ఆప్రికా ఖండంలో అతి పెద్ద పర్వతం మౌంట్ కిలిమాంజరోని అధిరోహించిన చిత్రం
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): కృషితో పట్టుదలతో ఆ యువకుడు ఏ పర్వతాన్నయినా అవలీలగా అధిరోహిస్తున్నాడు. ఆరేళ్ల క్రితం మనసులో వచ్చిన ఆలోచనకు పదును పెట్టి ఆచరణ సాధ్యం చేస్తున్నాడు. రాజమహేంద్రవరానికి చెందిన అతని పేరు ఉమేష్ ఆచంట. ఇతని తల్లిదండ్రులు బాలాజీ..పద్మావతి. ఉమేష్ చదువులో దిట్ట. టేబుల్ టెన్నిస్ అంటే ప్రాణం. ఈ ఆటలో అద్భుత ప్రావీణ్యం కనబరిచాడు. బీకాం ఉత్తీర్ణుడైన ఈ యువకుడు స్టోర్ట్సు కోటాలో రాజమహేంద్రవరంలోని పోస్టల్ డిపార్టుమెంట్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
2016లో చూసిన ఎవరెస్ట్ సినిమా ఇతని ప్రవృత్తిని మార్చేసింది. తాను కూడా ఎవరెస్ట్ ఎక్కాలని బలంగా సంకల్పించాడు. వాస్తవానికి పర్వతారోహణ అనేది సాహస విన్యాసం. అయినప్పటికీ కృతనిశ్చయంతో తల్లితండ్రులను ఒప్పించి అరుణాచల ప్రదేశ్ వెళ్లాడు. కఠోరమైన శిక్షణ పొందాడు. అప్పటి నుంచి చిన్న చిన్న కొండలను ఎక్కడం ప్రారంభించి నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు.
చూసి తాను కూడా ఎవరెస్ట్
ఉమేష్ అంచెలంచెలుగా తన లక్ష్యాన్ని పెంచుకుంటూ పోయాడు. మూడు ఖండాలలో అతి ఎత్తయిన శిఖరాలను అధిరోహించగలిగాడు. గతేడాది మార్చిలో ఆఫ్రికాలో అతి పెద్ద పర్వతం కిలిమంజారోను అధిరోహించి ఔరా అనిపించాడు. అదే ఏడాది ఆగస్టులో యూరప్ ఖండంలో అతిపెద్ద పర్వతం మౌంట్ ఎలబస్‌ని ఎక్కాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో అతిపెద్ద పర్వతం మౌంట్ కోజిస్కోని అధిరోహించి అందరి దృష్టీ ఆకర్షించాడు. తాజాగా ఎవరెస్ట్ ఎక్కడానికి సన్నద్ధమవుతున్నట్లు ఉమేష్ సాక్షికి చెప్పాడు.
ప్రమాద అంచున పయనం
కిలిమంజారో ఎత్తు 19340 అడుగులు. మొదటి రెండు రోజులు ఏ ఆటంకాలు లేకుండా ఎక్కగలిగాడు. మూడో రోజు ఆక్సిజన్ లెవల్ తగ్గిపోయింది. దీంతో ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న అధికారవర్గాలు వెంటనే స్పందించాయి. అక్కడికి గైడ్, రిస్క్యు టీంను పంపాయి. దీంతో ఉమేష్ ప్రాణాలతో బయట పడ్డాడు. అలాగే మౌంట్ కోజిస్కోపర్వతం ఎత్తు 2228 మీటర్లు. ఆస్ట్రేలియా ఖండంలో ఈ పర్వతం పూర్తిగా మంచుతో నిండి ఉంటుంది. దీంతో అక్కడ పర్వతారోహనను ఆపేశారు. కానీ ఉమేష్ ప్రత్యేక అనుమతి తీసుకుని ఈనెల 11న బేస్ క్యాంపు నుంచి బయులుదేరాడు.
సుమ్మిట్ పూర్తి చేసుకుని కిందకు రాత్రి లోపు వచ్చేయాలి. జీపీఎస్ సిగ్నల్స్..తీప్ర మంచు సమస్యలతో రూట్ మ్యాప్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. రావ్‌సన్ వద్ద ఎడమ వైపునకు వెళ్లాల్సి ఉంది. కానీ పొరపాటున దారి తప్పిపోయాడు. ఆ రాత్రి మళ్లీ కిందికి చేరుతానో లేదో అని తాను తీవ్ర ఆందోళన చెందానని ఉమేష్ చెప్పాడు. రాత్రి 12 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ టీంకు సమాచారం ఇద్దామన్నా సిగ్నిల్స్ లేవన్నాడు.
తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రెస్క్యూ అపరేషన్ టీం ఇతడ్ని గుర్తించింది. అతి జాగ్రత్తగా బేస్ క్యాంపునకు తీసుకు వచ్చింది. అయినా పట్టు వీడకుండా ఈనెల 12న బేస్ క్యాంప్ నుంచి మళ్లీ బయలుదేరి మౌంటైనీర్ అవిన జోష్ మాతేవ్‌తో కలిసి మౌంట్ కోజిస్కోను అధిరోహించగలిగాడు.
ఉమేష్ సాధించిన మెడల్స్
ఒడిదుడుకులు ఎదుర్కొని..
ప్రపంచంలో అతి ఎత్తయిన ఏడు పర్వతాలత్లో మౌంట్ ఎల్‌బస్ ఒకటి. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే పర్వతమిది. సముద్రమట్టానికి 16510 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విజయవంతంగా చేరుకోగలిగాడు. టీటీలో పలు ర్యాంకింగులు సాధించిన ఉమేష్ పర్వతరోహణలో ఏడు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు.
Comments
Please login to add a commentAdd a comment