కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘోర ఓటమి చవిచూసింది. పాకిస్తాన్ నిర్ధేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా 7.1 ఓవర్లలో ఛేదించింది.
దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 194 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్.. ఫాలో ఆన్(రెండో ఇన్నింగ్స్)లో మాత్రం అద్బుతమైన పోరాటం కనబరిచింది.
421 పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడిన పాకిస్తాన్ 478 పరుగుల భారీ స్కోర్ సాధించింది. షాన్ మసూద్ (145) సెంచరీ చేయగా.. బాబర్ ఆజాం (81) హాఫ్ సెంచరీతో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోర్‌కే పరిమితం కావడంతో పాక్ జట్టు సఫారీల ముందు మెరుగైన టార్గెట్‌ను ఉంచలేకపోయింది.
దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 615 పరుగులు చేసింది. ప్రోటీస్ తొలి ఇన్నింగ్స్‌లో ర్యాన్ రికెల్టన్ (259) డబుల్ సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా (106), కైల్ వెర్రెన్న్ (100) శతకాలతో మెరిశారు. పాక్ బౌలర్లు అబ్బాస్, సల్మాన్ అఘా మూడేసి వికెట్లు పడగొట్టారు.
చరిత్ర సృష్టించిన పాక్..
కాగా ఫాలో ఆన్‌లో ధీటుగా ఆడిన పాకిస్తాన్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఫాల్ ఆన్‌లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. ఇంతకముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది.
1902లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడి 372/7 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో 122 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డును పాకిస్తాన్ బ్రేక్ చేసింది. ఆస్ట్రేలియా (372/7) తర్వాత వెస్టిండీస్ (348/10), న్యూజిలాండ్ (342/10), శ్రీలంక (342/10) జట్లు ఉన్నాయి.
చదవండి: Ind vs Eng: ఇంకెన్నాళ్లు ఇలా?.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లలోనైనా ఆడిస్తారా?
Comments
Please login to add a commentAdd a comment