగ్గించి, థైరాక్సిన్ హార్మోన్ సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే అన్నాన్ని అతిగా తినకూడదని చెబుతున్నారు నిపుణులు. అదీగాక అన్నంలో ఉండే పిండి పదార్థం త్వరగా జీర్ణమవుతుంది. దీంతో మనకు చాలా త్వరగా ఆకలిగా అనిపిస్తుంది. ఇంకేముంది కడుపు నిండేదాక ఆబగా తింటుంటాం. కానీ ఇది బరువును అమాంతం పెంచుతుంది. ఈ కారణంగానే థైరాయిడ్ రోగులను అన్నం తినొద్దని అంటారు. నిపుణులు ఏమంటున్నారంటే.. థెరాయిడ్ రోగులు అన్నం ఇలా ఎక్కువగా తింటే థైరాయిడ్ తో పాటుగా టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. బియ్యంలో ఉండే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం తదితర పరిమాణలు ఎక్కువుగా ఉంటాయి. అందుకే థైరాయిడ్ పేషెంట్లు అన్నం తినకూడదని చెబుతున్నారు. ఒకవేళ తినాలనుకున్నా బాగా నానబెట్టి వార్చి తినడం మంచిది. ఇలా చేస్తే గంజి రూపంలో బియ్యంలో ఉంటే కొన్ని విటమిన్లు వెళ్లిపోతాయి. కాస్త బెటర్‌గా ఉంటుంది. ఇక అలానే నానబెట్టి వండుకోవడానికే ప్రాముఖ్యత ఇవ్వండి. మరీ ముఖ్యంగా ఆర్గానిక్ రైస్‌కి ప్రిఫెరెన్స్ ఇవ్వండి. అదే సమయంలో తగు మోతాదులో తినేందుకు యత్నించండి. అంటే ఇక్కడ రైస్ క్వాంటిటీ తక్కువగానూ, కూర కంటెంట్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోమని చెబుతున్నారు. అన్నాన్ని ఎలా వండి తినాలి? అన్నం తినడం ఇష్టమైతే దీన్ని రకరకాల కూరగాయలతో మిక్స్ చేసి డైట్ లో చేర్చుకోవచ్చు. కానీ అన్నాన్ని చాలా తక్కువగా తినాలి. అన్నం తక్కువగా, కూరగాయలు ఎక్కువగా ఉండేట్టు చూసుకుంటే ఏ సమస్యా ఉండదు. అయితే మీ ఆహారంలో మార్పులు చేయడానికి ముందు ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించండి. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చింది. ఈ సూచనలు, సలహాలు పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడని సంప్రదించి పాటించటం మంచిది. (చదవండి: రెడ్‌లైట్ థెరఫీతో షుగర్ తగ్గించొచ్చా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
మనకు భారత్ రైస్ భాగ్యం లేదా?
సాక్షి, హైదరాబాద్: బియ్యం ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో సబ్సిడీ ధరతో దేశవ్యాప్తంగా అవసరమైన వారందరికీ నాణ్యమైన బియ్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బృహత్తర పథకం రాష్ట్రంలో మాత్రం అమలు కావడం లేదు. బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించినప్పటికీ ధరలు అదుపులోకి రాకపోవడంతో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని రూ.29కే విక్రయించాలని నిర్ణయించింది. భారత్ రైస్ పేరుతో ఈ బియ్యం అమ్మకాలను ఫిబ్రవరి 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేషనల్ అగ్రికల్చర్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో ఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలతో పాటు మొబైల్ అవుట్లెట్లలో కూడా భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించారు. ఆమెజాన్, జియో మార్ట్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్ ద్వారా కూడా 5 కిలోలు, 10 కిలోల భారత్ రైస్ బ్యాగులను అందుబాటులోకి తెచ్చారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రూ.29 కిలోల బియ్యం బ్యాగులు విక్రయిస్తున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భారత్ రైస్ భాగ్యం సామాన్యులకు దక్కడం లేదు. కేటాయింపులు జరిపినప్పటికీ... ఫిబ్రవరి 6వ తేదీ నాటికే రాష్ట్రంలో కూడా అమ్మకాలు జరపాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ భావించింది. ఈ మేరకు నాఫెడ్ ప్రాంతీయ కార్యాలయానికి సమాచారం అందించింది. ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం సేకరించి 5 కిలోలు, 10 కిలోల బ్యాగులలో నింపి విక్రయించే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తొలి విడతగా నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌కు ఒక్కో సంస్థకు 2 వేల టన్నుల చొప్పున బియ్యం కేటాయించింది. అయితే ఇప్పటివరకు బియ్యం బ్యాగ్‌లు రిటైల్ అవుట్లెట్లకు చేరలేదు. డిపోలలోని బియ్యం ఇతర రాష్ట్రాలకే! భారత్ రైస్ బ్యాగ్‌లకు అవసరమైన బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నాఫెడ్‌కు సరఫరా చేయాలి. అయితే రాష్ట్రంలో నాఫెడ్‌కు అవసరమైన మేర బియ్యాన్ని ఎఫ్‌సీఐ పంపించలేదని సమాచారం. రాష్ట్రంలోని 52 ఎఫ్‌సీఐ డిపోలలో సుమారు 5లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ, ఆ బియ్యం మొత్తం సెంట్రల్ పూల్ కింద ఇతర రాష్ట్రాలకు పంపించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్ రైస్ కోసం నాఫెడ్‌కు ఎఫ్‌సీఐ ప్రత్యేకంగా బియ్యాన్ని కేటాయించలేని పరిస్థితి నెలకొంది. దీనిపై కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖనే నిర్ణయం తీసుకోవాలని ఎఫ్‌సీఐ వర్గాలు చెపుతున్నాయి. బియ్యం రాలేదు రిటైల్ అమ్మకాల కోసం రైస్ బ్యాగులు మా దగ్గరికి రాలేదు. భారత్ రైస్ బ్యాగులకు ప్రజల నుంచి డిమాండ్ ఉంది. రోజూ ఎంక్వైరీలు వస్తున్నాయి. నాఫెడ్ ద్వారా ఈ బ్యాగులు రావలసి ఉంది. ఎప్పుడు పంపించినా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్ ఆటా పేరుతో పంపిన గోధుమ పిండి బ్యాగులు మాత్రం విక్రయించాం.- రమణమూర్తి, ఆర్.ఎం,కేంద్రీయ భండార్ -
మాంసంతో బియ్యం తయారీ..!సరికొత్త హైబ్రిడ్ వరి వంగడం!
మాంసంతో బియ్యం తయారు చేయడం ఏంటిదీ! అనిపిస్తుంది కదూ. మీరు వింటుంది నిజమే గొడ్డు మాంసంతో సరికొత్త వరి వంగడాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. రానున్న కాలంలో ఎదురయ్య ఆహార సమస్యను ఈ సరికొత్త వంగడం తీరుస్తుందని చెబుతున్నారు. చూస్తే బియ్యపు గింజల్లానే ఉంటాయట. తింటే మాత్రం మాంసం రుచిని పోలి ఉంటుందని చెబుతున్నారు. ఏంటా వరి వండగం? ఎలా తయారు చేశారంటే.. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ పరిశోధకులు బృందం ఈ సరికొత్త బీఫ్ హైబ్రిడ్ వరి వంగడాన్ని సృష్టించారు. వాళ్లు సృష్టించిన బియ్యపు గింజల్లో గొడ్డు మాంసంలో ఉండే కొవ్వు కణాలు ఉంటాయి. చూడటానికి గులాబీ రంగులో ఉంటాయి ఈ బియ్యం. ఫిష్ జెలటిన్‌లో సాంప్రదాయ బియ్యం గింజలను కప్పి, వాటిని అస్థిపంజర కండరం కొవ్వు మూలకణాలతో ప్రయోగాత్మకంగా ల్యాబ్‌లో సాగు చేశారు. అలా తొమ్మిది నుంచి 11 రోజుల పాటు కండరాలు, కొవ్వు, జెలటిన్-స్మోటెర్డ్ బియ్యాన్ని సాగు చేసిన తర్వాత, ధాన్యాలు అంతటా మాంసం, కొవ్వును ఉంటాయి. చివరిగా ఉత్పత్తి అయ్యే వరి వంగడం మంచి పౌష్టికరమైన బియ్యంగా మారుతుంది. ప్రయోగశాలలో తయారు చేసిన ఈ గొడ్డు మాంసం కల్చర్డ్ రైస్‌ను ప్రోఫెసర్ జింకీ హాంగ్ వండి రుచి చూశారు. చూడటానికి సాధారణ బియ్యం వలే గులాబీ రంగులో ఉంటాయి. కానీ మాంసపు లక్షణాన్ని కలిగి ఉందన్నారు. సువాసన కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ హైబ్రిడ్ బియ్యం కొంచెం దృఢంగా పెళుసుగా ఉందని అన్నారు. అయితే ఇందులో 8% దాక ప్రోటీన్, 7% కొవ్వులు ఉంటాయని అన్నారు. ఈ బియ్యం గొడ్డు మాంసం, బాదం వంటి వాసనను కలిగి ఉంటుందన్నారు. వండిన తర్వాత వెన్న, కొబ్బరి నూనె కూడిన వాసన వస్తుందన్నారు. ఈ వరి వంగడాన్ని సృష్టించడానికి కారణం.. ఒకవైపు వనరులు తగ్గిపోతున్నాయి, మరోవైపు పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఆ అవసరాలను తీర్చడం కోసం ఈ సరికొత్త వరి బియ్యాన్ని సృష్టించే ప్రయోగాలు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా జంతువుల నుంచి మనకు అవసరమైన ప్రోటీన్‌ను అందుతుంది. అయితే జంతువులను పెంచడానికి చాలా వనరులు అవసరం. ఇది ఒకరకంగా వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువు విడుదలను పెంచుతుంది. అలాగే వరి పండించటానికి ఎక్కువ నీరు, శ్రమ అవసరం అవుతాయి. బదులుగా తక్కువ శ్రమతో తక్కువ వనరులను ఉపయోగించి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ కలయికలో ఆహారం ఉంటే అది అందరికీ వెసులుబాటుగా ఉంటుందన్నారు. అంతేగాదు ఈ సెల్-కల్చర్డ్ ప్రోటీన్ రైస్ నుంచి మనకు అవసరమైన అన్ని పోషకాలు పొందడం గురించి కూడా పరిశోధన చేయాల్సి ఉందన్నారు. పరిశోధకులు స్థానిక వధశాలలో వధించిన హన్వూ పశువుల నుంచి కండరాలు, కొవ్వు కణాలను తీసుకుని ఈ సరికొత్త వరి వండగాన్ని సృష్టించారు. ఇలా ఎక్కువ జంతువులు అవసరం లేకుండా ల్యాబ్‌లో నిర్వహించగల జంతు కణాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.ఈ ప్రయోగంలో మరిన్ని మార్పులు చేసి.. చేపల వంటి వాటిని కూడా వినియోగించి వివిధ రుచులగల ఆహారాన్ని తయారు చేసే దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. అయితే ఈ హైబ్రిడ్ బియ్యం అచ్చంగా మాంసం రుచిని పోలీ ఉంటాయి కాబట్టి మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రజలు వీటిని ఇష్టపడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏదీఏమైనా ఈ సరికొత్త వరి వంగడం భవిష్యత్తులో కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు మంచి ఆహార వనరుగా ఉంటుంది. అలాగే సైనికులకు అవసరమైన పౌష్టికాహారంగానూ, అంతరిక్ష ఆహారంగానూ పనిచేస్తుందని పరిశోధకులు నమ్మకంగా చెబుతున్నారు. చెబుతున్నారు. (చదవండి: 1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!) -
సామాన్యులకు మోడీ సర్కారు ఊరట..
-
మాగాణుల్లో మిథేన్‌కు చిరు చేపలతో చెక్!
వాతావరణాన్ని వేడెక్కిస్తున్న మిథేన్, కార్బన్ డయాక్సయిడ్ కన్నా 86 రెట్లు ఎక్కువ పర్యావరణానికి హాని చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోకి విడుదలవుతున్న మిథేన్ వాయువులో 10శాతం మేరకు వరి పొలాల నుంచే వెలువడుతోందని అంచనా. అయితే, వరి పొలాల్లోని నీటిలో చిరు చేపల (గోల్డెన్ షైనర్ రకం)ను పెంచితే మూడింట రెండొంతుల మిథేన్ వాయువు తగ్గిందని కాలిఫోర్నియాకు చెందిన రిసోర్స్ రెన్యువల్ ఇన్స్టిట్యూట్(ఆర్ఆర్ఐ) అనే స్టార్టప్ కంపెనీ చెబుతోంది. ‘ఫిష్ ఇన్ ద ఫీల్డ్స్’ పేరిట పైలట్ ప్రాజెక్టు ద్వారా రెండేళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ఇటీవల ‘ద జెఎం కప్లన్ ఇన్నోవేషన్ ప్రైజ్’ను గెల్చుకొని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ‘వరి రైతులకు చేపల ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. సముద్ర చేపలను దాణాల్లో వాడే బదులు ఈ పొలాల్లో పెరిగే చేపలను వాడటం ద్వారా భూతాపాన్ని తగ్గించడానికి, చేపల జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి మా పరిశోధనలు ఉపకరిస్తాయి. 1,75,000 డాలర్ల ప్రైజ్ మనీతో మేం చేపట్టిన ప్రయోగాత్మక సాగుకు ఊతం వచ్చింది..’ అన్నారు ఆర్.ఆర్.ఐ. వ్యవస్థాపకులు దెబోరా మోస్కోవిట్జ్, ఛాన్స్ కట్రానో. ఆసియా దేశాల్లో అనాదిగా సాగు చేస్తున్న వరి–చేపల మిశ్రమ సాగులో అదనపు ప్రయోజనాన్ని కొత్తగా వారు శోధిస్తున్నారు. సుస్థిర ఆక్వా సాగుతో పాటు రైతుల ఆదాయం పెరుగుదలకు, భూతాపం తగ్గడానికి ఉపకరిస్తుందంటున్నారు. మాగాణుల్లో వరితో పాటు చేపలు పెంచితే ‘కార్బన్ క్రెడిట్స్’ ద్వారా కూడా అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. మరికొన్ని సంగతులు ప్రపంచంలోని గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో నాలుగింట ఒక వంతు ఆహారం , వ్యవసాయం నుంచి వస్తున్నవే. వీటిల్లో నైట్రస్ ఆక్సైడ్ , మీథేన్దే అగ్రభాగం. ప్రపంచ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో 13 శాతం వ్యవసాయం, అటవీ భూ వినియోగంనుంచి వస్తుండగా, 21 శాతం ఇంధన కాలుష్యం. వరి పంట, పశువుల పెంపకం వంటి పద్ధతులు నేరుగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తాయనేది నిపుణుల వాదన. పంటకోత, నాటడం, రవాణా ద్వారా కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు, అలాగే యూరియాతో పండించిన గడ్డితినే పశువుల ద్వారా, పేడ నిర్వహణ ద్వారా ద్వారా మీథేన్ విడుదలవుతుంది. ఎరువుల వాడకం, నేల శ్వాసక్రియ వలన నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ-స్మార్ట్ వ్యవసాయం ద్వారా ఉద్గారాల ప్రభావాలను తగ్గించాలనేది ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా సమర్థవంతమైన పశువుల పెంపకం, శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం, జంతు-ఆధారిత ఆహార పదార్థాల నిర్వహణ లాంటివి ప్రధానంగా ఉన్నాయి. ఇవి సుస్థిర ఆహార వ్యవస్థకు దోహదపడతాయి కూడా. గ్రీన్హౌస్ వాయువులపై వ్యవసాయ ప్రభావాన్ని తగ్గించడం మన భూగ్రహ మనుగడకు చాలా అవసరం. -
నేటి నుంచి మార్కెట్లోకి ‘భారత్ రైస్’
కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరల తగ్గింపునకు శ్రీకారం చుట్టి, సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది. మంగళవారం (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్‌ను ప్రభుత్వం మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ బియ్యాన్ని కిలో రూ.29కి విక్రయించనున్నారు. బియ్యం ధరల తగ్గింపునకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలలో గణనీయమైన తగ్గింపు లేదు. నిత్యావసరాల ధరలు ప్రస్తుతం 14.5 శాతం మేరకు పెరిగాయి. భారత్ రైస్ నేటి నుంచి ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌తో సహా అన్ని చైన్ రిటైల్‌లలో అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిలో రూ.29కి లభ్యమయ్యే భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల బస్తాలలో లభించనుంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తొలుత భారత్ బ్రాండ్ కింద తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాల విక్రయాలను ప్రారంభించింది. ‘భారత్ ఆటా’ను 2023, నవంబరు 6న ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది బయటి మార్కెట్లో కిలో రూ. 35 ఉండగా, ప్రభుత్వం రూ.27.50కే అందిస్తోంది. అదే సమయంలో పప్పులు కిలో రూ.60కి అందుబాటులోకి వచ్చాయి. -
వరికి రూ. 500 బోనస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్లో పండించే వరికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూన్‌లో నిర్వహించే ‘గ్లోబల్ రైస్ సమ్మిట్’ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ్మిట్ నిర్వాహకులు డాక్టర్ జానయ్య, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కమిషనర్ గోపి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు వరి తక్కువ వేయాలని, అందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేసి, పంటల సాగులో సమతుల్యత పాటించాలన్నారు. వరితోపాటు అన్ని పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతుధర ఇవ్వాలని కోరారు. వివిధ దేశాలకు వరి ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు రాష్ట్రానికి ప్రతిబంధకంగా ఉన్నాయని, రైస్ పాలసీపై కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు. కేరళ ప్రజలు దొడ్డు బియ్యం, కర్నాటక ప్రజలు సన్నబియ్యం, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో జనం చిట్టి ముత్యాలు వంటి రకాల బియ్యం వాడుతారని, ఆ ప్రకారం ఆయా రాష్ట్రాలకు తెలంగాణ నుంచి రైస్ అమ్ముకునేలా అవకాశం కల్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఎంత అవసరమైతే అంతమేరకు వరి సాగు చేయాలని, ఎగుమతులు పెంచడం వల్ల రాష్ట్రంలో అదనపు వరిని విక్రయించడానికి వీలుకలుగుతుందని పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్రం ఆలోచించి తెలంగాణ రైతులకు మేలు చేయాలన్నారు. ఇప్పటికే పేదలకు ఇస్తు న్న రేషన్‌రైస్ ఎవరూ వాడుకోవడం లేదని తుమ్మల అభిప్రాయపడ్డారు. -
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్!
సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వచ్చే వారం నుంచి ‘భారత్ రైస్’ పేరిట కిలో బియ్యం రూ.29కే విక్రయించనున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా సామాన్య ప్రజలకు ఊరట కలిగిస్తుందని పేర్కొంది. ఈ మేరకు బియ్యం నిల్వలు ఎంత మేర ఉన్నాయో ట్రేడర్లు ప్రకటించాలని ఆదేశించింది. ‘వివిధ రకాలపై ఎగుమతి పరిమితులు ఉన్నప్పటికీ.. బియ్యం రిటైల్, టోకు ధరలు సంవత్సరానికి 13.8 శాతం నుంచి 15.7శాతం పెరిగాయి. ధరలను నియంత్రించడానికి, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులను గుర్తించేలా వచ్చే వారం నుండి రిటైల్ మార్కెట్లో సబ్సిడీతో కూడిన భారత్ రైస్‌ను కిలో రూ.29 చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని యూనియన్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సంజీవ్ చోప్రా తెలిపారు. భారత్ రైస్‌ను ఎక్కడ కొనుగోలు చేయాలి? నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్), రిటైల్ చైన్ కేంద్రీయ భండార్లలో భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల ప్యాక్ అందుబాటులో ఉంచనుంది కేంద్రం. తొలి దశలో, ప్రభుత్వం రిటైల్ మార్కెట్లో అమ్మకానికి 500,000 టన్నుల బియ్యాన్ని కేటాయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ కిలో గోదుమ పిండిని రూ. 27.50, భారత్ దాల్ (చనా) కిలో రూ. 60కి విక్రయిస్తోంది . బియ్యంపై స్పష్టత ఇవ్వాల్సిందే ట్రేడర్ల వద్ద అన్నీ రకాల బియ్యం బ్రోకెన్ రైస్, నాన్ బాస్మతీ వైట్ రైస్, పార్బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్, వరి ఇలా ఎంత మేరకు నిల్వ ఉన్నాయో తెలపాలని, ఇందుకోసం ప్రతి వారం ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ పోర్టల్‌లో ప్రకటించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా దేశీయంగా ధరలు స్థిరపడే వరకు బియ్యం ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చోప్రా చెప్పారు. -
బియ్యం,గోధుమల్లో బలం సగమే, పైగా.. : షాకింగ్ రిపోర్ట్
తిండికి కటకటలాడుతూ ఓడలో ధాన్యం వస్తేనే దేశం ఆకలి తీరే పరిస్థితుల్లో హరిత విప్లవ సాంకేతికత (జిఆర్టి)ల అమలు మన దేశంలో 1960వ దశకంలో ప్రాంరంభమైంది. అధిక దిగుబడినిచ్చే వరి/గోధుమ ఆధునిక వంగడాలు తయారుచేసుకొని వాడుతున్నాం.. నీటి పారుదల, రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పంటలు పండిస్తున్నాం.. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు తెల్ల బియ్యం, గోధుమలు అందిస్తున్నది. ఏభయ్యేళు గడచిపోయాక.. వెనక్కి చూస్తే జనం కడుపు నిండుతోంది. కానీ, పోషకలోపం వెంటాడుతోంది. ముందెన్నడూ లేనట్లుగా రోగాలు ముసురుకుంటున్నాయి. దీనికి మూలకారణం ఏమిటో ఓ తాజా అధ్యయనం విడమర్చి చెబుతోంది. ప్రసిద్ధ వంగడాలపైనే అధ్యయనం వరి, గోధుమల్లో పోషకాల స్థాయిని తెలుసుకునేందుకు ఐసిఎఆర్, ఐసిఎంఆర్ పరిశోధన సంస్థల్లో పనిచేస్తున్న నేలల నిపుణుడు డా. సోవన్ దేబనాద్, మరో 11 మంది శాస్త్రవేత్తలతో కలసి విస్తృత పరిశోధనలు చేశారు. డా. సోవన్ ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఐసిఎఆర్– సెంట్రల్ ఆగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త. పశ్చిమబెంగాల్లోని ఐసిఎఆర్– బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ, హైదరాబాద్‌లోని ఐసిఎంఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌కు చెందిన మరో 11 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 1960వ దశకం నుంచి ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు 1,199 వరి, 448 గోధుమ, 417 మొక్కజొన్న, 223 జొన్న అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన (50 లక్షల హెక్టార్ల కన్నా ఎక్కువగా సాగైన) వంగడాల్లో నుంచి ఒక్కో దశాబ్దానికి 2–4 రకాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా పండించి మరీ అధ్యయనం చేశారు. జయ నుంచి స్వర్ణ సబ్ 1 వరకు.. ఈ విధంగా ఎంపికచేసిన 16 వరి, 18 గోధుమ రకాలను 2018–2020 మధ్యకాలంలో మూడేళ్ల పాటు సాగు చేశారు. ఎంపికైన వరి రకాల్లో 1960ల నాటి జయ, పంకజ్, 1970ల నాటి ఐఆర్8, స్వర్ణ, రాశి, 1980ల నాటి ఐఆర్ 36, క్షితిశ్, సాంబ మసూరి, లలత్, 1990ల నాటి ఐఆర్ 64, ఖందగిరి, రంజిత్, త్రిగుణ, 2000ల నాటి నవీన్, ప్రతిక్ష్య, స్వర్ణ సబ్ 1 వున్నాయి. గోధుమ రకాల్లో 1960ల నాటి సొనాలిక నుంచి 2010లలో విడుదలైన హెచ్డి–3059 రకాలను ఎంపిక చేశారు. 2009లో విడుదలైన స్వర్ణ సబ్ 1 తర్వాత 5 లక్షల హెక్టార్లకు పైగా సాగైన లాండ్మార్క్ వరి వంగడాలు లేక΄ోవటం వల్ల 2010లలో విడుదలైన ఏ వరి వంగడాన్నీ అధ్యయనం చేయలేదని డా. సోవన్ తెలి΄ారు. వరి విత్తనాలను కటక్‌లోని ఎన్ఆర్ఆర్ఐ నుంచి, గోధుమ విత్తనాలను కర్నల్‌లోని ఐఐడబ్లు్యబిఆర్ల నుంచి సేకరించారు. వీటన్నిటినీ ఒకే రకమైన మట్టి మిశ్రమంతో కూడిన ప్రత్యేక కుండీల్లో సాగు చేశారు. అలా పండించిన తెల్ల బియ్యం, గోధుమ పిండిలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో సరిపోల్చి విశ్లేషించటం ఈ అధ్యయనం లక్ష్యం. 45శాతం తగ్గి పోయిన పోషకాలు మన దేశంలో ప్రజలు రోజువారీ ప్రధాన ఆహారంగా తినే వరి బియ్యం లేదా గోధుమల ద్వారానే రోజుకు అవసరమైన శక్తిలో 50%కి పైగా సమకూరుతుంది. ఈ రెండు ధాన్యాలు గత 50 ఏళ్లలో 45% పోషక విలువలను కోల్పోయినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు.. గత 50 ఏళ్లలో, వరి బియ్యంలో అత్యవసరమైన పోషకాలైన జింక్ 33%, ఇనుము 27% తగ్గిపోయాయి. గోధుమలో జింక్ 30%, ఇనుము 19% తగ్గిపోయాయి. ఈ సమస్యను ఇప్పటికైనా సరిచేయకపోతే 2040 నాటికి వరి బియ్యం, గోధుమలు తినటానికి పనికిరానంతగా పోషకాలన్నిటినీ కోల్పోతాయని డా. సోవన్ ఆందోళన వ్యక్తం చేశారు. పోషకాలు బాగా తగ్గి΄ోవటంతో పాటు మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. ఈ ధాన్యాల్లో విషతుల్య పదార్థాలు చాలా పెద్ద ఎత్తున పోగుపడటం. ఆర్సెనిక్ (పాషాణం) ఏకంగా 1,493 శాతం మేరకు పెరిగిపోయింది. భార ఖనిజాలతో జబ్బులు ఈ అధ్యయనం మనకు తెలియజెప్తున్నదేమిటంటే.. రోజువారీగా ప్రధాన ఆహారంగా మనం తింటున్న తెల్ల అన్నం, గోధుమ రొట్టెల్లో పోషకాలు సగానికి తగ్గటంతో పాటు ఆరోగ్యానికి హాని చేసే భార ఖనిజాలు మెండుగా చేరాయన్న మాట. షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఊబకాయం, కేన్సర్ వంటి అసాంక్రమిక వ్యాధులు పెచ్చుమీరిపోవడానికి వరి, గోధుమల్లో ΄ోషకాలు లోపించటంతో పాటు భార ఖనిజాలు కూడా కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఫాస్ఫరస్, కాల్షియం, సిలికాన్, వనాడియం వంటి పోషకాలు ఎముకల అభివృద్ధికి దోహదం చేస్తాయి. రోగనిరోధక శక్తి, పునరుత్పాదక శక్తికి, నరాల బలానికి జింక్ కీలకం. రక్తవృద్ధికి ఇనుము చాలా ముఖ్యం. రోజూ ఎక్కువ మొత్తంలో తినే ఆహారంలో ఈ పోషకాలు లోపిస్తే నరాల బలహీనత, సంతానలేమి, కండరాలు, ఎముకల క్షీణతకు దారితీస్తుందని నేచర్ పత్రికలో ప్రచురితమైన వ్యాసాల్లో నిపుణులు చెబుతున్నారు. ఆర్సెనిక్, క్రోమియం, బేరియం, స్ట్రాంటియమ్ వంటి విషతుల్య భార ఖనిజాలు ఊపిరితిత్తుల కేన్సర్లు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, హైపర్కెరటోసిస్, కిడ్నీల సమస్యలు, ఎముకల్లో కాల్షియం లోపించటం వంటి జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పూర్వం మాదిరిగా జొన్న తదితర చిరుధాన్యాలు తినటం తగ్గిపోవటం, వరి, గోధుమల వినియోగం బాగా పెరిగి΄ోవటం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. 1990–2016 మధ్యకాలంలో అసాంక్రమిక వ్యాధులు 25% పెరిగి΄ోయాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) నివేదికలు చెబుతున్నాయి. బయోఫోర్టిఫైడ్ వంగడాలతో సమస్య తీరేనా? ధాన్యాల్లో పోషకాల లేమిని అధిగమించేందుకు ఐరన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉండే బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొదించటంపై ఐసిఏఆర్ పదేళ్ల క్రితం నుంచే పని ప్రారంభించింది. ఇప్పటికి 142 బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొందించింది. ఇందులో 124 ధాన్యపు పంటలు. వీటిలో 10 వరి, 43 గోధుమ, 20 మొక్కజొన్న, 13 రకాల కొర్ర వంటి చిన్న చిరుధాన్యాలు, 11 సజ్జ రకాలు ఉన్నాయి. వీటి ద్వారా పోషకాల లోపాన్ని కొంతమేరకు అధిగమించవచ్చన్నది శాస్త్రవేత్తల మాట. దేశవ్యాప్తంగా 6% సాగు భూమిలో ఈ వంగడాలు సాగవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. సాగు భూమిలో పోషకాలు తగ్గిపోయాయి కాబట్టి ఆహారంలో పోషకాలు తగ్గి పోతున్నాయని ఇన్నాళ్లూ అనుకున్నాం. అయితే, వరి, గోధుమ మొక్కలకు నేలలో ఉన్న పోషకాలను తీసుకునే శక్తి కూడా తగ్గిపోయిందని ఇప్పుడు రూఢి అయ్యింది. ఇంతకన్నా ఆందోళన కలిగించే మరో విషయాన్ని కూడా ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. నేలలో భార ఖనిజాలు వంటి విషతుల్య పదార్థాలను కంకుల్లోని ధాన్యాలకు చేరకుండా ఆపి వేసే సహజసిద్ధమైన విచక్షణా జ్ఞానం మొక్కలకు ఉంటుంది. అయితే, అధిక దిగుబడుల కోసం తయారు చేసిన ఆధునిక వరి, గోధుమ విత్తనాల బ్రీడింగ్ ప్రక్రియల్లో గత ఏభయ్యేళ్లలో చేసిన కీలక మార్పుల వల్ల ఈ పంటల్లో ఆ తెలివి లోపించింది. అందువల్లే ఇప్పుడు వరి బియ్యం, గోధుమల్లోకి ప్రాణాంతక భార ఖనిజాలు అధిక పాళ్లలో చేరుతున్నాయి. వీటిని తిన్న మనుషులకు పోషకాలు లోపించటం వల్ల మాత్రమే కాదు, భార ఖనిజాల వల్ల కూడా రకరకాల జబ్బులొస్తున్నాయని తేలింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, భారతీయ వైద్య పరిశోధనా మండలి సమన్వయంతో అత్యంత కీలకమైన ఈ అధ్యయనం చేయటం విశేషం. గత నవంబర్‌లో ‘నేచర్’ లో ఈ అధ్యయన పత్రం అచ్చయ్యింది. ఇందులోని వివరాలు సంక్షిప్తంగా.. ► గత ఏభయ్యేళ్లలో 45% మేరకు పోషకాలు కోల్పోయిన వరి, గోధుమలు.. ►2040 నాటికి పూర్తిగా తగ్గే ప్రమాదం.. ►అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల్లో దశాబ్దానికి ఒకటి, రెండు ప్రాచుర్యం ΄పొందిన రకాలపై ఐసిఏఆర్, ఐసిఎంఆర్ సంయుక్త అధ్యయనం ►సాంబ మసూరి, స్వర్ణ సబ్ 1 తదితర 16 రకాల వరి, 18 రకాల ►గోధుమ అధిక దిగుబడి వంగడాలపై అధ్యయనం ►భారఖనిజాల శాతం పెరగటంతో ప్రజారోగ్యానికి ముప్పు ►బయోఫోర్టిఫైడ్ వంగడాలు మేలంటున్న శాస్త్రవేత్తలు నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
వలసొచ్చి.. వరి నాట్లు వేసి
దుబ్బాకటౌన్: జిల్లాలో వరి నాట్లు వేయడానికి రైతులను కొత్త సమస్యలు వేధిస్తున్నాయి. మొత్తం 48 లక్షల ఎకరాల్లో నాట్లు సిద్ధం కావడం వల్ల కూలీల కొరత ఏర్పడింది. ఇప్పటికే సగం వరినాట్లు పూర్తి అయినా మరో 50 శాతం ఉండడంతో ఎకరానికి రోజుకు 8 నుంచి 10 మంది కూలీలు అవసరం పడుతున్నారు. కానీ, నాటు వేయడానికి కూలీలు దొరక్క బిహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పురుష కూలీలతో రైతులు నాట్లు వేయిస్తున్నారు. ఎకరానికి రూ.5,500 వరకు గంపగుత్తగా మాట్లాడుకొని నాట్లు వేస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు కూలి పేరు సిద్దార్థ్. సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో పెద్దగా చేసేందుకు ఉపాధి లేకపోవడంతో 30 రోజుల క్రితం ఆయనతోపాటు మరో 13 మంది కూలీలు వరినాట్లు వేసేందుకు సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతానికి వచ్చారు. ఇందులో ఒక వ్యక్తి వంటలు చేస్తుండగా మిగతా 12 మంది నాట్లు వేస్తారు. ప్రతి రోజూ 5 ఎకరాలకు పైగా నాట్లు వేస్తామని సిదార్ధ్ చెప్పుకొచ్చాడు. గతేడాది ఏపీలో వేశామని, ఈసారి ఆంధ్రాకు చెందిన వ్యక్తి తెలపడంతో ఇక్కడికి వచ్చామని ఇప్పటి వరకు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 130 ఎకరాల వరకు నాట్లు వేశామని చెప్పుకొచ్చాడు. బెంగాల్‌కు చెందిన 13 మంది కూలీలు వరినాట్లు వేసేందుకు ఇక్కడికి వచ్చారు. రైతుల పొలాల్లో నారు తీసి వారే వేసుకొని రోజు 5 ఎకరాలకు పైగా నాట్లు వేస్తున్నారు. పొలాల్లో సన్నటి తాడుతో మునుములు కట్టుకొని చూస్తుండగానే టకటకా నాట్లు వేస్తున్నారు. ఎకరం నాటుకు వీరిని తీసుకొచ్చిన మధ్య వ్యక్తి రైతుల నుంచి రూ.5,500 తీసుకుంటున్నాడు. ఇందులో నుంచి బెంగాల్ కూలీలకు రూ.3,500 ఇస్తూ మిగతా డబ్బులతో వీరు ఉండడానికి వసతి, భోజనాలు, వాహనం తదితర సౌకర్యాలు చూసుకుంటున్నాడు. సాధారణంగా ఇక్కడ మహిళలు ఎకరం నాటుకు రూ.6 వేల వరకు తీసుకుంటుండగా, నారు వేసేందుకు మరో రూ.2,000 పైగా రైతులకు ఖర్చు అవుతుంది. దీంతో ఎకరం నాటుకు రైతుకు రూ. 8 వేలు ఖర్చు అవుతుంది. అదే బెంగాల్ కూలీలతో నాటు వేయిస్తే రూ.5,500 మాత్రమే అవుతుంది. ఎకరానికి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు రైతులకు ఆదా అవడంతోపాటు కూలీల బాధ తప్పుతుంది. 1.80 లక్షల ఎకరాల్లో పూర్తి.. జిల్లాలో ఈ యాసంగిలో 3.49 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేస్తారని వ్యవసాయాధికారుల అంచనా ఉంది. ఇప్పటి వరకు 1.80 లక్షల ఎకరాల్లో నాట్లు వేయడం పూర్తి అయ్యింది. ప్రస్తుతం జోరుగా వరినాట్లు పడుతుండడంతో ఈ నెలలోపు నాట్లు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈసారి నాట్లు పెరిగే అవకాశం.. జిల్లాలో ఇప్పటికే సగంకు పైగా వరినాట్లు పూర్తి అయ్యాయి. ఈ యాసంగిలో 3.48 లక్షల ఎకరాల్లో వరినాట్లు అంచనా ఉండగా ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాల వరకు నాట్లు పడ్డాయి. కూలీల కొరతతో రైతులు వెద పద్ధతిలో వేసుకున్నారు. ఇతర రాష్ట్రాల కూలీలు, నాట్లేసే యంత్రాలు రావడంతో రైతులకు చాలా బాధలు తప్పాయి. ఈ సారి రికార్డు స్థాయిలో వరినాట్లు వేసే అవకాశం ఉంది. – శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి -
రెండేళ్లలోనే కొత్త వరి వంగడాలు
(సాక్షి సాగుబడి డెస్క్): సంప్రదాయ ప్రజనన (బ్రీడింగ్) పద్ధతిలో ఓ కొత్త వరి వంగడం రూపొందించడానికి 6–7 సంవత్సరాలు పడుతుంది. క్లైమెట్ ఛేంజ్ వల్ల వాతావరణంలో వస్తున్న పెనుమార్పులకు దీటుగా తట్టుకునే వంగడాలు రూపొందించడం శాస్త్రవేత్తలకు ఇంత సుదీర్ఘకాల పరిమితి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లలోనే సరికొత్త వంగడాన్ని రూపొందించేందుకు అనువైన వినూత్న స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిని ఫిలిప్పీన్స్ మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) అభివృద్ధి చేసింది. భారతీయ, జపాన్ వరి రకాలతో పాటు ఏ దేశంలో వంగడాలతోనైనా రెండేళ్లలోనే కొత్త వంగడం రూపొందించటం సాధ్యమేనని ‘ఇరి’పరిశోధనల్లో తేలింది. ‘ఇరి’ప్ర«దాన కార్యాలయంతో పాటు వారణాసిలో ‘ఇరి’దక్షిణాసియా పరిశోధనా స్థానంలో కూడా సాంబ వంటి అనేక రకాలతో రెండేళ్లలోనే ‘ఇరి’శాస్త్రవేత్తలు విజయవంతంగా కొత్త వంగడాలను రూపొందించారు. కృత్రిమ వెలుగుల మధ్య ప్రయోగాలు నియంత్రిత వాతావరణంలో ప్రత్యేక గదుల్లో కృత్రిమ వెలుగుల మధ్య వరి ప్రయోగాలు చేయటం స్పీడ్ బ్రీడింగ్‌లో ముఖ్యభాగం. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, తేమ, పోషకాల స్థాయి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇస్తారు. కుండీలలో పెరిగే వరి మొక్కలకు స్థూల, సూక్ష్మ పోషకాలను పిచికారీల ద్వారా అందిస్తున్నారు. ఈ స్పీడ్ బ్రీడింగ్ క్రమంలో వేగంగా పూత దశకు ఎదగటం అనేది మరో ముఖ్యాంశం. సాధారణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక వరి రకాలు 58 నుంచి 127 రోజుల మధ్య సహజంగా పూతకు వస్తాయి. అయితే, స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో రాత్రి, పగలు అని తేడా లేకుండా కృత్రిమ వెలుగుల మధ్య పెరిగే వరి మొక్కలు, వాటి సహజ కాల పరిమితితో నిమిత్తం లేకుండా, 60 రోజుల లోపలే అన్ని రకాలూ ఒకేసారి పూతకు వస్తున్నాయి. ఇలా త్వరగానే ఏ వరి రకమైనా కోతకు వస్తున్నాయి. అందువల్లనే ఈ స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ద్వారా జరిపే పరిశోధనలకు ‘స్పీడ్ ఫ్లవర్’అని ‘ఇరి’పేరుపెట్టింది. ఏడాదికి నాలుగైదు పంటలు ఈ విధంగా ఏడాదికి 1–2 పంటలకు బదులు నాలుగైదు పంటలు పండిస్తున్నారు. నియంత్రిత వాతావరణంలో అనుకున్నన్ని రోజుల్లో పంట నూరి్పడికి వస్తోంది. వారణాసిలోని ఇరి దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానంలో 198 వరి రకాలను పెంచినప్పుడు అన్నీ 60 రోజుల్లోనే పూతకు రావటం విశేషం. స్వర్ణ, సాంబ మసూరి సహా.. వారణాసిలోని దక్షిణాసియా ఇరి పరిశోధనా స్థానం సంచాలకులు డా. సుధాంశు సింగ్ మాట్లాడుతూ.. క్రాసింగ్, ఇన్‌బ్రీడింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ఉపయోగపడుతోంది. క్షేత్రస్థాయిలో 6–7 సంవత్సరాల సమయం పట్టే పని ఇప్పుడు 1.5–2 ఏళ్లలోనే పూర్తవుతోందని వ్యాఖ్యానించారు. స్పీడ్ ఫ్లవర్ పరిశోధన కార్యక్రమంలో స్వల్పకాలిక రకాలైన కో–51, ఐఆర్64, మధ్యకాలిక రకాలైన సర్జూ–52, డిఆర్ఆర్ ధాన్ 44, దీర్ఘకాలిక రకాలైన స్వర్ణ, సాంబ మసూరి రకాలు సైతం చక్కని ఫలితాలు వచ్చాయని, రెండేళ్లలోనే కొత్త వంగడాలను అభివృద్ధి చేయటం సాధ్యమేనని తేలిందని సుధాంశు సింగ్ చెప్పారు. ఏడాదిలో స్వర్ణ వరిని వరుసగా 5.1 పంటలు, సాంబ మసూరిని 4.9 పంటలు వరుసగా సాగు చేయటం ఈ పద్ధతిలో సాధ్యపడిందని పేర్కొన్నారు. – డాక్టర్ సుధాంశు సింగ్ ఇది శాస్త్రపరంగా పెద్ద ముందడుగు.. ’’అధికోత్పత్తినిచ్చే, వాతావరణ మార్పుల్ని తట్టుకునే, పోషకాల పరంగా మెరుగైన సరికొత్త వరి వంగడాలను అతి తక్కువ కాలంలోనే రూపొందించడానికి అవకాశం దొరికిందిప్పుడు. వరికి జన్యుసుసంపన్నత చేకూరడానికి, ప్రపంచ మానవాళికి ఆహార భద్రతను అందించడానికి ఇది ఉపయోగకరం’అంటున్నారు పరిశోధకుల బృందం సారధి డాక్టర్ వికాస్ కుమార్ సింగ్. ’’ఈ పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సౌజన్యంతో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఆర్థిక తోడ్పాటు ఉంది. సమీప కాలంలోనే మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని రైస్ బ్రీడర్లకు కూడా స్పీడ్ బ్రీడింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు.’అని వెల్లడించారు. – డాక్టర్ వికాస్కుమార్ సింగ్ -
ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయండి..
సాక్షి, హైదరాబాద్: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు ఇవ్వాల్సిన బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. కస్టమ్ మిల్లింగ్‌పై దృష్టి సారించాలని, రైస్ మిల్లర్ల ద్వారా బియ్యం ఎఫ్‌సీఐకి అందజేయాలని స్పష్టం చేశారు. తాను ఇటీవల ఢిల్లీ పర్యటించినప్పుడు కేంద్ర అధికారులు పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారని, ఆశించిన స్థాయిలో బియ్యం నిల్వలు రావడం లేదని వారు ఫిర్యాదు చేశారని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో జనవరి 31వ తేదీలోపు బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇతర అధికారులతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి కలెక్టర్లు, పౌర సరఫరాల సంస్థ, ఎఫ్‌సీఐ అధికారులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం డెలివరీ చేయాలి.. ఈనెలాఖరు నాటికి 7.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, యాసంగి సీజన్‌కు 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరాలో ఆలస్యం జరగకూడ దని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. మిల్లర్లంతా రాబోయే రోజులలో దాదాపు 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుందన్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అందించేందుకు పౌరసరఫరాల సంస్థ రుణాలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పెట్టుబడిని తిరిగి పొందడం అనేది మిల్లర్లు ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీ చేయడంపైనే ఆధారపడి ఉంటుందని, జాప్యం జరిగితే కార్పొరేష న్కు పెద్ద ఎత్తున నష్టం కలుగుతుందన్నారు. గత పదేళ్లలో రూ.58,000 కోట్ల అప్పులు, రూ. 11,000 కోట్ల నష్టాల వల్ల పౌరసరఫరాలపై భారం పడింద ని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు రూ.3,000 కోట్ల వార్షిక వడ్డీ భారం పడుతోందన్నారు. బియ్యం సరఫరాలో జాప్యంతో రాష్ట్ర కేటాయింపులపై ప్రభావం సకాలంలో బియ్యం పంపిణీ చేయకుండా మిల్లర్లు పెద్దఎత్తున నిల్వలు ఉంచుకోవడం వల్ల లాభం లేదని ఉత్తమ్ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరాలో జాప్యం వల్ల భవిష్యత్తులో తెలంగాణకు కేటాయింపులపై తీవ్ర పరిణామాలు వస్తాయని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల కార్పొరేషన్ భవిష్యత్తు కోసం బియ్యం పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను కోరారు. పీడీఎస్ బియ్యం నాణ్యత లోపించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పీడీఎస్ బియ్యాన్ని పాలిష్‌చేసి రీసైక్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కో బియ్యం బస్తాకు 45 కిలోల కంటే తక్కువ బియ్యం అందుతున్నట్లు రేషన్ షాపు యజమానుల నుంచి వచ్చిన ఫిర్యాదును కూడా మంత్రి ప్రస్తావించారు. కొందరి నిర్లక్ష్యం వల్ల రేషన్‌షాపుల యజమానులు ఎందుకు నష్టపోవాలనీ, దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాంః సీఎస్ సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఎఫ్‌సీఐకి పంపిణీ చేయాల్సిన బియ్యం లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల డాటా ఎంట్రీని ఆధార్, రేషన్ కార్డుల్లోని సమాచారం ఆధారంగా నమోదు చేయడంలో జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. -
దేశంలో భారీగా పెరిగిన బియ్యం ధరలు!
భారతదేశంలో బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి, ఒక క్వింటాల్ బియ్యం ధరల గరిష్టంగా సుమారు రూ. 1500 పెరిగినట్లు తెలుస్తోంది. భారతదేశంలో రూ. 4500 నుంచి రూ. 5000 వరకు ఉన్న క్వింటాల్ HMT, BPT, సోనామసూరి బియ్యం ధరలు ప్రస్తుతం రూ. 6200 నుంచి రూ. 7500కు చేరాయి. క్వింటాల్ ధరలు గతం కంటే కూడా రూ. 1000 నుంచి రూ. 15000 పెరిగింది. బియ్యం ధరలు పెరగటానికి ప్రధాన కారణం వరదల నష్టం వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా.. వారి సాగు కూడా బాగా తగ్గడం అని సమాచారం. -
ఛత్తీస్‌గఢ్ నుంచి అయోధ్యకు.. సుగంధభరిత బియ్యం, భారీగా కూరగాయలు
ఛత్తీస్‌గఢ్ మిల్లర్స్ అసోసియేషన్ అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సుగంధభరిత బియ్యాన్ని పంపనుంది. అలాగే ఈ ప్రాంతపు రైతులు తాము పండించిన కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించారు. రాజధాని రాయ్‌పూర్‌లోని రామాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవసాయి పాల్గొని, ఆలయ ప్రాంగణం నుంచి 300 మెట్రిక్ టన్నుల సుగంధభరిత బియ్యంతో అయోధ్యకు బయలుదేరిన 11 ట్రక్కులకు పచ్చజెండా చూపారు. ఇదిలావుండగా సీఎం విష్ణు దేవ్‌సాయి తన సోషల్ మీడియా ఖాతాలో ‘రాముని దర్శనం కోసం ఆతృతగా వేచిచూస్తున్నాం. జనవరి 22న అయోధ్యలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. రాష్ట్రంలోని రైతులు వారి పొలాల్లో పండించిన 100 టన్నుల కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించుకున్నారు. శ్రీరాముడు ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్నాడు. ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్న రాష్ట్రంలోని రైతులు అభినందనీయులు’ అని పేర్కొన్నారు. కాగా ఛత్తీస్‌గఢ్ రైస్‌మిల్లర్లు అయోధ్యకు సుగంధభరిత బియ్యం పంపినందుకు సీఎం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే! राम काज करिबे को आतुर... आगामी 22 जनवरी को अयोध्या में मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्र जी की मूर्ति की प्राण प्रतिष्ठा होने वाली है, जिस पर हर सनातनी को गर्व है। मेरे प्रदेश के अन्नदाताओं ने भी राम काज के लिए अपने खेतों से उगाई गई 100 टन सब्जियां राम मंदिर निर्माण कार्य… pic.twitter.com/fD3OvLiod0 — Vishnu Deo Sai (@vishnudsai) January 2, 2024 -
కేంద్రం కీలక నిర్ణయం.. రూ.25కే కిలో బియ్యం?
న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న బియ్యం ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని రాయితీ కింద రూ. 25కే ఇవ్వాలనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పలుజాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు పెరుగుతున్న నిత్యావసర ఆహార పదార్థాల ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో సగటున కిలో బియ్యం ధర రూ. 43గా ఉంది. ఇది కిందటి ఏడాదితో పోలిస్తే 14.1శాతం పెరిగింది. దీంతో అందుబాటు ధరలో బియ్యాన్ని అందించేందుకు కేంద్రం.. ‘భారత్ రైస్’ను తీసుకురానున్నట్లు వినికిడి. రాయితీ ధరతో అందించనున్న బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), కేంద్రీయ భండార్ అవుట్లెట్, మొబైల్ వ్యాన్లు వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే దేశంలో ఆహార పదార్థాలను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్’ బ్రాండ్ పేరుతో పప్పు, గోధుమ పిండిని రాయితీ ధరలకు విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కిలో గోధుమ పిండిని రూ. 27.50, కిలో శనగ పప్పును . 60 చొప్పున వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఉత్పత్తులు 2,000 కంటే ఎక్కువ రిటైల్ పాయింట్లలో పంపిణీ చేస్తున్నారు. వీటిలాగే ‘భారత్ రైస్’ విక్రయాలు కూడా చేపట్టనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా.. దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఇటీవల కేంద్రం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అటు బాస్మతి బియ్యంపైనా ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. టన్ను ధర 1200 డాలర్లకంటే తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతులను నిషేధించింది. -
భారత్ రైస్ వస్తోంది.. కేజీ ధర ఎంతంటే?
రోజు రోజుకి పెరుగుతున్న బియ్యం ధరలను పరిష్కరించడానికి ప్రభుత్వం భారత్ బ్రాండ్‌తో కేవలం 25 రూపాయలకే కేజీ బియ్యాన్ని అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన విషయాలను సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించినట్లు సమాచారం. భారత్ రైస్ అనేది నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సిసిఎఫ్), కేంద్రీయ భండార్ అవుట్లెట్ల ద్వారా విక్రయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ అట్టా, భారత్ దాల్ (పప్పు) వంటి వాటిని విక్రయిస్తున్న ప్రభుత్వం రైస్ విభాగంలోకి అడుగుపెట్టింది. బాస్మతియేతర బియ్యం ధరల నియంత్రణకు చర్యలు గత కొంతకాలంగా దేశీయ మార్కెట్లో బాస్మతియేతర బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ 'సంజీవ్ చోప్రా' (Sanjeev Chopra) ప్రముఖ రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులతో ఇటీవలే సమావేశమయ్యారు. ఇదీ చదవండి: అప్పుడు ఆస్తి పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ.37000 కోట్ల సామ్రాజ్యం.. ఈ సమావేశంలో సంజీవ్ చోప్రా మాట్లాడుతూ.. బాస్మతియేతర బియ్యం ధరలు సజావుగా (రీజనబుల్) ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద 29 రూపాయలకే ప్రాసెసర్లకు అందజేస్తున్నారు. అయితే ఇదే బియ్యాన్ని వారు మార్కెట్లో రూ.43 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదేశాలను జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. -
అన్నదాతకు అండగా ప్రభుత్వం
సాక్షి, అమరావతి: వరి పంట కోతల సమయమిది. రాష్ట్రంలోని రైతులు పంట కోసం, కల్లాల్లో, రోడ్ల పైన ఆరబెట్టారు. ఇదే సమయంలో రెండు రోజుల క్రితం మిచాంగ్ తుపాను ప్రభావం మొదలవడంతో రైతాంగం వణికిపోయింది. ఆపత్కాలంలో ఉన్న అన్నదాతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం జగన్ అధికారులతో సమీక్షించి, పలు ఆదేశాలు జారీ చేశారు. ఒక్క రైతుకు కూడా నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. గ్రామాల్లో రైతులు కల్లాలు, రోడ్ల మీద ఆరబెట్టిన ధాన్యాన్ని ఎక్కడికక్కడ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. నిబంధనలను సైతం సడలించి ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకే కొంటోంది. వెనువెంటనే మిల్లులకు తరలిస్తోంది. కేశవరావు లాంటి వేలాది రైతులను ఆదుకుంటోంది. గడిచిన 48 గంటల్లో ఏకంగా 1.07 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా క్షేత్ర స్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని తరలిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో కల్లాల్లోని ధాన్యాన్ని మిల్లులకు చేర్చింది. ఇప్పటివరకు ఆన్లైన్లో 75 వేల మంది రైతుల నుంచి రూ.1,211.49 కోట్ల విలువైన 5.30 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 55 వేల మంది రైతులకు సుమారు రూ.750 కోట్ల వరకు నిర్ణీత కాల వ్యవధిలో వారి ఖాతాల్లో జమ చేసింది. అత్యవసర నిధి కింద జిల్లాకు రూ.కోటి తుపాను నేపథ్యంలో కల్లాల్లోని ధాన్యం తడిసిపోకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆన్లైన్ ద్వారా సాంకేతికంగా వివరాల నమోదులో కొంత జాప్యం జరుగుతుంది. ఈలోగా వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోకుండా ఆఫ్‌లైన్‌లో కొనేలా నిబంధనలను సడలించింది. దీనిని మరింత వేగంగా చేపట్టేందుకు అత్యవసర నిధుల కింద అవసరమైన జిల్లాలకు రూ.కోటి చొప్పున కేటాయించింది. ఈ నిధులతో కలెక్టర్లు మిల్లర్లు పంపించే వాహనాలకు తోడు ఎక్కడికక్కడ ప్రైవేట్ వాహనాలను బుక్ చేసి ధాన్యం బస్తాలను శరవేగంగా తరలిస్తున్నారు. ఇప్పటివరకు కృష్ణా, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేశారు. కంట్రోల్ రూమ్‌ల ద్వారా పర్యవేక్షణ విపత్కర పరిస్థితుల్లో ఉన్న రైతుల నుంచి ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సమష్టిగా పని చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల సంస్థ ఎండీ, జిల్లా కలెక్టర్లు, జేసీలు, డీఎంలు, తహసీల్దార్లు కంట్రోల్ రూమ్‌ల ద్వారా కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గ, మండల, ఆర్బీకేల్లో ప్రత్యేక అధికారులను సైతం నియమించి రోడ్లపై ఉన్న ధాన్యాన్ని తక్షణం మిల్లులకు తరలిస్తున్నారు. తుపాను సమయంలో రైతులు పంట రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మిల్లుల సామర్థ్యం తక్కువగా ఉన్న చోట ధాన్యాన్ని మార్కెట్ యార్డుల్లో భద్రపరుస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమలో అత్యధికంగా.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా ఆన్లైన్లో 96,965 టన్నులు, ఆఫ్‌లైన్‌లో 48వేల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఆదివారం ఒక్కరోజే 40 వేల టన్నులకుపైగా కొనడం విశేషం. మాన్యువల్‌గా పుస్తకంలో రైతుల ధాన్యం వివరాలను నమోదు చేసుకుని మిల్లులకు తరలిస్తున్నారు. తేమ 18 శాతం ఉన్నప్పటికీ మిల్లర్లు సహకరిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో 2.40 లక్షల టన్నులు వస్తుందని అంచనా వేయగా ఇప్పటికే 1.43 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. అమలాపురం, కొత్తపేట డివిజన్లలో పంట కోతలకు సమయం ఉంది. ఆలమూరు, మండపేట, రాయవరం ప్రాంతాల్లో మొత్తం ధాన్యాన్ని తుపాను ప్రభావం కంటే ముందే సేకరించారు. ఇప్పుడు మద్దతు ధర ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో రైతుల వివరాలను వేగంగా ఆన్లైన్ చేస్తూ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్‌టీవో)లు జనరేట్ చేస్తున్నట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం ఎస్. సుధా సాగర్ చెప్పారు. ఇప్పటివరకు రైతులకు మద్దతు ధరకు సుమారు 15 వేల టన్నులకుపైగా ఎఫ్‌టీవోలు ఇచ్చామన్నారు. ‘14 ఎకరాల పంట. ఈసారి బాగా పండటంతో 30 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. యంత్రంపై కోయడంతో ధాన్యం పచ్చిగా ఉందని కల్లాల్లో ఆరబెట్టాను. చివరికొచ్చేసరికి తుపాను భయం పట్టుకుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం పడితే ఎలా అనుకుంటున్న దశలో అధికారులు వచ్చారు. కంప్యూటర్లో ఎక్కించాల్సిన అవసరంలేదని, లోడును వెంటనే పక్కనున్న మిల్లులకు పంపించేద్దామని చెప్పారు. కూలీలను పిలిపించారు. గోతాల్లోకి నింపి.. నా ట్రాక్టర్లోనే ఆదివారం రాత్రి పంటను తీసుకెళ్లి మిల్లులో అప్పజెప్పాను. లేకుంటే సోమవారం కురిసిన చినుకులకు చేతికొచ్చిన లాభం తడిసిపోయేది’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరుకు చెందిన కౌలు రైతు శీర్ల వెంకట కేశవరావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఏర్పాట్లతో వర్షంలోనూ తరలింపు ► కృష్ణా జిల్లాలో కల్లాల్లోని ధాన్యం తడిసిపోకుండా, రవాణా వాహనాలపై కప్పేందుకు వీలుగా 700కుపైగా టార్పాలిన్లు ప్రభుత్వం కొనుగోలు చేసింది. తేమ శాతం నిబంధనలను సైతం పక్కనబెట్టి 20 వేల టన్నులకుపైగా ధాన్యాన్ని సేకరించింది. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేస్తే చెడిపోయే ప్రమాదం ఉండటంతో వెంటనే గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లోని డ్రయర్ సౌకర్యం ఉన్న మిల్లులకు తరలిస్తోంది. ► ఏలూరు జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 10 వేల టన్నులు తరలించగా సోమవారం వర్షంలోనూ ధాన్యం సేకరణ కొనసాగింది. అయితే తుపాను భయంతో కొంత మంది రైతులు కోతలు చేపడుతున్నారు. మరికొందరు కోసిన ధాన్యాన్ని ఇళ్లలో, షెడ్లలో నిల్వ చేసుకుంటున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత ఆరబోసుకుని విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం భార్గవి తెలిపారు. వర్షాల్లో కోత మంచిది కాదని, తమ సిబ్బంది సహాయంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో ఆఫ్‌లైన్, ఆన్లైన్లో లక్ష టన్నులకు పైగా ధాన్యం సేకరించామన్నారు. ► పశ్చిమ గోదావరి జిల్లాలో కోతలు కోసి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని దాదాపు మొత్తం సేకరించారు. ఆదివారం రాత్రి 12 గంటల వరకూ వాహనాల్లో తరలించారు. ఆ ఒక్కరోజే సుమారు 24,000 టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. అక్కడక్కడా మిగిలిన స్వల్ప మొత్తం ధాన్యాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 90 వేల ఎకరాల్లో వరికోతలు పూర్తవగా 1.80 లక్షల టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం శివరామ్ చెప్పారు. ఇందులో 1.30 టన్నులు ఆర్బీకేల్లో కొనుగోలు చేశామన్నారు. ► తూర్పు గోదావరి జిల్లాలో 6,367 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు జేసీ తేజ్‌భరత్ తెలిపారు. ఇక్కడ అత్యధికంగా బహిరంగ మార్కెట్‌కు తరలిపోగా ఆర్బీకేల ద్వారా 15,272 మంది రైతుల నుంచి 1,04,917 టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ► ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను ప్రభావం పెద్దగా లేదు. విజయనగరం జిల్లాలో నూర్పిడి చేసిన ధాన్యం 1,242 టన్నుల వరకు ఉంది. దీనిలో 440 మెట్రిక్ టన్నులు సోమవారం ఆఫ్‌లైన్‌లో కొన్నారు. మంగళవారం మరో వెయ్యి టన్నులు కొనుగోలు చేయనున్నారు. శ్రీకాకుళంలో 700, పార్వతీపురం మన్యంలో 500 టన్నులు కొనుగోలు చేశారు. ► కాకినాడ జిల్లాలో కల్లాల్లో, రోడ్లపై ఉన్న 23 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ దేవీపట్నం, గంగవరం ప్రాంతాల్లో 300 టన్నులు కొన్నారు. ఆఫ్‌లైన్‌లో ఆదుకున్నారు.. నేను సొంతంగా, కౌలుకు కలిపి 70 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరాకు 30 నుంచి 35 బస్తాలు వచ్చింది. ఆఫ్‌లైన్‌లో ఆదివారం 240 బస్తాలు ఆర్బీకేలో విక్రయించాను. ఇప్పుడు వర్షాలకు ధాన్యం తడిసే అవకాశమున్నందున తేమ శాతం ఉండాలనే నిబంధనను ప్రభుత్వం సవరించి కొనుగోలు చేయడం హర్షణీయం.– సేవా సత్యనారాయణ, లొల్ల గ్రామం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా తేమతో సంబంధం లేకుండా.. ఒక్క రోజు ఆలస్యమైనా పంట మొత్తం వర్షార్పణమయ్యేది. చాలా ఇబ్బందులు పడేవాడిని. సకాలంలో అధికారుల సాయంతో నాలుగు ఎకరాల ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా నేరుగా మిల్లుకే చేర్చాను. ఫలితంగా 10 టన్నుల ధాన్యాన్ని నష్టపోకుండా ఒబ్బి చేసుకోగలిగా. – చిటికెన పెద సత్యనారాయణ, వడలి, పశ్చిమగోదావరి జిల్లా కోతలు వాయిదా వేయండి రైతులు వరికోతలను నాలుగు రోజులు వాయిదా వేస్తే మంచిది. వర్షాల సమయంలో పంట కోస్తే తడి ఆరక తేమ పెరిగిపోతుంది. త్వరగా మొలకలు వచ్చి ధాన్యం దెబ్బతింటుంది. కోసిన ధాన్యంలో తేమ ఎక్కువగా ఉంటే వాటిని డ్రయర్ సౌకర్యం ఉన్న మిల్లులకు వర్షంలోనూ ప్రత్యేక జాగ్రత్తల నడుమ తరలిస్తున్నాం. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా ఆర్బీకేల్లో తీసుకునేలా అవకాశం కల్పిస్తాం. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ కల్లాల్లో స్వల్పంగానే.. తుపాను హెచ్చరికలతో వర్షం రాక ముందే ధాన్యాన్ని మిల్లులకు తరలించేశాం. ఇంకా అక్కడక్కడా కొద్దిగా ఉంది. దానిని కూడా తరలిస్తాం. కొందరు రైతులు ఆదివారం కూడా యంత్రంపై కోతలు ఎక్కువగా చేశారు. వాటిల్లో చాలా వరకు కొనుగోలు చేశాం. తేమ శాతం ఎక్కువ ఉంటే రైతులకు నష్టం జరగకుండా మిల్లర్లతో మాట్లాడుతున్నాం. అప్పటికప్పుడు ప్రైవేటు వాహనాల్లో ధాన్యం లోడును తరలించాలని కలెక్టర్లకు చెప్పాం. – జి.వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ ప్రభుత్వ చొరవ కాపాడింది ఐదు ఎకరాలు కౌలుకు సాగు చేశాను. పంటను మిషన్‌తో కోయించి, ధాన్యం రోడ్డుపై రాశి పోశాను. తుపాను కారణంగా వర్షం పడుతుందని బరకాలతో కప్పి ఉంచాను. లేదంటే వర్షానికి ధాన్యం తడిసిపోయేది. జేసీగారు వచ్చి మా ధాన్యాన్ని వెంటనే మిల్లుకు పంపించారు. తేమ ఎక్కువ ఉంటే మిల్లరు ధాన్యంలో కోత వేస్తారు. కానీ, ధాన్యంలో ఎటువంటి కోతా పెట్టలేదు. ప్రభుత్వం తీసుకున్న చొరవే నన్ను కాపాడింది – వాసంశెట్టి అర్జునరావు, గొడ్డటిపాలెం, కాకినాడ జిల్లా మద్దతు ధర నష్టపోకుండా.. ఎకరాకు 30 బస్తాల పైనే దిగుబడి వచ్చింది. ఈ లోగా తుపాను భయపెట్టింది. ప్రైవేటుగా అమ్మేందుకు ప్రయత్నించా. మద్దతు ధర కంటే రూ.400 తక్కువకు అడిగారు. ఇంతలోనే వానలు మొదలయ్యాయి. ధాన్యం నిల్వ చేయడానికి సరైన గిడ్డంగులు లేవు. తక్కువకు అమ్మితే బాగా ఆదాయం పోతుందని బాధ పడ్డాను. ఆర్బీకేలో చెబితే ఆఫ్‌లైన్‌లో నా 220 బస్తాల ధాన్యం కొని, మిల్లుకు తరలించారు. పూర్తిగా మద్దతు ధర వస్తుందని వీఏఏ చెప్పారు. ఆపత్కాలంలో ఆదుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – పంచిరెడ్డి రమణ, గండువల్లిపేట, నరసన్నపేట నిబంధనలు సడలించి ఆదుకున్నారు తుపాను హెచ్చరికలతో పంట కోత కోయించాను. ఆర్బీకే వాళ్లు తేమ 22 శాతం ఉందన్నారు. మద్దతు రేటు రాదేమో అనుకున్నా. కానీ ప్రభుత్వం నిబంధనలు మార్చి మేలు చేసింది. తేమ శాతం ఎక్కువ వచ్చినా మద్దతు ధర దక్కేలా చేసింది. కోత చేసిన 495 సారలు (40 కిలోల బస్తాలు) ఆదివారం ముసురులోనే ధాన్యం కాటా వేయించి లారీల్లో పంపించారు. – సాగి కోటేశ్వరరావు, కౌలురైతు, పునాదిపాడు, కృష్ణాజిల్లా -
వరి ఆకారపు మిల్లెట్లు!
సాక్షి, హైదరాబాద్: మిల్లెట్ డైట్‌ను ప్రోత్సహించేందుకుగాను తాము చేపట్టిన కార్యక్రమాల్లో మిల్లెట్లను బియ్యం ఆకారంలోకి మార్చడం ఒకటని న్యూట్రీహబ్ సీఈవో డాక్టర్ రావు తెలిపారు. సాయిల్ టు సోల్ అనే అంశంపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌కు విచ్చేసిన మహిళా పారిశ్రామికవేత్తల బృందంతో డాక్టర్ రావు మాట్లాడారు. మిల్లెట్ డైట్‌పై అవగాహన కల్పించి, ఎక్కువ మంది వీటిని తమ డైట్లో భాగం చేసుకునేలా చేసేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. చాలా మంది అన్నం తినడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి మిల్లెట్లు అన్నంలాగా కనిపిస్తాయి. బియ్యం ఆకారంలో తృణధాన్యాలను అందజేస్తాం. తద్వారా వాటికి ఆమోదయోగ్యం పెరుగుతుంది మూడు వేల సంవత్సరాల నాటి తృణధాన్యాల సమూహానికి మరింత యాక్సెప్టెన్స్ పెంచడానికి ఇది ఒక చొరవ. మిల్లెట్లను బియ్యంగా పునర్నిర్మించేటప్పుడు వాటి పోషక విలువలు ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మిల్లెట్లను బియ్యం రూపంలోకి మార్చడం ద్వారా, మేము వాటి షెల్ఫ్-లైఫ్‌ను పెంచుతున్నాం. మిల్లెట్లు పురాతన ఆహార ధాన్యాలలో ఒకటని, వాటి సాగు దాదాపు క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాటిదని ఆధారాలున్నాయి. ఇది ప్రపంచ విస్తీర్ణంలో 19 %, ప్రపంచ ఉత్పత్తిలో 20%తో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచంలో సాగవుతున్న 18 మిల్లెట్లలో 11 భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. మిల్లెట్లు గుండె జబ్బులు, పెద్దపేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి. టైప్-2 డయాబెటిస్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. బరువు తగ్గిస్తాయి. మిల్లెట్లు గ్లూటెన్ రహిత ఆహారం. ఇది గర్భిణీ, బాలింతలకు మంచిది, పిల్లలలో పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. భారతదేశంలో మిల్లెట్ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి ఐఐఎమ్ఆర్ కృషి చేస్తోంది. వాణిజ్యపరంగా ఐఐఎంఆర్‌లో న్యూట్రిహబ్ టీబీఐఎస్సీ ఉంది. ఇది మిల్లెట్స్‌కు ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసింది. ఇది గత ఐదు ఏళ్లలో 400 స్టార్టప్‌లతో సుమారు రెండు కోట్ల వరకు మూలధనాన్ని సేకరించాయి. ప్రస్తుతం వందకు పైగా స్టార్టప్‌లు ఇంక్యుబేట్ చేపడుతున్నాయి. ఇది దాదాపు 70 సాంకేతికతలను అభివృద్ధి చేసిందని డాక్టర్ బి. దయాకర్ రావు తెలిపారు. అంతకుముందు ఐసీఏఆర్- డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి మాట్లాడుతూ, “మనము ఆహరం పేరిట కేలరీలను మాత్రమే తింటున్నాము. పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలతో ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత దిశగా పయనిస్తున్నాం. మిల్లెట్‌ను సూపర్‌ఫుడ్‌గా ప్రదర్శించడం, మనం మర్చిపోయిన వంటకాలను పునరుద్ధరించడం తదితర వాటితో మిల్లెట్ పేద ప్రజల ఆహారం అనే కళంకాన్ని తొలగించే మన ప్రధాన ఆహారంలో భాగంగే చేసే యత్నం చేస్తోంది ఐఐఎంఆర్. ఇక మిల్లెట్ వాల్యూ చైన్‌లో 500కి పైగా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని, ఐఐఎంఆర్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద మరో 250 స్టార్టప్‌లను ప్రారంభించామని ఐసీఏఆర్ డైరెక్టర్ సత్యవతి అన్నారు. దాదాపు 66 స్టార్టప్‌లకు సుమారు రూ. 6.2 కోట్ల నిధులను పంపిణీ చేయగా, మిగిలిన 25 స్టార్టప్లుకు కూడా నిధుల విడుదలకు ఆమోదం లభించినట్లు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ రీతు షా మాట్లాడుతూ.. మిల్లెట్లు ప్రోటీన్, ఫైబర్, కీలకమైన విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలమని అన్నారు. ఇది అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం కాబట్టి ఎఫ్ఎల్ఓ తమ సభ్యులకు మరిన్ని వ్యాపార అవకాశాలను లభించాలని ఆశిస్తోంది. అందుకే ఈ టూర్ ప్లాన్ చేశామని ఆమె తెలిపారు. మిల్లెట్స్‌లో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఆసక్తి ఉన్న పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు అనేక ప్రశ్నలు సంధించి..వివరణలు పొందారు. ఇక ఈ కార్యక్రమం చివర్లో వారు పారిశ్రామికవేత్తల కోసంఐఐఎంఆర్ సృష్టించిన సౌకర్యాలను కూడా సందర్శించి పరిశీలించారు. (చదవండి: ఆహారానికి ‘అనారోగ్య మూల్యం’ అంతింత కాదయా!) -
రైస్ వల్ల షుగర్ లెవల్స్ పెరగవు!.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
రైస్ అధికంగా తినడం వల్లే బరువు పెరుగుతామని, అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిపోతాయని చాలామంది అనుకుంటారు. అందుకే రైస్‌ని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తారు కూడా. కొందరు రాత్రి సమయంలో చపాతీలు, పుల్కాలు, సూప్‌లతో సరిపెట్టేస్తారు. అదేం అవసరం లేదంటున్నారు న్యూటిషియన్లు. దీనిపై అధ్యయనం చేసిన యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూటిషియన్లు కూడా రైస్‌ను హాయిగా తినొచ్చని అంటున్నారు. అదంతా కేవలం అపోహే అని తేల్చి చెబుతున్నారు. ఆ రైస్‌కి తాము చెప్పిన వాటిని జోడించి తింటే ఆ భయాలు కూడా ఉండవని నొక్కి చెబుతున్నారు. ఐతే మధుమేహం వ్యాధి గ్రస్తులు కూడా రైస్‌ని రెండుపూట్ల హయిగా తినేయొచ్చ? తదితరాల గురించే ఈ కథనం.! రైస్‌లో అత్యంత సాధారణ కార్బోహైడ్రేట్ ఉంటుందని అంటున్నారు ప్రముఖ న్యూటిషియన్ పూర్ణిమ. ఆహారంలో రైస్ ఎక్కువుగా తీసుకుంటే బరువు పెరుగుతామన్న భయంతో కొద్దికొద్దిగానే తింటూ బాధపడుతుంటారు. కానీ అది నిజం కాదని చెబుతున్నారు న్యూటిషియన్ పూర్ణిమ. ఇది బరువు తగ్గడంలోనూ, చక్కెర స్థాయిలను నిర్వహించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఈ మేరకు పూర్ణిమ యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ అధ్యయనంలో కనుగొన్న ఆసక్తికర విషయాలు ఏంటంటే... ఎలా తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయంటే.. తెల్లటి అన్నంలో వంద శాతం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అదే రైస్‌కి వెనిగర్ కలిపి వండుకుంటే గ్లూకోజ్ స్థాయిలు పెరుతాయన్న భయమే ఉండదు. బియ్యానికి వెనిగర్‌ని జోడించడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రభావం గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే రైస్‌కి పాలు చేర్చడం వల్ల మంచి ప్రోటీన్ లభిస్తుంది. ఆటోమెటిక్‌గా గ్లైసెమిడ్ ఇండెక్స్ తగ్గుతుందని సోయాబీన్ లేదా సోయాబీన్ ఉత్పత్తులతో కూడిన బియ్యంలో కూడా గ్లైసెమిక సూచిక తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. నిమ్మరసాన్ని జోడించడం వల్ల కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రభావం గణనీయంగా 40 శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. నిమ్మరసంతో అన్నం తినడం వల్ల ఎక్కువుగా తిన్న అనుభూతి కలుగుతుంది. అందువల్ల తెలియకుండానే ఈజీగా బరువు కూడా తగ్గుతాం పులియబెట్టిన పదార్థాలను రైస్‌కి జోడించడం వల్ల కూడా గ్లూకోజ్ స్థాయిలు తక్కువుగానే ఉంటాయి. ఉదాహరణకు కొబుచా, సౌర్‌క్రాట్, కిమ్చి, మిసో, పెరుగు తదితరాలు ప్రేగులకు మంచిది. ఎసిటిక్ యాసిడ్‌తో కలిగిన పదార్థాలు లేదా వెనిగర్ ఆధారిత పదార్థాలు, పచ్చళ్లు, సాస్‌లు, ఆవాలు, సలాడ్లు(మిక్సిడ్ కూరగాయాలు) తదితరాలు అన్నానికి జోడించి తీసుకుంటే మంచిది. ఇది కుదరనట్లయితే రైస్‌లో ఏదో రకంగా నిమ్మరసం జోడించి తీసుకోవడం మంచి ఆప్షన్ని అని న్యూట్రిషియన్ పూర్ణిమ చెబతున్నారు. ఇలా తీసుకుంటుంటే బరువు తగ్గడమే గాక రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించగలం అంటున్నారు న్యూట్రిషియన్ పూర్ణిమ. అందుకు సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Poornima Peri (@poornimahormonecoach) (చదవండి: రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా? బీ కేర్‌ఫుల్ అంటున్న వైద్యులు!) -
కుకింగ్ చేస్తే రైస్‘పుల్లింగ్’!
సాక్షి, హైదరాబాద్: చంద్రయాన్–3 పేరుతో హైదరాబాద్‌లో ఒకరిని బురిడీ కొట్టించి రూ. 3 కోట్లు కొల్లగొట్టిన రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ కేటుగాళ్ల మోడస్ ఆపరెండీని సీసీఎస్ పోలీసులు వివరించారు. సాధారణ చెంబు, బిందెలకు అతీంద్రియశక్తులు ఉన్నాయంటూ నమ్మించి నిండా ముంచడం వారి శైలి అని... సాధారణ చెంబు/బిందెను ‘రైస్‌పుల్లర్’గా మార్చడానికి ‘కుకింగ్’ చేస్తుంటారని పేర్కొన్నారు. అమోఘ శక్తులంటూ... రైస్ పుల్లింగ్ అంటే బియ్యాన్ని ఆకర్షించి తన వైపునకు లాక్కోవడం. ఇలాంటి శక్తులున్న పాత్రలు, బిందెలు, చెంబుల పేరు చెప్పి మోసగాళ్లు అందినకాడికి దండుకుంటుంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వీటికి చేజిక్కించుకుంటే అమోఘ మైన ఫలితాలు ఉంటాయని నమ్మబలుకుతారు. సాధారణంగా కేటుగాళ్లు కస్టమర్లకు రైస్‌పుల్లింగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలనే చూపిస్తుంటారు. అనేక సందర్భాల్లో తాము విక్రయిస్తున్న పాత్రలను చూసే అవకాశం కొనే వారికి ఇవ్వరు. అయితే ఎవరైనా తమకు ఆ పాత్ర మహిమల్ని ప్రత్యక్షంగా చూపించాలని కోరితే మాత్రం చూపిస్తారు. ఇలాంటి ముఠాలు బియ్యాన్ని తమదైన శైలిలో అన్నంగా వండటం ద్వారా రైస్ పుల్లింగ్ చేసేలా చేస్తారు. బియ్యంలో సన్నని ఇనుప రజను కలిపి బిరుసుగా అన్నం వండుతారు. దీన్ని ఎండబెట్టడం ద్వారా మళ్లీ బియ్యంలా కనిపించేలాగా చేస్తారు. అనంతరం రైస్‌పుల్లర్‌గా పేర్కొనే పాత్ర లోపలి భాగంలో ఎవరికీ కనిపిచంకుండా అయస్కాంతం ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ పాత్రకు దగ్గరగా ఇనుప రజనుతో కూడిన బియాన్ని ఉంచితే అది దానికి అతుక్కుంటుంది. ఇలాంటి షోలు చూపించే ఈ మోసగాళ్లు అమాయకులను బుట్టలో వేసుకుంటుంటారని పోలీసులు వివరిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ముఠాలకు చెందిన వారిలో అనేక మంది తొలుత బాధితులుగా మారినవారేనని పోలీసులు చెబుతున్నారు. తాము నష్టపోయిన మొత్తాన్ని తిరిగి అదే మార్గంలో సంపాదించాలనో, అసలు ఈ రైస్‌పుల్లర్లు ఉన్నాయా? లేవా? అనే అధ్యయనం కోసమో అలాంటి ముఠాలతో జట్టుకడుతున్నారు. ఒకసారి తేలిగ్గా డబ్బు వచ్చిపడిన తర్వాత అదే దందా కొనసాగించేస్తున్నారు. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటకతో పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రైస్ పుల్లింగ్, డబుల్ ఇంజిన్‌గా పిలిచే రెండు తలల పాములతో మోసాలు చేసే ముఠాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దొంగ సర్టిఫికేషన్లు రైస్ పుల్లింగ్ ముఠాల్లో కొన్ని ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తుంటాయి. వాటి కేంద్రంగానే కొన్ని ఉపకరణాలను కలిగి ఉండి ఆయా రైస్‌పుల్లర్స్‌ను పరీక్షించినట్లు నటిస్తూ ఆయా ఉపకరణాలు నిజమైనవనేలా సర్టిఫికేషన్ ఇచ్చేస్తుంటారు. ఇదంతా దాన్ని కొనే వారి ఎదురుగానే జరుగుతుంది. ఇలాంటి ముఠాల చేతిలో మోసపోయిన వారి సంఖ్య పదుల్లో ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే ఇకపై ఇంకెవరూ మోసపోకుండా అప్రమత్తం చేసిన వాళ్లవుతారని చెబుతున్నారు. కస్టడీకి తీసుకోవాలని నిర్ణయం పోలీసులు అరెస్టు చేసిన విజయ్‌కుమార్, సాయి భరద్వాజ్, సంతోష్, సురేందర్‌లను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని అధికారులు నిర్ణయించారు. -
రేషన్ డీలర్ల కమీషన్ రెండింతలు పెంపు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల కమీషన్‌ను ప్రభుత్వం రెండింతలు చేసింది. టన్ను బియ్యంపై రూ. 700గా ఉన్న కమీషన్‌ను రూ. 1,400 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఏటా డీలర్ల కమిషన్ రూ. 303 కోట్లకు చేరనుందని, అందులో రూ. 245 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భరిస్తుందని వెల్లడించారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో రేషన్ డీలర్లు అందించిన సేవలకు గౌరవంగా సీఎం డీలర్ల కమీషన్‌ను రెండింతలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కేంద్రం అందించే కమీషన్కన్నా అదనంగా రూ.950 ఒక్కో టన్నుకు అందిస్తున్నారని తెలిపారు. అలాగే కేంద్రం జాతీయ ఆహార భద్రతా కార్డులు ఇవ్వని దాదాపు 90 లక్షల మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ఆహార భద్రత కింద పూర్తి రేషన్‌ను అదనంగా అందజేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే 5కిలోల బియ్యానికి అదనంగా మరో కిలోని చేర్చి ఎన్ఎఫ్ఎస్సీ కార్డులకు కూడా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందచేస్తోందని తెలిపారు. ఇందుకోసం ఏటా రూ. 3వేల కోట్లను పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోందన్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రతినిధులు మంత్రిని సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
MS Swaminathan: ఆకలి లేని సమాజమే ఆయన కల
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన(1947) తర్వాత దేశంలో వ్యవసాయ రంగం నిస్తేజంగా మారింది. బ్రిటిష్ వలస పాలనలో ఈ రంగంలో అభివృద్ధి నిలిచిపోయింది. వనరులు లేవు, ఆధునిక విధానాలు లేవు. తిండి గింజలకు కటకటలాడే పరిస్థితి. గోధుమలు, బియ్యం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప ప్రజలకు నాలుగు మెతుకులు అందించలేని దురవస్థ ఉండేది. ఇలాంటి తరుణంలో స్వామినాథన్ రంగ ప్రవేశం వేశారు. హరిత విప్లవానికి బీజం చేశారు. మొదట పంజాబ్, హరియాణా, పశి్చమ ఉత్తరప్రదేశ్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టారు. రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే వంగడాలు సరఫరా చేశారు. ప్రభుత్వ సాయంతో తగిన సాగు నీటి వసతులు కలి్పంచారు. ఎరువులు అందించారు. కొద్ది కాలంలోనే సత్ఫలితాలు రావడం మొదలైంది. 1947లో దేశంలో గోధుమల ఉత్పత్తి ఏటా 60 లక్షల టన్నులు ఉండేది. 1962 నాటికి అది కోటి టన్నులకు చేరింది. 1964 నుంచి 1968 దాకా వార్షిక గోధుమల ఉత్పత్తి కోటి టన్నుల నుంచి 1.70 కోట్ల టన్నులకు ఎగబాకింది. దాంతో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. మనకు అవసరమైన ఆహారాన్ని మనమే పండించుకోగలమన్న నమ్మకం పెరిగింది. గోధుమల తర్వాత స్వామినాథన్ నూతన వరి వంగడాలపై తన పరిశోధనలను కేంద్రీకరించారు. అమెరికాతోపాటు ఐరోపా దేశాల్లో విద్యాసంస్థలతో కలిసి పనిచేశారు. 1954లో కటక్‌లోని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. నూతన వరి వంగడాలను సృష్టించారు. దేశీయ రకాలను సంకరీకరించి, కొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. స్వామినాథన్ పలువురు మాజీ ప్రధానమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. హరిత విప్లవాన్ని విజయంతం చేయడానికి శ్రమించారు. గోధుమ వంగడాల అభివృద్ధి కోసం ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్తోనూ స్వామినాథన్ కలిసి పనిచేశారు. సుస్థిర ఆహార భద్రత విషయంలో ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారు. సివిల్ సరీ్వసు వదులుకొని వ్యవసాయం వైపు.. మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జని్మంచారు. ఆయన తండ్రి డాక్టర్ ఎం.కె.సాంబశివన్ వైద్యుడు. తల్లి పార్వతీ తంగమ్మల్ గృహిణి. 11వ ఏట తండ్రిని కోల్పోయారు. తన మామయ్య సంరక్షణలో పెరిగిన స్వామినాథన్ కుంభకోణంలో మెట్రిక్యులేషన్, త్రివేండ్రంలో జంతుశాస్త్రంలో డిగ్రీ చేశారు. తర్వాత కోయంబత్తూరు అగ్రికల్చరల్ కాలేజీ నుంచి అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీజీ పూర్తి చేశారు. యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరి, బంగాళదుంప జన్యు పరిణామంపై అధ్యయనం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యు శాస్త్రవేత్తగా ఎదిగి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరారు. స్వామినాథన్ తొలుత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కానీ, తండ్రి బాటలో వైద్య వృత్తిలో అడుగుపెట్టాలని భావించారు. అయితే, అప్పట్లో ఆకలి చావులను చలించిపోయారు. వ్యవసాయ పరిశోధనా రంగంలో అడుగుపెట్టారు. ఆకలి లేని సమాజాన్ని కలగన్నారు. ప్రజల ఆకలి తీర్చడమే కాదు, పౌష్టికాహారం అందించాలని సంకలి్పంచారు. కరువు పరిస్థితులు చూసి.. వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడానికి కారణాలను స్వామినాథన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘1942–43లో బెంగాల్లో భయంకరమైన కరువు సంభవించింది. తిండి లేక దాదాపు 30 లక్షల మంది చనిపోయారు. దేశం కోసం నేనేమీ చేయలేనా? అని ఆలోచించా. ప్రజల ఆకలి బాధలు తీర్చాలంటే వ్యవసాయ రంగమే సరైందని నిర్ణయానికొచ్చా. మెడికల్ కాలేజీకి వెళ్లడానికి బదులు కోయంబత్తూరులో వ్యవసాయ కళాశాలలకు చేరిపోయా. వ్యవసాయ పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టా. ఎక్కువ మందికి ఆహారం అందించాలంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలు కావాలి. అందుకే జెనెటిక్స్, బ్రీడింగ్‌పై పరిశోధనలు చేశా. కరువు పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించా. వీటితో రైతులు లాభం పొందారు. ప్రజలకు తగినంత ఆహారం దొరికింది’ అని స్వామినాథన్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధరపై కీలక సిఫార్సు స్వామినాథన్ 2004 నుంచి 2006 దాకా ‘నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్’ అధినేతగా వ్యవహరించారు. పంటలకు కనీస మద్దతు ధరపై ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేశారు. పంటల ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతాన్ని కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని సూచించారు. ఎన్నో పదవులు కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. ► 1981 నుంచి 1985 దాకా ఫుడ్ అండ్ అగ్రిక ల్చరల్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ స్వతంత్ర చైర్మన్ ► 1984 నుంచి 1990 దాకా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అధ్యక్షుడు ► 1982 నుంచి 1988 దాకా ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ► 1989 నుంచి 1996 దాకా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(ఇండియా) అధ్యక్షుడు ► ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ వరించిన అవార్డులు ► 1967లో పద్మశ్రీ ► 1971లో రామన్ మెగసెసే ► 1972లో పద్మభూషణ్ ► 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ► 1989లో పద్మవిభూషణ్ ► ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్లు నేల సారాన్ని కాపాడుకోకపోతే ఎడారే హరిత విప్లవం వల్ల లాభాలే కాదు, నష్టాలూ ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. నూతన వంగడాలతో సంపన్న రైతులకే లబ్ధి చేకూరుతోందన్న వాదనలు వినిపించాయి. వీటితో నేల సారం దెబ్బతింటోందని, సంప్రదాయ దేశీయ వంగడాలు కనుమరుగైపోతున్నాయని నిపుణులు హెచ్చరించారు. పురుగు మందులు, ఎరువుల వాడకం మితిమీరుతుండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. హరిత విప్లవం ప్రతికూలతలను స్వామినాథన్ 1968లోనే గుర్తించారు. ఆధునిక వంగడాలతోపాటు సంప్రదాయ వంగడాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. నేల సారాన్ని కాపాడుకోకుండా విచ్చలవిడిగా పంటలు సాగుచేస్తే పొలాలు ఎడారులవుతాయని చెప్పారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంపై నియంత్రణ ఉండాలన్నారు. అంతేకాకుండా భూగర్భ జలాల పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్వింటాల్ ధాన్యం సగటున రూ.1,685
సాక్షి, హైదరాబాద్: మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం విక్రయానికి మరో అడుగు ముందుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా మిల్లుల్లోని 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించేందుకు ఆన్లైన్లో గత నెలలో గ్లోబల్ టెండర్లు ఆహ్వానించగా, 11 సంస్థలు 54 బిడ్స్ దాఖలు చేశాయి. ఈనెల 14న టెక్నికల్ బిడ్స్ తెరిచిన పౌరసరఫరాల సంస్థ ఈ 11 సంస్థల్లో హరియాణాకు చెందిన గురునానక్ రైస్ అండ్ జనరల్ మిల్స్ కంపెనీ బిడ్‌ను తిరస్కరించింది. మిగతా అర్హత పొందిన 10 సంస్థలకు సంబంధించి శనివారం ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచారు. ఇందులో క్వింటాల్ ధాన్యానికి కనిష్టంగా రూ.1,618, గరిష్టంగా రూ.1,732 కింద బిడ్స్ వేసిన 10 సంస్థలకు 25 లాట్లు అప్పగించారు. మొత్తం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సగటున రూ.1,685 లెక్కన విక్రయించారు. నష్టం క్వింటాల్‌కు రూ. 375 రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో క్వింటాల్ ధాన్యాన్ని గరిష్ట మద్దతు ధర (ఎంఎస్పీ) రూ.2,060 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసింది. యాసంగిలో మొత్తంగా 66.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వ ఉంచింది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల నూకల శాతం ఎక్కువగా వస్తుందని మిల్లర్లు సీఎంఆర్‌కు నిరాకరించారు. దీంతో ఈ ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్లు ఆహ్వానించింది. ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే వచ్చే నూకలకు నష్టపరిహారంగా క్వింటాల్ ధాన్యానికి రూ. 280 వరకు కేంద్ర ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చినా, మిల్లర్లు ససేమిరా అనడంతో తప్పక విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సగటున ధాన్యం క్వింటాల్‌కు రూ.1,800 వరకు విక్రయించేందుకు బిడ్స్ వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తర్వాత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సగటున క్వింటాల్‌కు రూ. 1,685 మాత్రమే బిడ్స్ ఫైనల్ అయ్యాయి. అంటే ఎంఎస్పీ రూ.2,060తో పోలిస్తే క్వింటాల్‌కు రూ. 375 ప్రభుత్వానికి నష్టం. అంటే ఒక మెట్రిక్ టన్నుకు రూ. 37 కోట్ల చొప్పున 25 ఎల్ఎంటీకి రూ. 925 కోట్ల నష్టం. కాగా ఈ ఫైనాన్షియల్ బిడ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ ఆమోదించాల్సి ఉంది. 25 లాట్లు దక్కించుకున్న 10 సంస్థలు ఇవే కేంద్రీయబండార్, సామ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, పట్టాబి ఆగ్రోఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్‌ఫుడ్ ఇండస్ట్రీ లిమిటెడ్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసింగ్ అండ్ రిటేనింగ్ కోఆపరేటివ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నోచా ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, బగదీయ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిద్దరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీలలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, శంభుదయాల్ జైన్ అండ్ కంపెనీ. -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఇలా చేయండి
రైస్ పకోడా ఎలా చేయాలంటే.. కావల్సిన పదార్థాలు: అన్నం – 1 కప్పు,ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి – పావు కప్పు చొప్పున కారం – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్ ధనియాల పొడి – 1 టీ స్పూన్ , కొత్తిమీర తురుము – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అన్నం వేసుకుని.. మెత్తగా పప్పు రుబ్బు కర్రతో ఒత్తుకుకోవాలి. అనంతరం దానిలో శనగపిండి, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పు.. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం కాగే నూనెలో.. పకోడీల్లా దోరగా వేయించుకుని.. సర్వ్ చేసుకోవాలి. -
పౌరసరఫరాల సంస్థలో విభేదాలు.. ‘సార్’ X ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థలో ఆధిపత్య పోరు నడుస్తోంది. సంస్థలో కీలక హోదా ల్లో ఉన్న ఉన్నతాధికారులకు, సంస్థ బాధ్యతలు చూసేందుకు నియమితులైన ‘సార్’కు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. తాను ప్రతిపాదించి న పనులేవీ సంస్థలో జరగడం లేదని, ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నారని ‘సార్’ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోమంటే ఎలా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రైస్‌మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్, సీ ఎంఆర్ అప్పగింత మొదలు మిల్లులు, ఎంఎల్ఎస్ పాయింట్లపై విజిలెన్స్ దాడులు, రేషన్ దుకాణా లకు బియ్యం సరఫరాలో అవకత వకల వరకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం మొద లు అధికారుల బదిలీల వరకు పలు అంశాలపై విభేదా లు సంస్థ సిబ్బందిలో హాట్‌టాపిక్‌గా మారాయి. మిల్లుల్లో తనిఖీలు .. విజిలెన్స్ దాడులు రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో రైస్‌మిల్లుల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయి, సీఎంఆర్ నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం లేదు. దీంతో కొన్ని నెలల క్రితం మిల్లర్ల అక్రమాలను నిగ్గు తేల్చే పేరుతో ప్రభుత్వ ప్రతినిధిగా ‘సార్’ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో స్థానిక విజిలెన్స్, జిల్లా అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. అయితే ఏ మిల్లులో ఎంత లోటు ఉంది, ఏ మేరకు అక్రమాలకు పాల్పడ్డాయనే అంశాలను మీడియాకు వెల్లడించేందుకు తాను చేసిన ప్రయత్నాలను ఉన్నత స్థాయిలో అధికారులు అడ్డుకున్నారని ఆయ న ఆరోపిస్తున్నారు. అయితే ఎండీకి గానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ సమాచారం ఇవ్వకుండా ‘రహస్య ఎజెండా’తో ‘సార్’ తనిఖీలు చేశారని సంస్థ అధికారులు కౌంటర్ ఇస్తున్నారు. తనిఖీల పేరుతో దందాలు సాగుతున్నాయనే అనుమానాలే దీనికి కారణమని కొందరు చెబుతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో రేషన్ బియ్యం పంపిణీ జరిగే ఎంఎల్ఎస్ పాయింట్లకు విజిలెన్స్ సిబ్బందిని పంపిస్తూ దాడుల పేరుతో భయపెడుతున్నారని, తనను ప్రసన్నం చేసుకున్న వారిని వదిలేసి, లేదంటే బెదిరిస్తున్నారనే ఆరోప ణలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సీఆర్ఓ భవనానికి బ్రేక్ సికింద్రాబాద్‌లోని చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్ఓ) భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించాల ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సార్’ భావించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మిల్లర్ల ‘సహకారం’తో రూ.2 కోట్లతో నిర్మించాలని ఆయన ప్రయత్నించారు. ఈ మేరకు సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న డీఈఈని ప్రతిపాదనలు అడిగితే, ఆయన కేవలం రూ.70 లక్షల అంచనాతో ప్రతిపాదనలు ఇచ్చారు. తర్వాత సదరు డీఈఈ డిప్యుటేషన్ రద్దు చేసుకొని వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కరీంనగర్లో పనిచేసిన ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను డీఈఈగా తెచ్చేందుకు ‘సార్’ చేసిన ప్రయత్నం విఫలమైంది. దీన్ని కూడా ప్రభుత్వ పెద్దల ద్వారా ఉన్నతాధికారులు అడ్డుకున్నారనే వాదన విన్పిస్తుండగా, మిల్లర్ల ‘సహకారం’తో భవన నిర్మాణం చేపట్టడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. 11 మంది సిబ్బంది ఆరుకు కుదింపు కీలక పదవిలో చేరిన తర్వాత ‘సార్’ తన పేషీలో 11 మంది సిబ్బందిని నియమించుకున్నారు. అయి తే సంస్థ ఎండీ.. వారి సంఖ్యను ఏకంగా ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ మేరకు ఆదేశాలు వచ్చినా సిబ్బందిని తగ్గించే నిర్ణయం అమలుకాకపోవడంపై సంస్థలో చర్చ జరుగుతోంది. ఔట్సోర్సింగ్ నియామకాలకు నో రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేనివిధంగా పౌరసరఫరాల సంస్థలో 800 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ‘సార్’ చేసిన సిఫారసులను అధికారులు ఆమోదించడం లేదని సమాచారం. ప్రధాన కార్యాలయంలో ఉండే లీగల్ అడ్వయిజర్ తరహాలో జిల్లాకో లీగల్ అడ్వయిజర్‌ను పెట్టాలని ప్రతిపాదించినప్పటికీ ఉన్నతాధికారి అంగీకరించలేదని తెలుస్తోంది. మూడు జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ముగ్గురికి అవకాశం ఇవ్వగా, మరి కొందరి కోసం చేస్తున్న ప్రయత్నాలకు కూడా అడ్డు పడుతున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనిచేస్తున్న డీఎంలు, ఇతర ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా తన ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని ‘సార్’ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వసూళ్ల ఆరోపణలు ఇదే సమయంలో ‘సార్’పై పలు ఆరోపణలు సంస్థలో విన్పిస్తుండటం గమనార్హం. త్వరలో డిప్యుటేషన్ పూర్తయ్యే డీజీఎం–అడ్మిన్, డీజీఎం – ఫైనాన్స్ పోస్టుల నియామకం కోసం బేరసారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్ కింద పంపించి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిని మళ్లీ అదే పోస్టులో నియమించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఈ విషయంలో నలుగురు రైస్ మిల్లర్లు బేరం కుదిర్చారనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. -
పీవీ సత్యనారాయణకు స్వామినాథన్ అవార్డు ప్రదానం
ఏజీ వర్సిటీ: ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2021–2012 ఏడాదికి రాగోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ పీవీ సత్యనారాయణకు అందించారు. రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నూజివీడ్ సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ దైవార్షిక జాతీయ అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు బంగారు పతకం అందజేశారు.హైబ్రిడ్ వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కృషికి గాను సత్యనారాయణను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్–ఐఐఆర్‌ఆర్‌లోని రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలతో పాటు ఈ అవార్డును కూడా అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఇప్పటివరకు 8 మందికి ప్రకటిస్తే అందులో నలుగురు తెలుగురాష్ట్రాల వారే కావడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో ఐసీఏఆర్ డీజీ డీఏఆర్ఈ కార్యదర్శి హిమాన్షు పాఠక్, డీఏఆర్ఈ కార్యదర్శి ఆర్ఎస్ పరోడా, ఐసీఏఆర్ మాజీ డీడీజీ ఈఏ సిద్దిఖ్, నూజివీడ్స్ సీఏండీ ఎం.ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
'భారత ఆహార సంస్థ' కు నాసిరకం బియ్యం అప్పగింత..!
జగిత్యాల: జిల్లాలోని కొందరు రైస్‌మిల్లర్లు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)కు నాసిరకం బియ్యం అప్పగిస్తున్నారు. రాష్ట్రస్థాయి విజిలెన్స్ బృందాల తనిఖీల్లో ఈ నిజాలు బహిర్గతం కావడంతో జిల్లా అధికారులు అయోమయంలో పడ్డారు. నిజానికి ఐకేపీ, సహకార సంఘాల ద్వారా పౌరసరఫరాల అధికారులు ఏటా రెండు సీజన్లలో రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. దీనిని రైస్‌మిల్లర్లకు అప్పగించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)గా మార్చి ఎఫ్‌సీఐకి అందజేస్తున్నా రు. ఇక్కడే కొందరు మిల్లర్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మర ఆడించిన బియ్యాన్ని గోదాములకు తరలిస్తున్న సమయంలో పాత బియ్యాన్ని కూడా కొత్తవిగా చూపుతున్నారు. కేసులు నమోదైనా మారని తీరు.. ► జిల్లాలో 2022లో పౌర సరఫరాలు, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు పలు రైస్‌మిల్లుల్లో చాలాసార్లు తనిఖీలు చేశారు. ► నిబంధనలు అతిక్రమించిన వారిపై 133 కేసులు నమోదు చేశారు. వారినుంచి 4,734 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ► గత జనవరి నుంచి ఇప్పటివరకు 26 కేసులు నమోదు చేసి 275 క్వింటాళ్ల బియ్యం, 4,500 క్వింటాళ్ల ధాన్యం స్వాధీనం చేసుకున్నారు. బయటపడుతున్న నిజాలు.. గతనెల 28న కొడిమ్యాల మండలం నాచుపల్లి శివారు ప్రభుత్వ గోదాముల్లో విజిలెన్స్ అధి కా రులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వచేసిన అనుమానాస్పద బియ్యాన్ని సీజ్‌చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు.. ► నాచుపల్లి ప్రభుత్వ గోదాము పర్యవేక్షణాధికారులను మిల్లర్లు మచ్చిక చేసుకుని పాతవాటినే కొత్త బియ్యంగా అప్పగించారని విజిలెన్స్ తనిఖీల్లో తేలింది. ► 2021–22కి భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) నిబంధనల ప్రకారం రైస్‌మిల్లర్లు పంపించిన రైస్బ్యాగ్పై బ్లూకలర్ దారం ఉండాలి. ► చాప ప్రింటింగ్, స్టిక్కర్, కన్సైన్మెంట్ నంబరు వేయాలి. ► అయితే, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో అవేమీ కనిపించలేదు. ► వాటిని పాత బియ్యంగానే పరిగణించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. రాజకీయ ఒత్తిళ్లతో వెనుకంజ వేస్తున్నారని తెలిసింది. ► 2022–23లో మిల్లర్లు తమ బ్యాగులకు రెడ్‌కలర్ దారం, రెడ్‌కలర్ చాప ప్రింటింగ్, రెడ్‌కలర్ స్టిక్కర్, కన్సైన్మెంట్ నంబరు బ్యాగ్‌పై వేయాలి. ► మొన్నటి తనిఖీల్లో ఇవేమీ కనిపించలేదు. దీంతో అక్కడ జరుగుతున్న అవినీతి బయటపడింది. ► నిబంధనల ప్రకారం.. బియ్యం రీసైక్లింగ్‌ను అరికట్టేందుకు ఒక ఏడాది ఒక కలర్ దారం, చాప, స్టిక్కర్, మరో ఏడాది మరో కలర్ దారం, చాప ప్రింటింగ్, స్టిక్కర్ ఉండాలి. ► చాలామంది మిల్లర్లు గోదాముల్లోని అధికారులను మచ్చిక చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా బియ్యం అప్పగిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు.. నాచుపల్లి గోదాముల్లో అనుమానాస్పద బియ్యం సరఫరా చేసిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. తమపై చర్యలు తీసుకోకుండా మిల్లర్లు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారని తెలిసింది. కేసులు నమోదు చేస్తున్నాం నిబంధనలు పాటించని రైస్మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నాం. కొడిమ్యాల మండలం నాచుపల్లి గోదాముల్లో తనిఖీలు చేయగా అనుమానిత బియ్యం లభించాయి. వాటిని పరీక్షల నిమిత్తం ల్యామ్‌కు తరలించాం. నివేదికలు రాగానే చర్యలు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి -
సింగపూర్‌కు మన బియ్యం.. అనుమతిచ్చిన కేంద్రం
భారత్ - సింగపూర్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆహార అవసరాలను తీర్చేలా భారత్ నుంచి సింగపూర్‌కు బియ్యాన్ని ఎగుమతి చేసుకునేలా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. భారత్, సింగపూర్ దేశాల మధ్య వ్యూహాత్మక ఒప్పందాలు, ఆర్ధికంగా బలోపేతం అయ్యేలా కొనసాగుతున్న సన్నిహిత సంబంధాల్ని దృష్టిలో ఉంచుకుని, ఆహార భద్రత అవసరాలకు అనుగుణంగా బియ్యం ఎగుమతిని అనుమతించాలని భారత్ నిర్ణయించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. Our response to media queries on export of rice to Singapore:https://t.co/RfmpXV38jR pic.twitter.com/lzqbRlzesb — Arindam Bagchi (@MEAIndia) August 29, 2023 20 శాతం సుంకం ఆగస్ట్ 27న దేశీయంగా బియ్యం ధరల్ని అదుపులో ఉంచేలా ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించింది. ఆగస్టు 25 నుంచే ఈ సుంకం అమల్లోకి రాగా.. ఈ ఏడాది అక్టోబరు 16 వరకు ఈ నిబంధన కొనసాగుతుందని పేర్కొంది. వరి ఉత్పత్తిపై అంచనాలు.. అప్రమత్తమైన కేంద్రం ప్రపంచంలోని బియ్యం ఎగుమతులలో భారత్ వాటా సుమారు 40 శాతం. భారత్ నుంచి సుమారు 140 దేశాలకు బియ్యం ఎగుమతి అవుతుంది. భారత్ తరువాత అత్యధికంగా థాయిలాండ్, వియత్నాం, పాకిస్తాన్, అమెరికా బియ్యం ఎగుమతి చేస్తున్నాయి. అయితే ఉత్తర భారతదేశంలో వరి పండించే రాష్ట్రాలలో భారీ వర్షాలు కురవడం, దేశంలోని మరికొన్ని రాష్ట్రాలలో వర్షాభావం కారణంగా ఈ ఏడాది వరి ఉత్పత్తి తగ్గనుందన్న అంచనాలున్నాయి. దానివల్ల బియ్యం ధరలు పెరగకుండా ఉరుము లేని పిడుగులా బాస్మతి బియ్యం మినహా మిగతా రకాల తెల్ల బియ్యం ఎగుమతుల్ని తక్షణమే నిషేధిస్తూ ‘ఆహారం, వినియోగదారుల వ్యవహారాల’ మంత్రిత్వ శాఖ జులై 20న ఉత్తర్వులు జారీచేసింది. బియ్యమో రామచంద్రా అమెరికాలో ఆసియా ప్రజల ప్రధాన ఆహారం బియ్యమే. ఎక్కవగా భారత్ నుంచే అక్కడకు ఎగుమతి అవుతుంది. బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలతో అమెరికాలోని భారతీయులు అప్రమత్తయ్యారు. బియ్యమో రామచంద్రా అనుకుంటూ.. ముందుగానే బియ్యం బస్తాల్ని కొనుగోలు చేసేందుకు సూపర్ మార్కెట్లకు పోటెత్తారు. దాంతో కొన్ని సూపర్ మార్కెట్లలలో రైస్ బ్యాగ్‌లు కొద్ది నిమిషాలలోనే అమ్ముడు పోవడం, బియ్యం లభ్యం కాకపోవడంతో క్యూ లైన్లలో నిలబడి ఎదురు చూపులు చూస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, బియ్యం ఎగుమతులపై తాజాగా భారత్ ఆంక్షల సడలించడంతో సింగపూర్ ప్రజలకు ఊరట కలిగినట్లైంది. -
వ్యవసాయానికి ఎన్నాళ్లీ సంకెళ్లు?
ఉల్లి ఎగుమతులను సమర్థంగా అడ్డుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం స్థానిక సరఫరాను పెంచింది. ఈ చర్య రైతులకు నష్టం కలిగించేదే. ఇది మార్కెట్ యంత్రాంగంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కాదా? అంతర్జాతీయంగా బియ్యం ధరలు దశాబ్ద కాలపు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. కానీ బాస్మతీయేతర తెల్ల బియ్యం, నూకల బియ్యం ఎగుమతిని కేంద్రం నిషేధించింది. మొత్తం బియ్యం ఎగుమతుల్లో ఈ రెండూ 45 శాతం వరకు ఉంటున్నాయి (తాజాగా బాస్మతి ఎగుమతులనూ నిషేధించింది). బియ్యం ఎగుమతులను నిషేధించడానికి కారణం ఇథనాల్ తయారీదారుల ప్రయోజనాలను కాపాడటం కోసమేనని తెలుస్తోంది. ఇది వరి రైతు లాభాలను పణంగా పెడుతోంది. ఈ సంవత్సరం మరో రెండు లక్షల టన్నుల ఉల్లిని అదనంగా సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఈ ఏడాది ఉల్లి నిల్వల లక్ష్యాన్ని (బఫర్ స్టాక్) మూడు లక్షల టన్నుల నుండి ఐదు లక్షల టన్నులకు తీసుకెళు తుంది. ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకం విధించిన ఒక రోజు తర్వాత కేంద్రం నుంచి ఈ ప్రకటన వచ్చిందని గుర్తించాలి. అంటే, ఎగుమతులను సమర్థంగా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం స్థానిక సరఫరాను పెంచింది. ఇది ఉల్లి ధరల పతనానికి కారణమవు తుంది. ఇది మార్కెట్ యంత్రాంగంలో జోక్యం చేసుకోవడం కాదా? ఉల్లి రైతులు ప్రభుత్వానికి తక్కువ ధరకు తమ పంటను అమ్మేలా చేసేందుకు ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకున్నట్లు కనిపించడం లేదా? ఇది మార్కెట్‌పై ప్రభుత్వ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడం కాదా? ఈ చర్య కచ్చితంగా రైతులకు నష్టం కలిగిస్తున్నందున, కేంద్ర మాజీ వ్యవసాయ మంత్రి కూడా ఉల్లిపై ఎగుమతి పన్ను పెంపును విమర్శించారు. ఆ మాజీ మంత్రి దేశంలోని ఉల్లిపాయల్లో మూడింట ఒక వంతు సరఫరా చేసే రాష్ట్రానికి చెందినవారు. ఎగు మతి పన్నుకు వ్యతిరేకంగా రైతులు ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నప్ప టికీ ఫలితం లేకుండా పోయింది వ్యవసాయోత్పత్తుల కోసం మార్కెట్ యంత్రాంగంలో ఇటువంటి ఏకపక్ష జోక్యాలకు రైతులు అలవాటు పడ్డారు. ఈ వారం ఉల్లి ద్రవ్యోల్బణం 19 శాతానికి చేరుకోవడం కేంద్ర ప్రభుత్వానికి ఆందో ళన కలిగిస్తోంది. ఇంటి బడ్జెట్లో ఉల్లిపాయల వాటా కొంత భాగం మాత్రమే అనుకోవద్దు. ఉల్లి ధరలు రాజకీయ నాయకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. మితిమీరిన ఉల్లిపాయల ధరల పెరుగుదల కారణంగా ప్రభుత్వాలే పడిపోయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 2020 సెప్టెంబర్‌లో పార్లమెంటులో ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలను గుర్తుంచుకోండి. ఈ మూడు చట్టాలలో ఒకటి వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై నియంత్రణను పూర్తిగా ఎత్తివేయాలనీ, నిల్వ పరిమితులను తొలగించాలనీ ప్రతిపాదించింది. ఎగుమతులు లేదా దిగుమతులపై ఏకపక్ష నిషేధాలను సడలించాలని కూడా అది ప్రతిపాదించింది. కానీ నూతన వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆ వారంలోనే, బంగ్లాదేశ్‌కు వెళ్లే అనేక ట్రక్కులను సరిహద్దు వద్ద నిలిపివేశారు. ఎందుకంటే, అవి ఉల్లిపాయల ఎగుమతి సరుకులను తీసుకుపోతు న్నాయి. ఒకవైపు ఎగుమతులను నిలిపివేయడం, మరోవైపు వ్యవ సాయ మార్కెట్లపై నియంత్రణ ఎత్తివేయడం వంటి ఈ చర్యలు మిశ్రమమైన, నిజాయితీ లేని సంకేతాలను ఇస్తున్నాయి. బహుశా, ఉల్లిపాయలపై ప్రస్తుతం విధించిన ఎగుమతి పన్నును నివారణ చర్యగా చెప్పవచ్చు. టమోటా ధరల అనూహ్య పెరుగుదల కారణంగా ఇప్పటికే దెబ్బతిని ఉన్నాం. భారత జాతీయ సహకార సంస్థల వినియోగదారు సమాఖ్య, భారత జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య ఇప్పటికే తమ బఫర్ స్టాక్ కోసం 15 లక్షల టన్నులకంటే ఎక్కువ టమోటాలను సేకరించాయి. కిలో టమోటా ధర రూ.200 వరకు పెరగడంతో సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ రాయితీలను ఎక్కడినుంచి చెల్లిస్తున్నారు? ద్రవ్యోల్బణం మంటలను ఆర్పడా నికి నేపాల్, తదితర దేశాల నుండి కూడా బహిరంగంగా ప్రకటించని మొత్తంలో టమోటాలను భారత్ దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 7.5 శాతం వద్ద నడుస్తోంది. ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 6 శాతం పరిమితి కంటే ఎక్కువ. కాబట్టి, ద్రవ్యోల్బణానికి కారణమయ్యే ప్రధాన విల¯Œ లలో టమోటాలు కూడా ఉన్నాయి. ఇది ప్రభుత్వాల అపఖ్యాతికి కారణ మవుతోంది. పైగా అది మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది కూడా. మరొక వ్యవసాయ సరుకును తీసుకోండి. జూలై నెలలో భారత దేశం బాస్మతీయేతర తెల్ల బియ్యం, నూకల బియ్యం ఎగుమతిని నిషేధించింది. మొత్తం బియ్యం ఎగుమతుల్లో ఈ రెండూ 45 శాతం వరకు ఉంటున్నాయి. ఈ నిషేధం మన వ్యాపార భాగస్వాములలో చాలామందిని కలవరపెట్టింది. పైగా భారతదేశాన్ని నమ్మదగని సర ఫరాదారుగా కనిపించేలా చేసింది. ఈ నేపథ్యంలో ఆఫ్రికా, ఆసియా లోని కొన్ని దేశాలు భారత్ నుండి బియ్యం దిగుమతిపై ఆధారపడటం వారి ఆహార భద్రతకు హాని కలిగించవచ్చు. దీనివల్ల ఆహార భద్రతపై భారత ప్రభుత్వం నిజంగా శ్రద్ధ చూపడం లేదని అర్థమవుతోంది. అయితే ప్రాథమికంగా బియ్యం ఎగుమతులను నిషేధించడానికి కారణం ఇథనాల్ తయారీదారుల ప్రయోజనాలను కాపాడటం కోస మేనని తెలుస్తోంది. 50 నుండి 60 లక్షల టన్నుల నూకల బియ్యంలో 30 లక్షల టన్నుల దాకా ఇథనాల్ తయారు చేయడానికి వెళ్తాయి. బియ్యం ఎగుమతిపై నిషేధం కార్ ఇంజిన్ల లభ్యతను పెంచుతుంది. కానీ ఇది వరి రైతు లాభాలను పణంగా పెడుతోందని గమనించాలి. అంతర్జాతీయంగా బియ్యం ధరలు దశాబ్ద కాలపు గరిష్ఠ స్థాయికి చేరు కున్నాయి. మంచి లాభాలు ఆర్జించేందుకు ఇదొక అవకాశం. వ్యవసా యోత్పత్తులపై ఎగుమతి నిషేధం వంటి చర్యల ఫలితంగా అంతిమంగా రైతులు నష్టపోతున్నారు. టమోటాలు, ఉల్లిపాయలు లేదా బియ్యంపై విధానపరమైన చర్యలకు సంబంధించిన ఇటీవలి కథనాలు... వ్యవసాయంలో సంస్క రణలు ఎందుకు ఇంత కఠినంగా, అసంపూర్తిగా ఉన్నాయనే విష యాన్ని వివరిస్తున్నాయి. దీని వెనుక స్వాభావికమైన పట్టణ పక్షపాతం ఉంది. ప్రభుత్వ విధానాలు రైతుల ప్రయోజనం కంటే పట్టణ వినియో గదారుల సంక్షేమానికి (తక్కువ ఆహార ద్రవ్యోల్బణం) అధిక ప్రాధా న్యత ఇస్తాయి. కాబట్టి, మార్కెట్లను సంస్కరించే, రైతుకు అనుకూలంగా క్రమబద్ధీకరించే వ్యవసాయ విధానాలను ఎల్లప్పుడూ ఏకపక్షంగా తిప్పికొడుతున్నారు. ధరల నియంత్రణల వల్ల రైతులకు కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేయడానికి, ఉచిత నీరు, విద్యుత్, చౌకగా ఎరువులు వంటి ఇన్పుట్ సబ్సిడీలు కొనసాగుతాయి. ఇది ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంటుంది. ప్రభుత్వంపై పడుతున్న భారానికి ప్రత్యా మ్నాయంగా ‘ఫార్వర్డ్ మార్కెట్ల’ అన్వేషణ జరగటం లేదు. అందువల్లే్ల ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుంటోంది. దానికోసం పోటీ లేని గుత్తాధిపత్య ప్రవర్తనకు కూడా వెనుకాడటం లేదు. ఈ ఆధిపత్య దుర్వినియోగానికి గానూ ప్రభుత్వాన్ని ఎవరు కోర్టుకు లాగుతారు? ధరల నియంత్రణ, నిల్వ పరిమితులు, ఏకపక్ష దిగుమతి, ఎగుమతి నిషేధాలతోపాటు తరచూ మారుతున్న ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయం ఇప్పటికీ సంకెళ్లతో బంధించబడి ఉంది. సాంకేతికంగా చూస్తే వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వాల పరిధికి సంబంధించిన అంశం అయినప్పటికీ కేంద్రంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసా యంపై తీవ్రంగా జోక్యం చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలతో రైతు భారీస్థాయి, విధ్వంసకరమైన రాయితీలతో అల్లాడిపోతాడు. భారీ సబ్సిడీలతో కూడిన రసాయన ఎరువులను అధికంగా వాడటం వల్ల పంజాబ్‌లో సంభవించిన నేల క్షీణత, లవణీయత దీనికి సాక్షీభూ తంగా ఉంది. వీటన్నింటికీ మించి, దేశంలో సగం మంది రైతులకు రాయితీలు లభించవు. ఎందుకంటే వారు భూమి లేనివారు లేదా కౌలుదారులు కాబట్టి తాము సాగుచేసే భూమితో వారికి సంబంధం ఉండదు. వ్యవసాయ విధాన పరంగా మనం నేస్తున్న వలలు మనల్ని చిక్కుల్లో పడేశాయి. అందుకనే వాటి సంకెళ్లు తొలగించడం చాలా కష్టంగా మారింది. మార్కెట్లు మెరుగ్గా పనిచేయాలన్నా, ప్రభుత్వ జోక్యాన్ని పరిమితంగా ఉంచాలన్నా, మార్కెట్ ప్రక్రియలో పాల్గొని, దాని నుండి లాభం పొందేందుకు రైతుకు మరింత స్వేచ్ఛను అందించాల్సి ఉంది. దీనికోసమే మనకు భారీ సంస్కరణలు అవసరం. డాక్టర్ అజీత్ రానాడే, ఆర్థికవేత్త (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
బియ్యం అమ్మకం..రూ.4 వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నిధుల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టి.. కస్టమ్‌మిల్లర్ల నోట్లో మట్టికొట్టే పనిచేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో నాలుగైదు రూపాయల తక్కువకు అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. ఒక్క ఆక్షన్‌కి రూ.1000 కోట్ల స్కామ్.. కోటిటన్నులు అమ్ముకునే ప్రణాళిక బీఆర్ఎస్ సర్కారుదని ఆరోపించారు. ఈ విధంగా వచ్చే రూ.4 వేల కోట్ల అవినీతి సొమ్ము 100 నియోజకవర్గాల్లో..ఒక్కో సెగ్మెంట్లో రూ.40 కోట్లు ఖర్చు చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు సంధించారు. శనివారం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ బియ్యం అమ్ముకుంటామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, దీనికి వెనుక అసలు ఉద్దేశం అదేనని ఆరోపించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని వేలం వేసేందుకు వెయ్యికోట్ల టర్నోవర్, రూ.100 కోట్ల ప్రాఫిట్ ఉండాలనే నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. మొదటిదశలో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారని, టెండర్లో పాల్గొనేందుకు పౌరసరఫరాలశాఖ నిర్ణయించిన విధివిధానాలతో రైస్ మిల్లర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎంఎస్పీకి బియ్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో మిల్లర్లు సిద్ధంగా ఉన్నా, టెండర్ల ద్వారా తమ మిల్లు సామర్థ్యం మేరకు ధాన్యం దక్కించుకుందామనుకున్న మధ్యతరగతి మిల్లర్లకు అసలు అందులో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలతో రైస్‌మిల్లర్లు బియ్యం ఆక్షన్‌లో కొనలేరన్నారు. రైస్‌మిల్లర్ల వ్యాపారం బంద్ అయితే రైతులు రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా కల్వకుంట్ల కవిత పోటీచేస్తే మూడో స్థానానికి పరిమితం అవుతుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తాను ఎంపీగా పోటీలో ఉండడం ఖాయమని ప్రకటించారు. -
దేశీ వరి పరిరక్షకుడు డా.దేబల్ దేవ్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం!
ప్రముఖ దేశీ వరి వంగడాల పరిరక్షకులు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ దేబల్ దేవ్‌కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘ఐఫోమ్ ఆసియా ఆర్గానిక్ మెడల్ ఆఫ్ ఆనర్’ లభించింది. వంద దేశాల్లో సేంద్రియ వ్యవసాయదారుల సంఘాల సమాఖ్య (ఐఫోమ్) ఆర్గానిక్స్ ఆసియా విభాగం, చైనాలోని క్సిచాంగ్ కౌంటీ సంయుక్తంగా 2023వ సంవత్సరపు ఆర్గానిక్ మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారానికి డా. దేబల్ దేవ్‌ను ఎంపిక చేశాయి. వైవిధ్యభరితమైన 1,440కు పైగా అపురూపమైన భారతీయ వరి వంగడాలను సేకరించడంతో పాటు.. ఒడిషాలోని తన చిన్న పరిశోధనా క్షేత్రంలో ప్రతి ఏటా సాగు చేస్తూ పరిరక్షిస్తున్న డా. దేబల్ దేవ్ దశాబ్దాలుగా నిస్వార్థ సేవ చేస్తున్నారు. 5 వేల డాలర్ల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారు. డా. దేబల్ దేవ్ పరిరక్షిస్తున్న దేశీ వరి వంగడాల్లో వాతావరణ మార్పుల్ని తట్టుకొని నిలిచే వరి రకాలతో పాటు అత్యంత అరుదైన పౌష్టిక విలువలు కలిగిన రకాలు కూడా ఉండటం విశేషం. జీన్ బ్యాంకుల్లో ఉండే పురాతన వంగడాలు శాస్త్రవేత్తల పరిశోధనలకు మాత్రమే ఉపయోగపడతాయి. అయితే, రైతుల పొలాల్లో ఏటేటా సాగవుతూ దేశీ వరి వంగడాలు వాతావరణ మార్పులకు, సరికొత్త చీడపీడలకు దీటుగా తట్టుకుంటూ రాటుదేలుతూ రైతులకు అందుబాటులో ఉంటాయి. అందువల్లనే, ఆధునిక వంగడాలెన్ని వచ్చినా ఈ అపురూపమైన పురాతన వంగడాలను సాగు చేస్తూ పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రకృతి సేద్యానికి అనువైన ఈ వంగడాల ద్వారానే మన ఆహార సార్వభౌమత్వం నిలుస్తుందని డా. దేబల్ దేవ్ ‘సాక్షి సాగుబడి’తో అన్నారు. - సాక్షి సాగుబడి డెస్క్ -
గోధుమలు, బియ్యం ధరల స్థిరీకరణ
సాక్షి, అమరావతి: గోధుమలు, గోధుమ పిండి, బియ్యం రిటైల్ ధరలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్ – డొమెస్టిక్) ద్వారా బహిరంగ మార్కెట్లో గోధుమలు, బియ్యాన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పథకం కింద 25 లక్షల టన్నుల బియ్యం, 50 లక్షల టన్నుల గోధుమలను మార్కెట్లోకి తెస్తోంది. ప్రస్తుతం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) వద్ద ఆంధ్రప్రదేశ్‌లో 7.61 లక్షల టన్నుల బియ్యం, 10,703 టన్నుల గోధుమలు ఉన్నాయి. వీటికి అదనంగా సెంట్రల్ పూల్ కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద మరో 8.40 లక్షల టన్నుల బియ్యం ఉన్నాయి. ఓఎంఎస్ఎస్ (డీ) పథకం కింద ఎఫ్‌సీఐ ప్రతివారం నిర్వహించే ఈ–వేలంలో భాగంగా అమరావతిలోని ఎఫ్‌సీఐ ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 23న 5 వేల టన్నుల గోధుమలు, 13,200 టన్నుల బియ్యాన్ని మార్కెట్లోకి తెస్తున్నారు. ఈ–వేలంలో పాల్గొనదలి్చన వారు ఈఎండీ మొత్తాన్ని ఎల్రక్టానిక్ మోడ్ ద్వారా జనరల్ మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, అమరావతి పేరిట ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు జమ చేయాలి. ఆసక్తి కలిగిన పిండి మిల్లులు, గోధుమ పిండి ప్రాసెసర్లు, గోధుమ ఉత్పత్తుల తయారీదారులు ఈ–వేలంలో పాల్గొనేందుకు www. valuejunction.in/ fci లో ఎం.జంక్షన్‌ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. వేలంలో గోధుమలు కొన్న వారు 30 రోజులలోపు ప్రాసెస్ చేసి రిటైల్ మార్కెట్లోకి విడుదల చేయాలి. బియ్యం వేలంలో వ్యాపారులు కూడా పాల్గొనవచ్చు. ఎఫ్ఆర్కే బియ్యం రిజర్వ్ ధర క్వింటాల్‌కు రూ.2,973, ఎఫ్ఆర్కే కాని బియ్యం రిజర్వ్ ధర క్వింటాల్‌కు రూ.2,900గా నిర్ణయించారు. ఆసక్తి గల బిడ్డర్లు, వ్యాపారులు వెబ్సైట్ ద్వారా వారి వివరాలను సమరి్పంచి ఈ వేలంలో పాల్గొనవచ్చని ఎఫ్‌సీఐ ఏపీ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ జోషి శనివారం ఓ ప్రకటనలో కోరారు. -
మటన్‌తో రైస్ పట్టి.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా
రైస్ పట్టి తయారీకి కావల్సినవి మిగిలిన అన్నం – కప్పు ; పచ్చి బఠాణి – అరకప్పు ; క్యారట్ – ఒకటి(సన్నగా తురమాలి) ; ఉడికించిన మటన్ ఖీమా – పావు కప్పు ; చీజ్ – ముప్పావు కప్పు ; గుడ్డు – ఒకటి ; గోధుమ పిండి – టేబుల్ స్పూను ; నూనె – మూడు టేబుల్ స్పూన్లు ; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: నూనె తప్పించి మిగతా పదార్థాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ∙ఈ మిశ్రమాన్ని పట్టిలా చేసుకోని రెండు వైపులా నూనె వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి తీసేయాలి. ∙సాస్, చట్నీ సర్వ్‌చేసుకోవాలి. -
బియ్యమో... రామచంద్రా!
