South Africa vs Pakistan
-
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. 122 ఏళ్ల వరల్డ్ రికార్డు బద్దలు
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘోర ఓటమి చవిచూసింది. పాకిస్తాన్ నిర్ధేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా 7.1 ఓవర్లలో ఛేదించింది.దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 194 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్.. ఫాలో ఆన్(రెండో ఇన్నింగ్స్)లో మాత్రం అద్బుతమైన పోరాటం కనబరిచింది.421 పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడిన పాకిస్తాన్ 478 పరుగుల భారీ స్కోర్ సాధించింది. షాన్ మసూద్ (145) సెంచరీ చేయగా.. బాబర్ ఆజాం (81) హాఫ్ సెంచరీతో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోర్‌కే పరిమితం కావడంతో పాక్ జట్టు సఫారీల ముందు మెరుగైన టార్గెట్‌ను ఉంచలేకపోయింది.దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 615 పరుగులు చేసింది. ప్రోటీస్ తొలి ఇన్నింగ్స్‌లో ర్యాన్ రికెల్టన్ (259) డబుల్ సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా (106), కైల్ వెర్రెన్న్ (100) శతకాలతో మెరిశారు. పాక్ బౌలర్లు అబ్బాస్, సల్మాన్ అఘా మూడేసి వికెట్లు పడగొట్టారు.చరిత్ర సృష్టించిన పాక్..కాగా ఫాలో ఆన్‌లో ధీటుగా ఆడిన పాకిస్తాన్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఫాల్ ఆన్‌లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. ఇంతకముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 1902లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడి 372/7 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో 122 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డును పాకిస్తాన్ బ్రేక్ చేసింది. ఆస్ట్రేలియా (372/7) తర్వాత వెస్టిండీస్ (348/10), న్యూజిలాండ్ (342/10), శ్రీలంక (342/10) జట్లు ఉన్నాయి.చదవండి: Ind vs Eng: ఇంకెన్నాళ్లు ఇలా?.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లలోనైనా ఆడిస్తారా? -
రెండో టెస్టులో పాకిస్తాన్ చిత్తు.. దక్షిణాఫ్రికాదే సిరీస్
దక్షిణాఫ్రికా(South Afrcia) గడ్డపై వన్డే సిరీస్ ‘క్లీన్‌స్వీప్’ చేసి చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు... టెస్టు సిరీస్‌లో మాత్రం తేలిపోయింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పర్యాటక పాకిస్తాన్ ‘వైట్‌వాష్’కు గురైంది. కేప్‌టౌన్ వేదికగా సోమవారం(జనవరి 6) ముగిసిన రెండో టెస్టులో పాక్‌పై 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో సౌతాఫ్రికా సొంతం చేసుకుంది.ఫాలో ఆన్‌లో అదుర్స్..కాగా తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన పాకిస్తాన్ ఫాలో ఆన్‌లో మాత్రం అద్భుతమైన పోరాటం పటమకనబరిచింది. ఓవర్‌నైట్ స్కోరు 213/1తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ ఆఖరికి 122.1 ఓవర్లలో 478 పరుగులకు ఆలౌటైంది. దీంతో సఫారీల ముందు పాకిస్తాన్ కేవలం 58 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంచగల్గింది.పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాన్ మసూద్ (251 బంతుల్లో 145; 17 ఫోర్లు) భారీ సెంచరీతో ఆకట్టుకోగా... ఆఘా సల్మాన్ (95 బంతుల్లో 48; 5 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (75 బంతుల్లో 41; 2 ఫోర్లు), ఆమేర్ జమాల్ (34; 7 ఫోర్లు) రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడ, కేశవ్ మహరాజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.ఊదిపడేసిన సౌతాఫ్రికా..ఇక 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా 7.1 ఓవర్లలో ఊదిపడేసింది. డేవిడ్ బెడింగ్హమ్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్క్రమ్ (14 నాటౌట్) ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించారు.దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగుల భారీ స్కోరు చేయగా... పాకిస్తాన్ మాత్రం తమ మొదటి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలోనే పాక్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన రికెల్టన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మార్కో యాన్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.కాగా దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న తుది పోరులో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది.చదవండి: Jasprit Bumrah: భయం పుట్టించాడు! -
బాబర్పైకి బంతి విసిరిన ముల్దర్.. పాక్ బ్యాటర్ రియాక్షన్ వైరల్
సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు సందర్భంగా వియాన్ ముల్దర్(Wiaan Mulder)- బాబర్ ఆజం(Babar Azam) మధ్య వాగ్వాదం జరిగింది. తన పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు బాబర్ వియాన్ ముల్దర్ వైపునకు దూసుకువచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ ముదరగా.. ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకుని ఇరువురికి నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మిశ్రమ ఫలితాలుకాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య జట్టు 2-0తో నెగ్గింది. అనంతరం వన్డే సిరీస్‌లో మాత్రం పర్యాటక పాకిస్తాన్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. చరిత్రలోనూ ఎన్నడూ లేనివిధంగా.. సౌతాఫ్రికా గడ్డపై 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.అరుదైన ఘనతతద్వారా ప్రొటిస్ దేశంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి జట్టుగా మహ్మద్ రిజ్వాన్ బృందం నిలిచింది. అయితే, టెస్టు సిరీస్‌లో మాత్రం పాకిస్తాన్ జట్టు తడబడుతోంది. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో రెండు వికెట్ల తేడాతో షాన్ మసూద్ బృందం ఓటమిపాలైంది. ఇక శుక్రవారం మొదలైన రెండో టెస్టులోనూ కష్టాల్లో కూరుకుపోయింది.రెకెల్టన్ భారీ డబుల్ సెంచరీకేప్టౌన్లో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రియాన్ రెకెల్టన్ భారీ డబుల్ సెంచరీ(259)తో విరుచుకుపడగా.. కెప్టెన్ తెంబా బవుమా(106), వికెట్ కీపర్ బ్యాటర్ వెరియెన్నె(100) కూడా శతక్కొట్టారు. మార్కో జాన్సెన్(62) అర్ధ శతకంతో రాణించగా.. కేశవ్ మహరాజ్ తన వంతుగా 40 పరుగులు సాధించాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఏకంగా 615 పరుగులు స్కోరు చేసింది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 194 పరుగులకే కుప్పకూలింది. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేశాడు. ప్రొటిస్ బౌలర్లలో రబడ మూడు వికెట్లు తీయగా.. క్వెనా మఫాకా, కేశవ్ మహరాజ్ చెరో రెండు, మార్కో జాన్సెన్, వియాన్ ముల్దర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.షాన్ మసూద్ శతకం.. సెంచరీ మిస్ అయిన బాబర్ ఆజంఈ నేపథ్యంలో.. మొదటి ఇన్నింగ్స్‌లో 200కు పైగా ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను ఫాలో ఆన్ ఆడిస్తోంది. దీంతో వెంటనే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ జట్టు శుభారంభం చేయగలిగింది. కెప్టెన్ షాన్ మసూద్ సెంచరీ(145)తో చెలరేగగా.. బాబర్ ఆజం కూడా శతకం దిశగా పయనించాడు. అయితే, సోమవారం నాటి ఆటలో భాగంగా 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. జాన్సెన్ బౌలింగ్‌లో బెడింగ్హామ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, అంతకంటే ముందు అంటే.. ఆదివారం నాటి ఆటలో భాగంగా బాబర్ ఆజం- ప్రొటిస్ పేసర్ వియాన్ ముల్దర్ మధ్య గొడవ జరింది. తన బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి బాబర్ విఫలం కాగా.. ముల్దర్ బంతిని చేజిక్కించుకుని బ్యాటర్ వైపు బలంగా విసిరాడు.సౌతాఫ్రికా పేసర్ దూకుడు.. ఉరిమి చూసిన బాబర్ ఆజంఅప్పటికే ప్రమాదాన్ని పసిగట్టిన బాబర్ ఆజం వికెట్లకు కాస్త దూరంగానే ఉన్నా బంతి అతడికి తాకింది. దీంతో బాబర్ కోపోద్రిక్తుడై.. చూసుకోవా అన్నట్లుగా ముల్దర్వైపు ఉరిమి చూశాడు. అయితే, అతడు కూడా ఏమాత్రం తగ్గకుండా బాబర్‌ను చూస్తూ దూకుడుగా మాట్లాడాడు. దీంతో గొడవ పెద్దదయ్యే సూచన కనిపించగా అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరినీ సముదాయించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 352 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది.Fight moment between Babar Azam and Wiaan Mulder. 🥵Wiaan Mulder unnecessary throws the ball at Babar Azam & showing him verbal aggression. #BabarAzam𓃵 #PAKvsSA #SAvPAK pic.twitter.com/PZnPNTWELZ— Ahtasham Riaz (@ahtashamriaz22) January 5, 2025 -
సూపర్ సెంచరీతో సత్తా చాటిన రికెల్టన్
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (Ryan Rickelton) సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రికెల్టన్ 134 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సల్మాన్ అఘా బౌలింగ్‌లో బౌండరీ బాది రికెల్టన్ సెంచరీ మార్కును అందుకున్నాడు. టెస్ట్‌ల్లో రికెల్టన్కు ఇది రెండో సెంచరీ. మరోవైపు కెప్టెన్ టెంబా బవుమా కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బవుమా 82 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ విరామం సమయానికి రికెల్టన్ (106), బవుమా (51) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0 పరుగులకు ఔటయ్యారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్ షెహజాద్, సల్మాన్ అఘా తలో వికెట్ పడగొట్టారు.కాగా, పాక్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 211, రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు (8 వికెట్లు కోల్పోయి) చేసింది.పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కమ్రాన్ గులామ్ (54) అర్ద సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో డేన్ పీటర్సన్ 5, కార్బిన్ బాష్ 4 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ (89), కార్బిన్ బాష్ (81 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్, నసీం షా తలో మూడు వికెట్లు తీశారు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (50), సౌద్ షకీల్ (84) అర్ద సెంచరీలు చేశారు. మార్కో జన్సెన్ 6 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాశించాడు. 150 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా కూడా తడబడింది. మార్క్రమ్ (37), బవుమా (40),రబాడ (31 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను గెలిపించారు. -
CT 2025: పాకిస్తాన్‌కు భారీ షాక్!
చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్(Saim Ayub) తీవ్రంగా గాయపడ్డాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా అతడు చీలమండ నొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో ఫిజియోలు వచ్చి పరీక్షించినా ఫలితం లేకపోయింది.ఫలితంగా ఆయుబ్‌ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. కాగా 2023లో పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 22 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. గతేడాది వన్డే, టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు 27 టీ20లలో 498 పరుగులు చేసిన ఆయుబ్.. ఏడు టెస్టుల్లో 364 రన్స్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీశాడు.సౌతాఫ్రికా గడ్డపై పాక్ చరిత్రఅయితే, వన్డేల్లో మాత్రం ఆయుబ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు తొమ్మిది ఇన్నింగ్స్ ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు శతకాల సాయంతో.. 515 పరుగులు సాధించాడు. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రొటిస్ జట్టుతో టీ20 సిరీస్‌లో ఓడిపోయిన పాక్.. వన్డేల్లో మాత్రం 3-0తో క్లీన్‌స్వీప్ చేసి.. సౌతాఫ్రికా గడ్డపై ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.ఇక ఈ టూర్లో భాగంగా ఆఖరిగా టెస్టు సిరీస్‌లో తలపడుతున్న పాకిస్తాన్.. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం ఆఖరిదైన రెండో టెస్టు మొదలైంది. కేప్‌టౌన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగింది.ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఆయుబ్ఈ క్రమంలో ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ను పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ వేయగా.. క్రీజులో ఉన్న రియాన్ రెకెల్టన్ షాట్ బాదాడు. బంతి గల్లీ, బ్యాక్వర్డ్ పాయింట్ల మీదుగా దూసుకుపోతుండగా.. ఫీల్డర్లు జమాల్- ఆయుబ్ దానిని ఆపే ప్రయత్నం చేయగా... బంతి జమాల్ చేజిక్కింది. సౌతాఫ్రికాలో వరుస సెంచరీలుఅయితే, ఈ క్రమంలో ఆయుబ్ కుడికాలి మడిమ మెలిక పడింది. తీవ్ర నొప్పితో అతడు మైదానం వీడాడు. అతడి స్థానంలో అబ్దుల్లా షఫీక్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. కాగా సయీమ్ ఆయుబ్ మడిమ విరిగినట్లు సమాచారం. దీంతో అతడు సొంతగడ్డపై జరిగే ఐసీసీ టోర్నీ చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే పాక్‌కు మాత్రం గట్టి షాక్ తగిలినట్లే. ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టుపై పరుగుల వరద పారించడంతో పాటు సౌతాఫ్రికా గడ్డపై కూడా రెండు శతకాలతో చెలరేగాడు. ఇలాంటి ఇన్ ఫామ్ ఓపెనర్ సేవలను కోల్పోతే మెగా టోర్నీలో పాకిస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బలు తప్పవు! చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
చరిత్ర సృష్టించిన కగిసో రబాడ.. 108 ఏళ్ల రికార్డు బ్రేక్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్లో దక్షిణాఫ్రికా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సెంచూరియన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో సంచలనం విజయం సాధించిన ప్రోటీస్.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించింది.ఈ విజయంలో సౌతాఫ్రికా స్పెషలిస్టు సీమ్ బౌలర్ కగిసో రబాడ (26 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) కీలక పాత్ర పోషించాడు. 148 పరుగుల సులువైన లక్ష్య చేధనలో ప్రోటీస్ 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రబాడ, మార్కో జానెసన్ విరోచిత పోరాటం కనబరిచారు.వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా ఊహించని విధంగా మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో స్పెషలిస్టు బ్యాటర్ అవతరమెత్తిన రబాడ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.రబాడ అరుదైన ఘనత..విజయవంతమైన లక్ష్య చేధనలో పది లేదా అంతకంటే ఎక్కువ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా రబాడ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సౌతాఫ్రికా దిగ్గజం పెర్సీ షెర్వాల్ పేరిట ఉండేది. అతడు 1906లో జోహన్నెస్‌బర్గ్‌లో ఇంగ్లండ్‌పై పదో వికెట్‌కు బ్యాటింగ్‌కు వచ్చి ఆజేయంగా 22 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో 108 ఏళ్ల షెర్వాల్ రికార్డును రబాడ బ్రేక్ చేశాడు.చదవండి: IND vs AUS: బెయిల్స్ మార్చిన స్టార్క్.. ఇచ్చిపడేసిన యశస్వి జైశ్వాల్! వీడియో వైరల్ -
పాకిస్తాన్ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2023-25 ఫైనల్‌కు ఆర్హత సాధించింది.సెంచూరియన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది.ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో 11 మ్యాచ్‌లు ఆడిన ప్రోటీస్.. 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో మూడింట ఓటమి, ఒకటి డ్రా చేసుకుంది. పాయింట్ల పట్టికలో 66.670 విన్నింగ్ శాతంతో దక్షిణాఫ్రికా అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఇక మిగిలిన ఒక స్ధానం కోసం ఆస్ట్రేలియా, భారత్ జట్లు పోటీపడుతున్నాయి.రబాడ, జాన్సెన్ విరోచిత పోరాటం..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా శ్రమించింది. మార్కో జాన్సెన్, కగిసో రబడా విరోచిత పోరాటంతో తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించారు. స్వల్ప లక్ష్య చేధనలో సౌతాఫ్రికా కేవలం 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ 6 వికెట్లతో సఫారీలను దెబ్బకొట్టాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన జాన్సెన్(16), కగిసో రబాడ(31)లు అడ్డుగా నిలుచునున్నారు. అచితూచి ఆడుతూ లక్ష్యాన్ని చేధించారు. అంతకుముందు పాకిస్తాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది.బాబర్ ఆజం (85 బంతుల్లో 50; 9 ఫోర్లు), సౌద్ షకీల్ (113 బంతుల్లో 84; 10 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరు అర్ధసెంచరీలతో రాణించారు. అదేవిధంగా సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేయగా.. పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకే ఆలౌటైంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కేప్‌టౌన్ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs IND: మెల్బోర్న్ టెస్టు.. భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు బద్దలు! -
పాక్ బ్యాటర్లకు చుక్కలు.. అరంగేట్రంలోనే నిప్పులు చెరిగిన పేసర్
పాకిస్తాన్‌తో మొదటి టెస్టులో సౌతాఫ్రికా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డేన్ పాటర్స(Dane Paterson)న్‌తో కలిసి అరంగేట్ర పేసర్ కార్బిన్ బాష్(Corbin Bosch) పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరి దెబ్బకు పాక్ బ్యాటింగ్ఆర్డర్ కుదేలైంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 211 పరుగులకే ఆలౌట్ అయింది.కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికాకు వెళ్లిన పాకిస్తాన్.. పరిమిత ఓవర్ల సిరీస్‌లో మిశ్రమ ఫలితాలు అందుకుంది. టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు 0-2తో కోల్పోయినా.. వన్డే సిరీస్‌లో మాత్రం 3-0తో క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటింది.టాపార్డర్ కుదేలుఈ క్రమంలో సౌతాఫ్రికా- పాకిస్తాన్(South Africa vs Pakistan) మధ్య సెంచూరియన్‌లో గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు.. షాన్ మసూద్ బృందాన్ని బ్యాటింగ్ ఆహ్వానించింది.ఆది నుంచే సౌతాఫ్రికా పేసర్లు విజృంభించడంతో పాక్ టాపార్డర్ కకావికలమైంది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(14), వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(4)ను పెవిలియన్‌కు పంపి పాటర్సన్ శుభారంభం అందించాడు.రాణించిన కమ్రాన్ గులామ్మరో ఓపెనర్, కెప్టెన్ షాన్ మసూద్(17)ను అవుట్ చేసిన కార్బిన్ బోష్.. సౌద్ షకీల్(14), అమీర్ జమాల్(28), నసీం షా(0)లను కూడా వెనక్కి పంపించాడు. మరోవైపు.. టాపార్డర్‌లో రెండు కీలక వికెట్లు తీసిన డేన్ పాటర్సన్.. డేంజరస్‌గా మారుతున్న కమ్రాన్ గులామ్(54)కు కూడా చెక్ పెట్టాడు. అదే విధంగా.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్(27), సల్మాన్ ఆఘా(18) వికెట్లు కూడా కూల్చాడు. డేన్ పాటర్సన్పాటర్సన్ సరికొత్త చరిత్ర.. ఆల్‌టైమ్ రికార్డు సమంఈ క్రమంలో డేన్ పాటర్సన్ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికా తరఫున 35 వయస్సులో.. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. రెండుసార్లు ఈ ఘనత సాధించి.. రెగ్గీ స్వార్జ్(1910- 1912), గాఫ్ చబ్(1951)ల రికార్డును సమం చేశాడు.కార్బిన్ బాష్ అరుదైన ఘనతమరోవైపు.. అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో చెలరేగిన 30 ఏళ్ల కార్బిన్ బాష్ కూడా ఓ అరుదైన రికార్డు సాధించాడు. కెరీర్లో మొట్టమొదటి టెస్టులో తొలి బంతికే వికెట్ తీసిన ఐదో సౌతాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు. షాన్ మసూద్‌ను అవుట్ చేయడం ద్వారా ఈ ఫీట్ నమోదు చేశాడు. అంతకు ముందు.. హర్దూస్ విల్జోన్, డేన్ పెట్, బెర్ట్ వోగ్లర్, షెపో మోరేకీ సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించారు.పాక్ తొలి ఇన్నింగ్స్‌లో డేన్ పాటర్సన్ ఐదు వికెట్లు కూల్చగా.. కార్బిన్ బోష్ నాలుగు, మార్కో జాన్సెన్ ఒక వికెట్ పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో కమ్రాన్ గులామ్(54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్ -
చరిత్ర సృష్టించిన బాబర్.. ప్రపంచంలోనే మూడో ప్లేయర్‌గా..
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం(Babar Azam) పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేశాడు. ఈ క్రమంలో పాక్ అభిమానులు సైతం బాబర్ ఆట తీరుపై మండిపడుతున్నారు. పునరాగమనంలోనూ పాత కథే పునరావృతం చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విఫలమైనా.. ఓ అరుదైన రికార్డుఇలా ఓవైపు బాబర్‌పై విమర్శల వర్షం కురుస్తుండగా.. అతడి ఫ్యాన్స్ మాత్రం బాబర్‌కు మరెవరూ సాటిరారంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రొటిస్ జట్టుతో తొలి టెస్టు సందర్భంగా ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఓ అరుదైన రికార్డు సాధించడమే ఇందుకు కారణం.మూడు ఫార్మాట్లలోనూకాగా ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజం చేసిన నాలుగు పరుగుల కారణంగా.. టెస్టుల్లో అతడు నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా పాక్ తరఫున.. టెస్టు, వన్డే, టీ20.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.కోహ్లి, రోహిత్ తర్వాతఅంతేకాదు.. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగానూ బాబర్ ఆజం అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇప్పటి వరకు టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) మాత్రమే ఈ ఘనత సాధించారు.కాగా బాబర్ ఆజం ఇప్పటి వరకు 56 టెస్టుల్లో కలిపి 4001 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది శతకాలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా.. 123 వన్డేల్లో 19 సెంచరీలు, 34 ఫిఫ్టీల సాయంతో బాబర్ 5957 రన్స్ పూర్తి చేసుకున్నాడు. కష్టాల్లో పాక్ జట్టుఅంతేకాదు.. 128 అంతర్జాతీయ టీ20లలో మూడు శతకాలు, 36 హాఫ్ సెంచరీ సాయంతో 4223 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సెంచూరియన్‌లో గురువారం మొదలైన తొలి టెస్టులో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. ప్రొటిస్ బౌలర్ల ధాటికి పాక్ టాపార్డర్ కుప్పకూలగా.. కమ్రాన్ గులామ్(54) అర్థ శతకంతో ఆదుకున్నాడు. ఇక మహ్మద్ రిజ్వాన్(27), అమీర్ జమాల్(28) మాత్రమే ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా వాళ్లంతా చేతులెత్తుశారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 195 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది షాన్ మసూద్ బృందం. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో తొలి మ్యాచ్ తర్వాత బాబర్ ఆజంపై వేటు పడగా.. మళ్లీ సౌతాఫ్రికా గడ్డపై అతడు టెస్టుల్లో పునరాగమనం చేశాడు.చదవండి: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్ -
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. తుది జట్టును ప్రకటించిన పాకిస్తాన్
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు అదే జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు సెంచూరియన్ వేదికగా గురువారం నుంచి మొదలు కానుంది.ఈ క్రమంలో బాక్సింగ్ డే టెస్టు(క్రిస్ట్మస్ తర్వాతి రోజు జరిగే మ్యాచ్) కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ తుది జట్టును ప్రకటించింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. అక్టోబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో బాబర్ చివరిసారిగా పాక్ తరపున ఆడాడు.ఆ తర్వాత సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు పీసీబీ బాబర్‌ను పక్కన పెట్టింది. ఇప్పుడు మరోసారి అతడికి పాక్ క్రికెట్ బోర్డు అవకాశమిచ్చింది. మరోవైపు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ డకౌట్లు నమోదు చేసిన అబ్దుల్లా షఫీక్‌పై పీసీబీ వేటు వేసింది.అతడి స్దానంలోనే బాబర్‌కు చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో నలుగురు పేసర్లతో పాక్ బరిలోకి దిగుతోంది. కాగా ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భాగంగా జరుగుతోంది.తుది జట్లుపాకిస్థాన్: షాన్ మసూద్ (కెప్టెన్), సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ముహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, సల్మాన్ అలీ అఘా, అమీర్ జమాల్, నసీమ్ షా, ఖుర్రం షాజాద్, ముహమ్మద్ అబ్బాస్.దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రేన్నే (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడా, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు -
పాక్‌తో తొలి టెస్టు.. తుది జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
స్వదేశంలో పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన సౌతాఫ్రికా(South Africa).. ఇప్పుడు అదే జట్టుతో టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది.ఈ క్రమంలో మొదటి టెస్టు కోసం తమ తుది జట్టుకు సౌతాఫ్రికా క్రికెట్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌తో ఐడెన్ మార్క్రామ్ బెస్ట్ ఫ్రెండ్ కార్బిన్ బాష్ దక్షిణాఫ్రికా తరపున టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టనున్నాడు. బాష్ ఇటీవలే పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ జట్టుకు టెంబా బావుమా సారథ్యం వహించనున్నాడు.కాగా దక్షిణాఫ్రికాకు ఈ సిరీస్ చాలా కీలకం. ప్రోటీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు. సౌతాఫ్రికా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాతి స్ధానాల్లో ఆస్ట్రేలియా, భారత్ ఉన్నాయి.తొలి టెస్టుకు దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్: ఐడెన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), కార్బిన్ బాష్, మార్కో జాన్సెన్, కగిసో రబడా, డేన్ ప్యాటర్సన్.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే? -
చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 36 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో పాక్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.94 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత ఓవర్లలో పాకిస్తాన్ 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో 271 పరుగులకు ప్రోటీస్ ఆలౌటైంది.కాగా ఈ సిరీస్‌లో అయూబ్‌కు రెండో సెంచరీ కావడం గమనార్హం. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కూడా అయూబ్ సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలో అయూబ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన అయూబ్..వన్డే క్రికెట్లో దక్షిణాఫ్రికాపై రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కుడిగా అయూబ్ రికార్డులెక్కాడు. 22 సంవత్సరాల, 207 రోజుల వయస్సులో అయూబ్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనతను సాధించలేకపోయారు. కాగా వన్డేల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన అతి వయష్కుడి రికార్డు మాత్రం అయూబ్ సహచరుడు అబ్దుల్లా షఫీక్ పేరిట ఉంది. 22 ఏళ్ల 4 రోజుల వయస్సులో షఫీక్ ఈ ఘనత సాధించాడు.వన్డేల్లో సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన పిన్న వయస్కులు వీరేవన్డేల్లో సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన పిన్న వయస్కులు వీరేఅబ్దుల్లా షఫీక్(పాకిస్తాన్)- 22 ఏళ్ల, 4 రోజుకేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 22 ఏళ్ల, 167 రోజులుసైమ్ అయూబ్ 22 ఏళ్ల, 207 రోజులుసైమ్ అయూబ్ 22 ఏళ్ల, 212 రోజులు రహ్మానుల్లా గుర్బాజ్ 22 ఏళ్ల 297 రోజులుచదవండి: IND vs AUS: ఆసీస్‌తో నాలుగో టెస్టు.. ముంబై యువ సంచలనానికి పిలుపు!? -
పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత
సౌతాఫ్రికా గడ్డపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య ప్రొటిస్ జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా.. సౌతాఫ్రికా 2-0తో నెగ్గింది. అనంతరం జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో జయభేరి మోగించిన పాకిస్తాన్.. తాజాగా మూడో వన్డేలోనూ విజయం సాధించింది. జొహన్నస్‌బర్గ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది.సయీమ్ అయూబ్ శతకంఇక వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ బృందం తొమ్మిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఓపెనర్ సయీమ్ అయూబ్(94 బంతుల్లో 101) శతకంతో చెలరేగగా.. బాబర్ ఆజం(52), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(53) హాఫ్ సెంచరీలు సాధించారు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(48), తయ్యబ్ తాహిర్(28) రాణించారు. టాపార్డర్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్(0)తో పాటు లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైంది. ప్రొటిస్ బౌలర్లలో కగిసో రబడ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, క్వెనా మఫాకా, కార్బిన్ బాష్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. క్లాసెన్ ఒక్కడేఅయితే, లక్ష్య ఛేదనలో మాత్రం సౌతాఫ్రికా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. ఓపెనర్లలో టోనీ డి జోర్జి(26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ తెంబా బవుమా 8 పరుగులకే నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాసీ వాన్ డెర్ డసెన్ 35 రన్స్‌తో రాణించగా.. మిడిలార్డర్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్(19) నిరాశపరిచాడు.ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రొటిస్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కేవలం 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 81 పరుగులు సాధించాడు. అయితే, షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో తయ్యబ్ తాహిర్‌కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ పెవిలియన్ చేరడంతో ప్రొటిస్ జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.36 పరుగుల తేడాతో పాక్ గెలుపుమార్కో జాన్సెన్(26), కార్బిన్ బాష్(40 నాటౌట్) కాసేపు పోరాడగా.. జార్న్ ఫార్చూన్(8), కగిసో రబడ(14), మఫాకా(0) విఫలమయ్యారు. ఫలితంగా 42 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికాపై.. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. పాక్ బౌలర్లలో సూఫియాన్ ముకీం నాలుగు వికెట్లు కూల్చగా.. షాహిన్ ఆఫ్రిది, నసీం షా చెరో రెండు.. మహ్మద్ హొస్నేన్, సయీమ్ ఆయుబ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.సౌతాఫ్రికాలో సౌతాఫ్రికాను వన్డేల్లో వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగాకాగా 1991లో అధికారికంగా తొలిసారి వన్డే సిరీస్ ఆడిన సౌతాఫ్రికా.. స్వదేశంలో క్లీన్‌స్వీప్ కావడం ఇదే మొదటిసారి. తద్వారా ప్రొటిస్ గడ్డపై సౌతాఫ్రికాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా పాకిస్తాన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇంతవరకు ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన ఫీట్ నమోదు చేసింది.అంతేకాదు.. సౌతాఫ్రికాపై పాకిస్తాన్‌కు ఇది మూడో ద్వైపాక్షిక సిరీస్ విజయం. ఈ ఘనత సాధించిన తొలి జట్టు కూడా పాకిస్తాన్ కావడం విశేషం. ఇక మూడో వన్డేలో సెంచరీ చేసిన సయీమ్ ఆయుబ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా అందుకున్నాడు.చదవండి: VHT 2024: అయ్యర్ సెంచరీ వృథా.. 383 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేసిన కర్ణాటక -
పాకిస్తాన్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ
పాకిస్తాన్‌తో మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పర్యాటక జట్టుకు సిరీస్ సమర్పించుకున్న ప్రొటిస్.. కీలక పేసర్ సేవలను కోల్పోనుంది. ఫాస్ట్ బౌలర్ ఒట్నీల్ బార్ట్‌మన్ గాయం కారణంగా పాక్‌తో మూడో వన్డేకు దూరం కానున్నాడు.వన్డే సిరీస్‌లో విఫలంకాగా సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌ను 2-0తో చిత్తు చేసిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. తొలి వన్డేలో మూడు వికెట్లు, రెండో వన్డేలో 81 పరుగుల తేడాతో పాక్ చేతిలో ఓటమి పాలైంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది.ఇక జొహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని తెంబా బవుమా బృందం పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు ప్రొటిస్ జట్టుకు షాక్ తగిలింది. పేసర్ ఒట్నీల్ బార్ట్‌మన్ గాయం బారినపడ్డాడు. దీంతో అతడు మూడో వన్డేకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.మోకాలి నొప్పి వల్లరెండో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే బార్ట్మన్కు మోకాలి నొప్పి వచ్చింది. దీంతో ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, ఇప్పటికీ అతడు ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. కాగా టీ20 సిరీస్‌లో మూడు వికెట్లు తీసిన బార్ట్‌మన్.. తొలి వన్డేలోనూ రాణించాడు. ఏడు ఓవర్లపాటు బౌలింగ్ చేసిన ఈ 31 ఏళ్ల రైటార్మ్ పేసర్.. 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.ఆల్‌రౌండర్‌కు పిలుపుఇక పాకిస్తాన్ చేతిలో వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకునేందుకు సౌతాఫ్రికా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బార్ట్‌మన్ స్థానంలో ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్‌ను వన్డే జట్టులో చేర్చింది. కాగా బార్ట్‌మన్ కంటే ముందే స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కూడా గాయం వల్ల సిరీస్‌కు దూరమయ్యాడు.పాకిస్తాన్‌దే వన్డే సిరీస్కేప్టౌన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాకిస్తాన్ జట్టు... దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 81 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తద్వారా 2–0తో సిరీస్ చేజిక్కించుకుంది. పాకిస్తాన్ జట్టుకు విదేశాల్లో ఇది వరుసగా రెండో సిరీస్ విజయం కావడం విశేషం.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (82 బంతుల్లో 80; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మాజీ కెపె్టన్ బాబర్ ఆజమ్ (95 బంతుల్లో 73; 7 ఫోర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... కమ్రాన్ గులామ్ (32 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ ఎడాపెడా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి దూకుడుతో పాకిస్తాన్ చివరి 10 ఓవర్లలో 105 పరుగులు రాబట్టింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎమ్పాకా 4, యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (74 బంతుల్లో 97; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకోగా... తక్కినవాళ్లు ఆకట్టుకోలేకపోయారు.కెప్టెన్ తెంబా బవుమా (12), టోనీ (34), డసెన్ (23), మార్క్రమ్ (21), మిల్లర్ (29) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 4, నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టారు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టిన కమ్రాన్ గులామ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
'నోరు మూసుకొని వెళ్లి ఆడు'.. రిజ్వాన్ ఓవరాక్షన్! వీడియో వైరల్
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 81 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో పాక్ కైవసం చేసుకుంది.అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది.అసలేం ఏమి జరిగిందంటే?దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 26 ఓవర్ వేసిన పాక్ పేసర్ హారీస్ రవూఫ్ ఆఖరి బంతిని క్లాసెన్‌కు బౌన్సర్‌గా సంధించాడు. ఆ బంతిని క్లాసెన్ ఆడటంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో క్లాసెన్‌ను రవూఫ్ ఏదో అన్నాడు. అందుకు ప్రోటీస్ వికెట్ కీపర్ బ్యాటర్ సైతం గట్టిగా బదులిచ్చాడు. దీంతో అంపైర్లు జోక్యం చేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మహ్మద్ రిజ్వాన్ అనవసరంగా జోక్యం చేసుకుని క్లాసెన్ వైపు వేలు చూపిస్తూ ముందు వెళ్లి సైలెంట్‌గా ఆడు అన్నట్లు సైగ చేశాడు.దీంతో చిర్రెత్తిపోయిన క్లాసెన్ సైతం తన నోటికి పని చెప్పాడు. క్లాసన్ సైతం రిజ్వాన్ పై మాటలతో మండిపడ్డాడు. ఈ క్రమంలో అంపైర్లు వచ్చి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.క్లాసెన్‌కు ఫైన్..కాగా ఈ మ్యాచ్‌లో క్లాసెన్ ఒంటరి పోరాటం చేశాడు. 97 పరుగులు చేసిన క్లాసెన్ ఆఖరి వికెట్‌గా వెనుదిరగాడు. దీంతో ఔటైన కోపంలో క్లాసెన్ తన కాలితో స్టంప్స్‌ను పడగొట్టాడు. ఈ విషయాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు మేరకు క్లాసెన్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. Fight on the field between Mohammad Rizwan and Heinrich Klaasen.💀😭 pic.twitter.com/XRb4yjYCl4— MEER YASIR🇵🇸 (@MY_EDITS_56) December 19, 2024 -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
వన్డే క్రికెట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. గత నెలలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న పాకిస్తాన్.. ఇప్పుడు సౌతాఫ్రికా గడ్డపై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. గురువారం కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై 81 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది.తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో రిజ్వాన్ సేన సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఓ వరల్డ్ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. 21వ శతాబ్దంలో సౌతాఫ్రికా గడ్డపై వరుసగా మూడు వన్డేల సిరీస్‌ను గెలుచుకున్న తొలి జట్టుగా పాక్ చరిత్ర సృష్టించింది.దక్షిణాఫ్రికాలో పాక్‌కు ఇది వరుసగా మూడో వన్డే సిరీస్ విజయం. ఇంతకుముందు 2013, 2021లో పాక్ వన్డే సిరీస్‌లను పాక్ సొంతం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన మెన్ ఇన్ గ్రీన్.. మరో వన్డే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.ఓవరాల్‌గా 7 సార్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన పాక్ జట్టు.. మూడు సార్లు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. పాక్ తర్వాత ఆస్ట్రేలియా 10 పర్యటనల్లో మూడు సార్లు సఫారీ గడ్డపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. కానీ ఆసీస్ మాత్రం వరుసగా సిరీస్ విజయాలు సాధించలేకపోయింది. ఇకు ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే డిసెంబర్ 22న జోహాన్స్‌బర్గ్ వేదికగా జరగనుంది.చదవండి: జాకెర్ అలీ మెరుపు ఇన్నింగ్స్.. వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ -
SA vs Pak: పాక్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సౌతాఫ్రికా చిత్తు
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. సమిష్టిగా రాణించి 81 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా టీ20, వన్డే, టెస్టులు ఆడేందుకు పాక్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య సౌతాఫ్రికా 2-0తో సిరీస్ గెలుచుకుంది. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం పాకిస్తాన్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. పర్ల్ వేదికగా మంగళవారం నాటి తొలి వన్డేలో మూడు వికెట్ల తేడాతో గెలిచిన రిజ్వాన్ బృందం.. కేప్‌టౌన్ మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది.ఓపెనర్లు విఫలంన్యూలాండ్స్ మైదానంలో గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫీక్ అబ్దుల్లా డకౌట్ కాగా.. మరో ఓపెనర్ సయీమ్ అయూబ్ 25 పరుగులకే వెనుదిరిగాడు.కమ్రాన్ గులామ్ మెరుపు అర్ధ శతకంఅయితే, వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(95 బంతుల్లో 73) మెరుగ్గా రాణించగా.. రిజ్వాన్ కెప్టెన్ ఇన్నింగ్స్(82 బంతుల్లో 80)తో మెరిశాడు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(33) ఫర్వాలేదనిపించగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కమ్రాన్ గులామ్(32 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 329 పరుగులు చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది.ప్రొటిస్ జట్టు బౌలర్లలో యువ పేసర్ క్వెనా మఫాకా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ మూడు, బిజోర్న్ ఫార్చూన్, పెహ్లూక్వాయో తలా ఒక వికెట్ తీశారు. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్లు కెప్టెన్ తెంబా బవుమా(12), టోనీ డి జోర్జీ(34), వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(23) విఫలమయ్యారు.హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ ఇన్నింగ్స్‌ఇక మిడిలార్డర్లో ఐడెన్ మార్క్రమ్(21) నిరాశపరచగా.. హెన్రిచ్ క్లాసెన్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. 74 బంతుల్లో అతడు 8 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 97 పరుగులు సాధించి.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక డేవిడ్ మిల్లర్(29) కాసేపు పోరాడే ప్రయత్నం చేయగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించలేదు.సిరీస్ పాక్ కైవసంఈ క్రమంలో 43.1 ఓవర్లకే సౌతాఫ్రికా కథ ముగిసిపోయింది. ఆతిథ్య ప్రొటిస్‌ను 248 పరుగులకే పరిమితం చేసిన పాకిస్తాన్.. 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది నాలుగు, నసీం షా మూడు, అబ్రార్ అహ్మద్ రెండు, సల్మాన్ ఆఘా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జొహన్నస్‌బర్గ్‌లో జరుగుతుంది.చదవండి: IND W Vs WI W: విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం -
సౌతాఫ్రికాతో రెండో వన్డే.. ధోని రికార్డుపై కన్నేసిన బాబర్ ఆజమ్
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 19) రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్‌కు శుభారంభం లభించింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీనికి ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మూడో టీ20 వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. పాక్ క్రికెట్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది.ధోని రికార్డుపై కన్నేసిన బాబర్ ఆజమ్గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోని పేరిట ఉన్న ఓ లాంగ్ స్టాండింగ్ బ్యాటింగ్ రికార్డుపై కన్నేశాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో బాబర్ అన్ని ఫార్మాట్లలో కలిపి ఏడు సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 4732 పరుగులు చేశాడు. మరోవైపు ధోని SENA దేశాల్లో 38 హాఫ్ సెంచరీ సాయంతో 5273 పరుగులు చేశాడు. SENA దేశాల్లో ధోని, బాబర్ ప్రస్తుతం 38 యాభై ప్లస్ స్కోర్లు కలిగి ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగే రెండో వన్డేలో బాబర్ మరో హాఫ్ సెంచరీ చేస్తే.. SENA దేశాల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనిని అధిగమిస్తాడు.తొలి వన్డేలో పాక్ ఘన విజయంతొలి వన్డేలో అఘా సల్మాన్ ఆల్‌రౌండర్ షో, సైమ్ అయూబ్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో సౌతాఫ్రికాపై పాక్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డేలో బాబర్ ఆజమ్ 23 పరుగులు చేసి ఓట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో బాబర్‌కు శుభారంభం లభించినా భారీ స్కోర్ చేయలేకపోయాడు. బాబర్ గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా దారుణంగా విఫలమవుతున్నాడు. అతను హాఫ్ సెంచరీ మార్కు తాకి కూడా చాన్నాళ్లవుతుంది. -
పాక్‌తో టెస్టులు: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌కు అడుగుదూరంలో ఉంది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి.. టైటిల్ పోరుకు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకునేందుకు కూడా ప్రొటిస్ బోర్డు వెనుకాడటం లేదు.గాయం బారినపడ్డ కేశవ్ మహరాజ్, వియాన్ ముల్దర్లను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేయడం ఇందుకు నిదర్శనం. కాగా పాకిస్తాన్‌తో డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికా టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రొటిస్ బోర్డు బుధవారం తమ జట్టును ప్రకటించింది.తొలి పిలుపుపదహారు మంది సభ్యులున్న ఈ టీమ్‌లో అన్క్యాప్డ్ ప్లేయర్‌కు చోటిచ్చింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కార్బిన్ బాష్‌కు తొలిసారి పిలుపునిచ్చింది. అదే విధంగా.. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ కేశవ్ మహరాజ్, వేలి నొప్పి నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్‌ను కూడా ఈ జట్టులో చేర్చింది.కాగా తొలి వన్డే సందర్భంగా గాయపడ్డ కేశవ్ మహరాజ్ కోలుకోని పక్షంలో.. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సెనూరన్ ముత్తుస్వామిని జట్టుకు ఎంపిక చేయనున్నారు. అదే విధంగా సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ముల్దర్ ఫిట్నెస్ సాధిస్తే.. బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కు ఉద్వాసన పలుకనున్నారు.క్వెనా మఫాకా కూడాఇక తెంబా సారథ్యంలో పాక్‌తో టెస్టులు ఆడనున్న సౌతాఫ్రికా జట్టులో స్థానం సంపాదించిన బాష్.. ఇప్పటి వరకు 34 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 40.46 సగటుతో పరుగులు రాబట్టడంతో పాటు.. 72 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. మరో పేసర్, పద్దెమినిదేళ్ల క్వెనా మఫాకా కూడా తొలిసారి టెస్టు జట్టులోకి వచ్చాడు.అయితే, పేస్ సూపర్స్టార్లు లుంగి ఎంగిడి, గెరాల్డ్ కొయెట్జిలతో పాటు నండ్రీ బర్గర్, లిజాడ్ విలియమ్స్ తదితరులు సెలక్షన్‌కు అందుబాటులో లేరు. మరోవైపు.. కగిసో రబడ, మార్కో జాన్సెన్ పాక్‌తో తొలి వన్డే ఆడినా.. ఆ తర్వాత నుంచి విశ్రాంతి తీసుకోనున్నారు. టెస్టుల నేపథ్యంలో బోర్డు వారికి రెస్ట్ ఇచ్చింది. కాగా పాక్‌తో ఒక్క టెస్టులో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో సౌతాఫ్రికా ముందు వరుసలో ఉంటుంది. ఇక పాక్‌తో సౌతాఫ్రికా టెస్టులకు సెంచూరియన్, కేప్‌టౌన్ వేదికలు. పాకిస్తాన్‌తో టెస్టులకు సౌతాఫ్రికా జట్టుతెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనురన్ ముత్తుస్వామి, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెయిన్ (వికెట్ కీపర్).చదవండి: WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుందా? -
సల్మాన్ ఆల్‌రౌండ్ షో.. సౌతాఫ్రికాపై పాక్ విజయం
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ విజయంతో ఆరంభించింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు మాత్రమే చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(97 బంతుల్లో 86 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్రమ్(35), రికెల్టన్(36), టోనీ డీజోర్జీ(33) రాణించారు. పాక్ బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ సల్మాన్ ఆఘా 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ ఆర్బర్ ఆహ్మద్ రెండు, షాహీన్ అఫ్రిది, సైమ్ అయూబ్ తలా వికెట్ సాధించారు.అయూబ్ సూపర్ సెంచరీ..ఇక 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 119 బంతులు ఎదుర్కొన్న అయూబ్.. 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు.మరోవైపు బంతితో మాయ చేసిన సల్మాన్ అలీ అఘా బ్యాట్‌తో కూడా సత్తాచాటాడు. 90 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. సఫారీ బౌలర్లలో కగిసో రబడ, బార్టమన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమ్సీ, జానెసన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 19న కేప్‌టౌన్ వేదికగా జరగనుంది. -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
టీ20 క్రికెట్ పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా పదకొండు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను అధిగమించి.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.పాక్‌కు చేదు అనుభవంసౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లింది. ఈ పర్యటన టీ20 సిరీస్‌తో మొదలుకగా.. పాక్‌కు చేదు అనుభవం ఎదురైంది.డర్బన్‌లో జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ప్రొటీస్ జట్టు చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్.. సెంచూరియన్‌లో శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. సౌతాఫ్రికా చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది పాక్.సయీమ్ ఆయుబ్ ధనాధన్ ఇన్నింగ్స్ వృథాఓపెనర్ సయీమ్ ఆయుబ్(57 బంతుల్లో 98 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌కు తోడు.. బాబర్ ఆజం(20 బంతుల్లో 31), ఇర్ఫాన్ ఖాన్(16 బంతుల్లో 30) రాణించడంతో భారీ స్కోరు సాధించింది. అయితే, సౌతాఫ్రికా బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ సూపర్ సెంచరీ(63 బంతుల్లో 117), రాసీ వాన్ డెర్ డసెన్(38 బంతుల్లో 66) అద్భుత అర్ధ శతకం కారణంగా పాక్‌కు ఓటమి తప్పలేదు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఘనంగా(31, 3 ఫోర్లు, ఒక సిక్సర్)నే ఇన్నింగ్స్‌ను ఆరంభించినా.. దానిని భారీ స్కోరుగా మలుచుకోలేకపోయాడు. అయినప్పటికీ పొట్టి ఫార్మాట్లో అతడు అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.గేల్ ప్రపంచ రికార్డును బద్దలుసౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం షార్టెస్ట్ క్రికెట్లో ఓవరాల్‌గా 11,020 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గేల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. పదకొండు వేల పరుగుల మార్కును అందుకోవడానికి గేల్‌కు 314 ఇన్నింగ్స్ అవసరమైతే.. బాబర్ 298 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. అయితే, ఓవరాల్‌గా మాత్రం అంతర్జాతీయ, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో గేల్ యూనివర్సల్ బాస్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 14562 టీ20 రన్స్ ఉన్నాయి.టీ20 క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్‌లో 11000 పరుగులు సాధించిన ఆటగాళ్లు1. బాబర్ ఆజం- 298 ఇన్నింగ్స్2. క్రిస్ గేల్- 314 ఇన్నింగ్స్3. డేవిడ్ వార్నర్- 330 ఇన్నింగ్స్4. విరాట్ కోహ్లి- 337 ఇన్నింగ్స్.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
SA Vs PAK: రీజా హెండ్రిక్స్ విధ్వంసకర సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
పాకిస్తాన్‌తో రెండో టీ20లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాక్‌తో టీ20 సిరీస్‌ను 2-0తో ప్రొటీస్ జట్టు కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.సయీమ్ ఆయుబ్ అద్భుత ఇన్నింగ్స్.. సెంచరీ మిస్ఇందులో భాగంగా డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా పదకొండు పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికగా రెండో టీ20లో ఇరుజట్లు శుక్రవారం రాత్రి తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(11) విఫలం కాగా.. సయీమ్ ఆయుబ్ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.మొత్తంగా యాభై ఏడు బంతులు ఎదుర్కొన్న ఆయుబ్ పదకొండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 98 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(20 బంతుల్లో 31), ఆరో స్థానంలో వచ్చిన ఇర్ఫాన్ ఖాన్(16 బంతుల్లో 30) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఒట్నీల్ బార్ట్‌మన్, డయాన్ గాలియెమ్ రెండేసి వికెట్లు తీయగా.. జార్జ్ లిండే ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక పాక్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.రీజా హెండ్రిక్స్ విధ్వంసం.. ‘తొలి’ శతకంపాక్ యువ పేసర్ జహన్‌బాద్ ఖాన్ ఓపెనర్ రియాన్ రికెల్టన్ను రెండు పరుగుల వద్దే పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్(12)ను కూడా తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. అయితే, మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ విధ్వంసం ముందు పాక్ బౌలర్లు తలవంచకతప్పలేదు.రీజా 63 బంతుల్లోనే ఏడు ఫోర్లు, పది సిక్స్‌ల సాయంతో ఏకంగా 117 పరుగులు సాధించాడు. కాగా అంతర్జాతీయ టీ20లలో 35 ఏళ్ల రీజా హెండ్రిక్స్‌కు ఇదే తొలి శతకం కావడం విశేషం.సిరీస్ సౌతాఫ్రికా కైవసంఇక రీజాకు తోడుగా రాసీ వన్ డెర్ డసెన్ మెరుపు ఇన్నింగ్స్(38 బంతుల్లో 66)తో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రీజా విధ్వంసకర సెంచరీ, డసెన్ ధనాధన్ బ్యాటింగ్ కారణంగా సౌతాఫ్రికా 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించిన ప్రొటీస్.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక పాక్ బౌలర్లలో జహన్‌బాద్ ఖాన్‌కు రెండు, అబ్బాస్ ఆఫ్రిదికి ఒక వికెట్ దక్కాయి.ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు మూడో టీ20 శనివారం జరుగనుంది. జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
పాక్‌తో వన్డే సిరీస్.. సౌతాఫ్రికా విధ్వంసకర వీరుల రీఎంట్రీ
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు క్రికెట్ సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. తెంబా బవుమా సారథ్యంలోని ఈ జట్టులో క్వెనా మఫాకాకు తొలిసారి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఇక ఈ సిరీస్‌తో కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్ పునరాగమనం చేయనుండగా.. టీ20 వీరులు డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ సైతం తిరిగి వన్డే జట్టులో స్థానం సంపాదించారు.డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డిసెంబరు 10న తొలి టీ20 జరుగగా.. ఆతిథ్య జట్టు 11 పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. ఇక డిసెంబరు 13న రెండో, డిసెంబరు 14న మూడో టీ20 జరుగునుండగా.. డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.‘అన్క్యాప్డ్’ ప్లేయర్‌కు చోటుఈ నేపథ్యంలో సౌతాఫ్రికా గురువారం తమ వన్డే జట్టును ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌తో పద్దెమినిదేళ్ల లెఫ్టార్మ్ పేసర్ క్వెనా మఫాకా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన క్వెనా మఫాకా.. పాక్‌తో తొలి టీ20లో అదరగొట్టాడు. తన అద్భుత బౌలింగ్‌తో బాబర్ ఆజంను అవుట్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు.గాయాల బెడదమరోవైపు.. స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే కాలి గాయం కారణంగా.. మిగిలిన రెండు టీ20లు, వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక వేలు విరిగిన కారణంగా వియాన్ ముల్దర్, తుంటినొప్పి వల్ల లుంగి ఎంగిడి, గజ్జల్లో గాయం కారణంగా గెరాల్డ్ కోయెట్జి, వెన్నునొప్పితో బాధపడుతున్న నండ్రీ బర్గర్ సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయారు.వారికి పునఃస్వాగతంఇదిలా ఉంటే.. పాక్‌తో టీ20 సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న రబడ, స్టబ్స్, కేశవ్ మహరాజ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. తాము తమ వన్డే జట్టు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తెలిపాడు. క్వెనా మఫాకాకు కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని.. క్లాసెన్, మిల్లర్లకు వన్డే జట్టులోకి తిరిగి స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నాడు.పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా క్రికెట్ జట్టుతెంబా బవుమా (కెప్టెన్), ఒట్ట్నీల్ బార్ట్‌మన్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.సౌతాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ వన్డే సిరీస్ షెడ్యూల్తొలి వన్డే- డిసెంబరు 17- పర్ల్- బోలాండ్ పార్క్రెండో వన్డే- డిసెంబరు 19- సెంచూరియన్- సూపర్‌స్పోర్ట్ పార్క్మూడో వన్డే- డిసెంబరు 22- జొహన్నస్‌బర్గ్- ది వాండరర్స్ స్టేడియం.చదవండి: భారత్‌తో మూడో టెస్టు... ఆసీస్ స్టార్ క్రికెటర్‌పై వేటు! -
షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు..
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో పాకిస్తాన్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడినప్పటకి ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్ పీటర్‌ను ఔట్ చేయడంతో అఫ్రిది వందో టీ20 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను ఈ పాకిస్తానీ స్పీడ్ స్టార్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆల్ ఫార్మాట్లలో 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన నాలుగో ప్లేయర్‌గా అఫ్రిది రికార్డులకెక్కాడు. అఫ్రిది ఇప్పటివరకు టెస్టుల్లో 116 వికెట్లు పడగొట్టగా.. వన్డేల్లో 112, టీ20ల్లో 100 వికెట్లు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ అగ్రస్ధానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తానీ కూడా అఫ్రిదినే కావడం గమనార్హం.👉మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్లు వీరేబౌలర్టెస్టు వికెట్లువన్డే వికెట్లుటీ20 వికెట్లుటిమ్ సౌథీ(న్యూజిలాండ్)389221164షకీబ్ అల్హసన్(బంగ్లాదేశ్)246317149లసిత్ మలింగ(శ్రీలంక)101338107షాహీన్ అఫ్రిది(పాక్)116112100 -
సౌతాఫ్రికా టూర్‌కు పాక్ జట్టు ప్రకటన: బాబర్ రీ ఎంట్రీ! అతడికి నో ఛాన్స్
సౌతాఫ్రికా పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ మూడు టీమ్‌లలోనూ చోటు దక్కించుకోగా.. టెస్టు జట్టులో ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిది పేరు మాత్రం లేదు.కాగా మూడు వన్డే, మూడు టీ20, రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. డిసెంబరు 10న తొలి టీ20తో ఈ టూర్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పీసీబీ బుధవారం ఈ సిరీస్‌లకు సంబంధించి మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది.టెస్టులలో బాబర్ పునరాగమనం.. అతడికి మాత్రం చోటు లేదుటెస్టులకు షాన్ మసూద్ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు మహ్మద్ రిజ్వాన్ సారథ్యం వహించనున్నాడు. ఇక మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మూడు జట్లలో స్థానం సంపాదించాడు. కాగా ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై తొలి టెస్టులో విఫలమైన తర్వాత.. మిగిలిన రెండు టెస్టులు ఆడకుండా బాబర్‌పై వేటు పడింది. అతడితో పాటు షాహిన్నూ తప్పించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. యువ పేసర్ నసీం షా కేవలం టెస్టు, వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. మరోవైపు.. షాహిన్ ఆఫ్రిది టీ20, వన్డేలు మాత్రమే ఆడి.. టెస్టులకు దూరంగా ఉండనున్నాడు.తప్పించారా? రెస్ట్ ఇచ్చారా?వచ్చే ఏడాది సొంతగడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో షాహిన్‌కు పీసీబీ ఈ మేర పనిభారం తగ్గించి.. విశ్రాంతినివ్వాలని నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల క్వైద్-ఇ-ఆజం ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లలో 31 వికెట్లతో సత్తా చాటిన రైటార్మ్ సీమర్ మహ్మద్ అబ్బాస్ దాదాపు మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు.తొలిసారి వన్డే జట్టుకు సూఫియాన్ ఎంపికఅదే విధంగా.. ఖుర్రం షెహజాద్, మీర్ హంజా కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. షాజిద్ ఖాన్ మాత్రం మిస్సయ్యాడు. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆప్షన్‌గా నొమన్ అలీ జట్టులోకి వచ్చాడు. ఇక లెగ్ స్పిన్నర్ సూఫియాన్ మోకీం తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య డిసెంబరు 10, 13, 14 తేదీల్లో టీ20... డిసెంబరు 17, 19, 22 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. అదే విధంగా.. డిసెంబరు 26 నుంచి జనవరి 7 వరకు టెస్టు సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది.సౌతాఫ్రికాతో టెస్టులకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, నొమన్ అలీ, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా.సౌతాఫ్రికాతో వన్డేలకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సుఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).సౌతాఫ్రికాతో టీ20లకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సూఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి