
గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల్లో వీఎఫ్ఎక్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. మూవీ చూస్తున్నప్పుడు ఏది నిజమో ఏది గ్రాఫిక్సో తెలియనంతంగా టెక్నాలజీ వచ్చేసింది. తాజాగా రిలీజైన పుష్ప 2 వీడియో చూస్తుంటే అదే అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
ఎందుకంటే పుష్ప 2 సినిమాలో ప్రారంభంలో వచ్చే జపాన్ ఫైట్, మాల్దీవుల సీన్, పుష్ప డెన్, రామేశ్వరం పడవల ఛేజింగ్, చందన దుంగల లారీలని షెకావత్ పట్టుకోవడం ఇలా చాలా సీన్లు సహజంగానే అనిపించాయి. కానీ అవన్నీ గ్రాఫిక్స్ లో తయారు చేసినవని తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో తెలిసింది.
పుష్ప 2 నిర్మాతల్లో ఒకటైన సుకుమార్ రైటింగ్స్ సంస్థ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో ఒకటి రిలీజ్ చేసింది. 6 నిమిషాల నిడివి ఉన్న దీన్ని చూస్తే మీరు కచ్చితంగా సినిమాని సగానికి సగం వీఎఫ్ఎక్స్ సాయంతోనే తీసేశారు కదారా అనిపిస్తుంది. ఎందుకంటే జపాన్ ఫైట్, రామేశ్వరం పడవల ఛేజింగ్.. ఇలా మెయిన్ సీన్స్ అన్ని గ్రాఫిక్స్ లోనే తీసి ప్రేక్షకుల్ని మాయ చేయడం విశేషం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి విక్రమ్ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
