
టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని కొత్త అవతారంలో కనిపించనున్నాడు. మాములుగానే ధోని మంచి ఫిజిక్‌తో ఉంటాడు. అలాంటి ధోని ఈసారి కండలు తిరిగిన దేహంతో .. పొడవాటి జుట్టుతో .. చేతిలో కత్తులతో యుద్ధంలో శత్రువులపై దాడికి సిద్ధంగా ఉన్నాడు. ఇదేంటి ధోని సినిమాల్లో ఏమైనా కనిపిస్తున్నాడా అని సందేహం వద్దు. ఒక యానిమేటెడ్ గ్రాఫిక్స్ నవల కోసం ధోని వారియర్ అవతారమెత్తాడు. అథర్వ అనే టైటిల్‌తో తొందర్లోనే రానున్న ఈ నవలకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అథర్వ అనే సూపర్ హీరో క్యారెక్టర్‌లో మెరుస్తున్న ధోని.. తన లుక్స్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. కాగా ఈ నవలను రమేశ్ తమిల్మని రాశారు.
చదవండి: IPL 2022 Auction: ధోని దృష్టికి జూనియర్ 'మలింగ'.. సీఎస్‌కే దక్కించుకోనుందా!
మోషన్ పోస్టర్‌కు సంబంధించిన టీజర్‌ను ధోని స్వయంగా తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అథర్వ అనే కొత్త అవతారంలో కనిపించడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇందులోని స్టోరీ, ఆర్ట్‌వర్క్‌తో ప్రతీ ఒక్కరు లీనమవుతారని.. ముఖ్యంగా కామిక్ లవర్స్‌కు ఇదో పెద్ద పండుగలా కనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లో నాలుగోసారి సీఎస్‌కేను విజేతగా నిలబెట్టిన ధోని.. మరోసారి సీఎస్‌కే కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇక ఫిబ్రవరి 12,13న జరగనున్న ఐపీఎల్ మెగావేలంలో సీఎస్‌కే ఎవరిని కొనుగోలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
చదవండి:Daryl Mitchell: ఆ ఒక్క నిర్ణయం.. ధోని లాంటి దిగ్గజాల సరసన నిలబెట్టింది