
శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పడింది. ఆయన నటించిన తాజా చిత్రం ‘#సింగిల్’ ఈ శుక్రవారం(మే 9) ప్రేక్షకుల ముందుకు వచ్చి.. హిట్ టాక్‌ని సంపాదించుకుంది. శ్రీవిష్ణు వన్‌లైన్ పంచ్‌లు, వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందంటూ సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ రావడంతో తొలిరోజు భారీ కలెక్షన్లనే రాబట్టింది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.4.15 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.
(చదవండి: #సింగిల్ మూవీ రివ్యూ)
బుక్‌మై షోలో 24 గంటల్లోనే 50.71 వేల టికెట్లు బుక్ అయ్యాయి. హిట్ టాక్ రావడంతో రెండో రోజు కూడా భారీగానే బుకింగ్స్ జరిగాయి. సినిమాకు వచ్చిన టాక్‌ని బట్టి చూస్తే..వీకెండ్‌లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో కొంతభాగం భారత సైనికులకు విరాళంగా ఇస్తామని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక సినిమా విషయానికొస్తే.. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో శ్రీవిష్ణుకి జోడీగా కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా, వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు.