కొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గాలి సంపత్. ఫి..ఫి..ఫీ అంటూ గాలి భాషను పరిచయం చేసిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్‌గా మాత్రం హిట్టవలేదు. పైగా బాక్సాఫీస్ దగ్గర జాతి రత్నాలు పోటీని తట్టుకుని నిలబడలేక కుప్పకూలిపోయింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అప్పుడే ఓటీటీ బాట పట్టింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో మార్చి 19న రిలీజ్ కానుంది. ఇందుకోసం ఆహా టీమ్ చిత్రయూనిట్‌తో మంచి డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
కాగా 'గాలి సంపత్'లో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి సమర్పణలో ఎస్. కృష్ణ, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్లు రాబట్టడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌కు మొగ్గు చూపారు. ఫలితంగా సినిమా రిలీజై పట్టుమని పది రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వస్తుండటం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
చదవండి: 'గాలి సంపత్' మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment