ప్లాస్టిక్ పూల తోరణాలను తయారు చేస్తున్న మునీశ్వరి, ఉపాధి పొందుతున్న మహిళలు
నవరత్నాల పేరుతో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగు రేఖలు నింపుతు న్నాయి. లక్షలాది మంది జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. తిరుపతి జీవకోనలోని రాఘవేంద్ర నగర్‌కు చెందిన వెంకటేష్, మునీశ్వరి కుటుంబమే ఇందుకు నిదర్శనం వెంకటేష్ 2019కి ముందు భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తూ చాలీ చాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుండేవారు. పని దొరికిన రోజు వచ్చే కూలి రూ.400తో ఆ కుటుంబంలోని ఆరుగురు జీవించాల్సి వచ్చేది.
ఆయన భార్య మునీశ్వరి గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ముగ్గురు పిల్లలను చదివించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు తప్ప ఎలాంటి పథకాలు అందలేదు. మునీశ్వరి అత్తమ్మకు పింఛన్ కూడా వచ్చేది కాదు. జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగే లా తిరిగినా ఫలితం లేకపోయింది. పిల్లలను చది వించగలమా అనే బెంగతో ఉండేవారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త ప్రవేశపెట్టిన నవరత్నాలతో ఆ కుటుంబానికి భరోసా లభించింది.
వైఎస్‌ఆర్ ఆసరా, జగనన్న తోడు, ముగ్గురు పిల్లలకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి, కుటుంబంలోని మునీశ్వరి అత్తమ్మకు వృద్ధాప్య పింఛన్ లభిస్తోంది. ప్రస్తుతం ఒక కుమార్తె ఇంజినీరింగ్ పూర్తి చేసింది, మరో కుమార్తె డిగ్రీ పూర్తి చేసింది. వీరిద్ధరూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కూలిపని మానేసి చెన్నై నుంచి ముడిసరుకు తెప్పించుకుని గృహాలకు ప్లాస్టిక్ పూల తోరణాలు, దేవుని చిత్రపటాలకు అవసరమైన పలు రకాల రంగులతో మాలలు, ప్లాస్టిక్ పూలతో షోకేజ్ డెకరేషన్ బొకేలు తయారు చేస్తూ మరో ఆరు మంది మహిళలకు ఉపాధి కబ్ధి స్తున్నారు. –తిరుపతి సిటీ\
తలసరి ఆదాయం పెరిగింది
గతంలో నిరుపేద మహిళలు కూలి పనులు చేసుకుంటూ లేదా ఇళ్లల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. పిల్లలను చదివించలేక పోవడంతో వారు షాపుల్లో పనులు చేసుకుంటూ మంచి భవిష్యత్తు కోల్పోయి జీవితాలను సర్వనాశనం చేసుకునేవారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయి. వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. ఇది కాదనలేని నిజం. అమ్మ ఒడి, ఫీజురియింబర్స్‌మెంట్, విద్యాదీవెన, వసతి దీవెనతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. –జి సవరయ్య, రిటైర్డ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మునీశ్వరి కుటుంబానికి కలిగిన లబ్ధి
వైఎస్సార్ ఆసరా రూ.68,000
వైఎస్సార్ చేయూత రూ.75,000
జగనన్న విద్యాదీవెన రూ.28,000
వసతి దీవెన రూ.20,000
అమ్మ ఒడి రూ.30,000
సున్న వడ్డీ రూ.2,250
పింఛన్ కానుక రూ.96,000
మొత్తం రూ.3,19,250
Comments
Please login to add a commentAdd a comment