తెలుగుతేజం పూర్ణ ప్రపంచ రికార్డు | Telugu student Purna creates world record | Sakshi
Sakshi News home page

తెలుగుతేజం పూర్ణ ప్రపంచ రికార్డు

Published Sun, May 25 2014 10:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

Telugu student Purna creates world record

హైదరాబాద్: తెలుగు తేజం పూర్ణ ప్రపంచ రికార్డు సాధించింది. చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా పూర్ణ చరిత్ర సృష్టించింది. తెలుగు విద్యార్థులు ఆనంద్, పూర్ణ ఈ సాహసం చేశారు. ఎవరెస్ట్ పర్వతంపై వీళ్లు జాతీయ జెండా ఎగురవేశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆనంద్‌ రికార్డులకెక్కాడు.


14 ఏళ్ల పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్‌ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ గతేడాది నవంబర్‌లో డార్జిలింగ్‌లోని 17వేల అడుగుల ఎత్తున్న మౌంట్ రినాక్ శిఖరాన్ని ఎక్కి రికార్డు సృష్టించారు. వీరి ప్రతిభను గుర్తిం చిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ వీరికి భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో ప్రత్యేక తర్ఫీదునిచ్చింది. వీరికి సొసైటీకి చైర్మన్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ తనవంతు సహాయం అందించారు. మూడు నెలల తర్ఫీదు అనంతరం విద్యార్థులను ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement