everest
-
వందేళ్ల క్రితం ఎవరెస్ట్‌పై గల్లంతు
లండన్: ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో జాడ తెలియకుండా పోయిన బ్రిటిష్ పర్వతారోహకుడి ఆనవాళ్లు తాజాగా వందేళ్లకు బయటపడ్డాయి. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందంలోని పర్వతారోహకులకు 1924లో కనిపించకుండా పోయిన ఇద్దరిలో ఎ.సి.ఇర్విన్(22) పాదం, బూటు, ఆయన పేరున్న ఎంబ్రాయిడరీ సాక్స్ దొరికాయి. ఇది తెలిసి ఇర్విన్ సోదరుని కుమార్తె ఆనందం వ్యక్తం చేశారు. దీంతోపాటు, ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే కంటే 29 ఏళ్ల ముందే ఎవరెస్ట్ అధిరోహించేందుకు వెళ్లిన ఈ ఇద్దరూ తమ ప్రయత్నంలో విజయం సాధించారా లేదా అన్న అనుమానాలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందం ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనా ఆదీనంలోని ఎవరెస్ట్ ఉత్తర ప్రాంతంలో రొంగ్బుక్ గ్లేసియర్ వద్ద చిత్రీకరణ చేపట్టింది. ఈ బృందానికి ఆస్కార్ విజేత కూడా ప్రముఖ జిమ్మీ చిన్ నాయకత్వం వహిస్తున్నారు. అక్కడ వారికి 1933 నాటి ఆక్సిజన్ సిలిండర్ ఒకటి లభ్యమైంది. ఇర్విన్‌కు సంబంధించిన వస్తువు కూడా ఒకటి దొరికింది. దీంతో, చాలా రోజులు అక్కడే అన్వేషణ జరిపారు. ఫలితంగా వారికి ఓ కాలున్న బూట్ దొరికింది. అందులోని సాక్ ఎంబ్రాయిడరీపై ‘ఎ.సి.ఇర్విన్’అనే పేరుంది. ఈ బూటును 1924 జూన్‌లో జార్జి మల్లోరీతో కలిసి ఎవరెస్ట్ అధిరోహించేందుకు వచ్చి అదృశ్యమైన బ్రిటిష్ దేశస్తుడు ఏసీ శాండీ ఇర్విన్దేనని తేల్చారు. 1999లో మల్లోరీ మృతదేహం పర్వతారోహకుల కంటబడగా, ఇర్విన్ ఆనవాళ్లు ఇప్పటికీ దొరకలేదు. అయితే, ఈయన వెంట తెచ్చుకున్న కెమెరా కోసం పలువురు గతంలో తీవ్రంగా గాలించారు. అందులోని ఫొటోల ఆధారంగా ఈ ఇద్దరు సాహసికుల ప్రయత్నం ఏమేరకు ఫలించిందన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని వారి ఆశ. తాజాగా దొరికిన ఆధారంతో ఇర్విన్ మృతదేహం వంటి ఆనవాళ్లు అదే ప్రాంతంలో దొరకవచ్చన్న అంచనాలు పెరిగిపోయాయి. -
పర్వతారోహణ చేద్దామా?
‘పర్వతాలు పిలుస్తాయి... వెళ్లాలి’ అంటారు పర్వతారోహకులు. మనకున్న ఎన్నో హాబీల్లో పర్వతారోహణ ఒకటి. చిన్న గుట్టలతో మొదలయ్యే హాబీ కొండలకు పర్వతాలకు ఎదిగి ఆఖరకు ‘ఎవరెస్ట్’ అధిరోహించడంతో ముగుస్తుంది. పర్వతారోహణ చేసేవారు జీవితంలో ఒక్కసారైనా పర్వతారోహణ చేయాలని కోరుకుంటారు. కొంతమంది ఏడు ఖండాల్లోని ప్రతి ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాలనుకుంటారు. ఇంతకూ పర్వతారోహణ వల్ల ఏమవుతుంది?పర్వతాలు ఎక్కే క్రమంలో ప్రకృతి పెట్టే పరీక్షలను ఓర్చడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శిఖరం వరకూ చేరాక భూమ్మీద ఎదురయ్యే కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా జీవితం ఎంత విలువైనదో తెలుస్తుంది. జీవితం అంటే చిన్న చిన్న విషయాలు కాదు ఉదాత్తమైనవి ఉన్నతమైన విషయాలను సాధించడం అని తెలుస్తుంది. ‘పర్వతం వంటి వ్యక్తి’, ‘శిఖరం వంటి వ్యక్తి’ అని కొందరిని కోలుస్తారు. అంటే ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో ఆ రంగంలో వారు అత్యున్నత విజయాన్ని సాధించినవారన్నమాట. శాస్త్రవేత్తలలో ఐన్‌స్టీన్ శిఖరం వంటి వాడు. సినిమా నటులలో అమితాబ్ బచ్చన్ శిఖరం వంటి వాడు. మనం ఒక చిత్రకారులం కావాలనుకుంటే పికాసో అంతటి వాళ్లం కావాలని లక్ష్యం పెట్టుకోవాలి. అలాంటి స్ఫూర్తి పర్వతారోహణ వల్ల కలుగుతుంది.అబ్బాయిల కంటే మేము ఎందులోనూ తక్కువ కాదు అని ఆత్మవిశ్వాసం తెచ్చుకోవడానికి అమ్మాయిలకు పర్వతారోహణ ఒక మంచి మార్గం.పర్వతారోహణలో వీపు వెనుక బరువు వేసుకుని ఎక్కాలి. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనడం పెద్ద కష్టం కాదని ఈ కష్టం పడినప్పుడు తెలుస్తుంది. పర్వతారోహణలో పోదుపుగా తెలుస్తుంది. తీసుకెళ్లిన ఆహారాన్ని పోదుపుగా వాడుకోవాలి. నీళ్లను ΄÷దుపుగా వాడుకోవాలి. జీవితంలో కూడా ఉన్న నిధులను ఎలా జాగ్రత్త చేసుకోవాలో దీని వల్ల తెలుస్తుంది. అహం (ఇగో) కొన్నిసార్లు మేలు చేస్తుంది. కొన్నిసార్లు హాని చేస్తుంది. అంత ఎత్తయిన పర్వతం మౌనంగా ఉన్నప్పుడు ఆరడుగుల మనిషి ఎందుకు మిడిసి పడాలి. ఎదిగేకొద్దీ వొదగడం పర్వతం నేర్పిస్తుంది. వినయం విజయానికి తొలి మెట్టు.ఉదయాన్నే లేచి స్కూలుకు వెళుతున్నాం, ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్నాం అనుకుంటాంగాని కొండనో పర్వతాన్నో ఎక్కితేనే మనం ఎంత ఫిట్‌గా ఉన్నామో తెలుస్తుంది. మన ఊపిరితిత్తులు, మోకాళ్లు, పిక్కలు ఎంత బలంగా ఉన్నాయో పర్వతారోహణ తెలియచేస్తుంది. ఈ హాబీని ఫాలో అయ్యేవారు ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు. మరిన్ని పర్వతాలు ఎక్కేందుకు మరింత ఫిట్‌గా ఉంటారు. కాబట్టి పర్వతారోహణ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. -
29వ సారి ఎవరెస్ట్‌ను అధిరోహించిన కమీ రీటా షెర్పా
నేపాల్‌కు చెందిన 10 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో విజయం సాధించారు. ఈ సీజన్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన తొలి యాత్ర బృందం ఇదే. డెండి షెర్పా నేతృత్వంలోని పర్వాతారోహకుల బృందం శుక్రవారం రాత్రి 8.15 గంటలకు 8,848.86 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది. ఈ విషయాన్ని ఈ పర్వతారోహణ యాత్ర నిర్వహణ సంస్థ ‘సెవెన్ సమ్మిట్ ట్రాక్’ ప్రతినిధి థాని గుర్గైన్ మీడియాకు తెలిపారు.ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ సాధించని ఘనతను పర్వతారోహకురాలు కమీ రీటా షెర్పా చేసి చూపారు. ఆమె 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. షెర్పా తన 28వ ఎవరెస్ట్ అధిరోహణ రికార్డును తానే బద్దలు కొట్టారు. కమీ రీటా షెర్పాకు 54 ఏళ్లు. ఆమె 1994 నుండి పర్వతాలను అధిరోహిస్తున్నారు.ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే ముందు కమీ రీటా షెర్పా మీడియాతో మాట్లాడుతూ తనకు మరో వ్యాపకం లేదని, పర్వతారోహణే తన లక్ష్యమని అన్నారు. 29వ సారి కూడా ఎవరెస్ట్ అధిరోహిస్తానని తెలిపారు. కాగా కమీ రీటా షెర్పాతో పాటు టెన్జింగ్ గ్యాల్జెన్ షెర్పా, పెంబా తాషి షెర్పా, లక్పా షెర్పా, దావా రింజి షెర్పా, పామ్ సోర్జీ షెర్పా, సుక్ బహదూర్ తమాంగ్, నామ్‌గ్యాల్ డోర్జే తమాంగ్, లక్పా రింజీ షెర్పా తదిరులు పర్వతాన్ని అధిరోహించారు. మొత్తం 414 మంది అధిరోహకులు ఈ సీజన్లో ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు అనుమతి పొందారు. Nepali Sherpa climber Kami Rita Sherpa climbs Everest for record 29th time breaking his own previous record of 28 ascends. He is the sole person to climb the World’s tallest peak for a record 29 times: Government officials(file pic) pic.twitter.com/6gp6QaKWdz— ANI (@ANI) May 12, 2024 -
Gullamarsu Suresh: ఎవరెస్టుపై నవరత్న కీర్తి
సాక్షి, మచిలీపట్నం: వైఎస్ జగన్ పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నవరత్న పథకాల కీర్తి ఇప్పుడు ఎవరెస్టుపై రెపరెపలాడుతోంది. కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన గుల్లమర్సు సురేష్ బాబు ఎవరెస్టు బేస్ నుంచి ఒక్కో శిఖరాన్ని అధిరోహిస్తూ.. ఒక్కో పర్వతంపై ఒక్కో పథకం ఫ్లెక్సీల్ని ఎగురవేసి సీఎం జగన్ ఖ్యాతిని చాటిచెప్పాడు. వాస్తవాన్ని ఖండాంతరాలకు తెలిజేయాలనుకున్న అతని వజ్ర సంకల్పాన్ని సీఎం జగన్ గతంలో ట్వీట్ ద్వారా అభినందించారు. My warm wishes to G Suresh Babu, the mountaineer from Kurnool who scaled peaks worldwide promoting our Navaratnalu schemes! Your dedication and love for Andhra Pradesh are truly inspiring and we're grateful for your support Suresh. pic.twitter.com/PNyUX6viKX— YS Jagan Mohan Reddy (@ysjagan) May 27, 2023ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మా తండ్రి హమాలీ. నేను ఇంటర్లో ఉండగా ప్రభుత్వం పర్వతారోహణకు ఆసక్తి ఉన్న వారి పేర్లను కోరింది. ప్రిన్సిపల్ ప్రోత్సాహంతో దరఖాస్తు చేశా. అంతకుముందు అరికెర హాస్టల్లో చదువుకునే రోజుల్లో సీతాఫలం, తేనె కోసం అక్కడున్న 200–300 మీటర్ల ఎత్తయిన కొండలు అవలీలగా ఎక్కేవాడిని. ప్రిన్సిపల్ పేర్ల జాబితా పంపాక.. ప్రభుత్వం ఎంపిక చేసి, విజయవాడలో శిక్షణ ఇచ్చింది. అందులో ప్రతిభ చూపిన 35 మందిని ఎంపిక చేసి, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండలపై మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో 35 రోజులు శిక్షణ ఇచి్చంది. ఆ తర్వాత పర్వతారోహణను నా హాబీగా మార్చుకున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్న పథకాలు నన్ను అమితంగా ఆకర్షించాయి. ఆయన ప్రవేశపెట్టిన వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు అద్భుతం. మా మామ అనారోగ్యంగా ఉంటే రూ.1.50 లక్షల ఖరీదైన వైద్యం ప్రైవేటు ఆసుపత్రిలో ఉచితంగా చేశారు. అందుకే నవరత్న పథకాల కీర్తిని చాటిచెప్పాలని భావించా. ఎవరెస్టు బేస్ నుంచి ఒక్కో శిఖరంపై ఒక్కో పథకం ఫ్లెక్సీని ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2023 మే 27న నన్ను ఉద్దేశించి ‘నీ అంకితభావం స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు. అదే సంవత్సరం జూన్ 1న కర్నూలు జిల్లా పత్తికొండకు వచి్చనప్పుడు సీఎం జగన్‌ను కలవగా అభినందించారు. మరింత ముందుకు సాగాలని వెన్నుతట్టారు. పర్వతారోహణకు సుమారు రూ.35 లక్షలు ఖర్చవుతుంది. నా ఆర్థిక పరిస్థితి తెలిసిన దాతలు, సిల్వర్ జూబ్లీ కళాశాల పూర్వ విద్యార్థులు, మిత్రులు సహకారం అందించారు. ఐఏఎస్ అధికారి సత్యనారాయణ కూడా సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థి కావడంతో చేయూత లభించింది. ఇప్పుడు నా వయసు 24 ఏళ్లు. ఐదేళ్లలోనే దేశంలోని 25 శిఖరాలు అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడిగా పేరుపొందడం గర్వకారణం. తెలుగు బుక్ ఆఫ్ రికా>ర్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించా. పర్వతాలు అధిరోహించేటప్పుడు ఐదు సార్లు చావు అంచుదాకా వెళ్లి వచ్చా. 2019 మే 23న మౌంట్ లోథ్‌సే ఎక్కుతూ చాలా ఇబ్బంది పడ్డా. -
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో కల్తీ మసాలా దినుసుల తయారీకి సంబంధించిన భారీ రాకెట్‌ను పోలీసులు కనుగొన్నారు. రెండు కర్మాగారాలపై దాడులు నిర్వహించి 15 టన్నుల నకిలీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీకి కారణమైన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించి డీసీపీ పవేరియా మాట్లాడుతూ..‘మసాలా దినుసుల్లో కల్తీ జరుగుతోందనే సమాచారం మేరకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. దిల్లీ పరిసర ప్రాంతాల్లో సెర్చ్ నిర్వహించాం. ఆపరేషన్ సమయంలో దిలీప్ సింగ్ (46) అనే వ్యక్తికి చెందిన ఒక ప్రాసెసింగ్ యూనిట్లో పాడైపోయిన ఆకులు, నిషేధిత పదార్థాలను ఉపయోగించి కల్తీ పసుపును ఉత్పత్తి చేయడం గుర్తించాం. బియ్యం, మినుములు, కలప పొట్టు, మిరపకాయలు, ఆమ్లాలు, నూనెలను కలిపి వీటిని తయారుచేస్తున్నట్లు కనుగొన్నాం. సెర్చ్ సమయంలో సింగ్‌తోపాటు అక్కడే ఉన్న సర్ఫరాజ్(32) పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాం. ఈ కల్తీ మసాలా దినుసులు మార్కెటింగ్ చేసేది ఖుర్సీద్ మాలిక్ (42) అనే మరోవ్యక్తి అని తేలింది. దాంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నాం. సర్ఫరాజ్‌కు కరవాల్ నగర్‌లోని కాలీ ఖాతా రోడ్లో మరో ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఈ ముఠా 2019 నుంచి కల్తీ మసాలా దినుసుల వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు యూనిట్లలో నిలువ ఉన్న సుమారు 15 టన్నుల కల్తీ మసాలా దినుసులను సీజ్ చేశాం. చట్ట ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని వివరించారు.సీజ్చేసిన వాటిలో పసుపు, గరం మసాలా, దనియా పొడి కలిపి 7,105 కిలోలు ఉంది. కలపపొడి, బియ్యం, మినుములు, మిరపకాయలు, సిట్రిక్ యాసిడ్.. వంటి పదార్థాలు 7,215 కిలోలు ఉన్నాయి.ఇదీ చదవండి: మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థభారత బ్రాండ్లైన ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్ఎస్ఏ) గుర్తించిన సంగతి తెలిసిందే. దాంతో హాంకాంగ్, సింగపూర్‌ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్‌ఏఎస్‌ఎఫ్‌ఎఫ్) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్ఎస్ఏ అధికారులు ఇటీవల తెలిపారు. -
మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థ
మసాలాలు, సుంగధద్రవ్యాల్లో 10 రెట్లకంటే అధికంగా పురుగుమందుల అవశేషాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతిస్తోందని తెలిపే నివేదికలను సంస్థ తోసిపుచ్చింది. ఆహార పదార్థాల విషయంలో ఇండియాలో కఠినమైన నియమాలు ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.ఇటీవల రెండు ప్రముఖ భారతీయ బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్‌ల ఉత్పత్తుల్లో పురుగు మందు ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు ఆరోపిస్తూ హాంకాంగ్ ఆహార నియంత్రణ సంస్థ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో భారత్ ఉత్పత్తులను ముందుగా విదేశాలకు ఎగుమతి చేయాలంటే స్థానికంగా ఉన్న ఆహార నియంత్రణ సంస్థలు పూర్తి స్థాయిలో వాటిని పరీక్షించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అయినప్పటికీ హాంకాంగ్ ఆహార నియంత్రణ సంస్థ చేసిన పరీక్షల్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఉందని తేలడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో సామాజిక మాధ్యమాల్లో భారత ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ పనితీరును ప్రశ్నిస్తూ వార్తలు వైరల్‌గా మారాయి. దాంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ దాని పనితీరుపై స్పష్టతనిచ్చింది.ఇదీ చదవండి: వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్ ముద్రించాలని నిర్ణయంపురుగుమందుల అవశేషాలకు సంబంధించి గరిష్ట అవశేష స్థాయి (ఎంఆర్ఎల్) అత్యంత కఠినమైన ప్రమాణాల్లో ఒకటి. పురుగుమందుల ఎంఆర్‌ఎల్‌లు వివిధ ఆహార వస్తువులకు వాటి ప్రమాద అంచనాల ఆధారంగా వేర్వేరుగా నిర్ణయిస్తారు. అయితే భారత్‌లో మొత్తం 295 పురుగుమందులు నమోదయ్యాయి. వాటిలో 139 వాటిని మాత్రమే మసాలా దినుసుల ఉత్తత్తిలో వాడేందుకు అనుమతులున్నాయి. -
ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీ
ఎవరెస్ట్, ఎండీహెచ్ భారతీయ బ్రాండ్లకు చెందిన ప్రీ-ప్యాకేజ్డ్ స్పైస్ మిక్స్ ఉత్పత్తుల్లో పరిమితికి మించి ‘ఎథిలీన్ ఆక్సైడ్’ అనే పురుగుల మందు ఉన్నట్లు హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఎవరెస్ట్ కంపెనీ స్పందించింది. తమ కంపెనీ తయారుచేస్తోన్న ఉత్పత్తులు భద్రమైనవని, నాణ్యతా ప్రమాణాలను పాటించే వాటిని తయారుచేస్తున్నట్లు స్పష్టం చేసింది.సింగపూర్, హాంకాంగ్‌లో ఎవరెస్ట్, ఎండీహెచ్ కొన్నేళ్ల నుంచి వ్యాపారం సాగిస్తున్నాయి. ఏటా ఆయా కంపెనీల ఉత్పత్తులకు చెందిన శాంపిళ్లను అక్కడి ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ అయిన హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) పరీక్షిస్తోంది. అయితే ఇటీవల చేసిన పరీక్షల్లో ఆయా కంపెనీలు తయారుచేసిన ఉత్పత్తుల్లో ‘ఎథిలీన్ ఆక్సైడ్’ అనే పురుగుమందు వాడుతున్నట్లు నిర్ధారణ అయిందని, వాటిని నిషేధించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో ఎవరెస్ట్ కంపెనీ వివరణ ఇచ్చింది. అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించి తాము ఉత్పత్తులు తయారుచేస్తామని చెప్పింది. తమ ప్రొడక్ట్‌లపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది.సింగపూర్, హాంకాంగ్‌లో ఎవరెస్ట్ ఉత్పత్తులు మొత్తం 60 ఉంటే, కేవలం ఒకదాన్నే పరీక్షించారని కంపెనీ వర్గాలు తెలిపాయి. అది కూడా ప్రామాణిక ప్రక్రియలోనే జరిగింది. కానీ ఎలాంటి నిషేధం మాత్రం విధించలేదని సంస్థ వివరించింది. ఈ అంశంపై కంపెనీ ప్రతినిధి ఒకరు స్పందించారు. ఆహార భద్రత కంపెనీకి అత్యంత ప్రాధాన్యమన్నారు. స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ల్యాబ్ అనుమతి లభించాకే ఎగుమతులు జరుగుతాయని చెప్పారు.హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) సదరు కంపెనీల ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. సీఎఫ్ఎస్ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ రీకాల్ చేసింది. అందులో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్ మిక్స్‌డ్‌మసాలా పౌడర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: గగనవీధిలో పెరుగుతున్న ప్రయాణికులు.. ఒకే రోజు భారీ రికార్డు..ఆ రెండు తయారీ కంపెనీలపై చర్యలు తీసుకుందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. ఇందులో భాగంగా ముందస్తుగా ఎండీహెచ్, ఎవరెస్ట్‌కు చెందిన అన్ని మసాలా దినుసుల తయారీ యూనిట్ల నుండి నమూనాలను సేకరించాలని ప్రభుత్వం ఫుడ్ కమిషనర్లను ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. అధికారులు ఎండీహెచ్, ఎవరెస్ట్ మాత్రమే కాకుండా అన్ని మసాలా తయారీ కంపెనీల నుంచి నమూనాలను తీసుకుని టెస్ట్ చేయనున్నట్లు తెలిసింది. దాదాపు 20 రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామంటూ సంబంధిత అధికారులు వెల్లడించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. -
‘భారత ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు..’
భారత బ్రాండ్లైన ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్ఎస్ఏ) గుర్తించింది. దాంతో హాంకాంగ్, సింగపూర్‌ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్‌ఏఎస్‌ఎఫ్‌ఎఫ్) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్ఎస్ఏ అధికారులు తెలిపారు.ఈ 527 ఉత్పత్తుల్లో ఇప్పటికే 87 సరుకులను ఇతర దేశాలు తిరస్కరించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే వీటిలో 332 ఉత్పత్తుల్లో భారత్‌లోనే తయారైన హానికర రసాయనాలను వినియోగించినల్లు తేలింది. కానీ మిగతావాటిలో వాడిన రసయనాలు ఎక్కడివో తెలియాల్సి ఉంది. ఇథిలీన్ ఆక్సైడ్ వాస్తవానికి వైద్య పరికరాలపై క్రిములను చంపడానికి, వాటిని శుభ్రం చేయడానికి వాడుతారు. పురుగుమందు, స్టెరిలైజింగ్ ఏజెంట్‌గా వినియోగిస్తారు. దీన్ని ఆహార ఉత్పత్తుల్లో వాడడంతో లింఫోమా, లుకేమియా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.ఇదీ చదవండి: హార్లిక్స్ లేబుల్ తొలగింపు.. కారణం ఇదేనా..రామయ్య అడ్వాన్స్డ్ టెస్టింగ్ ల్యాబ్స్‌లోని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జుబిన్ జార్జ్ జోసెఫ్ ఇథిలీన్ ఆక్సైడ్ ఉప ఉత్పత్తుల వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలిపారు. ఇథిలీన్ ఆక్సైడ్ ఉప ఉత్పత్తి అయిన ఇథిలీన్ గ్లైకాల్ చాలా ప్రమాదమని చెప్పారు. దీన్ని గతంలో దగ్గు సిరప్‌ల్లో వాడడం వల్ల ఆఫ్రికాలో మరణాలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే ఇథిలీన్ ఆక్సైడ్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకున్న వారికి గామా కిరణాలతో చికిత్స అందించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలు అధ్యయనాలు నిర్వహించాలని కోరారు. -
ఎవరెస్టు ఎక్కిన రెండేళ్ల బుడ్డోడు
మాటలు నేర్చుకునే వయసులో బ్రిటీష్‌కు చెందిన రెండేళ్ల బుడ్డోడు టాట్ కార్టర్ అందరినీ ఆశ్చర్యపరిచే పనిచేశాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పర్వతారోహకునిగా టైటిల్‌ను దక్కించుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరుకున్న అతి పిన్న వయస్కునిగా టాట్ కార్టర్ నిలిచాడు. గతంలో చెక్ రిపబ్లిక్కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా టాట్ కార్టర్ సాధించిన విజయంపై అతని తల్లిదండ్రులు సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఈ ఘనత సాధించేందుకు టాట్ కార్టర్‌కు శ్వాస సంబంధిత శిక్షణ అందించామన్నారు. దీనికితోడు టాట్ కార్టర్‌కు ఎవరెస్టు అధిరోహణ సమయంలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు అందించామన్నారు. టాట్ కార్టర్ తన తల్లిదండ్రులతో పాటు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా టాట్ కార్టర్ తండ్రి ఒక ప్రకటనలో తమ కుటుంబం ఏడాదిగా ఆసియా పర్యటనలో ఉన్నదని, తన కుమారుడు టాట్ కార్టర్ 2023, అక్టోబర్ 25న తమతోపాటు ఎవరెస్టును అధిరోహించాడని తెలిపారు. తాను స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో నివాసముంటున్నానని, ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని ఆయన తెలిపాడు. తాము శ్రీలంక, నేపాల్, మాల్దీవులతో సహా అనేక దేశాలను సందర్శించామని, ఎప్పటికప్పుడు వైద్య నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. -
2023లో ఎవరెస్ట్‌ను ఎందరు అధిరోహించారు? సరికొత్త రికార్డు ఏమిటి?
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని గడచిన 70 ఏళ్లలో అధిరోహించిన వేలాది మంది పర్వతారోహకులు సరికొత్త రికార్డులు సృష్టించారు. వీరిలో పలువురు భారతీయులు కూడా ఉన్నారు. గత 70 ఏళ్లలో సుమారు ఏడు వేల మంది పర్వతారోహకులు ఎవరెస్ట్‌ను అధిరోహించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీనదాలు, మంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, పర్వతారోహణ సంఘం ఈ సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. 2023లో నలుగురు భారతీయులతో సహా దాదాపు 500 మంది పర్వతారోహకులు ఈ ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించారు. న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్‌కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్గే 8,848.86 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని 1953, మే 29న ఆవిష్కరించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని నేపాలీ భాషలో సాగరమాత అని అంటారు. ఎడ్మండ్-నార్జ్ 1953లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత దాదాపు 7000 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఇప్పటివరకూ 300 మందికి పైగా పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారని అధికారిక సమాచారం. 2023లో మొత్తం 478 మంది పర్వాతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ ఏడాది నలుగురు భారతీయులు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. భారత్‌కు చెందిన యాషి జైన్, మిథిల్ రాజు, సునీల్ కుమార్, పింకీ హారిస్ మే 17న ప్రపంచంలోనే ఎత్తయిన ఈ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. భారత పర్వతారోహకురాలు సుజానే లియోపోల్డినా మే 18న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నంలో మరణించారు. ఈ ఏడాది ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రలో నలుగురు నేపాలీలు, ఒక భారతీయ మహిళ, ఒక చైనీస్ సహా 11 మంది పర్వతారోహకులు మరణించారు. ఎనిమిది మంది గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. 2023లో నేపాల్‌కు చెందిన కమీ రీటా షెర్పా (53) ఎవరెస్ట్ శిఖరాన్ని 28 సార్లు అధిరోహించి, సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇది కూడా చదవండి: 2023లో భారత్- చైనా సంబంధాలు ఎలా ఉన్నాయి? -
Sheetal Mahajan: ఎవరెస్ట్ జంప్
41 ఏళ్ల భారతీయ మహిళా స్కై డైవర్ శీతల్ మహాజన్ ఎవరెస్ట్ ఎదుట పక్షిలా ఎగిరారు. హెలికాప్టర్లో ఎవరెస్ట్ ఒడిలో 21,500 అడుగుల ఎత్తు నుంచి దూకి ఊపిరి బిగపట్టి చూసే జంప్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. నవంబర్ 13న ఆమె ఈ ఘనత సాధించారు. ఆ సాహసం వెనుక కథనం. ‘స్కై డైవింగ్ చేసి కాళ్లూ చేతులూ విరిగితే నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు’ అని ఇంటివాళ్ల చేత చివాట్లు తిన్న అమ్మాయి రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ ఇంటివారినే కాదు ప్రపంచాన్ని కూడా నివ్వెర పరుస్తూనే ఉంది. 41 ఏళ్ల శీతల్ మహాజన్ ఎవరెస్ట్ చెంత సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తున హెలికాప్టర్లో నుంచి జంప్ చేసి 17,444 అడుగుల ఎత్తు మీదున్న కాలాపత్థర్ అనే చోట సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఊపిరి బిగ పట్టి చూడాల్సిన సాహసం ఇది. గడ్డ కట్టే చలిలో, ఆక్సిజన్ అందని ఎత్తు నుంచి, ఎవరెస్ట్ సానువుల వంటి ప్రమాదకరమైన చోట ఒక మహిళ ఇలా జంప్ చేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ మహిళా ఇంత ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేయకపోవడం మరో రికార్డు. ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ స్కై డైవర్ పౌల్ హెన్రీ ఇందుకు గైడ్‌గా వ్యవహరిస్తే నీతా అంబానీ, అనంత్ అంబానీ తదితరులు స్పాన్సరర్స్‌గా వ్యవహరించారు. స్త్రీలు ఎందుకు చేయలేరు? శీతల్ మహాజన్‌ది పూణె. తండ్రి కమలాకర్ మహాజన్ టాటా మోటార్స్‌లో ఇంజినీర్‌గా చేసేవాడు. ఇంటర్ చదువుతూ ఉండగా ‘నీ చదువుతో నువ్వు హ్యాపీగా ఉన్నావా?’ అని తండ్రి అడిగిన ప్రశ్న ఆమెలో సంచలనం రేపింది. ‘సైన్స్ చదవాలనుకుని చేరాను. కాని ఇలా చదవడం కాకుండా ఇంకేదో చేయాలి. ఎవరూ చేయనిది చేయాలి. అదే నాకు సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాను’ అంటుంది శీతల్. ఆ తర్వాత ఆమె గూగుల్ చేయడం మొదలెట్టింది– భారతీయ స్త్రీలు ఎక్కువగా లేని రంగంలో ఏదైనా సాధించాలని. అలా తారసపడినదే స్కై డైవింగ్. ‘అప్పటికి మన దేశంలో స్కై డైవింగ్‌లో రేచల్ థామస్ వంటి ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది స్త్రీలు లేరు. నేనెందుకు చేయకూడదు అనుకున్నాను. 22 ఏళ్ల వయసులో నార్త్‌పోల్‌లో మొదటి స్కై డైవింగ్ చేశాను. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ స్త్రీని నేనే’ అంటుంది రేచల్. 15 లక్షల ఖర్చుతో 2004లో శీతల్ తండ్రి జీతం 18 వేలు. కాని ఆ సంవత్సరం శీతల్ నార్త్ పోల్‌లో స్కై డైవింగ్ చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అందుకు అయ్యే ఖర్చు 15 లక్షలు. దాని కంటే ముందు ‘నువ్వు ఆడపిల్లవు. ఇలాంటి వాటికి పనికిరావు’ అన్నారు అంతా. ‘నన్ను ఆ మాటలే ఛాలెంజ్ చేశాయి’ అంటుంది శీతల్. అప్పటివరకూ శీతల్ విమానం కూడా ఎక్కలేదు. పారాచూట్ జంప్ అసలే తెలియదు. ఏ ట్రైనింగ్ లేదు. అయినా సరే స్పాన్సరర్లను వెతికి నార్త్‌పోల్‌కు వెళ్లింది. అయితే అక్కడి ఇన్స్ట్రక్టర్లు ఆమెను వెనక్కు వెళ్లమన్నారు. ‘ఇంతకుముందు ఒక మహిళ ఇలాగే నార్త్‌పోల్‌కు వచ్చి జంప్ చేయబోయి మరణించింది. అందుకని వారు అంగీకరించలేదు. నేను పట్టువదలక వారంపాటు అక్కడే ఉండి మళ్లీ సంప్రదించాను. ఈసారి అంగీకరించారు’ అంది శీతల్. 2004 ఏప్రిల్ 18న నార్త్‌పోల్‌లో మైనస్ 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో తన మొదటి జంప్ చేసింది. అలా లోకానికి సాహసిగా పరిచయమైంది. ఎన్నో రికార్డులు ఆ తర్వాతి నుంచి శీతల్ స్కై డైవింగ్‌లో రికార్డులు సాధిస్తూనే ఉంది. ఆ వెంటనే ఆమె అంటార్కిటికాలో స్కై డైవింగ్ చేసింది. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎదుట స్కై డైవింగ్ చేయడంతో భూమ్మీద ఉన్న రెండు ధ్రువాలతో పాటు మూడో ధ్రువం వంటి ఎవరెస్ట్ దగ్గర కూడా జంప్ చేసిన ఏకైక మహిళగా రికార్డు స్థాపించింది. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన వైభవ్ రాణెను హాట్ ఎయిర్ బెలూన్‌లో 5,800 అడుగుల ఎత్తులో వివాహం చేసుకుని అందరినీ హాశ్చర్యపరిచింది. శీతల్‌కు కవల అబ్బాయిలు. ‘పెళ్లయ్యి పిల్లలు పుట్టాక మహిళ జీవితం కెరీర్ పరంగా అంతమైనట్టేనని అందరూ అనుకుంటారు. నేను కూడా ఆగిపోతానని కొందరు ఆశపడ్డారు. నేను ఆ తరహా కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు కలిసి పెంచాలి. తల్లి మాత్రమే కాదు. నేను నా పిల్లల్ని పెంచుతాను... అలాగే నా కెరీర్‌ని కూడా కొనసాగిస్తాను. నిజానికి పెళ్లయ్యాకే అమెరికా వెళ్లి స్కై డైవింగ్‌లో ఉత్తమ శ్రేణి ట్రైనింగ్ తీసుకున్నాను’ అంటుందామె. ఇప్పుడు పూణెలో స్కై డైవింగ్ అకాడెమీ తెరిచి స్కై డైవింగ్‌లో శిక్షణ ఇస్తోంది.బయటకు రండి స్త్రీలు నాలుగ్గోడల నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడాలి... తమలోని సామర్థ్యాలను తెలుసుకుని వాటిని సానబట్టుకోవాలి... విజయం సాధించాలి... భారతీయ స్త్రీలు సాధించలేనిది లేదు... వారికి కావాల్సింది అవకాశమే అంటున్న శీతల్ కచ్చితంగా ఒక గొప్ప స్ఫూర్తి. -
చందమామకు ఎవరు దగ్గర?
గోరుముద్దలు తింటున్నప్పుడే ఆకాశంలో చందమామను అందుకోవాలన్న ఆరాటం మనిషిది. అలా అందుకోవాలంటే దగ్గరవ్వాలి. అందుకే అంతరిక్ష ప్రయోగాలు, స్పేస్ షిప్పులతో ప్రయాణాలు. అలాగాకుండా భూమ్మీద నుంచే చూస్తే.. చందమామ ఎవరికి దగ్గరో తెలుసా? ఏయే దేశాల వారికి దగ్గరగా ఉంటాడో తెలుసా? అసలు అంతరిక్షానికి భూమ్మీద దగ్గరి ప్రాంతమేంటో ఐడియా ఉందా? చందమామపైకి ఇస్రో తాజా ప్రయోగం నేపథ్యంలో ఈ వింతైన విశేషాలు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఎవరెస్ట్ ఎత్తయినదే.. అయినా.. భూమ్మీద ఏ ప్రాంతం చంద్రుడికి దగ్గరగా ఉంటుందనే ప్రశ్నకు.. ఎవరెస్ట్ శిఖరమే అయి ఉంటుందని చాలా మంది అంచనా వేస్తుంటారు. ఎందుకంటే భూమిపై ఎత్తయిన ప్రాంతం అదేకదా అంటారు. కానీ ఇది కొంత వరకే నిజం.. హిమాలయ పర్వతాలు, ఎవరెస్ట్ శిఖరం భూమి ఉపరితలంపైన మాత్రమే ఎత్తయినవి. భూమి మధ్యభాగం నుంచి చూస్తే.. ఎవరెస్ట్ కన్నా ఎత్తయిన ప్రాంతాలూ ఉన్నాయి మరి. అవే చందమామకు, స్పేస్‌కు దగ్గరగా ఉంటాయి. భూమి ఆకృతి ఎఫెక్ట్ మన భూమి అచ్చంగా గోళాకారంలో ఉండదు. ధ్రువ ప్రాంతాల వద్ద కాస్త నొక్కినట్టుగా, భూమధ్య రేఖ ప్రాంతంలో ఉబ్బెత్తుగా.. కాస్త దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. భూమి భ్రమణ వేగం, సూర్యుడి గురుత్వాకర్షణ వంటివే దీనికి కారణం. ఈ కారణం వల్లే భూమి మధ్యభాగం నుంచి చూస్తే.. ధ్రువ ప్రాంతాలు దగ్గరగా, భూమధ్యరేఖ ప్రాంతాలు దూరంగా ఉంటాయి. దీనికితోడు భూమిపైపొరల్లోని హెచ్చుతగ్గులు కూడా భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువ. చంద్రుడికి దగ్గరున్నది ‘మౌంట్ చింబోరాజో’ స్పేస్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతం ఏదన్న దానిపై అమెరికాకు చెందిన జోసెఫ్ సెన్నె అనే ఇంజనీర్, న్యూయార్క్‌లోని హెడెన్ ప్లానెటోరియం డైరెక్టర్ నీల్ డెగ్రాస్ టైసన్ కలసి అధ్యయనం చేశారు. లోతుగా పరిశీలన చేసిన తర్వాత ఆండీస్ పర్వత శ్రేణుల్లో ఈక్వెడార్ దేశం పరిధిలోకి వచ్చే ‘మౌంట్ చింబోరాజో’శిఖరం చంద్రుడికి దగ్గర అని తేల్చారు. దక్షిణ అమెరికా ఖండంలో సుమారు ఏడు దేశాల్లో ఆండీస్ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. అందులో భూమధ్యరేఖకు కాస్త దిగువన ఉన్న ఈక్వెడార్ పరిధిలో ‘మౌంట్ చింబోరాజో’శిఖరం ఉంది. ఎవరెస్ట్ ఎత్తు సముద్ర మట్టం నుంచి 8,848 మీటర్లు, అదే చింబోరాజో శిఖరం ఎత్తు 6,268 మీటర్లు మాత్రమే. కానీ ఎవరెస్ట్‌తో పోలిస్తే.. చింబోరాజో చంద్రుడికి 2.4 కిలోమీటర్లు సమీపంలో ఉన్నట్టేనని నిపుణులు లెక్క తేల్చారు. ఈ దేశాలు కూడా ‘స్పేస్’కు దగ్గర చిన్న ప్రాంతాల వారీగా కాకుండా దేశాల వారీగా చూస్తే.. ఈక్వెడార్, కెన్యా, టాంజానియా, ఇండోనేసియా వంటివి భూమ్మీద మిగతా దేశాల కన్నా చంద్రుడికి, స్పేస్‌కు దగ్గరగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సరిగ్గా భూమి మధ్య నుంచి చూస్తే.. భూమధ్యరేఖకు కాస్త దిగువన ఉన్న ప్రాంతం ఉబ్బెత్తుగా ఉంటుందని, ఈ దేశాలన్నీ ఆ ప్రాంతంలోనే ఉన్నాయని వివరిస్తున్నారు. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాలతో పోలిస్తే.. ఈ దేశాల్లోని జనం చంద్రుడికి సుమారు 21 కిలోమీటర్లు (13 మైళ్లు) దగ్గరగా ఉన్నట్టేనని పేర్కొంటున్నారు. ♦ భూమిపై సముద్ర మట్టం కంటే పైన భాగాల్లో అత్యంత ఎత్తయినది ‘ఎవరెస్ట్’శిఖరమే అన్నది సుస్పష్టం. కానీ సముద్రాలు, భూభాగాలు అన్నింటినీ కలిపి చూస్తే.. భూమ్మీద అతి ఎత్తయిన శిఖరం అమెరికాలోని హవాయ్ దీవుల్లో భాగమైన ‘మౌనాకీ’అగ్నిపర్వత శిఖరమే. ♦ సముద్ర మట్టంపైన మౌనాకీ ఎత్తు 4,205 మీటర్లే. కానీ సముద్రం లోపల మరో 6,000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. అంటే సముద్ర గర్భం నుంచీ చూస్తే.. మౌనాకీ మొత్తం ఎత్తు 10,205 మీటర్లపైనే. అంటే ఎవరెస్ట్ కన్నా సుమారు 1,350 మీటర్లు ఎత్తు ఎక్కువ. -
జయహో ఎవరెస్ట్
మే 29, 2023 నాటికి ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గెలు ఎవరెస్ట్ అధిరోహించి 70 ఏళ్లు. ఆ సందర్భంగా నేపాల్‌లోని లుక్లా ఎయిర్‌పోర్ట్‌లో వాళ్లిద్దరి బంగారు విగ్రహాలు ప్రతిష్టించారు. అంతేనా? షెర్పాల ఘన ఆరోహణ సంప్రదాయాన్ని నిలబెడుతూ ‘ఎవరెస్ట్ మేన్’గా ఖ్యాతినెక్కిన ‘కమిరత్న షెర్పా’ మే 23న 28వసారి ఎవరెస్ట్ ఎక్కి ఆ మహా పర్వతం ఒడికి తాను ముద్దుబిడ్డని నిరూపించుకున్నాడు. ఎవరెస్ట్– ఒక ధవళ దేవత. ఈ ఆరాధన ఎప్పటికీ వైరలే. ఎంత బాగుందో ఆ సన్నివేశం మే 26న, నేపాల్‌లోని లుక్లా ఎయిర్‌పోర్ట్‌లో (దీని పేరు టెన్సింగ్–హిల్లరీ ఎయిర్పోర్ట్) ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గె బంగారు విగ్రహాలు ప్రతిష్టిస్తే ఆ కార్యక్రమంలో హిల్లరీ కుమారుడు పీటర్ హిల్లరీ, టెన్జింగ్ కుమారుడు జామ్లింగ్ నార్గె పాల్గొన్నారు. డెబ్బయి ఏళ్ల క్రితం తమ తండ్రులు సృష్టించిన ఘన చరిత్రను వాళ్లు గుర్తు చేసుకోవడం, పొంగిపోవడం అందరినీ ఉద్వేగభరితం చేసింది. ఎవరెస్ట్‌ను నేపాల్‌వైపు ఎక్కాలనుకునేవారు మొదట లుక్లా ఎయిర్‌పోర్ట్‌లోనే దిగుతారు కాబట్టి వారికి స్ఫూర్తినివ్వడానికి, 70 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా ఈ విగ్రహాలు ఆవిష్కరించారు. ఇప్పటికి 6 వేల మంది డెబ్బయి ఏళ్ల క్రితం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ హిల్లరీ, నార్గెల జంట ఎవరెస్ట్‌ను అధిరోహించాక అప్పటి నుంచి ఇప్పటి వరకూ హిమాలయన్ డేటాబేస్ ప్రకారం ఆరు వేల మంది ఎవరెస్ట్ అధిరోహించారు. దానికి రెట్టింపు మంది ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకూ వెళ్లి వచ్చారు. పర్వతారోహకుల తొలి ఆరోహణ కలగా ఇప్పటికీ ఎవరెస్ట్ నిలిచి ఉంది. ఇప్పుడు నేపాల్‌వైపు నుంచి ఎవరెస్ట్ అధిరోహించాలంటే 9 లక్షలు పర్మిట్ ఫీజు కట్టాలి. ఈ సీజన్లో 478 మందికి పర్మిట్ ఇచ్చారు. వీరిలో చాలామంది గైడ్‌ను తీసుకెళతారు కాబట్టి రికార్డు స్థాయిలో 900 మంది ఈ సీజన్లో ఎవరెస్ట్‌ను అధిరోహిస్తారని భావిస్తున్నారు. మంచుపులి హిల్లరీకి దారి చూపేందుకు వచ్చి చరిత్రలో నిలిచిన షెర్పా టెన్జింగ్ నార్గెను ‘మంచు పులి’ అని పిలుస్తారు. ఆ షెర్పాల జాతికే చెందిన కమిరత్న షెర్పాను ‘ఎవరెస్ట్ మేన్’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇతను ఎవరెస్ట్ గైడ్‌గా పని చేస్తూ ఇప్పటికి 27సార్లు ఆ శిఖరాగ్రాన్ని ఎక్కి దిగాడు. అందుకని అత్యధికసార్లు ఎవరెస్ట్ ఎక్కిన ఘనత ఇతని పేరు మీద ఉంది. అయితే మొన్నటి మే 22న పసాంగ్ దవ రత్న అనే మరో షెర్పా 27వసారి ఎవరెస్ట్ అధిరోహించి కమిరత్న రికార్డును సమం చేశాడు. ఇది ఏమాత్రం రుచించని కమిరత్న ఆ మరుసటి రోజు ఉదయానికి ఎవరెస్ట్ ఎక్కి 28వసార్లు ఎక్కిన ఏకైక వ్యక్తిగా రికార్డు తన పేరు మీదే నిలుపుకున్నాడు. ఈ మే నెలలో కమిరత్న రెండుసార్లు ఎవరెస్ట్ ఎక్కాడు. హైదరాబాద్ బెజవాడల మధ్య తిరిగినంత సులభంగా ఎవరెస్ట్ అధిరోహిస్తున్న ఇతణ్ణి మరో మంచుపులి అనక ఇంకేం అనగలం. -
ఎవరెస్ట్: 53 ఏళ్ల వయసులో విజయవంతంగా 27వసారీ.. తన రికార్డు తానే
కఠ్మాండూ: నేపాల్‌కు చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడు కమీ రీటా షెర్పా మరోమారు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి తన గత రికార్డును తానే చెరిపేసి కొత్త రికార్డ్‌ను లిఖించారు. 53 ఏళ్ల రీటా బుధవారం ఉదయం విజయవంతంగా 27వసారీ ఎవరెస్ట్‌ను ఎక్కారని నేపాల్ పర్యాటక శాఖ ప్రకటించింది. దీంతో నూతన ప్రపంచ రికార్డు ఆవిçష్కృతమైంది. గత ఏడాది రీటా 26వసారి ఎవరెస్ట్ పర్వతారోహణ విజయవంతంగా పూర్తిచేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. ఆ రికార్డును మూడు రోజుల క్రితం మరో షెర్పా అయిన 46 ఏళ్ల పసంగ్ దవా సమం చేశారు. దీంతో రీటా బుధవారం మరోమారు పర్వతమెక్కి తన పేరిట రికార్డును లిఖించుకున్నారు. ఈయన 1994 మే 13న తొలిసారి ఈ పర్వతశిఖరాన్ని చేరారు. రీటా గతంలోనే ప్రపంచంలోని 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న పలు శిఖరాలను అధిరోహించారు. సీనియర్ మౌంటేన్ గౌడ్‌గా పనిచేస్తున్నారు. బుధవారంనాటి పర్వతారోహణకు అయిన ఖర్చులను కఠ్మాండూకు చెందిన ఒక వాణిజ్య సాహసయాత్రల నిర్వహణ సంస్థ భరించింది. ఈ స్ప్రింగ్ సీజన్లో ఇప్పటిదాకా మొత్తంగా 478 మందికి ఎవరెస్ట్ ఎక్కేందుకు అనుమతులు వచ్చాయి. -
ఎవరెస్ట్ ఎక్కించిన తెలుగుపాఠం..
నిర్మల్: ఆయనో చార్టెడ్ అకౌంటెంట్. పక్షంరోజులు పనులన్నీ పక్కనపెట్టి, ఏకంగా ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడానికి వెళ్లారు. తొలిసారే అవకాశం లేదనడంతో వెనక్కి తగ్గేది లేదంటూ.. ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకూ వెళ్లారు. ఆయన హిమాలయాలకు వెళ్లడానికి, అంత ఎత్తు ఎక్కడానికి కారణం తొమ్మిదో తరగతిలో ఆయన విన్న తెలుగుపాఠం కారణం. ఎవరా సీఏ, ఏమా తెలుగుపాఠం.. వివరాలివిగో! నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ముక్క సాయిప్రసాద్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన కరీంనగర్‌లోని పారామిత హైసూ్కల్లో చదువుకున్నారు. తెలుగుసార్ సన్యాసిరావు తొమ్మిదో తరగతి పాఠంలో భాగంగా ‘అటజని కాంచె భూమిసురుడు..’ అనే పద్యాన్ని చెబుతూ హిమాలయాలను అందంగా వర్ణించారు. అది సాయిప్రసాద్ మనసులో బలంగా నాటుకుపోయింది. ఎప్పటికైనా హిమాలయాలకు వెళ్లాలని, ఆ అందాలను చూడాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు. తరువాత ఉన్నత చదువులు, కెరీర్లో పడిపోయినా.. ఇరవైఏళ్ల కిందట విన్న పాఠం, హిమాలయాలకు వెళ్లాలన్న ఆలోచన ఆయన మదిలో మెదులుతూనే ఉంది. మొదటిసారి కావడంతో.. అయితే.. గతనెల 28న నేపాల్ రాజధాని ఖాట్మాండు వెళ్లిన ఆయన అక్కడి నుంచి హిమాలయాలకు చేరుకున్నారు. మొత్తం ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8,849 మీటర్లు కాగా, బేస్ క్యాంప్ 5,364 మీటర్లు ఉంటుంది. తొలిసారి ఎవరెస్ట్ ఎక్కాలనుకునేవారిని ఈ బేస్ వరకే అనుమతిస్తారు. సాయిప్రసాద్‌ను సైతం బేస్ వరకే అనుమతించారు. ఏడురోజుల పాటు ఎక్కుతూ ఈనెల 6న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. తన కుటుంబం, మిత్రుల సహకారంతో ఇక్కడి వరకూ వచ్చానని సాయిప్రసాద్ చెప్పారు. తనతో పాటు ఆయన మిత్రుడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన నార్లాపురం గిరిధర్‌ను కూడా ఒప్పించి వెంట తీసుకెళ్లారు. హిమాలయాలు అద్భుతం.. హిమాలయాల గురించి వింటుంటాం. కనులారా చూస్తేనే వాటి అందం తెలుస్తుంది. నాకు ట్రెక్కింగ్ అనుభవం లేదు. కానీ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తాను. అదే నేను ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకు చేరడానికి ఉపయోగపడింది. అక్కడికి వెళ్లి హిమాలయాలను చూడటం మర్చిపోలేని ఫీలింగ్. మరోసారి ఎవరెస్ట్ మొత్తం ఎక్కడానికి ప్రయత్నిస్తా. – ముక్క సాయిప్రసాద్, సీఏ, నిర్మల్ -
పర్వతం అతనికి పాదాక్రాంతం
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): కృషితో పట్టుదలతో ఆ యువకుడు ఏ పర్వతాన్నయినా అవలీలగా అధిరోహిస్తున్నాడు. ఆరేళ్ల క్రితం మనసులో వచ్చిన ఆలోచనకు పదును పెట్టి ఆచరణ సాధ్యం చేస్తున్నాడు. రాజమహేంద్రవరానికి చెందిన అతని పేరు ఉమేష్ ఆచంట. ఇతని తల్లిదండ్రులు బాలాజీ..పద్మావతి. ఉమేష్ చదువులో దిట్ట. టేబుల్ టెన్నిస్ అంటే ప్రాణం. ఈ ఆటలో అద్భుత ప్రావీణ్యం కనబరిచాడు. బీకాం ఉత్తీర్ణుడైన ఈ యువకుడు స్టోర్ట్సు కోటాలో రాజమహేంద్రవరంలోని పోస్టల్ డిపార్టుమెంట్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2016లో చూసిన ఎవరెస్ట్ సినిమా ఇతని ప్రవృత్తిని మార్చేసింది. తాను కూడా ఎవరెస్ట్ ఎక్కాలని బలంగా సంకల్పించాడు. వాస్తవానికి పర్వతారోహణ అనేది సాహస విన్యాసం. అయినప్పటికీ కృతనిశ్చయంతో తల్లితండ్రులను ఒప్పించి అరుణాచల ప్రదేశ్ వెళ్లాడు. కఠోరమైన శిక్షణ పొందాడు. అప్పటి నుంచి చిన్న చిన్న కొండలను ఎక్కడం ప్రారంభించి నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. చూసి తాను కూడా ఎవరెస్ట్ ఉమేష్ అంచెలంచెలుగా తన లక్ష్యాన్ని పెంచుకుంటూ పోయాడు. మూడు ఖండాలలో అతి ఎత్తయిన శిఖరాలను అధిరోహించగలిగాడు. గతేడాది మార్చిలో ఆఫ్రికాలో అతి పెద్ద పర్వతం కిలిమంజారోను అధిరోహించి ఔరా అనిపించాడు. అదే ఏడాది ఆగస్టులో యూరప్ ఖండంలో అతిపెద్ద పర్వతం మౌంట్ ఎలబస్ని ఎక్కాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో అతిపెద్ద పర్వతం మౌంట్ కోజిస్కోని అధిరోహించి అందరి దృష్టీ ఆకర్షించాడు. తాజాగా ఎవరెస్ట్ ఎక్కడానికి సన్నద్ధమవుతున్నట్లు ఉమేష్ సాక్షికి చెప్పాడు. ప్రమాద అంచున పయనం కిలిమంజారో ఎత్తు 19340 అడుగులు. మొదటి రెండు రోజులు ఏ ఆటంకాలు లేకుండా ఎక్కగలిగాడు. మూడో రోజు ఆక్సిజన్ లెవల్ తగ్గిపోయింది. దీంతో ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న అధికారవర్గాలు వెంటనే స్పందించాయి. అక్కడికి గైడ్, రిస్క్యు టీంను పంపాయి. దీంతో ఉమేష్ ప్రాణాలతో బయట పడ్డాడు. అలాగే మౌంట్ కోజిస్కోపర్వతం ఎత్తు 2228 మీటర్లు. ఆస్ట్రేలియా ఖండంలో ఈ పర్వతం పూర్తిగా మంచుతో నిండి ఉంటుంది. దీంతో అక్కడ పర్వతారోహనను ఆపేశారు. కానీ ఉమేష్ ప్రత్యేక అనుమతి తీసుకుని ఈనెల 11న బేస్ క్యాంపు నుంచి బయులుదేరాడు. సుమ్మిట్ పూర్తి చేసుకుని కిందకు రాత్రి లోపు వచ్చేయాలి. జీపీఎస్ సిగ్నల్స్..తీప్ర మంచు సమస్యలతో రూట్ మ్యాప్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. రావ్సన్ వద్ద ఎడమ వైపునకు వెళ్లాల్సి ఉంది. కానీ పొరపాటున దారి తప్పిపోయాడు. ఆ రాత్రి మళ్లీ కిందికి చేరుతానో లేదో అని తాను తీవ్ర ఆందోళన చెందానని ఉమేష్ చెప్పాడు. రాత్రి 12 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ టీంకు సమాచారం ఇద్దామన్నా సిగ్నిల్స్ లేవన్నాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రెస్క్యూ అపరేషన్ టీం ఇతడ్ని గుర్తించింది. అతి జాగ్రత్తగా బేస్ క్యాంపునకు తీసుకు వచ్చింది. అయినా పట్టు వీడకుండా ఈనెల 12న బేస్ క్యాంప్ నుంచి మళ్లీ బయలుదేరి మౌంటైనీర్ అవిన జోష్ మాతేవ్తో కలిసి మౌంట్ కోజిస్కోను అధిరోహించగలిగాడు. ఉమేష్ సాధించిన మెడల్స్ ఒడిదుడుకులు ఎదుర్కొని.. ప్రపంచంలో అతి ఎత్తయిన ఏడు పర్వతాలత్లో మౌంట్ ఎల్బస్ ఒకటి. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే పర్వతమిది. సముద్రమట్టానికి 16510 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విజయవంతంగా చేరుకోగలిగాడు. టీటీలో పలు ర్యాంకింగులు సాధించిన ఉమేష్ పర్వతరోహణలో ఏడు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. -
హిచ్ హైకింగ్: ఎవరెస్ట్ వరకూ లిఫ్ట్ అడిగింది
ఎవరెస్ట్ వరకూ వెళ్లాలంటే ఎవరైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు. నలుగురితో కలిసి వెళతారు. ఆమె ఒక్కతే వెళ్లాలనుకుంది. అదీ లిఫ్ట్ అడుగుతూ వెళ్లాలనుకుంది. అలా ఒక్కరే ప్రయాణ ఖర్చులు లేకుండా దొరికిన వాహనంతో పర్యటించడాన్ని ‘హిచ్ హైకింగ్’ అంటారు. ఐదుగురు పిల్లల తల్లి నాజిరా నౌషాద్ సాహసంతో ఈ పని చేసి ‘ఈ దేశం స్త్రీలకు సురక్షితమైనదే’ అని సందేశం ఇస్తోంది. ఇది వింత సంగతి. ఘనంగా చెప్పుకోవలసిన సంగతి. లారీల్లో లిఫ్ట్ అడుగుతూ (హిచ్ హైకింగ్) కేరళ నుంచి ఒక ఒంటరి మహిళ ట్రావెల్ చేయగలదా? చేయగలదు అని నిరూపించింది నాజిరా నౌషాద్. ఫిబ్రవరి 9న బయలు దేరి కేరళ నుంచి నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకూ వెళ్లిరావడానికి 50 రోజుల లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కేరళలోని కుట్టనాడ్‌లోని మన్‌కొంబు నాజిరా ఊరు. అది సముద్ర మట్టానికి 10 అడుగుల దిగువ. అక్కడి నుంచి బయలుదేరి సముద్రమట్టానికి 17,500 అడుగుల పైన ఉన్న ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు హిచ్ హైకింగ్ చేయాలని నిశ్చయించుకుంది నాజిరా. అలా చేయడంలో ఎంతో రిస్క్. ఒంటరి స్త్రీల మీద ఏ అఘాయిత్యం అయినా జరగొచ్చు. ‘లారీ డ్రైవర్ల మీద చాలా అపప్రథలు ఉన్నాయి. కాని నేను చూసిన లారీడ్రైవర్లు ఎంతో స్నేహపాత్రంగా ఉన్నారు. నా లక్ష్యం చేరుకోవడానికి సాయం చేశారు’ అంటుంది నాజిరా. షి కెన్ ట్రావెల్ అలోన్ ‘ఒంటరిగా స్త్రీ ప్రయాణించగలదు’ అనే స్లోగన్‌తో 33 ఏళ్ల నాజిరా ఈ యాత్ర మొదలెట్టింది. ఆమె భర్త ఒమన్‌లో ఉద్యోగం చేస్తాడు. ఆమెకు ఐదుగురు పిల్లలు. నాజిరా ట్రావెల్ వ్లోగర్. అంటే యాత్రా కథనాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఆమెకు ఫాలోయెర్స్ ఉన్నారు. నాలుగేళ్ల క్రితం భర్త ఇండియా వచ్చినప్పుడు కారులో వాళ్లు టూరు చేశారు. అప్పుడే ఆమెకు తాను కూడా ప్రయాణాలు చేసి సోషల్ మీడియాలో పంచుకోవాలనిపించింది. ‘గత సంవత్సరం మరో ఇద్దరు మహిళలతో కలిసి లదాఖ్ వరకు యాత్ర మొదలెట్టాను రోడ్డు మార్గం ద్వారా. కాని 20 రోజులకే వారు వెనక్కు వెళ్లిపోయారు. నేను మాత్రం యాత్ర కొనసాగించాను. వెనక్కు తిరిగి వచ్చి ‘నేను చూసిన దేశం’ అనే పుస్తకం రాసి ప్రచురించింది. ఆ తర్వాత నెల రోజులకే కేవలం షిప్ చార్జీలు జేబులో పెట్టుకుని లక్షద్వీప్‌కు వెళ్లింది. 10 దీవులను 25 రోజుల్లో తిరిగి వచ్చింది. తన ఫాలోయెర్స్ ఇళ్లల్లో లేదా స్థానికుల ఇళ్లలో రిక్వెస్ట్ చేసి బస చేసేది. ఇప్పుడు ఈ ఎవరెస్ట్ యాత్ర చేసింది. మన దేశం సురక్షితమే ‘మన దేశం స్త్రీ పర్యాటకులకు సురక్షితమే అని చెప్పడమే నా ఉద్దేశ్యం. మన దేశాన్ని మనం చూడకుండా విదేశాలకు వెళ్లి అక్కడ భద్రత ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు’ అంటుంది నాజిరా. వీపుకు ఒక బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని ఫిబ్రవరి 9న ఆమె కేరళలో బయలుదేరింది. పిల్లల్ని చూడటానికి ఇంట్లో తల్లి ఉంటుంది. ‘పిల్లల్ని అలా వదిలి బయలుదేరడం అందరికీ నచ్చదు. కాని మాటలు అనేవారిని నేను పట్టించుకోను’ అంటుంది నాజిరా. కేరళ నుంచి లారీలు, ట్రక్కులు పట్టుకుంటూ ఫిబ్రవరి 21కి ఆమె ఢిల్లీ చేరుకుంది. మరో లారీ దొరికే వరకు దిగిన ఊరులో ఏదో ఒక ఇంటి తలుపు తట్టి ఆ ఇంట్లో బస చేస్తూ వెళ్లింది. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సొనౌలీ చేరుకుని అక్కడి నుంచి నేపాల్‌లోని లుల్కాకు విమానంలో వెళ్లింది. రికార్డు జర్నీ ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు వెళ్లాలంటే లుల్కా నుంచి ట్రెక్ చేయాలి. అంటే కాలినడకన వెళ్లాలి. 2860 మీటర్ల ఎత్తున్న లుల్కా నుంచి 5364 మీటర్ల ఎత్తున్న బేస్‌క్యాంప్‌కు నడవాలంటే 8 రోజులు పడుతుంది. ‘కాని నేను ఐదురోజుల్లో చేరుకున్నాను. ఒక మహిళ ఇంత వేగంగా చేరుకోవడం రికార్డు’ అంటుంది నాజిరా. ఈ దారిలో ఆమె ప్రయాణించడానికి గైడ్‌ను మాట్లాడుకుంది. బేస్‌క్యాంప్ దగ్గర ఆమె దిగిన ఫొటో నిజంగానే ఒక సాహస చిహ్నం. కొంతమంది మరొకరు అనుకరించడానికి వీలులేని సాహసాలు చేస్తారు. నాజిరాను ఎంతమంది స్ఫూర్తిగా తీసుకోగలరు? అంత రిస్క్ ఎవరు చేయగలరు? కాని చేయాలనుకుంటే ఒక విజేత అంతకు ముందు దారి వేసింది అని చెప్పడానికి నాజిరా ఉంది. నాజిరా ఈజ్ గ్రేట్. -
Viral Video: జార్జ్ ఎవరెస్ట్‌ను ఎక్కిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి
-
జార్జ్ ఎవరెస్ట్‌ను ఎక్కిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి
Lavanya Tripathi Climbes George Everest Video Viral: హీరోయిన్ లావణ్య త్రిపాఠి పర్వాతారోహణ చేసి ఔరా అనిపించింది. ఉత్తరాఖండ్‌లోని 8,848 మీటర్ల ఎత్తున్న జార్జ్ ఎవరెస్ట్ శిఖరాన్ని లావణ్య అధిరోహించింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: మరోసారి వార్తల్లో నిలిచిన సమంత సైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా లావణ్య చేసిన అడ్వెంచర్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన లావణ్య తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ప్రస్తుతం ‘రాయబారి’అనే సినిమాలో నటిస్తుంది. చదవండి: ఫారెన్ అమ్మాయితో రెండో పెళ్లి.. స్పందించిన మంచు మనోజ్ ఆ ఫోటో చూసి సెట్స్‌లో నాతో విచిత్రంగా ప్రవర్తించారు: హీరోయిన్ -
ఎవరెస్టుపై మరణాలు రద్దీ వల్ల కాదు
కఠ్మాండ్ : ఎవరెస్టు శిఖరంపై ఇటీవల సంభవించిన మరణాలు కేవలం ట్రాఫిక్ జామ్ వల్ల కాలేదని.. ఎత్తైన ప్రదేశాల్లో వ్యాధులకు గుర య్యే అవకాశం, ఆరోగ్య సమస్యలు, ప్రతికూల వాతావరణం వంటి కారణాల వల్ల జరిగాయ ని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. ఎవరెస్టుపై అత్యధిక రద్దీ నెలకొనడంతో ఈ ఏడాది 11 మంది చనిపోయారన్న జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలను నేపాల్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఏదైనా కథనాన్ని ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకొని రాయాలని.. అసత్య వార్తలు రాయడం తగదని ఘాటు గా వ్యాఖ్యానించింది. ఎవరెస్టును అధిరోహిం చే క్రమంలో ఎనిమిది మంది చనిపోయారని నేపాల్ పర్యాటక మంత్రిత్వ శాఖ డీజీ దండు రాజ్ గిమిరే గురువారం వెల్లడించారు. ఈ మరణాలకు ట్రాఫిక్ జామ్ మాత్రమే కారణం కాదన్నారు. -
ఎవరెస్టును గెలిచిన పేదరికం
పంజగుట్ట: పట్టుదల ఉంటే పేదరికం లక్ష్యానికి అడ్డురాదని నిరూపించాడా యువకుడు. ఆర్థిక స్థోతమత లేకున్నా కేవలం దాతల సాయంతో తాను అనుకున్న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు వికారాబాద్ జిల్లా ఎల్లకొండ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కొడుకు జి.తిరుపతిరెడ్డి. ఎవరెస్టు అనుభవాలను సాయం అందించిన దాతలతో కలిసి శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో పంచుకున్నాడు. ఈసారి ఎవరెస్టు ఎక్కేటప్పుడు ఒకేసారి రెండువందల మంది ఒకేదగ్గర కలవడంతో సుమారు 3 గంటల పాటు ట్రాఫిక్ జామైందని, దాంతో ముందుకు కదల్లేక, వెనక్కి రాలేక ఒకేచోట ఉండాల్సి వచ్చిందన్నాడు. నడుస్తున్నప్పుడు శరీరంలో వేడి పుడుతుందని, అప్పుడే ముందుకు సాగగలమని.. కానీ ఒకేచోట కదలకుండా ఉంటే శరీరం చల్లబడిపోయి, మెదడు పనిచేయదన్నాడు. ఒక్కో సమయంలో వెనక్కి వెళ్లిపోదామా అన్న ఆలోచన వచ్చేదని, తమతో వచ్చిన బృందం ప్రోత్సాహం, తనకు సాయం చేసిన దాతలు, విద్యార్థులు కళ్లముందు కనిపించడంతో ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్లగలిగామన్నాడు. 7400 మీటర్ల ఎత్తు నుంచి మాత్రమే ఆక్సిజన్ వినియోగించామని, అయితే, 3 గంటల పాటు ట్రాపిక్ జామ్ కారణంగా తిరిగి వచ్చే సమయంలో ఆక్సిజన్ సమస్య వచ్చిందన్నాడు. అయితే, ఉన్న దానితోనే అతి జాగ్రత్తగా త్వరత్వరగా శిఖరం దిగామని వివరించాడు. మన రాష్ట్రం నుంచి ఆర్మీకి వెళ్లేవారి సంఖ్య తగ్గుతోందని, యువతను ఆ వైపు ప్రోత్సహించేందుకు త్రివిధ దళాల ప్రాధాన్యతను వివరిస్తూ ఎవరెస్టుపై జాతీయ పతాకాన్ని ప్రదర్శించినట్లు చెప్పాడు. తనకు సాయం అందించిన ప్రతీ సంస్థ పేరు, దాతల ఫొటోలను సైతం ప్రదర్శించానని తెలిపాడు. తనకు ప్రోత్సాహం అందిచిన దాతలకు రుణపడి ఉంటానని తిరుపతిరెడ్డి కృతజ్ఞతలు చెప్పాడు. తనపై పత్రికల్లో వచ్చిన కథనానికి స్పందించిన ఓ మహిళా దాత రూ.50 వేల సాయం అందించారని, కానీ ఆమె ఎవరో తనకు తెలియదని తెలిపాడు. ఈ సమావేశంలో దాతలు విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘు ఆరికెపూడి, ప్రభులింగం తదితరులు పాల్గొన్నారు. -
ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్.. ఇద్దరి మృతి
కఠ్మాండు: ఎవరెస్ట్ పర్వతంపై ట్రాఫిక్ ఏంటని ఆలోచిస్తున్నారా? మీరు చదివింది నిజమే..! ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ అనే విషయం మీలో చాలా మందికి తెలిసిందే. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఎంతోమంది పర్వతారోహకులు ఆసక్తి చూపిస్తూంటారు. అయితే తాజాగా వివిధ దేశాలకు చెందిన 200 మంది పర్వతారోహకులు ఒకేసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించారు. ఒకేసారి వందల సంఖ్యలో ట్రెక్కర్స్ రావడంతో.. పర్వత శిఖరానికి చేరుకునేమార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో గంటలపాటు ముందుకు వెళ్లలేక, వెనక్కు వెళ్లలేక క్యూలో వేచి ఉన్నారు. ఈ విషయాన్ని పర్యాటకశాఖకు చెందిన అధికారి జ్ఞానేంద్ర శ్రేష్ఠ తెలిపారు. వసంత రుతువు కావడంతో ప్రభుత్వం 381 మందికి పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతి ఇచ్చింది. ఈ కారణంగానే వందలాది మంది ఒకేసారి పర్వతంపైకి చేరుకోడానికి ఆసక్తి కనబర్చారు. ప్రతి ఏడాది మార్చి నుంచి జూన్ వరకు మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించే వారి సంఖ్య వందల్లో ఉండటం విశేషం. ఇదిలా ఉంటే... 1953 నుంచి ఇప్పటివరకు 4,400 మందికిపైగా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఇద్దరి భారతీయుల మృతి ఓవైపు ట్రాఫిక్ జామ్ ఎక్కువవగా... దురదృష్టం కొద్దీ అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంచుతో కూడిన గాలులు ప్రాణాలు తీస్తున్నాయి. శిఖరాన్ని అధిరోహించి గురువారం మధ్యాహ్నం తిరిగి కిందకి వస్తున్న భారతీయ మహిళ కల్పనా దాస్(52) అనే చనిపోయారు. మరో భారతీయుడు నిహాల్ భగవాన్(27) కూడా అదే విధంగా మృతిచెందారు. ఆయన కిందకి వస్తున్నప్పుడు దాదాపు 12 గంటల పాటూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. చివరకు చనిపోయారు. -
మరో శబరి నొప్పించక తానొవ్వక
నిన్న శబరిమల, నేడు అగస్త్యర్‌కూడమ్! మహిళ తన అభీష్టాన్ని నెరవేర్చుకుంది. కోర్టు తీర్పులు తొలగించిన నిషేధంతో తన ఆకాంక్షను శిఖరానికి చేర్చుకుంది. రెండువారాల క్రితం కనకదుర్గ, బిందు.. అయ్యప్పను దర్శించు కుంటే.. రెండు రోజుల క్రితం ధన్య అనే ఐఎఎస్ ఆఫీసర్ అగస్త్యకూడమ్ను అధిరోహించారు! ఎవర్నీ నొప్పించకుండా తాను అనుకున్నది సాధించారు. మహిళలు మగవాళ్ల మధ్య ప్రకృతి పెద్ద తేడానే సృష్టించింది. మహిళలను మానసికంగా శక్తిమంతులను చేసింది, మగవారిని శారీరకంగా శక్తిమంతుల్ని చేసింది. శారీరకంగా మగవారికున్నంత దేహదారుఢ్యం లేదనే కారణంగా మహిళలకు కొన్ని జాగ్రత్తలు చెప్పడం మొదలవుతుంటుంది సమాజంలో. ‘అక్కడికి వెళ్లద్దు, ఇక్కడికి వెళ్లడం కష్టం. ఆ కొండ ఎక్కడం ఎంత కష్టం అంటే ఆడవాళ్లు ఎక్కగలిగిన కొండ కాదది’ వంటి అభిప్రాయాలతో మొదలై, అది కాస్తా క్రమంగా జాగ్రత్త స్థాయి నుంచి నిషిద్ధం స్థాయిని చేరుతూ ఉంటుంది. కేరళలోని 1868 మీటర్ల ఎత్తయిన అగస్త్యర్‌కూడమ్ కొండ కూడా మహిళలకు అలాంటి నిషిద్ధ ప్రదేశమే. కేరళలో ఎల్తైన పర్వతాల్లో రెండవది అగస్త్యర్‌కూడమ్. పర్వత శిఖరాన్ని అధిరోహించడం సాధ్యమయ్యే పని కాదు. ప్రమాదకరమైన భూభాగం అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తించిన ప్రదేశం. ఆ కొండ మీదకు ఆడవాళ్లు వెళ్లకూడదనే నిబంధన ఉండేది. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పుల్లో శబరిమలకు అన్ని వయసుల మహిళలూ వెళ్లవచ్చనే తీర్పుతోపాటు అగస్త్యర్‌కూడమ్ శిఖరానికి మహిళలు కూడా వెళ్లవచ్చని తీర్పు చెప్పింది. ఆ తీర్పు వెలువడగానే ఆ శిఖరం మీదకు ట్రెకింగ్‌కు వెళ్లడానికి వందమంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్, డిఫెన్స్ అధికార ప్రతినిధి ధన్య సనాల్ కూడా ఉన్నారు. అయితే వాళ్లందరి కంటే మొదట అగస్త్యర్కూడమ్ను అధిరోహించారామె. ఆ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళగా ఈ జనవరి 14న రికార్డు సాధించారు. ఆందోళనలను అధిగమించింది పర్వత శిఖరాన్ని అధిరోహించడానికి ధన్య సనాల్కి ప్రకృతి పెట్టే పరీక్షలు, వాతావరణ ప్రతికూలతలు ఎదురు కాలేదు కానీ స్థానిక ‘కణి’ గిరిజనుల నుంచి ప్రతికూలత ఎదురైంది. పర్వత శిఖరం మీదున్న అగస్త్య ముని ఆలయాన్ని ఆడవాళ్లు దర్శించుకోవడానికి వీల్లేదని పట్టుపట్టారు ఆ గిరిజనులు. అందుకు ధన్య సనాల్ ‘‘నేను ట్రెకింగ్‌ను ఇష్టపడి ఈ పర్వతాన్ని అధిరోహించాను, అంతే తప్ప ఆలయాన్ని దర్శించుకోలేదు. ఒకరి మనోభావాలన ఇబ్బంది కలిగించడం నా ఉద్దేశం కాదు. ఈ పర్వతం మీదకు ట్రెకింగ్‌కు వెళ్లడానికి తమ పేర్లను నమోదు చేసుకున్న నాలుగు వేల మందిలో వందమంది మహిళలున్నారు. వారిలో నేనూ ఉన్నానంతే’’ అని సున్నితంగా బదులిచ్చారు. ధన్య సనాల్ వయసు 38, ఆమె 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ‘‘అగస్త్యర్‌కూడమ్ పర్వతం నిటారుగా ఉంటుంది. ఎక్కేటప్పుడు ఏ మాత్రం పట్టు తప్పినా ఊహించలేని ప్రమాదం సంభవిస్తుంది. మహిళలకు కష్టమనే ఉద్దేశంతో ఆ నిబంధన పెట్టి ఉండవచ్చు. నేను శారీరక దారుఢ్యం కోసం రోజూ గంట సేపు వ్యాయామం చేస్తాను. పర్వతాన్ని అధిరోహించడానికి అవసరమైన మానసిక, శారీరకమైన దారుఢ్యం నాకుంది. అందుకే ఈ పర్వతారోహణ చేశాను. ఇక్కడ ఫిట్నెస్ ఒక్కటే ప్రధానం’’ అని కూడా అన్నారామె. ధన్య సనాల్ ఆగస్త్య ఆలయానికి వెళ్లకపోవడంతో కణి గిరిజనులు కూడా ఆందోళనను తీవ్రతరం చేయలేదు. సంప్రదాయ వాదులు కూడా నిషేధం ఉన్నది పర్వతాన్ని అధిరోహించడానికా, ఆలయాన్ని సందర్శించడానికా అనే ధర్మ మీమాంసలో పడిపోయి ఉండవచ్చు. ఏది ఏమైనా ధన్య సనాల్ ఎవరినీ నొప్పించకుండా తాను అనుకున్నది సాధించారు. – మంజీర -
శిఖరానికి డాక్టరేట్
అరుణిమా సిన్హా ఒకప్పుడు జాతీయ స్థాయి ఫుట్‌బాల్, వాలీబాల్ ప్లేయర్. ఇప్పుడు పర్వతారోహకురాలు. అరుణిమ 2013, మే 21వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు. ప్రపంచంలోనే ఎవరెస్టును ఎక్కిన తొలి మహిళగా రికార్డు సాధించారు! తొలి మహిళా?! జపాన్ మహిళ జంకో తాబేకి ఆ రికార్డు ఉంది కదా! నిజమే. జంకో తాబే ఎవరెస్టును అధిరోహించిన తొలి మహిళ. అరుణిమది అంతకంటే పెద్ద రికార్డు, మనసును కదిలించే రికార్డు. స్ఫూర్తిని నింపే రికార్డు. వెక్కిరించిన విధిని ఒక్క తోపు తోసేసి శిఖరం పైకి నడిచిన విజయం ఆమెది. ఒక ఘర్షణలో ప్రమాదవశాత్తూ కాలిని (ఎడమ) పోగొట్టుకున్న అరుణిమ కృత్రిమ కాలితో ఎవరెస్టును అధిరోహించారు. ప్రపంచంలోనే తొలిసారి ఎవరెస్టును ఎక్కిన వికలాంగ మహిళగా రికార్డు సాధించారు. ఆ తర్వాత అనేక రికార్డులకు ఆమె గౌరవాన్ని తెచ్చారు. ఆఫ్రికాలో కిలిమంజరో, యూరప్‌లోని ఎల్బ్రస్, ఆస్ట్రేలియాలోని కోస్‌కుయిజ్‌కో, సౌత్ అమెరికాలోని ఆకాంకాగువా, ఇండోనేసియాలో కార్స్టెంజ్ పిరమిడ్లను అధిరోహించారు. ఈ పర్వతాలన్నీ ఆమె స్ఫూర్తి ముందు తలవంచాయి. ఇప్పుడు ఆమె దీక్షకు గుర్తింపుగా యుకెలోని స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీ పురస్కరించింది. గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కాలు ఎలా పోయింది? 2011, ఏప్రిల్ 12వ తేదీ. ఉత్తర ప్రదేశ్, అంబేద్కర్ నగర్ కి చెందిన అరుణిమ ఢిల్లీకి వెళ్లడానికి లక్నోలో రైలెక్కింది. జనరల్ కోచ్‌లో ఉన్న అరుణిమ మీద దొంగల చూపు పడింది. ఆమె మెడ మీద వాళ్ల చెయ్యి పడింది. ఆమె మెడలో ఉన్న బంగారు దండ, బ్యాగ్‌లో డబ్బు దొంగల పాలు కాకుండా కాపాడుకోవడానికి వారితో పెనుగులాడింది అరుణిమ. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ఉద్యోగం కోసం పరీక్ష రాయడానికి వెళ్తున్న అమ్మాయి కావడంతో దొంగలకు లొంగిపోవడానికి సిద్ధంగా లేదామె. ఆ పెనుగులాటలో ఆమెను రైల్లోంచి బయటకు తోసేశారు దొంగలు. ఆమె ప్రయాణిస్తున్న రైల్లోంచి పక్కనే ఉన్న పట్టాల మీద పడిందామె. ఆ పట్టాల మీద మరో రైలు వస్తోంది. ఆ రైలు రావడం కనిపిస్తోంది, తనను తాను రక్షించుకోవడానికి పక్కకు తిరిగిందామె. దేహం పూర్తిగా పట్టాల మీద నుంచి బయటపడనేలేదు. మరో రెండు సెకన్లయితే పూర్తిగా పక్కకు దొర్లిపోయేదే, అంతలోనే వచ్చేసింది రైలు. కాలి మీదుగా వెళ్లిపోయిందా రైలు. మోకాలి కింద భాగం నుజ్జయిపోయింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నాలుగు నెలల కాలం బెడ్‌మీదనే గడిచిపోయింది. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చిందామె. కోలుకున్న తరవాత జీవితాన్ని సాహసోపేతంగా గడపాలని. ఎవరెస్టును అధిరోహించాలనే కోరిక కూడా ఆ నిర్ణయంలోంచి పుట్టినదే. కృత్రిమ కాలితో శిక్షణ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉత్తరాలు, టెలిఫోన్ ద్వారా బచేంద్రిపాల్‌ను (ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ) సంప్రదించింది అరుణిమ. బచేంద్రిపాల్ పూర్తి సంపూర్ణ సహకారాలందించారామెకి. అరుణిమ సోదరుడు ఓంప్రకాశ్ ప్రోత్సహించాడు. ప్రోస్థెటిక్ లెగ్ అమర్చిన తర్వాత పర్వతారోహణ శిక్షణ మొదలైంది. మొదట 2012లో హిమాలయాల్లోని ఐలాండ్ పీక్‌ను అధిరోహించి, ఫిట్నెస్ విషయంలో నిర్ధారణకు వచ్చింది. తర్వాత ఏడాది ఎవరెస్టును అధిరోహించింది. ఆ అనుభవాలను ‘బార్న్ అగైన్ ఆన్ ద మౌంటెయిన్’ అని పుస్తకంగా రాసింది అరుణిమ. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తోపాటు టెన్సింగ్ నార్గే అవార్డులతో అరుణిమలోని స్ఫూర్తిని గౌరవించింది. తనలాంటి వాళ్ల కోసం ఆరు పర్వత శిఖరాలను పూర్తి చేసుకున్న తర్వాత యుకె లోని స్ట్రాత్‌క్లైడ్ యూనివర్శిటీ గడచిన గురువారం నాడు గ్లాస్గోలో జరిగిన గ్రాడ్యుయేషన్ సెరిమనీలో అరుణిమకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ‘ఈ పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు యువతకు మంచి సందేశాన్నిస్తాయి. సంకల్పశుద్ధితో చేసిన పనిని ప్రపంచం గుర్తిస్తుందనే సంకేతాన్ని జారీ చేస్తాయి’ అంది అరుణిమ. ఆమె స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న అరుణిమ ఫౌండేషన్ సేవలను కూడా స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆమె స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్‌కి మానసిక, శారీరక ఆరోగ్య సేవలతోపాటు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రోత్సాహం, మహిళల సాధికారత అవగాహన వంటి కార్యక్రమాలను తన చారిటీ ద్వారా నిర్వహిస్తోంది. అరుణిమ ఇప్పటి వరకు ఆరు శిఖరాలు అధిరోహించింది. అన్ని ఖండాల్లోని ప్రముఖ శిఖరాలను అధిరోహించాలని, ప్రతి శిఖరం మీదా భారత పతాకాన్ని ఆవిష్కరించాలనీ ఆమె ఆశయం. – మంజీర -
ఎవరెస్ట్ కలుగులో ‘డబ్బులు’
లంకెబిందెలున్నాయంటే పలుగు పారతో పరుగెత్తుకెళ్లి తవ్వుతాడు. కొండ కోనల్లో నిధి ఉందని తెలిస్తే టక్కరిదొంగలా సాహసం చేస్తాడు. డబ్బుకోసం మనిషి ఏదైనా చేస్తాడు! మనిషికి అంత ఆశ. దీనిని ఆసరాగా చేసుకుని డబ్లిన్‌లో ఆస్క్ ఎఫ్ఎం 2.0 అనే స్టార్టప్ కంపెనీ ఆ ఆశకు గాలం వేసింది. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం లోపల దాదాపు రూ.34 లక్షల విలువైన క్రిప్టోకరెన్సీ దాచేసింది. సాహసం చేసి తీసుకొచ్చిన వారు ఆ మొత్తాన్ని తమ వెంట తీసుకెళ్లవచ్చని ప్రకటించింది. ముగ్గురు ఉక్రెయిన్ పర్వతారోహకులు వాటిని సొంతం చేసుకునేందుకు పర్వతాన్ని ఎక్కారు. అయితే అందులో ఇద్దరు మాత్రమే ఆ కరెన్సీని తీసుకొచ్చారు. డబ్బునూ సొంతం చేసుకున్నారు. అయితే మూడో వ్యక్తి ఆ కరెన్సీ అన్వేషణలో ప్రాణాలు కోల్పోయాడు. తన వ్యాపారంలో భాగంగా క్రిప్టోకరెన్సీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పించాలనే ఆ కంపెనీ ఈ పని చేసింది. -
కీర్తి శిఖరాన్ని తాకారు
సాక్షి, స్టూడెంట్ ఎడిషన్ ఎవరెస్టు...ఈ పేరు విన్న ఔత్సాహికులు ఒక్కసారైనా దాన్ని అధిరోహించాలని తహతహలాడుతుంటారు. కొంతమంది ఒంటరిగా, మరికొంతమంది బృందంగా దీనిని అధిరోహిస్తుంటారు. పర్వతారోహకుల్లో బంధువులు లేదా కుటుంబసభ్యులు ఉండడమనేది అరుదు. అందులోనూ తండ్రీకూతుళ్లు ఉండడం అనేది ఇంకా అరుదు. ఆ కోవకే చెందుతారు అజీత్ బజాజ్ ఆయన కుమార్తె దియా బజాజ్. గుర్గావ్కు చెందిన వీరు ఈ నెల 16వ తేదీన 8,848 మీటర్ల ఎత్తయిన ఎవరెస్టు అధిరోహించారు. ఈ పర్వతాన్ని ఎక్కడమంటే కఠినమైన పరిస్థితుల్లో ముందుకు సాగడమే. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన అజీత్ ఆయన కుమార్తె దియా తొలి ప్రయత్నంలోనే తమ లక్ష్యాన్ని సాధించడం విశేషం. ప్రాణాంతకమైన సవాళ్లను లెక్కచేయకుండా, తీవ్ర చలి వాతావరణమనే ఆందోళన లేకుండా గమ్యాన్ని చేరుకున్నారు. దశాబ్దం క్రితం సాహసోపేత ప్రయాణ సంస్థల నిర్వాహకుడైన 53 ఏళ్ల బజాజ్ ...ఒకే ఏడాది వ్యవధిలో దక్షిణ, ఉత్తర ధ్రువాలను తిలకించారు. అలా ఒకే ఈ రెండుచోట్లకి వెళ్లిన తొలి భారతీయుడిగా నిలిచారు. ఆయన పెద్దకుమార్తె దియా...పర్యావరణ సైన్సులో డిగ్రీ చదివి ఉత్తరకాశిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ సంస్థలో పర్వతారోహణపై శిక్షణ పొందింది. 14 ఏళ్ల లేలేత వయసులోనే ట్రాన్స్ గ్రీన్లాండ్ యాత్ర చేసింది. 2012లో యూరప్‌లో అత్యంత ఎత్తయిన 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించింది. ఏడాదిపాటు శిక్షణ: ‘ఎవరెస్టు శిఖరాన్ని తిలకించాలని ఇరువురం గతేడాది నిర్ణయించుకున్నాం. శిక్షణ అత్యంత ఉల్లాసభరితంగా సాగింది. శారీరకంగా మంచి ఆకృతిని పొందడం కోసం జిమ్‌లో రకరకాల వ్యాయామాలు చేశాం. పరుగులు తీశాం. ఈత కొట్టాం. గతేడాది ఆగస్టులో లడఖ్ యాత్రకు వెళ్లాం. ఎవరెస్టుకు ముందు ట్రయలర్‌గా ఈ యాత్ర సాగించాం’ అని అజీత్ చెప్పారు. ‘ఇటువంటి మూడు సాహస యాత్రల తర్వాత గతేడాది డిసెంబర్లో నేపాల్ వెళ్లాం. అవసరమైన సామగ్రి కొనుగోలు చేశాం. ఆ తర్వాత రెంజోలా పాస్ చేరుకున్నాం. తిరిగి లడఖ్ చేరుకుని అక్కడ కొద్దిరోజులు గడిపాం, మాపై పూర్తి నమ్మకం కలిగింది. ఏప్రిల్ పదిన టిబెట్ వెళ్లాం. ఈ నెల 16న ఎవరెస్టు పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం ’ అని దియా చెప్పారు. అజిత్, దియా స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల. అజీత్‌ను చిన్నతనంలో వాళ్ల నాన్న సరదాగా తరచూ పర్వతారోహణకు తీసుకెళ్లేవాడు. ఢిల్లీలోని స్టీఫెన్ కళాశాలలో చదువుకునే రోజుల్లో అజీత్ ఔట్‌డోర్ క్లబ్లో సభ్యుడయ్యాడు. అదే సమయంలో తరచూ సాహసోపేత క్రీడల్లోనూ పాలుపంచుకునేవాడు. ఆ తర్వాత అదో వ్యాపకంగా మారిపోయింది. దియాను కూడా తరచూ తన వెంట తీసుకుపోయేవాడు. తనకు ఇటువంటి తండ్రి దొరకడం పూర్వజన్మ సుకృతమంటూ దియా పొంగిపోయింది. పైగా సాహసయాత్రలో తండ్రే భాగస్వామి కావడం అదృష్టమని చెప్పుకొచ్చింది. చిన్నతనంలో ఈత అంటే సరదా అని, ఆ తర్వాత జాతీయస్థాయి క్రీడల్లో కూడా పాలుపంచుకున్నానంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకుంది. ‘అంటార్కిటాలో రెండో అతిపెద్ద భాగమైన గ్రీన్లాండ్ ఐస్ క్యాప్‌ను అతి చిన్న వయసులో దాటిన రికార్డు నా సొంతం. ఎవరెస్టుపై మా యాత్ర సాగే సమయంలో ఓ రాత్రి భీకర తుపాను వచ్చింది. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు కూడా వీచాయి. తీవ్ర ఆందోళనకు గురయ్యాం. తెల్లవారాక అంతా సర్దుకోవడంతో ఊపిరి పీల్చుకున్నాం’ అని తెలిపింది. -
ఎవరెస్ట్‌పై కాస్ట్లీ డిన్నర్ !
ఆ విందు తినాలంటే మీరు భోజన ప్రియులైతే మాత్రమే సరిపోదు. గుండెల్లో కాస్త ధైర్యం ఉండాలి. శారీరక పుష్టి, ఆర్థిక పరిపుష్టి కూడా మీ సొంతమై ఉండాలి.. అప్పుడే ఆ డిన్నర్ ఎంజాయ్ చేయగలరు. ఎందుకంటే అదేమీ అల్లాటప్పా భోజనం కాదు. సముద్ర మట్టానికి ఏకంగా 11,600 అడుగుల ఎత్తులో వండి వార్చబోతున్నారు. ఎవరెస్ట్‌పై ఒక అరుదైన ప్రపంచ రికార్డు కోసం కొంత మంది చెఫ్‌లు భారీగా కసరత్తు చేస్తున్నారు. నేపాల్ బేస్ క్యాంప్‌లో ఓ రెస్టారెంట్ గిన్నీస్ రికార్డులకెక్కడానికి సన్నాహాలు చేస్తోంది. దీని వెనుక మొత్తం నలుగురు చెఫ్‌లు ఉన్నారు. ట్రియాంగ్యోని పేరుతో ఎవరెస్ట్‌పై డిన్నర్‌కి ఏర్పాట్లు చేస్తున్నారు. అంత ఎత్తులో అసలు ఆక్సిజన్ అందక ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది, అలాంటిది భోజనం చేయడం అంటే మాటలా ? అందుకే ఆ వాతావరణానికి తగ్గట్టుగా మెనూ రూపొందిస్తున్నారు. ఈ మెనూలో మసాలా పదార్థాలకే పెద్ద పీట వేస్తామని రెస్టారెంట్లో భాగస్వామి అయిన మన ఇండియన్ చెఫ్ సంజయ్ థాకూర్ వెల్లడించారు. వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల్ని కూడా తట్టుకుంటూ ఈ నెలఖారు నుంచి రోజుకి ఆరుగంటల సేపు ట్రెక్కింగ్ చేస్తూ నలుగురు చెఫ్‌లు, పదిమంది అతిథులు ఎవరెస్ట్‌కు చేరుకోనున్నారు. అతిథులెవరైనా ట్రెక్కింగ్ చేయలేకపోతే వారంతా హెలికాప్టర్లలో ఎవరెస్ట్‌కు చేరుకునే సదుపాయం కూడా ఉంది. ఎవరెస్ట్‌పై డిన్నర్ తినాలనుకునే ప్రతి ఒక్కరూ 3 లక్షల 64 వేల రూపాయలు చెల్లించాలి. కేవలం భోజనం మాత్రమే కాదు, ప్రయాణానికయ్యే ఖర్చు, వసతి అన్నింటికి కలిపి ఆ మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఎవరెస్ట్ లాంటి ప్రాంతానికి వెళ్లాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు మరి. అలా వచ్చిన మొత్తాన్ని చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే హార్ట్ ఫర్ ఇండియా ఫౌండేషన్‌కు ఇవ్వనున్నారు. అన్నట్టు ఇలా ఎవరెస్ట్‌పై డిన్నర్ ఐడియా ఇది మొదటిసారి కాదు. 2016లో ప్రఖ్యాత చెఫ్ జేమ్స్ షెర్మన్ ఇలా రకరకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. కానీ అది వరల్డ్ రికార్డులకు ఎక్కలేదు. ఈసారి ఎలాగైనా ప్రపంచ రికార్డులకెక్కాలని చెఫ్‌లు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎవరెస్ట్‌పై భోజనం చేయాలన్న ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా ఫైన్‌డైనింగ్ వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. -
ఎవరెస్టు అధిరోహణకు రేణుక పయనం
సీతంపేట: ఎవరెస్టు శిఖర అధిరోహణకు కొండగొర్రె రేణుక అనే గిరిజన విద్యార్థిని శుక్రవారం తన స్వగ్రామమైన భామిని మండలం నులకజోడు నుంచి పయనమై వెళ్లింది. పది రోజుల పాటు విజయవాడలోని కేతాని కొండ వద్ద శిక్షణ అనంతరం మరో పది రోజులు లడక్‌లో మంచు పర్వతాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తదుపరి 20 రోజుల తర్వాత ఎవరెస్టు అధిరోహణకు వెళ్లనున్నారు. రేణుక ఎవరెస్టు ఎక్కితే జిల్లా నుంచి ఊయక కృష్ణారావు తర్వాత అధిరోహించిన రెండో గిరిజన విద్యార్థినిగా గుర్తింపు దక్కుతుంది. ఈమె సీతంపేట గిరిజన బాలికల గురుకుల కళాశాలలో వృత్తివిద్యాకోర్సు ( అక్కౌంట్స్ అండ్ ట్యాక్సేషన్) గ్రూపు ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రాసింది. ఇప్పటికే 6,620 మీటర్ల ఎత్తయిన రినాక్ పర్వతశిఖరాన్ని అధిరోహించింది. 8,848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్టు శిఖరాగ్రాన చేరుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. తల్లిదండ్రులు సంజీవరావు, కృష్ణవేణిలు కొండపోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుంటారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం వారిది. అన్నయ్య గణపతి పదో తరగతి వరకు చదివి డ్రాపౌట్ అయ్యాడు. మరో అన్నయ్య సంతోష్ సీతంపేటలో ఐటీఐ చేస్తున్నాడు. ప్రాథమిక విద్యాబ్యాసం స్వగ్రామంలో పూర్తి చేసి, ఐదు నుంచి పదోతరగతి వరకు హడ్డుబంగి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ సీతంపేట బాలికల కళాశాలలో చేరింది. గురుకుల సొసైటీ ఇచ్చిన పర్వతారోహణ శిక్షణ అందిపుచ్చుకుంది. -
‘కిలిమంజారో’పై తెలుగు కుర్రాడు
సాక్షి, గద్వాల: ఆఫ్రికా ఖండంలోని ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని గద్వాలకు చెందిన ఆడెం కిశోర్‌కుమార్ అధిరోహించాడు. 5,895 మీటర్ల ఎత్తు గల కిలిమంజారో పర్వతాన్ని డిసెంబర్ 25న అధిరోహించి అక్కడ జాతీయ జెండాను ఎగురవేశాడు. పర్యావరణ పరిరక్షణ, మానవ రవాణా, ఉగ్రవాదం రూపుమాపాలనే అంశాలతో తాను రూపొందించిన జెండాను శిఖరంపై ఎగురవేసినట్లు ఆ యువకుడు పేర్కొన్నాడు. హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ చదువుతున్న కిశోర్ ఒకటిన్నరేళ్లు పర్వతారోహణలో శిక్షణ పొందాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పి భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటడమే తన లక్ష్యమని తెలిపాడు. -
ఎవరెస్ట్ ఎత్తు ఎంతో తెలుసా?
కఠ్మాండు: భూతాపోన్నతి కారణంగా మంచు కరిగి హిమాలయాల ఎత్తులో మార్పు వచ్చిందా? నేపాల్‌లో 2015లో వచ్చిన పెను భూకంపం వల్ల కొండలు కుంచించుకుపోయాయా? భూమి పొరలు కదలడం వల్ల ఎత్తు మరింత పెరిగిందా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది. ప్రపంచంలోనే ఎల్తైన హిమాలయాలను కొలిపించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిసారి హిమాలయాలను 1856లో కొలిచారు. బ్రిటీష్ సర్వేయర్ సర్ జార్జ్ ఎవరెస్ట్ బందం దీన్ని కొలచి సముద్ర మట్టానికి 8,840 మీటర్ల ఎత్తున ఉందని తేల్చింది. ఆయన పేరుతోనే హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత 1955లో రెండోసారి కొలచి హిమాలయాల ఎత్తును 8,848 మీటర్లుగా తేల్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఎత్తును ప్రమాణంగా తీసుకుంటున్నారు. కాలక్రమంలో హిమాలయాల ఎత్తులో మార్పు వచ్చినట్లు మూడు శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయని, అందుకని ఎత్తును కొలవాల్సిన బాధ్యత నెపాల్కుందని నేపాల్ సర్వే విభాగం డైరెక్టర్ గణేష్ ప్రసాద్ భట్టా తెలిపారు. ఈ సర్వేకు దాదాపు 15 లక్షల డాలర్లు ఖర్చవతాయన్నది ఓ అంచనా. నేపాల్‌లోని ఉదయపూర్ జిల్లాలో సముద్ర మట్టానికి దాదాపు 1500 మీటర్ల ఎత్తులో కొంతమంది సర్వేయర్లు ఎవరెస్ట్‌ను కొలవడం మొదలు పెట్టారని నేపాల్ అధికారులు తెలిపారు. ప్రతి రెండు కిలీమీటర్లకు ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఒక్క మిల్లీమీటరు కూడా వదలకుండా కొలుస్తామని వారు చెప్పారు. జూలై మధ్యలో అధికారికంగా కొలిచే కార్యక్రమం మొదలవుతుందని, ఆగస్టు నాటికి ఊపందుకుంటుందని, దాదాపు 50 మంది సర్వేయర్లు పాల్గొంటారని వారు వివరించారు. జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అమెరికా జాతీయ జియోగ్రఫిక్ సొసైటీ 1999లో ఎవరెస్ట్ ఎత్తును కొలచి 8,850 మీటర్లని తేల్చింది. అయితే సంప్రదాయక పద్ధతుల్లో ఎత్తును కొలవలేదన్న కారణంగా దాన్ని గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం తిరస్కరించింది. 2005లో చైనా బందం సర్వే జరిపి 8,844 మీటర్లని తేల్చింది. దాన్ని కూడా గుర్తించేందుకు నేపాల్ తిరస్కరించింది. ఎవరెస్ట్ శిఖరం అధికారికంగా నేపాల్ భూభాగంలో ఉన్న విషయం తెల్సిందే. -
సత్తా చూపుతా.. సాయం చేయరూ!
విలువిద్యలో ప్రావీణ్యం ఉంది ప్రోత్సహించండి ఎవరెస్ట్ అధిరోహకుడు కుంజా దుర్గారావు వీఆర్‌పురం : తనకు తగిన ప్రోత్సాహం అందిస్తే విలువిద్య(ఆర్చరీ)లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపిస్తానని ఎవరెస్ట్ అధిరోహకుడు కుంజా దుర్గారావు అన్నాడు. రేఖపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం దుర్గారావు మాట్లాడుతూ విలువిద్యలో తనకు ప్రావీణ్యం ఉందని, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో, ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు తగిన సాధన చేయాల్సి ఉందన్నాడు. సాధనకు అవసరమైన పరికరాలకు సుమారు రూ.మూడు లక్షలకు పైగా ఖర్చవుతుందని తెలిపాడు. ప్రభుత్వంగానీ, దాతలు గానీ తన ఆశయ సాధనకు ఆర్థిక సహకారం అందించాలని కోరాడు. అనంతరం తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్‌కు వినతి పత్రం ఇచ్చాడు. దుర్గారావును తహసీల్దార్ అభినందించారు. దుర్గారావు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పూనెం సత్యనారాయణ, సోయం చినబాబు తదితరులు ఉన్నారు. -
ఎవరెస్ట్‌పై తెలుగు తేజం
రెండోసారి అధిరోహించిన నీరుడి ప్రవీణ్ నారాయణఖేడ్: ఎవరెస్ట్ శిఖరాన్ని రెండోసారి అధిరోహించి తెలుగు కీర్తిపతాకాన్ని ఇనుమ డింపజేశాడు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన నీరుడి ప్రవీణ్‌కుమార్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. తొమ్మిది మంది బృందం సభ్యులు గత నెల 21న న్యూఢిల్లీ నుంచి బయలుదేరారు. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి పార్క్ దగ్గరలోని 6,180 మీటర్ల శిఖరాన్ని అధిరోహించారు. అయితే, 9 మంది సభ్యుల్లో ఐదుగురు మాత్రమే ఎవరెస్ట్‌ను ఎక్కారు. ఇందులో ప్రవీణ్ కుమార్‌తోపాటు అఖిలేశ్, తిరుపతి, తుకారాం, రంగారావు ఉన్నారు. శిఖరాన్ని అధిరోహించిన అనంతరం వీరు జాతీయ జెండాను ఎగురవేశారు. ఎవరెస్ట్ శిఖరారోహణకు ఆర్థిక సహాయం అందజేసిన వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, సత్యసాయిసేవా సమితి జెండాలను సైతం ఆవిష్కరించారు. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రవీణ్ 5,186 మీటర్ల ఎల్తైన శిఖరాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే. -
ఆక్సిజన్ లేకుండా ఎవరెస్టు పైకి..
కఠ్మాండు: ఎవరెస్టు అధిరోహణలో అరుదైన అద్భుతం ఆవిష్కృతమైంది. భారత ఆర్మీకి చెందిన నలుగురు సభ్యులు ఆక్సిజన్ సిలిం డర్లను వినియోగించకుండా విజయవంతంగా ఎవరెస్టును అధిరోహించారు. ఆక్సిజన్ సిలిం డర్లను వినియోగించకుండా ఎవరెస్టును అధిరో హించిన తొలి బృందంగా చరిత్రను సృష్టించారు. ఎవరెస్టును అధిరోహించిన బృందంలో కున్‌చోక్ టెండా, కెల్సాంగ్ డోర్జీ భూటియా, కాల్డెన్ పంజ ర్, సోనమ్ ఫంత్సోక్‌లు ఉన్నారు. మొత్తం 14 మంది సభ్యులుగల బృందంలో ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన వారు ఈ నలుగురు కాగా, మిగిలిన వారిలో అర్జీన్ తోప్‌గే, గ్వాంగ్ గెల్‌క్, కర్మ జోపాలు ఆక్సిజన్ సిలిండర్లను విని యోగిస్తూ ఎవరెస్టును అధిరోహించగలిగారు. -
టార్గెట్ ఎవరెస్ట్
మారధాన్‌తో 31 జిల్లాల్లో పర్యటన అభినందించిన పలు రాజకీయ నాయకులు పటాన్చెరు : ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడమే తన లక్ష్యమని సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతానికి చెందిన కోర నిఖితాయాదవ్ తెలిపింది. అసాధ్యమైన లక్ష్యాలు సుసాధ్యం చేసి బాలికల్లో రోల్ మోడల్‌గా నిలవాలని ఈ సాహసం చేపట్టినట్టు చెప్పింది . తెలంగాణలోని 31 జిల్లాల్లో పర్యటించి బాలికల్లో ఆత్మస్తెర్యం నిపేందుకు ప్రయత్నిస్తున్న ఆమె.. ఇప్పటికి 29 జిల్లాల్లో పర్యటన ముగించుకుని మంగళవారం 30 వ జిల్లా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చేరుకుంది. దీంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి దండు విక్రమ్ యాదవ్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చక్రీ, నిరంజన్లు నిఖితా యాదవ్‌ను కలసి సన్మానం చేసి తన లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిఖితా యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను హైదరాబాద్‌లోని కస్తూర్భాగాంధీ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రధమ సంవత్సరం పూర్తి చేశానని, కుటుంబ పెద్దలు యాదవ సంఘాల సహకారంతో ఆడపిల్లల్లో ఆత్మస్ధెర్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నానని చెప్పింది. ఆడపిల్ల అబలకాదు సబల అని నిరూపిస్తానని తెలిపింది. ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెప్పింది. ప్రస్తుతం మారధాన్‌తో 31 జిల్లాల్లో పర్యటించాలని లక్ష్యంగా పెట్టూకున్నానని, ఏప్రిల్ 27న ప్రారంభమైన మారధాన్‌తో ఇప్పటి వరకు 30 జిల్లాలో పర్యటనలో 1990 కిలోమీటర్ల పూర్తి చేసుకున్నాని వివరించింది. జూన్ 2 నాటికి హైదరాబాద్‌కు చేరుకొని అక్కడ నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటానని నికిత తెలిపింది. కాగ చిన్న వయస్సులోనే ఉన్నత లక్షాఅ్యలు నిర్దేశించుకని ఆ దిశగా పయనిస్తున్న నిఖితను వైఎస్సార్సీపీ నాయకులు అభినందించారు. నిఖిత యాదవ్‌కు స్వాగతం పలికిన యాదవ సంఘం నాయకులు ఆర్. కుమార్ యాదవ్, ఆర్.సంతోష్ యాదవ్, దండు విక్రమ్ యాదవ్‌లను కృతజ్ఞతలు తెలిపింది. -
టార్గెట్ ఎవరెస్ట్
► తొమ్మిదేళ్ల విశాఖ చిన్నారి అరుదైన ఘనత ► తల్లితో కలసి ఎవరెస్టు బేస్ క్యాంపునకు చేరుకున్న కామ్య కార్తికేయన్ సాక్షి, విశాఖపట్నం: సంకల్ప బలం ముందు శిఖరాలు సైతం తలొంచాల్సిం దేనని తొమ్మిదేళ్ల చిన్నారి నిరూపించింది. విశాఖకు చెందిన కామ్య కార్తికేయన్ రోజుకు 9 గంటల పాటు నడిచి.. 9 రోజుల్లోనే ఎవరెస్టు బేస్ క్యాంప్‌నకు(18,000 అడుగులు) చేరు కుంది. తద్వారా ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో బాలికగా రికార్డు సృష్టించింది. బాలిక తండ్రి కార్తికేయన్ తూర్పు నావికాదళ అధికారి, తల్లి లావణ్య ఉపాధ్యాయురాలు. కామ్య కార్తికేయన్ ప్రస్తుతం నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో ఆరో తరగతి చదువు తోంది. చిన్నప్పట్నుంచీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పర్వతా రోహణలో మెళకువలు నేర్చుకున్న కామ్య మూడేళ్ల వయసులోనే సహ్యాద్రి కొండలు ఎక్కేసింది. 2015లో ఒకసా రి, 2016లో 3సార్లు హిమాలయాల్లో భాగమైన చంద్రశిల (13 వేల అడుగు లు), హర్కిధమ్ (13,500 అడుగులు), రూప్ ఖండ్ లేక్ (16,499 అడుగులు)ను అధిరోహిం చింది. ఇప్పుడు ఏకంగా ఎవ రెస్ట్ బేస్ క్యాంప్‌పై త్రివర ్ణ పతాకాన్ని ఎగురవేసింది. దేశంలో ఇంత చిన్న వయ సులో ఎవరూ ఈ ఘనతను సాధించలేదు. దీంతో జాతీ య రికార్డు కూడా కామ్య సొంతమైంది. సవాళ్లు ఎదుర్కోవడం నేర్పాలి కామ్య తల్లి లావణ్య ‘సాక్షి’ తో మాట్లాడుతూ.. ‘మా ప్రయాణం నేపాల్‌లోని లుక్లా నుంచి ప్రారంభమైంది. రోజుకు 9 గంటలు నడవాలని నిర్ణయించుకున్నాం. పిల్లలకు సవాళ్లను ఎదుర్కోవడం చిన్నప్పట్నుంచే నేర్పాలనే ఉద్దేశంతో కష్టమైనా తనకి నచ్చిన మార్గంలో ప్రోత్స హిస్తున్నాం..’ అని చెప్పారు. నా తండ్రి కలను సాధిస్తా.. కామ్య మాట్లాడుతూ.. ‘ఎవరెస్ట్ ఎక్కాలనేది నా తండ్రి కల. దానిని నేను సాధించాలనుకుంటున్నాను. ఇప్పటివరకు 18వేల అడుగులకు చేరుకున్నా ను. ఇకపై ఎక్కాలంటే దానికి ప్రత్యేక శిక్షణ అవసరం. 14 ఏళ్లు పూర్తయితేనే ఎవరెస్ట్ ఎక్కేందుకు అనుమతిస్తారు. అర్హత సాధించగానే ఎవరెస్ట్‌పై కాలుపెడతాను..’ అని పేర్కొంది. -
ఎవరెస్టును అధిరోహించిన తెలుగు తేజాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన మరో నలుగురు విద్యార్థులు ఎవరెస్టును అధిరోహించారు. సాహస క్రీడల్లో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎవరెస్టును అధిరోహించేందుకు ప్రభుత్వం 19 మందిని ఎంపిక చేసింది. అందులో 13 మంది నాలుగు రోజుల క్రితం ఎవరెస్టు ఎక్కగా.. తాజాగా విజయనగరం జిల్లా భద్రగిరిలో ని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న బొడ్ల సాగర్, శ్రీశైలంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న శీలం ఈశ్వరయ్య, యువ జన సంక్షేమ విభాగం నుంచి ధర్మతేజ, చెన్నారావు ఈ ఘనత సాధించారు. -
ఎవరెస్ట్ పైకి.. ఎనిమిదో సారి
నేపాల్ మహిళ సరికొత్త రికార్డు కట్మాండు: నేపాల్‌కు చెందిన 44 ఏళ్ల మహిళ మౌంట్ ఎవరెస్ట్‌ను 8వ సారి ఎక్కి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆ పర్వతాన్ని అధిక సార్లు ఎక్కిన మహిళగా నిలిచారు. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన లాక్పా షెర్పా...శనివారం ఉదయం మౌంట్ ఎవరెస్ట్‌ను విజయవంతంగా అధిరోహించా రని నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ నెల మధ్యలో టిబెట్ వైపు నుంచి ప్రయాణం సాగించిన లాక్పా, సహచరిణి నీమా డోర్జీ షెర్పాతో కలిసి విజయవంతంగా యాత్రను పూర్తిచేశారు. ఇంతటితో ఆగనని ఎవరెస్ట్‌ను పదిసార్లు ఎక్కడమే తన లక్ష్యమని ఆమె చెప్పారు. ఎలాంటి శిక్షణ లేకుండానే లాక్పా 2000లో తొలిసారి మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించారు. -
ఎవరెస్టుపై మెరిసిన మరో మన్యం వీరుడు
కుంజవారి గూడెం ఖ్యాతిని పెంచిన దుర్గారావు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండో గిరిజనుడు చింతూరు (రంపచోడవరం): ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి భారత పతాకాన్ని రెపరెపలాడించడంతో పాటు రాష్ట్రం, జిల్లా పేరును ఇనుమడింపజేశాడు కుంజా దుర్గారావు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రెండో పర్వతారోహకుడిగా పేరుగడించాడు. వీఆర్‌పురం మండలం కుంజవారిగూడెం గ్రామానికి చెందిన 18 ఏళ్ల కుంజా దుర్గారావు . శనివారం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. గిరిజన కుటుంబానికి చెందిన దుర్గారావు తండ్రి పిచ్చిరెడ్డి, తల్లి లచ్చమ్మ గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ, పూరిపాకలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. దుర్గారావుకు అన్న కల్యాణ్, ఇద్దరు సోదరిలు ఉన్నారు. తాము నిరక్షరాస్యులమైనా తమ బిడ్డల్ని పెద్ద చదువులు చదివించాలనే కుమారులిద్దర్నీ చదివిస్తున్నట్టు తండ్రి పిచ్చిరెడ్డి తెలిపాడు. కల్యాణ్ డిగ్రీ చదువుతుండగా దుర్గారావు మారేడుమిల్లి గురుకుల కళాశాలలో ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పాసయ్యాడు. క్రీడలంటే ప్రాణం మా ఇద్దరికీ క్రీడలంటే ఎంతో ప్రాణమని, ప్రధానంగా వాలీబాల్ ఆడేవారమని దుర్గారావు సోదరుడు కల్యాణ్ తెలిపాడు. క్రీడల పట్ల ఉన్న ఆసక్తే తన తమ్ముడిని పర్వతారోహణ వైపు ఆకర్షితుడిని చేసిందన్నాడు. ఎవరెస్టు అధిరోహించిన దూబి భద్రయ్యను ఆదర్శంగా తీసుకుని తాను కూడా ఎవరెస్టు అధిరోహించాలని ఆకాంక్షించాడని అతను తెలిపాడు. రంపచోడవరం ఐటీడీఏ సహకారంతో దూబి భద్రయ్య శిక్షణలో గతేడాది డిసెంబర్లో దుర్గారావు రెనాక్ పర్వతం అధిరోహించాడని అదేనెలలో చింతూరులో శిక్షణా కార్యక్రమం జరిగిందని తెలిపాడు. అనంతరం జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ పర్వతాన్ని అధిరోహించాడని కల్యాణ్ తెలిపాడు. అందులో ప్రతిభ కనబరచిన దుర్గారావుతో సహా ఆరుగురు శనివారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారని వివరించాడు. 45 రోజుల్లో అధిరోహించాల్సిన శిఖరాన్ని కేవలం 30 రోజుల్లోనే అధిరోహించి వారు రికార్డు సృష్టించారని కళ్యాణ్ తెలిపాడు. చిన్నకొడుకు దుర్గారావు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాడనే ఆనందం ఒకవైపు పెద్దకొడుకు కళ్యాణ్ శుక్రవారం విడుదలైన కానిస్టేబుల్ సెలక్షన్లో ఎంపికయ్యాడనే ఆనందం వారి తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తమ వాడు ఎవరెస్ట్ అధిరోహించాడనే విషయం ఆదివారం ఉదయం తమకు తెలిసిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంటిల్లిపాదీ ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లా నుంచి రెండోవాడు గతంలో చింతూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దూబి భద్రయ్య మనజిల్లా నుంచి ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి గిరిజనుడిగా పేరు గడించాడు. దీంతో ఐటీడీఏ అతనిని రాష్ట్రంలోని గురుకుల కళాశాలల్లో చదువుతున్న యువతకు పర్వతారోహణలో శిక్షణ ఇచ్చే శిక్షకుడిగా నియమించింది. అతని శిక్షణలోనే కుంజా దుర్గారావు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండో యువకుడిగా గురువు పేరు నిలబెట్టాడు. పలువురి అభినందన దుర్గారావు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం పట్ల రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, చింతూరు ఐటీడీఏ పీఓ గుగ్గిలి చినబాబు అభినందనలు తెలియజేశారు. పంచాయతీ సర్పంచ్ రవ్వ సుజాత, గ్రామస్తులు కూడా దుర్గారావును అభినందించారు. ఎంతో ఆనందంగా వుంది నాబిడ్డ ఏదో కొండ ఎక్కాడని నా పెద్దకొడుకు చెప్పాడు. ఎవరెవరో వచ్చి అభినందనలు చెబుతున్నారు. ఎంతో ఆనందంగా వుంది. వాడిని ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను. -కుంజా లచ్చమ్మ, దుర్గారావు తల్లి -
ఎవరెస్ట్‌ను అధిరోహించిన గురుకులం విద్యార్థి
సి.బెళగల్: సి.బెళగల్‌లోని ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం (బైపీసీ) చదువుతున్న విద్యార్థి సురేష్‌బాబు ఎవరెస్ట్ అధిరోహించారు. గోనెగండ్లకు చెందిన కర్రెన్న, సువర్ణ దంపతుల కుమారుడైన ఈ విద్యార్థి శనివారం తెల్లవారుజామున 5–48 గంటలకు ఎవరెస్ట్ ఎక్కినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ మనోహరరావు తెలిపారు. ఈ సమాచారం గురకులం సంస్థ కార్యదర్శి, కల్నల్ రాములు ఫోన్లో తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు. ఎవరెస్ట్ అధిరోహణకు రాష్ట్రం తరపున 16 మంది విద్యార్థులను 2016 ఆగష్టున అధికారులు ఎంపికచేయగా పాఠశాలకు చెందిన సురేష్ బాబు అందులో ఒకరన్నారు. ఆత్మవిశ్వాసంతో తమ విద్యార్థి శిఖరం అధిరోహించి కళాశాలకు పేరు తీసుకొచ్చారని శనివారం విలేకరుల సమావేశంలో సంతోషం వ్యక్తం చేశారు. చదువులోనూ ఈ విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని 1000కి 882 మార్కులు సాధించారని వెల్లడించారు. అనంతరం సురేష్‌బాబు శిక్షణ విశేషాలను వెల్లడించారు. -
అత్యంత ఎత్తైన ప్రాంతంలో డీజే
కఠ్మాండు: సముద్ర మట్టానికి 5,380 అడుగుల ఎత్తులో బ్రిటన్‌కు చెందిన డీజే పాల్ ఓకెన్‌ఫోల్డ్ ప్రదర్శన ఇవ్వనున్నాడు. అదెక్కడా అనే కదా మీ సందేహం. అదే ఎవరెస్టు బేస్ క్యాంపు. ఈ ప్రదర్శనకు ‘హయ్యెస్ట్ పార్టీ ఆన్ ది ఎర్త్’ అని నామకరణం చేశారు. మంగళవారం ఉదయం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఫోల్డ్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతశ్రేణి వద్ద ఈ ప్రదర్శన జరగనుండడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందన్నాడు. ట్రెక్కింగ్ విషయంలో తనకు ఎంతమాత్రం అనుభవం లేదని 53 ఏళ్ల ఈ డీజే చెప్పాడు. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందన్నాడు. ఇక్కడ గాలి అత్యంత పలచగా ఉందని, శ్వాస తీసుకోవడం ఒక్కోసారి కష్టం కూడా కావొచ్చని ఓకెన్‌ఫోల్డ్ వెంట వచ్చిన నేపాల్‌కు చెందిన మరో డీజే రంజీన్ ఝా చెప్పాడు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని అందరి దృష్టికి తీసుకుపోవాలనే లక్ష్యసాధనలో భాగంగానే ఇక్కడ కార్యక్రమం నిర్వహించతలపెట్టామని, ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మొత్తాన్ని చారిటీలకు అందజేస్తామని పేర్కొన్నాడు. మరోవైపు ఎవరెస్టు వద్ద ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు. హిమాలయాల ప్రశాంతతకు ఇది భంగం కలిగిస్తుందనేది వారి ఆరోపణ. -
మన హీరో ‘పూర్ణ’
► నేడు సినిమా విడుదల ► ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థుల బయోపిక్ ► స్వేరోస్కమిటీ అభినందన ఆదిలాబాద్: అతిపిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరం అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లపై వస్తున్న బయోపిక్ సినిమాలో ఆదిలాబాద్ వాసి మనోజ్ హీరోగా నటిస్తున్నాడు. ‘పూర్ణ’ అనే టైటిల్‌తో బాలీవుడ్ డైరెక్టర్ రాహుల్‌బోస్ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 31న దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మనోజ్ ఆనంద్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఆదిలాబాద్‌లో మనోజ్‌ను స్వేరోస్ కమిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సుంకరి రమేశ్, ప్రధాన కార్యదర్శి ఊశన్న, సభ్యులు పొచ్చన్న, కుశల్, అడెల్లు, రాజ్‌కుమార్ అభినందించా రు. నిజామాబాద్‌కు చెందిన పూర్ణమాలవత్, ఖమ్మంకు చెందిన ఆనంద్‌లు 13 ఏళ్ల వయసులో ఎవరెస్టు శిఖరం అధిరోహించి గు రుకులాల పేరు నిలబెట్టారు. వారిపై తీస్తున్న సినిమాలో ఆనంద్ క్యారెక్టర్లో నటిస్తున్న మనోజ్‌కుమార్ సైతం గురుకులాల్లో చదివాడు. పూర్ణ క్యారెక్టర్లో హైదరాబాద్‌కు చెంది న ఆదితి ఇందల్ నటిస్తోంది. పూర్ణ సినిమా కోసం వంద మందిని ఎంపిక చేయగా అందులో చివరికి వరంగల్‌లో ఇంటర్మీడియెట్ చదువుతున్న మనోజ్‌ను అవకాశం దక్కింది. -
రాధిక.. ఎదురులేదిక!
⇒ ఆస్ట్రేలియాలో ‘ఆస్సీ 10 పీక్ చాలెంజ్’ పూర్తి ⇒ రెండు రోజుల్లో పది పర్వతాల అధిరోహణ ⇒ ఈ ఘనత సాధించిన తొలి పోలీసు అధికారిగా రికార్డు సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేట పోలీసు ట్రైనింగ్ కాలేజీ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న జీఆర్ రాధిక అరుదైన రికార్డు సృష్టించారు. శుక్ర, శనివారాల్లో ఆస్ట్రేలియాలో ‘ఆస్సీ 10 పీక్ చాలెంజ్’ పూర్తి చేశారు. దేశంలో ఈ రికార్డు సాధించిన తొలి పోలీసు అధికారి రాధిక కావడం గమనార్హం. ఆ దేశంలో ఉన్న 10 ఎల్తైన పర్వత శ్రేణుల్ని ఏకబిగిన అధిరోహించడాన్ని ‘ఆస్సీ 10 పీక్ చాలెంజ్’ అంటారు. శుక్రవారం ఆరు పర్వతాల్ని అధిరోహించిన రాధిక శనివారం మరో నాలుగింటిని ఎక్కారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మౌంట్ కొసిఉజ్కో అధిరోహించడంతో ఈ చాలెంజ్ పూర్తయింది. 2015లో మౌంట్ కున్ ఎక్కిన రాధిక ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. గత ఏడాది మేలో ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి మహిళా పోలీసు అధికారిణిగా రికార్డుల్లోకి ఎక్కారు. గత ఏడాది ఆగస్టులో టాంజానియాలో ఉన్న మౌంట్ కిలిమంజారో ఎక్కారు. ఇప్పుడు 2 రోజుల్లో ఆస్ట్రేలియాలో ఉన్న 10 పర్వతాలను అధిరోహించి మరో రికార్డు సృష్టించారు. -
ఎవరెస్టు అధిరోహణకు ఎంపిక
జూపాడుబంగ్లా: ఎవరెస్టు శిఖరాధిరోహణకు జూపాడుబంగ్లా గురుకుల పాఠశాల విద్యార్థి సుందర్రాజ్ ఎంపికయ్యాడు. సి.బెళగల్ మండలం, కొండాపురం గ్రామానికి చెందిన రాజశేఖర్, సుశీలమ్మ ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన సుందర్రాజ్ 10వరకు అరికెర గురుకుల పాఠశాలలో చదివాడు. ప్రస్తుతం జూపాడుబంగ్లా గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ విద్యార్థికి ఎవరెస్టు ఎక్కేందుకు అవకాశం దక్కింది. అందులో భాగంగా లడక్‌లో పదిరోజుల ట్రైనింగ్ పూర్తి చేసుకుని మంగళవారం కళాశాలకు తిరిగొచ్చాడు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ హేమచంద్ర, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు సుందర్రాజును ప్రత్యేకంగా అభినందించారు. ఎవరెస్ట్ ఎక్కేస్తా శ్రీశైలం ప్రాజెక్టు: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే తన ముందున్న లక్ష్యమని లడక్‌లో 10 రోజుల ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ చదువుతున్న శీలం ఈశ్వరయ్య చెబుతున్నాడు. చెంచు మల్లయ్య, ఈదమ్మల ఆరవ సంతానమైన ఈ విద్యార్తి స్వగ్రామం గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శిలువకొండ గ్రామం. 10వ తరగతి వరకు నాగార్జునసాగర్‌లో విద్యను అభ్యసించి ఇంటర్ శ్రీశైలం ప్రాజెక్టులోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ట్రైబల్ వెలే్ఫర్, సోషల్ వెల్పెర్ సొసైటీలు గతంలో 69 మందిని పర్వతారోహణ ట్రైనింగ్‌కు సెలెక్ట్ చేశారు. చేతన కొండ సీబీఆర్ అకాడమిలో జరిగిన ఫిట్నెస్ ట్రైనింగ్‌లో 34 మంది నిలుదొక్కుకున్నారు. వెస్ట్‌బెంగాల్‌లోని హిమాలయ పర్వత ప్రాంతాలో్ల డార్జిలింగ్ బేష్లో 34 మంది వారం రోజుల పాటు 70వేల అడుగుల ఎత్తును అధిరోహించి ట్రైబల్ సొసైటీ జెండాను ఎగుర వేశారు. ఆ ట్రైనింగ్‌లో ప్రతిభ కనబర్చిన ఈశ్వరయ్యకు గోల్డ్ మెడల్ దక్కింది. కోచ్ భద్రయ్య నేర్పిన మెలకువలతో గత జనవరి 21వ తేదీ నుంచి నెలాఖరు వరకు మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో 10 రోజుల పాటు 5 వేల 18 అడుగుల స్టోక్లా శిఖరాన్ని ఎక్కారు. బృందంలో 12 మంది విద్యార్థులు ఉండగా, వారిలో ఈశ్వరయ్య తన అసమాన ప్రతిభను కనబరుస్తూ వస్తున్నాడు.దీంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ఈ విద్యార్థికి త్వరలో పిలుపురానుంది. గతంలో సొసైటీ తరపున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆనంద్, పూర్ణలే తనకు స్ఫూర్తి అని ఈశ్వరయ్య ‘సాక్షి’తో చెప్పారు. ఈశ్వరయ్యకు అభినందనల వెల్లువ లడక్‌లో 10 రోజుల ట్రైనింగ్‌ను పూర్తి చేసుకుని మంగళవారం సున్నిపెంటకు చేరుకున్న ఈశ్వరయ్యను పలువురు అభినందనలతో ముంచెత్తారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ ఇస్మాయిల్, పీఈడీ శౌరిరాజు, హౌస్‌మాస్టర్ జాన్మెషయ్య తదితరులు సత్కరించారు. -
ఎవరెస్టు.. చిన్నబోయేటట్టు..
ఎవరెస్టు ఎత్తుతో పోలిస్తే దీని ఎత్తు 300 రెట్లు ఎక్కువ.. పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసేశారు. చలామణిలో ఉన్న కరెన్సీ విలువలో ఇది 86 శాతం.. అంటే 2,203 కోట్ల నోట్లు.. మీకో విషయం తెలుసా? ఈ కరెన్సీ కొండ ముందు ఎవరెస్టు కూడా చిన్నబోవాల్సిందే. ఎందుకంటే.. ఈ నోట్లను ఒకదానిపై ఒకటి పెడితే.. ఎవరెస్టు ఎత్తుకు 300 రెట్లు ఎక్కువుంటుందట. ఒకదాని పక్కన ఒకటి రోడ్డులా పరిస్తే.. చంద్రుడి వద్దకు ఐదుసార్లు వెళ్లిరావచ్చట. అసలు రద్దయిన నోట్లను ఆర్బీఐ ఏం చేస్తుంది? విభజించు.. 2001 వరకూ వాటిని తగులబెట్టేవారు. తర్వాత నుంచి పర్యావరణ అనుకూల విధానాలను అనుసరిస్తున్నారు. 2003 నుంచి రద్దయిన, పాడైపోయిన నోట్లను వేగంగా ప్రాసెస్ చేయడానికి కరెన్సీ వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్లను (సీవీపీఎస్) పెట్టారు. అప్పటి గవర్నర్ బిమల్ జలాన్ హయాంలో ఇవి వచ్చాయి. ఒక్కో సీవీపీఎస్ గంటకు 60 వేల నోట్లను ప్రాసెస్ చేస్తుంది. బాగున్న నోట్లను జాగ్రత్తగా కట్ చేసి.. వాటిని కొత్త కరెన్సీ పేపర్ తయారీలో వాడతారు. విక్రయించు.. బాగోలేని, పనికిరాని నోట్లను కంప్రెస్ చేసి.. ఇటుకలుగా, బ్లాకులుగా మారుస్తారు. వీటిని పారిశ్రామిక అవసరాల నిమిత్తం విక్రయిస్తారు. ఇందుకోసం ఆర్బీఐ టెండర్లను పిలుస్తుంది. కిలో రూ.5–6 మధ్య విక్రయిస్తారు. వీటిని కొన్ని కంపెనీలు ఫర్నేస్‌లను మండించడానికి వాడతాయి. మరికొన్ని సాఫ్ట్ బోర్డుల తయారీకి వినియోగిస్తాయి. అంతేకాదు.. క్యాలెండర్లు, ఫైళ్లు, సావనీర్లు, పేపర్ వెయిట్లుగా వీటిని మారుస్తారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
‘మిషన్ ఎవరెస్ట్’కు ఆహ్వానం
–ప్రభుత్వ ఖర్చుతో ఎవరెస్ట్ అధిరోహణ అవకాశం – ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం –సెట్కూరు మేనేజర్ పీవీ రమణ కర్నూలు(హాస్పిటల్): ప్రపంచంలోనే ఎల్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనుకునే ఔత్సాహికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 'మిషన్ ఎవరెస్ట్' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా యువజన సంక్షేమ శాఖ(సెట్కూరు) మేనేజర్ పీవీ రమణ చెప్పారు. ఈ మేరకు ఈ నెల 28వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నెం.300ను జారీ చేసిందని తెలిపారు. సోమవారం ఆయన సెట్కూరు కార్యాలయంలో ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా.. ఎవరెస్ట్‌ను అధిరోహించడం కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి 10 మంది చొప్పున ఔత్సాహిక నిరుపేద యువతీయువకులను ఎంపిక చేస్తారు. సంవత్సరాదాయం గ్రామీణ ప్రాంతాల వారైతే ఏడాదికి రూ.81వేలు, పట్టణ ప్రాంతాల వారైతే రూ.1,03,000లు ఉండాలి. ఎంపికకు జిల్లా స్థాయి కమిటీలో చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, కన్వీనర్‌గా యువజన సర్వీసుల శాఖ అధికారి, సభ్యులుగా శిఖరాలను అధిరోహించడంలో శిక్షణ ఇచ్చే సంస్థల నిర్వాహకులు, క్రీడల అధికారి, వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన 130 మంది యువతకు ఐదురోజుల పాటు విజయవాడ/వైజాగ్‌లలో శిక్షణ ఇచ్చి వీరిలో 20 మందిని ఎంపిక చేస్తారు. 20 మందిని భారత రక్షణ శాఖతో శిక్షణ ఇచ్చి అందులోంచి 9 మందిని ఎంపిక చేస్తారు. వారికి మరోసారి శిక్షణ ఇచ్చి, శారీరక, మానసిక దారుఢ్యపరీక్షల కోసం హిమాలయ పర్వతాలకు తీసుకెళ్లి అక్కడ పర్వతాలు అధిరోహించడంలో అనుభవం ఉన్న లెఫ్ట్‌నెంట్ కల్నల్ స్థాయి అధికారిచే శిక్షణ ఇప్పిస్తారు. 9 మందిలో నుంచి చివరకు 5 మందిని ఎంపిక చేసి రెండు నెలల పాటు ఎత్తైన ప్రదేశాలలు ఎక్కడంలో శిక్షణ ఇస్తారు. వీరికి 2017 ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిస్తారు. వివరాలకు కల్లూరు ఎస్టేట్‌లోని సెట్కూరు కార్యాలయం, 08518–229146ను సంప్రదించవచ్చు. -
ఇంతకీ ఎవరెస్ట్ ఎక్కారా లేదా?
పర్వతారోహణ అంత సులభం కాదు. అందులోనూ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం అంటే అతి పెద్ద విజయమే. తాము అలాంటి విజయాన్ని సాధించామంటూ పుణెకు చెందిన ఓ పోలీసు జంట అందరినీ మోసం చేసిందని ఫిర్యాదు వచ్చింది. మే 23వ తేదీన తాము ఎవరెస్ట్ ఎక్కామంటూ మార్ఫింగ్ చేసిన ఫొటోలను ప్రదర్శించారు. దీనిపై విచారించి, వాస్తవాలను బయటపెట్టాలని ఒక నిజనిర్ధారణ కమిటీని నగర పోలీసు కమిషనర్ రశ్మి శుక్లా ఆదేశించారు. దినేష్ రాథోడ్, తారకేశ్వరి అనే ఇద్దరు కానిస్టేబుళ్లు భార్యభర్తలు. వీళ్లు ఎవరెస్ట్ ఎక్కినట్లు ఫొటోలు మార్ఫింగ్ చేసి చూపించారని పుణెకు చెందిన కొంతమంది పర్వతారోహకులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్తున్నామంటూ రాథోడ్ దంపతులు ఏప్రిల్‌లో బయల్దేరారు. జూన్ 5వ తేదీన ఖట్మాండులో ప్రెస్‌మీట్ పెట్టి, మే 23న తాము ఎవరెస్ట్ ఎక్కామని చెప్పారు. అయితే, దీనిపై ఫిర్యాదులు రావడంతో నగరానికి చెందిన శరద్ కులకర్ణి, అంజలి కులకర్ణి, ఆనంద్ బాన్సోడ్, శ్రీకాంత్ చవాన్ తదితర పర్వతారోహకుల నుంచి పోలీసులు వివరాలు తీసుకున్నారు. పది రోజుల క్రితం రాథోడ్ దంపతులు పుణెకు తిరిగొచ్చారని, కానీ వాళ్లు ఇంతవరకు తమను కలవలేదని జాయింట్ పోలీసు కమిషనర్ సునీల్ రామానంద్ తెలిపారు. వాళ్లు నిజంగా ఎవరెస్ట్ ఎక్కారా లేదా అనే విషయం తెలుసుకోడానికి నేపాల్ ప్రభుత్వం నుంచి కూడా సాయం తీసుకుంటామన్నారు. దీనిపై విచారణ జరుగుతున్నందున ఇప్పుడు తాము ఏం చెప్పడం బాగోదని, విచారణలోనే అన్ని విషయాలూ వెల్లడిస్తానని తారకేశ్వరి రాథోడ్ అన్నారు. ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు తమ ముందు ఎవరున్నారు, వెనక ఎవరున్నారనే విషయం పర్వతారోహకులందరికీ తెలుస్తుందని, కానీ వీళ్లు మే 23న ఎక్కామని చెబుతూ జూన్ 5వ తేదీ వరకు ఆ విషయం ఎందుకు వెల్లడించలేదని గత 40 ఏళ్లుగా ఇదే రంగంలో ఉన్న ఉమేష్ జిర్పే అనే పర్వతారోహకుడు ప్రశ్నించారు. వాళ్లు మూడు ఫొటోలు చూపిస్తే, మూడింటిలోనూ బూట్లు వేర్వేరుగా ఉన్నాయని.. ఎవరెస్ట్ మీద దుస్తులు గానీ, బూట్లు గానీ మార్చుకోవడం అసాధ్యమని, అలా చేస్తే ఫ్రాస్ట్ బైట్ తప్పదని తెలిపారు. అయితే.. నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్‌ను అధిరోహించినట్లు తమకు ఇచ్చిన సర్టిఫికెట్తో పాటు ఇతర ఆధారాలను విచారణ అధికారులకు ఇచ్చామని కానిస్టేబుల్ దినేష్ రాథోడ్ తెలిపాడు. కొందరు వ్యక్తులు తమ గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని.. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించాడు. విచారణ పూర్తయితే గానీ ఈ జంట ఎవరెస్ట్ ఎక్కిందీ.. లేనిది తేలేలా లేదు. -
సెల్ లేదు... విల్ ఉంది...
స్ఫూర్తి ఆ ఊర్లో ఉండే కుటుంబాల సంఖ్య 150కి మించ దు. కరెంటొచ్చి ఆరేళ్లయింది. ఇప్పటికీ సెల్ఫోన్లో కబుర్లు చెప్పుకునే చాన్స్ లేదు. ఎందుకంటే 50 కి.మీ దూరం వెళితేగాని సిగ్నల్స్ లేవు మరి. ఇంతగా వెనుకబడిన మారుమూల గ్రామానికి చెందిన యువకుడు ఊర్లో లేని సౌకర్యాల గురించి తిట్టుకుంటూ కూర్చోలేదు. అనితర సాధ్యమైన ఆత్మవిశ్వాసంతో తమ చిన్న ఊరి ప్రతిష్టను కొండంత ఎత్తుకు తీసుకెళ్లారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన భద్రయ్య... తలచుకుంటే కొండలు సైతం తలవంచుతాయని నిరూపించారు. ‘‘రెండేళ్ల క్రితం భద్రాచలం యువకుడు ఆనంద్‌కుమార్ ఎవరెస్ట్ ఎక్కడంతో దీనిపై ఆసక్తి వచ్చింది. ఆయన దగ్గర నుంచే ఆ వివరాలను తెలుసుకున్నా’’నన్నారు ఎపి జెన్కోలో కాంట్రాక్ట్ ఉద్యోగి భద్రాచలం సమీపంలోని చింతూరు గ్రామవాసి భద్రయ్య. తూర్పుగోదావరిజిల్లా మోతుగూడెం విద్యుత్ కేంద్రంలో రోజుకు రూ.120 వేతనం అందుకునే కాంట్రాక్ట్ ఉద్యోగి దూబి భద్రయ్య... ఎవరెస్ట్ శిఖరాధిరోహణపై ఆసక్తి చూపడమే విశేషం. ఆసక్తినే అద్వితీయ శక్తిగా మలచుకుని కొండంత ఆశయాన్ని సాధించడం మరింత గొప్ప విశేషం. ఈ నేపథ్యంలో తన అనుభవాలను సాక్షికి ఇలా వివరించారాయన. క్రమశిక్షణతో...కఠోరశిక్షణ... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే ఆలోచన తర్వాత దీనికి సంబంధించి శిక్షణ కోసం ఈ సాహసయాత్రకు గత కొంతకాలంగా మార్గదర్శకత్వం చేస్తున్న శేఖర్‌బాబును కలిశాను. ఆయన నాకు అవసరమైన పరీక్షలన్నీ పూర్తి చేశారు. ఫిట్నెస్ను నిర్ధారించుకున్నారు. జులైలో నన్ను ఎంపిక చేశారు. అత్యంత శీతల వాతావరణాన్ని నా శరీరం తట్టుకుంటుందా లేదా అనే పరిశీలన కూడా చేశారు. అనంతరం సిక్కిం, హిమాలయాల్లో శిక్షణ. అది నవంబరు నెల వరకూ సాగింది. అదైపోయాక భువనగిరిలో సాంకేతిక అంశాలపై 3నెలల పాటు శిక్షణ ఇచ్చారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత చింతూరు ఆంధ్రప్రదేశ్‌లో కలవడం, నా గుర్తింపు కార్డులన్నీ తెలంగాణకు చెందినవి కావడంతో పాస్‌పోర్ట్ జారీలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇంత కష్టపడిందీ వృధా పోతుందేమో అని భయపడినా... జిల్లా కలెక్టర్, స్థానిక ఐటీడిఎ పిఓల సహకారంతో ఈ సమస్య పరిష్కారమైంది. సాహసయాత్రకు శ్రీకారం... అన్ని బాలారిష్టాలు అధిగమించాక... ఏప్రిల్7న సాహసయాత్రకు శ్రీకారం చుట్టాను. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి ఖాట్మండు అనంతరం సిసలైన కఠిన పరీక్షకు సిద్ధం అయ్యాను. గత ఏడాది తీవ్ర భూకంపం తర్వాత ఎవరెస్ట్‌కు వెళ్లే మార్గాలన్నీ దాదాపు మూసుకుపోయాయి. ఖాట్మండు నుంచి కొడారి వెళ్లే దారి సైతం దెబ్బతింది. నేపాల్ చైనాల మధ్య వంతెన పాడైపోయింది. దీంతో రోడ్డు మార్గం గుండా వెళ్లలేక విమానంలో లాసా వరకు వెళ్లాను. లాసా నుంచి ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకూ 800కి.మీ దూరం ఉంటుంది. నేరుగా వెళితే రెండ్రోజులు పడుతుంది. అక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు దేహం అనువుగా మారేందుకు ఈ దూరం ఉపకరిస్తుంది. అక్కడక్కడ ఆగుతూ లాసా నుంచి బేస్ క్యాంప్‌కు చేరడానికి 7 రోజులు పట్టింది. బేస్‌క్యాంప్ సముద్రమట్టానికి దాదాపు 5200కి.మీ ఎత్తులో ఉంటుంది. దీని తర్వాత 6400 కి.మీ ఎత్తులో మరో అడ్వాన్స్ బేస్ క్యాంప్ ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితం... అత్యంత ఎత్తులో ఆక్సిజన్ అందని పరిస్థితుల మధ్య పర్వతారోహణ సాగింది. శరీరంపై 15 కిలోల బరువుతో మైనస్ 40 డిగ్రీల టెంపరేచర్ గడ్డకట్టించేస్తుంటే, విపరీతమైన వేగంతో వీచే చలిగాలులు కోసేంత పదునుగా తాకుతుంటే ఇబ్బందుల్ని మొక్కవోని పట్టుదలతో అధిగమిస్తూ ముందడుగేశా. అడుగడుగునా ఆత్మవిశ్వాసానికి సవాళ్లు ఎదురవుతాయీ పర్వతారోహణలో. ఒక్కసారి కాలు జారితే కొన్ని వేల కిలోమీటర్ల దిగువకు పడిపోతాం. ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నం చేసి విఫలమైన వారి మృతదేహాలు అడుగుకొకటి కనపడుతూ ధైర్యానికి పరీక్ష పెట్టాయి. ఏదేమైతేనేం... సాధించాలి అనే పట్టుదల తప్ప మరే ఆలోచనను, భయాన్నీ దరిచేరనీయకుండా ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరాక... ముందుగా గుర్తొచ్చింది మా చిన్న ఊరు. ఒక మారుమూల ప్రాంతపు గిరిజన తెగకు చెందిన వ్యక్తిగా అంత గొప్ప కలను సాకారం చేసుకోవడం కొండంత సంతృప్తిని అందించింది’’ అంటూ చెప్పారు భద్రయ్య. అత్యంత వ్యయప్రయాసలతో కూడిన ఈ యాత్రకు శిక్షణా ఖర్చుల్ని శేఖర్‌బాబు సారథ్యంలోని రాక్‌క్లైంబింగ్ స్కూల్ భరిస్తే, రంపచోడవరం ఐటీడిఎ పిఓ రూ.23.5 లక్షల ఆర్థిక సాయం అందించారంటూ కృతజ్ఞతలు తెలిపారు. - ఎస్.సత్యబాబు -
ఎవరెస్టు ఎక్కేసిన నీలిమ
ఎట్టకేలకు పూదోట నీలిమ తన పంతం నెగ్గించుకున్నారు. తన చిరకాల వాంఛ ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరంపై పాదం మోపారు. విజయవంతంగా.. ఎవరెస్టు అధిరోహణం పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్ లోని మెహదీపట్నం వాసి పూదోట నీలిమ ఎవరెస్టు శిఖరం పై మువ్వన్నెల పతాకను ఎగుర వేశారు. మగళవారం ఉదయం ఎవరెస్టు పై నీలిమ కాలుమోపినట్లు ఆమెకుటుంబ సభ్యులు తెలిపారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తుకపాలెం గ్రామానికి చెందిన నీలిమ కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. ఆమె తండ్రి శౌరయ్య జర్నలిస్టు. బీటెక్ పూర్తి చేసిన నీలిమ బెంగళూరు లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి సాహస క్రీడలంటే మక్కువ ఉన్న నీలిమ గత ఏడాది ఏప్రిల్ లో తొలిసారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లారు. అప్పట్లో నేపాల్ లో సంభవించిన పెను భూకంపం కారణంగా.. తన ప్రయత్నం విఫలమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బేస్ క్యాంప్ నుంచే తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. అయితే ఈ సారి విజయ వంతంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు నీలిమ కుటుంబ సభులు తెలిపారు.నీలిమ సాహసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎవరెస్టును అధిరోహించిన తొలి నవ్యాంధ్ర మహిళగా ఆమె అందరికీ గర్వకారణమని కొనియాడారు. నీలిమ చిరకాల కోరిక తీరడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. నీలిమ రాక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. -
ఎవరెస్టును అధిరోహించి.. తిరిగి వస్తూ!
కోల్ కతా: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని శనివారం ఉదయం అధిరోహించిన పశ్చిమ బెంగాల్ కు చెందిన ముగ్గరు పర్వతారోహకులు తిరిగివస్తూ 8 వేల అడుగుల ఎత్తులో (డెత్ జోన్) వద్ద ఆచూకీ లేకుండా పోయారు. మొత్తం పర్వతారోహణకు ఏడుగురు వెళ్లగా భట్టచార్య శుక్రవారం మృతి చెందాడు. ఆ తర్వాత మిగిలిన ఆరుగురిలో ముగ్గురు మాత్రమే క్యాంప్ 4 కు చేరుకోగా మిగిలిన ముగ్గురి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఆచూకీ లేకుండా పోయిన వారిలో సునీత హజ్రా, గౌతమ్ ఘోష్, పరేశ్ నాథ్ లు ఉన్నారు. క్యాంపునకు సురక్షితంగా చేరుకున్న రమేష్, మలయ్, సత్యరూప్, రుద్రప్రసాద్ లు చివరి క్యాంప్ ను చేరుకుని యాత్రను ముగించడానికి బయలుదేరారు. డెత్ జోన్ ప్రయాణంలో ఇబ్బందులకు లోనైనా తట్టుకుని గమ్యాన్ని చేరుకున్నట్లు వివరించారు. గతంలో రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించడానికి ప్రయత్నించి విఫలం చెందిన ప్రదీప్, చేతనా సాహులు ఈ సారి విజయవంతమవడంతో కోల్ కతా వాసులు సంబరాల్లో మునిగిపోయారు. -
ఎవరెస్టు ఎక్కిన గిరిజన యువకుడు
మోతుగూడెం: ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే లక్ష్యాన్ని ఓ గిరిజన యువకుడు ఎట్టకేలకు సాధించాడు. తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెం మండలం కొత్తపల్లికి చెందిన దూపు భద్రయ్య(27) పదో తరగతి వరకు చదువుకున్నాడు. పస్తుతం అతడు లోయర్ సీలేరు జెన్కో జల విద్యుత్ ప్రాజెక్టులో కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తున్నాడు. చిన్ననాటి నుంచి ఎవరెస్ట్ అధిరోహించాలనే కోరిక బలీయంగా ఉన్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. తన లక్ష్యాన్ని రంపచోడవరం ఐటీడీఏ పీవోగా ఉన్న చక్రధర్‌బాబుకు తెలిపాడు. సాయం కోసం ఆర్థించాడు. అతడి విన్నపాన్ని ప్రభుత్వానికి తెలియజేసిన పీవో మూడేళ్ల క్రితం రూ.25 లక్షల సాయం అందేలా కృషి చేశారు. అలా అందిన ఆర్థిక సాయంతో కావల్సిన శిక్షణ, సాధన సామగ్రిని భద్రయ్య సమకూర్చుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన శేఖర్‌బాబు వద్ద పర్వతారోహణలో శిక్షణ పొందాడు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎవరెస్ట్ అధిరోహకుల బృందంలో ఒక్కడిగా భద్రయ్య శుక్రవారం ఉదయం ఎవరెస్టు అధిరోహించాడు. తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఎవరెస్టు అధిరోహించిన భద్రయ్యకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. -
అత్యున్నత శిఖరమే లక్ష్యంగా..
♦ మౌంట్ రెనోక్ అధిరోహణ ఉత్సాహంతో గురుకుల విద్యార్థులు ♦ తదుపరి లక్ష్యం కాంచనగంగ..ఆ తర్వాత ఎవరెస్ట్ ♦ శిక్షణకు ఎంపిక కోసం కొనసాగుతున్న పరిశీలన సాక్షి, హైదరాబాద్: హిమాలయ పర్వత శ్రేణుల్లోని మౌంట్ రెనోక్‌ను విజయవంతంగా అధిరోహించిన ఉత్సాహంతో గురుకుల విద్యార్థులు ఉరకలు వేస్తున్నారు. ఇక ఎవరెస్ట్‌ను ఎక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 2014లో పూర్ణ, ఆనంద్‌లు ఎవరెస్ట్‌ను అధిరోహించడాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళుతున్నారు. ఎవరెస్ట్ అధిరోహణకు పూర్వ రంగంగా భావించే మౌంట్ రెనోక్‌ను ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 31 మంది బాలబాలికలు అధిరోహించి రికార్డును సొంతం చేసుకున్నారు. వీరంతా కడు పేదరికం నుంచి వచ్చిన వారే. వారి తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, రోజు కూలీలు, వ్యవసాయ కూలీలే. ఈ విద్యార్థుల్లో 16 మంది (8 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు) గిరిజనులుకాగా.. అందులో ఆరుగురు ఆదిమ గిరిజన తెగ (ప్రిమిటివ్ ట్రైబల్గ్రూప్స్)లకు చెందినవారు. కొలామ్, కోయ తెగలకు చెందిన వారు ఇద్దరు చొప్పున, గోండు, చెంచు తెగలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. ఎవరెస్ట్ దారిలో.. ఎవరెస్ట్ ఎత్తు 29,100 అడుగులుకాగా... మౌంట్ రెనోక్ ఎత్తు 17 వేల అడుగులు. ఎవరెస్ట్ అధిరోహణ అత్యంత కఠినమైనది, వ్యయ ప్రయాసలతో కూడినది. దానికి కఠినమైన శిక్షణను తీసుకోవాల్సి ఉంటుంది. వివిధ స్థాయిల్లో పరీక్షించి, ఎంత వరకూ తట్టుకోగలుగుతారన్నది పరిశీలించాకే ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి అనుమతి ఇస్తారు. ఈ పరీక్షలు, పరిశీలనలో భాగంగా తొలుత మౌంట్ రెనోక్‌ను అధిరోహించాలి. దీనిని విజయవంతంగా ఎక్కి, కఠిన పరిస్థితిని తట్టుకోగల వారిని కాంచన గంగ అధిరోహణకు ఎంపిక చేస్తారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకునే మానసిక స్థైర్యం ఏమేరకు ఉందన్నది పరిశీలిస్తారు. దీనికితోడు వాతావరణ పరిస్థితి కూడా కీలకమే. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఎవరెస్ట్ అధిరోహణకు పచ్చజెండా ఊపుతారు. ఇంతకు ముందు 110 మంది గురుకుల విద్యార్థులను పర్వతారోహణకు ఎంపిక చేశారు. వారిలో 20 మందిని ఎంపిక చేయగా.. మౌంట్ రెనోక్‌ను 18 మంది అధిరోహించారు. వారిలో 11 మంది కాంచనగంగను అధిరోహించగా.. ఎవరెస్ట్‌ను ఎక్కేందుకు పూర్ణ, ఆనంద్ మాత్రమే ఎంపికయ్యారు. తాజాగా మౌంట్ రెనోక్‌ను ఎక్కిన 31 మందిలో ఎందరు తదుపరి శిక్షణకు తట్టుకోగలరన్న ప్రాతిపదికన వివిధ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ విద్యార్థుల్లో ప్రతి ఆరుగురికి ఒక మెంటార్ ఉన్నందున వారు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎంపిక ఉంటుంది. మౌంట్ రెనోక్‌ను ఎక్కిన ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు.. జి.ప్రకాష్(లంబాడ-వరంగల్ పాత తండా), ఆర్.ప్రశాంత్(లంబాడ-మెదక్), ఎస్.రాకేష్ (లంబాడ-రంగారెడ్డి), బి.అనిల్(లంబాడ-వరంగల్), పి.అరవింద్(లంబాడ-ఆదిలాబాద్), ఎన్.కృష్ణ(చెంచు-మహబూబ్‌నగర్), టి.భగవంతరావు(కోలామ్), ఎ.మల్లేష్(గోండు-కరీంనగర్), జి.సింధు(లంబాడ-నల్లగొండ), ఎం.జయబాయి(లంబాడ-నల్లగొండ), టి.సుఖిప్రియ (కోయ-ఖమ్మం), డి.యమున(లంబాడ-కురవి), ఎన్.కవిత(లంబాడ-వరంగల్),ఎం.పూజ (లంబాడ-మహబూబ్‌నగర్),ఎస్.అంజలి(కోలామ్-ఆదిలాబాద్),ఈ.తేజశ్రీ(కోయ-ఖమ్మం ) ఉన్నారు. ఇక ఎస్సీ విద్యార్థుల్లో.. బి.పూర్ణచందర్(వరంగల్), జె.రవళి(కరీంనగర్), బి.రాజేశ్ (నల్లగొండ), ఆర్.బాలరాజ్(రంగారెడ్డి), జి.రాకేష్(మెదక్), కె.సాయిబాబా(నల్లగొండ), కె.నరేష్కుమార్ (రంగారెడ్డి), ఒ.వెంకటేశ్ (ఆదిలాబాద్), డి.చందు (నిజామాబాద్) ఉన్నారు. -
2100 నాటికి మంచులేని ఎవరెస్ట్!
హిమాలయ హిమానీనదాలు పూర్తిగా కనుమరుగు కఠ్మాండు: ఎవరెస్ట్ పర్వత ప్రాంతంలోని గ్లేసియర్లు(హిమానీనదాలు) ఈ శతాబ్ది చివరిలోగా కనుమరుగయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం వల్లే ఈ ముప్పు తలెత్తుతోందన్నారు. ఈ వాయువులను నియంత్రించకుంటే ఎవరెస్ట్ సానువుల్లోని మంచు 70 శాతం మేర కరిగిపోతుందని లేదా మొత్తమే కనుమరుగవుతుందని నేపాల్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ పరిశోధకుల బృందం అంచనా వేసింది. గ్లోబల్‌వార్మింగ్ ప్రభావంతో 21వ శతాబ్ది ముగిసేలోగా మంచు పొరలు పూర్తిగా నాశనమవుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను బట్టి మంచు తగ్గిపోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కఠ్మాండులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్(ఐసీఐఎంవోడీ) అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త జోసెఫ్ షియా పేర్కొన్నారు. 2100 సంవత్సరం నాటికి ఎవరెస్ట్ వద్ద ఉన్న గ్లేసియర్లు 70 నుంచి 99 శాతం కరిగిపోతాయని తెలిపారు. ప్రధానంగా దూద్కోసి బేసిన్‌లోని అతిపెద్ద గ్లేసియర్ క్రమంగా కరుగుతోందని, ఉష్ణోగ్రతలు పెరిగితే ఇది మరింత తీవ్రమవుతుందని అధ్యయనంలో తేలింది. దీనివల్ల దిగువన కోసీ నదిలో నీరు పెరిగి నదుల ప్రవాహంపైనా ప్రభావం పడే అవకాశముందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. మంచు భారీగా కరిగిన తర్వాత తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని, దీంతో వ్యవసాయం, జల విద్యుదుత్పత్తి ప్రభావితమవుతాయని విశ్లేషించారు. గ్లేసియర్లకు సంబంధించిన గత 50 ఏళ్ల సమాచారం, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాల తదితరాలను విశ్లేషిస్తూ ఈ అధ్యయనం సాగింది. -
ఎవరెస్ట్‌పై భూకంప దృశ్యాలు.
-
మహా పర్వతంపై మంచు చరియలు
-
ఎవరెస్టు వద్ద 217 మంది గల్లంతు?
మహా పర్వతంపై మంచు చరియలు విరిగిపడి 22 మంది మృతి ⇒ 60 మందికి గాయాలు.. సహాయం కోసం వందల మంది నిరీక్షణ ⇒ ఆదివారం నాటి భూ ప్రకంపనలతో మళ్లీ కూలిన మంచుదిబ్బలు కఠ్మాండు: భూగోళంపై మహా పర్వతమైన ఎవరెస్ట్ సైతం శనివారం నాటి పెను భూకంపానికి వణికిపోయింది. పర్వతం పై నుంచి భారీ మంచు చరియలు విరిగిపడటంతో.. నేపాల్ వైపున గల బేస్ క్యాంపుల్లో ఉన్న పర్వతారోహకుల్లో 22 మంది ప్రాణాలు కోల్పాయారు. మరో 217 మంది ఆచూకీ తెలియటం లేదు.విదేశీయలతో సహా వందలాది మంది పర్వతారోహకులు అక్కడ చిక్కుబడి ఉన్నారు. ఆదివారం నాటి తీవ్ర భూప్రకంపనల కారణంగా కూడా ఎవరెస్ట్‌పై మళ్లీ మంచుచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ చిక్కుబడి ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. వారిని రక్షించటానికి, తరలించటానికి మరికొంత సమయం పడుతుందని నేపాల్ మౌంటెయినీరింగ్ అసోసియేషన్ అధికారులు ఆదివారం పేర్కొన్నారు. అయితే.. ఎవరెస్ట్ పర్వతానికి టిబెట్ వైపున బేస్ క్యాంపుల్లో 400 మంది పర్వతారోహకులు క్షేమంగా ఉన్నారని చైనా అధికారులు తెలిపారు. వారిలో చాలా మంది పర్వతం దిగిపోయారని, ఇంకొంత మంది దిగుతున్నారని చెప్పారు. మొత్తం 8,848 మీటర్ల ఎత్తు ఉండే ఎవరెస్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తయిన పర్వత శిఖరం. ప్రపంచం నలుమూలల నుంచీ ఏటా వందలాది మంది ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు వస్తుంటారు. నేపాల్ పర్యాటక మంత్రిత్వశాఖ అధికారుల అంచనా ప్రకారం.. శనివారం నాటి పెను భూకంపం వచ్చి, ఎవరెస్ట్‌పై మంచు చరియలు విరిగిపడినప్పుడు.. నేపాల్ వైపు బేస్ క్యాంప్ వద్ద 400 మంది విదేశీయులతో సహా దాదాపు 1,000 మంది పర్వతారోహకులు ఉన్నారు. మంచు చరియలు బేస్ క్యాంపులోని ఒక భాగాన్ని ముంచేశాయి. బేస్ క్యాంప్ వద్ద 17 మంది చనిపోగా.. క్యాంపు దిగువు ప్రాంతాల్లో మరో ఐదుగురు చనిపోయారు. ఈ విపత్తులో 60 మంది పర్వతారోహకులు గాయపడ్డారు. ఇంకా చాలా మంది విదేశీ పర్వతారోహకులు, వారి సహాయకులు, మార్గదర్శకులు ఈ మంచు కింద సమాధి అయివుంటారని ఆందోళన వ్యక్తమవుతోంది. తీవ్రంగా గాయపడ్డ వారిలో 22 మందిని భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లు ఐదు విడతల్లో తరలించాయి. కొందరిని కఠ్మాండుకు తరలించారు. ఎవరెస్ట్ వద్ద బస చేసివున్న భారత సైనిక పర్వతారోహణ బృందం బేస్ క్యాంప్ వద్ద (17,500 అడుగుల ఎత్తులో) క్షేమంగా ఉందని.. శనివారం మంచు చరియల్లో చనిపోయిన 13 మంది మృతదేహాలను వెలికి తీసేందుకు సాయపడిందని భారత సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు.ఏడు ఖండాల్లోని అన్ని అతి పెద్ద పర్వతాలనూ అధిరోహించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ పర్వతారోహకుడు అంకుర్ బహల్ (54), ఆయన సహ పర్వతారోహకులు మరో 15 మంది ఎవరెస్ట్ పర్వతంపై రెండో క్యాంపు వద్ద చిక్కుకుపోయారు. ఎవరెస్ట్‌పై గూగుల్ ఉద్యోగి మృతి ఎవరెస్ట్ పర్వతంపై మంచుచరియలు విరిగిపడడంతో గూగుల్ ఉద్యోగి డాన్ ఫ్రెడిన్బర్గ్ శనివారం మరణించారు. ఈయన గూగుల్ ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డ్రైవర్ లేని కారు’ ప్రాజెక్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు. ‘గూగుల్ స్ట్రీట్ వ్యూ’ ప్రాజెక్టులో కూడా పనిచేస్తున్నారు. ఈయనతోపాటున్న మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. -
ఎవరెస్టుపై 18 మంది మృతి
నేపాల్: హిమాలయ పర్వతాలను చుట్టేసిన భూకంపం కారణంగా ఎవరెస్టు శిఖరంపై 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం పర్వతారోహణ సమయం కావడంతో ప్రమాదం అంచనా వేయని వీరంతా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలనే ఉద్దేశంతో సాహసయాత్ర ప్రారంభించి ప్రమాద బారిన పడ్డారు. వీరిలో చాలామంది బ్రిటన్ దేశస్థులే ఉన్నారు. వీరిలో ప్రధానంగా గూగుల్ సంస్థకు చెందిన సీనియర్ అధికారి డేనియల్ ఫ్రెడిన్ బర్గ్ (33), న్యూజెర్సీకి చెందిన డాక్టర్ మరిసా ఈవ్(29) వంటివారు కూడా ఉన్నారు. మిగితా వారిని గుర్తించాల్సి ఉంది. భారీ భూకంపం సంభవించి నేపాల్ కకావికలమైన విషయం తెలిసిందే. -
చక్కని ఉద్యోగం.. భూకంపానికి చిక్కాడు
శాన్ ఫ్రాన్సిస్కో: అతడిది చక్కటి ఉద్యోగం.. అదీకూడా గుగూల్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ గా.. కాకపోతే అతడికి పర్వతారోహణల పిచ్చి కూడా ఉంది. అదే అతడి ప్రాణం మీదకు తెచ్చింది. నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా గూగుల్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ అధికారి ఒకరు చనిపోయారు. స్వతహాగా సాహసికుడు అయిన డాన్ ఫ్రెడిన్ బర్గ్ హిమాలయ పర్వతాల్లో ఎవరెస్టు పర్వతారోహణకు వెళ్లే క్రమంలో బేస్ క్యాంపు వద్ద ప్రాణాలు కోల్పోయాడు. హిమాలయాలు మొత్తం కంపించడంతో భారీ ఎత్తున కొండ చరియలు కూడా విరిగి పడిన విషయం తెలిసిందే. ఇవి డాన్ ఉన్న బేస్ క్యాంపుపై పడటంతో డాన్‌తో సహా మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గూగుల్ సంస్థ స్వయంగా ప్రకటించింది. చాలా కాలంగా గూగుల్ ప్రైవసీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి మౌంట్ ఎవరెస్టును అధిరోహించే ప్రయత్నంలో ఉండగా డాన్ ప్రాణాలు కోల్పోయాడు. డాన్ తోపాటు ఉన్న మరో ముగ్గురు గూగుల్ ఉద్యోగస్తులు ప్రాణాలతో బయటపడ్డారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. డాన్ తలకు బలమైన గాయం అవడం వల్ల ప్రాణాలు విడిచాడని అతడి సోదరి తెలిపింది. -
ధ్వంసమైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్, 13మంది మృతి
-
ఎవరెస్ట్ ఫాలభాగాన్ని ముద్దాడినవాడు...
‘షెర్పాలు తల ఎత్తి పర్వతాన్ని చూస్తారు. తల దించి ఎత్త వలవలసిన బరువు వైపు చూస్తారు. వాళ్లకు తెలిసింది ఆ రెండే’ అంటాడు తేన్సింగ్ నార్గే తన ఆత్మకథలో. అతడు తన జీవితంలో ఒక అద్భుతం చేశాడు. ఆ అద్భుతం కోసమే బతికాడు. మొదటిసారి.. కుదర్లేదు. రెండోసారి.. సాధ్యం కాలేదు. మూడోసారి... సగం పనే అయ్యింది. నాలుగోసారి... పర్వతం మంచు ఖడ్గాన్ని ధరించి ఓడగొట్టి పంపించింది. ఐదోసారి... చలి కోత ఒంటిని నీలం రంగులో మార్చింది. ఆరోసారి... ఇక ఈ శిఖరాన్ని అందుకోవడం అసాధ్యం అని తేల్చిచెప్పింది. అయినా సరే... తేన్సింగ్ ఓడిపోలేదు. పట్టు విడవలేదు. తన తల్లి... మహామాత.. చెమోలుంగ్మా.... ఎవరెస్ట్... తన ఒడిలోకి ఈ పిల్లాణ్ణి తీసుకోదా? తనను ఎత్తుకోదా? ఎందుకు ఎత్తుకోదో చూద్దాం అని ఏడోసారి ప్రయత్నించాడు. ఎడ్మండ్ హిల్లరి... బ్రిటిష్‌వారి పనుపున వచ్చిన న్యూజిలాండ్ పర్వతారోహకుడు. అతనితో పాటు మరో ఐదారుగురు... అందరూ కలిసి అప్పటికే ‘మంచుపులి’గా బిరుదుపొందిన తేన్సింగ్ సహకారంతో ఎవరెస్ట్ శిఖరంపై పాదాలను తాటించాలనే ఉత్సాహంతో బయలుదేరారు. ఇద్దరిద్దరు ఒక జట్టు. హిల్లరీ-తేన్సింగ్ ఒక జట్టు. మొత్తం మూడు జట్లలో ఏదో ఒక జట్టు శిఖరం ఎక్కినా చాలు. మొదటి జట్టు రెండో జట్టు విఫలమయ్యాయి. మిగిలింది హిల్లరీ- తేన్సింగ్ జట్టు. అమ్మా... దయామయీ... దారి విడువు... ధైర్యం చేసి బయలుదేరారు. ఎవరెస్ట్ దక్షిణ శిఖరం వరకూ ఎక్కడమే అసాధ్యం. అక్కడి నుంచి అసలు శిఖరంపై ఎగబాకాలంటే మరో మూడునాలుగు వందల అడుగులు ఎక్కాలి. ఆ దూరం నిట్టనిలువుగా ఉంటుంది. ప్రవేశార్హం కానిదిగా ఉంటుంది. పట్టుదప్పితే శవంగా మారి సంవత్సరాల తరబడి పాడవకుండా మంచులో పడి ఉండాల్సిందే. హిల్లరీ, తేన్సింగ్ ధైర్యం చేశారు. మొత్తం 30 అడుగుల తాడు. ఒకరి వెనుక ఒకరు పట్టుకొని... ఒకరికి మరొకరు దారి ఇచ్చుకుంటూ... ఒకరు కొద్ది దూరం మెట్లు చెక్కితే... మరొకరు కొద్ది దూరం మెట్లు చెక్కుతూ... అదిగో... శిఖరానికి చేరుకుంటూ ఉన్నారు. ఇద్దరి మధ్యా ఎంత దూరం? కేవలం ఆరు అడుగులు. ఆరు అడుగుల ముందు హిల్లరీ ఉన్నాడు. ఆరు అడుగుల వెనుక తేన్సింగ్ ఉన్నాడు. పడింది. తొలిపాదం. పరమ పవిత్రమైన, సృష్టి తన సమున్నతకు చిహ్నంగా నిలబెట్టుకున్న, దైవం తన ఏకాంతం కోసం కాపాడుకుంటున్న, దైహిక ప్రయాణం వల్లగానీ ఆత్మిక ప్రయాణం వల్లగాని ఒక మనిషి చేరుకోదగ్గ ఎత్తుకు చిహ్నంగా నిలిచిన ఎవరెస్ట్ శిఖరంపై పాదం పడింది. రెండో పాదం తేన్సింగ్ది. అతడి చిన్నారి కూతురు బయల్దేరే ముందు చిన్న పెన్సిల్ ముక్క ఇచ్చింది- ఎవరెస్ట్ మీద ఉంచమని. తేన్సింగ్ దానిని శిఖరం మీద ఉంచాడు. ఐక్యరాజ్య సమితి పతాకం, బ్రిటిష్, నేపాల్, భారతదేశాల పతాకాలు అక్కడ మంచులో సమష్టి విజయానికి గుర్తుగా గుచ్చాడు. ఆత్మీయులను, పెద్దవాళ్లనూ కలవడానికి వెళ్లినప్పుడు మిఠాయి పట్టుకెళ్లడం ఆనవాయితీ. తేన్సింగ్ తాను తీసుకెళ్లిన మిఠాయిని ఎవరెస్ట్‌కు కానుకగా సమర్పించాడు. మొత్తం పదిహేను నిమిషాలపాటు వాళ్లిద్దరూ ఆ పర్వత శిఖరం మీద ఉన్నారు. అక్కడ నుంచి చూస్తే దిగువ నుంచి చూసినప్పుడు మహా మహా పర్వతాలుగా కనిపించే కాంచనజంగా, లోట్సే, మత్సే, మకాలూ... అన్నీ చిన్న చిన్న గుడారాలుగా కనిపించాయి. నిజమే. ఎవరెస్ట్ సమున్నతమైనది. కాని సంకల్పం, లక్ష్యసాధన, రుజుదృష్టి ఉన్న మనిషి అంతకు ఏమాత్రం తక్కువ కాడు. ఒక మామూలు షెర్పా, బరువులెత్తే కూలి, జీవితాంతం ఎవరెస్ట్‌ను కళ్లలో పెట్టుకొని జీవించి దానిని అధిరోహించడమే లక్ష్యంగా బతికినవాడూ... నువ్వు నిజంగా సంకల్పిస్తే అది అవుతుంది అని నిరూపించాడు. ఏదైనా సాధించవచ్చు అనేదానికి కొండగుర్తుగా నిలిచాడు. తిరిగి వచ్చాక ఎన్నెన్ని సన్మానాలనీ? ఎన్నెన్ని సత్కారాలనీ... నెహ్రూ తన ఇంటికి పిలుచుకెళ్లి నీకు బట్టలు లేవా అని అడిగి సూట్‌కేస్‌లు విప్పి తన బట్టలన్నీ తీసుకో తీసుకో అని తేన్సింగ్కి ఇచ్చాడు. ‘ఆశ్చర్యం. మా ఇద్దరి కొలతలు ఒకటే. అవి నాకు చక్కగా సరిపోయాయి’ అంటాడు తేన్సింగ్. ఇలాంటి వివరాలెన్నో ‘మంచుపులి- తేన్సింగ్ నార్గే ఆత్మకథ’లో ఉన్నాయి. దీనికి మూలం ‘టైగర్ ఆఫ్ ది స్నోస్’ కావచ్చు. పీకాక్ క్లాసిక్స్ వారు అసలు పుస్తకం పేరు ఇస్తే ఆసక్తి ఉన్నవారు దానిని కూడా చదువుకుంటారు. ఏమైనా ఇది మంచి పుస్తకం. మంచి అనువాదం (ఎం.రామా రావు)తో వచ్చిన పుస్తకం. తప్పనిసరిగా చదవదగ్గ పుస్తకం. ఎవరెస్ట్ ఎక్కడం మనందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆ అద్భుతమైన లిప్తలో పాలుపంచుకున్నామన్న తృప్తి దొరకాలంటే దీనిని చదవాల్సిందే. - లక్ష్మీ మందల -
గ్లోబల్... నోబెల్
యువత 2014 శాంతిస్థాపన యత్నానికి అత్యున్నత పురస్కారం.. అపారమైన ప్రతిభకు అవధుల్లేని అవకాశాలు.. ఎవరెస్ట్ స్థాయి సాహసాలు.. ఆటల్లోనూ అబ్బురపరిచే విన్యాసాలు.. మొత్తంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యువతకు కలిసొచ్చిన సంవత్సరం 2014. ఈ ఏడాదిలో అనేక యువకిరణాలు ఉదయించాయి. వ్యాపార, క్రీడ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అనేక మంది యువతీయుకులు తమ ప్రతిభాపాటవాలను చాటారు. నోబెల్ బహుమతి... ఈ బహుమతి స్థాయిని బట్టి, తలపండిన వారికే దక్కుతుందనుకోవడం చాలా సహజమైన అభిప్రాయం. అయితే అలాంటి అంచనాలకు భిన్నంగా ఒక 17 యేళ్ల యువతికి నోబెల్ బహుమతి దక్కింది. అది కూడా శాంతి పరిరక్షణకు గానూ.. దక్కిన నోబెల్ శాంతి బహుమానం. ఈ ఏడాది యువతకు సంబంధించి ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సిన విషయం ఇది. యువ శక్తి ఉద్యోగం సంపాదించుకొనేంత స్థాయికో, కొత్త ఆవిష్కరణ చేపట్టడానికో పరిమితం కాదు... టీనేజ్లోనే నోబెల్‌ను సాధించుకొనే స్థాయి వరకూ ఎదిగిందనే సందేశాన్ని ఇచ్చింది పాకిస్తాన్ యువతి మలాలాకు దక్కిన ఈ ఖ్యాతి. మలాలానే ఈ ఏడాదికి ‘యూత్ ఆఫ్ ది ఇయర్’ అని చెప్పవచ్చు. ఎవరెస్ట్నూ అధిరోహించేశారు! ఈ ఏడాది భారతీయ యువతకు దక్కిన ఖ్యాతి ఇది. తెలుగువాళ్లు అయిన మలావత్ పూర్ణ, సద్దనపల్లి ఆనంద్‌లు ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆ శిఖర స్థాయి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొన్నారు. టీనేజర్ పూర్ణ ఎవరెస్ట్‌ను అధిరోహించిన అత్యంత పిన్నవయస్కురాలు కూడా. వీరి విజయానికి తెలుగుగడ్డ నీరాజనాలు పల్కింది జీతాలు కోట్లకు చేరాయి! ఐదంకెల జీతం ఇన్ని రోజులకూ గొప్ప. అయితే ఇప్పుడు ఐదుకు మరో రెండంకెలను జోడించి ఆ మొత్తాన్ని భారతీయ విద్యార్థులకు ప్యాకేజీలుగా ఇవ్వడానికి ముందుకొచ్చాయి అనేక కంపెనీలు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం చేస్తున్న అనేక మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు చదువు పూర్తి కాకుండానే ఇలాంటి ఆఫర్లు వచ్చాయి. గూగుల్ వంటి దిగ్గజాలు భారతీయ విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో సంచలనాలే నమోదయ్యాయి. వార్షిక వేతనం కోటి, కోటిన్నర రూపాయల స్థాయిలో ఉండే ఉద్యోగాలు మనవాళ్లను పలకరించాయి. కోటి రూపాయల వేతనం! 2014 మెమరబుల్ ఇయర్.. ఇదే ఏడాది స్టూడెంట్స్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఒక సెమిస్టర్ సింగపూర్‌లో చదివాను. సామ్‌సంగ్‌లో ఇంటర్న్‌షిప్ చేయడం మంచి అనుభవాన్ని మిగిల్చింది. అందులోనే ఉద్యోగం రావడం, అదీ కోటి రూపాయల భారీ వేతనంతో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ఈ ఏడాదితో నా విద్యార్థి జీవితం ముగుస్తుంది. 2015 నుంచి బాధ్యత గలిగిన ఉద్యోగిగా మారాలి. అయితే నా జీవితంలో ఇది ఒక మైలురాయి అని చెప్పడం కష్టం. ప్రతిదీ ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ అనే చెప్పాలి. ఐఐటిలో సీటు కోసం కోచింగ్ దగ్గర నుంచి ఐఐటి క్యాంపస్‌లో చదువు అన్నీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్పించాయి. - ఇమ్మడి పృథ్వితేజ్, ముంబయి ఐఐటి విద్యార్థి -
ఎవరెస్టే ధ్యేయంగా...
భువనగిరి టౌన్ : చెట్టు ఎక్కగలవ ఓ నరహరి.. పుట్టలెక్కగలవా.. చెట్టు ఎక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా.. అని ప్రశ్నిస్తే చెట్టు ఎక్కగలను.. పుట్టలెక్కగలను.. చెట్టు కొమ్మన ఉన్న చిగురు కోయగలను అని బదులిస్తాడు.. సినీ హీరో. కానీ భువనగిరి ఖిలాపై రాక్క్లైం బింగ్‌లో శిక్షణ పొందుతున్న ఈ విద్యార్థులు చెట్టులు.. పుట్టలే కాదు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగలమని ఆత్మవిశ్వాసంతో పేర్కొం టున్నారు. ఏకశిల పర్వతంపై సాహస విన్యాసాలు చేస్తూ అబ్బుర పరుస్తున్నారు. రాష్ట్రం లోని 10 జిల్లాల్లో ఎంపిక చేసిన 30 మంది సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నాలుగు రోజులుగా ఖిలాపై రాక్‌క్లైంబింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ గురువారం ముగియనుంది. గతంలో భువనగిరి ఖిలాపై శిక్షణ పొందిన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పూర్ణ, ఆనంద్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన విషయం విధితమే. తాము కూడా వారి స్ఫూర్తితో శిక్షణ తీసుకుం టున్నామని, ఎప్పటికైనా ఎవరెస్ట్ శిఖరాన్ని అందుకోవడమే తమ ధ్యేయమని శిక్షణ పొందుతున్న విద్యార్థులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే నా లక్ష్యం. మొదట్లో రాక్‌క్లైంబింగ్ చేయటం కష్టంగా అనిపించింది. కానీ ఈ శిక్షణతో భయం తొలిగిపోయింది. ఇప్పడు సుల భంగా రాక్‌క్లైంబింగ్ చేయగలుగుతున్నాను. పర్వాతారోహణ చేయాలంటే శిక్షణ తప్పని సరి. - టి.సంగీత, 9వ తరగతి, కేజీబీవీ, మెదక్ జిల్లా పర్వతారోహణ అంటే ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి పర్వతారోహణ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే రాక్ క్లైంబింగ్ శిక్షణ కోసం ఫీజు చెల్లించాను. శిక్షణలో అనేక విషయాలు నేర్చుకున్నా. కోచ్‌లు ఎన్నో మెళకువలు నేర్పించారు. ఎప్పటికైనా హిమాలయాల్లోని ఏదేని పర్వతాన్ని అధిరోహించాలన్నది నా కోరిక. - ఆర్.శాంతి, 9వ తరగతి, కమదానం, మహబూబ్‌నగర్ జిల్లా -
బుల్లితెర ‘ఎవరెస్ట్’కి రహమాన్ పాటలు!
హాలీవుడ్ చిత్రాలకు స్వరాలు సమకూర్చడం మొదలుపెట్టిన తర్వాత, ఏఆర్ రహమాన్ భారతీయ చిత్రాలకు సమయం కేటాయించలేనంత బిజీ అయిపోయారు. అయినప్పటికీ వీలు చేసుకుని తమిళ, హిందీ చిత్రాలకు స్వరాలందిస్తున్నారు. అంత బిజీగా ఉండే రహమాన్ ఓ బుల్లితెర షో కోసం పాటలివ్వడానికి అంగీకరించడం విశేషం. విషయంలోకి వస్తే... ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత అశుతోష్ గోవారీకర్ ‘ఎవరెస్ట్’ పేరుతో బుల్లితెర కోసం ఓ షో చేస్తున్నారు. ఈ షో కోసం పాటలివ్వాల్సిందిగా రహమాన్ని కోరారు. అశుతోష్ రూపొందించిన లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ చిత్రాలకు సంగీతదర్శ కునిగా వ్యవహరించారు రహమాన్. అప్పటినుంచీ అశుతోష్‌తో ఆయనకు మంచి అనుబంధం కుదిరింది. అందుకే, ‘ఎవరెస్ట్’కి పాటలివ్వడానికి అంగీకరించారు. ఇప్పటికి టైటిల్ ట్రాక్ పూర్తి చేశానని, ఇతర పాటలకు తన మ్యూజిక్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ చేసిన ట్యూన్స్‌ని కూడా వాడాలనుకుంటున్నానని రహమాన్ తెలిపారు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు బుల్లితెరకు చాలా క్రేజ్ ఉందని, టెలివిజన్ రంగంలో పెను మార్పులు వచ్చాయని రహమాన్ చెప్పారు. ఇదిలా ఉంటే.. దాదాపు 30 ఏళ్ల క్రితం ‘వండర్ బలూన్’ అనే టీవీ షోలో నటించారు రహమాన్. ఆ తర్వాత బుల్లితెరకు సమయం కేటాయించలేకపోయారు. ఇప్పుడు నటుడిగా కాకపోయినా.. సంగీతదర్శకుడిగా అయినా బుల్లితెరకు రావడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
‘ఎవరెస్ట్’తెలుగు తేజాలకు అపూర్వ సన్మానం
మాలవత్ పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు కన్నడ సంప్రదాయలో సన్మానం ఉన్నతచదువులకు సాయం చేస్తామన్న ప్రవాసాంధ్రులు బెంగళూరు : ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ తెలుగు తేజాలు పూర్ణ (15), ఆనంద్ కుమార్ (18)లకు ఇక్కడి జేసీ రోడ్డులోని రవీంద్ర కళాక్షేత్రలో బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సిద్దం నారయ్య అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాలవత్ పూర్ణ, ఆనంద్ కుమార్‌లను కర్ణాటక సాంప్రదాయం ప్రకారం శాలువా, మైసూరు పేటతో సత్కరించి షీల్డ్‌లు అందించారు. కార్యక్రమానికి పలు తెలుగు ప్రముఖులతో పాటు ప్రవాసాంధ్రులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మాలవత్పూర్ణ, ఆనంద్ మాట్లాడుతూ తాము ఈ సన్మానాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా కార్యక్రమాని హాజరైన మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ... మైనస్ 30 డిగ్రీలు ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడం దేశానికి వారు గర్వకారణమని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన ఐపీఎస్ అధికారి తూకివాకం సునీల్ కుమార్ మాట్లాడుతూ విజేతలు భవిష్యత్తులో ఐపీఎస్ చదువుతామని చెప్పడం గర్వంగా ఉందన్నారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ. రాధకృష్ణరాజు మాట్లాడుతూ... పూర్ణ, ఆనంద్ కుమార్‌లను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కర్ణాటక తెలుగు ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొందు రామస్వామి మాట్లాడుతూ ఎవరెస్ట్ విజేతలకు ఉన్నత చదువులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ. 5,116 చొప్పున అందజేశారు. కార్యక్రమానికి బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ రమేష్, ఐఆర్ఎస్ అధికారిణి చంద్రిక, లోకాయుక్త డీఎస్పీ నారాయణ, ఎవరెస్ట్ విద్యార్థుల కోచ్ శేఖర్‌బాబుతో పాటు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిద్దం నారయ్య, పత్తిపాటి ఆంజనేయులు, హెచ్ఏఎల్ తెలుగు సాహిత్య సమితి అధ్యక్షుడు ఎల్. నాగేశ్వరావు తదితరులు మాట్లాడారు. అంతకు ముందు కన్నడ సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అనంతమూర్తి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు బీ.కుపేంద్రరెడ్డి రూ. 50 వేలు, చామరాజపేట శాసన సభ్యుడు ఆర్.వీ. దేవరాజ్ రూ. 50 వేలు చొప్పున మాలవత్ పూర్ణ, ఆనంద్ కుమార్‌లకు అందించారని డీఎస్పీ నారాయణ తెలిపారు. తెలంగాణ శిఖరాలు : తెలంగాణలోని నిజమాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన అమానత్పూర్ణ, ఖమ్మం జిల్లా ధర్మమండలం సమీపంలోకి కలివేరు గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్‌లు తొమ్మిది నెలల పాటు డార్జిలింగ్‌లో శిక్షణ పొందారు. ఇదే ఏడాది మే 25న వీరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. -
పూర్ణ, ఆనంద్ కు సన్మానం
బెంగళూరు : ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లకు బెంగళూరులో ఆదివారం అపూర్వ సత్కారం లభించింది. ఈ సందర్భంగా జరిగిన సవూవేశంలో కర్ణాటక రాష్ర్ట రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ... ప్రపంచ దేశాల ముందు భారతీయులు తల ఎత్తుకునే రోజు ఇదని అన్నారు. ఇలాంటి సాహసవంతులను అన్ని ప్రభుత్వాలు ఆదరించాలన్నారు. జేసీ రోడ్డులోని రవీంద్ర కళాక్షేత్రంలో బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సిద్ధం నారయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాలవత్ పూర్ణ, ఆనంద్‌కుమార్‌ను కర్ణాటక సంప్రదాయ రీతిలో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. -
కిలి‘మజారో..’
ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతారోహణ చేసిన విజయవాడ వైద్యుడు గత ఏడాది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కిన వైనం.. ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తయిన పర్వతం.. ఎముకలు కొరికే చలి.. ఆక్సిజన్ అందక తలనొప్పి.. కళ్లు తిరగడం.. మధ్యమధ్యలో అటవీ ప్రాంతం.. సందర్శకులకు ఇది కాస్త భయూనక వాతావరణమే అయినా.. సాహసీకులకు మాత్రం ఓ మంచి టూరింగ్ స్పాట్. ఇంతటి భయంకరమైన పర్వతాన్ని తేలిగ్గా అధిరోహించారు విజయవాడకు చెందిన ఎండ్రోక్రైనాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ మెహర్. ఆఫ్రికాలోని కిలిమంజారో (5,985 మీటర్లు) పర్వతాన్ని ఐదు రోజుల్లో సునాయూసంగా ఎక్కేశారు. ఇటీవల విజయవాడ వచ్చిన ఆయన ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. - విజయవాడ ‘ఏటా స్నేహితులతో కలిసి ఏదో ఒక ప్రాంతంలో పర్యటించడం ఆనవాయితీ. పర్యాటక ప్రాంతాలను సందర్శించడమే కాకుండా జీవితంలో మధుర జ్ఞాపకాలుగా మిగిలే ప్రాంతాలకు వెళ్లాలనేది నా ఆకాంక్ష. అందుకనుగుణంగా మూడేళ్లుగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నాను. రెండేళ్ల కిందట అమెరికాలోని రిమ్ టు రన్‌ను సందర్శించాను. గత ఏడాది 5,500 మీటర్ల ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో పర్యటించా. తాజాగా ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తై పర్వతం కిలిమంజారోను అధిరోహించాను. పర్వతారోహణ చేసే వారికి శారీరక ధృడత్వంతో పాటు మానసిక స్థైర్యం అవసరమని నేను తెలుసుకున్నాను. అడుగడుగునా ఎంతో థ్రిల్లింగ్.. నా స్నేహితులు, అమెరికాలో స్థిరపడిన వంశీ, శశితో కలిసి ఈ నెల నాల్గో తేదీన ఆఫ్రికా చేరుకున్నాను. అక్కడ ఉన్న ఎత్తై పర్వతం కిలిమంజారోను అధిరోహించేందుకు నిర్ణయించుకుని అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశాం. ఐదో తేదీన పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించాం. ఐదు రోజుల పాటు నిరాటంకంగా ఎక్కాం. రాత్రివేళల్లో టెంట్లు వేసుకుని ఉండేవాళ్లం. ఉదయాన్నే బిస్కెట్లు తిని అధిరోహణ ప్రారంభించేవాళ్లం. ఇలా ఐదు రోజులు 5,985 మీటర్ల ఎత్తున్న పర్వతాన్ని అధిరోహించాం. అడుగడుగునా ఎంతో థ్రిల్‌కు గురయ్యూ. గత ఏడాది ఎవరెస్ట్ బేస్ (5,500 మీటర్లు) ఎక్కేందుకు ఎనిమిది రోజుల సమయం పట్టగా, అప్పటి అనుభవాలతో ఐదు రోజుల్లో కిలిమంజారో అధిరోహించాం. వాతావరణంలో ఎన్నో మార్పులు తొలిరోజు పెద్దపెద్ద చెట్లు ఉండే ప్రాంతంలో తిరిగాం. అక్కడ వర్షం పడుతూనే ఉంది. ఉష్ణోగ్రత 19 డిగ్రీలు ఉంది. రెండోరోజు మూన్ కైన్ట్.. అంటే చిన్న చెట్లు, వణికించే చలి ఉంది. మూడోరోజు సెమి డిజర్ట్ అంటే.. చెట్లు తక్కువగా, రాళ్లు రప్పలు ఎక్కువగా కనిపించాయి. నాల్గోరోజు ఆల్పెన్ డిజార్ట్, ఐదోరోజు అర్కేట్లు.. ఇలా వాతావరణంలో మార్పులు కనిపించాయి. చివరి రెండు రోజుల్లో ఆక్సిజన్ సరిగా అందక తలనొప్పి, వాంతులు, ఆకలి లేకపోవడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించారుు.. అని మెహర్ రమేష్ తన మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. - విజయవాడ -
ఎవరెస్టంత ఎత్తుకు ఎదిగారు!
-
ఆనంద్‌తో సాక్షి ఫేస్ టూ ఫేస్
-
ఎవరెస్టంత గర్వంగా ఉంది
‘సాక్షి’తో మాలావత్ పూర్ణ - మొదట అమ్మ భయపడింది - నాన్న వెన్నుతట్టారు - ప్రవీణ్ సార్ ప్రోత్సాహాన్ని మరిచిపోలేను - ఐపీఎస్ సాధించి ప్రజలకు సేవచేస్తా ‘‘చిన్న వయసులోనే పెద్ద శిఖరాన్ని అధిరోహించాను. ఎంత గర్వంగా ఉందం టే.. ఎవరెస్ట్ శిఖరమంత’’ అంటూ మాలావత్ పూర్ణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘నా విజయం వెనుక ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ ప్రోత్సాహం ఎంతో ఉంది. జీవితాంతం సార్‌కు రుణపడి ఉంటా. ఆయనలా ఐపీఎస్ అయి సేవలందిస్తా’’ అని పేర్కొన్నారు. చిన్న వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన పూర్ణ తన స్వగ్రామం సిరికొండ మండలంలోని పాకాలకు వెళ్తూ శనివారం రాత్రి కామారెడ్డిలోని బంధువుల ఇంట్లో బస చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన యాత్ర అనుభవాలను పంచుకున్నారు. -కామారెడ్డి సాక్షి : ఎవరెస్టు ఎక్కాలన్న ఆలోచన ఎలా వచ్చింది. పూర్ణ : ప్రవీణ్‌సార్ ప్రోత్సాహం వల్లే ఈ ఘనత సాధించగలిగాను. నేను తాడ్వాయి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ ఆడేదాన్ని. ఓసారి ప్రవీణ్‌కుమార్ సార్ వచ్చారు. ఆయన నాలోని ప్రతిభను గుర్తించారు. శిఖరారోహణకు ఎంపిక చేశారు. 2013 సెప్టెంబర్‌లో భువనగిరి ట్రైనింగ్ క్యాంపునకు తీసుకెళ్లారు. 110 మందికి ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. అందులో ప్రతిభ చూపిన 20 మంది ఎంపిక చేసి నవంబర్‌లో డార్జిలింగ్ తీసుకెళ్లారు. అక్కడ 20 రోజులపాటు శిఖరారోహణలో శిక్షణ ఇచ్చారు. 17వేల అడుగుల ఎత్తున్న శిఖరాలను అధిరోహించాం. ప్రతిభ చూపిన తొమ్మిది మందిని ఎంపిక చేసి లద్దాహ్ తీసుకెళ్లారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నన్ను, ఆనంద్‌ను ఎంపిక చేశారు. మాకు రెండు నెలలపాటు రంగారెడ్డి జిల్లాలోని గేలిదొడ్డి స్కూల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శారీరక, మానసిక దృఢత్వానికి శిక్షణ తోడ్పడింది. రోజూ 26 కిలో మీటర్లు జాగింగ్, అనంతరం మెడిటేషన్, యోగ సాధన చేసేవాళ్లం. వార్షిక పరీక్షల సమయంలో తాడ్వాయికి వచ్చి పరీక్షలు రాశాను. తర్వాత ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి హియాలయాలకు బయలు దేరాం. సాక్షి : ఎవరెస్టును ఎలా అధిరోహించారు. పూర్ణ : మొదట 5,400 మీటర్ల వద్ద ఉన్న బేస్ క్యాంపునకు చేరాం. అక్కడి నుంచి 6,400 మీటర్ల వద్ద ఉన్న అడ్వాన్స్ బేస్ క్యాంప్‌నకు, అక్కడినుంచి 7,100 మీటర్ల దగ్గర ఉన్న క్యాంప్ ఫాక్స్‌కు చేరుకున్నాం. అక్కడినుంచి బేస్ క్యాంప్‌నకు తిరిగివచ్చాం. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల అక్కడ 15 రోజులు ఉండాల్సి వచ్చింది. 19వ తేదీన మళ్లీ మొదలుపెట్టాం. 20న అడ్వాన్స్ క్యాంపునకు చేరాం. అక్కడ ఒకరోజు విశ్రాంతి తీసుకొన్న అనంతరం ముందుకు సాగాం. 22న క్యాంప్ వన్‌కు, 23న క్యాంప్ -2కు, 24న క్యాంప్ -3కి చేరాం. దీన్ని డెడ్ జోన్ అంటారు. 24న ఉదయం 9.30 గంటలకు లాస్ట్ ఈవెంట్ సమ్మిట్ హెడ్ క్యాంప్ వద్దకు చేరాం. 26న ఉదయం 6 గంటల ప్రాంతంలో శిఖరంపై జాతీయ పతాకాన్ని, తెలంగాణ జెండాను ఆవిష్కరించాం. బీఆర్ ఆంబేద్కర్, శంకరన్ చిత్రపటాలను ఉంచాం. 15 నిమిషాలు అక్కడ గడిపిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యాం. చదువు సంగతి.. పూర్ణ : పదో తరగతి తాడ్వాయి హాస్టల్లోనే ఉండి చదువుకుంటా. ఐపీఎస్ సాధించాలన్నది నా లక్ష్యం. కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకుంటా. సమాజానికి నావంతు సేవ చేస్తా. రాష్ట్ర, జాతీయ నేతలు అభినందించినపుడు మీ ఫీలింగ్ పూర్ణ : ఎవరెస్టును అధిరోహించి దేశ ప్రతిష్టను పెంచావంటూ అందరూ అభినందించారు. వారి అభినందనలతో ఎంతో సంతోషించా. గర్వంగా ఫీలవుతున్నా. కొత్త రాష్ట్రంలో ఈ విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఈ ఘనత సాధిస్తానని ఎప్పుడైనా అనుకున్నావా? పూర్ణ : పేద కుటుంబానికి చెందిన తాను ఇలాంటి సాహస యాత్ర చేస్తానని ఏనాడూ ఊహించలేదు. ఎవరెస్టుకు వెళ్లేందుకు ఎదురయ్యే ఆటంకాల గురించిన ఫొటోలు, వీడియోలు చూపించినప్పుడు అమ్మ భయపడింది. కానీ నాన్న వెన్నుతట్టారు. ప్రవీణ్‌సార్ ప్రోత్సాహంతో అరుదైన ఘనత సాధించా. ఇప్పుడు అందరూ ఆనందిస్తున్నారు. -
ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలుగు తేజాలకు నజరానా!
-
ఆనంద్, పూర్ణలకు కేసీఆర్ భారీ నజరానా
హైదరాబాద్: చిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన తెలుగుతేజాలు ఆనంద్, పూర్ణలకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు.. ఆనంద్, పూర్ణలకు చెరో 25 లక్షల రూపాయిల నగదు బహుమతిని ప్రకటించారు. తెలుగు తేజం మాలావత్ పూర్ణ చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా సాధనపల్లి ఆనంద్‌కుమార్ రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి.. 17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్ఇయర్ చదువుతున్నాడు. పూర్ణ, ఆనంద్‌లు దేశ వ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల లోక్‌సభ వీరిద్దరినీ అభినందించింది. ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పూర్ణ, ఆనంద్‌లను అభినందించి ఘనంగా సన్మానించారు. ఢిల్లీలో పూర్ణ, ఆనంద్ వారిని కలిశారు. -
తెలుగు తేజాలకు లోక్‌సభ అభినందనలు
న్యూఢిల్లీ: అతి పిన్నవయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగుతేజాలు మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌కుమార్‌లను లోక్‌సభ అభినందించింది. బుధవారం లోక్‌సభ సమావేశాలు మొదలైన తర్వాత పూర్ణ, ఆనంద్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పూర్ణ, ఆనంద్‌లను అభినందించి ఘనంగా సన్మానించారు. ఢిల్లీలో ఇటీవల పూర్ణ, ఆనంద్ వారిని కలిశారు. తెలుగు తేజం పూర్ణ చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆనంద్ రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి.. 17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్ఇయర్ చదువుతున్నాడు. -
ఎవరెస్టు వీరులకు గ్రాండ్ వెల్కం..
సాహసవీరులకు నగరం రెడ్‌కార్పెట్ అడుగడుగునా పూల జల్లు భారీ విజయోత్సవ ర్యాలీ సాక్షి,సిటీబ్యూరో: అతి పిన్నవయస్సులో అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిన మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌కుమార్‌లకు నగరం రెడ్‌కార్పెట్ పర్చింది. శంషాబాద్ విమానాశ్రయంలోకి అడుగుపెట్టగానే అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. నినాదాలు, పూలు జల్లుతూ సాదరస్వాగతం పలికారు. అత్యంత ప్రతికూల వాతావరణాన్ని ఎదిరించి ఎవరెస్టు శిఖరంపై భారతపతాకాన్ని ఎగురువేసిన సాంఘికసంక్షేమ గురుకుల విద్యార్థులైన తెలుగుతేజాలు ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి అభిమానులు, గురుకుల సంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారిని అభిమానులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రపుబగ్గీలో ర్యాలీగా విమానాశ్రయం నుంచి బయటకు తీసుకొచ్చారు. అక్కడ్నుంచి డప్పుచప్పుళ్లతో భారీర్యాలీగా బయల్దేరారు. పాతబస్తీలో..: సాహసవీరులు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు పాతనగరంలో ఘనస్వాగతం లభించింది. జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ జయంత్యుత్సవాల కమిటీ చైర్మన్ గడ్డం సత్యనారాయణ ఆధ్వర్యంలో వారికి స్వాగతం పలికారు. ఫలక్‌నుమాలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై హరిజన, గిరిజన ఆదివాసుల అభివృద్ధి సంఘం నాయకులు జి.మోతీలాల్‌నాయక్, దేవేందర్‌నాయక్, రవినాయక్‌లు వారిని అభినందించారు. ప్రపంచ బాడీబిల్డర్ మోతేశ్యాంఅలీఖాన్ సాహసవీరులకు పూలమాలలువేసి సత్కరించారు. బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, అలియాబాద్ చౌరస్తా, లాల్‌దర్వాజా చౌరస్తా, చార్మినార్ వద్ద అభిమానులు, వివిధప్రజాసంఘాల నేతలు స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మోజంజాహిమార్కెట్, గన్‌పార్క్, బాబుజగ్జీవన్‌రామ్ విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని రాజ్యాంగనిర్మాత విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఇంకా విజయాలు సాధిస్తాం గురుకుల, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ భోలక్‌పూర్: గురుకుల పాఠశాలల విద్యార్థుల విజ యాలు ఇది ఆరంభమేనని, ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయని గురుకుల, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఎవరెస్టు విజేతలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సన్మానం జరిగింది. దీనికి విచ్చేసిన ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కడమే కాదని, విద్యలో కూడా అదేస్థాయిలో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ను స్వారోబృందం యువకులు ఎత్తుకుని ఆనందంతో ఊరేగించారు. -
‘ఎవరెస్టు’ వీరులకు ఘనస్వాగతం
సాక్షి,హైదరాబాద్: ఎవరెస్టు శిఖరంపై భారత పతాకాన్ని ఎగరువేసిన తెలుగు తేజాలు లావత్పూర్ణ, సాధనపల్లి అనంద్‌కుమార్‌కు ఆదివారం ఇక్కడ ఘనస్వాగతం లభించింది. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే అభిమానులు గురుకుల సంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రపు బగ్గీలో ర్యాలీగా బయటికి తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి ర్యాలీగా శంషాబాద్‌కు చేరుకున్న పూర్ణ, ఆనంద్‌లు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా పాతబస్తీకి చేరుకున్నారు. ఫలక్‌నుమాలోనూ స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మొజంజాహిమార్కెట్, గన్‌పార్కు మీదుగా ట్యాంక్‌బంక్‌కు భారీ ర్యాలీ చేరుకుంది. -
ఎవరెస్ట్ వీరులకు మోడీ సన్మానం
చిన్న వయసులోనే ఎవరెస్ట్‌ను అధిరోహించి రికార్డు నెలకొల్పిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం వీరిద్దరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. పూర్ణ, ఆనంద్‌లను మోడీ సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్ణ, ఆనంద్‌లను మోడీ సన్మానిస్తున్నప్పటి ఫొటోను పీఎంఓ ప్రధాని కార్యాలయం అధికారులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. (చదవండి: మా సంకల్పం ముందు ఎవరెస్ట్ చిన్నదైంది) పూర్ణ, ఆనంద్‌లు గురువారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాన్ని సాధించి దేశంలోని విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఈ సందర్భంగా వారితో కలసి ఫొటోలు దిగారు. కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్‌ను కూడా ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. వారిని మంత్రి ప్రశంసలతో ముంచెత్తారు. (చదవండి: కష్టమనిపించినా.. ఇష్టపడి చేశాం) తెలుగు తేజం పూర్ణ చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆనంద్ రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి.. 17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్ఇయర్ చదువుతున్నాడు. -
పూర్ణ, ఆనంద్‌లకు నేపాల్‌లో సత్కారం
కఠ్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలుగు తేజాలు మాలావత్ పూర్ణ(13), ఎస్. ఆనంద్ కుమార్(16)లకు ఆదివారం నేపాల్‌లో ఘన సత్కారం లభించింది. నేపాల్‌లో దళితుల హక్కుల కోసం పోరాడే జాగరణ్ మీడియా సెంటర్‌వారు కఠ్మాండులో ఈ ఇద్దరు టీనేజర్లనూ ఘనంగా సన్మానించారు. కాగా, నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ, ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్‌లు చైనా వైపు నుంచి ఇటీవల ఎవరెస్టును అధిరోహించారు. వీరిలో పూర్ణ.. ఎవరెస్టును ఎక్కిన అతిపిన్న మహిళగా కూడా కొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. -
బేస్ క్యాంపునకు చేరుకున్న పూర్ణ, ఆనంద్
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులు మాలావత్ పూర్ణ, ఎస్. ఆనంద్‌కుమార్‌లు తిరుగుప్రయాణంలో భాగంగా మంగళవారం సాయంత్రం బేస్‌క్యాంప్‌నకు చేరుకున్నారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఐఎస్) నేతృత్వంలో వీరు ఎవరెస్ట్‌ను అధిరోహించగా, తిరుగుప్రయాణంలో భాగంగా అడ్వాన్డ్స్ బేస్ క్యాంప్(ఏబీసీ) నుంచి ఆదివారమే తిరుగుపయనమయ్యారు. అయితే, సోమవారం అక్కడి వాతావరణం ప్రతికూలంగా మారడంతో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ కిందికి దిగుతున్నారు. ఎవరెస్ట్ శిఖరం ఆఖరి పాయింట్‌గా పరిగణించే 8,848 మీటర్లు (సముద్రమట్టానికి 29,029 అడుగులు) నుంచి ఈ సాహసికులు దిగుతున్నారు. అక్కడ నుంచి కిందికి వస్తూ సముద్ర మట్టానికి 8 వేల మీటర్ల ఎత్తులో ఉన్న డెత్ జోన్ (లీథల్ పాయింట్), 8,230 మీటర్లు ఎత్తులో ఉన్న క్యాంప్-6 (ఎల్లో బ్యాండ్), 7,775 మీటర్ల ఎత్తున ఉన్న క్యాంప్-5, 7,100 మీటర్ల ఎత్తున ఉన్న క్యాంప్-4 (నార్త్ కోల్) మీదుగా 6,500 మీటర్ల వద్ద ఉన్న అడ్వాన్డ్స్ బేస్ క్యాంప్ (ఏబీసీ)కు చేరుకున్నారు. -
ఈ బాలలను అబినందించాలి
-
తెలుగుతేజం పూర్ణ ప్రపంచ రికార్డు
హైదరాబాద్: తెలుగు తేజం పూర్ణ ప్రపంచ రికార్డు సాధించింది. చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా పూర్ణ చరిత్ర సృష్టించింది. తెలుగు విద్యార్థులు ఆనంద్, పూర్ణ ఈ సాహసం చేశారు. ఎవరెస్ట్ పర్వతంపై వీళ్లు జాతీయ జెండా ఎగురవేశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆనంద్ రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ గతేడాది నవంబర్‌లో డార్జిలింగ్‌లోని 17వేల అడుగుల ఎత్తున్న మౌంట్ రినాక్ శిఖరాన్ని ఎక్కి రికార్డు సృష్టించారు. వీరి ప్రతిభను గుర్తిం చిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ వీరికి భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో ప్రత్యేక తర్ఫీదునిచ్చింది. వీరికి సొసైటీకి చైర్మన్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ తనవంతు సహాయం అందించారు. మూడు నెలల తర్ఫీదు అనంతరం విద్యార్థులను ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధం చేశారు. -
ఎవరెస్టుకు చేరువలో తెలుగుతేజాలు
హైదరాబాద్: ఆ ఇద్దరు విద్యార్థుల సంకల్ప బలం ముందు ఎవరెస్టు తలవంచుతోంది. ఆ ఇద్దరు మారుమూల గ్రామాల విద్యార్థులు వయసుకు మించిన సాహసయాత్రకు నడుం బిగించారు. సాంఘిక సంక్షేమశాఖ సహకారంతో భారత జెండాను ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్టు శిఖరాగ్రంపై ఎగురవేయబోతున్నా రు. అన్నీ సవ్యంగా సాగితే ఆదివారం ఉద యం 8కల్లా మువ్వన్నెల జెండాను ఎవరెస్టుపై రెపరెపలాడించేందుకు సన్నద్ధమవుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వీరి యాత్ర అత్యంత ప్రమాదకరమైన డెత్జోన్లో సాగుతుందని యాత్రను పర్యవేక్షిస్తున్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ శనివారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రస్తుతం వీరు బేస్ క్యాంప్‌కు 27,390 అడుగుల ఎత్తులో ప్రయాణం సాగిస్తున్నారన్నారు. మరో రెండువేల అడుగులు సాహసయాత్రను పూర్తిచేస్తే.. ఆదివారం ఉదయం 8 గంటల్లోపే లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. సాహసయాత్రకు చేయూత.. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ విద్యార్థులు సాహసయాత్రకు బయలుదేరారు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయికి చెందిన లక్ష్మి, దేవదాస్ వ్యవసాయ కూలీలు. వారి కుమార్తె మాలావత్ పూర్ణ స్వేరోస్(14) ప్రస్తుతం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ 9వ తరగతి చదువుతోంది. ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మి, కొండలరావు దంపతుల కుమారుడు ఆనంద్‌కుమార్(17) అన్నపురెడ్డిపల్లి ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఇద్దరు విద్యార్థులు ప్రముఖ పర్వతారోహకుడు, అర్జున అవార్డు గ్రహీత శేఖర్‌బాబు నేతత్వంలో ఈ సాహసయాత్ర చేస్తున్నారు. వీరితో పాటు వివిధ దేశాలకు చెందిన 30 మంది ఈ సాహసయాత్ర చేస్తున్నారు. వీరు ఎవరెస్టు శిఖరం అధిరోహిస్తే పూర్ణ స్వేరోస్ అత్యంత పిన్నవయస్సులో ఎవరెస్టు అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. -
‘ఎవరెస్టు’కు చేరువలో గ్రామీణ విద్యార్థులు
మెహిదీపట్నం, న్యూస్‌లైన్: ఆ ఇద్దరు గ్రామీణ విద్యార్థులు.. వారి లక్ష్యం మాత్రం ఎవరెస్టు.. దాన్ని ఛేదించే దిశగా పయనిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే దిశగా సాగుతున్నారు. ఏప్రిల్ 4వ తేదీన నగరం నుంచి బయలుదేరిన ఈ ఇద్దరు విద్యార్థులు ప్రస్తుతం ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంప్ నుంచి 21,300 అడుగుల ఎత్తుకు చేరుకున్నట్లు వారి సాహసయాత్రను పర్యవేక్షిస్తున్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ గురువారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గ్రామానికి చెందిన మాలావత్ పూర్ణ స్వేరోస్, ఖమ్మంజిల్లా చార్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన ఎస్.ఆనంద్‌కుమార్ అన్నపురెడ్డిపల్లిలో ఉన్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. పర్వతారోహణ అంటే మక్కువ ఉన్న వీరు అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ పర్వతారోహణుడు, ట్రైనర్ శేఖర్‌బాబు నేతృత్వంలో ఈ సాహసయాత్ర సాగిస్తున్నారు. వీరితో పాటు ప్రస్తుతం అక్కడ వివిధ దేశాలకు చెందిన 47 మంది సాహసయాత్ర దిశగా సాగుతున్నారు. కఠినమైన శిక్షణ తీసుకున్న ఈ విద్యార్థులు దాదాపు ఎవరెస్టు శిఖరానికి చేరువలో ఉన్నట్లు తెలిపారు. ఎవరెస్టు శిఖరానికి ఉత్తరం వైపు ఉన్న డెత్ జోన్‌ను అధిగమించగలిగితే వీరు దాదాపు ఎవరెస్టు శిఖరం అధిరోహించినట్లే. వీరి సాహసయాత్ర షెడ్యూల్ ప్రకారం జూన్5తో ముగిసే అవకాశం ఉన్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వీరు ఎవరెస్టు శిఖరం అధిరోహిస్తే పూర్ణ స్వేరోస్, అత్యంత పిన్నవయస్కురాలిగా ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం ఉందని ప్రవీణ్ కుమార్ తెలిపారు.