జగనన్న కాలనీలో నిర్మించుకున్న నూతన గృహం వద్ద మారిశెట్టి సత్యనారాయణ, గన్నెమ్మ దంపతులు
మంచి ప్రభుత్వం అధికారం చేపడితే... మనసున్న నేత ముఖ్యమంత్రి పదవిలో ఉంటే కుటుంబాలు దశ ఏ విధంగా తిరగనుందోననడానికి ఉదాహరణ కొవ్వూరు మండలం వేములూరుకి చెందిన మారిశెట్టి సత్యనారాయణ బతుకు చిత్రం. పూరిపాకలోనే తుదివరకూ జీవితం కొడిగట్టిపోవల్సిందేమోననే వేదనతో ఆ కుటుంబం విచారవదనంతో ఉండేది. కానీ ఆ పాకలో క్రమేపీ వెలుతుర్లు విరజిమ్మాయి. ఆ మోములో చిరునవ్వులు చిందాయి. దీనికంతటికీ కారణం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నవ వసంతాలు పూయించాయి. అదెలానో చూద్దాం. – కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లా
మూడు దశాబ్ధాలకు పైగా రోడ్డు మార్జిన్‌లో పూరిపాకలోనే సత్యనారాయణ కుటుంబ నివాసం. సొంత ఇల్లంటూ వీరికి లేదు. ఓ గూడు కల్పించాలంటూ ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సొంతింటి కల సాకారమైంది. ఎవరి సిఫార్సులు లేకుండానే వలంటీర్ ఇంటికి వచ్చి వివరాలు తీసుకుని వెళ్లారు. ఆ వెంటే ఇంటి స్ధలం మంజూరైంది.
ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల సాయం అందించారు. జీవితంలో సొంతంటి కల నెరవేరుతుందా అనుకున్న వారి బతుకుల్లోకి ముప్పై ఏళ్ల తర్వాత ఓ పొదిరిల్లు పలకరించింది. గీత కార్మిక వృత్తి చేసుకున్న ఆ ఇంటి యజమానికి రూ.3 వేలు గీత కార్మిక పింఛన్ మంజూరైంది. వయస్సు మీద పడిన సమయంలో ఆ సొమ్ము వారి కుటుంబానికి ఎంతో ఊరటనిస్తోంది. ఇప్పటి వరకూ రూ.1,40,750 అందుకున్నారు.
సత్యనారాయణ భార్య గన్నెమ్మకి చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.56.250 అందాయి. ఇంటి స్ధలం, ఇంటి రుణం అన్నీ కలిపి రూ.5.77 లక్షల లబ్ధి చేకూరింది. వారి మనవరాలికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు అందుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి మేలు ఎప్పటికీ మరిచిపోలేమని వారు సంతోషంగా చెబుతున్నారు.
చేయూత అందించారు
ప్రభుత్వం 45 ఏళ్లు పైబడిన మహిళలకు అందించే చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,500 అందిస్తున్నారు. ఈ సొమ్ము నా కుటుంబానికి ఎంతో ఉపకరిస్తుంది. నా భర్త గీత కార్మికుడు. వయస్సు మీదపడడంతో పనులకు వెళ్లలేకపోతున్నాం. ఈ సొమ్ముతో ఏటా అందించడంతో మా కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. సంక్షేమ పథకాల ద్వారా పేదల బతుకుల్లో భరోసా కల్పించారు. – మారిశెట్టి గన్నెమ్మ, వేములూరు, జగనన్న కాలనీ, కొవ్వూరు మండలం
వైఎస్సార్‌సీపీ సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధి
వైఎస్సార్ పింఛన్ కానుక రూ.1,40,750.
వైఎస్సార్ చేయూత రూ.56,250
ఇంటి స్థలం విలువ రూ.2,00,000
ఇంటినిర్మాణానికి ఆర్థిక సాయం రూ.1,80,000
మొత్తం లబ్ధి రూ.5,77,000
Comments
Please login to add a commentAdd a comment