గడచిన కొద్దిరోజులుగా అమెరికాలోని దుకాణాల వద్ద భారతీయుల భారీ క్యూలు ఓ హాట్ టాపిక్. రానున్న రోజుల్లో బియ్యానికి కొరత రావచ్చనే భయంతో, నిల్వ చేసుకొనేందుకు ప్రవాస భారతీయులు పెద్దయెత్తున కొనుగోళ్ళకు దిగడంతో తలెత్తిన దృశ్యమది. ఉరుము లేని పిడుగులా బాస్మతి బియ్యం మినహా మిగతా రకాల తెల్ల బియ్యం ఎగుమతుల్ని తక్షణమే నిషేధిస్తూ భారత సర్కార్ గత గురువారం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో రేపు ఇలాంటి దృశ్యాలు ఇంకేం తలెత్తు తాయో తెలీదు. అది ఫలించక ఇప్పుడు నిషేధమే విధించారు.. ప్రపంచ బియ్యం మార్కెట్‌ను ఇది ఆశ్చర్యపరిచినప్పటికీ, పెరిగిపోతున్న ధాన్యం ధరలను నియంత్రించడం రానున్న ఎన్నికల దృష్ట్యా పాలకులకు అనివార్యమైంది. దేశీయంగా సరఫరా పెంచడానికీ, ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేసేందుకూ బియ్యం ఎగుమతులపై ఈ తక్షణ నిషేధం ఉపకరిస్తుందని సర్కార్ భావన. అందుకే, 10 నెలల క్రితం బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం వేసి, ఆంక్షలు పెట్టిన పాలకులు అది ఫలించక ఇప్పుడు నిషేధమే విధించారు. భారత్ మాటెలా ఉన్నా ఇది ప్రపంచానికి ప్రాణసంకటమే. ఇటీవలే నల్లసముద్రపు ఆహార ధాన్యాల ఒప్పందాన్ని రష్యా రద్దు చేసుకోవడంతో వివిధ దేశాల్లో గోదుమలు, మొక్కజొన్నల ధర నింగికెగసింది. ఇప్పుడు భారత బియ్యం ఎగుమతి నిషేధమూ తోడయ్యేసరికి, ప్రపంచ ఆహార ధరలు ఇంకా పెరగవచ్చని ఆందోళన రేగుతోంది. Rice bag NRIs standing in line to collect rice in the US,just like how they stand in front of a ration shop.pic.twitter.com/L0YqEwqrsa— Брат (@B5001001101) July 25, 2023 అత్యధిక బియ్యం ఎగుమతి మన దేశం నుంచే.. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా బియ్యం ఎగుమత య్యేది మన దేశం నుంచే! ప్రపంచ పామాయిల్ ఎగుమతుల్లో ఇండొనేసియా, మలేసియా ఎలాగో బియ్యానికి సంబంధించి మనం అలా! ఎగుమతుల్లో 40 శాతానికి పైగా మన దేశానివే! ఇప్పుడు మన ఉత్పత్తుల్లో ఉన్నతశ్రేణిదిగా భావించే బాస్మతి మినహా మిగతా రకాల బియ్యానికి తాజా నిషేధం వర్తిస్తుంది. పెరిగిన అంతర్జాతీయ అమ్మకాలు సైతం ఈ నిషేధానికి కారణం. గత ఆర్థిక సంవత్సరం భారత్ నుంచి బియ్యం ఎగుమతులు 23 శాతం పెరిగాయి. ఈ ఏడాదిలో జూన్ వరకు మన బియ్యం అంతర్జాతీయ అమ్మకాలు 35 శాతం హెచ్చాయి. వెరసి, గత నెల రోజుల్లో దేశంలో బియ్యం రేటు 3 శాతం పెరిగింది. ఏడాది క్రితంతో పోలిస్తే 11.5 శాతం పెరిగిందని సర్కారే చెబుతోంది. అదేసమయంలో, దేశీయంగా వరి ఉత్పత్తి పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఒకపక్క పంజాబ్, హర్యానా లాంటి చోట్ల వర్షాలతో వరి పంట దెబ్బతింది. మరోపక్క అదనులో తగినంత వర్షాలు పడక కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు వగైరాల్లో వరి నాట్లు ఆలస్యమయ్యాయి. దీంతో భవిష్యత్తులో బియ్యం సరఫరాకు కొరత రావచ్చు. అదే జరిగితే నింగినంటుతున్న ధరలు నేలకు రావడం కష్టమే. ఎన్నికల వేళ అది దెబ్బ తీస్తుందని భావించిన పాలకులు ఎగుమతులపై నిషేధాస్త్రం సంధించారు. మన దేశపు బియ్యం ఎగుమతుల్లో 25 నుంచి 30 శాతం ఇప్పుడు నిషేధానికి గురైన ఈ బాస్మతీయేతర తెల్ల బియ్యమే. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మన దేశం 1.7 కోట్ల టన్నులకు పైగా బియ్యాన్ని భారత్ ఎగుమతి చేస్తోంది. నిషేధంతో ఈ ఎగుమతులు 40 శాతం పడిపోవచ్చు. ఈ నిషేధం తాత్కాలికమేనా? సహజంగానే దీనిపై దేశంలోని ఎగుమతిదారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ నిషేధం తాత్కాలికమేననీ, మహా అయితే ఆరు నెలల వరకే ఉండచ్చనీ, ప్రపంచ వాణిజ్య సంస్థ బరిలోకి దిగాక పరిస్థితి చక్కబడుతుందనే ఆశ లేకపోలేదు. బంగ్లాదేశ్, అంగోలా, గినియా, కెన్యా, నేపాల్ సహా 140కి పైగా దేశాలకు మన దేశం బియ్యం ఎగుమతి చేస్తోంది. థాయిలాండ్, వియత్నామ్, పాకిస్తాన్, మయన్మార్ లాంటి ఇతర ఎగుమతి దేశాలూ ఉన్నా భారత నిర్ణయంతో ఏర్పడ్డ లోటును అవి భర్తీ చేయలేవు. ఫలితంగా, విపణిలో ఇతర ఆసియా దేశాల నుంచి వచ్చే బియ్యం ధరలూ పెరిగాయి. బియ్యం ఎగుమతిలో ప్రపంచంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న థాయిలాండ్, వియత్నామ్‌ల బియ్యం రేటు హెచ్చింది. రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ నుంచి ఎగుమతులకు ఆటంకం చాలదన్నట్టు అమెరికాలో ధాన్యం పండించే ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావంతో సతమతమవుతున్నాయి. ఈసారి అమెరికాలో గోదుమల దిగుబడి తగ్గవచ్చు. 16 ఏళ్ళలో ఎన్నడూ లేనంత తక్కువకు నిల్వలు పడిపోవచ్చు. గోదుమలు, బియ్యం – రెంటికీ అగ్రరాజ్యంలో కటకట రావచ్చు. గత ఏడాది మేలో గోదుమల ఎగుమతిపై నిషేధం, సెప్టెంబర్‌లో విరిగిన బియ్యంపైన నిషేధం, బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం సుంకం విధింపు... ఆ వరుసలో వచ్చినదే భారత సర్కార్ తాజా ఉత్తర్వు. ఈ ఏడాది మే నుంచి పంచదార ఎగుమతుల్నీ ఆపారు. ఇవన్నీ తిరోగామి చర్యలైనా, దేశీయ సరఫరాలో ఇబ్బందులతో అనివార్యమైంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పుంజుకుంటున్నా, నాట్లలో జరిగిన జాప్యం దెబ్బతీయవచ్చు. ఇక, ఎల్‌నినో పొంచి ఉండనేవుంది. So it begins. India has banned some rice exports and now people are panic buying up rice. pic.twitter.com/ujpm66ER3n— Ian Miles Cheong (@stillgray) July 23, 2023 జబ్బలు చరుచుకున్నాం.. మరి నిషేధం విధించాల్సి రావడమేమిటి? వీటన్నిటి మధ్య ఈ ఏటి దిగుబడి పరిస్థితి ఏమిటో ఇప్పుడే చెప్పలేం. కానీ, గత ఆర్థిక సంవత్సరం బియ్యం, గోదుమలు – రెండూ ఎన్నడూ లేనంత అధిక దిగుబడినిచ్చాయని జబ్బలు చరుచుకున్నాం. ప్రపంచానికి మనమే ఆహారం అందిస్తున్నామన్నాం. తీరా అప్పుడు గోదుమలు, ఇప్పుడు బియ్యంపై ఇలా నిషే«ధం విధించాల్సి రావడమేమిటి? ఇది బేతాళ ప్రశ్న. అలాగే, ఏళ్ళ తరబడి కష్టంతో ప్రపంచ విపణిలో ఎగుమతిదారుగా సంపాదించుకున్న పేరుకు ఈ నిషేధపుటుత్తర్వులు చేటు చేస్తాయి. గుండుగుత్తగా ఎగుమతులపై నిషేధమనే కన్నా, నిర్ణీత కనీస ధరకు తక్కువైతే ఎగుమతుల్ని అను మతించబోమని చెప్పవచ్చు. దేశీయంగా ఆహార ధరలు నియంత్రించాలంటే పాలకులు ప్రత్యామ్నా యాలు ఆలోచించక తప్పదు. వాణిజ్య విధానాన్ని ఘడియకోసారి మార్చడం మార్గం కానే కాదు! -
కర్ణాటక స్టైల్లో.. మిగిలిపోయిన అన్నంతో రొట్టెలు
రైస్ రొట్టి తయారీకి కావల్సినవి: మిగిలిన అన్నం – మూడు కప్పులు ; ఉల్లిపాయ తరుగు – అరకప్పు ; క్యారట్ తురుము – కప్పు ; పచ్చిమిర్చి – నాలుగు (సన్నగా తరగాలి) ; అల్లం – అంగుళం ముక్క (తురమాలి) ; కరివేపాకు – మూడు రెమ్మలు ; కొత్తిమీర తరుగు – పావు కప్పు ; జీలకర్ర – అరటీస్పూను ; బియ్యప్పిండి – ముప్పావు కప్పు ; ఉప్పు – రుచికి సరిపడా ; నూనె – రొట్టి వేగడానికి సరిపడా. తయారీ విధానమిలా.. అన్నాన్ని నీళ్లు పోయకుండా పేస్టులా గ్రైండ్ చేయాలి. అన్నం పేస్టుని గిన్నెలో వేసి..ఉల్లిపాయ ముక్కలు , క్యారట్ తురుము, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, జీలకర్ర రుచికి సరిపడా ఉప్పువేసి చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా బియ్యప్పిండి వేసి ముద్దగా కలుపుకుని పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చేతులు తడిచేసుకుని పిండిని టెన్నిస్ బంతి పరిమాణంలో ఉండలుగా చేయాలి. ఈ ఉండలను అరిటాకు లేదా కవర్ మీద పెట్టి రొట్టెలా చేతితో వత్తుకోవాలి. పలుచగా వత్తుకున్న రొట్టెపై అక్కడక్కడ రంధాల్రు చేయాలి. ఈ రొట్టెను చక్కగా కాలిన పెనం మీద వేసి సన్నని మంట మీద కొద్దిగా నూనె వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుని వేడివేడిగా సర్వ్‌చేసుకోవాలి. -
బియ్యం ఎగుమతిపై ఇండియా బ్యాన్..!
-
ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న భారత్ నిర్ణయం - బియ్యం ధరల్లో పెనుమార్పులు!
ప్రపంచంలో అతి పెద్ద బియ్యం సరఫరాదారుగా ఉన్న భారత్ పెరుగుతున్న ధరలను అదుపులో ఉంచేందుకు ఎగుమతులను నిషేధించింది. ఈ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యాలు కూడా ఈ ప్రభావానికి గురయ్యాయి. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 40% వాటా కలిగి ఉన్న ఇండియా ఎగుమతులను నిలిపివేయడంతో ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. ఒక మెట్రిక్ టన్ను ధరలు కనిష్టంగా 50 డాలర్లు నుంచి 100 డాలర్లు ఎక్కువ ఉండవచ్చని సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ వ్యాపార సంస్థలో ఒక వ్యాపారి వెల్లడించారు. కాగా ఈ ధరలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేది మున్ముందు తెలియాల్సి ఉందని మరొకరు అభిప్రాయపడ్డారు. బియ్యం ఎగుమతులను నిషేధించాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం ప్రపంచ గోధుమ మార్కెట్లో బలమైన లాభాలను తీసుకు వస్తోంది. ఈ కారణంగానే గోధుమ ధరలు కూడా ఈ వారంలో 10 శాతం కంటే ఎక్కువ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోని దాదాపు 3 బిలియన్ల కంటే ఎక్కువ మంది వరి మీద ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 90 శాతం నీటి ఆధారంగా పెరిగే ఈ పంట దాదాపు ఎక్కువ భాగం ఆసియా ఖండంలో ఉత్పత్తవుతుంది. (ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!) ఇక ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఎగుమతిదారు అయిన థాయ్‌లాండ్, కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి ముందు ధరలను తెలుసుకోవడానికి సరఫరాదారులు వేచి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా దేశాల్లో బియ్యం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వియాత్నం, సింగపూర్ వంటి దేశాల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చదవండి: భారత్ బ్యాన్ డెసిషన్.. యూఎస్‌లో బియ్యం కష్టాలకు అసలు కారణం ఇదే.. -
యూఎస్‌లో బియ్యం కష్టాలకు అసలు కారణం ఇదే..
ఢిల్లీ: విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తీసుకున్న ఈ నిర్ణయం.. అమెరికాలో దావానంలా పాకింది. దీంతో ఎక్కడ బియ్యం కొరత.. సంక్షోభం తలెత్తుతాయనే భయంతో బియ్యం కోసం ఎగబడిపోతున్నారు మనవాళ్లు. ఈ క్రమంలోనే అమెరికాలో మునుపెన్నడూ కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికాలో బియ్యం స్టోర్ల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా.. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకించి సోనామసూరికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో భారతీయులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అమెరికాలో బియ్యం కోసం భారతీయులు.. ఎక్కువగా తెలుగువాళ్లు ఎగబడుతున్నారు. మార్ట్ల బయట క్యూలు కడుతున్నారు. అగ్రరాజ్యంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటికి తోడు ఎక్కడ బియ్యం సంక్షోభం వస్తుందనే భయంతో.. ఒక్కొక్కరు ఐదారు బాగ్యులకు మించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పరిమితంగా కొనుగోలు చేయాలనే నోటీసులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఇప్పటికే నో స్టాక్ బోర్డులూ కనిపిస్తున్నాయి. ఇక అదే అదనుగా.. అధిక ధరలు వసూలు చేస్తున్నారు. After Banning Rice Exports From India, Indians situation in USA to buy rice bags🥲 Those who are living in USA Immediately go to your nearby Indian Store and get some Rice Bags Before its too late🚨🚨#RiceBanInUSA pic.twitter.com/vAumv6fedv — Prabhas Fans USA🇺🇸 (@VinayDHFprabhas) July 21, 2023 భారత్ బియ్యానికే అగ్రతాంబూలం ప్రపంచంలో.. 90 శాతం బియ్యం ఆసియా నుంచే ఉత్పత్తి అవుతుండగా.. అందులో 45 శాతం వాటా భారత్‌దే. ఇక బాస్మతి బియ్యం ఉత్పత్తిలోనూ 80 శాతం భారత్‌దే ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్ ఉండగా.. 2012 నుంచి అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంటూ వస్తోంది. ఇక చైనా, థాయ్‌లాండ్, మెక్సికో తదితర దేశాల నుంచి బియ్యం ఎక్కువగా అమెరికా దిగుమతి చేసుకుంటుంది. అయితే.. మన బియ్యానికే అక్కడ క్రేజ్ ఎక్కువ. ఈ ప్రాధాన్యం ఇవ్వడంతోనే తాజా పరిస్థితి నెలకొంది. అందుకే నిషేధం ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. దీని వల్ల దేశంలో చాలా ప్రాంతాల్లో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాల మూలంగా చాలా చోట్ల పంట నష్టం జరిగింది. దీని వల్ల ఈ సారి దిగుబడులపై ప్రభావం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసుకుందని ప్రభుత్వం భావించింది. దీంతో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. విదేశాలకు నాన్-బాస్మతి బియ్యం ఎగమతులపై నిషేధం విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజీఎఫ్టీ) గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, తెల్లటి బియ్యంపై ఈ నిషేధం వర్తిస్తుంది. నోటిఫిికేషన్‌కు ముందే ఓడల్లోకి బియ్యాన్ని లోడ్ చేసి ఉంటే అలాంటి వాటిని అనుమతి ఇస్తామని తెలిపింది. ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దేశాలకు మాత్రం బియ్యం ఎగుమతులు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. తద్వారా దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు కొంత మేర తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. అయితే.. మన దేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించడం వల్ల మన దేశం నుంచి దిగుమతులు చేసుకునే దేశాల్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయని కేంద్రం ముందుగానే అంచనా వేసింది. అదే ఇప్పుడు నిజమవుతోంది. -
మార్కెట్లోకి కొత్త విత్తనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వరిలో 4, మినుములో 2, వేరుశనగ, పెసర, పొగాకులలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 వంగడాలను బుధవారం వ్యవసాయ శాఖ స్పెషల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మార్కెట్లోకి విడుదల చేశారు. వీటిని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నెల్లూరు, బాపట్ల, తిరుపతి, మారుటేరు, నంద్యాల, గుంటూరు లాం పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటి ప్రత్యేకతలను ఆర్బీకేల్లో ప్రదర్శించడంతో పాటు వీటి వినియోగాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, వీసీ విష్ణువర్థన్‌రెడ్డి, ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎల్.ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ సీడ్స్ ఎ.సుబ్బరావిురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేరుశనగలో.. టీసీజీఎస్ 1522: ఈ వంగడం కదిరి–6కు ప్రత్యామ్నాయం. తిరుపతి 4 ఎక్స్, కదిరి 9 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం ఖరీఫ్‌లో 100 నుంచి 103 రోజులు, రబీలో 103 నుంచి 106 రోజులు. దిగుబడి హెక్టార్‌కు ఖరీఫ్‌లో 3.328 టన్నులు, రబీలో 4.031 టన్నులు. ఆకుమచ్చ, తుప్పు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. కాయ నుంచి పప్పు దిగుబడి 75–76 శాతం, నూనె 48.5 శాతం, 100 గింజల బరువు 45–47 గ్రాములు, గింజలు లేతగులాబీ రంగులో ఉంటాయి. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. పొగాకులో.. ఏబీడీ 132(నంద్యాల పొగాకు–2): ఈ వంగడం నంద్యాల పొగాకు–1కు ప్రత్యామ్నాయం. లైన్ 3–58–38, ఎక్స్ లైన్ (190–27–5–7–32), ఎక్స్ (303–3–38–13–11–40) రకాల నుంచి అభివృద్ధి చేశారు. ఇది తక్కువ హాని కారకాలను కలిగి ఉంటుంది. కిలో ఆకు ధర రూ.85 నుంచి రూ.90 పలుకుతుంది. ఒరోబాంకీని మధ్యస్థంగా తట్టుకోవడమేకాదు.. ఆకు కోత వరకు పచ్చగా ఉండి.. అధిక వర్షపాత పరిస్థితులను తట్టుకుంటుంది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో బీడీ పొగాకు సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్‌లో సాగుకు అనుకూలం. పెసరలో.. ఎల్జీజీ 630: ఈ వంగడం ఎల్జీజీ 460, ఐపీఎం 2–14, టీఎం 96–2 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్జీజీ 460 ఎక్స్ పీ 109 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 65 నుంచి 70 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునే రకం. ఒకేసారి కోత కోయటానికి అనువైనది. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. మినుములో.. టీబీజీ 129: ఈ వంగడం ఎల్బీజీ 752కు ప్రత్యామ్నాయం. దీనిని పీయూ 31 ఎక్స్ ఎల్బీజీ 752 నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. ఎల్బీజీ 904: ఈ వంగడం ఎల్బీజీ 752, 787, పీయూ 31, టీబీజీ 104, జీబీజీ 1 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్బీజీ 645 ఎక్స్ టీయూ 94–2 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 2.20 నుంచి 2.50 టన్నులు. పల్లాకు తెగులుతో పాటు కొంత మేర తలమాడుతట్టుకునే రకం. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. నూతన వంగడాలు.. వాటి ప్రత్యేకతలు బీపీటీ 2841: ఈ వంగడం బర్మా బ్లాక్, కాలాబట్టి సాంప్రదాయ బ్లాక్ రైస్‌కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–7029, ఐఆర్జీసీ 18195, ఎంటీయూ–1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 130 నుంచి 135 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 5.50 నుంచి 6 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపుతో పాటు దోమపోటును కొంతమేర తట్టుకుంటుంది. గింజలు పగిలిపోవడం తక్కువ. ముడి బియ్యానికి అనుకూలం. మధ్యస్థ సన్న గింజ రకం. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ సాగుకు అనుకూలం. బీపీటీ 2846: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1061, ఐఆర్ 78585–64–2–4–3–1 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 నుంచి 150 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపు, దోమపోటు, ఎండాకు తెగులును కొంతమేర తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. మధ్యస్థ సన్న గింజ రకం. నిండు గింజల శాతం ఎక్కువ. ఏపీలో కృష్ణా, సదరన్ జోన్లలో ఖరీఫ్ సాగుకు అనుకూలం. ఎన్‌ఎల్‌ఆర్ 3238: బయో ఫోర్టిఫైడ్ స్వల్పకాలిక వరి రకమిది. బీపీటీ–5204, ఎంటీయూ 1010 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 120 నుంచి 125 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. ఇది కూడా చేనుపై వాలిపోదు. పాలిష్ చేసిన బియ్యంలో జింక్ మోతాదు 27–72 పీపీఎంగా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి నాణ్యతతో ఉంటాయి. అగ్గితెగులు, మెడవిరుపులను కొంత మేర తట్టుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగుకు అనుకూలం. ఎంటీయూ 1271: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1075, 1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. దోమ, ఎండాకు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. మధ్యస్థ సన్న గింజ రకం. ఇది కూడా చేనుపై వాలిపోదు. నిండు గింజల శాతం ఎక్కువ. సాగునీటి వసతులున్న లోతట్టు, అప్ల్యాండ్స్లో ఖరీఫ్ సాగుకు అనుకూలం. -
AP: తక్కువ రేట్లకే బియ్యం, కందిపప్పు విక్రయాలు
సాక్షి, అమరావతి : నిత్యావసరాల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా మిల్లర్లు, టోకు వ్యాపారులను ఇందులో భాగస్వాములను చేస్తోంది. మార్కెట్ ధరల కంటే 15–20 శాతం తక్కువ రేట్లకే బియ్యం, కందిపప్పును విక్రయించేలా ప్రోత్సహిస్తోంది. ఏపీలోని 26 జిల్లాల్లో శనివారం నుంచి తక్కువ ధరకు బీపీటీ, సూపర్ ఫైన్, ఫైన్ వెరైటీ బియ్యం విక్రయాలను ప్రారంభిస్తోంది. ఆయా జిల్లాల్లోని మార్కెట్ ధరల ప్రకారం జాయింట్ కలెక్టర్లు ఈ సబ్సిడీ రేట్లను నిర్ణయిస్తారు. ప్రత్యేక కౌంటర్లలో.. దేశవ్యాప్తంగా గడిచిన రెండు నెలలుగా నిత్యావసరాల ధరలు వేగంగా పెరిగాయి. ఒక్కసారిగా బియ్యం, కందిపప్పు ధరలు అమాంతం పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలపై అధిక రేట్ల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గత మూడ్రోజులుగా పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు, టోకు వ్యాపారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా బియ్యం, కందిపప్పును మార్కెట్ ధర కంటే తక్కువకు విక్రయించాలని కోరగా.. అందుకు వ్యాపారులు ముందుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు రైతుబజార్లు, కళ్యాణమండపాలు, రద్దీగా ఉండే మార్కెట్లు, వ్యాపారుల దుకాణాల ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ రేట్లకు బియ్యం, కందిపప్పును విక్రయించనున్నారు. ఒక వ్యక్తికి గరిష్టంగా ఒక కేజీ కందిపప్పు, 10 కేజీల ఫైన్ వెరైటీ బియ్యాన్ని అందిస్తారు. వ్యాపారులను సమన్వయం చేస్తూ.. కొన్ని జిల్లాల్లో ఫైన్ వెరైటీ బియ్యం రకాల్లేవు. అయితే, వాటిని ఇతర జిల్లాల నుంచి వ్యాపారులతో కొనుగోలు చేయించి ప్రజలకు విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేస్తుంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పప్పుమిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ చర్యలతో ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు సైతం తక్కువ రేటుకు కందిపప్పును విక్రయించేందుకు అంగీకరించారు. దీంతో అక్కడి నుంచి కందిపప్పు నిల్వలను మార్కెట్లోకి తరలిస్తారు. ఇక వచ్చే సోమవారం నుంచి కందిపప్పును పూర్తిస్థాయిలో తక్కువ రేటుకు అందిస్తారు. కార్పొరేషన్.. కొత్త బ్రాండ్.. ఏపీ పౌరసరఫరాల సంస్థ సైతం సొంత బ్రాండింగ్‌తో బియ్యం రకాలను విక్రయించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఇప్పటికే కర్నూలు నుంచి 50 టన్నుల బీపీటీ రకం ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వాటిని మిల్లింగ్ చేయగా 32 టన్నుల బియ్యం వస్తున్నట్లు గుర్తించారు. వీటిని పైలెట్ ప్రాజెక్టు కింది ప్రత్యేక ప్యాకింగ్‌లో మార్కెట్ రేటు కంటే తక్కువకు విక్రయించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే సీజన్ నుంచి పౌరసరఫరాల సంస్థ స్థానిక రైతుల నుంచి కందులను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయనుంది. అవసరమైతే మద్దతు ధరకు మించి మార్కెట్ రేటు ఉన్నా కొనుగోలు చేసి ప్రజా ప్రజలకు చేర్చనుంది. నవంబర్, డిసెంబర్లలో కందుల సేకరణకు ప్రత్యేకంగా కార్పస్ పెట్టడంతో పాటు కొనుగోలు చేసిన వెంటనే రైతులకు నగదు చెల్లించేలా ప్రతిపాదనలు రూపొందిస్తోంది. నిల్వలపై పటిష్ట నిఘా వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి నిత్యావసరాల రేట్లను పెంచకుండా పౌరసరఫరాల శాఖ పటిష్ట నిఘా ఏర్పాటుచేసింది. వివిధ వర్గాల వ్యాపారుల వద్ద సరుకు నిల్వలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ http://fcainfoweb. nic.in/pspలో వెబ్సైట్లో నమోదు చేయాలని హెచ్చరిస్తోంది. నిల్వలు అధికంగా ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. గుంటూరు కోల్డ్ స్టోరేజీల్లోని కందుల నిల్వలను సైతం తనిఖీచేసి వాటిని కూడా బయట మార్కెట్లోకి తరలించనుంది. 111 ప్రత్యేక కౌంటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా సీఎస్ఆర్ ద్వారా చౌకగా బియ్యం, కందిపప్పు విక్రయాలకు వీలుగా 111 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు. ఇందులో 42 రైతుబజార్లలో, 56 ఓపెన్ మార్కెట్లలో ఉన్నాయి. వీటిల్లో సూపర్ ఫైన్ వెరైటీలతో పాటు బీపీటీ, సోనా మసూరి, సాంబామసూరి, ఆర్జీఎల్, స్టీమ్డ్ బియ్యం రకాలను అందుబాటులో ఉంచనున్నారు. కేవలం ప్రజల కోసమే.. ప్రజలకు నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉంచేందుకు మిల్లర్లు, వ్యాపారులతో చర్చించాం. వారి ద్వారా మార్కెట్ రేటు కంటే 15–20 శాతం తక్కువకు సరుకులు అందిస్తాం. ప్రజల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. హోల్‌సేల్ వ్యాపారులు ఈ విక్రయాలను కేవలం ప్రజల కోసమే చేపడుతున్నారు. – హెచ్.అరుణ్‌కుమార్,కమిషనర్, పౌరసరఫరాల సంస్థ -
Coconut Rice Balls: పసందైన స్నాక్స్.. కమ్మని కోకోనట్ రైస్ బాల్స్
కోకోనట్ రైస్ బాల్స్ కావల్సినవి: కొబ్బరి పాలు – ముప్పావు కప్పు బియ్యప్పిండి – అర కప్పు జొన్న పిండి – 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు – తగినంత కొబ్బరి కోరు, కాచిన పాలు – కొద్దికొద్దిగా (గార్నిష్‌కి అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా.. ముందుగా కొబ్బరి పాలలో కొద్దిగా ఉప్పు వేసుకుని.. చిన్న మంట మీద మరిగించాలి. అనంతరం బియ్యప్పిండి వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గర పడే సమయంలో మళ్లీ జొన్న పిండి వేసి తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గర పడిన తర్వాత చల్లార్చి.. చేతులకు నూనె రాసుకుని.. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని ఆవిరిపై బాగా ఉడికించుకుని.. వేడివేడిగా ఉన్నప్పుడు గరిటె సాయంతో ఒక్కో బాల్ని పాలలో ముంచి.. కొబ్బరి కోరు పట్టించి సర్వ్ చేసుకోవచ్చు. అభిరుచిని బట్టి ఆవిరిలోంచి తియ్యగానే.. తాలింపు వేసుకోవచ్చు. లేదా బెల్లం పాకంలో వేసుకుని, నానిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. -
మిల్లర్ల బకాయిలు రూ. 2,072 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. వేల కోట్లలో బకాయి పడ్డారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు. దీంతో 2019 యాసంగి నుంచి 2022 యాసంగి వరకు పౌరసరఫరాల సంస్థకు రూ. 2,072 కోట్ల విలువైన 5.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిపడ్డారు. ఈ మొత్తం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన నగదును 25 శాతం జరిమానాతో డిఫాల్ట్ అయిన మిల్లుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి హోదాలో కమిషనర్ అనిల్ కుమార్ ఇప్పటివరకు నాలుగు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఆయా మిల్లులకు రికవరీ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ బియ్యం విలువే రూ. 1,630 కోట్లు 2021–22 యాసంగికి సంబంధించి 2,37,310 మెట్రిక్ టన్నుల బియాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉండగా ఈ గడువు గత మే నెలాఖరుతో ముగిసింది. దీంతో ఈ బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో రికవరీ చేయాలని లేదంటే బియ్యం విలువ రూ. 842.09 కోట్లను 25 శాతం పెనాల్టితో వసూలు చేయాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గత నెల 23న 2021–22 వానాకాలానికి సంబంధించిన 2.22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో 494 మిల్లుల నుంచి రికవరీ చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ బియ్యం విలువ రూ. 787.67 కోట్లు. ఈ రెండు సీజన్లలోనే రూ. 1,630 కోట్ల వరకు రావాల్సి ఉంది. 2019 యాసంగి బకాయి 48,762 మెట్రిక్ టన్నులు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2019 యాసంగి సీజన్‌కు సంబంధించి 118 మిల్లుల నుంచి సీఎంఆర్ కింద లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలోనే పెనాల్టీతో 125 శాతం రికవరీ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ మిల్లులు గడువులోగా బియ్యం ఇవ్వకపోవడంతో నెలకోసారి గడువును పెంచుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ నెలలో 14 మిల్లులు 125 శాతం బియ్యం రికవరీ చేశాయి. మరో 89 మిల్లులు 100 శాతం రికవరీ కింద సర్కారుకు సీఎంఆర్ అప్పగించాయి. ఇంకా 15 మిల్లులు ఎలాంటి రికవరీ చేయలేదు. దీంతో ఇంకా 48,762 మెట్రిక్ టన్నుల బియ్యం ఆయా మిల్లుల నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికీ ఈ మిల్లులకు పెండింగ్ సీఎంఆర్ రికవరీ చేసుకొనే అవకాశం ఇస్తూ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 2020–21 సంవత్సరం యాసంగికి సంబంధించి మరో 73 మిల్లుల నుంచి 75,878 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా ఈ మొత్తాన్ని కూడా పెనాల్టితో 125 శాతం రికవరీ చేయాలని సైతం ఈ నెల 19నే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన బియ్యం 1.25 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ బియ్యం విలువనే రూ. 442 కోట్లు. 25 శాతం నగదు... 100 శాతం బియ్యం రికవరీ డిఫాల్ట్ మిల్లర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేసే ప్రక్రియలో ముందుగా 25 శాతం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన మొత్తాన్ని పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తేనే తరువాత సీజన్‌కు మళ్లీ సీఎంఆర్ ఇచ్చేందుకు వీలు కలుగుతుంది. అయితే 25 శాతం పెనాల్టిలో ఐదు శాతమే ఇప్పటికిప్పుడు ఇవ్వడం, మిగతా పెనాల్టీ మొత్తాన్ని 4 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉండటంతో మిల్లర్లు ఇదే అదనుగా వ్యాపారాన్ని య«థేచ్ఛగా సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. -
బియ్యం ఇవ్వలేం!
సాక్షి, హైదరాబాద్: దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని ఓవైపు పాలకులు చెబుతుంటే.. మరోవైపు పక్క రాష్ట్రాలు తమ అవసరార్ధం కొనుగోలు చేస్తామన్న బియ్యం కూడా అందించలేక అధికార యంత్రాంగం సతమతమవుతోంది. కర్ణాటకలో ఎన్నికల హామీ అయిన ‘అన్న భాగ్య పథకం’కింద రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి అదనంగా 5 కిలోలు ఇచ్చేందుకు ఆ రాష్ట్రంలో బియ్యం అందుబాటులో లేవు. అలాగే తమిళనాడుకు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇచ్చేందుకు బియ్యం అవసరమయ్యాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల పౌరసరఫరాల సంస్థలూ తెలంగాణను సంప్రదించాయి. దీంతో పౌరసరఫరాల సంస్థ గోడౌన్లలో మూలుగుతున్న బియ్యం ని ల్వలను, మిల్లులు బకాయి పడిన లక్షల టన్నుల బియ్యా న్ని సేకరించి ఈ రెండు రాష్ట్రాలకు పంపించాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్.. సంస్థ ఎండీ, కమిషనర్ అనిల్‌కుమార్‌కు సూచించారు. అయితే బియ్యం పంపడం సాధ్యం కాదంటూ కమిషనర్ చేతులెత్తేసినట్లు సమాచారం. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన పౌరసరఫరాల సంస్థ సమీక్ష సమావేశంలోనూ ఆయ న ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో మంత్రులు గంగుల, హరీశ్‌రావు, సీఎస్ సమావేశమై దీనిపై చర్చించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. 33 లక్షల మెట్రిక్ టన్నులు కావాలన్న రెండు రాష్ట్రాలు: కర్ణాటకకు నెలకు 2.18 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) బియ్యం అవసరం ఉందంటూ ఆ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల సంస్థ ఎండీ ఈ నెల 3న అనిల్‌కుమార్‌కు లేఖ రాశారు. ఈ లెక్కన సంవత్సరానికి 27 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. అలాగే తమిళనాడు నుంచి కూడా ఈ నెల 23న ఒక లేఖ అందింది. రాష్ట్ర పీడీఎస్ అవసరాల కోసం 4 ఎల్ఎంటీల బాయిల్డ్ రైస్, 2 ఎల్ఎంటీల ముడి బియ్యం అవసరం అని ఆ రాష్ట్రం కోరింది. రాష్ట్ర మిల్లర్ల నిర్వాకంతోనే వెనకడుగు? తెలంగాణలో ఏటా సగటున కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్‌కు వస్తోంది. ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే వచ్చే 67 శాతం బియ్యం లెక్కన ఏటా సుమారు కోటి మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుంది. ఇందులో ఎఫ్‌సీఐకి 50 ఎల్ఎంటీ అప్పగించినా, మరో 50 ఎల్ఎంటీ వరకు స్టేట్ పూల్ కింద రాష్ట్రం వద్దనే ఉంటుంది. అయితే మిల్లర్లు నాణ్యమైన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం, రోజుకు కనీసం 8 నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల మేర కూడా ఎఫ్‌సీఐకి అప్పగించకపోవడం వంటి కారణాలతో ఒక సీజన్ ధాన్యం సీఎంఆర్‌గా ఎఫ్‌సీఐ గోడౌన్లకు చేరుకునేందుకు 18 నెలల వరకు పడుతోంది. ఈ పరిస్థితుల్లో మిల్లర్ల మీద నమ్మకంతో పక్క రాష్ట్రాలకు విక్రయించే ఒప్పందాలు చేసుకుంటే ఇబ్బందులు తప్పవని కమిషనర్ భావిస్తున్నట్లు సమాచారం. మిల్లర్లు 2021–22 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 4.5 ఎల్ఎంటీ బియ్యం ఇవ్వాల్సి ఉంది. 2019–20, 21 బాపతు బియ్యం 1.25 ఎల్ఎంటీలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బియ్యాన్ని 25 శాతం అదనపు జరిమానాతో వసూలు చేసినా, అది పౌరసరఫరాల సంస్థ ద్వారా పీడీఎస్‌కు తరలుతుంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌సీఐకి ఇచ్చే బియ్యంలో కోత పెట్టడం ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు అవకాశాలున్నాయని కొందరు అధికారులు చెబుతున్నారు. అలాగే మిల్లర్లపై ఒత్తిడి పెంచి ఏ సీజన్ బియ్యం ఆ సీజన్లో మిల్లింగ్ చేయిస్తే పక్క రాష్ట్రాలకు విక్రయించడం కష్టం కాదని ఓ రిటైర్డ్ అధికారి వ్యాఖ్యానించారు. బియ్యానికి బదులు డబ్బులు అన్న భాగ్య పథకంపై కర్ణాటక నిర్ణయం బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న హామీల్లో ఒకటైన అన్న భాగ్య పథకం అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పథకం ప్రకారం దారిద్య్ర రేఖకి దిగువన ఉన్న కుటుంబాలకు అయిదు కేజీలు అదనంగా బియ్యం ఇవ్వాల్సి ఉంది.జూలై 1 నుంచి ఈ పథకం అమలు చేయాల్సి ఉండగా బియ్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తడంతో బియ్యానికి బదులుగా డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన కర్ణాటక రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేజీ బియ్యానికి రూ.34 చొప్పున 5 కేజీలకయ్యే ధర మొత్తం వారి ఖాతాల్లో వేయనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి కె.హెచ్. మునియప్ప విలేకరులకు వెల్లడించారు.‘‘రాష్ట్ర అవసరాలకు సరిపడా బియ్యాన్ని ఇవ్వడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం కేజీ బియ్యం ధర రూ.34. అవసరమైన బియ్యం ప్రభుత్వం సేకరించే వరకు అర్హులైన లబ్దిదారులందరికీ బియ్యానికి బదులుగా డబ్బులు ఇస్తాం’’ అని వివరించారు. ఒక కార్డులో ఒకే వ్యక్తి ఉంటే రూ.170, ఇద్దరు ఉంటే రూ.340, ఒకవేళ అయిదుగురు సభ్యులుంటే వారి ఖాతాలో రూ.850 వేస్తామని మంత్రి వివరించారు. -
రేషన్ షాపునకు ముక్కిన బియ్యం సరఫరా
అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం మండలం చిల్వెర గ్రామంలోని రేషన్ షాపునకు రెండు నెలల క్రితం ముక్కిన బియ్యం సరఫరా చేశారు. వాటిని తీసుకొని ఏం చేసుకోవాలని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్ నర్సింహులు విషయాన్ని అధికారులకు తెలపడంతో బియ్యాన్ని గోదాంకు తిరిగి పంపించాలని సూచించారు. ఎఫ్‌సీఐ గోదాం ఇన్చార్జిని సంప్రదిస్తే రేపు మాపు అంటూ రెండు నెలలు కాలయాపన చేశాడు. మంగళవారం డీలర్ స్వయంగా 10 క్వింటాళ్ల ముక్కిన బియ్యం బస్తాలు పెద్దశంకరంపేట ఎఫ్‌సీఐ గోదాంకు తీసుకెళ్లాడు. ఈ బియ్యానికి తనకు సంబంధం లేదని, మీరే ఏమైనా చేసుకోవాలని గోదాం ఇన్చార్జి తేల్చి చెప్పాడు. దీంతో ముక్కిన బియ్యాన్ని డీలర్ అక్కడే పడేసి వచ్చాడు. అధ్వాన్న బియ్యం సరఫరా చేస్తూ గోదాం ఇన్చార్జిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. -
బడుగు వర్గాలపై ప్రధాని మోదీ కక్ష సాధింపు
న్యూఢిల్లీ: ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(ఓఎంఎస్ఎస్) కింద రాష్ట్రాలకు ఇచ్చే బియ్యం, గోధుమలను ఇకపై ఇవ్వకుండా కేంద్రం నిలిపివేయడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ గురువారం తప్పుపట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ప్రధాని మోదీ మనోవేదనకు గురవుతున్నారని, అందుకే బడుగు వర్గాల ప్రజలపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. కర్ణాటకకు కేంద్రం బియ్యం ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడాన్ని మోదీ సహించలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు సెంట్రల్ పూల్ నుంచి బియ్యం, గోధుమల పంపిణీని కేంద్రం నిలిపివేసింది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం దీనివల్ల నష్టపోనుంది. -
తనిఖీ అధికారి యమ.. స్పీడ్..! ఇట్టే పసిగడుతుంది..! వీడియో వైరల్..
సామాజిక మాధ్యమాల్లో కంటెంట్ ఒక్కోసారి విభిన్నరీతిలో వైరల్ అవుతోంది. ఒక్కోసారి చెప్పలేం ఏ కంటెంట్ వైరల్ అవుతుందో? ఎందుకు ఆ కంటెంట్‌ను వీక్షకులు ఇష్టపడుతున్నారో? తాజాగా ఓ క్యాలిటీ చెకింగ్ వీడియోకు గొప్పగా ఆదరణ లభించింది. కేవలం పది రోజుల్లోనే 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంతకూ ఈ వీడియోలో ఉన్న విషయం ఏంటంటే..? క్యాలిటీ చెకింగ్ ఆఫీసర్ పనేంటో తెలుసు కదా? పదార్థం నాణ్యతను తనిఖీ చేస్తుంటారు. వీడియోలో బియ్యం గోదాంలో బియ్యం క్వాలిటీని చెకింగ్ చేస్తుంది ఓ అమ్మాయి. అయితే.. కార్మికులు వరుసగా బియ్యం సంచులను మోసుకుంటూ వెళుతుండగా.. ఆవిడ ఒక్కరే అందరి సంచుల్లోని బియ్యాన్ని చాలా వేగంగా తనిఖీ చేస్తోంది. నాణ్యత సరిగా లేని బియ్యం సంచిని పక్కకు తీసుకురమ్మని ఆదేశిస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈవిడ స్పీడ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Tech | Engineering | Gadgets (@techniiverse) ఇదీ చదవండి: ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..! -
TS: క్వింటాల్ పత్తి రూ.8 వేలు!.. వరి, కంది ధరలు ఇలా..
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమవుతోంది. త్వరలో రాష్ట్రానికి రుతుపవనాలు రానున్నాయి. రైతులు సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విత్తనాలు కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ సీజన్లో ఏ పంటలు వేయాలన్న దానిపై రైతుల్లో కొంత గందరగోళం నెలకొంది. కొందరు అవగాహన లేకపోవడం వల్ల ఏదో ఒక పంట వేసి నష్టపోతుంటారు. కొందరు సరైన అవగాహన, ప్రణాళికతో మంచి లాభాలు పొందుతుంటారు. కోతలు ముగిసే సమయానికి ఏ పంటకు ఎంత ధర ఉండే అవకాశం ఉందో ముందుగా అంచనా వేయగలిగితే.. రైతులు ఆ ప్రకారం పంటలు సాగు చేసుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో 15 నుంచి 21 ఏళ్ల నెలవారీ ధరలను విశ్లేషించింది. ఈ విశ్లేషణ ఫలితాలు, మార్కెట్ సర్వేలను పరిశీలించి 2023–24 వానాకాలం (ఖరీఫ్) పంటల ధరలు ఏ విధంగా ఉండవచ్చో అంచనా వేసింది. వరంగల్ ప్రధాన మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే నవంబర్–ఫిబ్రవరి మధ్య కాలంలో పత్తి ధర క్వింటాల్‌కు రూ.7,550 నుంచి రూ.8,000 వరకు ఉంటుందని తెలిపింది. దీనితో పాటు వరి, మిర్చి, కంది తదితర పంటల ధరలను కూడా అంచనా వేసింది. అయితే పంట రకం, నాణ్యత, అంతర్జాతీయ ధరలు, ఎగుమతి లేదా దిగుమతి పరిమితులపై ఆధారపడి అంచనా ధరల్లో మార్పు ఉండొచ్చని పేర్కొంది. కాగా వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం అంచనాల ప్రకారం..ఏయే పంటలు వేయాలో నిర్ణ యం తీసుకుని రైతులు సాగుకు సన్నద్ధం కావాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవ సాయ విశ్వవిద్యాలయం సూచించింది. మద్దతు ధరల కంటే ఎక్కువే.. ఈ ఏడాది రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు అయ్యేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు రైతులకు సూచిస్తున్నారు. ఆ తర్వాత వరి ఎలాగూ భారీగానే సాగవుతుంది. కాబట్టి పత్తి తర్వాత కంది సాగును కూడా పెంచాలనేది సర్కారు ఉద్దేశం. కాగా ఖరీఫ్‌లో పత్తి, వరి, కంది పంటలకు మద్దతు ధరకంటే ఎక్కువ ధరలే లభిస్తాయని వ్యవసాయ మార్కెట్ ఇంటిలిజెన్స్ కేంద్రం అంచనా వేయడం గమనార్హం. పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,380గా ఉంది. అయితే 2021–22 వానాకాలం సీజన్లో పత్తి ధర మార్కెట్లో ఏకంగా రూ.12 వేల వరకు పలికింది. దీంతో రైతులు గత సీజన్లో అంత ధర వస్తుందని భావించారు. కానీ రూ. 7–8 వేలకు మించలేదు. దీంతో చాలామంది రైతులు మంచి ధర కోసం ఎదురుచూస్తూ పత్తిని ఇళ్లల్లోనే దాచుకున్నారు. అందులో చాలావరకు పాడైపోయింది. ఇక ఈసారి కూడా పత్తి ధర రూ.8 వేల వరకు ఉంటుందని వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం ప్రకటించడంతో రైతులు పత్తి సాగుకు ఏ మేరకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: నైరుతి రాక.. జూన్ రెండో వారం నుంచి వానలు!