Japan
-
ఒసాకా–కన్సాయ్ ఎక్స్‌పోకు సీఎం
సాక్షి, హైదరాబాద్: జపాన్‌లో జరిగే ఒసాకా–కన్సాయ్ ఎక్స్పో– 2025కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెళ్లనున్నారు. ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరి వారు జపాన్ వెళ్తారు. వారి వెంట పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం కార్యాలయ అధికారి అజిత్‌రెడ్డి కూడా వెళ్తారని సమాచారం. ఈ నెల 13వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తెదీ వరకు జరిగే ఈ ఎక్స్‌పోలో వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. భారత్ నుంచి కూడా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొననున్నట్లు సమాచారం.రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించేందుకు ఒసాకా షోను వేదిక చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దావోస్ వెళ్లిన రెండు దఫాల్లోనూ దాదాపు రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదర్చుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒసాకా ఉత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారని సమాచారం. తెలంగాణలో ప్రభుత్వం ఏయే రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తుంది? ఇక్కడ ఉన్న పెట్టుబడి వాతావరణం, స్కిల్డ్, అన్‌స్కిల్డ్ లేబర్‌తోపాటు, విద్యుత్, నీటి సరఫరా, భూముల కేటాయింపు, అనుమతులు, రాయితీలు తదితర అంశాలపై రాష్ట్ర బృందం ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. గతంలో రాష్ట్రం నుంచి ఇలాంటి షోకేస్ చేసే ప్రయత్నం జరగలేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. నేడు అహ్మదాబాద్‌కు సీఎం: సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం అహ్మదాబాద్ వెళ్లనున్నారు. మంగళ, బుధవారాల్లో అక్కడ జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసిసి సమావేశాల్లో పాల్గొనేందుకు ఉదయం ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సమావేశాల డ్రాఫ్ట్ కమిటీలో సభ్యులుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దామోదర్ రాజనర్సింహ, వంశీచంద్‌రెడ్డి ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడి హోదాలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. బుధవారం జరిగే ఏఐసిసి సమావేశానికి రాష్ట్రం నుంచి ఏఐసీసీలో ప్రాతినిధ్యం వహిస్తున్న 41 మందితోపాటు ప్రత్యేక ఆహ్వనితులుగా రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు హాజరుకానున్నారు. వీరంతా మంగళవారం అహ్మదాబాద్ బయలుదేరుతున్నారు. -
సముద్రంలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి
టోక్యో: జపాన్‌లో హెలికాప్టర్ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మెడికల్ హెలికాప్టర్ సముద్రంలో కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మరో ముగ్గురిని సహాయక బృందాలు రక్షించాయి. మృతిచెందిన వారిలో వైద్యుడి కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. జపాన్‌లో సాధారణంగా డాక్టర్ హెలికాప్టర్ అని పిలువబడే విమానం Medevac EC-135 ప్రమాదానికి గురైంది. ఆదివారం నాగసాకి ప్రిఫెక్చర్‌లోని విమానాశ్రయం నుండి ఫుకుయోకాలోని ఆసుపత్రికి రోగులను తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. నైరుతి జపాన్ ప్రాంతంలోని సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన జపాన్ కోస్ట్ గార్డ్, సహాయక బృందాలు ముగ్గురిని కాపాడారు.అనంతరం, ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. మృతిచెందిన వారిలో వైద్య వైద్యుడు కీ అరకావా (34), రోగి మిత్సుకి మోటోయిషి (86), ఆమె సంరక్షకురాలు కజుయోషి మోటోయిషి (68) ఉన్నారని అధికారులు తెలిపారు. తరువాత వారి మృతదేహాలను జపాన్ ఎయిర్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా నీటి నుండి వెలికితీశారు. ప్రాణాలతో బయటపడిన వారిలో హెలికాప్టర్ పైలట్ హిరోషి హమడ (66), మెకానిక్ కజుటో యోషిటకే, నర్సు సకురా కునిటకే(29) ఉన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ముగ్గురు హైపోథర్మియాకు గురయ్యారని వైద్యులు వెల్లడించారు. #Breaking A Medevac EC-135 crashed off Nagasaki (Japan). 3 of 6 aboard died. Helicopter had been missing east of Tsushima island, found floating upside fown near Iki island. Helicopter [Registration “JA555H”] was operated by “SGC Saga Aviation opf Fukuoka Wajiro Hospital” pic.twitter.com/M5J4t7vf0H— Air Safety #OTD by Francisco Cunha (@OnDisasters) April 6, 2025 -
జపాన్ పర్యటనకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి 22 వరకు జపాన్‌లో పర్యటించనున్నారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు అధికారులు పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 15వ తేదీన జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్.. జపాన్‌లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. అలాగే, తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరే అవకాశం ఉంది. -
Japan: మెగా సునామీ వార్నింగ్
-
జపాన్‌లో భారీ భూకంపం
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్‌లోని క్యూషు కేంద్రంగా భూమి కంపించింది. ఈ ఏడాది జనవరిలో కూడా జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం జరిగింది.గత ఏడాది ఆగస్టులోనూ జపాన్‌లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. 6.9, 7.1 తీవ్రతతో ఏర్పడిన రెండు శక్తిమంతమైన భూకంపాలు నైరుతి దీవులైన క్యూషు, షికోకులను ప్రభావితం చేశాయి. గత ఏడాది జనవరి 1న 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 300 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.ఏఎఫ్‌పీ (Agence France-Presse) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్‌లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని, మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుందని పేర్కొంది.కాగా, ఇటీవల మయన్మార్ (Myanmar)లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్‌లో సంభవించిన భూకంపం థాయిలాండ్‌లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది. -
పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం?
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో మహా భూకంపం (Mega quake) రానుందా? దీని తీవ్రతకు 3,00,000 మంది ప్రాణాలు కోల్పోనున్నారా? లెక్కలేనన్ని నగరాలు సముద్రంలో మునిగిపోతాయా? ఈ సామూహిక విధ్వంసానికి సమయం ఆసన్నమయ్యిందా?.. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రశ్నలకు ‘అదే జరగవచ్చు’ అంటూ జపాన్ తన అంచనాలను, భవిష్యవాణిని వెల్లడించింది. ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ (Agence France-Presse) (ఏఎప్పీ) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్‌లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసింది. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని, మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుంది.ఇటీవల మయన్మార్ (Myanmar)లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్‌లో సంభవించిన భూకంపం థాయిలాండ్‌లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను మరువక ముందే జపాన్ మహాభూకంపం అంచనాలను చెప్పడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు.జపాన్ ప్రభుత్వం (Japanese Government) తమ దేశ పసిఫిక్ తీరంలో వినాశకరమైన మెగా క్వేక్ సంభవించవచ్చని తెలిపింది. దీని కారణంగా సునామీ వస్తుందని, ఇదే జరిగితే జపాన్‌లో లక్షలాది మంది ప్రజలు కొన్ని నిమిషాల్లోనే మృత్యువాత పడతారని పేర్కొంది. మృతదేహాలను లెక్కించడం కూడా కష్టమయ్యేంత విధ్వంసం జరుగుతుందని అంచనా వేసింది. జపాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు నాశనమవుతుందని పేర్కొంది. అందుకే మెగా భూకంపాన్ని ఎదుర్కొనేందుకు సన్నాహాలు ఇప్పటి నుంచే ప్రారంభించినట్లు వెల్లడించింది.భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. వార్తా సంస్థ ఏఎప్పీ నివేదిక ప్రకారం జపాన్‌లో 9 తీవ్రతతో భూకంపం సంభవిస్తే, 13 లక్షల మంది నిరాశ్రయులు కానున్నారు. భవనాలు కూలిపోవడం వల్ల సుమారు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే జపాన్ ఆర్థిక వ్యవస్థ 2 ట్రిలియన్ డాలర్లు (అంటే రూ. 171 లక్షల కోట్లకు పైగా) నష్టపోతుంది. ఈ నష్టం నుండి కోలుకోవడం జపాన్‌కు చాలా భారంగా మారుతుంది.ఇది కూడా చదవండి: చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్ -
RRR చూసి తెలుగు నేర్చుకున్న జపాన్ అభిమాని.. తారక్ ఎమోషనల్
దేవర సినిమా ప్రమోషన్స్ కోసం హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నాడు. అక్కడి అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఆటోగ్రాఫ్స్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని ప్రేమను చూసి తారక్ పొంగిపోయాడు. 'జపాన్ పర్యటించినప్పుడల్లా ఎన్నో జ్ఞాపకాలు కూడగట్టుకుంటాను. కానీ ఈసారి అంతకుమించి సంతోషమేసింది. ఆర్ఆర్ఆర్ చూసి తెలుగు నేర్చుకున్న అభిమానిజపనీస్ అభిమాని ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) చూశాక తెలుగు నేర్చుకుందని తెలిసి మనసు ఉప్పొంగిపోయింది. సినిమా చూసి ఒక అభిమాని భాష నేర్చుకోవడాన్ని సినీ, భాషా ప్రేమికుడిగా నేను ఎన్నటికీ మర్చిపోలేను. భారతీయ సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తుండటం గర్వకారణం' అని ట్వీట్ చేశాడు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశాడు.అతిపెద్ద ఇన్స్పిరేషన్అందులో ఓ అమ్మాయి.. అన్నా.. నేను ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. రెండు సంవత్సరాల క్రితం తెలుగు రాత నేర్చుకునే పుస్తకాన్ని ప్రాక్టీస్ చేశాను. మీరు నాకు అతి పెద్ద ఇన్స్పిరేషన్ అని పేర్కొంది. ఆమె మాటలు విని ఆశ్చర్యపోయిన తారక్.. వావ్.. మీరే అందరికీ బిగ్ ఇన్స్పిరేషన్ అని పొగిడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.దేవర సినిమాకొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర (Devara: Part 1). జాన్వీకపూర్ హీరోయిన్గా నటించగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. గతేడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ దాదాపు రూ.440 కోట్లు రాబట్టింది. మార్చి 28న జపాన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతోంది.ఆర్ఆర్ఆర్ మూవీఆర్ఆర్ఆర్ మూవీ విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 మార్చి 24న విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించాడు. సుమారు రూ.1200 కోట్లు కొల్లగొట్టిన ఈ పాన్ ఇండియా మూవీ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది. My visits to Japan always give me beautiful memories but this one hit differently. Hearing a Japanese fan tell me she learned Telugu after watching RRR truly moved me. Being a lover of cinema and languages, the power of cinema to be a bridge across cultures and encouraging a… pic.twitter.com/4bQ1v8ZZP8— Jr NTR (@tarak9999) March 27, 2025 చదవండి: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఏర్పాట్లలో శ్యామలా దేవి -
భారరహిత స్థితిలో బంతాట
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ ఎస్)లో వ్యోమగామి అనగానే మనకు ఠక్కున గుర్తొ చ్చేది ఒక్కటే. వందల కోట్ల వ్యయంతో అక్కడికెళ్లిన వ్యోమగామి ఎక్కువగా ప్రయోగాల్లో మునిగితేలుతా రని భావిస్తాం. అందుకు భిన్నంగా బేస్‌బాల్ ఆడుతూ కనిపించి అవాక్కయ్యేలా చేశారు జపాన్ వ్యోమగామి కొయిచి వకాటా. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంబంధిత ‘స్పేస్ బేస్‌బాల్’ వీడియోను తాజాగా ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు. అంతరిక్షంలో భారర హిత స్థితిలో ఒంటరిగా ఉండకుండా సరదాగా బంతితో ఒక్కరమే ఎలా ఆడుకోవచ్చో వకాటా ఆడి చూపించారు. బేస్‌బాల్‌ను మంచి పిచ్ చూసుకుని విసిరి వెంటనే మళ్లీ ఆయనే బాల్ దూసుకెళ్తున్న దిశలో అంతకంటే వేగంగా కదిలి మళ్లీ బాల్‌ను బ్యాట్‌తో బాదారు. బ్యాట్‌తో కొట్టడంతో వ్యతిరేక దిశలో వెళ్తున్న బంతిని మళ్లీ ఆయనే ఇటు చివరకు దూసుకొచ్చి ఒడుపుగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘‘ జపాన్‌లో బేస్‌బాల్ ఎంఎల్‌బీ సీజన్ మొదలైంది. మైక్రోగ్రావిటీ స్థితిలో మనకు బేస్‌బాల్ టీమ్ మొత్తంతో పనిలేదు. ఒక్కరమే ఆట ఆడకోవచ్చు. బాల్ వేసేది మనమే. దానిని కొట్టేది మనమే. చివరకు పట్టేదీ మనమే’’ అని వకాటా రాసుకొచ్చారు. భారరహిత స్థితిని ఎలా ఆస్వాదించాలో, కేవలం ఒక్కరున్నా బేస్‌బాల్‌ను ఎలా ఆడాలో ఆయన చూపించిన విధం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. చాలా మంది మెచ్చుకు న్నారు. అంతరిక్ష వాతావరణాన్ని క్రీడాస్థలిగానూ వినియోగించువచ్చని ఆయన నిరూపించారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. ‘‘అంతరిక్ష క్రీడాకారుడు’’ అంటూ మస్క్ పొగిడారు. దాదాపు 20 సంవత్సరాలపాటు వ్యోమగామిగా కొనసాగిన వకాటా 2024లో రిటైర్ అయ్యారు. ఐదుసార్లు ఐఎస్ఎస్కు వెళ్లి మొత్తంగా 500 రోజులపాటు అక్కడ గడిపారు. ఎక్స్‌పిడీషన్39లో భాగంగా అక్కడికెళ్లిన ప్పుడు ఐఎస్ఎస్కు కమాండర్‌గా చేసిన తొలి జపాన్ వ్యోమగామిగా రికార్డ్ నెలకొల్పారు. జపాన్ ఏరోస్పే స్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా)లో వ్యోమగామిగా సేవలందించారు. pic.twitter.com/AGzg4O21St— Elon Musk (@elonmusk) March 25, 2025 -
కొరియాలో కార్చిచ్చు
సియోల్: దక్షిణ కొరియాను కార్చిచ్చు అతలాకుతలం చేస్తోంది. దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైందిగా చెబుతున్న కార్చిచ్చు ధాటికి ఇప్పటికే 44,000 ఎకరాల పైచిలుకు అడవి కాలిపోయింది. 24 మంది మంటలకు బలవగా 26 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులే. నలుగురు సివిల్ సర్వెంట్లు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే 28 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉయిసాంగ్ నగరంలో క్రీ.శ 618 నాటి పురాతన గౌన్సా బౌద్ధాలయాన్ని కూడా కార్చిచ్చు దగ్ధం చేసింది. ప్రావిన్స్‌లోని అతిపెద్ద దేవాలయాలలో ఇదొకటి. జోసన్ రాజవంశానికి చెందిన జాతీ య సంపదగా భావించే ఈ బౌద్ధ నిర్మాణ నిర్మాణం ఉత్సవ గంటతో పాటుగా నేలమట్టమైంది. ప్రభుత్వ నిధిగా గుర్తించిన రాతి బుద్ధుడితో సహా ఇక్కడి పలు కళాఖండాలను ముందే ఇతర ఆలయాలకు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం సాంచియాంగ్ కౌంటీలో మొ దలైన మంటలు ఉయి సాంగ్‌కు వ్యాపించాయి. బలమైన, పొడి గాలుల కా రణంగా పొరుగు కౌంటీలైన అండాంగ్, చి యోంగ్సాంగ్, యోంగ్యాంగ్, యోంగ్డియో క్లకు మంటలు వ్యాపిస్తున్నాయి. జపాన్‌లోనూ: జపాన్‌లోనూ కార్చిచ్చు కొనసాగుతోంది. బలమైన గాలుల వల్ల మంటల్లో పశ్చిమ జపాన్ ప్రావిన్స్‌లోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒకాయామా, తమోనోలో వందల ఎకరాల్లో చెట్లు కాలిపోయాయి. -
జపాన్ లో ఘనంగా భార్య బర్త్ డే సెలబ్రేషన్స్
-
ఆ నిర్దోషికి రూ. 12 కోట్ల భారీ నష్టపరిహారం
హత్యల కేసులో ఓ వ్యక్తికి మరణ శిక్ష పడింది. దాదాపు 50 ఏళ్లు గడిచినా ఆ శిక్ష అమలు కాలేదు. కేసు పునర్విచారణ అనంతరం గతేడాది 89 ఏళ్ల వయస్సులో కోర్టు ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది. మానసికంగా ఆయన తీవ్రంగా దెబ్బతినడంతో జైలులో పడిన వేదనకు ప్రతిఫలంగా రూ. 12.41 కోట్లు చెల్లించాలని తాజాగా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. జపాన్‌లోనే కాదు ప్రపంచ క్రిమినల్ కేసుల చరిత్రలో ఇదే అత్యంత భారీ నష్ట పరిహారంగా చెబుతున్నారు.1966లో టోక్యోకు పశ్చిమాన ఉన్న షిజౌకాలోని ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఇవావో హకమట (Iwao Hakamada) అనే వ్యక్తి పనిచేసేవారు. ఒక రోజు ఆ ప్లాంట్ యజమాని, భార్య, ఇద్దరు పిల్లలు వారి ఇంట్లో హత్యకు గురయ్యారు. రూ.కోటి వరకు నగదు మాయమైంది. నలుగురూ కత్తిపోట్లతోనే మరణించినట్లు తేల్చారు. ఇందుకు హకమటాయే కారణమని ఆరోపణలొచ్చాయి. తనకేపాపం తెలియదని హకమట వాదించారు. అయినా అధికారులు వినిపించుకోలేదు. జైలులో ఆయన్ను చిత్ర హింసలు పెట్టారు. రోజుకు 12 గంటలపాటు ఆయ న్ను విచారించారు. తట్టుకోలేక ఆ నేరం తానే చేసినట్లు హకమట ఒప్పుకున్నారు. 1968లో కోర్టు ఆయనకు మరణ శిక్ష (Death Sentence) విధించింది.తన సోదరుడు అమాయకుడంటూ సోదరి హిడెకు అప్పటి నుంచి, గత 56 ఏళ్లుగా న్యాయం పోరాటం సాగిస్తూనే ఉన్నారు. హతుల దుస్తుల్లో లభ్యమైన డీఎన్ఏ (DNA) తన సోదరుడిది కాదని తెలిపారు. ఈ కేసులో ఇరికించేందుకు ఉద్దేశపూర్వకంగానే అతడికి సంబంధించిన ఆధారాలను అక్కడ ఉంచి ఉంటారని ఆమె అంటున్నారు. ఆమె సుదీర్ఘ పోరాటం ఫలించింది. కేసును తిరిగి విచారించేందుకు 2014లో న్యాయస్థానం అంగీకరించింది. హకమట కేసు అత్యంత ప్రముఖ న్యాయ పోరాటంగా మారింది. గత సెప్టెంబర్‌లో షిజౌకా కోర్టు (Shizuoka Court) హకమటను విడుదల చేస్తూ తీర్పు వెలువరించింది.కోర్టు వద్ద వందలాదిగా గుమికూడిన జనం హకమటను నిర్దోషిగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్న హకమట ఇప్పుడు 91 ఏళ్ల తన సోదరి సంరక్షణలో ఉన్నారు. అందుకే విచారణ నుంచి కోర్టు ఆయనకు మినహాయించింది. సోమవారం ఈ కేసును విచారించిన జడ్జి కుని కోషి... హకమట దాదాపు 47 ఏళ్లపాటు జైలులో అత్యంత తీవ్రమైన మానసిక, శారీరక వేదనను అనుభవించారని పేర్కొన్నారు. అందుకు గాను రూ.12.41 కోట్లు పరిహారంగా చెల్లించాలని జైలు అధికారులను ఆదేశించారు.చదవండి: ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు.. అమెరికాకు భారీ షాక్ -
జపాన్‌లో ఎన్టీఆర్ మాస్ జాతర - అభిమానితో 'దేవర' స్టెప్పులు (ఫొటోలు)
-
జపాన్‌లో దేవర ఫీవర్.. ఆయుధ పూజ సాంగ్‌కు ఫ్యాన్స్ స్టెప్పులు
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన ఫుల్ యాక్షన్ మూవీ దేవర పార్ట్-1. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే మన టాలీవుడ్ సినిమాలకు జపాన్‌లో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను జపాన్‌లోనూ విడుదల చేయనున్నారు. ఇప్పటికే మన యంగ్ టైగర్ జపాన్ చేరుకుని ప్రమోషన్లతో బిజీ అయిపోయారు. తాజాగా అక్కడి ఫ్యాన్స్‌తో కలిసి ఓ థియేటర్లో సందడి చేశారు.ఈ సందర్భంగా దేవర మూవీలోని ఆయుధ పూజ సాంగ్‌కు జపాన్ ఫ్యాన్స్ డ్యాన్స్ చేశారు. వారితో కలిసి మన జూనియర్ ఎన్టీఆర్ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను దేవర టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. దేవరను మార్చి 28న జపాన్‌లో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో దేవర-2 కూడా ఉంటుందని డైరెక్టర్ కొరటాల ఇప్పటికే ప్రకటించారు.#Devara fever grips Japan! 🌊🔥Man of Masses #NTR stuns the Japanese audience as he grooves to Ayudha Pooja with a fan! 🤙🏻@tarak9999 #デーヴァラ #KoratalaSiva @anirudhofficial @devaramovie_jp pic.twitter.com/y9ybqaAYsT— Devara (@DevaraMovie) March 24, 2025┼─映画『#デーヴァラ』ジャパンプレミア@新宿ピカデリー🔱┼─1日目 無事に終わりました🦈サプライズゲストで登場した#キンタロー 。さんと#NTRJr がダンス🕺✨お越しいただいたみなさま、ありがとうございました❗️ pic.twitter.com/QvMutZAyYB— 【公式】映画『デーヴァラ』 (@devaramovie_jp) March 24, 2025 -
ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రైల్వేస్టేషన్
టోక్యో: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3డీ ప్రింటెడ్ రైల్వేస్టేషన్ నిర్మాణానికి జపాన్‌లోని ఓ రైల్వే ఆపరేటింగ్ సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ స్టేషన్ చుట్టకొలత 108 చదరపు అడుగులు. జపాన్‌లో జనాభా పరంగా మూడో అతిపెద్ద నగరమైన ఒసాకా నుంచి 60 మైళ్ల దూరంలోని దక్షిణ వకయామ ప్రావిన్స్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించబోతున్నట్లు వెస్ట్ జపాన్ రైల్వే(జేఆర్ వెస్ట్) సంస్థ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడ కలపతో నిర్మించిన రైల్వే కాంప్లెక్స్ ఉంది. అది చాలావరకు దెబ్బతినడంతో పూర్తిగా కూల్చివేసి 3డీ ప్రింటెడ్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ కొత్త స్టేషన్ చిత్రాలను ఇప్పటికే విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సెరెండిక్స్ అనే నిర్మాణ సంస్థ సైతం ఇందులో భాగస్వామిగా మారుతోంది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీలో ఈ సంస్థకు మంచి అనుభవం ఉంది. కొత్త టెక్నాలజీతో రైల్వే స్టేషన్నిర్మాణం కేవలం ఆరు గంటల్లో పూర్తి కానుంది. జపాన్‌లో ప్రస్తుతం పనిచేసే సామ ర్థ్యం కలిగిన యువత సంఖ్య తగ్గుతోంది. వృద్ధు ల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రామిక శక్తి అందుబాటులో లేకుండాపోతోంది. అందుకే తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తయ్యే టెక్నాలజీపై జపాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో తక్కువ మంది కార్మికులతో నిర్మాణాలు చకచకా పూర్తి చేయొచ్చు. ఇందులో భవనం విడిభాగాలను ముందుగానే తయారు చేస్తారు. నిర్మాణ స్థలానికి తీసుకెళ్లి వాటిని బిగించేస్తారు. -
జపాన్‌లో దేవర
జపాన్ వెళ్లారు ఎన్టీఆర్. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవర’. కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాలోని తొలి భాగం ‘దేవర: పార్ట్ 1’ 2024 సెప్టెంబరు 27న విడుదలైంది. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా (తండ్రి పాత్ర దేవర, కొడుకు పాత్ర వర) నటించి, ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా మేకర్స్ పేర్కొన్నారు.ఇక ఈ నెల 28న ‘దేవర: పార్ట్ 1’ సినిమా జపాన్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ టూర్లో భాగంగా ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. ఈ ప్రమోషనల్ టూర్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాను హీరోగా చేస్తున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా షూట్లో ఎన్టీఆర్ పాల్గొంటారని సమాచారం.అలాగే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయ్యాక ‘దేవర 2’ సినిమా షూట్లో పాల్గొంటారని, ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నారని సమాచారం. -
జపాన్ లో 'దేవర'.. భార్యతో కలిసి వెళ్లిన తారక్
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు కొన్ని జపాన్ లోనూ రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే కొన్ని నెలల తర్వాత అక్కడి థియేటర్లలోకి వస్తున్నాయి. అలా ఈ ఏడాది జనవరిలో 'కల్కి' రిలీజైంది. ఇప్పుడు 'దేవర'.. మార్చి 28న జపాన్ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రమోషన్స్ జరుగుతున్నాయి.(ఇదీ చదవండి: 'రాను.. బొంబాయి'కి అంటూనే లక్షల్లో కొల్లగొట్టేశారు)తాజాగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అక్కడి ప్రేక్షకులతో కలిసి 'దేవర' చూసేందుకు స్వయంగా ఎన్టీఆర్ జపాన్ వెళ్లాడు. భార్య ప్రణతీతో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ కోసం పనిచేస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ లో 'వార్ 2' కూడా చేస్తున్నాడు. ఇది ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలోకి రానుండగా.. ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే జనవరి టార్గెట్ గా ప్లాన్ చేస్తున్నారు. కానీ అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 25 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతున్న సినిమా)#YoungTiger ..జపాన్ లో pic.twitter.com/zM0Y53gPj7— devipriya (@sairaaj44) March 23, 2025 -
ప్రపంచ శాంతి కోసం ఆ పాప ఏం చేసిందో తెలుసా?
‘నేను బతుకుతానా అమ్మా?‘ అని అమాయకంగా అడిగింది సడాకో. తల్లి ఏమీ చెప్పలేక పక్కకు వెళ్లి ఏడ్చింది. సడాకోను ఆసుపత్రిలో ఉంచి రకరకాల చికిత్సలు అందిస్తున్నారు. 12 ఏళ్ల సడాకోది జపాన్ దేశం. ఆటపాటల్లో, చదువులో ఉత్సాహంగా ఉంటుంది. అలాంటి పిల్ల ఒక రోజు ఉన్నట్టుండి అనారోగ్యం పాలైంది. డాక్టర్లు తనకు రకరకాల పరీక్షలు చేశారు. పిడుగు లాంటి వార్త తెలిసింది. ఆ చిన్నారి పాపకు లుకేమియా. అంటే కేన్సర్. తనకీ పరిస్థితి ఎందుకు వచ్చిందని సడాకో తల్లిని అడిగింది.‘అణుబాంబు వల్ల’ అంది తల్లి. 1945 ఆగస్టులో అమెరికా జపాన్ మీద అణుబాంబు వేసే సమయానికి సడాకో వయసు రెండేళ్లు. సరిగ్గా బాంబు వేసిన ప్రదేశానికి మైలు దూరంలోనే సడాకో కుటుంబం ఉంటోంది. ఆ బాంబు దాడి నుంచి ఆ కుటుంబం ఎలాగో తప్పించుకుని బతికింది. కానీ అణుధార్మికత వల్ల సడాకోకు క్యాన్సర్ వచ్చింది.‘అలాంటి బాంబును ఎందుకు వేశారు? ఎందుకు ఇంత నష్టం కలిగించారు?‘ అని అడిగింది సడాకో. తల్లి దగ్గర సమాధానం లేదు. ఏమని చెప్పగలదు? దేశాల మధ్య వైరంలో సామాన్యులే బాధితులు అని ఆ చిన్నారికి ఎలా అర్థం చేయించాలి? ‘ఇకపై ఎక్కడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?‘ అని మరో ప్రశ్న వేసింది సడాకో. ‘ప్రపంచంలో శాంతి నెలకొనాలి‘ అంది తల్లి.’అవును! శాంతి నెలకొనాలి. ప్రపంచంలో అందరూ హాయిగా ఉండాలి. ఎవరికీ ఏ కష్టం రాకుండా ఉండాలి’ అని సడాకో నిర్ణయించుకుంది. కానీ తాను ఏం చేయగలుగుతుంది? తట్టిందో ఆలోచన.జపాన్ దేశ నమ్మకం ప్రకారం కాగితంతో కొంగు బొమ్మలు చేసి దేవుణ్ని ప్రార్థిస్తే అనుకున్నది నెరవేరుతుంది. వెంటనే ఆస్పత్రి మంచం మీదే సడాకో కాగితాలతో కొంగ బొమ్మలు చేయడం ప్రారంభించింది. ఒకటి.. రెండు.. మూడు.. చేతులు నొప్పి పుట్టేవి. అలసట వచ్చేది. అయినా సడాకో ఆగిపోకుండా బొమ్మలు చేసేది. అలా చేస్తూ ఉంది. చేస్తూనే ఉంది. 1300 బొమ్మలు తయారు చేసింది. ఆపై చేయలేక΄ోయింది. 12 ఏళ్లకే సడాకో క్యాన్సర్‌తో మరణించింది. ప్రపంచంలో శాంతి నెలకొనాలన్న తన కోరిక ఇంకా సజీవంగా ఉంది. ఈ విషయం తెలిసిన జపాన్ ప్రభుత్వం సడాకో కోసం స్మారకం నిర్మించింది. కాగితపు కొంగ బొమ్మ పట్టుకున్న సడాకో విగ్రహాన్ని చూస్తే ప్రపంచంలో శాంతి నెలకొనాలన్న తన ఆశ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. నేటికీ అనేక మంది ఆ విగ్రహం దగ్గరికి వెళ్లి కాగితంతో కొంగ బొమ్మలు చేసి అక్కడ పెడతారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని ప్రార్థిస్తారు. కాని నేటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపిల్లల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. పిల్లలు ఈ పెద్దల్ని చూసి ఏమనుకుంటారు? వీరికి బుద్ధి లేదు అనే కదూ..?. (చదవండి: యమ్మీబ్రదర్స్: చదువుకుంటూనే వ్యాపారం చేస్తున్న చిచ్చరపిడుగులు..!) -
ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది!
ఐడియా ఉండాలే గానీ, వేస్ట్ నుంచి కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంకొంచెం క్రియేటివ్‌గా ఆలోచిస్తే ఎందుకూ పనికి రాదు అనుకున్న వాటి ద్వారా కోట్లకు పడగలెత్తవచ్చు. అదెలాగా అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే. ఇక అది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు అయితే ఇక తిరుగే లేదు.జపాన్‌లోని ఒసాకాకు చెందిన 38 ఏళ్ల హయాటో కవమురా ఇదే నిరూపించాడు. ఆయన బుర్రలో తట్టిన ఒక ఐడియా ఆయన జీవితాన్నే మార్చేసింది. పాడుబడిన ఇళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని రీమోడలింగ్ చేసి అందంగా తీర్చి దిద్దాడు. ఆ తరువాత వాటిని రెంట్‌కు ఇచ్చాడు. ఇలా ఎంత సంపాదించాడో తెలుసా? ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిది కోట్లు సంపాదించాడు.‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన వివరాల ప్రకారం..హయతో కవాముర అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి వివిధ ఆకారాల్లో నిర్మించిన ఇళ్లంటే మహా ఇష్టం. అంతేకాదు నగరంలోని ఎత్తైన ప్రదేశానికి వెళ్లి పైనుంచి కింద ఉన్న వివిధ రకాలైన ఇళ్లను గమనిస్తుండేవాట. 200 పాతబడిన ఎవరూ పట్టించుకోని,శిథిలావస్థలో ఉన్న ఇళ్లు హయాటో కళ్ల బడ్డాయి. అంతే రంగంలోకి దిగాడు. వాటిని అందంగా మలిచి, వాటికి అద్దెకు ఇవ్వడం ద్వారా 8.2 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు.చిన్నప్పటి రియల్ ఎస్టేట్ పట్ల మక్కువ ఉండేది. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో తనకు డబ్బు లేకపోయినా, తన స్నేహితురాలితో డేటింగ్లో భాగంగా సందర్శించే వాడు. చదువు తరువాత జాబ్‌లో చేరాడు. అయితే సీనియర్ మేనేజ్మెంట్తో వివాదం రావడంతో సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడాలనే కోరిక పెరిగింది. ఉపాధి నుండి వైదొలగాలనే అతని కోరిక పెరిగింది. ప్రమోషన్లు సామర్థ్యంమీద ఆధారపడి ఉండవు, పై అధికారి మన్నలి ఇష్టపడుతున్నారా లేదా అనే దానిపై ఆధార పడి ఉంటుందని కవామురాకి అర్థమైంది రిస్క్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు.రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే కవామురా సామర్థ్యం కూడా అతని విజయంలో కీలక పాత్ర పోషించింది. అతని సంబంధాలు ఇతరుల కంటే ముందుగా విలువైన ఆస్తి సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సాయపడ్డాయి. 2018లో, అతను తన కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన సొంత రియల్ ఎస్టేట్ సంస్థ మెర్రీహోమ్ను స్థాపించి ఘన విజయం సాధించాడు. మారుమూల, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను బాగు చేసి అద్దెకు ఇవ్వగలిగాడు. 23 సంవత్సరాల వయసులో, వేలంలో 1.7 మిలియన్ యెన్ (10.1 లక్షలు) కు ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. అద్దె ద్వారా ఆదాయం. రూ. 2 లక్షలు. రెండేళ్ల తరువాత దీన్ని రూ. 25.6 లక్షలకు విక్రయించాడు. “రాత్రికి రాత్రే ధనవంతుడవుతానని అస్సలు ఊహించలేదు. రియల్ ఎస్టేట్‌లో లాభాలు రావాలంటే అపెట్టుబడులకు దీర్ఘకాలికంగా ఉండాలి. దీనికి ఓపిక , జాగ్రత్తగా శ్రద్ధ అవసరం అంటాడు కవామురా. అతని దూరదృష్టి ప్రశంసలు దక్కించుకుంది. భవిష్యత్తులో గొప్ప ఫలితాలను సాధించే అవకాశాలున్నాయంటూ మెచ్చుకున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట సందడి చేస్తోంది. -
దేవర ప్రమోషన్లతో బిజీగా జూనియర్ ఎన్టీఆర్.. ఫోటోలు షేర్ చేసిన టీమ్..
-
దేవర ప్రమోషన్లతో బిజీగా జూనియర్ ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్-1. గతేడాది దసరా ముందు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో దేవర-2 కూడా ఉంటుందని డైరెక్టర్ కొరటాల ఇప్పటికే ప్రకటించారు.అయితే గతంలో మన తెలుగు చిత్రాలు చాలా వరకు జపాన్‌లో కూడా విడుదలై ఘన విజయం సాధించాయి. మన టాలీవుడ్ సినిమాలకు జపాన్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. గతంలో ఆర్ఆర్ఆర్తో పాటు పలు చిత్రాలు సైతం జపాన్ భాషలో కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీని కూడా ఈ ఏడాది అక్కడ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగానే దేవర ప్రమోషన్స్ ప్రారంభించారు యంగ్ టైగర్.జపాన్ అభిమానులు, అక్కడి మీడియాతో వర్చువల్ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలను దేవర టీమ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. మూవీ ప్రమోషన్లతో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చే నెల మార్చి 22న జపాన్‌లో పర్యటించనున్నారని తెలిపింది. ఈ సినిమాను మార్చి 28న జపాన్‌లో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు. Man of Masses @Tarak9999 has kick started #Devara promotions with interviews for Japanese media ahead of his visit on March 22nd 🌊The countdown begins for the grand release in Japan on March 28th. pic.twitter.com/UwPJLNrQ1I— Devara (@DevaraMovie) February 25, 2025 -
జంతురూపాల్లోని 'మనుషుల జూ'..!
జూలో రకరకాల జంతువులను ఉండటం మామూలే! కాని, తాజాగా అచ్చంగా జంతువులను తలపించే వేషాలతో కనిపించే మనుషుల ప్రదర్శనశాలను ఎక్కడైనా చూశారా? ఈ ఫొటోలో కనిపిస్తున్న కుక్క నిజమైన కుక్క కాదు. జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఒక అల్ట్రా రియలిస్టిక్ డాగ్ సూట్లో ఉన్న దృశ్యం. అతను ఒక ఇండోర్ జూను ప్రారంభించాడు. ‘మీరు ఎప్పుడైనా జంతువులాగా మారాలని కోరుకున్నారా? అయితే, ఇక్కడకు రండి’ అంటూ తన ఇంట్లోనే ఈ జూను ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం నెలకు రెండుసార్లు మాత్రమే తెరిచే ఈ జూను చూడటానికి చాలామంది పోటీ పడుతున్నారు. పైగా దీని ఎంట్రీ ఫీజుతోపాటు, మీరు కూడా జంతువుల వేషం ధరించాలనుకుంటే, ఒక నెల ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం ఇలా సెషన్ వ్యవధిని బట్టి ధర 49,000 యెన్లు (అంటే రూ. 27 వేలు) వరకు ఉంటుంది. త్వరలోనే మరికొన్ని జంతువుల వేషాలను కూడా ఏర్పాటు చేస్తానని టోకో చెబుతున్నాడు. (చదవండి: వామ్మో ఇదేం బిజినెస్? విలనీజం వ్యాపారమా..!) -
ఇది సుమచరితం..! రెండు దేశాల సంస్కృతుల సమ్మేళ్లనం
పూల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్ని పుస్తకాలు రాసినా రాయడానికి ఇంకా ఉంటుంది. ఇకబెనా అనేది జపాన్‌కు చెందిన ఫ్లవర్ ఆర్ట్. ఇకబెనాలో చేస్తున్న సేవకి గాను ‘జపాన్ ఫారిన్ మినిస్టర్స్ కమెండేషన్ అవార్డు’ అందుకున్నారు రేఖారెడ్డి. జపాన్ ఫ్లవర్ ఆర్ట్‌ను భారతీయ చేనేతకళతో సమ్మిళితం చేస్తూ తన ‘లూమ్స్ అండ్ బ్లూమ్స్, పెటల్స్ అండ్ ప్యాలెట్, మిశ్రణం’ రచనలను పరిచయం చేశారు రేఖారెడ్డి. పువ్వులు, రంగులు జీవితంలో భాగం. లైఫ్ కలర్ఫుల్గా ఉంచుకోవడం తోపాటు సుమభరితంగానూ ఉండాలి. భారతీయ సంస్కృతి పూలు ఆస్వాదనకు, ఆడంబరానికి, రసమయమైన, విలాసవంతమైన జీవితానికి ప్రతీకలు. అలాగే దైవానికి చేసే నిత్యపూజలో పూలది ప్రధానపాత్ర. మన పూల అలంకరణ ఈ తీరులోనే ఉంటుంది. జపాన్ వాళ్లు మాత్రం తాము అనుసరించే నిరాడంబర జీవనశైలిలో పూలతో ఆధ్యాత్మికపథం నిర్మిస్తారు. బౌద్ధం నుంచి నేర్చుకున్న వైరాగ్యతను పూల అలంకరణ ద్వారా నిత్యధ్యానం చేస్తారు. మనిషి జీవితాన్ని పువ్వుతో పోలుస్తారు. త్రికోణాకారపు అమరికలో పైన స్వర్గం, కింద భూమి, మధ్యలో మనిషి... ఈ మూడింటికి ప్రతిరూపం ఇకబెనా ఫ్లవర్ అరేంజ్మెంట్. ఒక మొగ్గ, ఒక అర విరిసిన పువ్వు, మరొకటి పూర్తిగా విచ్చుకున్న పువ్వు... ఈ మూడు భవిష్యత్తు, వర్తమానం, భూత కాలాలకు సూచికలు. మనిషి జీవన చక్రానికి ప్రతీక. ఫ్లవర్ అరేంజ్మెంట్ కూడా ధ్యానం వంటిదే. ఒకరు దేవుని ముందు కూర్చుని ధ్యానం చేస్తారు. ఒకరు ప్రకృతి ఒడిలో ధ్యానం చేస్తారు. రోజూ కొంత సమయం ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో నిమగ్నమైతే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ధ్యానం తర్వాత కలిగే అలౌకిక ఆనందం వంటిదే ఇది కూడా. ఇరు దేశాల సంస్కృతుల సమ్మేళనం జపాన్ సంస్కృతిలో భాగమైన ఇకబెనాలో భారతీయ సంస్కృతిని మమేకం చేస్తూ పసుపుకుంకుమలతో పరిపూర్ణం చేశారు. ‘బ్లూమ్స్ అండ్ లూమ్స్’ కాన్సెప్ట్ జపాన్ ఇకబెనాను భారతీయ చేనేతతో సమ్మిళితం చేయడం. ‘మిశ్రణం’లో మన ఆహారంలో ఉన్న పోషకాలు – జపాన్ పూల అలంకరణతో అనుసంధానం చేయడం. పెటల్స్ అండ్ ప్యాలెట్స్లో పూలు– రంగుల మధ్య విడదీయలేని బంధాన్ని వర్ణించారు. రెండు దేశాల సంస్కృతుల సమ్మేళనమే ఇవన్నీ. స్టేజ్ టాక్‌లో ఆతిథులను సమ్మోహనపరిచిన ఈ ప్రయోగాలే ఆమెను ‘జపాన్ ఫారిన్ మినిస్టర్స్ కమెండేషన్ అవార్డు’కు ఎంపిక చేశాయి. (చదవండి: -
భారత్ X జపాన్
కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కాంస్య పతకాన్ని నిలబెట్టుకునేందుకు విజయం దూరంలో నిలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్ జట్టుతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటుంది. గురువారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో ద్వయం 21–11, 12–21, 15–21తో కి డాంగ్ జు–జియోంగ్ నా యున్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో మాళవిక బన్సోద్ 9–21, 10–21తో సిమ్ యు జిన్ చేతిలో పరాజయం పాలైంది. దాంతో భారత్ 0–2తో వెనుకబడింది. మూడో మ్యాచ్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్ 17–21, 21–18, 21–19తో చో జియోన్‌యోప్‌పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 19–21, 21–16, 21–11తో కిమ్ ఇన్ జి–కిమ్ యు జుంగ్ జంటను ఓడించడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో సాతి్వక్ సాయిరాజ్–అర్జున్ జంట 14–21, 21–23తో జిన్ యోంగ్–నా సుంగ్ సెయోంగ్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది. -
జపాన్‌కు మేడ్ ఇన్ ఇండియా కారు
భారతదేశంలో తయారవుతున్న వాహనాలకు.. విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే పలు వాహనాలు మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా 'మారుతి సుజుకి' (Maruti Suzuki) కంపెనీకి చెందిన 'జిమ్నీ' (Jimny) జపాన్‌కు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారుకు జపాన్‌లో కూడా అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది.2023లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కనిపించిన మారుతి జిమ్నీ.. ప్రస్తుతం 5 డోర్ వెర్షన్ రూపంలో కూడా అమ్మకానికి ఉంది. ఇదే ఇప్పుడు జపాన్‌లో విక్రయానికి సిద్ధమైంది. అంతే కాకుండా 2024-25 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి అత్యధికంగా ఎగుమతి చేసిన వాహనాల్లో ఇది రెండో మోడల్ అని తెలుస్తోంది.జిమ్నీ 5 డోర్ కారు హర్యానాలోని గురుగ్రామ్‌లో.. మారుతి సుజుకి తయారీ కేంద్రంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది గ్లోబల్ ఆఫ్ రోడర్‌గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే ఈ కారును కంపెనీ దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు జపాన్‌కు కూడా తరలించింది. మొత్తం మీద కంపెనీ ఇప్పటి వరకు 3.5 లక్షల కంటే ఎక్కువ జిమ్నీ కార్లు గ్లోబల్ మార్కెట్లో అమ్ముడయ్యాయి.జిమ్నీ 5 డోర్ మోడల్ జపాన్‌లో ప్రారంభమైన సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ హిసాషి టకేయుచి (Hisashi Takeuchi) మాట్లాడుతూ.. జపాన్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' జిమ్నీ 5-డోర్‌ను ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆగష్టు 2004లో కంపెనీ అత్యధికంగా ఎగుమతిచేసిన కార్లలో 'ఫ్రాంక్స్' తరువాత.. జిమ్నీ ఉంది. మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి మార్కెట్లలో అమ్మకాల పరంగా ఇది గొప్ప విజయం సాధించిందని అన్నారు.జిమ్నీ 5 డోర్రూ. 12.47 లక్షల ప్రారంభ ధర వద్ద మార్కెట్లో లాంచ్ అయిన మారుతి జిమ్నీ.. ప్రత్యేకంగా ఆఫ్ రోడింగ్ విభాగంలో ఓ పాపులర్ మోడల్. కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ మోడల్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 105 హార్స్ పవర్, 134 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వంటివి పొందుతుంది. -
‘అంకుల్ ప్రైజ్’: అతడేం పనిచేస్తాడో తెలుసా..!
పొగడ్తలను ఇష్టపడని వారు చాలా అరుదు. పూర్వం రాజులు కూడా కేవలం తమని పొగడటానికి ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకునేవారు. తాజాగా ఇదే తరహాలో జపాన్(Japan)లోని ఒక వ్యక్తి ‘అంకుల్ ప్రైజ్(Uncle Praise)’ పేరుతో తన సొంత స్ట్రీట్ జాబ్‌ను ప్రారంభించాడు. ప్రతిరోజూ టోక్యో నగర వీథుల్లో నిల్చొని, అతని దగ్గరకు వచ్చిన అపరిచితులను పొగుడుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఒకానొక సమయంలో జూదానికి బానిసగా మారి, తన ఉద్యోగం, కుటుంబం రెండింటినీ కోల్పోయి, చాలాకాలం పాటు ఖాళీగా ఉండేవాడు. ఆ సమయంలో తిరిగి ఎవరూ తనని పనిలో చేర్చుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. అప్పుడే కొంతమంది స్ట్రీట్ ఆర్టిస్ట్‌లను చూసి, ‘అంకుల్ ప్రైౖజ్’ పేరుతో సొంత ఆలోచనతో ఇతరులను పొగిడే పనిని ప్రారంభించాడు. ఇతని కథనాన్ని ఈ మధ్యనే ఒక టీవీ షో ప్రసారం చేయటంతో ఫేమస్ అయ్యాడు. రోజుకు దాదాపు 150 యెన్ల నుంచి 10 వేల యెన్ల వరకు (రూ.82 నుంచి రూ. 5,500 వరకు) సంపాదించేవాడు. టీవీ షో ద్వారా ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు, విస్తృతంగా వ్యాపార పర్యటనలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు. (చదవండి: సర్వ ఆహార సమ్మేళనం -
జనాభా తగ్గుతోంది... వృద్ధులు పెరుగుతున్నారు
ఇటు జనాభా క్షీణిస్తోంది. అటు వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చైనా సహా అనేక దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లివి. పెళ్లికి, పిల్లలను కనేందుకు యువతరం పెద్దగా ఇష్టపడటం లేదు. కాస్త అటూ ఇటుగా ప్రపంచమంతటా ఇదే ధోరణి పెరుగుతోంది. దాంతో ఏ దేశంలో చూసి నా జనాభా క్రమంగా తగ్గుతోంది. 2024లో చైనా జనాభా 10.4 లక్షలు తగ్గింది. అక్కడ జనాభా తగ్గడం వరుసగా ఇది మూడో ఏడాది. జపాన్లోనైతే 15 ఏళ్లుగా జనాభా వరుసగా తగ్గుము ఖం పడుతోంది. దక్షిణ కొరియాలో 2023లో కాస్త పుంజుకున్న జనాభా ఈ ఏడాది మళ్లీ తగ్గింది. ఇటలీలో జననాల సంఖ్య 19వ శతాబ్దం తరవాత తొలిసారి 4 లక్షల కంటే తక్కువకు పడిపోయింది. 63 దేశాలు, భూభాగాల్లో జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరిందని ఐరాస అంచనా. వచ్చే 30 ఏళ్లలో మరో 48 దేశాలు ఆ స్థాయికి చేరతాయని సంస్థ పేర్కొంది. 60 ఏళ్లలో ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని, అక్కడినుంచి క్షీణించడం మొదలవుతుందని అభిప్రాయపడింది. చైనాలో రిటైర్మెంట్ వయసు పెంపు మరోవైపు ఆరోగ్య సంరక్షణ, మెరుగైన జీవనశైలి, ఆయుర్దాయం పెరుగుదల తదితరాలతో చాలా దేశాల్లో వృద్ధుల జనాభా నానాటికీ పెరిగిపోతోంది. చైనాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాంతో ఆర్థిక వృద్ధి దెబ్బ తింటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు చైనా నానా ప్రయత్నాలు చేస్తోంది. పురుషుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 63 ఏళ్లకు పెంచింది. ఫ్యాక్టరీ, బ్లూ కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు 50 నుంచి 55కు, వైట్–కాలర్ ఉద్యోగాల్లో 55 నుంచి 58కు పెంచింది. 2022 నుంచి చైనాలో జనాభా తగ్గుముఖం పట్టడం మొదలైంది. దాంతో అత్యధిక జనాభా రికార్డును 2023లోనే భారత్‌కు కోల్పోయింది. ఒకే సంతానం నిబంధనను సడలించి ముగ్గురిని కనేందుకు అనుమతించినా లాభం లేకపోయింది. 140 కోట్లున్న చైనా జనాభా 2050 నాటికి 130 కోట్లకు తగ్గుతుందని అంచనా. ఇటలీదీ అదే వ్యథ... ఇటలీలో కూడా జనాభా నానాటికీ తగ్గిపోతోంది. 2023లో 5.94 కోట్లుండగా 2024 చివరికి 5.93 లక్షలకు తగ్గింది. 2008లో 5.77 లక్షలున్న వార్షిక జననాల సంఖ్య 2023 నాటికి ఏకంగా 3.8 లక్షలకు పడిపోయింది! ఇటలీ ఏకీకరణ తరువాత జననాల సంఖ్య క్షీణించడం అదే తొలిసారి! పిల్లల సంరక్షణ ఖరీదైన వ్యవహారంగా మారడం, తక్కువ జీతాలు, వృద్ధ తల్లిదండ్రులను చూసుకునే సంప్రదాయం వంటివి ఇటాలియన్లకు భారంగా మారుతు న్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది పిల్లలను కనాల్సిందిగా పోప్ కూడా ఇటీవలే ఇటాలియన్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా 2033 కల్లా ఏటా కనీసం 5 లక్షల జననాలే లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిరోధించడానికి జనాభా అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దక్షిణ కొరియాలో విదేశీయుల రాక పుణ్యమా అని 2023లో జనాభా పుంజుకుంది. నిజానికి అధిక పోటీ విద్యా విధానంలో పిల్లలను పెంచడానికి అధిక ఖర్చు, మహిళలే శిశు సంరక్షణ చేపట్టా లనే ధోరణి వల్ల అక్కడ కొన్నేళ్లుగా జనాభా తగ్గుతోంది. వర్కింగ్ వీసా ప్రోగ్రాం పొడిగింపు వల్ల విదేశీ నివాసి తుల సంఖ్య 10% పెరిగి 10.9 లక్షలకు చేరింది. ఫలితంగా జనాభాలో కాస్త పెరుగుదల నమోదై 5.18 కోట్లకు చేరింది. కానీ వీరిలో ఏకంగా 90.5 లక్షల మంది 65, అంతకు మించిన వయసువారే! వృద్ధుల జనాభా పెరగడం కార్మికుల కొరతకు దారి తీస్తోంది.జపాన్‌లో అలా.. జపాన్ అయితే జనాభా సంక్షోభమే ఎదుర్కొంటోంది! 2008లో 12.8 కోట్లుండగా ప్రస్తుతం 12.5 కోట్లకు పడిపోయింది. జననాల సంఖ్య కూడా బాగా తగ్గుతోంది. యువత పెళ్లి, పిల్లలను కనడంపై తీవ్ర విముఖత చూపుతుండటం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. ఉద్యోగావకాశాల లేమి, జీవన వ్యయానికి తగ్గ వేతనాలు లేకపోవడం, కార్పొరేట్ సంస్కృతి పనిచేసే మహిళలు పని చేసేందుకు అనుకూలంగా లేకపోవడం వంటివి సమస్యను మరింత పెంచుతున్నాయి. 2070 నాటికి జపాన్ జనాభా 8.7 కోట్లకు పడిపోతుందని అంచనా. జనాభా సమస్యకు తోడు వృద్ధుల సంఖ్య కూడా జపాన్ను కలవరపరుస్తోంది. అక్కడ ప్రతి 10 మందిలో నలుగురు వృద్ధులే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుట్టుకతో వచ్చే పౌరసత్వం: భారత్ సహా ఏ దేశాల్లో ఎలా ఉందంటే..
విదేశీయులకు పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు అమెరికాలో సహజంగా దక్కుతున్న పౌరసత్వ హక్కును రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నారు. కానీ, న్యాయస్థానం తాజాగా ఆ ఆదేశాలకు మోకాలడ్డేసింది. దీంతో అప్పీల్‌కు వెళ్లాలని ట్రంప్ నిర్ణయించారు. అయితే.. జన్మతః దక్కే పౌరసత్వం విషయంలో మిగతా దేశాలు ఏం విధానాలు పాటిస్తున్నాయో తెలుసా?.అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ ఒక్కరికీ అక్కడి పౌరసత్వం దక్కేలా అక్కడి రాజ్యాంగం హక్కు కల్పించింది. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ హక్కు దక్కాలి కూడా. అయితే ఆ హక్కును తనకున్న విశిష్ట అధికారంతో మార్చేయాలని ట్రంప్ భావించారు.ఈ క్రమంలోనే రాజ్యాంగ సవరణతో సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇకపై అమెరికా నేలపై విదేశీయులకు పుట్టే పిల్లలను అమెరికా పౌరులుగా పరిగణించకూడదన్నది ఆ ఆదేశాల సారాంశం.👉పుట్టే పిల్లలకు పౌరసత్వం వర్తింపజేయడమే బర్త్‌రైట్ సిటిజన్‌షిప్. తల్లిదండ్రుల జాతీయత.. అంటే వాళ్లది ఏ దేశం, ఇమ్మిగ్రేషన్ స్టేటస్.. అంటే ఏ రకంగా వలసలు వచ్చారు ఇలాంటివేవీ పరిగణనలోకి తీసుకోకుండా అమెరికాలో ఇంతకాలం పౌరసత్వ గుర్తింపు ఇస్తున్నారు. అయితే ప్రపంచం మొత్తంగా ‘‘జస్ సాన్‌గ్యుఇనిస్, జస్ సోలి’’ అనే రెండు సిద్ధాంతాల ఆధారంగా సిటిజన్‌షిప్‌ను వర్తింపజేస్తున్నారు. అయితే.. ఎక్కువ దేశాలు మాత్రం పౌరసత్వాన్ని ‘‘జస్ సాన్‌గ్యుఇనిస్’’ ఆధారంగానే పౌరసత్వం అందిస్తున్నాయి . జస్ సాన్‌గ్యుఇనిస్ అంటే.. వారసత్వంగా(రక్తసంబంధంతో) పౌరసత్వ హక్కు పొందడం. జస్ సోలి అంటే.. ఫలానా దేశంలో పుట్టిన కారణంగా ఆ దేశ పౌరసత్వ హక్కు లభించడం. 👉ఇప్పటిదాకా అమెరికా మాత్రమే కాదు.. మరికొన్ని దేశాలు పుట్టుకతో పౌరసత్వం విషయంలో జస్ సోలి వర్తింపజేస్తున్నాయి. అందులో అమెరికా పొరుగుదేశాలైన కెనడా కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. అమెరికా తరహాలోనే ఈ దేశం కూడా తమ గడ్డపై పుట్టే విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వం వర్తింపజేస్తోంది. అయితే అమెరికాలోలానే ఇక్కడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.👉అమెరికా రెండు ఖండాల్లో మెక్సికో, అర్జెంటీనాతో సహా చాలాదేశాలే ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. చిలీ, కంబోడియా మాత్రం ఇవ్వడం లేదు. ఆ దేశాలు జస్ సాన్‌గ్యుఇనిస్ ఆధారంగా పౌరసత్వం అందించడంపై ప్రధానంగా దృష్టిసారించాయి. 👉యూరప్, ఆసియా, ఆఫ్రికా.. చాలా దేశాలు జస్ సాన్‌గ్యుఇనిస్ మీదే జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం షరతులతో కూడిన సడలింపులు ఇచ్చాయి ఉదాహరణకు.. జర్మనీ, ఫ్రాన్స్‌లాంటి దేశాలు తమ దేశాల్లో పుట్టే పిల్లలకు సంబంధించి.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ దేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని కొన్నేళ్లపాటు(ప్రస్తుతం 8 సంవత్సరాలుగా ఉంది) జీవించి ఉండాలి. అలా ఉంటే ఆ పిల్లలకు ఆ దేశాల పౌరసత్వం వర్తిస్తుంది. అలాగే.. కొన్ని దేశాలు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కూడా పౌరసత్వం ఇస్తున్నాయి.👉భారత్‌లో జన్మతఃపౌరసత్వంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. జస్ సాన్గ్యుఇని అనుసరిస్తోంది మన దేశం. అంటే.. వారసత్వంగా రక్తసంబంధీకులకు పౌరసత్వం వర్తిస్తుందన్నమాట. అయితే.. 1928లో మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ.. జస్ సోలిని భారత్‌లోనూ వర్తింపజేయాలని ప్రతిపాదించింది. అంటే.. భారత గడ్డపై జన్మించే విదేశీయులకు కూడా ఇక్కడి పౌరసత్వం వర్తింపజేయాడన్నమాట. జస్ సాన్గ్యుఇని ‘జాతి భావన’ మాత్రమే ప్రతిబింబిస్తుందని, అదే జస్ సోలి అనేది సమాన హక్కుల భావనను చూపిస్తుందని ఈ కమిటీ అభివర్ణించింది. ఈ కమిటీలో నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, తేజ్ బహదూర్ సప్రూ ఉన్నారు.1949లో రాజ్యాంగం కూడా ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంది. కానీ, కాలక్రమేణా భారత్‌లో వారసత్వ పౌరసత్వానికే ప్రాధాన్యం లభించింది. 1955లో భారత పౌరసత్వ చట్టం.. జన్మతః పౌరసత్వ చట్టాలకు కఠిన నిబంధనలను చేర్చింది. తల్లిదండ్రుల్లో ఒకరు కచ్చితంగా భారత పౌరసత్వం ఉన్నవాళ్లు ఉండాలి. మరొకరు చట్టపరంగా వలసదారు అయి ఉంటే సరిపోతుంది.👉జపాన్‌లోనూ కఠిన నిబంధనలే అమలు అన్నాయి. అయితే ఏ జాతీయత లేని స్థితిలో ఆ పిల్లలకు అక్కడి పౌరసత్వం ప్రసాదిస్తారు. స్పెయిన్‌లో పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి కచ్చితంగా పౌరసత్వం ఉండాలి. లేదంటే ఎలాంటి జాతీయత లేని పిల్లలైనా అయి ఉండాలి.👉ఇటలీలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై పరిమితులున్నాయి. పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి ఇటలీ పౌరసత్వం ఉండాలి. లేదంటే.. ఆ బిడ్డకు 18 ఏళ్లు నిండేదాకా ఆ దేశంలోనే ఉండాలి. అప్పుడే పౌరసత్వం ఇస్తారు.👉యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మలేషియా.. ఇలా మరికొన్ని దేశాల్లోనూ తల్లిదండడ్రులు కచ్చితంగా ఆ దేశ పౌరులై ఉంటేనే, లేదంటే శాశ్వత నివాసుతులై ఉంటేనే అక్కడి పౌరసత్వం సంక్రమిస్తుంది. 👉జన్మతః పౌరసత్వ హక్కుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సమానత్వం, ఏకీకరణలతో పాటు జాతీయత విషయంలో న్యాయపరమైన చిక్కులేవీ తలెత్తకుండా ఉంటాయి. అయితే.. అభ్యంతరాలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. అక్రమ వలసదారుల్నిప్రొత్సహించడంతో పాటు దేశంపై ఆర్థికపరమైన భారాన్ని మోపుతుంది. ఈ క్రమంలోనే పౌరుల జాతీయత-వలసవిధానం గురించి పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. మరోవైపు ఇది ‘‘బర్త్ టూరిజం’’గా మారే ప్రమాదం లేకపోలేదని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య బానిసత్వం, హక్కుల సాధనగా మొదలైన అంతర్యుద్ధం 1861-65 మధ్య కొనసాగింది. దాదాపు 6,20,000 మంది ఈ యుద్ధంలో మరణించారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ చిన్నారికి అక్కడి పౌరసత్వం లభిస్తోంది. ఈ 157 ఏళ్ల చరిత్రను రాజ్యాంగ సవరణ ద్వారా కాకుండా.. తన సంతకంతో మార్చేయాలని ట్రంప్ భావించడం విశేషం. -
ఇంటికన్నా జైలే పదిలం
అక్కడంతా.. చేతులు ముడతలు పడిపోయి, నడుములు ఒంగిపోయి.. కొందరు వాకర్ల సహాయంతో.. ఇంకొందరు సహాయకుల ఆసరాతో కారిడార్లలో నెమ్మదిగా తిరుగుతూ ఉంటారు. భోజనం, మందులు ఇచ్చేది కూడా సహాయకులే. అది కచ్చితంగా వృద్ధాశ్రమం అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే అది జపాన్ రాజధాని టోక్యోలోని అతి పెద్ద మహిళా జైలు. వృద్ధ మహిళలు నేరాలు చేసి మరీ ఈ జైలుకు వస్తున్నారు. ఇంటి దగ్గరకంటే వారు జైలులో ఉండటానికే ఇష్టపడటానికి కారణం తెలియాలంటే ఇది చదవాల్సిందే! వినడానికి వింతగా ఉన్నా.. జపాన్‌లోని వృద్ధ మహిళలు జైళ్లలో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఒంటరితనం. బయట వారికి లేని సాంగత్యం జైళ్లలో దొరుకుతోంది. అంతేకాదు క్రమం తప్పకుండా ఆహారం, ఉచిత ఆరోగ్య సంరక్షణ, వృద్ధాప్యంలో కావాల్సిన ఆసరా ఇక్కడ లభిస్తోంది. దీంతో జైలుకు వచ్చేందుకే ఇష్టపడుతున్నారు. యోకో అనే 51 ఏళ్ల మహిళ గత 25 ఏళ్లలో ఐదుసార్లు జైలు శిక్ష అనుభవించారు. తాను వచ్చిన ప్రతిసారీ జైలు జనాభా పెరిగినట్లు కని్పస్తోందని చెబుతున్నారు. ఒంటరితనానికి తోడు పేదరికం.. జైలులోకి రావడానికి అత్యధిక మంది చేసే నేరం దొంగతనం. వృద్ధ ఖైదీలు, ముఖ్యంగా మహిళల్లో దొంగతనం సర్వసాధారణమైన నేరం. 2022లో దేశవ్యాప్తంగా 80 శాతానికి పైగా వృద్ధ మహిళా ఖైదీలు దొంగతనాలకు పాల్పడి జైళ్లలో ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కొందరు ఒంటరిగా ఉండలేక దొంగతనాలకు పాల్పడుతుంటే మరికొంతమంది మనుగడ కోసం చేస్తున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) ప్రకారం.. జపాన్‌లో 65 ఏళ్లు పైబడిన వారిలో 20% మంది పేదరికంలో నివసిస్తున్నారు. సంస్థలో ఉన్న 38 సభ్య దేశాలలో ఈ సగటు 14.2% శాతం ఉండగా.. జపాన్‌దే అత్యధికం. పేదరికంలో ఉన్న పిల్లలు సైతం.. తమ తల్లిదండ్రులు ఆకలితో ఉండే కంటే ఇలా దూరంగా వెల్లిపోవడమే మంచిదని కోరుకుంటున్నారు. ఇదే జైలులో ఉన్న 81 ఏళ్ల అకియో పేదరికం, ఒంటరితనం రెండింటితో బాధపడుతున్నారు. రెండు నెలలకోసారి వచ్చే నామమాత్రపు పెన్షన్ ఆమెకు జీవనాధారం. ఆర్థిక స్థిరత్వం, సౌకర్యవంతమైన జీవనశైలిఉంటే కచి్చతంగా ఇలా చేసి ఉండేదాన్ని కాదని చెబుతారామె. గతంలో ఆహారాన్ని దొంగిలించిన కేసులో జైలు శిక్ష అనుభవించిన అకియో.. జైలుకు రావడం ఇదిరెండోసారి. ఉచిత వైద్యం.. అనారోగ్యానికి గురైన వారు జైలులో ఉంటే వారికి ఉచిత వైద్యం అందుతుంది. బయటికి వెళ్తే దానికోసం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోంది. దీంతో కొంతమంది సాధ్యమైనంత ఎక్కువకాలం ఇక్కడ ఉండాలని కోరుకుంటారని జైలు గార్డు షిరానాగ తెలిపారు. ఇప్పటికీ జైళ్లు తెల్ల వెంట్రుకలు కలిగిన ఖైదీలతో నిండిపోయాయి. టోచిగిలో ఉన్న జైలులో ఐదుగురు ఖైదీలలో ఒకరు వృద్ధులు. ఇక్కడ ఒక్కచోటే కాదు.. జపాన్ అంతటా, 2003 నుంచి 2022 వరకు 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఖైదీల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఇది జైలు స్వభావాన్ని మార్చింది. ఇప్పుడవి వృద్ధాశ్రమాల్లా ఉన్నాయి. ఇక్కడ వారికి సహాయకులు ఖైదీలు తినడానికి, వారి స్నానానికి, డైపర్లు మార్చడానికి కూడా సహాయపడాలని షిరానాగ చెప్పారు. అది దోషులతో నిండిన జైలు కంటే నర్సింగ్ హోమ్ లాగా అనిపిస్తుందని చెబుతారాయన. సహాయక సిబ్బంది కొరత.. జపాన్‌లో వయోవృద్ధుల జనాభా చాలా వేగంగా పెరుగుతోంది. దీంతో సహాయక సిబ్బంది కొరత కూడా పెరుగుతోంది. 2040 నాటికి 21 లక్షల మంది సంరక్షణ కారి్మకులు అవసరమవుతారని ప్రభుత్వం తెలిపింది. జనాభా మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయడానికి విదేశాల నుంచి ఉద్యోగులను తీసుకోవడానకి తంటాలు పడుతోంది. ఇక జైలులో నర్సింగ్ అర్హతలు ఉన్న ఖైదీలను ఇతర వృద్ధ ఖైదీలకు నర్సింగ్ సంరక్షణను అందించమని అధికారులు కోరుతున్నారు. దీంతో వృద్ధ ఖైదీలను చూసుకోవడానికి తగినంత మంది జైలు సిబ్బంది లేనప్పుడు వారు సహాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2026 నాటికి 4వ అతిపెద్ద ఎకానమీగా భారత్
న్యూఢిల్లీ: భారత్ 2026 నాటికి ప్రపంచంలో జపాన్ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని పరిశ్రమల సంఘం– పీహెచ్‌డీసీసీఐ అంచనా వేసింది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో భారత్ ఎకానమీ 6.8 శాతంగా నమోదవుతుందని విశ్లేషించింది. ఇది ఆర్బీఐ, ప్రభుత్వ అంచనాలకన్నా అధికంగా ఉండడం గమనార్హం. ఇక ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2025–26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంటుందని అంచనాకు వచ్చింది. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ల తర్వాత భారత్ ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 వతేదీన లోక్‌సభలో 2025–26 వార్షిక బడ్జెట్‌ను సమ ర్పించనున్న నేపథ్యంలో పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు హేమంత్ జైన్ చేసిన ఒక ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు... → ప్రస్తుతం రూ.15 లక్షల పైన ఉన్న ఆదాయానికి 30 శాతం పన్ను రేటు వర్తిస్తోంది. అయితే ఈ స్థాయి పన్ను రేటును రూ.40 లక్షల పైన ఉన్నవారికి మాత్రమే వర్తింపజేయాలి. → ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ.10 లక్షలకు పెంచాలి. -
జపాన్‌లో ఇంత క్లీన్‌గా ఉంటుందా..!
ఏ దేశమైనా.. రోడ్లను ఎంత శుభ్రం చేసినా వాహనాలు, మనుషుల కారణంగా దుమ్ము లేకుండా ఉండదు. చెత్త లేకుండా చూడొచ్చు గానీ దుమ్ము లేకుండా అంటే కొంచెం కష్టమే. కానీ నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని చూస్తే మాత్రం ఆ దేశంలో అంత క్లీన్‌గా ఉంటుందా అని నోరెళ్ల బెడతారు.భారతదేశానికి చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్(Indian Influencer) జపాన్(Japan) పరిశుభ్రత(Cleanest)ను టెస్ట్ చేసింది. ఎందుకంటే జపాన్ కూడా ప్రపంచంలోని అత్యంత పరిశుభ్రమైన దేశాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఆ నేపథ్యంలోనే ఈ ఇన్ఫ్లుయెన్సర్ అది నిజమా..? కాదా..? అని స్వయంగా టెస్ట్ చేసింది. అందుకోసం ఒక షాపులోకి వెళ్లి తెల్లటి సాక్సులు కొత్తవి కొనుగోలు చేసింది. వాటిని వేసుకుని బూట్లు లేకుండా ఆ పరిసర ప్రాంతాల్లో నడిచింది. బూట్లను చేతితో పట్టుకుని సమీపంలో ఉన్న జీబ్రా క్రాసింగ్‌లు, ఫుట్‌పాత్‌లు వద్ద కలియతిరిగింది. ఆ తర్వాత కూల్‌గా సాక్స్‌ని విప్పి..చూస్తే ఒక్క మరక లేకుండా క్లీన్‌గా కనిపించాయి. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఇదస్సలు నమ్మశక్యంగా లేదు. అసాధ్యం అని కామెంట్ చేస్తున్నారు. అందులోకి తెల్లటి సాక్స్‌లు ఎంతలా పరిసరాలను క్లీన్‌గా ఉంచినా.. వినియోగిస్తే మాత్రం మాసినట్లు కనిపిస్తాయి. అలాంటిది ఈ సాక్సులు మాత్రం కొన్నప్పుడూ ఎలా ఉందో అలానే ఉంది. కాబట్టి ఇది నమ్మగిన వీడియో కాదంటూ తిట్టిపోస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా ఆ వీడియోలో చైనా రోడ్లు క్లీన్‌గానే కనిపించాయి. డెస్ట్ కనిపించనంత క్లీన్‌గా అనేది కొంచెం నమ్మశక్యం కానిదే. కానీ వాళ్లు చెత్త అనేది కనిపించకుండా పరిసరాలను అంతలా శుభ్రంగా ఉండేలా మెయింటైన్ చేస్తున్నందుకుగానూ తప్పకుండా ప్రశంసించాల్సిందే కదూ..!. View this post on Instagram A post shared by Simran Jain (@simranbalarjain) (చదవండి: మహాకుంభ మేళలో యోగమాతగా తొలి విదేశీ మహిళ..!) -
మహాకుంభ మేళలో యోగమాతగా తొలి విదేశీ మహిళ..!
మహా కుంభమేళా హిందువులకు పెద్ద పండుగలాంటిది. కుంభమేళా సమయంలో హిందువులు త్రివేణీ సంగమంలో స్నానం చేయాలని అనుకుంటారు. తద్వారా తాము చేసిన పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. ఈ మహాకుంభ మేళని 144 ఏళ్ల కోసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణకుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహించడం ఆనవాయితీ. అలాంటి మహా కుంభమేళలో ఎందరెందరో ప్రముఖుల, నాగసాధువులు, యోగగురువులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. తాజాగా ఈ కుంభ మేళలో ప్రధాన ఆకర్షణగా యోగ మాతగా తొలి విదేశీ మహిళ నిలిచింది. ఆమె ఏ దేశస్తురాలు..మన హిందూ ఆచారాలను అనసరించడానికి రీజన్ తదితరాల గురించి తెలుసుకుందామా..!.యోగమాతా(Yogmata) కైకో ఐకావా(Keiko Aikawa) సిద్ధ గురువు లేదా హిమాలయ సమాధి యోగి హోదాను పొందిన తొలి భారతీయేతర మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె ప్రపంచ ప్రఖ్యాత ధ్యాన నిపుణురాలు. అంతేగాదు మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించబడిన తొలి విదేశీ మహిళ కూడా ఆమెనే. ఈ మహామండలేశ్వర్ అనేది ఆది శంకరాచార్య స్థాపించిన దశనామి క్రమంలో హిందు సన్యాసులకు ఇచ్చే బిరుదు. ఈ బిరుదు ప్రకారం వారిని గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిగా పరిగణిస్తారు. ఆమె ప్రస్తుతం జరగుతున్న మహాకుంభ మేళలో పాల్గొననున్నది. నేపథ్యం..1945లో జపాన్‌లో జన్మించిన యోగమాత కైకో ప్రకృతి వైద్యంలో మంచి ఆసక్తిని పెంచుకున్నారు. ఈ అభిరుచి పశ్చిమ దేశాలలో హిప్పీ ఉద్యమం ద్వారా సంక్రమించింది. అలాగే కైకో జపాన్‌లో యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేసింది.ఆ నేపథ్యంలోనే టిబెట, చైనా, భారతదేశం గుండా పర్యటనలు చేసింది. 1972లో జపాన్ జనరల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ను స్థాపించింది. అక్కడ యోగా నృత్యం, ప్రాణ యోగాను నేర్చుకుంది. ఆధ్యాత్మిక గురువుగా ఎలా మారిందంటే..1984లో జపాన్‌లో పైలట్ బాబాను కలిసినప్పుడు పరివర్తన చెందింది. ఎత్తైన హిమాలయాలలో సిద్ధ మాస్టర్స్‌తో కలిసి యోగాను నేర్చుకోవడానికి పైలెట్ బాబా ఆమెను ఆహ్వానించారు. అక్కడ ఆమె "సమాధి" పొందడానికి కఠినమైన శిక్షణ పొందింది. హిందూ, బౌద్ధ మతాల ప్రకారం సమాధి అనేది శరీరానికి కట్టుబడి ఉండగానే సాధించగల అత్యున్నత మానసిక ఏకాగ్రత స్థితి. ఇది వ్యక్తిని అత్యున్నత వాస్తవికతతో ఏకం చేస్తుంది. 1991లో తన తొలి బహిరంగ సమాధిని ప్రదర్శించింది. ఇది ఒక అసాధారణ యోగ సాధన. ఇందులో ఆమె ఆహారం, నీరు లేకుండా 72 గంటలకు పైగా గాలి చొరబడి భూగర్భ ఆవరణలో ఉండటం జరిగింది. ఈ ఘనతను కొద్దిమంది మాత్రమే సాధించగలరు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న ఇద్దరు సిద్ధ మాస్టర్లలో ఒకరు. 2024లో పైలట్ బాబా మరణానంతరం అతని వారసురాలిగా యోగా మాత కేవలానంద్గా పేరుపొందింది. ఆమె తరుచుగా హిమాలయ రహస్య ధ్యానం"ను బోధిస్తుంది, సాధన చేస్తుంది. ఆమె అంతర్గత పరివర్తన శక్తిని విశ్వసిస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ విశ్వ ప్రేమ ఉంటుంది. దానిని గుర్తించి, సమతుల్యత, ప్రశాంతతను సాధించడమే ధ్యానం లక్ష్యం. అని చెబుతుంటుంది యోగమాత కైకో.(చదవండి: పల్లవించిన ప్రజ్ఞ! తమిళులైనా.. తెలుగులో..) -
జపాన్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరిక జారీ
టోక్యో:జపాన్(Japan)లో సోమవారం(జనవరి13) భారీ భూకంపం(EarthQuake) సంభవించింది. క్యుషు ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. 37 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యురోపియన్ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది. ఈ భూకంపం ధాటికి ఎలాంటి పప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని సమాచారం. అయితే ముందు జాగ్రత్తగా కొన్ని తీర ప్రాంతాలకు సునామీ(Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. గతేడాది ఆగస్టు 8న క్యుషు ప్రాంతంలో రెండు భారీ భూకంపాలు రాగా జనవరి 1 2024న 7.6 తీవ్రతతో సుజు,వజీమాలో భారీ భూకంపం సంభవించింది.ఈ భూకంపం ధాటికి ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు టెక్టానిక్ ప్లేట్లు కలిసే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో జపాన్ ఉండడంతో ఇక్కడ తరచు భూకంపాలు వస్తుంటాయి. -
Sankranti 2025 : జపాన్‌లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు
-
Sankranti 2025 : జపాన్‌లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి వచ్చిందంటే ఊరా వాడా అంతా సంబరంగా జరుపుకుంటారు. తొలి పండగ, పెద్ద పండగ అంటే ప్రపంచంలో ఎక్కడున్నా సంబరాలు అంబరాన్నంటుతాయి. స్థానికంగా ఉన్న తెలుగువారంతా ఒక్క చోట సంబరంగా వేడుకచేసుకుంటారు. సంక్రాంతి-2025 సందర్భంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్( తాజ్-TAJ) ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల పోటీలను నిర్వహించారు. పిల్లలకు డ్రాయింగ్ ఈవెంట్, పెద్దలకు కబడ్డీ పోటీలు, ఆడవారికి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఇంకా కైట్ ఫెస్టివల్‌తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండువలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జపాన్‌లో నివసించే తెలుగువారు, జపనీయులు కూడ పెద్ద ఎత్తున పాల్గొని సంతోషంగా గడిపారు.ఉద్యోగగ రీత్యా విదేశాల్లో ఉన్నప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా తరువాతి తరం వారికి అందించే విధంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్( తాజ్-TAJ) నిరంతరం కృషిచేస్తూ ప్రశంసలు అందుకుంటుంది.గత పదేళ్లుగా సంక్రాంతి డుకులను జరుపుకుంటూ వస్తున్నామని తాజ్ నిర్వాహకులు ప్రకటించారు. ఒక్క సంక్రాంతి పండుగ మాత్రమే కాకుండా, ప్రతీ తెలుగు పండుగను అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకుంటా మన్నారు. -
గోల్డెన్ గ్లోబ్స్ 2025 వేడుక: 24 క్యారెట్ల బంగారంతో వంటలా..!
82వ గోల్డెన్ గ్లోబ్స్(Golden Globes) ఈ నెల జనవరి 6, 2025న లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్టన్‌లో అట్టహాసంగా జరిగింది. ఇది స్టార్ స్టడ్స్ అవార్డుల ప్రధానోత్సవం. ఏదైన హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (HFPA) గతేడాది సినిమా, టెలివిజన్లలోని ఆయా విభాగాల్లో అత్యుత్తమ విజయాన్ని సాధించిన వారికి అవార్డులు అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లో వడ్డించే విందు కూడా అత్యంత గ్రాండ్‌గానే ఉంటుంది. సాదాసీదా చెఫ్‌లు తయారు చేయరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ మెనూలో ఉండే వెరైటీ వంటకాలెంటో చూద్దామా..!.ఈ వేడుకలో వంటకాలను తయారు చేసేది పాక ప్రపంచంలో ప్రముఖ లెజెండ్ అయిన నోబు మత్సుహిసా(Chef Nobu Matsuhisa). ఆయన సాంప్రదాయ జపనీస్ రుచులకు వివిధ పద్ధతుల మిళితం చేసి అందించడంలో ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో రెస్టారెంట్లో నోబు తన పాక నైపుణ్యాన్ని రుచి చూపించారు ఆహారప్రియులకు. ఇలాటి లగ్జరీయస్ ఈవెంట్‌లోని మెనూ బాధ్యతను చెఫ్ నోబు తీసుకోవడం రెండోసారి. ఇక ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్స్ 2025లోని అతిథులకు చెఫ్ నోబు ..ఎల్లోటైల్ జలపెనో, సిగ్నేచర్ మాట్సుహిసా డ్రెస్సింగ్‌తో సాషిమి సలాడ్, మిసో బ్లాక్ కాడ్, సీవీడ్ టాకోస్ విత్ కేవియర్, సాల్మన్, ట్యూనా, తాయ్ వంటి వాటితో రకరకాల డిష్‌లు తయారు చేశారు. ఈ రుచికరమైన పదార్థాలన్నింటిలో అత్యంత లగ్జరీయస్ రెసిపీ కూడా షేర్ చేసుకున్నారు. ఆ మెనూలో హైలెట్‌గా గోల్డ్ స్టాండర్డ్ రోల్(Gold Standard Roll) నిలిచింది. దీన్ని ఈ గోల్డెన్ గ్లోబ్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారట చెఫ్ నోబు. ఈ అద్భుతమైన రోల్‌ని కింగ్ క్రాబ్, సాల్మన్ ఉపయోగించి తయారు చేశారట. అలాగే 24-క్యారెట్ బంగారు రేకులు(24-karat gold ), కేవియర్తో అలంకరించి సర్వ్ చేశామని తెలిపారు చెఫ్ నోబు. అంతేకాదండోయ్ ఈ వేడుకలో ప్రీమియం షాంపైన్, వైన్‌ను హాయిగా సిప్ చేయొచ్చట. View this post on Instagram A post shared by Golden Globes (@goldenglobes) (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!) -
అతడితో బంధం ముగిసింది: టెన్నిస్ స్టార్
జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తన భాగస్వామి కోర్డె అమరి బ్రూక్స్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ‘ఇకపై అతడితో సంబంధం లేదు. అంతా ముగిసినట్లే’ అని ఒసాకా సామాజిక మాధ్యమాల వేదికగా స్పష్టం చేసింది. వేర్వేరు దారుల్లో పయనంఈ మేరకు.. ‘పరస్పర అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. అతడిపై విమర్శలు చేసేందుకు కూడా లేదు.కోర్డె గొప్ప వ్యక్తి. అంతకుమించి అద్భుతమైన తండ్రి. వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలో ఎన్నో నేర్చుకున్నా. నా కుమార్తె అతిపెద్ద ఆశీర్వాదం’ అని ఒసాకా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా ఒసాకా ఖాతాలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇక తాజా సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. 2019 నుంచి కోర్డె- నయోమి ఒసాకా సహజీవనం చేస్తున్నారు. ర్యాపర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కోర్డెతో కలిసి 27 ఏళ్ల ఒసాకా 2023లో ఓ పాపకు జన్మనిచ్చింది. కాగా జనవరి 12 నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ మొదలుకానుంది. మరిన్నిక్రీడా వార్తలుసహజ శుభారాంభంసాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల డబ్ల్యూ75 టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో సహజ 6–3, 7–5తో పునిన్ కొవాపిటుక్‌టెడ్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది.ఒక గంటా 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ఏడు ఏస్‌లు సంధించింది. రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 76 పాయింట్లు గెలిచింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.అయితే, డబుల్స్ విభాగంలో సహజ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సహజ (భారత్)–దరియా అస్తకోవా (రష్యా) ద్వయం 3–6, 3–6తో నయీమా కరామోకు (స్విట్జర్లాండ్)–ఇనెస్ ఇబు (అల్జీరియా) జోడీ చేతిలో ఓడిపోయింది. కళింగ లాన్సర్స్ చేతిలో బెంగాల్ టైగర్స్ చిత్తు రూర్కెలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో కళింగ లాన్సర్స్ భారీ విజయాన్ని అందుకుంది. లాన్సర్స్ 6–0 గోల్స్‌తో బెంగాల్ టైగర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఇందులో 4 ఫీల్డ్ గోల్స్ కాగా... 2 గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారా వచ్చాయి. లాన్సర్స్ తరఫున థియరీ (3వ నిమిషం, 47వ నిమిషం), సంజయ్ (4వ నిమిషం), హెన్డ్రిక్ (6వ నిమిషం), బండూరన్ (29వ నిమిషం), బాబీ సింగ్ ధామీ (49వ నిమిషం) గోల్స్ సాధించారు.తొలి క్వార్టర్స్‌లో 3 గోల్స్‌తో ముందంజ వేసిన లాన్సర్స్‌ను తర్వాతి రెండు క్వార్టర్లలో కొంత వరకు నిలువరించడంలో టైగర్స్ సఫలమైంది. అయితే చివరి క్వార్టర్లో కూడా మరో రెండు గోల్స్‌తో కళింగ తమ ఆధిక్యాన్ని పెంచుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లలో తమిళనాడు డ్రాగన్స్‌తో గోనాసిక వైజాగ్...యూపీ రుద్రాస్‌తో హైదరాబాద్ తూఫాన్స్ తలపడతాయి. -
116 ఏళ్ల మహిళ ఇక లేరు
టోక్యో: ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన జపాన్ బామ్మ టొమికో ఇటూకా 116 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. హ్యోగో ప్రిఫెక్చర్‌లోని ఆషియా నగరంలోని వృద్ధాశ్రయంలో డిసెంబర్ 29వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచారని జపాన్ ప్రభుత్వ వృద్ధుల వ్యవహారాల పర్యవేక్షణ విభాగం అధికారి యోషిట్సుగు నగటా చెప్పారు. అరటి పండ్లు, జపాన్ పానీయం కల్పిస్ను అమితంగా ఇష్టపడే ఇటూకా 1908 మే 23వ తేదీన ఒసాకాలో జన్మించారు.హైసూ్కల్లో చదువుకునేటప్పుడు వాలీబాల్ ప్లేయర్. సుమారు 3,067 మీటర్ల ఎత్తున్న ఒంటాకె పర్వతాన్ని రెండుసార్లు అధిరోహించారు. ఆమెకు 20 ఏళ్లప్పుడు పెళ్లయింది. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కలిగారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భర్త సారథ్యంలోని దుస్తుల ఫ్యాక్టరీని నడిపారు. భర్త 1979లో చనిపోయినప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఇటూకాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు, ఐదుగురు మనవలు ఉన్నారు. కాగా, గతేడాది ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు 117 ఏళ్ల మరియా బ్రన్యాస్ మరణించడంతో ఆమె స్థానంలో ఇటూకాను అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా గెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్ ప్రకటించారు. తాజాగా ఇటూకా కన్నుమూయడంతో ఆమె కంటే 16 రోజులు మాత్రమే చిన్నదైన బ్రెజిల్‌కు చెందిన సన్యాసిని ఇనాహ్ కనబర్రోను ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పరిగణిస్తామని గెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్ తెలిపింది. -
ఇండో–పసిఫిక్ స్వేచ్ఛా, సుస్థిరతలే లక్ష్యం
న్యూఢిల్లీ: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దుందుడుకు, విస్తరణవాదానికి కళ్లెం వేస్తూ ఈ ప్రాంత స్వేచ్ఛా, సుస్థిరతలే లక్ష్యంగా ఉమ్మడిగా ముందడుగువేస్తున్నామని క్వాడ్ కూటమి దేశాలు పునరు ద్ఘాటించాయి. క్వాడ్ కూటమిగా ఆవిర్భవించి పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకోవడం మొదలెట్టి 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా క్వాడ్ సభ్యదేశాలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదలచేశాయి. 2004లో హిందూ మహాసముద్రంలో ఇండోనేసియా సమీపంలో సముద్రగర్భంలో భూకంపం కారణంగా ఉద్భవించిన సునామీ సృష్టించిన విలయం నుంచి కోలుకునేందుకు భార త్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు 20 ఏళ్ల క్రితం ‘క్వాడ్’కూటమిగా ఏర్పడిన విషయం విదితమే.మంగళవారం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదలచేశారు. ఇటీవలికాలంలో ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తరచూ సముద్రతీర భద్రత, మౌలిక వసతుల కల్పన, దేశాల మధ్య అనుసంధానత పెను సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సంయుక్త ప్రక టన వెలువడటం గమనార్హం. ‘‘ఇండో–పసిఫిక్ స్వేచ్ఛాయుతంగా ఉంటే ఇక్కడ సుస్థిరత, పారదర్శకత నెలకొనడంతోపాటు దేశాల మధ్య పరస్పర నమ్మకం, విశ్వాసం ఇనుమడిస్తుంది. పది దేశాలతో ఏర్పడిన ఆసియాన్ గురించి క్వాడ్ ఆలో చిస్తోంది. తూర్పు ఆసియా దేశాలకు పూర్తి సహాయసహకారాలు అందించడంతోపాటు దేశాల మధ్య ఐక్యతకు క్వాడ్ కృషిచేస్తోంది. పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లకూ క్వాడ్ తన మద్దతు పలుకుతోంది.సునామీ వంటి ప్రకృతి విపత్తులు మా నాలుగు దేశాలను దగ్గర చేశాయి. సునామీ వినాశనం వేళ దాదాపు 2.5 లక్షల మంది సజీవ సమాధి అయ్యారు. రాకాసి అలల ధాటికి తీరప్రాంతమున్న 14 దేశాల్లో 17 లక్షల మంది సర్వస్వం కోల్పోయి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. లక్షలాది బాధితులను ఆదుకునేందుకు 40,000కు పైగా అత్యయక బృందాలు అవిశ్రాంతంగా సేవలందించాయి. వినాశనాల వేళ మానవీయ సా యం, విపత్తు స్పందన సహకారం అందించడమే క్వాడ్ ముఖ్యోద్దేశం. ఇండో–పసిఫిక్‌లో తలెత్తే ఎలాంటి ఉపద్రవాన్నైనా తక్షణం ఎదుర్కొనేందుకు మేం సదా సిద్ధంగా ఉన్నాం.2021 నుంచి ప్రతి ఏటా క్వాడ్ దేశాధినేతలు దక్షిణాసియా, ఆగ్నేయాసియా, పసిఫిక్ ప్రాంతాల అభ్యున్నతికి ఎంతగానో కృషిచేశారు’’అని సంయుక్త ప్రకటన పేర్కొంది. 2025 ద్వితీయార్థంలో క్వాడ్ సదస్సు భారత్‌లో జరగనుంది. క్రితంసారి అమెరికాలోని విలి్మంగ్టన్‌లో క్వాడ్ సదస్సు జరిగింది. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ దేశాల సార్వ¿ౌమత్వానికి భంగం వాటిల్లకుండా క్వాడ్ దేశాలు పనిచేస్తున్నాయని ప్రకటన స్పష్టంచేసింది. -
‘సుడోకు’ రావాలంటే గణితంతో పనిలేదు..! కేవలం..
తొమ్మిది గుడులు.. తొమ్మిది అంకెలు. అటు చూసినా ఇటు చూసినా ఒకటి నుంచి తొమ్మిది వరకు అన్ని అంకెలూ రావాలి. ఒక్కటీ మిస్ కాకూడదు, ఒకే అంకె మరోసారి రాయకూడదు. ఇవన్నీ సుడోకు(sudoku) ఆటలో నియమాలు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నిత్యం ఆడే ఈ ఆటంటే పిల్లలతోపాటు పెద్దలకూ చాలా ఇష్టం. దీని వల్ల లెక్కల మీద ఇష్టంతోపాటు ఏకాగ్రత, దీక్ష పెరుగుతాయి. ‘సుడోకు’ జపాన్‌లో (Japan) చాలా ప్రసిద్ధి చెందింది. అయితే పుట్టింది మాత్రం అమెరికాలో. 1979లో హోవర్డ్ గాన్స్ అనే ఆయన దీన్ని కనిపెట్టారు. ఆ తర్వాత ఇది పలు పత్రికల్లో ప్రచురితమైంది. అయితే 1986లో జపాన్‌కు చెందిన పజిల్ కంపెనీ ‘నికోలీ’ ఈ ఆటకు ‘సుడోకు’ అని పేరు పెట్టిన ప్రపంచమంతా తెలిసింది. ‘సుడోకు’ అంటే ‘ఒకే సంఖ్య’ అని అర్థం. సుడోకు ఆడాలంటే లెక్కలు తెలిసి ఉండాలని చాలామంది పొరబడుతుంటారు. నిజానికి అదేమీ అక్కర్లేదని సుడోకు నిపుణులు అంటున్నారు. ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు గుర్తుపట్టగలిగేవారు ఎవరైనా సుడోకు ఆడొచ్చంటున్నారు. ఈ ఆట ఆడేందుకు గణితశాస్త్రంతో పని లేదని, కేవలం ఆలోచనాశక్తి చాలని వివరిస్తున్నారు.సుడోకులోనూ అనేక రకాలున్నాయి. జిగ్సా సుడోకు, సమురాయ్ సుడోకు, మినీ సుడోకు, లాజిక్ 5, కిల్లర్ సుడోకు.. ఇలా ఒకే ఆటని రకరకాలుగా ఆడతారు. పేరుకు ఆటే అయినా ఇది ఆడేందుకు ఒక్కరే సరిపోతారు. ఒకచోట కూర్చుని పెన్ను, కాగితం పట్టుకొని గడులు నింపడమే ఇందులో కీలకం. చదవండి: ఆమె ఇళయరాజానా లేక రెహమానా..? అంత చిన్న వయసులోనే..సుడోకు ఎలా ఆడాలి, తొందరగా ఎలా పూర్తి చేయాలి అనే విషయాలను వివరిస్తూ కొంతమంది పుస్తకాలు రాశారు. అలాగే సుడోకు పేపర్లతో నిండిన పుస్తకాలను మార్కెట్లో అమ్ముతుంటారు. త్రీడీ సుడోకులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు ఫోన్లో సుడోకు ఆడేందుకు ప్రత్యేకమైన యాప్స్ అందుబాటులో ఉన్నాయి. 2006లో ఇటలీ(Italy)లో ప్రపంచ సుడోకు ఛాంపియన్(Championship) షిప్ ఏర్పాటు చేశారు. ఏటా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ విన్నాక మీకూ సుడోకు మీద ఆసక్తి కలుగుతోందా? ఇంకెందుకు ఆలస్యం.. వెళ్లి ఆడేయండి. మెదడును పదునుగా మార్చుకోండి. -
ఈ నీళ్లు.. చాలా ఖరీదు గురూ!
నీరు.. మానవాళికి తప్పనిసరిగా అవసరమైన వనరు. ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా లభ్యమయ్యే నీటిని ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. ఒక లీటరు వాటర్ బాటిల్ ఖరీదు సాధారణంగా రూ.20 ఉంటుంది. కంపెనీ, ఇతరత్రా అంశాలను బట్టి రూ.2వేల బాటిల్ కూడా ఉంది. కానీ జపాన్‌కు చెందిన ఫిల్లికో అనే కంపెనీ ఇంతకుమించిన ధరకు మంచినీళ్లను అమ్ముతోంది. ఆ కంపెనీ వాటర్ బాటిళ్ల ధర రూ.84వేల నుంచి మొదలై ఏకంగా రూ.8 లక్షల వరకు ఉంది. ధర చూస్తే గుండె గుభేల్మనడం ఎంత నిజమో.. ఆ బాటిల్ చూసిన తర్వాత వావ్ అని అనకుండా ఉండలేకపోవడం కూడా అంతే నిజం. ఆ బాటిల్ అందం అలాంటిది మరి. ఇంతకీ ఆ బాటిల్ నీళ్లకు అంత రేటెందుకు? అవేమైనా పైనుంచి దిగొచ్చాయా అనే కదా మీ సందేహం? ఔను.. జపాన్‌లో అత్యంత స్వచ్ఛమైన ప్రదేశంగా భావించే కోబ్‌లోని రౌకా నేషనల్ పార్క్‌లో ఉన్న నునోబికి ఫాల్స్ నుంచి రాతిశిలల ద్వారా సహజసిద్ధంగా శుద్ధి అయి కిందకు వచ్చిన నీళ్లవి. నునోబికి ప్రాంతం అటు పరిశ్రమలకు, ఇటు వ్యవసాయానికి చాలా దూరంగా ఉండటం వల్ల అక్కడ ఎలాంటి కాలుష్యం ఉండదు. అందువల్ల అక్కడ నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. పైగా రాతిశిలల్లో నుంచి ఫిల్టర్ కావడం వల్ల మరింత స్వచ్ఛత కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ నీటిలోని సహజసిద్ధమైన ఖనిజ లవణాలు, స్వచ్ఛత పోకుండా కనీస ప్రాసెసింగ్ పద్ధతులను ఉపయోగించి ప్యాక్ చేస్తారు. ఎంత కష్టపడి నాణ్యమైన నీటిని తీసుకొచ్చి జాగ్రత్తగా ప్యాక్ చేసినా.. రంగు, రుచి, వాసన లేని నీటికి మరీ ఇంత రేటేంటి బాస్ అంటారా? ఇదే డౌట్ ఫిల్లికో కంపెనీ యజమాని క్రిస్టియన్ డయోర్కీ వచి్చంది. మనిషికి నిత్యావసరమైన నీటిని లగ్జరీ వస్తువుగా అధిక ధరకు అమ్మడం ఎలా అని ఆలోచించారు.దేవతా రెక్కలు.. కిరీటాలు..» ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేయడం ద్వారా మార్కెటింగ్ చేయడం సులభం అని డియోర్ భావించారు. దానికి తగినట్టుగా తమ బాటిల్ డిజైన్‌ను వినూత్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. శాటిన్ గాజుతో కంటికి ఇంపుగా కనిపించేలా బాటిల్ డిజైన్ చేయించారు. తాము విక్రయించే ధరకు అది చాలదనే భావనతో దానికి అదనపు సొబగులద్దారు. బాటిల్ మూతలను రాజు, రాణి కిరీటాలను పోలి ఉండేలా రూపొందించారు.దేవతలకు రెక్కలు ఉన్నట్టుగా బాటిల్‌కు రెండు రెక్కలు కూడా జోడించారు. అవసరమైన చోట వెండి పూత పూయించారు. లగ్జరీ బ్రాండ్ స్ఫటికాలను ఉత్పత్తి చేసే స్వరోవ్స్కీ స్ఫటికాలను బాటిల్‌పై అమర్చారు. వెరసి.. చూసిన తర్వాత చూపు తిప్పుకోలేనంత అందమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. దీనికి ఫిల్లికో జ్యవెలర్ వాటర్ అని పేరు పెట్టి.. ఇది సార్ మా బ్రాండ్ అంటూ తొలుత తమ వీఐపీ కస్టమర్లకు పరిచయం చేశారు. వారి నుంచి అద్భుత స్పందన వచ్చిoది. అనంతరం ఫిల్లికో కంపెనీ 2008లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించడంతో ఈ బ్రాండ్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. అంతే అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు. 2005లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. అయితే, బాటిళ్ల డిజైన్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిని చేతితోనే తయారుచేస్తారు. అందువల్ల నెలకు 5వేల బాటిళ్లను మించి ఉత్పత్తి చేయరు. ఇది కూడా ఈ బ్రాండ్ డిమాండ్ కొనసాగడానికి మరో కారణం. ప్రస్తుతం ఫిల్లికో జ్యువెలరీ వాటర్ రెండో తరం నడుస్తోంది. ఈ బాటిల్ ప్రారంభ ధర వెయ్యి డాలర్లు. (దాదాపు రూ.84 వేలు). ఒక్కోసారి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మరింత వినూత్నమైన బాటిళ్లను ఉత్పత్తి చేసి విక్రయిస్తుంటారు. వాటి ధర ఏకంగా రూ.8.40 లక్షల వరకు కూడా ఉంటుంది. వాస్తవానికి ఆ బాటిల్లో ఉన్న నీళ్లను కాదు.. ఆ నీళ్లున్న బాటిల్‌ను ఇంత ధర పెట్టి కొనాలన్న మాట. అయితే, దాహం వేసిన ప్రతిసారీ ఈ నీటిని తాగితే కష్టమే కదా? కేవలం తమ స్టేటస్ సింబల్ చాటుకోవాల్సిన సందర్భాల్లో ఓ రెండు గుటకలు వేయక తప్పదు మరి. అసలే బ్రాండ్ వాటర్.. పైగా లిమిటెడ్ ఎడిషన్స్. ఆ మాత్రం ముందు జాగ్రత్త తప్పనిసరి.. కాదంటారా? – సాక్షి సెంట్రల్ డెస్క్ -
పట్టుదలగా చేస్తే.. గుట్టలాంటి బెల్లీ ఫ్యాట్ దెబ్బకి...!
కొండలాంటి పొట్టను కరిగించుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారా? ఎంత కష్టపడినా బెల్లీ ఫ్యాట్ తగ్గడంలేదని ఆందోళనలో ఉన్నారా? మరి అలాంటివారికి చక్కగా ఉపయోగపడే పురాతన యుద్ధ కళలు, ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరైన జపాన్‌లో ఆచరించే కొన్ని వర్కౌట్స్ గురించి తెలుసు కుందాం రండి!ఆహార అలవాట్లలో మార్పులతోపాటు కొన్ని జపనీస్ వ్యాయామాలు బెల్లీ ఫ్యాట్‌ను కరిగించు కునేందుకు, బాడీ ఫిట్‌గా ఉండేందుకు ఉపకరిస్తాయి.సుమో స్క్వాట్స్జపనీస్ ప్రొఫెషనల్ రెజ్లర్ల మ్యాచ్‌కు ముందు పొట్ట, తొడలపై భారం పడేలా కొన్ని భంగిమలను ప్రదిర్శిస్తారు. దాదాపు అలాంటివే ఈ సుమో స్క్వాట్స్పాదాలను వెడల్పుగా చాచి,నడుముపై భారం వేసి, భుజాలను స్ట్రెచ్ చేసి, రెండు చేతులను దగ్గరగా చేర్చి నమస్కారం పెడుతున్న ఫోజులో నిలబడాలి. ఇపుడు, పొత్తికడుపు, కాలి కండరాలపై భార పడుతుంది. ఈ భంగిమలో కనీసం 30 సెకన్ల పాటు నిలబడి, తిరిగి యథాస్థితిలోకి రావాలి.తెనుగుయ్ టైడో (టవల్ స్వింగ్స్)అత్యంత ప్రభావవంతమైన, సులభంగా నిర్వహించగల జపనీస్ వ్యాయామాలలో ఒకటి, టవల్ స్వింగ్‌లు కడుపు, పొత్తికడుపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. కండరాలను బలపరుస్తాయి.పాదాలను వెడల్పుగా ఉంచి, భుజాలు స్ట్రెచ్అయ్యేలా చేతులను వెడల్పుగా చాచి నిల బడాలి. ఇపుడు రెండు చేతలుతో ఒక టవల్‌ను రెండు వైపులా పట్టుకొని స్వింగ్ చేయాలి. కనీసం 2 నిమిషాలు చేయాలి. సౌలభ్యాన్ని ఈ సమయాన్ని పెంచుకోవచ్చు.రేడియో టైసో..కాళ్లు, చేతులు వేగంగా కదిలిస్తూ, శరీరాన్ని ముందుకు, వెనక్కి వంచుతూ వ్యాయామాలు చేస్తారు. ఇవి వివధ శరీర భాగాల్లోనే కాకుండా పొట్ట, నడుము చుట్టు ఉండే కొవ్వును అద్భుతంగా కరిగిస్తాయి. లంగ్ అంట్ టో టచ్కుడి కాలిని మడిచి, ఎడమ కాలిని సాధ్యమైనంత ముందుకు చాపాలి. కుడిచేత్తో కుడి కాలి తొడమీద సపోర్టు తీసుకుని, నడుమును వంచి ఎడమచేతితో ఎడమ కాలి బొటన వేలి తాకాలి. ఇలా విరామం తీసుకుంటూ ఇలా రెండువైపులా చేయాలి.హూలాహూప్నడుము చుట్టూ ఒక పెద్ద రింగ్ ధరించి హూలాహూప్ వర్కౌవుట్ చేస్తారు. పొట్ట భాగంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. కాళ్లు, చేతులు, కోర్ కండరాలు ధృడంగా తయారవుతాయి.నోట్: క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేయడం కాదు. శరీరం సమతుల్యంగా, ఫిట్‌గా ఉండటానికి కూడా దోహదం చేస్తాయి. ఇండోర్ వర్కౌట్స్, ఔట్‌డోర్ వర్కౌట్స్‌తో కొవ్వులను సులభంగా కరిగించుకోవచ్చు. అయితే కొంత మందికి కొన్ని ఆరోగ్య పరిస్థితులు, వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు, జీవనశైలిగా కారణంగా అనుకున్నంత సులువు కాకపోవచ్చు. దీనికి వైద్య నిపుణుల సలహాలను తీసుకోవాల్సి ఉంటుంది. -
అక్కడి ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన ప్రభాస్... ఎందుకంటే?
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. దాదాపు రూ.1200 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఆ మధ్య వైజయంతి మూవీస్ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 3న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.జపాన్ భాషలో సారీ చెప్తూ..అంతేకాదు, జపాన్ను సైతం వస్తానని మాటిచ్చాడు ప్రభాస్. కానీ ప్రస్తుతం కాలికి గాయంతో బాధపడుతున్నందున ఆ ప్లాన్‌ను వాయిదా వేశాడు. దీంతో జపాన్ భాషలో అక్కడివారికి సారీ చెప్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. 'నాపై, నా సినిమాలపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. గాయం వల్లే..జపాన్‌కు రావాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. కానీ నా కాలికి గాయం కావడం వల్ల రాలేకపోతున్నాను. కానీ త్వరలోనే మీ ముందుకు వస్తానని మాటిస్తున్నాను. జనవరి 3న జపాన్‌లో రిలీజయ్యే కల్కి 2898 ఏడీ మూవీ చూసి ఎంజాయ్ చేయండి' అని పేర్కొన్నాడు. ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నాడు.కల్కి సినిమా సంగతులుకల్కి విషయానికి వస్తే.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వర్షన్స్)తో పాటు నెట్‌ఫ్లిక్స్ (హిందీ వర్షన్)లో అందుబాటులో ఉంది.#プラバース から日本のすべてのファンの皆さんへメッセージ 🫶❤️🔥- https://t.co/mLRYxxFLXl#Kalki2898AD releasing in cinemas across Japan from January 3rd!#カルキ2898AD #Kalki2898ADinJapan@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani… pic.twitter.com/CYdG1kmTmm— Kalki 2898 AD (@Kalki2898AD) December 18, 2024//#カルキ2898ADジャパンプレミア実況🏹\\TOHOシネマズ六本木ヒルズ 無事終了いたしました✨次は、19:00〜新宿ピカデリーにて!🔥#カルキ2898AD来日譚 pic.twitter.com/YIEbOzkhF6— 【公式】映画『カルキ 2898-AD』 (@kalki2898AD_jp) December 18, 2024చదవండి: నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్ -
బ్యాంకులో రూ.558 కోట్ల దొంగతనం!
ఖాతాదారులకు చెందిన సేఫ్ డిపాజిట్ బాక్స్‌ల నుంచి ఒక బిలియన్ యెన్ (సుమారు 6.6 మిలియన్ డాలర్లు-రూ.558 కోట్లు) సొమ్మును బ్యాంకు ఉద్యోగి దొంగలించినట్లు జపాన్‌లోని ప్రముఖ బ్యాంకు మిత్సుబిషి యుఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ తెలిపింది. అందుకుగాను అధికారికంగా కస్టమర్లకు క్షమాపణలు చెప్పింది. 60 మంది క్లయింట్ల్లో సుమారు 20 మంది ఖాతాల్లో నుంచే 300 మిలియన్ యెన్ (దాదాపు 2 మిలియన్ డాలర్లు-రూ.169 కోట్లు) వరకు దొంగతనాలు జరిగినట్లు ధృవీకరించింది. కస్టమర్లు కోల్పోయిన నగదు పరిహారం కోసం కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: కొత్త సార్ ముందున్న సవాళ్లు!ఎంయూఎఫ్‌జీ ప్రెసిడెంట్, సీఈఓ జునిచి హంజావా విలేకరులతో మాట్లాడుతూ..‘టోక్యోలోని మిత్సుబిషి యుఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ బ్యాంకు శాఖల్లో ఈ దొంగతనాలు జరిగాయి. ఏప్రిల్ 2020 నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు ఈమేరకు ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించాం. సేఫ్ డిపాజిట్ బాక్స్‌లను ఓ మహిళా ఉద్యోగి నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన కీ తనవద్దే ఉంటుంది. ఆ ఉద్యోగి డబ్బు తీసుకున్నట్లు, ఇతర పెట్టుబడులు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు అంగీకరించింది. వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి విచారణ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశాం. జరిగిన దొంగతనానికి క్షమాపణలు కోరుతున్నాం. నగదు నష్టపోయిన కస్టమర్లకు పరిహారం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు. -
స్టార్ హీరో ప్రభాస్ మళ్లీ గాయపడ్డాడా?
వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. గతేడాది 'సలార్', ఈ ఏడాది 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న డార్లింగ్ హీరో.. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీస్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. మరి ఎప్పుడు జరిగిందో గానీ ప్రభాస్ చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే వెల్లడించినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)'బాహుబలి' తర్వాత నుంచి ప్రభాస్ తన ప్రతి సినిమాను జపాన్‌లోనూ విడుదల చేస్తున్నాడు. రాబోయే జనవరి 3న 'కల్కి' జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఈ సినిమా ప్రీమియర్ కోసం ప్రభాస్ వెళ్లే ప్లాన్ ఫిక్సయింది. ఇప్పుడు ఇతడి చీలమండ బెణికిందని, దీంతో జపాన్ రాలేకపోతున్నానని జపనీస్ భాషలో ప్రభాస్ ఓ లెటర్ ఒకటి వైరల్ అవుతుంది. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. గతంలో పలుమార్లు ప్రభాస్ గాయపడ్డాడు!ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికే చాలా షూటింగ్ పెండింగ్‌లో ఉందని, బహుశా ఈ తేదీకి రాకపోవచ్చనే రూమర్స్ నడుస్తున్నాయి. విడుదల తేదీ ఇంకా చాలా దూరముంది కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
యునెస్కో సాంస్కృతిక ఫుడ్స్ 2024
యునెస్కో ప్రతి యేటా వివిధ దేశాల సాంస్కృతిక వారసత్వాలను, అక్కడి కళారూ΄ాలను గుర్తించి మనముందుకు తీసుకువస్తుంది. ఈ యేడాది అత్యంత ప్రాచీనమైన వివిధ రుచికరమైన వంటకాల జాబితాను తీసుకొచ్చింది. వాటిలో...అరబిక్ కాఫీఅరబ్ ప్రపంచంలో కాఫీ తయారీ, దానిని అతిథులకు అందజేసే విధానం అత్యద్భుతంగా ఉంటుందట. ఈ విధానం కూడా వారి తరతరాల భాగస్వామ్యం ఉందని, దీనిని యునెస్కో జాబితాలో చేర్చింది.జపాన్ వారి సాకె రైస్వైన్గా గుర్తింపు పొందిన సాకె ను స్థానిక సాంస్కృతిక వేడుకలలో సేవిస్తారు. దీని తయారీ వెనక తరాలుగా వస్తున్న కుటుంబాల శ్రమ ఉంటుంది.మలేషియన్ బ్రేక్ఫాస్ట్వంటకాల రుచి గురించి చెప్పుకోవాలంటే ఉదయం అల్పాహారంగా మలేషియా ‘నాసి లెమక్, రోటీ కనాయ్’ని ఈ దేశపు హిస్టరీగా చెప్పుకోవచ్చు. వందల ఏళ్ల ఈ ఆహార తయారీ ఫార్ములా వారికి మాత్రమే తెలుసు.కొరియా జంగ్కొరియా వంటకాలలో జంగ్ అనే వంటకం తయారీ, రుచి, దానిని నిల్వ చేసే పద్ధతలు శతాబ్దాలుగా ఒక తరం నుంచి మరో తరానికి వస్తున్నాయి.అజెర్బైజాని బ్రెడ్మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల బ్రెడ్స్ చూసి ఉంటాయి. కానీ, అజెర్బైజాని బ్రెడ్ తయారీలో వారి సంస్కృతి పరమైన ప్రభావం ఎంతో ఉందంటున్నారు. ఈ బ్రెడ్ తయారీలో వాడే పదార్థాలు, తయారీలో తరాల వారసత్వం ఉందని జాబితాలో పొందుపరిచారు. -
గ్లాసు వైన్ 5 లక్షల డాలర్లు!
అవున్నిజమే! మన రూపాయల్లో కోటి 24 లక్షల రూపాయల పైమాటే. అంత ఖరీదెందుకు, ఏమిటా వైన్ ప్రత్యేకత వంటి సందేహాలెన్నో వస్తున్నాయి కదా! ఆ వైన్ అంతరిక్ష కేంద్రంలో తయారవుతోంది మరి! ఇదంతా జపాన్‌కు చెందిన ప్రముఖ సేక్ (వైన్) బ్రాండ్ దస్సాయ్ తయారీ సంస్థ అసాహి షుజో ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చింది. ముడి పదార్థాలను ఏకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పంపించి అక్కడ పులియబెట్టాలని యోచిస్తోంది. ఇది విజయవంతమైన మీదట కేవలం 100 మి.లీ. వైన్ బాటిల్‌ను ఏకంగా రూ.5.53 కోట్లకు అమ్మనుంది. ఈ ప్రయోగానికి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి కంపెనీ భారీ మొత్తమే చెల్లించింది. ఈ ప్రాజెక్టును 2025లో లాంచ్ చేయనుంది. అంతరిక్షంలో పులియబెట్టేందుకు కావాల్సిన పరికరాల తయారీలో బిజీగా ఉంది. అయితే గురుత్వాకర్షణ ఉండని అంతరిక్ష కేంద్రంలో పులియడానికి కావాల్సిన కిణ్వ ప్రక్రియ ఎలా జరుగుతుందన్నది చూడాలి. చంద్రుడే లక్ష్యంగా.. ప్రయోగం గనుక సక్సెసైతే ఇదే అతి ఖరీదైన పానీయం అవుతుందని అసాహి షుజో కంపెనీ బ్రూవర్ ప్రాజెక్ట్ ఇన్చార్జి సౌయా ఉట్సుకి చెప్పారు. ‘‘అయితే ఈ పరీక్ష 100% విజయవంతమవుతుందని గ్యారంటీ లేదు. కాకపోతే మా ప్రయత్నం వెనుక కేవలం ఘనత కోసం కాదు. అంతరిక్షంలో కిణ్వ ప్రక్రియ ఏ మేరకు జరుగుతుందన్న దానిపై మా కంపెనీ దృష్టి పెట్టింది. జరిగితే ఏదో ఒకనాడు చంద్రుడిపైనా వైన్‌ను పులియబెట్టడం మా కంపెనీ లక్ష్యం. మున్ముందు మనుషులు చంద్రుడిపైకి స్వేచ్ఛగా ప్రయాణించే రోజు రానుంది. పర్యాటకులు చంద్రునిపై ఆహ్లాదకరమైన క్షణాలను ఆస్వాదించాలన్నది మా ఉద్దేశం. అంతేగాక పులియబెట్టిన ఆహారాన్ని ఇష్టపడే భావి అంతరిక్ష పర్యాటకులకు కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. నాటో, మిసో వంటి జపనీస్ ఆహారాలు పులియబెట్టడం ద్వారానే తయారవుతాయి. ఏమిటీ సేక్? సేక్ ఒక రకమైన వైన్ లేదా సారాయి. జపనీస్ బియ్యం, నీరు, ఈస్ట్, కోజీ (ఒక రకమైన అచ్చు) తో తయారవుతుంది. నిర్దిష్ట సమయాల్లో పలు దశల్లో ఆవిరి పట్టడం, కదిలించడం, పులియబెట్టడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. అందుకు 2 నెలలు పడుతుంది. ఇది జపాన్ సాంస్కృతిక వారసత్వ పానీయంగా యునెస్కో గుర్తింపు పొందింది. సేక్ బ్రాండ్లలో దస్సాయ్ అత్యంత ప్రాచుర్యం పొందింది. – వాషింగ్టన్ -
ఆ జత జాడీలు అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఏం మాయ చేశాయి..!
అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగానే, జత జాడీలు చైనాలోని ఒక కుటుంబాన్ని రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేశాయి. ఫొటోలో కనిపిస్తున్న ఈ రెండు జాడీలు చైనాకు చెందిన ఒక కుటుంబంలో గత శతాబ్దంగా ఉంటున్నాయి. పాతబడిన ఈ జాడీలను పనికిరాని వస్తువులుగా భావించి, ఆ కుటుంబం వారు వాటిని ఒక మూలన పడేశారు. అయితే ఈ జాడీలే తమకు కోట్లు కురిపిస్తాయని వారు ఊహించలేదు. అయితే, ఒక పురావస్తు నిపుణుడి సలహాపై, ప్రస్తుతం ఈ జాడీలను వారు వేలంలో పెడితే, అప్పుడే తెలిసింది వారికి ఈ జాడీల ప్రాముఖ్యత! పదహారో శతాబ్దానికి చెందిన చక్రవర్తి జియాజియ్ హయాంలో ఈ జాడీలను తయారు చేసినట్లు గుర్తించి, వాటిని 9.6 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 102 కోట్లు) కొనుగోలు చేశారు. అతి పురాతనమైన ఈ జాడీలను చైనీస్ మింగ్ రాజవంశం ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇవి వీరి దగ్గరకు ఎలా వచ్చాయో తెలియదు గాని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి నుంచి ఈ జాడీలు వారి ఇంటి వంటగదిలో నిరుపయోగంగా ఉంటున్నాయి. ఎగిరే చేపల డిజైన్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ జాడీలను వారు కేవలం ఇంట్లో అలంకరణకు మాత్రమే వాడేవారట! అందుకే అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. (చదవండి: వామ్మో..!ఈ తిమింగలం వలస రికార్డు మాములుగా లేదుగా..!) -
మూడ్‌ని బట్టి స్నానం చేయిస్తుంది!
అద్భుతమైన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన జపాన్ తాజాగా వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి.. సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఆవిష్కరించింది. వామ్మో..! ఏంటిది అనుకోకండి. మాములుగా మనమే స్నానం చేయడం అనేది పాత ట్రెండ్. దీన్ని కూడా మిషన్ సాయంతో తొందరగా పనికానిస్తే.. అనే వినూత్న ఆలోచనతో జపాన్ చేసిన ఆవిష్కరణ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే మనం బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ మాదిరి "హ్యూమన్ వాషింగ్ మెషిన్" అన్నమాట. ఏంటీ మిషన్‌తో స్నానమా అని విస్తుపోకండి. ఇది వెల్‌నెస్‌ని దృష్టిలో ఉంచుకుని, అత్యాధుని ఫీచర్లతో రూపొందించారు. అసలేంటీ మిషన్ ? ఎలా పనిచేస్తుంది..? తదితరాల గురించి తెలుసుకుందామా..!ఈ "హ్యూమన్ వాషింగ్ మెషిన్"ని ఒసాకాకు చెందిన సైన్స్ కో కంపెనీ ఏఐ సాంకేతికతో రూపొందించింది. దీన్ని జపాన్‌లో మిరాయ్ నింగెన్ సెంటకుకిగా పిలుస్తారు. ఈ మిషన్ కేవలం 15 నిమిషాల్లోనే మనిషి శరీరాన్ని శుభ్రపరుస్తుందట. అలాగే మంచి విశ్రాంతితో కూడిన మానసిక ఆనందాన్ని అందిస్తుందట. దీంట్లో కేవలం స్నానమే కాదు మనసు రిలాక్స్ అయ్యేలా చక్కటి వేడినీళ్ల మసాజ్ వంటి అత్యాధునిక ఫ్యూచర్లు కూడా ఉన్నాయి. దీనిలో ఉండే ఐఏ సెన్సార్లు మానవుల బాడీ మూడ్ ఎలా ఉందో టెస్ట్ చేసి దానికనుగుణంగా నీటి ఉష్ణోగ్రత ఆటోమెటిక్‌గా సెట్ అవుతుందట. అలాగే మన భావోద్వేగా పరిస్థితికి అనుకుణంగా మంచి విజువల్స్‌ని కూడా ప్రొజెక్ట్ చేస్తుందట. కేవలం పరిశుభ్రత మాత్రేమ గాక మంచి వెల్నెస్ అనుభవాన్ని కూడా అందిస్తుందని ఈ ఒసాకా కంపెనీ చైర్మన్ యసుకి అయోమా చెబుతున్నారు. ముఖ్యంగా అత్యంత బిజీగా ఉండే వ్యక్తులకు ఈ మిషన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఇది కొత్తదేం కాదు..ఇంతకు ముందే ఈ మానవ వాషింగ్ మిషన్‌ని రూపొందించారు. దీని తొలి వర్షన్‌ని 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్‌పోలో సాన్యో ఎలక్ట్రిక్ కో పరిచయం చేసింది. అయితే అప్పట్లో ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నప్పటికీ..కమర్షియల్ ప్రొడక్ట్‌గా ప్రజల్లోకి బాగా వెళ్లలేదు. కానీ ప్రస్తుతం ఏఐ సాంకేతికతో కూడిన ఈ మిషన్‌ని అత్యాధునిక ఫ్యూచర్లతో డిజైన్ చేశారు. ఈ ప్రొడక్ట్‌ని పానాసోనిక్ హోల్డింగ్స్ కార్పోరేషన్ కంపెనీ తీసుకురానుంది. ఈ ఏడాది ఒసాకా కన్సాయ్ ఎక్స్‌పోలో ఈ సరికొత్త సాంకేతిక హ్యూమన్ వాషింగ్ మిషన్‌ని ప్రదర్శించనున్నారు. అక్కడ దాదాపు వెయ్యిమందికి పైగా అతిథులు ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో.. ప్రత్యక్షం అనుభవం ద్వారా తెలుసుకోనున్నారు. అలాగే ఈ మిషన్ పనితీరు వారెంటీల గురించి సంకిప్త సమాచారం గురించి వివరింనుంది సదరు కంపెనీ ఒసాకా. అయితే సదరు కంపెనీ దీని ధర ఎంతనేది ఇంక ధృవీకరించలేదు. కాగా, ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆఖరికి వ్యక్తిగత శుభ్రతను కూడా హై-టెక్ లగ్జరీగా మార్చడం జపాన్‌కే చెల్లిందని ఒకరూ, ఇంత చిన్న పనికోసం అంతప్రయాస పడ్డారా మీరు అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. 🚨AI-POWERED HUMAN WASHING MACHINE: BECAUSE WHO HAS TIME TO SCRUB?Japan’s "Mirai Ningen Sentakuki" is here to wash your...everything. A 15-minute AI-powered bath capsule uses jets, microbubbles, and calming videos to cleanse bodies and soothe egos.Chairman Yasuaki Aoyama… pic.twitter.com/0GBwOtCV9r— Mario Nawfal (@MarioNawfal) December 3, 2024 (చదవండి: ‘ఫాస్ట్’గా స్లిమ్ కాకండి!) -
అక్కడి 'ప్రభాస్' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత అంతటి విజయాన్ని కల్కి అందుకుంది. సుమారు రూ. 1200 కోట్లకు పైగానే ఈ చిత్రం కలెక్షన్స్ రాబట్టింది.కల్కి చిత్రం జపాన్‌లో విడుదల చేస్తున్నట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం జపనీస్‌లో కూడా విడుదల కానుందని ఒక వీడియోతో మేకర్స్ పంచుకున్నారు. 2025 జనవరి 3న జపాన్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.పురాణాలను, సైన్సును ముడిపెడితూ తీసిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న భారత్‌లో విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటించారు. విజువల్ వండర్లా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
పసికూనపై విరుచుకుపడిన టీమిండియా... భారీ విజయం
అండర్-19 ఆసియా కప్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. పసికూన జపాన్‌తో ఇవాళ (డిసెంబర్ 2) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్ 211 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ అజేయ సెంచరీతో (122) కదంతొక్కగా.. ఓపెనర్ ఆయుశ్ మాత్రే మెరుపు అర్ద సెంచరీతో (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. మిడిలార్డర్ బ్యాటర్ కేపీ కార్తికేయ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, సిక్స్) రాణించగా.. స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 23, ఆండ్రీ సిద్దార్థ్ 35, నిఖిల్ కుమార్ 12, హర్వంశ్ సింగ్ 1, హార్దిక్ రాజ్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. జపాన్ బౌలర్లలో కీఫర్ యమమోటో లేక్, హ్యూగో కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్లెస్ హింజే, ఆరవ్ తివారి చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జపాన్.. భారత బౌలర్లు యుధాజిత్ గుహ (7-3-9-1), హార్దిక్ రాజ్ (8-2-9-2), చేతన్ శర్మ (8-0-14-2), కేపీ కార్తికేయ (10-1-21-1) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. జపాన్ ఇన్నింగ్స్‌లో హ్యూగో కెల్లీ (50), చార్లెస్ హింజే (35 నాటౌట్), నిహార్ పర్మార్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, ఈ మ్యాచ్‌లో ముందు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. -
Asia Cup 2024: శతక్కొట్టిన కెప్టెన్.. టీమిండియా భారీ స్కోర్
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా జపాన్‌తో ఇవాళ (డిసెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి జపాన్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ అజేయ సెంచరీతో (118 బంతుల్లో 122; 7 ఫోర్లు) కదం తొక్కాడు. కేపీ కార్తికేయ (57), ఆయుశ్ మాత్రే (54) అర్ద సెంచరీలతో రాణించారు. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ 23 పరుగులకే పరిమితమయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో ఆండ్రీ సిద్దార్థ్ 35, నిఖిల్ కుమార్ 12, హర్వన్ష్ సింగ్ 1, హార్దిక్ రాజ్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. జపాన్ బౌలర్లలో కీఫర్ యమమోటో లేక్, హ్యూగో కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్లెస్ హింజే, ఆరవ్ తివారి చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడింది. గత శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 47.1 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఈ టోర్నీలో భారత్, పాక్, జపాన్, యూఏఈ జట్లు గ్రూప్-ఏలో తలపడుతున్నాయి. ఇవాళే జరుగుతున్న మరో గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాకిస్తాన్, యూఏఈ జట్లు ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. షాజైబ్ ఖాన్ (132), మొహమ్మద్ రియాజుల్లా (106) సెంచరీల మోత మోగించారు. -
జపాన్‌లో మహిళలపై ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
టోక్యో:మహిళల పునరుత్పత్తి అవయవాలపై జపాన్ చట్ట సభ సభ్యుడు నవోకీ హ్యకుట చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై దేశంలో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జపాన్‌లో ఎప్పటినుంచో పడిపోతున్న జననాల రేటుపై ఇటీవల హ్యకుట ఇటీవల స్పందించారు. 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత మహిళల గర్భసంచి తొలగించడంతో పాటు 25 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లిల్లు నిషేధించాలన్నారు. ఈ చర్యలు తీసుకుంటే దేశంలో జననాల రేటు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ వ్యాఖ్యలపై రోజురోజుకు వివాదం పెరుగుతూ మహిళల ఆగ్రహావేశాలు చల్లారకపోవడంతో హ్యకుట స్పందించారు.తన వ్యాఖ్యలు కేవలం ఊహాజనితం అ ని వివరణ ఇచ్చారు. అయినా ఆయనపై మహిళలు శాంతించడం లేదు. కాగా,నవలా రచయితగా ఉన్న హ్యకుట అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి జపాన్ కన్జర్వేటివ్ పార్టీలో చేరి చట్టసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. -
భారత్‌కు రెండో విజయం
ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మస్కట్‌లో గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున థోక్చోమ్ కింగ్సన్ సింగ్ (12వ నిమిషంలో), రోహిత్ (36వ నిమిషంలో), అరిజిత్ సింగ్ హుండల్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ జట్టుకు నియో సాటో (15వ, 38వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు. ఈ మ్యాచ్‌లో జపాన్ జట్టుకు ఏకంగా 16 పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే జపాన్ రెండింటిని మాత్రమే గోల్స్‌గా మలిచింది. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు దక్కగా ఇందులో రెండింటిని సది్వనియోగం చేసుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత జట్టు ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. శనివారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జట్టుతో భారత్ తలపడుతుంది. -
ఇదేం మేకప్ సామీ..కన్నీళ్లు పెట్టించేస్తున్నారుగా!
అందానికి సంబంధించి.. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పాదాల దగ్గర నుంచి హెయిర్ వరకు ప్రతిదాని సంరక్షణ కోసం విచిత్రమైన చిట్కాలతో వీడియోలు పోస్ట్ చేసేస్తున్నారు. ఇక మేకప్ విషయానికి వస్తే వామ్మో..! ఆ పదం ఎత్తాలంటేనే భయంగొలిపేలా పిచ్చి పిచ్చి మేకప్‌లతో జనాలను చంపేస్తున్నారనే చెప్పొచ్చు. ఏవేవో వింత వింత మేకప్‌ల వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. వాటిని చూసి జనాలు ఇవేం అందం పోకడలు అని నోరెళ్లబెడుతున్నారు. ఇప్పుడు తాజగా అదే మాదిరిగా ఓ మేకప్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూస్తే.. ఇందుకోసం కూడా మేకప్ అవసరమా అని తలపట్టుకుంటారు. ఇంతకీ ఏంటా మేకప్ అంటే..జపాన్ టిక్‌టాక్ బ్యూటీ క్రియేటర్ వెనెస్సా ఫ్యూన్స్ ఈ వీడియోని పోస్ట్ చేసింది. అందులో ఆమె హాట్ గ్లూగన్ అనే సరికొత్త మేకప్ గురించి వివరించింది. వేడివేడి జిగురుని ఉపయోగించి "3D టియర్‌డ్రాప్ మేకప్" వేస్తారు. ఇందులో ఏంటి స్పెషాల్టీ అంటే..మేకప్ ప్రక్రియలో భాగంగా ముఖంపై ప్లాస్టిక్ షీట్ వంటిదాన్ని పరిచి దాని మీద వేడి వేడి వెంట్రుకుల జిగురుని వేయడం జరుగుతుంది. అతి ముఖానికి అతుక్కుపోయిన వెంటనే..ఒలిస్తే కన్నీటి బిందువు ఆకారంలా ముఖంపై రావడం జరుగుతుంది. దీన్ని భావోద్వేగ భరితం లేదా దుఃఖ పూరితంగా కననిపించేలా చేసేందుకు ఈ మేకప్‌ని ఉపయోగిస్తారట. అంతేగాదు అనుకోని పరిస్థితుల్లో సానుభూతిని సంపాదించుకునేందుకు కూడా ఈ మేకప్ ఉపయోగపడుతుందట. ఆఖరికి ఏడుపుని కూడా మేకప్‌తో మాయ చేస్తారా అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ బ్యూటీ ట్రెండ్ చూస్తే.. ఇక రాను రాను కన్నీళ్లకు కూడా విలువ ఉండదేమోకదూ. అయితే నిపుణులు మాత్రం ఇలా చర్మంపై వేడి వేడి జిగురుని వేయడం అనేది మంచిది కాదని, ఇది చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. (చదవండి: శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?) -
జపాన్‌లో ‘తాజ్’ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు
పుణ్య కార్తీకమాసం సందర్భంగా వనభోజనాల కార్యక్రమాన్ని జపాన్‌లోని తెలుగు అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. జపాన్‌లో నవంబర్ 24, ఆదివారం, తాజ్ (Telugu Association of Japan) అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుకున్నారు. చిన్నా పెద్దా అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ వేడుక ఆద్యంతం ఆటపాటలతో ఆనందంగా గడిపారు. అనంతరం పిల్లలు, పెద్దలు విందు భోజనాన్ని ఆరగించారు. -
లవ్ హోటళ్లు.. పోటెత్తుతున్న ప్రేమ జంటలు
అణుబాంబుల వినాశనం నుంచి తేరుకుని జపాన్ సాధించిన ప్రగతి అన్ని దేశాలకూ స్ఫూర్తిదాయకమే. అక్కడి గమ్మత్తైన సంగతులను కెమెరాలో బంధించేందుకు బయల్దేరిన ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఫ్రాంకోయిస్ ప్రోస్ట్ను లవ్ హోటళ్ల సంస్కృతి బాగా ఆకర్షించింది. ప్రైవసీ కోసం ప్రేమ పక్షులు కాస్త ‘ఏకాంతంగా’ సమయం గడిపే ఈ హోటళ్లు జపాన్‌లో సూపర్‌హిట్‌గా మారాయి. వింత ఆకృతుల్లో అలరించే వీటి విశేషాలను రకరకాల యాంగిళ్లలో కెమెరాలో బంధించాడు.పడవలు, కోటలు, అంతరిక్ష వస్తువులు హోటల్ జాయ్, హోటల్ ప్యాషన్, హోటల్ బేబీ కిస్... ఇలా ఆకర్షణీయ పేర్లతో లవ్, కిస్ సింబళ్లతో ఈ హోటళ్లు ఆకట్టుకునేలా ఉంటాయి. విభిన్న ఆకృతుల్లో ఉండటం వీటిలోని మరో విశేషం. ఒక హోటల్ భారీ పడవలా, మరోటి పేద్ద కోటలాగా దర్శనమిస్తాయి. ఇంకోటి తిమింగలంలా, మరోటి గ్రహాంతరవాసుల ఎగిరే పళ్లెం (యూఎఫ్ఓ)లా నిర్మించారు. సాధారణ భవంతుల మధ్య చూడగానే కనిపెట్టేలా వీటిని కట్టారు. ఇలాంటి 200కు పైగా లవ్ హోటళ్లను ప్రోస్ట్ ఫొటోలు తీశారు. వ్యభిచారాన్ని నిషేధిస్తూ జపాన్‌లో 1958లో చట్టం తెచ్చాక ఈ లవ్ హోటళ్ల సంస్కృతి పెరగడం విశేషం. వీటిల్లో వ్యభిచారం జరుగుతోందని కొందరు విమర్శిస్తుండగా మరికొందరు దాన్ని గట్టిగా ఖండిస్తుండటం విశేషం.ఇరుకు ఇళ్లు, ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాల్లో కొత్త జంటలకు ఊపిరాడదు. చిలిపి చేష్టలు తదితరాలు కష్టం. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నివసించే ఇళ్లు, గదులు మరీ ఇరుకు, ఇలాంటి కొత్త, పేద జంటల ‘అవసరాలు’ తీర్చే ప్రత్యామ్నాయ వేదికలుగా లవ్ హోటళ్లు బాగా ఉపయోగపడుతున్నాయని జపాన్‌లో చాలామంది భావిస్తున్నారు. కొత్త జంటలు, ప్రేమ పక్షుల ప్రైవసీకే గాక నైట్‌క్లబ్ వంటి పలు వసతులకు ఇవి నెలవులు. జలాంతర్గామిలా, పెద్ద నౌకలా చూపు తిప్పుకోలేనంతటి ముదురు రంగు పెయింటింగుల్లో, రాత్రిళ్లు ధగధగల విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఫుల్ ప్రైవసీ ఈ లవ్ హోటళ్లలో సిబ్బంది చాలా తక్కువగా ఉంటారు. ఉన్నా సరిగా కనపడరు. తెరలు, మసకమసక గాజు తలుపుల వెనుక నుంచే సేవలందిస్తారు. చార్జీలను ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. కారు పార్కింగ్ ప్రాంతం కూడా కాస్త చీకటిగానే ఉంటుంది గనుక ప్రైవసీకి లోటే ఉండదు. 1970ల నుంచీ బాగా పాపులరైన మెగురో ఎంపరర్ లవ్ హోటల్‌ను యూరప్ కోట ఆకృతిలో నిర్మించారు. దాని బాటలో జపాన్ అంతటా చాలా నగరాల్లో లవ్ హోటళ్లు కోట డిజైన్లలో పుట్టుకొచ్చాయి. హోన్సు, షికోకు దీవులు మొదలుకుని టోక్యోదాకా అంతటా అలరిస్తూ వచ్చాయి. ఒకయామాలోని హోటల్ అలాదిన్ను గ్రాండ్ అరేబియన్ ప్యాలెస్‌లా భారీ గుమ్మటాలతో కట్టారు.ఏటా 50 కోట్ల మంది జపాన్వ్యాప్తంగా 20,000 లవ్ హోటళ్లుంటాయని అంచనా. 1980ల్లో వచి్చన కఠిన చట్టాల తర్వాత వీటి సంఖ్య తగ్గింది. అయినా ఇప్పటికీ వీటికి విపరీతమైన జనాదరణ ఉంది. 1990ల నుంచి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఈ హోటళ్లను ప్రేమ జంటలు ఏటా 50 కోట్లసార్లు సందర్శిస్తున్నారు! ఆ లెక్కన జపాన్‌లో సగం శృంగారం ఈ హోటళ్లలోనే జరుగుతోందని ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త మార్క్ డి.వెస్ట్ విశ్లేíÙంచారు. 2005లో రాసిన ‘లా ఇన్ ఎవ్రీడే జపాన్’ పుస్తకంలో ఇలాంటి బోలెడు విషయాలను వెల్లడించారాయన.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్
రాజ్‌గిర్ (బిహార్): భారత మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, జపాన్‌పై 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ 48వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచింది. అనంతరం లాల్రెమ్సియామి 56వ నిమిషంలో మరో గోల్ చేసింది. రేపు జరుగబోయే ఫైనల్లో భారత్ చైనాతో తలపడనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ లీగ్ దశలో చైనాను ఓడించింది. చైనా తొలి సెమీఫైనల్లో మలేసియాపై 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది.మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో మలేసియా, జపాన్ తలపడతాయి. ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో కొరియా థాయ్‌లాండ్‌ను 3-0 గోల్స్ తేడాతో ఓడించి, ఐదో స్థానాన్ని దక్కించుకుంది. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా..
రాజ్‌గిర్ (బిహార్): లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచిన భారత మహిళల హాకీ జట్టు కీలక సమరానికి సమాయత్తమైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో నేడు మాజీ చాంపియన్ జపాన్‌తో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీఫైనల్లో తలపడనుంది. ఇప్పటి వరకు సాధించిన ఫలితాలతో సంబంధం లేకుండా ఈ నాకౌట్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. మరో సెమీఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనాతో మలేసియా పోటీపడుతుంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో భారత జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. లీగ్ దశలో భారత్ మొత్తం 26 గోల్స్ సాధించి ప్రత్యర్థి జట్లకు కేవలం 2 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. ‘డ్రాగ్ ఫ్లికర్’ దీపిక ఏకంగా 10 గోల్స్‌తో అదరగొట్టింది. సంగీత కుమారి నాలుగు గోల్స్... ప్రీతి దూబే మూడు గోల్స్ చేశారు. లాల్రెమ్సియామి, మనీషా చౌహాన్, నవ్‌నీత్ కౌర్ రెండు గోల్స్ చొప్పున సాధించారు. ఉదిత, కెప్టెన్ సలీమా టెటె, బ్యూటీ డుంగ్‌డుంగ్ ఒక్కో గోల్ చేశారు. మరోవైపు జపాన్ జట్టు ఓవరాల్‌గా 6 గోల్స్ మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో భారత్ తమ సహజశైలిలో ఆడితే వరుసగా ఆరో విజయంతో ఐదోసారి ఈ టోరీ్నలో టైటిల్ పోరుకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఏడుసార్లు జరగ్గా.. భారత జట్టు రెండుసార్లు చాంపియన్‌గా (2016, 2023) నిలిచి, మరో రెండుసార్లు (2013, 2018) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. జపాన్ జట్టు మూడుసార్లు (2010, 2013, 2023) ఫైనల్‌కు చేరుకొని ఒకసారి (2010లో) విజేతగా నిలిచి, రెండుసార్లు తుది పోరులో ఓడిపోయింది. ‘మా జట్టు బలాలు ఏంటో, బలహీనతలు ఏంటో సభ్యులందరికీ తెలుసు. మా బలాన్ని మరింత పెంచుకొని, భవిష్యత్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ టోర్నీని వినియోగించు కుంటున్నాం. ఇప్పటి వరకైతే భారత జట్టు అద్భుతంగా ఆడింది. అయితే నాకౌట్ మ్యాచ్ అయినా సెమీఫైనల్లో జపాన్ను తక్కువ అంచనా వేయకూడదు’ అని భారత జట్టు హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. -
అమ్మాయిలు అజేయంగా
రాజ్‌గిర్ (బీహార్): మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ లీగ్‌లో ఎదురు లేని ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–0తో జపాన్ పై ఘన విజయం సాధించింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ (37వ నిమిషం), దీపిక కుమారి (47వ ని., 48వ ని.) గోల్స్ నమోదు చేశారు. ఆడిన మూడూ గెలిచిన భారత్ 15 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలువగా... పారిస్ ఒలింపిక్స్ రన్నరప్, రజత పతక విజేత చైనా (12) రెండో స్థానంలో నిలిచింది. జపాన్‌తో జరిగిన పోరులో తొలి క్వార్టర్ నుంచే భారత స్ట్రయికర్లు తమ దాడులకు పదునుపెట్టడంతో మూడు పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించాయి. 8వ నిమిషంలో దీపిక తొలి ప్రయత్నాన్ని ప్రత్యర్థి గోల్‌కీపర్ యూ కుడో చాకచక్యంగా ఆడ్డుకుంది. మిడ్‌ఫీల్డర్లు కెపె్టన్ సలీమా టేటే, నేహా, షరి్మలా దేవిలు రెండో క్వార్టర్లో చక్కని సమన్వయంతో ఫార్వర్డ్ లైన్‌కు గోల్స్ అవకాశాలు సృష్టించారు. కానీ జపాన్ రక్షణ పంక్తి అడ్డుకోగలిగింది. దీంతో దీపిక రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. ఎట్టకేలకు మూడో క్వార్టర్లో భారత్ ఖాతా తెరిచింది. వైస్‌కెపె్టన్ నవ్‌నీత్ కౌర్ రివర్స్ షాట్ కొట్టి ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆఖరి క్వార్టర్ మొదలవగానే దీపిక చెలరేగింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదించుకొని గోల్‌పోస్ట్ లక్ష్యంగా దాడులు చేసింది. ఈ క్రమంలో వరుస పెనాల్టీ కార్నర్లను దీపిక గోల్స్‌గా మలిచి భారత్‌ను గెలిచే స్థితిలో నిలిపింది. చివరి వరకు ఇదే ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ ప్రత్యరి్థకి మాత్రం ఒక్క గోల్ కొట్టకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసింది. చాంపియన్స్ ట్రోఫీలో దీపిక దూకుడుకు ప్రత్యర్థి డిఫెండర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ టోర్నీలోనే ఆమెది అసాధారణ ప్రదర్శన. నాకౌట్‌కు ముందే ఆమె పది గోల్స్ సాధించింది. ఇందులో 4 ఫీల్డ్ గోల్స్ కాగా, ఐదు పెనాల్టీ కార్నర్ గోల్స్ ఉన్నాయి. మరొకటి పెనాల్టీ స్ట్రోక్‌తో చేసింది. ఆదివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మలేసియా 2–0తో థాయ్‌లాండ్‌పై, చైనా 1–0తో దక్షిణ కొరియాపై గెలుపొందాయి. భారత్ సెమీస్ ప్రత్యర్థి కూడా జపానే! మంగళవారం జరిగే సెమీఫైనల్లో భారత అమ్మాయిల జట్టు... నాలుగో స్థానంలో ఉన్న జపాన్‌తో తలపడుతుంది. -
అమ్మలకు అమ్మలు
‘మాతృత్వం’ వరుసలో నిలిచే మరో గొప్ప మాట... మిడ్వైఫ్. ‘మిడ్వైఫరీ’ అనేది ఉద్యోగం కాదు. పవిత్ర బాధ్యత. అటువంటి పవిత్ర బాధ్యతను తలకెత్తుకున్న సూర్ణపు స్వప్న, నౌషీన్ నాజ్ అంకితభావంతో పనిచేస్తున్న మిడ్వైఫరీ నర్స్‌లలో ఒకరు. జపాన్ లో ప్రత్యేక శిక్షణ కోసం మన దేశం నుంచి ఏడుగురు మిడ్ వైఫరీ నర్సులు ఎంపికయ్యారు. వారిలో కొత్తగూడెం ఆస్పత్రిలో పని చేస్తోన్న సూర్ణపు స్వప్న, వరంగల్ సీకేయం ఆస్పత్రిలో పనిచేస్తున్న నౌషీన్ నాజ్ ఉన్నారు. నవంబరు 12 నుంచి 24 వరకు జపాన్‌లో జరిగే లీడర్షిప్ ట్రైనింగ్ప్రోగ్రామ్లో వీరు పాల్గొంటున్నారు.తెలంగాణా రాష్ట్రంలోని మహబూబాబాద్‌కు చెందిన స్వప్న తండ్రి సోమయ్య కమ్యూనిస్టు. ఆపదలో ఉన్నవారికి సేవ చేయాలని ఎప్పుడూ చెబుతుండేవాడు. ఆయన ప్రభావం వల్లనే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. తొలి పోస్టింగ్ కోసం ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్‌ను ఎంచుకుంది. యూనిసెఫ్ సహకారంతో హైదరాబాద్‌లో ప్రముఖ మెటర్నిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏడాదిన్నర పాటు డిప్లొమా ఇన్ మిడ్వైఫరీ శిక్షణ కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 మందిని ఎంపిక చేసింది. అందులో స్వప్న ఒకరు.భద్రాచలం ఏజెన్సీలో...డిప్లొమా ఇన్ మిడ్‌వైఫరీలో నేర్చుకున్న నైపుణ్యాలను సార్థకం చేసుకునే అవకాశం స్వప్నకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పని చేసేప్పుడు వచ్చింది. ‘మా బ్యాచ్‌లో మొత్తం ముగ్గురం ఈ ఆస్పత్రికి వచ్చాం. అప్పుడు ఇక్కడ సగటున 70 శాతం వరకు సీ సెక్షన్ పద్ధతిలో ప్రసవాలు జరుగుతుండేవి. శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం మొదలుపెట్టాం. ముందుగా క్షేత్రస్థాయిలో ఆశ వర్కర్లకు సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాం.ఆ తర్వాత కాన్పు సులువుగా అయ్యేందుకు అవసరమైన వ్యాయామాలు ఎలా చేయాలి, మందులు ఎలా తీసుకోవాలి... మొదలైన విషయాల గురించి గర్భిణులకు ఎప్పటికప్పుడు చెబుతూ వారితో ఆత్మీయంగా కలిసిపోయేవాళ్లం. మేము పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఏడాది వ్యవధిలోనే ఈ ఆస్పత్రిలో సీ సెక్షన్లు 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గిపోయాయి. వైద్యపరంగా అత్యవసరం అనుకున్న వారికే సీ సెక్షన్లు చేసేవారు. ఈ ఆస్పత్రిలో ఒకే నెలలో 318 సాధారణ ప్రసవాలు చేసి రికార్డు సృష్టించాం’ అంటుంది స్వప్న. భద్రాచలం ఆస్పత్రిలో స్వప్న బృందం తీసుకొచ్చిన మార్పునకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభించింది. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి, భద్రాద్రి కొత్తగూడెంముఖ కవళికలతోనే...భద్రాచలంలో పని చేస్తున్నప్పుడు ఒడిషాకు చెందిన ఆదివాసీ మహిళ కాన్పు కోసం వచ్చింది. మన దగ్గర కాన్పు చేయాలంటే బెడ్ మీద పడుకోబెడతాం. కానీ ఆ ఆదివాసీ మహిళ కింద కూర్చుంటాను అని చెబుతోంది. మా ఇద్దరి మధ్య భాష సమస్య ఉంది. ముఖకవళికలతోనే ఆమెకు ఎలా కంఫర్ట్‌గా ఉంటుందో కనుక్కుని బెడ్ మీదనే కూర్చునే విధంగా ఒప్పించి సాధారణ ప్రసవం చేయించాను. ఒకరోజు ఆస్పత్రికి వచ్చేసరికి ఒక గర్భిణీ స్పృహ కోల్పోయి ఉంది.బీపీ ఎక్కువగా ఉంది. పదేపదే ఫిట్స్ వస్తున్నాయి. హై రిస్క్ కేసు. బయటకు రిఫర్ చేద్దామంటే మరో ఆస్పత్రికి చేరుకునేలోగా తల్లీబిడ్డలప్రాణాలు ప్రమాదంలో పడతాయి. మేము తీసుకున్న శిక్షణ, నేర్చుకున్న నైపుణ్యం, అనుభవంతో భద్రాచలం ఆస్పత్రిలోనే గైనకాలజిస్ట్ సాయంతో నార్మల్ డెలివరీ చేశాం. ఆస్పత్రికి వచ్చేప్పుడు స్పృహలో లేని మహిళ తిరిగి వెళ్లేప్పుడు తన బిడ్డతో నవ్వుతూ వెళ్లడాన్ని చూడటం మాటలకు అందని సంతోషాన్ని ఇచ్చింది. నా వృత్తి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.– సూర్ణపు స్వప్నమరచిపోలేని జ్ఞాపకాలుహైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు ఎస్ఐ పరీక్షలకు సిద్ధమవుతున్న లావణ్య అనే గర్భవతి మమ్మల్ని సంప్రదించింది. సిజేరియన్ అయితే పోలీసు ఉద్యోగం రావడం కష్టమవుతుందనడంతో ఆమె చేత కొన్ని ఎక్సర్సైజులు చేయించాను. ఎదురుకాళ్లు ఉన్న పాప గర్భంలో సరైన స్థితికి వచ్చేలా చూశాను. నొప్పులు రావడం లేదని టెన్షన్ పడితే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేలా కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు రకరకాల వ్యాయామాలు చేయించి సాధారణ ప్రసవం అయ్యేలా చేశాను.వరంగల్ జిల్లా నెక్కొండకి చెందిన స్వప్న ఎత్తు తక్కువగా ఉండడంతో చాలా మంది సాధారణ ప్రసవం కాదని అంటుండేవారు. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ క్లాస్‌లు విన్నాక ఆమెలోని భయాలు తొలగిపోయాయి. సాధారణ ప్రసవం అయ్యింది. దుబాయ్‌లో ఉంటున్న నా చెల్లెలు సైన్తా నాష్ తొలి రెండు కాన్పులు సిజేరియన్ అయ్యాయి. మూడో కాన్పుకు సంబంధించి ఫోన్ ద్వారా నాతో మాట్లాడుతూ నేను చెప్పిన విధంగా వ్యాయామాలు చేసేది. చెల్లికి సాధారణ ప్రసవం కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది.– నౌషీన్ నాజ్‘ప్రసవం అనేది తల్లికి పునర్జన్మ’ అంటారు. స్వప్న, నౌషీన్ నాజ్‌లు గతంలో తీసుకున్న శిక్షణ ఎంతోమంది తల్లులకు అండగా నిలవడానికి, ప్రతికూల పరిస్థితుల్లో ఎంతోమందిప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడింది. జపాన్‌లోని లీడర్షిప్ప్రోగ్రామ్ ద్వారా వీరు మరెన్నో నైపుణ్యాలను సొంతం చేసుకోనున్నారు. ఆ నైపుణ్యాల ‘పుణ్యం’ ఊరకే పోదు. ఆపదలో ఉన్న ఎంతోమంది తల్లులకుప్రాణవాయువు అవుతుంది.‘వైద్యులకు వైద్యసేవలు అందించే నైపుణ్యమే కాదు ఆత్మస్థైర్యాన్నిచ్చే శక్తి కూడా ఉంటుంది’ అని తాత డాక్టర్ వారీజ్ బేగ్ చెప్పిన మాటలు హనుమకొండకు చెందిన నౌషీన్ నాజ్ మనసులో బలంగా నాటుకు΄ోయాయి. తాత మాటల స్ఫూర్తితో మెడిసిన్ ఎంట్రెన్స్ రాసింది కానీ సీటు రాలేదు. అయినా నిరాశపడకుండా హైదరాబాద్‌లోని ‘మెడిసిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్’లో జీఎన్ఎం కోర్సు చేరింది. ఆ తర్వాత మైనారిటీ కోటాలో ఎంబీబీఎస్ సీటు వచ్చినా కోర్సును కొనసాగించి నర్సింగ్ వృత్తిలో అత్యుత్తమ సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించింది.మాతా శిశు మరణాలను తగ్గించడంలో భాగంగా 1500కు పైగా సాధారణ ప్రసవాలలో సహాయం అందించింది. భయంతో వచ్చే తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ΄ాటు సాధారణ ప్రసవం కోసం వ్యాయామాలు నేర్పిస్తుంటుంది. వరంగల్‌లో నిర్వహించిన ఆబ్స్టెక్టిక్స్ ఎమర్జెన్సీ(ఎంవోఎస్, మామ్స్) వర్క్‌షాప్‌లో యూకే నుంచి వచ్చిన మిడ్ వైఫరీ నర్సులు సాధారణ ప్రసవాలపై ఇక్కడి వైద్యులకు శిక్షణ ఇచ్చారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని ‘నేషనల్ మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ గురించి తెలునుకొని అర్హత పరీక్షలు రాసి ఎంపికైంది నౌషీన్. మిడ్వైఫరీ కోర్సులో బెస్ట్ స్టూడెంట్‌గా ఎంపికైంది. హైదరాబాద్‌లోని నీలోఫర్, కింగ్ కోఠి, వనస్థలిపురం మెటర్నిటీ ఆసుపత్రులలో పనిచేసింది. వాటర్ బర్త్, బ్రీచ్ బర్త్ డెలివరీల గురించి తెలుసుకొని వ్యాయామాల ద్వారా సాధారణ ప్రసవాలు చేయించింది. బ్రీచ్బర్త్ డెలివరీలలో చాలామంది తల్లుల గర్భంలో ΄ాపలు ఎదురుకాళ్లతో ఉంటారు. వ్యాయామం ద్వారా తలపైకి, కాళ్లు కిందకు వచ్చేలా చేసి సాధారణ ప్రసవం అయ్యేలా చేసేది. ప్రస్తుతం అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంఏ సైకాలజీ కోర్సు చదువుతోంది. ‘తల్లుల మానసిక స్థితి తెలుసుకునేందుకు ఈ చదువు ఉపయోగపడుతుంది’ అంటుంది నౌషీన్. – వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్ -
ఆసియా స్టాక్ మార్కెట్లలో జోష్: ఒక్కసారిగా పెరిగిన ట్రంప్ షేర్స్
అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా దూసుకెళ్తున్నాయి. డోజోన్స్, నాస్డాక్ సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ట్రంప్' షేర్స్ ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. జపాన్, సౌత్ కొరియా మార్కెట్లు సైతం లాభాల్లోనే సాగుతున్నాయి.ప్రారంభ ట్రేడ్‌లో జపాన్ నిక్కీ 263.50 పాయింట్లు లేదా 0.68 శాతం పెరిగి 38,843.50 వద్ద ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఎస్&పీ/ఏఎస్ఎక్స్200.. 67.90 పాయింట్లు లేదా 0.83 శాతం పెరిగి 8,200.90 వద్ద ఉంది. దక్షిణ కొరియా కోస్పి 4.05 పాయింట్లు లేదా 0.16 శాతం పురోగమించి 2,581.57 వద్దకు చేరుకుంది.అమెరికా ఎన్నికలు ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌లు లాభపడ్డాయి. ఓవర్‌నైట్ ట్రేడ్‌లో.. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 427.28 పాయింట్లు లేదా 1.02 శాతం పెరిగి 42,221.88 వద్ద ఉంది. ఎస్&పీ 500 ఇండెక్స్ కూడా 70.07 పాయింట్లు లేదా 1.23 శాతం పెరిగి 5,782.76 వద్దకు చేరుకుంది. గిఫ్ట్ నిఫ్టీ.. ఒక రోజు స్మార్ట్ రికవరీ తర్వాత దేశీయ స్టాక్ సూచీలు ఎలా రాణిస్తాయనే దానిపై అందరి దృష్టి ఉంది.ఎన్నికల ఫలితాలు అమెరికాకు ఎగుమతి చేసే ఐటీ అండ్ ఫార్మా వంటి అనేక దేశీయ రంగాల దృక్పథాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా యూఎస్ ప్రభుత్వ విధానాలు ఆటో, బ్యాంకింగ్, రక్షణ, చమురు & గ్యాస్‌తో సహా అనేక ఇతర రంగాలను ప్రభావితం చేయవచ్చని తెలుస్తోంది. -
ఆర్థిక పనితీరు ఫర్వాలేదు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగానే ఉందంటూ.. రానున్న రోజుల్లో డిమాండ్ పరిస్థితులపై పరిశీలన అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల దృక్పథం ఉంది. సాగు రంగం పట్ల సానుకూల అంచనాలు, పండుగల్లో డిమాండ్ మెరుగుపడుతుందన్న అంచనాలు, ప్రభుత్వం నుంచి అధిక మూలధన వ్యయాలు పెట్టుబడులకు ఊతమిస్తాయి’’అని సెపె్టంబర్ ఎడిషన్ నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదికలో ఆర్థిక శాఖ పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ 2024–25 సంవత్సరానికి 6.5–7 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. వినియోగ సెంటిమెంట్ మృదువుగా మారడంతో పట్టణ డిమాండ్ మోస్తరు స్థాయికి చేరుకుంటున్నట్టు కనిపిస్తోందని.. సాధారణం మించి వర్షాలతో ఫూట్ఫాల్ (షాపులను సందర్శించే కస్టమర్లు) పరిమితంగా ఉండడం, కాలానుగుణ కారణాలతో ప్రజలు కొత్త కొనుగోళ్లకు దూరంగా ఉన్నట్టు వివరించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక స్తబ్దత మరింత అధికం కావడం, అభివృద్ధి చెందిన దేశాల వాణిజ్య విధానాల్లో అనిశ్చితి ఇవన్నీ ఆర్థిక వృద్ధికి రిస్క్‌లుగా పేర్కొంది. వీటి ప్రభావాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రసరించే రిస్క్ ఉందంటూ.. అదే జరిగితే డ్యూరబుల్ గూడ్స్‌పై వినియోగదారులు చేసే వ్యయాలపై ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే.. వరుసగా రెండు నెలల పాటు తగ్గిన ద్రవ్యోల్బణం తిరిగి సెపె్టంబర్లో పెరిగిపోవడం తెలిసిందే. కానీ, కొన్ని కూరగాయలను మినహాయిస్తే ద్రవ్యోల్బణం దాదాపుగా నియంత్రణలోనే ఉన్నట్టు ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. రిజర్వాయర్లలో నీటిమట్టాలు మెరుగ్గా ఉండడం, ఖరీఫ్‌లో జోరుగా విత్తన సాగు వ్యవసాయ ఉత్పాదకత పట్ల ఆశాజనక అంచనాలకు వీలు కలి్పస్తోందని.. ఆహార ధాన్యాల నిల్వలు తగినంత ఉండడంతో మధ్యకాలంలో ధరల కట్టడికి వీలుంటుందని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో భారత్ పట్ల సానుకూల సెంటిమెంట్ ఉన్నట్టు వెల్లడించింది. స్థిరమైన వృద్ధి సాధించడం ద్వారానే ఈ సెంటిమెంట్‌ను వాస్తవిక పెట్టుబడులుగా మలుచుకునేందుకు అవకాశాలుంటాయని పేర్కొంది. నెల రోజుల్లోనే విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో రూ.85వేల కోట్లకు పైగా అమ్మకాలు చేయడం ఈ సందర్భంగా గమనార్హం. విదేశాలతో ఆర్థిక కార్యకలాపాలు (ఎక్స్టర్నల్ సెక్టార్) మెరుగ్గా ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. పెరుగుతున్న పెట్టుబడులు, స్థిరమైన రూపాయి, మెరుగైన స్థితిలో విదేశీ మారకం నిల్వలను ప్రస్తావించింది. సెపె్టంబర్ చివరికి 700 బిలియన్ డాలర్లను విదేశీ మారకం నిల్వలు దాటిపోవడాన్ని గుర్తు చేసింది. తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు క్రమంగా విస్తరిస్తున్నట్టు తెలిపింది.వృద్ధి మందగమనంలోకి భారత్జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగు పెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ దిగ్గజం నోమురా ప్రకటించింది. జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధిస్తుందన్న ఆర్బీఐ అంచనాలు మరీ ఆశావహంగా ఉన్నట్టు పేర్కొంది. 2024–25లో 6.7 శాతం, 2025–26లో 6.8 శాతం మేర భారత జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న తమ అంచనాలు మరింత క్షీణించడానికి రిస్‌్కలు పెరుగుతున్నట్టు పేర్కొంది. వృద్ధి సూచికలు జీడీపీ మరింత మోస్తరు స్థాయికి చేరుకుంటుందని సూచిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధిని సాధిస్తుందని ఇటీవలి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష తన గత అంచనాలను కొనసాగించడం తెలిసిందే. పట్టణాల్లో వినియోగం సాధారణంగా మారుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయని.. ప్యాసింజర్ వాహన విక్రయాలు తగ్గడం, విమాన ప్రయాణికుల రద్దీ మోస్తరు స్థాయికి దిగిరావడం, ఎఫ్ఎంసీజీ సంస్థల అమ్మకాలు దీనికి నిదర్శనాలుగా పేర్కొంది. పట్టణ వినియోగంలో ఈ బలహీన ధోరణి కొనసాగుతుందని తాము భావిస్తున్నట్టు నోమురా తెలిపింది. కంపెనీలు వేతన వ్యయాలను తగ్గించుకుంటున్న విషయాన్ని ప్రస్తావించింది. ‘‘కరోనా అనంతరం ఏర్పడిన పెంటప్ డిమాండ్ సమసిపోయింది. ద్రవ్య విధానం కఠినంగా మారింది. అన్ సెక్యూర్డ్ రుణాలపై ఆర్బీఐ ఆంక్షలు వ్యక్తిగత రుణాలు, ఎన్బీఎఫ్సీ రుణాల వృద్ధి క్షీణతకు దారితీశాయి’’ అని నోమురా తన నివేదికలో వివరించింది. -
జపాన్‌లో పాలక పక్షానికి ఎదురుదెబ్బ
టోక్యో: జపాన్ పార్లమెంట్‌లోని శక్తిమంతమైన దిగువ సభకు ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధికార పక్షం మెజారిటీకి గండిపడింది. 465 సీట్లకు గాను మెజారిటీకి 233 సీట్లు అవసరం. చివరి ఫలితాలు అందేటప్పటికీ అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ, మిత్రపక్షం కొమెయిటో కలిపి 211 సీట్లు గెలుచుకున్నాయి. ఈ సంఖ్య కొంత పెరిగేలా ఉన్నా అధికార పక్షానికి మెజారిటీ కష్టమేనని భావిస్తున్నారు. ప్రతిపక్షం, ఇతరులు కలిసి 224 వరకు స్థానాలను దక్కించుకున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసి, విజయం సాధించిన తమ వారిని కూడా కలుపుకుంటే అధికార పక్షం బలం పెరగొచ్చు. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో వారిని చేర్చుకునేందుకు ఎల్డీపీ సిద్ధంగా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలోని మరో పార్టీ సాయంతో ప్రధానమంత్రి షిగెరు ఇషిబా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. -
ప్రపంచంలోనే ఖరీదైన బియ్యం
జపాన్‌లో పండించే ‘కిన్‌మెమాయి’ అనే రకానికి చెందిన ఈ బియ్యం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం. జపాన్‌లోని టోయో రైస్ కార్పొరేషన్ ఐదు రకాల వరి వంగడాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసి, పండిస్తోంది. ఈ బియ్యం కిలో ప్యాకెట్లలోను, బస్తాల్లో కాకుండా, 140 గ్రాముల ఆరు సాచెట్లు నింపిన ప్యాకెట్లలో విక్రయిస్తుండటం విశేషం. టోయో రైస్ కార్పొరేషన్ పేటెంట్ పొందిన ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఈ బియ్యం గింజల పొట్టు పూర్తిగా తొలగించకుండా ప్యాక్ చేస్తుంది. ఈ కిన్‌మెమాయి’ బియ్యం గింజలు చిన్నగా ఉంటాయి. మిగిలిన రకాల బియ్యంతో పోల్చుకుంటే, కిన్‌మెమాయి రకం బియ్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని, దీని రుచి కూడా చాలా బాగుంటుందని టోయో రైస్ కార్పొరేషన్ చెబుతోంది. ఈ బియ్యం ధరలు రకాన్ని బట్టి కనీసం కిలోకు 109 డాలర్ల నుంచి 155 డాలర్ల (రూ.9,135 నుంచి రూ. 12,990) వరకు ఉంటాయి. -
జపాన్‌లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రీ రిలీజ్ కూడా
పాన్ ఇండియా పుణ్యమా అని మన హీరోలకు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ బోలెడంత మంది అభిమానులు ఉంటున్నారు. 'బాహుబలి'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌కి మన దేశంతో పాటు జపాన్‌లోనూ లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లలో కొందరు ఇప్పుడు డార్లింగ్ ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!)అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజున రాజా సాబ్, కల్కి 2, సలార్ 2 సినిమాలకు సంబంధించి అప్డేట్స్ రావొచ్చని టాక్. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలుచోట్ల 'సలార్' రీ రిలీజ్ చేశారు. మిస్టర్ ఫెర్ఫెక్ట్, ఈశ్వర్, రెబల్ చిత్రాల్ని కూడా రీ రిలీజ్ చేస్తారు.ఇప్పుడు జపాన్‌లోనూ ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడంతో పాటు 'రాధేశ్యామ్' మూవీని రీ రిలీజ్ చేశారు. లేడీ ఫ్యాన్స్ చాలామంది ఈ సినిమాని చూసి ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్ కావడంతో ఇక్కడి డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు)I’m overjoyed to see our darling #Prabhas fans in Japan celebrating his birthday in Tokyo! They sent their heartfelt wishes to our Rebel Star ♥️😍#HappyBirthdayPrabhas pic.twitter.com/yEBj9FSbMY— Prasad Bhimanadham (@Prasad_Darling) October 19, 2024 -
జూనియర్ల జయభేరి
జొహర్ (మలేసియా): సుల్తాన్ జొహర్ కప్ హాకీ టోర్నమెంట్లో యువ భారత జట్టు శుభారంభం చేసింది. మలేసియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో శనివారం భారత్ 4–2తో జపాన్ను చిత్తు చేసింది. హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేశ్ జాతీయ జూనియర్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆడిన తొలి మ్యాచ్‌లో యంగ్ ఇండియా అదరగొట్టింది. భారత్ తరఫున అమీర్ అలీ (12వ నిమిషంలో), గుర్జోత్ సింగ్ (36వ నిమిషంలో), ఆనంద్ సౌరభ్ (44వ నిమిషంలో), అంకిత్ పాల్ (47వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ తరఫున సుబాస తనాకా (26వ ని.లో), రకుసై యమనకా (57వ ని.లో) ఒక్కో గోల్ నమోదు చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే భారత జట్టు అటాకింగ్ గేమ్ కొనసాగించింది. ఒలింపిక్స్‌లో భారత జట్టు రెండు కాంస్య పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించి... పారిస్ విశ్వక్రీడల తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలికిన గోల్ కీపర్ శ్రీజేశ్ మార్గనిర్దేశనంలో కుర్రాళ్లు సత్తా చాటారు. తొలి క్వార్టర్లో జపాన్ రక్షణ వలయాన్ని చేధించుకుంటూ ముందుకు వెళ్లిన అమీర్ అలీ తొలి గోల్ అందించి జట్టుకు ఆధిక్యం అదించాడు. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం పట్టు కొనసాగించాలంటే మ్యాచ్‌లో ఎక్కువ శాతం ఫీల్డ్ గోల్స్ కొట్టాలని పదే పదే చెప్పే శ్రీజేశ్... కోచ్‌గా తొలి మ్యాచ్‌లోనే కుర్రాళ్లతో ఆ పని చేసి చూయించాడు. అయితే కాసేపటికే సుబాస తనాకా గోల్ కొట్టడంతో జపాన్ స్కోరు సమం చేయగలిగింది. మూడో క్వార్టర్లో భారత్ రెండు గోల్స్ కొట్టి ఆధిక్యం కనబర్చగా... చివరి క్వార్టర్లో అంకిత్ పాల్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి యంగ్ ఇండియా ఆధిక్యం మరింత పెంచగా... మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా... జపాన్ ఓ గోల్ చేసింది. నేడు గ్రేట్ బ్రిటన్‌తో భారత జట్టు తలపడనుంది. -
డోరెమాన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ వాయిస్ మూగబోయింది
ప్రముఖ కార్టూన్ క్యారెక్టర్స్‌లో డోరెమాన్ ఒకటి. చిన్నారులు ఎంతో ఇష్టపడే డోరెమాన్‌కు చాలా క్రేజ్ ఉంది. డోరెమాన్ కార్టూన్ సిరీస్ చిన్న పిల్లలకు చాలా ఇష్టం. ఈ సిరీస్‌లో డోరెమాన్, షుజుకా, నోబితా, జియాన్, సునియో క్యారెక్టర్స్‌ను పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఈ డోరెమాన్ క్యారెక్టర్‌కు వాయిస్ ఇచ్చిన జపనీస్ ఆర్టిస్ట్ నోబుయో ఒయామా మృతి చెందారు. ఈ కార్టూన్ సిరీస్‌లో 1979-2005 వరకు డోరెమాన్‌కు వాయిస్ ఇచ్చారు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది.అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం జపనీస్ వాయిస్ ఆర్టిస్ట్ నోబుయో ఒయామా (90) వయోభారంతో సెప్టెంబర్ 29న మరణించారు. అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించకపోవడంతో బయటికి రాలేదు. తాజాగా శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులు మరణం పట్ల ప్రకటన విడుదల చేశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మరణించినట్లుగా పేర్కొన్నారు. ఈ వార్తను ఆలస్యం చేసినందుకు అభిమానులకు క్షమాపణలు తెలిపారు. నోబుయోపై చూపించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.కాగా.. 1933లో టోక్యోలో జన్మించిన నోబుయో ఒయామా వాయిస్ ఆర్టిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. సినిమాలు, షోలు, సిరీస్‌లలో వివిధ పాత్రలకు ఆమె డబ్బింగ్ చెప్పేవారు. సూపర్ మ్యాన్ జాంబోట్- 3లో కప్పే జిన్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. 1964లో సహ నటుడైన కీసుకే సగావాను వివాహం చేసుకున్నారు. 1979లో డోరెమాన్ ప్రారంభమైనప్పటి నుంచి 2005 వరకు నిరంతరాయంగా తన వాయిస్ అందించారు. -
అణ్వాయుధ వ్యతిరేక పోరాటానికి నోబెల్ శాంతి బహుమతి
ఒస్లో: అణ్వాయుధాలకు తావులేని శాంతియుత ప్రపంచమే లక్ష్యంగా అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తున్న జపాన్ సంస్థ ‘నిహాన్ హిడాన్క్యో’కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ వాట్నే ఫ్రైడ్నెస్ శుక్రవారం ఈ విషయం ప్రకటించారు. అణ్వాయుధాల ప్రయోగాన్ని నిషేధించాలన్న నినాదం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని చెప్పారు. మానవాళి సంక్షేమం కోసం అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం గళం విప్పాలని సూచించారు. 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా చేపట్టిన అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయటపడిన పౌరులు ‘నిహాన్ హిడాన్క్యో’ను స్థాపించారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అమెరికా దాడిలో క్షతగాత్రులు మారిపోయి, బాధాకరమైన జ్ఞాపకాలతో జీవిస్తున్నప్పటికీ శాంతి కోసం కృషి చేస్తున్నారని నిహాన్ హిడాన్క్యో సభ్యులను వాట్నే ఫ్రైడ్నెస్ ప్రశంసించారు. తమ సంస్థకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడం పట్ల నిహాన్ హిడాన్క్యో హిరోíÙమా శాఖ చైర్పర్సన్ తొమొయుకి మిమాకీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘‘ఇది నిజమేనా? నమ్మలేకపోతున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఏమిటీ నిహాన్ హిడాన్క్యో? రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యం 1945 ఆగస్టు 9న జపాన్‌లోని నాగసాకి పట్టణంపై అణుబాంబు ప్రయోగించింది. ఈ దాడిలో ఏకంగా 70 వేల మంది మరణించారు. మూడు రోజుల తర్వాత హిరోషిమా పట్టణంపై మరో బాంబును అమెరికా ప్రయోగించింది. ఈ ఘటనలో 1.40 లక్షల మంది ప్రజలు బలయ్యారు. దాంతో 1945 ఆగస్టు 15న పశి్చమ దేశాల సైన్యం ఎదుట జపాన్ లొంగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. నాగసాకి, హిరోíÙమాపై జరిగిన అణుబాంబు దాడుల్లో వేలాది మంది క్షతగాత్రులయ్యారు. అవయవాలు కోల్పోయి దివ్యాంగులుగా మారారు. బాధితులంతా(హిబకుషా) తమకు ఎదురైన అనుభవాలతో అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, తమ భవిష్యత్తు తరాలను కూడా ఆదుకోవాలని, అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ 1956లో నిహాన్ హిడాన్క్యో సంస్థను స్థాపించారు. పసిఫిక్ ప్రాంతంలో అణ్వాయుధ ప్రయోగాలతో బాధితులుగా మారినవారు సైతం ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ ఉద్యమం క్రమంగా ప్రపంచమంతటా వ్యాప్తిచెందింది. BREAKING NEWSThe Norwegian Nobel Committee has decided to award the 2024 #NobelPeacePrize to the Japanese organisation Nihon Hidankyo. This grassroots movement of atomic bomb survivors from Hiroshima and Nagasaki, also known as Hibakusha, is receiving the peace prize for its… pic.twitter.com/YVXwnwVBQO— The Nobel Prize (@NobelPrize) October 11, 2024 -
Snap Elections: జపాన్ పార్లమెంట్ రద్దు
జపాన్ పార్లమెంటు రద్దు అయింది. ముందస్తు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పార్లమెంటును రద్దు చేసినట్లు ఆ దేశ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ప్రకటించారు. దశాబ్ద కాలంగా జపాన్ను అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పరిపాలిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని షిగేరు ఇషిబా మాట్లాడారు. ‘‘మేము ఈ ఎన్నికలను న్యాయంగా, నిజాయితీగా ఎదుర్కోవాలనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందాలని కోరుకుంటుంది’’ అని అన్నారు. అయితే.. జపాన్‌లో జనాభా సంక్షోభం నెలకొన్న పేద ప్రాంతాలపై రక్షణ, అటువంటి ప్రాంతాలపై మరిన్ని అధిక నిధులు ఖర్చు చేయటం వంటి విధానాల అమలకు ప్రజల మద్దతును ప్రధాని ఇషిబా కోరుకుంటున్నట్లు తెలిస్తోంది. 🚨#BREAKING: Japan's Prime Minister Shigeru Ishiba dissolved the lower house of parliament on Wednesday, ahead of the general election slated on October 27, the first national vote for the country's new leader. - Reuters/AFP— R A W S G L 🌎 B A L (@RawsGlobal) October 9, 2024 పలువురు కీలక నేతలు పార్టీ మారుతున్నా కూడా ఎలాంటి ఢోకా లేకుండా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పాలన కొనసాగిస్తోంది. ఇక.. వారం రోజుల కిందటే నూతన ప్రధానిగా షిగేరు ఇషిబా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇంతలోనే ముందస్తు ఎన్నికల కోసం పార్లమెంట్‌ను రద్దు చేయటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక.. అక్టోబర్ 27న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి.చదవండి: ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్ -
85 ఏళ్ల తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో పేలిన బాంబు.. 87 విమానాల రద్దు
టోక్యో: జపాన్ రెండో ప్రపంచ యుద్ధ బాంబులు తాజాగా కలకలం రేపుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా.. జపాన్‌లో బాంబులను జారవిడించింది. అయితే ఆ బాంబులు జపాన్‌లో ఎక్కడో చోట పేలుతూనే ఉన్నాయి.తాజాగా అక్టోబర్ 2న సౌత్‌వెస్ట్ జపాన్‌లోని మియాజాకి విమానాశ్రయం రన్‌వే పై ఓ బాంబు పేలింది. దీంతో బాంబు పేలిన ప్రదేశంలో ఏడు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతు భూమి ధ్వంసమైంది. బాంబు విస్పోటనంతో సమాచారం అందుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు రన్‌వేని షట్‌డౌన్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.బాంబు విస్పోటనం అయ్యే సమయంలో రన్‌వేపై సుమారు 87కి పైగా విమానాలు ఉన్నాయి. అయినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్ రన్‌వే మీద బాంబు పడిన ప్రదేశాన్ని పునర్నిర్మిస్తామని, ఆ పనులు గురువారం నాటికి పూర్తి చేస్తామని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిమాస హయాషి తెలిపారు.విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయంమియాజాకి విమానాశ్రయంపై బాంబు విస్పోటనంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ నుంచి జపాన్ నగరాలైన టోక్యో,ఒసాకా,ఫుకుయోకాతో పాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిర్వహించే ప్రముఖ ఎయిర్ లైన్ దిగ్గజం జపాన్ ఎయిర్‌లైన్స్ (జేఏఎల్), ఆల్ నిప్పాన్ ఎయిర్‌లైన్స్ (ఏఎన్ఏ)తో పాటు ఇతర విమానాయాన సంస్థలు సర్వీసుల్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం.85ఏళ్ల క్రితం యుద్ధంరెండో ప్రపంచం యుద్ధం జరిగింది 85ఏళ్ల అవుతుంది. అయినప్పటికీ యుద్ధ సమయంలో జపాన్‌పై అమెరికా ప్రయోగించిన బాంబులు నిత్యం ఎక్కడ ఒక చోట పేలుతూనే ఉన్నాయి. కేంద్ర రవాణ శాఖ అధికారిక లెక్కల ప్రకారం.. గతేడాది మియాజాకి విమానాశ్రయంలో 37.5 టన్నుల బరువైన 2,348 బాంబులను జపాన్ డిఫెన్స్ ఫోర్స్ నిర్విర్యం చేసింది. -
గాంధీ చెప్పే మూడు కోతుల కథ వెనుక..
నేడు దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. గాంధీ జీవితంతో ముడిపపడిన పలు కథనాలు మనం వింటుంటాం. వాటిలో ఒకటే గాంధీ చెప్పే ‘మూడు కోతుల కథ’. ఆ మూడు కోతులు చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు అనే సందేశాన్ని అందిస్తాయనే విషయం తెలిసిందే. అయితే గాంధీ దగ్గరకు ఈ మూడు కోతులు ఎలా వచ్చాయనే దాని వెనుక ఆసక్తికర ఘట్టం ఉంది.గాంధీ చెప్పే మూడు కోతుల కథ సుమారు 90 ఏళ్ల క్రితం నాటిది. ఈ కోతుల బొమ్మలు జపాన్ నుంచి గాంధీకి బహుమతిగా వచ్చాయి. జపాన్‌కు చెందిన ప్రముఖ బౌద్ధ సన్యాసి నిచిదత్సు ఫుజీ గాంధీకి ఈ మూడు కోతుల బొమ్మలను బహూకరించారు. జపాన్‌లోని అసో కాల్డెరా అడవుల్లో జన్మించిన నిచిదత్సు ఫుజీ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 19 ఏళ్ల ప్రాయంలోనే బౌద్ధ సన్యాసిగా మారాడు. 1917లో భారత్‌లో ఆయన తన మిషనరీ కార్యకలాపాలు ప్రారంభించాడు.1923లో జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ సమయంలో నిచిదత్సు ఫుజీ జపాన్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఆయన తిరిగి భారత్ వచ్చాడు. 1931లో నిచిదత్సు ఫుజీ కలకత్తా చేరుకుని, నగరమంతా పర్యటించాడు. తన భారత పర్యటనలో నిచిదత్సు ఫుజీ మహాత్మా గాంధీని కలవాలనుకుని, వార్ధాలోని గాంధీ ఆశ్రమానికి వచ్చాడు. నిచిదత్సు ఫుజీని చూసి గాంధీ చాలా సంతోషించారు. అతను గాంధీకి మూడు కోతుల బొమ్మలను కానుకగా ఇచ్చాడు. గాంధీకి ఈ కోతి బొమ్మలు ఎంతగా నచ్చాయంటే, ఆయన వాటిని తన టేబుల్‌పై పెట్టుకున్నారు.గాంధీని కలవడానికి వచ్చిన ప్రతివారూ ఆ టేబుల్‌పై ఉన్న మూడు కోతులను గమనించి, దానిలోని అంతర్థాన్ని తెలుసుకునేవారు. అనతికాలంలోనే ఈ మూడు కోతుల సందేశం అందరికీ చేరింది. తరువాతి కాలంలో నిచిదత్సు ఫుజీ బీహార్‌లోని రాజ్‌గిర్‌లో శాంతి గోపురాన్ని నిర్మించారు. ఈ ప్రదేశంలో జపాన్ దేవాలయం కూడా ఉంది. జపనీస్ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో అందమైన తెల్లటి బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. నిచిదత్సు ఫుజీ 1986 జనవరి 9న కన్నుమూశారు.ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు -
అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలు
టోక్యో: అధికార పగ్గాలు చేపట్టేలోపే జపాన్ కాబోయే ప్రధాని షిగెరు ఇషిబా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పిలుపునిచ్చారు. నేడు ప్రధానిగా ప్రమాణం చేయనున్న ఇషిబా సోమవారం మాట్లాడారు. ‘‘ నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తా’’ అని అన్నారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో ఇషిబా విజయం సాధించడం తెల్సిందే. దీంతో ఫుమియో కిషిద వారసుడిగా ఇషిబా ఎంపికయ్యారు. మంగళవారం ప్రమాణస్వీకారం కోసం ఎల్డీపీ ముఖ్యనేతలంతా సిద్దమవుతున్న వేళ ఇషిబా తదుపరి ఎన్నికలపై ముందే ఒక ప్రకటనచేయడం గమనార్హం. -
కిషిదా వారసుడిగా ఇషిబా
టోక్యో: జపాన్ నూతన ప్రధానమంత్రిగా షిగెరు ఇషిబా(67) బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఫుమియో కిషిదా వారసుడిగా ఆయన ఎన్నికయ్యారు. రక్షణ శాఖ మాజీ మంత్రి అయిన ఇషిబాను జపాన్ అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) శుక్రవారం తమ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచి్చంది. పార్లమెంట్లో మెజార్టీ ఉన్న పార్టీ అధ్యక్షుడే ప్రధానమంత్రి కావడం ఆనవాయితీ. కిషిదా తప్పుకోవడంతో నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. ఎల్డీపీ పార్లమెంట్ సభ్యులతోపాటు దాదాపు 10 లక్షల మంది పార్టీ ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి పదవి కోసం ఇద్దరు మహిళలు సహా మొత్తం 9 మంది ఎంపీలు పోటీపడ్డారు. ఇషిబాతోపాటు ఎకనామిక్ సెక్యూరిటీ మంత్రి సనాయే తకైచి చివరి వరకు బరిలో కొనసాగారు. కానీ, ఇషిబాను విజయం వరించింది. ఒకవేళ తకైచి గెలిచి ఉంటే జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించి ఉండేవారు. ఎంపీల ఓట్లు 368, స్థానిక ప్రభుత్వాల్లోని ఓట్లు 47 ఉన్నాయి. ఇషిబాకు అనుకూలంగా 215 ఓట్లు, తకైచి అనుకూలంగా 194 ఓట్లు వచ్చాయి. కొందరు ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. జపాన్ ప్రధాని కిషిదా, ఆయన కేబినెట్ మంత్రులు అక్టోబర్ 1న రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు పార్లమెంటరీ ఓటింగ్‌లో ఇషిబాను ప్రధానిగా లాంఛనంగా ఎన్నుకుంటారు. తర్వాత అదే రోజు ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. జపాన్ను సురక్షితమైన దేశంగా మారుస్తా: ఇషిబా ప్రజల పట్ల తనకు ఎనలేని విశ్వాసం ఉందని ఇషిబా చెప్పారు. ధైర్యం, నిజాయతీతో ఎల్లప్పుడూ నిజాలే మాట్లాడుతానని అన్నారు. ఎల్డీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఇషిబా శుక్రవారం టోక్యోలో మీడియాతో మాట్లాడారు. జపాన్ను సురక్షితమైన, సౌభాగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. ద్రవ్యోల్బణం, అధిక ధరల నుంచి ప్రజలకు విముక్తి కలి్పంచడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతానని తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్దపీట వేస్తానని వెల్లడించారు. అణు ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆసియా ఖండంలో ‘నాటో’ తరహా కూటమి ఏర్పాటు కావాలని ఇషిబా ఆకాంక్షించారు. జపాన్‌లో పెళ్లయిన మహిళలకు ఏదో ఒక ఇంటిపేరు ఉండాలి. పుట్టింటివారు లేదా అత్తింటివారి ఇంటి పేరుతో కొనసాగవచ్చు. కానీ, రెండు ఇంటి పేర్లతో కొనసాగేలా చట్టం తీసుకురావాలని ఇషిబా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి చట్టం కావాలని ఆయన ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు స్వలింగ వివాహాల పట్ల సానుకూల వ్యక్తం చేస్తున్నారు. ఎవరీ ఇషిబా? షిగెరు ఇషిబా న్యాయ విద్య అభ్యసించారు. బ్యాంకింగ్ రంగంలో సేవలందించారు. తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1986లో 29 ఏళ్ల వయసులో ఎల్డీపీ టికెట్‌పై తొలిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ఎల్డీపీ సెక్రెటరీ జనరల్‌గా వ్యవహరించారు. వ్యవసాయం, రక్షణ శాఖల మంత్రిగా పనిచేశారు. ప్రధానమంత్రి పదవిపై ఎప్పుటినుంచో కన్నేశారు. గతంలో నాలుగుసార్లు గట్టిగా ప్రయతి్నంచి భంగపడ్డారు. ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో విజయం సాధించారు. ఇషిబా తండ్రి సైతం రాజకీయ నాయకుడే. ఆయన కేబినెట్ మంత్రిగా పనిచేశారు. కిషిదాకు, ఇషిబాకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎల్డీపీలో ఇషిబాకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారన్న విమర్శలున్నాయి. ఎల్డీపీలో ఇషిబా పలు సందర్భాల్లో అసమ్మతి గళం వినిపించారు. -
దేవర.. నీ రాక కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.. ఎన్టీఆర్‌తో మహిళా అభిమాని
దేవర విడుదల సందర్భంగా బియాండ్ ఫెస్ట్‌లో పాల్గొనేందుకు జూ ఎన్టీఆర్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆ ఫెస్టివల్లో ప్రదర్శితం అయిన తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ రికార్డ్ నెలకొల్పింది. సినిమా ప్రదర్శన అనంతరం అక్కడికొచ్చిన అభిమానులతో ఆయన ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఒక మహిళా అభిమానితో మాట్లాడుతూ ఆమెకు తారక్ ఒక మాటిచ్చాడు.ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఖ్యాతి పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకోవండంతో పాటు ఖండాంతరాలు దాటింది. ముఖ్యంగా తారక్‌కు జపాన్‌లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, బియాండ్ ఫెస్ట్‌లో ఎన్టీఆర్ పాల్గొంటున్న విషయం తెలుసుకున్న ఓ మహిళ.. టోక్యో నుంచి లాస్ ఏంజెల్స్‌కు చేరుకుంది. అతికష్టం మీద ఆమె తారక్‌ను కలుసుకుని మాట్లాడింది. ఎన్టీఆర్‌ను చూసేందుకు ఎంతోమంది అభిమానులు జపాన్‌లో ఎదురుచూస్తున్నారని ఆమె తెలిపింది. ఆపై తమ దేశానికి రావాలని తారక్‌ను ఆహ్వానించింది. ఆమె మాటలతో ఎన్టీఆర్ చాలా ఆనందించారు. ఈ క్రమంలో జపాన్‌కు తప్పకుండా వస్తానని, అభిమానులతో కలిసి దేవర చూస్తానంటూ తారక్ మాటిచ్చారు.ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం దేవర. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పిస్తే.. సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ కీలక పాత్రలలో నటించారు.A Priceless reaction for a Priceless moment! ❤️🔥❤️🔥@KO19830520 traveled all the way from Tokyo to Los Angeles just to watch #Devara with @tarak9999 at the @BeyondFest. #DevaraUSA pic.twitter.com/nPpYmEgj4o— Vamsi Kaka (@vamsikaka) September 27, 2024 -
కిషిదా వారసుడెవరో!
జపాన్ అధికార పార్టీ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) ప్రతి మూడేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని నడిపేందుకు తమ నాయకుడిని ఎన్నుకుంటుంది. ప్రధాని ఫుమియో కిషిదా 2021లో ఎల్డీపీ నేతగా ఎన్నికై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మూడు పర్యాయాలు పదవి చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజాదరణ తక్కువగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని కిషిదా తాను మరోమారు ప్రధాని పదవికి పోటీపడటం లేదని చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. అక్టోబర్ ఒకటిన కిషిదా, ఆయన కేబినెట్ రాజీనామా చేయనుంది. అదేరోజు పార్లమెంటు ఆమోదముద్ర పడ్డాక కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కిషిదా ని్రష్కమణ నేపథ్యంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వానికి తీవ్ర పోటీ నెలకొంది. శుక్రవారం జరిగే ఎన్నికలో ఏకంగా తొమ్మిది మంది బరిలో ఉన్నారు. వీరిలో కొందరు ప్రస్తుత కేబినెట్ మంత్రులు కాగా.. మరికొందరు మాజీ మంత్రులు. దిగువసభ కాలావధి 2025 అక్టోబర్ వరకు ఉన్నప్పటికీ.. కొత్త ప్రధానిగా ఎన్నికైన వారు తమ కొత్త ఇమేజ్ను ఉపయోగించుకొని.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు. ప్రధాని పదవి చేపట్టాక కొద్ది వారాల్లోనే ఎన్నికలకు వెళతామని చాలా మంది పోటీదారులు బాçహాటంగానే చెప్పారు. ఓటింగ్ జరిగేదిలా.. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వ ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఎల్డీపీకి 368 మంది ఎంపీల బలముంది. ఎంపీకి ఒక ఓటు ఉంటుంది. 11 లక్షల ఎల్డీపీ సభ్యుల ప్రాధామ్యాలకు అనుగుణంగా మరో 368 ఓట్లను పోటీపడుతున్న అభ్యర్థులకు కేటాయిస్తారు. అంటే తొలిరౌండ్లో మొత్తం 736 ఓట్లు ఉంటాయి. మొదటిరౌండ్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఏకంగా తొమ్మిది మంది బరిలో ఉండటంతో తొలిరౌండ్లో ఏ ఒక్కరూ 50 శాతం ఓట్లను సాధించే అవకాశాలు లేవని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారమే రెండో రౌండ్ ఓటింగ్ జరుగుతుంది. మొదటిరౌండ్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు తదుపరి రౌండ్ ఓటింగ్‌కు అర్హత సాధిస్తారు. ఈ రౌండ్లో 368 మంది ఎంపీలకు తోడు 47 మంది స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు ఓటింగ్‌కు అర్హులు. మొత్తం 415 ఓట్లు ఉంటాయి. తమ పరిధిలోని మెజారిటీ పార్టీ సభ్యులు ఎవరివైపు మొగ్గుచూపారో దానికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు తమ ఓటు వేస్తారు. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కిషిదా కుర్చీ కోసం తొమ్మిది మంది రేసులో నిలిచినా.. ప్రధానంగా పోటీ ముగ్గురి మధ్యే ఉందని పలు పోల్ సర్వేలు చెబుతున్నాయి. మాజీ రక్షణమంత్రి షిగెరూ ఇషిబా, మాజీ పర్యావరణ మంత్రి షిన్‌జిరో కొయిజుమీ, ఆర్థిక భద్రత మంత్రి తకైచీ సనయీలు ముందంజలో ఉన్నారు. యోషిమాసా హయాíÙ, తకయుకి కొబయాషి, తొషిమిత్సు మొతెగి, యోకో కమికావా, టారో కోనో, కత్సునోబు కటో.. మిగతా పోటీదారులు. టాప్–3 పోటీదారుల వివరాలిలా ఉన్నాయి...షిగెరూ ఇషిబా (67): ఆపత్కాలంలో అనుభవజు్ఞడు ఇషిబా మాజీ బ్యాంకర్. ఎల్డీపీ నాయకత్వానికి ఆయన పోటీపడటం ఇది ఐదోసారి. ఇదే తన చివరి ప్రయత్నమని ప్రకటించారు. 1986లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన ఇషిబా రక్షణ, వ్యవసాయ శాఖలతో పాటు పలు మంత్రిత్వ శాఖలు చూశారు. పార్టీ పదవుల్లోనూ పనిచేశారు. ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ.. తోటి ఎంపీల నుంచి ఆశించినంత మద్దతు కూడగట్టుకోలేకపోయారు. ఏడాది కాలంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విపక్ష కాన్సిట్యూషనల్ డెమొక్రాటిక్ పార్టీ మాజీ ప్రధాని యోషిహికో నోడాను తమ నాయకుడిగా ఎన్నుకుంది. వాగ్ధా్దటితో ప్రజలను ఆకట్టుకునే నోడాను ఎదుర్కొనడానికి ఇషిబా అనుభవం, విషయ పరిజ్ఞానం, నైపుణ్యం అక్కరకొస్తాయని ఎల్డీపీ భావిస్తోంది. రక్షణ విధానాల రూపకల్పనలో నిపుణుడిగా ఇషిబాకు పేరుంది. నాటో రక్షణ కూటమి లాంటిది ఆసియాకూ ఉండాలని ఇషిబా ప్రతిపాదించారు. షిన్‌జిరో కొయిజుమీ (43): నాలుగోతరం వారసుడు ప్రజాదరణ పొందిన మాజీ ప్రధాని జునిచితో కొయిజుమీ కుమారుడే షిన్‌జిరో. కొయిజుమీ రాజకీయ వారసత్వంలో నాలుగోతరం నాయకుడు. శుక్రవారం ఎన్నికల్లో నెగ్గితే జపాన్‌కు అత్యంత పిన్న వయసు్కడైన ప్రధానిగా రికార్డులకెక్కుతారు. 2009లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. షింజో అబే కేబినెట్లో 2019– 2021 మధ్య పర్యావరణ మంత్రిగా పనిచేశారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి రాజనీతిశాస్త్రంలో మాస్టర్స్ చేసిన షిన్‌జిరో ప్రముఖ టీవీ యాంకర్ తకిగవా క్రిస్టెల్ను వివాహమాడారు. ఇతర పోటీదారులతో పోలి్చనపుడు అనుభవం పెద్దగా లేకున్నా.. ఎల్డీపీ శ్రేణుల్లో ఆదరణ ఉంది. మాజీ ప్రధాని యోషిహిడే సుగా మద్దతు ఉంది. సంస్కరణ వాది. పితృత్వపు సెలవును ప్రమోట్ చేయడానికి 2020లో స్వయంగా రెండు వారాలు సెలవు తీసుకున్నారు. జపాన్– అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేస్తానని, పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేయడానికి భావసారూప్యత కలిగిన దేశాలతో కలిసి పనిచేస్తానని షిన్‌జిరో చెబుతారు. రెండోరౌండ్ వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అనుభవలేమి ఒక్కటే ప్రతికూలత.తకైచీ సనయీ (63): సంప్రదాయవాది తకైచీ గెలిస్తే జపాన్‌కు తొలి మహిళా ప్రధానమంత్రి అవుతారు. మాజీ ప్రధాని షింజో అబే అనుయాయురాలు. సంప్రదాయవాది. రైట్ వింగ్ మద్దతు ఉంది. 2021లో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వం కోసం కిషిదాతో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే సా«ధనసంపత్తిని బలోపేతం చేయడం, ఆహార భద్రత, సైనిక సామర్థ్యం పెంపుదల, పంపిణీ వ్యవస్థల బలోపేతం.. ఇవి తకైచీ ప్రధాన హామీలు. స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తారు. పురుషులనే వారసులుగా పరిగణించే రాజకుటుంబ సంప్రదాయాన్ని బలపరుస్తారు. టీవీ యాంకర్‌గా పనిచేసిన తకైచీ తొలిసారిగా 1993లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రిగా పనిచేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ తనకు రోల్ మోడల్ అని చెబుతారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అప్పుడు జపాన్‌లో కనిపించింది: ఇప్పుడు నోయిడాలో..
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతాలో ఎప్పటికప్పుడు అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ప్రెట్టీ కూల్ అంటూ కొన్ని ఫోటోలను ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసారు. ఇవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలను గమనిస్తే.. వాషింగ్ మెషీన్లో మహిళా ఉందేమో అనిపిస్తుంది. కానీ ఆలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇదొక పాడ్-స్టైల్ హోటల్. ఇలాంటి టెక్నాలజీ మొదటిసారిగా 1979లో జపాన్ పరిచయం చేసింది. ఆ తరువాత ఇప్పుడు నోయిడాలో కనిపించింది.ఇదీ చదవండి: మస్క్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు: ఇదే జరిగితే..ట్రావెల్ వ్లాగర్ ఇందులో ఉండటానికి రూ. 1000 చెల్లించి, ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే గడిపింది. ఇందులో ఒక మంచం, అద్దం, కంట్రోల్ ప్యానెల్, ఛార్జింగ్ పాయింట్స్, ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వంటి వాటితో పాటు మహిళల కోసం ప్రత్యేకమైన వాష్‌రూమ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని ఆనంద్ మహీంద్రా ప్రెట్టీ కూల్ అంటూ అభివర్ణించారు. -
జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
టోక్యో: జపాన్ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. మంగళవారం త్లెలవారుజామున రిక్టార్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించటంతో.. జపాన్ దీవులైన ఇజు, ఒగాసవారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్ రాజధాని టోక్యోకు 600 కిలోమీటర్ల దూరంలోని తోరిషిమా ద్వీపంలో సంభవించిన భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం కారణంగా పెద్దగా ప్రకంపనలు చోటుచేసుకొనప్పటికీ.. భూకంపం సంభవించిన 40 నిమిషాల్లోనే ఇజు దీవుల్లోని హచిజో ద్వీపంలో దాదాపు 50 సెంటీమీటర్ల అతి చిన్న సునామీ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, సముద్రపు నీరు ఒక మీటరు ఎత్తులో ఎగసిపడితే సునామి ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.All tsunami warnings lifted for Japan's Izu and Ogasawara islands after earlier 5.6 magnitude earthquake https://t.co/bWfknc7WAj— Factal News (@factal) September 24, 2024క్రెడిట్స్: Factal Newsఈ క్రమంలోనే అధికారులు.. ముందస్తుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తరచూ భూకంపాలు సంభవించే జపాన్‌లో గత రెండు నెలల్లో అనేక చిన్న భూకంపాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబరు 23న తైవాన్‌లో 4.8 తీవ్రత, సెప్టెంబర్ 22న ఎహిమ్‌లో 4.9 తీవ్రత, సెప్టెంబర్ 21న చిబాలో 4.6 తీవ్రతతో చిన్న భూకంపాలు సంభవించాయి.చదవండి: వింత శబ్దాల మిస్టరీ వీడింది -
జాబిల్లిపై కారులో!
టోక్యో: సంప్రదాయకంగా అపోలో మిషన్ మొదలు తాజా ప్రయోగాల దాకా జాబిల్లిపై జరిగిన అన్ని ప్రయోగాల్లో ల్యాండర్, రోవర్‌లనే అధికంగా వాడారు. మానవరహితంగా కదిలే రోవర్ కొద్దిపాటి దూరాలకు వెళ్లగలవు. అక్కడి ఉపరితల మట్టిని తవ్వి చిన్నపాటి ప్రయోగాలు చేయగలవు. అయితే వీటికి చెల్లుచీటి పాడేస్తూ చంద్రుడిపై ఏకంగా కారులో వ్యోమగాములు ప్రయాణించేలా ఒక అధునాతన స్పెషల్ కారును తయారుచేస్తామని జపాన్ ప్రకటించింది. ఆటోమోటివ్ దిగ్గజం టొయోటాతో కలిసి తాము తయారుచేయబోయే భారీ వాహనం వివరాలను జపాన్‌లోని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) తాజాగా వెల్లడించింది. భూమి లాంటి వాతావరణం అక్కడ లేని కారణంగా చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ చాలా తక్కువ. దీంతో సాధారణ కారు అక్కడ చకచకా ముందు కదలడం చాలా కష్టం. అందుకే ఒత్తిడితో నడిచే ప్రత్యేక వాహనాన్ని రూపొందిస్తామని టొయోటా సంస్థ తెలిపింది. ఈ కారు కథాకమామిషు ఓసారి చూద్దాం.. అమెరికా నాసా వారి ప్రతిష్టాత్మక ఆరి్టమిస్–8 మిషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా కారులా ఉండే అత్యాధునిక రోవర్ వాహనాన్ని సిద్ధంచేయనున్నారు. ఈ వాహనంలో వ్యోమగాములు ఎక్కువ కాలం గడపొచ్చు. సంప్రదాయ రోవర్ మాదిరిగా స్వల్ప దూరాలకుకాకుండా చాలా దూరాలకు ఈ వాహనం వెళ్లగలదు. వ్యోమగాములు చేపట్టబోయే అన్ని ప్రయోగాలకు సంబంధించిన ఉపకరణాలు ఇందులో ఉంటాయి. గతంలో ఎన్నడూ వెళ్లని ప్రాంతాలకు వెళ్తూ కారు లోపల, వెలుపల ప్రయోగాలు చేయొచ్చు. చందమామపై వేర్వేరు ప్రదేశాల వాతావరణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తూ వ్యోమగాములు అక్కడి నేల స్వభావాన్ని అంచనావేయొచ్చు. వ్యోమగాముల రక్షణ కోసం లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్, వాహనం దిగి ఎక్కువసేపు బయట గడిపితే రేడియేషన్ ప్రభా వానికి లోనుకాకుండా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు, దిగి సులభంగా ఆ ప్రాంతంలో కలియతిరిగేందుకు ‘ఎయిర్‌లాక్’వ్యవస్థ ఇలా పలు ఏర్పాట్లతో వాహనాన్ని తీర్చిదిద్దుతామని జాక్సా తెలిపింది. ఆటోమొబైల్ సాంకేతికతలో జపాన్‌ది అందెవేసిన చేయి. దీంతో జ పాన్ టెక్నాలజీ, అంతరిక్ష అనుభవం చంద్రుడి ఉపరితలంపై కొత్త తరహా ప్రయోగాలకు బాటలు వేస్తాయని నాసా తెలిపింది. -
కిన్మేమై బియ్యం గురించి విన్నారా? ధర తెలిస్తే కంగుతింటారు!
మనం చూసే సాధారణ తెల్లటి బియ్యం మాదిరిగానే ఉంటాయి జపాన్‌కి చెందిన కిన్మేమై బియ్యం. అయితే దీన్ని ప్రత్యేకమైన ప్రాసెసింగ్ పద్ధతిలో తయారు చేస్తారు. జపాన్ వాళ్లు ఈ బియ్యాన్నితాము పేటెంట్ పొందిన ప్రత్యేక సాంకేతిక ప్రక్రియలోనే అభివృద్ది చేశారు. ముఖ్యంగా ఆహార ప్రియలుకు మంచి పోషాకాలను అందించే దృష్ట్యా ప్రత్యేకంగా రూపొందించిన బియ్యం. అయితే ఈ బియ్యం స్పెషాలిటీ ఏంటంటే వండే ముందు కడగాల్సిన పని ఉండదు. అంటే వీటి వాడకం వల్ల నీటి వృధాను తగ్గించొచ్చు. ఇవి రుచికి కమ్మదనంతో కూడిన స్వీట్‌నెస్‌గా ఉంటాయి. చూసేందుకు కూడా చాలా వెన్న మాదిరి సున్నితంగా ఉంటుంది. పోషకాల పరంగా సంప్రదాయ తెల్ల బియ్యం కంటే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు బ్రౌన్ రైస్ మాదిరి ప్రయోజనాలకు కూడా అందిస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేకమైన చెస్ట్నట్ రంగు ఉన్నతమైన పోషకాహార ప్రొఫైల్‌ని కలిగి ఉంటుంది. అలాగే తొందరగా ఉడికిపోతుంది.ఆరోగ్య ప్రయోజనాలు..ఇవి తెలుపు, గోధుమ వంటి రెండు రకాల్లోనూ లభ్యమవుతాయి. ఇందులో ఊక ఉంటుంది.సాధారణ బియ్యం కంటే 1.8 రెట్లు ఫైబర్, ఏడు రెట్టు విటమిన్ బీ1 కలిగి ఉంది. ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదర్కొనడంలో సహాయపడుతుంది. ఇందులో ఆరు రెట్లు లిపోపాలిసాకరైడ్లు(ఎల్పీఎస్)ను కలిగి ఉంది. ఫ్లూ, ఇన్ఫెక్షన్లు, కేన్సర్, డిమెన్షియా(చిత్త వైకల్యం) వంటి వ్యాధులతో పోరాడేలా రోగనిరోధక వ్యవస్థకు సహజమైన బూస్టర్.కడుపు ఉబ్బరం, అజీర్ణం తదితర సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే అన్నం అధిక నీటిని పీల్చుకోకుండా చేస్తుంది కాబట్టి ఇది బ్రౌన్ రైస్‌కి సమానమైన ఆరోగ్య ప్రయోజనాలను అందింగలదని చెబతున్నారు నిపుణులు. ధర..మార్కెట్లో ఈ బియ్యం కిలో ధర రూ.15 వేలు పలుకుతోంది. ధరల పరంగా అత్యంత ఖరీదైన బియ్యంగా ప్రపంచ రికార్డు సాధించింది. అయితే జపాన్‌లో ఈ బియ్యాన్ని ఒక పెట్టేలో 140 గ్రాముల చొప్పున ఆరు ప్యాకెట్లుగా ప్యాక్ చేసి విక్రయిస్తుంటారు. దీని ధర రూ. 13000/-కిన్మెమై రైస్‌ని టోయో రైస్ కార్పొరేషన్ రూపొందించింది. ఈ రైస్ కార్పొరేషన్ వాకయామాలో 1961 స్థాపించబడింది. అక్కడే ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్పొరేషన్ సాంకేతికలో మెరుగుదల ఈ కిన్మెమై రైస్ అభివృద్ధికి దారితీసిందని జపాన్ అగ్రికల్చర్ నిపుణులు చెబుతున్నారు.(చదవండి: టైటానిక్ మూవీ నటి 48 ఏళ్ల వయసులో టెస్టోస్టెరాన్ థెరపీ! మహిళలకు మంచిదేనా..?) -
టోక్యోలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు
-
టోక్యోలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు
జపాన్ రాజధాని టోక్యో నగరంలో వినాయక చవితి వేడుక ఉత్సాహంగా జరిగింది. తెలుగు అసోసియేషన్ జపాన్ (TAJ) వారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విఘ్ననాయకుడికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి, ఆది దేవుడి ఆశీస్సులు పొందారు.అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు వారంతా కలిసి విగ్రహాన్ని ప్రతిష్టించి గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివారం అట్టహాసంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పెద్దలు, పిల్లలు ఆనందంతో పాల్గొన్నారు. -
ఈ పీతను కొనాలంటే ఆస్తులుకు ఆస్తులే అమ్ముకోవాలి..!
పులస చేపకే పుస్తెలమ్ముకోవాలనుకునే మన జనాలు ఈ పీత ధర వింటే ఏకంగా ఆస్తులకు ఆస్తులే అమ్మేసుకోవాలనుకుంటారు. జపాన్‌లో దొరికే ఈ అరుదైన పీత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పీత. సముద్రంలో మూడువందల మీటర్లకు పైగా లోతులో మాత్రమే ఇది దొరుకుతుంది. అంత లోతున వేటాడినా, అదృష్టం బాగున్న వేటగాళ్ల వలలకే ఇది చిక్కుతుంది. అందుకే దీనికి అంత ధర. దీనిని ‘మాత్సుబా క్రాబ్’ అని, ‘స్నో క్రాబ్’ అని అంటారు.ఈ పీత మాంసం చాలా రుచిగా ఉంటుందట! సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు ఈ పీతలు వలలో చిక్కినప్పుడు వాటిని వేలంలో అమ్ముతారు. గత ఏడాది నవంబర్‌లో ఒక మత్స్యకారుడి వలలో ఈ రకం పీత చిక్కింది. వేలంలో అమ్మితే, 1.2 కిలోల బరువు ఉన్న ఈ పీతకు ఏకంగా 10 మిలియన్ యెన్లు (రూ.58 లక్షలు) ధర పలికింది. జపాన్‌లోని రెస్టారెంట్లలో ఈ పీతలను సన్నగా తరిగి వేయించి ‘కనిసుకియాకి’, గంజిలో ఉడికించి ‘జోసుయి’, గ్రిల్డ్ క్రాబ్ వంటి వంటకాలను తయారు చేస్తారు. వీటిని ఆరగించేందుకు డబ్బున్న బడాబాబులు ఎగబడుతుంటారు. -
ఏ దేశమేగినా... బొజ్జ గణపయ్యే!
నేడు వినాయక చవితి. విఘ్నాలను తొలగించి, సర్వ కార్యాల్లో విజయం సిద్ధించాలని కోరుకుంటూ గణనాథుడికి పూజలు చేస్తాం. ఆసేతుహిమాచలం మాత్రమే కాదు భారతదేశానికి ఆవల సైతం పూజలందుకుంటున్న అతికొద్ది మంది దేవుళ్లలో వినాయకుడు సైతం ఉన్నాడు. థాయిలాండ్ మొదలు కాంబోడియా, జపాన్, చైనా ఇలా ఎన్నో దేశాల్లో బొజ్జ గణపయ్య ఘనంగా పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏటా గణేష్ చతురి్థని జరుపుకుంటూ మహదానందం పొందుతున్నాడు ఆయా దేశాల ప్రజలు. వాణిజ్య, ధారి్మక సంబంధాల కారణంగా ఆగ్నేయాసియాలో అనేక హిందూదేవతలను పూజించడం పరిపాటి. భారత్‌లో మాదిరే వరసిద్ధి వినాయకుడు విదేశాల్లోనూ చక్కని పూజలందుకుంటున్నాడు. అయితే గణపతిని ఆయా దేశాలు వివిధ రూపాల్లో కొలుస్తుండటం విశేషం. విఘ్ననాయకుడిని విశేష రూపాల్లో ఏ దేశం? ఎలా ఆరాధిస్తుందో ఓసారి పరికిద్దాం.. థాయిలాండ్‌లో.. థాయిలాండ్ బౌద్ధులకు వినాయకుడూ ఆరాధ్య దైవమే. క్రీ.శ 550–600 ప్రాంతంలో థాయిలాండ్‌లో లంబోదరుని విగ్రహాలు వెలిశాయి. థాయిలాండ్‌లో మన మోదకప్రియుడిని ఫిరా ఫికానెట్గా కొలుస్తారు. విజయానికి చిహ్నంగా, అడ్డంకులను తొలగించే శక్తిగా భావిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు, వివాహం సందర్భంగా మహాగణపతిని పూజిస్తారు. గజాననుడి ప్రభావం థాయ్ కళ, వాస్తుశిల్పంలోనూ స్పష్టంగా గోచరిస్తుంది. గణపతి ఆలయాలు దేశవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. కాంబోడియాలో ఆగ్నేయాసియా అంతటా మన విఘ్నరాజును పూజిస్తారు. ఈ సంప్రదాయ ఈ ప్రాంతానికి ఎలా వచి్చందనేది మాత్రం తెలియడం లేదు. ఐదు, ఆరో శతాబ్దాలకు చెందిన గణాధ్యక్షుడి శాసనాలు, చిత్రాలు ఆగ్నేయాసియాలో ఉన్నాయి. కంబోడియాలో గణా«దీశుడు ప్రధాన దైవం. ఏడో శతాబ్దం నుంచి ఆయనను దేవాలయాలలో పూజించారు. భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఈ దేవుడికి ఉందని ఇక్కడ నమ్ముతారు. టిబెట్‌లో టిబెట్‌లోనూ మన మంగళప్రదాయుడిని బౌద్ధ దేవుడిగా పూజిస్తారు. ఇక్కడ మహారక్త గణపతిగా, వజ్ర వినాయకుడిగా విభిన్న రూపాల్లో ఆరాధిస్తారు. భారతీయ బౌద్ధ మత నాయకులు అతిసా దీపంకర శ్రీజ్ఞ, గాయధర వంటివారు క్రీస్తుశకం 11వ శతాబ్దంలో టిబెట్ బౌద్ధమతానికి వినాయకుడిని పరిచయం చేసినట్లు చరిత్ర చెబుతోంది. గణేశుడిని టిబెట్, మంగోలియాలో ఉద్భవించిన బౌద్ధమత రూపమైన లామాయిజం పుట్టుకతో ఈ దేశ పురాణాలు ముడిపడి ఉన్నాయి. ధర్మ రక్షకుడిగా, చెడును నాశనం చేసే శక్తిగా, అడ్డంకులను తొలగించే మూర్తిగా వినాయకుడిని బౌద్ధం బోధిస్తోంది. అందుకే ఇక్కడి గణపతి విగ్రహం దృఢంగా, బలమైన కండరాలు, కవచం, దంతాలు, ఆయుధాలతో అలరారుతుంటాయి. ఇతర టిబెటన్ దేవతల మాదిరిగా కోపం కొట్టొచి్చనట్లు ఎరుపు, నలుపు, గోధుమ వర్ణాల్లో విగ్రహాలు కనిపిస్తాయి. ఇండోనేసియాలో.. ఇండోనేసియాలోని జావా ద్వీపంలో కృతనాగర మహారాజు మాంత్రిక కర్మలలో అడ్డంకులను తొలగించే తాంత్రిక దేవతగా వినాయకుడిని పూజించారు. ఇది క్రీ.శ 14–15 వ శతాబ్దాల నాటికి ఇక్కడ అభివృద్ధి చెందిన తాంత్రిక బౌద్ధం, శైవ మతాల కలయికగా గణపతిని ఇక్కడ ఆరాధిస్తారు. పుర్రెలు ధరించి పుర్రెల సింహాసనంపై కూర్చున్న రూపంలో వినాయకుడు పూజలందుకుంటున్నారు. భారత్‌లో సాధారణంగా కనిపించే విగ్రహరూపాల్లోనూ గణపతిని ఇక్కడ పూజిస్తారు. తూర్పు జావా ప్రాంతంలోని తెన్గెర్ సెమెరూ జాతీయ వనంలోని బ్రోమో పర్వతం ముఖ ద్వారం వద్ద 700 సంవత్సరాలనాటి గణనాథుని విగ్రహం ఉంది. బ్రహ్మదేవుని పేరు మీద ఈ పర్వతానికి బ్రోమో పేరు వచి్చంది. అగి్నపర్వతాల విస్ఫోటం నుంచి ఈ విగ్రహం తమను రక్షిస్తుందని స్థానికులు నమ్ముతారు.చైనా, అఫ్గానిస్తాన్‌లలో.. చైనాలో లంబోదరుడిని ‘హువాంగ్ సీ టియాన్’అని పిలుస్తారు. ఆయనను ఒక విఘ్నంగా భావిస్తారు. అఫ్గానిస్తాన్ రాజధా ని కాబూల్ సమీపంలోని గార్డెజ్‌లో క్రీ.శ 6 లేదా 7వ శతాబ్దంలో చెక్కిన ప్రసిద్ధ వినాయ క విగ్రహం బయలి్పంది. గార్డెజ్ గణేశుడుగా పిలువబడే ఆయనను జ్ఞానం, శ్రేయస్సునందించే దేవుడిగా స్థానికులు ఆరాధిస్తారు. జపాన్‌లో.. గణాలకు అధిపతి అయిన వినాయకుడిని జపాన్‌లో కంగిటెన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక్కడి వాణిజ్యవేత్తలు, వ్యాపారులు, జూదగాళ్ళు, నటులు, ‘గీషా’లుగా పిలవబడే కళాకారి ణులు ఎక్కువగా గణేషుడిని కొలుస్తారు. అయితే ఇక్కడ కొందరు ప్రత్యేకమైన రూపంలో ఉన్న వినాయకుడిని ఆరాధిస్తారు. ఈ వినాయక విగ్ర హంలో స్త్రీ, పురుష రూపాలు ఆలింగనం చేసుకు ని ఉంటాయి. జపనీస్ వినాయక రూపాల్లో ఒక రూపం నాలుగు చేతులతో, ముల్లంగి, మిఠాయి పట్టుకొని ఉండటం విచిత్రం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజీనామాకు సాయం చేసే కంపెనీలు!
ఉద్యోగం మానేయాలనుకుంటే భారత్‌లో రాజీనామా పత్రం ఇచ్చి నోటీస్ పీరియడ్ పూర్తిచేస్తే సరిపోతుంది. కానీ జపాన్ దేశంలో మాత్రం రాజీనామా ఇచ్చినా కంపెనీలు దాన్ని ఆమోదించడం లేదట. దాంతో చాలామంది ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అలాంటి వారికోసం జపాన్‌లో కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. రాజీనామా తంతును పూర్తిచేసి ఉద్యోగులకు బాసటగా నిలుస్తున్నాయి. ఆ కంపెనీలను ఆశ్రయిస్తున్న క్లయింట్ల సంఖ్య ఏటా పెరుగుతోంది.జపాన్‌లో సరిపడా కార్మికశక్తి లేక కంపెనీలు ఉన్న ఉద్యోగులు రాజీనామాలు ఆమోదించడం లేదు. దాంతో తమ కొలువులు వదిలివేయడం ఉద్యోగులకు సవాలుగా మారుతోంది. ఎగ్జిట్, ఆల్బాట్రాస్ వంటి కంపెనీలు కార్మికులు రాజీనామా చేయడంలో సహాయపడుతున్నాయి. ఇందుకోసం 20,000 యెన్లు(దాదాపు రూ.11,600) వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఈ కంపెనీలు తమ క్లయింట్ యజమానికి కాల్ చేసి రాజీనామాను సమర్పించి దాన్ని ఆమోదించే వరకు అవసరమయ్యే తంతును పర్యవేక్షిస్తున్నాయి. కంపెనీ అందిస్తున్న చాలా వెసులుబాట్లు అనుభవిస్తున్న వారు ఉద్యోగానికి రాజీనామా సమర్పించిన వెంటనే కొన్ని సంస్థలు వృత్తిపరంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇలాంటి ఇబ్బందులను సైతం న్యాయబద్ధంగా పరిష్కరిస్తూ ఉద్యోగులకు బాసటగా నిలుస్తున్నాయి. 2017లో ప్రారంభమైన ఎగ్జిట్ కంపెనీ ఏటా సుమారు 10,000 మంది క్లయింట్లకు సాయం చేస్తున్నట్లు తెలిపింది.యువత ఎక్కువగా ఉన్న భారత్‌లో శ్రామికశక్తికి ప్రస్తుతం ఢోకాలేదు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతాల సరసన చేరిన జపాన్ వంటి దేశాల్లో యువతలేక అల్లాడిపోతున్నారు. కంపెనీల్లో పనిచేసే సరైన శ్రామికశక్తి లేక ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం పిల్లల్ని కనడానికి ప్రభుత్వం అక్కడి దంపతులకు ప్రత్యేక వెసులుబాటు అందిస్తోంది. నిరుద్యోగం, అధిక జీవన వ్యయం, మహిళల పట్ల వివక్ష తదితర సమస్యలతో అక్కడి జనాభా తగ్గిపోతోంది. వివాహం చేసుకుని సంతానాన్ని కనే వారికి జపాన్ ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా యువత నిర్ణయంలో పెద్ద మార్పు ఉండడంలేదని తెలుస్తోంది. జపాన్ 2070 నాటికి 30 శాతం మేర జనాభాను కోల్పోయే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఫలితంగా కార్మికశక్తి లేక సంక్షోభంలోకి చేరే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: కొండలు, లోయ ప్రాంతాల్లో సులువుగా నడిపేలా కొత్త టెక్నాలజీ -
పందొమ్మిదేళ్లకు.. ‘ఫ్యామిలీ ట్రీ’ట్!
జపాన్‌లోని ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో ఒక విద్యార్థి రిన్. ఇరవై ఏళ్ల రిన్ని ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా కాలేజీ వాళ్లు ‘ఫ్యామిలీ ట్రీ’ తయారుచేయమన్నారు. తల్లి తప్ప మరెవరూ లేకపోవడంతో తండ్రి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించాడు రిన్. తల్లి సచియే తకహతాను అడిగాడు. తల్లి–తండ్రి విడిపోయే సమయంలో రిన్ వయసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే. వారు విడిపోయిన తర్వాత ఇద్దరి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ‘ఆధారాల కోసం వెతికే క్రమంలో కొన్ని పాత ఫ్యామిలీ ఫొటోలు, తండ్రి సుఖ్‌పాల్ పేరు, అమృతసర్ అడ్రస్ దొరికాయి. గూగుల్ మ్యాప్‌లో లొకేషన్ కోసం వెతికి, టికెట్ బుక్ చేసుకొని ఆగస్టు 15న పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి చేరుకున్నాడు.అయితే విధి అతన్ని మరింతగా పరీక్ష పెట్టింది. సుఖ్‌పాల్ అక్కడి నుండి ఎప్పుడో వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాడని తెలిసింది. తండ్రి ప్రస్తుతం ఉంటున్న అడ్రెస్ ఎవరూ చెప్పలేకపోయారు. ‘నా దగ్గర మా నాన్న పాత ఫొటోలు ఉండటంతో స్థానిక ప్రజలను అడిగి కనుక్కోవడానికి ప్రయత్నించాను. చాలా మందిని అడిగాక అదృష్టం కొద్దీ ఒక వ్యక్తి నా తండ్రి ఫొటో గుర్తించి, అతని కొత్త చిరునామా నాకు ఇచ్చే ఏర్పాటు చేశాడు. అలా 19 ఏళ్ల తర్వాత మా నాన్నను మళ్లీ కలవగలిగాను’ అని తండ్రిని కలుసుకున్న ఉద్విగ్న క్షణాలను పంచుకుంటున్నాడు రిన్.‘ఇలా జరుగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ, జరిగింది. నా ప్రస్తుత భార్య గుర్విందర్‌జిత్ కౌర్, నా ఏకైక కుమార్తె అవ్లీన్ కూడా రిన్ను కుటుంబంలోకి హృదయపూర్వకంగా స్వాగతించినందుకు సంతోషంగా ఉన్నాను. నా మాజీ భార్య సచియేతో ఫోన్లో మాట్లాడాను. రిన్ క్షేమం గురించి చె΄్పాన’ని సుఖ్‌పాల్ కొడుకును కలుసుకున్న మధుర క్షణాలను పంచుకుంటున్నాడు.రక్షాబంధన్ రోజే...రిన్ తండ్రి కుటుంబాన్ని కలవడం, పండగప్రాముఖ్యతను గురించి తెలుసుకొని, ఆ రోజు సవతి సోదరి అవ్లీన్ చేత రాఖీ కట్టించుకోవడం.. వంటివి రిన్ను థ్రిల్ అయ్యేలా చేశాయి. ‘మా సోదర–సోదరీ బంధం చాలా బలమైనది’ అని ఆనందంగా చెబుతాడు రిన్.కొడుకును అమృత్‌సర్‌కి తీసుకెళ్లి..ఇన్నేళ్లకు వచ్చిన కొడుకును వెంటబెట్టుకొని సుఖ్‌పాల్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించుకున్నాడు. అటారీ వాఘా సరిహద్దులో జరిగిన జెండా వేడుకను వీక్షించారు. సుఖ్‌పాల్ తన గతాన్ని వివరిస్తూ ‘2000 సంవత్సరం మొదట్లో థాయ్‌లాండ్ విమానాశ్రయంలో భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండా సచియేను చూశాను. విమానంలో మా సీట్లు పక్కపక్కనే ఉన్నాయి. అలా మా మొదటి సంభాషణ జరిగింది. ఆమె వరుసగా ఎర్రకోట, తాజ్‌మహల్‌లను సందర్శించడానికి న్యూఢిల్లీ, ఆగ్రాకు వెళుతోంది.గోల్డెన్ టెంపుల్ గురించి చెప్పి, అమృత్‌సర్‌కి తన పర్యటనను పొడిగించమని సచియేని నేనే అడిగాను. ఆమె వెంటనే ‘ఓకే’ చెప్పి అమృత్‌సర్‌కి నాతో పాటు వచ్చింది. మా కుటుంబంతో కలిసి 15 రోజులకు పైగా ఉంది. ఇక్కడ ఉన్న సమయంలో స్థానిక పర్యాటక ప్రదేశాలతో పాటు ఎర్రకోట, తాజ్‌మహల్‌ను సందర్శించాం. సచియే జపాన్‌కు వెళ్లాక కూడా ఇద్దరం ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. అప్పుడు తనకు 19 ఏళ్లు, నాకు 20 ఏళ్లు. 2002లో సచియేను వివాహం చేసుకుని, జపాన్ పర్యటనకు వెళ్లాను. ఏడాది తర్వాత రిన్ జన్మించాడు. నేను జపనీస్ నేర్చుకున్నాను. అక్కడ చెఫ్‌గా పని చేశాను.కొన్ని రోజుల తర్వాత మేం కొన్ని కారణాల వల్ల కలిసి ఉండలేకపోయాం. దీంతో నేను భారతదేశానికి తిరిగి వచ్చేశాను. ఆమె రిన్‌తో కలిసి నన్ను చూడటానికి భారతదేశం వచ్చింది. మరోసారి తనతో కలిసి జపాన్‌కు వెళ్లాను. కానీ, కలిసి ఉండలేకపోయాం. 2004లో విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత మూడేళ్ళు జపాన్‌లోనే ఉన్నా కానీ, వారిని కలవలేదు. 2007లో స్వదేశానికి తిరిగి వచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు మేమంతా రిన్‌తో టచ్‌లో ఉంటాం’ అని గత స్మృతులను, ప్రస్తుత ఆనందాన్ని ఏకకాలంలో పొందుతూ ఆనందంగా చెబుతున్నాడు సుఖ్‌పాల్. -
రాజీనామాకూ కన్సల్టెన్సీ
మన దగ్గర ఉద్యోగం కలి్పంచడం కోసం బోలెడన్ని కన్సల్టెన్సీలు ఉంటాయి. కానీ ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ అందుకు భిన్నం! అక్కడ రాజీనామా చేయాలనుకునే ఉద్యోగుల కోసం కన్సల్టెన్సీలుంటాయి!! అవి ఇటీవల దేశవ్యాప్తంగా పుట్ట గొడుగుల్లా పెరుగుతున్నాయి. రాజీనామాకు కన్సల్టెన్సీలు ఎందుకా అనుకుంటున్నారా? జపాన్ పని సంస్కృతి, అందులోని సంక్లిష్టతలే అందుకు కారణం... రాజీనామా చేయాలంటే ఏం చేస్తాం? గడువు ప్రకారం రాజీనామా లేఖ ఇస్తాం. అంతటితో సరిపోతుంది. కానీ జపాన్‌లో రాజీనామా అంత ఈజీ కాదు. అక్కడి పని సంస్కృతే ఇందుకు కారణం. అక్కడ కెరీర్ మొత్తం ఒకే సంస్థలో కొనసాగించే వాళ్ల సంఖ్యే ఎక్కువట. చేస్తున్న పని ఇష్టం లేకపోయినా, బాస్ తీరు నచ్చకపోయినా వేధింపులకు భయపడో, మరో కారణంతోనో కష్టంగా అదే ఉద్యోగంలో కొనసాగుతున్న వాళ్లు చాలామంది. సరిగ్గా ఇలాంటి వాళ్లకు సాయం చేసేందుకే పుట్టుకొచ్చాయి ‘రాజీనామా కన్సల్టెన్సీలు’. ఇవి కొవిడ్‌కు ముందే ఉన్నా, ఆ మహమ్మారి తదనంతర కాలంలో ఆదరణ బాగా పెరిగింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 11,000 పై చిలుకు క్లయింట్ల తమ సేవల గురించి ఎంక్వైరీ చేసినట్టు ‘మోమూరి ఆపరేషన్స్’ అనే రాజీనామాల కన్సల్టెన్సీ సంస్థ చెబుతోంది. ‘మోమూరి’ అంటే జపనీస్‌లో ‘నేనీ పని ఇంకే మాత్రమూ చేయలేను (ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్)’ అని అర్థం! ఇది 2022లో పుట్టుకొచి్చంది. కర్ర విరక్రుండా, పాము చావకుండా ఎలా రాజీనామా చేసి బయట పడాలో ఇవి సలహాలిస్తాయన్నమాట. ఈ వ్యవహారంలో చట్టపరమైన వివాదాల్లాంటివి తలెత్తితే కూడా అవే చూసుకుంటాయి. అధిక పని సంస్కృతి... జపాన్‌లో చాలాకాలంగా అధిక పని సంస్కృతి ఉంది. రంగమేదైనా ఉద్యోగులకు పనివేళలు మరీ ఎక్కువ. ఏకధాటిగా 12 గంటలు పని చేయడం చాలా మామూలు విషయం. ఇల్లు చేసేసరికి ఏ అర్ధరాత్రో అవుతుంది. మళ్లీ ఉదయాన్నే హడావుడిగా బయల్దేరాలి. ఇలా వెనక్కు తిరిగి చూసుకుంటే పనిలో కరగదీసిన జీవితమే తప్పితే సరదాగా గడిపిన క్షణాలంటూ పెద్దగా కన్పించడం లేదని వాపోయేవాళ్ల సంఖ్యే అధికం. వీటికి తోడు సూపర్వైజర్లు, మేనేజర్ల నుంచి ఒత్తిళ్లు. తట్టుకోలేక రాజీనామాకు ప్రయతి్నస్తే యజమానులు వేధిస్తారట. ఇలాంటి సంస్థలను ‘నల్లజాతి సంస్థలు’గా పిలుస్తుంటారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాల్లోనే గాక పెద్ద సంస్థల్లోనూ ఈ సంస్కృతి ఉందట. బాధితుల్లో ప్రధానంగా ఆహార పరిశ్రమ కార్మికులు, ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ రంగాల వారున్నారు. పరిస్థితి ఎంతదాకా వెళ్లిందంటే, తీవ్రమైన పని ఒత్తిడి పెట్టే సంస్థల జాబితాను ప్రభుత్వమే నిషేధిత జాబితాలో పెట్టడం ప్రారంభించింది! అలా జపాన్వ్యాప్తంగా ఇప్పటికే 370కి పైగా కంపెనీలు లేబర్ బ్యూరో బ్లాక్ లిస్ట్‌లో చేరాయి. అధిక పని ఒత్తిడి వల్ల మెదడు, గుండె సంబంధిత జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య జపాన్‌లో పెరుగుతోందట. 31 ఏళ్ల జర్నలిస్టు ఒకామె కేవలం పని ఒత్తిడి వల్లే హార్ట్ ఫెయిల్యూర్‌తో మరణించింది. చనిపోవడానికి ముందు ఒకే నెలలో ఆమె ఏకంగా 159 గంటలు ఓవర్ టైమ్ పని చేసిందట! అలాగే ఓ 26 ఏళ్ల వైద్యుడు కూడా ఒకే నెలలో 200 గంటలకు పైగా ఓవర్ టైమ్ పనిచేసి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు! మారుతున్న యూత్.. ఈ పని జపాన్‌లో ఎప్పటినుంచో సంస్కృతి ఉన్నా రాజీనామా కన్సల్టెన్సీలు ఇటీవలి కాలంలోనే ఎందుకు పుట్టుకొచ్చాయి? అంటే యువత ఆలోచనల్లో వచి్చన మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. జపాన్‌లో ఉద్యోగుల్లో వృద్ధుల సంఖ్య తగ్గుతోంది. ఎక్కడ చూసినా యువ ఉద్యోగులే. ఉద్యోగం స్వభావంతో సంబంధం లేకుండా యజమాని ఏది చెబితే అది చేయాలనే పాత తరం ఆలోచనతో వాళ్లు ఏకీభవించడం లేదు. అందుకే అవసరమైతే రాజీనామాకూ వెనకాడటం లేదు. అలాగని యాజమాన్యంతో ఘర్షణ పడి ఉద్యోగ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అందుకే నేర్పుగా పని కానిచ్చుకోవడానికి కన్సల్టెన్సీల బాట పడుతున్నారు.‘‘రాజీనామా ఏజెన్సీలు జపాన్ సమాజం నుంచి పూర్తిగా కనుమరుగవ్వాలని మేం నిజాయితీగా కోరుకుంటున్నాం. ఉద్యోగులు తమ రాజీనామా గురించి నేరుగా బాస్‌తో మాట్లాడుకునే వాతావరణం వస్తే మేలు. కానీ మా క్లయింట్ల భయానక గాథలు వింటుంటే అది ఇప్పట్లో జరుగుతుందని అనిపించడం లేదు’’ – మోమూరీ కన్సల్టెనీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
హృదయాన్ని కదిలించే ఘటన: 19 ఏళ్ల తర్వాత భారత్‌లో తండ్రిని..!
జపాన్‌కి చెందిన ఓ కుర్రాడు తన తండ్రిని వెతుకుతూ భారత్‌లోకి వచ్చాడు. తండ్రి జాడ కోసం అనువణువు గాలించి మరీ వెతికి పట్టుకున్నాడు. అదీకూడా 19 ఏళ్ల తర్వాత తన తండ్రిని కలుసుకుంటే ఆ అనందం వేరేలెవెల్. మాటలకందని ఆ ఆనందం ఊహకందని నమ్మలేని నిజంలా అనిపిస్తుంది. అలాంటి సంఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన సుఖ్‌పాల్ సింగ్ థాయిలాండ్‌లో జపనీస్ మహిళ సాచీని కలుసుకున్నాడు. 2002లో ఆమెను ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. టోక్యో సమీపంలో చిబాకెన్లో ఆమెతో కలిసి నివశించాడు. కొన్నాళ్లకే వైవాహిక బంధంలో సమస్యలు వచ్చి విడిపోయారు. అప్పటికే వారికి రెండేళ్ల కుమారుడు రిన్ తకహటా ఉన్నాడు. అయితే రిన్ తన తల్లి సాచీ వద్దే పెరిగాడు. 2007లో భారత్‌కు తిరిగివచ్చిన సుఖ్పాల్కు కొడుకు లేదా భార్యతో ఎలాంటి సంబంధాలు లేవు. ప్రస్తుతం జపాన్‌లో ఉంటున్న రిన్ తన తండ్రిని కలవడానికి ఇటీవలే పంజాబ్ వెళ్లాడు. కేవలం అలనాటి తండ్రి ఫోటో, అడ్రస్ సాయంతో అవిశ్రాంతంగా ఆచూకీ కోసం వెతికాడు. చివరికి తండ్రిని కలిసి భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు సుఖ్‌పాల్ సింగ్ మాట్లాడుతూ..తన ఫోటో సాయంతో ప్రజలందర్ని అడుగుతూ వస్తూ తనని కనుక్కున్నాడని అన్నారు. తన కొడుకుని కలవడం నిజంగా నమ్మలేకున్నా. ఇది ఒక కలలా ఉంది. నా కొడుకుని కలవాలని చాలసార్లు అనుకున్నా కానీ అది సాధ్య పడదని వదిలేశాను. ఇలా తన కొడుకే తనని వెతుక్కుంటూ వస్తాడని ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు ." సుఖ్‌పాల్ సింగ్. ఇక రిన్ జపాన్‌లోని ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో కుటుంబ వృక్షం అనే ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. ఆ సమయంలోనే తన తల్లివైపు కుటుంబసభ్యులే తెలుసు తప్ప తండ్రి గురించి ఏం తెలియదని గ్రహించి..రిఎలాగైనా కలుసుకోవాలనే సంకల్పం మొదలయ్యింది రిన్లో. తన తండ్రి ఆచూకీ కోస గూగుల్ మ్యాప్స్ ఉపయోగించినట్లు వివరించాడు. ఆగస్టు 15 కల్లా తండ్రి ఉన్న ప్రదేశానికి చేరకున్నాడు. చివరికీ ఆగస్టు 18 నాటికి తన తండ్రిని కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. What a moment ❤️ Sukhpal Singh and his Japanese son Rin Takahata reunited after 19 years when Rin, inspired by a college assignment, traced his father to Amritsar, India. Rin was welcomed warmly by Sukhpal and his current family. pic.twitter.com/KExVBl6wwY— Akashdeep Thind (@thind_akashdeep) August 24, 2024 (చదవండి: నటి ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
ఏజ్‌లో సెంచరీ దాటి రికార్డు సృష్టించిన బామ్మ..ఆమె ఒకప్పుడూ..!
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానంలో సుదీర్థకాలం బతకం బహుకష్టంగా ఉంది. ఏవో ఒక రోగాలతో 60 లేదా డెభైకే టపా కట్టేస్తున్నారు. సెంచరీ కొట్టడం గగనంగా ఉంది. అలాంటి జపాన్‌కి చెందిన టోమికో ఇటూకా అనే బామ్మ ఏకంగా 116 ఏళ్ల జీవించి రికార్డు సృష్టించి. ప్రపంచంలో సుదీర్ఘకాలం బతికిన మహిళగా గిన్సిస్ రికార్డ్సులో స్థానం సంపాదించుకుంది. ఈ విషయాన్ని జెరోంటాలజీ రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది. ఇటూకా పుట్టిన తేదీ సంవత్సరం ఆధారంగా వరల్డ్ సూపర్సెంటెనేరియన్ ర్యాంకింగ్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ రీసెర్చ్ గ్రూప్ 110 లేదా అంతకంటే ఎక్కువ వయసుగల వ్యక్తుల వివరాలను ధృవీకరిస్తుంది. ఇటీవల 117 ఏళ్ల మరియా బ్రాన్యాస్ మరణం తరువాత జపాన్‌కి చెందిన 116 ఏళ్ల టోమికో ఇటూకా ఎక్కువ కాలం జీవించిన మహిళగా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఆమె ఆషియా నగరంలోని ఒక నర్సింగ్ హోమ్‌లో ఉంటుంది. ఆమె తాను పుట్టిన తేదీని కూడా ధృవీకరించింది. ఆ బామ్మ సాధించిన రికార్డు గురించి ఆమెకు చెప్పగానే.. వెంటనే థాంక్యూ అని చలాకీగా చెప్పిందంట. అంటే ఆమె స్పందంచిన తీరు చూస్తే..ఆమె ఈ వయసులో కూడా ఎంతో ఉషారుగా, స్పష్టంగా వినగలుగుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ బామ్మ ఇటూకా మూడు నెలల క్రితమే తన పుట్టిన రోజుని జరుపుకుందట. ఒసాకాలో జన్మించిన ఈ బామ్మ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ క్రీడాకరిణి. 20వ ఏటన వివాహం చేసుకుందంట. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారట. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భర్త నడుపుతున్న టెక్స్టైల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనుల్లో సహాయం చేసేవారట. ఆమె వృద్ధ ఆశ్రమంలో చేరడానికి ముందు 1979లో భర్త మరణానంతరం నారాలో ఒంటరిగా నివసించింది. అంతేకాదండోయ్ ఏకంగా 3,067-మీటర్లు (10,062-అడుగులు) మౌంట్ ఆన్టేక్ను ఏకంగా రెండుసార్లు అధిరోహించిందట. వందేళ్లు నిండిన తర్వాత కూడా సుదీర్ఘ పాదయాత్రలు చేసిందట. ఆమె లైఫ్‌స్టైల్..ఆమె క్యాల్పిస్ అనే ప్రసిద్ధ పెరుగు రుచిగల పానీయాన్ని తీసుకుంటుంది. ఆమెకు ఇష్టమైన ఆహారం అరటిపండ్లు అని ఆమె సంరక్షకురాలు చెబుతోంది. (చదవండి: బరువు తగ్గడంలో 'పంచకర్మ' ది బెస్ట్!..అనుభవాన్ని షేర్ చేసుకున్న రోహిత్ రాయ్!) -
సునామీలో కొట్టుకుపోయిన భార్య, 13 ఏళ్లుగా వెతుకులాట!
మనకు అత్యంత ప్రియమైన వాళ్లను ఏదైన దుర్ఘటనలో కోల్పోతే ఆ బాధ మాటలకందనిది. ఇది అలాంటి ఇలాంటి ఆవేదన కాదు. అందులోనూ తల్లి బిడ్డలు, భార్యభర్తల్లో ఎవ్వరైన కానరాని లోకలకు వెళ్తే ఆ బాధ అంత తేలిగ్గా మర్చిపోలేంది. బతుకున్నన్ని రోజులు ఆ శోకాన్ని మోస్తుంటాం. అయితే కొన్నేళ్లుకు మాములు మనుషులుగా అవుతాం. రాను రాను వారి జ్ఞాపకాలతో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తాం. కానీ జపాన్‌కి చెందిన వ్యక్తిని చూస్తే ఓ దుర్ఘటనలో గల్లంతైన వ్యక్తి కోసం ఇంతలా కళ్లల్లో ఒత్తులు వేసుకుని అన్వేషిస్తారా అని ఆశ్యర్యపోతారా. ప్రేమంటే ఇది కదా అనే ఫీల్ వస్తుంది. ఎవరతను? అతడి గాథ ఏంటంటే..జపనీస్ వ్యక్తి యసువో టకామట్సుకి 2011లో సంభవించిన ప్రకృతి విపత్తు భార్యను దూరం చేసి, తీరని ఎడబాటు మిగిల్చింది. అయితే ఆ భయానక సునామీలో భార్య కోల్పోయినప్పటికీ ఇప్పటి వరకు ఆమె అవశేషాలు కనిపించలేదు. ఆమెకు అంత్యక్రియలు మంచిగా చేయాలనే ఆశతో ఆ నాటి నుంచి నేటి వరకు ఆమె అవశేషాల కోసం తీవ్రంగా గాలిస్తున్నాడు. నిజానికి ఆ సునామీలో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక యుసువో భార్య యుకో ఓ బ్యాంకులో పనిచేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆమె ఎగిసిన రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో తకామాట్సు ఆమె అవశేషాల కోసం ఒక వాలంటీర్ సహాయంతో అన్వేషించడం మొదలుపెట్టాడు. అంతేగాదు తన భార్య అవశేషాలు దొరక్కపోతాయా..? అని డైవింగ్ నేర్చుకుని మరీ మురికినీటిలో ముమ్మరంగా గాలిస్తున్నాడు. మంచు జలాలతో అపారమైన సవాళ్లు ఉన్నప్పటికీ తన భార్య అవశేషాల కోసం ఆ ఇరువురు వెతకడం విశేషం. ఇక యుకో చివరిగా తన భర్త కోసం ఫోన్లో రెండు సందేశాలను పంపింది. ఒకటి పంపేలోపు దుర్ఘటన భారిన పడగా ఇంకొకటి ఈ ఘటనకు కొద్ది క్షణాల ముందు పంపించింది. ఆమె చివరి సందేశం మీరు బాగున్నారా..? ఇంటికి వెళ్లాలనుకుంటున్నా అని పంపించింది. పంపాలనుకున్న సందేశం.. సునామీ అత్యంత వినాశకరమైనద అని నాటి దుర్ఘటనను వివరించే యత్నం చేసింది. కాగా, తకామట్సు ఈ అన్వేషణ ఫలించడం కష్టమని తెలుసు కానీ తాను చేయగలిగింది ఏమన్నా ఉందంటే ఆమె అవశేషాల కోసం అన్వేషించడం మాత్రమే అని ఆవేదనగా చెప్పాడు. అంతేగాదు ఈ సముద్రంలో వెతుకుతూ ఉంటే తాను ఆమెకు దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ దంపతులు ప్రేమకు అసలైన అర్థం ఇచ్చారు కదా..!. అంతేగాదు భార్యభర్తలు ఒకరికొకరుగా ఉండటం అనే పదానికి అసలైన భాష్యం ఇచ్చారు ఈ ఇరువురు.(చదవండి: ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి వచ్చే పాక్ సోదరి ఎవరో తెలుసా..) -
సెప్టెంబర్‌లో మళ్లీ పోటీచేయను
టోక్యో: జపాన్ అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) అధ్యక్షుడు, ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిద త్వరలో ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నారు. ఎల్డీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడే దేశ ప్రధాని అవుతారు. అయితే సెప్టెంబర్‌లో జరగబోయే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయట్లేదని కిషిద బుధవారం ప్రకటించారు. 2021లో ఎల్డీపీకి అధ్యక్షుడిగా ఎన్నికైన కిషిద పార్టీ అధ్యక్ష పదవీకాలం ఈ సెప్టెంబర్‌తో ముగుస్తోంది. దీంతో ఆయన మళ్లీ పార్టీ పగ్గాలు, దేశ అధికార పగ్గాలు చేపడతారన్న చర్చ నడుమ కిషిద పక్కకు తప్పుకోవడం గమనార్హం. పార్టీలో అవినీతి కుంభకోణాలుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడంతోపాటు ఆయనకు ప్రజల్లో మద్దతు సైతం 20 శాతానికి పడిపోయిన నేపథ్యంలో స్వచ్ఛందంగా పక్కకు జరగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
‘పదవికి రాజీనామా చేస్తున్నా’..జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా
టోక్యో: జపాన్ ప్రధాని పదవికి ఫుమియో కిషిడా రాజీనామా చేయనున్నారు. వచ్చే నెలలో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కొద్ది సేపటి క్రితం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) సమావేశంలో వెల్లడించారు. ఇటీవల వివాదాస్పద యూనిఫికేషన్ చర్చ్తో పార్టీ సంబంధాలు,ఎల్డీపీకి విరాళాలతో పాటు ఇతర అంశాలు కిషిడాపై దేశ ప్రజల మద్దతు తగ్గింది. ప్రధానిగా కొనసాగితే మరిన్ని ఇబ్బందులు తప్పవని ముందే గ్రహించిన కిషిడా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కిషిడా మాట్లాడుతూ..‘సెప్టెంబర్‌లో నా పదవీకాలం ముగిసే వరకు నేను ప్రధానమంత్రిగా నేను చేయగలిగినదంతా చేస్తూనే ఉంటాను’ అని అన్నారు. బాధ్యతలు చేపట్టిన మూడేళ్లలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తుండడం, అతని స్థానంలో మరో అభ్యర్ధి ఎంపిక కత్తిమీద సాములా మారి జపాన్ అధికార పార్టీ ఎల్డీపీకి. జీవన వ్యయాల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు వంటి అంశాలు కొత్త అభ్యర్ధి ఎంపికపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. -
Naba Mohammadi: మోటారు పాఠం.. జపాన్ చేర్చుతోంది!
బోటనీ పాఠమంటే.. బోరు..బోరు.. హిస్టరీ రొస్టు్ట కంటే రెస్ట్ మేలు.. అని పాడుకుంటే పొరపాటే.. పాఠం సరిగా వింటే విదేశీయానం, విమోనమెక్కే యోగం దక్కుతుందని నిరూపించింది కరీంనగర్ జిల్లా శంకరపట్నంకు చెందిన నబా మొహమ్మదీ. ఇటీవల హైదరాబాద్‌లో ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఏకంగా ఈ ఏడాది నవంబరులో జపాన్ లో జరిగే సకుర సైన్స్ ఫెస్టివల్ లో పాల్గొనబోతోంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? కేవలం సైన్స్ మీద ఉన్న ఆసక్తి.. మోటారు పాఠం వినడం వల్లే అంటుంది. నబా..! తనకు సైన్స్‌పై ఉన్న ఆసక్తి తనను జపాన్ గడ్డపై కాలు మోపేలా చేస్తుందని ‘సాక్షి’కి చెప్పింది.ఏంటా మోటారు కథ...!నబా ప్రస్తుతం శంకరపట్నంలోనే ఇంటర్ సెకండియర్ చదువుతోంది. దాదాపు నాలుగేళ్ల క్రితం తాను 9వ తరగతిలో ఉండగా.. విన్న ఫిజిక్స్ పాఠం తన ఆలోచన తీరును మార్చివేసింది. 8 వ తరగతి వరకు బేసిక్ సైన్స్ విన్న తాను.. తొలిసారిగా మోటారు ఎలా పనిచేస్తుందో తన గురువులు చెప్పిన పాఠానికి ముగ్ధురాలైంది. విద్యుచ్ఛక్తి, అయస్కాంత శక్తిని కలిపి మోటారు నడిపే విధానం తెలుసుకోవడం తనకు సైన్స్ ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిన్న సూత్రం ఆధారంగా ప్రపంచంలోని ఎన్నో మోటార్లు ఎలా నడుస్తున్నాయన్న విషయంపై తనకు పూర్తి అవగాహన వచ్చింది. అది మొదలు సైన్స్పాఠాలను మరింత శ్రద్ధగా చదువుతూ విశ్లేషణ చేసుకునేది. ప్రతీది తనకు అర్థమయ్యేందుకు అదనపు పుస్తకాలు, యూట్యూబ్ చూసేది. ఇటీవల జిల్లా స్థాయిలో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో కరీంనగర్ నుంచి మొదటి స్థానంలో నిలిచింది. అదే ఊపులో రాష్ట్రస్థాయికి ఎంపికై టాప్–5లో టాప్–2 స్థానం దక్కించుకుంది. ఫలితంగా నవంబరులో జపాన్ లో జరిగే సుకుర సైన్స్ ఫెస్టివల్లో పాల్గొనే అరుదైన అవకాశం చేజిక్కించుకుంది.తాను కూడా ఏదైనా సాధించాలంటే..!అదే ఉత్సాహంతో తాను కూడా ఏదైనా సాధించాలని తలచింది. అంధులకు దారి చూపేందుకు ప్రత్యేక డివైజ్ రూపొందించింది. ఇది ప్రస్తుతంప్రోటోటైప్ దశలోనే ఉంది. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. దీనికి త్వరలోనే పేటెంట్ కూడా దరఖాస్తు చేసుకుంటానని నబా ‘సాక్షి’కి వివరించింది. జపాన్ పర్యటనలో అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాలను గమనించి, వాటిని ఇక్కడఅమలు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. తాను ఈ ప్రగతి సాధించడం వెనక తన తండ్రి షాబీర్, ఫిర్దౌస్ సుల్తానాలు ఎంతోప్రోత్సహించారని, సంప్రదాయ కుటుంబమైనా, బాలికనైన తనను అన్ని కాంపిటీషన్లకు పంపించారని తెలిపింది. అదే సమయంలో తనకు పాఠాలు చెప్పిన గురువులకు తానెప్పుడూ రుణపడి ఉంటానని, పెద్దయ్యాక శాస్త్రవేత్తనవుతాననీ, అంధులకు చూపునవుతాననీ వారికి దారిచూపేందుకు రూపొందించిన ఉపకరణాన్ని మరింత అభివృద్ధి చేస్తాననీ చెప్పింది. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదగడమే తన కల అని వివరించింది నబా. – బి. అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
జపాన్ను కుదిపేసిన తీవ్ర భూకంపం
టోక్యో: జపాన్ దక్షిణ తీర ప్రాంతంలో గురువారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. క్యుషు దీవిలో ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. భూమికి సుమారు 30 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిచినన్ నగరంతోపాటు మియజాకి ప్రిఫెక్చర్ తీవ్ర ప్రభావానికి గురైంది. భూకంప కేంద్రానికి సమీపంలోని మియజాకి విమానాశ్రయంలో భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్తగా అధికారులు రన్‌వేను మూసివేశారు. పొరుగునే ఉన్న కగోíÙయా ప్రిఫెక్చర్‌లోని ఒసాకిలో కాంక్రీట్ గోడలు ధ్వంసమయ్యాయి. క్యుషు, షికోకు దీవుల తీరం వెంబడి అలలు సుమారు 1.6 అడుగుల ఎత్తున సుమారు అరగంటసేపు ఎగిసిపడ్డాయి. దీంతో, అధికారులు ముందు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల వైపు వెళ్లరాదని ప్రజలకు సూచనలిచ్చారు. భూకంపం తాకిడితో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. -
జపాన్‌లో భారీ భూకంపం
జపాన్లోభారీ భూకంపం సంభవించింది. దక్షిణ ద్వీపం క్యుషు ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం రిక్టర్‌స్కేల్‌పై తొలిసారి 6.9 తీవ్రతతో, రెండోసారి 7.1 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది . జపాన్ వాతావరణ కేంద్రం ప్రకారం దక్షిణ జపాన్‌లోని క్యుషు తూర్పు తీరంలో సుమారు 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉంది.ఈ భూ ప్రకంపనల ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.అదే విధంగా జపాన్‌కు వాతావరణ శాత సునామీ హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ దీవులైన క్యుషు, షికోకులోని పసిఫిక్ తీరంలో సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు సముద్రం, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
చరిత్రలో మాయని మచ్చలు..
జపాన్‌లోని హిరోషిమా నగరంపై 1945 ఆగస్టు 6న, నాగసాకిపై ఆగస్టు 9న అమెరికా జారవిడిచిన అణుబాంబులు సుమారు 2 లక్షలకుపైగా పౌరులను బలి తీసు కున్నాయి. ఇవి చరిత్రలో మాయని మచ్చలు, అతిపెద్ద దుస్సంఘటనలు. అయినా దేశాలు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. ఒక్క క్షణంలో ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుధాలను పోగేస్తూనే ఉన్నాయి.‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (సిప్రి) 2024 నివేదిక, అమెరికా వద్ద 5,044 అణ్వా యుధాలు ఉన్నట్టు తెలిపింది. అదే నివేదిక ప్రకారం, రష్యా దగ్గర 5,580, ఫ్రాన్స్ దగ్గర 290, చైనా దగ్గర 500, బ్రిటన్ దగ్గర 225, భారత్ దగ్గర 172 అణ్వాయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ కూడా అణుసంపత్తిని కలిగి ఉన్నాయి. పైగా ఈ దేశాలన్నీ తమ అణ్వాయుధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. చైనా దగ్గర గతేడాది 410 ఉండగా, ఇప్పుడది 500కు చేరింది. యుద్ధాల కారణంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, రాజకీయ దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో అణ్వస్త్రాల పాత్ర ప్రముఖంగా మారిందని ‘సిప్రి’ రిపోర్ట్ పేర్కొన్నది.అణ్వాయుధాలతో పాటు ఆయుధాలు కూడా ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేవే. ప్రపంచంలో ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాలలో అమెరికా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉన్నది. భారత్ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా రష్యా కొనసాగుతున్నది. భారత దిగుమతులలో రష్యా వాటా 36 శాతం. ఆయుధాల దిగుమతుల్లో మొదటి ఐదు స్థానాల్లో ఇండియా, సౌదీ అరేబియా, ఖతార్, ఉక్రెయిన్, పాకిస్తాన్ ఉన్నాయి. రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయిల్–పాలస్తీనా యుద్ధాలు కొనసాగుతున్న వేళ అణ్వాయుధాల భయం మళ్లీ పెరిగింది. ఆయా దేశాలు రక్షణ పేరుతో ఆయుధాలు పెంచుకుంటూ పోవడం ఆయుధ పోటీకి దారి తీస్తున్నది. – నర్సింగు కోటయ్య, మిర్యాలగూడ -
‘శవాలదిబ్బ’ : ఆ మారణహోమానికి 79 ఏళ్లు
హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు జరిగి నేటికి (ఆగష్టు 6, 2024) 79 ఏళ్లు. ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసిన తీరని విషాదం. జపాన్‌లో 1945 ఆగస్ట్‌లో జరిగిన అణు బాంబు పేలుళ్లతో హిరోషిమాలో లక్షా 40వేల మంది, నాగసాకిలో 74వేల మందిని బలి తీసుకున్న ఉదంతం. ప్రపంచంలోనే తొలి అణు బాంబు దాడిగా పేరొందిన ఈ దాడుల ధాటికి విలవిల్లాడిన జపాన్ శత్రు దేశాలకు లొంగిపోవడంతో 1945 ఆగస్ట్ 14న రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. హిరోషిమా డే సందర్భంగాఈ ఘటనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక సంగతులు..!1945 ఆగష్టు 6న జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణు బాంబు జారవిడిచింది. ఎనోలా గే అనే అమెరికన్ B-29 బాంబర్, జపాన్ నగరం హిరోషిమాపై "లిటిల్ బాయ్" అనే అణు బాంబును జారవిడిచింది. ఈ బాంబు పేలిన కాసేపట్లోనే 5 చ.కి.మీ. పరిధిలోని ప్రాంతం నాశనమైంది. 80 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 35 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలు, రేడియన్ ప్రభావంతో వేలాదిమంది చనిపోయారు. మరో మూడు రోజులకు అంటే ఆగస్టు 9న నాగసాకి నగరంపై అమెరికా మరో భారీ అణుబాంబుతో దాడి చేసింది. హిరోషిమా అంటే జపనీస్ బాషలో విశాలమైన దీవి. దీవుల సమాహారమైన జపాన్‌లోని అతిపెద్ద దీవిలో ఉన్న పెద్ద నగరం హిరోషిమాపై యురేనియం-235తో తయారు చేసిన “లిటిల్ బాయ్”, నాగసాకిపై ప్లూటోనియంతో తయారుచేసిప “ఫ్యాట్ మ్యాన్” అనే అత్యంత పవర్‌పుల్ బాంబును ప్రయోగించింది.‘ఎనోలా గే’ అనే విమానం బరువు 9 వేల పౌండ్లు, పొడవు 10 అడుగులు. ఈ బాంబు నేలను తాకడానికి ముందే, 1750 అడుగుల ఎత్తులోనే పేలింది. ఈ దాడికి ముందు హిరోషిమా జనాభా దాదాపు 3.4 లక్షలు కాగా, తర్వాత అది 1.37 లక్షలకు పడిపోయిందంటే ఈ విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా జపాన్‌లో ఐదు నగరాలను ఎంచుకుంది. కోకురా, హిరోషిమా, యోకోహామా, నీగాటా ,క్యోటో. ఈ దాడులకు యునైటెడ్ కింగ్డమ్ సమ్మతించింది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పురాతన రాజధాని పట్ల అప్పటి సెక్రటరీ ఆఫ్ వార్ హెన్రీ స్టిమ్సన్కు ఉన్న అభిమానం కారణంగా క్యోటో తప్పించుకుంది. దానికి బదులుగా, నాగసాకి నగరం బలైంది. ఈ బాంబు పేలుళ్లలో బతికి బయటపడిన వారిని హిబాకుషా అంటారు. పేలుళ్ల ప్రభావంతో ఏర్పడిన రేడియేషన్, విషవాయువులు ప్రభావంతో బాధితుల మానసిక వేదన, బాధలు వర్ణనాతీం. అణ్వాయుధాల వినాశకరమైన ప్రభావాన్ని కళ్లకు కట్టిన మారణహోమం.ఇపుడు అణుయుద్ధం జరిగితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఉత్తర, దక్షిణ అమెరికా ఘర్షణలు మధ్య ఇపుడు అణు యుద్ధం జరిగితే ఎంతమంది చనిపోవచ్చు? అనేది ప్రధానంగా వినిపించే ప్రశ్న. అణు సంఘర్షణ ప్రభావాలను అధ్యయనం చేస్తూ సంవత్సరాలు గడిపిన జర్నలిస్ట్ అన్నీ జాకబ్సెన్ అంచనాల ప్రకారం అణు యుద్ధం ప్రారంభమైన 72 నిమిషాల్లోనే దాదాపు ఐదు బిలియన్ల మంది ప్రజలు చనిపోతారు.రేడియేషన్ ప్రభావం అత్యంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఓజోన్ పొర చాలా దెబ్బతింది కనుక అణువిస్ఫోటనాలు జరిగితే ఊహకందని విధ్వంసమే. అణుయుద్ధం నుండి బతికిన వారికి ఆహారం లభించదు. ఆకలితో అలమటించి. పోషకాహార లోపంతో కృంగి కృశించి ప్రాణాలొదులుతారు. -
Stock Market: బేర్ విశ్వరూపం
ముంబై: అమెరికాలో మాంద్యం భయాలు మార్కెట్లను ముంచేశాయి. జపాన్ కరెన్సీ యెన్ భారీ వృద్ధి బెంబేలెత్తించింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు వణికించాయి. వెరసి దలాల్ స్ట్రీట్ సోమవారం బేర్ గుప్పిట్లో విలవిలలాడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 2,223 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్లు పతనమై 24,055 వద్ద నిలిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన రోజు జూన్ 4న (5.76% పతనం) తర్వాత ఇరు సూచీలకిదే భారీ పతనం. రోజంతా నష్టాల కడలిలో ... అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఏకంగా 3% నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 2,394 పాయింట్ల నష్టంతో 78,588 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు క్షీణించి 24,303 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు సాహసించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కొట్టిమిట్టాడాయి. ఒకదశలో సెన్సెక్స్ 2,686 పా యింట్లు క్షీణించి 78,296 వద్ద, నిఫ్టీ 824 పాయింట్లు కుప్పకూలి 23,893 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. → బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. సరీ్వసెస్ సూచీ 4.6%, యుటిలిటీ 4.3%, రియల్టీ 4.2%, క్యాపిటల్ గూడ్స్ 4.1%, ఇండస్ట్రీయల్ 4%, విద్యుత్ 3.9%, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్ 3.75% చొప్పున క్షీణించాయి. → సెన్సెక్స్ సూచీలో హెచ్‌యూఎల్(0.8%,) నెస్లే (0.61%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ఇందులో టాటా మోటార్స్ 7%, అదానీ పోర్ట్స్ 6%, టాటాస్టీల్ 5%, ఎస్బీఐ 4.50%, పవర్ గ్రిడ్ 4% షేర్లు అత్యధికంగా పడ్డాయి. → చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 4%, 3.6% చొప్పున క్షీణించాయి. → బీఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన మొత్తం 4,189 కంపెనీల షేర్లలో ఏకంగా 3,414 కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. → రిలయన్స్ 3% పడి రూ. 2,895 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 4.50% పతనమై రూ.2,866 కనిష్టాన్ని తాకింది. మార్కెట్ క్యాప్ రూ. 70,195 కోట్లు ఆవిరై రూ. 19.58 లక్షల కోట్లకు తగ్గింది. → మార్కెట్లో ఒడిదుడుకులు సూచించే వొలటాలిటీ ఇండెక్స్(వీఐఎక్స్) 42.23 శాతం పెరిగి 20.37 స్థాయికి చేరింది. ఇంట్రాడేలో 61% ఎగసి 23.15 స్థాయిని తాకింది. లేమాన్ బ్రదర్స్, కోవిడ్ సంక్షోభాల తర్వాత ఈ సూచీ కిదే ఒక రోజులో అత్యధిక పెరుగుదల.2 రోజుల్లో రూ.19.78 లక్షల కోట్ల ఆవిరి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ సోమవారం ఒక్కరోజే రూ.15.32 లక్షల కోట్లు హరించుకుపోయాయి. శుక్రవారం కోల్పోయిన రూ.4.46 లక్షల కోట్లను కలిపితే గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లో ఇన్వెస్టర్లకు మొత్తం రూ.19.78 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ. 441.84 లక్షల కోట్లకు పడింది.84 దిగువకు రూపాయి కొత్త ఆల్‌టైమ్ కనిష్టంఈక్విటీ మార్కెట్ల భారీ పతనంతో రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్ మారకంలో 37 పైసలు క్షీణించి 84 స్థాయి దిగువన 84.09 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 83.78 వద్ద మొదలైంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, దలాల్ స్ట్రీట్ భారీ పతన ప్రభావంతో ఇంట్రాడే, జీవితకాల కనిష్టం 84.09 వద్ద స్థిరపడింది. ‘అమ్మో’రికా! ముసిరిన మాంద్యం భయాలు.. ఉద్యోగాల కోత.. హైరింగ్ తగ్గుముఖం.. మూడేళ్ల గరిష్టానికి నిరుద్యోగం.. 4.3%కి అప్ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల ఎఫెక్ట్... ఫెడ్ రేట్ల కోత సుదీర్ఘ వాయిదా ప్రభావం కూడాఅమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచమంతా తుమ్ముతుందనే నానుడిని నిజం చేస్తూ, ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూఎస్ తయారీ, నిర్మాణ రంగంలో బలహీనతకు గత వారాంతంలో విడుదలైన జాబ్ మార్కెట్ డేటా ఆజ్యం పోసింది. జూలైలో హైరింగ్ 1,14,000 ఉద్యోగాలకు పరిమితమైంది. అంచనాల కంటే ఏకంగా 1,80,000 జాబ్స్ తగ్గాయి. మరోపక్క, జూన్‌లో 4.1 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జూలైలో 4.3 శాతానికి ఎగబాకింది. 2021 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతేకాదు, ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్‌తో సహా మరికొన్ని కంపెనీలు తాజా కొలువుల కోతను ప్రకటించడం కూడా అగ్గి రాజేసింది. ఈ పరిణామాలన్నీ ఇన్వెస్టర్లలో మాంద్యం ఆందోళనలను మరింత పెంచాయి. వెరసి, గత శక్రవారం అమెరికా మార్కెట్లు కకావికలం అయ్యాయి. నాస్డాక్ 2.4% కుప్పకూలింది. డోజోన్స్ 1.5%, ఎస్అండ్పీ–500 ఇండెక్స్ 1.84 చొప్పున క్షీణించాయి. కాగా, గత నెలలో ఆల్‌టైమ్ రికార్డుకు చేరిన నాస్డాక్ అక్కడి నుంచి 10% పైగా పతనమై కరెక్షన్లోకి జారింది. ఆసియా, యూరప్ బాటలోనే సోమవారం కూడా అమెరికా మార్కెట్లు 3–6% గ్యాప్ డౌన్‌తో మొదలై, భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ స్టాక్స్.. ట్రిలియన్ డాలర్లు ఆవిరి రెండో త్రైమాసిక ఫలితాల నిరాశతో నాస్డాక్లో టాప్–7 టెక్ టైటాన్స్ (యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్వీడియా, టెస్లా, మెటా) షేర్లు అతలాకుతలం అవుతున్నాయి. ఏఐపై భారీగా వెచి్చస్తున్న మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి కంపెనీలకు ఆశించిన ఫలితాలు రావడం లేదనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇక బలహీన ఆదాయంతో అమెజాన్ షేర్లు 10% క్రాష్ అయ్యాయి. ఫలితాల నిరాశతో ఇంటెల్ షేర్లు ఏకంగా 26% కుప్పకూలాయి. 1985 తర్వాత ఒకే రోజు ఇంతలా పతనమయ్యాయి. కంపెనీ ఏకంగా 15,000 మంది సిబ్బంది కోతను ప్రకటించడంతో జాబ్ మార్కెట్లో గగ్గోలు మొదలైంది. వెరసి, షేర్ల పతనంతో టాప్–7 టెక్ షేర్ల మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది. కాగా, సోమవారం ఈ షేర్లు మరో 6–10% కుప్పకూలాయి. ఎకానమీ పరిస్థితి బయటికి కనిపిస్తున్న దానికంటే చాలా బలహీనంగా ఉందని సీఈఓలు సిగ్నల్స్ ఇస్తున్నారు. యుద్ధ సైరన్..: పశ్చిమాసియాలో హమాస్ చీఫ్ హనియేను ఇజ్రాయిల్ తుదముట్టించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించడంతో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేస్తోంది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు సద్దుమణగక ముందే మరో వార్ మొదలైతే క్రూడ్ ధర భగ్గుమంటుంది. బ్యారల్ 100 డాలర్లను దాటేసి, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుంది. వెరసి ఎకానమీలు, మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. జపాన్.. సునామీ అమెరికా దెబ్బతో ఆసియా, యూరప్ మార్కెట్లన్నీ సోమవారం కూడా కుప్పకూలాయి. జపాన్ నికాయ్ సూచీ ఏకంగా 13.5 శాతం క్రాష్ అయింది. 1987 అక్టోబర్ 19 బ్లాక్ మండే (14.7% డౌన్) తర్వాత ఇదే అత్యంత ఘోర పతనం. నికాయ్ ఆల్ టైమ్ హై 42,000 పాయింట్ల నుంచి ఏకంగా 31,000 స్థాయికి దిగొచి్చంది. గత శుక్రవారం కూడా నికాయ్ 6% క్షీణించింది. ముఖ్యంగా జపాన్ యెన్ పతనం, ద్రవ్యోల్బణం 2% లక్ష్యంపైకి ఎగబాకడంతో అందరికీ భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు బాటలో వెళ్తోంది. గత బుధవారం కూడా రేట్ల పెంపు ప్రకటించింది. దీంతో డాలర్‌తో ఇటీవల 160 స్థాయికి చేరిన యెన్ విలువ 142 స్థాయికి బలపడి ఇన్వెస్టర్లకు వణుకు పుట్టించింది. జపాన్, అమెరికా ఎఫెక్ట్ మన మార్కెట్ సహా ఆసియా, యూరప్ సూచీలను కుదిపేస్తోంది.ఫెడ్ రేట్ల కోతపైనే ఆశలు.. కరోనా విలయం తర్వాత రెండేళ్ల పాటు ఫెడ్ ఫండ్స్ రేటు 0–0.25% స్థాయిలోనే కొనసాగింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగబాకి, 2022 జూన్‌లో ఏకంగా 9.1 శాతానికి చేరడంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ రేట్ల పెంపును మొదలెట్టింది. 2023 జూలై నాటికి వేగంగా 5.25–5.5% స్థాయికి చేరి, అక్కడే కొనసాగుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం ఈ ఏడాది గతేడాది జూన్‌లో 3 శాతానికి దిగొచి్చంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో (క్యూ2) యూఎస్ జీడీపీ వృద్ధి రేటు 2.8 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ, ఫెడ్ మాత్రం రేట్ల కోతను సుదీర్ఘంగా వాయిదా వేస్తూ వస్తోంది. గత నెలఖర్లో జరిగిన పాలసీ భేటీలోనూ యథాతథ స్థితినే కొనసాగించింది. అయితే, తాజా గణాంకాల ప్రభావంతో సెప్టెంబర్‌లో పావు శాతం కాకుండా అర శాతం కోతను ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ రేట్ల కోత విషయంలో ఫెడ్ సుదీర్ఘ విరామం తీసుకుందని, దీనివల్ల ఎకానమీపై, జాబ్ మార్కెట్‌పై ప్రభావం పడుతోందనేది వారి అభిప్రాయం. అధిక రేట్ల ప్రభావంతో మాంద్యం వచ్చేందుకు 50% అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్ అంటోంది!– సాక్షి, బిజినెస్ డెస్క్ -
50 శాతం వడ్డీ ఉన్న దేశం (ఫొటోలు)
-
అమెరికా- జపాన్ సైనిక ఒప్పందం.. ఇక చైనాకు చుక్కలే?
చైనా నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు, ఆ దేశానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు జపాన్- అమెరికాలు ఒక సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ రెండు దేశాలు సంయుక్తంగా చైనా చర్యలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపధ్యంలో తాజాగా జపాన్, అమెరికా రక్షణ అధిపతులు, అగ్ర దౌత్యవేత్తలు టోక్యోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు యూఎస్ఏ సైనిక కమాండ్‌ను నవీకరించడం, జపాన్‌లో యూఎస్ఏ నుండి లైసెన్స్ పొందిన క్షిపణుల ఉత్పత్తిని పెంచడం తదితర అంశాలపై చర్చించారు.అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ జపాన్-అమెరికా సెక్యూరిటీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో జపాన్ ప్రతినిధులు యోకో కమికావా, మినోరు కిహారాతో భద్రతా చర్చలు జరిపారు. చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకోవడంలో నిమగ్నమైందని, తూర్పు, దక్షిణ చైనా సముద్రంలో, తైవాన్ చుట్టూ యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆస్టిన్ ఆరోపించారు.ఉత్తర కొరియా చేపట్టిన అణు కార్యక్రమం, రష్యా నుంచి ఆ దేశానికి అందుతున్న సహకారం మొదలైనవి ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు ముప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. యుఎస్ఏ బలగాల పెంపుతో సహా కమాండ్ అండ్ కంట్రోల్ నిర్మాణాలను ఆధునీకరించే విషయమై త్వరలో చర్చించనున్నట్లు ఆస్టిన్ తెలిపారు. -
జపాన్‌లో ‘హను-మాన్’.. రిలీజ్ ఎప్పుడంటే..?
తేజ సజ్జ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మహేశ్ బాబు, నాగార్జున, వెంకటేశ్ లాంటి బడా హీరోల సినిమాలు బరిలో ఉన్నా..వాటన్నింటిని తట్టుకొని సంక్రాంతి హిట్ సినిమాగా నిలిచింది. టాలీవుడ్లోనే కాకుండా..బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా హను-మాన్ భారీ వసూళ్లను రాబట్టింది. స్టార్ హీరోలు లేని ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. (చదవండి: 'కన్నప్ప' పేరుతో యూట్యూబర్స్‌కి మెయిల్స్.. నిజమేంటి?)ఇలా పాన్ ఇండియా స్థాయిలో అలరించిన ఈ చిత్రం..ఇప్పుడు జపాన్‌లోనూ సందడి చేయనుంది. అక్టోబర్ 4న ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా తెలియజేస్తూ.. ‘విడుదలైన అన్ని చోట్ల సెస్సేషన్ క్రియేట్ చేసిన ‘హను-మాన్’..ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 4న జపనీస్ సబ్‌టైటిల్ వెర్షన్ విడుదల కానుంది’ అని పేర్కొన్నాడు. After creating a sensation all over❤️🔥#HanuMan is now all set to amaze the audience in Japan 💥The Japanese subtitled version is all set to hit the screens on October 4th 🤩#HanuManInJapan 🔥🌟ing @tejasajja123@Actor_Amritha @Niran_Reddy @varusarath5 @VinayRai1809… https://t.co/ccprtfKEs3— Prasanth Varma (@PrasanthVarma) July 27, 2024 -
మరో కరోనా వేవ్.. జపాన్‌లో పెరుగుతున్న కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోల్లాన్ని ఎవరూ మరచిపోలేరు. తాజాగా జపాన్‌లో మరోసారి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇవి అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ వేరియంట్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జపాన్ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19కు చెందిన 11వ వేవ్ ఇప్పుడు జపాన్ను వణికిస్తోంది.జపాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కజుహిరో టటేడా తెలిపిన వివరాల ప్రకారం కేపీ.3 వేరియంట్ జపాన్‌లో వేగంగా విస్తరిస్తోంది. టీకాలు తీసుకున్న లేదా గతంలో ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ సోకుతోంది. ఈ వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారీ మరింత ప్రమాదకరంగా మారుతోంది. కరోనా నూతన వేరియంట్ వ్యాప్తి విషయంలో రాబోయే వారాలు చాలా కీలకం.ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో కోవిడ్ -19 బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. అయితే ఈ కేసుల్లో చాలా వరకు తీవ్రమైనవి కావని టాటెడా చెప్పారు. కేపీ వేరియంట్ త్రీ సాధారణ లక్షణాలు అధిక జ్వరం, గొంతు నొప్పి, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి, అలసట. జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం జపాన్ అంతటా జూలై 1 నుండి 7 వరకు వివిధ ఆసుపత్రులలో రోజుకు సగటున 30 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య సదుపాయాలు, పడకల కొరత విషయంలో ఆందోళన తలెత్తుతోంది. -
భారత్‌లో రూ. 500 కోట్ల పెట్టుబడులు : తోషిబా గ్రూప్
న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాల విస్తరణపై 10 బిలియన్ జపాన్ యెన్లు (సుమారు రూ. 500 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తోషిబా గ్రూప్ వెల్లడించింది. పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ సామర్థ్యాన్ని 1.5 రెట్లు పెంచుకునేందుకు తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) ఈ నిధులను వెచ్చించనున్నట్లు వివరించింది. 2024–2026 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ మేరకు ఇన్వెస్ట్ చేయనున్నట్లు టీటీడీఐ చైర్పర్సన్ హిరోషి ఫురుటా తెలిపారు. భారత్‌లో తయారీ, భారత్ నుంచి ఎగుమతుల నినాదానికి అనుగుణంగా చేసే ఈ పెట్టుబడులతో నిర్వహణ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపర్చుకోనున్నట్లు వివరించారు. భారత మార్కెట్లో ట్రాన్స్ఫార్మర్ల డిమాండ్‌ను తీర్చడానికి, ఎగుమతులను పెంచుకోవడానికి పవర్ ట్రాన్స్ఫార్మర్ల విస్తరణ తోడ్పడగలదని హిరోషి పేర్కొన్నారు. -
'నవ్వడం' కోసం ఏకంగా చట్టం..!
ఒక దేశంలోని స్థానిక ప్రభుత్వం నవ్వడం కోసం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. పైగా రోజులో కనీసం ఒక్కసారైన నవ్వేలా వినూత్నమైన చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే దీనిపై కొన్ని రకాల విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అయితే ఈ చట్టాన్ని కేవలం ప్రజల మానసిక ఆరోగ్యం కోసమే తప్ప బలవంతంగా నవ్వేలా చేయడం కాదని చెప్పి మరీ కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఇదంతా ఎక్కడ జరిగిందంటే..జపాన్‌లో యమగటా ఫ్రిఫెక్చర్లోని స్థానిక ప్రభుత్వం నవ్వు కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రజలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా నవ్వాలని పిలుపునిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించింది. గతవారం నుంచే ఈ చట్టం అమలులోకి వచ్చింది. స్థానిక విశ్వవిద్యాయల పరిశోధనల్లో 'నవ్వు' మంచి ఆరోగ్యాన్ని అందించగలదని తేలడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నవ్వడం వల్ల ఎన్నో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందేలా స్థానిక ప్రజలను.. ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా నవ్వేలా ప్రోత్సహించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అందుకోసం నవ్వులతో నిండిన కార్యాలయ వాతావరణాన్ని అభివృద్ధి చేసేలా వ్యాపార నిర్వాహకులను కోరుతోంది స్థానికి ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం ప్రతి నెల ఎమనిమిదొవ తేదీని నివాసితులు నవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకునే దినంగా నిర్ణయించింది. యమగటా విశ్వవిద్యాలయంలోని మెడిసిన్ ఫ్యాకల్టీ నవ్వులపై జరిపిన పరిశోధనల్లో నవ్వుతో మంచి ఆరోగ్యం తోపాటు దీర్ఘాయువు పెరుగుతుందని తేలింది. అలాగు రకరకాల కారణాలతో దారితీస్తున్న మరణాలు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఈ నవ్వు ద్వారా తగ్గుతాయని పరిశోధన వెల్లడించింది. అంతేగాదు అధ్యయనం 'నవ్వు' సానుకూల వైఖరితో ప్రవర్తించేలా సమర్థత, విశ్వాసం, నిష్కాపట్యతతో ఉండేలా చేస్తుందని పేర్కొంది . అయితే ఈ నియమాన్ని జపాన్‌లోని చాలామంది రాజకీయనాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇది వారి రాజ్యంగ హక్కులను ఉల్లంఘించడం కిందకు వస్తుందని, నవ్వలేని వారిని ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. అంతేగాదు నవ్వడం లేదా నవ్వకుండా ఉండటం అనేది వారి అంతర్గత ఆలోచన, స్వేచ్ఛకు సంబంధించింది. పైగా ఇది రాజ్యంగం ద్వారా ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటి కూడా అని జపనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(జేసీపీ)నేత టోరు సెకి అన్నారు. అలాగే అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల నవ్వడానికి ఇబ్బంది పడే వారి మానవ హక్కులను మనం అణగదొక్కకూడదు అని కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ (సీడీజేపీ) సభ్యుడు సటోరు ఇషిగురో అన్నారు.కానీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డిపి) నేత కౌరీ ఇటో ఆ వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటరిచ్చారు. ఈ ఆర్డినెన్స్ ప్రజలను నవ్వమని బలవంతం చేయదు. ఇది ఒక వ్యక్తి, అతడి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తుందని కూడా నొక్కి చెప్పారు కౌరీ ఇటో. అలాగే ఈ కొత్త నిబంధన ప్రకారం రోజుకు ఒక్కసారైనా నవ్వలేని వారికి జరిమానా విధించే నిబంధన కూడా లేదని స్థానికి అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: బియ్యం లేదా రోటీ: బరువు తగ్గేందుకు ఏది మంచిది? నిపుణులు ఏమంటున్నారంటే..) -
బలవంతపు ‘కుటుంబ నియంత్రణ’ బాధితులకు పరిహారం
జపాన్ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశంలో ‘యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా’ కింద బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శారీరక వికలాంగులు పిల్లలను కనకుండా నిరోధించడానికి ప్రభుత్వం గతంలో ఈ చట్టం చేసింది. 1950- 1970 మధ్యకాలంలో పుట్టే పిల్లల్లో శారీరక లోపాలను నివారించడానికి ఈ చట్టం చేశారు. ఈ చట్టం కింద దేశంలోని సుమారు 25 వేల మందికి వారి అనుమతి లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.‘యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా’ను యుద్ధానంతర కాలంలో జరిగిన అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనగా జపాన్ న్యాయవాదులు అభివర్ణించారు. ఈ నేపధ్యంలో 1948 నాటి ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. జపాన్‌లోని ఐదు దిగువ న్యాయస్థానాల నుంచి ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ, ‘కుటుంబ నియంత్రణ’ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.తీర్పు అనంతరం కోర్టు బయట బాధితులు సుప్రీకోర్టు న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. టోక్యోలోని 81 ఏళ్ల వాది సబురో కితా మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పుడు నేను నా ఆనందాన్ని వ్యక్తపరచలేకపోతున్నాను. 1957లో 14 ఏళ్ల వయసులో ఉన్నప్పడు బలవంతంగా నాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఇది జరిగింది. ఈ విషయాన్ని నా భర్య చనిపోయే ముందు ఆమెకు తెలిపాను. తన వల్లే పిల్లలు పుట్టలేదని భార్య ముందు పశ్చాత్తాప పడ్డాను’ అని తెలిపారు. కాగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా బాధితులకు క్షమాపణలు తెలిపారు. బాధితులకు పరిహారాన్ని అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
నిజంగానే ఆకాశానికి నిచ్చెన!
ఆకాశానికి నిచ్చెన వేయటం అనే మాటను మనం చాలా సార్లు యాథాలాపంగా వాడుతూంటాం. ఇప్పుడు జపాన్ దేశం అదే అంశంపై దృష్టి పెట్టింది. అంతరిక్షానికి ఎలివేటర్ నిర్మించే సన్నాహాల్లో ఉంది. అదీ అక్షరాలా వంద బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో. ఈ ఎలివేటర్ ఎలా నిర్మిస్తారు? అసలు అది ఆచరణ సాధ్యమేనా అన్న అనుమానం మీకక్కరలేదు. ఎయిరో స్పేస్ అన్వేషణలో జపాన్ అగ్రగామిగా ఉంది. అలాగే రోబొటిక్స్, బయోమెడికల్ రీసెర్చి, నేచురల్ సైన్స్ విభాగంలో గ్లోబల్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. ఆ దేశానికి చెందిన ఒబాయషీ కార్పొరేషన్ అనే నిర్మాణ సంస్థ ఎలివేటర్ నిర్మాణ బాధ్యతను స్వీకరించింది. దానివల్ల ఒనగూడే ప్రయోజనాలను ఆ సంస్థ ప్రకటించింది. ‘భూవాతావరణం నుంచి రికార్డు వేగంతో మనుషులను అంతరిక్షంలోకి పంపవచ్చు. అంగారక గ్రహం మీదకు వెళ్లటానికి ఇప్పటి మాదిరిగా ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం అక్కరలేదు. కేవలం 40 రోజుల్లోనే అక్కడకు చేరగలుగుతామని సంస్థ చెబుతోంది. ఇంత పెద్ద భారీ నిర్మాణం చేపట్టటానికి తగినంత స్టీల్ అందుబాటులో లేదు. పైగా వాతావరణంలో ఒత్తిళ్లను తట్టుకోగలిగినంత దృఢత్వం ఉన్న మెటీరియల్ అవసరం అవుతుంది. అందుకే ఒబాయాషీ కార్పొరేషన్ ‘కార్బన్ నానో ట్యూబ్’ లను ఎంచుకుంది. అవి చుట్టచుట్టిన గ్రాఫైట్ లేయర్లు. స్టీలు కంటే గ్రాఫైట్ లేయర్లు తక్కువ బరువు ఉంటాయి. అవి విరిగిపోయే అవకాశాలు తక్కువ. కార్బన్ నానో ట్యూబ్‌ల వ్యాసం మీటరులో బిలియన్ వంతు ఉంటుంది. ఇంత వరకూ ఎవరూ కూడా రెండడుగుల కంటే పెద్ద నానో ట్యూబ్‌ను రూపొందించలేదు. ఇప్పుడు నానో ట్యూబ్‌ల ఆధారంగానే ఎలివేటర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.ఎలివేటర్లో నానో ట్యూబ్ 60 వేల మైళ్ల పొడవున ఉంటుంది. వీల్ లిఫ్ట్‌ల ద్వారా అది మనుషులను, సామగ్రిని రవాణా చేయగలుగుతుంది. వాటిని ‘క్లైంబర్స్’గా పిలుస్తారు. భూమి నుంచి 22 వేల మైళ్ల ఎత్తులో స్పేస్ షిప్‌కు కార్బో నానో ట్యూబ్‌ను అమరుస్తారు. థ్రస్టర్ దాని కొసకు జోడించబడుతుంది. అదే సమయంలో స్పేస్ షిప్ భూమికి దూరంగా జరుగుతుంది. సంస్థ వేస్తున్న అంచనాల ప్రకారం ఎనిమిది నెలల తర్వాత కార్బన్ నానోట్యూబ్ భూమి ఉపరితలానికి చేరుతుంది. అదే సమయంలో స్పేస్ షిప్ తన తుది గమ్యం 60 వేల మైళ్లకు చేరుకుంటుంది. అది ట్యూబ్‌కి కౌంటర్ వైట్‌గా ఉపయోగపడుతుంది. ఈ ట్యూబ్ ద్వారా పైకి వెళ్లి కేబుళ్లతో బలోపేతం చేస్తారు. ఇందుకోసం ముందుగా ‘లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్ఈఓ)లో స్పేస్ షిప్ నిర్మిస్తారు. ఇందుకోసం రాకెట్ల ద్వారా నిర్మాణ సామగ్రి పంపుతారు. అక్కడ నుంచి స్పేస్ షిప్ ఎలక్ట్రికల్ ప్రొపల్షన్లను ఉపయోగించుకుని కదులుతుంది. జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ (జీఈఓ)కు చేరే వరకూ అది కొనసాగుతుంది.భూమి మీద ఎర్త్ పోర్టును రెండు భాగాలుగా నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకటి ఈక్వేటర్ దగ్గర, మరొకటి సముద్రం దగ్గర. ఈ రెండూ సముద్రం దిగువన టన్నెల్‌తో అనుసంధానమయి ఉంటాయి. ఎర్త్ పోర్ట్ నుంచి పైకి పాకేవాళ్లు సుమారు గంటకు 93 మైళ్ల వేగంతో కార్బో నానో ట్యూబ్ అధిరోహిస్తారు. వాళ్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ని రెండున్నర గంటల్లో చేరతారని సంస్థ ప్రకటించింది.జపాన్ సంస్థ చెబుతున్న దాని ప్రకారం, ఇప్పుడు అంతరిక్షంలో ప్రయోగాలకు పెడుతున్న ఖర్చులతో పోలిస్తే, దీనివల్ల తక్కువ ఖర్చవుతుంది. అలాగే ఇందులో ఇంధన వినియోగం లేదు. ఇదంతా సౌరశక్తి ఆధారంగా సాగుతుంది. భారీగా సోలార్ ప్యానళ్లతో జియో స్టేషన్ నిర్మిస్తారు. మానవుల పరంగా కానీ, వాతావారణ పరంగా కానీ ఎలివేటర్లకు ఉండే ముప్పుల గురించి సంస్థ ఇంకా అధ్యయనం చేపట్టలేదు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది అంటే 2025లో ప్రారంభం కావాలి. ప్రస్తుతం ఆర్ అండ్ బీ పైనా, పార్ట్నర్షిప్ బిల్డింగ్, ప్రమోషన్లపైనా దృష్టి పెట్టారు. ఇందుకు మరికొంత జాప్యమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక రోజున మానవాళి ఈ ఎలివేటర్ ద్వారా అంతరిక్షంలోకి అడుగు పెడుతుంది. అందుకు జపాన్ను మనం తప్పకుండా అభినందించి తీరాలి. డా‘‘ పార్థసారథి చిరువోలు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
లగేజ్ మోసే బాధ లేదు.. ఎంచక్కా అదే వస్తుంది!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మనిషి అన్ని పనులను సునాయాసంగా చేసుకోవడానికి సులభమైన మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలో షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్స్, విమాశ్రయాలలో పైకి ఎక్కడానికి లేదా కిందికి దిగటానికి ఎస్కలేటర్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నాడు. లగేజ్ తీసుకెళ్లడానికి కూడా బెల్ట్ కన్వేయర్స్ ఉపయోగిస్తున్నాడు. అయితే ఇవన్నీ చిన్న దూరాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. అదే ఒక నగరం నుంచి మరో నగరానికి లేదా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి లగేజ్ తీసుకెళ్లే అవకాశం ఉంటే? నిజంగా ఇది వినటానికే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది కదూ..! దీన్ని నిజం చేయడానికే జపాన్.. సరికొత్త టెక్నాలజీని తీసుకురానుంది.జపాన్ గవర్నమెంట్ ప్రధాన నగరాల్లో ఆటోమేటెడ్ జీరో ఎమిషన్స్ లాజిస్టిక్స్ లింక్‌లను ఏర్పాటు చేయడానికి ఓ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇది అమలులోకి వస్తే.. ఒక వ్యక్తి తన లగేజిని ప్రత్యేకంగా తనతోపాటే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా కన్వేయర్ బెల్ట్ నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయన్నమాట.ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే లగేజీని మనతో పాటు తీసుకెళ్లాలి. కానీ కన్వేయర్ బెల్ట్ ఉంటే.. లగేజ్ అక్కడ ఇచ్చేసి మీరు హ్యాపీగా విజయవాడ వెళ్లిపోవచ్చు. లగేజీని దొంగలు తీసుకెళ్లారని భయంగానీ.. ఎక్కడైనా మరచిపోతామేమో అని టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ నిర్వాహకులు లేదా అధికారులు ఆ లగేజీని గమ్యానికి చేరుస్తారు. మీరు మళ్ళీ అక్కడ తీసుకుంటే సరిపోతుంది.జపాన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయడానికి గత ఫిబ్రవరి నుంచి చర్చలు జరుపుతోంది. ఇది 2034 నాటికి అమలులోకి వస్తుందని సమాచారం. మొదటి లింక్ టోక్యో నుంచి ఒకసా మధ్య ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన ప్లాన్ కూడా ఇటీవలే విడుదలైంది. ఈ ప్రణాళిక అమలులోకి వచ్చిన తరువాత లక్షల టన్నుల బరువును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు.టోక్యో నుంచి ఒకసా నగరాల మధ్య సుమారు 500 కిమీ దూరాన్ని కవర్ చేయడానికి భారీ కన్వేయర్ బెల్ట్‌లను ఏర్పటు చేస్తారు. ఈ బెల్ట్ కన్వేయర్స్ హైవేల పక్కన, సొరంగాలు మార్గాల్లో కొనసాగుతుంది. ఇది మొత్తం డ్రైవర్‌లెస్ టెక్నాలజీతో రూపొందుతుంది. ఇందులో కార్గోలు లగేజీని సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తాయి. కాబట్టి వీటికోసం ప్రత్యేకంగా డ్రైవర్స్ అవసరం లేదు.ఈ ప్రాజెక్టుకు నిధులను సమకూర్చడానికి మంత్రిత్వ శాఖ ప్రైవేట్ కంపెనీలకు పిలుపునిచ్చింది. ఈ ప్రాజెక్ట్ లాజిస్టిక్స్ సంక్షోభాన్ని పరిష్కరించడమే కాకుండా, గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుందని రవాణా & పర్యాటక మంత్రి టెట్సువో సైటో పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇది అద్భుతమైన టెక్నాలజీ అనే చెప్పాలి. ఇలాంటి సదుపాయాన్ని మన దేశంలో కూడా అందుబాటులోకి తెస్తే బాగుంటుంది. -
బంతి ఆకారంలో ఉండే బ్రేక్‌ఫాస్ట్.. ఏ దేశం వంటకం అంటే..
ప్రతి దేశం ఒక్కో రకమైన వంటకంలో ఫేమస్ అవుతుంది. ఆ వంటకం పేరు వినగానే వెంటనే ఆ దేశం లేదా ప్రాంతం పేరు మనకు ఠక్కున గుర్తొస్తుంది. అంతలా కొన్ని రకాల వంటకాలు మన మనసులో స్థానం దక్కించుకుంటాయి. అలానే ఇక్కడొక వంటకం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వంటకం మన భారతీయ వంటకానికి దగ్గర పోలిక ఉన్న రెసిపీలానే ఉంటుంది. కానీ వాళ్లు తయారీ చేసిన విధానం మాత్రం వావ్ అనాల్సిందే. ఇంతకీ ఏంటా వంటకం, ఏ దేశానికి సంబంధించింది అంటే..జపాన్ పాకశాస్త్ర నిపుణులు బంతి ఆకారంలో ఉండే బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేశారు. అది ఎక్కడ వంకర లేకుండా..గుండ్రటి బంతి ఆకారంలో ఉంది. పైగా ప్లేటంతా ఆక్రమించేసింది. దీన్ని ఎలా చేస్తారంటే..మైదాపిండికి కొద్ది మోతాదు బొంబాయిరవ్వను కలిపి పులియబెట్టేలా కొద్దిగా ఈస్ట్ జోడించి చపాతి పిండి మాదిరిగా నీళ్లతో కలిపి ఒక పక్కన ఉంచాలి. తర్వాత చిన్నసైజు ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలిన. కానీ వేయించేటప్పుడూ బంతి షేపులోకి పొంగేలా జాగ్రత్తగా వేయించాలి. అంతేగాదు ఈ పిండిని ఎంత ఎక్కువ సేపు నానిస్తే అంతలా అవి డీప్ ఫ్రై చేసేటప్పుడూ కచ్చితమైన చందామామ లాంటి ఆకృతికి వస్తాయి. మన ఇండియన వంటకమైన భాతురా రెసిపీకి దగ్గరగా ఉంటుంది ఈ వంటకం. ఇది పంజాబీ వంటకం. ఇది కూడా ఒక విధమైన పులియబెట్టిన బన్ లేదా పూరీ మాదిరిగా ఉండే వంటకం. మనం ఎలా అయితే పూరీలను సెనగలు ఆలు కర్రీ లేదా కుర్మాతో తింటామో అలానే ఈ జపాన్ రెసీపీని కూడా ఇంచుమించుగా అదే మాదిరి స్పైసీ కర్రీతో తింటారట అక్కడ ప్రజలు. దీన్ని వాళ్లు "జెయింట్ సెసేమ్ బాల్" అని పిలుస్తారట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు ఈ రెసిపీని కాస్మిక్ భాతురా, బంతి ఆకారపు పూరీ అని రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by むにぐるめ(唯一無二の絶品グルメ) (@muni_gurume_japan) (చదవండి: బీచ్‌లో సరదాగా జంట ఎంజాయ్ చేస్తుండగా..అంతలోనే..) -
జపాన్ లో మనిషి మాంసం తినేసే బ్యాక్టీరియా కలకలం
-
దడ పుట్టిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. సోకితే రెండు రోజుల్లో మృతి?
జపాన్‌లో అరుదైన వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా ప్రాణాంతకమని, దీని బారిన పడిన బాధితులు రెండు రోజుల్లో మృతి చెందే అవకాశం ఉన్నదని జపాన్ వైద్య నిపుణులు చెబుతున్నారు.జపాన్‌లో కరోనా పీరియడ్ ఆంక్షలు సడలించిన అనంతరం ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. వైద్యుల అంచనా ప్రకారం ఈ వ్యాధి మనిషిని 48 గంటల్లో మృత్యు ఒడికి చేరుస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిని ‘స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్’ (ఎస్టీఎస్ఎస్) అని అంటారు.జపాన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తెలిపిన వివరాల ప్రకారం 2024, జూన్ 2 నాటికి ఈ వ్యాధి కేసులు 977కి చేరుకున్నాయి. గతేడాది 941 కేసులు నమోదయ్యాయి. ఈ ఇన్స్టిట్యూట్ 1999 నుంచి ఈ వ్యాధికి సంబంధించిన రికార్డులను భద్రపరుస్తోంది.ఈ వ్యాధి సోకినప్పుడు గొంతు నొప్పి మొదలవుతుంది. అలాగే శరీరంలోని వివిధ అవయవాల్లో వాపు, నొప్పి జ్వరం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది శ్వాస సమస్యలు, అవయవ వైఫల్యానికి దారితీసి చివరికి బాధితుడిని మృత్యు ఒడికి చేరుస్తుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం అధికంగా ఉంటున్నదని పలు పరిశోధనల్లో తేలింది.ఈ వ్యాధి గురించి టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన అంటు వ్యాధుల ప్రొఫెసర్ కెన్ కికుచి మాట్లాడుతూ ఈ వ్యాధి సోకినప్పుడు మరణం 48 గంటల్లో సంభవించే అవకాశం ఉన్నదన్నారు. జపాన్‌లో ఈ ఏడాది చివరినాటికి ఈ కేసుల సంఖ్య 2,500కి చేరుకోవచ్చని కికుచి తెలిపారు. -
యాంటీ కేన్సర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలున్న 5 సూపర్ ఫుడ్స్ఇవే!
ప్రపంచంలో జపాన్ ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు. వంద సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు కూడా దాదాపు రెండు శాతం మంది ఇక్కడ ఉన్నారు. దీనికి కారణం జపాన్ ప్రజల ఆహారపు అలవాట్లు వారి జీవనశైలి అని చెబుతారు. ఇదే మాటలను ఉటంకిస్తూ ప్రముఖ నూట్రీషనిస్ట్ డా. సింథానీ ఎక్స్‌లో ఒక ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు. యాంటి కేన్సర్, యాంటీ డయాబటిక్ సూపర్‌ఫుడ్స్ గురించి ఆయన ఈ వీడియోలో వివరించారు.షిటేక్ మష్రూమ్స్ ఇది తూర్పు ఆసియాకు చెందిన ఒక తినదగిన పుట్టగొడుగు.నాటో లేదా నానబెట్టిన సోయా బీన్స్ సీవీడ్ లేదా సముద్ర పాచి : కరిగే ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం సముద్రపు పాచిలో లభించే కొన్ని ఖనిజాలు . రక్తపోటును నియంత్రించి, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అలాగే ఫైటోకెమికల్స్ ఇందులో లభిస్తాయి. సీవీడ్ పెద్దప్రేగు , కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణలో గణనీయ పాత్ర పోషిస్తుంది. సీవీడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని పరిశోధన ద్వారా తెలుస్తోంది.5 Anti-Cancer, anti-diabetic, super foods that explain Japanese longevity. pic.twitter.com/Owicj1OFsO— Barbara Oneill (@BarbaraOneillAU) June 14, 2024ఇంకా కొంజాకు కొన్యాకూ ప్రయోజనాలు, అధిక యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న మాచ్చా టీ ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఈ వీడియోలు తెలిపారు. -
తూర్పు ఆసియాలో కొత్త సమీకరణాలు
నాలుగున్నర ఏళ్ళ తర్వాత సియోల్ వేదికగా చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశం ప్రపంచ రాజకీయ నాయకులు, విశ్లేషకుల్లో ఆసక్తిని రేపుతోంది. తూర్పు ఆసియాలో భౌగోళిక రాజకీయాల్లో కొత్త సమీకరణాల దిశగా అడుగులు పడనున్నాయా అన్న చర్చ మొదలయ్యింది. ఒకరిపై ఒకరికి ఉన్న అనుమానాలు, ఉద్రిక్తతలు పక్కన పెట్టి స్నేహ సంబంధాల బలోపేతానికి జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని భారత దేశం కూడా నిశితంగా గమనించాల్సిందే. వాస్తవంగా 2008లోనే చైనా, జపాన్, దక్షిణ కొరియా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. చివరిసారిగా 2019లో త్రైపాక్షిక సమావేశం జరిగింది. వాస్తవంగా ఈ మూడు దేశాల మధ్య త్రిముఖ కోణాల్లో సంఘర్షణలు ఉన్నాయి. జపాన్–దక్షిణ కొరియా దేశాల మధ్య శత్రుత్వానికి చారిత్రక నేపథ్యమే ఉంది. 1910 నుంచి 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు జపాన్ వలస పాలనలో దక్షిణ కొరియా మగ్గింది. అందుకే ఆ దేశం ఇప్పటికీ జపాన్ చేసిన గాయాలను మర్చిపోలేదు. అటు చైనా– జపాన్ మధ్య కూడా గత ఏడాది ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్ నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేసి పసిఫిక్ సముద్రంలో జపాన్ విడుదల చేయటాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే జపాన్ నీటిని విడుదల చేస్తోందని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసినా చైనా మాత్రం వెనక్కి తగ్గలేదు. జపాన్ నుంచి చేపల దిగుమతిపై చైనా, దక్షిణ కొరియాలు ఆంక్షలు విధించాయి. చైనా–జపాన్ దేశాల మధ్య ఉన్న డియాయు ద్వీపం ప్రాదేశిక జలాల్లో నాలుగు నెలల కిందట చైనా గస్తీ నిర్వహించటంతో ఇరు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తాయి. తూర్పు చైనా సముద్రంలోని సెంకాకు ద్వీపాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య వివాదం చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. వాస్తవంగా రెండో ప్రపంచ యుద్ధ సమయం అంటే 1939–1945 మధ్య కాలంలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతం జపాన్ అధీనంలోనే ఉండేది. యుద్ధంలో జపాన్ ఓటమితో ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరిగింది. మరోవైపు అమెరికాతో తమ సంబంధాల బలోపేతానికి దక్షిణ కొరియా కృషి చేస్తుండటాన్ని చైనా జీర్ణించుకులేకపోతోంది. ఇక దక్షిణ చైనా సముద్రం, ఇండో పసిఫిక్ జలాల్లో చైనా దూకుడు పెంచటంతో జపాన్, దక్షిణ కొరియాల్లో ఆందోళన ఉంది. ఇలా మూడు దేశాల మధ్య వివిధ అంశాల్లో తీవ్ర విభేదాలు, అపనమ్మకాలు, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా... ప్రస్తుతం అన్నింటినీ పక్కన పెట్టి ఒకే తాటిపైకి రావటం ఆసియా ఖండంలో కీలక పరిణామం. చైనా అధ్యక్షుడి తర్వాత నంబర్ టూ గా పరిగణించే ప్రిమీర్... లీ కియాంగ్ అన్నట్లు ఇది మరో శుభారంభం. ఈ సమావేశంలో మూడు దేశాలు పరస్పర సహకారం, భద్రత, వాణిజ్యం, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, పెరుగుతున్న వృద్ధ జనాభా సమస్య వంటి కీలక అంశాలపై చర్చతో పాటు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దిశగా అడుగులు వడిగా వేయటం మరో ప్రధాన విషయం. ఈ మూడు తూర్పు ఆసియా దేశాల మధ్య సంబంధాల ప్రభావం ప్రపంచంపై కూడా ఉంటుంది అనటానికి వీరి గ్లోబల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వాల్యూమ్ ఒక ప్రామాణికం. గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్‌లో 25 శాతం వాటా ఈ మూడు దేశాలదే. అంతే కాదు జపాన్, సౌత్ కొరియాలకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇక్కడే మరో ఈక్వేషన్ కూడా ఉంది. ఆసియా ఖండంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారి తనకు సవాలు విసురుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి అమెరికాకు ఆసియాలో బలమైన స్నేహితులు కావాలి. అందుకే దక్షిణ కొరియా, జపాన్‌లతో కలిసి అగ్రరాజ్యం మిలటరీ డ్రిల్స్‌ను విస్తరిస్తోంది. అదే సమయంలో ఈ రెండు దేశాలకూ, అమెరికాకు మధ్య దూరం పెరగాలని ఆకాంక్షిస్తోంది చైనా. ఆసియా ఖండంలో శాంతి సామరస్యాలు పెరగటాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే అదే సమయంలో ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు, మరింత బలపడేందుకు డ్రాగన్ చేస్తున్న ప్రయత్నాల పట్ల మన దేశం అప్రమత్తంగా ఉండాలి. రెహానా వ్యాసకర్త ఏపీ సమాచార కమిషనర్, ఆంధ్రప్రదేశ్ -
విదేశాలకే వి‘హారం’
సాక్షి, అమరావతి: భారతీయులు విదేశీయానాల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. 2019తో పోలిస్తే జపాన్‌లో 53 శాతం, అమెరికాలో 59 శాతం, వియత్నాంలో 248 శాతం భారతీయ ప్రయాణికులు రాకపోకలు పెరగడం విశేషం. మాస్టర్ కార్డ్ ఎకనామిక్స్ ఇన్స్టిట్యూట్ ‘బ్రేకింగ్ బౌండరీస్’ పేరుతో తాజా ట్రావెల్ ట్రెండ్స్‌ను విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులు అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఆదాయాన్ని మెరుగు పరచుకోవడంతో విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులు సంఖ్య ట్రావెల్, టూరిజం రంగానికి ఊతమిస్తోందని నివేదిక పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల మందికిపైగా మధ్య తరగతి ప్రజలు (ఏడాదికి రూ.12 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారు). దాదాపు 20 లక్షల మంది అధిక ఆదాయ ప్రజలు (ఏటా రూ.66 లక్షలు కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు) కూడా అంతర్జాతీయ ప్రయాణికుల జాబితాలో చేరతారని అంచనా వేసింది. విస్తరిస్తున్న విలాసవంతమైన ఆలోచనలు ఔట్ బౌండ్ ఇండియా ట్రావెల్ రంగాన్ని అసాధారణ వృద్ధిలోకి తీసుకెళ్తున్నాయని అభిప్రాయపడింది. తొలి త్రైమాసికంలో 10 కోట్ల మంది ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే సుమారు 10 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక దశాబ్దం కిందటి వరకు ఈ సంఖ్యలో ప్రయాణాలు చేయాలంటే ఏడాది సమయం పట్టేది. అంటే భారతీయుల్లో ఏ స్థాయిలో ప్రయాణాలు వృద్ధి చెందాయో నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి దేశీయ ప్రయాణాలు 21శాతం, విదేశీ ప్రయాణాలు 4 శాతం మేర పెరిగినట్టు గుర్తించింది. ఆమ్స్టర్డామ్, సింగపూర్, లండన్, ఫ్రాంక్‌ఫర్డ్, మెల్‌బోర్న్‌లు ఈ వేసవి (జూన్–ఆగస్టు)లో భారతీయ ప్రయాణికులు సందర్శించే ఐదు ట్రెండింగ్ గమ్యస్థానాలుగా నిలవడం విశేషం. 2019, 2020లో ఒక పర్యటన సగటు వ్యవధి నాలుగు రోజులుగా ఉంటే ఈ ఏడాది ఐదు రోజులకు పెరిగింది. పెరిగిన క్రూయిజ్ ప్రయాణాలు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యూరోపియన్ చాంపియన్íÙప్ కారణంగా 2024లో జర్మనీలోని మ్యూనిచ్ టాప్ ట్రెండింగ్ డెస్టినేషన్‌గా నిలిచింది. గత మార్చికి ముందు 12 నెలల్లో ప్రజలు అత్యధికంగా ప్రయాణించిన గమ్యస్థానంగా జపాన్ నిలిచింది. ముఖ్యంగా ఐదు మార్కెట్లలో నాలుగు యూరోపియన్ గమ్యస్థానాలు, టాప్ 10లో 50 శాతం ఆసియా–పసిఫిక్ గమ్యస్థానాలు ఉన్నాయి. గడిచిన ఏడాది అత్యధికంగా ప్రయాణికులను ఆకర్షించిన గమ్యస్థానాల్లో జపాన్, ఐర్లాండ్, రొమేనియా, ఇటలీ, స్పెయిన్, మలేషియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, యూఏఈ, ఇండోనేషియా నిలిచాయి. అయితే విదేశీ సందర్శకుల రికవరీలో అమెరికా 2019తో పోలిస్తే 6 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. హోటల్ పరిశ్రమలలో నిరంతరం ధరల పెరుగుదల కారణంగా క్రూయిజ్ ప్రయాణాలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్ క్రూయిజ్ ప్యాసింజర్ లావాదేవీల సంఖ్య 2019 కంటే దాదాపు 16 శాతం పెరిగాయి. -
నీలిరంగు చీరలోన జపాన్‌లో ఒక సందమామ
‘రోమ్‌లో రోమన్‌లా ఉండాలి’ అంటారు కొందరు. ‘అయినా సరే, నేను నాలాగే ఉంటాను’ అంటారు కొందరు. రెండో కోవకు చెందిన డిజిటల్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్ మహిశర్మ వీడియో వైరల్ అయింది. గోల్డెన్ బార్డర్స్ బ్లూ శారీ ధరించి జపాన్‌లోని టోక్యో వీధుల్లో చిద్విలాసంగా నడుస్తున్న ఆమె వీడియో ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్స్ దృష్టిని ఆకర్షించింది. ‘ఐ వోర్ ఏ శారీ ఇన్ జపాన్ రియాక్షన్స్ ఆర్’ కాప్షన్‌తో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో ఏడు మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. వీడియోలో ఆబాలగోపాలం మహిశర్మను ఆశ్చర్యంగా చూస్తున్న, సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తాయి. -
అంతరిక్ష వ్యర్థాలకు చెక్ పెట్టేలా 'చెక్క ఉపగ్రహం'..ప్రపంచంలోనే..!
సాధారణంగా ఉపగ్రహాలు లోహంతో తయారు చేస్తారు. అవి వాతావరణంలో పొరపాటున కాలిపోతే హానికరమైన చెత్తను సృష్టిస్తున్నాయి. ఈ శిథిలాల కార్యాచరణ ఇతర ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకకు గణనీయమైన ముప్పుని కలిగిస్తాయి. అందుకని ఈ సమస్యకు చెక్‌పెట్టేలా జపాన్ శాస్త్రవేత్తలు సరికొత్త ఉప్రగ్రహ్నాన్ని అభివృద్ధిచ చేశారు. దేనితో అంటే..ప్రపంచంలోనే తొలిసారిగా జపాన్ పరిశోధకులు లిగ్నోశాట్ అనే చిన్న చెక్క ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని సెప్టెంబర్‌లో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ లిగ్నోశాట్ని క్యోటో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు లాగింగ్ కంపెనీ సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో రూపొందించగలిగారు. 2020 ఏప్రిల్ నుంచి ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసే పనిలోపడ్డారు. ఈ ఉపగ్రహాన్ని తయారు చేసేందుకుమాగ్నోలియా కలపను ఎంచుకున్నారు. ఈ చెక్క ఉపగ్రహాలు అంతరిక్షంలోని వ్యర్థాల సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం అందించగలవని పరిశోధకులు చెబుతున్నారు. చెక్కను ఉపగ్రహంలా మలిచేలా ప్రతివైపు పది సెంటిమీటర్లు ఉండేలా అడ్జెస్ట్ చేశారు. దీన్ని సెప్టెంబర్‌లో కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ రాకెట్లో ప్రయోగించనుంది. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కి డెలివరీ చేయడం జరుగుతుంది. అక్కడ ఈ ఉపగ్రహం బలాన్ని, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను తట్టుకునే సామార్థ్యం ఉందా లేదా వంటి పలు టెస్ట్‌లు చేస్తారు. అందుకోసం డేటాని పంపించి పరిశీలిస్తామని సుమిటో ఫారెస్ట్రీ ప్రతినిధి తెలిపారు. ఈ సరికొత్త చెక్క ఉపగ్రహం అంతరిక్ష వ్యర్థాలపై పోరాటంలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది గనుక విజయవంతమైతే కొత్తతరం పర్యావరణ అనకూల ఉపగ్రహాలను తయారు చేసేలా ఈ లిగ్నోశాట్ ఉపగ్రహం మార్గం సుగమం చేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: చిట్టి పికాసో: రెండేళ్ల వయసులో పెయింటింగ్..ఎంతకు అమ్ముడయ్యాయంటే..) -
జపాన్ బుల్లెట్ రైలు తలరాతని మార్చిన కింగ్‌ఫిషర్!
శాస్త్రవేత్తలు, మహామహా మేధావులు ఎన్నో కొంగొత్త ఆవిష్కరణలు చేయడం గురించి విన్నాం. అవన్నీ పూర్తి స్థాయిలో ఫలవంతమయ్యేందుకు దేవుడు వైపు(ప్రకృతి వైపు) చూడక తప్పేది కాదు. ఆయన చేసిన సృష్టి అద్భుతమే ఓ గొప్ప మేథస్సు. దాని సాయంతోనే ఆవిష్కరణలు ఫలమంతమయ్యేవి. అలాంటి ఘటనే జపాన్ బుల్లెట్ రైలు విషయంలో చోటు చేసుకుంది. అదేంటంటే..జపాన్ శాస్త్రవేత్తలు సాంకేతికతో కూడిన అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైళ్లను రూపొందించారు. అవి ప్రజల దూరాలను దగ్గర చేసి సమయాన్ని ఆదా చేసేలా అత్యంత నాణ్యతతో రూపొందించారు. అయితే జపాన్‌లో రైలు మార్గం చాలా వరకు టన్నెళ్లతో కూడినది. దీంతో గంటక సుమారు 240 నుంచి 320 కిలోమీటర్లు దూరం ప్రయాణించే ఈ బల్లెట్ రైళ్లు ఈ టన్నెల్ గుండా వెళ్లగానే భారీ శబ్దాలు వచ్చేవి. ఎంతలా అంటే ఇవి దాదాపు 400 మీటర్లు దూరంలో ఉన్న నివాసితులకు వినిపించేంత పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి. దీంతో ఈ రైళ్లపై ఫిర్యాదులు రావడం మొదలయ్యింది. నిజంగానే ఆ శబ్దాలు భరిచలేనంత పెద్దగా వచ్చేవి. దీంతో శాస్త్రవేత్తలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటని వెతకడం ప్రారంభించారు. పలు సమావేశాల్లో చర్చల్లో దీనికి పరిష్కారం ప్రకృతిని పరిశీలించే కనుగొనగలమని ఒక శాస్త్రవేత్త సూచించడంతో..ఈ బుల్లెట్ ట్రెయిన్ని ఆవిష్కరించిన ఇజీ నకాట్సు ఆ దిశగా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇక్కడ బుల్లెట్ రైలు అత్యంత వేగంతో టన్నెల్ గుండా వెళ్తుండటంతో దాని ముందున్న అట్మాస్పియరిక్ ప్రెజరే ఈ బారీ శబ్దానికి కారణమని గుర్తించాడు. ఇలా ఆకాశం నుంచి వేగవంతంగా పయనించి భూమ్మీదకు వచ్చే జీవి ఉందా అనే దిశగా ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడే కింగ్ ఫిషర్ బర్డ్ జ్ఞప్తికి వచ్చింది. అది ఆకాశ నంచి అత్యంత వేగంగా వచ్చి నీటిలోకి శబ్దం లేకుండా తల ముంచి చేపలను లటుక్కున పట్టుకునే తీరు నకాట్సని సరికొత్త ఆలోచనను రేకెత్తించింది. దాని ముక్కు అత్యంత సూదిగా పొడుగుగా ఉండటంతోనే కదా నీటిపై శబ్దం చేయకుండా లోపలకు ముంచి చేపను పట్టుకోగలుగుతుంది అని గుర్తించాడు. దీన్నే బుల్లెట్ రైలుకి అప్లైచేసి దాని రూపురేఖలు మార్పు చేస్తాడు. అనుహ్యాంగా అది టన్నెల్ గుండా వెళ్లినప్పుడూ ఎలాంటి శబ్ద కాలుష్యాన్ని సృష్టించకుండా నిశబ్దంగా వెళ్తుంది. ఈ కొత్త డిజైన్ శబ్దాన్ని తగ్గించడమే కాకుండా, రైళ్లను 15% వేగంగా, 15% శక్తిని ఆదాచేసేలా చేసింది. దేవుడి అద్భత సృష్టిని కాపీ కొట్టడం ద్వారా ఇది సాధ్యం అయ్యిందని ఆయన మేథస్సు ముందు మానవ మేథస్సు చిన్నదేనని నకాట్సు అన్నారు. Japan's famous bullet train used to make a loud boom when it travelled through tunnels. But, thanks to a spot of bird-watching, an engineer was able to fix the problem after he was inspired by a kingfisher.#biomimicry #designthinking #uxRead more at: https://t.co/MzROXEt3aV pic.twitter.com/2HZd9P8FIy— Black Bee (@BlackBeeCoIndia) June 27, 2021 (చదవండి: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
సీన్ హై జపానీ..సినిమా హై హిందుస్థానీ
భారతీయ సినిమా పాటలకు విదేశీయులు డ్యాన్స్ చేయడం కొత్త కాదు. అయితే జపాన్‌లో మాత్రం బాలీవుడ్ హిట్ సినిమాల ఐకానిక్ సీన్లను రీక్రియేట్ చేసే కొత్త ట్రెండ్ మొదలైంది. బాలీవుడ్ మూవీ ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ (కె3జి)లో అంజలిగా కాజోల్, రాహుల్‌గా షారుఖ్ ఖాన్ నటించారు. రాహుల్, అంజలి వేషధారణలో జపనీస్ ఇన్ఫ్లూయెన్సర్లు మాయో, కకే టకులు ‘కె3జి’లోని ‘బడే మజాకీ హో’ కామెడీ సీన్‌ను రీక్రియేట్ చేశారు. ‘లెర్నింగ్ హిందీ ఇన్ 2024 ఈజ్ లైక్ బడే మజాకీ హో’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. హిందీలో ్రపావీణ్యం సంపాదించిన మాయో, కకే టకుల లిప్ సింక్ బాగా కుదిరింది. ‘క్రాస్–కల్చరల్ అడ్మిరేషన్ అనేది భౌగోళిక సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒక గొడుగు కిందికి తీసుకువస్తుంది. పర్యాటక ఆసక్తి పెంచుతుంది’... లాంటి కామెంట్స్ ఎన్నో యూజర్ల నుంచి వచ్చాయి. -
వరల్డ్ ఫ్యామస్ మీమ్ డాగ్ ఇకలేదు.. గుండె పగిలిందంటున్న నెటిజన్లు
సోషల్‌మీడియాలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయినా జపనీస్ కుక్క(19) ఇకలేదు. సోషల్ మీడియాలో మీమ్స్ ఐకాన్ కబోసు "డాగీ" కన్నుమూసింది. ఈవిషయాన్ని కబోసు యజమాని అత్సుకో సాటో ప్రకటించారు. "మే 26 ఆదివారం నాడు కబో-చాన్‌కు వీడ్కోలు పార్టీ"ని నరిటా సిటీలోని కొట్సు నో మోరిలోని ఫ్లవర్ కౌరీలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కూడా వెల్లడించారు. దీంతో డాగ్ లవర్స్, సోషల్ మీడియా యూజర్లు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆర్ఐపీ కబోసు సందేశాలు వెల్లువెత్తాయి.Rest in Peace, Doge 💔Doge मीम के पीछे का, करोड़ों लोगों के चेहरों पर मुस्कान लाने वाला जापानी कुत्ता काबोसु (kabosu) 18 साल की उम्र में मर गया, लेकिन काबोसु हमेशा ज़िंदा रहेगा। ❤Miss u kabosu 😥Kabuso the dog behind this meme died , RIP Doge 💔 pic.twitter.com/LLDfWp7xcU— Jayesh Jha (@imjayeshjha) May 24, 2024క్రిప్టోకరెన్సీ డాగ్కాయిన్ను, సోషల్ మీడియా మీమ్స్ బెస్ట్ ఛాయస్గా షిబా ఇను కబోసు పేరుగాంచింది. లుకేమియా , కాలేయ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం మృతి చెందింది. ముందు రోజు రాత్రి ఎప్పటిలాగే అన్నం తిని పుష్కలంగా నీళ్ళు తాగిందనీ, గాఢ నిద్రలో ప్రశాతంగా కన్నుమూసిందని సాటో తెలిపారు. 2022లో లుకేమియా , కాలేయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. -
World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
కలకు సాధన తోడైతే చాలు మిగతావన్నీ వాటికవే వచ్చి చేరతాయి. ఈ మాట నా విషయంలో అక్షర సత్యం అంటోంది దీప్తి జివాంజీ. తెలంగాణలోని వరంగల్ వాసి అయిన దీప్తి జివాంజీ దినసరి కూలీ కుమార్తె. జపాన్‌లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో సోమవారం 400 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా 21 ఏళ్ల దీప్తిని పలకరిస్తే ఇలా సమాధానమిచ్చింది.⇢ క్రీడలే ప్రధానంగా!నా చిన్నప్పుడు స్కూల్లో పీఈటీ సర్ చెప్పిన విధంగాప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పుడే జిల్లా స్థాయి ΄ోటీల్లో పాల్గొనేదాన్ని. నాకు చిన్నతనంలో తరచూ ఫిట్స్ వస్తుండేవి. రన్నింగ్ చేసేటప్పుడు బాడీ షేక్ అయ్యేది. దీంతో మా పీఈటీ సర్‡పారా అథ్లెట్స్‌తో మాట్లాడి, టెస్టులు చేయించారు. వారితో మాట్లాడి ‘ఇక పారా అథ్లెట్స్ గ్రూప్‌లో పాల్గొనమ’ని చె΄్పారు. మా అమ్మనాన్నలది మేనరికం కావడం వల్ల జన్యుపరమైన సమస్యలు వచ్చాయని తెలిసింది. అక్కణ్ణుంచి పారా అథ్లెటిక్ కాంపిటిషన్లో పాల్గొంటూ వచ్చాను. ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అందులో పాల్గొన్నాను. మెడల్ రావడంతో అక్కణ్ణుంచి నా జీవితంలో క్రీడలు ప్రధాన భాగంగా మారి΄ోయాయి. డిగ్రీలో చేరాను కానీ, అప్పటికి ఇంకా పరీక్షలు రాయడం పూర్తి చేయలేదు.⇢ బలహీనతలను అధిగమించేలా..స్పోర్ట్స్‌లో పాల్గొనడం వల్ల ఒక ఆరోగ్యపరమైన సమస్యను ఆ విధంగా అధిగమించాను అనుకుంటాను. చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఈ ఆటలు నీకు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. కానీ, కానీ, మా అమ్మ మాత్రం ‘అవన్నీ పట్టించుకోవద్దు. నీవనుకున్నదానిపైనే దృష్టి పెట్టు. ఈ రోజు నిన్ను అన్నవాళ్లే రేపు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు’ అని చెప్పేది. ఆ విధంగా మానసిక ధైర్యం కూడా పెరిగింది. స్పోర్ట్స్ అన్ని బలహీనతలను దూరం చేస్తుందని.. గెలిచినా, ఓడినా.. ఎప్పడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటామని నమ్ముతాను. ఇప్పటివరకు నాలుగు వరల్డ్ చాంపియన్‌షిప్ ΄ోటీల్లో పాల్గొన్నాను. నాకు సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ⇢ ధైర్యమే బలంమా ఇంటి పరిస్థితులు ఎప్పుడూ కష్టంగానే ఉండేవి. మా అమ్మ ధనలక్ష్మి కూలి పనులకు వెళుతుంది. నాన్న పైపుల కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు స్కూల్‌కు వెళుతుంది. ఉండటానికి మాకు కనీసం అద్దె ఇల్లు కూడా ఉండేది కాదు. మొన్న మొన్నటి వరకు మా అమ్మమ్మ వాళ్లింటోనే ఉన్నాం. ఎన్నో అవమానాలూ ఎదుర్కొన్నాం. ఈ మధ్య ఆ ఇంటినే కొనుగోలు చేశాం. ఇక బలమైన ఆహారం అంటే స్పోర్ట్స్ అకాడమీలోకి వచ్చిన తర్వాతే అని చెప్పుకోవాలి. అమ్మ ఎప్పుడూ చెప్పే విషయాల్లో బాగా గుర్తుపెట్టుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ‘కష్టపడితే ఏదీ వృథా ΄ోదు. నీకు నువ్వు ధైర్యంగా నిలబడాలి. అప్పుడే నిన్ను కాదని వెళ్లి΄ోయినవి కూడా నీ ముందుకు వస్తాయి’ అంటుంది. మొన్న జపాన్‌లో జరిగిన పారా ఒలింపిక్‌లో బంగారు పతకం సాధించిన విషయం చెప్పినప్పుడు అమ్మ చాలా సంతోషించింది. నా బలం మా అమ్మే. ఆమె ఏమీ చదువుకోలేదు. కానీ, ధైర్యంగా ఎలా ఉండాలో చెబుతుంది. ఆడపిల్లలమైనా మేం బాగా ఎదగాలని కోరుకుంటుంది.⇢ ప్రాక్టీస్ మీదనే దృష్టిటీవీ కూడా చూడను. ΄÷లిటికల్ లీడర్స్‌కు సంబంధించి వచ్చే సాంగ్స్ వింటుంటాను. ఆ పాటల్లో స్ఫూర్తిమంతమైన పదాలు ఉంటాయి. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉంటున్నాను. మరో మూడు నెలల్లో ఒలపింక్స్ లో పాల్గొనబోతున్నాను. దేశం తరపున పాల్గొనబోతున్నాను కాబట్టి నా దృష్టి అంతాప్రాక్టీస్ మీదనే ఉంది. సాధారణంగా ఉదయం రెండు గంటలు; సాయంత్రం రెండు గంటలుప్రాక్టీస్ ఉంటుంది. మధ్యలో మా రోజువారీ పనులు, విశ్రాంతికి సమయం కేటాయిస్తాం. నాతో పాటు ఉన్న స్నేహితులతో చిట్ చాట్ ఉంటుంది.⇢ బాధ్యతగా ఉండాలిచిన్నప్పటి నుంచి అమ్మనాన్నల కష్టం చూస్తూ పెరగడం వల్ల సొంతంగా ఇష్టాలు, అభిరుచులు అనే ధ్యాస ఏమీ లేదు. కానీ, చిన్నప్పటి నుంచి ΄ోలీసు కావాలనేది నా కల. ఇప్పటికీ అదే ఆలోచన. నా కృషి నేను చేస్తున్నాను. నేను కోరుకున్నది వస్తుందనేది నా నమ్మకం. అమ్మనాన్నలు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ΄ోలీసుని అయి మా అమ్మ నాన్నలను, చెల్లెలిని బాగా చూసుకోవాలి, అది నా బాధ్యత అనుకుంటున్నాను’’అంటూ ముగించింది దీప్తి. ఆమె ఆశలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
చరిత్ర సృష్టించిన తంగవేలు.. మనసును కదిలించే కథ
భారత పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలు సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో T63 హై జంప్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించాడు.జపాన్‌లోని కోబేలో జరిగిన ఈవెంట్లో 1.88 మీటర్లు దూకి పసిడి ఒడిసిపట్టాడు 28 ఏళ్ల తంగవేలు. అంతేకాదు పనిలో పనిగా శరత్ కుమార్ పేరిట ఉన్న(1.83 మీటర్లు) రికార్డు కూడా బద్దలు కొట్టాడు.మనసును కదిలించే కథతమిళనాడుకు చెందిన మరియప్పన్ తంగవేలు ఐదేళ్ల వయసులో ఘోర ప్రమాదానికి గురయ్యాడు. తాగి బస్సు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన కుడికాలును శాశ్వతంగా పోగొట్టుకున్నాడు.అయితే, తంగవేలు చదివే పాఠశాలలోని పీఈటీ సర్ అతడిని ఎంతగానో ఎంకరేజ్ చేశాడు. ఒంటికాలితోనే హై జంప్‌లో రాణించేలా శిక్షణ ఇచ్చాడు.తల్లే తండ్రిగా మారి.. రోజూ వారీ కూలీగాతంగవేలు బాల్యం కూడా కష్టంగా గడిచింది. అతడి తల్లి రోజూ వారీ కూలీ. కొడుకును పోషించుకునేందుకు అప్పుడప్పుడు కూరగాయలు కూడా అమ్మేవారు.ఇలాంటి ఒడిదుడుకుల నడుమ పాఠశాల విద్య పూర్తి చేసిన తంగవేలు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించాడు. చదువుకుంటూనే ఆటపై కూడా దృష్టి సారించిన అతడు జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించాడు.పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్అంచెలంచెలుగా ఎదిగిన తంగవేలు 2016 రియో పారాలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచాడు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో మాత్రం రజతంతో సరిపెట్టుకున్నాడు.అందుకున్న పురస్కారాలుహై జంప్‌లో విశేష ప్రతిభ కనబరిచిన తంగవేలును భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అదే విధంగా అర్జున అవార్డు కూడా ప్రదానం చేసింది. ఇక తంగవేలు 2020లో అత్యుత్తమ క్రీడా పురస్కారం ఖేల్ రత్న అందుకున్నాడు. ధ్యాన్ చంద్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.డబ్బు మొత్తం వాటికే ఖర్చు పెట్టివివిధ టోర్నీల్లో పతకాలు గెలవడం ద్వారా సంపాదించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తంగవేలు పొలాలు కొనేందుకు వినియోగించాడు. తన తల్లి కోసం ఇంటిని కూడా నిర్మించాడు.చదవండి: MS Dhoni: ఐపీఎల్‌కు గుడ్‌బై?.. ధోని కీలక వ్యాఖ్యలు That's Mariyappan Thangavelu. Just few hours back he won India's 🇮🇳 first ever Gold Medal in High Jump at World Para Athletics. Media won't share stories of such incredible athletes. But should know more about him.At the age of 5, he met with an accident where a drunk bus… pic.twitter.com/d4zaKEXJR5— Dilip Kumar (@kmr_dilip) May 22, 2024 -
‘భళా భారత్’.. జపాన్ కంపెనీ సీఈఓ ప్రశంసల వర్షం
భారత్ సంస్కృతి, సంప్రదాయాలకు జపాన్ టెక్ కంపెనీ కోఫౌండర్ ఫిదా అయ్యారు. భారత్ భళా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే సత్తా ఈ దేశానికే ఉందంటూ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.టెక్ జపాన్ కంపెనీ కోఫౌండర్, సీఈఓ నౌటకా నిషియామా.. తన వ్యాపార కార్యకలాపాల్ని భారత్‌లో విస్తరించాలని భావించారు. ఇందుకోసం ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల్ని అర్ధం చేసుకునేందుకు గత నెలలో సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరుకు వచ్చారు.ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఈ నేపథ్యంలో భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ రోజు ప్రపంచం నివసించడానికి అస్తవ్యస్తమైన ప్రదేశంగా ఉందని అన్నారు. అయితే అనేక విషయాల్లో అపార అనుభవం ఉన్న భారత్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉందన్నారు. ఆశ్చర్యపోయా‘ప్రపంచానికి భారతీయ నాయకత్వం అవసరం. నేను భారతదేశానికి వచ్చి నెలరోజులైంది. దేశంలోని విలువల వైవిధ్యాన్ని చూసి మరోసారి ఆశ్చర్యపోయాను’ అని లింక్డిన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లు.. వివిధ మతాలు, జాతులు, విలువలతో కూడిన పెద్ద దేశంగా ఉన్నప్పటికీ భారతదేశం ఒకే దేశం కావడం ఒక అద్భుతం. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ల విజయాల్ని ఉదహరించారు. భారత్ పోటీ, సహకారం రెండింటినీ మూర్తీభవించిందని.. ప్రపంచ సంస్థలో నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిషియామా అన్నారు. వ్యాపార రంగంలో, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల రెండవ తరం అమెరికన్లు కాదు. వారు ఇక్కడే (భారత్) జన్మించారు. ఇక్కడే చదువుకున్నారు. ఆపై గ్రాడ్యుయేట్ కోసం అమెరికాకు వెళ్లారు. వాళ్లే టెక్ రంగాల్ని శాసిస్తున్నారంటూ భారత్‌ను కొనియాడుతూ పోస్ట్ చేశారు. నౌటకా నిషియామా పోస్ట్‌పై నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ఏంటి? ఫిజికల్ రిలేషన్ షిప్‌కు ఎందుకు తావులేదు?
వివాహం అంటే రెండు ఆత్మల కలయిక అని చెబుతుంటారు. వివాహానికి ఇచ్చే వివరణల్లో కాలనుగుణంగా అనేక మార్పులు వచ్చాయి. లివ్ ఇన్ రిలేషన్ షిప్ కూడా ఇలాంటివాటిలో ఒకటి. దీనిలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ భార్యాభర్తలుగానే కలసి జీవిస్తుంటారు.ఇప్పుడు పెళ్లి విషయంలో మరో కొత్త ప్రయోగం జరుగుతోంది. ఇది జపాన్‌లో ప్రారంభమయ్యింది. అక్కడి యువతలో ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది వివాహాల్లో మరో నూతన విధానం. ఇందులో యువతీయువకులు భాగస్వాములుగా మారుతారు. అయితే ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’లో ప్రేమ లేదా శారీరక సంబంధానికి అవకాశం ఉండదు. జపాన్‌లోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది ఈ రకమైన వివాహాన్ని ఇష్టపడుతున్నారు.‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’లో చట్టబద్ధంగా వివాహం చేసుకుంటారు. కానీ ఫిజికల్ రిలేషన్ షిప్కి అవకాశం ఉండదు. అయితే కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలను కనేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వివాహంలో ఇద్దరు భాగస్వాములూ విడివిడిగా వారికి నచ్చిన మరో మరొక భాగస్వామితో సంబంధం పెట్టుకునే స్వేచ్ఛను పొందుతారు. ఇలాంటి వివాహం చేసుకున్న ఒక జంట మీడియాతో మాట్లాడుతూ ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’అంటే మనకు నచ్చిన రూమ్మేట్ని ఎంచుకోవడం లాంటిదని అన్నారు. ఈ విధంగా ఒకచోటు చేరిన భాగస్వాములు ఇంటి ఖర్చులను, ఇతర ఖర్చులను సమానంగా పంచుకుంటారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం 32 ఏళ్లుదాటిన యువతీ యువకులు ఇటువంటి వివాహలపై మక్కువ చూపిస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా స్వేచ్ఛగా ఉండాలనుకునే వారు ఇటువంటి ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’కు ప్రాధాన్యతనిస్తున్నారు. 2015 మార్చి తరువాత నుండి జపాన్‌లో వంద మందికి పైగా యువతీ యువకులు ఈ విధమైన వివాహం చేసుకున్నారని సమాచారం. -
సౌరశక్తి ఉత్పాదనలో జపాన్ను తలదన్నిన భారత్
భారత్ 2023లో సౌరశక్తి ఉత్పాదనలో జపాన్ను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌరశక్తి ఉత్పాదక దేశంగా అవతరించింది. గ్లోబల్ ఎనర్జీ సెక్టార్లో పనిచేస్తున్న పరిశోధనా సంస్థ అంబర్ తన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది.2015లో సౌరశక్తి వినియోగంలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారత్ గత కొన్ని ఏళ్లుగా సౌరశక్తి వినియోగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. దాని ఫలితమే ఈ విజయం. ‘గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ’ పేరుతో అంబర్ ఈ నివేదికలో 2023లో ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 5.5 శాతం సౌరశక్తి రూపంలో లభించిందని పేర్కొంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వృద్ధి 2023లో ఆశా జనకంగా ఉందని, అయితే చైనాలో కరువు కారణంగా జలవిద్యుత్ ఉత్పత్తి ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిందని ఆ నివేదిక పేర్కొంది.ప్రపంచంలో అత్యంత చౌకైన సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశం భారతదేశం అయితే అత్యంత ఖరీదైన సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశం కెనడా. 2023 నాటికి భారతదేశం సౌరశక్తి ఉత్పత్తి విషయంలో ప్రపంచంలోనే నాల్గవ దేశంగా నిలిచింది. ఈ విషయంలో చైనా, అమెరికా, బ్రెజిల్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. సౌరశక్తి వృద్ధిలో ఈ నాలుగు దేశాల వాటా 2023లో 75 శాతంగా ఉంది. జపాన్.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి సహకారం 2015లో 0.5 శాతంగా ఉండగా, ఇది 2023లో 5.8 శాతానికి పెరిగింది. సౌర శక్తి 2030 నాటికి ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 22 శాతానికి పెరగనున్నదనే అంచానాలున్నాయి. 2030 నాటికి పునరుత్పాదక సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలని యోచిస్తున్న కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. -
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
అంతర్జాతీయ టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్ నమోదైంది. ఏషియన్ గేమ్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో భాగంగా జపాన్‌తో ఇవాళ (మే 8) జరిగిన మ్యాచ్‌లో మంగోలియా 12 పరుగులకే ఆలౌటైంది. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్ గతేడాది ఫిబ్రవరి 26న నమోదైంది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు 10 పరుగులకే చాపచుట్టేసి చెత్త రికార్డు మూటగట్టుకుంది.మంగోలియాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. జపాన్ ఇన్నింగ్స్‌లో శబరీష్ రవిచంద్రన్ (69) అర్దసెంచరీతో రాణించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన మంగోలియా.. జపాన్ బౌలర్ల ధాటికి 8.2 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా జపాన్ 205 పరుగుల అతి భారీ తేడాతో విజయం సాధించింది. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో భారీ విజయంగా నమోదైంది. 2023లో నేపాల్ ఇదే మంగోలియాపై సాధించిన 273 పరుగుల విజయం పొట్టి క్రికెట్ చరిత్రలోనే అతి భారీ విజయంగా నమోదైంది.ఈ మ్యాచ్‌లో జపాన్ బౌలర్ కజుమా కటో స్టాఫోర్డ్ 3.2 ఓవర్లు వేసి 7 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డౌట్లయ్యారు. 4 పరుగులు చేసిన సుమియా టాప్ స్కోరర్ కాగా.. ఎక్స్‌ట్రాల రూపంలో మూడు పరుగులు వచ్చాయి. -
Salaar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అయిన సలార్.. ట్రైలర్ అదిరింది!
జపాన్‌లో ఇండియన్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అక్కడ భారతీయ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో పాటు కేజీయఫ్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు కూడా జపాన్‌లో రిలీజై మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా మరో ఇండియన్ చిత్రం జపాన్‌లో రిలీజ్ కాబోతుంది. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’. కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో ప్రభాస్‌కి ఓ మంచి హిట్ లభించింది. థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలోనూ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి రెడీ అయ్యాడు ప్రభాస్. జులై 5న ఈ చిత్రాన్ని జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం యాక్షన్ సీన్లతోనే కట్ చేసిన ఈ ట్రైలర్ గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ చిత్రంలో శృతీహాసన్ హీరోయిన్గా నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. -
ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
ఆరోగ్యానికి మంచిదంటూ పాతకాలపు వంటలు, వంటలు ఇపుడొక ఫ్యాషన్. జపాన్‌లో ఒక వింత వంటకం తెగర వైరల్ అవుతోంది. శతాబ్దాల నాటి చిరుతిండిని లేటెస్ట్గా వడ్డించడంతో, ఖరీదు ఎక్కువైనా సరే ఎగబడి తింటున్నారట అక్కడి జనం. అసలు స్టోరీ ఏంటంటే..ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నాయి జపాన్ రెస్టారెంట్లు. శతాబ్దాల చరిత్రగల పురాతన వంటకం ‘రైస్ బాల్’ ను వెరైటీగా సిద్ధంచేసి మరీ ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి కూడా. ఇంతకీ ఈ స్నాక్ ఎలా తయారు చేస్తారో తెలిస్తే మాత్రం.. దిమ్మ దిరగాల్సిందే.జపాన్‌లో ఒనిగిరి లేదా రైస్ బాల్ (అన్నం ముద్దలు) వంటకం చాలా ఫేమస్. ఉడకబెట్టిన వివిధ కూరగాయలు, మాంసం, అన్నం, నోరి అనే ఎండబెట్టిన సముద్ర పాచిలో చుడతారు. సాధారణంగా ఒనిగిరి అన్నం ముద్దలను చేత్తోనే లడ్డూల్లా చుడతారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇటీవలి కాలంలో అందమైన మహిళా చెఫ్‌లను రెస్టారెంట్ల యజమానులు రంగంలోకి దించారు. ఆ అమ్మాయిలు ఒనిగిరి ముద్దలను చేత్తో బదులు చంక కింద పెట్టుకొని చుడతారు. ఇక్కడో ఇంకో సంగతి ఏంటంటే...ఆర్మ్పిట్ టెక్నిక్‌ను వంటగదిలో కస్టమర్లను చూడటానికి అనుమతిస్తాయి. అంతేకాదు మేము చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇన్ఫోక్షన్స్ రాకుండా డిస్ ఇన్ఫెక్ట్ట్తోశుభ్రంగా ఉండేలా చూసు కుంటామంటూ యజమానులు హామీ ఇస్తున్నారు. ఆర్మ్పిట్ ఒనిగిరి ముద్దలను కొన్ని రెస్టారెంట్లు ఏకంగా 10 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోందీరైస్ బాల్! కొందరు పాజిటివ్‌గా కమెంట్ చేస్తోంటే, మరికొందరు నెగిటివ్ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద రైస్బాల్ తయారీ విధానంపై చర్చ రచ్చ రచ్చగా మారింది.కొందరు కస్టమర్లు వహ్వా అంటూ లొట్టలేసుకొని తింటుంటే మరికొందరు మాత్రం రుచిలో పెద్దగా తేడా రాలేదంటూ పెదవి విరుస్తున్నారట. చెఫ్‌కు ఏదైనా గుప్త రోగం ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది. సాధారణంగా తమకు రైస్‌బాల్స్ అంటే ప్రాణం.. కానీ ఇది అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండి పడుతున్నారు. తాము ఎప్పటికీ ఈ డిష్‌ను ట్రై చేయబోమని తెగేసి చెబుతున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం చంకలో తయారయ్యే చెమటలో ఒక ప్రత్యేకమైన ఫెరోమోన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందట. దీన్ని వాసన చూస్తే లైంగిక ఆకర్షణలు పెంచుతుందని 2013 నాటి అధ్యయనంలో తేలిందట. -
భారత్‌పై జో బైడెన్ షాకింగ్ కామెంట్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్ తమ దేశంలోకి విదేశీ వలసదారులను అనుమతించేందుకు భయపడుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే భారత్ వంటి దేశాల్లో ఆర్థిక అభివృద్ధి వేగంగా లేదని చురకలించారు.కాగా, వాషింగ్టన్లో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో జో బైడెన్ మాట్లాడుతూ.. భారత్, జపాన్, చైనా, రష్యా దేశాలపై విరుచుకుపడ్డారు. ఈ దేశాలు విదేశీ వలసదారులను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు భయపడుతున్నాయి. అందుకే వాటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందకుండా ఇబ్బంది పడుతున్నాయన్నారు. కానీ, అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తుందన్నారు. ఈ కారణంగానే వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తుంటారని చెప్పుకొచ్చారు. Breaking news: "President Joe Biden calls Japan and India ‘xenophobic’ nations that do not welcome immigrants." Joe Biden comes out as a hardline pro-immigrant, pro-open border & pro-Chinese fentanyl President of the US! pic.twitter.com/yyTTHrvSeZ— Tan Vu (@TanVu327031160) May 2, 2024ఈ క్రమంలో భారత్, జపాన్, చైనా, రష్యా దేశాలను ‘జెనోఫోబిక్’ (విదేశీయుల పట్ల విద్వేషం, భయం) దేశాలంటూ విమర్శించారు. ఈ సందర్బంగా అమెరికాను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు బైడెన్. అయితే, ఎన్నికల సందర్బంగా బైడెన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా మిత్ర దేశాలైన భారత్, జపాన్ గురించి బైడెన్ తక్కువ చేసి మాట్లాడం సరికాదని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. అలాగే, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో ఉన్న భారతీయులపై ప్రభావం చూపిస్తాయంటున్నారు. మరోవైపు.. బైడెన్ వ్యాఖ్యలపై వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. ఆయనకు ఆయా దేశాల పట్ల అమితమైన గౌరవం ఉందని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు విశాల దృక్పథంతో చేసినవని చెప్పుకొచ్చింది. బైడెన్ ఎంత గౌరవిస్తారో మా మిత్రదేశాలు, భాగస్వాములకు బాగా తెలుసు. ఆయన అమెరికా గురించి మాట్లాడుతూ.. వలసదారులు దేశానికి ఎంత కీలకమో, వారు ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారో చెప్పారు. ఈ వ్యాఖ్యలను విస్తృత అర్థంలో తీసుకోవాల్సి ఉంటుంది. జపాన్, భారత్‌తో మాకు బలమైన సంబంధాలున్నాయి. మూడేళ్లుగా వాటిని మరింత పటిష్ఠపర్చేందుకు కృషి చేశామని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కరీన్ జీన్ పియర్ వివరించారు. -
రాత మార్చేసిన దుర్ఘటన.. 29 ఏళ్ల వయసులో రిటైర్మెంట్
జపాన్ బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ స్థాయి టోర్నీల నుంచి రిటైర్ అవుతున్నట్లు గురువారం ప్రకటించాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన కారు ప్రమాదం తర్వాత తాను పూర్తిగా కోలుకోలేకపోయానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. కాగా జపాన్‌కు చెందిన 29 ఏళ్ల కెంటో మొమోటా ఒకప్పుడు బ్యాడ్మింటన్ రంగంలో మకుటంలేని మహారాజుగా నీరాజనాలు అందుకున్నాడు. 2019లో ఏకంగా 11 టైటిళ్లు సాధించి సత్తా చాటాడు. ఆ ఏడాది ఆడిన 73 మ్యాచ్‌లలో మొమోటా కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయాడు. అయితే, ఆ మరుసటి ఏడాది మొమోటా కారు ప్రమాదానికి గురయ్యాడు. మలేషియా మాస్టర్స్ టైటిల్ గెలిచిన తర్వాత కౌలలంపూర్ విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో అతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాద ఘటనలో నుజ్జునుజ్జయింది. ఆ కారు డ్రైవర్ చనిపోగా.. మొమోటాకు తీవ్ర గాయాలయ్యాయి. మొమోటా కంటికి బలమైన దెబ్బ తలగడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరో రెండు టైటిళ్లు గెలిచిన మొమోటా.. ఏడాది తర్వాత రెండో కంటి చూపు కూడా మందగించడంతో ఫామ్ కోల్పోయాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. ‘‘కారు ప్రమాదం జరిగిన సమయంలో నేను నా గురించి ఆందోళన చెందలేదని చెప్తే అది అబద్ధమే అవుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. ఆడాలనే తపన ఉన్నా నా శరీరం అందుకు సహకరించడం లేదు. అందుకే ఈ నిర్ణయం. అయితే, ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు’’ అని కెంటో మొమోటా చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్‌గా వెలుగొందిన మొమోటా ప్రస్తుతం 52వ ర్యాంకులో ఉన్నాడు. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన అతడు.. థామస్, ఉబెర్ కప్ తర్వాత ఆటకు దూరం కానున్నాడు. -
స్నేక్ ఎఫెక్ట్.. ఆలస్యమైన బుల్లెట్ రైలు
టోక్యో: జపాన్‌లో బుల్లెట్ రైలు 17 నిమిషాలు ఆలస్యమవడం హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణంగా బుల్లెట్ రైళ్లు నిమిషం ఆలస్యం కాకుండా షెడ్యూల్ ప్రకారం నడుస్తుంటాయి. అయితే అనూహ్యంగా బుల్లెట్ రైలు ఆలస్యమవడానికి ఓ పాము కారణమైంది. పాము రైలుపైకి ఎలా వచ్చిందనేదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సాధారణంగా ఈ రైళ్లలో కొన్ని జంతువులను తీసుకెళ్లడానికి మాత్రం అనుమతి ఉంటుంది. పాములను మాత్రం అనుమతించరు. ప్రయాణికుల లగేజీని మాత్రం చెక్ చేసే నిబంధన లేదు. ఎవరైనా ప్రయాణికుల లగేజీలో పాము వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. జపాన్‌లో బుల్లెట్ రైలు 1964 సంవత్సరంలోనే ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో బుల్లెట్ రైలు నెట్వర్క్ 2700కిలోమీటర్లుగా ఉంది. బుల్లెట్ రైళ్ల ఆలస్యం సగటున నిమిషానికంటే తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం బుల్లెట్ రైలు స్పీడు గంటకు 300 కిలో మీటర్లు. ఇదీ చదవండి.. జపాన్‌కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డు -
జపాన్‌కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డ్!
తూర్పు ఆసియాలోని జపాన్‌కు విదేశీ పర్యాటకులు పోటెత్తారు. గత మార్చి నెలలో 30 లక్షల మందికిపైగా విదేశీయులు జపాన్ను సందర్శించారు. ఒక నెలలో ఇంత మంది పర్యాటకులు రావడం రికార్డు అని ఆ దేశ ప్రభుత్వ డేటా ద్వారా వెల్లడైంది. జపాన్ను గత మార్చి నెలలో మొత్తం 30.8 లక్షల మంది సందర్శించారు. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన పర్యాటకుల సంఖ్యతో పోలిస్తే 69.5 శాతం పెరుగుదల నమోదైంది. కరోనా మహమ్మారి ప్రపంచ పర్యాటకాన్ని దెబ్బతీసే ముందు 2019 మార్చితో పోల్చినప్పటికీ ఈ ఏడాది మార్చి నెలలో 11.6 శాతం పర్యాటకులు పెరిగారని జపాన్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ తెలిపింది. సాధారణంగా పెరుగుతున్న పర్యాటక డిమాండ్‌తోపాటు స్ప్రింగ్ చెర్రీ బ్లూజమ్ సీజన్, ఈస్టర్ విరామం కూడా సందర్శకుల సంఖ్యను పెంచడంలో దోహదపడింది. జపాన్ను సందర్శించిన విదేశీ పర్యాటకులలో ఎక్కువ మంది భారత్, జర్మనీ, తైవాన్, యునైటెడ్ స్టేట్స్ దేశాలకు చెందినవారు కావడం గమనార్హం. కోవిడ్ పరిమితులు ఎత్తేసినప్పటి నుంచి జపాన్ పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. సందర్శకుల సంఖ్యను పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. -
అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!
ఎన్నో విలాసవంతమైన వస్తువులను చూసుంటాం. వాచ్‌ల దగ్గర నుంచి హ్యండ్ బ్యాగ్‌లు, వ్యాలెట్ వరకు అత్యంత ఖరీదు పలికిన బ్రాండ్లు చూశాం. ఓ సాధారణ టీ కప్పు అత్యంత ఖరీదైనదిగా ఉంటుందంటే నమ్ముతారా. మహా అయితే రూ. 30 వేల నుంచి రూ. లక్ష రూపాయాల విలవు చేసే ప్రత్యేకమైన మెటీరియల్‌తో చేసి ఉండొచ్చు. అంతేగానీ మరీ ఇంత రేంజ్లో ధర ఉండదు. అంత ఖరీదైన టీకప్పు ఎక్కడ ఉందంటే.. జపనీస్ డిపార్ట్మెంట్ స్టోర్ చైన్ తకాషిమయాలో అత్యంత ఖరీదైన టీ కప్పు ఉంది. దీని ధర ఏకంగా రూ. 56 లక్షలు. దీన్ని స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంలో తయారు చేశారట. అమ్మకానికి వివిధ బంగారు వస్తువులను ప్రదర్శనగా ఉంచగా ఈ టీకప్పు దురదృష్టవశాత్తు అపహరణకు గురయ్యింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ వస్తువుని జేబులో వేసుకుని పారిపోతున్నట్లు వీడియో ఫుటేజ్‌లో కనిపించింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. ఈ ప్రదర్శనలో దాదాపు వెయ్యికి పైగా టీవేర్ టేబుల్ వేర్ వంటి కళఖండాలు ఉన్నాయని, వాటిల్లో ఈ టీ కప్పు త్యంత ఖరీదైనదని అన్నారు తకాషిమయా స్టోర్ ప్రతినిధి. "తాము ఆ వస్తువులను అమ్మకానికి పారదర్శకమైన అన్‌లాక్ పెట్టేలో ఉంచామని, దీన్ని పసిగట్టిన కస్టమర్లు సులభంగా బయటకు తీసి ఉండొచ్చు. సీసీఫుటేజ్‌లో ఓ వ్యక్తి టీ కప్పుని తన బ్యాగ్‌లో వేసుకుని పారిపోతున్నట్లు మేము చూశాం. ప్రస్తుతం పోలీసులు సదరు వ్యక్తి కనిపెట్టే పనిలో ఉన్నారు. అయినప్పటకీ తమ స్టోర్ అమ్మకాల ప్రదర్శన నిరాటకంగా కొనసాగుతుందని, పైగా భద్రతను కూడా మరింత పటిష్టం చేస్తామని చెప్పారు." స్టోర్ ప్రతినిధులు. (చదవండి: చిచ్చర పిడుగు!..తొమ్మిదేళ్లకే ఏకంగా 75 కిలోలు..!) -
Japan Earthquake: జపాన్‌లో కంపించిన భూమి..
టోక్యో: తైవాన్ భూకంప ఘటన మరువకముందే తాజాగా జపాన్‌లో భూమి కంపించింది. గురువారం ఉదయం హోన్షు తూర్పు తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. దీంతో, రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. కాగా, తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. బుధవారం తైవాన్‌లో భూకంపం వచ్చిన మరుసటి రోజే నేడు జపాన్‌లో భూమి కంపించింది. హోన్షు తూర్పు తీరంలో రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. భూమికి 32 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం తెలియరాలేదు. జపాన్ రాజధాని టోక్యోలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 🚨🇯🇵 BREAKING: 6.3 magnitude earthquake near the east coast of Japan pic.twitter.com/Ro97HguPVZ — Kacee Allen 🇺🇸 (@KaceeRAllen) April 4, 2024 ఇదిలా ఉండగా.. తైవాన్‌లో బుధవారం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ క్రమంలో 25 ఏండ్లలో అతి పెద్ద భూకంపం ఇదే అని స్థానిక అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం ధాటికి తైవాన్ రాజధాని తైపీ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు బీటలు వారాయి. A dog sensed an earthquake in Taiwan seconds before it happened and alerted its owner..🐕🐾😳#Taiwan #Tsunami #Japan #TaiwanEarthquake #earthquake pic.twitter.com/10SdmUDENd — Zainab Fatima (@ZainabFati18) April 4, 2024 తైవాన్‌లో భూకంపం సందర్భంగా చిన్నారులను కాపాడిన నర్సులు.. ⚡️Nurses in a #Taiwan Hospital protecting babies during #earthquake.#Taiwan #earthquake #Japanpic.twitter.com/rF5It43iYO — Tajamul (@Tajamul132) April 4, 2024 -
J-బ్యూటీకి సై అంటున్న యువత, అసలేంటీ జే బ్యూటీ?
చర్మం జిడ్డుగా లేకుండా ఉండడానికి ఏంచేయాలి? కంటి కింద నల్ల వలయాలను ఎలా తప్పించాలి? ఎండ నుంచి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి? చర్మం మెరవాలంటే ఏం చేయాలి? చర్మసంరక్షణ నుంచి సౌందర్యం వరకు సందేహాల సముద్రంలో ఈదులాడుతున్న యువతరానికి నిన్నా మొన్నటి వరకు ‘కె–బ్యూటీ’ లేదా కొరియన్ బ్యూటీ చుక్కానిగా కనిపించింది. అయితే ఇప్పుడు యూత్ దృష్టి జె–బ్యూటీ(జపనీస్ బ్యూటీ)పై మళ్లింది. ఇది జపాన్ బ్యూటీ బ్రాండ్ల మార్కెటింగ్ మాయాజాలమా? సహజమైన పరిణామమా? అనే చర్చను పక్కనపెడితే ‘జె–బ్యూటీ’లోని సహజత్వాన్ని, వాబీ–సాబీ తత్వాన్ని యువతరం బాగా ఇష్టపడుతోంది... మృదువైన చర్మం కోసం కలలు కనే యువతరానికి చిరపరిచితమైన ట్రెండ్ కె–బ్యూటీ( కొరియన్–బ్యూటీ) బ్యూటీ ఇండస్ట్రీపై భారీ ప్రభావాన్ని చూపించింది. మైండ్ – బాగ్లింగ్ ప్రొడక్ట్స్, మల్టీ–స్టెప్ రొటీన్స్‌తో ‘కె–బ్యూటీ’ గ్లోబల్ సెన్సేషన్‌గా నిలిచింది. యువ ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకుంది. తాజా విషయానికి వస్తే ‘జె–బ్యూటీ’ లేదా జపనీస్ బ్యూటీ యువతరం ఫేవరెట్‌గా మారింది. ‘పవర్ఫుల్ సిస్టర్ ఆఫ్ కె–బ్యూటీ’ గా పేరు తెచ్చుకున్న ‘జె–బ్యూటీ’ కె–బ్యూటీని అధిగమించేలా దూసుకుపోతోంది. ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిసి జపనీస్ బ్యూటీ బ్రాండ్లు కలిసి పనిచేయడం కూడా మన దేశంలో ‘జె–బ్యూటీ’ పాపులారిటీకి కారణం అయింది. ‘జె–బ్యూటీ’కి ఎందుకు ఇంత పాపులారిటీ వచ్చింది... అనే విషయానికి వస్తే... నిపుణుల మాటల్లో చెప్పాలంటే...‘జె–బ్యూటీ’లోని ప్రధాన ఆకర్షణ సింప్లిసిటీ, ఎఫెక్టివ్‌నెస్. ‘ప్రివెన్షన్ రాదర్ దేన్ కరెక్షన్ ’ తత్వంతో కూడిన ఈ విధానం హ్యాపీగా, హెల్తీగా ఉండేలా చర్మ సంరక్షణతో΄ాటు పర్యావరణ ఒత్తిళ్ల నుంచి రక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది, గ్రీన్ టీ, రైస్ బ్రాన్, సీవీడ్లాంటి ΄ ఇన్‌గ్రేడియెంట్స్ ‘జె–బ్యూటీ’లో భాగం అయ్యాయి. ‘ఘుమఘుమలతో కూడిన ఖరీదైన వంటకాల కంటే సాదాసీదా పప్పన్నం ఎంచుకోవడం లాంటిదే జె–బ్యూటీ. దీనిపై జపనీస్ తత్వం వాబీ–సాబీ ప్రభావం ఉంది. ఇంపర్ఫెక్షన్, సింస్లిపిటీ నుంచి అందాన్ని దర్శించడమే వాబీ –సాబీ తత్వం. జె–బ్యూటీ ప్రాథమికంగా రెండు విషయాలపై దృష్టి పెడుతుంది. వర్తమానంలో చర్మ సౌందర్యం. రెండోది భవిష్యత్తులో చర్మ సమస్యలు రాకుండా నివారించడం’ అంటుంది ముంబైకి చెందిన డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శిఖా షా. జపనీస్ కల్చర్ అండ్ లైఫ్‌స్టైల్‌పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరగడం కూడా మన దేశంలో ‘జె–బ్యూటీ’పై ఆసక్తి కలిగించే కారణాలలో ఒకటి. ‘ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం 11–12 స్టెప్ స్కిన్‌కేర్ రొటిన్ అవసరం అనే అ΄ోహను జె– బ్యూటీ బ్రేక్ చేసింది’ అంటుంది డాక్టర్ మోనికా బాంబ్రూ. ‘కె–బ్యూటీ’తో పోల్చితే ‘జె–బ్యూటీ’ని ప్రత్యేకంగా ఉంచుతున్నదేమిటి? అనే విషయానికి వస్తే... చర్మసంరక్షణ విషయంలో రెండిటికీ పేరు ఉన్నప్పటికీ వాటి విధానాలు, తత్వం వేరు. ‘కె–బ్యూటీ’ అనేది ఇన్నోవేషన్, ఎక్స్పెరిమెంటేషన్పై దృష్టి పెడుతుంది. మల్టీ–స్టెప్ రొటిన్స్, ట్రెండ్–డ్రైవన్ ఫార్ములేషన్స్ ఉంటాయి. ఇక ‘జె–బ్యూటీ’ అనేది సింప్లిసిటీ, మినిమలిజం, సహజపదార్థాలపై దృష్టి పెడుతుంది. ‘జె–బ్యూటీకి తిరుగులేదు’ అని అంటుంది ముంబైకి చెందిన అద్విక శ్రీవాస్తవ. ‘జె–బ్యూటీ’పై కొండంత ఇష్టంలోనూ ఆచితూచి ఆలోచించేవారు లేకపోలేదు. ఇందుకు ఉదాహరణ బెంగళూరుకు చెందిన చైత్ర. ‘కె–బ్యూటీతో పోల్చితే జె–బ్యూటీ ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలా అని వేలంవెర్రిగా జె–బ్యూటీ ప్రొడక్ట్స్ కొనాలనుకోవడం లేదు. జె–బ్యూటీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటుంది చైత్ర. క్లీన్ బ్యూటీ ట్రెండ్ గతంలో పోల్చితే జపనీస్ బ్యూటీ కంపెనీలపై యువత ఆసక్తి పెరిగింది. దీనికి అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు మారుతున్నాయి...అంటుంది గ్లోబల్ డేటా ర రిపోర్ట్ ‘కె–బ్యూటీ అనేది ట్రెండీ ఇన్‌గ్రేడియెంట్స్, ఆకర్షణీయమైన ప్యాకింగ్, క్విక్ రిజల్ట్కు ప్రాధాన్యత ఇస్తుంటే జె–బ్యూటీ ఇందుకు భిన్నంగా సహజమైన పదార్థాలతో శాశ్వత ప్రభావంపై దృష్టి పెడుతుంది’ అంటున్నాడు ‘గ్లోబల్ డేటా’ కన్జ్యూమర్ అనలిస్ట్ మణి భూషణ్ శుక్లా. ‘సహజ’ ‘సేంద్రియ’ ‘అలెర్జీరహిత’ మాటలతో ‘జె–బ్యూటీ’ ‘క్లీన్ బ్యూటీ’ ట్రెండ్‌గా పేరు తెచ్చుకుంది. -
Japan eVisa: జపాన్ టూర్ ఇక ఈజీ!
జపాన్ను సందర్శించాలనుకునే భారతీయులు ఇకపై తమ పాస్‌పోర్ట్‌లపై భౌతిక వీసా స్టిక్కర్లను పొందాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 1 నుండి, జపాన్ భారతీయ పర్యాటకుల కోసం ఈ-వీసాల జారీని ప్రారంభించింది. పర్యాటకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ జపాన్ ఈ-వీసా ప్రోగ్రామ్.. వీఎఫ్ఎస్ గ్లోబల్ ద్వారా నిర్వహిస్తున్న జపాన్ వీసా దరఖాస్తు కేంద్రాల ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీసాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ వీసా ప్రోగ్రామ్ ప్రత్యేకంగా పర్యాటక ప్రయోజనాల కోసం సింగిల్-ఎంట్రీ స్వల్పకాలిక వీసాను అందిస్తుంది. జపాన్‌లో గరిష్టంగా 90 రోజుల పాటు ఉండేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశంలో నివసిస్తున్న భారతీయ పౌరులు, విదేశీ పౌరులు ఈ ఈ-వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీసా కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు కొత్త విధానం ప్రకారం.. పర్యాటకులు తమ దరఖాస్తులను మునుపటి ప్రక్రియ మాదిరిగానే వీఎఫ్ఎస్ గ్లోబల్ నిర్వహించే వీసా దరఖాస్తు కేంద్రాలకు సమర్పించాలి. అయితే తమ పాస్‌పోర్ట్‌లకు సాంప్రదాయ వీసా స్టిక్కర్‌ను అతికించుకునేందుకు వీసా కేంద్రానికి వెళ్లాల్సిన పని లేదు. విజయవంతమైన దరఖాస్తుదారులకు నేరుగా వారి ఫోన్‌కే ఎలక్ట్రానిక్ వీసా వస్తుంది. ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తమ ఫోన్లలో "వీసా జారీ నోటీసు"ని చూపించాలి. ఈ దశకు ఇంటర్నెట్ యాక్సెస్ అవసరమని గమనించడం ముఖ్యం. డిజిటల్ వీసా జారీ నోటీసు కాకుండా పీడీఎఫ్, ఫోటో, స్క్రీన్‌షాట్ లేదా ప్రింటెడ్ కాపీలను అనుతించరు. 🚨 Japan begins issuing e-visas for Indian tourists, offering a 90 day stay for tourism purposes. 🇯🇵🇮🇳 pic.twitter.com/rhwml8dvF3 — Indian Tech & Infra (@IndianTechGuide) April 3, 2024 -
తైవాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7. 4 తీవ్రత.. సునామి హెచ్చరికలు జారీ
తైపీ: తైవాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేల్‌లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. తైవాన్‌లో హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తీ, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో తైవాన్ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో జనాలు రోడ్లమీదకు వచ్చారు. ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. జపాన్ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింద. తైవాన్‌లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక.. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్ ప్రజలు మృత్యువాత పడ్డారు. -
వీడియోలు: భూకంపంతో తల్లడిల్లిన తైవాన్.. సునామీ హెచ్చరిక జారీ
తైపీ: తైవాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేల్‌లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. తైవాన్‌లో హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల వివిధ ప్రాంతాల్లో 7 మంది మృతి చెందగా.. సుమారు 730 మంది గాయపడినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఆస్తి నష్టం జగరినట్లు సమాచారం. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గత 25 ఏళ్లలో ఇదే భారీ భూకంపమని అధికారులు తెలిపారు. 🚨🇹🇼 Building Collapse in Taiwan Due to Earthquakes | Visible Structural Damage Source: @northicewolf https://t.co/cpytWyIx4y pic.twitter.com/Qc0XS4ZXXx — Mario Nawfal (@MarioNawfal) April 3, 2024 మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిపడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో తైవాన్ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో జనాలు రోడ్లమీదకు వచ్చారు. ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. జపాన్ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింద. తైవాన్‌లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక.. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్ ప్రజలు మృత్యువాత పడ్డారు. JUST IN: 7.5 magnitude earthquake strikes Taiwan, rocking the whole island and even causing several buildings to collapse. The earthquake triggered a tsunami warning of up to 10 feet from Japan. "Tsunami is coming. Please evacuate immediately. Do not stop. Do not go back,"… pic.twitter.com/E1783aoN3k — Collin Rugg (@CollinRugg) April 3, 2024 భూకంపం కారణంగా తైవాన్ రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లు వచ్చాయి. జపాన్‌లోని కొన్ని దీవుల్లో పెద్ద ఎత్తున ఆస్తీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. భూప్రకంపనాలు సంభవిస్తున్న సమయంలో ఓ స్విమ్మింగ్ పూల్ నీళ్లు.. సముద్రంలో అలల్లా స్విమింగ్ పూల్‌లో అలజడికి గురయ్యాయి. స్మిమింగ్‌పూల్ ఉన్న భయభ్రాంతులకు గురయ్యాడు. దీనికిసంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. This is not just another funny video on social media. These visuals capture the scary moment a 7.4 earthquake hit Taiwan, even affecting a swimming pool. Prayers for Taiwan & Japan. 🙏 #Taiwan #Japan pic.twitter.com/iuGtutTeMo — Prayag (@theprayagtiwari) April 3, 2024 -
గీతా ప్రెస్‌కు జపాన్ యంత్రం.. ముద్రణ మరింత వేగవంతం!
యూపీలోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ గురించి అందరికీ తెలిసిందే. పలు భాషల్లో ఇక్కడ ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రచురిస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 70 వేల పుస్తకాలు ముద్రతమవుతాయంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. గీతా ప్రెస్‌లో పుస్తకాలను వేగంగా ముద్రించేందుకు యంత్రాలను వినియోగిస్తుంటారు. ఇందుకోసం తాజాగా జపాన్ నుంచి కొమోరి యంత్రాన్ని ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ యంత్రం ఏర్పాటుతో గీతా ప్రెస్‌లో మరింత వేగంగా అత్యధిసంఖ్యలో పుస్తకాలను ముద్రించవచ్చు. మరో 10 రోజుల్లో ఈ యంత్రాన్ని పూర్తిస్థాయిలో అమర్చనున్నారు. జపాన్ నుంచి తెచ్చిన ఈ యంత్రంలో పాటు బెంగళూరు నుంచి తీసుకువచ్చిన వెల్వూండ్ మెషీన్‌ను కూడా ఇక్కడ వినియోగించనున్నారు. ఈ యంత్రం ద్వారా బైండింగ్ పనులు మరింత వేగవంతం కానున్నాయి. జపాన్ నుంచి తెచ్చిన కొమోరీ మెషిన్ సాయంతో కలర్ ప్రింటింగ్ పనులు వేగంగా చేసే అవకాశం లభిస్తుంది. అలాగే పుస్తకాల కవర్ పేజీలను రంగుల్లో ముద్రించవచ్చు. ఈ యంత్రం ద్వారా ఒక గంటలో 15 వేల కలర్ పేజీలను ముద్రించవచ్చు. -
మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది: రాజమౌళి
దర్శకధీరుడు ప్రస్తుతం జపాన్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్‌లోనూ రిలీజ్ చేశారు. గతేడాది ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఈ చిత్రాన్ని జపాన్‌లో 100 ఏళ్లనాటి పురాతన మ్యూజికల్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా పంచుకున్నారు. రాజమౌళి ట్విటర్లో రాస్తూ.. 'ఆర్ఆర్ఆర్ సినిమాను 110 ఏళ్ల నాటి తకరాజుకా సంస్థ నిర్వహించే మ్యూజికల్ థియేటర్లో ప్రదర్శించడం విశేషం. ఆర్ఆర్ఆర్ చిత్రంలాగే ఈ మ్యూజికల్ షోపై కూడా ప్రేమ చూపిన జపనీస్ ఆడియన్స్‌కు ధన్యవాదాలు. మీ రెస్పాన్స్ చూస్తే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ షోలో మీ శక్తి, ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈ ఈవెంట్లో భాగమైన అమ్మాయిలను అభినందించకుండా ఉండలేకపోతున్నా' అని రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ దర్శకధీరుడి అభినందిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్‌బాబుతో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను అందించారు. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్ పెట్టాలనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్గా.. హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ కీలకపాత్ర పోషించనున్నారని కూడా టాక్ నడుస్తోంది. Its an honour that our RRR has been adapted as a musical by the 110 year old Takarazuka company. Thank you Japanese audience for embracing the Broadway play of RRR just like the film itself. Overwhelmed by your response... Can't appreciate all the girls enough for your energy,… pic.twitter.com/QbfLPmsJxC — rajamouli ss (@ssrajamouli) March 22, 2024 -
రాజమౌళి తనయుడి ట్వీట్.. నెటిజన్స్ ఆగ్రహం!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం ప్రస్తుతం జపాన్‌లో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' స్క్రీనింగ్ కోసం వారు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ అక్కడ స్వల్ప భూకంపం వచ్చిందని ఆయన కుమారుడు కార్తికేయ తన ఎక్స్ ఖాతాలో ఫోస్ట్ చేశాడు. జపాన్‌లో ఒక భారీ బిల్డింగ్ 28వ ఫ్లోర్లో ఉన్నామని ఎందుకో బిల్డింగ్ కదులుతున్నటుగా అనిపించిందని కార్తికేయ రాసుకొచ్చాడు. కానీ కొంత సమయం తర్వాత అది భూకంపం వల్ల అలా జరిగినట్లు తెలిసి చాలా భయపడ్డానని ఆయన తెలిపాడు. మొదటిసారిగా భూకంపం ద్వారా కలిగే అనుభూతిని పొందానని రాసుకొచ్చారు. మండిపడ్డ నెటిజన్స్.. అయితే ఇది చూసిన నెటిజన్స్ ఎస్ఎస్ కార్తికేయ తీరుపై మండిపడుతున్నారు. భూకంపం అంటే అదేమైనా జోక్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మరో నెటిజన్ రాస్తూ భూకంపం అనేది నీ బకెట్ లిస్ట్‌లో ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సెన్సిటివ్ విషయాన్ని ఫన్నీగా ట్వీట్ చేయడంపై కార్తికేయపై మండిపడుతున్నారు. అలాగే ఇండియా బోర్డర్‌కు వెళ్లి బాంబుల మోత కూడా ఆస్వాదించు అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ఏదేమైనా కార్తికేయ భూకంపంపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలోను ఊపేస్తోంది. Felt a freaking earthquake in Japan just now!!! Was on the 28th floor and slowly the ground started to move and took us a while to realise it was an earthquake. I was just about to panic but all the Japanese around did not budge as if it just started to rain!! 😅😅😅😅😅… pic.twitter.com/7rXhrWSx3D — S S Karthikeya (@ssk1122) March 21, 2024 Experiencing an Earthquake is in your bucket list ? Weird — RAVI SANKAR GARIMELLA (@ravis_g239) March 21, 2024 Experience an earthquake box ticked. ✅ --> WTF 😒 😒 — KK (@krishjlk) March 21, 2024 Pls go to Indian border and EXPERIENCE A BOMB BLAST also ... Tick it bro — KK (@krishjlk) March 21, 2024 -
మహేశ్ బాబును ఇక్కడికి తీసుకొస్తాను: రాజమౌళి
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో రానున్న బిగ్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. తాజాగా ఇదే విషయాన్ని జక్కన్న తెలిపారు. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న రాజమౌళి SSMB29 సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ఆస్కార్ అవార్డుతో RRR గుర్తింపు తెచ్చుకుంది. తెలుగువారికి ఎంతో గర్వకారణంగా ఈ చిత్రం నిలిచింది. తాజాగా జపాన్‌లో ఈ మూవీ స్క్రీనింగ్‌కు రాజమౌళి హజరయ్యారు. అక్కడ మన జక్కన్న క్రేజ్ మామూలగా లేదు. ఆయనపై ఎనలేని అభిమానాన్ని అక్కడి ప్రజలు చూపించారు. ఈ క్రమంలో తన తర్వాతి ప్రాజెక్ట్ అయిన SSMB29 గురించి ఆయన మాట్లాడారు. 'మహేశ్ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. SSMB29 ప్రాజెక్ట్‌కు సంబంధించి కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరో మహేశ్ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుషా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను.' అని జపాన్‌లో జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఆయన మాటలను సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తున్నారు. SSR about #SSMB29 We've finished writing and are now in pre-production. Only the, protagonist SuperStar @urstrulyMahesh , is confirmed and he's incredibly handsome. Hoping to expedite the filming process and have him join us for promotion during the release #MBSSR pic.twitter.com/JZAx3oP6cu — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2024 -
ఆ దేశంలో రాజమౌళి క్రేజే వేరు.. ఏకంగా 83 ఏళ్ల వృద్ధురాలు!
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. నాటునాటు అనే సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. అంతే కాకుండా ఈ సినిమాను విదేశాల్లోనూ రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇండియన్ సినిమాలకు ఆదరణ ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. జపాన్ అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమాను ఏకంగా జపనీస్లోనూ రిలీజ్ చేశారు. అక్కడ రాజమౌళి సినిమాకు పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇటీవల జపాన్ వెళ్లిన రాజమౌళికి ఓ మహిళ అభిమాని అరుదైన కానుక అందజేశారు. దాదాపు 83 ఏళ్ల వద్ధురాలు దర్శకధీరుడు రాజమౌళికి బహుమతులను అందజేసింది. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. రాజమౌళి ట్విటర్లో రాస్తూ..'జపాన్‌లో ఓరిగామి క్రేన్లను తయారు చేస్తారు. వారికిష్టమైన వారి ఆరోగ్యం కోసం బహుమతిగా ఇస్తారు. ఈ 83 ఏళ్ల వృద్ధురాలు మమ్మల్ని ఆశీర్వదించడానికి అలాంటివీ 1000 తయారు చేసింది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఆమెను సంతోషపెట్టింది. ఆమె ఇప్పుడే బహుమతి పంపింది. చలిలో బయట వేచి ఉంది. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ తిరిగి ఇవ్వలేం. అది గ్రేట్ అంతే.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం మహేశ్ బాబుతో చేయనున్నారు. In Japan, they make origami cranes &gift them to their loved ones for good luck& health. This 83yr old woman made 1000 of them to bless us because RRR made her happy. She just sent the gift and was waiting outside in the cold.🥹 Some gestures can never be repaid. Just grateful🙏🏽 pic.twitter.com/UTGks2djDw — rajamouli ss (@ssrajamouli) March 18, 2024 -
మహానగరాన్ని వణికిస్తున్న పిల్లి!
ఓ పిల్లి కారణంగా ఒక మహానగరం వణికిపోతోంది. ఎప్పుడు.. ఏం వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణం.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడ్డాక అక్కడి నుంచి కనిపించకుండా పోవడమే. దీంతో ఆ పిల్లి క్యాన్సర్ కారక రసాయనాన్ని అంతటా వెదజల్లుతుందనే భయం ఆ నగరంలో నెలకొంది. జపాన్ హిరోషిమాలోని ఫుకుయామా అధికారులు ఆ పిల్లిని వెదికేందుకు పెట్రోలింగ్‌ను మరింతగా పెంచారు. ఆ పిల్లి ఎక్కడ కనిపించినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు. కాగా ఆ పిల్లి చివరిగా రసాయన కర్మాగారం నుండి బయటపడినట్లు భద్రతా ఫుటేజీలో కనిపించింది. ఒక కార్మికుడు ఆ పిల్లి పంజా గుర్తులను గమనించి, దానిని ఉన్నతాధికారులకు తెలిపాడు. ఆ పిల్లికి అంటుకున్న రసాయనం అత్యంత ప్రమాదకరం. దానిని ముట్టుకున్నా లేదా పీల్చినా వెంటనే శరీరంపై దద్దుర్లు, వాపు వచ్చి, తీవ్ర వ్యాధికి దారితీస్తుంది. ఫుకుయామా సిటీ హాల్లోని ఒక అధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆ పిల్లి కోసం వెదకగా, ఇంకా దాని జాడ తెలియలేదన్నారు. అది సజీవంగా ఉందా లేదా అనేది కూడా సందేహాస్పదంగా ఉందన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ అకిహిరో కొబయాషి మాట్లాడుతూ కర్మాగారంలో రసాయన వ్యాట్‌ను కప్పి ఉంచే షీట్ పాక్షికంగా చిరిగిపోయిందని తెలిపారు. దానిలో పిల్లి పడి, తరువాత ఎటో వెళ్లిపోయిందని, దానికోసం తమ సిబ్బంది వెదుకుతున్నారని చెప్పారు. స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన రసాయన ప్రమాద అంచనాలో నిపుణురాలు లిండా షెంక్ మాట్లాడుతూ సాధారణంగా పిల్లులు తమ బొచ్చును నాకుతుంటాయని, ఈ విధంగా చూస్తే ఆ పిల్లి ఇప్పటికే ఆ రసాయన్నాన్ని నాకి, చనిపోయివుంటుందన్నారు. -
గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే పేలిన జపాన్ తొలి ప్రైవేటు రాకెట్..!
టోక్యో: వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. బుధవారం ఉదయం కుషిమోటో పట్టణంలోని లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి బయల్దేరిన దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ కైరోస్ లాంచ్ అయిన కొద్ది సెకన్లలోనే పేలిపోయింది. ఈ రాకెట్ నింగిలోకి ఎగిరితే జపాన్ చరిత్రలోనే తొలి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి ఎగిరిన రికార్డు క్రియేట్ అయ్యేది. JUST IN: Space One rocket in Japan explodes after takeoff during its “inaugural launch.” The Kairos rocket was attempting to make Space One the first Japanese company to put a satellite in orbit. (Reuters) The 59 ft, four-stage solid-fuel rocket was launched from the Kii… pic.twitter.com/BJAAWXGsCy — Collin Rugg (@CollinRugg) March 13, 2024 ఈ రాకెట్‌ను స్పేస్ వన్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. 59 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్ రాకెట్ ప్రభుత్వానికి చెందిన సాటిలైట్ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. రాకెట్ పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ రాకెట్ మార్చ్ 9వ తేదీనే లాంచ్ కావల్సి ఉండగా పలు కారణాల వల్ల లాంచింగ్ వాయిదాపడింది. రాకెట్ పేలిపోవడంతో స్పేస్ వన్ కంపెనీ షేర్లు జపాన్ స్టాక్మార్కెట్లో ఒక్కరోజే 13 శాతం పడిపోయాయి. ఇదీ చదవండి.. చైనాలో భారీ పేలుడు -
ఇన్నేళ్లకు కల నిజమైంది: రష్మికా మందన్నా
చిన్ననాటి కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందంటున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. జపాన్‌లోని టోక్యోలో జరిగిన ఎనిమిదో ఎడిషన్ ‘క్రంచీ రోల్ అనిమే’ అవార్డ్స్ ఫంక్షన్‌కు అతిథిగా వెళ్లారు రష్మిక. విజేతలకు అవార్డులను అందజేశారు. జపాన్‌కు వెళ్లడం పట్ల రష్మికా మందన్నా ఈ విధంగా స్పందించారు.‘‘నా చిన్నతనంలో జపాన్‌కు వెళ్లాలనే కల ఉండేది. అయితే అది అసాధ్యం అనుకున్నాను. కానీ ఇన్నేళ్లుగా జపాన్‌కు వెళ్లాలనే కల మాత్రం అలానే ఉంది. ఇప్పుడు అది సాధ్యమైనందుకు సంతోషంగా ఉంది. కొన్నేళ్ల నా కల నిజమైంది. జపాన్‌లోని ఆహారం, వాతావరణం, ఇక్కడి ప్రజలు నాపై చూపించిన ప్రేమ, ఆదరణ నాకు ఆనందాన్నిచ్చాయి. జపాన్ నాకు ఇప్పుడు చాలా స్పెషల్’’ అని ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు రష్మిక. ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ‘పుష్ప 2’, ధనుష్ ‘డీఎన్ఎస్’ (వర్కింగ్ టైటిల్), హిందీ ‘ఛావా’లో హీరోయిన్గా నటిస్తున్నారామె. అలాగే ‘ది గాళ్ ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ అనే ఉమెన్‌సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు రష్మికా మందన్నా. -
Rashmika Mandanna: జపాన్‌లో రష్మిక.. భారత్ నుంచి మొట్టమొదటి సెలబ్రిటీ (ఫోటోలు)
-
March-3: జపాన్ ‘హినామత్సురి’ వేడుక ప్రత్యేకత ఏంటో తెలుసా!
మన దేశంలో కొన్నిచోట్ల ఏటా దసరా నవరాత్రుల సందర్భంగా ఇళ్లల్లో బొమ్మల కొలువులు పెట్టడం, వాటిని చూడటానికి బంధుమిత్రులను ఆహ్వానించడం ఆచారంగా ఉంది. జపాన్‌లో కూడా ఇలాంటి ఆచారమే ఉండటం విశేషం. జపాన్‌లో ఏటా మార్చి 3న ‘హినామత్సురి’ పేరుతో బొమ్మల కొలువుల వేడుకను జరుపుకొంటారు. జపాన్‌లోని షింటో మతస్థులు ఏటా జరుపుకొనే ఐదు రాచవేడుకల్లో ఇదొకటి. ఇదివరకు చైనీస్ కేలండర్ లెక్కల ప్రకారం ప్రతిఏటా మూడో నెలలోని మూడో రోజున ఈ వేడుకను జరుపుకొనేవారు. ఇంగ్లిష్ కేలండర్ వాడుక అలవాటైన తర్వాత ఈ వేడుకను మార్చి 3న జరుపుకోవడం మొదలు పెట్టారు. ‘హినామత్సురి’ వేడుకను ‘డాల్స్ ఫెస్టివల్’ అని, ‘గర్ల్స్ ఫెస్టివల్’ అని కూడా అంటారు. ఈ వేడుకలో ఇళ్లల్లో బొమ్మల కొలువు పెట్టడానికి అంచెలంచెలుగా వేదికను ఏర్పాటు చేసి, దానిపై ఎర్రని తివాచీ పరిచి, చక్కగా అలంకరించిన బొమ్మలను కొలువులో పెడతారు. ఈ బొమ్మల కొలువులో జపాన్ చక్రవర్తి, మహారాణి బొమ్మలతో పాటు రాచప్రాసాదంలో సంగీత వాద్యాలను వాయించేవారు, నృత్యం చేసేవారు సహా రకరకాల పనులు చేసేవారి బొమ్మలను సంప్రదాయబద్ధంగా పెడతారు. వీటితో పాటు ఆధునిక జీవనశైలిని ప్రతిబింబించే బొమ్మలను కూడా కొలువులో పెడతారు. ఈ కొలువుల్లో బొమ్మలను అమర్చడంలో ఒక క్రమాన్ని, పద్ధతిని పాటిస్తారు. ఈ బొమ్మల కొలువులను ఏర్పాటు చేయడంలో సందడంతా అమ్మాయిలదే! ఐదు అంచెల్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేయడానికి దాదాపు 1500–2500 డాలర్ల (రూ.1.24 లక్షల నుంచి రూ. 2.07 లక్షలు) వరకు ఖర్చు చేస్తారు. ఇళ్లల్లో బోషాణాల్లోను, బీరువాల్లోను దాచిపెట్టిన బొమ్మలను ఈ వేడుక కోసం బయటకు తీసి, వాటిని శ్రద్ధగా అలంకరిస్తారు. వేడుక మరుసటి రోజునే ఈ బొమ్మలను కొలువు నుంచి తీసేసి యథాప్రకారం దాచేస్తారు. వేడుక ముగిసినా బొమ్మలను తీసి దాచేయకుంటే, ఇళ్లలోని అమ్మాయిలకు ఆలస్యంగా పెళ్లి జరుగుతుందని షింటో మతస్థుల నమ్మకం. సంప్రదాయ ప్రకారం ఈ బొమ్మల కొలువులను కనీసం ఐదు అంచెల్లో ఏర్పాటు చేస్తారు. సంపన్నులైతే, ఏడు అంచెల్లో కూడా బొమ్మల కొలువులు పెడతారు. ఈ ఆచారం పదిహేడో శతాబ్ది నుంచి కొనసాగుతోంది. అప్పటి జపాన్ యువరాణి మీషో పీచ్ ఫెస్టివల్ సమయంలో తొలిసారిగా బొమ్మల కొలువును ఏర్పాటు చేసింది. బొమ్మల కొలువులను ఏర్పాటు చేసిన వారు ఇళ్లకు అతిథులను ఆహ్వానించి విందు భోజనాలు పెడతారు. ఇవి చదవండి: ఈ 'గాడ్జెట్'.. రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా.. -
‘హషిమా’ దీవి.. ఈ చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది!
విమానంలో వెళుతూ పైనుంచి చూస్తే, ఈ దీవి యుద్ధనౌకలా కనిపిస్తుంది. అలాగని, ఇదేమీ పర్యాటకులను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన దీవి కాదు. దీని వెనుకనున్న చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. ప్రస్తుతం జపాన్‌లోని నాగసాకి నగరం పరిధిలోనున్న ‘హషిమా’ అనే ఈ దీవిని ఒకప్పుడు యుద్ధఖైదీల బందిఖానాగా ఉపయోగించేవారు. వేలాదిమంది చైనీస్, కొరియన్ ఖైదీలను ఈ దీవిలో నిర్బంధించేవారు. ఇక్కడ బొగ్గు నిల్వలు బయటపడటంతో రెండో ప్రపంచయుద్ధం ముగిసిన కొన్నేళ్ల వరకు ఖైదీలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ, బొగ్గు నిల్వలను వెలికితీసేవారు. బొగ్గు గనులు మొదలయ్యాక ఇక్కడ ఇళ్లు, స్కూళ్లు వెలిశాయి. వాటితో పాటే ఒక ఆలయం, షాపింగ్ సెంటర్ ఏర్పడ్డాయి. ఈ దీవిలో తొలిసారిగా 1887లో బొగ్గు నిల్వలను గుర్తించారు. వాహనాల తయారీ సంస్థ ‘మిత్సుబిషి’ ఈ దీవిని 1890లో కొనుగోలు చేసింది. జపాన్ ప్రభుత్వం ఇక్కడకు తరలించే యుద్ధఖైదీలనే కార్మికులుగా ఉపయోగించుకుని, వారితో వెట్టిచారికి చేయించుకుని, భారీగా లాభాలు గడించింది. మిత్సుబిషి సంస్థ 480 అడుగుల మీటర్ల పొడవు, 160 మీటర్ల వెడల్పు గల స్థావరంలో గని కార్మికులుగా పనిచేసే 5,300 మంది ఖైదీలను నిర్బంధంలో ఉంచేది. గని తవ్వకాల్లో జరిగే ప్రమాదాల వల్ల, పోషకాహార లోపం వల్ల, జపాన్ సైనికులు అమలు జరిపే మరణ శిక్షల వల్ల దాదాపు 1,700 మంది ఖైదీలు అర్ధాంతరంగా ఇక్కడే మరణించారు. ఇక్కడి బొగ్గు నిల్వలు 1974 నాటికి అంతరించిపోవడంతో, వెట్టిచాకిరి చేసే కార్మికులకు విముక్తి దొరికింది. వారు ఈ దీవిని ‘జైలు దీవి’ అని, ‘యుద్ధనౌక దీవి’ అని పేర్లు పెట్టారు. గడచిన ఐదు దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న ఈ దీవిలోని కట్టడాలన్నీ ఇప్పుడు శిథిలమైపోయాయి. మిత్సుబిషి సంస్థ నుంచి నాగసాకి నగరపాలక సంస్థ 2005లో ఈ దీవిని స్వాధీనం చేసుకుంది. ఈ దీవిలోనే 2012లో జేమ్స్‌బాండ్ సినిమా ‘స్కై ఫాల్’ షూటింగ్ జరిగింది. యునెస్కో 2015లో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. నాగసాకి నగరపాలక సంస్థ ఈ దీవి అభివృద్ధికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. అయినా, కుతూహలం ఉన్న కొద్దిమంది పర్యాటకులు అరుదుగా ఇక్కడకు వచ్చి, ఫొటోలు దిగి వెళుతుంటారు. ఇవి చదవండి: పాతాళవనం కాదు! అదొక 'నేలమాళిగలో ఉద్యానవనం..!' -
SLIM: జాబిల్లిపై మళ్లీ నిద్రలోకి జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్
టోక్యో: చందమామ మీద రాత్రి వేళల్లో ఉండే అసాధారణ చలిని తట్టుకుని రెండు వారాల తర్వాత మేల్కొని చరిత్ర సృష్టించిన జపాన్ మూన్ ల్యాండర్ స్లిమ్(స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్) నిద్రలోకి జారకుంది. జపాన్ కాలమానం ప్రకారం శుక్రవారం(మార్చ్1)వ తేదీన ఉదయం మూడు గంటలకు స్లిమ్ నిద్రలోకి వెళ్లింది. ఈ విషయాన్ని జపాన్ ఎయిరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) ఎక్స్(ట్విటర్)లో వెల్లడించింది. రెండు వారాల తర్వాత చంద్రుని మీద మళ్లీ సూర్యుడు ఉదయించాక స్లిమ్‌ను పనిచేయించడానికి ప్రయత్నిస్తామని జాక్సా తెలిపింది. అయితే జాబిల్లి మీద ఉన్న అసాధారణ ఉష్ణోగ్రతల మార్పుల వల్ల స్లిమ్ మళ్లీ పనిచేసేందుకు అవకాశాలు తక్కువేనని పేర్కొంది. స్లిమ్‌ను కచ్చితమైన ల్యాండింగ్ జోన్ టార్గెట్ టెక్నాలజీతో డిజైన్ చేసినందున దీనిని మూన్ స్నైపర్‌గా కూడా పిలిచారు. చంద్రునిపై ల్యాండర్లను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాల్లో భారత్ తర్వాత జపాన్ ఐదో దేశంగా చరిత్రకెక్కింది. కాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా, ప్రైవేట్ కంపెనీ ఐఎమ్ సంయుక్తంగా చంద్రునిపైకి పంపిన ఒడిస్సియస్ గురువారం(ఫిబ్రవరి 29) చంద్రుని నుంచి ఆఖరి చిత్రాన్ని పంపింది. పవర్ బ్యాంకుల్లోని ఇంధనం ఖాళీ అవడంతో ఒడిస్సియస్ ల్యాండ్ అయిన వారం రోజుల తర్వాత శాశ్వత నిద్రలోకి జారుకుంది. చంద్రుని మీద ఒక్క రాత్రి పూర్తవ్వాలంటే భూమి మీద రెండు వారాలు గడవాలి. 3/1午前3時過ぎ(日本標準時)にしおりクレータは日没を迎え、SLIMは再び休眠に入りました。厳しい温度サイクルを繰り返すことになるため故障確率は上がりますが、次回の日照(3月下旬)でもSLIMは再び運用を試行する予定です。#JAXA #SLIM #たのしむーん 2/29 23:00過ぎ 航法カメラによる周辺画像 pic.twitter.com/xutv56uSU9 — 小型月着陸実証機SLIM (@SLIM_JAXA) March 1, 2024 ఇదీ చదవండి.. టెక్సాస్‌లో విజృంభిస్తున్న కార్చిచ్చు.. భారీగా నష్టం -
మృత్యుంజయ ‘మూన్ స్నైపర్’!
ఓ వైజ్ఞానిక విశేషం... కాదు... అంతకంటే అబ్బురమే. జపాన్ శాస్త్రవేత్తల్లో వెల్లివిరిసిన సంభ్రమాశ్చర్యాలు, ఆనందోత్సాహాలు... గత నెలలో చంద్రుడిపై దిగిన జపాన్ ల్యాండర్ ‘మూన్ స్నైపర్’ అనూహ్యంగా నిద్ర లేచింది. జాబిలిపై సుదీర్ఘంగా 14 రోజులపాటు కొనసాగిన రాత్రివేళలో గడ్డకట్టించే మైనస్ 130 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్ని దీటుగా తట్టుకుని మరీ బతికింది! నిజానికి అంతటి కఠోర శీతల ఉష్ణోగ్రతలను తట్టుకునేలా జపాన్ దానిని తయారుచేయలేదు. కానీ అది మృత్యువును జయించి పునర్జన్మ పొందింది. ఈ ల్యాండర్ అసలు పేరు ‘స్లిమ్’ (స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్). ఆదివారం రాత్రి ‘మూన్ స్నైపర్’తో సమాచార సంబంధాల్ని పునరుద్ధరించి ఓ ఆదేశం పంపామని, ల్యాండర్ నుంచి ప్రతిస్పందన వచ్చిందని ‘ఎక్స్’ వేదికగా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (జాక్సా) వెల్లడించింది. చంద్రుడిపై మధ్యాహ్నం కావడంతో కమ్యూనికేషన్స్ సాధనాలు బాగా వేడెక్కినందున కొద్ది సేపటి తర్వాత ల్యాండరుతో సమాచార సంబంధాలు నిలిపివేశామని తెలిపింది. పరికరాల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాక కమ్యూనికేషన్స్ పునరుద్ధరిస్తామని ‘జాక్సా’ ప్రకటించింది. ‘మూన్ స్నైపర్’ గత నెల 19న చంద్రమధ్యరేఖకు దక్షిణంగా షియోలీ బిలం వాలులో దిగడమే తలకిందులుగా దిగింది. శీర్షాసనం భంగిమలో నిలిచిన దానిపై తొలుత జాక్సా ఆశలు వదిలేసుకుంది. సూర్యుడికి వ్యతిరేక దిశలో సౌరఫలకాలు ఉండిపోవటంతో ముందుజాగ్రత్తగా ల్యాండరును కొద్దిరోజులు నిద్రాణస్థితిలోకి పంపారు. అనంతరం సూర్యుడి దిశ మారి ఎండ అందుబాటులోకి రావటంతో సౌరశక్తిని సమకూర్చుకున్న ల్యాండర్ తిరిగి పని చేయడం ప్రారంభించింది. అనంతరం చంద్రుడిపై రాత్రి సమయం సమీపించడంతో దాన్ని మరోసారి నిద్రావస్థలోకి పంపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ గత ఏడాది విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్-3 మిషన్‌లోని ‘విక్రమ్’ ల్యాండర్ మాదిరిగానే... చంద్రుడిపై 14 రోజులపాటు నిర్విరామంగా కొనసాగే రాత్రి వేళ అతి శీతల ఉష్ణోగ్రతలను భరించగలిగేలా ‘మూన్ స్నైపర్’ ల్యాండరును ‘జాక్సా’ డిజైన్ చేయలేదు. భూమ్మీద రెండు వారాల కాలానికి సమానమయ్యే అతి శీతల చంద్ర రాత్రిలో మనుగడ సాగించలేక ‘విక్రమ్’ ల్యాండర్ మూగబోయింది. కానీ ‘మూన్ స్నైపర్’ మాత్రం అదృష్టవశాత్తు జీవించగలిగింది. :::జమ్ముల శ్రీకాంత్ -
కత్తులు తయారు చేస్తున్న టెక్ బాస్.. వీడియో వైరల్!
Mark Zuckerberg viral video: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం, ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కత్తుల తయారీపై దృష్టి పెట్టినట్లు ఉన్నారు. ఇటీవల జపనీస్ కత్తి మాస్టర్ అకిహిరా కోకాజీ నుంచి కత్తి తయారీ పాఠాన్ని నేర్చుకున్నారు. పదునుకు ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ జపనీస్ కత్తి ‘కటనా’ను తయారు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జుకర్‌బర్గ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్ట్‌లను షేర్ చేశారు. అందులో ఆయన కత్తి మాస్టర్‌తో పోజులివ్వడాన్ని చూడవచ్చు. మరొక చిత్రంలో తాను తయారు చేసిన కత్తిని చూపించాడు. అలాగే కత్తి తయారు చేస్తున్న వీడియోను, తయారు చేసిన కత్తిని వాడుతున్న వీడియోను కూడా షేర్ చేశారు. "మాస్టర్ అకిహిరా కోకాజీతో కటనాల తయారీ గురించి నేర్చుకోవడం నిజంగా అద్భుతంగా ఉంది. మీ (అకిహిరా కోకాజీ) కళా నైపుణ్యాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు!" అని పేర్కొన్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. షేర్ చేసినప్పటి నుంచి 3.6 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. అలాగే వేలాది కామెంట్లు వచ్చాయి. “తయారు చేసిన కటానాను మీతోనే ఉంచుకుంటారా?” అని ఓ యూజర్ ప్రశ్నించారు. “మీరు నిజమైన నింజాగా మారే మార్గంలో ఉన్నారు. చేతులతో యుద్ధంలో ఆరితేరాక కత్తులపై దృష్టిపెట్టారు!” అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
చంద్రుడి ఒడిలో ‘ఒడిస్సియస్’!
జాబిలిపైకి ల్యాండర్ల పరంపర కొనసాగుతోంది. జపాన్ ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ తర్వాత తాజాగా అమెరికా వంతు వచ్చింది. అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడిపై మరోమారు అగ్రరాజ్యం జెండా రెపరెపలాడింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ రూపొందించిన ‘ఒడిస్సియస్’ (నోవా-సీ శ్రేణి) ల్యాండర్ జాబిలి ఉపరితలంపై దక్షిణ ధ్రువం చేరువలోని ‘మాలాపెర్ట్ ఎ’ బిలంలో దిగ్విజయంగా దిగింది. తొలుత ల్యాండర్ నేవిగేషన్ వ్యవస్థలోని లేజర్ రేంజిఫైండర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. దీంతో ల్యాండర్ దిగాల్సిన నిర్దేశిత సమయంలో కొంత జాప్యం సంభవించినప్పటికీ భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4:53 గంటలకు అది క్షేమంగా చంద్రుడిపై దిగి భూమికి సంకేతం పంపింది. ‘మాలాపెర్ట్ ఎ’ అనేది చంద్రుడి దక్షిణ ధృవానికి 300 కిలోమీటర్ల దూరంలో 85 డిగ్రీల దక్షిణ అక్షాంశ ప్రాంతంలో నెలకొన్న ఓ చిన్న బిలం. బెల్జియంకు చెందిన 17వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మాలాపెర్ట్ పేరును దానికి పెట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అతి సమీపంలో దిగిన వ్యోమనౌకగా చరిత్ర సృష్టించిన ‘ఒడిస్సియస్’… ఆ విషయంలో గత ఏడాది మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టడం విశేషం. ‘ఒడిస్సియస్’ ల్యాండరుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ సంస్థ ఉద్యోగులు పెట్టుకున్న ముద్దు పేరు ‘ఒడీ’. ఈ మానవరహిత చంద్రయాత్రకు మిషన్ ‘ఐఎం-1’గా నామకరణం చేశారు. జీవితకాలం ఏడు రోజులే! పూర్తిగా ఓ ప్రైవేటు కంపెనీ తయారీ-నిర్వహణలో ల్యాండర్ ఒకటి చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగడం ఇదే తొలిసారి. సాంకేతిక అవాంతరాలు ఎదుర్కొన్నప్పటికీ జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ మాదిరిగా తలకిందులుగా కాకుండా ‘ఒడిస్సియస్’ నిటారుగానే దిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. షడ్భుజి ఆకృతితో, సిలిండర్ ఆకారంలో టెలిఫోన్ బూత్ కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న ఈ ల్యాండరులో 100 కిలోల బరువైన ఐదు ‘నాసా’ పరికరాలు, ఇతర వాణిజ్య సంస్థలకు చెందిన ఆరు శాస్త్రీయ పరికరాలు (పేలోడ్స్) ఉన్నాయి. అవి చంద్రుడిపై పరిశోధనలు నిర్వహిస్తాయి. వీటిలో లేజర్ రెట్రో రిఫ్లెక్టర్, ఐఎల్ఓ-ఎక్స్ అబ్జర్వేటరీ (టెలిస్కోప్) ఉన్నాయి. జాబిలిపై ‘ఒడిస్సియస్’ జీవితకాలం కేవలం ఏడు రోజులు. మరో వారం రోజుల్లో అది దిగిన ప్రదేశంలో సూర్యాస్తమయం అవుతుంది. కనుక ల్యాండర్ పనిచేయడానికి సౌరశక్తి లభించదు. చంద్రుడి ఉపరితలంతో అంతరిక్ష వాతావరణం చర్యనొందే విధానం, రేడియో ఆస్ట్రానమీ, చంద్రావరణానికి సంబంధించిన డేటాను ‘నాసా’ పేలోడ్స్ సేకరించనున్నాయి. అమెరికా చివరిసారిగా 1972లో చేపట్టిన ‘అపోలో-17’ మానవసహిత యాత్రలో వ్యోమగాములు జీన్ సెర్నాన్, హారిసన్ ష్మిట్ చంద్రుడి నేలపై నడయాడారు. ఆ తర్వాత అమెరికా వ్యోమనౌక ఒకటి నియంత్రిత విధానంలో చంద్రుడిపై దిగడం ఇదే మొదటిసారి. చైనా కంటే ముందుగా తమ ‘ఆర్టెమిస్’ యాత్రతో త్వరలో జాబిలిపైకి తమ వ్యోమగాములను పంపాలని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఒడిస్సియస్’ సేకరించే సమాచారం కీలకం కానుంది. చంద్రుడిపైకి ప్రైవేటు ల్యాండర్లను ప్రయోగించడానికి ఉద్దేశించిన తన కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రాజెక్టులో భాగంగా ‘నాసా’ వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఈ మిషన్ కాంట్రాక్టును ‘ఇంట్యూటివ్ మెషీన్స్’కు కట్టబెట్టింది. చంద్రుడి సూక్ష్మ శిల్పానికి గాంధీ పేరు! ఆరు కాళ్లపై నిలబడే ‘ఒడిస్సియస్’ ల్యాండర్ ఎత్తు 4 మీటర్లు కాగా, వెడల్పు సుమారు 2 మీటర్లు. ప్రయోగ సమయంలో ల్యాండర్ బరువు 1,908 కిలోలు. ఈ నెల 15న ఫ్లోరిడాలోని కేప్ కెనెవరాల్ నుంచి కెన్నెడీ అంతరిక్ష కేంద్రం వేదికగా ఇలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్-ఎక్స్’కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో దాన్ని ప్రయోగించారు. భూమి నుంచి చూస్తే చంద్రుడిలో కనిపించే 62 దశలు, అంతరిక్షంలోని ఇతర ప్రాంతాల నుంచి చూస్తే చంద్రుడిలో అగుపించే మరో 62 దశలు, ఒక చంద్రగ్రహణం... మొత్తం కలిపి చంద్రుడి 125 దశలను ప్రతిబింబించే సూక్ష్మ శిల్పాలను ఓ పెట్టెలో పెట్టి ల్యాండరులో అమర్చడం విశేషం. వీటిని అమెరికన్ కళాకారుడు జెఫ్ కూన్స్ రూపొందించారు. ఒక్కో బుల్లి శిల్పం వ్యాసం అంగుళం. ఈ శిల్పాలకు మానవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమున్న అరిస్టాటిల్, లియోనార్డో డా విన్సీ, గాంధీ, డేవిడ్ బౌయీ, బిల్లీ హాలిడే తదితరుల పేర్లు పెట్టారు. భూమికి ‘ఒడిస్సియస్’ ల్యాండర్ పంపిన సంకేతం బలహీనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా ల్యాండర్ భవితపై అనిశ్చితి నెలకొంది. దీంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలో హర్షధ్వానాలు, విజయోత్సవాలను రద్దు చేశారు. ల్యాండర్ సంకేతాలను మెరుగుపరచేందుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ::: జమ్ముల శ్రీకాంత్