
అత్యంత కీలక స్పేస్ ఆపరేషన్ల మధ్య వ్యోమగామి ఆటవిడుపు
సోలోగా స్పేస్‌లో బేస్‌బాల్ ఆడిన కొయిచి వకాటా
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ ఎస్)లో వ్యోమగామి అనగానే మనకు ఠక్కున గుర్తొ చ్చేది ఒక్కటే. వందల కోట్ల వ్యయంతో అక్కడికెళ్లిన వ్యోమగామి ఎక్కువగా ప్రయోగాల్లో మునిగితేలుతా రని భావిస్తాం. అందుకు భిన్నంగా బేస్‌బాల్ ఆడుతూ కనిపించి అవాక్కయ్యేలా చేశారు జపాన్ వ్యోమగామి కొయిచి వకాటా. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంబంధిత ‘స్పేస్ బేస్‌బాల్’ వీడియోను తాజాగా ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు.
అంతరిక్షంలో భారర హిత స్థితిలో ఒంటరిగా ఉండకుండా సరదాగా బంతితో ఒక్కరమే ఎలా ఆడుకోవచ్చో వకాటా ఆడి చూపించారు. బేస్‌బాల్‌ను మంచి పిచ్ చూసుకుని విసిరి వెంటనే మళ్లీ ఆయనే బాల్ దూసుకెళ్తున్న దిశలో అంతకంటే వేగంగా కదిలి మళ్లీ బాల్‌ను బ్యాట్‌తో బాదారు. బ్యాట్‌తో కొట్టడంతో వ్యతిరేక దిశలో వెళ్తున్న బంతిని మళ్లీ ఆయనే ఇటు చివరకు దూసుకొచ్చి ఒడుపుగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘‘ జపాన్‌లో బేస్‌బాల్ ఎంఎల్‌బీ సీజన్ మొదలైంది. మైక్రోగ్రావిటీ స్థితిలో మనకు బేస్‌బాల్ టీమ్ మొత్తంతో పనిలేదు. ఒక్కరమే ఆట ఆడకోవచ్చు.
బాల్ వేసేది మనమే. దానిని కొట్టేది మనమే. చివరకు పట్టేదీ మనమే’’ అని వకాటా రాసుకొచ్చారు. భారరహిత స్థితిని ఎలా ఆస్వాదించాలో, కేవలం ఒక్కరున్నా బేస్‌బాల్‌ను ఎలా ఆడాలో ఆయన చూపించిన విధం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. చాలా మంది మెచ్చుకు న్నారు. అంతరిక్ష వాతావరణాన్ని క్రీడాస్థలిగానూ వినియోగించువచ్చని ఆయన నిరూపించారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. ‘‘అంతరిక్ష క్రీడాకారుడు’’ అంటూ మస్క్ పొగిడారు. దాదాపు 20 సంవత్సరాలపాటు వ్యోమగామిగా కొనసాగిన వకాటా 2024లో రిటైర్ అయ్యారు. ఐదుసార్లు ఐఎస్‌ఎస్‌కు వెళ్లి మొత్తంగా 500 రోజులపాటు అక్కడ గడిపారు. ఎక్స్‌పిడీషన్39లో భాగంగా అక్కడికెళ్లిన ప్పుడు ఐఎస్‌ఎస్‌కు కమాండర్‌గా చేసిన తొలి జపాన్ వ్యోమగామిగా రికార్డ్ నెలకొల్పారు. జపాన్ ఏరోస్పే స్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా)లో వ్యోమగామిగా సేవలందించారు.
— Elon Musk (@elonmusk) March 25, 2025