సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ఉదారత చాటుకున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్ధి కలను సాకారం చేసేందుకు ఆర్ధిక భరోసా కల్పించారు. వివరాలు.. పాలకొల్లుకు చెందిన జహ్నవి దంగేటి ఏవియేషన్ శిక్షణకు గతంలో ఏపీ ప్రభుత్వం రూ. 50 లక్షల సాయం అందజేసింది. గతేడాది జూలైలో రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా సీఎంజగన్ జాహ్నవికి ఈ సాయం అందించారు.
తాజాగా రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లాకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని జాహ్నవి కలిశారు. పైలెట్ ఆస్ట్రొనాట్ అవ్వాలన్న తన కోరికను అర్థం చేసుకొని ఉన్నత చదువుకు చేసిన సాయానికి వైఎస్ జగన్‌కు జాహ్నవి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్ధిక సాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేయగా.. సీఎం సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వం చేసిన ఆర్ధిక సాయంతో గ్రామీణ ప్రాంతానికి చెందిన జాహ్నవి ఐఐఏఎస్ ఫ్లోరిడా, యూఎస్‌ఏ నుంచి సైంటిస్ట్ వ్యోమగామి అభ్యర్థిగా సిల్వర్ వింగ్స్ అందుకున్నారని సీంఎ జగన్‌కు సమాచార శాఖ మంత్రి వేణుగోపాల్ వివరించారు. ఇప్పటికే జాహ్నవి నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. అయితే భారత సంతతికి చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్ప స్ఫూర్తితో ముందుకెళుతున్నట్లు వైఎస్ జగన్‌కు జాహ్నవి వివరించారు.
చదవండి: గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment