graphics
-
మార్వెలస్.. మ్యూరల్స్..
రాజుల కోటలు, ప్యాలస్‌ల వైభవాన్ని మన ఇంటికీ తీసుకురావచ్చు మ్యూరల్స్‌తో! చిన్న చిన్న ఆర్ట్ పీస్‌ల నుంచి గోడ మొత్తం పరచుకునేలా రూపుదిద్దుకునే మ్యూరల్స్ ఇప్పుడు ఇంటీరియర్‌లో అందమైన పాత్రను పోషిస్తున్నాయి. మన అభిరుచి.. సృజనకు అద్దం పడుతున్నాయి.మ్యూరల్స్ని గోడ లేదా పైకప్పుకు డిజైన్ చేసే ఒక గ్రాఫిక్ ఆర్ట్‌గా చెప్పవచ్చు. ఖాళీ గోడను కాన్వాస్‌గా మార్చే అద్భుతమైన కళ ఇది. చిన్న చిన్న ఆకృతుల నుంచి గ్రాండ్ స్టేట్మెంట్ వరకు, పారిస్ వీధుల నుంచి మాల్దీవుల ప్రశాంతమైన బీచ్‌ల వరకు కళ్లను కట్టిపడేసే గ్రాఫిక్స్‌ను గోడల మీద కొలువుదీరుస్తుంది. మరో ప్రపంచానికి కిటికీ వంటిదిగా పేరొందిన ఈ కళ ద్వారా ఒక కథనే చెప్పవచ్చు.మ్యూరల్స్.. వాల్‌పేపర్స్..మ్యూరల్స్ వ్యయప్రయాసలతో కూడుకున్నవనిపిస్తే వాటిని తలపించే వాల్ పేపర్స్‌ని ఎంచుకోవచ్చు. నచ్చిన ఆకృతులు, దృశ్యాల వాల్ పేపర్స్ లివింగ్ రూమ్, ఆఫీసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జలపాతాలు, పచ్చటి మైదానాలతో పెయింట్ అయిన వాల్ పేపర్స్ ఏ గదినైనా ప్రశాంతంగా కనిపించేలా చేస్తాయి. గెలాక్సీలు, కోటలతో వాల్ పేపర్స్ పిల్లల గదులను మురిపిస్తాయి. వీటిని మార్చేసుకోవడమూ సులువే. కాబట్టి మ్యూరల్స్ భారం అనుకున్న వాళ్లు వాల్ పేపర్స్‌కి స్టిక్ అవొచ్చు. మ్యూరల్స్కే ఓటు వేసే వాళ్లు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి..కుడ్యచిత్రాలను స్థలాన్ని బట్టి డిజైన్ చేయించుకునే వీలుంటుంది. విశాల మైదానాలున్న కుడ్యచిత్రాల అలంకరణ వల్ల ఆ గది కూడా విశాలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.ముదురు రంగులు పెద్ద పెద్ద హాల్స్‌కు బాగుంటాయి. చిన్న గదులకైతే లైట్ షేడ్స్‌నే ఎంచుకోవాలి.నిర్వహణ విషయానికొస్తే.. కుడ్యచిత్రం తాజాగా కనిపించాలంటే మెత్తని తడిగుడ్డతో తుడిస్తే సరిపోతుంది. ఆ కళాఖండం దీర్ఘకాలం మన్నాలంటే రసాయనాలు, స్క్రబ్స్ వంటివి వాడకూడదు.మ్యూరల్ పెయింటింగ్ డిజైన్స్‌ని చిత్రించి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో గోడలను కళాఖండాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీటిలో రంగులే కాదు ఎలక్ట్రిక్ వెలుగులూ జతచేరాయి కొత్తగా! -
యానిమేషన్, వీఎఫ్ఎక్స్లకు విపరీతమైన డిమాండ్.. అలా చేస్తే సూపర్ సక్సెస్
అద్భుత దృశ్యాలను వర్ణించడానికి...‘రెండు కళ్లు సరిపోవు’ అంటాం. అద్భుత దృశ్యాలను సృష్టించడానికి రెండు కళ్లతో పాటు మూడోకన్ను కూడా అవసరం.దాని పేరే... క్రియేటివ్ ఐబూమింగ్ మార్కెట్ యానిమేషన్, వీఎఫ్ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెరగడం ఒక కోణం అయితే, ఉపాధి అవకాశాలు పెరగడం, యువతరం క్రియేటివిటీకి విశాలమైన వేదిక దొరకడం అనేది మరో కోణం... ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఇరవై ఏడు సంవత్సరాల అభినవ్ భరద్వాజ్ ఫ్యాషన్ బ్లాగర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్. వీఎఫ్ఎక్స్, యానిమేషన్లో డిగ్రీ పూర్తి చేసిన అభినవ్‌కు ఎన్నో పురాణ పాత్రలపై అవగాహన ఉంది. ఇరవై సంవత్సరాల వయసులో ఆర్ట్, డిజైనింగ్‌ను కెరీర్‌గా చేసుకున్న అభినవ్ లాక్డౌన్ సమయంలో ట్రెండింగ్ టాపిక్స్‌పై లెక్కలేనన్ని డిజైన్లను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో సృష్టించాడు. వాటికి మంచి స్పందన రావడం ఒక ఎత్తయితే పాపులర్ బ్రాండ్ల నుంచి అవకాశాలు రావడం మరో ఎత్తు. ‘మనకు ఉన్న రెండు కళ్లతో పాటు క్రియేటివ్ ఐ అనే మూడో కన్ను కూడా ఉండాలి. అది ఉన్నప్పుడే బ్రాండ్ డిజైనింగ్ నుంచి సినిమా వీఎఫ్ఎక్స్ వరకు రాణించగలం’ అంటాడు అభినవ్. కలర్స్ నుంచి డ్రెస్సింగ్ సెన్స్ వరకు అతడి యూనిక్ స్టైల్ స్టేట్మెంట్కు యువతలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల్లో బెంగళూరుకు చెందిన శ్రీతేజస్వి ఒకరు. డిగ్రీ రెండోసంవత్సరం చదువుతున్న తేజస్వి వీఎఫ్ఎక్స్కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను విడుదలైన మొదటి రోజే చూస్తుంది. ఆ సాంకేతికత గురించి తన అభిప్రాయాలను ఫేస్బుక్లో రాస్తుంది. వినోద రంగంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీకి ఇది బంగారు కాలం. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్ స్టూడియోల సంఖ్య పెరుగుతోంది. ముంబై, చెన్నై, బెంగళూరు... మొదలైన నగరాలు యానిమేషన్ కంపెనీలు, అకాడమీలకు కేంద్రాలుగా మారాయి. మన దేశానికి పెద్ద ఎంటర్టైన్మెంట్ మార్కెట్ ఉంది. ఒక అధ్యయనం ప్రకారం ఈ రంగంలో 2025 కల్లా 75,000 నుంచి 1,25,000 ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. కమర్షియల్స్, వెబ్ సిరీస్, మూవీస్, వోటీటీకి హై–క్వాలిటీ మెటీరియల్ కావాలి. ఈ నేపథ్యంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్లకు ప్రాధాన్యత పెరిగింది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ బిజినెస్ కాంబినేషన్ యువతను ఆకర్షిస్తుంది. కొత్త ఆలోచనలకు అవకాశం కల్పిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ యానిమేషన్‌కు డిమాండ్‌ను పెంచే కథలను సిద్ధం చేస్తోంది. ‘వీఎఫ్ఎక్స్, యానిమేషన్లకు గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ పెరిగింది. అంచనాలకు అందని విధంగా ఈ రంగం చాలా అడ్వాన్స్డ్గా ఉంది. వీఎఫ్ఎక్స్ అనేది సాంకేతికత మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. కథాసం విధానంలో భాగం’ అంటున్నాడు వీఎఫ్ఎక్స్ నిపుణుడు రాజీవ్ కుమార్. స్కూల్ రోజుల నుంచే వీఎఫ్ఎక్స్ అంటే రాజీవ్‌కు ఆసక్తి. అయితే దాన్ని కెరీర్‌గా ఎలా చేసుకోవాలనే దానిపై స్పష్టత ఉండేది కాదు. పుణెలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసిన రాజీవ్ ముంబైకి వెళ్లి వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీతో ప్రయాణం మొదలుపెట్టి భారీ విజయం సాధించాడు. మలయాళ చిత్రం కందిట్టుండు (అది చూడు) బెస్ట్ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డ్ గెలుచుకుంది. 25 సంవత్సరాల అదితి క్రిష్టదాస్ ఈ చిత్రానికి దర్శకురాలు. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ (ఎన్ఐడీ) లో యానిమేషన్ కోర్సు చేసిన అదితి క్రిష్ణదాస్ తొలి చిత్రంతోనే జాతీయ అవార్డ్ అందుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకుంది చెన్నైకి చెందిన ప్రియాంక సుబ్రమణియన్. లండన్ ఫిల్మ్ స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక ఫ్రెండ్ ద్వారా మూవింగ్ పిక్చర్ కంపెనీకి తరచు వెళ్లేది. ఇండస్ట్రీ ధోరణులను అర్థం చేసుకోవడం కోసం ఎందరో కళాకారులతో మాట్లాడేది. పుస్తకాలు చదివేది. స్టూడియోలలో అవసరమైన వారికి టీ, కాఫీలు, వోల్డ్ టేప్‌లు, హార్డ్ డిస్క్‌లు అందించేది. వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన ప్రియాంక సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని కలలు కనేది. వీఎఫ్ఎక్స్ స్టూడియో రూపంలో తన కలను సాకారం చేసుకుంది. మీ శక్తి వృథా చేయవద్దు వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. అప్పుడు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత కష్టమైనా చేసే శక్తి ఉంటుంది. ఆ శక్తి నిరుపయోగం కాకుండా చూసుకోవాలి. – ప్రియాంక సుబ్రమణియన్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ అ కథలు మళ్లీ ఇప్పుడు మనకు తరతరాల కథల సంపద ఉంది. అమ్మమ్మలు, నానమ్మల నోటి నుంచి కథలు వినే దృశ్యాలు అరుదైపోయాయి. ఈ నేపథ్యంలో యానిమేషన్‌కు ప్రాధాన్యత పెరిగింది. మరుగున పడిన ఎన్నో కథలను పిల్లలకు ఆకట్టుకునేలా చెప్పవచ్చు. యానిమేషన్ ఫిల్మ్స్ అంటే ఫన్నీ కార్టూన్స్‌ను మాత్రమే కాదు. – అదితి క్రిష్ణదాస్, డైరెక్టర్ -
'హనుమాన్'కి గ్రాఫిక్స్ హాలీవుడ్ కాదు.. మన హైదరాబాద్‌లోనే
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజసజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. సూపర్ హీరో కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంజనాద్రి (Anjanadri) అనే ఒక ఊహాలోకంలో జరిగే సూపర్ హీరో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవలె ఈ సినిమా టీజర్ విడుదలై జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ విశేషంగా ఆకట్టుకుంది. దీనికి మరో ప్రధాన కారణం "వి.ఎఫ్.ఎక్స్". హాలీవుడ్ స్టాండర్డ్స్ ను తలదన్నేలా కనిపిస్తున్న ఈ గ్రాఫిక్స్ అద్దింది హైదరాబాద్ కు చెందిన "హేలో హ్యూస్ స్టూడియోస్" సంస్థ. దీంతో ఈ గ్రాఫిక్స్ కంపెనీ గురించి పలువురు టాలీవుడ్ దర్శకులు చర్చించుకుంటున్నారు. -
భారీ బడ్జెట్ సినిమాలో విపరీతమైన గ్రాఫిక్స్.. లాభమా? నష్టమా?
సినిమా-వీఎఫ్ఎక్స్ ఈ రెండింటిని విడివిడిగా చూడలేం. గ్రాఫిక్స్‌తో తెరపై వండర్స్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఒక్కోసారి మితిమీరిన గ్రాఫిక్స్ కూడా సినిమాకు పనిచేయవు. ఆదిపురుష్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. బ్రహ్మస్త్ర సినిమాలోనూ గ్రాఫిక్స్ డామినేట్ చేశాయి. ఈ క్రమంలో అసలు సినిమా సక్సెస్‌లో గ్రాఫిక్స్ ప్రాముఖ్యత ఏంటి? భారీ బడ్జెట్ సినిమా అంటే హై లెవల్లో గ్రాఫిక్స్ ఉండాల్సిందేనా? బాక్సాఫీస్ వద్ద గ్రాఫిక్స్ క్రియేట్ చేసే మ్యాజిక్ ఏంటి? తెలుసుకుందాం.. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ టీజర్ రిలీజ్ తర్వాత ఊహించని రీతిలో విమర్శల పాలైందీ సినిమా. ఇందులో రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. టీజర్ రిలీజ్ తర్వాత రామాయణాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ గ్రాఫిక్స్, విజువల్స్ కూడా అస్సలు బాగోలేవని, పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తీస్తున్నప్పుడు ఇలా నాసీరకమైన గ్రాఫిక్స్ ఏంటని నెటిజన్లు దారుణంగా విమర్శించారు. దీంతో వెనక్కి తగ్గిన మేకర్స్ మళ్లీ రీ షూట్స్ చేసి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్‌తో కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో టాలీవుడ్ నుంచి వచ్చిన మరో మైథాలాజికల్ సినిమా హనుమాన్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవలె విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందులోని వీఎఫ్ఎక్స్ సైతం విజువల్ వండర్లా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమాకు పెద్ద హీరో, బడ్జెట్ కంటే కంటెంట్, స్క్రీన్ ప్లే చాలా ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ఇక మరో భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మస్త్ర. రణ్‌బీర్,ఆలియా హీరో,హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కూడా బాలీవుడ్ మినహా మిగతా భాషల్లో ఆశించినంత సక్సెస్ కాలేదు. కంటెంట్‌కి గ్రాఫిక్స్ తోడవ్వాలి కానీ గ్రాఫిక్స్‌కే కంటెంట్ వచ్చి చేరింది అన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో వీఎఫ్క్స్పై ఇంత భారీగా ఖర్చుపెట్టడం సినిమా రిజల్ట్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతుంది అన్న చర్చ మొదలైంది. ఈ అంశంపై ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీ యజమాని రాజీవ్ చిలకా మాట్లాడతూ.. ''స్క్రిప్ట్ విషయంలో సరైన అవగాహన లేక పదేపదే మార్చుతూ దానికనుగుణంగా వీఎఫ్ఎక్స్ మార్చితే బడ్జెట్ కూడా అంతకంతకూ పెరుగుతుంది. ఆదిపురుష్ మూవీకి సంబంధించి మేకర్స్ చాలా తొందరపడ్డారు. ప్రీ-ప్రొడక్షన్‌కి సరైన సమయం ఇవ్వలేదని భావిస్తున్నా. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో సినిమా అంటే చాలా అంచనాలు ఉంటాయి. అయితే భారీ బడ్జెట్‌తో సినిమా తీస్తున్నప్పుడు దానికి తగినంత సమయం ఇవ్వకపోతే ఆశించినంత రిజల్ట్ రాదని గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో ఆర్ఆర్ఆర్, తన్హాజీ: ది అన్సంగ్ వారియర్, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, రన్‌వే వంటి సినిమాలు భారీ బడ్జెట్‌తోనే నిర్మించారు. వీఎఫ్ఎక్స్ కూడా బాగానే వాడారు. కానీ కంటెంట్‌కి, విజువల్స్‌కి మ్యాచ్ అయ్యింది కాబట్టి ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. కానీ వాళ్లలాగే మనమూ గ్రాఫిక్స్ ప్రధానంగా సినిమా తీద్దాం అనుకుంటే ఒక్కోసారి ఆదిపరుష్ లాగా ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. సినిమా బడ్జెట్ ఎప్పుడూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. ఫిల్మ్ మేకింగ్ అనేది క్రియేటివ్ ప్రాసెస్. మేకర్స్ అనుకున్నదానికంటే ఒక్కోసారి బడ్జెట్ ఎక్కువ అవ్వొచ్చు.. లేదా తక్కువ అవ్వొచ్చు. బడ్జెట అంటే కంటెంట్ అన్నది చాలా ముఖ్యం అని అందరూ తెలుసుకోవాలి'' అంటూ చెప్పుకొచ్చారు. -
కండలు తిరిగిన దేహం.. పొడవాటి జుట్టు; అదరహో ధోని
టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని కొత్త అవతారంలో కనిపించనున్నాడు. మాములుగానే ధోని మంచి ఫిజిక్‌తో ఉంటాడు. అలాంటి ధోని ఈసారి కండలు తిరిగిన దేహంతో .. పొడవాటి జుట్టుతో .. చేతిలో కత్తులతో యుద్ధంలో శత్రువులపై దాడికి సిద్ధంగా ఉన్నాడు. ఇదేంటి ధోని సినిమాల్లో ఏమైనా కనిపిస్తున్నాడా అని సందేహం వద్దు. ఒక యానిమేటెడ్ గ్రాఫిక్స్ నవల కోసం ధోని వారియర్ అవతారమెత్తాడు. అథర్వ అనే టైటిల్‌తో తొందర్లోనే రానున్న ఈ నవలకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అథర్వ అనే సూపర్ హీరో క్యారెక్టర్లో మెరుస్తున్న ధోని.. తన లుక్స్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. కాగా ఈ నవలను రమేశ్ తమిల్మని రాశారు. చదవండి: IPL 2022 Auction: ధోని దృష్టికి జూనియర్ 'మలింగ'.. సీఎస్కే దక్కించుకోనుందా! మోషన్ పోస్టర్‌కు సంబంధించిన టీజర్‌ను ధోని స్వయంగా తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అథర్వ అనే కొత్త అవతారంలో కనిపించడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇందులోని స్టోరీ, ఆర్ట్‌వర్క్‌తో ప్రతీ ఒక్కరు లీనమవుతారని.. ముఖ్యంగా కామిక్ లవర్స్‌కు ఇదో పెద్ద పండుగలా కనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో నాలుగోసారి సీఎస్కేను విజేతగా నిలబెట్టిన ధోని.. మరోసారి సీఎస్కే కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇక ఫిబ్రవరి 12,13న జరగనున్న ఐపీఎల్ మెగావేలంలో సీఎస్కే ఎవరిని కొనుగోలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి:Daryl Mitchell: ఆ ఒక్క నిర్ణయం.. ధోని లాంటి దిగ్గజాల సరసన నిలబెట్టింది -
డామిట్..కధ అడ్డం తిరిగింది..!
-
పోలవరం ఒక త్రిశంకు స్వర్గం?
పిచ్చి కుదిరింది తలకు రోకలి చుట్టు అన్నాడొకాయన. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని భ్రమింపచేస్తూ 48 గేట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టులో 1 గేటు పెట్టి ప్రాజెక్టు పూర్తి అయిపోయిందన్న భ్రమ కల్పించి బాహుబలి సినిమాను తలదన్నేలా గ్రాఫిక్స్‌ను చూపించి ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు. కనీసం ఒక్క గేటు అమర్చటానికి 2 నెలలు పడుతుంది. మిగిలిన 47 గేట్లు పెట్టడానికి ఎంత సమయం పడుతుందో మనకు తెలుస్తుంది. పోలవరం అంచనాలను తనకు కావలసిన రీతిలో పెంచుకొని ప్రాజెక్టును 58 వేల కోట్లకు పెంచేశారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తి అయిపోయాయని ప్రకటనలు చేస్తున్నారు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఇక 40 శాతమే మిగిలింది. చంద్రబాబు వేసిన అంచనా ప్రకారం 58 వేల కోట్ల ప్రాజెక్టు 60 శాతం పూర్తి అయిందని చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారం ఇంకా 23 వేల కోట్లు పని మాత్రమే మిగిలింది. నిజానికి 11,500 కోట్లు మాత్రం ఇప్పటివరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. దానిలో వై.ఎస్.ఆర్. హయాంలో దాదాపు 5,500 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 6 వేల కోట్లు కేంద్రం యిచ్చిన కేటాయింపు, ఈ తక్కువ మొత్తంతోనే 60 శాతం పని ఎలాపూర్తి చేస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. పోలవరం ప్రాజెక్టు నుంచి 2019 మే నెలలో నీరు ఇస్తాననడం ఎడారిలో ఎండమావి లెక్కే. కాపర్‌డ్యామ్ ఎత్తు 31 మీటర్లు అని ముందు అంచనా కాని ఇపుడు 41 మీటర్లు పెంచడం ప్రమాదకరం అని నిపుణులైన ఇంజనీర్లు చెబుతున్నారు. ఎందుకంటే కాపర్‌డ్యామ్ అనేది తాతాల్కిక అడ్డుకట్ట. కేవలం ఎర్త్ కమ్ రాక్పిల్ డ్యామ్ నిర్మించి స్పిల్‌వే ద్వారా నీటిని మళ్లించడానికి కాపర్డ్యామ్ను నిర్మిస్తారు. అలాగే ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌కి దిగువకూడా కాపర్‌డ్యామ్ కడతారు. 41 మీటర్లు ఎత్తు పెంచి దాని ద్వారా వచ్చే నీరు కాలువకు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి అయిందనే భ్రమ కల్పించడానికి చేస్తున్న ఎత్తుగడ ఇది. గోదావరిలో ఎక్కువ నీటి ప్రవాహం వస్తే కాపర్‌డ్యామ్ కొట్టుకొనిపోవడం ఖాయం. 31 మీటర్ల ఎత్తులో అయితే కాపర్‌డ్యామ్ కొట్టుకుపోయినా ప్రమాదం తక్కువ. అది 41 మీటర్లు కడితే ప్రమాదం జరిగితే అది గోదావరి గట్టు కంటే 5 మీటర్ల ఎత్తుకు నీరు ప్రవహించి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు వరదల ప్రమాదం ఏర్పతుంది. ఇవన్నీ ఆలోచిస్తే పోలవరం ఇప్పట్లో పూర్తి అవుతుందనేది భ్రమ. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎండాకాలంలో కాపర్‌డ్యామ్ కొట్టుకుపోయింది. తక్కువ ఎత్తు కావటం వలన క్రింద ప్రాంతానికి పెద్దగా నష్టం జరగలేదు. కానీ 41 మీటర్ల ఎత్తు కట్టబోతున్న పోలవరం కాపర్‌డ్యామ్ వర్షాకాలంలోగాని కూలిపోతే ఉభయగోదావరి జిల్లాలు మునగడం ఖాయం. ప్రాజెక్టులో అవినీతికి అంతులేకుండా పోయిందని కాగ్ చెప్పినప్పటికీ కేంద్రం దానిపై ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం చూస్తే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా అనుమానించవలసిన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రజల స్పందన చూసిన చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టి ఎలాగైనా గెలవాలని తాపత్రయంతో ఈ గ్రాఫిక్స్ చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మేస్థితిలో లేరు. ఏదిఏమైనా పోలవరం బాబుకు ఒక పాడి ఆవులాగ ఉంది. పునరావాస ప్యాకేజీలో జరుగుతున్న అక్రమాలకు అంతులేదు. ముంపు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూముల పరిహారం సైతం పచ్చచొక్కాలకు అందచేసిన మోసాలు, ఇలాంటి ఎన్నో రకాల మోసాలు చేస్తూ అధినాయకుడు నుంచి కింది నాయకుల వరకు చేస్తున్న అవినీతికి అంతులేకుండా పోయింది. ప్రాజెక్టులో జియోలాజికల్ సర్వే, సి.డబ్లు్య.సి ఇచ్చి మార్గదర్శకాలను తుంగలో తొక్కుతున్న వైనం చూస్తే ప్రాజెక్టులను ఎటువైపునకు తీసుకొని వస్తారో అని భయాందోళనలతో ప్రజలు వున్నారు. 2018లో పోలవరం పూర్తి అవుతుందని రాసుకో జగన్ అని పిచ్చికూతలు కూసిన సాగునీటిశాఖ మంత్రి ఇప్పుడు నిస్సిగ్గుగా 2019లో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పడం చూస్తే వారి అవగాహన ఏ మేరకుందో తెలుస్తుంది. ప్రతిపనికి ఒక శంకుస్థాపన, ఒక గ్రాఫిక్‌తో ప్రజలను మభ్యపెట్టడం, ఎన్నికలలో ప్రజలను డబ్బుతో కొనేయవచ్చుననే భ్రమలో ఉన్నాడు. పోలవరం నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రాజెక్టు అ«థారిటీ బీటలువారిన స్పిల్‌వేను చూపిం చినా, ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాగ్ ఆధారాలతో చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టుంది. ఒక రోడ్డు వేసిన 21 రోజుల తరువాత, లోడ్ టెస్టింగ్ అనేది చెయ్యటం పరిపాటి, ఇంత పెద్ద ప్రాజెక్టుకి కాంక్రీటు వేసిన తరువాత కనీసం ప్రామాణిక పరీక్ష చెయ్యకపోవటం, మార్గదర్శకాలను పాటిం చకపోవటం ప్రాజెక్టుకే ప్రమాదంగా మారింది. ఇప్పటికైనా జిమ్మిక్కులు మాని, ప్రాజెక్టును నాణ్యతాప్రమాణాలతోను, సి.డబ్లు్య.సి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి మార్గదర్శకాలను అమలు చేస్తూ ప్రాజెక్టు నిర్మించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. -కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త రాష్ట్ర నీటి సంఘాల అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మొబైల్ : 94402 04323 -
ఎన్వీడియా టైటన్ ఆర్టీఎక్స్
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ గ్రాఫిక్ కార్డుల తయారీ సంస్థ ఎన్వీడియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డెస్క్‌టాప్ గ్రాఫిక్ కార్డ్‌ను తాజాగా విడుదల చేసింది. ఎన్వీడియా టైటాన్ ఆర్టీఎక్స్ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఇందులో వినియోగదారులకు 24 జీబీ హైస్పీడ్ జీడీడీఆర్6 గ్రాఫిక్స్ మెమొరీ లభిస్తుంది. 672 జీబీ పర్ సెకండ్ స్పీడ్‌తో ఈ గ్రాఫిక్ కార్డ్ పనిచేస్తుంది. దీని వల్ల అద్భుతమైన గ్రాఫిక్స్‌ను పొందవచ్చు. రియల్ టైం 8కె వీడియోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక ఈ గ్రాఫిక్ కార్డ్ ధర 2499 అమెరికన్ డాలర్లు (దాదాపుగా రూ.1,75,965)గా ఉంది. జనవరి నెలలో అమెరికా, యూరప్ మార్కెట్లలో ఈ గ్రాఫిక్ కార్డు విక్రయానికి రానుంది. అయితే ఇండియన్ మార్కెట్లో దీని ధర 2 లక్షల రూపాయలకు పైమాటే. -
చిన్న సినిమాకు రాజమౌళి సాయం
దర్శకధీరుడు రాజమౌళి చిన్న సినిమాలకు తనవంతు సాయం అంధించేందుకు ఎప్పుడూ ముందుంటారు. అదే బాటలో సంజీవని సినిమా ట్రైలర్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు జక్కన్న. ఓ సాహసయాత్రకు బయలు దేరిన కొంతమంది యువత ఎలాంటి పరిస్థితులును ఎదుర్కొన్నారు అన్నదే ఈ సినిమా కథ. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి వీడే దర్శకత్వం వహించారు. అనురాగ్ దేవ్, మనోజ్ చంద్ర, తనూజ నాయుడు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను నివాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై జీ శ్రీనివాన్ నిర్మిస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో ఈ స్థాయి గ్రాఫిక్స్ తో సినిమాను తెరకెక్కించిన చిత్రయూనిట్‌ను రాజమౌళి ప్రశంసించారు. The clean visuals with an interesting storyline and notable graphics make #Sanjeevani praiseworthy. Achieving this output with restricted budget is truly commendable. Wishing the entire team all the best. https://t.co/pT3UkXthBB — rajamouli ss (@ssrajamouli) 22 May 2018 -
క్రిష్-4: తండ్రితో హృతిక్ విభేదాలు!
హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'క్రిష్'కి అభిమానులు కాని వారుండరు. 2006లో వచ్చిన ఆ చిత్రం హిందీలోనే కాదు.. తెలుగులోనూ అనువాద రూపంలో మంచి విజయం సాధించింది. తరువాత వచ్చిన 'క్రిష్ 3' (2013) కూడా మంచి విజయమే సాధించింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో నాలుగో భాగం వస్తున్న విషయం తెలిసిందే. అయితే గత చిత్రాల కంటే భారీగా ‘క్రిష్ 4′ ను రూపొందించాలన్నది హృతిక్ ఆలోచిస్తున్నాడట. యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ భారీ ఎత్తున ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన విషయాల్లో తండ్రి రాకేశ్ రోషన్ సలహాను హృతిక్ పాటించడం లేదట. ఈ సినిమాకి సంబంధించి హృతిక్‌కి కొన్ని ఆలోచనలు ఉన్నాయట. ఏఏ ఆర్టిస్టులను తీసుకోవాలి. ఎలాంటి గ్రాఫిక్స్‌ను వాడాలని అనే విషయాలను హృతిక్యే చూసుకుంటున్నాడట. ఎలాంటి విజువల్ ఎఫెక్ట్ సినిమాలో పెట్టాలనే అంశాన్ని కూడా అతనే చూసుకుంటున్నాడట. తండ్రి రాకేశ్ రోషన్ కంటే హృతిక్ కే నేటితరం ప్రేక్షకులపై మంచి అవగాహన ఉంది. ఎలాంటి గ్రాఫిక్స్ సన్నివేశాలయితే ప్రేక్షకులకు నచ్చుతాయో హృతిక్ బాగా తెలుసు. అందుకే సినిమా సంబంధించిన విషయాల్లో తండ్రి మాట వినడం లేదని బాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఏదేమైనా భారీ హంగులతో 2020లో క్రిష్-4 సినిమాను విడుదల చేయాలని తండ్రీ-కొడుకులు ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. -
చిరు కొత్త లుక్ చూశారా..!
ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా సైరా నరసింహారెడ్డి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. రెండో షెడ్యూల్ ను ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లుక్ కోసం మెగాస్టార్ కొంత కాలంగా గెడ్డంతో కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన షూటింగ్ లో కూడా చిరు అదే లుక్ లో పాల్గొన్నారు. కానీ తాజాగా మెగాస్టార్ క్లీన్ గా షేవ్ చేసుకొని అభిమానులకు దర్శనమిచ్చారు. శనివారం జువ్వ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరు.. గెడ్డం, మీసం లేకుండా కనిపించారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో గెడ్డం లేకుండా కనిపించిన చిరు తరువాత గ్రాఫిక్స్ వర్క్ కోసం మీసం కూడా తీసేశారట. రెండో షెడ్యూల్ ప్రారంభం కావడానికి మరికొంత సమయం ఉండటంతో ఈ లోగా గ్రాఫిక్స్‌కు కావాల్సిన త్రీడీ ఇమేజెస్ కోసం చిరు ఈ న్యూ లుక్ లోకి మారిపోయారని తెలుస్తోంది. త్వరలో సైరా నరసింహారెడ్డి సినిమా రెండో షెడ్యూల్ పొల్లాచ్చిలో ప్రారంభం కానుంది. -
గ్రాఫిక్స్‌తో సినిమా చూపించారు...
► గ్రాఫిక్స్‌కే పరిమితమైన 60 అంతస్తులు ► హైరైజ్ భవనాలపై ప్రభుత్వం వెనకడుగు ► కమర్షియల్ జోన్‌లోనూ జీ+11కే అనుమతి ► సీఆర్డీఏ ఆమోదిస్తేనే15 నుంచి 18 అంతస్తులు విజయవాడ బ్యూరో: రాజధానిలో ఆకాశహర్మ్యాల (హైరైజ్) నిర్మాణం అంతా హంబక్కేనని తేలిపోయింది. ఈ భవనాల నిర్మాణంపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. సింగపూర్, చైనా తరహాలో ఇక్కడా భారీ ఎత్తున ఆకాశహర్మ్యాలు నిర్మిస్తామని మొదట్లో హడావుడి చేసి రకరకాల రంగుల బొమ్మలను చూపించినా.. చివరికి 15 నుంచి 18 అంతస్తులతోనే సరిపెట్టుకుంటోంది. ఆ మేరకు జోనింగ్ మార్గదర్శకాలూ రూపొందించడంతో మాస్టర్‌ప్లాన్‌లో చూపించిన 50, 60 అంతస్తుల భవనాలు కేవలం గ్రాఫిక్స్‌కే పరిమితమయ్యాయి. సచివాలయాన్ని 60 అంతస్తుల్లో నిర్మించడానికి ఒక దశలో సీఆర్డీఏ కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా పర్యటన తర్వాత అక్కడి ఆకాశహర్మ్యాలను చూసి అదేమాదిరిగా అమరావతిలో భారీ భవనాలు నిర్మిస్తామని చెప్పారు. వివిధ దేశాలల్లో పర్యటించిన సీఆర్డీఏ, ప్రభుత్వ ఉన్నతాధికారులు.. ఆధునిక నగరాలు నిట్టనిలువుగా (హైరైజ్) పెరుగుతున్నాయని, ఇక్కడా అదే మోడల్‌ను అనుసరిస్తామని చెప్పారు. తీరా అమరావతి ప్రాంతంలోని భూమిలో గట్టిదనం లేనందువల్ల బహుళ అంతస్తుల నిర్మాణం సరికాదని నిపుణులు హెచ్చరించడంతో ప్రభుత్వానికి వెనకడుగు తప్పలేదు. చేసేదేమీలేక తక్కువ అంతస్తుల నిర్మాణాలకే పరిమితమై అందుకనుగుణంగా జోనింగ్ మార్గదర్శకాలు రూపొందించింది. వీటిప్రకారం రెసిడెన్షియల్ జోన్లలో జీ+11 నిర్మాణాలకే అనుమతిస్తారు. అది కూడా ఆర్-3, ఆర్-4 జోన్లలో మాత్రమే. కమర్షియల్, ఇన్స్టిస్ట్యూషనల్ జోన్లనూ జీ+11 నిర్మాణాలకే పరిమితం చేశారు. భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరమైతే సీఆర్డీఏ కమిషనర్ ఆమోదంతో 15 నుంచి 18 అంతస్తులకు అనుమతించే అవకాశం ఉంటుంది. నిపుణులు హెచ్చరించినా.. అమరావతిలో నేల సామర్థ్యం బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుకూలం కాదని మొదటి నుంచి నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం గ్రాఫిక్స్ చేయించింది. అమరావతి ప్రాంతమంతా ఒండ్రుమట్టి (అల్లువియల్), వదులు (లూజ్) మట్టితో ఉంది. ఇక్కడి భూమిలో పది నుంచి 15 అడుగుల లోతులోనే నీళ్లు పడతాయి. ఈ నేలలకు సాయిల్ బేరింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి ముందు సీఆర్డీఏ ఈ ప్రాంతంలో ఎనిమిది చోట్ల భూ పరీక్షలు నిర్వహించినా వివరాలను బయటపెట్టలేదు. కొందరు రైతులు భూమి పరిస్థితి తెలుసుకునేందుకు లెసైన్స్డ్ సంస్థతో భూపరీక్షలు చేయించగా ఈ ప్రాంతం బహుళ అంతస్తులకు అనువైంది కాదని తేలింది. ఈ అనుమానంతోనే జీ+7 తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి 60 అడుగుల లోతు, మూడున్నర అడుగుల వెడల్పుతో పునాది వేయిస్తోంది. ఈ స్థాయి పునాది 120 అంతస్తులకు వేస్తారని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. పైకి ఎంత బకాయిస్తున్నా లోలోన అనేక అనుమానాలుండడంతో ప్రభుత్వం భారీ పునాది వేయిస్తోందంటున్నారు. -
వాళ్లే డబ్బు అడుగుతున్నారు!
‘ఇప్పటి పరిస్థితుల్లో స్టార్స్ లేని సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ముందుకు రావడం లేదు. సినిమా రిలీజ్‌కు ముందు నిర్మాతలకు అడ్వాన్సులు ఇచ్చే ఎగ్జిబిటర్స్ ఈ చిత్రం కోసం ఎదురు డబ్బులు అడుగుతు న్నారు. దీంతో నిర్మాతలు కష్టపడి థియేటర్స్‌ను సంపాదించి సొంతంగా సినిమాను విడుదల చేస్తున్నారు. చిన్న నిర్మాతల పరిస్థితి అలా తయారైంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిశోర్, పావని ప్రధాన పాత్రల్లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన ‘ఎలుకా మజాకా’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందంతో కలసి దాసరి నారాయణరావు విలేకరులతో మాట్లాడారు. ‘‘చిన్న నిర్మాతల శ్రేయస్సు కోసం ఇప్పుడున్న రోజుకు నాలుగు ఆటలను ఐదు ఆటలు చేసి ఒంటిగంట ఆట చిన్న చిత్రానికి కేటాయించాలని, చిన్న సినిమాలకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరగా ప్రభుత్వ కమిటీ సానుకూలంగా స్పందించింది’’ అని దాసరి అన్నారు. ‘ఎలుకా మజాకా’ గురించి మాట్లాడుతూ - ‘‘రేలంగి చిత్రమంటే నా సినిమా కిందే లెక్క. వినాయకుడిని కేర్ చేయని హీరోను ఎలుక ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందన్నదే చిత్ర కథ. ఇది పిల్లలతో చూడాల్సిన చిత్రం’’ అని పేర్కొ న్నారు. ‘‘తొలిసారి గ్రాఫిక్స్‌తో చిత్రం తీశా. దీనిలో 40 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటాయి. జంధ్యాల గారి, నా చిత్రాల్లో ఓ మ్యాన రిజం ఉంటుంది. ఈ చిత్రంలో ఆ తరహా పాత్ర రఘుబాబు చేశారు’’ అని రేలంగి అన్నారు. దర్శకుడు కోడి రామకృష్ణ, ‘వెన్నెల’ కిశోర్, పావని, సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ మాట్లాడారు. -
నీట మునిగిన సత్యం
గ్రాఫిక్స్ ఎడమ వైపు ఫొటోలో ఉన్న అమ్మాయి ‘తేజ్’ న్యూస్ చానల్ యాంకర్. కుడివైపు ఫొటోలో ఉన్న అమ్మాయి కూడా సేమ్ టు సేమ్ అదే యాంకర్. అయితే మొదటి ఫొటో ఒరిజినల్. రెండోది ఫేక్. చెన్నై వరదల్లో నీటి మట్టం క్షణక్షణానికీ పెరిగి పోతున్న విషయాన్ని ‘లైవ్’లో చెప్పడానికి ఈ యాంకర్ నీళ్లలోకి దిగారు. రెండో ఫొటోలో మాత్రం యాంకర్ బొమ్మ మాత్రమే నీళ్లలోకి దిగింది! తేజ్ న్యూజ్ చానెల్ వాళ్లు స్టూడియోలో ఉండి చేసిన గ్రాఫిక్స్ గిమ్మిక్ ఇది. అర్థమైన వాళ్లకు అయింది. ‘మరీ ఇలాంటప్పుడు కూడానా!’ అని ఆవేదన చెందారు. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా చెన్నైని వానలు, వరదలు ముంచెత్తాయి. 200 మందికి పైగా మరణించారు. మీడియా నిద్రమాని మరీ వార్తల్ని అందించింది. మరింత ప్రాణ నష్టం జరక్కుండా, పరిస్థితి విషమించకుండా ప్రజలకు, ప్రభుత్వశాఖలకు అప్డేట్స్ ఇచ్చింది. ఇలా వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టే న్యూస్ ఛానెల్స్‌ను అభినందించాల్సిందే. కానీ ఆ అభినందనల కోసం గ్రాఫిక్స్‌తో గిమ్మిక్స్ చేసే ఛానెళ్లను ఏమనుకోవాలి? పైగా దీనిపై ఆ చానల్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. -
'చరిత్రను వక్రీకరించలేదు.. గ్రాఫిక్స్‌ను నమ్ముకోలేదు'
హైదరాబాద్: రుద్రమదేవి సినిమాలో తాను ఎవరి చరిత్రను వక్రీకరించలేదని దర్శకుడు గుణ శేఖర్ అన్నారు. కేవలం గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ నమ్ముకుని చేసుకొని సినిమా తీయలేదని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా రుద్రమదేవి సినిమా అక్టోబర్ 9న విడుదలవుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. సినిమా మూడుసార్లు సెన్సార్‌కు వెళ్లిందనే వార్తలు పూర్తిగా అబద్ధం అని చెప్పారు. కేవలం ఒకసారి మాత్రమే రుద్రమదేవి సినిమా సెన్సార్ అయిందని చెప్పారు. ఇప్పటి వరకు పలుమార్లు రుద్రమదేవి చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు భాషల్లో రుద్రమదేవి విడుదలవుతుంది. తెలుగు, తమిళం, హిందీతోపాటు కన్నడ భాషల్లో కూడా రుద్రమదేవి విడుదల కానుంది. -
4జీ మాయ... స్మార్ట్ హవా!
సెకనుకో సినిమా డౌన్లోడ్... రెండు సెకన్లకు మరోటి అప్లోడ్... కళ్లు చెదిరిపోయే గ్రాఫిక్స్, రెప్ప ఆర్పనివ్వని స్పష్టత... ఇవేవో హైటెక్ హంగుల్లే మనకు అప్పుడప్పుడే అందవులే అనుకోకండి... అన్నీ సవ్యంగా సాగితే కొన్నినెలల్లోనే ఇవి మనకు అందుబాటులోకి వస్తాయంటున్నారు... టాటా టెలికామ్ సర్వీస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆశీష్ పచౌరీ. టెలికామ్ రంగంలో సరికొత్త విప్లవానికి 2014 నాందీ పలకనుంది. ప్రస్తుతం మనలో చాలామంది ఉపయోగిస్తున్న త్రీజీ స్థానంలో మరింత ఆధునికమైన 4జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఫలితంగా అత్యధిక వేగంతో టెలికామ్ సేవలను అందుకోవడమే కాకుండా.. ఇంకా అనేకానేక వినూత్న సాంకేతిక మార్పులు సాధ్యమవుతాయి. అవి ఏమిటో స్థూలంగా... భలే వేగం... సెకనుకు ఒక గిగాబిట్ సమాచారం డౌన్లోడ్ చేసుకునే సౌకర్యమిస్తుంది... 4జీ టెక్నాలజీ ఉన్న బ్యాండ్‌విడ్త్‌ను మరింత సమర్థంగా వాడుకోవడంతోపాటు, సమాచారాన్ని పంపే విషయంలో ఏకకాలంలో వేర్వేరు ఫ్రీక్వెన్సీల్లో డేటా ప్రసారాలు చేసే అవకాశం ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఈ ఏడాది దేశంలోని అనేక ప్రాంతాల్లోకి 4జీ సేవలను విస్తరించేందుకు టాటా టెలిసర్వీసెస్ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రాల స్థాయిలోనూ బ్యాండ్‌విడ్త్ సమస్య అన్నది లేకుండా పోవడం వల్ల ఇంటర్నెట్ను మరింత వేగంగా అందుకోవడం సాధ్యం కానుంది. యంత్రాలు మాట్లాడుకుంటాయి... మొబైల్‌ఫోన్ చేతిలో ఉంటే ఇంట్లో ఉంటూనే పొలంలోని పంప్‌సెట్‌ను ఆన్ చేసుకోవచ్చు. ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. కానీ మిగిలిన యంత్రాల మాటేమిటి? ఎక్కడి నుంచైనా ఇంట్లో, ఆఫీసులో ఉండే యంత్రాలతో మాట్లాడగలిగితే? యంత్రాలు తమంతట తామే ఇతర యంత్రాలతో సమాచారం ఇచ్చిపుచ్చుకోగలిగితే? ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఎం2ఎం కమ్యూనికేషన్స్‌ను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. టెలికామ్ శాఖ ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. మొబైల్-హెల్త్, ఎడ్యుకేషన్, కామర్స్.... స్మార్ట్ఫోన్లు సైతం గ్రామాల్లోకి ప్రవేశిస్తుండటంతో భారత్‌లో టెలికం ఆపరేటర్లు వాణిజ్యపరంగా కొత్త అవకాశాలపై దష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే మొబైల్-హెల్త్, మొబైల్-ఎడ్యుకేషన్, మొబైల్-కామర్స్ వంటి అంశాల్లో కొత్త కొత్త అప్లికేషన్లు ప్రవేశపెడుతున్నారు. మనకేంటి..? స్మార్ట్హోమ్ల సాకారానికి తొలిమెట్టు ఈ ఎం2ఎం. ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, సేవలు, నిర్మాణరంగం, ఇంకా అనేక రంగాల్లో యంత్రాలను అనుసంధానించవచ్చు. స్మార్ట్ మీటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, టెలీ హెల్త్, సెక్యూరిటీ రంగంలో మేలైన పరిష్కారాలు దొరుకుతాయి. ఇంధన వినియోగం, ఉత్పాదక వ్యయం, సమయం తగ్గుతాయి. ఆరోగ్య పరికరాలను పర్యవేక్షించడం, వ్యాధి నిర్ధారణ, స్మార్ట్ మీటరింగ్, రవాణా నిర్వహణ సాధ్యమవుతుంది. ఉపయోగం ఏంటి..? ఎం-హెల్త్: ఆరోగ్యం గురించి నిపుణులతో సమాచారం, సూచనలు అందుకోవచ్చు. పలు వ్యాధుల నివారణకు మొబైల్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. చాలా చౌకగానే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు పొందొచ్చు, అందించొచ్చు. ఎం-ఎడ్యుకేషన్: మారుమూల గ్రామాల్లో విద్యను అందించేందుకు ఈ అప్లికేషన్లు ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా అనుసరించదగ్గ మోడల్‌ను ఇంకా రూపొందించాల్సి ఉంది. ఎం-కామర్స్: ఇప్పటికీ గ్రామాల్లో బ్యాంకింగ్ సౌకర్యం లేకపోవడంతో మొబైల్ ద్వారా ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలకు ఈ అప్లికేషన్లు ఉపయుక్తం.. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు డబ్బును సులభంగా, త్వరగా పంపేందుకూ బాగా ఉపయోగపడతాయి.