Sree Vishnu
-
ఒంటరివాడను నేను!
ఒకరు కాదు... ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తారు అతన్ని. కానీ, ‘ఒంటరివాడను నేను... ఎవ్వరివాడను కాను...’ అనే పాట వింటుంటాడు. పైగా 35 ఏళ్ల వయసులో ఉన్న ఒక వ్యక్తి పెళ్లి కాకుండా మిగిలిపోవడానికి కారకుడు కూడా అవుతాడు. ఈ ఒంటరివాడు ఆ తర్వాత ఒక ఇంటివాడు అవుతాడా? పెళ్లి కాని 35 ఏళ్ల బ్రహ్మచారి కథ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ‘హ్యాష్‌ట్యాగ్ సింగిల్’ చిత్రం చూడాలి. ఒంటరివాడుగా హీరో శ్రీవిష్ణు(Sree Vishnu), 35 ఏళ్ల యువకుడిగా ‘వెన్నెల కిశోర్’ నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు దర్శకత్వంలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం టైటిల్ ప్రకటించి, శ్రీవిష్ణు లుక్, గ్లింప్స్ విడుదల చేశారు. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమేరా: ఆర్ వేల్రాజ్. -
ఓటీటీలోకి వచ్చేసిన డిఫరెంట్ తెలుగు మూవీ
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు వీలైనంత త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అలానే తెలుగు డిఫరెంట్ మూవీ ఒకటి ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. అదే 'స్వాగ్'. హీరో శ్రీ విష్ణు ఏకంగా ఇందులో నాలుగైదు పాత్రలు పోషించడం విశేషం. ఇంతకీ ఏంటీ ఈ మూవీ స్పెషాలిటీ?(ఇదీ చదవండి: టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ బెయిల్ రద్దు)తెలుగులో కాస్త డిఫరెంట్ మూవీస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. ఇతడు చేసిన 'రాజరాజచోర' మూవీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా తీసిన హసిత్ గోలి.. మరోసారి శ్రీ విష్ణుతో చేసిన ప్రయోగాత్మక చిత్రం 'స్వాగ్'. స్త్రీ, పురుషుల సమానత్వం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే విషయంలో కాస్త గందరగోళం వల్ల థియేటర్లలో ప్రేక్షకులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు.ఇప్పుడు ఈ సినిమా కాస్త సడన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఒకవేళ ఓపిక ఉండి, ఈ వీకెండ్ ఏదైనా డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే 'స్వాగ్' ప్రయత్నించండి. ఇందులో శ్రీ విష్ణు పోషించిన హిజ్రా తరహా క్యారెక్టర్ చాలా బాగుంటుంది.(ఇదీ చదవండి: హడలెత్తించిన నిఖిల్, పృథ్వీ.. కూతురి కోసం హరి కన్నీళ్లు!) -
శ్రీ విష్ణు ‘స్వాగ్’ మూవీ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
శ్రీ విష్ణు 'స్వాగ్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Swag Movie Review: ‘శ్వాగ్’ మూవీ రివ్యూ
టైటిల్: ‘శ్వాగ్’ నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులునిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్రచన-దర్శకత్వం: హసిత్ గోలిసంగీతం: వివేక్ సాగర్సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్ఎడిటర్: విప్లవ్ నైషధంవిడుదల తేది: అక్టోబర్ 04, 2024వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు హీరో శ్రీవిష్ణు. ఈ ఏడాది మార్చిలో ఓం భీమ్ బుష్ సినిమాతో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ‘శ్వాగ్’ అంటూ మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. 'రాజ రాజ చోర' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీవిష్ణువుతో డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కించిన రెండో చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 4)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? శ్రీవిష్ణువు ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. దివాకర్ పేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవనభూతి(శ్రీవిష్ణు) రిటైర్మెంట్ రోజు అతనికి ఒక లెటర్ వస్తుంది. అందులో తనది శ్వాగనిక వంశం అని.. వంశ వృక్ష నిలయంలో పూర్వికుల ఆస్తి ఉందని ఉంటుంది. ఎలాగైన ఆ ఆస్తినికి కొట్టేయాలని భవనభూతి అక్కడికి వెళ్తాడు. ఆ ఆస్తికి రక్షగా నిలుస్తున్న మరో వంశం వ్యక్తి(గోపరాజు రమణ).. పూర్వికుల ఇచ్చిన పలక తీసుకొని వస్తేనే ఆస్తి దక్కుతుందని చెబుతాడు. భవనభూతి దాని వెతుకుతుండగా..మరో యువతి అనుభూతి(రీతువర్మ) ఆ పలకతో వంశవృక్ష నిలయానికి వస్తుంది. శ్వాగనిక వంశం తనదే అంటే తనదే అంటూ ఇద్దరు గొడవపడుతుంటారు. మరోవైపు యూట్యూబర్ సింగ(శ్రీవిష్ణువు) కూడా స్వాగనిక వంశం వాడేనని తెలుస్తుంది. ఆయన కూడా ఆస్తికోసం వంశ వృక్ష నిలయానికి వస్తాడు. అసలు ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధ ఏంటి? వీరికి లేఖలు రాస్తున్నదెవరు? ఎందుకు రాశారు? 1550లో మాతృస్వామ్య పాలన సాగిస్తున్న వింజారమ వంశపు స్త్రీ (రితూ వర్మ) నుంచి స్వాగనిక వంశ మూలపురుషుడు భవభూతి(శ్రీవిష్ణు) అధికారాన్ని ఎలా దక్కించుకున్నాడు? మాతృస్వామ్య పాలనకు ముగింపు పలికి పితృస్వామ్య పాలన ఎప్పటికి కొనసాగించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పైన రాసిన కథ చదివితేనే కాస్త గందరగోళంగా అనిసిస్తుంది కదా?. మరి దాన్ని తెరపై అర్థమయ్యేలా చూపించడం చాలా కష్టమైన పని. ఈ విషయంలో డైరెక్టర్ హసిత్ గోలి కొంతమేర సక్సెస్ అయ్యాడు. విభిన్న టైమ్లైన్లలో సెట్ చేయబడిన కథ ఇది. ప్రారంభంలో కాస్త గందరగోళానికి గురైనా.. కాసేపటి తర్వాత అందరూ పాత్రలతో మూవ్ అవుతుంటారు. 1550ల నాటి కథకి ఇప్పటి వ్యక్తులకు ఉన్న సంబంధం ఏంటి అనేది బుర్రపెట్టి చూస్తే తప్ప అర్థం కాదు. అయితే ఉన్న కొద్ది సమయంలో దర్శకుడు అందరికి అర్థమయ్యేలా కథను చెప్పాలనుకున్నాడు. కానీ సాధారణ ప్రేక్షకుడికి మాత్రం అది కాస్త గందరగోళానికి గురిచేస్తుంది. పెద్ద కథ కాబట్టి అన్ని విడమర్చి చెప్పడానికి సమయం లేకపోవడంతో సింపుల్‌గా ఒక్కొ సీన్‌తో ముగించేశారు.1550 ల సమయంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగాళ్ల మధ్య ఆడవాళ్ళ ఆధిపత్య పోరు జరుగుతున్న సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. అప్పట్లో స్త్రీలే పరిపాలన చేసేవారని, మగవారు ముసుగు ధరించి ఇంట్లోనే ఉండేవారని చూపించారు. ఆ తర్వాత కథ ప్రస్తుతానికి చేరుతుంది. ఎస్సై భవనభూతి భార్య రేవతి(మీరా జాస్మిన్) ఎందుకు అతన్ని వదిలి వెళ్లిపోయింది అనేది ఆసక్తికరంగా చూపించారు. ఫస్టాఫ్‌లోనే అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసి.. ఆ పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కల్పించారు. అయితే మొదటి 30 నిమిషాలు మాత్రం కథనం రొటీన్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని రివీల్ చేస్తూనే ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న ఓ ప్రధానమైన సమస్యపై సీరియస్‌గా చర్చించారు. ముఖ్యంగా విభూతి(శ్రీవిష్ణువు) పాత్ర ఎంట్రీ తర్వాత కథనం మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. కామెడీతో మొదలైన సినిమా.. చివరకు ఎమోషనల్‌గా ముగుస్తుంది. అయితే ముందుగా చెప్పినట్లు కాస్త బుర్రపెట్టి చూస్తేనే ఈ సినిమా అర్థమవుతుంది. ఎవరెలా చేశారంటే.. కంటెంట్ కింగ్ అనే బిరుదుకు శ్రీవిష్ణువు మరోసారి న్యాయం చేశాడు. మంచి కథను ఎంచుకోవడమే కాకుండా తనదైన నటనతో ఆ కథకు పూర్తి న్యాయం చేశాడు. విభిన్నమైన ఐదు పాత్రల్లో నటిస్తూ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విభూతి పాత్ర అయితే సినిమాకే హైలెట్. ఆ పాత్రతో శ్రీవిష్ణు నటన అద్భుతం. ఈ పాత్ర గురించి ఎక్కువగా చెబితే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇక రీతూ వర్మ రెండు పాత్రల్లో కనిపించి.. తనదైన నటనతో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ తెరపై కనిపించేంది కాసేపే అయితే..ఉన్నంతలో బాగానే చేసింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. సునీల్, గోపరాజు రమణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -Rating: 2.75/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Swag Review: 'స్వాగ్' సినిమా ట్విటర్ రివ్యూ
తెలుగులో డిఫరెంట్ సినిమాలు చేసే హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. సహాయ నటుడిగా పేరు తెచ్చుకుని ప్రస్తుతం హీరోగా ఆకట్టుకుంటున్నాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'స్వాగ్'. 'రాజరాజ చోర' అనే సినిమాని తనతోనే తీసి హిట్ కొట్టిన హసిత్ గోలి దర్శకుడు. ప్రతి ఒక్కరు నాలుగేసి పాత్రల్లో నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్ ప్రియాంక మోహన్)టీజర్, ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమాకు ఇప్పుడు థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. సింగ క్యారెక్టర్ హిలేరియస్ అని, మిగిలిన మూడు పాత్రలు కూడా అదిరిపోయాయని అంటున్నారు. మూవీ చూసొచ్చిన వాళ్లు ఇంకా ఏమేం అంటున్నారనేది ట్విటర్ రివ్యూలో చూసేయండి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8.కొత్త పోకడ, మాజీ కంటెస్టెంట్లతో వర్కవుట్ అవుతుందా?)Showtime: #SWAG pic.twitter.com/Wo5v7bmgso— hikigaya (@Aravind_V3) October 3, 2024#SWAG REVIEW :#SreeVishnu Generates FUN With Multiple Characters especially #SINGA Character 💥💥💥💥Dir #Hasith Planned a Lot Of TWISTS 🤩🤩🤩🤩#RituVarma Plays a Very DIFFERENT Character 👍👍👍Overall a Very Good Fun ENTERTAINER 💯💯💯💯 pic.twitter.com/2BLAk66P5A— GetsCinema (@GetsCinema) October 3, 2024#SWAG : A wholesome film with high emotional drama with hilarious entertainment👌👏🏼#SreeVishnu and #HasithGoli bring another new age cinema to the screens offering a beautiful experience with first of its kind screenplay.Pure one man show from @sreevishnuoffl and… pic.twitter.com/SXjgZbbSlw— Let's X OTT GLOBAL (@LetsXOtt) October 3, 2024#Swag: A first-of-its-kind cinema from Telugu, delivering a gender equality message through impeccable storytelling and writing.🔥🔥#SreeVishnu delivers his career-best performance. He shines as #Bhavabhuti for fun and #Vibudhi for the message. #Yayathi, #Singa, and King…— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) October 3, 2024#SWAG is something TFI has never seen before!@hasithgoli delivers an innovative concept with a one-of-a-kind screenplay executed flawlessly. @sreevishnuoffl shines taking on multiple roles with impressive voice modulations for each character. What an outstanding performance! 🙏 pic.twitter.com/fVcblx53nn— . (@Sayiiing_) October 3, 2024#Swag:#SreeVishnu's portrayal of different characterizations and their variations is excellent. Hasith Goli took a point that wasn't revealed in the trailer and presented it in a unique way. The interval is simply terrific, and the twists worked well!A detailed review…— Movies4u Official (@Movies4u_Officl) October 3, 2024#SWAG Very Good First half even with Complex Script.@sreevishnuoffl @peoplemediafcy pic.twitter.com/tTJKBHdK3M— Pradyumna (@pradyumna257) October 3, 2024Just finished watching #SWAGMovie at Prasad labs ❤️RRC combo worked out big again 🙌🏻Anna this is your career best performance ani cheppochu truly award deserving @sreevishnuoffl👏🏻 👏🏻👏🏻#HasithGoli is here to stay man 💯@peoplemediafcy#Swag #SWAGFromOct4th pic.twitter.com/dkiP23o5B5— Yashwanth (@YashTweetz___) October 3, 2024 -
ఈసారి ప్రేక్షకులను గెలిపించాలనుకుంటున్నాను: శ్రీవిష్ణు
‘‘తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహం వల్లే మేం గెలుస్తుంటాం. ఈసారి ప్రేక్షకులను గెలిపించాలనుకుంటున్నాను. దాని కోసం ఎంతో కష్టపడ్డాం. నిజంగా మీకు మా ‘శ్వాగ్’ సినిమా నచ్చితే అభినందిస్తూ రెండు చప్పట్లు కొట్టండి చాలు. ఈ నెల 4న థియేటర్స్‌కి వచ్చి మీరు గెలిచి, నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘శ్వాగ్’. మీరా జాస్మిన్, దక్షా నగార్కర్ కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌కి ‘గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ 2’ సినిమాలు చాలా పెద్ద సక్సెస్ ఇచ్చాయి. ‘శ్వాగ్’ కూడా అలాంటి సక్సెస్ ఇస్తుంది. ఈ మూవీలో శ్రీవిష్ణు నటన చూశాక కమల్హాన్గారితో ΄ోల్చుతారు’’ అని తెలి΄ారు. ‘‘శ్రీ విష్ణు, వివేక్ ఆత్రేయ స΄ోర్ట్తోనే ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాను. ‘రాజ రాజ చోర’ సినిమా తర్వాత రెండో సినిమా ‘శ్వాగ్’ని విశ్వప్రసాద్‌గారి నిర్మాణంలో చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు హసిత్ గోలి. -
శ్రీ విష్ణు స్వాగ్ ’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నాలుగు పాత్రలు చేయడం సవాల్‌గా అనిపించింది: శ్రీవిష్ణు
‘‘నా కెరీర్లో ఎప్పుడూ ద్విపాత్రాభినయం చేయలేదు. అలాంటిది ‘శ్వాగ్’ సినిమాలో నాలుగు పాత్రలు చేశాను. అందరూ ఒకే పోలికతో ఉండే ఒకే వంశస్తులే. నాలుగు పాత్రలు ఉన్నప్పడు ఎలా చేయాలనేది సవాల్‌గా అనిపించింది. ఒక్కసారి గెటప్స్ అన్నీ సెట్ అయ్యాక చాలా బాగా కుదిరింది’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘శ్వాగ్’. మీరా జాస్మిన్, దక్ష నగార్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు పంచుకున్న విశేషాలు.⇒ ‘శ్వాగ్’ ఒక వంశానికి సంబంధించిన కథ. మాతృ, పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 1500 సంవత్సరంలో మొదలయ్యే కథ. పురుషులు గొప్పా? మహిళలు గొప్పా? అనే అంశంపై వినోదాత్మకంగా ఈ కథ సాగుతుంది. శ్వాగ్ అంటే శ్వాగనిక వంశానికి సుస్వాగతం. అంత పెద్ద టైటిల్‌ని పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని ‘శ్వాగ్’ అని పెట్టాం. కొత్త తరహా కథల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అదే ధైర్యంతో సరికొత్త కథాంశంతో మా సినిమా చేశాం. ఈ మూవీలో నా పాత్రకి మేకప్ వేసుకోవడానికి రోజుకి నాలుగున్నర గంటలు పట్టేది... తీయడానికి రెండు గంటలు పట్టేది.. ఇదంతా చాలా కష్టంగా అనిపించింది. ⇒ కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. పెద్దవాళ్లకి ఈ చిత్రం విపరీతంగా నచ్చుతుంది. అలాగే యువ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. నేటి యువత తెలుసుకోవాల్సిన చాలా విషయాల్ని చూపించాం. మన వంశంతో పాటు పెద్దల గురించి, తాతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? అనేది హసిత్ చాలా చక్కగా తెరకెక్కించాడు. చాలా పెద్ద కథ ఇది. రెండున్నర గంటల్లో ఇంత పెద్ద కథ చెప్పారా? అని సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ని ప్రేక్షకులు అభినందిస్తారు. కథలో బాగంగానే వినోదం ఉంటుంది. నా కెరీర్లో పెద్ద హిట్‌గా నిలిచే చిత్రాల్లో ‘శ్వాగ్’ ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ⇒పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌గారు నన్ను, హసిత్ని నమ్మి తొలిసారి ‘రాజ రాజ చోర’ సినిమా అవకాశం ఇచ్చి, చాలా ్రపోత్సహించారు. ఇప్పుడు ‘శ్వాగ్’ చేసే అవకాశం కల్పించారు. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మంచి సక్సెస్ ఇస్తుంది. ఈ సినిమా చూశాక మహిళలను ఒక మెట్టు ఎక్కువ అభిమానం, గౌరవంతో చూస్తాం. ఈ సినిమా చూస్తున్నంత సేపు నటీనటులు కాకుండా పాత్రలే గుర్తుంటాయి. ప్రస్తుతం ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నా. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ వినోదాత్మక చిత్రం చేస్తున్నాను. -
మేకప్‌కే నాలుగున్నర గంటలు.. చాలా కష్టపడ్డా: శ్రీవిష్ణు
శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్వాగ్’. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటించగా, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో శ్రీవిష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ శ్వాగ్.. అంటే శ్వాగనిక వంశానికి సుస్వాగతం. అంత పెద్ద టైటిల్ ని పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని షార్ట్ గా 'శ్వాగ్' అని టైటిల్ పెట్టాం. ⇢ శ్వాగ్ ఒక వంశానికి సంబధించిన కథ. మాత్రు, పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 1500 సంవంత్సవంలో మొదలయ్యే కథ. మగ గొప్పా ? ఆడ గొప్పా ? అనే అంశంపై చిన్న టిట్ ఫర్ టాట్ లాంటి కథ. తెలుగు ప్రేక్షకులు కొత్త కథ ఎప్పుడు చెప్పినా ఆదరించారు. అదే ధైర్యంతో ఈ సినిమా చేయడం జరిగింది. ⇢ నేను ఎప్పుడూ డ్యుయల్ రోల్స్ చేయలేదు. ఇందులో నాలుగు పాత్రలు చేశాను. అందరూ ఒకే పోలికతో ఉండే ఒకే వంశస్తులే. నాలుగు పాత్రలు ఉన్నప్పడు ఎలా చేయాలనేది ఛాలెంజ్ గా అనిపించింది. వన్స్ గెటప్స్ అన్నీ సెట్ అయ్యాక.. చాలా బాగా కుదిరింది. ⇢ సినిమా చాలా బావొచ్చింది. ఇంటిల్లిపాది చూడదగ్గ సినిమా ఇది. పెద్దవాళ్ళకి సినిమా విపరీతంగా నచ్చుతుంది. అలాగే యంగ్ ఆడియన్స్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. సినిమా చూసి పేరెంట్స్ ని కూడా సినిమాకి తీసుకువెళ్తారు. ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. మన వంశం గురించి, పెద్దల గురించి, తాతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటనేది ఇందులో చాలా చక్కగా చూపించడం జరిగింది.⇢ చాలా పెద్ద కథ ఇది. రెండున్న గంటల్లో ఇంత పెద్ద కథ చెప్పారా అని సినిమా చూసిన తర్వాత దర్శకుడిని ప్రేక్షకులు అభినందిస్తారు. కథలో బాగంగానే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందరి ఆడియన్స్ కి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నా కెరీర్ లో ఈ సినిమా వన్ అఫ్ ది టాప్ ఫిల్మ్ గా నిలుస్తుందనే నమ్మకం ఉంది.⇢ రాజ రాజ చేస్తున్నప్పుడు సెకండ్ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా మీరు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు ప్రాజెక్ట్ చేసుకోమని చెప్పారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మమ్మల్ని నమ్మి రాజరాజ చోర సినిమా ఇచ్చింది. చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి మంచి సక్సెస్ అవుతుంది.⇢ ఇందులో క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ బాగా కుదిరాయి. రీతూ వర్మ క్యారెక్టర్ లో చాలా మంచి ట్రాన్స్ ఫర్మేషన్ ఉంటుంది. ఈ సినిమా చూసాక ఆడవాళ్ళని ఒక మెట్టు ఎక్కువ అభిమానం, గౌరవంతో చూస్తాం. భవభూతి క్యారెక్టర్ ని కూడా సినిమా పూర్తయిన తర్వాత ఆడవాళ్ళు అందరూ చాలా ఇష్టపడతారు. ఈ సినిమా చూసినప్పుడు నటులు కాకుండా పాత్రలే గుర్తుంటాయి.⇢ ఇందులో నేను చేసిన నాలుగు క్యారెక్టర్లలో సింగ తప్ప మిగతా మూడు కష్టమైనవే. వాటి గెటప్, బాడీ లాంగ్వెజ్, డైలాగ్ డిక్షన్ దేనికవే ప్రత్యేకం. రోజుకి నాలుగున్న గంటల సేపు మేకప్ వేసుకోవడం, మళ్ళీ దాన్ని తీయడానికి మరో రెండు గంటల సమయం పట్టడం.. ఇదంతా చాలా టఫ్. అయితే రేజర్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత దానికి వచ్చిన మంచి రెస్పాన్స్ మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చిన అనుభూతి కలిగింది. అందరూ వందశాతం ఎఫర్ట్ పెట్టి సినిమా చేశారు. కింగ్ ఎపిసోడ్స్ కి మోనో లాగ్స్ వున్నాయి. దాని కోసం ప్రత్యేకంగా ప్రాక్టిస్ చేశాం. ఇందులో 90 ఇయర్స్ క్యారెక్టర్ కూడా వుంటుంది. అది చాలా బావొచ్చింది.⇢ ఒక కుటుంబం కథ చెప్పినప్పుడు స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమేయ్యేలా ఉండాలి. ఎలాంటి కన్ఫ్యుజన్ ఉండకూడదు. శ్వాగ్ లో స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమయ్యేలా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. సింపుల్ గా ఉంటునే చాలా కొత్తగా ఉంటుంది.⇢ ఇందులో మీరా జాస్మిన్ గారు చాలా అద్భుతంగా నటించారు. 90లో మదర్ లాంటి క్యారెక్టర్ ఆమెది. ఆ క్యారెక్టర్ ని చూసినప్పుడు అందరి మదర్స్ గుర్తుకు వస్తారు. ఆ పాత్ర చాలా హుందాగా హోమ్లీ గా ఉంటుంది. యునానిమస్ గా అందరికీ నచ్చుతుంది.⇢ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ తో బ్రోచేవారెవరురా, రాజ రాజ చేశాను, ఇది మూడో సినిమా. పాటలు సిట్యువేషన్ కి తగ్గట్టుగా ఉంటాయి. బీజీఎం థియేటర్స్ లో క్రేజీ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా తన కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది.⇢ ఇది కొత్త కథ. ప్రతి ఇరవై నిమిషాలకు అబ్బురపరిచే ట్విస్ట్ ఉంటుంది. సర్ ప్రైజ్ లు ఉంటాయి. ప్యూర్ కంటెంట్ సినిమా. పండగ సినిమాల్లో తప్పకుండా ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ సినిమా.⇢ కొత్తగా ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్ లో ఓ ఎంటర్ టైనర్ చేస్తున్నాను. -
అంబటి రాయుడిని అప్పట్లో నెక్ట్స్ సచిన్ అన్నారు: హీరో శ్రీ విష్ణు
చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కానీ తెలుగు హీరో శ్రీ విష్ణు మాత్రం క్రికెటర్ కాబోయి హీరో అయినట్లు ఉన్నాడు. గతంలో ఓసారి చెప్పాడు. ఇప్పుడు మరోసారి తన క్రికెట్ కెరీర్ గురించి బయటపెట్టాడు. అదే టైంలో అంబటి రాయుడు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)అతిథి పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన శ్రీ విష్ణు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. ఇతడు నాలుగు పాత్రల్లో నటించిన 'స్వాగ్' మూవీ అక్టోబరు 4న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఓ పాడ్ కాస్ట్లో తన క్రికెట్ జర్నీ గురించి రివీల్ చేశాడు.తాను ఆంధ్రా జట్టు తరఫున అండర్-19 క్రికెట్ ఆడానని, తన టైంలో అంబటి రాయుడు.. హైదరాబాద్ తరఫున ఆడేవాడని, అప్పట్లో అతడిని నెక్స్ట్ సచిన్ అని పిలిచేవారని శ్రీ విష్ణు చెప్పుకొచ్చాడు. నిజ జీవితంలో క్రికెటర్ కానప్పటికీ 'అప్పట్లో ఒకడుండేవాడు' అనే మూవీలో మాత్రం శ్రీ విష్ణు క్రికెటర్‌గా నటించాడు. రాయుడు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Permit Room (@thepermitroommedia) -
వెతకక్కర్లేదు.. వచ్చేశాడు!
‘రాజ రాజ చోర’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో శ్రీ విష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘శ్యాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.‘‘ఈ వంశ ఖజానా వారసుడు దొరకడం అంత సులువు కాదు.. ఈ తరంలో వాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు...’, ‘వెతకక్కర్లేదు..వచ్చేశాడు!’, ‘మా వంశాన్ని వెతుక్కుంటూ వచ్చేసరికి ఇంతకాలం పట్టింది’ వంటి డైలాగ్స్ ‘శ్యాగ్’ సినిమా ట్రైలర్లో ఉన్నాయి. రీతూ వర్మ హీరోయిన్ గా, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్ నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు. -
సమ్‌థింగ్ డిఫరెంట్‌గా 'స్వాగ్' ట్రైలర్
యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ 'స్వాగ్'. ఇందులో సింగ, భవభూతి, యయాతి, కింగ్ భవభూతి అనే నాలుగు పాత్రల్లో కనిపిస్తాడు. వీటన్నింటికీ డిఫరెంట్ షేడ్స్ ఉండటంతో పాటు డైలాగ్ డెలివరీ కూడా అంతే డిఫరెంట్‌గా ఉంది. 1551లో మొదలైన ఈ కథ ప్రస్తుతం వరకు దాదాపు నాలుగు టైమ్ లైన్స్‌లో ఉండనుంది. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ట్రైలర్‌ని తాజాగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)పురుషాధిక్యం అనే పాయింట్ ఆధారంగా 'స్వాగ్' సినిమా తీసినట్లు తెలుస్తోంది. చాలావరకు అచ్చ తెలుగు పదాలే వినిపిస్తున్నాయి. అక్టోబరు 4న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. గతంలో శ్రీవిష్ణుతోనే 'రాజరాజచోర' అనే హిట్ మూవీ తీసిన హసిత్ గోలి దీనికి దర్శకుడు.ఈ సినిమాతో మీరా జాస్మిన్ చాలారోజుల తర్వాత మళ్లీ తెలుగులో నటించింది. రీతూ వర్మ హీరోయిన్. సునీల్, దక్ష నగర్కర్, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను, రవిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?) -
మహారాణి రుక్మిణీదేవిగా రీతు వర్మ
అందం, ప్రతిభ గల అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో ఒకరు రీతు వర్మ. పెళ్లి చూపులు, టక్ జగదీశ్, వరుడు కావలెను, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతు వర్మ. ఫిలింమేకర్స్ లో ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్ గా పేరు సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది రీతు వర్మ. ఆమె అప్ కమింగ్ రిలీజ్ స్వాగ్ తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతోంది.స్వాగ్ సినిమాలో వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి పాత్రలో రీతు వర్మ కనిపించనుంది. మహారాణి రుక్మిణీదేవి పాత్రతో ఆమె అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్వాగ్ లో రీతు వర్మ క్యారెక్టర్ హైలైట్ కానుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు ఇష్టపడే రీతు వర్మ..మహారాణి రుక్మిణీదేవి పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్దమైంది. ఆమె ఎఫర్ట్ స్క్రీన్ మీద కనిపించబోతోంది.ప్రస్తుతం రీతు వర్మ తెలుగుతో పాటు తమిళంలోనూ పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రీతు వర్మకు ఈ సిరీస్ డిజిటల్ డెబ్యూ కానుంది. శ్రీ విష్ణు హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు హసిత్ గోలి రూపొందించిన స్వాగ్ మూవీ అక్టోబర్ 4న థియేటర్స్ లోకి రానుంది. -
నీలో... నాలో...
భవ భూతి, రేవతి ప్రేమలో పడ్డారు. ‘నీలో... నాలో కదలాడు భావమీ రాగం... లోలో ఎదలో వినిపించసాగే ఓ తాళం...’ అంటూ పాట అందుకున్నారు. భవ భూతిగా శ్రీవిష్ణు, రేవతిగా మీరా జాస్మిన్ నటించిన చిత్రం ‘శ్వాగ్’. హసిత్ గోలి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘నీలో... నాలో కదలాడు భావమీ రాగం...’ అంటూ సాగే పాటను శనివారం విడుదల చేశారు.ఈ చిత్రంలో శ్రీవిష్ణు చేసిన నాలుగు పాత్రల్లో భవ భూతి ఒకటి. ఆ పాత్ర సరసనే మీరా జాస్మిన్ కనిపించనున్నారు. ఇక చిత్ర సంగీతదర్శకుడు వివేక్ సాగర్ స్వరపరచిన ఈ పాటకు భువనచంద్ర సాహిత్యం అందించగా రాజేశ్ కృష్ణన్, అంజనా సౌమ్య ఆలపించారు. ‘‘ఈ మెలోడీ ట్రాక్‌లో శ్రీవిష్ణు, మీరా జాస్మిన్ల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. ఈ పాట ప్రేక్షకులను 1980, 90లలోకి తీసుకెళుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. రీతూ వర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో దక్షా నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
కన్ఫ్యూజ్ అవ్వరు: దర్శకుడు హసిత్ గోలి
‘‘మగవారు గొప్పా? ఆడవారు గొప్పా? అనే గొడవ ఎప్పట్నుంచో ఉంది. ఎప్పటికీ ఉంటుంది. అలాగే లింగ వివక్ష కూడా ఉంది. ఈ రెండింటినీ మేళవించి ఓ కథ రెడీ చేస్తే బాగుంటుందని భావించి, కల్పిత కథగా ‘శ్వాగ్’ సినిమా తీశాం. తరతరాలుగా మగ – ఆడ గొడవలు ఎలా మారుతూ వస్తున్నాయి? అనే అంశాన్ని ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం’’ అని దర్శకుడు హసిత్ గోలి అన్నారు. ‘రాజ రాజ చోర’ (2021) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘శ్వాగ్’. రీతూ వర్మ హీరోయిన్గా నటించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో హసిత్ గోలి పంచుకున్న విషయాలు. ⇒ నాలుగు తరాలకు చెందిన కథ ఇది. ప్రతి తరంలోనూ హీరోగా శ్రీవిష్ణుగారే కనిపిస్తారు. ఒక తరంలో భవభూతిగా, మరో తరంలో యయాతిగా, ప్రస్తుత తరంలో సింగాగా కనిపిస్తారు. కథ, గెటప్స్, క్యారెక్టర్స్ పరంగా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవ్వరు. ఆ విధంగా మంచి స్క్రీన్ ప్లేని తయారు చేశాం. ⇒ శ్రీవిష్ణు గెటప్స్ కోసం ్రపోస్థెటిక్ మేకప్ చేశాం. జాతీయ అవార్డు గ్రహీత రషీద్గారు చాలా కష్టపడ్డారు. మగజాతి ఉనికిని నిలబెట్టే వంశమే శ్వాగణిక వంశమని, అతను లేకపోతే మగవారు అందరూ బానిసలుగానే ఉండిపోతారనేది భవభూతి (శ్రీవిష్ణుపాత్ర) మహారాజు ఫీలింగ్. ఈ వంశానికి అపోజిట్‌లో మాతృస్వామ్యం డామినేటెడ్‌గా ఉంటుంది వింజామర వంశం. ఈ వంశంలో రుక్మిణీ దేవిగా రీతూ వర్మ ఉంటారు. ⇒ ఓ సీరియస్ సబ్జెక్ట్‌నే వినోద పంథాలో చెప్పే ప్రయత్నం చేశాం. ఇంట్రవెల్ ఆడియన్స్‌ని ఆశ్చర్యపరుస్తుంది. సినిమాలో కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. ‘ఏడు తరాల’ నవలకు, మా ‘శ్వాగ్’కు ఏ సంబంధం లేదు. ఇక నా తర్వాతి సినిమాని ఫ్యాంటసీ జానర్లో తీయాలనుకుంటున్నాను. -
హీరో శ్రీవిష్ణు భార్య-కూతురిని చూశారా.. క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
ఈ సినిమా చేయాలంటే దమ్ముండాలి: హీరో
‘‘శ్వాగ్’ చాలా గొప్ప కథ. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ ఇలాంటి కథ రాలేదు. ఇది మనందరి ఇళ్లలోని కామన్ పాయింట్ అయినా స్క్రీన్‌పై ఇప్పటి వరకూ రాలేదు. ఇలాంటి కథ నాకు ఇచ్చిన హసిత్కి థ్యాంక్స్. ‘శ్వాగ్’ లాంటి సినిమాలు చేయాలంటే చాలా దమ్ముండాలి.. కథను నమ్మి సినిమా చేసిన విశ్వప్రసాద్‌గారికి కృతజ్ఞతలు’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్వాగ్’. రీతూ వర్మ, మీరా జాస్మిన్, సునీల్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్ ఇతర పాత్రల్లో నటించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకలో హసిత్ గోలి మాట్లాడుతూ– ‘‘తాతలు, ముత్తాతలతో కలిసి చూడగలిగేలా ఉంటుంది’’ అని తెలిపారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శ్రీవిష్ణు, హసిత్లతో కలసి ‘రాజ రాజ చోర’ సినిమా చేశాను. మా కాంబినేషన్లో ‘శ్వాగ్’ సెకండ్ మూవీ. కమల్‌హాసన్‌గారి ‘ఇంద్రుడు చంద్రుడు’ లాంటి సినిమాలు చూసిన అనుభూతిని ఇస్తుంది’’ అని చెప్పారు. -
శ్రీవిష్ణు ‘స్వాగ్’ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
శ్రీవిష్ణు 'శ్వాగ్' టీజర్.. హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నాడే
‘రాజ రాజ చోర’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘శ్వాగ్’. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఎంతో వినోదాత్మకంగానే కాకుండా ఆసక్తిగా కూడా ఈ టీజర్ మెప్పిస్తుంది. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.తాజాగా విడుదలైన టీజర్‌ను బట్టి చూస్తే సినిమాపై మంచి అంచనాలు పెట్టుకోవచ్చు. సినిమా కాన్సెప్ట్ కూడా అందరినీ మెప్పించేలా ఉంది. శ్వాగణిక వంశానికి చెందిన వాడిగా శ్రీవిష్ణు విభన్న గెటప్పులతో అలరించాడు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత ‘శ్వాగ్’తో శ్రీవిష్ణు హ్యాట్రిక్ హిట్ అందుకునేలా ఉన్నాడు. -
సింగరో సింగ
‘రాజ రాజ చోర’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘శ్వాగ్’. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలో సింగరేణి అలియాస్ సంగ పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్నట్లుగా వెల్లడించి, ‘సింగరో సింగ’ అనే పాట లిరికల్ వీడియోను కూడా విడుదల చేశారు. ‘సింగరో సింగ.. అబ్బో సింగరో సింగ...’ అంటూ మొదలై, ‘పక్కక్ జరుగుర్రి... దండల్ గుచ్చుర్రీ... దండాలు గిండాలు పెట్టుర్రి... ఆస్తండు సింగ... సింగరో సింగ..’ అంటూ సాగే ఈ పాటకు వివేక్ సాగర్ స్వరాలందించగా నిక్లేష్ సుంకోజీ సాహిత్యం అందించారు. బాబా సెహగల్–వైకోమ్ విజయలక్ష్మి పాడారు. -
మీకు ఏం గుర్తొస్తుంది?
‘మగాడంటే మీకు ఏం గుర్తొస్తుంది’ అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ‘శ్వాగ్’ మూవీ టీజర్ రిలీజ్ అయింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రంలో రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు కీలక పాత్రల్లో నటించారు. హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మించారు.ఈ చిత్రంలోని అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసిన మేకర్స్ శుక్రవారం టీజర్‌ని రిలీజ్ చేశారు. ‘ఆడవాళ్లని ఏం అడుక్కోనక్కర్లేదు... మగవాడినే అనుసరించాలి. వంశాలైనా, ఆస్తులైనా, ఆడవాళ్లయినా..’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగులు ఈ టీజర్లో ఉన్నాయి. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ‘శ్వాగ్’ రూపొందింది. శ్రీవిష్ణు హిలేరియస్ రోల్లో కనిపించనున్నారు. త్వరలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు మేకర్స్. -
సింహాసనం దక్కాలి కానీ...
ఉత్పలదేవిగా మారిపోయారు మీరా జాస్మిన్. ఉత్పలదేవి దయాగుణం వల్ల రాణి కావాల్సిన ఆమెకు సింహాసనం దక్కదు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ‘శ్వాగ్’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలీ దర్శకత్వంలో ‘శ్వాగ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో వింజమర వంశంలోని రాణి రుక్మిణి దేవిగా రీతూ వర్మ ఓ లీడ్ రోల్లో నటిస్తుండగా, మరో లీడ్ రోల్లో ఉత్పలదేవిగా మీరా జాస్మిన్ కనిపిస్తారు. ఆదివారం ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. -
హీరో శ్రీవిష్ణు కొత్త సినిమా ఆరంభం (ఫొటోలు)
-
‘ఓం భీమ్ బుష్’ ఓటీటీ వివరాలు.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ‘ఓమ్ భీమ్ బుష్’ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. మార్చి 22న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 10.44 కోట్ల గ్రాస్ వసూళ్ల సాధించి, ఔరా అనిపిస్తోంది. లాజిక్‌తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. (చదవండి: ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్ ఊహించలేరు..) ఈ మధ్య కాలంలో ఫుల్లెన్త్ కామెడీ చిత్రాలేవి తెలుగులో రిలీజ్ కాకపోవడం కూడా ఓం భీమ్ బుష్‌కి బాగా కలిసొచ్చింది. వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డిటేల్స్ బయటకు వస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయబోతుందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఓటీటీలోకి 'ఓపెన్‌హైమర్' తెలుగు వర్షన్ వచ్చేసింది) రిలీజ్‌కి ముందే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కింకుంది. మంచి రేటుకే ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు వారాల వరకు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం లేదు. ఏప్రిల్ చివరి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు మాత్రం ఆగాల్సిందే. -
కడుపుబ్బా నవ్వుకునే మూవీ, చివరి 20 నిమిషాలైతే..
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించారు. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు మారుతి ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ దిల్ రాజు మాట్లాడుతూ.. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. ఈ ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం వుండాలి. థియేటర్‌కు వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు. మంచి ఎంటర్టైనర్ మూవీ ఈ సమ్మర్‌కు వచ్చింది. అందరూ థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చేయండి' అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ... 'ఓం భీమ్ బుష్' ప్రీమియర్ చూశాను. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురి కాంబినేషన్‌ను కలపడమే ఈ విజయం. ప్రేక్షకులని తప్పకుండా అలరించాలనే టెన్షన్ ఆ ముగ్గురిలో గమనించాను. దర్శకుడు అద్భుతంగా కథ రాసుకుంటే.. ఈ ముగ్గురు ఇంకా అద్భుతంగా నటించారు. మీరు ఇచ్చే డబ్బులకి వందశాతం న్యాయం చేస్తుంది' అన్నారు. కష్టే ఫలి హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా రోజులు ఆడుతుందని మా అందరి గట్టి నమ్మకం. థియేటర్స్ లో విజల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలకు మహిళా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది అన్నారు. రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. కష్టే ఫలి అంటారు. మా దర్శకుడు మమ్మల్ని కష్టపెట్టి ఫలితాన్ని పొందాడు. (నవ్వుతూ) కష్టం పడటంలో కూడా ఓ ఆనందంగా వుంటుంది. తెరపై మమ్మల్ని మేము చుసుకున్నపుడు మిగతావారు అనందంగా నవ్వడం చూసి మేము ఆనంద పడుతున్నాం'' అన్నారు. దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ... ప్రేక్షకులు సినిమా చూసి పగలబడి నవ్వుతున్నారు. వారి నవ్వులు చూసిన తర్వాత మేము రెండేళ్ళు పడిన కష్టం మర్చిపోయామని చెప్పారు. చదవండి: నటిని నానామాటలన్న అత్త.. ఇప్పుడేమో తెగ పొగిడేస్తోంది! -
‘ఓం భీమ్ బుష్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Om Bheem Bush: ‘ఓం భీమ్ బుష్’ మూవీ రివ్యూ
టైటిల్: ఓం భీమ్ బుష్ నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ తదితరులు నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు సమర్పణ: యూవీ క్రియేషన్స్ దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి సంగీతం: సన్నీ ఎమ్ఆర్ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట సంగీతం ఎడిటింగ్: విజయ్ వర్ధన్ విడుదల తేది: మార్చి 22, 2024 ‘ఓం భీమ్ బుష్’ కథేంటంటే? కృష్ణ కాంత్ అలియాస్ క్రిష్(శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి(ప్రియదర్శి), మాధవ్ రేలంగి అలియాస్ మ్యాడీ(రాహుల్ రామకృష్ణ) ముగ్గురు మంచి స్నేహితులు. సైంటిస్టులు కావాలనేది వారి కోరిక .పీహెచ్డీ కోసం లెగసీ యూనివర్సిటీలో చేరతారు. ఐదేళ్లయినా పీహెచ్డీ పూర్తి చేయరు. కాలేజీలో వీళ్లు చేసే పనులు భరించలేక డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తాడు కాలేజీ ప్రిన్సిపాల్ రంజిత్ విలుకొండ(శ్రీకాంత్ అయ్యంగార్). ఊరికి వెళ్లే క్రమంలో ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ జరిగే కొన్ని సంఘటనలు, మాంత్రిక దళం చేసే మోసాన్ని గమనించి, తాము కూడా టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు వసూలు చేయాలనుకుంటారు. సైంటిస్టుల అవతారమెత్తి ఎ టు జెడ్ సర్వీసెస్ పేరు ఓదుకాణం తెరుస్తారు. తక్కువ సమయంలోనే ఊరి ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటారు. అయితే బ్యాంగ్ బ్రోస్(ఈ ముగ్గురి టీమ్ పేరు బ్యాంగ్ బ్రోస్) నిజమైన సైంటిస్టులు కాదని, డబ్బుకోసం ప్రజలను మోసం చేస్తున్నారనే విషయం బయటపడుతుంది. దీంతో ఆ ఊరి సర్పంచ్(ఆదిత్యా మీనన్).. ఈ ముగ్గురికి ఓ పరీక్ష పెడతాడు. ఊరి చివరన ఉన్న సంపంగి మహాల్‌లోకి వెళ్లి నిధిని కనిపెట్టి తీసుకురావాలని ఆదేశిస్తాడు. సంపంగి దెయ్యం ఉన్న ఆ మహాల్‌లోకి వెళ్లిన తర్వాత బ్యాంగ్ బ్రోస్కి ఎదురైన సంఘటనలు ఏంటి? సంపంగి మహల్ కథ ఏంటి? ఇంతకీ ఆ మహల్ లో నిధి ఉందా లేదా? చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘ఓం భీమ్ బుష్’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు వాస్తవానికి విరుద్దంగా, లాజిక్ లెస్‌గా ఉంటాయి. కానీ తెరపై చూస్తే మాత్రం వినోదాన్ని పంచుతాయి. అలాంటి సినిమాల్లో ‘ఓమ్ భీమ్ బుష్’ ఒకటి. ‘నో లాజిక్ ఓన్లీ మేజిక్ ’అని టైటిల్ క్యాప్షన్ ఇచ్చిన దర్శకుడు శ్రీహర్ష.. అందుకు తగ్గట్టే ఓన్లీ స్క్రీన్‌ప్లేతో తెరపై మ్యాజిక్ చేశాడు. మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. ‘జాతిరత్నాలు’ తరహాలో సాగే ముగ్గురు స్నేహితుల కథకి హారర్‌ని జోడించి.. చివరిలో ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ మరికొన్ని చోట్ల భయపెడతూనే ఓ డిఫరెంట్, ఎమోషనల్ లవ్‌స్టోరీని చెప్పాడు. టైటిల్లో చెప్పినట్లుగానే కథ ప్రారంభం నుంచే ఇందులో లాజిక్స్ ఉండవు. సంపంగి మహల్ లో తాంత్రిక పూజ సీన్ తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే కాలేజీ ఎపిసోడ్ తో ముగ్గురు హీరోల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో చూపించాడు. ఈ ముగ్గురు భైరవపురం వచ్చేవరకు కథ స్లోగా అవుతుంది. అయితే ఆ మధ్యలో వచ్చే అడల్ట్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. భైరవపురంలో బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సర్వీసెస్ పేరుతో దుకాణం తెరిచాక అసలైన కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఊరి ప్రజలతో ఈ ముగ్గురు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సంతానం కలగడం లేదని వచ్చిన ఓ వ్యక్తికి వీరిచ్చే ట్రీట్మెంట్ సీన్‌కి థియేటర్స్‌లో పగలబడి నవ్వుతారు. అలాగే అర్థరాత్రి ఈ ముగ్గురు సర్పంచ్ ఇంట్లోకి చొరబడి చేసే అల్లరి, ప్రియదర్శి, ఆదిత్య మీనన్‌కు సంబంధించిన సన్నివేశాలు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.ద్వితియార్థం మొత్తం సంపంగి మహాల్ చుట్టే తిరుగుతుంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ పకడ్బంధీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడ హారర్ సీన్ పెట్టాలి? ఎలాంటి సీన్‌కి నవ్వుతారు? లాంటివి లెక్కలేసుకొని బలమైన స్క్రీప్ట్ రాసుకున్నాడు. సంపంగి దెయ్యం, ప్రియదర్శిని భయపెట్టే సీన్ వచ్చినప్పుడు మనం కూడా భయపడుతూనే నవ్వుతుంటాం. అయితే సంపంగి దెయ్య నేపథ్యం తెలిశాక వచ్చే సీన్స్ అంతగా ఆకట్టుకోవు. నిధి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ ముగ్గురు చేసే ప్రయత్నాలు కూడా రొటీన్‌గా ఉంటాయి. కానీ చివరిలో మాత్రం ఓ కొత్త పాయింట్‌ని టచ్ చేశాడు. ఇంతవరకు ఎవరూ అలాంటి అంశాన్ని ఇంత డిఫరెంట్‌గా తెరపై చూపించలేదు. నవ్వించడంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చారు. కొన్నీ సంభాషణలు, సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ లాజిక్స్ జోలికి వెళ్లకుండా సినిమా చూస్తే మాత్రం రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చు. ఎవరెలా చేశారంటే.. ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.తన కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది. క్రిష్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన చేసే ఇన్నోసెంట్‌గా కామెడీ నవ్వులు పూయిస్తుంది. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రలు కూడా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాయి. భయస్తుడు వినయ్ గుమ్మడి పాత్రకి ప్రియదర్శి వందశాతం న్యాయం చేశాడు. సినిమాలో బాగా నవ్వించిన సీన్లలో ఎక్కువగా ప్రియదర్శివే ఉంటాయి.మహల్లో అతనికి, దెయ్యంకి మధ్యవచ్చే సీన్లు హిలేరియస్‌గా అనిపిస్తాయి. ఇక రాహుల్ రామకృష్ణ ఎప్పటి మాదిరే తనదైన పంచ్ డైలాగ్స్, కామెడీతో ఆకట్టుకున్నాడు.స్పెషల్ సాంగ్‌లో ప్రియా వడ్లమాని అందాల అరబోసింది.ప్రీతీ ముకుందన్ , ఆయేషా ఖాన్, రచ్చరవితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా ఉన్నతంగా ఉంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. ఆర్ట్ డైరెక్టర్ పనితీరు బాగుంది. సన్నీ అందించిన బీజీఎం కొన్ని సీన్లను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్ విజయ్ వర్దన్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉంది. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ నటి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది: శ్రీవిష్ణు
‘‘నా సినిమాలకు పెట్టుబడి పెట్టే నిర్మాతలు నష్టపోకూడదని కోరుకుంటాను. ఇండస్ట్రీలో నా మార్కెట్ పెరగడం, తగ్గడం అనేది నా చేతుల్లో లేని విషయం. ఏ సినిమా వల్ల మార్కెట్ పెరుగుతుందో, ఏ సినిమా వల్ల తగ్గుతుందో గ్యారెంటీగా చెప్పలేం’’ అని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ– ‘‘సైంటిస్ట్‌లు కావాలని ఉస్మానియా యూనివర్సిటీలో చాలా కాలంగా తిష్ట వేసిన ఓ ముగ్గురు పీహెచ్డీ స్కాలర్స్‌ను అక్కడి విద్యార్థులు ఓ స్కెచ్ వేసి బయటకు పంపిస్తారు. అలా బయటకు వచ్చిన ఆ ముగ్గురు భైరవపురం అనే ఊరికి వెళ్లినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఈ ముగ్గురి నిధి అన్వేషణ ఫలించిందా? లేదా అన్నది ‘ఓం భీమ్ బుష్’ కథాంశం. అలాగే ఈ మూవీలో కొత్త పాయింట్‌ని టచ్ చేశాం. ఆ అంశం నాకు కిక్ ఇచ్చింది. ఈ మూవీలో ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ చేసింది. తనకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన విషయం మాతో చెప్పకుండా వెళ్లిపోయింది. తన వల్ల కొన్నాళ్లు షూటింగ్ ఆలస్యమైంది. నా తర్వాతి చిత్రం ‘స్వాగ్’ పూర్తి కావొచ్చింది. గీతా ఆర్ట్స్, కోనగారితో సినిమాలు కమిటయ్యాను. అలాగే ఓ థ్రిల్లర్ ఫిల్మ్ కూడా ఉంది’’ అన్నారు. చదవండి: జపాన్‌లో భూకంపం.. రాజమౌళి కుటుంబానికి తప్పిన ప్రమాదం -
Om Bheem Bush: నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్.. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్?
తెలుగు తెరపై మరో కామెడీ సినిమా సందడి చేయబోతుంది. అదే ఓమ్ బీమ్ బుష్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ(U/A) సర్టిఫికేట్ జారీ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు సెన్సార్ సభ్యులు నవ్వుతూనే ఉన్నారట. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ పోటీపడి నటించారట. శ్రీవిష్ణు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటే.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ స్పాంటేనియస్ డైలాగ్స్‌తో అదరగొట్టారట. క్లైమాక్స్ లో భారీ ఎమోషన్ తో ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయట. సెన్సార్ సభ్యుల మాదిరే థియేటర్స్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వెళ్లిపోతాడని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్? సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు నటించిన ఫుల్లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ ఓమ్ బీమ్ బుష్. డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి ఈ కథకి హారర్ టచ్ ఇవ్వడంతో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ని జతచేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేసింది. సెన్సార్ సభ్యులు ప్రశంసలు.. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చుస్తుంటే శ్రీవిష్ణు ఖాతాలో కచ్చితంగా మరో హిట్ పడేలా ఉంది. మరి జాతిరత్నాలు మాదిరే ‘ఓమ్ బీమ్ బుష్’ కూడా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది మరో మూడు రోజుల్లో తెలిసిపోతుంది. -
‘ఓం భీమ్ బుష్’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
నవ్వులే నవ్వులు
‘‘ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతోనే ‘ఓం భీమ్ బుష్’ సినిమా చేశాం. రెండు వందల శాతం ఆడియన్స్ పిచ్చి పిచ్చిగా నవ్వుతారు. ప్రేక్షకుల నవ్వులతో థియేటర్స్ బద్దలైపోతాయి’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, ప్రీతీ ముకుందన్ జంటగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, అయేషా ఖాన్, ప్రియా వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, వీ సెల్యూలాయిడ్ పతాకాలపై సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘దర్శకుడు హర్ష ఈ సినిమాను హిలేరియస్‌గా తీశాడు. అవకాశం ఇచ్చిన యూవీ వంశీ అన్న, సునీల్గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ట్రైలర్లో ఉన్న ఎనర్జీ కంటే సినిమాలో వంద రెట్లు ఎనర్జీ ఉంది’’ అన్నారు శ్రీహర్ష. ‘‘ఈ సినిమాతో డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం’’ అన్నారు ప్రియదర్శి. ‘‘ఓం భీమ్ బుష్’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు సునీల్. -
ఓం భీమ్ బుష్ ట్రైలర్.. టైటిల్‌కు తగ్గట్టే ఉంది
‘సామజవరగమన’(2023) వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అన్నది ఉపశీర్షిక. ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ప్రీతి ముకుందన్,ఆయేషా ఖాన్ కథానాయికలుగా ఉన్నారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్‌పై సునీల్ బలుసు నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.. ‘‘గుప్త నిధుల కోసం ముగ్గురు శాస్త్రవేత్తలు ఏం చేశారు? అనే నేపథ్యంలో తెరకెక్కిన ‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ట్రైలర్లో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారు. ట్రైలర్ మొత్తం కామెడీ ట్రాక్‌లో ఉంది. సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమా మార్చి 22న రిలీజ్ కానుంది. -
ఆ రోజులు గుర్తొస్తున్నాయి
‘‘లక్కీ మీడియా బ్యానర్ ఎంతో అదృష్టంగా భావిస్తాను. ఈ సంస్థతో నాకున్న అనుబంధం గొప్పది. ‘రోటి కపడా రొమాన్స్’ టీమ్‌ను చూస్తుంటే నేనీ బ్యానర్లో సినిమా చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ చిత్రం టీజర్ చూస్తుంటే యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా అనిపిస్తోంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ చిత్రం ఎమోషనల్ డోస్ ప్రీ ట్రైలర్‌ను శ్రీవిష్ణు రిలీజ్ చేశారు. ‘‘కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమా ఇది’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్, సృజన్‌కుమార్ బొజ్జం, విక్రమ్ రెడ్డి. -
Sree Vishnu: నాలుగేళ్లకోసారి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్న కుర్ర హీరో (ఫోటోలు)
-
మార్చిలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!
-
ఈ సినిమా హాలీవుడ్ లో తీద్దాం అనుకున్నాం: శ్రీ విష్ణు
-
శ్రీ విష్ణు ‘సామజవరగమన’ మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
'ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకుంటే పాపం'.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. (ఇది చదవండి: ప్రముఖ కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురు పెళ్లి) తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. అనంతరం చిత్ర బృందానికి మెగాస్టార్ బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా విష్ణు షర్ట్‌పై చిరంజీవి ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఫోటోలను ట్విటర్ షేర్ చేశారు హీరో. కాగా.. ట్రైలర్ చూస్తే పుల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ నటుడు నరేశ్ ఈ చిత్రంలో శ్రీవిష్ణుకు తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతమందించారు. (ఇది చదవండి: సరికొత్తగా ‘సామజవరగమన’ ) Beyond blessed to have you launch our Trailer sir MEGASTAR @KChiruTweets 🤗 Forever indebted to you for taking out your time for us 🙏🏻 - https://t.co/6WsNyC9XzT #Samajavaragamana In cinemas from June 29 ✨ pic.twitter.com/VzIO1AwoXE — Sree Vishnu (@sreevishnuoffl) June 25, 2023 -
శ్రీ విష్ణు 'సామజవరగమన'టీజర్ చూశారా?
హిట్టూ, ఫ్లాపు అనే సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు హీరో శ్రీ విష్ణు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సామజవరగమన. రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో రెబా మోనిక జాన్ టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. మే18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.హాస్య మూవీస్ పతాకం పై అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
శ్రీ విష్ణు ‘సామజవరగమన’ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్‌సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 18న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. -
యంగ్ హీరో శ్రీవిష్ణు కొత్త సినిమా షురూ
శ్రీవిష్ణు హీరోగా నూతన సినిమా షురూ అయింది. ‘వివాహ భోజనంబు’(ఓటీటీ ప్రాజెక్ట్) ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నారా రోహిత్ క్లాప్ ఇచ్చారు. ‘‘పూర్తి ఫన్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో నిర్మాత అనిల్ సుంకర, దర్శకులు వీఐ ఆనంద్, విజయ్ కనకమేడల, ఏఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీ ప్రసాద్, ప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాంరెడ్డి. -
‘అల్లూరి’ మార్నింగ్ షో రద్దు.. ఇక మీ చేతుల్లోనే అంటూ శ్రీవిష్ణు ట్వీట్
శ్రీ విష్ణు, కయదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 23)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనుకోని కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మార్నింగ్ షో రద్దు చేశారు. మాట్నీ షో నుంచి ఈ చిత్రం థియేటర్స్‌లో ప్రదర్శించబడుతుంది. ఈ విషయాన్ని శ్రీవిష్ణు ట్వీటర్ వేదికగా తెలియజేశాడు. ‘కొన్ని కారణాల వల్ల ‘అల్లూరి’ మార్నింగ్ షోలను మీ ముందుకు తీసుకురాలేకపోయాం. మ్యాట్నీ నుంచి మీదే.. ఇక మీ చేతుల్లోనే’ అని శ్రీవిష్ణు ట్వీట్ చేశాడు. మార్నింగ్ షో రద్దు కావడంపై పలువురు సినీ ప్రియులు, శ్రీవిష్ణు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఈ సినిమా ఆగినట్లు తెలుస్తుంది. నిర్మాతకు, ఫైనాన్సియర్స్‌కి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. నిర్మాత ముందడుగు వేసి ఫైనాన్సియర్స్‌తో డీల్ చేసుకోవడంతో మాట్నీ షో నుంచి ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. పోలీస్ వ్యవస్థ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రీవిష్ణు పోలీసు అధికారి పాత్రను పోషించాడు. Due to some issues, we couldn’t bring in the #Alluri morning shows! Matinees nunchi meedhe . Ika mi chethilone 🙏 Enjoy #ALLURI at your nearest cinemas ❤️#AlluriFromToday pic.twitter.com/SnX5pdskcB — Sree Vishnu (@sreevishnuoffl) September 23, 2022 -
‘అల్లూరి’ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
హీరో నాని చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘అల్లూరి’ మూవీ ట్రైలర్
యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే కథలే కాదు, ఆయన నటించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి పదాలు తెలుస్తాయంటాడీ హీరో. ఇప్పుడు ఈ యంగ్ హీరో ‘అల్లూరి’ చిత్రంతో అలరించబోతున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. ‘లక్ష్యసాధనకు పడిన శ్రమ గొప్పది’ అంటూ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ వస్తుండగా పోలీసు ఆఫీసర్‌గా శ్రీవిష్ణు ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత పోలీసులు నిజమైన హీరోలు అంటూ చెప్పే డైలాగ్, యాక్షన్స్ సీన్స్, లవ్ యాంగిల్ వంటి ఆసక్తికర సన్నివేశాలతో ట్రైలర్ అద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఊహించిన రితీలో ఉన్న యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల చేత ఈళలు వేయించడం ఖాయం అంటున్నారు. సమాజం బాగుపడాలంటే రాజకీయ నాయకులను కూడా మార్చాలని హీరో సవాలు విసరడం, అలాగే, ఎక్కువ మంది పిల్లలు పోలీసు అధికారులుగా మారాలని కోరుకుంటున్నానంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీవిష్ణు మరోసారి తన మార్క్ చూపించాడని ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు హైలెట్ అని చెప్పవచ్చు. ఇలా సాంతంగా ఆసక్తిగా సాగిన ట్రైలర్ ప్యాన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది. కాగా తనికేళ భరణి, రాజా రవింద్ర, పృథ్వీరాజ్, సుమన్, జయవాణి, మధుసుధననరావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తన్నారు. సెప్టెంబర్ 23న ఈచిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. -
శ్రీవిష్ణు 'అల్లూరి' వచ్చేది అప్పుడే
శ్రీ విషు, కయ్యదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. ‘నిజాయితీకి మారు పేరు’ అనేది ఉపశీర్షిక. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ త్రాన్ని సెప్టెంబర్ 23న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటింంది. ప్రదీప్ వర్మ, బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఓ పోలీసాఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌గా రూపొందింది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు నిజాయితీ గల పోలీసు అధికారిగా అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు’’ అన్నారు. తనికెళ్ల భరణి, మధుసూధన్ రావు, రాజా రవీంద్ర నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డే, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: రాజ్ తోట -
'దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా' సాంగ్ విన్నారా?
యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్‌పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి 'దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా..' అనే లిరికల్ సాంగ్‌ను నిజజీవితంలో మంచి మిత్రులు అయిన హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి విడుదల చేశారు. ఈ పాటను గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో మున్నా ఎస్డీ సాహిత్యాన్ని అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటలో టాలీవుడ్ రియల్ ఫ్రెండ్స్ అయిన ప్రభాస్ గోపీచంద్, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్, ఎన్టీఆర్ రామ్ చరణ్, మహేష్ బాబు వంశీ పైడిపల్లి ఇలాంటి వారిని చూపిస్తూ స్నేహం గొప్పదనం తెలియజేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. పాడుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. దోస్త్లందరికీ ఇది ఒక ఆంథమ్ సాంగ్ అవుతుందని నా నమ్మకం. ఈ పాట నాకు ఇచ్చిన మ్యూజిక్ దర్శకుడు గిఫ్టన్ కి దర్శకుడు గురు పవన్ కి థ్యాంక్స్ అన్నారు. చదవండి: అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్! 'బింబిసార'లో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? -
హీరో శ్రీవిష్ణుకు తీవ్ర అస్వస్థత
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. గత కొద్దిరోజులుగా ఆయన డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. తాజాగా అతడి రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య దారుణంగా పడిపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం శ్రీవిష్ణుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా విభిన్న పాత్రలు ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శ్రీవిష్ణు. వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న అతడు ప్రస్తుతం అల్లూరి సినిమా చేస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. చదవండి: అమ్మ బాబోయ్, ఒంటి మీద నూలుపోగు లేకుండా హీరో పోజులు! రీఎంట్రీ అనంతరం డైరెక్టర్లకు స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతున్న బాద్షా -
అల్లూరి టీజర్: ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్
శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అల్లూరి. అల్లూరి సీతారామరాజు అనే పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. సోమవారం (జూలై 4న) అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్.. పోలీస్ బయల్దేరాడురా.. అన్న డైలాగ్‌తో వీడియో మొదలైంది. విప్లవానికి నాంది చైతన్యం.. చైతన్యానికి నాంది నిజాయితీ.. నిజాయితీకి మారుపేరు అల్లూరి అన్న డైలాగ్ అదిరిపోయింది. మొత్తానికి ఒకటిన్నర నిమిషంలోనే తను ఫైర్ మీదున్న పోలీస్ అని, నిజాయితీకి మారుపేరుగా నిలిచే అల్లూరినని చెప్పకనే చెప్పాడు శ్రీ విష్ణు. త్వరలోనే అసలైన ఫైరింగ్ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు. ఈ సినిమాతో కాయదు లోహర్ తెలుగు చిత్రసీమకు పరిచయం కాబోతోంది. చదవండి: ఆ తరహా జానర్లో తెలుగులో సినిమాలు రాలేదు: డైరెక్టర్ 'రుద్రుడు'గా రాఘవ లారెన్స్.. ఆ పండుగకే రిలీజ్ -
ఓటీటీకి శ్రీవిష్ణు ‘భళా తందనాన’, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
Bhala Thandanana Streaming On Disney Plus Hotstar: యంగ్ హీరో శ్రీవిష్ణు సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. ఎందుకంటే అతడు ఎంచుకునే కథలు, మూవీ టైటిల్స్ కాస్తా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దీంతో అతడి సినిమాల్లో ఓ మెసెట్ ఉంటుందని ప్రేక్షకుడి అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా నటించిన మూవీ ‘భళా తందనాన’. మే 6న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. చదవండి: కరాటే కల్యాణిపై యూట్యూబర్ శ్రీకాంత్ సంచలన ఆరోపణలు డిస్నీప్లజ్ హాట్‌స్టార్ ఈ సినిమా విడుదల కానుందని తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. మే 20 నుంచి ఈ మూవీ డిస్నీప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్. వెండితెరపై పెద్ద ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్‌పై ఏంతమేర ఆకట్టుకుందో చూడాలి. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేథరిన్ హీరోయిన్గా నటించింది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. Bhala re Bhala! Mee screen ki vachestundi #BhalaThandhanana #BhalaThandanaOnHotstar@sreevishnuoffl @CatherineTresa1 @chaitanyahead @SaiKorrapati_ #manisharma @SrikanthVissa @dopsureshragutu #GarudaRam #MarthandVenkatesh @PeterHeinOffl @VaaraahiCC @MangoMusicLabel pic.twitter.com/rnETXyzBrR — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) May 13, 2022 -
భళా తందనాన మూవీ రివ్యూ
టైటిల్: భళా తందనాన నటీనటులు: శ్రీవిష్ణు, కేథరిన్, గరుడ రామ్, పొసాని కృష్ణమురళి, సత్య తదితరులు దర్శకుడు: చైతన్య దంతులూరి కథ, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా సంగీతం: మణిశర్మ బ్యానర్: వారాహి చలనచిత్రం నిర్మాత: రజనీ కొర్రపాటి సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేశ్ విడుదల తేది: మే 6, 2022 కొత్తదనం అంటే చాలు రంకెలేస్తాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. డిఫరెంట్ కాన్సెప్టులకు తివాచీ పరుస్తాడు. సినిమా హిట్టా? ఫట్టా అని కాకుండా అది ప్రేక్షకుడి మనసును హత్తుకుందా? లేదా? అన్నదాని మీదే ఎక్కువగా దృష్టి పెడతాడు. అంతేకాదు, తెలుగు భాషపై మమకారంతో తన సినిమాలన్నింటికీ దాదాపు తెలుగు టైటిల్స్ ఉండేలా చూసుకుంటాడు. అలా అన్నమయ్య కీర్తనలో ఉన్న భళా తందనానా అనే పదాన్ని తీసుకుని అదే టైటిల్‌తో సినిమా చేశాడు. ‘బాణం’ఫేం చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు శ్రీవిష్ణు. మరి ఈ మూవీ శ్రీవిష్ణుకి విజయాన్ని అందించిందా? తన సినిమాతో ప్రేక్షకుడికి కొత్తదనం పంచాడా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. భళా తందనాన కథేంటంటే.. శశిరేఖ(కేథరిన్) ఓ మీడియా సంస్థలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తుంది. ఓ అనాథాశ్రమంపై ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలుసుకొని.. ఆ న్యూస్ కవర్ చేయడానికి అక్కడికి వెళ్తుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ అనాథాశ్రమ అకౌంటెంట్ చందు అలియాస్ చంద్రశేఖర్(శ్రీవిష్ణు)తో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు దగ్గరయ్యే క్రమంలో సిటీలో వరుస హత్యలు జరుగుతాయి. హత్యకు గురైన వారంతా హవాలా కింగ్ ఆనంద్ బాలి(గరుడ రామ్) మనుషులు కావడంతో.. ఈ కేసుని సీరియస్ తీసుకొని స్టడీ చేస్తుంది శశిరేఖ. ఈ క్రమంలో ఆనంద్ బాలి దగ్గర ఉన్న రూ.2000 కోట్ల హవాలా మనీ ఎవరో దొంగిచించారనే విషయం తెలుస్తుంది. ఈ వార్తను తన మీడియా సంస్థలో ప్రచురించి ప్రపంచానికి తెలియజేస్తుంది శశిరేఖ. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంతకీ రూ.2000 కోట్లను దొంగిలించిదెవరు? ఈ దొంగతనం కేసుతో చందుకి ఉన్న సంబంధం ఏంటి?అనేదే మిగతా కథ ఎలా ఉందంటే.. బాణం, బసంతి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న చైతన్య దంతులూరి.. చాలా గ్యాప్ తర్వాత క్రైమ్ థ్రిల్లర్ కథతో ‘భళా తందనాన’ తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్‌కి కామెడీ, ప్రేమను యాడ్ చేసి అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇదే సినిమాకు కాస్త మైనస్ అయింది. కథలో కావాల్సినన్ని ట్విస్టులు, ఉత్కంఠ రేకెత్తించే సీన్స్ ఉన్నప్పటికీ.. కామెడీ, లవ్ ట్రాక్ కారణంగా రొటీన్ సినిమాగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఓ కిడ్నాప్ జరగడం..దానిని కనెక్ట్ చేస్తూ అసలు కథను ప్రేక్షకులకు చెప్పడంతో దర్శకుడు సఫలమయ్యాడు. వరుస హత్యలు.. హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది. పాట రూపంలో హీరో చెప్పే లవ్ ఫెయిలర్ స్టోరీ నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడమే కాకుండా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథంతా రూ. 2000 కోట్ల హవాలా మనీ చుట్టే తిరుగుతుంది. ఆ డబ్బుతో చందుకు ఉన్న సంబంధం ఏంటి? అది ఎక్కడా దాచారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుడికి కలుగుతుంది. క్లైమాక్స్ కొత్తగా ఉన్నప్పటికీ.. సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అసలు హీరో ఎవరు? అతని గతం ఏంటి? రూ. 2000 కోట్లు ఎక్కడ దాచాడు? అనే విషయాలను తెలియజేయకుండా.. రెండో భాగం ఉందని చెప్తూ కథని ముగించాడు. ఎలాంటి అశ్లీలతకు తావులేకుండా.. క్లీన్ ఎంటర్టైనర్గా సినిమా సాగుతుంది. ఎవరెలా చేశారంటే... ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు తన పాత్రలో ఒదిగిపోయాడు. ఫస్టాఫ్‌లో అమాయక చక్రవర్తిగా, సెకండాఫ్‌లో ఢిఫరెంట్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా తనదైన నటనతో మెప్పించాడు. గత సినిమాలతో పోలిస్తే.. ఇందులో శ్రీవిష్ణు నటనలో పరిణితి కనిపించింది. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కేథరిన్ మెప్పించే ప్రయత్నం చేసింది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేథరిన్.. తెరపై కాస్త బొద్దుగా కనిపించింది. ఇక ఈ సినిమాకు ఆమే డబ్బింగ్ చెప్పుకుంది. అయితే అది కాస్త నప్పలేదు. ‘మేడమ్ మీరు మాట్లాడే తెలుగు.. ఇంగ్లీష్‌లా ఉంటుంది’అని హీరోతో ఓ డైలాగ్ చెప్పించి.. ప్రేక్షకులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇక విలన్‌గా గరుడ రామ్ మెప్పించాడు. అయితే అతనికి బలమైన సీన్స్ లేకపోవడం మైనస్. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న దయామయం పాత్రలో పొసాని కృష్ణమురళి ఒదిగిపోవడమే కాకుండా..తనదైన కామెడీతో నవ్వించాడు. ఫస్టాఫ్‌లో సత్యతో వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. మిగిలిన నటీనటులు తమ, తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధానబలం మణిశర్మ సంగీతం.తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ ఏడాది సెన్సేషనల్ హిట్ ఇస్తాను- హీరో శ్రీవిష్ణు
‘అన్నమయ్య ఎన్నో కీర్తనలు రాశారు. అందులో‘దనానా భళాతందనానా’ ఒక్కటే విప్లవాత్మకమైన కీర్తన. ప్రకృతితో పాటు మనిషికి డబ్బు, కులం, మతం వంటి అంశాలు చర్చిస్తూ రాసిన ఈ గీతం చాలా హైలెట్ అయింది. మా కథకు యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందనే మా చిత్రానికి ‘భళా తందనాన’అనే టైటిల్ పెట్టామని చెప్పారు హీరో శ్రీవిష్ణు. ఆయన హీరోగా, కేథరిన్ థ్రెసా హీరోయిన్గా నటించిన చిత్రం భళా తందనాన. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణ లో రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. మే 6 న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హీరో శ్రీవిష్ణు మీడియాతో పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.ఆవెంటో ఆయన మాటల్లోనే.. ► చైతన్యతో నాకు 14 ఏళ్లుగా పరిచయం ఉంది. ఈ కథను నాకు బాణం(2009) సినిమా అప్పుడే చెప్పారు. బసంతి టైంలో ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ అప్పటికీ పూర్తిగా కథ వర్కౌట్ కాలేదు. ఆ తరువాత తను బిజీ అయ్యాడు నేను బిజీ అయ్యాను. నాలుగేళ్ళు తర్వాత కథకు ఒక రూపం రావడంతో బాగా నచ్చి ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. చైతన్యకు అన్ని శాఖలపై పట్టు వుంది. తను సెట్లో మోనిటర్ చూడరు. నాకు మొదట్లో అదే అనుమానం వచ్చి అడిగాను. నాకు ఫ్రేమ్ ఎలా వుందో, లైటింగ్ ఎట్లా పెట్టారో, నటీనటులు హావభావాలు అన్నీ నేను చెప్పినట్లే వస్తుంటాయి. అప్పడు మోనిటర్‌తో పనేంటి? అనేవారు. మొదటి సినిమాకే ఆయన అంత క్లారిటీగా వుండడంతో ఆయన ఆలోచన విధానం బాగా నచ్చింది. అందుకే ఆయనతో పనిచేయడం హ్యాపీగా అనిపించింది. ► ఈ సినిమాలో ముందు 25 నిమిషాలు క్యారెక్టర్ల పరిచయం ఉంటుంది. రానురాను కథలో డెప్త్ వెళ్లడంతో ప్రతి క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఇంతవరకు రాని కొత్త కోణం ఇందులో హైలెట్ గా ఉంటుంది. కేజీయఫ్ వంటి అంత పెద్ద సినిమాలో చేసిన ఆయన నా సినిమాలో చేయడం చాలా గొప్పగా ఉంది. ఆయనతో వచ్చే ఫైట్ సీక్వెన్స్ సినిమాను నిలబెడతాయి. ఒక అరుదైన కొత్త క్లైమాక్స్ ఈ సినిమాలో చూస్తారు. ► ఇది సస్పెన్స్ థ్రిల్లర్, ఇంటెన్సివ్ కథ. చాలా బాగుంటుంది. ఈ సినిమా చెప్పగానే నేను చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇందులో చాలా ఫన్ ఉంటుంది. ► ఈ చిత్రంలో నేను కామన్ మ్యాన్ గానటించాను. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కేథరిన్ నటించింది. కామన్ మ్యాన్ గా చాలా చేయాలి అనుకుంటాం, కానీ చేయలేం. ఆ సందర్భంలో ఈ జర్నలిస్టు సహకారంతో తీసుకుంటే ఎలా వుంటుంది అనేది నా పాత్ర. ఆ ప్రాసెస్ లో చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ► కేథరిన్ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆమె నాతో కంటే మిగిలిన చాలా పాత్రలతో కనెక్ట్ కావడంతో ఆమె నటనకు మంచి స్కోప్ వున్న పాత్ర అది. ఆమె కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుంది. ► ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి బీజియమ్స్ చాలా ఇంపార్టెంట్. మణిశర్మ చక్కటి బాణీలతోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా ఇచ్చారు ఇలాంటి సినిమాలకి సౌండ్ అనేది చాలా కీలకం. ఆ సౌండ్ విని చాలా మంది మళ్లీ మళ్లీ రావాలి అనిపించేటట్లుగా ఆయన మలిచారు ఇందులో. కొత్త బీజియమ్ మనం వింటాం. పాటలు కూడా సందర్భానుసారంగా ఉంటాయి ► ఇప్పటి వరకు నాకు సెన్సేషనల్ హిట్ అనేది లేదు. అయితే ఇప్పుడే మంచి మంచి కథలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో మాత్రం సెన్సేషనల్ హిట్ ఒకటి ఇస్తాను. ► ప్రస్తుతం అల్లూరి అనే సినిమా చేస్తున్నా. పోలీసు ఆఫీసర్ బయోపిక్. ఈ సినిమాతో మంచి హిట్ ఇవ్వగలననే నమ్మకముంది. -
తెరపైకి మరో 'అల్లూరి' సీతారామరాజు..
Ravi Teja Launched Sree Vishnu Alluri Movie Poster: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇందులో ఫైర్ ఎలిమెంట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను, వాటర్ ఎలిమెంట్‌గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను చూపించారు. క్యారెక్టర్లకు తగినట్లుగానే అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్ అద్భుతంగా నటించారు. రామ్ చరణ్, తారక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఇందులో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ ప్రేక్షకులను మెప్పించాడు. ఎంతలా అంటే ఆ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా. అలా ఇదివరకూ 'అల్లూరి సీతారామరాజు' చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అంతగా ఆకట్టుకున్నాయి వారి పాత్రలు. చదవండి: రామ్ చరణ్ చుట్టూ ఎగబడ్డ జనం.. వీడియో వైరల్ ఇప్పుడు మరో అల్లూరి సీతారామరాజు వెండితెరపై సందడి చేయనున్నాడు. 'అల్లూరి' పేరుతో మరో సినిమా రానుంది. శ్రీ విష్ణు హీరోగా డైరెక్టర్ ప్రదీప్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశాడు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మూవీలో పోలీసు అధికారి అల్లూరి సీతరామరాజుగా విష్ణు కనిపించనున్నాడు. ఇప్పటివరకు ఎవరికీ తెలియని గొప్ప పోలీసు అధికారి పాత్రను ఈ మూవీ ద్వారా తెలియజేస్తున్నామని పోస్టర్లో రాసి ఉంది. బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. హర్ష వర్ధన్ సంగీతం అందిస్తున్నారు. TITLE ASSAULT of My next as A Sincere Cop #𝗔𝗟𝗟𝗨𝗥𝗜 👮♂️ Witness The Greatest Police Story, Ever Told 🤙🏾 Directed by #PradeepVarma Produced by @BekkemVenugopal #Babita @luckymediaoff 🎶 @rameemusic 🎥#RajThota pic.twitter.com/Oe7PPXrCfI — Sree Vishnu (@sreevishnuoffl) April 5, 2022 చదవండి: సమంత 'యశోద'గా వచ్చేది అప్పుడే.. నాగ చైతన్య, అఖిల్‌తో పోటీ ! -
భళా తందనాన: లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు!
యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే కథలే కాదు, ఆయన నటించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి పదాలు తెలుస్తాయంటాడీ హీరో. తాజాగా ఆయన నటించిన చిత్రం భళా తందనాన. శుక్రవారం(జనవరి 28న) ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. 'రాక్షసులను చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి. నేను మామూలు మనిషిని....' అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. 'నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్‌కు కూడా రిస్కే', 'ఈ రోజుల్లో లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు' అన్న డైలాగులు బాగా పేలాయి. ఇక ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేథరిన్ హీరోయిన్గా నటించింది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. -
ఓటీటీలో అర్జున ఫల్గుణ.. ఎప్పుడు? ఎక్కడ? స్ట్రీమింగ్ అంటే..
Sree Vishnu Arjuna Phalguna In OTT: మూస ధోరణిలో కాకుండా డిఫరెంట్ పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీ విష్ణు. అతడు హీరోగా నటించిన అర్జున ఫల్గుణ సినిమా డిసెంబర్ 31న రిలీజైంది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ట్రాక్ ఎక్కింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. ఈ విషయాన్ని ఆహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నరేశ్, సుబ్బరాజు, మహేశ్, శివాజీ రాజా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి నిర్మించారు. ప్రియదర్శన్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రమే ఆడిన అర్జున ఫల్గుణ ఓటీటీలో ఎలా ఆడుతుందో చూడాలి! A fun yet thrilling ride of friendship, love & greed will premiere on Jan 26. #ArjunaPhalgunaOnAHA@sreevishnuoffl @MatineeEnt @DirTejaMarni #AnveshReddy @pasha_always @Actor_Amritha @adityamusic pic.twitter.com/OCzWaiB8fW — ahavideoIN (@ahavideoIN) January 13, 2022 -
‘అర్జున ఫల్గుణ’ మూవీ రివ్యూ
టైటిల్ : అర్జున ఫల్గుణ నటీనటులు : శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, నరేశ్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవి ప్రసాద్, ‘రంగస్థలం’మహేశ్ తదితరులు నిర్మాణ సంస్థ : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి దర్శకత్వం : తేజ మార్ని సంగీతం : ప్రియదర్శన్ సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి విడుదల తేది : డిసెంబర్ 31,2021 వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు ఎంచుకుంటూ.. .. విలక్షణ నటనతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘రాజ రాజ చోర’ చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ టాలెంటెండ్ హీరో.. తాజాగా ‘అర్జున ఫల్గుణ’అంటూ మరో డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు మూవీ ప్రమోషన్స్ కూగా గ్రాండ్‌గా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘అర్జున ఫల్గుణ’ఏ మేరకు అందుకుంది? రివ్యూలో చూద్దాం. ‘అర్జున ఫల్గుణ’కథేంటంటే..? డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటున్న ఐదుగురు స్నేహితులు అర్జున్(శ్రీవిష్ణు), రాంబాబు(రాజ్ కుమార్), తాడి(‘రంగస్థలం’మహేశ్), ఆస్కార్(చైతన్య గరికిపాటి), శ్రావణి(అమృత అయ్యర్)ల చూట్టూ ‘అర్జున ఫల్గుణ’కథ సాగుతుంది. వీరంతా చిన్నప్పటి నుంచి బెస్ట్‌ఫ్రెండ్స్. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే వ్యక్తిత్వం వాళ్లది. వీరంతా ఊర్లోనే సోడా సెంటర్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటారు. దాని కోసం బ్యాంకు లోన్‌కు ట్రై చేస్తారు. రూ. 50 వేలు ఇస్తే లోన్ వస్తుందని చెప్పడంతో.. డబ్బుకోసం వీళ్లు ప్రయత్నాలు చేస్తారు. ఈక్రమంలో ఈ ఐదుగురు గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడతారు. అక్కడి నుంచి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? సరదాగా ఊర్లో తిరిగే వీళ్లు గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ కేసు నుంచి ఈ ఐదుగురు ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ. (రాజ్‌కుమార్ ఎలా చేశారంటే..? ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు యాక్టింగ్ ఇరగదీశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన మోసుకొచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో కొన్నిచోట్ల నవ్వించాడు. ఇక శ్రీవిష్ణుకు జతగా శ్రావణి పాత్రలో అమృత అయ్యర్ మంచి నటనను కనబర్చింది. పల్లెటూరి అమ్మాయిలా తెరపై అందంగా కనబడింది. హీరో స్నేహితులుగా రంగస్థలం మహేశ్‌తో పాటు మిగిలిన ఇద్దరు కూడా చక్కగా నటించారు. ఇక కన్నింగ్ కరణంగా నరేశ్, రైతుగా దేవీ ప్రసాద్, హీరో తండ్రిగా శివాజీ రాజా తమ అనుభవాన్ని మరోసారి తెరపై చూపించారు. పోలీసాఫిసర్గా సుబ్బరాజ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. సినిమాలో హీరో ఎంత బాగా నటించినా కూడా.. కథ, కథనం బాగుంటేనే అది సక్సెస్ అవుతుంది. రొటీన్ కథనైనా.. దాన్ని తెరపై వైవిధ్యంగా చూపిస్తే దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. కథ తగ్గట్టు సినిమాని డ్రైవ్ చేసే బాధ్యత దర్శకుడిది. ఈ విషయంలో కొత్త దర్శకుడు తేజ మార్ని తడబడ్డాడు. తొలి సినిమా ‘జోహార్’తో మంచి మార్కులు కొట్టేసినా తేజ.. ‘అర్జున ఫల్గుణ’మూవీని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. కథ, కథనం రెండూ రోటీన్‌గా ఉన్నాయి. గోదావరి జిల్లాలకు చెందిన ఐదుగురి నిరుద్యోగుల నేపథ్యాన్ని కథాంశంగా మలచుకొని ‘అర్జున ఫల్గుణ’సినిమాన్ని తెరకెక్కించాడు. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా.. తెరపై మాత్రం రోటీన్‌గా చూపించడం సినిమాకు మైనస్. ఫస్టాఫ్‌లో కామెడీతో కొంతమేర నవ్వించే ప్రయత్నం చేసినా.. సెకండాఫ్ పూర్తిగా తేలిపోయింది. ప్రేక్షకుడి ఊహకందే విధంగా కథనం సాగుతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. థ్రిల్లింగ్ మూమెంట్స్, లవ్, పల్లెటూరి చమత్కారం.. ఇలా కథలో జొప్పించడానికి చాలా ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. వాటిని చేచేతూలా చేజార్చుకున్నాడు. అర్జుణుడు, అభిమన్యుడు, పద్మవ్యూహం అంటూ పెద్ద పెద్ద పదాలతో కథను ప్రారంభించిన దర్శకుడు.. చివరకు గమ్యంలేని ప్రయాణంలా మార్చేశాడు. అయితే సుధీర్ వర్మ డైలాగ్స్ మాత్రం సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ప్రియదర్శన్ సంగీతం కొంతమేర ఆకట్టుకున్నా.. కొన్ని చోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అతిగా అనిపిస్తుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కథలను ఎంచుకోవడంతో దిట్ట అయినా శ్రీవిష్ణువు.. ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త బోల్తా పడ్డాడనే చెప్పాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అందుకే తెలుగు టైటిల్స్ పెడతా.. ఆ కథలే నా బలం: శ్రీవిష్ణు
‘తెలుగు టైటిల్స్ నాకు చాలా ఇష్టం. నా సినిమా టైటిల్స్ అన్ని తెలుగులో పెట్టేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతుంటాను. అలా మధ్య మధ్యలో సంస్కృత పదాలు కూడా పెడుతుంటాను. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి తెలుగు పదాలు తెలుస్తాయి. అర్జున ఫల్గుణ అనేది ఈ తరం పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకరో ఇద్దరూ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే నేను తెలుగు టైటిల్స్‌ని ఇష్టపడతా’అన్నారు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అర్జున ఫల్గుణ ’.అమృతా అయ్యర్ హీరోయిన్గా ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఈ ఏడాదిలో నాకు ఇది మూడో చిత్రం. కొత్త దర్శకులనే నేను ఎంచుకుంటూ వచ్చాను. మంచి కథతో దర్శకులు వస్తే.. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. నాకు మొదటి సారి తేజ మర్నిలో దర్శకుడు కనిపించాడు. బాగా హ్యాండిల్ చేయగలడని నాకు నమ్మకం కలిగింది. ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు. ఎమోషనల్ హ్యాండిల్ చేయగలిగితే సినిమా వర్కవుట్ అవుతుంది. అందుకే సినిమాను ఓకే చేశాను. చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి నాకు షాక్ ఇచ్చాడు. 55 రోజుల్లో షూట్ చేయడం చాలా కష్టం. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ►అర్జున ఫల్గుణ అనేది భారతంలోని టాపిక్. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ,విజయ ఇలా ఓ పది పేర్లు తలుచుకుంటూ ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. కానీ రాను రాను అది అర్జున ఫల్గుణ వరకే చెప్పారు. ఉరుములు మెరుపులు పిడుగులు వస్తే అందరూ అర్జున ఫల్గుణ అని అనుకునేమనేవారు. కానీ కొన్ని పేర్లు విన్నప్పుడు, తలుచుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అలా అర్జున ఫల్గుణ అనే పేరులో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ► గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్లో కథ చేయాలని అనుకున్నాను. ఊరి బ్యాక్ డ్రాప్‌లోంచి సిటీకి వచ్చిన కథలు చేశాను. కానీ మొత్తం ఊరి బ్యాక్ డ్రాప్లో చేయలేదు. ఇది చాలా ఫ్రెష్‌గా అనిపించింది. పూర్తి కథను సిద్దం చేయమని చెప్పాను. ► డిగ్రీలు పూర్తి చేసి ఊర్లోనే ఉన్న ఐదుగురి స్నేహితుల కథే ఈ సినిమా. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో మా క్యారెక్టర్స్ ఉంటాయి. యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కించాం. కానీ దాన్ని గోదావరి జిల్లాకు అడాప్ట్ చేశాం. నర్సీపట్నంలో జరిగిన ఘటనల ఆధారంగానే ఈ సినిమాను తీశాం. ► ఇది వరకు చాలా సినిమాల్లో కొంతమేర గోదావరి యాసలో మాట్లాడాను. కానీ ఇప్పుడు పూర్తిగా గోదావరి యాసలోనే ఉంటుంది. ఇది కరెక్ట్ స్లాంగ్. ఈ సినిమాలో యాస పరంగా ఎలాంటి హద్దుల్లేవు. పూర్తిగా ఎటకారంగా ఉంటుంది. ► తెలుగు హీరోలందరినీ నేను ఆరాధిస్తాను. అందరినీ ఇష్టపడతాను. పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా అందరినీ నేను గొప్పగా చూస్తుంటాను. మన హీరోలను గౌరవించుకునే అవకాశం వస్తే నేను దాన్ని వాడుకుంటాను. వాళ్లంతా గొప్ప వాళ్లు కాబట్టే స్టార్లు అయ్యారు. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇందులో ఎంతో పాజిటివ్‌గా ఉంటుంది. ► అర్జున ఫల్గుణలో అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. పద్దతులు, సంప్రదాయాలు చూపిస్తాం. ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషన్ బాగు ఉంటుంది. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ముల్కల లంక అనే ఊర్లోకి వెళ్తారు. ► రంగస్థలం మహేష్, చైతన్య, రాజావారు రాణివారు చౌదరి, నేను, అమృతా అయ్యర్ మేం ఐదుగురం ఉంటాం. ప్రతీ పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. పెద్ద నరేష్ , శివాజీ రాజా, సుబ్బరాజు అందరూ అద్భుతంగా నటించారు. ► రియలిస్టిక్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. కెరీర్లో ఒకటో రెండో రియలిస్టిక్ కథలు వస్తాయి. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతీ కథను రియలిస్టిక్ చేసేందుకు ప్రయత్నిస్తాను. నా సినిమాలన్నీ నాచురల్‌గా ఉంటాయని అందరూ అంటుంటారు.రియలిస్ట్ కథలే నా బలం. ► నేను పెద్దగా ప్రయోగాలు ఏమీ చేయలేదు. నార్మల్ కథనే కాస్త కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను. తిప్పరా మీసం సినిమాను బాగా నమ్మాం. అమ్మ సెంటిమెంట్‌తో ఆ సినిమా చేశాను. అంతకు ముందే బ్రోచేవారెవరురా అంటూ ఫుల్ కామెడీ సినిమాను తీశాను. తిప్పరా మీసం కూడా ఎక్కువ సరదాగా ఉంటుందని అనుకున్నారు. కానీ అది పూర్తిగా మదర్ సెంటిమెంట్‌తో ఉంటుంది. కానీ నా వరకు అదే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన చిత్రం. ► ప్రస్తుతం భళా తందనాన అనే సినిమా చేస్తున్నాను. లక్కీ మీడియాలో మరో చిత్రం చేస్తున్నాను. భళా తందనాన పెద్ద పాన్ ఉన్న సినిమా. మంచి యాక్షన్ డ్రామా. లక్కీ మీడియాలో చేస్తోన్నది పోలీస్ ఆఫీసర్ బయోగ్రఫీ. ఇందులో ఐదు ఏజ్ గ్రూపులుంటాయి. -
Bhala Thandanana: శ్రీవిష్ణు లుక్ అదిరిందిగా!
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ‘భళా తందనాన’ చిత్రీకరణ పూర్తయింది. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించారు. కేథరిన్ థ్రెసా హీరోయిన్గా నటించారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో శ్రీ విష్ణుని ఇప్పటిదాకా చూడని డిఫరెంట్ లుక్‌లో చూపించనున్నారు చైతన్య. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్‌లకు కొదవే ఉండదు. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ప్రతినాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ రామచంద్ర రాజు రోల్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సురేష్ రగుతు. -
శ్రీ విష్ణు కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది!
Arjuna Phalguna Movie Release Date: విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీవిష్ణు. ఇటీవల ఆయన నటించిన 'రాజరాజ చోర' చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన నటించిన 'అర్జున ఫల్గుణ' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 31న మూవీ రిలీజ్ అవుతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ మేరకు రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో నరేశ్, సుబ్బరాజు, మహేశ్, శివాజీ రాజా ముఖ్య పాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి నిర్మించారు. ప్రియదర్శన్ సంగీతం అందించాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి! -
ఆకట్టుకుంటున్న ‘మైల్స్ అఫ్ లవ్’ టీజర్
హుషారు ఫేమ్ అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మైల్స్ ఆఫ్ లవ్’. ఫ్యాక్టరీ బ్యానర్ పై రాజిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాలుగు పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని యంగ్ మరో శ్రీవిష్ణు విడుదల చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మైల్స్ అఫ్ లవ్ టీజర్ చూశాను. చాలా ఫ్రెష్ గా ఉంది. హీరో అభినవ్ చాలా అందంగా కనిపించాడు.ఈ సినిమా కి అందరు కొత్తవాళ్లే పని చేశారు. ఈ సినిమా కి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. మెలోడీ మ్యూజిక్ తో ఈ టీజర్ మొదలవుతుంది. ఇది ప్యూర్ అండ్ హానెస్ట్ లవ్ స్టోరీ అని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఎంతో ఫీల్ తో హీరో హీరోయిన్ ల మధ్య లవ్ స్టోరీ ఉండబోతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తాయని టీజర్ చివర్లో వచ్చే ఓ షాట్ ద్వారా చూపించారు. 'ప్రాబ్లమ్ ని ప్రాబ్లమ్ లా కాకుండా సొల్యూషన్ లా చూస్తే సొల్యూషన్ ప్రాబ్లమ్ అవుతుంది.. ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుంది..' అనే డైలాగ్ చాలా బాగుంది. -
‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
-
‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
టైటిల్ : రాజ రాజ చోర నటీనటులు : శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్ తదితరులు నిర్మాణ సంస్థ : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు : అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ దర్శకత్వం : హసిత్ గోలి సంగీతం : వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ : వేద రమణ్ శంకరన్ ఎడిటింగ్: విప్లవ్ విడుదల తేది : ఆగస్ట్ 19,2021 చిత్ర పరిశ్రమలో ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. విలక్షణ నటనతో, వైవిద్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. యావరేజ్ నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ యంగ్ హీరో సెక్సెస్కి ‘గాలి సంపత్’ బ్రేక్ వేశాడు. దీంతో కాస్త వెనకడుగు వేసిన శ్రీవిష్ణు.. ఈ సారి ఎలాగైనా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలనే కసితో ‘రాజ రారజ చోర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు మూవీ ప్రమోషన్స్ కూగా గ్రాండ్‌గా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘రాజ రాజ చోర’ఏ మేరకు అందుకుంది? ఈ సినిమాతో శ్రీవిష్ణు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడా లేదా? రివ్యూలో చూద్దాం. రాజ రాజ చోర కథేంటంటే భాస్కర్ (శ్రీవిష్ణు) ఓ చిన్న దొంగ. ఓ జిరాక్స్ షాపులో పని చేస్తూ అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. పైకి మాత్రం తాను ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. అలా చెప్పుకొనే సంజన అలియాస్ సంజు(మేఘ ఆకాశ్)తో ప్రేమాయణం సాగిస్తాడు. అయితే భాస్కర్‌కు అప్పటికే విద్య( సునైన)తో పెళ్లి జరిగుతుంది. వాళ్లిద్దరికి ఒక బాబు కూడా ఉంటాడు. అయినప్పటికీ భాస్కర్ సంజనతో ఎందుకు ప్రేమాయణం సాగించాడు? తాను ప్రేమించిన వ్యక్తి సాఫ్టవేర్ ఇంజనీర్ కాదనీ, అతనికి పెళ్లై, బాబు కూడా ఉన్నాడని తెలిసిన తర్వాత సంజన పరిస్థితి ఏంటి? దొంగగా పట్టుబడి పోలీసులకి చిక్కిన భాస్కర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే? ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. దొంగగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా రెండు కోణాల్లో అద్భుత నటనను కనబరిచాడు. తనదైన మేనరిజమ్స్‌తో నవ్విస్తూనే.. ఎమోషనల్ సీన్స్‌ని కూడా అద్భుతంగా పండించాడు. సినిమా మొత్తం తన భూజాల మీద వేసుకొని కథని నడిపించాడు. హీరో భార్య విద్య పాత్రలో సునైనా ఒదిగిపోయింది. మధ్యతరగతికి చెందిన వివాహితగా ఆకట్టుకుంది. ఇక సంజూగా మేఘా ఆకాశ్ పర్వాలేదనిపించింది. పోలీస్ అధికారి విలియమ్ రెడ్డి పాత్రలో రవిబాబు ఒదిగిపోయిన తీరు బాగుంది. స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. అవినీతి పోలీసు అధికారిగా అదరగొట్టేశాడు. అంజమ్మ పాత్రలో గంగవ్వ మెప్పించింది. తనదైన పంచులతో నవ్వులు పూయిచింది. శ్రీకాంత్ అయ్యంగర్, అజయ్ ఘోష్, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే? అవసరాల కోసం దొంగగా మారిన ఓ వ్యక్తి.. తన తప్పును తెలుసుకొని మంచి వాడిగా ఎలా మారాడనేదే ఈ సినిమా కథ. మనసు మాట వినకుండా.. డబ్బు కోసం ఆశ పడి చేసే ఏ పనైనా తప్పే అనే సందేశాన్ని కామెడీ యాంగిల్లో చూపించాడు దర్శకుడు హసిత్ గోలి. దానికి కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చి కథను నడిపించాడు. సాధారణంగా దర్శకులు సేఫ్‌గా ఉండేందుకు తమ తొలి సినిమాని ప్రేమ కథతో ప్రారంభిస్తారు. కానీ డైరెక్టర్ హిసిత్ మాత్రం తన డెబ్యూ మూవీనే ఇలాంటి కొత్త తరహా కథను చెప్పాలనుకొనే ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. అనుకున్నది తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. భాస్కర్, విద్యల సంబంధించిన సన్నివేశాలు మొదలయ్యాక కథలో వేగం పెరుతుంది. అయితే కథను సాగదీస్తూ అసలు విషయాన్ని ఇంటర్వెల్ వరకు లాగడం ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇంటర్వెల్ ముందు పోలీసులకు శ్రీవిష్ణు పట్టుబడినప్పుడు వచ్చే సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. అంతేకాదు సెండాఫ్‌పై అంచనాలను పెంచుతుంది. కానీ అక్కడ కూడా కథను నెమ్మదిగా సాగడం కాస్త మైనస్. కథను ఎమోషనల్‌గా డీల్ చేయడానికి స్కోప్ ఉన్నప్పటీ.. డ్రామాపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు దర్శకుడు. సెకండాఫ్‌లో భాస్కర్ దొంగతనం చేసే సీన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే, తనికెళ్ల భరణి చెప్పే ప్రవచనాలతో ముడిపెడుతూ కథని నడిపించిన విధానం బాగుంటుంది. ఇక ఈసినిమాకు ప్రధాన బలం వివేక్ సాగర్ సంగీతం. పాటలు అంతంతమాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతంతో అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సెకండాఫ్‌లో వచ్చే సిధ్ శ్రీరామ్ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించేవిధంగా ఉంటుంది. వేద రమణ్ శంకరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ విప్లవ్ తన కత్తెరకు ఇంకా చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఫ్యామిలీ అంతా ఇష్టపడే మూవీ ‘రాజ రాజ చోర’: శ్రీవిష్ణు
-
కథ లేకుండా కామెడీ నడిపించలేం!
‘‘చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. నేను, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బాల్య స్నేహితులం. ఇద్దరం కలిసి చేసిన షార్ట్ ఫిలింస్‌కు మంచి అభినందనలు వచ్చాయి. ‘మెంటల్ మది’లో చిత్రం ద్వారా తనకు డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత నేను కూడా ఎంట్రీ ఇచ్చాను’’ అని దర్శకుడు హసిత్ గోలి అన్నారు. శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. (చదవండి: ఆ ఫొటో వల్లే సినిమా ఛాన్స్ వచ్చింది : వైశాలీ రాజ్) ఈ సందర్భంగా చిత్రదర్శకుడు హసిత్ గోలి మాట్లాడుతూ– ‘‘మా నాన్న గోలి హనుమత్ శాస్త్రి గృహ నిర్మాణ శాఖలో సివిల్ ఇంజనీర్. ఆయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. అందుకే నాకూ సాహిత్యంపై అభిరుచి పెరిగింది. శ్రీవిష్ణు నటించిన ‘బ్రోచెవారెవరురా’ సినిమాకి దర్శకత్వ శాఖలో చేశాను. అంతకు ముందే శ్రీవిష్ణుకి చెప్పిన కథతో సినిమా చేద్దామనుకున్నాం. అయితే, దానికన్నా మంచి ఐడియా రావడంతో ‘రాజ రాజ చోర’ను స్టార్ట్ చేశాం. శ్రీవిష్ణులోని కామెడీని పూర్తి స్థాయిలో మా సినిమాలో చూపిస్తున్నాం. ఓ దొంగ ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు? అనేది కామెడీ కోణంలో చూపించాం. అయితే బలమైన కథ లేకపోతే కామెడీతోనే సినిమా రన్ అవుతుందనుకోను. అందుకే మంచి కథ తయారు చేసుకున్నాను’’ అన్నారు. (చదవండి: అంతదాకా వస్తే టీ.. కాఫీ అందించడానికీ రెడీయే!) -
ఆగస్ట్ 19న వస్తున్న ‘రాజ రాజ చోర’
యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లు. హితేశ్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగగా హిలేరియస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఎంటర్టైనింగ్ టీజర్, పాటలు సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను ఆగస్ట్ 19న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకోవాలని, మంచి సినిమాలను చూడాలనుకుంటున్నారు. `రాజ రాజ చోర` ఈ అపరిమితమైన వినోదాన్ని అందించడం ఖాయం అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
రాజ రాజ చోర: మందు గ్లాసు పట్టుకున్న గంగవ్వ, శ్రీవిష్ణు
డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఆయన తాజాగా నటించిన చిత్రం రాజ రాజ చోర. మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఇందులో శ్రీవిష్ణు, బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ మందు గ్లాసు పట్టుకుని కనిపించారు. తనో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పిన హీరో నిజానికి దొంగతనం చేస్తాడన్నట్లుగా చూపించారు. ఇందులో కామెడీకి కూడా ఎటువంటి ఢోకా లేనట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో గంగవ్వతోపాటు తనికెళ్ళ భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, వాసు, ఇంటూరి తదితరులు నటించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. చదవండి: పాపం 'గాలి సంపత్' అప్పుడే ఓటీటీ బాట! -
పాపం 'గాలి సంపత్' అప్పుడే ఓటీటీ బాట!
కొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గాలి సంపత్. ఫి..ఫి..ఫీ అంటూ గాలి భాషను పరిచయం చేసిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్‌గా మాత్రం హిట్టవలేదు. పైగా బాక్సాఫీస్ దగ్గర జాతి రత్నాలు పోటీని తట్టుకుని నిలబడలేక కుప్పకూలిపోయింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అప్పుడే ఓటీటీ బాట పట్టింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో మార్చి 19న రిలీజ్ కానుంది. ఇందుకోసం ఆహా టీమ్ చిత్రయూనిట్‌తో మంచి డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా 'గాలి సంపత్'లో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి సమర్పణలో ఎస్. కృష్ణ, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్లు రాబట్టడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌కు మొగ్గు చూపారు. ఫలితంగా సినిమా రిలీజై పట్టుమని పది రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వస్తుండటం టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: 'గాలి సంపత్' మూవీ రివ్యూ విలన్ గా నన్ను చూడరేమో!: శ్రీ విష్ణు -
ఆ అభినందనలను ఎప్పటికీ మర్చిపోలేను: రాజేంద్ర ప్రసాద్
‘‘నా కెరీర్లో చేసిన సరికొత్త ప్రయత్నం ‘గాలి సంపత్’. ‘అన్నయ్యా.. ఈ చిత్రంలో ఆస్కార్ అంత పర్ఫార్మెన్స్ చేశావు’ అనే అభినందనలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.. నా గుండెల్లో ఉంచుకుంటాను’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. శ్రీవిష్ణు, లవ్లీ సింగ్ జంటగా అనీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్’. డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఎస్.కృష్ణ నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఫిలిం స్కూల్లో ఉన్నప్పుడు నాకు మైమ్ పర్‌ఫార్మెన్స్‌లోనే గోల్డ్ మెడల్ వచ్చింది. ఇన్ని సంవత్సరాలకు ఆ డ్రెస్ వేసుకుని స్టేజ్ మీదకు రావడానికి మా మైమ్ మధునే కారణం’’ అన్నారు. ‘‘మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని గ్యారెంటీగా చెప్పగలను’’ అన్నారు ఎస్.కృష్ణ. ‘‘మీ పిల్లలు, కుటుంబంతో సినిమా చూస్తే మరింత ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘మైమ్ ముఖ అభినయాన్ని సినిమాలో పెట్టాలంటే దమ్ముండాలి. ఎస్.కృష్ణగారి ఆలోచనకి హ్యాట్సాఫ్’’ అన్నారు మైమ్ మధు. ఈ కార్యక్రమంలో కమెడియన్ సత్య, హీరోయిన్ లవ్లీ సింగ్ మాట్లాడారు. చదవండి: పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్న జాతిరత్నం నవీన్ పొలిశెట్టి -
'గాలి సంపత్' మూవీ రివ్యూ
చిత్రం: ‘గాలి సంపత్’; తారాగణం: రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు, లవ్లీ సింగ్, సత్య, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అనీశ్ కురువిల్లా; కథ: ఎస్. కృష్ణ; సంగీతం: అచ్చు రాజమణి; కెమేరా: సాయి శ్రీరామ్; ఎడిటింగ్: బి. తమ్మిరాజు; నిర్మాతలు: ఎస్. కృష్ణ, హరీశ్ పెద్ది, సాహూ గారపాటి; సమర్పణ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి; దర్శకత్వం: అనీశ్ కృష్ణ; నిడివి: 119 నిమిషాలు; రిలీజ్: మార్చి 11 కొన్ని కాన్సెప్టులు వినడానికి చాలా బాగుంటాయి. ఉద్విగ్నతకు గురిచేస్తాయి. అయితే, ఆ కాన్సెప్టును సరైన రీతిలో కథగా డెవలప్ చేసుకొని, ఆసక్తికర సన్నివేశాలతో అల్లుకున్నప్పుడే పూర్తిస్థాయి సినిమా స్క్రిప్టు అవుతుంది. లేదంటే, మంచి కాన్సెప్టు సైతం మెచ్చుకొనే రీతిలో తయారు కాలేదని పెదవి విరవాల్సి వస్తుంది. ‘గాలి సంపత్’ చూశాక ఇలాంటి ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతాయి. ప్రకృతి దైవం లాంటిది. అప్పుడప్పుడు కొంత హాని చేసినట్టనిపించినా, దాని స్వభావం మనల్ని రక్షించడమే అనే పాయింట్ చెప్పేందుకు ఈ 2 గంటల చిన్న సినిమాలో ప్రయత్నించారు. కథేమిటంటే..: అరకులో ట్రక్కు డ్రైవర్ సూరి (శ్రీవిష్ణు). తల్లి లేని అతనికి తండ్రి సంపత్ (రాజేంద్రప్రసాద్) ఒక్కడే ఉంటాడు. నోట మాట పోవడంతో, ‘‘ఫి... ఫి... ఫీ’’ అంటూ గాలితో మాట్లాడుతుంటాడు కాబట్టి, ఆ తండ్రి పేరు గాలి సంపత్. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవాలని నాటక పోటీలలో పాల్గొంటూ, ఉంటాడు గాలి సంపత్. ఆ ఊరి సర్పంచ్ కూతురు (లవ్లీ సింగ్)ను ప్రేమిస్తాడు సూరి. అప్పులు తీర్చేసి, ఎలాగైనా ఓ ట్రక్కు కొనుక్కొని, ఆమెను పెళ్ళాడాలని మనోడి ప్లాన్. ఓ బ్యాంకు మేనేజర్‌ను మొహమాటపెట్టి, 5 లక్షలు తెస్తాడు. తీరా నాటక పోటీల కోసం ఆ డబ్బు అతని తండ్రి తీస్తాడు. దాంతో, కంటికి కనిపించకుండా పొమ్మని కొడుకు అంటాడు. ఆ క్రమంలో హోరున కురుస్తున్న వర్షంలో ఇంటి వెనకే లోతైన పెద్ద గోతిలో పడిపోతాడు తండ్రి. పైకి మాట్లాడలేని, అరవలేని ఆ మనిషి ఆ గోతిలో పడ్డ సంగతి ఎవరూ గమనించరు. అతనికై వెతుకులాట సాగుతుంది. తండ్రిని ద్వేషిస్తున్న కొడుకుకు తన కోసం చిన్నప్పుడు తండ్రి చేసిన త్యాగం లాంటివన్నీ సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌లో వస్తాయి. చివరకు ప్రకృతిని ద్వేషించిన తండ్రికి ఆ ప్రకృతే ఎలా సహకరించింది, అతని అభినయ ప్రతిభ ఎలా బయటపడిందన్నది అక్కడక్కడ మెరుపులతో సాగే మిగతా కథ. ఎలా చేశారంటే..: లేటు వయసులో ఘాటు పాత్ర దక్కడం ఏ నటుడికైనా వరం. నాలుగు దశాబ్దాల పైచిలుకు తరువాత నటుడు రాజేంద్రప్రసాద్ కు ఇప్పుడు అలాంటి వరం మరోసారి దక్కింది. ఈ సినిమా టైటిల్ రోల్ ఆయనదే. ఇంకా చెప్పాలంటే, కథ అంతా ఆయన చుట్టూరానే తిరుగుతుంది.ఆయన తన నట విశ్వరూపం చూపెట్టారు. శ్రీవిష్ణు బాగా చేశారు. మహారాష్ట్ర మోడలింగ్ అమ్మాయి లవ్లీ సింగ్ ఈ సినిమాలో అందానికీ, అభినయానికీ కూడా తక్కువే. మిగిలిన పాత్రల్లో గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా శ్రీకాంత్ అయ్యంగార్, ఆడిటింగ్ ఆఫీసర్ గా అనీశ్ కురువిల్లా లాంటి వారి కామెడీ అక్కడక్కడ ఫరవాలేదనిపించినా, అతిగా సాగదీసే సరికి ఉసూరుమనిపిస్తుంది. ఎలా తీశారంటే..: వరుస హిట్లతో జోరు మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ఈసారి ఈ చిన్న కథ, తెలుగు తెరపై కొత్త ప్రయత్నంతో సినీ నిర్మాణంలోకీ వచ్చారు. తానే మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అరకులో చిత్రీకరించిన ఈ సినిమాలో ప్రధానమైనది తండ్రీ కొడుకుల సెంటిమెంట్. అది అక్కడక్కడా పండింది. కానీ, కొడుకు ఎవరిని ప్రేమిస్తున్నాడో తండ్రికి తెలియకపోవడం, సాక్షాత్తూ కొడుకు పెళ్ళినే అతను చెడగొట్టడం అంత కన్విన్సింగ్‌గా లేదు. ఫ్లాష్‌బ్యాక్ బాగున్నా, తన చిన్నప్పుడు ఏం జరిగిందో కళ్ళారా చూసిన కొడుకుకు ఇంకొకరు చెప్పేవరకు అసలేం జరిగిందో తెలియదనడమూ పెద్దగా అతకలేదు. తీసుకున్న పాయింట్ బాగున్నా, కథారచనలో ఇలాంటి ఇబ్బందులున్నాయి. సహజ పరిణామ క్రమంగా కాక, అనుకున్నట్టల్లా సంఘటనలు జరిగిపోయే సినిమాటిక్ లిబర్టీలూ బోలెడు. ఫస్టాఫ్‌లో చాలా భాగం అసలు కథకు రంగం సిద్ధం చేయడంతోనే సరిపోతుంది. రాజేంద్రప్రసాద్ మూకాభినయ (మైమ్) ప్రదర్శన దగ్గర నుంచి కాస్తంత ఊపు వస్తుంది. గోతిలో పడడ మనే పాయింట్ చుట్టూరానే కథ నడిస్తే బాగుండేది. కానీ, తీసుకున్న పాయింట్ చిన్నది కావడంతో కామెడీని జొప్పించే ప్రయత్నం చేశారు. అది అసలు కథా గమనానికి అడ్డమై కూర్చుంది. సెంటిమెంట్ పండుతున్న చాలా సందర్భాల్లో అనవసరపు హాస్యం అడ్డం పడినట్టు అనిపిస్తుంది. మరింత బలమైన సన్నివేశాలు రాసుకొని ఉంటే బాగుండేది. కొన్ని డైలాగులు మనసుకు హత్తుకుంటాయి. డైలాగులు లేని మైమ్ ప్రదర్శన, క్లైమాక్స్ గోతి సీన్ లాంటి చోట్ల అచ్చు రాజమణి నేపథ్య సంగీతాన్ని ప్రత్యేకించి ప్రస్తావించి తీరాలి. ఇవన్నీ సినిమాలో మంచి జీడిపలుకులు. కానీ, ఓవరాల్ గా వంటకంలోనే తీపి తగ్గింది. కొసమెరుపు: కథ తక్కువ! గాలి ఎక్కువ!! బలాలు: ►రాజేంద్రప్రసాద్ విశ్వరూపం, శ్రీవిష్ణు నటన ►అక్కడక్కడ మెరిసిన డైలాగ్స్, సెంటిమెంట్ ►కీలక సందర్భాల్లో నేపథ్య సంగీతం బలహీనతలు: ∙నిదానంగా సాగే ఫస్టాఫ్ ►కథను పక్కదోవ పట్టించే అనవసరపు ట్రాక్‌లు ►సాగదీసిన గ్రామీణ బ్యాంక్ కామెడీ ►రచయిత అనుకున్నట్టల్లా నడిచే సినిమాటిక్ సంఘటనలు రివ్యూ: రెంటాల జయదేవ -
ఇది సెంటిమెంట్ గాలి
-
విలన్ గా నన్ను చూడరేమో!
‘‘ఒకప్పుడు కథల కోసం నేను పరుగులు పెట్టాను. ఇప్పుడు మంచి కథలు నా దగ్గరకు వస్తున్నాయి. నేను విభిన్నమైన సినిమాలను ఎంచుకోవడం వల్ల కాదు.. నేను ఎంచుకున్న కథలను ప్రేక్షకులు ఆదరించడం వల్ల ఈ స్థాయిలో ఉన్నాను’’ అన్నారు శ్రీవిష్ణు. అనీష్ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘గాలి సంపత్’. అనిల్ రావిపూడి సమర్పణలో ఎస్. కృష్ణ, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. శ్రీ విష్ణు మాట్లాడుతూ – ‘‘గతంలో వచ్చిన నా సినిమాలు కొన్నింటికి అనిల్ రావిపూడిగారు సపోర్ట్ చేశారు. ఓ సందర్భంలో ‘గాలిసంపత్’ కథ చెప్పారు. కథ నచ్చింది. ఈ కథను ఎస్.కృష్ణ రాశారని, అనీష్ డైరెక్ట్ చేస్తారని చెప్పారు. అలాగే నా తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్‌గారు ఉంటారని తెలిసింది. సాధారణంగా తండ్రి బాధ్యతగా ఉంటే... కొడుకు జులాయిగా ఉంటాడు. కానీ ఈ సినిమాలో కొడుకు బాధ్యతగా ఉంటే.. తండ్రి జులాయి అన్నమాట. రాజేంద్రప్రసాద్ గారితో వర్క్ చేయడం ఫుల్ హ్యాపీ. నెగటివ్ పాత్రల గురించిన ఆలోచన ఉంది. కానీ విలన్ గా నన్ను చూడరేమోనని అనుకుంటున్నాను’’ అన్నారు. -
‘గాలి సంపత్’ ప్రీ రిలీజ్ వేడుక
-
గాలి సంపత్ ట్రైలర్: నవ్విస్తూనే ఏడిపించిన నట కిరీటి
ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న చిత్రం ‘గాలి సంపత్’. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్లో, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. అనీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఎస్. క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా.. మూవి ట్రైలర్‌ని విడుదల చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్‌తో పాటు కామెడీని కూడా పంచడం విశేషం. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికగా ఆ తప్పులను కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోళ్ళు ఏమి చేసినా ఊరికే చిరాకులొచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి.. నేను కూడా మా నాన్నని కాస్త ఓపికగా ప్రేమగా అడగాల్సింది’ అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగ్ ట్రైలర్ ప్రారంభమవుతుంది. మాటలు రాని రాజేంద్ర ప్రసాద్‌కు హీరో కావాలని ఉంటుంది. కానీ ఆయన నిర్ణయం కొడుకు (శ్రీ విష్ణు)కు నచ్చదు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాదం జరిగినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘ప్రతి అమ్మాయికీ డబ్బున్నోడే కావాలి.. లేకపోతే ఫారినోడు కావాలి.. డబ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డబ్బే ఇస్తాడు. టైమ్ ఎక్కడి నుంచి ఇస్తాడు' అంటూ హీరోయిన్‌తో హీరో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తానికి 'గాలి సంపత్' సినిమాలో కామెడీతోపాటు తండ్రికొడుకుల ఎమోషన్ని కూడా చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతంది. చదవండి : ‘పుష్ప’ అప్డేట్.. లీక్ చేసిన జానీ మాస్టర్ ఎన్టీఆర్ ధరించిన మాస్క్ ధరెంతో తెలుసా? -
‘పలాస 1978 గొప్ప సినిమా అవుతుంది’
కరుణకుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి6న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చిని ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ హీరోలు నాగశౌర్య, శ్రీవిష్ణు, దర్శకుడు మారుతి, పలువురు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు హాజరయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, చిత్రయూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ‘పలాస 1978 నేను చూసాను. ఇలాంటి కథలు చేయాలని ఉన్నా లోపల చాలా భయం ఉంటుంది. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు చాలా ధైర్యం వచ్చింది. ఇలాంటి కథలు నిర్మించాలంటే నిర్మాతకు చాలా ధైర్యం ఉండాలి. కొడుకు హీరో గా ఉన్నా కూడా సినిమా నే ప్రేమించి సినిమాను నిర్మించారు నిర్మాత ప్రసాద్ గారు. అందరికీ ఆల్ ద బెస్ట్’ అని నాగశౌర్య అన్నారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘పలాస గురించి తెలుసుకున్నప్పుడు నా సినిమా అనే ఫీల్ కలుగుతుంది. దర్శకుడు తనదైన మార్క్ ని తెలుగు సినిమా పై ఇవ్వబోతున్నారు అనిపిస్తుంది. రఘు గారు ఇచ్చిన ‘పలాస మీద వచ్చిన పాట’చాలా బాగుంది. ఇది ప్రేక్షకుల్లో బలమైన ముద్రను వేయాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘పలాస ఫస్ట్ కాపీ చూసిన రోజు దర్శకుడు కుమార్ ఒక అద్భుతం చేసాడని పించింది. మనం ఊహించిన దానికంటే చాలా బాగా తీసాడు. ప్రతి మేకర్‌కి ఇలాంటి సినిమా చేయాలనిపించేలా చేసాడు. అందులో రఘుకుంచె గారి నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. తమిళ సినిమాలు చూసి మనం ఫీల్ అవుతుంటాం.. వెట్రిమారన్ లాంటి వారిని చూసి ప్రేరణ పొందుతుంటాం. కానీ మనకూ అలాంటి దర్శకులున్నారు అని కరుణ కుమార్ గుర్తు చేసాడ’న్నారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్, నిర్మాత రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్, చిత్ర బృందం పాల్గొంది. చదవండి: బంజారా సినిమాను నిషేధించాలి రాధిక నాకు తల్లి కాదు! -
శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ నమస్సులు
విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు ఈసారి ‘రాజ రాజ చోర’ గా వస్తున్నాడు. శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా శనివారం మోషన్ టీజర్ ద్వారా చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. తదుపరి అవతారం ‘రాజ రాజ చోర’ నమస్సులు అంటూ శ్రీవిష్ణు ట్వీట్ చేయగా, పలువురు టాలీవుడ్ ప్రముఖులు అతనికి బర్త్‌డే విషెస్ తెలిపారు. హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను బట్టి చూస్తే.. శ్రీవిష్ణు దొంగగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ సునైన, సీనియర్ నటుడు తనికెళ్ల భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ ఇతర తారాగణం. సినిమా కథ అద్భుతంగా ఉంటుందని, ఏప్రిల్ వరకు షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నామని నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ చెప్పారు. సంగీతం: వివేక్ సాగర్, సినిమాటోగ్రఫీ: వేదరామన్, ఎడిటర్: విప్లవ్ నైషదం. కాగా, శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా సినిమా ‘తిప్పరా మీసం’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. హసిత్ గోలీకి ఇది తొలి సినిమా కావడం విశేషం. -
వినోదం.. వినూత్నం
వైవిధ్యంతో కూడిన కథలను ఎంచుకుంటూ హీరోగా సినిమాలు చేస్తుంటారు శ్రీవిష్ణు. తాజాగా మరో విభిన్న కథలో హీరోగా నటించబోతున్నారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన హాసిత్ గోలి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం కానున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల, కీర్తీ చౌదరి సహ–నిర్మాతలు. ‘‘వినూత్నమైన కథతో వినోదభరితంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. జనవరిలో చిత్రీకరణ మొదలుపెడతాం. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తారు. వేదరామన్ కెమెరామేన్‌గా పని చేస్తారు’’అని చిత్రబృందం పేర్కొంది. -
శ్రీ విష్ణు కొత్త సినిమా లాంచ్..
యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో నూతన సినిమా లాంచ్ అయింది. ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. హాసిత్ గోలి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వినోదం, డ్రామా కలగలిపిన ఈ చిత్రం వైవిధ్యంగా సాగుతుందని చిత్ర దర్శకుడు హాసిత్ గోలి తెలిపారు. శ్రీవిష్ణు, హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నెలలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంగీతం: వివేకసాగర్, ఛాయాగ్రహణం: వేదరామన్, సహ నిర్మాతలు: వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి. ఇక చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది. -
తిప్పరా మీసం : మూవీ రివ్యూ
టైటిల్: తిప్పరా మీసం జానర్: థ్రిల్లర్ నటీనటులు: శ్రీవిష్ణు, నిక్కీ తంబోలీ, సీనియర్ నటి రోహిణి, బెనర్జీ, దర్శకుడు: ఎల్ కృష్ణవిజయ్ నిర్మాత: రిజ్వాన్ సంగీతం: సురేశ్ బొబ్బిలి డీవోపీ: సిద్ వైవిధ్యభరితమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు.. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి సినిమాలతో శ్రీవిష్ణు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవరుతో మంచి విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో తాజాగా ‘తిప్పరా మీసం’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్లో శ్రీవిష్ణు నెగటివ్ షెడ్స్‌తో డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ క్రమంలో శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’ అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించాడా? మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? తెలుసుకుందాం పదండి.. కథ: మణిశంకర్ (శ్రీవిష్ణు) చిన్న వయస్సులోనే చెడు సాహవాలతో డ్రగ్స్‌కు అలవాటుపడుతాడు. ఇలాగే వదిలేస్తే.. అతని పరిస్థితి చేయిదాటిపోతుందేమోనని, డ్రగ్స్‌కు పూర్తిగా బానిస అవుతాడేమోనని భయపడి తల్లి లలితాదేవి (రోహిణి) అతన్ని రిహాబిటేషన్ సెంటర్లో చేరుస్తోంది. అక్కడ ఎవరూ తోడులేక తీవ్ర ఒంటరితనంలో మగ్గిపోయిన మణి.. తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు. అక్కడి నుంచి పారిపోయి ఓ పబ్‌లో డీజేగా పనిచేస్తూ ఇష్టారాజ్యంగా బతుకుతుంటాడు. తల్లి ఇంటి గడప కూడా తొక్కని అతని.. డబ్బుల కోసం మాత్రం తల్లిని వేధిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ క్రికెట్ బూకీ వద్ద తాను చేసిన అప్పును తీర్చేందుకు ఏకంగా తల్లి మీద మణి కోర్టులో కేసు వేస్తాడు. ఆమె రూ. 5 లక్షల చెక్కు ఇస్తే.. దానిని ఫోర్జరీ చేసి.. అది బౌన్స్ కావడంతో తల్లిని కోర్టుకీడుస్తాడు. ఏదీఏమైనా పరిస్థితులకు ఎదురెళ్లి తను అనుకున్నది సాధించాలనుకునే మణి.. అనూహ్య పరిణామాల నడుమ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. కాళీతో గొడవలు ఉన్నప్పటికీ.. అతన్ని తాను హత్య చేసినట్టు చెప్పి మణి జైలుశిక్ష అనుభవిస్తాడు. అసలు కాళీని చంపిందెవరు? ఆ మర్డర్ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు మణి మారిపోయి తల్లి ప్రేమను అంగీకరించి.. మంచి వాడిగా మారడానికి కారణమేమిటి? అన్నది సినిమాలో చూడాలి. విశ్లేషణ: తల్లీకొడుకుల బంధం బేసిక్ హ్యూమన్ రిలేషన్. అలాంటి కనీస మానవీయ బంధాన్ని కోర్టుకీడ్చిన కొడుకు.. చివరకు మంచి మనిషిగా ఎలా మారిపోయాడనే కథ బాగానే ఉన్నా.. దర్శకుడు స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడు. సినిమా ఫస్టాఫ్ అంతా ఫ్లాట్‌గా సాగుతూ.. పెద్దగా ఆసక్తి రేకెత్తించదు. మణి క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ దాదాపు ఫస్టాఫ్ అంతా సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. సినిమా మీద ఆసక్తి రేకెత్తించేలా కథనం సాగకపోగా.. మోనిక (నిక్కీ తంబోలీ)తో మణి లవ్, తనకు అప్పు ఇచ్చిన బూకీ జోసెఫ్‌తో మణి గొడవ, మణిని అతను ఏడురోజులపాటు బంధించడం ఈ సీన్లన్నీ బిట్లుబిట్లుగా వచ్చిపోయినట్టు అనిపిస్తాయి. డ్రగ్స్, మద్యం, స్మోకింగ్ అలవాటు వంటి సీన్లు చూపించినా మణి పాత్రలో పెద్దగా నెగిటివ్ షెడ్స్ ఉన్నట్టు అనిపించదు. అతని కోణంలో ప్రేక్షకుడికి అతనిపై జాలి కలుగుతుంది. పైగా చాలాచోట్ల మణి పాత్ర కూడా డైరెక్టర్ డల్‌గా డీల్ చేసినట్టు అనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్‌తో తీసిన సినిమాలు చాలావరకు సూపర్‌హిట్ అయ్యాయి. ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో తల్లీని కోర్టుకీడ్చడం.. కొడుకు కోసం తల్లి ఇల్లు అమ్మి డబ్బులు వంటి సీన్లు కొంతమేరకు బాగుండి ప్రేక్షకుల కనెక్ట్ అయ్యే అవకాశముంది. సెకండాఫ్‌లోనూ వచ్చే సీన్లు పెద్దగా ఆసక్తికరంగా అనిపించవు. శ్రీవిష్ణుకు మాస్ ఇమేజ్ కోసం ఈ సినిమాల్లో అక్కడక్కడ పెద్ద ఫైట్లే పెట్టారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్వీస్ట్.. మర్డర్ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు అనే అంశాలు ఒకింత ఆసక్తికరంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ, అప్పటికే సినిమాతో ప్రేక్షకుడు కొంతవరకు డిస్ కనెక్ట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. మరోసారి శ్రీవిష్ణు తన నటనతో ఆకట్టుకున్నాడు. కథనం ఫ్లాట్‌గా ఉన్నా చాలా సీన్లలో, ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ సీన్లలో శ్రీవిష్ణు అదరగొట్టాడు. హీరోయిన్ నిక్కీ తంబోలీ పాత్ర కొద్దిసేపు అప్పుడప్పుడు కనిపిస్తుంది. కథలో భాగంగా నిక్కీ ఎస్సై పాత్రను పోషించిప్పటికీ పెద్దగా ఆకట్టుకునే సీన్లు లేవు. సీనియర్ నటి రోహిణి, బెనర్జీ, ఇతన నటులు తమ పరిధి మేరకు పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సురేశ్ బొబ్బలి అందించిన పాటలు అంతగా గుర్తుండకపోయినా.. నేపథ్య సంగీతం బావుంది. సినిమా నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా ఉన్నాయి. సినిమా టైటిల్ ‘తిప్పరా మీసం’ అంటూ పౌరుషం రేకెత్తించేలా ఉన్నా.. సినిమా మాత్రం మీసం తిప్పేలా లేదు. బలాలు మదర్ సెంటిమెంట్ శ్రీవిష్ణు నటన బలహీనతలు స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా లేకపోవడం సాగదీత ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశాలు అంతగా లేకపోవడం - శ్రీకాంత్ కాంటేకర్ -
‘నిన్ను కన్నందుకు నీ తల్లి బాధపడాలి’
విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’అంటూ మరో విభిన్న కథా చిత్రంతో నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా సినిమాలతో మెప్పించిన శ్రీ విష్ణు.. ఈసారి ‘తిప్పరా మీసం’ అనే యాక్షన్ ఎంటర్టైనర్తో అలరించనున్నాడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ లభించింది. సినిమా విడుదలకు కొన్ని గంటల సమయమే ఉన్నందున ఈ మూవీపై హైప్ క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. ట్రైలర్‌ను చూస్తుంటే అమ్మ సెంటిమెంట్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. ‘నా గతాన్ని.. నా సమస్యను గుర్తించని ఈ పనికిమాలిన సమాజం, నేను చేసింది తప్పు అని ఓ ముద్ర వేసింది’, ‘వాడికున్న కోపమంతా వాడి అమ్మమీదే’ ,‘కన్న తల్లిని రోడ్డుకీడ్చిన కొడుకుగా చరిత్రలో నిలిచిపోతావ్’, ‘ నిన్ను కన్నందుకు నీ తల్లి బాధపడాలి’, ‘అందరూ నేను అర్థం కాని వెదవనని అనుకుంటారు. కానీ ఎవడేమనుకుంటే నాకేంటి.. నేననుకున్నదే చేస్తా’ అంటూ ట్రైలర్లో శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ చిత్రం భారీ విజయం సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ట్రైలర్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు.. పీక్స్‌లో ఉంది. ఈ చిత్రానికి ‘అసుర’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవిష్ణు సరసన నిక్కి తంబోలి హీరోయిన్గా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్న ఈసినిమాకు సిధ్ సినిటోగ్రాఫర్. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. -
తిప్పరా మీసం టీజర్