కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 19) రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్‌కు శుభారంభం లభించింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దీనికి ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మూడో టీ20 వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. పాక్ క్రికెట్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది.
ధోని రికార్డుపై కన్నేసిన బాబర్ ఆజమ్
గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోని పేరిట ఉన్న ఓ లాంగ్ స్టాండింగ్ బ్యాటింగ్ రికార్డుపై కన్నేశాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో బాబర్ అన్ని ఫార్మాట్లలో కలిపి ఏడు సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 4732 పరుగులు చేశాడు.
మరోవైపు ధోని SENA దేశాల్లో 38 హాఫ్ సెంచరీ సాయంతో 5273 పరుగులు చేశాడు. SENA దేశాల్లో ధోని, బాబర్ ప్రస్తుతం 38 యాభై ప్లస్ స్కోర్లు కలిగి ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగే రెండో వన్డేలో బాబర్ మరో హాఫ్ సెంచరీ చేస్తే.. SENA దేశాల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనిని అధిగమిస్తాడు.
తొలి వన్డేలో పాక్ ఘన విజయం
తొలి వన్డేలో అఘా సల్మాన్ ఆల్‌రౌండర్ షో, సైమ్ అయూబ్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో సౌతాఫ్రికాపై పాక్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డేలో బాబర్ ఆజమ్ 23 పరుగులు చేసి ఓట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో బాబర్‌కు శుభారంభం లభించినా భారీ స్కోర్ చేయలేకపోయాడు. బాబర్ గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా దారుణంగా విఫలమవుతున్నాడు. అతను హాఫ్ సెంచరీ మార్కు తాకి కూడా చాన్నాళ్లవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment