రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే? | Jagadeka Veerudu Athiloka sundari Re Release Box Office Collections | Sakshi
Sakshi News home page

రీరిలీజ్‌తో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన మెగాస్టార్‌.. ‘జగదేక వీరుడు..’ కలెక్షన్స్‌ ఎంతంటే?

May 10 2025 4:38 PM | Updated on May 10 2025 5:12 PM

Jagadeka Veerudu Athiloka sundari Re Release Box Office Collections

టాలీవుడ్‌లో రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోల పాత హిట్‌ చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ఆ సినిమాలకు వెళ్లడంతో కలెక్షన్స్‌ కూడా భారీగా వస్తున్నాయి. అందుకే ఈ మధ్య ఈ రీరిలీజులు ఎక్కువయ్యాయి. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’(Jagadeka Veerudu Athiloka sundari ) మళ్లీ థియేటర్‌లో విడుదలైంది. 

ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 9న  2D,3D ఫార్మాట్లలో రీరిలీజ్‌ చేశారు. దీనికోసం వైజయంతీ నిర్మాణ సంస్థ దాదాపు రూ. 8 కోట్లవరకు ఖర్చు చేశారు. ఇదంతా అభిమానుల కోసమేచేస్తున్నట్లుగా ప్రకటించారు. వారి అంచనాలకు తగ్గట్టే చిరంజీవి ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ఈ సినిమాను వీక్షించారు. దీంతో ఒక్క రోజులోనే దాదాపు రూ.1.75 కోట్లు వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్‌ వెల్లడించారు. వీకెండ్‌లో కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉంది. తమ అభిమాన హీరో సినిమా రీరిలీజ్‌కి ఈ స్థాయి కలెక్షన్స్‌ రావడం పట్ల మెగా ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా విషయానికొస్తే.. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం 1990 మే 9న రిలీజై సంచలనం సృష్టించింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్‌గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. 

ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిర్మాత సి. అశ్విని దత్ తన ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు.‘మాస్ట్రో’ ఇళయరాజా అయితే ఎవర్ గ్రీన్ సంగీతాన్ని, పాటల్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement