సాక్షి, మచిలీపట్నం: వైఎస్ జగన్ పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నవరత్న పథకాల కీర్తి ఇప్పుడు ఎవరెస్టుపై రెపరెపలాడుతోంది. కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన గుల్లమర్సు సురేష్ బాబు ఎవరెస్టు బేస్ నుంచి ఒక్కో శిఖరాన్ని అధిరోహిస్తూ.. ఒక్కో పర్వతంపై ఒక్కో పథకం ఫ్లెక్సీల్ని ఎగురవేసి సీఎం జగన్ ఖ్యాతిని చాటిచెప్పాడు. వాస్తవాన్ని ఖండాంతరాలకు తెలిజేయాలనుకున్న అతని వజ్ర సంకల్పాన్ని సీఎం జగన్ గతంలో ట్వీట్ ద్వారా అభినందించారు.
My warm wishes to G Suresh Babu, the mountaineer from Kurnool who scaled peaks worldwide promoting our Navaratnalu schemes! Your dedication and love for Andhra Pradesh are truly inspiring and we're grateful for your support Suresh. pic.twitter.com/PNyUX6viKX
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 27, 2023
ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మా తండ్రి హమాలీ. నేను ఇంటర్‌లో ఉండగా ప్రభుత్వం పర్వతారోహణకు ఆసక్తి ఉన్న వారి పేర్లను కోరింది. ప్రిన్సిపల్ ప్రోత్సాహంతో దరఖాస్తు చేశా.
అంతకుముందు అరికెర హాస్టల్‌లో చదువుకునే రోజుల్లో సీతాఫలం, తేనె కోసం అక్కడున్న 200–300 మీటర్ల ఎత్తయిన కొండలు అవలీలగా ఎక్కేవాడిని. ప్రిన్సిపల్ పేర్ల జాబితా పంపాక.. ప్రభుత్వం ఎంపిక చేసి, విజయవాడలో శిక్షణ ఇచ్చింది. అందులో ప్రతిభ చూపిన 35 మందిని ఎంపిక చేసి, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండలపై మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో 35 రోజులు శిక్షణ ఇచి్చంది. ఆ తర్వాత పర్వతారోహణను నా హాబీగా మార్చుకున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్న పథకాలు నన్ను అమితంగా ఆకర్షించాయి. ఆయన ప్రవేశపెట్టిన వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు అద్భుతం. మా మామ అనారోగ్యంగా ఉంటే రూ.1.50 లక్షల ఖరీదైన వైద్యం ప్రైవేటు ఆసుపత్రిలో ఉచితంగా చేశారు.
అందుకే నవరత్న పథకాల కీర్తిని చాటిచెప్పాలని భావించా. ఎవరెస్టు బేస్ నుంచి ఒక్కో శిఖరంపై ఒక్కో పథకం ఫ్లెక్సీని ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2023 మే 27న నన్ను ఉద్దేశించి ‘నీ అంకితభావం స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు. అదే సంవత్సరం జూన్ 1న కర్నూలు జిల్లా పత్తికొండకు వచి్చనప్పుడు సీఎం జగన్‌ను కలవగా అభినందించారు. మరింత ముందుకు సాగాలని వెన్నుతట్టారు.
పర్వతారోహణకు సుమారు రూ.35 లక్షలు ఖర్చవుతుంది. నా ఆర్థిక పరిస్థితి తెలిసిన దాతలు, సిల్వర్ జూబ్లీ కళాశాల పూర్వ విద్యార్థులు, మిత్రులు సహకారం అందించారు. ఐఏఎస్ అధికారి సత్యనారాయణ కూడా సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థి కావడంతో చేయూత లభించింది. ఇప్పుడు నా వయసు 24 ఏళ్లు. ఐదేళ్లలోనే దేశంలోని 25 శిఖరాలు అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడిగా పేరుపొందడం గర్వకారణం. తెలుగు బుక్ ఆఫ్ రికా>ర్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించా. పర్వతాలు అధిరోహించేటప్పుడు ఐదు సార్లు చావు అంచుదాకా వెళ్లి వచ్చా. 2019 మే 23న మౌంట్ లోథ్‌సే ఎక్కుతూ చాలా ఇబ్బంది పడ్డా.
Comments
Please login to add a commentAdd a comment