ప్రపంచంలోనే ఖరీదైన బియ్యం | Most Expensive Rice in the World | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే ఖరీదైన బియ్యం

Published Sun, Oct 27 2024 10:52 AM | Last Updated on Sun, Oct 27 2024 11:21 AM

Most Expensive Rice in the World

జపాన్‌లో పండించే ‘కిన్‌మెమాయి’ అనే రకానికి చెందిన ఈ బియ్యం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం. జపాన్‌లోని టోయో రైస్‌ కార్పొరేషన్‌ ఐదు రకాల వరి వంగడాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసి, పండిస్తోంది. ఈ బియ్యం కిలో ప్యాకెట్లలోను, బస్తాల్లో కాకుండా, 140 గ్రాముల ఆరు సాచెట్లు నింపిన ప్యాకెట్లలో విక్రయిస్తుండటం విశేషం. 

టోయో రైస్‌ కార్పొరేషన్‌ పేటెంట్‌ పొందిన ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఈ బియ్యం గింజల పొట్టు పూర్తిగా తొలగించకుండా ప్యాక్‌ చేస్తుంది. ఈ కిన్‌మెమాయి’ బియ్యం గింజలు చిన్నగా ఉంటాయి. మిగిలిన రకాల బియ్యంతో పోల్చుకుంటే, కిన్‌మెమాయి రకం బియ్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని, దీని రుచి కూడా చాలా బాగుంటుందని టోయో రైస్‌ కార్పొరేషన్‌ చెబుతోంది. ఈ బియ్యం ధరలు రకాన్ని బట్టి కనీసం కిలోకు 109 డాలర్ల నుంచి 155 డాలర్ల (రూ.9,135 నుంచి రూ. 12,990) వరకు ఉంటాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement