ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అద్భుత రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో (ఇంగ్లండ్) మార్క్ వుడ్ క్యాచ్ పట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్‌లు అందుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ ఇతర ఆటగాడు మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్‌లు అందుకోలేదు. డబుల్ సెంచరీలు, సిక్సర్ల రికార్డులు ఎక్కువగా నెలకొల్పే రోహిత్‌కు క్యాచ్‌ల పరంగా ఇది అతి పెద్ద రికార్డని చెప్పవచ్చు.
WHAT A CATCH BY CAPTAIN ROHIT SHARMA...!!!! 🔥
— CricketMAN2 (@ImTanujSingh) March 7, 2024
- The Magician Ravi Ashwin picked 2 wickets in an over on his 100th Test Match. pic.twitter.com/WawmeAxQ1H
కాగా, ధర్మశాల టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment