world record
-
చరిత్ర సృష్టించిన శివమ్ దూబే.. వరల్డ్‌లోనే తొలి ప్లేయర్‌గా
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్‌లో అభిషేక్ శర్మతో పాటు శివమ్ దూబే(Shivam Dube) కూడా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ (13 బంతుల్లో 30 పరుగులు) ఆడిన దూబే.. అనంతరం బౌలింగ్‌లో రెండు వికెట్లతో సత్తాచాటాడు. ఫిల్ సాల్ట్, జాకబ్ బెతల్ వంటి కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో దూబే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దూబే వరల్డ్ రికార్డు..అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 30 విజయాలు సాధించిన జట్టులో భాగమైన తొలి క్రికెటర్‌గా దూబే వరల్డ్ రికార్డు సృష్టించాడు. దూబేకు భారత్ తరపున ఇది వరుసగా 30వ టీ20 విజయం కావడం గమనార్హం. దూబే తన కెరీర్లో టీమిండియా తరపున ఇప్పటివరకు 35 టీ20లు ఆడాడు. 2019లో ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20తో దూబే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత అతడి ఐదో టీ20లో సైతం బంగ్లాదేశ్‌లో భారత్ ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి దూబే ఆడిన ఏ టీ20 మ్యాచ్‌లోనూ టీమిండియా పరాజయం పాలవ్వలేదు. వరుసగా భారత్ 30 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.ఈ అరుదైన ఫీట్ సాధించిన దూబేకు ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ అభినందనలు తెలిపింది. "దూబే ఆడితే భారత్ గెలవాల్సిందే. దూబే ఆడిన 30 మ్యాచ్‌ల్లోనూ భారత్ వరుసగా విజయం సాధిచిందని సీఎస్కే ఎక్స్‌లో రాసుకొచ్చింది.కాగా ఇంగ్లండ్‌తో టీ20లకు దూబేకు తొలుత భారత జట్టులో చోటు దక్కలేదు. నితీశ్ కుమార్ రెడ్డి గాయపడడంతో దూబే జట్టులోకి వచ్చాడు. పుణే వేదికగా జరిగిన నాలుగో టీ20తో తుది జట్టులోకి వచ్చిన దూబే.. అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆ మ్యాచ్‌లో కంకషన్‌కు గురికావడంతో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.ఆఖరి టీ20లో మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని ఈ ముంబై ఆటగాడు అందిపుచ్చుకున్నాడు. కాగా టీ20 సిరీస్ ముగియడంతో దూబే ముంబై తరపున రంజీల్లో ఆడనున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది.జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్, మార్క్ వుడ్.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి -
కళ్లు చెదిరే ఇన్‌స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలు
సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌కు, లేదా ఒక వీడియోకు లేదా ఒక రీల్‌కు దక్కిన వ్యూస్, కామెంట్స్ ఆధారంగా దాని ప్రాధాన్యతను అంచనా వేస్తుంటాం సాధారణంగా. క్రియేట్ చేసినవాళ్లే ఆశ్చర్యపోయేలా మిలియన్ల వ్యూస్‌తో ప్రజాదరణ పొంది, రికార్డులను క్రియేట్ చేసే కొన్ని విశేషమైన వీడియోలను కూడా చూస్తుంటాం. ఇలా సరదాగా సృష్టించిన ఒక రీల్ రికార్డు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా చూసిన ఈ వైరల్ క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది. రండి.. ఆ రికార్డ్ స్టంట్ రీల్ కథాకమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఒకటీ రెండూ ఏకంగా 55.4 కోట్ల (554 మిలియన్ల) మంది ఆ రీల్‌ను వీక్షించారంటే మరి ప్రపంచ రికార్డు కాక మరేమిటి. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఈ ఫీట్ సాధించింది ఎవరో తెలుసా? భారతదేశంలోని కేరళకు చెందిన ఫ్రీస్టైల్ ఫుట్‌బాల్ ఆటగాడు 21 ఏళ్ల ముహమ్మద్ రిజ్వాన్. ఈ స్టార్ ప్లేయర్ కంటెంట్ క్రియేటర్‌గా కూడా పాపులర్ అయ్యాడు. 2023 నవంబరులో ఈ రీల్ పోస్ట్ చేశాడు. అప్పటినుంచి ఇది వైరల్ అవుతూ రికార్డును కొట్టేసింది. మలప్పురంలోని కేరళంకుండు జలపాతం వద్ద చిత్రీకరించిన రీల్‌ను పోస్ట్ చేశాడు. ఈ రీల్లో ఒక జలపాతం వద్ద బంతిని బలంగా తంతాడు. దీంతో ఆ బంతి జలపాతం వెనుక ఉన్న రాళ్ల నుండి ఎగిరి పడుతుంది. అద్భుతమైన ఈ దృశ్యం చూసి రిజ్వాన్ కూడా ఆశ్చర్యపోయాడు. కేవలం క్రీడాకారులను మాత్రమే కాదు, కోట్లాదిమంది నెటిజనులను కూడా ఆకట్టుకుంది. అప్పటి నుండి, రీల్ ప్రజాదరణ పొందింది, 92 లక్షలకు పైగా (9.2 మిలియన్లు) లైక్‌లు మరియు 42,000 కంటే ఎక్కు లక్షల కొద్దీ లైక్స్, కామెంట్లను దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఇన్స్టాగ్రామ్ రీల్‌తో అవార్డు కూడా పొందాడు. ఇదీ చదవండి: మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలువిశేషం ఏమిటంటేఅతని రీల్ జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువ వీక్షణలను సాధించడం విశేషమే మరి. జర్మనీ, ఫ్రాన్స్ స్పెయిన్‌ల ఉమ్మడి జనాభా కంటే ఎక్కువ వ్యూస్ అంటూ నెటిజన్లను రిజ్వాన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.రిజ్వాన్ స్పందన“నేను దీన్ని ఎప్పుడూ ఊహించలేదు. ఇది స్నేహితులతో సరదాగా గడిపిన వీడియో. 10 నిమిషాల్లోనే, దీనికి 2లక్షలవీక్షణలు వచ్చాయి . నేను ఇంటికి చేరుకునే సమయానికి, అది మిలియన్‌కు చేరుకుంది.” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపురిజ్వాన్ అసాధారణ విజయాన్ని ఈ ఏడాది జనవరి 8న అధికారికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిజ్వన్ షేర్ చేశాడు. అదే జలపాతం వద్ద, ఒక చేతిలో వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్‌ను, మరో చేతిలో ఫుట్‌బాల్‌ను పట్టుకుని, తనను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. (బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్) View this post on Instagram A post shared by muhammed riswan (@riswan_freestyle) కేవలం 21 సంవత్సరాల వయస్సులో, రిజ్వాన్ తన వైరల్ రీల్‌కు మాత్రమే కాకుండా తన అద్భుతమైన ఫ్రీస్టైల్ ఫుట్‌బాల్ నైపుణ్యాలకు కూడా ప్రపంచ సంచలన ఆటగాడు. ఆటలోని విన్యాసాలకు పరిమితం కాలేదు రిజ్వాన్ పర్వత శిఖరాలపై, కారు పైకప్పులపై మకా, నీటి అడుగున కూడా విన్యాసాలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఫుట్‌బాల్‌తో పాటు, రిజ్వాన్ రోజువారీ వస్తువులతో కూడా సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. -
వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్
సైకాలజీ స్టూడెంట్ ఇప్పుడు టీమిండియా తరఫున సత్తా చాటుతోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఆరో ఇన్నింగ్స్‌లోనే ఏకంగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. భారత మహిళా క్రికెట్ జట్టులోకి దూసుకువచ్చిన ఆ యువ కెరటం మరెవరో కాదు.. ప్రతీకా రావల్(Pratika Rawal).యువ ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma) వరుస వైఫల్యాల నేపథ్యంలో సెలక్టర్లు ప్రతీకా రావల్‌కు పిలుపునిచ్చారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న 24 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది డిసెంబరులో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసింది. ఈ క్రమంలో ఆడిన తొలి నాలుగు వన్డేల్లోనే రెండు అర్ధ శతకాలతో మెరిసింది.వరల్డ్ రికార్డు బద్దలుతాజాగా ఐర్లాండ్‌తో వన్డే సిరీస్(India Women Vs Ireland Women) జట్టులోనూ చోటు దక్కించుకున్న ప్రతీకా రావల్.. మూడు మ్యాచ్‌లలోనూ అదరగొట్టింది. తొలి వన్డేలో 89, రెండో వన్డేలో 67 పరుగులు సాధించిన ప్రతీకా.. బుధవారం నాటి మూడో వన్డేలో భారీ శతకంతో అదరగొట్టింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 154 పరుగులు సాధించింది.ఈ క్రమంలో ప్రతీకా రావల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. ఇదిలా ఉంటే.. ప్రతీకా రావల్ భారత్ తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు (154)ను సాధించింది. దీప్తి శర్మ (188), హర్మన్‌ప్రీత్ (171 నాటౌట్) ఆమెకంటే ముందున్నారు. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు👉ప్రతీకా రావల్(ఇండియా)- 444 పరుగులు👉చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్)- 434 పరుగులు👉నథాకన్ చాంథమ్(థాయ్‌లాండ్)- 322 పరుగులు👉ఎనిడ్ బేక్వెల్(ఇంగ్లండ్)- 316 పరుగులు👉నికోలే బోల్టన్(ఆస్ట్రేలియా)- 307 పరుగులు.అతిపెద్ద వన్డే విజయంరాజ్కోట్ వేదికగా ఐర్లాండ్‌తో మూడో వన్డేలో భారత ఓపెనర్లు ప్రతీక రావల్(154), స్మృతి మంధాన(135) శతకాలతో చెలరేగారు. వీరిద్దరికి తోడు రిచా ఘోష్ హాఫ్ సెంచరీ(59)తో రాణించింది. ఈ క్రమంలో భారత జట్టు 435 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది. పురుషులు, మహిళల వన్డే క్రికెట్లో భారత్‌కు ఇదే అతిపెద్ద స్కోరు. ఓవరాల్‌గా మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. టాప్–3 అత్యధిక స్కోర్లు న్యూజిలాండ్ (491/4; 2018లో ఐర్లాండ్‌పై; 455/5; 1997లో పాక్‌పై; 440/3; 2018లో ఐర్లాండ్‌పై) పేరిటే ఉండటం విశేషం.ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 304 పరుగులతో ఐర్లాండ్‌పై టీమిండియా జయభేరి మోగించింది. పరుగుల తేడా పరంగా భారత మహిళా జట్టుకిదే అతిపెద్ద విజయం. 2017లో భారత్ 249 పరుగుల తేడాతో ఐర్లాండ్‌నే ఓడించింది. ఇక ఈ గెలుపుతో 3–0తో వన్డే సిరీస్‌ను స్మృతి బృందం క్లీన్‌స్వీప్ చేసింది. అదే విధంగా.. భారత జట్టు ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేయడం ఇది 13వసారి. అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన రికార్డు ఆస్ట్రేలియా (33 సార్లు) పేరిట ఉంది. ఇక.. ఐర్లాండ్‌తో ఇప్పటి వరకు ఆడిన 15 వన్డేల్లోనూ భారత జట్టే గెలవడం మరో విశేషం.చదవండి: ముంబై రంజీ జట్టుతో రోహిత్ శర్మ, యశస్వి ప్రాక్టీస్A post-series chat with the record-breaking opening duo! 😎From Maiden ODI century to Fastest ODI Hundred for India in women's cricket 💯Captain Smriti Mandhana and Pratika Rawal 𝙚𝙡𝙖𝙗𝙤𝙧𝙖𝙩𝙚 it all 😃👌 - By @mihirlee_58 #TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/7c0xsYGaIo— BCCI Women (@BCCIWomen) January 16, 2025 -
వరల్డ్ రికార్డుపై కన్నేసిన షమీ.. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడంటే..
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో గనుక అతడు రాణిస్తే.. మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023లో షమీ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.కాస్త ఆలస్యంగా ఈ మెగా టోర్నీలో ఎంట్రీ ఇచ్చినా.. వికెట్ల వేటలో మాత్రం దూసుకుపోయాడు షమీ. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే, వరల్డ్‌కప్ మధ్యలోనే చీలమండ నొప్పి వేధించినా లెక్కచేయని షమీ.. టోర్నీ ముగిసిన తర్వాత మాత్రం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు ఏడాది కాలం పట్టింది. అయితే, ఇప్పటి వరకు అతడు టీమిండియాలో పునరాగమనం చేయలేకపోయాడు. తొలుత దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ఈ పేస్ బౌలర్.. పదకొండు వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో షమీ స్థానం దక్కించుకున్నాడు. సొంతగడ్డపై జరిగే ఈ సిరీస్ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డేల్లోనూ షమీ చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది.ఈ నేపథ్యంలో షమీని ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అతడు ఐదు వికెట్లు తీస్తే చాలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరిన మొదటి క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది.షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్లోస్టార్క్ 102 ఇన్నింగ్స్‌లో 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. అయితే, షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్‌లో 195 వికెట్లు పడగొట్టాడు. కాబట్టి తదుపరి ఆడబోయే వన్డేలో షమీ ఐదు వికెట్లు తీశాడంటే.. స్టార్క్ వరల్డ్ రికార్డును అతడు బద్దలుకొడతాడు. ఇక భారత్ తరఫున అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్‌గా.. టీమిండియా ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కొనసాగుతున్నాడు. అతడు 133 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ అందుకున్నాడు.కాగా టీమిండియా ఇంగ్లండ్‌తో జనవరి 22- ఫిబ్రవరి 2 వరకు ఐదు టీ20లు ఆడనుంది. అనంతరం.. ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో తొలి వన్డే, ఫిబ్రవరి 9న కటక్‌లో రెండో వన్డే, ఫిబ్రవరి 12న మూడో అహ్మదాబాద్‌లో మూడో వన్డే జరుగనున్నాయి.వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్లు వీరే1. మిచెల్ స్టార్క్- 102 మ్యాచ్‌లలో2. సక్లెయిన్ ముస్తాక్- 104 మ్యాచ్‌లలో3. ట్రెంట్ బౌల్ట్- 107 మ్యాచ్‌లలో4. బ్రెట్ లీ- 112 మ్యాచ్‌లలో5. అలెన్ డొనాల్డ్- 117 మ్యాచ్‌లలో.చదవండి: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు! -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. 122 ఏళ్ల వరల్డ్ రికార్డు బద్దలు
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘోర ఓటమి చవిచూసింది. పాకిస్తాన్ నిర్ధేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా 7.1 ఓవర్లలో ఛేదించింది.దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 194 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్.. ఫాలో ఆన్(రెండో ఇన్నింగ్స్)లో మాత్రం అద్బుతమైన పోరాటం కనబరిచింది.421 పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడిన పాకిస్తాన్ 478 పరుగుల భారీ స్కోర్ సాధించింది. షాన్ మసూద్ (145) సెంచరీ చేయగా.. బాబర్ ఆజాం (81) హాఫ్ సెంచరీతో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోర్‌కే పరిమితం కావడంతో పాక్ జట్టు సఫారీల ముందు మెరుగైన టార్గెట్‌ను ఉంచలేకపోయింది.దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 615 పరుగులు చేసింది. ప్రోటీస్ తొలి ఇన్నింగ్స్‌లో ర్యాన్ రికెల్టన్ (259) డబుల్ సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా (106), కైల్ వెర్రెన్న్ (100) శతకాలతో మెరిశారు. పాక్ బౌలర్లు అబ్బాస్, సల్మాన్ అఘా మూడేసి వికెట్లు పడగొట్టారు.చరిత్ర సృష్టించిన పాక్..కాగా ఫాలో ఆన్‌లో ధీటుగా ఆడిన పాకిస్తాన్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఫాల్ ఆన్‌లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. ఇంతకముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 1902లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడి 372/7 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో 122 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డును పాకిస్తాన్ బ్రేక్ చేసింది. ఆస్ట్రేలియా (372/7) తర్వాత వెస్టిండీస్ (348/10), న్యూజిలాండ్ (342/10), శ్రీలంక (342/10) జట్లు ఉన్నాయి.చదవండి: Ind vs Eng: ఇంకెన్నాళ్లు ఇలా?.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లలోనైనా ఆడిస్తారా? -
చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్.. ప్రపంచ రికార్డు బద్దలు
టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్, విదర్భ జట్టు సారధి కరుణ్ నాయర్ (Karun Nair) విజయ్ హజారే ట్రోఫీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో ఇవాళ (జనవరి 3) జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ చేసిన కరుణ్ (101 బంతుల్లో 112; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) లిస్ట్-ఏ (50 ఓవర్ల ఫార్మాట్) క్రికెట్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. కరుణ్ లిస్ట్-ఏ క్రికెట్లో ఔట్ కాకుండా 541 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ పేరిట ఉండేది. ఫ్రాంక్లిన్ లిస్ట్-ఏ క్రికెట్లో ఔట్ కాకుండా 527 పరుగులు చేశాడు. కరుణ్, ఫ్రాంక్లిన్ తర్వాత ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వాన్ హీర్డెన్ (512) ఉన్నాడు.ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు..యూపీతో మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన కరుణ్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు చేశాడు. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో అజేయ సెంచరీ (112) చేసిన కరుణ్.. ఆతర్వాత చత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 44 పరుగులు చేశాడు. ఆతర్వాత కరుణ్ వరుసగా చంఢీఘడ్ (163 నాటౌట్), తమిళనాడు (111 నాటౌట్), ఉత్తర్‌ప్రదేశ్‌లపై (112) హ్యాట్రిక్ సెంచరీలు చేశాడు. ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. కరుణ్ 5 ఇన్నింగ్స్‌ల్లో 542 సగటున 542 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కరుణ్ 115.07 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు.కరుణ్ సూపర్ సెంచరీతో మెరవడంతో యూపీపై విదర్భ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో విదర్భకు ఇది వరుసగా ఐదో విజయం. విదర్భతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. సమీర్ రిజ్వి (82 బంతుల్లో 105; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు శతకం బాదాడు. కెప్టెన్ రింకూ సింగ్ (6) విఫలమయ్యాడు. విదర్భ బౌలర్లలో నచికేత్ భూటే నాలుగు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బరిలోకి దిగిన విదర్భ 47.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కరుణ్ నాయర్‌తో పాటు యశ్ రాథోడ్ సెంచరీ చేశాడు. యశ్ 140 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్ సాయంతో 138 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. యూపీ బౌలర్లలో రింకూ సింగ్, బిహారీ రాయ్ తలో వికెట్ పడగొట్టారు. -
ఒళ్లు గగుర్పొడిచే తెలుగోడి విన్యాసం : శిక్షణ లేకుండా, ఎవరూ ట్రై చేయొద్దు!
సామాన్య వ్యక్తినుంచి అసామాన్య వ్యక్తిగా ఎదిగిన 'డ్రిల్ మ్యాన్' గుర్తు ఉన్నాడా? అబ్బరపరిచే సాహస విన్యాసాలకు మారుపేరు ఈ డ్రిల్ మ్యాన్. తాజాగా మరో ఒళ్లు గుగుర్పొడిచే సాహసంతో గిన్నిస్‌బుక్ రికార్డు సాధించాడు. ఆ సాహసం పేరే తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పనికెర అలియాస్ డ్రిల్‌మ్యాన్.57 విద్యుత్ ఫ్యాన్ బ్లేడ్ల నాలుకతో ఆపి, ఇన్క్రెడిబుల్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. కేవలం ఒకే ఒక్క నిమిషాంలో ఈ ఫీట్ సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అసాధారణమైన టైటిల్ కోసం అద్భుతమైన ప్రయత్నం డ్రిల్‌మ్యాన్ సాహసం ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. హైస్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపివేసి దృశ్యం ప్రేక్షకులను అబ్బురపర్చింది. ఆశ్చర్యంతో కళ్లప్పగించి చూడటం అక్కడున్న ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల వంతైంది. 60 సెకన్లు గడిచిన తర్వాత, లో షో డీ రికార్డ్ అనౌన్సర్ "ఆపు" అనేంత వరకు ఆయన ప్రయత్నం కొనసాగింది. ఈ విషయంలో గతంలో తాను సృష్టించిన రికార్డును తానే అధిగమించాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ ఫీట్‌ను మరోసారి నిర్ధారించుకున్న న్యాయనిర్ణేతలు డ్రిల్మాన్కు సర్టిఫికేట్ అందించారు. ఈ టైటిల్‌ను సాధించిన తర్వాత డ్రిల్‌మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు.2024లో అరవై సెకన్లలో ఎన్ని ఫ్యాన్లు నాలుకతో ఆపగలరు అన్న టాస్క్‌లో నాలుకతో ఏకంగా 52 ఫ్యాన్లను ఆపి రికార్డు సాధించాడు. అంతేనా రెండడుగుల కత్తిని గొంతు లోకి దింపాడు. ఇదే కత్తికి కట్టిన తాడు సాయంతో 1944 కిలోలుండే వోక్స్ వ్యాగన్ వాహనాన్ని ఐదు మీటర్లు లాగాడు. ఇందులో ఎనిమిది మంది ఉండటం విశేషం. ఆ తర్వాత అరవై సెకన్లలో నాలుగు అంగుళాల 22 మేకులను ముక్కులోకి సుత్తితో కొట్టి మళ్లీ బయటకు తీశాడు. ఇతగాడి జైత్రయాత్ర ఇంకా ఉంది. సలసల కాగే వేడి నూనెలో చికెన్ ముక్కలను చేతితో బయటకు తీయడం అనేఫీట్లో. కేవలం 60 సెకన్లలో 17 చికెన్ ముక్కలను తీసి గిన్నిస్ రికార్డులను సృష్టించాడు . ఇలా గతంలోనే నాలుగు రికార్డులు సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే ఇలాంటి రికార్డులు నెలకొల్పిన వ్యక్తిగా నిలిచాడు క్రాంతి కుమార్. తాజా ఫీట్‌తో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.Most electric fan blades stopped using the tongue in one minute 👅 57 by Kranthi Drillman 🇮🇳 pic.twitter.com/dsH8FULHxW— Guinness World Records (@GWR) January 2, 2025 -
ప్రపంచంలో అతిచిన్న కెమెరా ఇదే
ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఇమేజ్ సెన్సర్ చిప్. అమెరికన్ కెమెరాల తయారీ కంపెనీ ‘ఓమ్నివిజన్’ కెమెరాల్లో ఉపయోగించే ఈ ఇమేజ్ సెన్సర్ చిప్‌ను ‘ఓవీఎం 6948’ పేరుతో ఇటీవల రూపొందించింది.‘చిప్ ఆన్ టిప్’ అనే ప్రచారంతో అందుబాటులోకి తెచ్చిన ఈ చిప్ ప్రపంచంలోనే అత్యంత చిన్న ఇమేజ్ సెన్సర్ చిప్‌గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. దీని పొడవు 0.65 మి.మీ., వెడల్పు 0.65 మి.మీ., మందం 1.158 మి.మీ. అంటే, దాదాపు ఒక పంచదార రేణువంత పరిమాణంలో ఉంటుంది.ఇది 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఫొటోలు తీయడానికి ఉపయోగపడుతుంది. ఎండోస్కోప్ సహా వివిధ వైద్య పరికరాల కెమెరాల్లో ఉపయోగించడానికి ఇది అత్యంత అనువుగా ఉంటుంది. ఇది సెకనుకు 30 ఫ్రేముల సామర్థ్యంతో వీడియోలు కూడా తీయగలదు. -
షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు..
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో పాకిస్తాన్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడినప్పటకి ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్ పీటర్‌ను ఔట్ చేయడంతో అఫ్రిది వందో టీ20 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను ఈ పాకిస్తానీ స్పీడ్ స్టార్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆల్ ఫార్మాట్లలో 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన నాలుగో ప్లేయర్‌గా అఫ్రిది రికార్డులకెక్కాడు. అఫ్రిది ఇప్పటివరకు టెస్టుల్లో 116 వికెట్లు పడగొట్టగా.. వన్డేల్లో 112, టీ20ల్లో 100 వికెట్లు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ అగ్రస్ధానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తానీ కూడా అఫ్రిదినే కావడం గమనార్హం.👉మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్లు వీరేబౌలర్టెస్టు వికెట్లువన్డే వికెట్లుటీ20 వికెట్లుటిమ్ సౌథీ(న్యూజిలాండ్)389221164షకీబ్ అల్హసన్(బంగ్లాదేశ్)246317149లసిత్ మలింగ(శ్రీలంక)101338107షాహీన్ అఫ్రిది(పాక్)116112100 -
ఎనిమిది శాస్త్రీయ నృత్య రూపాలు ఒకేసారి..!
ఎవరైనా ఒకటో రెండో శాస్త్రీయ నృత్య కళలను ప్రదర్శించడం చూస్తుంటాం. వారి కళకు అభివాదం తెలియజేస్తుంటాం. కేరళలోని ఇరింజలకుడకు చెందిన అనఘశ్రీ సజీవనాథ్ భారతీయ శాస్త్రీయ నృత్య కళారూపాలైన కథాకళి, కూచిపూడి, సత్రియా, మణిపురి, ఒడిస్సీ, మోహినియాట్టం, భరతనాట్యం, కథక్లను ఒక గంటా 30 నిమిషాల్లో ప్రదర్శించి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను నెలకొల్పారు. అన్ని భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలను అత్యధిక కాలం పాటు ప్రదర్శించి, రికార్డు సాధించిన ఘనత అనఘశ్రీ సొంతం చేసుకుంది. 27 ఏళ్ల అనఘ చిన్ననాటి నుంచే శాస్త్రీయ నృత్య సాధనలో తనైదన మార్క్ చూపిస్తూ ఉండేది. తమ స్థానిక కళ మోహినియాట్టం నేర్చుకోవడంలో చూపే ఆసక్తి, ఆ తర్వాత తర్వాత ఇతర నృత్య సాధనలవైపు మల్లేలా చేసిందని చెబుతుంది అనఘ. (చదవండి: బ్రెస్ట్ కేన్సర్ ఉంటే భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్ తగ్గొచ్చా..?) -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచ క్రికెట్లో తొలి జట్టుగా
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించింది.టెస్టుల్లో 5 లక్షలు పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఈ అరుదైన ఘనత సాధించింది. క్రికెట్ పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లండ్ జట్టు తమ తొలి టెస్టు మ్యాచ్ 1877లో ఆస్ట్రేలియాతో ఆడింది. అప్పటినుంచి ఇప్పటివరకు 1082 టెస్టులు ఆడిన ఇంగ్లీష్ జట్టు 5 లక్షలకు పైగా పరుగులు చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ తర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా(4,28,794 ప్లస్ రన్స్), భారత్( 2,78,700 ప్లస్ రన్స్) వరుసగా ఉన్నాయి. అదేవిధంగా టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉంది. ఇప్పటి వరకు ఇంగ్లండ్ బ్యాటర్లు 929 సెంచరీలు చేశారు.పట్టు బిగించిన ఇంగ్లండ్..ఇక కివీస్‌తో రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 378/5 స్కోరుతో ఉంది. దీంతో ఇంగ్లండ్ ప్రస్తుతం 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.క్రీజులో జో రూట్(73 బ్యాటింగ్), బెన్ స్టోక్స్(35 బ్యాటింగ్) ఉన్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కేవలం 125 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 280 పరుగులు చేసింది. ఇక ఇప్పటికే తొలి టెస్టులో కివీస్‌ను ఇంగ్లండ్ చిత్తు చేసింది.చదవండి: IND vs AUS:బుమ్రా మాస్టర్ మైండ్.. ట్రాప్‌లో చిక్కుకున్న స్మిత్! వీడియో -
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు బ్రేక్.. ఫాస్టెస్ట్ సెంచూరియన్‌గా!
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు సాధించాడు. కేవలం 33 బంతుల్లోనే శతకం బాది.. టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. కాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా జింబాబ్వే బుధవారం గాంబియాతో మ్యాచ్ ఆడింది.ఫాస్టెస్ట్ సెంచరీనైరోబీలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్( 26 బంతుల్లో 50), తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani- 19 బంతుల్లోనే 62) దుమ్ములేపగా.. సికందర్ రజా కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు.ఈ క్రమంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టు హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా సికందర్ రజా వరల్డ్ రికార్డు సృష్టించాడు.టెస్టులు ఆడే దేశాలకు చెందిన ఆటగాళ్లలో టీ20 ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసింది వీరే1. సికందర్ రజా(జింబాబ్వే)- గాంబియాపై 33 బంతుల్లో శతకం2. డేవిడ్ మిల్లర్(సౌతాఫ్రికా)- బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో సెంచరీ3. రోహిత్ శర్మ(ఇండియా)- శ్రీలంకపై 35 బంతుల్లో శతకం4. జాన్సన్ చార్ల్స్(వెస్టిండీస్)- సౌతాఫ్రికాపై 39 బంతుల్లో శతకం5. సంజూ శాంసన్(ఇండియా)- బంగ్లాదేశ్‌పై 40 బంతుల్లో శతకంఏకంగా 15 సిక్సర్లతో మరో రికార్డుఇక గాంబియాతో మ్యాచ్‌లో మొత్తంగా 3 బంతులు ఎదుర్కొన్న సికందర్ రజా.. ఏడు బౌండరీలు, పదిహేను సిక్స్‌ల సాయంతో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మరో రికార్డును కూడా సికందర్ రజా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు. ఈ లిస్టులో సాహిల్ చౌహాన్, హజ్రతుల్లా జజాయ్, ఫిన్ అలెన్ 16 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. సికందర్ రజా, జీషన్ కుకిఖెల్ 15 సిక్స్‌లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గాంబియాపై 344 పరుగులుస్కోరు చేసి ప్రపంచ రికార్డు సాధించింది.చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో! -
సికిందర్ రజా ఊచకోత.. టీ20 క్రికెట్లో జింబాబ్వే ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే పరుగుల విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 344 రన్స్ స్కోరు చేసింది. తద్వారా ఇంటర్నేషనల్ టీ20లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది.గాంబియా బౌలింగ్ ఊచకోతనైరోబిలోని రౌరాక స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జింబాబ్వే గాంబియా(Gambia) జట్టుతో తలపడింది. టాస్ గెలిచిన సికందర్ రజా బృందం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్, తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani) గాంబియా బౌలింగ్‌ను ఊచకోత కోశారు. బ్రియాన్ 26 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు రాబట్టగా.. మరుమణి కేవలం 19 బంతుల్లోనే 62 రన్స్ సాధించాడు.సికందర్ రజా ఒక్కడే 133 రన్స్వన్డౌన్ బ్యాటర్ డియాన్ మైర్స్(12) విఫలం కాగా.. కెప్టెన్ సికందర్ రజా పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 133 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగతావాళ్లలో రియాన్ బర్ల్ 11 బంతుల్లో 25, క్లైవ్ మడాండే కేవలం 17 బంతుల్లోనే 53(నాటౌట్) పరుగులు సాధించారు. చరిత్ర పుటల్లోకి జింబాబ్వే జట్టుఫలితంగా కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు స్కోరు చేసింది. తద్వారా నేపాల్ పేరిట ఉన్న టీ20 ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్ మంగోలియాపై 314 పరుగులు స్కోరు చేసింది. తాజాగా జింబాబ్వే ఆ రికార్డును బ్రేక్ చేసి అత్యధిక పరుగుల జట్టుగా తమ పేరును చరిత్రపుటల్లో లిఖించుకుంది. 290 పరుగుల భారీ తేడాతో విజయంజింబాబ్వే విధించిన కొండంత లక్ష్యాన్ని చూసి బెంబేలెత్తిన గాంబియా.. 54 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు ఆటగాళ్ల స్కోర్లు వరుస(బ్యాటింగ్ ఆర్డర్)గా 5,0,7,4,7,1,2,2,0,12*,0. దీంతో జింబాబ్వే ఏకంగా 290 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రాండన్ మవుతా మూడేసి వికెట్ల తీయగా.. వెస్లీ మధెవెరె రెండు, ర్యాన్ బర్ల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో! -
అతి చిన్న వాషింగ్ మెషీన్‌తో ప్రపంచ రికార్డు
-
అతి చిన్న వాషింగ్ మెషీన్‌తో ప్రపంచ రికార్డు..!
ఊహకే అందని విధంగా అత్యంత మైక్రో వాషింగ్ మెషిన్ని రూపొందించి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు భారతీయ ఇంజనీర్ సెబిన్ సాజీ. ఇదే ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్. దీని వైశాల్యం, పొడవు, వెడల్పలు వరుసగా 1.28 అంగుళాలు, 1.32 అంగుళాలు, 1.52 అంగుళాలే కావడం విశేషం. ఇది ఇది 1990ల నాటి ప్రసిద్ధ హ్యాండ్‌హెల్డ్ బొమ్మ అయిన డిజిటల్ పెంపుడు జంతువు సైజు కంటే కూడా చిన్నది. అయితే ఇది సాధారణ వాషింగ్ మెషీన్‌లానే పనిచేస్తుండటం మరింత విశేషం. ఇది చిన్న లోడ్ల కోసం రూపొందించడం జరిగింది. ఇంజీనీరింగ్ నైపుణ్యంతో సూక్ష్మీకరణ అనే హస్తకళకు సాజీ రూపొందించిన ఈ గాడ్జెట్ నిలువెత్తు నిదర్శనం. వర్కింగ్ పరంగా అసెంబుల్ చేసి చూస్తే..అది పూర్తిగా వర్క్ అవ్వడమే కాక, వాష్ , రిన్ , స్పిన్, వంటి వాటిని కొలిచేందుకు డిజిటల్ కాలిపర్లను ఉపయోగించారు. సాజీ వాషింగ్ మెషీన్ ఎలా వర్క్చేస్తుందో వివరిస్తున్న వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వాషింగ్ మెషీన్లో చిన్న క్లాత్, చిటికెడు వాషింగ్ పౌడర్ వేయగానే ఎలా వాష్ చేస్తుందో క్లియర్‌గా ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇప్పటివరకు తయారైన మైక్రో వాషింగ్ మెషీన్లలో ఇదే అత్యంత చిన్నదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. (చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..!) -
ప్రపంచ రికార్డు కోసం 1,121కిలోల గుమ్మడికాయ (ఫొటోలు)
-
అశ్విన్‌కే సాధ్యం.. ముత్తయ్య మురళీధరన్ వరల్డ్ రికార్డు సమం
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఎడిషన్‌లో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సత్తా చాటాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్న వేళ సెంచరీతో ఆదుకున్నాడు.సొంత మైదానం చెపాక్‌లో నిలకడగా ఆడి 113 పరుగులు సాధించాడు. అంతేకాదు.. అదే మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. ఇలా ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించి.. బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి అశూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.రెండో టెస్టులోనూ అదరగొట్టిఇక కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్టులోనూ అశ్విన్ అదరగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లను తిప్పలుపెట్టి కీలక వికెట్లు కూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజ్ముల్ షాంటో(31), షకీబ్ అల్ హసన్(9) వికెట్లు తీసిన అశూ.. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జకీర్ హసన్(10), మొమినుల్ హక్(2), హసన్ మహమూద్(4)లను పెవిలియన్‌కు పంపాడు. అలా మొత్తంగా రెండో టెస్టులో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ రికార్డు సమంఈ మ్యాచ్‌లోనూ భారత్ బంగ్లాపై గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన అశ్విన్‌ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. అశూ టెస్టుల్లో ఈ పురస్కారం అందుకోవడం ఇది పదకొండోసారి కావడం విశేషం. తద్వారా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ చెన్నై బౌలర్ సమం చేశాడు. మురళీధరన్ కూడా సంప్రదాయ క్రికెట్లో 11 సార్లు ఈ అవార్డు గెలిచాడు. కాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో చెన్నై టెస్టులో 280 పరుగుల తేడాతో గెలిచిన రోహిత్ సేన.. కాన్పూర్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.టెస్టుల్లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచిన క్రికెటర్లుముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)- 11 సార్లురవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 11 సార్లుజాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా)- 9 సార్లుసర్ రిచర్డ్ హాడ్లీ(న్యూజిలాండ్)- 8 సార్లుఇమ్రాన్ ఖాన్(పాకిస్తాన్)- 8 సార్లుషేన్ వార్న్(ఆస్ట్రేలియా)- 8 సార్లు.చదవండి: WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డు -
అబ్బా ఇదేం రికార్డు.. చాప్‌స్టిక్స్‌తో జస్ట్ ఒక్క నిమిషంలో..!
వరల్ రికార్డ్సు సృష్టించడం కోసం చాలా మంది విభిన్న రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది భారీగా టాస్క్‌లు పెట్టుకుని ఆశ్చర్యం కలిగిస్తే..కొందరూ భలే ఈజీగా మనం రోజూ చూసే వాటితో క్లిష్టమైన టాస్క్‌లను చేసి రికార్డులు సృష్టిస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే బంగ్లాదేశ్‌కు చెందిన ఈ మహిళ. ఏం చేసి రికార్డు సృష్టించిందో వింటే ఆశ్చర్యపోతారు. చైనా వాళ్లు ఆహారం తినేందుకు ఉపయోగించే చాప్‌స్టిక్స్‌తో బియ్యం గింజలు తిని ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఫిబ్రవరి 17, 2024న బంగ్లాదేశ్ మహిళ సుమైయా ఖాన్ బియ్యం గింజలను చాప్‌స్టిక్స్‌తో తినడం అనే ఛాలెంజ్‌ని స్వీకరించింది. అయితే సుమైయా చాప్‌స్టిక్‌లతో జస్ట్ ఒక నిమిషంలో దాదాపు 37 గింజలు తిని టాస్క్‌ని పూర్తి చేసింది. టాస్క్ పూర్తి అయ్యిన వెంటనే ఆనందంగా సంబరాలు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రపంచ గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ఇన్స్టాగ్రామ్ వేదికగా నెట్టింట షేర్ చేసింది. గతంలో ఈ రికార్డు కాలిఫోర్నియాకు చెందిన టెలాండ్ లా అనే వ్యక్తి పేరిట ఉంది. అప్పడు టెలాండ్ ఒక నిమిషంలో 27 బియ్యం గింజలు తిని రికార్డు సృష్టించగా..దాన్ని సుమైయా బ్రేక్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: అధునాత రాతి కోట..! దేనిపై నిర్మిస్తున్నారో తెలుసా..?) -
లబుషేన్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన అతడు.. ప్రపంచంలో ఇంతవరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. కాగా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు ఆసీస్ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది.హెడ్ విధ్వంసకర శతకం.. లబుషేన్ అజేయ హాఫ్ సెంచరీఇందులో భాగంగా మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న కంగారూ టీమ్.. గురువారం నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (129 బంతుల్లో 154 నాటౌట్) విధ్వంసకర శతకంతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడికి తోడుగా ఐదో నంబర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ సైతం రాణించాడు. 61 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 77 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చడంలో హెడ్‌కు సహకరించాడు.మూడు వికెట్లు తీసిన లబుషేన్ఇక అంతకు ముందు.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా మూడు వికెట్లతో చెలరేగగా.. రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగల లబుషేన్ సైతం మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్ హెడ్ రెండు, డ్వార్షుయిస్, మాథ్యూ షార్ట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నాలుగు క్యాచ్‌లతో మెరిసిన లబుషేన్ఇక ఈ మ్యాచ్‌లో బెన్ డకెట్ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు), కెప్టెన్ హ్యారీ బ్రూక్(31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రూపంలో కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన లబుషేన్.. జోఫ్రా ఆర్చర్(4) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు.. డకెట్, బ్రూక్, జాకబ్ బెతెల్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆదిల్ రషీద్(0) క్యాచ్‌లు కూడా తానే అందుకున్నాడు.𝐃𝐮𝐜𝐤𝐞𝐭𝐭 𝐦𝐮𝐬𝐭 𝐛𝐞 𝐠𝐮𝐭𝐭𝐞𝐝 😤Catching practice for Labuschagne off his own bowling 😎Watch #ENGvAUS LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/p0IxZKhQZY— Sony LIV (@SonyLIV) September 19, 2024 వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్గాఅలా మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు నాలుగు క్యాచ్‌లు అందుకుని.. లక్ష్య ఛేదనలో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు లబుషేన్. తద్వారా ఈ కుడిచేతి వాటం ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక వన్డే మ్యాచ్‌లో అర్ధ శతకం బాదడంతో పాటు.. మూడు వికెట్లు తీసి.. మూడు కంటే ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇదీ 30 ఏళ్ల లబుషేన్ సాధించిన అత్యంత అరుదైన ఘనత!!.. ఇక ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే లీడ్స్ వేదికగా శనివారం జరుగనుంది. చదవండి: IND vs BAN: బుమ్రా సూపర్ బాల్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
లక్ష్యం వైపు.. లాక్షనాయుడు
సాక్షి, హైదబారాద్: ఏదైనా రంగంలో రాణించాలంటే ఎంతో శ్రమించాలి.. అలాంటిది అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ప్రతిభ కనబర్చాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చాలి? ఏదైనా పని మొదలు పెట్టాలన్నా.. కొత్త రంగంలోకి వెళ్లాలన్నా ఇంటి నుంచే సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కొంటుంటాం. మనకు అవసరమా..? చక్కగా ఉన్న పని చేసుకుని హాయిగా ఉండొచ్చుగా అని సలహాలు ఇస్తుంటారు. మరికొందరేమో రెండు, మూడు పడవలపై ప్రయాణం చేయడం మంచిది కాదంటూ హితవు పలుకుతారు. ఇంకొందరు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వైఫల్యం గురించి బాధపడుతూ ఒకే దగ్గర కూర్చుంటే అంతకన్నా వైఫల్యం మరొకటి ఉండదని నిరూపిస్తున్నారు డాక్టర్ లాక్షనాయుడు. డాక్టర్‌గా, సింగర్‌గా, శాస్త్రీయ నృత్యకారిణిగా, రాజకీయవేత్తగా చిన్న వయసులోనే రాణిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. -
144 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి: నిసాంక ప్రపంచ రికార్డు
శ్రీలంక యువ బ్యాటర్ పాతుమ్ నిసాంక సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగి.. వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 144 ఏళ్ల చరిత్రలో ఇంగ్లండ్ గడ్డపై ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. అదేమిటంటే...!!లంక అనూహ్య విజయంప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టు గెలుపొంది సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అయితే, నామమాత్రపు మూడో టెస్టులో శ్రీలంక అనూహ్య రీతిలో విజయం సాధించింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది.వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకునితద్వారా వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకుని ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించగలిగింది. అయితే, ఇంగ్లండ్‌లో మూడో టెస్టులో శ్రీలంక గెలుపొందడంలో ఓపెనర్ పాతుమ్ నిసాంకదే కీలక పాత్ర. తొలి ఇన్నింగ్స్‌లో 51 బంతుల్లో 64 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లోనే 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టును విజయతీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.1880 నుంచి ఇదే మొదటిసారిఅయితే, నిసాంక సెంచరీ మార్కు అందుకునే కంటే ముందే అత్యంత అరుదైన ఘనత ఒకటి తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 41 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్న నిసాంక.. రెండో ఇన్నింగ్స్‌లో 42 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా 26 ఏళ్ల నిసాంక చరిత్రకెక్కాడు.ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ వీరులు వీరేకాగా 1880లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 559 మ్యాచ్‌లకు ఈ దేశం ఆతిథ్యం ఇచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కూడా నిసాంక మాదిరి ఇలా రెండు ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన దాఖలాలు లేవు.ఇదిలా ఉంటే.. టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా యాభై పరుగుల మార్కు అందుకున్న క్రికెటర్ల జాబితాలో మాత్రం నిసాంక తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ముందున్నది ఎవరంటే..👉మార్క్ గ్రేట్బచ్(న్యూజిలాండ్)- జింబాబ్వే మీద- 1992లో👉నాథన్ ఆస్ట్లే(న్యూజిలాండ్)- వెస్టిండీస్ మీద- 1996లో👉తిలకరత్నె దిల్షాన్(శ్రీలంక)- న్యూజిలాండ్ మీద- 2009లో👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- న్యూజిలాండ్ మీద- 2012లో👉జెర్మానే బ్లాక్‌వుడ్(వెస్టిండీస్)- టీమిండియా మీద- 2916లో👉డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- పాకిస్తాన్ మీద- 2017లో👉జాక్ క్రాలే(ఇంగ్లండ్)- పాకిస్తాన్ మీద- 2022లో👉హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- న్యూజిలాండ్ మీద- 2023లో👉పాతుమ్ నిసాంక(శ్రీలంక)- ఇంగ్లండ్ మీద- 2024లోచదవండి: Afg vs NZ: నోయిడాలో తొలి రోజు ఆట రద్దు.. కారణం ఇదే! -
ప్రపంచంలోనే అతిపెద్ద వంకాయ..గిన్నిస్ రికార్డు!
అమెరికాకు చెందిన డేవ్ బెన్నెట్ అతి పెద్ద వంకాయను పండించి గిన్ని స్ వర్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ వంకాయ ఆశ్చర్యపరిచే విధంగా ఏకంగా 3.778 కేజీల బరువు ఉంది. సుమారు 16 అడుగుల పొడవు, 35 సెంటిమీటలర్ల చుట్టుకొలతతో ఉంది. జూలై 31న అయోవాలోని బ్లూమఫీల్డ్లో ఇంత పెద్ద భారీ వంకాయ కాసినట్లు గుర్తించాడు. ఇది సాధారణ మార్కెట్లలో పండించే వంకాయ కంటే 10 రెట్లు పెద్దదిగా ఉంది. ఈ వంకాయకి సంబంధించిన విత్తనాలను ఏప్రిల్‌లో నాటినట్లు తెలిపాడు. జూలై నాటికి కాయడం ప్రారంభించిందని వివరించాడు. అంతేగాదు ఇదే ప్రపంచంలోనే అత్యంత భారీ వంకాయ అని గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకటించింది. ఈ అద్భుతమైన వంకాయను ప్రపంచ రికార్డుల జాబితాలో చేర్చుతున్నందుకు సంతోషంగా ఉందని అధికారులు తెలిపారు. అందుకు సంబంధంచిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.(చదవండి: ఆ దేశంలో జీన్స్ బ్యాన్..పొరపాటున ధరిస్తే అంతే సంగతులు..!) -
ఒకే ఓవర్లో 39 పరుగులు
అపియా (సమోవా): అంతర్జాతీయ టి20 క్రికెట్లో మంగళవారం అద్భుతం చోటు చేసుకుంది. టి20 ప్రపంచకప్ ఈస్ట్ ఆసియా–పసిఫిక్ రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా వనువాటు, సమోవా మధ్య జరిగిన పోరులో ఒకే ఓవర్లో 39 పరుగులు నమోదయ్యాయి. ఈ ఫార్మాట్లో గతంలో ఐదుసార్లు ఒకే ఓవర్లో 36 పరుగులు నమోదు కాగా... సమోవా దాన్ని అధిగమిస్తూ మొత్తం 39 పరుగులు రాబట్టింది. మిడిలార్డర్ బ్యాటర్ డారియస్ విసెర్ ఆరు సిక్సర్లతో అదరగొట్టాడు. క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో వనువాటుపై సమోవా 10 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సమోవా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. విసెర్ (62 బంతుల్లో 132; 5 ఫోర్లు, 14 సిక్సర్లు) శతక్కొట్టగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. అనంతరం లక్ష్యఛేదనలో వనువాటు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. నళిన్ నిపికో (52 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆ ఓవర్ సాగిందిలా.. వనువాటు బౌలర్ నళిన్ నిపికో వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో డారియస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుసగా 6, 6, 6, 1నోబాల్, 6, 0, 1 నోబాల్, 6+1నోబాల్, 6 పరుగులు సాధించి ఒకే ఓవర్లో 39 పరుగులు పిండుకున్నాడు. గతంలో యువరాజ్ సింగ్ (భారత్; 2007లో ఇంగ్లండ్‌పై; స్టువర్ట్ బ్రాడ్), కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్; 2021లో శ్రీలంకపై; అఖిల ధనంజయ), నికోలస్ పూరన్ (వెస్టిండీస్; 2024లో అఫ్గానిస్తాన్‌పై; అజ్మతుల్లా ఓమర్జాయ్), దీపేంద్ర సింగ్ (నేపాల్;2024లో ఖతర్‌పై; కమ్రాన్ ఖాన్), రోహిత్ శర్మ–రింకూ సింగ్ (భారత్; 2024లో అఫ్గానిస్తాన్‌పై; కరీమ్ జన్నత్) కూడా ఒకే ఓవర్లో 36 పరుగులు సాధించారు. అయితే తాజా మ్యాచ్‌లో వనువాటు బౌలర్ అదనంగా మూడు నోబాల్స్ వేయడంతో... మొత్తం 39 పరుగులు వచ్చాయి. ఒక టి20 ఇన్నింగ్స్ జట్టు స్కోరులో అత్యధిక శాతం పరుగులు చేసిన ప్లేయర్‌గా విసెర్ రికార్డుల్లోకెక్కాడు. సమోవా జట్టు 20 ఓవర్లలో 174 పరుగులు చేయగా.. అందులో విసెర్ ఒక్కడే 132 పరుగులు సాధించాడు. అంటే జట్టు మొత్తం స్కోరులో 75.86 శాతం విసెర్ బ్యాట్ నుంచే వచ్చాయి. గతంలో ఆ్రస్టేలియా ప్లేయర్ ఆరోన్ ఫించ్ జట్టు స్కోరులో 75.01 శాతం పరుగులు సాధించాడు. -
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఆసియా-పసిఫిక్ క్వాలిఫైయర్-ఏ పోటీల్లో భాగంగా సమోవా దేశంతో జరిగిన మ్యాచ్‌లో వనుఅటు దేశ సీమర్ నలిన్ నిపికో ఒకే ఓవర్లో 39 పరుగులు సమర్పించుకున్నాడు. నిపికో బౌలింగ్‌లో సమోవా దేశ బ్యాటర్ డేరియస్ విస్సర్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. నిపికో మూడు నో బాల్స్ వేశాడు. ఫలితంగా ఓ ఓవర్లో 39 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఇది సరికొత్త ప్రపంచ రికార్డు.2007 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, 2021లో శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయ, 2024 ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ టీ20 టోర్నీలో ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ ఒకే ఓవర్లో 36 పరుగులు (6 సిక్సర్లు) సమర్పించుకున్నారు. బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్, ధనంజయ బౌలింగ్‌లో కీరన్ పోలార్డ్, కమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో దీపేంద్ర సింగ్ ఎయిరీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్ల ఘనత సాధించారు.మొత్తం 14 సిక్సర్లు..నిపికో బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన డేరియస్ విస్సర్.. ఇన్నింగ్స్ మొత్తంలో ఏకంగా 14 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో 62 బంతుల్లో 132 పరుగులు చేసిన విస్సర్.. సమోవా దేశం తరఫున శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. -
ఆర్చరీలో కొత్త ప్రపంచ రికార్డు
పారిస్ ఒలింపిక్స్ క్రీడలు నేడు అధికారికంగా ప్రారంభమవుతున్నా... గురువారం ఈ క్రీడల్లో తొలి ప్రపంచ రికార్డు నమోదైంది. మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో దక్షిణ కొరియా అమ్మాయి లిమ్ సిహైన్ కొత్త ప్రపంచ రికార్డుతోపాటు ఒలింపిక్ రికార్డును కూడా నెలకొల్పింది. లిమ్ సిహైన్ 694 పాయింట్లు స్కోరు చేసింది. తద్వారా 692 పాయింట్లతో కాంగ్ చాయెంగ్ (దక్షిణ కొరియా; 2019లో) సాధించిన ప్రపంచ రికార్డును లిమ్ బద్దలు కొట్టింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కొరియాకే చెందిన ఆన్ సాన్ 680 పాయింట్లతో నెలకొల్పిన ఒలింపిక్ రికార్డును కూడా లిమ్ సిహైన్ తిరగరాసింది. -
వామ్మో ఎంత పొడుగు జుట్టు!..గిన్నిస్ రికార్డులకెక్కింది!
టీవీల్లోనూ, అడ్వర్టైస్మెంట్ల్లోనూ భారీ కురులను చూసుంటాం. రియల్ లైఫ్లోఎక్కువగా సన్యాసుల్లో చూస్తుంటాం. ఒక వేళ ఉన్నా ఇక్కడున్న మహిళకు ఉన్నంత భారీ కురులను చూసి ఉండే అవకాశమే లేదు. ఎవరామె? ఆమె చుట్టు సంరక్షణ రహస్యం ఏంటీ వంటి వాటి గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల స్మితా శ్రీ వాస్తవ అత్యంత పొడవాటి జుట్టుని కలిగి ఉన్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఆమె జుట్టు ఏకంగా తొమ్మిది అంగుళాల పొడవుతో ఉంది. ఆమె 14 ఏళ్ల ప్రాయం నుంచి కత్తిరించడం మానేసింది. అంతేగాదు చుట్టును కడగడానికే దాదాపు 45 నిమిషాలు పడుతుందట. తనకు తన జుట్టు అంటే మహా ఇష్టమని, దీనికి గుర్తిపు రావాలని ఎంతగానో కోరుకున్నాని చెప్పుకొచ్చింది. చివరికి దేవుడు తన ప్రార్థనలు ఆలకించి ప్రపంచ రికార్డులో చోటు దక్కేలా చేశాడని అంటోంది శ్రీ వాస్తవ. ప్రస్తుతం ఆమెకు 46 ఏళ్లు వారానికి రెండు సార్లు జుట్టును కడుగుతుందట. అయితే వాషింగ్, డ్రైయింగ్, డిటాంగ్లింగ్, స్టైలింగ్‌తో సహా మొత్తం ప్రక్రియకు ప్రతిసారీ మూడు గంటల వరకు పడుతుందట. తనకు జుట్టుని సంరక్షించుకోవాలనే విషయంలో ప్రేరణ తన అమ్మేనని చెబుతోంది. తన కుటుంబంలోని ప్రతిఒక్కరికి అందమైన జుట్టు ఉంది. అదీగాక 80ల టైంలోని హిందీ సినిమాల్లో నటీమణులు చాలా అందంగా ఉండేవారు. ఆ కాలల్లోని వాళ్లందరికీ జుట్టు చాలా పొడవుగా ఉండేది. అదే తనను బగా ప్రేరేపించిందని చెబుతోంది శ్రీ వాస్తవ. మన సమాజంలో పొడవాటి జుట్టు మహిళల అందాన్ని తెలియజేస్తుంది. ఇక శ్రీ వాస్తవ గత 20 ఏళ్లలో వెంట్రుకలను కత్తిరించలేదు. అయితే ఒకనొక సమయంలో కాస్త ఎక్కువగా జుట్టురాలిందని, అందుకోసం శ్రద్ధ తీసుకోవడంతో ఆ సమస్యను నివారించగలిగానని చెప్పింది శ్రీ వాస్తవ. అలాగే ఆమె తన జుట్టు సంరక్షణ కోసం కృత్రిమ షాంపూలు, కండీషనర్లకు దూరంగా ఉంటానని అంటోంది. ఎక్కువగా గుడ్డు, ఉల్లిపాయ రసం, అలోవెరా వంటి సహజమైన పదార్థాలతో జుట్టును సంరక్షించుకుంటానని అదే తన కేశసంపద రహస్యమని చెబుతోంది శ్రీ వాస్తవ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెమిడీలను తప్పకు ప్రయత్నించండి.(చదవండి: స్లిమ్‌గా మారిన భూమి పడ్నేకర్!.. జస్ట్ నాలుగు నెలల్లో ఏకంగా..!) -
ఒకేరోజు 85 వేల పండ్ల మొక్కలు! ప్రపంచ రికార్డు
ఛత్తీస్‌ఘడ్‌లోని గరియాబంద్ జిల్లాలో 17వేల మంది మహిళలు ఒకేరోజులో 85వేల పండ్ల మొక్కలను నాటడం ద్వారా రికార్డ్ సృష్టించారు. ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ పేరుతో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లాకేంద్రం వరకు కొత్తగా పెళ్లయిన వారు, గర్భిణులు, తల్లులు పాల్గొన్నారు. మామిడి, జామ, నిమ్మ, పనస... మొదలైన మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు, పౌష్టికాహార మెరుగుదలకు దోహదపడే ఈ మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించారు. వీరి ఘనతను ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది. ‘మొక్క నాటాను. ఇక నా పని పూర్తయిపోయింది అనుకోడం లేదు. నేను నాటిన మొక్క మా అమ్మ, నా బిడ్డతో సమానం. కంటికి రెప్పలా చూసుకుంటాను’ అంటుంది దస్పూర్ గ్రామానికి చెందిన సునీత అనే గృహిణి. ఇది ఆమె మాటే కాదు ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమంలో పాల్గొన్న పదిహేడు వేల మంది మహిళలది. -
శెభాష్ ఆండర్సన్.. వీడ్కోలు మ్యాచ్‌లో వరల్డ్ రికార్డు
తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నిప్పులు చేరుగుతున్నాడు. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆండర్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టిన ఆండర్సన్.. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆదిలోనే రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బతీశాడు. అయితే తన విడ్కోలు టెస్టులో ఆండర్సన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.టెస్టు క్రికెట్ చరిత్రలో 40,000 బంతులు వేసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా ఆండర్సన్ రికార్డులెక్కాడు. ఈ మ్యాచ్‌లో తన 10వ ఓవర్ వేసిన అనంతరం ఆండర్సన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 188 టెస్టులు ఆడిన ఆండర్సన్.. 6666. 5(40000 బంతులు) ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో ఆండర్సన్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్లు ఆండర్సన్ కంటే ముందు అనిల్ కుంబ్లే(44039), షేన్ వార్న్(40850), ముత్తయ్య మురళీధరన్(40705) ఉన్నారు.అదేవిధంగా ఆండర్సన్ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో విండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా ఆండర్సన్ నిలిచాడు. ఆండర్సన్ ఇప్పటివరకు వెస్టిండీస్‌పై 90 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(89) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కపిల్ దేవ్ రికార్డును ఆండర్సన్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో గ్లెన్ మెక్‌గ్రాత్(110) తొలి స్ధానంలో ఉన్నాడు. Jimmy Anderson, there are no words 🤯 pic.twitter.com/bBRCS1uykD— England Cricket (@englandcricket) July 11, 2024 -
ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. లూకీ ఫెర్గూసన్ సరికొత్త చరిత్ర
టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా పాపువా న్యూగినీతో మ్యాచ్‌లో ఫెర్గూసన్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.ఈ మ్యాచ్‌లో ఫెర్గుసన్ ఎవరూ ఊహించని విధంగా తన 4 ఓవర్ల కోటాను మెయిడిన్లుగా ముగించాడు. ఫెర్గూసన్ 4 ఓవర్లు వేసి ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా 3 వికెట్లు కూడా పడగొట్టాడు.పసికూన పాపువా న్యూగినీ బ్యాటర్లకు ఈ కివీస్పీడ్ స్టార్ చుక్కలు చూపించాడు. అతడిని ఎదుర్కొనేందుకు న్యూగినీ బ్యాటర్లు గజగజ వణికిపోయారు. పపువా న్యూ గినియా ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బంతిని అందుకున్న ఫెర్గూసన్ తొలి బంతికే వికెట్ తీసాడు. ఆ ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించిన లాకీ.. ఏడో ఓవర్లో మరోసారి బంతిని అందుకుని రెండోసారి మెయిడిన్ చేశాడు.మళ్లీ 12వ ఓవర్ బౌలింగ్ చేసిన ఫెర్గూసన్ రెండో బంతికి వికెట్ తీసి మూడో ఓవర్‌ను మెయిడిన్ చేశాడు. 14వ ఓవర్లో రెండో బంతికి మరో వికెట్ తీసి మరోసారి మెయిడిన్ చేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఫెర్గూసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఫెర్గూసన్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా ఫెర్గూసన్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ పేరిట ఉండేది.పనామాపై సాద్ బిన్ జఫర్ 4 మెయిడిన్ ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. అయితే తాజా మ్యాచ్‌లో 4 మెయిడిన్ ఓవర్లతో పాటు 3 వికెట్లు పడగొట్టిన ఫెర్గూసన్.. సాద్ బిన్ జఫర్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో 4 ఓవర్లు మెయిడిన్ వేసిన తొలి బౌలర్‌గా కూడా ఫెర్గూసన్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికి సాధ్యం కాలేదు.అదేవిధంగా ఓవరాల్‌గా టీ20ల్లో 4కి 4 ఓవర్లు మెయిడిన్ వేసిన రెండో బౌలర్‌గా ఫెర్గూసన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2021లో పనమాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో సాద్ బిన్ జఫర్ 4 ఓవర్లు మెయిడిన్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. -
T20 World Cup 2024: క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్
ఆసీస్ వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్ చరమాంకంలో ఓ అద్భుత రికార్డు నెలకొల్పాడు. పొట్టి క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (సెంచరీలు కలుపుకుని) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్) మెరిసిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ రికార్డు సాధించే క్రమంలో వార్నర్ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను అధిగమించాడు. ఒమన్‌పై హాఫ్ సెంచరీ కలుపుకుని వార్నర్ ఖాతాలో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. గేల్ పేరిట 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదై ఉన్నాయి. వార్నర్ కేవలం 378 ఇన్నింగ్స్‌ల్లో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్ల మార్కు తాకగా.. గేల్‌కు 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసేందుకు 455 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మూడో స్థానంలో (105), పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో స్థానంలో (101) ఉన్నారు.కాగా, బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. స్టోయినిస్‌తో పాటు జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటడంతో ఒమన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ ఒమన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
కలకు సాధన తోడైతే చాలు మిగతావన్నీ వాటికవే వచ్చి చేరతాయి. ఈ మాట నా విషయంలో అక్షర సత్యం అంటోంది దీప్తి జివాంజీ. తెలంగాణలోని వరంగల్ వాసి అయిన దీప్తి జివాంజీ దినసరి కూలీ కుమార్తె. జపాన్‌లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో సోమవారం 400 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా 21 ఏళ్ల దీప్తిని పలకరిస్తే ఇలా సమాధానమిచ్చింది.⇢ క్రీడలే ప్రధానంగా!నా చిన్నప్పుడు స్కూల్లో పీఈటీ సర్ చెప్పిన విధంగాప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పుడే జిల్లా స్థాయి ΄ోటీల్లో పాల్గొనేదాన్ని. నాకు చిన్నతనంలో తరచూ ఫిట్స్ వస్తుండేవి. రన్నింగ్ చేసేటప్పుడు బాడీ షేక్ అయ్యేది. దీంతో మా పీఈటీ సర్‡పారా అథ్లెట్స్‌తో మాట్లాడి, టెస్టులు చేయించారు. వారితో మాట్లాడి ‘ఇక పారా అథ్లెట్స్ గ్రూప్‌లో పాల్గొనమ’ని చె΄్పారు. మా అమ్మనాన్నలది మేనరికం కావడం వల్ల జన్యుపరమైన సమస్యలు వచ్చాయని తెలిసింది. అక్కణ్ణుంచి పారా అథ్లెటిక్ కాంపిటిషన్లో పాల్గొంటూ వచ్చాను. ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అందులో పాల్గొన్నాను. మెడల్ రావడంతో అక్కణ్ణుంచి నా జీవితంలో క్రీడలు ప్రధాన భాగంగా మారి΄ోయాయి. డిగ్రీలో చేరాను కానీ, అప్పటికి ఇంకా పరీక్షలు రాయడం పూర్తి చేయలేదు.⇢ బలహీనతలను అధిగమించేలా..స్పోర్ట్స్‌లో పాల్గొనడం వల్ల ఒక ఆరోగ్యపరమైన సమస్యను ఆ విధంగా అధిగమించాను అనుకుంటాను. చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఈ ఆటలు నీకు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. కానీ, కానీ, మా అమ్మ మాత్రం ‘అవన్నీ పట్టించుకోవద్దు. నీవనుకున్నదానిపైనే దృష్టి పెట్టు. ఈ రోజు నిన్ను అన్నవాళ్లే రేపు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు’ అని చెప్పేది. ఆ విధంగా మానసిక ధైర్యం కూడా పెరిగింది. స్పోర్ట్స్ అన్ని బలహీనతలను దూరం చేస్తుందని.. గెలిచినా, ఓడినా.. ఎప్పడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటామని నమ్ముతాను. ఇప్పటివరకు నాలుగు వరల్డ్ చాంపియన్‌షిప్ ΄ోటీల్లో పాల్గొన్నాను. నాకు సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ⇢ ధైర్యమే బలంమా ఇంటి పరిస్థితులు ఎప్పుడూ కష్టంగానే ఉండేవి. మా అమ్మ ధనలక్ష్మి కూలి పనులకు వెళుతుంది. నాన్న పైపుల కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు స్కూల్‌కు వెళుతుంది. ఉండటానికి మాకు కనీసం అద్దె ఇల్లు కూడా ఉండేది కాదు. మొన్న మొన్నటి వరకు మా అమ్మమ్మ వాళ్లింటోనే ఉన్నాం. ఎన్నో అవమానాలూ ఎదుర్కొన్నాం. ఈ మధ్య ఆ ఇంటినే కొనుగోలు చేశాం. ఇక బలమైన ఆహారం అంటే స్పోర్ట్స్ అకాడమీలోకి వచ్చిన తర్వాతే అని చెప్పుకోవాలి. అమ్మ ఎప్పుడూ చెప్పే విషయాల్లో బాగా గుర్తుపెట్టుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ‘కష్టపడితే ఏదీ వృథా ΄ోదు. నీకు నువ్వు ధైర్యంగా నిలబడాలి. అప్పుడే నిన్ను కాదని వెళ్లి΄ోయినవి కూడా నీ ముందుకు వస్తాయి’ అంటుంది. మొన్న జపాన్‌లో జరిగిన పారా ఒలింపిక్‌లో బంగారు పతకం సాధించిన విషయం చెప్పినప్పుడు అమ్మ చాలా సంతోషించింది. నా బలం మా అమ్మే. ఆమె ఏమీ చదువుకోలేదు. కానీ, ధైర్యంగా ఎలా ఉండాలో చెబుతుంది. ఆడపిల్లలమైనా మేం బాగా ఎదగాలని కోరుకుంటుంది.⇢ ప్రాక్టీస్ మీదనే దృష్టిటీవీ కూడా చూడను. ΄÷లిటికల్ లీడర్స్‌కు సంబంధించి వచ్చే సాంగ్స్ వింటుంటాను. ఆ పాటల్లో స్ఫూర్తిమంతమైన పదాలు ఉంటాయి. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉంటున్నాను. మరో మూడు నెలల్లో ఒలపింక్స్ లో పాల్గొనబోతున్నాను. దేశం తరపున పాల్గొనబోతున్నాను కాబట్టి నా దృష్టి అంతాప్రాక్టీస్ మీదనే ఉంది. సాధారణంగా ఉదయం రెండు గంటలు; సాయంత్రం రెండు గంటలుప్రాక్టీస్ ఉంటుంది. మధ్యలో మా రోజువారీ పనులు, విశ్రాంతికి సమయం కేటాయిస్తాం. నాతో పాటు ఉన్న స్నేహితులతో చిట్ చాట్ ఉంటుంది.⇢ బాధ్యతగా ఉండాలిచిన్నప్పటి నుంచి అమ్మనాన్నల కష్టం చూస్తూ పెరగడం వల్ల సొంతంగా ఇష్టాలు, అభిరుచులు అనే ధ్యాస ఏమీ లేదు. కానీ, చిన్నప్పటి నుంచి ΄ోలీసు కావాలనేది నా కల. ఇప్పటికీ అదే ఆలోచన. నా కృషి నేను చేస్తున్నాను. నేను కోరుకున్నది వస్తుందనేది నా నమ్మకం. అమ్మనాన్నలు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ΄ోలీసుని అయి మా అమ్మ నాన్నలను, చెల్లెలిని బాగా చూసుకోవాలి, అది నా బాధ్యత అనుకుంటున్నాను’’అంటూ ముగించింది దీప్తి. ఆమె ఆశలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
ఐర్లాండ్‌తో తొలి టీ20లో ఓటమికి పాకిస్తాన్ బదలు తీర్చుకుంది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే 16.5 ఓవర్లలో చేధించింది.పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(75), ఫఖార్ జమాన్(78) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.ఐరీష్ బ్యాటర్లలో లారెన్ టక్కర్(51), టాక్టెర్(32) పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. అమీర్, నసీం షా తలా వికెట్ సాధించారు.బాబర్ ఆజం వరల్డ్ రికార్డు..ఇక మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌ల్లో విజయం సాధించిన కెప్టెన్‌గా బాబర్ రికార్డులకెక్కాడు. బాబర్ సారథ్యంలో ఇప్పటివరకు పాకిస్తాన్ 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా పేరిట ఉండేది. బ్రియాన్ మసాబా కెప్టెన్‌గా ఉగాండాకు 44 టీ20లు విజయాలు అందించాడు. తాజా విజయంతో మసాబా రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (42), మోర్గాన్ (42), ఆఫ్ఘనిస్థాన్ మాజీ సారథి అస్గర్ ఆఫ్ఘన్ (42), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (41), రోహిత్ శర్మ (41) ఉన్నారు. -
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
పొట్టి క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. మహిళల టీ20ల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా బౌలర్ రొహ్మాలియా రొహ్మాలియా పరుగులేమీ ఇవ్వకుండా ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో (పురుషులు, మహిళలు) ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఐసీసీ గుర్తింపు పొందిన ఏ జట్టు తరఫున ఇలాంటి గణాంకాలు నమోదు కాలేదు.పురుషుల క్రికెట్లో (టీ20ల్లో) అత్యుత్తమ గణాంకాలు స్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) పేరిట ఉండగా.. మహిళల క్రికెట్లో రొహ్మాలియాకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ క్రికెటర్ ఫ్రెడ్రిక్ ఓవర్డిక్ (4-2-3-7) పేరిట ఉండింది. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు ఏ బౌలర్ పరుగులేమీ ఇవ్వకుండా 7 వికెట్లు తీసిన దాఖలాలు లేవు. రొహ్మాలియా తన కెరీర్లో రెండో టీ20 మ్యాచ్‌లోనే ఎవరికీ సాధ్యంకాని గణాంకాలు నమోదు చేయడం మరో విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. బాలీ బాష్‌గా పిలువబడే టోర్నీలో ఇండోనేషియా, మంగోలియా జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రొహ్మాలియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇండోనేషియా ఇన్నింగ్స్‌లో నందా సకారిని (61) అర్దసెంచరీతో రాణించింది. మంగోలియా బౌలర్లలో ఎంక్జుల్ 4 వికెట్లు పడగొట్టింది. View this post on Instagram A post shared by Persatuan Cricket Indonesia (@cricket_ina) 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. రొహ్మాలియా (3.2-3-0-7) ధాటికి 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం రెండంకెల మార్కు తాకలేకపోగా.. ఎక్స్‌ట్రాలు టాప్ స్కోర్ (10) కావడం విశేషం. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్లు అయ్యారు. -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన ముంబై ఇండియన్స్.. క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా..!
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ పొట్టి ఫార్మాట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ఎంఐ టీమ్... పొట్టి క్రికెట్లో 150 విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృస్టించింది. ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 7) జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ముంబై ఇండియన్స్ రికార్డుల్లోకెక్కింది. పొట్టి క్రికెట్ చరిత్రలో ఏ జట్టు ఇప్పటివరకు 150 విజయాల మార్కును తాకలేదు. ముంబై ఇండియన్స్ ఐపీఎల్, ప్రస్తుతం కనుమరుగైన ఛాంపియన్స్ టీ20 లీగ్‌లో కలిపి 273 మ్యాచ్‌లు ఆడి 150 విజయాలు సాధించింది. 117 మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిసాయి. టీ20ల్లో ముంబై సాధించిన 150 విజయాలు సూపర్ ఓవర్ ఫలితాలు కలుపుకోకుండా సాధించినవి. సూపర్ ఓవర్లో ముంబై రెండు విజయాలు సాధించి, రెండు అపజయాలు ఎదుర్కొంది. WANKHEDE CROWD GETS A SUPERB MATCH. ⭐ pic.twitter.com/HOEAsTTFkH — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024 టీ20ల్లో ముంబై తర్వాత అత్యధిక విజయాలు సాధించిన ఘనత చెన్నై సూపర్ కింగ్స్‌కు దక్కుతుంది. పొట్టి ఫార్మాట్లో సీఎస్కే 253 మ్యాచ్‌లు ఆడి 148 విజయాలు నమోదు చేసింది. 101 మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదర్కొంది. రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగియగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన రెండు మ్యాచ్‌ల్లో చెన్నై అపజయాలను ఎదుర్కొంది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో టీమిండియా మూడో స్థానంలో ఉంది. భారత్ అన్ని జాతీయ జట్ల కంటే ఎక్కువగా 219 మ్యాచ్‌ల్లో 140 విజయాలు సాధించి, 68 మ్యాచ్‌ల్లో ఓడింది. 6 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగియగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ విజయఢంకా మోగించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. 235 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు నాటౌట్), పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఢిల్లీని గెలిపించేందు విఫలయత్నం చేశారు. స్టబ్స్ చివరి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీ లక్ష్యానికి 30 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
చరిత్ర సృష్టించిన శ్రీలంక.. టీమిండియా రికార్డు బద్దలు
టెస్ట్‌ల్లో టీమిండియా పేరిట ఉండిన ఓ భారీ రికార్డును శ్రీలంక బద్దలు కొట్టింది. ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండా అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండింది. 1976లో టీమిండియా ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండా 529 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేయగా.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక శతకం లేకుండా 531 పరుగులు (తొలి ఇన్నింగ్స్) చేసి భారత్ రికార్డును బద్దలు కొట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు అర్ద సెంచరీలు సాధించగా.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ ఆరుగురు లంక ఆటగాళ్లు అర్ద శతకాలు బాదారు. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (93), కమిందు మెండిస్ (92 నాటౌట్) సెంచరీలకు చేరువగా వచ్చారు. మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో పర్యాటక శ్రీలంక పటిష్ట స్థితిలో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు ఆరుగురు అర్దశతకాలు సాధించడంతో 531 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటయ్యారు. నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ 92 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ 21 పరుగులు చేసి లహీరు కుమార బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. జకీర్ హసన్ (28), తైజుల్ ఇస్లాం (0) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 476 పరుగులు వెనుకంజలో ఉంది. కాగా, ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి శ్రీలంక 1-0 కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
శభాష్ హిట్‌మ్యాన్.. క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అద్భుత రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో (ఇంగ్లండ్) మార్క్ వుడ్ క్యాచ్ పట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్‌లు అందుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్లో ఏ ఇతర ఆటగాడు మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్‌లు అందుకోలేదు. డబుల్ సెంచరీలు, సిక్సర్ల రికార్డులు ఎక్కువగా నెలకొల్పే రోహిత్‌కు క్యాచ్‌ల పరంగా ఇది అతి పెద్ద రికార్డని చెప్పవచ్చు. WHAT A CATCH BY CAPTAIN ROHIT SHARMA...!!!! 🔥 - The Magician Ravi Ashwin picked 2 wickets in an over on his 100th Test Match. pic.twitter.com/WawmeAxQ1H — CricketMAN2 (@ImTanujSingh) March 7, 2024 కాగా, ధర్మశాల టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
తగ్గేదేలే అంటోన్న టాలీవుడ్ మూవీ.. ఏకంగా ప్రపంచ రికార్డ్ సొంతం!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'జయ జానకి నాయక'. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్‌లో రిలీజ్ అయినప్పటీ నుంచి ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తాజాగా 800 మిలియన్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. కాగా.. ఈ సినిమాను హిందీలో ఖుంఖార్ పేరుతో రిలీజ్ చేశారు. సౌత్ డబ్బింగ్ మూవీస్‌లో ఇప్పటివరకు జయ జానకి నాయక మాత్రమే ఈ రికార్డ్ సాధించింది. యశ్ నటించిన కేజీఎఫ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. కానీ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది. గతంలోనే హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 772 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో కొనసాగుతోంది. కాగా.. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. #JayaJanakiNayaka 800M+ Views 💥👌@BSaiSreenivas @Rakulpreet #BellamkondaSrinivas #RakulPreetSingh #PenMovies pic.twitter.com/eC5M6cml89 — South Hindi Dubbed Movies (@SHDMOVIES) February 20, 2024 -
ISSF World Cup 2024: ప్రపంచ రికార్డుతో పసిడి పతకం
భారత షూటర్ దివ్యాంశ్ సింగ్ పన్వర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. కైరోలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోరీ్నలో ఆదివారం జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల దివ్యాంశ్ 253.7 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకం నెగ్గాడు. గత ఏడాది ఆసియా క్రీడల్లో చైనా షూటర్ షెంగ్ లిహాయో 253.3 పాయింట్ల తో నెలకొల్పిన ప్రపంచ రికార్డును దివ్యాంశ్ బద్దలు కొట్టాడు. -
రికార్డులను చుట్టూ తిప్పుకుంటున్న గాయని.. మూడేళ్లకే!
మనసుంటే మార్గముంటుంది. ప్రతిభ ఉండాలేగానీ అవార్డులు, రివార్డులు, ప్రపంచ రికార్డులు మనకోసం వెదుక్కుంటూ వస్తాయి. ఇదే విషయాన్ని ఒక యువతి నిరూపించింది. తన పాటలతో రికార్డులను తన వెంట తిప్పుకుంటోంది. ఒక కాన్సర్ట్‌లో ఏకంగా 140 భాషల్లో పాటలు పాడి సరికొత్త ప్రపంచ రికార్డును సాధించింది కేరళ కుట్టి. గత ఏడాది నవంబర్ 24న దుబాయ్, యుఎఇలో జరిగిన కాన్సర్ట్ ఫర్ క్లైమేట్ సందర్భంగా కేరళకు చెందిన సుచేత సతీష్ తన గాన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. తన అద్భుత ఘనతను చాటుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. దీనికిసంబంధించిన వీడియో ఇన్‌స్టాలో షేర్ అవుతోంది. ఈ రికార్డును గిన్నిస్ బుక్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేజీ ప్రకారం , దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడానికి సుచేత 140 భాషలలో ప్రదర్శనలిచ్చి రికార్డును బద్దలు కొట్టారు. దుబాయ్‌లో జరిగిన COP 28 సమ్మిట్‌కు హాజరైన 140 దేశాల ప్రాతినిధ్యానికి గుర్తుగా 140 నంబర్ ఎంపిక చేసినట్టు వివరించింది. సుచేత సతీష్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన విజయాన్ని షేర్ చేసింది. దీంతో నెటిజనులు అభినందనలు కురిపించారు. ఇన్క్రెడిబుల్! వెయ్యి మైళ్ల ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అంటూ కామెంట్ చేశారు. 2018 జనవరిలో లాంగెస్ట్ లైవ్ సింగింగ్ కన్సర్డ్ పెట్టిన అమ్మాయిగా రికార్డు. అలాగే అత్యధిక భాషల్లో పాడిన ప్రపంచ రికార్డుకూడా సొంతం చేసుకుంది. 2021 మ్యూజిక్ బియాండ్ బోర్డర్స్ గిన్నిస్ రికార్డును సాధించింది. ఈ ప్రోగ్రామ్‌లో సుచేత సతీష్ 6 గంటల 15 నిమిషాల పాటు 102 భాషల్లో పాడి రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. ఈ రికార్డులను అమెరికా, మయామి వరల్డ్ రికార్డ్ అకాడెమీ నిర్ధారించింది. 2005 ఆగస్టు17న కన్నూర్‌లో అయిలియాత్ సుమిత, డాక్టర్ టీసీ సతీష్ దంపతులకు జన్మించింది. అన్నయ్య సుశాంత్ సతీష్ ఉన్నారు. 2 నెలల వయస్సులో దుబాయ్‌కి షిప్ట్. మూడేళ్ల వయస్సు నుంచే పాడటం మొదలు పెట్టింది. నాలుగేళ్లనుంచే కర్ణాటక సంగీతం నేర్చుకుంటోంది. చాలా చిన్న వయసులోనే ప్రముఖ గాయనీ గాయకులందరికీతోనూ పరిచయాటుండటం తన అదృష్టమనీ, ప్రముఖ గాయని శ్రీమతి పి.సుశీలను తన గాడ్ మదర్‌గా భావిస్తుందిసుచేత సతీష్. -
పొట్టి ఫార్మాట్లో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రోహిత్ ఈ ఘనతను కేవలం 149 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఖాతా తెరవకుండానే ఔటైనా అతని ఖాతాలో ప్రపంచ రికార్డు చేరడం విశేషం. Players to be part of most wins in T20I history: 1) Rohit Sharma - 100* 2) Shoaib Malik - 86 Hitman created history in Mohali. pic.twitter.com/x7UkiRwMUv — Johns. (@CricCrazyJohns) January 11, 2024 ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాల్లో భాగమైన రికార్డు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డ్యానీ వ్యాట్ (111) పేరిట ఉండగా.. పురుషుల క్రికెట్లో రోహిత్ తర్వాత ఈ రికార్డు పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ (124 మ్యాచ్‌ల్లో 86 విజయాలు) పేరిట ఉంది. రోహిత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక టీ20 విజయాల్లో భాగమైన ఘనత విరాట్ కోహ్లి (115 మ్యాచ్‌ల్లో 73 విజయాలు) సొంతం చేసుకున్నాడు. ఆఫ్ఘన్‌తో తొలి టీ20లో విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ కెప్టెన్‌గానూ అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. హిట్‌మ్యాన్ సారథ్యంలో టీమిండియా కేవలం 52 మ్యాచ్‌ల్లోనే 40 విజయాలు సాధించింది. Rohit Sharma has 40 wins from just 52 games in T20I as a captain 🇮🇳 - One of the most successful captains in T20I history. pic.twitter.com/Tpas68JN4M — Johns. (@CricCrazyJohns) January 12, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. శివమ్ దూబే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (1/9, 60 నాటౌట్) చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మొహమ్మద్ నబీ (42) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించగా.. గుర్బాజ్ (23), కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (25), అజ్మతుల్లా (29), నజీబుల్లా (19 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శివమ్ దూబే ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం ఛేదనలో భారత్ ఖాతా తెరవకుండానే రోహిత్ (0) వికెట్ కోల్పోయినా కుర్రాళ్లు జట్టును గెలిపించారు. శుభ్‌మన్ గిల్ (23), తిలక్ వర్మ (26), శివమ్ దూబే (60 నాటౌట్), జితేశ్ శర్మ (31 ), రింకూ సింగ్ (16 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ 2, ఒమర్జాయ్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 ఇండోర్ వేదికగా జనవరి 14న జరుగనుంది. -
నీరు.. బేజారు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కళాఖండమేమీ కాదు, ఇది మంచినీటి సీసా మాత్రమే! దీని ధర తెలుసుకుంటే మాత్రం గుండె బేజారవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచినీటి సీసా. ‘అక్వా డి క్రిస్టాలో ట్రిబ్యూటో ఎ మోదిగ్లియానీ’ పేరుతో ఈ మంచినీటి సీసాను దివంగత ఇటాలియన్ కళాకారుడు అమేదియో క్లెమెంటె మోదిగ్లియానీకి నివాళిగా మెక్సికన్ కళాకారుడు ఫెర్నాండో ఆల్టమిరానో ప్రాచీన ఈజిప్షియన్ శిల్ప శైలిలో రూపొందించాడు. దీని తయారీకి స్వచ్ఛమైన ప్లాటినమ్, 23 కేరట్ల బంగారం ఉపయోగించి, యంత్రాలతో పనిలేకుండా పూర్తిగా హస్తకళా నైపుణ్యంతోనే ఈ నీటిసీసాలను తయారు చేశాడు. వీటిలో జలపాతాల నుంచి జాలువారిన నీటిని నింపి, విక్రయానికి సిద్ధం చేశాడు. ఈ నీరు సాధారణ నీటి కంటే ఎక్కువ ఆల్కలైన్ లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. మెక్సికో సిటీలో 2010లో జరిగిన వేలంలో ఈ లీటరు నీటి సీసా ఒకటి 60 వేల డాలర్లకు (రూ.49.89 లక్షలు) అమ్ముడుపోయి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచినీటి సీసాగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు దీని రికార్డు చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. -
దక్షిణ ధ్రువంలో పోలార్ ప్రీత్ విజయ యాత్ర
లండన్: అంటార్కిటికా అన్వేషణలతో పోలార్ ప్రీత్‌గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది(33) మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా చరిత్ర సృష్టించారు. రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి నవంబర్ 26న ప్రారంభించిన యాత్ర దక్షిణ ధ్రువానికి చేరుకోవడంతో గురువారంతో ముగిసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. రోజుకు 12 ,13 గంటల చొప్పున ముందుకు సాగుతూ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మొత్తం 1,130 కిలోమీటర్ల దూరాన్ని ఎవరి సాయం లేకుండానే 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశానన్నారు. ఈ ఫీట్‌ను గురించి గిన్నిస్ వరల్డ్ బుక్ నిర్వాహకులకు వివరాలందించానని, ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. అంటార్కిటికా అన్వేషణలకు సంబంధించి కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది పేరిట ఇప్పటికే రెండు వేర్వేరు రికార్డులు నమోదై ఉన్నాయి. -
పిజ్జాతో రికార్డ్ బ్రేక్, ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా..
పిజ్జా.. చాలామంది యంగ్‌స్టర్స్‌కి ఫేవరెట్ రెసిపి. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ, చీజ్‌తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు? అందుకే సరికొత్త ప్రయోగాలతో పిజ్జా లవర్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వరల్డ్ రికార్డ్ కోసం ఇద్దరు ఫ్రెంచ్ చెఫ్‌లు చీజీ మాస్టర్ పిజ్జాను తయారు చేశారు. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా 1,001 చీజ్‌లతో పిజ్జా తయారు చేసి సరికొత్త రికార్డ్‌ను సృష్టించారు. వివరాల ప్రకారం.. బెనాయిట్ బ్రూయెల్,ఫాబియన్ మోంటెల్లానికో, సోఫీ హటాట్ రిచర్ట్-లూనా, ఫ్లోరియన్ ఆన్ఎయిర్లు కలిసి ఈ రెసిపీని రెడీ చేశారు. ఇంతకుముందు అత్యధికంగా 834 చీజ్‌లతో తయారు చేసిన పిజ్జా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ వెయ్యి చీజ్‌లతో క్రేజీ పిజ్జాను తయారు చేశారు. ఇందుకోసం సుమారు 5 నెలలు కష్టపడి ప్రపంచ వ్యాప్తంగా వెరైటీ చీజ్‌లను వెతికి సంపాదించారు. ఇందులో దాదాపు 940 రకాలు ప్రాన్స్‌కి చెందినవి కాగా, మిగిలినవి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సమకూర్చారు. ప్రతి చీజ్ నుంచి రెండు గ్రాముల మోతాదులో చీజ్‌ను పిజ్జాపై టోపింగ్ చేసి ఈ వెరైటీ డిష్‌ను అందించారు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారీ విజయం నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఈ వరల్డ్ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఈ అరుదైన రికార్డు శ్రీలంక మహిళల జట్టు పేరిట ఉండేది. 1997లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 309 పరుగుల తేడాతో ఓడించింది. తాజా మ్యాచ్‌తో 26 ఏళ్ల శ్రీలంక రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. భారత బౌలర్ల దాటికి కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పుజా వస్త్రాకర్ మూడు , గైక్వాడ్ రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ హీథర్ నైట్(21) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో కూడా దీప్తి శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఓవరాల్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టంది. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన 9⃣.3⃣ - Sophia Dunkley 9⃣.4⃣ - Nat Sciver-Brunt Relive how Pooja Vastrakar 2⃣ wickets in an over 🎥 🔽 Follow the Match ▶️ https://t.co/UB89NFaqaJ #TeamIndia | #INDvENG | @Vastrakarp25 | @IDFCFIRSTBank pic.twitter.com/EAUF8WPwMF — BCCI Women (@BCCIWomen) December 16, 2023 -
టీమిండియా సరికొత్త చరిత్ర.. పాకిస్తాన్ వరల్డ్ రికార్డు బద్దలు
రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 20 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా ప్రపంచరికార్డును టీమిండియా తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా భారత్ అవతరించింది. టీమిండియా ఇప్పటివరకు 213 మ్యాచ్‌ల్లో 136 విజయాలను అందుకుంది. కాగా ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. పాకిస్తాన్ 226 మ్యాచ్‌ల్లో 135 విజయాలు సాధించింది. తాజా మ్యాచ్‌తో పాక్ వరల్డ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రింకూ సింగ్ మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. రింకూ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. రింకూతో పాటు జితేష్ శర్మ(35), యశస్వీ జైశ్వాల్(37), రుతురాజ్ గైక్వాడ్(32) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సంగా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు, దీపక్ చాహర్ రెండు, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో మాథ్యూ వేడ్(36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఆస్ట్రేలియాతో మూడో టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా
గౌహతి వేదికగా మంగళవారం ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. మూడో టీ20లో కూడా కూడా అదే జోరును కనబరిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా పాకిస్తాన్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేస్తోంది. తిరువనంతపురం వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో గెలుపొందిన టీమిండియా.. పాకిస్తాన్ పేరిట ఉన్న ఈ అరుదైన ఫీట్‌ను సమం చేసింది. రిటీమిండియా ఇప్పటివరకు 211 మ్యాచ్‌ల్లో 135 విజయాలను అందుకుంది. పాకిస్తాన్ కూడా పాక్ 226 మ్యాచ్‌ల్లో 135 విజయాలు సాధించింది. ఈ క్రమంలో గౌహతి మ్యాచ్‌లో విజయం సాధిస్తే పాకిస్తాన్ వరల్డ్ రికార్డును భారత్ బద్దలు కొడుతోంది. చదవండి: క్రికెటర్లు అలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.. నేనైతే 2011లో: గంభీర్ -
Sheetal Mahajan: ఎవరెస్ట్ జంప్
41 ఏళ్ల భారతీయ మహిళా స్కై డైవర్ శీతల్ మహాజన్ ఎవరెస్ట్ ఎదుట పక్షిలా ఎగిరారు. హెలికాప్టర్లో ఎవరెస్ట్ ఒడిలో 21,500 అడుగుల ఎత్తు నుంచి దూకి ఊపిరి బిగపట్టి చూసే జంప్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. నవంబర్ 13న ఆమె ఈ ఘనత సాధించారు. ఆ సాహసం వెనుక కథనం. ‘స్కై డైవింగ్ చేసి కాళ్లూ చేతులూ విరిగితే నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు’ అని ఇంటివాళ్ల చేత చివాట్లు తిన్న అమ్మాయి రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ ఇంటివారినే కాదు ప్రపంచాన్ని కూడా నివ్వెర పరుస్తూనే ఉంది. 41 ఏళ్ల శీతల్ మహాజన్ ఎవరెస్ట్ చెంత సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తున హెలికాప్టర్లో నుంచి జంప్ చేసి 17,444 అడుగుల ఎత్తు మీదున్న కాలాపత్థర్ అనే చోట సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఊపిరి బిగ పట్టి చూడాల్సిన సాహసం ఇది. గడ్డ కట్టే చలిలో, ఆక్సిజన్ అందని ఎత్తు నుంచి, ఎవరెస్ట్ సానువుల వంటి ప్రమాదకరమైన చోట ఒక మహిళ ఇలా జంప్ చేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ మహిళా ఇంత ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేయకపోవడం మరో రికార్డు. ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ స్కై డైవర్ పౌల్ హెన్రీ ఇందుకు గైడ్‌గా వ్యవహరిస్తే నీతా అంబానీ, అనంత్ అంబానీ తదితరులు స్పాన్సరర్స్‌గా వ్యవహరించారు. స్త్రీలు ఎందుకు చేయలేరు? శీతల్ మహాజన్‌ది పూణె. తండ్రి కమలాకర్ మహాజన్ టాటా మోటార్స్‌లో ఇంజినీర్‌గా చేసేవాడు. ఇంటర్ చదువుతూ ఉండగా ‘నీ చదువుతో నువ్వు హ్యాపీగా ఉన్నావా?’ అని తండ్రి అడిగిన ప్రశ్న ఆమెలో సంచలనం రేపింది. ‘సైన్స్ చదవాలనుకుని చేరాను. కాని ఇలా చదవడం కాకుండా ఇంకేదో చేయాలి. ఎవరూ చేయనిది చేయాలి. అదే నాకు సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాను’ అంటుంది శీతల్. ఆ తర్వాత ఆమె గూగుల్ చేయడం మొదలెట్టింది– భారతీయ స్త్రీలు ఎక్కువగా లేని రంగంలో ఏదైనా సాధించాలని. అలా తారసపడినదే స్కై డైవింగ్. ‘అప్పటికి మన దేశంలో స్కై డైవింగ్‌లో రేచల్ థామస్ వంటి ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది స్త్రీలు లేరు. నేనెందుకు చేయకూడదు అనుకున్నాను. 22 ఏళ్ల వయసులో నార్త్‌పోల్‌లో మొదటి స్కై డైవింగ్ చేశాను. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ స్త్రీని నేనే’ అంటుంది రేచల్. 15 లక్షల ఖర్చుతో 2004లో శీతల్ తండ్రి జీతం 18 వేలు. కాని ఆ సంవత్సరం శీతల్ నార్త్ పోల్‌లో స్కై డైవింగ్ చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అందుకు అయ్యే ఖర్చు 15 లక్షలు. దాని కంటే ముందు ‘నువ్వు ఆడపిల్లవు. ఇలాంటి వాటికి పనికిరావు’ అన్నారు అంతా. ‘నన్ను ఆ మాటలే ఛాలెంజ్ చేశాయి’ అంటుంది శీతల్. అప్పటివరకూ శీతల్ విమానం కూడా ఎక్కలేదు. పారాచూట్ జంప్ అసలే తెలియదు. ఏ ట్రైనింగ్ లేదు. అయినా సరే స్పాన్సరర్లను వెతికి నార్త్‌పోల్‌కు వెళ్లింది. అయితే అక్కడి ఇన్స్ట్రక్టర్లు ఆమెను వెనక్కు వెళ్లమన్నారు. ‘ఇంతకుముందు ఒక మహిళ ఇలాగే నార్త్‌పోల్‌కు వచ్చి జంప్ చేయబోయి మరణించింది. అందుకని వారు అంగీకరించలేదు. నేను పట్టువదలక వారంపాటు అక్కడే ఉండి మళ్లీ సంప్రదించాను. ఈసారి అంగీకరించారు’ అంది శీతల్. 2004 ఏప్రిల్ 18న నార్త్‌పోల్‌లో మైనస్ 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో తన మొదటి జంప్ చేసింది. అలా లోకానికి సాహసిగా పరిచయమైంది. ఎన్నో రికార్డులు ఆ తర్వాతి నుంచి శీతల్ స్కై డైవింగ్‌లో రికార్డులు సాధిస్తూనే ఉంది. ఆ వెంటనే ఆమె అంటార్కిటికాలో స్కై డైవింగ్ చేసింది. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎదుట స్కై డైవింగ్ చేయడంతో భూమ్మీద ఉన్న రెండు ధ్రువాలతో పాటు మూడో ధ్రువం వంటి ఎవరెస్ట్ దగ్గర కూడా జంప్ చేసిన ఏకైక మహిళగా రికార్డు స్థాపించింది. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన వైభవ్ రాణెను హాట్ ఎయిర్ బెలూన్‌లో 5,800 అడుగుల ఎత్తులో వివాహం చేసుకుని అందరినీ హాశ్చర్యపరిచింది. శీతల్‌కు కవల అబ్బాయిలు. ‘పెళ్లయ్యి పిల్లలు పుట్టాక మహిళ జీవితం కెరీర్ పరంగా అంతమైనట్టేనని అందరూ అనుకుంటారు. నేను కూడా ఆగిపోతానని కొందరు ఆశపడ్డారు. నేను ఆ తరహా కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు కలిసి పెంచాలి. తల్లి మాత్రమే కాదు. నేను నా పిల్లల్ని పెంచుతాను... అలాగే నా కెరీర్‌ని కూడా కొనసాగిస్తాను. నిజానికి పెళ్లయ్యాకే అమెరికా వెళ్లి స్కై డైవింగ్‌లో ఉత్తమ శ్రేణి ట్రైనింగ్ తీసుకున్నాను’ అంటుందామె. ఇప్పుడు పూణెలో స్కై డైవింగ్ అకాడెమీ తెరిచి స్కై డైవింగ్‌లో శిక్షణ ఇస్తోంది.బయటకు రండి స్త్రీలు నాలుగ్గోడల నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడాలి... తమలోని సామర్థ్యాలను తెలుసుకుని వాటిని సానబట్టుకోవాలి... విజయం సాధించాలి... భారతీయ స్త్రీలు సాధించలేనిది లేదు... వారికి కావాల్సింది అవకాశమే అంటున్న శీతల్ కచ్చితంగా ఒక గొప్ప స్ఫూర్తి. -
22 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య
లక్నో/అయోధ్య: అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం అత్యంత వైభవంగా 22 లక్షల దీపాలతో జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా స్వీయ గిన్నిస్ రికార్డునే బద్దలు కొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో 25 వేల మంది వలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో దీపాలను లెక్కించి, ప్రపంచ రికార్డుగా ధ్రువీకరించడంతో నగరం ‘జై శ్రీరామ్’ నినాదాలతో మారుమోగింది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ మేరకు సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సర్టిఫికెట్‌ను అందజేశారు. గతేడాది ఈ వేడుకలో 15.76 లక్షల ప్రమిదలు వెలిగించడం తొలిసారి గిన్నిస్ రికార్డులకెక్కింది. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో ఏటా దీపోత్సవం జరుగుతోంది. శనివారం సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేబినెట్ మంత్రులు కూడా దీపాలు వెలిగించి, సరయూ నది ఒడ్డున పూజలు చేశారు. దీపోత్సవం 100 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
ఏడాది ప్రాయంలోనే అద్భుత గ్రాహకశక్తి
అనకాపల్లి: ఉగ్గినపాలెం గ్రామానికి చెందిన గాలి దృశ్యంత్‌కుమార్ బుడి బుడి అడుగుల నాడే అద్భుతమైన గ్రాహక శక్తితో నోబెల్ ప్రపంచ రికార్డు సాధించి అందరిని అబ్బుర పరిచాడు. తమిళనాడుకు చెందిన నోబెల్ వరల్డ్ రికార్‌ుడ్స ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని తండ్రి గాలి నాగేశ్వరరావు ఇక్కడ బుధవారం విలేకరులకు తెలిపారు. నాగేశ్వరరావు, శ్రీదేవి దంపతుల కుమారుడైన దృశ్యంత్ కుమార్ పుట్టినప్పటి నుంచి చురుగ్గా ఉండడమే కాకుండా అపరిమితమైన గ్రాహక శక్తి ఉన్నట్టు తల్లిదండ్రులు గుర్తించారు. పది నెలల వయస్సు నుంచి కుమార్‌కు అనేక రకాల వస్తువులు, ఫొటోలు, వివిధ దేశాల జెండాలను చూపిస్తూ అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దృశ్యంత్ ఏడాది వయసులోనే 300 రకాల ఫొటోలను గుర్తించడమే కాకుండా వస్తువులు, పూలు, పండ్లు, కూరగాయలను సునాయాసంగా గుర్తిస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుని గ్రాహక శక్తిని వీడియో ద్వారా రికార్డు చేసి తమిళనాడులో ఉన్న నోబుల్ వరల్డ్ రికార్‌ుడ్స ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు ఇటీవల పంపించారు. వాటిని పరిశీలించిన ప్రతినిధులు ఉగ్గినపాలెం వచ్చి పరిశీలించిన మీదట నోబెల్ వరల్డ్ రికార్డులో నమోదు చేసి పురస్కారాన్ని ప్రకటించారు. సర్టిఫికెట్, పతకాన్ని అందిస్తూ పోస్టు ద్వారా ఇక్కడకు పంపారు. దీంతో పురస్కారం రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఎంపీ డాక్టర్ సత్యవతి అభినందన చిన్నతనంలోనే అద్భుతాలు చేస్తున్న దృశ్యంత్కుమార్కు అనకాపల్లి ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి తన కార్యాలయంలో బుధవారం జ్ఞాపికను అందజేసి సత్కరించి కొద్దిసేపు ముచ్చటించి అభినందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను కూడా సత్కరించారు. ఈ చిన్నారి మరిన్ని అద్బుతాలు సాధించి అందరికి ఆదర్శంగా నిలవగలడని ఆకాంక్షించారు. డాక్టర్ కె. విష్ణుమూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
CWC 2023 ENG VS NZ: 4658 వన్డేల చరిత్రలో తొలిసారి ఇలా..!
భారత్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 2023లో ఇంగ్లండ్ జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తుది జట్టులోని సభ్యులందరూ (11 మంది) రెండంకెల స్కోర్లు చేసి చరిత్ర సృష్టించారు. 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టు సభ్యులు జానీ బెయిర్‌స్టో (33), డేవిడ్ మలాన్ (14), హ్యారీ బ్రూక్ (25), మొయిన్ అలీ (11), జోస్ బట్లర్ (43), జో రూట్ (77), లియామ్ లివింగ్‌స్టోన్ (20), సామ్ కర్రన్ (14), క్రిస్ వోక్స్ (11), మార్క్ వుడ్ (13 నాటౌట్), ఆదిల్ రషీద్ (15 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. 4,658 ODI matches in history so far. First time ever all the 11 batters of a team scored runs in double digits. pic.twitter.com/UYP1oWDf0S — Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2023 ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు రాణించినప్పటికీ జట్టులోని సభ్యులందరూ తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, ఫిలిప్స్ తలో 2, బౌల్ట్, రవీంద్ర చెరో వికెట్ దక్కించుకున్నారు. 283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఏడో బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ.. వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్ రవీంద్ర (39), డెవాన్ కాన్వే (33) ధాటిగా ఆడుతూ తమ జట్టును లక్ష్యం దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. 9 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 73/1గా ఉంది. -
టాటులతో వరల్డ్ రికార్డు..అది కూడా 667..
వరల్డ్ రికార్డ్ క్రేజ్ ఉన్న వాళ్లు దాన్ని సాధించేందుకు అంతే క్రేజీగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి క్రేజీ లిస్ట్‌లోకి యూకేకు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్నూ చేర్చొచ్చు. శరీరంపై తన కూతురు పేరుతో 667 టాటూలు వేయించుకున్నాడు. ఆల్రెడీ వీపు వెనుక భాగంపై ‘లూసీ’ పేరుతో 267 టాటూలు వేయించుకుని 2017లో గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు. అయితే 2020లో డ్రా విజిల్ అనే 27 ఏళ్ల మహిళ తన శరీరం మీద తన పేరుతో 300 టాటూలు వేయించుకుని మార్క్ ఓవెన్ ఎవాన్స్ గిన్నిస్ రికార్డును బ్రేక్ చేసింది. ఆ మహిళను అధిగమించి, ఎలాగైనా తిరిగి గిన్నిస్ రికార్డును పొందాలని మార్క్ నిశ్చయించుకున్నాడు. అందుకోసం అతను తన కూతురు బర్త్ డే సందర్భంగా తన రెండు కాళ్లపై మరో నాలుగు వందసార్లు ఆమె పేరును టాటూలు వేయించుకున్నాడు. అలా మొత్తం 667 టాటూస్‌తో మార్క్ ఓవెన్ మరోసారి వరల్డ్ గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. (చదవండి: జపాన్‌లో శరత్కాల వేడుకలు!) -
పరుగుల సునామీ.. ఏకంగా 8 సిక్సర్లు.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. యువీ రికార్డు బ్రేక్
Dipendra Singh Fastest T20I 50: నేపాల్ ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఆరీ పరుగుల సునామీ సృష్టించాడు. మంగోలియాతో మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చిత్తు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట(ఇంగ్లండ్ మీద 12 బంతుల్లో) ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఆసియా క్రీడలు -2023లో భాగంగా మెన్స్ క్రికెట్ ఈవెంట్లో నేపాల్- మంగోలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. చైనాలోని హోంగ్జూలో జరిగిన ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఈ మేర సుడిగాలి అర్ధ శతకంతో మెరిశాడు. ఐదోస్థానంలో బ్యాటింగ్ దిగిన ఈ ఆల్‌రౌండర్ 10 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో ఎదుర్కొన్న తొలి ఆరు బంతుల్లోనే వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు. రెండు ఫార్మాట్లలో అద్భుత సెంచరీలు కాగా 23 ఏళ్ల దీపేంద్ర సింగ్ ఆరీ 2018లో నేపాల్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 52 వన్డేలు, 38 టీ20లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 889, 991 పరుగులు సాధించాడు. అదే విధంగా ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ ఖాతాలో వన్డేల్లో 36, టీ20లలో 21 వికెట్లు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ వన్డేల్లో ఈ రైట్ హ్యాండ్‌బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 105, టీ20లలో 110 కావడం విశేషం. సంచలనాలు సృష్టించిన నేపాల్ జట్టు ఇక టీ20 చరిత్రలో బుధవారం(సెప్టెంబరు 27) సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఆసియా క్రీడలు- 2023 మెన్స్ క్రికెట్ ఈవెంట్లో మంగోలియాతో మ్యాచ్‌లో నేపాల్ పలు అరుదైన ఘనతలు సాధించి చరిత్రకెక్కింది. టీ20 ఫార్మాట్లో 314 పరుగులతో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. అంతేకాదు మంగోలియాను 41 పరుగులకే ఆలౌట్ చేసి 273 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. చదవండి: 34 బంతుల్లోనే సెంచరీ.. రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ రికార్డు బద్దలు -
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..
-
ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్ పెన్నును చూశారా!
ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్ పెన్నును చూశారా? ఇక్కడున్న పెన్ను అదే! జపాన్‌కు చెందిన మిత్సుబిషి కంపెనీ యూని–బాల్ వన్ సిరీస్ బ్లాక్ జెల్ పెన్ను. ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. దీని సిరా లోపలి వినూత్నమైన వర్ణద్రవ్య కణాల కారణంగా ఈ పెన్నుతో కాగితంపై రాస్తున్నప్పుడు ఇది ఇతర బ్లాక్ జెల్ పెన్నుల కంటే రంగును మరింత నల్లగా కనిపించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ పెన్నుకు సంబంధించిన వివరాలను కంపెనీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. చాలామంది ఈ పెన్నును కొనడానికి పోటీ పడుతున్నారు. కానీ ఇది ఇంకా మార్కెట్లో విడుదల కాలేదు. త్వరలోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. (చదవండి: కథక్ నుంచి తీన్మార్ వరకు ఏదైనా..వారెవా! అనేలా ఇరగదీస్తాడు!) -
తోకతో రికార్డు కొట్టేసింది...
ఈ ఫొటోలో విలాసంగా పోజు పెట్టిన పిల్లిని చూశారు కదా! చాలా పిల్లుల్లాగానే ఇది కూడా మామూలు పిల్లి మాత్రమే అనుకుంటే పొరపాటే! ఇది అలాంటిలాంటి పిల్లి కాదు, సుదీర్ఘవాలం కలిగిన మార్జాలరాజం. పొడవుగా పెరిగిన తోకే దీనికి రికార్డు తెచ్చిపెట్టింది. అమెరికాలో మిషిగన్‌కు చెందిన డాక్టర్ విలియమ్ జాన్ పవర్స్ పెంచుకుంటున్న ఈ ఐదేళ్ల పిల్లి ప్రపంచంలోనే అత్యంత పొడవైన తోక కలిగిన పిల్లిగా ఇటీవల గిన్నిస్ రికార్డు సాధించింది. దీని పేరు అలై్టర్. దీని తోక పొడవు 16.07 అంగుళాలు. ప్రపంచంలో మరే పిల్లికీ ఇంత పొడవాటి తోక లేదని గిన్నిస్‌బుక్ అధికారులు ధ్రువీకరించారు. అలై్టర్ మాత్రమే కాదు, దీని తోబుట్టువులైన ఆర్కటరస్, ఫెన్రిర్లు ఇదివరకు అతి పొడవాటి పిల్లులుగా గిన్నిస్ రికార్డులు సాధించాయి. (చదవండి: ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు!) -
ప్రపంచ రికార్డు సమం చేసిన బుమ్రా
ఐర్లాండ్‌తో రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఓ ప్రపంచ రికార్డు సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను (ఛేదనలో) మెయిడిన్ చేసిన బుమ్రా.. అంతర్జాతీయ టీ20ల్లో (ఐసీసీ ఫుల్‌టైమ్ సభ్యదేశాలు పాల్గొన్న మ్యాచ్‌లు) అత్యధిక మెయిడిన్ ఓవర్లు (10) వేసిన బౌలర్‌గా సహచరుడు భువనేశ్వర్ కుమార్ రికార్డును సమం చేశాడు. భువీ 87 టీ20ల్లో 10 మెయిడిన్లు వేస్తే, బుమ్రా తన 62వ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. ఈ విభాగంలో భువీ, బుమ్రాల తర్వాత బంగ్లాదేశ్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (6), శ్రీలంక నువాన్ కులశేఖర (6) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఐర్లాండ్‌తో రెండో టీ20లో 4 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (74) తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో చహల్ 96 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 90 వికెట్లతో భువనేశ్వర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఐర్లాండ్‌తో నిన్న (ఆగస్ట్ 20) జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ (58), శాంసన్ (40), రింకూ సింగ్ (38), శివమ్ దూబే (22 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఐర్లాండ్ లక్ష్యానికి 34 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఆండ్రూ బల్బిర్నీ (72) టాప్ స్కోరర్‌గా నిలువగా.. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు, అర్షదీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు. -
వన్డే ఫార్మాట్లో పెను సంచలనం.. 515 పరుగుల రికార్డు స్కోర్, 450 పరుగుల తేడాతో విజయం
ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో పెను సంచలనం నమోదైంది. యూఎస్ఏ అండర్-19 జట్టు అర్జెంటీనా యువ జట్టుపై 450 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది. టొరొంటో వేదికగా నిన్న (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 515 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అండర్-19 క్రికెట్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. 2002లో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్.. కెన్యాపై చేసిన 480 పరుగులే ఈ మ్యాచ్‌కు ముందు వరకు అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లో ఉండింది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ.. ఆసీస్ రికార్డును బ్రేక్ చేసి, అండర్-19 వన్డే ఫార్మాట్లో 500 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా లిస్ట్-ఏ క్రికెట్లోనూ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా యూఎస్ఏ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు టీమ్ రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్లో అతి భారీ విజయం.. యూఎస్ఏ నిర్ధేశించిన 516 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అర్జెంటీనా.. పేసర్ ఆరిన్ నాదకర్ణి (6-0-21-6) ధాటికి 65 పరుగులకే కుప్పకూలి, 450 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. అండర్-19 క్రికెట్ వన్డే ఫార్మాట్లో ఇదే అతి భారీ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండింది. 2002లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 430 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవరాల్‌గా (లిస్ట్-ఏ క్రికెట్) చూసినా యూఎస్ఏ సాధించిన విజయమే వన్డే ఫార్మాట్ మొత్తంలో అతి భారీ విజయంగా నమోదైంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్లో అతి భారీ విజయం రికార్డు తమిళనాడు (అరుణాచల్‌పై 435 పరుగుల తేడాతో విజయం) పేరిట ఉండింది. మ్యాచ్ విషయానికొస్తే.. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భవ్య మెహతా (136), రిషి రమేశ్ (100) సెంచరీలతో.. ప్రణవ్ చట్టిపలాయమ్ (61), అర్జున్ మహేశ్ (67) అర్ధసెంచరీలతో చెలరేగడంతో యూఎస్ఏ టీమ్ రికార్డు స్కోర్ చేసింది. యూఎస్ఏ టీమ్‌లో అమోఘ్ ఆరేపల్లి (48), ఉత్కర్ష్ శ్రీవత్సవ (45) కూడా రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన అర్జెంటీనా 19.5 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌటైంది. నాదకర్ణితో పాటు ఆర్యన్ సతీశ్ (2), పార్థ్ పటేల్ (1), ఆర్యన్ బత్రా (1) వికెట్లు పడగొట్టారు. అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో థియో (18) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
తొలి టి20.. భారత్ ముంగిట అరుదైన రికార్డు; పాక్ మనకంటే ముందే?
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను ముగించుకుంది. టెస్టు సిరీస్‌ను 1-0తో నెగ్గిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఇప్పుడు టి20 సిరీస్‌పై కన్నేసింది. రోహిత్ శర్మ, కోహ్లి, జడేజాలు ఈ సిరీస్‌కు దూరంగా ఉండడంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు విండీస్‌తో తొలి టి20లో తలపడనుంది. ఐపీఎల్లో ఇరగదీసిన యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, సంజూ శాంసన్‌లు విండీస్‌తో టి20 సిరీస్‌లో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే జైశ్వాల్ విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక గిల్, ఇషాన్ కిషన్‌లు వన్డే సిరీస్‌లో అద్బుతంగా ఆడారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ అర్థసెంచరీలతో మెరిశాడు. దీంతో ఈ ముగ్గురు తుది జట్టులో ఉండే అవకాశముంది. ఇక మిడిలార్డర్లో సంజూ శాంసన్ ఉంటాడా లేదా అనేది చూడాలి. ఇక ఫినిషర్స్‌గా సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలు తమ వంతు పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా విండీస్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా ఒక అరుదైన ఘనత సాధించనుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. టి20 క్రికెట్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా టీమిండియా నిలవనుంది. ఇంతకముందు పాకిస్తాన్ మాత్రమే ఈ మార్క్‌ను దాటింది. ఓవరాల్‌గా పాకిస్తాన్ 223 టి20 మ్యాచ్‌లు ఆడింది. దీంతో తొలి టి20 మొదలవ్వగానే ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా ఈ రికార్డును అందుకోనుండడం విశేషం. కాగా ఇప్పటివరకు 199 టి20 మ్యాచ్‌లాడిన టీమిండియా 127 విజయాలు, 63 ఓటములు చవిచూసింది. ఒక మ్యాచ్ మాత్రం టైగా ముగిసింది. చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. Ishan- Gill: వెటరన్ జోడీ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్- గిల్! -
చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. పాక్ బ్యాటర్ ప్రపంచ రికార్డు బద్దలు.. ఏకంగా..
West Indies vs India, 3rd ODI- Shubman Gill World Record: వెస్టిండీస్‌తో టెస్టుల్లో దారుణంగా విఫలమైన టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్.. వన్డే సిరీస్‌ను మాత్రం ఘనంగా ముగించాడు. ఏరికోరి టెస్టు సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ 6, 10, 29(నాటౌట్) పరుగులు మాత్రమే సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే సిరీస్‌నూ సింగిల్ డిజిట్ స్కోరు(7)తోనే ఆరంభించిన గిల్‌పై విమర్శలు కొనసాగాయి. తీవ్ర ఒత్తిడిలోనూ.. ఇక, రెండో వన్డేలో 34 పరుగులు సాధించినప్పటికీ జట్టు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన గిల్ మళ్లీ అభిమానులకు టార్గెట్ అయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడితో కూరుకున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో మాత్రం శుబ్‌మన్ గిల్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. పాక్ బ్యాటర్ ప్రపంచ రికార్డు బద్దలు బ్రియన్ లారా స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అతడు 92 బంతులు ఎదుర్కొని 11 ఫోర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీతో మెరిసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అద్భుత ఇన్నింగ్స్‌తో సరికొత్త రికార్డు సృష్టించాడు. మొన్న బాబర్‌ను దాటేసి సెంచరీ మిస్ అయినా.. పాకిస్తాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 27 వన్డే ఇన్నింగ్స్‌లో సగటు 62.48తో 1437 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇక గత మ్యాచ్‌లో 1352 పరుగుల వద్ద ఉన్న గిల్.. బాబర్ ఆజం(1322)ను అధిగమించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వన్డేల్లో 27 వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించింది వీళ్లే! 1.శుబ్‌మన్ గిల్- 1437 2.ఇమాన్ ఉల్ హక్- 1381 3.రాసీ వాన్ డెర్ డసెన్- 1353 4.రియాన్ టెన్ డొషాటే- 1353 5. జొనాథన్ ట్రాట్- 1342. చదవండి: విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. అరుదైన రికార్డు! ప్రపంచంలోనే ఏకైక జట్టుగా.. ఓడిపోతే ఏం జరిగేదో తెలుసు! అందుకే రోహిత్, కోహ్లిలను కాదని ఇలా: హార్దిక్ మొన్న వాటర్‌బాయ్! ఇప్పుడు ఇలా.. ఏంటిది కోహ్లి! వీడియో వైరల్ Well played. Deserved a 💯@ShubmanGill . .#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/KPWdZjFQt6 — FanCode (@FanCode) August 1, 2023 -
చరిత్ర సృష్టించిన పాక్ బ్యాటర్.. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు
పాక్ బ్యాటర్ సౌద్ షకీల్ చరిత్ర సృష్టించాడు. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఏడు టెస్ట్‌ల్లో కనీసం ఓ హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 27 ఏళ్ల షకీల్ తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 7 టెస్ట్ మ్యాచ్‌ల్లో 13 ఇన్నింగ్స్‌ల్లో 87.5 సగటున ఓ అజేయమైన డబుల్ సెంచరీ, అజేయమైన సెంచరీ, 5 హాఫ్ సెంచరీల (ఓ అజేయమైన హాఫ్ సెంచరీ) సాయంతో 875 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో షకీల్ వరుసగా (37 & 76), (63 & 94), (23 & 53), (22 & 55 నాటౌట్), (125 నాటౌట్ & 32), (208 నాటౌట్ & 30), 57 స్కోర్లు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు.. తన తొలి 7 టెస్ట్‌ల్లో ఈ ఘనత సాధించింది లేదు. కాగా, శ్రీలంక పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్ నెగ్గి 2 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న పాక్.. లంకతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ పట్టు బిగించింది. నాలుగో రోజు ఆటలో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 576/5 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఆ జట్టుకు 410 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అబ్దుల్లా షఫీక్ (201) డబుల్ సెంచరీతో చెలరేగగా.. అఘా సల్మాన్ (132) అజేయ శతకంతో మెరిశాడు. షాన్ మసూద్ (51), సౌద్ షకీల్ (57), మహ్మద్ రిజ్వాన్ (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం 410 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక.. 27 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. నిషాన్ మధుష్క (33), దిముత్ కరుణరత్నే (41) ఔట్ కాగా.. కుశాల్ మెండిస్ (12), ఏంజెలో మాథ్యూస్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండ్రోజుల ఆట (27, 28 తేదీలు) మిగిలి ఉంది. పాక్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తుంది. -
అతని వయసు 90..బాడీ పరంగా యువకుడే! ఎలాగంటే..
వయసులో అతను వృద్ధుడే కానీ బాడీ పరంగా ఉక్కులాంటి దేహం. యువ బాడీబిల్డర్లకు ఏ మాత్రం తీసిపోని దేహదారుఢ్యం అతని సొంతం. తొమ్మిది పదుల వయసులో ఓ వీల్‌చైర్‌కే పరిమితమై.. మనుషులను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. అతను మాత్రం చాలా యాక్టివిగ్ అచ్చం యువకుడిలో ఉండే నూతనోత్సహాం అతనిలో ఉంది. ఇంతకీ అతను ఎవరూ? ఆ వయసులో కూడా అంత చురుగ్గా ఎలా ఉన్నాడంటే.. జిమ్ అరింగ్టన్ అనే వ్యక్తి ఓ బాడీ బిల్డర్. అతను వయసులో ఉన్నపుడే ఎలాంటి బాడీని మెయింటేన్ చేశాడో అలానే వృద్ధాప్యంలో కూడా మెయింటేన్ చేసి అబ్బురపర్చాడు. 90ల వయసులో కూడా బాడీ బిల్డర్ మాదిరి తన కండలు, బాడీ తీరు మారకపోవడవం విశేషం. క్రమం తప్పకుండా చేసే జిమ్, తీసుకునే ఫుడ్ డైట్ కారణంగా అతను అలా బాడీని కంటిన్యూ చేయగలిగాడు. దీంతో అతను అత్యంత వృద్ధ బాడీ బిల్డర్‌గా రికార్డు నెలకొల్పోడు. తనకు చిన్నప్పటి నుంచి బాడీ బిల్డింగ్ మీద మక్కువ ఉండేదని, ఇదే తన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకునేలా చేసిందని ఆనందంగా చెబుతున్నడు అరింగ్టన్. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డు అతని హెల్త్ సీక్రెట్‌కి సంబంధించిన వీడియోని నెట్టింట పోస్ట్ చేసింది. అందులో తన ఆరోగ్య రహస్యం, బాడీని అలా మెయింటైన్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిట్కాలను పంచుకున్నాడు అరింగ్టన్. దీంతో ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఈ వయసులో కూడా బాడీని ఫిట్‌గా ఉంచి అందరికి స్ఫూర్తిగా నిలిచారంటూ అరింగ్టన్పై ప్రశంసల జల్లు కురిపించారు. (చదవండి: వ్యాధుల నిర్థారణ వైఫల్యతతో..ఏటా 8 లక్షల ప్రాణాలు బలి) -
ఓర్నీ!.. ఏం రికార్డ్..రా! ఇది..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్!
ఇంతవరకు ఎన్నో రికార్డులు గురించి విని ఉంటారు. చాలాచాలా వింతవింత రికార్డులను కూడా చూశాం. కానీ ఏడుస్తూ రికార్డు చేయొచ్చు అని మీకు తెలుసా!. అసలు ఇలాంటి వింత ఆలోచన.. కూడా చేస్తారా అనిపిస్తోంది కదా!. ఔను ఓ వ్యక్తి ఇలాంటి వెరైటీ రికార్డును నెలకొల్పాలనుకున్నాడు. వినూత్న రీతిలో ప్రపంచ రికార్డును సృష్టించాలని చాలా గట్టిగా నిశ్చయించకున్నాడు. అందుకోసం నాన్‌స్టాప్‌గా ఏడవలనే ఒక విచిత్రమైన టాస్క్ తీసుకున్నాడు. చివరికి రికార్డు సాధించాడో లేదో తెలియదు గానీ అతనికి లేనిపోని శారీరక కష్టాలను తెచ్చిపెట్టింది. వివరాల్లోకెళ్తే..నైజీరియన్‌కి చెందిన టెంబు ఎబెరే అనే వ్యక్తి ఎలాగైన ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాలనే ఉద్దేశంతో నాన్‌స్టాప్‌గా ఏడవం అనే ఫీట్‌ని ఎన్నుకున్నాడు. రికార్డు బ్రేక్ చేయడం కోసం ఏకంగా ఏడు రోజుల పాటు నాన్‌స్టాప్ ఏడ్చాడు. దీంతో అతడను 45 నిమషాల పాటు చూపుని కోల్పోయాడు. అంతలా ఏడవడం కారణంగా తలనొప్పి, ముఖం వాచిపోవడం, కళ్లు ఉబ్బడం వంటి శారరీక రుగ్మతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐతే అనతు గిన్నిస్ వరల్ఢ్ రికార్డుకి దరఖాస్తు చేయలేదు కాబట్టి అతడు చేసిన ఫీట్‌ని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. ఇలాంటి క్రేజీ రికార్డులు చేయడం నైజీరియన్లకు కొత్తేమీ కాదు. ఎందకంటే గతంలో ఇలానే ఓ మహిళ 100 గంటల పాలు వంటలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఏ కన్నులు చూడని రెండు చిత్రాలు దాగున్నాయి!కనిపెట్టగలరా?) -
సెంచరీలతో చెలరేగిన ఆఫ్గన్ ఓపెనర్లు.. ప్రపంచ రికార్డు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్(125 బంతుల్లో 145 పరుగులు, 13 ఫోర్లు, 8 సిక్సర్లు), ఇబ్రహీం జర్దన్(119 బంతుల్లో 100 పరుగులు, 9 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరి ధాటికి అఫ్గానిస్తాన్ 400 పరుగులు దాటుతుందని అనిపించింది. కానీ స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔట్ కావడం.. తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. వీరి తర్వాత మహ్మద్ నబీ చివర్లో 15 బంతుల్లో 25 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, హసన్ ముహ్మద్, షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. ఎబాదత్ హొసెన్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తడబడుతోంది. ప్రస్తుతం 8 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 25 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. ఇక అఫ్గానిస్తాన్ ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడమే కాకుండా ప్రపంచ రికార్డుతో మెరిశారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ► రహమనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దన్‌లు తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 256 పరుగులు జోడించారు. అఫ్గాన్ వన్డే చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకముందు 2010లో స్కాట్లాండ్పై కరీమ్ సాదిక్, మహ్మద్ షెహజాద్‌లు రెండో వికెట్‌కు 218* పరుగులు జోడించి రెండో స్థానంలో ఉన్నారు.2010లోనే షార్జా వేదికగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షెహజాద్, నూర్ అలీ జర్దన్‌లు రెండో వికెట్‌కు 205 పరుగులు జోడించి మూడో స్థానంలో ఉన్నారు. ► ఇక ఓవరాల్‌గా అఫ్గాన్ క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో పరిశీలిస్తే 256 పరుగుల భాగస్వామ్యం రెండో అత్యధికంగా ఉంది. ఇక మొదటి స్థానంలో అస్గర్ అప్గన్, హస్మతుల్లా షాహిది జోడి ఉంది. ఈ జోడి 2021లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో నాలుగో వికెట్‌కు 307 పరుగులు జోడించారు. ► ఇక వన్డే క్రికెట్లో బంగ్లాదేశ్‌పై ఏ జట్టుకైనా ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకముందు 2022లో టీమిండియా నుంచి కోహ్లి, ఇషాన్ కిషన్ల జోడి రెండో వికెట్‌కు 290 పరుగులు జోడించి తొలి స్థానంలో ఉన్నారు. The moment @RGurbaz_21 reached his 4th ODI hundred! 🤩#AfghanAtalan | #BANvAFG2023 | #XBull pic.twitter.com/0AmNoEtGol — Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023 When @IZadran18 brought up his 4th ODI hundred! 🤩#AfghanAtalan | #BANvAFG2023 | #XBull pic.twitter.com/Lv1eV610cg — Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023 చదవండి: విలన్‌గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్షాపులో డబ్బులు ఎగ్గొట్టి -
ఇదేం విచిత్రమైన పోటీ.. గిన్నిస్ రికార్డు కూడానా?
ఫ్రాన్స్: ఒక విచిత్రమైన పోటీలో పాల్గొని ప్రపంచ రికార్డు బద్దలుకొట్టాడు ఫ్రాన్స్ కు చెందిన జోనాథన్ వెరో అనే స్టంట్ మ్యాన్. ఆక్సిజన్ తీసుకునే అవకాశం లేకుండా ఒంటికి నిప్పంటించుకుని 100 మీటర్ల పరుగు పందాన్ని 17 సెకండ్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డుతో పాటు గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఫ్రాన్స్ కు చెందిన జోనాథన్ వెరో అనే 39 ఏళ్ల స్టంట్ మాస్టర్ కు చిన్నప్పటి నుండి స్టంట్స్ అంటే చాలా ఇష్టమట. అందులోనూ నిప్పుతో చెలగాటమాడటం అంటే అతడికి మహా సరదా. నిప్పును నోట్లో వేసుకుని విన్యాసాలు చేయడం వంటి ఎన్నో సాహసాలు చేయడం అతడికి అలవాటు. అందులో భాగంగానే ఒళ్ళంతా నిప్పు అంటించుకుని కాలుతూ పరిగెత్తడంలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మంటల్లో మండుతూ 272.25 మీటర్లు పరిగెత్తి కాలుతూ ఆక్సిజన్ తీసుకోకుండా ఎక్కువ దూరం పరిగెత్తిన రికార్డుతో పాటు 17 సెకండ్లలో 100 మీటర్లు పూర్తి చేసి పాత రికార్డును చెరిపేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కేవలం ప్రపంచ రికార్డు మాత్రమే కాదు ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు జోనథన్. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ స్వయంగా గిన్నిస్ బుక్ ప్రతినిధులే వీడియోతో సహా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ వీడియోకు మిలియన్లలో వీక్షణలు దక్కాయి. నెటిజన్లు ఈ వీడియోకు ఇలాంటి చెత్త రికార్డులు కూడా ఉంటాయా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. New record: The fastest full body burn 100 m sprint without oxygen - 17 seconds by Jonathan Vero (France) Jonathan also set the record for the farthest distance ran in full body burn during this attempt at 272.25 metres! 🔥 pic.twitter.com/J0QJsPNkPf — Guinness World Records (@GWR) June 29, 2023 ఇది కూడా చదవండి: ఎస్కలేటర్ లో చిక్కుకున్న మహిళ కాలు.. ఏం చేశారంటే..? -
అదరహో..! ఐదు రోజుల పాటు నిర్విరామంగా బాలిక డ్యాన్స్.. గిన్నీస్ రికార్డ్..
మహారాష్ట్ర: మహారాష్ట్రకు చెందిన ఓ బాలిక అరుదైన ఘనత సాధించింది. నిరంతరాయంగా 127 గంటలపాటు డ్యాన్స్ చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించింది. డ్యాన్స్ మారథాన్‌లో ఐదు రోజులపాటు నిర్విరామంగా క్లాసికల్ కథక్ నృత్యం చేసింది. మే 29 నుంచి జూన్ 3 వరకు ఈ మారథాన్‌లో పాల్గొని ఇప్పటివరకు ఉన్న 126 గంటల రికార్డ్‌ను అధిగమించింది. సృష్టి సుధీప్ జగతాప్(16) లాతూర్కు చెందిన బాలిక. నృత్యంలో మంచి ప్రతిభను చూపించింది. ఏదైనా గొప్పగా సాధించాలనే తన కలను నెరవేర్చుకుంది. నిర్విరామంగా ఐదు రోజుల పాటు క్లాసికల్ కథక్ నృత్యం చేసి గిన్నిస్ రికార్డును సాధించింది. అయితే.. ఈ అంశంలో ఇప్పటివరకు నేపాలీ డ్యాన్సర్ బందన 2018లోనే 126 గంటలపాటు నృత్యం చేసింది. ఆ రికార్డును ఇప్పుడు సుధీప్ జగతాప్ అధిగమించింది. అయితే.. ఈ డ్యాన్స్‌లో కేవలం ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సుధీప్ కేవలం రాత్రిళ్లు మాత్రమే ఈ అవకాశాన్ని వాడుకుని నృత్యం చేసింది. సుధీప్ ఎల్లప్పుడూ తన కాళ్లలో కదలికలను ఆపలేదని నిర్వహకులు తెలిపారు. తన తల్లిదండ్రులు ఎల్లప్పుడు తన పక్కనే ఉన్నారని సుధీప్ జగతాప్ చెబుతోంది.రాత్రిళ్లు నిద్ర రాకుండా ముఖంపై నీళ్లు చల్లేవారని తెలిపింది. చివరి గంటవరకు తన శరీరం కదలలేని పరిస్థితికి చేరినప్పటికీ లక్ష్యం మీదే దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. తాతయ్యతో పాటు యోగా తరగతులకు వెళ్లి యోగ నిద్ర సాధన చేశానని తెలిపింది. భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచ వేదికకు తీసుకువెళ్లడమే ధ్యేయమని అంటోంది. ఇదీ చదవండి:Aryan Dubey Rebirth Story: ‘ఆవిడ మా ఆవిడే..’ పునర్జన్మ చెబుతూ హడలెత్తిస్తున్న కుర్రాడు! -
ఆఫ్గన్‌తో ఏకైక టెస్టు.. చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ నజ్ముల్ హొసెన్ షాంటో చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన షాంటో 175 బంతుల్లో 146 పరుగులు చేశాడు.. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 115 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న షాంటో ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నజ్ముల్ షాంటో ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. బంగ్లాదేశ్ తరపున ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకముందు మోమినుల్ హక్ 2018లో శ్రీలంకతో చిట్టగాంగ్ వేదికగా జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 176, రెండో ఇన్నింగ్స్‌లో 105 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో అఫ్గానిస్తాన్ జట్టుపై ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా షాంటో నిలిచాడు. ఇక ఓవరాల్ టెస్టు క్రికెట్ జాబితాలో నజ్ముల్ హొసెన్ షాంటో 91వ క్రికెటర్‌గా నిలిచాడు. ఇక టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ భారీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌట్ అయిన ఆఫ్గన్‌ను ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లా మూడోరోజు ఆటలో లంచ్ విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. షాంటో 112, మోమినుల్ హక్ 43 పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 491 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండురోజులు మిగిలి ఉండడంతో బంగ్లాదేశ్ భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు -
కౌంటీల్లో సరికొత్త చరిత్ర.. 501 పరుగుల టార్గెట్‌ను ఊదేశారు
కౌంటీ క్రికెట్ క్లబ్ సర్రే జట్టు చరిత్ర సృష్టించింది. కౌంటీ చరిత్రలో రెండో అత్యధిక పరుగుల టార్గెట్‌ను(501 పరుగలు)చేధించిన సర్రే జట్టు ఔరా అనిపించింది. కౌంటీల్లో 1925 తర్వాత ఒక జట్టు 500కు పైగా పరుగుల లక్ష్యాన్ని చేధించడం ఇది రెండోసారి. ఇంతకముందు ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా నాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడిలెసెక్స్ 502 పరుగుల టార్గెట్‌ను చేధించింది. అప్పట్లో పాస్టీ హెండ్రెన్ 206 పరగులు నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మళ్లీ 98 ఏళ్ల తర్వాత 500 పరుగుల టార్గెట్‌ను అందుకున్న జట్టుగా సర్రే చరిత్రకెక్కింది. విషయంలోకి వెళితే.. కెంట్ విధించిన 501 పరుగుల భారీ టార్గెట్‌ను సర్రే జట్టు ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఐదోరోజు ఆట మొదలయ్యే సమయానికి సర్రే విజయానికి 238 పరుగులు అవసరం కాగా.. కెంట్కు ఏడు వికెట్లు కావాలి. జేమీ స్మిత్ 77 బంత్లులో 114 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో డామ్ సిబ్లే, బెన్ ఫోక్స్ ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. బెన్ ఫోక్స్(211 బంతుల్లో 124 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔట్ కాగా.. రెండురోజులు ఎంతో ఓపికతో ఆడిన డోమ్ సిబ్లే(511 నిమిషాల పాటు) 415 బంతుల్లో 140 పరుగులు నాటౌట్ అసమాన ఇన్నింగ్స్ ఆడి సర్రేకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. చివర్లో జోర్డాన్ క్లాక్ 26 నాటౌట్ అతనికి సహకరించాడు. ఇక అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరగుల టార్గెట్‌ను అందుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్‌ను ప్రొటిస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్ విధించిన 403 పరుగుల టార్గెట్‌ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. What an effort by Dom Sibley 👏 Sibs finishes 140 not out after batting for 146.1 overs 🤩 So good to have you home 🏡 🤎 | #SurreyCricket https://t.co/iJKxxiQJOt pic.twitter.com/5Wn4Fa7okE — Surrey Cricket (@surreycricket) June 14, 2023 An incredible day 📷 🤎 | #SurreyCricket pic.twitter.com/jYWh9ho31l — Surrey Cricket (@surreycricket) June 14, 2023 చదవండి: రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరు?.. గూగుల్ AI ఊహించని పేర్లు -
వంటలతో ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళ..ఏకంగా వంద గంటల పాటు..
ఇంతవరకు ఎన్నో రకాలు వరల్డ్ రికార్డులను చూశాం. విభిన్నంగా ఉండటం లేదా ఎవరూ చేయలేని సాహసానికి యత్నించడం వంటివి చూశాం. వాటన్నింటికంటే ఇంకాస్త విభిన్నంగా ఓ మహిళ వంటలతో కూడా రికార్డు సృష్టించొచ్చని నిరూపించింది. పైగా ఇంతకమునుపు అదే ఫీట్‌ని చేసిన మహిళ వరల్ఢ్ రికార్డుని సైతం బ్రేక్ చేసి ఔరా! అనినిపించుకుంది. వివరాల్లోకెళ్తే..నైజీరియాకి చెందిన చెఫ్ హిల్డా బాసి నాన్‌స్టాప్‌గా వంటలు చేస్తూ ప్రపంచ రికార్డును సృష్టించింది. ఆమె గత గురువారం నుంచి నాన్‌స్టాప్‌గా వంటలు చేస్తూ గతంలో భారతీయ చెఫ్ లతా టాండన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. గతంలో లతా సుమారు 87 గంటల 45 నిమిషాల పాటు వంట చేసి రికార్డు సృష్టిస్తే..హిల్డా సుమారు 100 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వంటలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇదిలా ఉండగా, గిన్నిస్ వరల్డ్ రికార్డు సదరు చెఫ్ హిల్డా బేక్ చేసిన రికార్డు గురించి తెలిసిందని, ఐతే ఆ రికార్డును అధికారికంగా ధృవీకరించే ముందు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని ట్వీట్ చేసింది. ఈ క్రమంలో సదరు నైజీరియన్ చెఫ్ హిల్డా మాట్లాడుతూ..నైజీరియన్ యువత ఎంతలా కష్టపడి పనిచేస్తారో ప్రపంచానికి తెలియజేప్పేందుకు ఇలా చేశానని చెప్పుకొచ్చింది. సమాజానికి దూరంగా ఉంటున్న ఆఫ్రికన్ యువతులు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె.. మీరు ఏ పనిచేయాలనుకుంటున్నా.. దాన్ని సీరియస్‌గా తీసుకుని అందరికంటే మెరుగ్గా చేయలన్నారు. అందుకోసం అదనపు మైళ్లు దాటి రావల్సిందేననిఝ(కష్టాలను అధిగమించి) నైజీరియన్ యువతకు చక్కటి సందేశం ఇచ్చారు. అంతేగాదు నైజీరియన్ వంటకాలు గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. కాగా హిల్డా తన వంటకాల్లో సూప్ దగ్గర నుంచి పశ్చిమ ఆఫ్రికాలోని ప్రసిద్ధ వంటకాలన్ని హిల్డా తయారు చేసింది. అంతేగాదు ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున విరామం తీసుకుంటూ..తన వ్యక్తిగత విషయాల కోసం 12 గంటల కొకసారి ఒక గంట చొప్పున తీసుకుని ఈ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మేరకు నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ నైజీరియాకు ఈ రోజు చాలా గొప్ప రోజు అంటూ హిల్డాను ప్రశంసించాడు. ఆమె ఆశయం చాలా గొప్పదని అభినందించాడు. నైజీరియన్ వంటకాలు తోపాటు ఇక్కడి వ్యక్తులు గురించి తెలుసుకునేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం కోసం ఇలా వంద గంటల పాటు చేయడమనేది అసామాన్య విషయమని అన్నాడు. ఆ మహిళ ఇక్కడ శక్తి చాలా ఎక్కువ ఉందని అనుమానించాల్సిన పని లేదని బల్లగుద్దినట్లు చెప్పింది అంటూ ట్విట్టర్లో హిల్డాని ప్రశంసలతో ముంచెత్తారు అధ్యక్షుడు బుహారీ. View this post on Instagram A post shared by Hilda Baci (@hildabaci) (చదవండి: ఓ పోలీసు చేతిలో ఉగాండా భారతీయ బ్యాంకర్ హతం) -
పరుగులే కాదు క్యాచ్‌ల విషయంలోనూ రికార్డులే
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో జైశ్వాల్ క్యాచ్ అందుకోవడం ద్వారా ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఫీల్డర్‌గా(నాన్-వికెట్‌కీపర్) కోహ్లి రెండోస్థానానికి ఎగబాకాడు. ఈ నేపథ్యంలో కీరన్ పొలార్డ్ 103 క్యాచ్‌ల రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ప్రస్తుతం కోహ్లి 104 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా.. 109 క్యాచ్‌లతో సురేశ్ రైనా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఘోర ప్రదర్శన చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 59 పరుగులకే కుప్పకూలింది. వేన్ పార్నెల్ మూడు వికెట్లు పడగొట్టగా.. కర్ణ్ శర్మ, బ్రాస్‌వెల్ తలా రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, మ్యాక్స్‌వెల్‌లు చెరొక వికెట్ తీశారు. ఈ క్రమంలో రాజస్తాన్ ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్‌లు చెలరేగి ఆడడంతో భారీ విజయం దక్కించుకున్న అదే రాజస్తాన్ తాజాగా ఆర్సీబీతో మాత్రం ఘోర ఓటమి చవిచూసింది. చదవండి: #AnujRawat: తొలిసారి తన పాత్రకు న్యాయం చేశాడు -
ఒక్క ఓవర్లో 46 పరుగులు.. క్రికెట్ చరిత్రలో తొలిసారి
క్రికెట్లో ఒక్క ఓవర్లో సాధారణంగా అత్యధికంగా ఎన్నిపరుగులు వస్తాయంటే టక్కున వచ్చే సమాధానం 36. అది కూడా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదితే ఈ ఫీట్ నమోదవుతుంది. ఒకవేళ మరో నోబాల్.. లేదా వైడ్ వెళితే కొన్ని పరుగులు జత అవుతాయి. అది కూడా అరుదుగా జరుగుతుంది. అందుకే 36 పరుగులే ఇప్పటివరకు చాలాసార్లు అత్యధికంగా ఉంది. కానీ ఒక్క ఓవర్లో 46 పరుగులు వచ్చాయంటే మీరు నమ్ముతారా.. అంత లేదు అని తేల్చేస్తాం. కానీ ఒక్క ఓవర్లో 46 పరుగులు బాదిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఊహించుకోవడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అరుదైన దృశ్యం.. కువైట్ వేదికగా జరిగిన కేసీసీ ఫ్రెండ్స్ మొబైల్ టి20 ఛాంపియన్స్ ట్రోఫీ 2023లో ఇది జరిగింది. ఎన్‌సీఎమ్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ టాలీ సీసీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్బుతం ఆవిష్కృతమైంది. ఎన్‌సీఎమ్ బ్యాటర్ వాసు.. టాలీ సీసీ బౌలర్ హర్మన్ ఓవర్‌ను చితకబాది 46 పరుగులు రాబట్టాడు. తొలి బంతిని నోబాల్ వేయగా సిక్సర్ బాదాడు. దీంతో ఏడు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఫ్రీహిట్‌కు నాలుగు పరుగులు బైస్ రూపంలో వచ్చాయి. ఒక్క బంతి కరెక్ట్ వేయగా 11 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఐదు బంతులను ఐదు సిక్సర్లు కొట్టగా ఇందులో ఒక నోబ్ సహా మొత్తం 31 పరుగులు వచ్చాయి. దీంతో ఐదు బంతుల్లో స్కోరు 42గా మారింది. ఇక ఆఖరి బంతిని బౌండరీ రావడంతో అలా ఆరు బంతుల్లో 46 పరుగులు వచ్చాయి. క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 46 పరుగులు రావడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వన్డేల్లో 36.. టెస్టుల్లో 35.. టి30ల్లో 36.. ఐపీఎల్లో 37.. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు వన్డేల్లో ఒక్క ఓవర్లో 36 పరుగులు అత్యధికంగా ఉంది. 2006లో సౌతాఫ్రికా ఓపెనర్ గిబ్స్ నెదర్లాండ్స్‌పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదగా.. 2021లో అమెరికా బ్యాటర్ జస్కరన్ మల్హోత్రా పపువా న్యూ గినియాపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఇక టెస్టుల్లో 2022లో ఇంగ్లండ్‌పై టీమిండియా బౌలర్ బుమ్రా కొట్టిన 35 పరుగులు ఇప్పటివరకు ఒక్క ఓవర్లో అత్యధికంగా ఉంది. ఇక టి20ల్లో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు రెండుసార్లు నమోదయ్యాయి. తొలిసారి 2007లో యువరాజ్ ఇంగ్లండ్‌పై 36 పరుగులు(ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు), 2021లో విండీస్ హిట్టర్ పొలార్డ్ శ్రీలంకపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఇక ఐపీఎల్లో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు 37గా ఉంది. తొలిసారి 2011లో ఆర్సీబీతో మ్యాచ్‌లో కొచ్చి టస్కర్స్ బౌలర్ పి. పరమేశ్వరన్ ఒక్క ఓవర్లో 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత 2021లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ సీఎస్కేతో మ్యాచ్‌లో ఒక్క ఓవర్లో 37 పరుగులు ఇచ్చుకోవడం గమనార్హం. Getting 46 runs in an over is not possible right? Right? Wrong! Watch this absolute bonkers over now. . .#KCCT20 pic.twitter.com/PFRRivh0Ae — FanCode (@FanCode) May 3, 2023 చదవండి: గమనించారా.. మ్యాచ్‌తో పాటు పాత పగను కూడా! -
కోహ్లి అరుదైన ఫీట్.. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడిగా
ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సాధించాడు. గురువారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో డుప్లెసిస్‌తో కలిసి ఓపెనింగ్ వచ్చాడు. ఆరంభం నుంచి డుప్లెసిస్‌కు స్ట్రైక్ ఇస్తూ తాను కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో రాహుల్ చహర్ బౌలింగ్‌లో మూడో బంతికి రెండు పరుగులు చేయడం ద్వారా 30 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే కోహ్లి ఒక రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో '30 ప్లస్' స్కోరు చేయడం కోహ్లికి ఇది వందోసారి. ఐపీఎల్లో వంద '30 ప్లస్' స్కోర్లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్రకెక్కాడు. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌కు కోహ్లి స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నప్పటికి కోహ్లి తానే ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా చేస్తున్నట్లు టాస్ సమయంలో తెలిపాడు. ''డుప్లెసిస్ ఈరోజు మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు రాడు.. మొదట బ్యాటింగ్ చేస్తున్నాం కాబట్టి డుప్లెసిస్ నాతో కలిసి బ్యాటింగ్‌కు వస్తాడు. బౌలింగ్ సమయంలో మాత్రం డుప్లెసిస్ స్థానంలో వైశాక్ విజయ్‌కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా రానున్నాడు.'' అంటూ తెలిపాడు. Virat Kohli becomes the first player in IPL history to complete hundred "30+ score". The Man, The Myth, The Legend - King Kohli. pic.twitter.com/3a0h8DtD2K — Johns. (@CricCrazyJohns) April 20, 2023 చదవండి: ఇది విన్నారా.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి! -
Antalya: జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
అంటాల్యా (తుర్కియే): భారత అగ్రశ్రేణి ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కొత్త సీజన్లో శుభారంభం చేసింది. ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో ఆమె క్వాలిఫయింగ్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు మరో ప్రపంచ రికార్డును సమం చేసింది. మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ మొత్తం 713 పాయింట్లు స్కోరు చేసింది. 2015లో సారా లోపెజ్ (కొలంబియా) 713 పాయింట్లతో నమోదు చేసిన ప్రపంచ రికార్డును సురేఖ సమం చేసింది. అంతేకాకుండా కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 2017లో కొరియా ఆర్చర్ 709 పాయింట్లతో నమోదు చేసిన రికార్డును సురేఖ సవరించింది. క్వాలిఫయింగ్‌లో ఒక్కో ఆర్చర్ 72 బాణాలు సంధించాలి. తొలి రౌండ్లో 36, రెండో రౌండ్లో మరో 36 బాణాలు సంధిస్తారు. తొలి రౌండ్లో జ్యోతి సురేఖ 353 పాయింట్లు... రెండో రౌండ్లో 360 పాయింట్లు సాధించింది. రెండో రౌండ్లో జ్యోతి సురేఖ కొట్టిన 36 బాణాలు 10 పాయింట్ల సర్కిల్‌లోకి వెళ్లడం విశేషం. దాంతో ఆమె అందుబాటులో ఉన్న మొత్తం 360 పాయింట్లను తన ఖాతాలోకి వేసుకుంది. ఈ క్రమంలో జ్యోతి సురేఖ 360కి 360 పాయింట్లు స్కోరు చేసిన తొలి మహిళా ఆర్చర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ప్రదర్శనతో 2015 నుంచి సారా లోపెజ్ (356 పాయింట్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జ్యోతి సురేఖ బద్దలు కొట్టింది. ‘ప్రపంచ రికార్డు సాధిస్తానని ఊహించలేదు. ఇదే నా అత్యుత్తమ ప్రదర్శన. టాప్ సీడ్‌తో మెయిన్ రౌండ్లో బరిలోకి దిగనుండటం సంతోషంగా ఉంది. ఎలిమినేషన్ రౌండ్లలోనూ పూర్తి ఏకాగ్రతతో పోటీపడతాను’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది. క్వాలిఫయింగ్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన సురేఖకు ఎలిమినేషన్ రౌండ్లలో టాప్ సీడ్ దక్కింది. భారత్‌కే చెందిన అదితి, అవ్నీత్ కౌర్ స్కోర్ల ఆధారంగా క్వాలిఫయింగ్ టీమ్ విభాగంలో భారత్ 2,112 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 2011 నుంచి భారత జట్టుకు ఆడుతున్న సురేఖ అంతర్జాతీయ టోర్నీలలో 30 కంటే ఎక్కువ పతకాలు సాధించింది. -
ప్రపంచ రికార్డు: 50 ఏళ్ల వయసు, 500 రోజులు ఒక్కత్తే.. గుహలో...
స్పెయిన్ అథ్లెట్ 50 ఏళ్ల బీట్రస్ ఒక ఆరోగ్య ప్రయోగంలో భాగంగా 500 రోజులు గుహలో ఒక్కత్తే గడిపి మొన్న (శుక్రవారం) బయటకు వచ్చింది. బయట నుంచి మాత్రమే నిపుణుల పర్యవేక్షణ ఉన్నా 260 అడుగుల లోతు గుహలో అదరక బెదరక జీవించింది. ఎక్కువ రోజులు గుహలో ఒంటరిగా జీవించిన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న బీట్రస్ కథా కమామీషు... ‘లోపలకు వెళ్లాక రెండు నెలల వరకూ లెక్క బెట్టాను. ఆ తర్వాత రోజుల్ని లెక్క బెట్టుకోవడం మానేశాను. సహాయక బృందం లోపలికి వచ్చి నన్ను బయటకు తెచ్చే వరకు ఏ 160 రోజులో ఉన్నాననుకున్నాను. కాని 500 రోజులు ఉన్నాను. కాలం ఇట్టే గడిచిపోయింది’ అంది బీట్రస్ ఫ్లెమినీ. తన 48వ ఏట నవంబర్ 21, 2021 తేదీన స్పెయిన్‌లోని గ్రనాడా పట్టణం సమీపంలో ఉన్న ఒక గుహలోకి బీట్రస్ అడుగుపెట్టింది. మళ్లీ 50వ ఏట ఏప్రిల్ 14, 2023న బయటకు వచ్చింది. ఒకటిన్నర సంవత్సరం గుహలో ఒక్కత్తే గడిపింది. ‘ఈ కాలంలో బయట ఏం జరిగిందో నాకు తెలియదు’ అందామె. గ్రనడా యూనివర్సిటీ, అల్మేరియా యూనివర్సిటీలోని శాస్త్ర నిపుణులు గుహలలో, పర్వతారోహణలో ఒక్కరిగా చిక్కుకుపోయినప్పుడు మనిషి ‘సర్కేడియన్ రిథమ్’ (వెలుతురు, చీకటిని బట్టి మానవ శరీర, మానసిక స్థితుల్లో 24 గంటల్లో వచ్చే మార్పు) అధ్యయనం చేయడానికి బీట్రస్ను గుహలోకి పంపారు. క్యాలెండర్, గడియారం ఏమీ ఇవ్వలేదు. 60 పుస్తకాలు, వెయ్యి లీటర్ల నీరు, స్టవ్, ఆమె కదలికలను బయటి నుంచి గమనించడానికి సెన్సర్స్‌ను తీసుకొని ఆమె లోపలికి వెళ్లింది. ‘నేను నాతో మాట్లాడుకుంటూ గడిపాను, వ్యాయామం, టోపీలు అల్లడం, పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం... వీటితో టైమ్ సరిపోయింది. ఒక్కోసారి భ్రాంతి కలిగేది’ అని తెలిపింది. ఆమె ద్వారా వచ్చిన రీడింగ్స్‌ను శాస్త్రజ్ఞులు ఇప్పుడు క్రోడీకరించే పనిలో పడ్డారు. Athlete Beatriz Flamini spent almost two years alone in an underground cave. And she makes it sound pretty relaxing... Follow us on Gab: https://t.co/IuhLFQBQPc pic.twitter.com/e7nlKR9Kyc — RT (@RT_com) April 15, 2023 -
అరుదైన ఫీట్.. అన్ని స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఒకే ఒక్కడిగా
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్లో ఇంతవరకు ఎవరికి సాధ్యం కాని అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్లో ఒకటో నెంబర్ నుంచి పదో నెంబర్ వరకు అన్ని స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఒకే ఒక్కడిగా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటికైతే ఈ రికార్డు యూనిక్‌గా మిగిలిపోనుంది. తాజాగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అశ్విన్ ఓపెనర్‌గా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే రాజస్తాన్ చేసిన ఈ ప్రయోగం బెడిసికొట్టింది. ఎందుకంటే అశ్విన్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. రాజస్తాన్ ప్రయోగం వికటించినప్పటికి అశ్విన్ మాత్రం చరిత్రకెక్కాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఓపెనర్‌గా ఒకసారి వచ్చిన అశ్విన్.. నెంబర్-3లో నాలుగుసార్లు, నెంబర్-4లో ఒకసారి, నెంబర్-5లో రెండుసార్లు, నెంబర్-6లో ఐదుసార్లు, నెంబర్-7లో 16 సార్లు, నెంబర్-8లో అత్యధికంగా 32 సార్లు, నెంబర్-9లో 11 సార్లు, ఇక చివరగా పదో స్థానంలో నాలుగుసార్లు బ్యాటింగ్‌కు వచ్చాడు. మొత్తానికి బ్యాటింగ్‌లో 76 ఇన్నింగ్స్‌లు ఆడి 648 పరుగులు సాధించాడు. -
చరిత్రలో ఇదే తొలిసారి.. పురుషుల క్రికెట్లో కొత్త శకం
అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో సరికొత్త శకం మొదలైంది. తొలిసారి ఒక మెన్స్ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఒక మహిళ ఫీల్డ్ అంపైర్‌గా విధులు నిర్వర్తించి చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌కు చెందిన మహిళా అంపైర్ కిమ్ కాటన్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. బుధవారం న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య జరిగిన రెండో టి20లో కిమ్ కాటన్.. మరో అంపైర్ వేన్ నైట్స్‌తో కలిసి ఫీల్డ్ అంపైరింగ్ చేసింది. అయితే కిమ్ కాటన్ గతంలో న్యూజిలాండ్, భారత్‌ల మధ్య హామిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు థర్డ్ అంపైర్ పాత్ర పోషించింది. తాజాగా మాత్రం పురుషుల క్రికెట్లో తొలిసారి ఫీల్డ్ అంపైరింగ్ చేసిన కిమ్ కాటన్ తన పేరును క్రికెట్ పుస్తకాల్లో లిఖించుకుంది. కాగా మహిళా అంపైర్‌గా కిమ్ కాటన్ పేరిట చాలా రికార్డులున్నాయి. 2020లో మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐసీసీ వుమెన్స్ టి20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళా అంపైర్‌గా కిమ్ కాటన్ నిలిచింది. అంతేకాదు మూడు మహిళల టి20 వరల్డ్‌కప్‌లతో పాటు వన్డే వరల్డ్‌కప్‌లోనూ అంపైర్‌గా పనిచేసింది. ఇక 2020, 2022, 2023 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించి ఎవరికి దక్కని రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇక ఓవరాల్‌గా 2018 నుంచి కిమ్ కాటన్ 54 టి20 మ్యాచ్‌లతో పాటు 24 వన్డేల్లో అంపైర్‌గా విధులు నిర్వర్తించింది. ఇక రెండో టి20 విషయానికి వస్తే న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరుగనుంది. కాగా, సిరీస్‌లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. History today for umpire Kim Cotton who becomes the first female umpire to stand in a men’s international match between two @ICC full member countries 🤝#NZvSL #CricketNation pic.twitter.com/EI8C1RJt4d — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 చదవండి: NZ VS SL 2nd T20: సీఫర్ట్ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే -
ఓ బాలుడి సాహసం..మూడేళ్లుగా టెంట్లోనే నిద్రపోయి..
ఓ యువకుడు క్యాపంగ్ ద్వారా అత్యధిక డబ్బులు సేకరించిన వ్యక్తిగి రికార్డు సృష్టించాడు. ది బాయ్ ఇన్ ది టెన్త్‌గా పేరుగాంచి ఈ రికార్డు సాధించాడు. ఒక ఛారిటీ కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కూడ బెట్టిన తొలి వ్యక్తి ఆ టీనేజర్. వివరాల్లోకెళ్తే..యూకేకి చెందిన మాక్స్ వూసే అనే యువకుడు తమ పొరుగన ఉండే ఫ్యామిలీ స్నేహితుడిని క్యాన్సర్ వ్యాధి కారణంగా కోల్పోవడంతో..అలాంటి సమస్యను ఎదుర్కొనే వాళ్లకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే నార్త్ డెవాన్ ఛారిటీ కోసం మూడేళ్లుగా క్యాంపింగ్ నిర్వహించి అత్యధికంగా డబ్బును సేకరించాడు. ఇలా అతను సుమారు రూ. 7.6 కోట్లను వసూలు చేశాడు. అందుకోసం పలుచోట్లకు టెంట్ తోసహా తిరిగేవాడు. అక్కడ క్యాంపింగ్ నిర్వహించి టెంట్లోనే నిద్రపోయేవాడు. అలా మూడేళ్లు అదే ధ్యాసలో గడిపాడు. దీంతో వూసే 'ది బాయ్ ఇన్ ది టెన్ట్'గా పేరుగాంచాడు. ఇలా వూసే తన ఫ్యామిలీ స్నేహితుడు రిక్ అబాట్ మరణించిన తర్వాత నుంచి అంటే.. వూసేకి 10 ఏళ్ల ప్రాయం నుంచి నిధుల సేకరణ ప్రారభించాడు. సరిగ్గా మార్చి 2020లో నిధుల సేకరించడం మొదలుపెట్టాడు. తన స్నేహితుడి రిక్కు వూసే కుటుంబం ఆర్థిక సాయం అందిచిన్పటికీ వైద్యులు అతన్ని రక్షించలేకపోయారు. ఆస్పత్రి కూడా అతడు బతకాలని ఎంతగానో కోరింది గానీ సఫలం కాలేదు. ఆ ఘటన ఫ్యామిలీ స్నేహితుడిలాంటి వారి కోసం ఏదో చేయమన్నట్లు తన మనసుకు బలంగా అనిపించిందని చెబుతున్నాడు. ఐతే వూసే నిధుల సేకరణ మొదలు పెట్టే సమయంలోనే కరోనా, తుపానులు పెద్ద సవాళ్లుగా మారాయి. తీవ్రమైన గడ్డకట్టే మంచుకుని సైతం అధిగమించి ఎన్నో ప్రయాసలకు ఓర్చి ఈ నిధులను సమకూర్చాడు. ఒకనొక సమయంలో తుపాను కారణంగా వూసే టెంట్ కూడా కూలిపోయింది. అయినా లెక్క చేయక మొక్కవోని దీక్షతో నిధులు సేకరించాడు. ఈ ప్రయాణంలో గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకున్నాను, ఎన్నో అద్భుతమైన అనుభవాలను పొందాను అని చెబుతున్నాడు వూసే. ఇక ఏప్రిల్ 2023 నాటికి తన నిదుల సేకరణను ఆపేసి తనకెంతో ఇష్టమైన రగ్బీపై దృష్టిపెట్టనున్నట్లు తెలిపాడు. ఇంత చిన్న వయసులో ఇంత నిబద్ధత, నిస్వార్థపూరితమైన అతని గొప్ప మనసుని చూసి అందరూ ఫిదా అవుతున్నారు. చిన్నపిల్లలైనా వారు కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయగలరు అని నిరూపించాడు వూసే. (చదవండి: వెల్లువలా ఉత్తర కొరియా అరాచకాలు..వెలుగులోకి విస్తుపోయే దారుణాలు) -
రేర్ రికార్డ్ నెలకొల్పిన జయ జానకి నాయక
-
సాధించాడు.. టాప్-5లో భారత్ ఫుట్‌బాల్ స్టార్
ఫుట్‌బాల్‌లో భారత్ వెలుగులు లేకపోయినప్పటికి జట్టు స్టార్ ఆటగాడు..కెప్టెన్ సునీల్ ఛెత్రి మాత్రం వ్యక్తిగతంగా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే ఉన్నాడు. తాజాగా ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సునీల్ ఛెత్రి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం కిర్గిజ్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా సునీల్ అంతర్జాతీయ కెరీర్లో 85వ గోల్ నమోదు చేశాడు. ఈ క్రమంలో హంగేరీకి చెందిన ఫెరెన్క్ ఫుకాస్(85 మ్యాచ్‌ల్లో 84 గోల్స్)ను అధిగమించి టాప్-5లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 133 మ్యాచ్‌లాడిన సునీల్ ఛెత్రి 85 గోల్స్ నమోదు చేశాడు. ఇక తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్‌ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్), అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్) మూడో స్థానంలో, మొక్తర్ దహారి- మలేషియా(142 మ్యాచ్‌ల్లో 89 గోల్స్) నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు విజేతగా నిలిచింది. మణిపూర్‌లో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–0 గోల్స్ తేడాతో కిర్గిజ్ రిపబ్లిక్ జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సందేశ్ జింగాన్ (34వ ని.లో), సునీల్ చెత్రి (84వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. సునీల్ చెత్రి కెరీర్లో ఇది 85వ గోల్ కావడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన మరో జట్టు మయన్మార్‌పై తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0తో విజయం సాధించింది. ....aaaaand that's #85 for Sunil Chhetri.pic.twitter.com/eUu6QHeUdE — Shyam Vasudevan (@JesuisShyam) March 28, 2023 📈 Most International Goals: 🇵🇹 Cristiano Ronaldo 𝟭𝟮𝟬 🇮🇷 Ali Daei 𝟭𝟬𝟵 🇦🇷 Lionel Messi 𝟵𝟵 🇲🇾 Mokhtar Dahari 𝟴𝟵 🇮🇳 Sunil Chhetri 𝟴𝟱 🇭🇺 Ferenc Puskás 𝟴𝟰 Sunil Chhetri becomes 5th all-time International Goalscorer. 🇮🇳🔥#IndianFootall #SC11 #BlueTigers pic.twitter.com/O1rU0ulunz — IFTWC - Indian Football (@IFTWC) March 28, 2023 చదవండి: అదే 26 పరుగులు.. శాసించిన చివరి ఓవర్ -
రొనాల్డో ప్రపంచ రికార్డు.. మెస్సీ చూస్తూ ఊరుకుంటాడా?
ప్రస్తుత ఫుట్‌బాల్ తరంలో లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఎవరికి వారే సాటి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ ఇద్దరు సమానంగానే కనిపించినా మెస్సీ ఒక మెట్టు పైన ఉంటాడు. అందుకు కారణం గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను విజేతగా నిలపడమే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ అత్యధిక గోల్స్ చేసి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు మూడోసారి టైటిల్ అందించాడు. ఈ దెబ్బతో రొనాల్డో కాస్త వెనుకబడినట్లుగా అనిపించాడు. అయితే వ్యక్తిగతంగా చూస్తే మాత్రం ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. ఒక రికార్డు రొనాల్డో బద్దలు కొట్టాడంటే వెంటనే మెస్సీ తన పేరిట ఒక రికార్డును లిఖించుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా రొనాల్డో దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే నీ వెనుకే నేను వస్తా అంటూ మెస్సీ కూడా తన కెరీర్లో 800వ గోల్ సాధించి కొత్త రికార్డు అందుకున్నాడు. బ్రూనస్ ఎయిర్స్ వేదికగా గురువారం అర్జెంటీనా, పనామాల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ సేన 2-0 తేడాతో విజయం సాధించింది. ఆట 89వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన ఫ్రీకిక్‌ను మెస్సీ తనదైన శైలిలో గోల్‌గా మలిచాడు. దీంతో తన కెరీర్లో 800వ గోల్ పూర్తి చేసుకున్న మెస్సీ అర్జెంటీనా తరపున 99వ గోల్ సాధించాడు. వంద గోల్స్ మార్క్‌ను చేరుకోవడానికి మెస్సీ ఇక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక క్లబ్స్ తరపున 701 గోల్స్ చేసిన మెస్సీ ఓవరాల్‌గా 800 గోల్స్‌తో కొనసాగుతున్నాడు. గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచిన జట్టుతోనే అర్జెంటీనా బరిలోకి దిగడం విశేషం. Lionel Messi with an incredible free-kick 🇦🇷 We are witnessing greatness once again 🐐 pic.twitter.com/QBPUO7B9LY — SPORTbible (@sportbible) March 24, 2023 చదవండి: ఫుట్‌బాల్‌లో సంచలనం.. చారిత్రాత్మక గోల్ -
ఫుట్‌బాల్‌లో సంచలనం.. చారిత్రాత్మక గోల్
ఫుట్‌బాల్‌లో గోల్ కీపర్ పనేంటి అని చూసుకుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు చేసే గోల్స్‌ను అడ్డుకోవడం, ఆ తర్వాత బంతిని తన జట్టు ఆటగాళ్లకు పాస్ లేదా సర్వ్ చేయడం. అయితే ఫుట్‌బాల్ చరిత్రలో ఒక సంచలన గోల్ నమోదైంది. గోల్ కీపర్ సర్వ్ చేసిన బంతి నేరుగా ప్రత్యర్థి జట్టు గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. దాదాపు 101 మీటర్ల దూరం అవతల ఉన్న గోల్‌పోస్ట్‌లోకి బంతి వెళ్లడంతో ఫుట్‌బాల్‌లో అత్యంత లాంగెస్ట్ గోల్‌గా రికార్డులకెక్కింది. ఈ అద్భుతమైన ఫీట్ కొబ్రెసల్, కొలో-కొలో మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఆట 77వ నిమిషంలో అర్జెంటీనాకు చెందిన గోల్ కీపర్ లియాండ్రో రెక్వినా బంతిని పాస్ చేయాలనే ఉద్దేశంతో బంతిని కాస్త వేగంగా తన్నాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో ఎత్తులో వెళ్లిన బంతి పెనాల్టీ ఏరియాలో నిలబడిన కొలో-కొలో గోల్ కీపర్ బ్రయాన్ కోర్టస్ను దాటుకొని అతని తలపై నుంచి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఈ దెబ్బకు గోల్ కీపర్ సహా ప్రత్యర్థి ఆటగాళ్లకు దిమ్మతిరిగింది. చేసేదేం లేక గోల్ కీపర్ బ్రయాన్ దానిని గోల్‌గా ప్రకటించాడు. దీంతో కొబ్రెసల్ జట్టు 3-1 తేడాతో కొలో-కొలో జట్టుపై సంచలన విజయం సాధించింది. ఇంతకముందు 2021లో టామ్ కింగ్ అనే ఫుట్‌బాల్ ప్లేయర్ 96.1 మీటర్ల దూరం నుంచి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి బంతిని పంపడం రికార్డుగా ఉంది. తాజాగా ఆ రికార్డును గోల్ కీపర్ లియాండ్రో బద్దలుకొట్టాడు. ఈ అద్భుత విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ⚽⚪🟠 El primer gol arco a arco del #CampeonatoBetsson Así fue la anotación de Leandro Requena desde su propia puerta y que dejó a Brayan Cortés quieto, provocando el error del portero albo en el #CSLvsCCxTNTSports. pic.twitter.com/HDL2K22QnS — TNT Sports Chile (@TNTSportsCL) March 18, 2023 చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో..