చిరు తిండ్లు తయారు చేస్తున్న నాగమల్లిక, ఉపా«ధి పొందుతున్న మహిళలు
జగనన్న ప్రభుత్వంలో ఆర్థిక బాసట పది మందికి ఉపాధినిచ్చేలా ఎదుగుదల
మదనపల్లె పట్టణం సుభాష్‌రోడ్డు వీధికి చెందిన రాజేంద్రప్రసాద్, నాగమల్లిక భార్యభర్తలు. చిన్నపాటి వ్యాపారం ద్వారా వచ్చే చాలీచాలనీ ఆదాయంతో కుటుంబాన్ని గడపాల్సి వచ్చేంది. వీరికి అమృత, వర్షిత ఇద్దరు కుమార్తెలు. పిల్లలను చదివించేందుకు ఆరి్థకంగా ఇబ్బందులు పడేవారు. రేషన్‌కార్డు తప్ప ఎటువంటి పథకాలు అందేవి కావు. నాగమల్లిక తెలిసిన వారి దగ్గర అప్పు చేసి సుభాష్‌రోడ్డులోనే చిరుతిళ్ల దుకాణం ప్రారంభించారు. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగానే ఉండేది. దీనికి తోడు పిల్లల్ని గొప్పగా చదివించాలన్న కోరిక తీరేనా? అన్న బెంగ వెంటాడేది. ఇదంతా 2019కి ముందు పరిస్థితి.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసిన సంక్షేమ పథకాలలతో ఆ కుటుంబానికి భరోసా కలిగింది. వైఎస్సార్ ఆసరా, ఇద్దరు పిల్లలకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వస్తోంది. రూ.6 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం ఇచ్చారు. ప్రస్తుతం పెద్ద కుమార్తె అమృత బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. చిన్న కుమార్తె హర్షిత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
గతంలో కష్టాలు పడిన నాగమల్లిక కుటుంబం ప్రభుత్వ పథకాల ద్వారా సుభాష్‌రోడ్డులోనే ఓ షాపు పెట్టి అందులో చిరుతిళ్లు తయారు చేస్తున్నారు. నిప్పట్లు, చెక్కిలాలు, అత్తిరాసలు, మిక్చర్ వంటివి తయారు చేస్తూ హోల్‌సేల్‌గా అమ్ముతున్నారు. చిరుతిళ్ల తయారీలో 10 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. వీటిని తయారు చేసి షాపులో రిటైల్ అమ్మకాలతో పాటు పరిసర ప్రాంతాలకు హోల్‌సేల్ ధరకు సరఫరా చేస్తున్నారు. దీంతో వారి కుటుంబం ఆరి్థకంగా నిలదొక్కుకుంది. –మదనపల్లె
జీవన ప్రమాణాలు పెరిగాయి
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో చాలా మందిలో జీవన ప్రమాణాలు పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా బలహీన వర్గాలకు అందిస్తున్న నిధులతో వారు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు వీలవుతుంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెనతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకుని స్థిరపడ్డారు. ఇది చాలా శుభపరిణామం. – జీఆర్ రుక్మిణి, పూర్వ ప్రిన్సిపాల్, మహిళా డీగ్రీ కళాశాల, మదనపల్లె
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కలిగిన లబ్ధి
వైఎస్సార్ ఆసరా రూ.32,328
జగనన్న వసతి దీవెన రూ.23,350
జగనన్న విద్యాదీవెన రూ.41,201
సున్నా వడ్డీ రూ.2,850
అమ్మ ఒడి రూ.45,000
ఇంటి స్థలం రూ.6,00,000
Comments
Please login to add a commentAdd a comment