Astronaut
-
‘ఇడియట్’..వ్యోమగామిపై మస్క్ చిందులు
వాషింగ్టన్:అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతావిలియమ్స్,బుచ్విల్మోర్ల విషయమై బిలియనీర్ ఇలాన్‌మస్క్, డెన్మార్క్‌కు చెందిన సీనియర్ వ్యోమగామి యాండీ మోగెన్సెన్ మధ్య ఎక్స్(ట్విటర్) వేదికగా మాటల యుద్ధం నడిచింది. వ్యోమగాములు నింగిలోనే ఉండిపోవడానికి బైడెన్ కారణమని ఇటీవల అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ చెప్పారు. రాజకీయ కారణాల వల్లే వారిని తిరిగి తీసుకురాలేదని అన్నారు.ట్రంప్,మస్క్ కలిసి చేసిన ఈ వ్యాఖ్యలపై వ్యోమగామి యాండీ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శలు చేశారు. సునీత,విల్మోర్ల విషయంలో మస్క్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని యాండీ పోస్టు పెట్టారు. యాండీ పోస్టుకు మస్క్ తీవ్రంగా స్పందించారు. ‘ఇడియట్..నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. వ్యోమగాములు సునీత,విల్మోర్లను తీసకువస్తానని నేను కొన్ని నెలల క్రితమే చెప్పాను.కొన్ని రాజకీయ కారణాల వల్ల బైడెన్ దీనిని పట్టించుకోలేదు’అని మస్క్ యాండీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తిరిగి స్పందించిన యాండీ ‘ఇలాన్ నువ్వంటే నాకు అభిమానం. టెస్లా, స్పేస్ ఎక్స్లలో నువు సాధించిన దానికి నిన్ను ప్రశంసించా.ఇది నీకు కూడా తెలుసు. అయితే సునీత,విల్మోర్ల విషయంలో నువు చెబుతున్నది మాత్రం అబద్ధం. వాళ్లను తీసుకురావడానికి గత సెప్టెంబర్‌లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. You are fully retarded. SpaceX could have brought them back several months ago. I OFFERED THIS DIRECTLY to the Biden administration and they refused. Return WAS pushed back for political reasons. Idiot.— Elon Musk (@elonmusk) February 20, 2025 నువ్వు ఇప్పుడు కొత్తగా ఏ రాకెట్‌ను ఐఎస్ఎస్కు పంపలేదు. ఎప్పటినుంచో ఐఎస్ఎస్లో ఉన్న క్రూ-9 వ్యోమనౌకలోనే వారు తిరిగి భూమికి వస్తున్నారు’అని యాండీ మస్క్‌కు కౌంటర్ ఇచ్చారు.కాగా, గతేడాది జూన్‌లో పది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లిన సునీత,విల్మోర్లు సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారు మార్చి మొదటి వారంలో తిరిగి భూమికి వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ వ్యోమనౌకలో వారు భూమికి రానున్నారు. -
సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు
నాసా వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా నిలిచారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న ఆమె.. తన 9వ స్పేస్‌వాక్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ సేపు స్పేస్ వాక్ చేసిన ఘనతతో ఆమె నాసా ఆల్‌టైం లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు.సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గురువారం ఉమ్మడిగా స్పేస్‌వాక్ చేశారు. తాజా స్పేస్‌వాక్‌తో కలిపి.. మొత్తంగా 62 గంటల 6 నిమిషాలపాటు ఆమె వాక్ పూర్తి చేసుకున్నారు. తద్వారా నాసా వ్యోమగామి పెగ్గీ వైట్సన్ రికార్డు(60 గంటలు) ఆమె అధిగమించారు. అంతేకాదు.. స్పేస్‌వాక్ టాప్ టెన్ జాబితాలో సునీతా విలియమ్స్ నాలుగో స్థానానికి ఎగబాకారు. అత్యధికంగా స్పేస్‌వాక్ చేసింది కాస్మోనాట్ అనాటోలీ సోలోవ్యెవ్. పదహారుసార్లు స్పేస్‌వాక్ చేసిన ఆయన.. 82 గంటల 22 నిమిషాలు గడిపారు. ఇక ఈ టాప్ టెన్ లిస్ట్‌లో ఎనిమిది మంది నాసా వ్యోమగాములే ఉండడం గమనార్హం. ఫైడోర్ యర్చికిహిన్(కాస్మోనాట్) 59 గంటల 28 నిమిషాలు వాక్ చేసి తొమ్మిది స్థానంలో కొనసాగుతున్నారు.కాస్మోనాట్.. రష్యా(పూర్వపు సోవియట్ యూనియన్) వ్యోమగామి , ఆస్ట్రోనాట్.. అమెరికా నాసా వ్యోమగామి.. వ్యోమనాట్.. తరచూ భారత వ్యోమగామికి, టైకోనాట్.. చైనా వ్యోమగామి, స్పేషియోనాట్.. ఫ్రాన్స్‌తో పాటు ఫ్రెంచ్ మాట్లాడే మరికొన్ని దేశాలువారం వ్యవధిలో సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్ చేయడం ఇది రెండోసారి. సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు బయటి భాగంలో చేయాల్సిన మరమ్మతులు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించారు. భూమికి 420 కిలోమీటర్ల ఎగువన సరిగ్గా స్పెయిన్ దేశం పైభాగాన తాము స్పేస్‌వాక్ చేశామని, చాలా ఆనందంగా ఉందని వాళ్లు అంటున్నారు. ఇదిలా ఉంటే.. అంతరిక్షంలో తొలిసారి స్పేస్‌వాక్ చేసింది సోవియట్ కాస్మోనాట్(ప్రస్తుత రష్యా) వ్యోమగామి అలెక్సీ లెనోవ్. 1965, మార్చి 18వ తేదీన వాష్కోడ్ 2 మిషన్‌లో భాగంగా.. 12 నిమిషాల 9 సెకండ్లపాటు ఆయన బయటకు వచ్చారు. అంతరిక్ష పరిశోధనల్లో ఆయన నడక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఇక.. గత ఏడాది జూన్‌లో వీళ్లిద్దరూ ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో అది సాధ్య పడలేదు. ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.అయితే.. అందుకోసం ప్రయత్నాలు మాత్రం ముమ్మరం అయ్యాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం జోక్యం చేసుకున్నారు. ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకురావడానికి సాయం అందించాలని స్పేస్ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్ ను కోరారు. అన్నీకుదిరితే.. ఈ మార్చి ఆఖర్లో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో వాళ్లను భూమ్మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరగొచ్చు. -
శుభాన్షు శుక్లా... ఎంటర్ ద ‘డ్రాగన్’
ప్రతిష్టాత్మక ఆక్సియం స్పేస్ ఏఎక్స్–4 మిషన్‌కు ఎంపికైన భారత వ్యోమగామి, వైమానిక దళ గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా తాము ప్రయాణించబోయే అత్యాధునిక డ్రాగన్ వ్యోమనౌకను తొలిసారి సందర్శించారు. అమెరికాలో హూస్టన్‌లోని స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిగతా ముగ్గురు సిబ్బందిని ముఖాముఖి కలుసుకున్నారు. వారంతా కలిసి వ్యోమనౌకలో కాసేపు గడిపారు. స్పేస్సూట్కు కొలతలివ్వడంతో పాటు ప్రెజరైజేషన్ తదితర తప్పనిసరి పరీక్షల్లో వారంతా పాల్గొన్నారు. దీంతో వారందరికీ శిక్షణ ప్రక్రియ లాంఛనంగా మొదలైనట్టయింది. ఈ మిషన్‌కు నాసా వ్యోమగామి పెగీ వాట్సన్ సారథ్యం వహించనున్నారు. ఇందులో భాగంగా వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 10 రోజుల పాటు పలు ప్రయోగాలు, పరిశోధనల్లో గడుపుతారు. ప్రైవేట్ వ్యక్తులు, పరిశోధకులకు ఐఎస్ఎస్ సందర్శనకు వీలు కలి్పచేందుకు స్పేస్ ఎక్స్ తలపెట్టిన నవతరం వాణిజ్య అంతరిక్ష యాత్రల్లో ఆక్సియం స్పేస్ మిషన్ నాలుగోది. ఆక్సియం స్పేస్, స్పేస్ ఎక్స్, నాసా భాగస్వామ్యంతో ఈ ప్రయోగం జరుగుతోంది. -
నాసా ప్రయోగానికి ‘గగన్‌యాన్’ వ్యోమగామి
న్యూఢిల్లీ: భారత్, అమెరికా ఉమ్మడిగా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టే దిశగా ముందడుగు పడింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగంలో పాలుపంచుకొనేందుకు ‘గగనయాన్’ మిషన్ వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లనున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ ప్రయోగం కోసం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. వీరిలో ఒకరిని ఐఎస్ఎస్కు పంపిచనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అమెరికాలో పర్యటించారు. ఉమ్మడి అంతరిక్ష ప్రయోగాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చించారు. ఉమ్మడి స్పేస్ మిషన్లలో భాగంగా 2024లో భారత వ్యోమగామిని ఐఎస్ఎస్కు పంపిస్తామని బైడెన్ ఈ సందర్భంగా ప్రకటించారు. మరోవైపు గగన్‌యాన్ మిషన్ కోసం భారత వైమానిక దళం నుంచి ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములకు ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో అస్ట్రోనాట్స్ ట్రైనింగ్ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. -
ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)లో విషాదం చోటు చేసుకుంది. నాసా రిటైర్డ్ వ్యోమగామి విలియం ఆండర్స్ (90) ఘోర విమాన ప్రమాదంలో మరణించారు.1968న నాసా అపోలో 8లో ముగ్గురు వ్యోమగాములు ఫ్రాంక్ బోర్మాన్, జేమ్స్ లోవెల్, విలియం ఆండర్స్ చంద్రుడి మీదకు పంపించింది.అయితే ఈ ముగ్గురు వ్యామగాములు డిసెంబర్ 24, 1968న చంద్ర కక్ష్యలోకి వెళ్లి తిరిగి డిసెంబర్ 27న భూమికి తిరిగి వచ్చారు. అప్పుడే భూమి మూలాలతో చంద్రుడికి సంబంధం ఉన్నట్లు వెల్లడించారు.ఆ ఫోటో తీసింది ఈయనే అపోలో 8లో చంద్రుడి చుట్టు తిరిగే సమయంలో ముగ్గురి ఆస్ట్రోనాట్స్‌లో ఒకరైన విలియం ఆండర్స్ చంద్రుడి ఉపరితలంపై నుంచి వెలుగుతూ కనిపిస్తున్న భూమి ఫోటోని తీశారు.ఈ ఫోటోకు ‘ఎర్త్ రైజ్’గా పేరు పెట్టారు. అంతరిక్షం నుంచి భూమికి తీసిన తొలి కలర్ ఫోటో ఇదీ.విమానంలో సాంకేతిక లోపంతాజాగా ఎర్త్రైజ్ ఫోటోతీసిన విలియం అండర్స్ జోన్స్ ద్వీపం తీరానికి చేరే సమయంలో ఆండర్స్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ విమానం ప్రమాదంలో అండర్స్ మరణించారని, ఆ విమానంలో తన తండ్రి మాత్రమే ఉన్నారంటూ అండర్స్ కుమారుడు గ్రెగ్ చెప్పారంటూ ది సీటెల్ టైమ్స్ నివేదించింది.ఆకాశం నుంచి అనంతలోకాల్లోకి కేసీపీక్యూ-టీవీ కథనం ప్రకారం..అండర్స్ పాతకాలపు ఎయిర్ ఫోర్స్ సింగిల్ ఇంజిన్ టీ-34 విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో లోపం తలెత్తడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆకాశం నుంచి నిటారుగా సముద్ర తీర ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అండర్స్ ప్రాణాలు కోల్పోవడంతో నాసాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీత
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్(61)తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో బుధవారం పయనమయ్యారు. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు 25 గంటల్లో చేరుకోబోతోన్నారు. అక్కడ వారం రోజులపాటు ఉంటారు. స్టార్‌లైన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే ఈ నెల 14న మళ్లీ భూమిపైకి చేరుకుంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ప్రయాణం అరంభమైంది. స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగాములుగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చరిత్ర సృష్టించారు. ఈ స్పేస్ మిషన్‌కు సునీతా ఫైలట్‌గా, విల్మోర్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. సునీతా అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి కావడం విశేషం. 2006లో, 2012లో అంతరిక్ష ప్రయాణం సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రయథ్లాన్ పూర్తిచేసిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. వెయిట్ లిఫ్టింగ్ మెషీన్ సాయంతో శూన్య వాతావరణంలో ఈత కొట్టారు. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తారు. 2007లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బోస్టన్ మారథాన్ పూర్తిచేశారు. అమెరికా నావికాదళంలో పనిచేసిన సునీతా విలియమ్స్‌ను నాసా 1998లో ఎంపిక చేసి వ్యోమగామిగా శిక్షణ ఇచి్చంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్టు మిషన్ చాలా ఏళ్లు వాయిదా పడింది. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధిలో కొన్ని అటంకాలు తలెత్తడమే ఇందుకు కారణం. ఎట్టకేలకు స్పేస్‌క్రాఫ్ట్ సిద్ధమైంది. బోయింగ్ కంపెనీ డెవలప్ చేసిన మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం వాహనం స్టార్‌లైనర్ కావడం విశేషం. ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇలాంటి అంతరిక్ష ప్రయాణ వాహనాలు తయారు చేసే తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డుకెక్కింది. తాజా ప్రయోగంతో రెండో ప్రైవేట్ సంస్థగా బోయింగ్ కంపెనీ రికార్డు సృష్టించింది. -
Sunita Williams: రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారు
తల్లాహస్సీ: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధం అయ్యారు. ఈస్టర్న్ డే టైమ్ (EDT) ప్రకారం ఈ నెల 17న సాయంత్రం 6.16 గంటలకు(భారత కాలమానం ప్రకారం 18వ తేదీ తెల్లవారుజామున 3:46 గంటలకు) ప్రయోగం నిర్వహించనున్నారు.అయితే, నిన్న(మే 7న) తలపెట్టిన ఈ యాత్ర ఆగిపోయిన విషయం తెలిసిందే. సాంకేతిక కారణాల దృష్ట్యా రోదసీ యాత్ర ఆగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎక్స్ ద్వారా తెలిపింది. కాగా, మరమ్మతుల కోసం అట్లాస్-5 రాకెట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. తల భాగంలో బోయింగ్ ‘స్టార్ లైనర్’ వ్యోమనౌకను అమర్చిన ఈ రాకెట్ ప్రయాణానికి సిద్ధంగా ఇప్పటివరకు ఫ్లోరిడాలో కేప్ కెనెవరాల్ ల్యాంచ్ పాడ్ మీద నిలిచివుంది. .@NASA’s Boeing Crew Flight Test now is targeted to launch no earlier than 6:16 p.m. EDT Friday, May 17, to the @Space_Station. Following a thorough data review completed on Tuesday, ULA (United Launch Alliance) decided to replace a pressure regulation valve on the liquid oxygen… pic.twitter.com/Bh6bOHzgJt— NASA Space Operations (@NASASpaceOps) May 8, 2024 రాకెట్ సెంటార్ అప్పర్ స్టేజిలోని ఆక్సిజన్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ పాడైపోవటంతో ప్రయోగం చివరి నిమిషంలో వాయిదాపడింది. వాల్వును మార్చడానికి అట్లాస్-5ను వర్టికల్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీకి తరలిస్తారు. అనంతరం, ఈస్టర్న్ డే టైమ్ (EDT) ప్రకారం ఈ నెల 17న సాయంత్రం 6.16 గంటలకు(భారత కాలమానం ప్రకారం 18వ తేదీ తెల్లవారుజామున 3:46 గంటలకు) ప్రయోగం నిర్వహించనున్నారు.ఇక, ఈ మిషన్ ప్రకారం.. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వారం పాటు బసచేస్తారు. వాస్తవానికి స్టార్‌లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక ఈ తరహా సేవలు అందిస్తోంది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి. -
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
అమెరికన్ స్పేస్ షటిల్స్... ముప్పై ఏళ్లు కొనసాగిన వీటి శకం 2011లో ముగిసింది. 1960ల నాటి సోవియట్ ‘సోయజ్’ కేప్సూల్... పాతపడిన, ఇరుకైన ఓ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి ఆధునిక మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో కాలం నెట్టుకొస్తున్నా అది కూడా నిష్క్రమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేశాక... రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లు అమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడపడాన్ని చూశాక... చెప్పేదేముంది? అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, రోదసి పరిశోధన, భావి చంద్ర-అంగారక యాత్రలు... అన్నీ ప్రైవేటైజేషనే! కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తోకూస్తో నిధులు... వీటికే ప్రభుత్వరంగ పాత్ర పరిమితమవుతోంది. పెట్టుబడి, పరిశోధన, లాంచింగ్స్ పరంగా రోదసిని ఇకపై ప్రైవేటు రంగమే ఏలబోతోంది. అంతరిక్షాన్ని అందుకోవడానికి రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు సిద్ధమయ్యాయి. ఇవి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లే అంతరిక్ష నౌకలు (స్పేస్ కేప్సూల్స్). ‘ఎక్స్’ (ట్విట్టర్) బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ వ్యోమగాములు, సరుకుల్ని చేరవేస్తోంది. ప్రపంచ అతిపెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ వ్యోమనౌకతో ఈ నెల 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో ప్రధాన విశేషం.మన సునీత హ్యాట్రిక్!ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్... ముద్దుపేరు సునీ... 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతోంది. అమెరికన్ నేవీ కెప్టెన్ (రిటైర్డ్) అయిన సునీతకు అనుభవమే మనోబలం. నాసా ఆమెను 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్య (ముంబాయి) కాగా, తల్లి స్లోవేన్-అమెరికన్ అర్సలిన్ బోనీ. అమెరికాలో 1965లో సునీత జన్మించారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్-5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ కంపెనీ వ్యోమనౌక ‘స్టార్ లైనర్’లో ఈ నెల 6న రాత్రి 10:34 గంటలకు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04 గంటలకు) ఫ్లోరిడాలోని కేప్ కెవెవరాల్ నుంచి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలో వారం రోజులు గడిపి భూమికి తిరిగొస్తారు. 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత 2007 జూన్ 22 వరకు రోదసిలో గడిపారు. ఆ సందర్భంగా మొత్తం 29 గంటల 17 నిమిషాలపాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. 2008లో మరో మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఐదు సార్లు స్పేస్ వాక్ చేసి సునీత రికార్డును బద్దలుకొట్టారు. తర్వాత సునీత రెండోసారి 2012 జులై 14 నుంచి 2012 నవంబరు 18 వరకు 127 రోజులపాటు ఐఎస్ఎస్లో ఉండి ప్రయోగాలు నిర్వహించారు. జపాన్ వ్యోమగామి అకిహికో హోషిడేతో కలసి ఆమె మూడు స్పేస్ వాక్స్ చేశారు. అంతరిక్ష కేంద్రం సౌర ఫలకాల నుంచి ఐఎస్ఎస్ వ్యవస్థలకు పవర్ సరఫరా చేసే ఓ విడిభాగం పాడైపోగా దాన్ని తొలగించి కొత్తదాన్ని అమర్చారు. అలాగే ఐఎస్ఎస్ రేడియటర్ అమ్మోనియా లీకేజిని సరిచేశారు. ఈ రెండు మిషన్లలో సునీత 322 రోజులు రోదసిలో గడిపారు. మొత్తం 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత పెగ్గీ విట్సన్ 10 సార్లు స్పేస్ వాక్స్ చేసి మరోమారు సునీత రికార్డును అధిగమించారు. ఎట్టకేలకు బోయింగ్... గోయింగ్! రాకెట్లు అనేవి వాహకనౌకలు. అవి వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళ్లి వదిలివేస్తాయి. అక్కడి నుంచి వారు గమ్యం చేరుకోవడానికి వ్యోమనౌక (స్పేస్ షిప్/ స్పేస్ కేప్సూల్)లో ప్రయాణించాల్సిందే. అమెరికన్ స్పేస్ షటిల్స్ నేరుగా ఐఎస్ఎస్ కు వెళ్లి వచ్చేవి. ఆ ఫ్లీట్ కనుమరుగైంది. ఐఎస్ఎస్ యాత్రల కోసం నాసా మార్గాంతరం లేక తమ సోయజ్ రాకెట్-వ్యోమనౌకల శ్రేణిపై ఆధారపడటంతో రష్యా గట్టిగా డబ్బులు పిండటం మొదలెట్టింది. ఒక్కో సీటుకు రేటు పెంచేసింది. అమెరికన్ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పట్టుకెళ్లి తిరిగి తీసుకురావడానికి ఒక్కొక్కరికి రూ.700 కోట్లు చొప్పున రష్యా వసూలు చేస్తోంది.దీంతో నాసా తమ ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’లో భాగంగా వ్యోమనౌకలను అభివృద్ధి చేసే కాంట్రాక్టుల్ని 2014లో రెండు సంస్థలకు కట్టబెట్టింది. ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ స్పేస్ కేప్సూల్ డిజైనింగ్, అభివృద్ధి కోసం బోయింగ్ సంస్థ 4.2 బిలియన్ డాలర్ల (రూ.35 వేల కోట్లు) కాంట్రాక్టు, ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్ ఆవిష్కరణ కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టు పొందాయి. 2020 నుంచే స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’లో వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళుతోంది. బోయింగ్ తన ‘సీఎస్టీ-100 (క్రూ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్-100) స్టార్ లైనర్’ పరీక్షల్లో వెనుకబడింది. 2019లో మానవరహిత ఆర్బిటాల్ ఫ్లైట్ టెస్టు (ఓఎఫ్టీ-1) సందర్భంగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాఫ్టువేర్ సమస్య తలెత్తింది. దాంతో అంతరిక్ష కేంద్రానికి నౌక అనుసంధానం కాకుండానే వెనుదిరిగి అతి కష్టంమీద భూమికి తిరిగొచ్చింది. 2022లో అది మానవరహిత ఓఎఫ్టీ-2లో విజయవంతమైంది. తాజాగా ఈ నెల 6న ‘స్టార్ లైనర్’ తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, ‘స్టార్ లైనర్’ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదం కాగానే... అంతరిక్ష మానవసహిత యాత్రలకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను నాసా ఆరంభిస్తుంది. అలా ‘స్టార్ లైనర్’కు లైసెన్స్ లభిస్తుంది. ఏడుగురు వెళ్లి రావచ్చు!‘స్టార్ లైనర్’లో ఏడుగురు వ్యోమగాములు రోదసికి వెళ్ళి రావచ్చు. వీరి సంఖ్యను తగ్గించుకునే పక్షంలో సరకులను తరలించవచ్చు. ‘స్టార్ లైనర్’ లో క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ ఉంటాయి. గత అమెరికన్ స్పేస్ కేప్సూల్స్ మాదిరిగా ఇది సముద్రంలో దిగదు. పైన పారాచూట్లు, కింద ఎయిర్ బ్యాగుల సాయంతో నేల మీదనే దిగుతుంది. అపోలో కమాండ్ మాడ్యూల్, స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’ కంటే సైజులో ‘స్టార్ లైనర్’ పెద్దది. ఇది ఐఎస్ఎస్ కు అనుసంధానమై ఏడు నెలల పాటు కక్ష్యలో ఉండగలదు. ‘స్టార్ లైనర్’ పునర్వినియోగ స్పేస్ కేప్సూల్. ఒక కేప్సూల్ పది మిషన్ల దాకా పనికొస్తుంది. నాసా తమ వ్యోమగాముల యాత్రల కోసం ఒక్కో సీటుకు స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’లో అయితే రూ.450 కోట్లు, బోయింగ్ ‘స్టార్ లైనర్’లో అయితే రూ.700 కోట్లు కుమ్మరించి కొనుక్కోవాల్సిందే! - జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The Boeing Company, NASA, The New York Times, The Washington Post, BBC, Reuters, Space.com, SciTechDaily, ars TECHNICA, PHYS.ORG, Forbes, Popular Science, Scientific American, Hindustan Times, The Indian Express, ND TV, India TV News, Business Today, The Economic Times, News 18, mint, Business Standard, First Post, Times Now) -
స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర 40వ వార్షికోత్సవం
3 ఏప్రిల్ 1984న భారతదేశ అంతరిక్ష చరిత్రలో ముఖ్యమైన రోజు. ఈ రోజు సోవియట్ యూనియన్ (ఇప్పుడు రష్యా) మద్దతుతో భారతదేశం స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మను అంతరిక్షంలోకి పంపింది. 3 ఏప్రిల్ 2024, అంతరిక్షంలో రాకేశ్ శర్మ చేసిన ఈ చారిత్రాత్మక మిషన్‌కు 40 ఏళ్లు పూర్తయ్యాయి. రాకేష్ శర్మ ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో పాటు సోయుజ్ T-11 ఎక్స్‌పెడిషన్ ద్వారా 3 ఏప్రిల్ 1984న సాయంత్రం 6.18 IST గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లారు.. ప్రయోగించిన తర్వాత Orbital Module రష్యా అంతరిక్ష కేంద్రానికి "Salyut 7" డాక్ చేయబడింది. రష్యా అంతరిక్ష కేంద్రంలో 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు గడిపిన తర్వాత రాకేష్ శర్మతో పాటు మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములు సోయుజ్ T-10 సహాయంతో 11 ఏప్రిల్ 1984న సాయంత్రం 4.18p.m IST సమయంలో భూమికి తిరిగి వచ్చారు. *ఆస్ట్రో స్పేస్ టెక్ క్లబ్ ప్రారంభించబడింది: రాకేష్ శర్మ యొక్క మిషన్ రాబోయే గగన్‌యాన్ గురించి అవగాహన కల్పించడానికి. ప్లానెటరీ గ్రూప్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్కృతి స్కూల్‌తో కలిసి పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక సెషన్‌ను నిర్వహించింది. ముఖ్యంగా NASADIYA(నాసదీయ) అనే ఆస్ట్రానమీ, స్పేస్ టెక్ క్లబ్‌ను రిటైర్డ్ ISRO సీనియర్ సైంటిస్ట్ Er రామకృష్ణ పాఠశాలలో ప్రారంభించారు. ఎన్.శ్రీ రఘునందన్ కుమార్ డైరెక్టర్ ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియాతో పాటు స్కూల్ డైరెక్టర్లు ఎన్.రేవతి రాజు & యామిని రాజు, ఏజేఎస్ ప్రకాష్ బిజినెస్ హెడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 200 మంది విద్యార్థులు, క్లబ్ సభ్యులు హాజరయ్యారు. -
రెండో పెళ్లి చేసుకున్న సైతాన్ నటి.. వరుడు ఎవరంటే?
ప్రముఖ మలయాళ నటి లేనా తెలుగులో వచ్చిన సైతాన్ వెబ్ సిరీస్‌లో నటించింది. మహి వీ రాఘవ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో లేనా మేరీ జోసెఫ్ పాత్రలో మెప్పించింది. ఆమె ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న ఆడుజీవితం చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ భామ వివాహాబంధంలోకి అడుగుపెట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ 42 ఏళ్ల నటి జనవరి 17న ప్రముఖ ఆస్ట్రోనాట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను పెళ్లాడినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. నెలన్నర తర్వాత రివీల్.. పెళ్లి చేసుకున్న దాదాపు 40 రోజుల తర్వాత తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది లేనా. అయితే ఇది ఆమెకు రెండో వివాహం కాగా.. మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఇటీవల కేరళలో పర్యటించిన మోదీ గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో పాల్గొనే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. వారిలో పైలట్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా ఉన్నారు. గగన్‌యాన్‌లో పాలుపంచుకునే నలుగురి పేర్లను మోదీ ప్రకటించిన వెంటనే లేనా తన పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రశాంత్ నాయర్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. లేనా తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఈరోజు, ఫిబ్రవరి 27, 2024న, మన ప్రధాని మోదీ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు మొదటి భారతీయ ఆస్ట్రోనాట్ వింగ్స్ బహుకరించారు. మన దేశం, కేరళ, ముఖ్యంగా నాకు ఇది చాలా గర్వించదగ్గ చారిత్రక సందర్భం. అధికారికంగా నేను ప్రశాంత్‌ను జనవరి 17, 2024న సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నానని మీకు తెలియజేయడానికి ఈ ప్రకటన కోసం వేచి ఉన్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ఫ్లైట్ మిషన్ గగన్‌యాన్ కోసం శిక్షణ పొందిన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. వారిలో కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఎంపికయ్యారు. ఈ నలుగురు వ్యోమగాములు రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. View this post on Instagram A post shared by Lenaa ലെന (@lenaasmagazine) -
గఘనయానులు...
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో పాల్గొనబోతున్న వ్యోమగాములంతా నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థులే. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాన్షు శుక్లా వృత్తిరీత్యా యుద్ధపైలెట్లు. వీరంతా గగన్‌యాన్ కోసం ఇప్పటికే రష్యాలో వ్యోమగాములుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. భారత్‌లోనూ ఇస్రో వీరికి కొంతకాలంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తమ నలుగురు యుద్ధవిమాన పైలెట్లు గగన్‌యాన్‌లో భాగస్వాములు కావడం తమకెంతో గర్వకారణమని భారత వాయుసేన పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ‘సూపర్ ఫోర్’ గురించి... ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ భారత వాయుసేనలో యుద్ధవిమానాన్ని సుదీర్ఘకాలంపాటు నడిపిన అనుభవం ఉన్న పైలెట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఈ నలుగురిలో ఒక్కడిగా ఎంపికయ్యారు. కేరళలోని తిరువజియాడ్‌లో 1976 ఆగస్ట్ 26న జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో శిక్షణ పూర్తిచేసుకుని అక్కడే ‘స్క్వాడ్ ఆఫ్ హానర్’ను సాధించారు. తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్విసెస్ స్టాఫ్ కాలేజీలో, తాంబరం ఎఫ్‌ఐఎస్‌లో చదువుకున్నారు. తర్వాత ఈయన 1998 డిసెంబర్19న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో యుద్ధవిమాన పైలెట్‌గా విధుల్లో చేరారు. సుఖోయ్30ఎంకేఐ, మిగ్–21, మిగ్–29 ఇలా పలు రకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన దిట్ట. మొత్తంగా 3,000 గంటలకుపైగా యుద్ధవిమానాలను నడిపారు. కీలకమైన సుఖోయ్–30 స్క్వాడ్రాన్‌కు కమాండింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఎ’ కేటగిరీ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా, టెస్ట్ పైలెట్‌గా అనుభవం గడించారు. గగన్‌యాన్‌లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. నాయర్ భార్య లీనా మలయాళ సినీపరిశ్రమలో నటిగా పేరొందారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. గత నెల 17వ తేదీన వీరి వివాహం జరిగింది. ‘ మా ఆయనకు తొలి ఇండియన్ ఆస్ట్రోనాట్ వింగ్స్ దక్కడం కేరళ రాష్ట్రానికే గర్వకారణం’ అని ఆమె ఆనందం వ్యక్తంచేశారు. వీళ్ల కుటుంబం కేరళలోని పాలక్కడ్ జిల్లా నెన్‌మరలో నివసిస్తోంది. నాయర్‌ను ఆస్ట్రోనాట్‌గా ప్రధాని ప్రకటించగానే నెన్‌మరలో పండగ వాతావరణం నెలకొంది. అజిత్ కృష్ణన్ అజిత్ కృష్ణన్ 1982లో చెన్నైలో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏలో శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుని స్వోర్డ్ ఆఫ్ ఆనర్ పొందారు. రాష్ట్రపతి బంగారు పతకాన్ని సాధించారు. ఈయన తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డీఎస్‌ఎస్‌సీలోనూ చదువుకున్నారు. 2003 జూన్‌లో భారత వాయుసేనలో పైలెట్‌గా చేరారు. ఫ్లయింగ్ ఇన్‌స్టక్టర్‌గా, టెస్ట్ పైలెట్‌గా ఉంటూ 2,900 గంటలపాటు యుద్ధ విమానాలను నడిపారు. సుఖోయ్, మిగ్, జాగ్వర్, డోర్నియర్, ఏఎన్–32 రకం విమానాలను నడిపారు. ఈ మిషన్‌లో అవసరం మేరకు గ్రూప్ కెప్టెన్ గా ఉంటారు. అంగద్ ప్రతాప్ అంగద్ ప్రతాప్ 1982లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏ పూర్వ విద్యార్ధే. 2004 డిసెంబర్లో భారత వాయుసేన దళాల్లో చేరారు. టెస్ట్ పైలెట్‌గా, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా సేవలందించారు. దాదాపు 2,000 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. సుఖోయ్ 30 ఎంకేఐ, మిగ్–21, మిగ్–29, హాక్, డోర్నియర్, ఏఎన్–32సహా ఎన్నో రకాల విమానాలను సమర్థవంతంగా నడిపారు. గగన్‌యాన్ మిషన్‌లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. శుభాన్షు శుక్లా వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 1985లో జన్మించారు. ఎన్డీఏలో శిక్షణ పూర్తిచేసుకుని 2006 జూన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలెట్‌గా చేరారు. ఫైటర్ కంబాట్ లీడర్‌గా, టెస్ట్ పైలెట్‌గా 2,000 గంటలపాటు యుద్ధవిమనాలు నడిపారు. భారత వాయుసేనలోని దాదాపు అన్నిరకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన నైపుణ్యం సాధించారు. ఈ నలుగురికి రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ సంస్థలో సమగ్రమైన శిక్షణ ఇచ్చారు. గగన్‌యాన్‌లో ఈయన వింగ్ కమాండర్‌గా వ్యవహరిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మన ఆస్ట్రోశాట్ గ్రేట్!
అంతరిక్షంలో జరిగిన అతి శక్తిమంతమైన గామా కిరణ పేలుడు (గామా రే బరస్ట్–జీఆర్బీ)ను ఇస్రో ఆస్ట్రోశాట్ టెలిస్కోప్ తాజాగా మరోసారి గుర్తించింది. జీఆర్బీ 231122బి గా పిలుస్తున్న ఇది ఆస్ట్రోశాట్ గుర్తించిన 600వ పేలుడు కావడం విశేషం. ఇస్రో టెలిస్కోప్ సాధించిన ఈ ఘనతపై అంతర్జాతీయ అంతరిక్ష సమాజంలో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జీఆర్బీలను అంతరిక్షంలో సంభవించే అత్యంత శక్తిమంతమైన పేలుళ్లుగా చెబుతారు. ఇవి తరచూ కృష్ణబిలాల ఆవిర్భావానికి దారి తీస్తుంటాయి. అతి తక్కువ వ్యవధిలోనే, అంటే కొన్ని మిల్లీ సెకన్ల నుంచి నిమిషాల్లోపే అపరిమితమైన శక్తిని వెదజల్లడం ఈ జీఆర్బీల ప్రత్యేకత. ఈ సందర్భంగా అంతరిక్షంలో పరుచుకునే వెలుతురు మిరుమిట్లు గొలిపే స్థాయిలో ఉంటుంది. ఈ పేలుళ్లను లోతుగా అధ్యయనం చేయగలిగితే విశ్వచాలనాన్ని నియంత్రించే మౌలిక భౌతిక నియమాలను మరింతగా అర్థం చేసుకునే ఆస్కారముంటుంది. దుమ్ము రేపుతున్న ఆస్ట్రోశాట్ 2015 సెపె్టంబర్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన తొలి మల్టీ వేవ్ లెంగ్త్ అంతరిక్ష టెలిస్కోపే ఆస్ట్రోశాట్. నాటినుంచి భారత అంతరిక్ష పరిశోధనలకు మూలస్తంభంగా నిలిచింది. ఇది గరిష్టంగా ఐదేళ్ల పాటు పని చేస్తుందని అంచనా వేశారు. కానీ ఎనిమిదేళ్లు దాటినా ఇప్పటికీ అద్భుతంగా పని చేస్తూ ఇస్రో సామర్థ్యానికి తిరుగులేని ప్రతీకగా నిలిచింది. అంతరిక్షంలో సంభవించే అరుదైన దృగ్విషయాలైన గామా పేలుళ్లను ఆస్ట్రోశాట్ ఇట్టే ఒడిసిపడుతూ పలు అంతర్జాతీయ పరిశోధనలకు ఆలంబనగా నిలిచింది. అదిప్పటిదాకా ఏకంగా 600 జీఆర్బీలను గుర్తించడం నిజంగా గొప్ప విషయమేనని నాసా సైంటిస్టులు అంటున్నారు. ఆస్ట్రోశాట్‌లోని కాడ్మియం జింక్ టెల్యురైడ్ ఇమేజర్ (సీజెడ్‌టీఐ)దే ఈ ఘనతలో ప్రధాన పాత్ర అని ఐఐటీ బాంబే పరిశోధకులు వివరించారు. హై ఎనర్జీ, వైడ్ ఫీల్డ్ ఇమేజింగ్ సీజెడ్‌టీఐ ప్రత్యేకత. త్వరలో తెరపైకి ‘దక్ష’... ఆస్ట్రోశాట్ సాధిస్తున్న ఘనతలు నిజంగా సాటిలేనివని ఐఐటీ బాంబే ప్రొఫెసర్ వరుణ్ భలేరావ్ అన్నారు. ఈ స్ఫూర్తితో అంతరక్ష రంగంలో ఇస్రో కృషిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అత్యాధునిక జీఆర్బీ టెలిస్కోప్ దక్షను తయారు చేయనున్నట్టు వెల్లడించారు. పలు ప్రతిష్టాత్మక సంస్థలు సంయుక్తంగా ఈ మిషన్‌లో పాల్గొంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని జీఆర్బీ టెలిస్కోప్ల్లోకెల్లా దక్ష అత్యంత అధునాతనంగా ఉండనుందని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2040నాటికి చంద్రునిపైకి వ్యోమగామి..సరికొత్త లక్ష్యాలతో భారత్
న్యూఢిల్లీ: చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను (చంద్రయాన్-3) ల్యాండ్ చేసిన తొలి దేశంగా అవతరించిన ఇండియా అంతరిక్షం, పరిశోధనలు విషయంలో మరింత వేగం పెంచింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కార్ సరికొత్త వ్యూహంతో దూసుకుపోనుంది. 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపే లక్ష్యంతో ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఆదేశాలు జారీ చేశారని కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశ గగన్‌యాన్ మిషన్ పురోగతి, భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఒక ఉన్నత స్థాయి సమావేశాశం జరిగింది. ఈ సందర్బంగా మోదీ భవిష్యత్తు రోదసి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రానికి ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికి సంబంధించిన ప్రణాళికలతో సహా సరికొత్త వ్యూహంతో సాగాలని ఆదేశించారు. సొంత 'భారతీయ అంతరిక్ష స్టేషన్' (ఇండియన్ స్పేస్ స్టేషన్) ఏర్పాటుతోపాటు చంద్రునిపైకి తొలి భారతీయుడిని పంపడం లాంటి సరికొత్త ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించు కోవాలని ఆయన కోరారు. అలాగే వీనస్,అంగారక గ్రహాలకు సంబంధించిన మిషన్లపై పనిచేయాలని శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇస్రో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న స్పేస్ డిపార్ట్మెంట్ భారత భావి చంద్ర మిషన్ల కోసం రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయాలని తదుపరి తరం లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ)అభివృద్ధి, రిటర్న్ మిషన్లను చేపట్టడానికి సన్నద్ధం కావాలని ప్రధాని శాస్త్రవేత్తలకు సూచించారు. కొత్త లాంచ్ ప్యాడ్, మానవ-కేంద్రీకృత ప్రయోగశాలలు, అనుబంధ సాంకేతికతలను ఏర్పాటు చేయాలన్నారు. కాగా ఇస్రో ఆధ్వర్యంలో చంద్రయాన్-3 సక్సెస్ తరువాత ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్నిచేపట్టింది. ఈ మిషన్లోపీఎస్ఎల్వీ సీ-57 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించిన సంగతి తెలిసిందే. మరోవైపు గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన మానవ అంతరిక్ష యాత్రకు సంబంధించిన తొలి మానవరహిత విమాన టెస్టింగ్ ఈనెల(అక్టోబర్) 21న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య జరగనుంది. గగన్‌యాన్ ప్రాజెక్ట్ అనేది మానవ అంతరిక్ష యాత్రల నిర్వహణలో భారతదేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలవనుంది. ఈ మూడు రోజుల మిషన్‌లో 400 కి.మీ కక్ష్యలో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షయాత్ర చేయనున్నారు. కాగా గగన్‌యాన్ మిషన్ మనుషులను సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి మానవ రేటింగ్ పొందిన ప్రయోగ వాహనం. ఇది అంతరిక్షంలోని వ్యోమగాములకు భూమి తరహా పర్యావరణాన్ని అందించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్, అత్యవసర ఎస్కేప్ సదుపాయంతోపాటు పలు క్లిష్టమైన సాంకేతికతలను అభివృద్ధి చేయనుంది. మానవ అంతరిక్ష విమాన మిషన్ ప్రయోగంలో ముందుగా మిషన్ సాంకేతిక సంసిద్ధత స్థాయిలను ప్రదర్శించనున్నామని అంతరిక్ష సంస్థ తెలిపింది. ఈ డెమోన్స్ట్రేటర్ మిషన్లలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఏడీటీ), ప్యాడ్ అబార్ట్ టెస్ట్ (పీఏటీ) టెస్ట్ వెహికల్ (టీవీ) విమానాలు ఉన్నాయి. టీవీ-డీ1 పరీక్ష వాహనం ఈ అబార్ట్ మిషన్ కోసం అభివృద్ధి చేసిన ఏక దశ లిక్విడ్ రాకెట్. పేలోడ్లలో క్రూ మాడ్యూల్ (సీఎం), క్రూ ఎస్కేప్ సిస్టమ్‌లు (సీఈఎస్) వాటి వేగవంతమైన సాలిడ్ మోటార్లతో పాటు సీఎం ఫెయిరింగ్ (సీఎంఎప్), ఇంటర్ఫేస్ అడాప్టర్లు ఉంటాయి. ఈ ఫ్లైట్ గగన్‌యాన్ మిషన్‌లో మాదిరి మ్యాక్ నంబర్ 1.2కి అనుగుణంగా ఆరోహణ పథంలో అబార్ట్ స్థితిని అనుసరిస్తుంది. సిఎంతో కూడిన సీఇఎస్ పరీక్ష వాహనం నుండి సుమారు 17 కి.మీ ఎత్తులో వేరు అవుతుంది. తదనంతరం అబార్ట్ సీక్వెన్స్ స్వయంప్రతిపత్తితో పనిచేయడం ప్రారంభిస్తుంది. అప్పడు సీఈఎస్ని వేరు చేయడం, పారాచూట్ల శ్రేణిని మోహరించడం మొదలవుతుంది చివరకు శ్రీహరికోట తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో సురక్షిత టచ్‌డౌన్‌తో ప్రయోగం ముగుస్తుంది’అని అంతరిక్ష సంస్థ వెల్లడించింది. TV-D1 Flight Test: The test is scheduled for October 21, 2023, at 0800 Hrs. IST from the First launchpad at SDSC-SHAR, Sriharikota. It will be a short-duration mission and the visibility from the Launch View Gallery (LVG) will be limited. Students and the Public can witness… pic.twitter.com/MROzlmPjRa — ISRO (@isro) October 17, 2023 -
అంతరిక్షంలో పొగలుకక్కే కాఫీ ఎలా తాగుతారు?
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)లో అంతరిక్ష పరిశోధనలు నిర్వహించే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యోమగాములు వేడివేడి కాఫీని ఎలా తాగుతారో చూపించారు. వీడియోలో క్రిస్టోఫోరెట్టి ఒక ప్యాకెట్లోని కాఫీని ఒకచిన్న బాటిల్లో పోయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తారు. అయితే గురుత్వాకర్షణలేమి కారణంగా కాఫీ బయటకు రాదు. ఆ తర్వాత ఆమె ప్రత్యేకంగా రూపొందించిన ‘స్పేస్ కప్’ను బయటకు తీసి, అందులో కాఫీ పోస్తారు. దీంతో ఆమె హాయిగా కాఫీ తాగగలుగుతారు. 2,85,000కు మించిన వీక్షణలు, 2 వేలకు పైగా లైక్‌లను అందుకున్న ఈ వీడియో అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలను తెలియజేస్తుంది. ‘స్పేస్ కప్’ వ్యోమగాములకు ఎంతో ఉపయోగపడుతుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం ఈ మైక్రోగ్రావిటీ కప్పులు అంతరిక్షంలో ద్రవపదార్థాలను తాగేందుకు రూపొందించారు. స్పేస్ కప్ అనేది ద్రవాన్ని నిష్క్రియాత్మకంగా కప్పు పైభాగానికి చేరవేస్తుంది. దీని రూపకల్పనకు పరిశోధకులు ఉపరితల ఉద్రిక్తత, చెమ్మగిల్లే పరిస్థితులు,కప్పు నిర్దిష్ట జ్యామితి మొదలైనవాటిని పరిశీలిస్తారు. ప్రక్రియను చూసేందుకు కప్పును పారదర్శకంగా రూపొందిస్తారు. ఇది కూడా చదవండి: చైనా ‘జియాన్-6’తో భారత్‌పై నిఘా పెట్టిందా? How do you like your coffee?☕️ Our astronaut @AstroSamantha demonstrates how she has her morning coffee in space! #InternationalCoffeeDay pic.twitter.com/UKA1Hy0EWW — ESA (@esa) October 1, 2023 -
అంతరిక్షంలో వ్యోమగామి చనిపోతే మృతదేహం భూమికి ఎలా చేరుతుంది?
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ‘గగన్‌యాన్’ ద్వారా త్వరలో మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్-3 విజయం, ఆదిత్య ఎల్-1 విజయవంతమైన తర్వాత ముగ్గురు భారతీయ వ్యోమగాములు గగన్‌యాన్ సాయంతో భూమికున్న దిగువ కక్ష్యలోకి వెళ్లనున్నారు. ఈ వ్యోమగాములు మూడు రోజుల పాటు నిర్ణీత కక్ష్యలో ఉంటారు. ఆ తర్వాత క్షేమంగా భూమికి తిరిగి రానున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా హ్యూమన్ స్పేస్ మిషన్ కోసం సన్నద్ధమవుతోంది. మృతదేహాలు ఏమవుతాయి? అనేక ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్ష పర్యాటక దిశగా పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచం నలుమూలల నుంచి 600 మందికి పైగా ప్రజలను అంతరిక్షంలోకి పంపారు. 1961లో తొలిసారిగా సోవియట్ యూనియన్‌కు చెందిన వ్యోమగామి యూరి గగారిన్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. అంతరిక్షంలో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది వ్యోమగాములే ఉన్నారు. అయితే ఇటీవల కొంత మంది సామాన్యులు కూడా స్పేస్ టూరిజం కింద అంతరిక్షయానం చేశారు. అయితే అంతరిక్ష యాత్రకు వెళ్లినవారిలో ఎవరైనా అంతరిక్షంలోనే మరణించారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అదే జరిగితే వారి మృతదేహాలను భూమికి ఎలా తీసుకువచ్చారు? అనే ప్రశ్నకూడా మదిలో మెదులుతుంది. అత్యధిక ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి? అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 188 మంది అంతరిక్ష విమానాల్లో మరణించారు. 1980ల నుంచి ఇలాంటి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. స్పేస్ ఫ్లైట్‌తో కూడిన చాలా ప్రమాదాలు భూమిపైన లేదా అంతరిక్షంగా పరిగణించే పాయింట్‌ను చేరుకోవడానికి ముందుగానే సంభవించాయి. ఈ పరిమితిని కర్మన్ లైన్ అంటారు. ఇది సముద్ర మట్టానికి 100 కిలోమీటర్లు అంటే 62 మైళ్ల ఎత్తులో ఉంది. అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ తప్పిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంతరిక్షంలో ప్రమాదానికి గురైన వ్యోమనౌకలోని బాధితులు సాధారణంగా భూమిపైన పడిపోతారు. ముగ్గురు వ్యోమగాములు మృతి చెందినప్పుడు.. అంతరిక్షంలో ఒకే ఒక్క ప్రమాదం 1971లో జరిగింది. సాల్యూట్-1 అంతరిక్ష కేంద్రం నుండి తిరిగి వస్తున్నప్పుడు సోయుజ్-11 క్యాప్సూల్ ఒత్తిడి తగ్గింది. ఫలితంగా వ్యోమగాములు జార్జి డోబ్రోవోల్స్కీ, వ్లాడిస్లావ్ వోల్కోవ్, విక్టర్ పట్సాయేవ్ మరణించారు. క్యాప్సూల్ భూమిపైకి దిగుతూనే సముద్రంలో పడిపోయింది. అనంతరం క్యాప్సూల్ నుంచి ముగ్గురు వ్యోమగాముల మృతదేహాలను వెలికి తీశారు. అంతరిక్షంలో వ్యోమగాములు మరణించిన ఒకేఒక్క ఉదంతం ఇది. బహిరంగపరచగానికి సోవియట్ యూనియన్ నిరాకరణ 1960 సంవత్సరపు ‘ది లాస్ట్ కాస్మోనాట్స్’ సిద్ధాంతం ప్రకారం యూరి గగారిన్ అంతరిక్ష ప్రయాణంలో విజయవంతమైన ప్రయత్నానికి ముందు, సోవియట్ యూనియన్ రహస్యంగా ఇటువంటి అనేక ప్రయత్నాలు చేసింది. అలాంటి ఒక ప్రయత్నంలో అంతరిక్షంలో ఒక ప్రమాదం జరిగింది. అందులో కొంతమంది వ్యోమగాములు మరణించారు. అయితే సోవియట్ యూనియన్ విషయాన్ని బహిరంగపరచడానికి నిరాకరించింది. ది లాస్ట్ కాస్మోనాట్స్ థియరీ నిజమా అబద్ధమా అనేది ఇప్పటి వరకు రుజువు కాలేదు. ఈ సిద్ధాంతం సరైనదని రుజువు చేయగల అటువంటి ఆధారాలు ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. జంతువులను పంపినప్పుడు ఏమి జరిగింది? మానవులను అంతరిక్షంలోకి పంపే ముందు సోవియట్, అమెరికన్ ఏజెన్సీలు 1950లలో అంతరిక్ష నౌకలో జంతువులను సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికా వి-2 బ్లోసమ్ రాకెట్లో ఆల్బర్ట్ ఫస్ట్ అనే కోతిని పంపింది. సోవియట్ యూనియన్ స్పుత్నిక్-2 ఉపగ్రహంతో లైకా అనే కుక్కను పంపింది. ఈ రెండు జంతువులు కూడా అంతరిక్షంలో మరణించాయి. తదుపరి ప్రయత్నాలలో కూడా కొన్ని జంతువులు అంతరిక్షంలో చనిపోయాయి. ఈ జంతువులన్నీ క్యాప్సూల్‌లోనే చనిపోయాయి. ఆ క్యాప్సూల్స్ భూమికి తిరిగి వచ్చాయి. వాటి మృతదేహాలు తిరిగి లభ్యమయ్యాయి. ఇప్పటివరకు అంతరిక్షంలో ఏ జంతువు కూడా గల్లంతైన సంఘటన ఎదురుకాలేదు. ఇది కూడా చదవండి: తొలి ఐఎఎస్ సెలక్షన్ ఎలా జరిగింది? మొదటి ఐఎఎస్ అధికారితో ఠాగూర్కున్న సంబంధం ఏమిటి? -
అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది?
భారతదేశం రూపొందించిన చంద్రయాన్-3 చంద్రునిపై ల్యాండ్ అయిన తర్వాత జనానికి అంతరిక్షానికి సంబంధించిన విషయాలపై మరింత ఆసక్తి పెరిగింది. పలు విషయాలు తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అంతరిక్షానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. గూగుల్ బాబాను అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదిలా ఉంటే అంతరిక్షానికి సంబంధించిన అనేక అపోహలు జనంలో ఉన్నాయి. ఇవి గత కొన్ని సంవత్సరాలుగా సమాధానాలు లేని ప్రశ్నలుగానే ఉన్నాయి. వీటిలో ఒక సందేహం జనంలో ప్రబలంగా ఉంది. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి వృద్ధాప్యానికి చేరుకోడు. యవ్వనునిగానే ఉండిపోతాడని అంటారు. దీనిలో నిజం ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యోమగాముల శరీరంలో మార్పులు గడచిన కొన్ని దశాబ్దాలుగా పలుదేశాలు తమ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాయి. వారు అంతరిక్షంలో కొన్ని రోజులు గడిపి, అక్కడి రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కాగా అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములలో పలు మార్పులు కనిపించాయి. వారికి సంబంధించిన అధ్యయనాన్ని నాసా చేపట్టింది. అంతరిక్షం నుంచి వచ్చిన వారిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో గమనించింది. అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములలో రక్తహీనత సర్వసాధారణం. దీనిని స్పేస్ అనీమియా అని కూడా అంటారు. అంతరిక్షంలో వయసు పెరగడం లేదా? అంతరిక్షంలోకి వెళ్లాక వారి వృద్ధాప్యం నిజంగానే నెమ్మదిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఇందుకోసం నాసా ఒక పరీక్ష చేసింది. పరిశోధకులు ఇద్దరు కవల సోదరులను ఎంపికచేశారు. ఈ సోదరులిద్దరూ వ్యోమగాములు. వారిలో ఒకరిని అంతరిక్షంలోకి పంపారు. మరొకరిని భూమిపై ఉంచారు. స్కాట్ కెల్లీ 340 రోజులు అంతరిక్షంలో గడిపాడు. అతని కవల సోదరుడు మార్క్ భూమిపైనే ఉన్నాడు. వయస్సుపై కొంతవరకు ప్రభావం స్కాట్ కెల్లీ అంతరిక్షం నుండి తిరిగి వచ్చినప్పుడు, అతని జన్యువులలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. భూమిపై జరగని కొన్ని మార్పులు అతని డీఎన్ఏలో కనిపించాయి. స్కాట్ తన సోదరుడు మార్క్ కంటే చిన్నవాడిగా కనిపించడానికి ఇదే కారణంగా నిలిచింది. అయితే తరువాతి 6 నెలల్లో స్కాట్ కెల్లీ జీన్స్‌లో మార్పు సాధారణ స్థితికి చేరుకుంది. దీని ప్రకారం చూస్తే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్నవారి శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా వారు యవ్వనులుగా కనిపించేందుకు అవకాశాలున్నాయి. ఇది కూడా చదవండి: పిజ్జా యాప్ సాయంతో ప్రియుడి అరెస్ట్.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు! -
మరోసారి ఉదారత చాటుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఉదారత చాటుకున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్ధి కలను సాకారం చేసేందుకు ఆర్ధిక భరోసా కల్పించారు. వివరాలు.. పాలకొల్లుకు చెందిన జహ్నవి దంగేటి ఏవియేషన్ శిక్షణకు గతంలో ఏపీ ప్రభుత్వం రూ. 50 లక్షల సాయం అందజేసింది. గతేడాది జూలైలో రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా సీఎంజగన్ జాహ్నవికి ఈ సాయం అందించారు. తాజాగా రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లాకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని జాహ్నవి కలిశారు. పైలెట్ ఆస్ట్రొనాట్ అవ్వాలన్న తన కోరికను అర్థం చేసుకొని ఉన్నత చదువుకు చేసిన సాయానికి వైఎస్ జగన్‌కు జాహ్నవి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్ధిక సాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేయగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వం చేసిన ఆర్ధిక సాయంతో గ్రామీణ ప్రాంతానికి చెందిన జాహ్నవి ఐఐఏఎస్ ఫ్లోరిడా, యూఎస్ఏ నుంచి సైంటిస్ట్ వ్యోమగామి అభ్యర్థిగా సిల్వర్ వింగ్స్ అందుకున్నారని సీంఎ జగన్‌కు సమాచార శాఖ మంత్రి వేణుగోపాల్ వివరించారు. ఇప్పటికే జాహ్నవి నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. అయితే భారత సంతతికి చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్ప స్ఫూర్తితో ముందుకెళుతున్నట్లు వైఎస్ జగన్‌కు జాహ్నవి వివరించారు. చదవండి: గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి: సీఎం జగన్ -
అతను 16 సార్లు వ్యోమనౌకలో భూమిని చుట్టబెట్టాడు.. అంతలోనే..
అంతరిక్షయాత్రలు, వ్యోమగాముల గురించిన కథనాలు చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోతుంటాయి. అలాంటి వ్యోమగాములలో ఒకరే వాల్దిమిర్ మిఖాయిలోచివ్ కొమారోవ్. రష్యా వ్యోమగామి అయిన ఈయన అంతరిక్షయాత్రలోనే కన్నుమూసిన తొలివ్యక్తి. 1967, ఏప్రిల్ 24న తన రెండవ అంతరిక్షయానం నుంచి తిరిగివస్తున్న సందర్బంలో స్పేస్‌క్రాఫ్ట్ దుర్ఘటనలో కన్నుమూశారు. సోవియట్ టెస్ట్ పైలెట్, ఎయిర్‌ఫోర్స్ ఇంజినీరు, కాస్మోనాట్ అయిన వ్లాదిమిర్ 1964లో అధిక సిబ్బందిని మోసుకువెళ్లే మొదటి వ్యోమనౌక వోస్కోడ్ -1కు.. సారధ్య బాధ్యతలు నిర్వహించారు. కొమారోవ్ ముగ్గురు సభ్యుల అంతరిక్ష నౌక వోస్కోడ్ను 16 సార్లు భూ మండలం చుట్టూ నడిపారు. సోయుజ్- 1కు సోలో పైలట్‌గా ఎంపికైనప్పుడు అతను రెండుసార్లు అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి వ్యోమగామిగా నిలిచారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అనుభవం, అంతరిక్షయానంలో శిక్షణ పొందిన 18 మందిలో ఒకరైన కొమారోవ్ 1964 అక్టోబరు 12న అంతరిక్షయానంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. రష్యా సమాచార సంస్థ టీఏఎస్ఎస్ తెలిపిన వివరాల ప్రకారం సోయుజ్-1కు సంబంధించిన కక్ష్య విన్యాసాలు,సిస్టమ్ పరీక్షలతో కూడిన విమాన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. దీని తరువాత 1967 ఏప్రిల్ 24న ఈ అంతరిక్షనౌకను భూమికి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోయుజ్-I 23,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు, ఒక పారాచూట్‌ని వినియోగించాల్సి ఉంది. ఇది కొమరోవ్ను సురక్షితంగా భూమిపైకి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఈలోపు పారాచూట్ లైన్ చిక్కుకుపోయింది. ఆ సమయంలో బ్యాకప్ పారాచూట్ లేదు. పారాచూట్ తెరుచుకోవడంలో విఫలం కావడంతో విమానం 4.5 మైళ్లు (7.24 కిమీ) ఎత్తునుంచి భూమి మీద పడిపోయింది. ది గార్డియన్ వెలువరించిన రిపోర్టు ప్రకారం ఈ ఘటనపై రష్యా స్పందిస్తూ ‘ప్రాథమిక నివేదికల ప్రకారం పారాచూట్‌లోని ప్రధాన భాగం ఏడు కిలోమీటర్ల ఎత్తులో తెరుచుకున్న సమయంలో పారాచూట్ పట్టీలు ముడుచుకుపోయాయి. ఇంతలో వ్యోమనౌక వేగంగా భూమిపై పడిపోయింది. ఈ దుర్ఘటన కొమరోవ్ మరణానికి దారితీసింది’ అని పేర్కొంది. సోయుజ్-1 మునుపటి రష్యన్ క్రాఫ్ట్ కంటే అధిక బరువు కలిగి ఉందని, ఇందులో సాధారణం కన్నా రక్షణ మార్జిన్లు తక్కువగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే రూ.72 కోట్లకు యజమాని.. బిజినెస్‌లో సక్సెస్.. లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. -
మొదటిసారిగా అంతరిక్షంలోకి పౌర వ్యోమగామిని పంపిన చైనా
బీజింగ్/జియుక్వాన్: చైనా మంగళవారం మొదటిసారిగా ఒక పౌర వ్యోమగామి సహా ముగ్గురు వ్యోమగాములను సొంత అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్‌కు పంపించింది. జియుక్వాన్ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములతో కూడిన షెంజౌ–16ను లాంగ్ మార్చ్–2ఎఫ్ రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. పది నిమిషాల తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన షెంజౌ–16 నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించిందని చైనా మానవసహిత అంతరిక్ష సంస్థ(సీఎంఎస్ఏ) తెలిపింది. ఈ మిషన్ పూర్తిగా విజయవంతంగా పూర్తయిందని పేర్కొంది. ‘షెంజౌ–16 అనంతరం టియాంగాంగ్ కోర్ మాడ్యూల్తో అనుసంధానమైంది. షెంజౌ–16లోని ముగ్గురు వ్యోమగాములు కోర్‌మాడ్యూల్ తియాన్హెలో ఉన్న ఇప్పటికే ఉన్న ముగ్గురు వ్యోమగాములను కలుసుకున్నారు. ఆ ముగ్గురు త్వరలోనే భూమికి తిరిగి వస్తారు’అని తెలిపింది. మంగళవారం పంపిన ముగ్గురిలో ఒకరు పేలోడ్ స్పెషలిస్ట్‌గా పేరున్న గుయి హయిచావో. ఈయన బీజింగ్‌లోని బీయిహంగ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. మిగతా ఇద్దరు పీపుల్స్ లిబరేషన్ ఆర్మికి చెందిన వారు. 2030కల్లా చంద్రునిపైకి మనుషులను పంపే మానవ సహిత యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎంఎస్ఏ సోమవారం ప్రకటించింది. -
థాంక్యూ సీఎం సార్.. మీ సాయంతో అంతరిక్షం అందుకుంటున్నా
రామచంద్రపురం: సైంటిస్ట్ ఆస్ట్రోనాట్‌గా ఎదగాలని కలలుగన్న ఓ యువతి ఆకాంక్షలకు ప్రభుత్వ సాయం తోడైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దంగేటి జాహ్నవి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈమెకు అంతరిక్ష రంగంపై విపరీతమైన మక్కువ. అమెరికా నాసా శిక్షణకు ఎంపికైన ఈమెకు ఆర్థిక ఇబ్బంది తలెత్తింది. బీసీ సంక్షేమ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే సీఎం ఈ శిక్షణ కోసం ఆమెకు రూ.50 లక్షలు మంజూరు చేశారు. దీంతో అమెరికాలోని నాసా అంతరిక్ష కేంద్రంలో నెల పాటు శిక్షణ పొందింది. ఇటీవల జాహ్నవి స్వస్థలం చేరుకుంది. మరికొన్నాళ్లు ఆమె శిక్షణ పొందాల్సి ఉంది. జాహ్నవి తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి వేణును కలిసింది. చిరకాల స్వప్నమైన సైంటిస్ట్ ఆ స్ట్రోనాట్ కావడానికి సహకారాన్ని అందజేసిన సీఎం జగన్‌కు, మంత్రి వేణుకు కృతజ్ఞతలు తెలిపింది. -
చంద్రుడి దాకా తొలి మహిళ
నీల్ ఆమ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టినప్పుడు ‘మానవాళి ముందంజ’ అని అభివర్ణించారు. కాని మానవాళి నిజమైన ముందంజ ఇకపై పడనుంది. వచ్చే సంవత్సరం చంద్రుణ్ణి చుట్టి రావడానికి వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల్లో ఒక మహిళా వ్యోమగామిని ఎంపిక చేసింది నాసా. ఆ విధంగా చంద్రుని దాకా వెళ్లనున్న తొలి మహిళగా వ్యోమగామి క్రిస్టినా కోచ్ చరిత్ర సృష్టించనుంది. 50 ఏళ్ల క్రితం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగు మోపినప్పుడు సమస్త మానవాళి అబ్బురపడింది. పులకించింది. మానవ చరిత్రలో శాస్త్ర, సాంకేతిక రంగాలు సాధించిన అపూర్వ ఘటనగా లిఖించుకుంది. భూమ్మీద నుంచి నిత్యం కనపడే, వెన్నెల కురిపించే, వేల ఏళ్లుగా ఎన్నో కథలకూ గాథలకూ ఆలవాలమైన చంద్రుడిపై అడుగుపెట్టడం అంటే సామాన్యమా మరి. ఈ చంద్రుణ్ణి అందుకోవడానికి అమెరికా నాసా ద్వారా 1968 నుంచి 72 మధ్య ‘అపోలో’ ద్వారా 24 మంది వ్యోమగాములను పంపితే 12 మంది చంద్రుడిపై దిగగలిగారు. అయితే వారంతా పురుషులు. ఇప్పటివరకూ ఒక్క స్త్రీ కూడా చంద్రుడిని తాకలేదు. కాని త్వరలో తాకబోతోంది. ‘అర్టిమిస్–2’ పేరుతో నాసా వచ్చే సంవత్సరం నిర్వహించనున్న చంద్రుని ప్రదక్షిణకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఒక మహిళ ఎంపికైంది. ఆమే క్రిస్టినా కోచ్. ఆ విధంగా చంద్రుడి వరకూ వెళ్లగలిగిన తొలి మహిళగా ఈమె చరిత్ర సృష్టించనుంది. చంద్రుడికి వీలైనంత దగ్గరగా వెళ్లి దాని చుట్టూ తిరిగి వచ్చే ఈ యాత్ర విజయవంతమైతే 2025లో జరిగే చంద్రయానంలో ఒక స్త్రీని పంపాలని నాసా నిర్ణయం. ఆ అసలు యాత్రకు కావలసిన ధైర్యం క్రిస్టినా ఇవ్వనుంది. ఆర్టిమిస్–2 అంటే? ఆర్టిమిస్–2 ప్రయోగంలో వ్యోమగాములు చంద్రుడి మీద కాలు పెట్టరు. చంద్రుడికి దగ్గరగా ఉన్న కక్ష్యలోనూ తిరుగాడరు. చంద్రుడికి కొంత దూరం నుంచి ప్రయాణిస్తారు. దీన్నే ఫ్లై బై అని పిలుస్తారు. చంద్రునిపై రోబోలు, మనుషులతో పరిశోధనలు చేపట్టేందుకు నాసా చేపట్టిన కార్యక్రమమే ఆర్టిమిస్. గత ఏడాది ఆర్టిమిస్–1 పేరుతో వ్యోమగాములు లేకుండా ఒరాయెన్ అనే స్పేస్క్యాప్సూల్ను చంద్రుని చుట్టూ తిప్పా రు. వచ్చే ఏడాది ఆర్టిమిస్–2 పేరుతో ఒరాయెన్ స్పేస్ క్యాప్సూల్‌లో నలుగురు వ్యోమగాములు ప్రయాణిస్తారు. ఈ నలుగురిలోనే క్రిస్టినా ఉంది. దాదాపు 10 రోజుల కాలంలో వీరంతా చంద్రుణ్ణి చుట్టి నేరుగా భూమిపైకి వస్తారు. ఒరాయెన్ క్యాప్సూల్‌లో వ్యోమగాముల కోసం చేసిన ఏర్పాట్లు, లైఫ్ సపోర్ట్ వ్యవస్థల పనితీరును పరిశీలించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. ఇది విజయవంతమైతే 2025లో ఆర్టిమిస్–3 ద్వారా వ్యోమగాములు, రోబోలు చంద్రుడిపైకి చేరి ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్టిమిస్–3లో పాల్గొనబోయే స్త్రీ వ్యోమగామి మళ్లీ క్రిస్టినాయే కావచ్చు. ఎవరీ క్రిస్టినా కోచ్? చంద్రుణ్ణి చుట్టి రావడానికి నలుగురు వ్యోమగాముల బృందంలో ఎంపికైన క్రిస్టినా కోచ్ ఆర్టిమిస్–2 యాత్రలో మిషన్ స్పెషలిస్ట్‌గా పని చేయనుంది. ఈమెతోపాటు మరో ముగ్గురు– జెరెమి హాన్సన్, విక్టర్ గ్లోవర్, రీడ్ వైజ్మెన్ ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిలో విక్టర్ గ్లోవర్ చంద్రుడి దాకా వెళ్లనున్న తొలి నల్ల జాతీయుడిగా చరిత్ర నమోదు చేయనున్నాడు. నార్త్ కరోలినాలో పుట్టి పెరిగిన క్రిస్టినా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసింది. 2013లో నాసాలో చేరి స్పేస్ సైన్స్ ఇన్స్ట్రుమెంట్ల తయారీలో నైపుణ్యం సంపాదించింది. అంతే కాదు అంతరిక్షంలో ఒక్కరుగా గడిపే సమయంలో ఏర్పడే వొత్తిడి, రేడియేషన్ ప్రభావం, మెక్కల పెంపకం లాంటి అంశాల మీద పరిశోధనలు చేసింది. అందుకే 2019 మార్చి 14 నుంచి 2020 ఫిబ్రవరి 6 వరకూ ఐ.ఎస్.ఎస్ (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో గడిపి సుదీర్ఘకాలం అంటే 328 రోజులు అంతరిక్షంలో గడిపిన తొలి మహిళగా రికార్డు స్థాపించింది. ఇంకా విశేషం ఏమిటంటే 2019 అక్టోబర్ 18న మరో మహిళా వ్యోమగామి జెస్సికా మెయర్‌తో కలిసి ఐ.ఎస్.ఎస్ నుంచి బయటకు వచ్చి దాని వెలుపల ఉండే ఒక భాగాన్ని రీప్లేస్ చేసింది. ఫలితంగా ఆల్ విమెన్ స్పేస్‌వాక్ చేసిన రికార్డు వీరిరువురూ నమోదు చేశారు. సొంత నేలపై ప్రేమ క్రిస్టినా కోచ్‌కు ఫొటోలు తీయడం ఇష్టం. తరచూ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంది. కాని అంతరిక్షం నుంచి ఆమె తీసిన ఒక ఫోటో మాత్రం ఆమె మరువలేదు. అది తను పుట్టి పెరిగిన నార్త్ కరోలినాప్రాంంతం ఫొటో. అంతరిక్షం నుంచి నార్త్ కరోలినాను మొదటిసారి చూసినప్పుడు ఆమె ఉద్వేగంతో ఊగిపోయింది. ఈ గడ్డలోనే కదా నేను ఇంతదాన్నయ్యాను అనుకుందామె. ఇటువంటి అనుభూతే ఆమెకు చంద్రుణ్ణి సమీపించినప్పుడు కలగవచ్చు. ఎందుకంటే చంద్రుడికి అతి దగ్గరగా వెళ్లిన తొలి మహిళ కదా. -
ఆకాశమంత అవకాశం
రేయనా బర్నావీ సౌదీ అరేబియా ఫస్ట్ ఉమెన్ ఆస్ట్రోనాట్‌గా చరిత్ర సృష్టించ నుంది. మహిళాసాధికారత విషయంలో సౌదీ మరో అడుగు ముందుకు వేసింది.. గత వైఖరికి భిన్నంగా సౌదీ అరేబియా మహిళా సాధికారత, హక్కులకు పెద్ద పీట వేస్తోంది. తనను తాను కొత్తగా నిర్వచించుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు... మేల్ గార్డియన్ లేకుండా మహిళలు డ్రైవింగ్ చేయకూడదు, విదేశాలకు వెళ్లకూడదు అనే ఆంక్షలు ఉన్న దేశంలో ఎంతో మార్పు వచ్చింది. దీనికి బలమైన ఉదాహరణ... సౌదీ అరేబియా తొలిసారిగా రేయనా బర్నావీ అనే మహిళను స్పేస్ మిషన్ ఎఎక్స్–2కు ఎంపిక చేయడం. సౌదీ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ప్రోగ్రాం, ప్రైవెట్ స్పేస్ కంపెనీ ఆక్సియం స్పేస్ (యూఎస్) భాగస్వామ్యంతో చేపట్టిన స్పేస్ మిషన్‌లో 33 సంవత్సరాల బర్నావీ సౌదీ అరేబియా ఫస్ట్ ఉమెన్ ఆస్ట్రోనాట్‌గా చరిత్ర సృష్టించబోతోంది. న్యూజిలాండ్‌లోని ఒటాగో యూనివర్శిటీ నుంచి బయోమెడికల్ సైన్స్‌లో పట్టాపుచ్చుకున్న బర్నావీ రియాద్‌లోని అల్ఫైసల్ యూనివర్శిటీలో బయోమెడికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేసింది. క్యాన్సర్ స్టెమ్ సెల్ రిసెర్చ్‌లో తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉంది. కొన్ని నెలల్లో ్ర΄ారంభం కానున్న తమ స్పేస్మిషన్ను దృష్టిలో పెట్టుకొని సౌదీ స్పేస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఒక వీడియో విడుదల చేసింది. భావుకత నిండిన ఆ వీడియోలో కొన్ని వాక్యాలు ఇలా ఉంటాయి... సగర్వంగా తల పైకెత్తి చూడు/ ఆకాశంలో అసంఖ్యాకమైన నక్షత్రాలు కనిపిస్తాయి వాటిని పలకరించాలి/ పరిచయం చేసుకోవాలి/ పేరు పెట్టాలి/ నక్షత్రాలు నీ స్నేహితులు కావాలి అంతరిక్షం అనేది నీ అపురూపమైన ఇష్టం కావాలి/ ఆకాశ మార్గంలో నీదైన దారి వెదుక్కో అధ్యయనం చేయాలి/పరిశోధించాలి/ కొత్త విషయాలను ఆవిష్కరించాలి/నీ తరానికి స్ఫూర్తిగా నిలవాలి నీ మార్గంలో నువ్వు ఒంటరివి కావు/ నీ పూర్వీకులెందరో ఆ బాటలో నడిచారు/ గొప్ప విజయాలు సాధించారు/ నీ కలను ఆవిష్కరించే సమయం వచ్చింది ఆ కలకు రెక్కలు ఇచ్చే సమయం వచ్చింది... లెట్ ఇట్ ఫ్లై! వీడియో తొలి దృశ్యంలో ఒక మహిళ కనిపించడం యాదృచ్ఛికం కాక΄ోవచ్చు. అంతరిక్ష విషయాల్లో, విజయాల్లో మహిళలు ముందుండబోతున్నారు అని ప్రతీకాత్మకంగా చెప్పడం కావచ్చు! -
రాజా చారికి బ్రిగేడియర్ జనరల్ హోదా
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ వ్యోమగామి, కల్నల్ రాజా జె.చారి(45) ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ హోదాకు ఎంపికయ్యారు. ఈ హోదాకు ఆయన్ను ఎంపిక చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ గురువారం ఒక ప్రకటన చేశారు. ఈ నియమాకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంది. అధ్యక్షుడు జరిపే అన్ని పౌర, సైనిక నియామకాలపై సెనేట్ సాధారణంగా ఆమోదముద్ర వేస్తుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాజా చారి టెక్సాస్‌లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్లో క్రూ–3 కమాండర్, ఆస్ట్రోనాట్‌గా ఉన్నారు. రాజా చారి తండ్రి శ్రీనివాసా చారి తెలంగాణకు చెందిన వారు. ఆయన హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదివి అమెరికాకు చేరుకున్నారు. వాటర్లూలోని జాన్ డీర్ సంస్థలో పనిచేశారు. రాజా చారి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, మేరీల్యాండ్‌లోని యూఎస్ నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 461వ ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్ కమాండర్‌గా, ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఎఫ్–35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్‌కు డైరెక్టర్‌గాను వ్యవహరించారు. రాజా చారి తన కెరీర్లో 2,500 గంటలకు పైగా ఫ్టైట్ టైంను సాధించారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో బ్రిగేడియర్ జనరల్(బీడీ) ఒన్ స్టార్ జనరల్ ఆఫీసర్ స్థాయి. ఇది కల్నల్‌కు ఎక్కువ, మేజర్ జనరల్ స్థాయికి తక్కువ. -
పుట్టినరోజునాడే నాలుగో పెళ్లి
వాషింగ్టన్: ఆయనకు ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయ్యి.. విడాకులు అయ్యాయి. తాజాగా నాలుగో పెళ్లి చేసుకున్నారు. అదీ పుట్టినరోజు నాడే. అంతలా ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారా?. చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు?.. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కదా!. మరి రెండో వ్యక్తి ఎవరు?.. ఈయనే ఆయన. పేరు ఎడ్విన్ బజ్ అల్డ్రిన్. అమెరికా మాజీ వ్యోమగామి. అపోలో 11 మిషన్ ద్వారా చంద్రుడిపై పాదం మోపి.. సంచరించిన ముగ్గురు వ్యోమగాముల్లో ఈయన కూడా ఒకరు. పైగా ఆ బ్యాచ్‌లో ఇంకా బతికి ఉంది కూడా ఈయనే. ఎడ్విన్ బజ్ అల్డ్రిన్.. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత చంద్రుడిపై పాదం మోపిన రెండో వ్యక్తి. ఆర్మ్‌స్ట్రాంగ్‌తో పాటు 19 నిమిషాల చంద్రుడిపై సంచరించారీయన. నీల్ ఆర్మ్‌స్టాంగ్ ఈ మిషన్‌లో కమాండర్‌గా వ్యవహరించగా.. ఎడ్విన్ బజ్ అల్డ్రిన్ ‘లునార్ మాడ్యుల్ పైలట్’గా వ్యవహరించారు. ఇక మైకేల్ కోలిన్స్ కమాండ్ మాడ్యుల్ పైలట్‌గా పని చేశారు. అపోలో 11 మిషన్ 1969 జులై 16వ తేదీన లాంఛ్ కాగా, జులై 20వ తేదీన చంద్రుడిపై తొలిసారిగా మానవుడు అడుగుపెట్టాడు. ఇక.. మూడుసార్లు అంతరిక్షంలో సంచరించిన వ్యోమగామిగానూ అల్డ్రిన్ పేరిట ఓ రికార్డు ఉంది. 1971లో నాసా నుంచి రిటైర్ అయిన ఈ పెద్దాయన.. 1998లో షేర్స్పేస్ ఫౌండేషన్‌ను స్థాపించి అంతరిక్ష అన్వేషణ సిబ్బందికి శిక్షణ ఇస్తూ వస్తున్నారు. గతంలో ఆయనకు మూడు సార్లు వివాహం అయ్యింది. 1954-1974, 1975-78, 1988-2012.. ఇలా మూడుసార్లు ఆయన వివాహాలు విడాకులు అయ్యాయి. అయితే ఆ తర్వాత ఆయన డాక్టర్ అంకా ఫౌర్తో డేటింగ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా తన 93వ పుట్టినరోజున.. 63 ఏళ్ల అంకాను వివాహం చేసుకున్నాడాయన. లాస్ ఏంజెల్స్ కలిఫ్లో దగ్గరి వాళ్ల మధ్య సింపుల్‌గా ఈ వివాహం జరిగింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసిన ఆ పెద్దాయ.. ఇంట్లోనుంచి పారిపోయే కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని ఉద్వేగాన్ని ప్రదర్శిస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. On my 93rd birthday & the day I will also be honored by Living Legends of Aviation I am pleased to announce that my longtime love Dr. Anca Faur & I have tied the knot.We were joined in holy matrimony in a small private ceremony in Los Angeles & are as excited as eloping teenagers pic.twitter.com/VwMP4W30Tn — Dr. Buzz Aldrin (@TheRealBuzz) January 21, 2023 -
ఇచ్చిన మాటకు కట్టుబడి.. జాహ్నవికి రూ.50లక్షల సాయం
సాక్షి, పశ్చిమగోదావరి: ఇచ్చిన మాట ప్రకారం తనకు సీఎం వైఎస్ జగన్ రూ.50 లక్షల సాయం అందజేయడంపై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన అనలాగ్ ఆస్ట్రోనాట్ దంగేటి జాహ్నవి ఆనందం వ్యక్తం చేసింది. జగనన్న మేలు మర్చిపోలేనిదని పేర్కొంది. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఇటీవల వరదల సమయంలో సీఎం రాజమండ్రి వచ్చినప్పుడు కలిశానని, ‘‘నీ విద్యకు ఆర్థిక ఇబ్బందులు రాకూడదు.. నీకు ఏ అవసరం ఉన్నా నేను సహకరిస్తా’’ అంటూ అప్పుడు ఆయన హామీ ఇచ్చారని పేర్కొంది. సీఎం భరోసాతో ఆస్ట్రోనాట్‌గా అవ్వాలన్న తన ఆశలు మరింత పెరిగాయంది. బుధవారం అమరావతిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతులమీదుగా ప్రభుత్వం అందించిన రూ. 50 లక్షల చెక్కును జాహ్నవి అందుకుంది. చదవండి: (Janasena: జనసేన జేపీ నకిలీ చేష్టలు) -
Jahnavi Dangeti: వ్యోమగామి కలకు సీఎం జగన్ చేయూత
సాక్షి, అమరావతి/పాలకొల్లు అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామి అవ్వాలనే కలను సాకారం చేస్తూ సీఎం వైఎస్ జగన్ రూ.50 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసినట్టు పౌరసంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. సచివాలయంలో బుధవారం జాహ్నవికి చెక్కును అందజేశారు. చదవాలనే తపన ఉండి నిరుపేద విద్యార్థులకు సీఎం జగన్ ఎప్పుడూ అండగా నిలుస్తారని చెప్పారు. జాహ్నవి పంజాబ్‌లో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. వ్యోమగామి అవ్వాలనే లక్ష్యంతో నాసాతో పాటు పోలాండ్‌లో అనలాగ్ ఆస్ట్రోనాట్ శిక్షణ పొందింది. అయితే వ్యోమగామికి అంతర్జాతీయ సంస్థలో పైలెట్ శిక్షణ పొందాల్సి ఉండగా ఆర్థిక సాయం నిమిత్తం సీఎంని కలిసి కోరగా సానుకూలంగా స్పందించారు. నెలలోపే ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. జాహ్నవి మాట్లాడుతూ సీఎం దీవెనలతో త్వరలోనే శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తానని చెప్పారు. వ్యోమగామిగా దేశ కీర్తిని పెంచేందుకు కష్టపడతానని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాసరావు ఉన్నారు. విజయవాడలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను జాహ్నవి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా జాహ్నవిని పద్మ సత్కరించారు. (క్లిక్ చేయండి: చరిత్ర సృష్టించిన జాహ్నవి.. స్పేస్ కావాలి!) -
భారత్‌కు అంతరిక్ష కేంద్రం నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు
India celebrates its Independence Day not world But Space Well: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా అంతరిక్షం నుంచి కూడా భారత్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు భారతీయ అమెరికన్ వ్యోమోగామి రాజా చారి ట్విట్టర్లో విదేశాల్లో నివశిస్తున్న భారతీయులకు శుభాకాంక్షల సందేశాలతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో భారతీయ జెండా ఫోటోను కూడా పోస్ట్ చేశారు. రాజా చారి ఇటీవల ఐఎస్ఎస్లో ఆరునెలల మిషన్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. మే నెలలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సురక్షితంగా ల్యాండ్ చేసిన స్పేఎక్స్ అంతరిక్ష నౌకలో నలుగురు వ్యోమోగాములలో అతను కూడా ఉన్నారు. ఈ మేరకు చారి ట్విట్టర్లో.... " భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా పూర్వీకుల మూలాలను గుర్తుతెచ్చుకుంటునమ్నాను. వలస వచ్చిన తన తండ్రి స్వస్థలం హైదరాబాద్ ఈ రోజు మెరిసిపోతుంది. యూఎస్‌లో ఉండే ప్రతి భారతీయ అమెరికన్‌కి ప్రతిరోజు ఒక వైవిధ్యంగా ఉంటుంది. తాను యూఎస్‌లోని ఇండియన్ ఎంబసీ వేడుకల కోసం ఎదురుచూస్తున్నాను. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులందరికి స్వాతంత్య్ర శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. చారి తాతగారిది తెలంగాణలోని మహబూబ్ నగర్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో గణిత శాస్త్ర ప్రోఫెసర్‌గా పనిచేశారు. చారి తండ్రి శ్రీనివాస్ అదే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత అమెరికా వెళ్లారు. ఆ తర్వాత చారీ అక్కడే యూఎస్‌లోని విస్కాన్సిన్లోని మిల్వాకీలో జన్మించాడు. అయోవాలోని వాటర్లూలో కొలంబస్ హై స్కూల్ నుంచి ప్రాధమిక విద్యను, కొలరాడోలోని యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశడు. ఆ తర్వాత అతను కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాడు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా కోసం పనిచేస్తున్న రాజా చారి 2017లో వ్యోమోగామిగా ఎంపికయ్యాడు. On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s home town of Hyderabad shines bright. @nasa is just 1 place Indian Americans make a difference every day. Looking forward to @IndianEmbassyUS celebration pic.twitter.com/4eXWHd49q6 — Raja Chari (@Astro_Raja) August 14, 2022 (చదవండి: భారత్‌తో పాటు ఇతర దేశాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు) -
అమ్మమ్మ కథలు.. అస్ట్రోనాట్ కలలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)తూర్పుగోదావరి: నిండు పున్నమి రోజు ఆరు బయట మంచం మీద బామ్మ ఆమెకు అన్నం తినిపిస్తూ ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ అనేక కథలు చెప్పేది. చందమామ లోపల ఒక ముసలావిడ నూలు వడుకుతుందని చెప్పేది. ఒక్కోసారి చందమామ ఎందుకు కనిపించకుండా పోతుందని అమ్మమ్మని అడిగితే..రాహువు, కేతువులు చందమామని మింగేస్తారు అందుకే చందమామ క్రమంగా తరుగుతూ, పెరుగుతూ ఉంటుందని తెలపడంతో మనవరాలిలో ఆలోచనలు మొలకెత్తాయి. చదవండి: రాజమౌళి తండ్రి హైస్కూల్ వరకూ చదివింది ఇక్కడే.. ఆ చిన్నారికి చందమామ దగ్గర ఏం ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి వయసుతోపాటు పెరుగుతూ వచ్చింది. 17 సంవత్సరాలకే నాసా నిర్వహించిన ప్రోగ్రామ్‌లో పాల్గొని రికార్డు నెలకొల్పింది. 18 ఏళ్ల వయసులో ఇప్పుడు పోలెండ్‌లో నిర్వహించిన అంతరిక్ష వ్యోమగాముల శిక్షణ శిబిరంలో పాల్గొని అతి చిన్న వయసులో ఈ శిక్షణ పొందిన మొదటి మహిళగా రికార్డు సాధించింది. అంతరిక్షంలో విహారానికి రెక్కలు చాపుకుని ప్రయత్నిస్తున్న ఆ అమ్మాయి పాలకొల్లుకి చెందిన జాహ్నవి దంగేటి. అమ్మమ్మ నాగమణితో జాహ్నవి అమ్మమ్మ లాలనలో... జాహ్నవి అమ్మానాన్నలు శ్రీనివాస్, పద్మశ్రీ ఉద్యోగ రీత్యా కువైట్‌లో ఉండడంతో ఆమె అమ్మమ్మ నాగమణి దగ్గర పెరిగింది. అమ్మాయిలకు స్వీయరక్షణ సామర్థ్యం ఉండాలని జాహ్నవి తండ్రి ఆలోచన ఆమెను ఐదవ తరగతిలో కరాటే నేర్చుకొనేలా చేసింది. అందులో నేషనల్, ఇంటర్నేషనల్ పతకాలు సాధించింది. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్‌లో కూడా తర్ఫీదు పొందింది. 17వ ఏటే నాసాలో పాల్గొన్న రికార్డు పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉండే జాహ్నవి పంజాబ్‌లోని లవ్లీ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. యూఎస్‌కి చెందిన నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం లేని ప్రోగ్రామ్‌లో ఆమె పాల్గొంది. జాహ్నవి పాల్గొనడం ఒక్క భారతదేశానికే కాదు ఆసియా ఖండానికి కూడా రికార్డే. తల్లిదండ్రులతో జాహ్నవి రాకెట్ నడిపింది.. జాహ్నవి గత సంవత్సరం 2021 నవంబర్ 12వ తేదీన యూఎస్‌కి వెళ్లి అక్కడి అలబామాలోని నాసాకు చెందిన స్పేస్ అండ్ రాకెట్ సైన్స్ సెంటర్లో అస్ట్రానాట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పూర్తి చేసుకొంది. పది రోజుల్లో ఆమె జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్, ట్రైనింగ్, అండర్‌వాటర్ రాకెట్ లాంచ్ చేయడంతో పాటు ఎయిర్ క్రాఫ్ట్‌ను నడపడం కూడా నేర్చుకొంది. మెషీన్ కంట్రోలర్‌కి ఫ్లైట్ డైరెక్టర్‌గా వేర్వేరు దేశాలకు చెందిన పదహారు మంది యువతతో కూడిన బృందానికి జాహ్నవి నేతృత్వం వహించింది. సెస్మా 170 స్కైహాక్ అనే చిన్న రాకెట్‌ని విజయవంతంగా లాంచ్ చేసింది. భూమి మీద నుంచి గాల్లోకి ఎగరడం, దాదాపు అరగంట సేపు ఆకాశంలో విహరించడం, తిరిగి జాగ్రత్తగా ల్యాండ్ చేయడంలో ప్రతిభ చూపింది. నాసా సెంటర్లో తోటి అనలాగ్ అస్ట్రోనాట్స్‌తో కలెక్టర్ ప్రశంసలు పొంది.. పోలెండ్‌లో నిర్వహించిన అంతరిక్ష వ్యోమగాముల శిక్షణ శిబిరంలో పాల్గొని అతి చిన్న వయసులో ఈ శిబిరంలో పాల్గొన్న మొదటి మహిళాగా రికార్డు సాధించిన జాహ్నవి బుధవారం పోలెండ్ నుంచి రాజమహేంద్రవరం చేరుకుని కలెక్టర్ మాధవీలతను మర్యాద పూర్వకంగా కలిసింది. అనలాగ్ అస్ట్రోనాట్‌గా శిక్షణ పొంది దేశానికి గర్వకారణంగా జాహ్నవి నిలిచిందని, అంతరిక్షంలోకి వెళ్లాలన్న ఆమె లక్ష్యం నెరవేరాలని కలెక్టర్ మాధవీలత ఆకాంక్షించారు. తమ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామన్నారు. స్కూబా డైవింగ్ నేర్చుకున్నాను స్కూబా డైవింగ్ అని చెప్తే ఇంటో వాళ్లు పంపించరేమోనని స్విమ్మింగ్ అని చెప్పి వైజాగ్ వెళ్లాను. ఆ తర్వాత గోవాకు వెళ్లి ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొని లైసెన్స్ తీసుకున్నాను. అండమాన్‌లో స్కూబా డైవింగ్‌లో అడ్వాన్స్డ్ కోర్సు పూర్తి చేశాను. అంతరిక్షంలో జీరో గ్రావిటీలోనే ఉండాలి. నీటి అడుగున కూడా గ్రావిటీ ఉండదు. ఆ ఎక్స్పీరియన్స్ కోసమే స్కూబా డైవింగ్ నేర్చుకున్నాను. పీపుల్స్ చాయిస్ అవార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నా పేరు నమోదు అయ్యింది. నేను సాధించిన వాటికి వచ్చిన ప్రశంసలన్నీ మా అమ్మమ్మకే దక్కాలి. – జాహ్నవి దంగేటి -
ఎక్కడున్నా.. పక్కనున్నట్టే..
ఒక్క బటన్ నొక్కగానే అక్కడెక్కడో ఉన్న వ్యక్తి ఠక్కున ఓ కాంతి రూపంలో ప్రత్యక్షమై మాట్లాడటం చాలా హాలీవుడ్ సినిమాల్లో చూసే ఉంటారు. సినిమాల్లో కనిపించిన ఈ టెక్నాలజీ ఇప్పుడు నాసా వాళ్లు కూడా వాడేస్తున్నారు. ఈ టెక్నాలజీ సాయంతోనే ఓ నాసా డాక్టర్, ఆయన బృందం.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆమధ్య ప్రత్యక్షమయ్యారు. ఫ్రెంచ్ ఆస్ట్రొనాట్తో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వార్త తాజాగా బయటకు వచ్చింది. ఇంతకీ ఇందుకోసం వాడిన సాంకేతికత పేరేంటో తెలుసా.. ‘హోలోపోర్టేషన్’. భూమి నుంచి అంతరిక్షంలోకి హోలోపోర్ట్ అయిన తొలి మనుషులు ఈ నాసా డాక్టర్ల బృందమే. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఏంటీ హోలోపోర్టేషన్? హోలోపోర్టేషన్ టెక్నాలజీ సాయంతో మనుషులను 3డీ రూపంలో ఎక్కడైనా ప్రత్యక్షమయ్యేలా చేయొచ్చు. ఈ టెక్నాలజీ కోసం తయారు చేసిన లెన్స్‌ల సాయంతో అలా ప్రత్యక్షమైన ఎదుటి వ్యక్తులు చెప్పేది వినొచ్చు, వాళ్లతో మాట్లాడవచ్చు. అంటే.. ఎక్కడో ఉన్న వ్యక్తి ఈ టెక్నాలజీ సాయంతో మన పక్కనే, మన ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందన్నమాట. మైక్రోసాఫ్ట్ 2016 నుంచి.. హోలోపోర్టేషన్ టెక్నాలజీని మైక్రోసాఫ్ట్ సంస్థ 2016 నుంచి వాడుతోంది. హోలోపోర్టేషన్ మానవులు సృష్టించిన అద్భుతమైన టెక్నాలజీ అని, మనం ఫిజికల్‌గా వెళ్లలేని ప్రాంతాలకు దీని సాయంతో చేరుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. స్పేస్ స్టేషన్ గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా, భూమికి 400 కిలోమీటర్ల పైన ఉన్నా ఈ సాంకేతికతతో ఠక్కున అక్కడ ప్రత్యక్షమై వ్యోమగాములతో మాట్లాడొచ్చంటున్నారు. మున్ముందు ఎక్కడెక్కడ వాడొచ్చు? కరోనా మహమ్మారి తర్వాత టెలీ మెడిసిన్ విధానం బాగా పెరిగిందని, ఈ టెక్నాలజీని టెలీ మెడిసిన్‌కు జోడిస్తే మంచి ఫలితాలుంటాయని నాసా వివరించింది. హాప్టిక్ (టచ్ టెక్నాలజీ)తో హోలోపోర్టేషన్ను కలిపి వాడి ఒక పరికరంపై ఇద్దరూ కలిసి పని చేసే అవకాశం ఉంటుందని.. ఆపరేషన్లు, సర్జరీల్లో ఇది మరింత ఉపయోగపడనుందని తెలిపింది. అంటార్కిటికా ఖండం, ఆయిల్ రిగ్స్ లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పని చేస్తున్న వాళ్లతో ఈ టెక్నాలజీ సాయంతో మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పింది. త్వరలో మార్స్‌కు వ్యోమగాములను పంపనున్నామని, డీప్ స్పేస్ మిషన్లలో కూడా హోలోపోర్టేషన్ వాడే అవకాశం ఉందని వివరించింది. నాసా ఏమంటోంది? గతేడాది అక్టోబర్‌లో ఈ టెక్నాలజీని వాడి స్పేస్ స్టేషన్‌లోని వ్యోమగాములతో తమ డాక్టర్ల బృందం మాట్లాడిందని నాసా చెప్పింది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన హోలోలెన్స్ కైనెక్ట్ కెమెరా, అవసరమైన సాఫ్ట్వేర్ సాయంతో ఇది సాధ్యమైందని వివరించింది. ‘ఈ టెక్నాలజీని మున్ముందు మేము ప్రైవేట్ మెడికల్ కాన్ఫరెన్స్‌లు, ప్రైవేట్ సైకియాట్రిక్ కాన్ఫరెన్స్‌లు, ప్రైవేట్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్‌ల కోసం వాడతాం. అలాగే వీఐపీలు వ్యోమగాములతో మాట్లాడేందుకు కూడా వినియోగిస్తాం’ అని నాసా చెప్పింది. -
చరిత్ర సృష్టించిన పశ్చిమ గోదావరి జాహ్నవి.. స్పేస్ కావాలి!
ఓ పాపాయి నేను డాక్టర్ని అవుతాను... అంటే! మన దగ్గర కావలసినన్ని కాలేజీలున్నాయి. మరో పాపాయి ‘ఇంజినీరింగ్ ఇష్టం’ అంటే... లెక్కకు మించిన విద్యాసంస్థలున్నాయి. ‘నేను ఆస్ట్రోనాట్ అవుతాను’ అంటే... ఎలా చదవాలో చెప్పేవాళ్లే లేరు. ‘స్పేస్ ఎడ్యుకేషన్’కి తగిన స్పేస్ మన దగ్గర లేదు. ఒక కల్పనాచావ్లా... మరో సునీతా విలియమ్స్ గురించి చెప్పుకుని సంతోషపడుతున్నాం ఇప్పటికీ. భారత సంతతికి చెందిన వారని సంతృప్తిపడుతున్నాం. మనదేశం నుంచి తొలిసారిగా ఒక అమ్మాయి ముందుకొచ్చింది. ‘నేను అంతరిక్షంలో అడుగుపెడతాను’ అంటున్న... ఈ తెలుగమ్మాయి పేరు జాహ్నవి దంగేటి. ‘చందమామ రావే’ అంటూ సాగిన బాల్యం. ‘అంతరిక్షంలో విహరిస్తా’ అంటూ రెక్కలు విచ్చుకున్నది. జాహ్నవి దంగేటిది పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. యూఎస్‌కు చెందిన నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి పార్టిసిపేషన్ లేని ప్రోగ్రామ్‌లో ఆమె పాల్గొన్నది. జాహ్నవి రికార్డు ఒక్క భారతదేశానికే కాదు ఆసియా ఖండానికి కూడా రికార్టే. రాకెట్ నడిపింది! జాహ్నవి గత నవంబర్ పన్నెండున యూఎస్‌కి వెళ్లి, అక్కడి అలబామాలోని నాసాకు చెందిన ‘స్పేస్ అండ్ రాకెట్ సైన్స్ సెంటర్’లో ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పూర్తి చేసుకుని 22వ తేదీన తిరిగి వచ్చింది. పదిరోజుల్లో ఆమె జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, అండర్‌వాటర్ రాకెట్ లాంచ్ చేయడంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్‌ను నడపడం కూడా నేర్చుకుంది. జాహ్నవి మిషన్ కంట్రోలర్‌కి ఫ్లైట్ డైరెక్టర్‌గా వేర్వేరు దేశాలకు చెందిన పదహారు మంది యువతతో కూడిన బృందానికి నేతృత్వం వహించింది. ‘సెస్నా 171 స్కైహాక్’ అనే చిన్న రాకెట్‌ను విజయవంతంగా లాంచ్ చేసింది. ‘భూమి మీద నుంచి గాల్లోకి ఫ్లై అవడం, దాదాపు అరగంట సేపు ఆకాశంలో విహరించడం, తిరిగి జాగ్రత్తగా ల్యాండ్ చేయడం’ మరిచిపోలేని అనుభూతి అన్నది ఈ అమ్మాయి. ‘ఆస్ట్రోనాట్‌గా పూర్తి స్థాయి శిక్షణ తీసుకోవాలనే కోరిక బలపడడంతోపాటు ఆస్ట్రోనాట్ కాగలననే నమ్మకం కూడా కలిగింది. పైలట్ ఆస్ట్రోనాట్ అయి తీరుతాను’ అని చెప్పింది. అమ్మమ్మ పెంపకం! జాహ్నవి అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా కువైట్‌లో ఉండడంతో ఆమె అమ్మమ్మ లీలావతి దగ్గరే పెరిగింది. అమ్మమ్మ చందమామ కబుర్లు చెబుతూ పెంచింది. అలా ఆకాశంలో విహరించాలనే కోరికకు బీజం పడింది. అమ్మాయిలకు స్వీయరక్షణ సామర్థ్యం ఉండాలని జాహ్నవి తండ్రి ఆలోచన ఆమెను ఐదవ తరగతిలో కరాటే క్లాసులో చేర్చింది. అందులో నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించింది. అంతరిక్షం కల మాత్రం ఆమెను వెంటాడుతూనే వచ్చింది. అందుకు ఉపకరించే స్కిల్స్ కోసం అన్వేషణ ఆమె మదిలో సాగుతూనే ఉండేది. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్‌లో కూడా తర్ఫీదు పొందింది. వివక్ష తప్పలేదు... కానీ! ఆడపిల్లలు డైనమిక్‌గా ఉంటే సమాజం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. తీర్పులు ఇస్తూనే ఉంటుంది. వద్దన్నా వినకుండా సలహాలు ఇస్తూనే ఉంటుంది. ఇవన్నీ తనకూ తప్పలేదని చెప్పింది జాహ్నవి. ‘‘పాలకొల్లు వంటి చిన్న పట్టణంలో చాలామందికి నేను చేస్తున్నవన్నీ విచిత్రాలుగానే తోచాయి. మెడిసినో, కంప్యూటర్ ఇంజనీరింగో చేసి ఉద్యోగం చూసుకోకుండా ఇవెందుకు? అన్నారు. ఇంతడబ్బు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా! అని కూడా అన్నారు. ఇవన్నీ వాళ్లకు ‘స్పేస్’ మీద అవగాహన లేకపోవడం వల్ల అన్న మాటలే. అందుకే ప్రతి పట్టణంలోనూ స్పేస్ మ్యూజియం కానీ అంతరిక్ష పరిజ్ఞానానికి సంబంధించిన యాక్టివిటీ సెంటర్ కానీ పెడితే బావుంటుంది. అమ్మాయిలను రొటీన్ కోర్సులకు పరిమితం చేయకుండా వాళ్లకు ఇష్టమైన కోర్సుల్లోకి వెళ్లడానికి ప్రోత్సహించమని పెద్దవాళ్లను కోరుకుంటున్నాను. మా క్లాసులో 33 మంది అబ్బాయిలుంటే నేను మాత్రమే అమ్మాయిని. ఈ విషయంలో మా అమ్మానాన్నలు గ్రేట్ అని అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది’’ అని చెప్పింది జాహ్నవి. అంతరిక్షమే హద్దు! ‘‘స్కూబా డైవింగ్ అని చెప్తే ఇంట్లో వాళ్లు పంపించరేమోనని స్విమ్మింగ్ అని చెప్పి వైజాగ్‌కు వెళ్లాను. ఆ తర్వాత గోవాకు వెళ్లి ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొని లైసెన్స్ తీసుకున్నాను. అండమాన్‌లో స్కూబా డైవింగ్‌లో అడ్వాన్స్డ్ కోర్సు పూర్తి చేశాను. అంతరిక్షంలో జీరో గ్రావిటీలోనే ఉండాలి. నీటి అడుగున కూడా గ్రావిటీ ఉండదు. ఆ ఎక్స్‌పీరియెన్స్ కోసమే స్కూబా డైవింగ్ కోసం అంత పట్టుపట్టాను. ఈ మధ్యలో ఓసారి నా ఆలోచనలు ఏవియేషన్ పైలట్ వైపు మళ్లాయి. కానీ నాన్న ‘నీ లక్ష్యం అంతకంటే పెద్దది, దాని మీద నుంచి దృష్టి మరల్చవద్దు’ అన్నారు. ఇక అంతరిక్షం అనే కల నాతోపాటు పెరిగి నాలో స్థిరపడిపోయింది. ఇంజినీరింగ్‌కి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీని ఎంచుకోవడంలో ఉద్దేశం కూడా అంతరిక్షం కలను సాకారం చేసుకోవడానికే. ఇప్పటికే ఆన్లైన్లో నాసా నిర్వహించిన ఐదు ప్రోగ్రామ్‌లలో పాల్గొన్నాను. గత ఏడాది ‘పీపుల్స్ చాయిస్’ అవార్డు కూడా వచ్చింది. అయితే ఇప్పటి వరకు నాసా నుంచి నేను సాధించిన అన్నింటిలో ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. నేను ఇవన్నీ చేస్తున్న సమయంలోనే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ నుంచి ఫోన్ వచ్చింది. ఆగస్టులో ఆ పురస్కారం అందుకున్నాను. నేనేం సాధించినా ప్రశంసలు దక్కాల్సింది మా అమ్మమ్మకే’’ అన్నది జాహ్నవి అమ్మమ్మను అల్లుకుంటూ... ‘నాసా’ సెంటర్లో, అమ్మమ్మ లీలావతితో జాహ్నవి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: రియాజ్, ఏలూరు -
‘బార్బీ’ ది ఆస్ట్రోనాట్
బార్బీ బొమ్మలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్. చాలా దేశాల్లో బార్బీతో ఆడుకోని అమ్మాయిలే ఉండరని చెప్పొచ్చు. ఇప్పుడా బార్బీ సరికొత్త రూపం సంతరించుకుని.. అంతరిక్షంలో చక్కర్లు కొట్టేసి వచ్చింది. వచ్చే ఏడాది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్ఎస్)కీ వెళ్లబోతోంది. ‘స్టెమ్’ వైపు అమ్మాయిలు.. ‘సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్’ రంగాల సంక్షిప్త రూపమే ‘స్టెమ్’. ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలను స్టెమ్, స్పేస్ రీసెర్చ్ వైపు ప్రోత్సహించడం, ఆయా రంగాల్లో తమ ఆడపిల్లలను ప్రోత్సహించేలా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా ‘బార్బీ ఆస్ట్రోనాట్’ను రూపొందించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ), బార్బీ బొమ్మల కంపెనీ సంయుక్తంగా ‘వుమన్ ఇన్ స్పేస్’ థీమ్‌తో ఈ ప్రాజెక్టును చేపట్టాయి. తాజాగా ఈఎస్ఏ నిర్వహించిన ‘వామిట్ కమెట్’ జీరో గ్రావిటీ ప్రయోగంలో బార్బీ బొమ్మకు కూడా స్థానం కల్పించారు. భార రహిత స్థితిలో తేలుతున్న బార్బీ చిత్రాలను విడుదల చేశారు. ఆ రూపం ఎవరిదో తెలుసా..? ఇంతకీ ‘బార్బీ ఆస్ట్రోనాట్’ రూపం ఎవరిదో తెలుసా.. ఇటలీ ఆస్ట్రోనాట్ సమంతా క్రిస్టోఫరెట్టి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్త అయిన ఆమె.. ఇంతకుముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 200 రోజులు గడిపి వచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఆమె మళ్లీ ఐఎస్ఎస్కు వెళ్తున్నారు. అప్పుడు ‘బార్బీ ఆస్ట్రోనాట్’ను కూడా తన వెంట తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతానికి ఈ ‘బార్బీ ఆస్ట్రోనాట్’ బొమ్మలు యూరప్ దేశాల్లో విక్రయిస్తున్నారు. త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశముంది. ఈ ఫొటోలో ధగధగా మెరుస్తూ వెంట్రుకల్లా ఉన్నవేమిటో తెలుసా..? అగ్ని పర్వతం నుంచి వెలువడిన గాజు పోగులు. హవాయిలో ఇటీవలే బద్దలైన కిలాయి అగ్ని పర్వతం నుంచి.. అచ్చం వెంట్రుకల్లా సన్నగా, తేలిగ్గా లేత బంగారు రంగులో ఉండే గాజు పోగులు వెలువడుతున్నాయి. వీటిని ‘పెలెస్ హెయిర్’గా పిలుస్తారు. హవాయ్ ప్రజలు పూజించే అగ్నిపర్వతాల దేవత పేరు ‘పెలె’. బంగారు రంగులో ఉండే ఈ గాజు పోగులు ఆ దేవత వెంట్రుకలేనని స్థానికులు చెప్తారు. అందుకే వీటికి పెలెస్ హెయిర్’గా పేరుపెట్టారు. ఎలా ఏర్పడుతాయి? అగ్నిపర్వతం నుంచి వెలువడే లావాలో గాజు బుడగలు ఏర్పడతాయని, అవి పగిలినప్పుడు సన్నగా, వెంట్రుకల్లా ఉండే గాజు పోగులు వెలువడతాయని హవాయ్ వల్కనో అబ్జర్వేటరీ శాస్త్రవేత్త డాన్ స్వాన్సన్ తెలిపారు. తేలిగ్గా ఉండే ఈ గాజు వెంట్రుకలు గాలిలో చాలా ఎత్తువరకు వెళతాయని.. ఎగురుతూ, కొట్టుకుపోతూ విస్తరిస్తుంటాయని చెప్పారు. చూడటానికి అందంగా ఉన్నా.. ఈ గాజు పోగులు ప్రమాదకరమని తెలిపారు. ఇవి పదునుగా ఉంటాయని.. చిన్నచిన్న ముక్కలుగా మారి పీల్చేగాలిలో, తాగే నీటిలో చేరి ఇబ్బందులకు కారణమవుతాయని వెల్లడించారు. 2018లోనూ ఈ అగ్ని పర్వతం లావాను వెదజల్లిందని.. అప్పుడు కూడా ఇలాగే ‘పెలెస్ హెయిర్’ భారీగా వెలువడిందని తెలిపారు. -
వారెవ్వా.. అంతరిక్షంలోకి సమంత
Samantha Cristoforetti Barbie Doll: వన్ సెకన్.. మీరనుకుంటున్న సమంత కాదిమే. ఈమె ఇటాలియన్ ఆస్ట్రోనాట్. పూర్తి పేరు సమంత క్రిస్టోఫోరెట్టి(44). అరుదైన ఓ గౌరవం అందుకుని ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కి మొట్టమొదటి యూరోపియన్ ఫిమేల్ కమాండర్ ఘనత దక్కించుకున్నారు. అంతేకాదు అచ్చం ఆమెలాంటి బొమ్మతో పిల్లల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవంలో భాగంగా మహిళా సాధికారికత దిశగా అడుగులు వేస్తోంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇందులో భాగంగా అమ్మాయిలకు స్పేస్ స్టడీస్తోపాటు సైన్స్ టెక్నాలజీ మ్యాథ్స్ అండ్ ఇంజినీరింగ్(STEM) రంగాల్లో కెరీర్ పట్ల ఆసక్తి కలిగించేందుకు కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఇందుకోసం ఐఎస్ఎస్కు కమాండర్‌గా వెళ్లబోతున్న సమంత బొమ్మను ఉపయోగించబోతున్నారు. అచ్చం సమంత క్రిస్టోఫోరెట్టి రూపంతో ఉన్న బొమ్మ(బార్బీ డాల్) ఒకదానిని తయారుచేయించి.. అంతరిక్ష ప్రయోగాల్ని, పరిశోధనల అనుభూతుల్ని పిల్లలకు తెలియజెప్పే ప్రయోగం చేస్తున్నారు. ఇందుకోసం జర్మనీకి చెందిన ఓ జీరో గ్రావిటీ ఫ్లైట్‌ను వినియోగించారు. స్పేస్‌లోకి వెళ్లే ముందు ఏం చేయాలి? అక్కడి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? తదితర అంశాల్ని జీరో గ్రావిటీలో సమంత బొమ్మను ఉపయోగించి చూపిస్తారు. అక్టోబర్ 4-10 మధ్య వరల్డ్ స్పేస్ వీక్ జరుగుతోంది. ఈ ఏడాదిని ‘విమెన్ ఇన్ స్పేస్’ థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె బొమ్మ ద్వారా పిల్లలకు ఆసక్తికరంగా చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రయోగం ద్వారా వచ్చే డబ్బును విమెన్ ఇన్ స్పేస్ ప్రోత్సాహకం కోసం ఉపయోగించనున్నట్లు బార్బీ ప్రతినిధి ఇసాబెల్ ఫెర్రెర్ తెలిపారు. ఇక తన బొమ్మ ద్వారా పాఠాలపై సమంత సైతం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే సమంతా క్రిస్టోఫోరెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తర్వాతి మిషన్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. ఆరు నెలలపాటు కమాండర్ హోదాలో ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే బార్బీ గతంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో పాటు శాలీ రైడ్, అన్నా కికినా బొమ్మలను సైతం రూపొందించింది. చదవండి: నాసా పోస్ట్ చేసిన బొమ్మ.. అద్భుతం -
నక్షత్రాలు మెరిసేది అందుకేనంట!
మెరుస్తున్న నక్షత్రాలు ఓవైపు.. భూమిపై నగరాల విద్యుత్ ధగధగలు మరోవైపు.. మధ్యలో నారింజ రంగులో వాతావరణం మిలమిలలు.. భూమి, వాతావరణం, అంతరిక్షంలో కాంతులు మూడూ ఒకేచోట కనిపిస్తున్న అరుదైన చిత్రమిది. థామస్ పెస్కెట్ అనే ఫ్రెంచ్ వ్యోమగామి.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి ఈ ఫొటో తీశారు. రాత్రిళ్లు భూమ్మీది విద్యుత్ లైట్ల కాంతులు ఐఎస్ఎస్లోని వారికి స్పష్టంగా కనిపిస్తాయి. అదే నక్షత్రాలు ఎప్పుడూ అలా మెరుస్తూనే ఉంటాయి. చదవండి: ఐన్‌స్టీన్, హాకింగ్‌లకన్నా ఈ చిన్నారి బుర్ర మరింత స్మార్ట్ కానీ భూమి వాతావరణంలో సుమారు 75 కిలోమీటర్ల ఎత్తున ఉండే సోడియం పొర వెలుగులు మాత్రం.. ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే కనిపిస్తాయి. సూర్యుడు, నక్షత్రాల నుంచి వచ్చే కాంతి, రేడియేషన్ ప్రభావం వల్ల.. సోడియం పొర నారింజ రంగులో మెరుస్తుంది. అది ఇలా రాత్రిపూట వెలుగులు విరజిమ్మడం, భూమ్మీది కాంతులు, నక్షత్రాల మెరుపులు జతకూడటం మాత్రం అరుదే. ఇంతేకాదు.. జాగ్రత్తగా గమనిస్తే ఈ నారింజ రంగు పొరపైన సన్నగా ఆకుపచ్చ రంగులో మరోపొరనూ చూడొచ్చు. ఆక్సిజన్ ఆయాన్లతో కూడిన ఈ పొర సౌర రేడియేషన్ కారణంగా.. ఆకుపచ్చ రంగులో మెరుస్తుంది. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్! Co2ను గాల్లోంచి గుంజేసి రాళ్లూరప్పల్లో కలిపేస్తది -
క్రూ– 3 లేడీ ఇలా వచ్చి అలా వెళ్తోంది
స్పేస్ ఎక్స్ ‘క్రూ–3’ మిషన్‌కు నాసా మహిళా వ్యోమగామి కేలా బ్యారన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆఖరి దశ నిర్మాణంలో ఉన్న ‘డ్రాగన్’ అనే వ్యోమనౌకలో కేలా, మరో ముగ్గురు పురుష వ్యోమగాములు వచ్చే అక్టోబర్ 23 న అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి బయల్దేరి వెళ్తారు. అక్కడ కనీసం ఆరు నెలల పాటు పరిశోధనలు జరిపి భూమిని చేరుకుంటారు. ‘క్రూ–3’ కి కేలా బ్యారన్.. మిషన్ స్పెషలిస్ట్. నిన్న గాక మొన్న నాసాలోకి వచ్చిన కేలా తన ప్రతిభతో స్పేస్‌లోకి స్పేస్ సంపాదించారు! ‘నాసా’ ప్రభుత్వానిదైతే, ‘స్పేస్ ఎక్స్’ ప్రైవేటు సంస్థ. నాసా వాషింగ్టన్లో ఉంటే, స్పేస్ ఎక్స్ కాలిఫోర్నియాలో ఉంటుంది. రెండిటి పనీ అంతరిక్ష పరిశోధనలు, అంతరిక్ష ప్రయాణాలు. స్పేస్ ఎక్స్‌కి ఇప్పటివరకైతే సొంత వ్యోమగాములు లేరు. నాసా నుంచి, లేదంటే మరో దేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి సుశిక్షితులైన వ్యోమగాములను తీసుకుంటుంది. ఎలాన్ మస్క్ అనే బిలియనీర్ స్థాపించిన సంస్థ స్పేస్ ఎక్స్. మార్స్‌లోకి మనిషిని పంపేందుకు ప్రయోగాత్మకంగా స్పేస్ ఎక్స్ వేస్తున్న మెట్లే ఈ స్పేస్ షటిల్స్. ఆ మెట్లలోని మూడో మెట్టే ‘క్రూ–3’. ఇందులో నాసా నుంచి కేలా, రాజాచారి (మిషన్ కమాండర్), టామ్ మార్ష్‌బర్న్ (మిషన్ పైలట్), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి మథియాస్ మారర్ (మిషన్ స్పెషలిస్ట్ 1) ఉంటారు. కేలా బ్యారన్.. మిషన్ స్పెషలిస్ట్ 2. స్పేస్ ఎక్స్ ఇలా మార్స్‌కి ఎన్ని మెట్లు కట్టుకుంటూ వెళుతుంది? తెలియదు! మార్స్‌లోకి మనిషిని పంపి, మెల్లిగా మార్స్‌లో మానవ కాలనీలను నిర్మించే ధ్యేయంతోనే ఎలాన్ మస్క్ 2002 లో ఈ సంస్థను నెలకొల్పారు. వ్యోమగాములతో అతడు వేయించే ప్రతి అడుగు, గమ్యమూ చివరికి అంగారక గ్రహమే. వాస్తవానికి స్పేస్ ఎక్స్ వల్ల నాసాకు ఖర్చు, భారం తగ్గాయి. పరిశోధనలకు సమయమూ కలిసివస్తోంది. అందుకే స్పేస్ ఎక్స్‌కి సహాయపడుతోంది. అంతే తప్ప తనకు పోటీ అనుకోవడం లేదు. ∙∙ ఇప్పటికి స్పేస్ ఎక్స్ పంపిన రెండు ‘క్రూ’ మిషన్లలోనూ ఒక్కో మహిళా వ్యోమగామి ఉన్నారు. వారిద్దరి కన్నా వయసులో చిన్న.. ఇప్పుడు ‘క్రూ–3’లో సభ్యురాలిగా ఉన్న కేలా బ్యారన్. ‘క్రూ–1’లో అంతరిక్షంలోకి వెళ్లిన మహిళా వ్యోమగామి షానన్ వాకర్ వయసు 55. ‘క్రూ–2’లో వెళ్లిన మహిళ మెగాన్ మెకార్తర్ వయసు 49 ఏళ్లు. కేలా బ్యారెన్ వయసు 33 ఏళ్లు. షానన్ వాకర్ భూమి మీదకు తిరిగి వచ్చేశారు. మెగాన్ ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్నారు. ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లబోతున్న కేలా బ్యారన్ వాషింగ్టన్లో పుట్టారు. యు.ఎస్. నేవల్ అకాడమీలో సిస్టమ్స్ ఇంజనీరింగ్ డిగ్రీ చదివారు. తర్వాత ఇంగ్లండ్ వెళ్లి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం యుద్ధ నౌకల్ని కమాండ్ చేసే సబ్‌మెరైన్ ఆఫీసర్‌గా శిక్షణ తీసుకున్నారు. యు.ఎస్.ఎస్. మెనీలో డివిజన్ ఆఫీసర్‌గా, నేవల్ అకాడమీలో సూపరింటెండెంట్‌గా పని చేశారు. 2017లో నాసాకు ఎంపిక అయ్యారు. వ్యోమగామి గా రెండేళ్లు శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడీ స్పేస్ ఎక్స్ ప్రయాణానికి అవకాశం పొందారు. మిషన్ ఆఫీసర్‌గా ఆమె అంతరిక్షంలో ఉన్నంత కాలం కమాండర్, పైలట్, మరొక మిషన్ స్పెషలిస్టుతో అనుసంధానం అయి ఉండాలి. క్రూ యాక్టివిటీ ప్లానింగ్, పర్యవేక్షణ ఆమె విధులే. ఇక ప్రయోగాలు ఎలాగూ ఉంటాయి. వ్యోమగామిగా నాసా శిక్షణలో ఉన్నప్పుడు కేలా బ్యారన్ -
యూఏఈ నుంచి ప్రథమ మహిళా వ్యోమగామి
దుబాయ్: అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన మొట్టమొదటి గల్ఫ్ దేశంగా రికార్డు సృష్టించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. మొట్టమొదటిసారిగా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనున్నట్లు దుబాయ్ పాలకుడు షేక్ మొహ్మమద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. శనివారం ఆయన ప్రకటించిన ఇద్దరు వ్యోమగాముల పేర్లలో ఒకరు మహిళ కావడం విశేషం. తమకు అందిన సుమారు 4వేల దరఖాస్తుల నుంచి నౌరా అల్ మత్రౌషి, మొహమ్మద్ అల్–ముల్లాను ఇందుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. 1993లో జన్మించిన మత్రౌషి అబుధాబిలోని నేషనల్ పెట్రోలియం కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా, అల్–ముల్లా ప్రస్తుతం దుబాయ్ పోలీస్ విభాగంలో పైలట్ శిక్షణావిభాగానికి అధిపతిగా ఉన్నారని పేర్కొన్నారు. వీరిద్దరూ త్వరలో అమెరికాలో టెక్సాస్‌లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్లో శిక్షణ పొందనున్నట్లు వెల్లడించారు. చదవండి: మార్స్‌పై బుల్లి హెలీకాప్టర్, దానికి పేరు పెట్టిందెవరో తెలుసా? -
గగారిన్ మళ్లీ పుట్టాడు!
ఇరవై ఏడేళ్ల వయసుకు ఎవరైనా ఎంత ఎత్తుకు ఎదుగుతారు? యూరీ గగారిన్ అంతరిక్షానికి ఎదిగాడు! రష్యన్ కాస్మోనాట్ ఆయన. స్పేస్ లోకి వెళ్లిన తొలి మానవుడు అతడే! 34లో పుట్టాడు. 34 ఏళ్లకే చనిపోయాడు. భార్య, ఇద్దరు కూతుళ్లు. లవ్ మ్యారేజ్. క్వీన్ ఎలిజబెత్ ఈ మార్చి 10 న వర్చువల్ మీటింగ్ లో బ్రిటిష్ సైంటిస్టులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యూరీ గగారిన్ ప్రస్తావన వచ్చింది. యూరీ అంతరిక్షం నుంచి దిగి వచ్చాక రాణిగారిని కలిసిన సందర్భాన్ని గుర్తు చేసి.. ‘‘అప్పుడు మీకు అతన్ని చూస్తే ఏమనిపించింది హర్ మ్యాజెస్టీ..’’ అని ఒక మహిళా సైంటిస్టు క్వీన్ ఎలిజబెత్‌ను అడిగారు. ‘రష్యన్ లా అనిపించాడు‘ అని క్విప్ (హాస్యం) చేశారు క్వీన్. నవ్వులే నవ్వులు. బ్రిటిష్ సైన్స్ వీక్ నిన్నటితో ముగిసింది. యూరీపై మళ్లీ కొత్తగా ప్రపంచానికి ఆసక్తి మొదలైంది. మ్యాగీ అంతరిక్ష శాస్త్రవేత్త. సైన్స్ ప్రొఫెసర్. వయసు 53. తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లిన యూరీ గగారిన్ జీవించి ఉంటే కనుక ఆయన ఇప్పుడు తన 87 ఏళ్ల వయసులో ఉండేవారు. మ్యాగీ బ్రిటన్ మహిళ. గగారిన్ రష్యన్ వ్యోమగామి. వీళ్లిద్దరికీ ఉన్న సంబంధం ఒకటే.. మ్యాగీకి గగారిన్ అంటే పిచ్చి అభిమానం. ఆయన స్ఫూర్తితోనే ఆమె స్పేస్ సైంటిస్ట్ అయ్యారు. 1961లో యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చేనాటికి మ్యాగీ పుట్టనే లేదు. అదీ విశేషం. ఈ బుధవారం మరొక విశేషానికి కూడా మ్యాగీ కారణం అయ్యారు. మార్చి 5 నుంచి 12 వరకు ‘బ్రిటన్ సైన్స్ వీక్’ జరిగింది. పదో తేదీన క్వీన్ ఎలిజబెత్ వీడియో కాన్ఫెరెన్సింగ్‌లో కొంత మంది బ్రిటన్ సైంటిస్టులతో మాట్లాడారు. ఆ సైంటిస్టులలో మ్యాగీ కూడా ఉన్నారు. తననొక స్పేస్ సైంటిస్ట్‌గా పరిచయం చేసుకున్నాక రాణిగారు.. ‘‘స్పేస్ సైన్స్ మీద నీకెలా ఆసక్తి ఏర్పడింది’’ అని మ్యాగీని అడిగారు. ‘‘హర్ మ్యాజెస్టీ.. నేను రష్యన్ వ్యోమగామి గగారిన్ అభిమానిని. ఆయన కారణంగానే అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తి కలిగింది’’ అని చెబుతూ.. ‘హర్ మ్యాజెస్టీ.. అంతరిక్షం లోకి వెళ్లి వచ్చాక ఆయన మిమ్మల్ని కలిసేందుకు బకింగ్ హ్యామ్ పాలెస్కు వచ్చారు కదా. అప్పుడు ఆయన్ని చూస్తే మీకేమనిపించింది?!’’ అని అడిగారు. బ్రిటిష్ సైన్స్ వీక్ సందర్భంగా బుధవారం (మార్చి 10) సైంటిస్టుల వీడియో కాన్ఫెరెన్సింగ్‌లో క్వీన్ ఎలిజబెత్. పచ్చరంగు దుస్తుల్లో ఉన్న మహిళే గగారిన్ అభిమాని మ్యాగీ. ‘‘రష్యన్’’ అనిపించింది అని క్వీన్ జోక్ వేశారు. రాణిగారి మాటకు ఒకటే నవ్వులు. ‘‘నా దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఆయన గాల్లో తేలుతూనే ఉన్నారు! స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన తొలి మానవుడు కదా! ఆ విజయోత్సాహం ఆయనలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నాతో రష్యన్‌లోనే మాట్లాడారు’’ అన్నారు ఎలిజబెత్. ఆ ఏడాది ఆగస్టులో అంతరిక్షంలోకి, జూలైలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌కి వెళ్లారు గగారిన్. ఇప్పుడు మళ్లీ వార్తలోకి వచ్చారు. మ్యాగీనే ఆయన్ని మళ్లీ ఒకసారి మానవాళి మనోపథంలోకి తెచ్చారని చెప్పాలి. గగారిన్ అభిమానిని అనిపించుకున్నారు మ్యాగీ! అంతరిక్షంలో యూరీ గగారిన్ సాధించినది పెద్ద విజయమే అయినా భూమి మీద ఆయన జీవించింది అతి స్వల్పకాలం. కేవలం 34 ఏళ్లు. ఆ ముప్పై నాలుగేళ్ల కాలాన్ని భూకక్ష్యలో అతడు గడిపిన గంటా 48 నిముషాలతో పోల్చవచ్చు. కక్ష్యలో ప్రతి నిముషాన్నీ ఆయన ఎంత ఇష్టంగా గడిపారో, తన భార్య, ఇద్దరు కూతుళ్లతో అంతే ఇష్టంగా జీవితాన్ని గడిపారు. 1934 మార్చి 9న తల్లి కడుపులోంచి భూమి మీద పడి, 1961 ఏప్రిల్ 12న ఆకాశంలో భూమి చుట్టూ తిరిగి, 1968 మార్చి 27 న భువి నుంచి దివికేగారు గగారిన్. ‘మిగ్’లో రోజువారీ శిక్షణలో ఉన్నప్పుడు ఆ విమానం పేలిపోయి ఫ్లయిట్ ఇన్స్ట్రక్టర్ తో పాటు గగారిన్ కూడా చనిపోయారు. ఆయన భార్య వాలెంటీనా గగారినా గత ఏడాదే మార్చి 17 న తన 84 ఏళ్ల వయసులో కన్నుమూశారు. పెద్ద కూతురు ఎలీనా ఆర్ట్ హిస్టారియన్. ‘మాస్కో క్రెమ్లిన్ మ్యూజియమ్స్’ జనరల్ డైరెక్టర్. చిన్న కూతురు గలీనా ఎకనమిక్స్ ప్రొఫెసర్. ప్లెఖనోవ రష్యన్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనమిక్స్ డిపార్ట్మెంట్ హెడ్. గగారిన్, వాలెంటీనాలది ప్రేమ వివాహం. ఆమెను తొలిసారి ఆయన మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో మేడే మహోత్సవాలలో చూశారు. అప్పటికి ఆమె మెడికల్ టెక్నిషియన్. అతడు బాస్కెట్‌బాల్ కోచ్. 1957లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు. వాలెంటీనా మెడికల్ టెక్నీషియన్‌గా, గృహిణిగా రెండు పడవల్ని నడిపిస్తే.. రష్యన్ పైలట్‌గా ఉన్న గగారిన్ ‘సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్’ కి అర్హత సంపాదించి స్పేస్‌లోకి తెడ్లు వేశారు! పదేళ్ల వైవాహిక జీవితంలో గగారిన్ తన భార్య, కూతుళ్లతో ప్రతి క్షణాన్నీ అత్యంత విలువైనదిగా గడిపారు. క్వీన్ ఎలిజబెత్‌ను కలవడం అయితే అదొక అపురూపమైన సందర్భం గగారిన్కి. తొలి కాస్మోనాట్‌గా బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లినప్పుడు పిల్లలకు ఇవ్వమని ఎలిజబెత్ రాణి అందమైన బొమ్మల్ని కానుకగా ఇచ్చారు. తమ తండ్రి స్పేస్‌లోకి వెళ్లడం, తిరిగి రావడం అర్థం చేసుకునేంత వయసు కాదు అప్పటికి ఎలీనా, గలీనాలది! -
అంతరిక్షానికే ‘హైలీ’ అద్భుతం!
భరించలేని సమస్యలు ఎన్ని ఎదురైనా.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే వివిధ కారణాల మూలంగా కష్టాల కడలిలో కొట్టుకుపోయిన మన కల లేదా లక్ష్యాన్ని చేరుకోవచ్చని 29 ఏళ్ల హైలీ ఆర్కేనో చెబుతోంది. అమెరికాకు చెందిన హైలీ ఆర్కేనోకు చిన్నప్పుడు ఓ పెద్ద కోరిక ఉండేది. ఎలాగైనా ఆస్ట్రోనాట్ కావాలని ఆమె కలలు కనేది. కానీ హైలీకీ పదేళ్లు ఉన్నప్పుడు విధి కన్నెర్ర చేయడంతో బోన్క్యాన్సర్ బయటపడింది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా హైలీ ఫీమర్ బోన్ (తొడ ఎముక) ను తొలగించి ఆ స్థానంలో రాడ్లను అమర్చారు. ప్రస్తుతం హైలీ కృత్రిమ మోకాలి సాయంతో నడవగలుగుతోంది. దీంతో వ్యోమగామి అవ్వాలన్న తన కల కరిగిపోయిందనుకుంది హైలీ. కానీ ఈ ఏడాది చివర్లో స్పేస్ఎక్స్ చేపట్టబోయే ‘సివిలియన్ స్పేస్ ఎక్స్ మిషన్’లో రెండో క్రూ మెంబర్‌గా హైలీ ఎంపికైనట్లు బిలియనీర్ జారెడ్ ఐజక్‌మాన్ ప్రకటించారు. దీంతో హైలీ చిరకాలం నాటి కల చిగురులు తొడిగింది. అన్నీ సక్రమంగా జరిగితే అతిచిన్న వయసు(29)లో స్పేస్‌లోకి వెళ్లిన మొదటి అమెరికన్‌గా, తొలి ప్రోస్తెటిక్ స్పేస్ ట్రావెలర్‌గా హైలీ చరిత్ర సృష్టించనుంది. పదేళ్ల వయసులో హైలీ ఏ హాస్పిటల్లో అయితే బోన్క్యాన్సర్కు చికిత్స తీసుకుందో అదే హాస్పిటల్లో అంటే ‘సెయింట్ జుడే చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్’లో ఆంకాలజీ యూనిట్లో అసిస్టెంట్ ఫిజీషియన్‌గా చేరింది. చిన్నతనంలో కాలిని కోల్పోయినప్పటికీ ఆమె అధైర్యపడకుండా వైద్యవిద్యను అభ్యసించి మళ్లీ అదే ఆసుపత్రిలో డాక్టరుగా సేవలందించడం ఎంతో గొప్ప విషయం. ఈ కారణంతోనే ఐజక్‌మాన్ హైలీని తన క్రూలో రెండో సభ్యురాలుగా చేర్చుకున్నారు. అలా జుడే హాస్పిటల్లో చేరడం వల్ల హైలీకి తన చిరకాల కోరిక తీరే మార్గం దొరికింది. ఆస్ట్రోనాట్‌గా ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ స్పేస్‌లోకి వెళ్లే గోల్డెన్ చాన్స్ హైలీని వెతుక్కుంటూ రావడం విశేషం. ప్రముఖ స్పేస్ ఎక్స్ సంస్థ త్వరలో లాంచ్ చేయబోయే డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో నలుగురు పర్యాటకులను పంపనుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఓ నాలుగురోజుల పాటు భూమి చుట్టూ తిరిగి మళ్లీ భూమిమీదకు వస్తుంది. ఈ మొత్తం మిషన్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని బిలియనీర్ అయిన 38 ఏళ్ల జారెడ్ ఐజక్‌మాన్ భరిస్తున్నారు. పెన్సిల్వేనియా కేంద్రంగా పనిచేస్తోన్న ‘షిఫ్ట్ ్ట4 పేమెంట్స్’ కంపెనీకీ ఆయన వ్యవస్థాపక సీఈఓగా వ్యవహరిస్తున్నారు. సివిలియన్ పైలట్ అయిన ఐజక్‌మాన్ నలుగురు మాత్రమే వెళ్లే ఈ స్పేస్ క్రాఫ్ట్ లో తనతోపాటు మరో ముగ్గురిని సొంత ఖర్చుతో తీసుకెళ్లనున్నారు. అయితే ఈ ముగ్గురు సభ్యుల కోసం ఆయన వివిధ రకాల పద్ధతుల్లో సభ్యులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైలీని రెండో క్రూ మెంబర్‌గా ఎంపిక చేశారు. ‘‘హైలిన్ చిన్నతనంలోనే ఎంతో కష్టమైన సవాళ్లను ఎదుర్కోని ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఈ మిషన్ ద్వారా ఆమె స్పేస్‌లోకి వెళ్లి.. ప్రపంచానికే స్ఫూర్తిదాయక సందేశంతోపాటు మరెంతోమందికి ఆదర్శంగా నిలవనుంది. హైలీ అనేక కష్టాలు ఎదుర్కొని నేడు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోనుండటం గొప్ప విశేషం. అందుకే ఈ అమ్మాయి అంతరిక్షానికే ఓ అద్భుతం’’ అని ఐజక్‌మాన్ చెప్పారు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే ఆస్ట్రోనాట్స్ తీసుకునే ఎటువంటి శిక్షణనూ నేను తీసుకోలేదు. అయినా నాకు స్పేస్‌లోకి వెళ్లడానికి ఎలాంటి భయం లేదు. బహుశా చిన్నతనం నుంచే క్యాన్సర్‌తో పోరాడడం వల్ల నాకు ఈ ధైర్యం వచ్చి ఉండవచ్చు. మరో విషయం ఏమిటంటే, ఈ మిషన్‌లో నన్ను ఎంపిక చేసేవరకు నేను ఎప్పుడూ స్పేస్‌లోకి వెళ్తానని అస్సలు అనుకోలేదు. ఫిజికల్లీ ఫిట్‌గా ఉన్నవారికే అవకాశం ఉంటుందని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్లకు కూడా స్పేస్‌లోకి వెళ్లే అవకాశాన్ని సివిలియన్ స్పేస్ మిషన్ ఇస్తోంది. ఈ మిషన్ ఎన్నో విషయాలను మార్చేస్తూ.. క్యాన్సర్‌ను జయించిన నన్ను స్పేస్‌లోకి పంపుతూ నమ్మశక్యం కాని గౌరవాన్ని ఇస్తోంది’’ అని హైలీ సంతోషంతో చెప్పింది. చదవండి: చంద్రుడి పైకి తొలి మహిళ! చదవండి: నాసా రోవర్.. సాఫ్ట్ వేర్ రాసింది మన మహిళే! -
చంద్రుడి పైకి తొలి మహిళ!
ఆకాశంలో సగం అనే నానుడిని నిజం చేస్తూ మగువ అన్ని రంగాల్లో మగవాడికి దీటుగా దూసుకుపోతోంది. ఏరంగంలో పురుషులకు తీసిపోమంటూ అంతరిక్ష ప్రయాణం కూడా పూర్తి చేసుకున్న స్త్రీ శక్తి త్వరలో చంద్రుడిపై కాలు మోపేందుకు సిద్ధమవుతోంది. 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ అల్డ్రైన్లు తొలిసారి చంద్రోపరితలంపై కాలుపెట్టారు. వీరితో కలిసి ఇంతవరకు 12 మంది పురుషులు చంద్రుడిపైకి విజయవంతంగా వెళ్లి తిరిగి వచ్చారు. కానీ ఇంతవరకు ఒక్క మహిళా వ్యోమగామికి ఈ అవకాశం రాలేదు. కానీ ఈ దఫా అమెరికా నాసా సంస్థ తమ ఆర్టిమిస్ మిషన్‌లో భాగంగా తొలిసారి చందమామపైకి మహిళా వ్యోమోగామిని పంపాలని యోచిస్తోంది. ఇందుకోసం బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన డా. జెస్సికా మెయిర్‌ను ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం ఈమె ఆర్టిమిస్ మూన్ లాండింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనే మరో 17మంది ఆస్ట్రోనాట్లతో కలిసి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. చంద్రయానానికి అవకాశం వచ్చిన తొలి మహిళ కావడం తనకెంతో సంభ్రమాన్ని కలిగించిందని జెస్సికా చెబుతోంది. చంద్రుడి ఉపరితలంపై నడిచేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటోంది. మిషన్‌లో అంతిమంగా పాల్గొనే ఆస్ట్రోనాట్ల పేర్లు ఇంకా అధికారికంగా ఖరారు కాకపోయినా, తప్పక తనను ఎంచుకుంటారని ఆమె ధీమాగా ఉంది. చివరి నిమిషంలో ఒకవేళ మూన్ జర్నీ అవకాశం తప్పిపోయినా బాధపడేది లేదని, తాను వెళ్లకపోయినా, తన కొలీగ్స్‌లో ఒకరు వెళ్తున్నారనే తృప్తి చాలని చెబుతూ పెద్దమనసు చాటుకుంది. రాబోయే ఆర్టిమిస్ మిషన్ కేవలం చంద్రుడిపైకి అలా వెళ్లి ఇలా రావడం కోసం కాదని, భవిష్యత్‌లో మార్స్ ప్రయాణాలకు ఇది మార్గదర్శకమవుతుందని వివరించింది. అలాగే చంద్రుడిపై ఒక శాశ్వత మానవ కాలనీ నిర్మాణానికి సంబంధించి ఈ మిషన్ తొలిమెట్టుగా మారవచ్చని నిపుణుల అంచనా. -
చల్లని ‘రాజా’ ఓ చందమామ
ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం అంటారు.ఈ చిత్రాన్ని చూడండి...పదాలు మాత్రమే కాదు కల, పట్టుదల కలిసికట్టుగా కనిపిస్తాయి. చంద్రుడి పైకి పంపడానికి ‘నాసా’ ఎంపిక చేసిన బృందంలో ఒకరైన రాజాచారి పదకొండు సంవత్సరాల వయసులో తయారుచేసిన పోస్టర్ ఇది.. రాజాచారి పదకొండు ఏళ్ల వయసులో, ప్రస్తుతం.. నిన్న అనేది నేటి జ్ఞాపకంరేపు అనేది నేటి కల. –ఖలీల్ జిబ్రాన్ చిన్న వయసులో పిల్లలు కనే కలలు పెద్దలకు మురిపెంగా ఉంటాయి. చాలామంది పిల్లల్లో ఆ కలలు వయసు పెరుగుతున్నకొద్దీ కరిగిపోతుంటాయి. కొందరు దీనికి మినహాయింపు. వారిలో కలలు కరిగిపోవు. బలపడతాయి. రాజాచారి ఈ కోవకు చెందిన వ్యక్తి. ‘రాజాచారి’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన పేరు. ‘నాసా’ చంద్రుడి పైకి పంపనున్న వ్యోమగాముల బృందంలో ఇండియన్–అమెరికన్ రాజాచారి ఒకరు. పదకొండు సంవత్సరాల వయసులో ఆస్ట్రోనాట్ కావాలని కలలు కన్నాడు రాజా. ‘ఇది పిల్లకల’ అని తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకోలేదు. ఆ కలల సౌధానికి దగ్గర కావడానికి ఒక్కో మెట్టు పేరుస్తూ వచ్చారు. ఉన్నత చదువు, సక్సెస్ఫుల్ కెరీర్ కోసం శ్రీనివాస్‌చారి(రాజా తండ్రి) ఇంజనీరింగ్ డిగ్రీతో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాడు. అక్కడ అమెరికన్ పెగ్గి ఎగ్బర్ట్ను వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడే రాజాచారి. రాజా చిన్నప్పుడు కాగితాలు, మెటల్ హుక్‌లతో బొమ్మ విమానాలు తయారుచేసి మురిసిపోయేవాడు. పక్కింటి పిల్లలు ఈ బొమ్మల కోసం పరుగులు తీస్తూవచ్చేవారు. తన భుజాలకు రెక్కలు తగిలించుకొని ఊహాల్లో ఆకాశంలోకి వెళ్లి వచ్చేవాడు రాజా. ‘ఫాంటసీ ప్రపంచం’లో వీరవిహారం చేసేవాడు. తల్లి టీచర్ కావడంతో ‘చందమామ పాఠాలు’ ఆసక్తికరంగా చెప్పేది. ఎన్నో సందేహాలను ఓపిగ్గా తీర్చేది. సైన్స్ మాత్రమే కాదు సంగీతం అంటే కూడా రాజాకు బాగా ఇష్టం. రెండేళ్ల వయసులోనే సుజుకి మెథడ్ వయోలిన్ పాఠాలు నేర్చుకున్నాడు. ఆరేళ్ల వయసులో ఫ్రెంచ్ హార్న్ ఇన్‌స్ట్రుమెంట్‌లో ప్రావీణ్యం సంపాదించాడు.‘నీ బ్రెయిన్లో కుడి,ఎడమ భాగాలు సమానంగా వృద్ధి చేయడానికి ప్రయత్నించు’ అని రాజాకు పదేపదే చెప్పేది తల్లి. మెదడులోని ఎడమభాగం విశ్లేషణ, కుడిభాగం సృజనాత్మకతను వృద్ధి చేస్తుంది. స్ఫూర్తి కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. స్ఫూర్తిని ఇచ్చే వాళ్లు పెద్దల రూపంలో మన చేరువలోనే ఉంటారు. రాజాచారి తండ్రి శ్రీనివాస్‌చారి అలాంటి వారే. చేతిలో ఇంజనీరింగ్ పట్ట, గుండెలో ధైర్యం...అంతే...అమెరికాకు వచ్చేశాడు. దేశం కాని దేశం. తెలియని మనుషులు. తెలియని కష్టాలు..కాని ఇవేమీ ఆయన ఆలోచించలేదు. అర్జునుడి చూపు పిట్టకన్ను మీదే ఉన్నట్లు శ్రీనివాస్ కన్ను కూడా ఒకే లక్ష్యాన్ని చూసింది. సాధించాలి....ఎలాగైనా సాధించాలి! ఆయన తన ప్రయాణంలో విజయాన్ని సాధించాడు. ఆ స్ఫూర్తిని కుమారుడికి అందించాడు.‘బాగా కష్టపడి చదివితే ఎన్నో ద్వారాలు నీకోసం తెరుచుకుంటాయి. జీవితాన్ని సంతోషమయం చేసుకోవడానికి కష్టాన్ని ఇష్టపడాలి’ అని రాజాచారితో చెబుతుండేవారు శ్రీనివాస్.‘‘ఇతరులు ఏమైనా అనుకుంటారని, హేళన చేస్తారనే భయం నాలో ఎప్పుడూ లేదు. నేను ఒకటి ఇష్టపడ్డాను అంటే. ఇక అంతే...చాలా కష్టపడతాను’ అంటాడు రాజాచారి. ఆ కష్టమే అతడిని యూఎస్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ చేసేలా, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్‌లో మాస్టర్డిగ్రీ చేసేలా చేసింది. టెస్ట్ పైలట్‌గా మార్చింది. ఆతరువాత తన ఆస్ట్రోనాట్ కల గుర్తుకు వచ్చింది. అదేమీ ఆషామాషీ కల కాదు. అలా అని వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. ‘నాసా’లో పనిచేసే వ్యక్తులను కలవడం మొదలైంది. వారు తనలో ఎంతో స్ఫూర్తి నింపారు. కమాండర్ ఆఫ్ ది 461 ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్, డైరెక్టర్ ఆఫ్ ది ఎఫ్–35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ఫోర్స్గా తన టాలెంట్ చాటుకున్న చారి 2017లో నాసా ‘ఆస్ట్రోనాట్ క్యాండిడెట్ క్లాస్’కు ఎంపికయ్యాడు. టెస్ట్ పైలట్‌గా రోజువారీ సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం, సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు వెదికే ధైర్యం ‘నాసా కమ్యూనిటీ’లో ఉపయోగపడింది. ‘నిరంతర పఠనం, నిరంతరం మెరుగుపరుచుకోవడం ఇదే నా జీవనతత్వం’ అని చెబుతున్న రాజాచారికి జయహో చెబుదాం. -
చందమామపైకి రాజాచారి!
వాషింగ్టన్ : చందమామను మళ్లీ అందుకునే యత్నాలు ఆరంభించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్ ఆర్టిమిస్‌లో పాల్గొనే 18 మంది పేర్లను ఖరారు చేసింది. వారిలో ఇండియన్ అమెరికన్, హైదరాబాద్ మూలాలున్న రాజా జాన్ వుర్పుతూర్ చారికి చోటు లభించింది. 1970 తర్వాత మళ్లీ చంద్రుడిపైకి యాత్ర చేయడానికి సన్నాహాలు చేస్తున్న నాసా ఈ సారి వ్యోమగాముల ఎంపికలో ఎన్నో ప్రత్యేకతలు కనబరిచింది. మొత్తం 18 మంది వ్యోమగాముల్ని ఎంపిక చేస్తే, అందులో తొమ్మిది మంది మహిళలే కావడం విశేషం. విభిన్న జాతుల వారూ ఈ సారి స్థానం దక్కించుకున్నారు. వ్యోమగాముల బృందంలో ఎక్కువ మంది 30, 40 వయసులో ఉన్న వారే. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లో జరిగిన వైట్ హౌస్ జాతీయ అంతరిక్ష మండలి సమావేశంలో చంద్రుడిపైకి పంపే వారి తుది జాబితాను ఖరారు చేశారు. అమెరికా ఉపా«ధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ 18 మంది పేర్లను ప్రకటించారు. ‘‘మన భావి హీరోలను మీకు పరిచయం చేస్తున్నాను. వీళ్లంతా చంద్రుడి పైకి వెళ్లి చరిత్రను తిరగరాస్తారు. వీరిని ఆర్టిమిస్ తరంగా భావించవచ్చు’’ అని మైక్ పెన్స్ చెప్పారు. నాసా ఆర్టిమిస్ మిషన్ 2024లో చంద్రుడిపైకి వెళ్లనుంది. ఆకాశంలోనే కాదు.. ఆకాశంలోనే కాదు జాబిల్లి యాత్రలో కూడా మహిళలు సగమనేలా ఈదఫా బృందంలోని మొత్తం 18 ఆస్ట్రోనాట్లలో తొమ్మిది మంది మహిళలే ఉన్నారు. అంతేకాదు ఈ సారి చంద్రుడిపైన తొలుత ఒక మహిళే కాలు మోపుతుంది. ఆ తర్వాతే బృందంలో మిగిలిన వారు అడుగు పెడతారు. గత ఏడాది మొదటి సారిగా స్పేస్ వాక్ చేసిన క్రిస్టినా కొచ్, జెస్సికా మీర్లు మూన్ మిషన్‌లో కూడా ఉన్నారు. ఇక ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆస్ట్రోనాట్ పాట్ ఫారెస్ట్ తమ ఆనందానికి హద్దుల్లేవని అన్నారు. చంద్రుడిపైకి వెళతామన్న ఊహ ఎంతో ఉద్వేగానికి గురి చేస్తోందని చెప్పారు. చంద్రుడిపై అటూ ఇటూ చక్కెర్లు కొట్టాలన్న కల నిజం కాబోతోందని, అందరికీ దక్కిన అపూర్వమైన గౌరవమిదని ఆయన చెప్పారు. మనోడే.. నాసా మూన్ మిషన్ యాత్రికుల్లో ఒకరైన ప్రవాస భారతీయుడు రాజాచారి హైదరాబాద్ మూలాలున్న వ్యక్తి. రాజాచారి తాతది మహబూబ్‌నగర్. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో గణితశాస్త్రం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు శ్రీనివాస్ చారి. తన 13 ఏళ్ల వయసులో ఉండగానే తండ్రిని కోల్పోయిన శ్రీనివాస్ తల్లి, అక్కల సంరక్షణలో పెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి కాగానే 1970లో శ్రీనివాస్ అమెరికాకు వెళ్లిపోయారు. విస్కన్సిన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తుండగా పెగ్గీ ఎగ్బర్ట్‌తో ప్రేమలో పడ్డారు. మూడేళ్లు డేటింగ్ చేశాక 1976లో పెళ్లి చేసుకున్నారు. వారికి 1977 జూన్ 25న రాజాచారి జన్మించారు. అయోవా రాష్ట్రంలో పెరిగిన రాజాచారి ప్రఖ్యాత మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఇంజనీరింగ్ చదివారు. ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ చేశారు. అక్కడ నుంచి అమెరికా ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పని చేశారు. 43 ఏళ్ల వయసున్న రాజాచారి 2017లో వ్యోమగాముల శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది జనవరిలో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు చరిత్రాత్మక మూన్ మిషన్‌లో చోటు సంపాదించారు. రాజాచారి, ఆయన తమ్ముడు కృష్ణ అమెరికాలో పుట్టి పెరిగినా భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎనలేని మమకారం. శ్రీనివాస్ తన ఇద్దరు కుమారుల్ని భారతీయ మూలాలను మర్చిపోకుండా పెంచారు. రాజాచారికి కొంచెం హిందీ కూడా వచ్చు. తల్లిదండ్రుల పెంపకమే తననీ స్థాయికి చేర్చిందని రాజాచారి గర్వంగా చెప్పుకుంటారు. -
నాసా: రాజా చారి అరుదైన ఘనత..!
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కల్నల్ రాజా చారి అరుదైన ఘనత సాధించారు. చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపాలనుకుంటున్న నాసా మూన్ మిషన్ ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్’కు అతను ఎంపికయ్యారు. అమెరికా వైమానిక దళంలో రాజా జాన్ వురుపుత్తూర్ చారి కల్నల్‌గా పనిచేస్తున్నారు. ఇక ఈ మిషన్ కోసం నాసా మొత్తం 18 మందిని ఎంపిక చేయగా.. వీరిలో 9మంది మహిళలే ఉండటం గమనార్హం. బుధవారం నాసా మూన్ మిషన్‌కు ఎంపికైన పద్దేనిమిది మంది పేర్లు వెల్లడించింది. 2024లో చంద్రుడి మీదకి మనుషులను పంపాలని నాసా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రాజా చారికి రెండు వేల గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉందని నాసా ఏరోనాటిక్స్ తన ట్విట్టర్లో వెల్లడించింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాజా చారి శిక్షణ పొందారు. యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్లో శిక్షణ పొందిన ఏకైక భారత సంతతి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం. ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాసుల కోసం నాసా అతన్ని 2017లో ఎంపిక చేసింది. తొలుత అవసరమైన ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ శిక్షణ కాలాన్ని అతను పూర్తి చేశాడని, ఇప్పుడు రాజాచారి మూన్ మిషన్‌కు అర్హత సాధించినట్లు నాసా వెల్లడించింది. ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్’కు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్లో ప్రకటించారు. ఈ సందర్భంగా కెన్నడీ ‘నా తోటి అమెరికన్లారా, మనల్ని చంద్రుడి మీదకు.. అంతకు మించి తీసుకువెళ్ళే భవిష్యత్ హీరోలను నేను మీకు పరిచయం చేస్తున్నాను’ అన్నారు. (చదవండి: జాబిల్లి యాత్రకు మహిళ సారథ్యం) ‘ఆర్టెమిస్’ బృందంలోని వ్యోమగాములు విభిన్న నేపథ్యాలు, నైపుణ్యం, అనుభవం నుంచి వచ్చారు. ఈ బృందంలోని చాలా మంది వ్యోమగాములు 30-40 ఏళ్ల లోపు ఉన్నవారే కావడం విశేషం. వీరిలో అతి పెద్ద వ్యక్తి వయసు 55 ఏళ్లు ఉండగా.. పిన్న వయసు వ్యక్తికి 32 ఏళ్లు ఉన్నాయి. -
అగ్ని పర్వతం బద్దలైనప్పుడు...
ఆకాశంలో చుక్కల ముగ్గేసినట్లు నక్షత్రాలు.. మధ్యలో ఒక్కసారిగా పేలిన కొలిమా అగ్ని పర్వతం.. ఫొటో సూపర్‌గా ఉంది కదూ.. ఈ చిత్రాన్ని హెర్నాండో రివేరా అనే ఫొటోగ్రాఫర్ తీశారు. గతంలో మెక్సికోలోని కొలిమా అగ్ని పర్వతం బద్దలైనప్పుడు ఓ రాత్రంతా అక్కడే ఉండి ఫొటోలను తీసినట్లు రివేరా తెలిపారు. ఒక్కోసారి ప్రకృతి విధ్వంసం కూడా కెమెరా కంటికి చాలా అందంగా కనిపిస్తుందని చెబుతున్న రివేరా ఈ చిత్రాలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. భారీ డ్రోన్‌తో ఉపగ్రహ ప్రయోగాలు ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలంటే బోలెడంత ఖర్చు. ఇస్రో లాంటి సంస్థలైతే చౌకగానే ఆ పనిచేస్తున్నాయి గానీ.. మిగిలిన చోట్ల మాత్రం ఒక్కో ప్రయోగానికి రూ.400 కోట్ల నుంచి రూ.వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంటుంది. ఇలా కాకుండా.. భారీ డ్రోన్ సాయంతో తక్కువ ఖర్చులో ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరుస్తానని అమెరికాకు చెందిన ఏవియమ్ అనే కంపెనీ చెబుతోంది. ‘రావన్ ఎక్స్’పేరుతో ఇటీవలే ఈ కంపెనీ ఓ డ్రోన్‌ను సిద్ధం చేసింది కూడా. పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించే ఈ డ్రోన్ గాలిలో నుంచే చిన్న చిన్న ఉపగ్రహాలను ప్రయోగించగలదు. 80 అడుగుల పొడవు.. రెక్కల వెడల్పు 60 అడుగులు, ఎత్తు 18 అడుగుల వరకు ఉంటుంది. సాధారణ విమాన ఇంధనాన్ని వాడుకుని 1.6 కిలోమీటర్ల రన్‌వే నుంచే నింగిలోకి ఎగరగలదు. 8 వేల చదరపు అడుగుల స్థలమున్న హ్యాంగర్‌లో ఉంచేయవచ్చు. ఎలాంటి వాతావరణంలోనైనా దీన్ని వాడుకోవచ్చని, డ్రోన్‌లో 70% మళ్లీ మళ్లీ వాడుకునేలా తయారు చేశామని కంపెనీ సీఈవో జే స్కైలస్ తెలిపారు. భవిష్యత్తులో డ్రోన్ మొత్తాన్ని పలుమార్లు వినియోగించుకునేలా చేస్తామని చెప్పారు. రావన్ ఎక్స్‌తో ఒక్కో ఉపగ్రహ ప్రయోగం 3 గంటల్లో పూర్తవుతుందన్నారు. కంపెనీ ఇప్పటికే సుమారు రూ.7 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకుందని, అమెరికా స్పేస్ ఫోర్స్‌తోపాటు, ఇతర సంస్థలు వినియోగదారులుగా ఉన్నారని వివరించారు. యూఎస్ స్పేస్ ఫోర్స్ ఆస్లోన్–56 పేరుతో భూమికి దగ్గరలో ఉన్న కక్ష్యలోకి చిన్న ఉపగ్రహాలు ప్రయోగించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. -
అంతరిక్షం నుంచి అధ్యక్షుడికి ఓటు
ఓటు వేయడం అంటే మనకేం కావాలో అడగడం మాత్రమే కాదు.. ఏం వద్దో కూడా చెప్పడం. అసలు ఓటే వేయకపోతే? ఏమైనా చేసుకొమ్మని హక్కులన్నీ రాసివ్వడం! ఓటు హక్కుని కూడా!! మహిళల్నైతే అస్సలు.. మిస్సవద్దని అంటారు కేట్ రూబిన్స్. తనైతే అంతరిక్షం నుంచే ఓటు వేయబోతున్నారు. మహిళలే మార్పు కోసం ముందుంటారు. మహిళలే మార్పు కోసం ముందుగా ఉద్యమిస్తారు. ఎందుకంటే మహిళలకే తమ స్థితిగతుల్ని మార్చుకోవలసిన అవసరాన్ని సమాజం ఎప్పుడూ కలిగిస్తూ ఉంటుంది. ‘సమాజం’ అని ఎక్కడో దూరాన్నుంచి చెప్పడం ఎందుకు గానీ, పురుషులు మారనందువల్లనే సమాజాన్ని మార్చే ప్రయత్నాలు మహిళలకు అవసరం అవుతుంటాయి. ఇంత ఉపోద్ఘాతాన్ని ఒక్కమాటలో కూడా చెప్పొచ్చు. ట్రంప్ ఉన్నారు. ఆయన్ని మార్చేయాలి. మనిషిని మార్చడం కాదు. అధ్యక్ష పదవి నుంచి మార్చేయాలి. మహిళలందరూ కలిస్తే ఆయన్ని మార్చడం సాధ్యం కావచ్చు. ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా అందరూ కలిసి రాకపోతే! రాకపోయినా అదేమీ మార్పు కోసం ఏ ప్రయత్నమూ జరగకుండా పోయినట్లు కాదు. ఎవరి వంతు ప్రయత్నాలతో వారే కదా ఇంతవరకు మహిళలు ఒకటవుతూ మార్పును సాధించుకుంటూ వచ్చారు. చదవండి: (తొలిసారిగా అంతరిక్షంలో డీఎన్ఏ అమరిక) అమెరికన్ ఆస్ట్రోనాట్ కేట్ రూబిన్స్ తను ట్రంప్‌కి వ్యతిరేకమో అనుకూలమో చెప్పడం లేదు. అయితే తప్పక ఆమె తన ఓటును నవంబర్ 3 న జరిగే అధ్యక్ష ఎన్నికలో వేయబోతున్నారు. ‘ఇటీజ్ క్రిటికల్ టు పార్టిసిపేట్ ఇన్ ది డెమోక్రసీ’ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో భాగస్వాములం అవడానికి ఓటు వేయడం అత్యవసరం’ అని. ముఖ్యంగా మహిళలు తమ ఓటును మిస్ చేసుకోకూడదని కేట్ చెబుతున్నారు. ఓటర్ల జాబితాలో పేరుండీ ఓటు వేయడాన్ని మహిళలు తరచు మిస్ చేసుకోడానికి కారణం రాజకీయాల్లో వాళ్లకు ఆసక్తి లేకపోవడం అనుకోకండి. ‘మిస్’ చేసుకోవడం అంటే ఇక్కడి అర్థం.. భర్త చెప్పినట్లో, ఇంకొకరు చెప్పినట్లో ఫలానా అభ్యర్థికి ఓటేయడం. కేట్ రూబిన్స్కి ట్రంప్‌కి ఓటెయ్యాలని లేదనుకోండి. ఆమె భర్త మైఖేల్ మేగ్నాని ఆమెను ట్రంప్‌కే ఓటెయ్యమని చెప్పాడనుకోండి. అతడు చెప్పినట్లు కేట్ ట్రంప్‌కే ఓటేశారనుకోండి. అప్పుడు ఆమె తన ఓటును మిస్ అయినట్లు. ‘‘ఓటు వేయకుండా ఉండకూడదు, నచ్చిన వ్యక్తికి వేయకుండానూ ఉండకూడదు’’ అని కేట్ తరచు మహిళల్ని ప్రోత్సాహ పరుస్తుంటారు. ఈసారి కూడా ఎన్నికల సమయానికి ఆమె భూమి మీద ఉండబోవడం లేదు. అక్టోబర్ మధ్యలో అంతరిక్షంలోకి వెళ్తున్నారు. మళ్లీ తిరిగి రావడం వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే. అధ్యక్ష ఎన్నికలకు అంతరిక్షం నుంచే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా ఆమె ఓటేస్తారు. ఆమె ఒక్క ఓటు కౌంట్ కాకపోతే అధ్యక్ష అభ్యర్థులకు వచ్చేది, పోయేది లేకపోవచ్చు. అయితే ఆమె ఒక్క ఓటూ అధ్యక్షుడు ట్రంపా, బైడనా అనే హోరాహోరీ పోటీలో ఒక సంఖ్యలో భాగంగానైతే ఉంటుంది. ఆ భాగాన్నే.. ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావడం అంటారు కేట్ రూబిన్స్. స్పేస్‌లోకి వెళ్లినప్పుడు ‘క్రూ’లో ఒకరైన వ్యోమగామి జెఫ్ విలియమ్స్‌తో నాసా స్పేస్ సూట్స్ మధ్య కేట్ రూబిన్స్. గత అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కూడా అంతరిక్షం నుంచే ఓటు వేశారు కేట్. ఆ ఏడాది నవంబర్ 8 న అధ్యక్ష ఎన్నికలు జరిగే నాటికి వారం ముందే కేట్ భూమి మీదకు తిరిగి వచ్చేసినప్పటికీ ‘ఎర్లీ ఓటింగ్’ సదుపాయంతో ముందే స్పేస్ నుంచి ఓటేశారు. ప్రస్తుతం ఈ ఆస్ట్రోనాట్ తన రెండో అంతరిక్షయానానికి సన్నద్ధం అయేందుకు మాస్కోలోని స్టార్ సిటీలో అక్కడ మరో ఇద్దరు పురుష కాస్మోనాట్స్‌తో కలిసి శిక్షణ పొందుతున్నారు. (ఆస్ట్రోనాట్ అన్నా, కాస్మోనాట్ అన్నా ‘వ్యోమగామి’ అనే అర్థం. అమెరికా ఆస్ట్రోనాట్ అంటుంది. రష్యా కాస్మోనాట్ అంటుంది). సూయెజ్ ఎం.ఎస్.–17 అనే వ్యోమనౌకలో రష్యాలోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ ముగ్గురూ అంతరిక్ష కేంద్రంలోకి బయల్దేరుతారు. ముగ్గురిలో ఒకరు కమాండర్. ఇద్దరు ఫ్లయిట్ ఇంజనీర్లు. కేట్ ఇంజనీర్ నెం.2. అంతరిక్ష కేంద్రంలోని (ఐ.ఎస్.ఎస్.) ‘కోల్డ్ ఆటమ్ ల్యాబ్’లో వ్యోమగాముల హృదయనాళాలపై అంతరిక్ష వాతావరణ పీడన ప్రభావాల మీద కేట్ ఆరు నెలల పాటు పరిశోధనలు జరుపుతారు. ఆమె అక్కడ ఉన్నప్పుడే... ఐ.ఎస్.ఎస్. విరామం లేకుండా మనుషులతో సందడిగా ఉండి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భం వస్తుంది! ఆమె అక్కడ ఉన్నప్పుడే ప్రైవేటు అంతరిక్ష సంస్థ ‘స్పేస్ ఎక్స్’ రెండో విడత వ్యోమగాములకు స్వాగతం పలుకుతారు. ఆమె అక్కడ ఉన్నప్పుడే భూమి మీద అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారాన్ని పై నుంచి వీక్షిస్తారు. ఆమె ఓటు వేసిన అభ్యర్థి ఎన్నికయ్యారా, ఓటు వేయని అభ్యర్థి ఎన్నికయ్యారా అన్నది ఆమెకు తెలుస్తుంది. ఆమెకు మాత్రమే తెలుస్తుంది. స్పేస్‌లో 60వ మహిళ కేట్ పూర్తి పేరు కేథ్లీన్ హ్యాలసీ కేట్ రూబిన్స్. నాసా వ్యోమగామి. కేట్ పుట్టింది కాలిఫోర్నియాలో. ఉంటున్నది టెక్సాస్‌లో. ఏడో తరగతి చదువుతున్నప్పుడే స్పేస్ క్యాంప్‌కు వెళ్లడానికి అవసరమైన డబ్బుల కోసం ఇంటి చుట్టుపక్కల పనీ పాటా చేసి, ఆ మేరకు సంపాదించుకున్నారు. స్పేస్ క్యాంప్ అంటే ఏం లేదు. అలబామాలో నాసా వాళ్ల అంతరిక్ష మ్యూజియం ఉంటుంది. అందులోని వింతలు–విశేషాలు చూసేందుకు వెళ్లే పిల్లల ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. కేట్ (41) తన ముప్పయవ యేట నాసాలో ప్రవేశించారు. 2016లో స్పేస్‌లోకి అరవయ్యవ మహిళగా (ప్రపంచం మొత్తం మీద) అడుగు పెట్టారు. కేట్ తర్వాత మరో ఐదుగురు మహిళలు ఐ.ఎస్.ఎస్.ను చేరుకున్నారు. -
ఎంటర్ ది డ్రాగన్
నడిపించడం పెద్ద మార్షల్ ఆర్ట్. టీమ్‌నైనా.. గేమ్‌నైనా.. వార్నైనా.. వెహికిల్నైనా.. ఎంటరింగ్ ది డ్రాగన్. డ్రాగన్‌కు ఎదురెళ్లడమే. వెళ్లడమే కాదు.. సవారీ చేయబోతున్నారు మెగాన్! అంతరిక్షం పైకి ‘డ్రాగన్’ని లేపబోతున్నారు. దేవుడు ఉన్నాడా లేడా అని ఆలోచించేంత తీరిక ఉండదు ఎలాన్ మస్క్‌కి. ప్రపంచంలోని తొలి పదిమంది సంపన్నుల జాబితాలో ఏ „ý ణానికి ఆ క్షణం పైకీ కిందికీ అవుతుండటంతోనే ఆయనకు రోజు సరిపోతుంటుంది. అయితే ఈ ఏడాది మే నెల 30వ తేదీ నుంచి ఆయన ఆలోచనల్లోకి దేవుడు వచ్చిపోతున్నాడు! ఫ్లారిడా నుంచి ‘డ్రాగన్’ అనే వ్యోమనౌక ఇద్దరు నాసా మానవుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి వదిలిన రోజు అది. ఆ నౌకను తయారు చేసింది ‘స్పేస్ ఎక్స్’ అనే అమెరికన్ ప్రైవేటు కంపెనీ. ఆ కంపెనీ యజమానే ఎలాన్ మస్క్. అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ఆ ఇద్దరినీ ఆగస్టు 2న డ్రాగన్ క్షేమంగా భూమి మీదకు దింపాక చూడాలి మస్క్ ఆశ్చర్యం, ఆనందం! ‘‘నేను భక్తిపరుడిని కాదు. అయితే ఇందుకోసం దేవుణ్ణి ప్రార్థించాను’’ అన్నాడు మస్క్.. ప్యారాచ్యూట్ల సహాయంతో డ్రాగన్ సుర క్షితంగా ఫ్లారిడా సముద్ర జలాలపై దిగగానే! నాసా కాకుండా, ఒక ప్రైవేటు వ్యోమనౌక సాధించిన తొలి ఘనత ఇది. చరిత్ర కూడా! అరవై ఐదు రోజుల పాటు భూకక్ష్యలోని ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం’ లో ఉండి వచ్చిన ఆ ఇద్దరు వ్యోమగాములు బాబ్ బెంకెన్ (50), డగ్ హర్లీ (53). డ్రాగన్–2 మిషన్ మళ్లీ వచ్చే ఏడాది మార్చి–మే ల మధ్య మొదలవుతుంది. అందులోనూ ఇద్దరు ఉంటారు. అయితే ఈసారి ఒక మహిళ. ఒక పురుషుడు. ఆ స్పేస్ క్రాఫ్ట్‌ను నడిపేది మాత్రం మహిళ. ఆమె పేరు మెగాన్ మెకార్థర్ (48). నానా వ్యోమగామి. ప్రసిద్ధ ఓషనోగ్రాఫర్. సముద్ర విజ్ఞాన పరిశోధకురాలు. బాబ్ బెంకెన్ భార్య. నాసాలో వీళ్లిద్దరూ ఇరవై ఏళ్ల క్రితం బ్యాచ్మేట్లు. మెగాన్ గత ఏడాదే నాసా ‘ఆస్రోనాట్ ఆఫీస్’ డిప్యూటీ చీఫ్ అయ్యారు. ఒక వ్యోమనౌకు పైలట్‌గా ఉండటం మెగాన్ మెకార్థర్కు ఇదే మొదటిసారి అయినప్పటికీ, అంతరిక్షంలోకి వెళ్లడం మాత్రం ఇది రెండోసారి. భూ నిమ్నకక్ష్యలో (లో ఎర్త్ ఆర్బిట్) 1990 నుంచి పరిభ్రమిస్తున్న ‘హబుల్ స్పేస్ టెలిస్కోప్’ మరమ్మతుల కోసం 2009లో ‘లీడ్ మిషన్ స్పెషలిస్టు’గా పదమూడు రోజులు స్పేస్‌లో ఉండి వచ్చారు మెగాన్. చివరిసారి హబుల్ని టచ్ చేసి వచ్చిన వ్యోమగామి కూడా మెగానే! అంటే ఆ తర్వాత హబుల్‌కు మరమ్మతులు రాలేదని. అంతా సవ్యంగా ఉంటే 2040 వరకు హబుల్ పనిచేస్తూనే ఉంటుంది. ఇప్పుడీ డ్రాగన్ 2 మిషన్‌తో మెగాన్ రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లినట్లవుతుంది. ఆమెతోపాటు షేన్ కింబోర్గ్ (స్పేస్ కమాండర్), మిషన్ స్పెషలిస్టులు అకిహకో, థామస్ పెస్క్వెట్లు ఉంటారు. నాసా, స్పేస్ ఎక్స్‌ల ఉమ్మడి మిషన్ ఇది. ‘‘స్పేస్ క్రాఫ్ట్‌ను నడపబోతున్నాను అనే ఆలోచనే ఎంతో ఉద్వేగంగా ఉంది’’ అని మెగాన్ సోమవారం ట్వీట్ చేశారు. నాసాలో ఇప్పటికే మెగాన్ పైలెట్ శిక్షణ మొదలైంది. కాలిఫోర్నియాలో మెగాన్ మెకార్థర్ నివాసం. 2000 లో ఆమె నాసా వ్యోమగామిగా ఎంపిక అయ్యారు. హైస్కూల్లో చదువుతున్నప్పుడే ఆస్ట్రోనాట్ అవాలని ఆమెకు ఉండేది. కానీ అది కష్టమైన సంగతని కూడా ఆమెకు తెలుసు. ఎంత కష్టమైతేనేం కోరుకున్న దారిలోకే వచ్చేశారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి, ఓషనోగ్రఫీలో డాక్టరేట్ చేశారు. నక్షత్రాలు, లేదంటే సముద్ర జలాలు. చివరికి నింగీ నేలా రెండూ ఆమెకు ఆహ్వానం పలికాయి. ఇప్పుడు పైలెట్‌గా ఆహ్వానం! ఈసారి మాత్రం స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఆరు నెలలు అంతరిక్షంలోనే ఉంటుంది. ఆమె భర్త బాబ్ బెంకెన్, ఆరేళ్ల కొడుకు థియోడర్లకు అదేమీ పెద్ద కాలమూ, దూరమూ కాకపోవచ్చు. వ్యోమగాముల ఫ్యామిలీ కనుక. -
అంతరిక్షానికి ప్రయాణం
అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం కాబోతున్నారు ఫర్హాన్ అక్తర్. వ్యోమగామిగా మారి అంతరిక్షాన్ని చుట్టేయాలనుకుంటున్నారు. అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. కెమెరామేన్ మహేష్ మతై ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. త్వరలోనే రష్యాలో ఈ సినిమా షూటింగ్ ని ఆరంభించనున్నారని సమాచారం. ఈ బయోపిక్ లో రాకేష్ శర్మ పాత్రను ఎవరు పోషిస్తారు? అనే వార్తల్లో ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, సుశాంత్ సింగ్, విక్కీ కౌశల్ పేర్లు గతంలో తెర మీదకు వచ్చాయి. చివరికి ఫర్హాన్ అక్తర్ ఈ పాత్రలో నటించనున్నారు. -
అంతుచిక్కని ‘విశ్వాంతరాళం’
పత్రికల్లో పజిల్స్ వస్తుంటాయి. దారి చూపండి.. రంగులు వేయండి. ఆరు తేడాలను గుర్తించండి. ఖాళీలు నింపండి. అన్నీ.. చిన్నపిల్లలు చేసేవి. వీళ్లూ చిన్నపిల్లలే.. టెన్త్ పిల్లలు. స్పేస్ ఇండియా వీళ్లకో పెద్ద పజిల్ ఇచ్చింది. ‘కనుక్కోండి చూద్దాం?’ అంది. ఆ పజిల్నీ పూర్తి చేశారు! కొత్త ఆస్టరాయిడ్‌ను కనిపెట్టి.. ‘కనుక్కున్నాం చూడండి’ అన్నారు! పైన అంతరిక్షంలో అనేకం తిరుగుతుంటాయి. గ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు! నక్షత్రాలు కూడా ఉంటాయి కానీ వాటిని ‘తిరుగుతున్నాయి’ అనకూడదు. వాటి దారి వేరే. సూర్యుడిలా సొంత రూట్లో ప్రయాణిస్తూ ఉంటాయి. అదొక మర్మదేశం. దేశం అంటే చిన్నదైపోతుంది. అంతుచిక్కని ‘విశ్వాంతరాళం’. ఆదీ అంతమూ తెలియని రహస్యం. వాటిల్లో కొన్ని శాస్త్ర పరిశోధకులకు మాత్రమే కనిపించేవి. మరికొన్ని మామూలు కంటికి కూడా కనిపించేవి. కొన్ని రోజులుగా డాబాలపై నుంచి ‘నియోవైజ్’ అనే తోకచుక్క కనిపిస్తోంది. నిన్నటి వరకు ఆ తోకచుక్కను వట్టి కంటితో చూడగలిగాం. దాదాపు 5 కి.మీ. పొడవున ఉన్న నియోవైజ్ భూమికి పది కోట్ల కిలో మీటర్ల దూరం నుంచి కూడా రోజూ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో తూర్పు దిక్కున పైకి తేలుతోంది. మళ్లీ 6,766 ఏళ్ల తర్వాతే నియోవైజ్ కనిపించడం! ఇప్పుడిక ‘నియోవైజ్’ తోక చుక్కను మించిన అద్భుతంలోకి వద్దాం. మనలాగే రోజూ ఆ తోకచుక్కను చూస్తూ, ఆశ్చర్యపడవలసిన ఇద్దరు అమ్మాయిలు.. ఆ తోక చుక్కను కూడా దాటిపోయి, ఆకాశంలో ఓ లఘు గ్రహాన్ని (ఆస్టరాయిడ్) కనిపెట్టారు! ఆ ఆస్టరాయిడ్ వీళ్ల కళ్లలో పడింది భూకక్ష్యలో ఉండి కాదు. అంగారకుడి చుట్టూ తిరుగుతూ!! నియోవైజ్ తోక చుక్క గురించి ‘నాసా’ వాళ్లు ప్రపంచానికి వెల్లడించక ముందు నుంచే గత రెండు నెలలుగా వైదేహి, రాధిక అనే ఆ ఇద్దరమ్మాయిలు కొత్త గ్రహాల కోసం ఖగోళాన్ని అన్వేషించే పనిలో ఉన్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో ‘సవానీ చైతన్య విద్యాసంకుల్’లో టెన్త్ విద్యార్థినులు వాళ్లు. ‘ఆలిండియా ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్ 2020’ భాగంగా గగనాన్ని గాలిస్తున్నప్పుడు ఆ ఆస్టరాయిడ్‌పై వీళ్ల దృష్టి పడింది! ‘పాన్ స్టార్స్’ అనే టెలిస్కోప్‌లో పరిశీలిస్తూ ఇద్దరూ ఒకేసారి అంగారకుడి కక్ష్యలో ఆస్టరాయిడ్‌ను గుర్తించారు. అంత శక్తిమంతమైన టెలిస్కోప్ ఈ అమ్మాయిల చేతికి ఎలా వచ్చింది? ఆస్టరాయిడ్ సెర్చ్ ప్రోగ్రామ్ కోసం ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కొలాబరేషన్ (ఐజక్) అనే బహుళ విశ్వవిద్యాలయాల సంస్థ, టెక్సాస్‌లోని హార్డిన్ సిమ్మన్స్ యూనివర్సిటీ ఉమ్మడిగా ఏర్పాటు చేశాయి. వాటితో ఒప్పందంలో ఉన్న ఇండియాలోని ‘స్పేస్ ఇండియా’ (హర్యానా) ఈ అన్వేషణ కోసం.. అంతరిక్ష పరిజ్ఞానం, ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తుల నుంచి ఆహ్వానించి, పోటీ పరీక్ష నిర్వహించి వైదేహి, రాధికలను ఎంపిక చేసుకుంది. భూమికి కనుచూపు మేరలో ఉన్న ఆస్టరాయిడ్స్‌ను కనిపెట్టడం సెర్చ్ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యం. కరోనా సమయం కాబట్టి వీళ్ల ఈ అన్వేషణ అంతా ఇంటి నుంచే జరిగేలా స్పేస్ ఇండియా ఏర్పాట్లు చేసింది. అంతకుముందే అన్వేషణ విధానాలలో శిక్షణ ఇచ్చింది. అంతరిక్షంలో మొదట వీళ్లు దాదాపు ఇరవై ఖగోళ పదార్థాలేవో గుర్తించారు. అయితే అవేవీ ఆస్టరాయిడ్స్ కాదు. చివరికి అసలైన ఆస్టరాయిడ్ కంటికి చిక్కింది. అయితే అది ఆస్టరాయిడేనా?! నిర్థారణ కోసం ఆ లోకేషన్‌ని ‘స్పేస్ ఇండియా’ నాసాకు పంపింది. ‘ఎస్.. ఆస్టరాయిడే’ అంది నాసా. తాత్కాలికంగా ఆ ఆస్టరాయిడ్కు హెచ్.ఎల్.వి.2514 అనే పేరు పెట్టింది. దాని కక్ష్యను కూడా నాసా గుర్తించాక (ఇందుకు సంవత్సరాలు పడుతుంది) ఆ ఆస్టరాయిడ్కు పేరు పెట్టే అవకాశాన్ని ఈ ఇద్దరు అమ్మాయిలకు ఇస్తుంది! హార్డిన్ సిమ్మన్స్ యూనివర్సిటీలో గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మిల్లర్ పంపిన ప్రత్యేక అభినందనలలో వైదేహి రాధిక ఇప్పుడు మేఘాలలో విహరిస్తున్నారు. యు.ఎస్.లోని నాసా వరకు ఎగరాలన్నది వారి కోరిక. వైదేహి తండ్రి వస్త్రవ్యాపారి. రాధిక తండ్రి కంప్యూటర్స్ విడిభాగాలు దుకాణం. కూతుళ్లు ఇంత సాధించాక తల్లిదండ్రులు గాలితో తేలిపోకుండా ఉంటారా! -
రికార్డు సృష్టించి.. భూమికి తిరిగొచ్చింది!
అల్మేటీ (కజకిస్తాన్): అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో సుదీర్ఘకాలం గడిపి రికార్డు సృష్టించిన మహిళా వ్యోమగామి క్రిస్టీనో కోచ్ ఎట్టకేలకు గురువారం భూమికి తిరిగి వచ్చారు. అమెరికాకు చెందిన ఈ వ్యోమగామి గత ఏడాది మార్చి 14నలో ఐఎస్ఎస్కు వెళ్లగా గురువారం ఉదయం (కజకిస్తాన్ స్థానిక సమయం) 9.12 గంటల ప్రాంతంలో సోయెజ్ క్యాప్సూల్ ద్వారా ల్యాండ్ అయ్యారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన లూకా పర్మిటానో, రష్యాకు చెందిన అలెగ్జాండర్ ష్కోవ్రోట్సవ్లుక ఊడా కోచ్‌తోపాటు ఉన్నట్లు రాస్‌కాస్మోస్ తెలిపింది. సోయెజ్ క్యాప్సూల్ కజక్‌లోని గడ్డిమైదానాల్లో ల్యాండ్ అయిన సందర్భంగా తీసిన వీడియోలను రాస్‌కాస్మోస్ విడుదల చేసింది. సుమారు 328 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన కోచ్.. సోయెజ్ క్యాప్సూల్‌లో నవ్వుతూ కనిపించగా.. పర్మిటానో పిడికిలి పైకెత్తి తన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మరోవైపు రష్యన్ వ్యోమగామి ఆపిల్ పండు తింటూ కనిపించారు. అమెరికాలోని మిషిగన్‌లో జన్మించిన కోచ్ గత ఏడాది డిసెంబరు 28న సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపిన మహిళ వ్యోమగామిగా పెగ్గి విట్సన్ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. పెగ్గీ 2016–17లో మొత్తం 289 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. -
మసాల దోశ, బిర్యానీ ఏ పాపం చేశాయి?
న్యూఢిల్లీ: మానవ సహిత అంతరిక్షయాత్ర గగన్‌యాన్‌ను నింగిలోకి పంపేందుకు ఇస్రో ఒక బృందాన్ని సిద్ధం చేసింది. ఎనిమిదిమందితో కూడిన ఈ బృందం రష్యాలో శిక్షణ పొందగా వీరిలో నలుగురిని ఎంపిక చేసినట్లు ఇస్రో చైర్మెన్ శివన్ తెలిపారు. అయితే వారి సమాచారాన్ని ఇప్పటిదాకా బయటకు రాలేదు. తాజా ఇస్రో అధికారులు అంతరిక్షంలోకి వెళ్తున్న నలుగురు వ్యోమగాములకు ఎలాంటి ఫుడ్ ఉండాలో నిర్ణయించారు. వీరికి పూర్తిగా స్వదేశీ ఆహారాన్ని మాత్రమే ఇస్తున్నారు. ఆ ఆహార పదార్థాల లిస్టులో ఇడ్లీ, మూంగ్ దాల్, హల్వా, వెజ్ పులావ్, ఎగ్ రోల్స్‌ను డిఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ లాబొరేటరి తయారు చేసింది. దీంతో పాటు ఫుడ్ హీటర్స్‌ను వ్యోమగాములకు అందుబాటులో ఉంచనున్నారు. అంతరిక్షంలో తేలియాడే వ్యోమగాముల కోసం తాగేందుకు ప్రత్యేకమైన కంటెయినర్లు తయారు చేశారు. వాటర్, జ్యూస్‌లను తీసుకువెళ్లేందుకు స్పెషల్ ప్యాకెట్లను డీఆర్డీవో తయారు చేసింది. వచ్చే ఏడాది చివర్లో లేదా 2022లో గగన్ యాన్ ప్రాజెక్ట్ ను చేపట్టడానికి ఇస్రో రెడీ అవుతుంది. అయితే ఈ ఫుడ్ మెనూపై సోషల్ మీడియాలో సైటైర్లు పేలుతున్నాయి. కొందరు నెటిజన్లు ఫన్నీగా అన్నీ ఉన్నాయి.. మరి 'మసాల దోశ, బిర్యానీ ఏ పాపం చేశాయి?' వాటిని మెనూలో ఎందుకు చేర్చలేదు' అని ఓ నెటిజన్ ఇస్రోకి ట్వీట్ చేశాడు. 'రసగుల లేదా.. ఇది చాలా చీప్ మెనూ' అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. 'పోహా కహా హై' అని మరో నెటిజన్ అడిగాడు. 'నో సాబుదాన వడా ఫర్ ఫాస్టింగ్ ఆస్ట్రోనాట్స్' అని ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు. ఇలా నెటిజన్లు రకరకాలుగా సరదా కామెంట్స్‌తో ఇస్రోని ప్రశ్నిస్తున్నారు. Why not Masala dosa and Biriyani ? https://t.co/AL2eXzi1SD — Naveenkumar (@NaveenTwtz1) January 7, 2020 No Sabudana wada for fasting astronauts? https://t.co/wbYSLGcYSP — मोर (@13MMGM) January 7, 2020 -
భూమి నుంచి అంతరిక్షంలో వైద్యం
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న ఓ వ్యోమగామికి మెడ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టింది. దానికి భూమ్మీద నుంచే ఓ వైద్య బృందం చికిత్స అందించింది. ఈ విధంగా చికిత్స అందించడం ఇదే తొలిసారి. ఆరు నెలల పాటు విధులు నిర్వర్తించేందుకు ఐఎస్ఎస్కు వెళ్లిన వ్యోమగామికి ఈ సమస్య ఉన్నట్లు అక్కడికెళ్లిన రెండో నెలలో తెలిసింది. వైద్య బృందాన్ని వేగంగా అక్కడికి పంపే అవకాశం లేకపోవడంతో భూమి నుంచే వైద్యాన్ని కొనసాగించారు. గడ్డకట్టిన రక్త నాళాలకు చికిత్స అందించే నిపుణుడైన ప్రొఫెసర్ స్టీఫన్ మోల్ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. మెయిల్స్ ద్వారా సమాచారం పంపుకుం టూ వైద్యం కొనసాగించారు. రక్తం గడ్డకట్టకుండా చూసే ప్రత్యేక మందును ఆయన ఇంజెక్షన్ ద్వారా తీసుకునేవారు. 40 రోజుల పాటు ఈ వైద్యం కొనసాగిన తర్వాత ప్రత్యేక రాకెట్ ద్వారా తర్వాత వాడాల్సిన మందులను పంపించారు. మొత్తంగా ఈ చికిత్స 90 రోజుల పాటు కొనసాగింది. వ్యోమగామి తిరిగి భూమి మీదకు వచ్చే నాలుగు రోజుల ముందు చికిత్సను ఆపేశారు. అతను భూమ్మీదకు వచ్చేసరికి తదుపరి చికిత్స కూడా అవసరం లేకుండా వ్యాధి నయమైందని సంబంధిత వర్గాలు విడుదల చేసిన అధ్యయనంలో తేలింది. -
చంద్రయాన్-2పై పాక్ వ్యోమగామి ప్రశంసలు
కరాచీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2పై పాకిస్తాన్‌కు చెందిన తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీమ్ అభినందనలు తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో చేసిన ప్రయత్నం చరిత్రాత్మకమైందని అన్నారు. కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న సైంటియా అనే సైన్స్ మ్యాగజైన్‌తో నమీరా మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-2ను దక్షిణ ఆసియా సాధించిన విజయంగా ఆమె అభివర్ణించారు. ఇది ప్రపంచ అంతరిక్ష రంగానికి గర్వకారణమని చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రాంతీయ అభివృద్ధికి దక్షిణ ఆసియాకు చెందిన ఏ దేశం విజయం సాధించినా.. అది ఆ ప్రాంతం మొత్తానికి గర్వకారణమని చెప్పుకొచ్చారు. కాగా, ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ వర్జిన్ గెలాక్టిక్ పంపే వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు నమీరా ఎంపికయ్యారు. ఇదిలా ఉంచితే చంద్రయాన్-2 ప్రయోగంపై పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫవాద్ వ్యాఖ్యలపై భారత నెటిజన్లతోపాటు పలువురు పాకిస్తానీలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడివైపు నెమ్మదిగా కదిలింది. మరో 2.1 కి.మీ ప్రయాణిస్తే ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందనగా, భూకేంద్రంతో ఒక్కసారిగా సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. అయితే విక్రమ్ ల్యాండర్ సురక్షింతగానే ఉందని ఇస్రో తాజాగా ప్రకటించింది. ‘విక్రమ్’ హార్డ్ ల్యాండింగ్ అయినప్పటికీ.. అది ముక్కలు కాలేదని ఇస్రో తెలిపింది. -
‘ఆమె’కు అందని అంతరిక్షం!
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే ప్రాజెక్టు గగన్‌యాన్‌లో ‘ఆమె’కు చోటు దక్కే అవకాశాలు దాదాపు కనుమరుగయ్యాయి. గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా పంపే వ్యోమగాముల బృందంలో మహిళ ఉంటారని ఇస్రో చైర్మన్ శివన్ గతంలో చెప్పారు. అయితే తాజాగా భద్రతా దళాల నుంచి ఓ పైలట్‌ను పంపాలని ఇస్రో భావిస్తోందని సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. అయితే భద్రతా దళాల్లో మహిళా పైలట్ ఎవరూ లేకపోవడంతో ‘ఆమె’కు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశాలు దాదాపు లేవు. ఇప్పటివరకు చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్టుల్లో పైలట్లను మాత్రమే పంపించారు. దీంతో తామూ మొట్టమొదటి ప్రాజెక్టులో పైలట్లనే పంపించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి మహిళా వ్యోమగామికి అవకాశం లేకపోయినప్పటికీ భవిష్యత్‌లో చేపట్టే మానవ సహిత యాత్రల్లో మహిళా పౌరురాలికి అవకాశం దక్కుతుందన్నారు. వచ్చే నెల కల్లా గగన్‌యాన్‌లో వెళ్లే బృందాన్ని ఖరారు చేస్తామని, ఇప్పటికే వడబోత మొదలైందన్నారు. 2022లో తొలి గగన్‌యాన్ యాత్ర చేపట్టనున్నారు. -
ప్రేమ విహారాలు
ఇద్దరు భామలతో స్పేస్‌లో ప్రేమ విహారం చేస్తున్నారట వరుణ్ తేజ్. మరి ఆ ఇద్దరిలో ఎవరితో ప్రేమలో పడతారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్ష్యం నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అదితీ రావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలుగా కనిపించనున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గురువారం మొదలైన కొత్త షెడ్యూల్ ఈ నెల 14 వరకూ జరగనుంది. ప్రత్యేకంగా వేసిన స్పేస్ సెట్లో ఈ షూటింగ్ చేస్తున్నారు. ఇందులో వరుణ్, అదితీ, లావణ్య ముగ్గురూ పాల్గొంటున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
సెల్యూట్‌కి గ్రీన్ సిగ్నల్
వివాహం చేసుకున్న తర్వాత కథానాయిక కరీనా కపూర్ ఒక కీలక పాత్రలో నటించిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న ఓ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఆ చిత్రం గురించి అధికారిక వార్త ఏమీ రాలేదు. ఇప్పుడు షారుక్ ఖాన్ హీరోగా నటించబోయే ‘సెల్యూట్’ సినిమాలో కథానాయిక పాత్ర పోషించడానికి కరీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ జీవితం ఆధారంగా ‘సెల్యూట్’ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా అక్టోబర్‌లో స్టార్ట్ కానుందని టాక్. షారుక్‌తో కరీనా నటించిన చివరి చిత్రం ‘రా. వన్’. 2011లో ఈ చిత్రం విడుదలైంది. -
మార్స్‌పై తొలి అడుగు ఈమెదే
వాషింగ్టన్: పెరిగి పెద్దయ్యాక అంతరిక్షయానం చేయాలని ఉందంటూ స్కూలు విద్యార్థులు చెబుతుండడం మనం వింటుంటాం. భవిష్యత్‌లో వారు ఏదో ఒక రంగంలో స్థిరపడి, చిన్నపుడు అనుకున్నది కలగానే మిగిలిపోయిన సందర్భాలే ఎక్కువగా ఉంటుంటాయి. అయితే దీనికి పూర్తి భిన్నంగా అమెరికాలోని లూసియానాకు చెందిన 17 ఏళ్ల అలెసా కార్సన్ మాత్రం అరుణ గ్రహం (మార్స్-అంగారకుడు)పై కాలుమోపబోయే తొలి మహిళగా (ఈ గ్రహంపై మొదట అడుగుపెట్టే వారిలో ఒకరిగా) రికార్డ్ సొంతం చేసుకోనుంది. అయితే అది ఇప్పుడప్పుడే కాదు ఆమె 32 ఏళ్ల వయసులో... 2033 సంవత్సరంలో.. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగం కోసం కార్సన్ ఇప్పటికే నాసా పోలార్ ఆర్బిటల్ సైన్స్, జీరో గ్రావిటీ, అండర్‌వాటర్ సర్వయివల్, తదితర కార్యక్రమాల్లో ప్రాథమిక శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. పద్దెనిమిదేళ్లు నిండిన వారినే నాసా వ్యోమోగామి (ఆస్ట్రోనాట్) గా అధికారికంగా ప్రకటించే వీలుంటుంది కాబట్టి ఇప్పుడామే ’బ్లూ బెర్రీ’కోడ్‌నేమ్‌తో కొనసాగుతోంది. మార్స్ గ్రహానికి వెళ్లేందుకు అవసరమైన ఆరియన్ అంతరిక్షనౌక, స్పేస్ లాంఛ్ సిస్టమ్ రాకెట్‌పై వెళ్లేందుకు ఆమెను ఈ శిక్షణ సిద్ధం చేస్తుంది. ప్రస్తుత సాంకేతికతను బట్టి చూస్తే మార్స్‌పైకి వెళ్లేందుకు ఆరుమాసాల సమయం పడుతుంది. ఆ తర్వాత ఏడాది పాటు ఆ గ్రహంపైనే గడిపాక తిరుగుపయనమవుతారు. ఈ ట్రిప్ ముఖ్యోద్ధేశ్యం ఏమంటే..అక్కడ వనరుల అన్వేషణ, నీటి నమూనాల పరిశీలన, జీవజాతుల జాడలున్నాయా లేదా అన్నది పరిశీలించడంతో పాటు అక్కడ అవాసాలు అభివృద్ధి చేసుకునేందుకు ఉన్న అవకాశాలు ఏ మేరకు ఉన్నాయన్నది చూస్తారు. నికోల్ ఒడియన్ ఛానల్ ’ద బాక్యార్డిజాన్స్’ కార్టూన్ మిషన్ టు మార్స్ ఎపిసోడ్లో ఓ మిత్రుల బృందం అంగారకగ్రహంపై సాహసయాత్రకు వెళ్లడం కార్సన్‌కు మూడేళ్ల వయసులోనే బలమైన ముద్రవేసింది. ఆస్ట్రోనాట్‌గా మారడమే ఆమె జీవితాశయంగా మారింది. చిన్నతనమంతా కూడా నాసాకు చెందిన అంతరిక్ష ప్రయోగకేంద్రాలు సందర్శించింది. ముందుగా వ్యోమోగామిగా అరుణగ్రహం నుంచి తిరుగొచ్చాక, ఓ అధ్యాపకురాలిగా ఆ తర్వాత దేశాధ్యక్షురాలిని కావాలని కోరుకుంటున్నట్టు ఆమె వెల్లడించింది. -
అంగారక యాత్రకు టీనేజ్ అమ్మాయి!
సాక్షి, న్యూఢిల్లీ : నక్షత్రాల వెలుగు జిలుగులతో అందంగా కనిపించే ఆకాశానికేసి చూసినప్పుడు పిల్లలందరికి ‘అబ్బా! అలా రోదసిలోకి వెళ్లి తిరిగొస్తే బాగుండు’ అనిపిస్తుంది. పెద్దయ్యాక వారికి అది అందమైన కలగానే మిగిలిపోతుంది. మన అలిస్సా కార్సన్‌కు అది మిగిలిపోయే కల కాదు. నిజంగా నిజమయ్యే అవకాశాలున్న కల. అమెరికాలోని లూజియానాకు చెందిన అలిస్సా కార్సన్ అంగారక గ్రహంపైకి వెళ్లేందుకు మొదటి మానవ యాత్రకు సిద్ధమవుతుంది. 2033లో అంగారక గ్రహంపైకి మానవ వ్యోమగాములను తీసుకెళ్లేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఆ యాత్రలో పాల్గొనేందుకు అలిస్సా ఎప్పటి నుంచి నాసాలో శిక్షణ పొందుతోంది. ఆ మాటకొస్తే ఆమె చిన్నప్పటి నుంచి నాసా నుంచి శిక్షణ తీసుకుంటుందని చెప్పవచ్చు. పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నాసా అమెరికాలో ఎక్కడా శిక్షణా శిబిరం ఏర్పాటు చేసినా అక్కడికెళ్లి హాజరవుతూ వచ్చింది. ఇంతవరకు ఒక్క శిబిరాన్ని కూడా వదల లేదంటే అంతరిక్ష యాత్రలపై ఆమెకున్న మక్కువ ఎంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు. అలా శిబిరాల ద్వారా నాసా శాస్త్రవేత్తలతో ఆమె మమేకమైంది. చివరకు వయస్సు రాకముందే నాసా శిక్షణకు హాజరవుతోంది. నాసా నిబంధనల ప్రకారం 18 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవడానికి వీల్లేదు. 17 ఏళ్ల అలిస్సా చేర్చుకోవాల్సి వచ్చింది. అందుకనే నాసా ఆమె పేరును, వయస్సును పేర్కొనకుండా ‘బ్లూబెర్రీ’ అనే కోడ్ నెంబర్‌తో వ్యవహరిస్తున్నారు. అంతరిక్ష యాత్ర, ముఖ్యంగా అంగారక యాత్రపై అలిస్సాకు ఇష్టం ఏర్పడడానికి కూడా కారణం ఉంది. ‘బ్యాకీయార్డిగాన్స్’ శీర్షికతో నికలడియాన్ నడిపిన కార్టూన్ సిరీస్‌ను చిన్నప్పుడే చదవడం కారణం. ఆ సిరీస్‌లో ఓ ఎపిసోడ్ ‘మిషన్ టు మార్స్’ ఉంటుంది. అందులో మిత్రులంతా కలిసి ఊహాత్మకమైన అంగారక గ్రహంపైకి వెళతారు. అప్పుడే తాను నిజంగా అంతరిక్ష యాత్రకు వెళ్లాలని అనుకుంది. అందుకు కాస్త పెద్దయ్యాక ఎలాగైనా వ్యోమగామిని కావాలని కలలుకంది. ఇప్పుడు నిజంగానే ఆమెకు అవకాశం వచ్చింది. తాను జీవితంలో టీచర్‌గానీ లేదా దేశాధ్యక్షుగానీ కావాలని కోరుకుంటున్నానని, అయితే అది అంగారక గ్రహంపైకి వెళ్లి వచ్చాక నెరవేరాలనుకుంటున్న లక్ష్యమని ‘టీన్ యోగ్’కు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. వ్యోమగామికి అవసరమైన ప్రాథమిక శిక్షణను అలిస్సా తీసుకుంటున్నారు. భూమి గురుత్వాకర్షణ లేని శూన్యంలో గడపడం, నీటిలో ఎక్కువ సేపు వివరించడం లాంటి శిక్షణలు తీసుకుంటున్నారు. ఆర్యన్ అంతరిక్ష నౌకలో ఆమె అంగారక గ్రహంపైకి వెళ్లనున్నారు. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం అంగారక గ్రహంపైకి వెళ్లేందుకు ఆరు నెలల కాల వ్యవధి పడుతుంది. తాను ఏడాదికి పైగా అంగారక గ్రహంపై గడపనున్నట్లు ఆమె తెలిపారు. అక్కడ ఎలాంటి వనరులు ఉన్నాయి. అసలు నీటి ఛాయలు ఉన్నాయా, జీవి ఉనికికి ఆస్కారం ఉందా? అక్కడ మానవుల మనుగడ సాధ్యమేనా? అంశాలపై తాము అధ్యయనం జరుపుతామని చెప్పారు. అంతరిక్ష యాత్రకు సమాయత్తమవుతున్న అలిస్సా ముందుగా రోదసిలోని అంతరిక్ష ప్రయోగశాలకు వెళ్లి రానుంది. అక్కడికి వెళుతున్న తొలి టీనేజర్‌గా రికార్డు సృష్టించనుంది. అంగారక యాత్రకు శిక్షణ పొందుతున్న తొలి టీనేజర్ కూడా అలిస్సానే అయినప్పటికీ ఆమె యాత్రకు బయల్దేరే నాటికి ఆమెకు 32 ఏళ్లు వస్తాయి. -
‘వ్యోమగామి’గా మెగా హీరో
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తెలుగులో తొలి స్పేస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. వరున్ ఆస్ట్రోనాట్‌గా నటిస్తున్న ఈ సినిమాకు వ్యోమగామి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నటించేందుకు వరుణ్ ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. స్పేస్ షటిల్‌తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు. వరుణ్ సరసన అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, క్రిష్(దర్శకుడు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
ప్రేమలో మునిగి.. వ్యోమగామిగా తేలి!
ప్రేమికుడు వ్యోమగామి (ఆస్ట్రోనాట్)గా మారబోతున్నాడు. ప్రేమ కోసం అమ్మాయి చుట్టూ తిరిగినవాడు ఒక ఆపరేషన్ నిమిత్తం అంతరిక్షంలో తిరగనున్నాడు. ఏం చెబుతున్నామో అర్థం కావడంలేదా? ‘తొలిప్రేమ’ సినిమాలో ప్రేమికుడిగా కనిపించి, మంచి హిట్‌ను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ తన నెక్ట్స్ సినిమాలో వ్యోమగామిగా కనిపిస్తారట. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ స్పేస్ ఫిల్మ్‌లో వరుణ్ నటించనున్న విషయం తెలిసిందే. దాని కోసం ప్రిపరేషన్స్ కూడా మొదలుపెట్టేశారట. ఈ సినిమా గురించి నిర్మాత వై. రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఘాజీ’ తర్వాత సంకల్ప్ రెడ్డి మరో ఎగై్జటింగ్ కాన్సెప్ట్‌తో వచ్చాడు. రెగ్యులర్ సినిమాల టైమ్ అయిపోయే తరుణం వచ్చింది. ఇప్పుడు కేవలం కంటెంట్ బేస్డ్ సినిమాలు ఆడే రోజులు వచ్చాయి. మా బ్యానర్ ద్వారా కంటెంట్ ఉన్న కథలను అందించాలన్నది మా ఆశయం. వరుణ్ తేజ్ ఈ సినిమా ఒప్పుకుంటారో.. ఒప్పుకోరో అని ఒక చిన్న టెన్షన్ ఉండేది. కానీ తను కూడా మాలాగే ఎగై్జట్ అయి, సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. అది మాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. ఈ సినిమా మొత్తం స్పేస్‌లో జరగనున్నందు వల్ల దర్శకుడు సంకల్ప్, హీరో వరుణ్ తేజ్ ఒక నెల పాటు ఖజికిస్థాన్లో జీరో గ్రావిటీ కండీషన్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటారు. సినిమాలో మిగతా క్యాస్ట్ అండ్ క్రూకి కూడా ఇలానే ట్రైన్ చేయనున్నాం’’ అన్నారు. ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను ముందుగా యూఎస్‌లో షూట్ చేద్దామనుకున్నారట. కానీ ఇప్పుడు జార్జియాలో షూట్ చేయాలనుకుంటున్నారట. -
వ్యోమగామి
-
చంద్రునిపై నడిచిన ఆస్ట్రోనాట్ మృతి
హూస్టన్: చంద్రుడిపై రెండుసార్లు నడిచిన వ్యోమగామిగా అందరికీ సుపరిచితుడైన జాన్ యంగ్(87) మృతిచెందాడు. ఆరుసార్లు అంతరిక్షయానం చేసిన యంగ్ మరణించాడన్న వార్తను నాసా తన వెబ్సైట్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. జాన్ యంగ్ మృతి మమ్మల్ని ఎంతగానో బాధించిందంటూ ట్వీట్ కూడా చేసింది. 1972లో చంద్రునిపై అడుగుపెట్టిన యంగ్.. ఈ ఘనత సాధించిన 12 మందిలో ఒకరిగా నిలిచాడు. 1962లో నాసాతో పనిచేయడం మొదలుపెట్టాడు జాన్ యంగ్. అయితే యంగ్ మృతికి కారణం మాత్రం ఇంకా తెలియలేదు. అమెరికా అంతరిక్ష పరిశోధనలో విజయవంతమైన ఆస్ట్రోనాట్లలో యంగ్ ఒకరు. 1960ల్లో రెండుసార్లు జెమినిలో, రెండుసార్లు అపోలో లూనార్ మిషన్లలో, 1980ల్లో రెండుసార్లు స్పేస్ షటిల్స్‌లో యంగ్ అంతరిక్షానికి వెళ్లారు. నాసాలో 42 ఏళ్లు పనిచేసిన తర్వాత 2004లో యంగ్ రిటైరయ్యాడు. జెమిని 3 మిషన్‌లో భాగంగా స్పేస్‌లోకి వెళ్లిన యంగ్.. తనతోపాటు నాసా కళ్లుగప్పి కక్ష్యలోకి బీఫ్ శాండ్విచ్ తీసుకెళ్లాడు. ఇది అప్పట్లో పెద్ద వివాదానికి కారణమైంది. -
దిగ్గజ యాత్రికుడి అస్తమయం.. నాసా ఘన నివాళులు
వాషింగ్టన్ : నాసా తరపున తొలిసారి అంతరిక్షంలో స్వేచ్ఛా విహారం చేసిన యాత్రికుడు బ్రూస్ మెక్ కాండ్లెస్స్ ఇక లేరు. గురువారం ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్ కాసేపటి క్రితం ఓ ప్రకటనలో తెలిపింది. 80 ఏళ్ల బ్రూస్ మెక్ కాండ్లెస్స్ అనారోగ్యంతో మరణించినట్లు సమాచారం. కాగా, 1984లో ఛాలెంజర్ స్పేస్ షటిల్లో ప్రయాణించిన ఆయన అంతరిక్షంలో ఎలాంటి ఆధారం లేకుండా తేలియాడిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయన అలా తేలుతున్న ఫోటోకు ఐకానిక్ ఫోటోగా గుర్తింపు కూడా లభించింది. మనిషి తలుచుకుంటే సాధించలేదనిది ఏదీ లేదని.. ఇది అమెరికన్లను ఎంతో గర్వకారణమని ఆ సమయంలో పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు కితాబు కూడా ఇచ్చారు. కాగా, బోస్టన్ లో జన్మించిన ఆయన కాలిఫోర్నియాలోనే విద్యాభ్యాసం చేశారు. నావల్ అకాడమీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా సాధించి.. 1973లో స్కై లాబ్ మిషన్‌లో ఆయన పాలుపంచుకున్నాడు. ఆపై 1984లో ప్రతిష్టాత్మక నాసా ఛాలెంజర్ ద్వారా అంతరిక్షంలో విహరించారు. 2006లో నాసాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాకు కనిపించటం అదే చివరిసారి. ఆ సమయంలో తాను ఎదుర్కున్న అనుభవాలను అప్పుడు వివరించి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు కూడా. 2015లో గార్డియన్ పత్రిక ఆయన చివరి ఇంటర్వ్యూను ప్రచురించింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
'సారే జహాసే అచ్ఛా' అంటున్న ఆమిర్
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. పీకే సినిమాతో భారతీయ సినీ రికార్డ్లను తిరగరాసిన ఈ స్టార్ హీరో ప్రస్తుతం దంగల్ సినిమాలో నటిస్తున్నాడు. బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిల తండ్రిగా నటించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ అవుతోంది దంగల్ సినిమా సెట్స్ మీద ఉండగానే మూడు సినిమాలకు ఓకె చెప్పాడు ఆమిర్. ఇప్పటికే అద్వైత్ చౌహాన్ తెరకెక్కిస్తున్న సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ షూటింగ్ పూర్తి చేశాడు. తొలి సారిగా అమితాబ్‌తో కలిసి నటిస్తున్న థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమాను సెట్స్ మీదకు తీసకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను 2018 దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తరువాత మరోసారి బయోపిక్‌లో నటించేందుకు అంగీకరించాడు ఆమిర్. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యోమగామి రాకేష్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో ఆమిర్ నటించనున్నాడు. ఈ సినిమా కోసం సెల్యూట్, సారే జహాసే అచ్ఛా అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
వ్యోమగామిగా ఆమిర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. పికె సినిమాతో భారతీయ సినీ రికార్డ్లను తిరగరాసిన ఈ స్టార్ హీరో ప్రస్తుతం దంగల్ సినిమాలో నటిస్తున్నాడు. బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిల తండ్రిగా నటించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కూడా బయోపిక్‌లోనే నటించేందుకు అంగీకరించాడు ఆమిర్. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యోమగామి రాకేష్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో ఆమిర్ నటించనున్నాడు. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ఆ వ్యోమగామి ఇక లేరు
వాషింగటన్: చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన ప్రముఖ ఆస్ట్రోనాట్ ఎడ్గర్ మిఛెల్ (85) ఇక లేరు. 1971లో అపొలో-14 మిషన్ ద్వారా చందమామపై నడిచిన వ్యోమగామి ఎడ్గర్ మిచెల్ కన్నుమూశారు. అమెరికాకు చెందిన ఈ వ్యోమగామి ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని హాస్పిటల్లో ఫిబ్రవరి 5న మిఛెల్ మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా 1930 సెస్టెంబర్17న టెక్సాస్‌లోని హెరెఫోర్డ్ లోపుట్టిన ఆయన జన్మించారు. చంద్ర గ్రహంపై అడుగుపెట్టిన ఆరో వ్యక్తిగా ఎడ్గర్ మిచెల్ రికార్డు క్రియేట్ చేశారు. 1971లో అమెరికా ప్రయోగించిన అపొలో-14 మిషన్‌లో పాల్గొన్న 12 మంది వ్యోమగాముల్లో ఎడ్గర్ మిచెల్ సభ్యుడు. సుమారు తొమ్మిది గంటల పాటు చంద్రుడిపై నడిచి రికార్డు సృష్టించారు. రోదసీ ప్రయాణం తర్వాత తనకు దైవత్వం ఆవహించినట్లు ఆస్ట్రోనాట్ ఎడ్గర్ తెలిపారు. 1972లో నాసా నుంచి రిటైర్ అయిన తర్వాత నియోటిక్ సైన్స్ ఒక ఫౌండేషన్ ను స్తాపించారు. మానవ మస్తిష్కంపై అధ్యయనం కొనసాగించారు. అనంతరం ఆయన అంతరిక్షయాన అనుభవాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. భూమిపైకి గ్రహాంతరవాసులు అడుగు పెట్టినట్లు ఎడ్గర కొన్ని సందర్భాల్లో తెలిపారు. దీనిపై నాసా శాస్త్రజ్ఞులు సంతాపం వ్యక్తం చేశారు. 45 వ వార్షికోత్సవం సందర్భంగా మరో వ్యోమగామిని కోల్పోవడం విచారకరమన్నారు. -
ఈ గేమ్ మీరెప్పుడైనా ట్రై చేశారా?
అంతరిక్షంలో అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీ ఖాళీ సమయంలో నీటి బుడగతో పింగ్ పాంగ్ ఆడాడు.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన కెల్లీ ఒకే విడతలో 300 రోజులు గడిపి రికార్డు బద్దలు కొట్టాడు. అక్కడ నీటి బుడగతో పింగ్ పాంగ్ ఆడిన వీడియోను ఆయన విడుదల చేశాడు. ఇలా ఆడటం సున్నా గ్రావిటీలో మాత్రమే సాధ్యమవుతుంది. వాటర్ బాటిల్లోంచి నీటిని బయటకు పంపడంతోనే వెంటనే ఒక బాల్ ఆకారంలో మారింది. తన దగ్గరున్న రెండు బ్యాట్ల సాయంతో ఆ బంతి ఆకారంలో ఉన్న నీటి బుడగతో పింగ్ పాంగ్ ఆడాడు. ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. రెడిట్‌లో శనివారం భూమిమీద నుంచి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. అరుదైన ప్రయోగం కోసం స్కాట్ కెల్లీని అరుదైన పరిశోధన కోసం ఐఎస్ఎస్ పంపారు. అంతరిక్షంలో సుదీర్ఘ కాలం పనిచేస్తే.. మానవ శరీరం, మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుందో పరిశోధించే మిషన్ లో భాగంగా ఆయన ఐఎస్ఎస్ వెళ్ళాడు. అంతే కాదు.. ఈ ప్రయోగంలో స్కాట్ కెల్లీ తో పాటు.. అతని కవల సోదరుడు మార్క్ కెల్లీ కూడా పనిచేస్తున్నాడు. స్కాట్ కెల్లీ అంతరిక్షంలో అత్యధిక రోజులు గడపనుండగా.. అతని కవల సోదరుడిపై భూమి మీద నాసా కేంద్రంలో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అంతరిక్షం, భూమి మీద ఉన్న వ్యక్తులపై ఎలాంటి ప్రతికూల ప్రయోగాలు ఉంటాయో పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. వ్యోమగాములకు మరింత రక్షణ ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం అంతరిక్షంలో గడపటం వల్ల శరీరం, మెదడు పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవచ్చని నాసా తెలిపింది. అంతేకాదు.. మార్స్ పై నాసా చేస్తున్న ప్రయోగాలకు ఇది ఎంతో ఉపయోగ పడుతుందని అభిప్రాయపడింది. స్పేస్ స్టేషన్ లో ఉండే భార రహిత స్థితి, ఒంటరి తనం, రేడియేషన్, ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి రావడం వంటి ప్రతికూల పరిస్థితులను శరీరం ఎలా తట్టుకుంటుందో అధ్యయనం చేస్తున్నట్లు వివరించింది. స్కాట్ మార్చి 3న భూమిపైకి తిరిగి రానున్నారు. -
అంతరిక్షం నుంచి రాంగ్ కాల్...!
మొబైల్ ఫోన్ల వాడకం వచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా రాంగ్ కాల్స్ రావడం మామూలై పోయింది. ఒకరికి చేరాల్సిన కాల్ మరొకరికి చేరడమూ... ఒక కాల్ మాట్లాడుతుండగా మధ్యలో ఇంకొకరి మాటలు వినిపించడమూ సర్వ సాధారణమైపోయింది. అయితే ఇతర నగరాలు, రాష్ట్రాలు, దేశాలే కాదు... ఇటీవల స్పేస్ సెంటర్ కు వెళ్ళిన ఆస్టోనాట్ కూ అదే అనుభవం ఎదురైందట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం... ఇటీవల అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి పలువురు సభ్యుల బృదం తరలి వెళ్ళిన విషయం తెలిసిందే. వీరందరినీ కజకిస్థాన్ లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సోయజ్ కాప్సూల్ ద్వారా ఇంటర్నేషనల్ స్సేస్ స్టేషన్ కు తరలించారు. మొత్తం ఆరు నెలల పాటు ఉండే అంతరిక్ష యాత్రకు ఈ వ్యోమగాములు వెళ్ళారు. అయితే ఈ బృదంలోని బ్రిటన్ కు చెందిన ఆస్టోనాట్ టిమ్ పీక్ కు ఇదే తొలి స్పేస్ జర్నీ. అంతేకాదు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొలి బ్రిటన్ దేశస్థుడు కూడ ఆయనే. ఆరునెలల పాటు అంతరిక్షంలో విధులు నిర్వహించనున్న టిమ్ పీక్ భూమిపై ఉన్న అధికారులు, కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఆయనకు ఓ వింత అనుభవం ఎదురైందట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఆయన ఫోన్ చేస్తే... అది... నంబర్ తప్పు డయల్ కావడంతో రాంగ్ కాల్ వెళ్ళిందట. ''ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్'' అంటూ అడిగిన కిమ్ కు ఆశ్చర్యం కలిగిందట. అట్నుంచి ఓ మహిళ స్వరం వినిపించడంతో '' హలో, ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్'' అని మరోసారి అడిగారట. తీరా తర్వాత అసలు విషయం అర్థమైందట. పొరపాటున రాంగ్ నంబర్ చేశానని కిమ్ గ్రహించారు. ఓ తప్పు సంఖ్య డయల్ చేయడం రాంగ్ కాల్ కు కారణమైందని, ఆ మహిళకు క్షమాపణలు చెప్తూ కిమ్ పీక్ ట్వీట్ చేశారు. 43 ఏళ్ళ హెలికాఫ్టర్ పైలట్ అయిన కిమ్ పీక్ ఈ యాత్ర కోసం సుమారు 28నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. యాత్రలో భాగంగా 173 రోజులు అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు నిర్వహించనున్నారు. -
అంతరిక్షంలో 522 రోజులు
- అంతరిక్షంలో అరుదైన రికార్డు - అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మానవుడిగా స్కాట్ కెల్లీ - మార్స్ మీదికి మనిషిని పంపే దిశగా... నాసా ప్రయోగాలు వాషింగ్టన్ :అంతరిక్షంలో అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. శనివారంతో ఆయన స్పేస్ స్టేషన్ లో 383 రోజులు పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు అమెరికన్ వ్యోమగామి.. మైక్ ఫింక్స్ పేరిట ఉంది. కాగా.. ఈనెల 29న స్కాట్ కెల్లీ మరో మైలు రాయిని చేరుకోనున్నాడు. అంతరిక్షంలో సుదీర్ఘ కాలం గడిపిన వ్యక్తిగా కూడా ఆయన గుర్తింపు సాధించనున్నాడు. ఐఎస్ఎస్ లో 45 మంది సభ్యుల బృందానికి కమాండర్ గా వ్యవహరిస్తున్న కెల్లీ ఒకే విడతలో 216 రోజుల పాటు స్పేస్ స్టేషన్ లో గడిపిన రికార్డు బద్దలు కొట్టనున్నాడు. మరో వైపు ఈనెల 29న ఐఎస్ఎస్ అంతరిక్షంలో పని ప్రారంభించి 15 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. అరుదైన ప్రయోగం కోసం స్కాట్ కెల్లీని అరుదైన పరిశోధన కోసం ఐఎస్ఎస్ పంపారు. అంతరిక్షంలో సుదీర్ఘ కాలం పనిచేస్తే.. మానవ శరీరం, మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుందో పరిశోధించే మిషన్ లో భాగంగా ఆయన ఐఎస్ఎస్ వెళ్ళాడు. అంతే కాదు.. ఈ ప్రయోగంలో స్కాట్ కెల్లీ తో పాటు.. అతని కవల సోదరుడు మార్క్ కెల్లీ కూడా పనిచేస్తున్నాడు. స్కాట్ కెల్లీ అంతరిక్షంలో అత్యధిక రోజులు గడపనుండగా.. అతని కవల సోదరుడిపై భూమి మీద నాసా కేంద్రంలో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అంతరిక్షం, భూమి మీద ఉన్న వ్యక్తులపై ఎలాంటి ప్రతికూల ప్రయోగాలు ఉంటాయో పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. వ్యోమగాములకు మరింత రక్షణ ఏర్పాట్లు చేయవచ్చని నాసా అభిప్రాయపడుతోంది. మార్స్ మీదికి మనిషిని పంపేందుకు ఉపయోగపడతాయని యూఎస్ స్పేస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. కెల్లీ రికార్డు కేవలం వ్యక్తిగతమైనది కాదని ...ఈ పరిశోధన అంతరిక్షంలో మానవ మనుగడ సాధ్యాసాధ్యాల పరిశోధనలో అరుదైన మైలు రాయని నాసా తెలిపింది. కెల్లీ అంతరిక్షంలో గడిపే ప్రతి గంటకూ ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొంది. ఎక్కువ కాలం అంతరిక్షంలో గడపటం వల్ల శరీరం, మెదడు పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవచ్చని.. తెలియజేసింది. అంతేకాదు.. మార్స్ పై నాసా చేస్తున్న ప్రయోగాలకు ఇది ఎంతో ఉపయోగ పడుతుందని అభిప్రాయపడింది. స్పేస్ స్టేషన్ లో ఉండే భార రహిత స్థితి, ఒంటరి తనం, రేడియేషన్, ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి రావడం వంటి ప్రతికూల పరిస్థితులను శరీరం ఎలా తట్టుకుంటుందో అధ్యయనం చేస్తున్నట్లు వివరించింది. స్కాట్ వచ్చే ఏడాది మార్చి 3న భూమిపైకి తిరిగి రానున్నారు. అప్పటికి 522 రోజులు పూర్తి కానున్నాయి. -
అంతరిక్షంలో ప్రీమియర్
సినిమా రిలీజ్ కాక ముందు ప్రముఖులకు ప్రీమియర్ షోస్ వేయడం సాధారణం. ఇప్పుడు తొలిసారిగా ఓ చిత్రాన్ని ఏకంగా అంతరిక్షంలోని ‘ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్’లో ప్రదర్శించారు. అదే ‘ద మార్షియన్’. అంగారక గ్రహంపై చిక్కుకున్న వ్యోమగామి చుట్టూ తిరిగే కథాంశంతో మాట్ డామన్ హీరోగా ‘గ్లాడియేటర్’ ఫేమ్ రిడ్లీ స్కాట్ దీన్ని తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న చిత్రం రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్రాన్ని ఇటీవలే చూశా. చాలా బాగుంది’’ అని ఆ స్పేస్‌స్టేషన్ నుంచే స్కోట్ కెల్లీ అనే వ్యోమ గామి ట్వీట్ చేశాడు. మొత్తానికి ఈ ప్రీమియర్ సంచలనమైంది. -
మహాద్భుతం!
గగనవీధుల్లో విజయ పరంపరను కొనసాగిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గురువారం అత్యంత కీలకమైన జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాన్ని సునాయాసంగా పూర్తిచేయగలిగింది. ప్రయోగ సమయం అనుకున్నకంటే అరగంట ఆలస్యమైందన్న మాటేగానీ మిగిలినవన్నీ ముందుగా నిర్దేశించిన ప్రకారం పూర్తయ్యాయి. మన శాస్త్రవేత్తల ప్రతిభాపాటవాలను ప్రపంచానికి చాటిచెప్పాయి. ఈ ప్రయోగం అనేక విధాల ఎన్నదగినది. రానున్న కాలంలో మనం సైతం వ్యోమగాములను అంతరిక్షానికి పంపేందుకు ఈ ప్రయోగం ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులో వాడిన కేర్ మాడ్యూల్ వ్యోమగాములను ఉద్దేశించిందే. భవిష్యత్తులో అచ్చంగా వ్యోమగాములను పంపినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోవడానికి దీన్ని రూపొందించారు. ఒక చిన్న బెడ్ రూమ్‌ను పోలివుండే ఈ మాడ్యూల్లో ముగ్గురు వ్యోమగాములు ప్రయాణించడానికి వీలుంటుంది. అలాగే రాకెట్‌కు రెండు దశల్లో వాడిన బూస్టర్లు సైతం మన శాస్త్రవేత్తలకు ఎనలేని ఆత్మస్థైర్యాన్ని అందించగలిగాయి. మొదటి దశలో ఉపయోగించిన ఎస్-200 బూస్టర్లు, రెండో దశ లోని ఎల్-110 బూస్టర్లు శాస్త్రవేత్తలిచ్చిన కమాండ్లకు అనుగుణంగా సక్రమంగా పనిచేసి నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ దూసుకెళ్లడానికి తోడ్పడ్డాయి. ఇన్నాళ్లూ ఇస్రో చేసిన ప్రయోగాలకూ, ఈ ప్రయోగానికీ గుణాత్మకమైన మార్పు కూడా ఉన్నది. మన శాస్త్రవేత్తలు లోగడ ఏ ప్రయోగంలోనూ ఇంత బరువైన రాకెట్‌ను ఉపయోగించలేదు. ఇది ఏకంగా 6,30,000 కిలోలు! ఇందులో కేర్ మాడ్యూల్ బరువు 3,775 కిలోలు. ఇంత బరువైన మాడ్యూల్‌ను భూమికి 126 కిలోమీటర్ల ఎత్తులో ఆ రాకెట్ జారవిడ్చగా అది సురక్షితంగా భూమార్గం పట్టింది. మాడ్యూల్ వెనక్కి వస్తున్న క్రమాన్నంతటినీ పరిశీలించి తమ అంచనాలు ఎలా ఉన్నాయో...ఎక్కడెక్కడ సవరించుకోవడం అవసరమో నిర్ధారించుకోవడానికి ఈ ప్రయోగం శాస్త్రవేత్తలకు ఉపయోగపడింది. అలాగే రాకె ట్పైనా, మాడ్యూల్పైనా వాతావరణ ప్రభావం, దాని పీడనం ఎలా పనిచేశాయో...రాకెట్ సామర్థ్యం ఎలాంటిదో అధ్యయనం చేయడానికి కూడా తోడ్పడింది. మాడ్యూల్ వేగాన్ని కొంతదూరం వరకూ దానికున్న మోటార్ల ద్వారా నియంత్రించి అటు తర్వాత ఆ మాడ్యూల్‌కు అమర్చిన ప్యారాచూట్లు తెరుచుకునేలా చేసి అది నేరుగా బంగాళాఖాతంలో పోర్టుబ్లెయిర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో 20 నిమిషాల్లో పడేలా చేయడం ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియంతా అనుకున్నట్టే సాగడం...ప్యారాచూట్లు సైతం ఎలాంటి లోపమూ లేకుండా పనిచే సి సహకరించడం కీలకమైనది. ఇందువల్ల భవిష్యత్తులో వ్యోమగాములను అంతరిక్షానికి పంపి వారిని తిరిగి సురక్షితంగా తీసుకురాగలిగిన సామర్థ్యాన్ని మన శాస్త్రవేత్తలు సొంతం చేసుకున్నట్టయింది. ఇలాంటి సామర్థ్యం ఇంతవరకూ రష్యా, అమెరికా, చైనాలకు మాత్రమే ఉంది. ఈ ప్రయోగం మరో రకంగా కూడా ముఖ్యమైనది. రాకెట్‌లోని రెండు దశలూ సక్రమంగా పనిచేశాయని రుజువైంది. ఇక క్రయోజనిక్ ఇంజన్(సీ-25)ను వాడే మూడో దశను కూడా విజయవంతం చేయగలిగితే మనం వ్యోమగాములను పంపగలిగే సామర్థ్యాన్ని పూర్తిగా సంతరించుకున్నట్టవుతుంది. అంతేకాదు...భారీ ఉపగ్రహాల ప్రయోగానికి ఇకపై విదేశాలపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. అంతరిక్షం మన ఊహలకూ, అంచనాలకూ దాదాపు దగ్గరిగానే ఉన్నా అక్కడ హఠాత్తుగా అత్యంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే రాకెట్‌లోని వ్యవస్థలు అత్యంత సంక్లిష్టమైనవి. ఏ చిన్న లోపం ఏర్పడినా మొత్తం అంతా కుప్పకూలుతుంది. రాకెట్ ప్రయోగానికి భారీ మొత్తంలో ఇంధనం అవసరమవుతుంది. అది ముందే విడుదల కావడం లేదా హఠాత్తుగా అవసరమైనదానికంటే ఎక్కువ విడుదలకావడం వంటి ప్రమాదాలు ఎప్పుడూ పొంచివుంటాయి. అంతేకాదు...రాకెట్‌కు, మాడ్యూల్‌కు వాడే లోహాలైనా, మిశ్రమ లోహాలైనా రాకెట్ గమనంలో ఎదురయ్యే వాతావరణపరమైన ఒత్తిళ్లను ఎంత సమర్థవంతంగా తట్టుకుంటాయో ఖచ్చితంగా అంచనా వేసుకోగలగాలి. ఈ మొత్తం ప్రక్రియలో శాస్త్రవేత్తల కళ్లుగప్పి ఏ చిన్న లోపం సంభవించినా అది తీసుకొచ్చే నష్టం అపారమైనది. వ్యోమగాములను పంపే ప్రయోగమైతే ఇక చెప్పేదేముంది?! అంతరిక్ష వైజ్ఞానిక ప్రగతిలో మన శాస్త్రవేత్తల కృషి అనుపమానమైనదీ... అసమానమైనదీ! వైఫల్యాలు లేవని కాదు...కానీ, అటువంటి వైఫల్యాలను భవిష్యత్తు విజయాలకు సోపానాలుగా మలచుకోవడం ముఖ్యం. మన శాస్త్రవేత్తలు ఆ పనిని దిగ్విజయంగా పరిపూర్తి చేయగలిగారు. పీఎస్ఎల్వీ ప్రయోగాలన్నీ విజయం సాధించినా భారీ బరువుండే ఉపగ్రహాలను మోసుకుపోగల జీఎస్‌ఎల్‌వీల మాత్రం వారికి అంత సులభంగా పట్టుబడలేదు. అందుకు కారణం అందులో వాడే క్రయోజనిక్ ఇంజన్లే. అతి శీతల స్థితిలో సైతం పనిచేయగల ఆ ఇంజన్లను మనకు అందజేయడానికి 1992లో రష్యా ఒప్పందం కుదుర్చుకున్నా అనంతరకాలంలో జరిగిన అణు పరీక్షలు దానికి ఆటంకంగా నిలిచాయి. అమెరికా ఒత్తిడితో ఆ దేశం క్రయోజనిక్ ఇంజిన్లు ఇవ్వడం మానుకుంది. అయినా ఇస్రో శాస్త్రవేత్తలు దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజిన్‌ను ఉపయోగించి తీరాలన్న సంకల్పంతో ఎంతో శ్రమపడ్డారు. ఈ ఏడాది జనవరిలో జీఎస్ఎల్వీ-డీ5ను విజయవంతంగా ప్రయోగించి ఆ సంకల్పాన్ని సాకారం చేసుకున్నారు. ఇప్పుడు సంవత్సరం చివరిలో జీఎస్ఎల్వీ మార్క్-3 ఘనవిజయం కొసమెరుపు వంటిది. అందువల్లే ఇస్రో శాస్త్రవేత్తలకు దేశం మొత్తం నీరాజనాలు పడుతున్నది. ఈ విజయం మరిన్ని విజయాలకు స్ఫూర్తినిచ్చి అంతరిక్షంలోకి భారత్ సైతం వ్యోమగాములను పంపే రోజొకటి వస్తుందని ఆశించవచ్చు. -
ఐ లవ్ యూ మామ్..!
అమ్మకు జేజే! పొద్దున్నే లేవగానే నాకు ప్రతి ఇల్లూ ఇస్రోలా అనిపిస్తుంది. ప్రతి హోమూ ఓ శ్రీహరికోట షార్సెంటర్లా కనిపిస్తుంది. పొద్దున్నే బ్యాగును వీపున పెట్టుకుని, బాస్కెట్ చేతిన పట్టుకుని వెళ్లే బుల్లిబుల్లి చిన్నారులను చూస్తుంటే పే...ద్ధ ఆస్ట్రోనాట్లను చూసిన అనుభూతి. వాళ్లు చదువుతున్నది ఏ ఎల్కేజీనో, యూకేజీ అయితేనేం... ఏ పెద్ద పెద్ద సైంటిస్టులనో చూసిన ఫీలింగ్! వాళ్లను స్కూళ్లకు తయారుచేసే తల్లులను చూస్తే గ్రౌండ్ కంట్రోల్ వద్ద బిజీబిజీగా పనిచేసే సైంటిస్టుల్లా కనిపిస్తుంటారు. అందుకే ఆ అమ్మలందరినీ చూస్తే చెయ్యెత్తి దండం పెట్టాలన్న ఆరాధన. ఎల్కేజీకి రాగానే అమాయకపు నీలి కళ్లతో తమ భుజబలంతో అనగా... స్ట్రాంగ్ ఆర్మ్‌తో అలవోగ్గా అలా ఆ బ్యాగును వీపుపైకి తర్జుమా చేసుకునే ప్రతి పిల్లాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్లాగే కనిపిస్తుంటాడు. ప్రతి బంగారుకొండా బుజ్జిబుజ్జి చేతుల్తో బాస్కెట్లను సునీతా విలియమ్స్ అంత నేర్పుగా అమర్చుకుంటుంది. ఆ తర్వాత స్కూల్ అనే గెలాక్సీ చమక్కుల పయనానికి తయారవుతుంటారు. అందమైన వ్యోమలోకం కొందరికి నక్షత్రంలా మిణుక్కుమంటే మరికొందరికి కృష్ణబిలంలా గుభేలుమనిపిస్తుంది. పూర్వం ఈ అంతరిక్షానికి అంతా రిక్షాల్లో వెళ్లేవారు. కానీ ఇటీవల దూరాలు పెరగడంతో పీఎస్ఎల్వీ ల్లాంటి పెద్ద బస్సులను వాడుతున్నారు. తరగతిగదిని కక్ష్య అని కూడా ఎందుకంటారో మొదట్లో తెలియలేదుగానీ... పిల్లల్ని క్లాసు వరకూ చేర్చడం కక్ష్యలోకి ప్రవేశపెట్టడం లాందిదే అని ఇప్పుడర్థమైంది. కిచెన్‌లో అనేక పొయ్యిలు ఉన్న స్టౌ ముందు నిల్చున్న అమ్మ... అనేక మానిటర్ల ముందు నిల్చున్న గ్రౌండు కంట్రోల్ వద్ద పెద్ద సైంటిస్టులా కనిపిస్తుంటుంది. బడివేళ కౌంట్‌డౌన్ మొదలయ్యాక తొలుత ఇంటి నుంచి బయటివరకూ, అక్కడ్నుంచి ఏ టూవీలర్ మీదనో లాంచింగ్ స్టేషన్ లాంటి బస్సాప్ వరకూ, మరిక ఆ తర్వాత బస్ నుంచి స్కూల్‌కూ... ఇక అప్పుడు క్లాస్‌కూ చిన్నారి చేరితే నిజంగా మన ఆస్ట్రోనాట్‌ను అంచెలంచెల మీద కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అనుభూతి పరిపూర్ణమవుతుంది. ఇక తిరిగొచ్చే టైమ్‌కు వాళ్లను రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రతి తల్లికీ గగనంలో ఎగిరే యూరీగగారిన్లనూ, ఎదుగుతూ పోయే ఎడ్విన్ ఆల్డ్రిన్లనూ, సీతాకోకచిలుక రెక్కల్లా చేతులల్లాడించే తెరిష్కోవాలనూ చూసిన అద్భుత ఫీలింగ్! ఇవన్నీ అనుభూతి చెందుతున్న వేళల్లో ఓ తెలతెలవారుతున్న వేకువలో, నునులేత చలిలో, అరమొగ్గల్లా వెళ్తున్న ఆ చిన్నారులను చూస్తుంటే... ఓ వైపు మనసు నిండిపోతుంటుంది. మరోవైపు కడుపు తరుక్కుపోతుంటుంది. నిజమే పొద్దున్నే మంగళయాన్‌లా అనిపించే ఆ పిల్లల ప్రయాణం నిజంగా మంగళప్రదమైన యానమే. కాకపోతే స్పేస్ సైంటిస్టులది మార్స్ మిషన్. హోమ్సైంటిస్టులైన పేరెంట్స్‌దీ, వాళ్ల పిల్లలదీ పరీక్షలకు తయారు చేసే ‘మార్చ్’ మిషన్! అదంతా చూశాకగానీ... అర్థం కాలేదు నాకు... మార్స్ ఆర్బిట్ మిషన్‌ను ‘మామ్’ అని షార్ట్ ఫామ్‌లో ఎందుకు పిలుస్తున్నారో. అవును... ఏదో ఒక రోజు స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపడం కాదు. ప్రతిరోజూ పిల్లలను తరగతి కక్ష్యల్లోకి ప్రవేశపెడుతున్న తల్లులదే అసలైన ‘మామ్’ మిషన్. అందుకే ఐ లవ్ యూ... మామ్. - యాసీన్