AHA
-
ఓటీటీలో 'తండ్రీకూతురు' సినిమా స్ట్రీమింగ్
సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన చిత్రం 'లగ్గం'. తెలంగాణ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్ల తంతును చూపిస్తూ.. రమేష్ చెప్పాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని వేణుగోపాల్ రెడ్డి నిర్మాతగా తక్కువ బడ్జెట్లో ఉన్నతంగా నిర్మించారు. అక్టోబర్ 25న ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఆ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.'లగ్గం' సినిమాలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్‌తో పాటు రోహిణి, చమ్మక్ చంద్ర వంటి వారు నటించడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు 'ఆహా' ఓటీటీలో విడుదల కానుంది. నవంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా విడుదల సమయంలో భారీగా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో మూవీ మెప్పించలేదు.కథ ఏంటంటే?సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా) కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత చెల్లెలైన సుగుణ( రోహిణి) కొడుకు (సాయి రోనక్)ని చూడడానికి సిటీకి వస్తాడు. అక్కడ అల్లుడి ఖరీదైన జీవితం, జీతం,సాప్ట్వేర్ లైఫ్ చూసి ఎలాగైనా సరే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఇంతకీ తన చెల్లి సుగుణ( రోహిణి)తో మాట్లాడి కూతురి లగ్గం ఖాయం చేసుకున్నాడా? ఆ తర్వాత తన కుమార్తె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే లగ్గం కథ.ప్రతి ఆడపిల్ల కథ ఇంతేనేమో..'ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో.. ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా..' అనే పాటను చరణ్ అర్జున్ చాలా అద్భుతంగా రచిస్తే.. సింగర్ చిత్ర అందరి గుండెల్ని పిండేసేలా ఆలపించారు. లగ్గం చిత్రంలోని ఈ పాటకు యూట్యూబ్‌లో కూడా మంచి వ్యూస్ వచ్చాయి. -
మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు డబ్బింగ్ సినిమా
రీసెంట్గా రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా.. మూడు రోజుల క్రితం ఒక ఓటీటీలో వచ్చింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా మరో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ సంగతేంటి? ఏయే ఓటీటీల్లో ఉందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్)ఒకప్పుడు తెలుగులో హీరోగా చేసిన అర్జున్ మేనల్లుడు ధ్రువ్ సర్జా ప్రస్తుతం కన్నడలో హీరో. ఇతడి లేటెస్ట్ మూవీ 'మార్టిన్'. దసరాకి కన్నడతో పాటు తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. కాకపోతే ఘోరమైన కంటెంట్ వల్ల దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలియనంత వేగంగా మాయమైపోయింది.మొన్న శుక్రవారం ఈ సినిమాని ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించారు. థియేటర్లలో అంటే చూడలేకపోయారు గానీ ఓటీటీలో కాబట్టి తెలుగు ఆడియెన్స్ ఓ లుక్కేస్తారేమో? విజువల్స్ పరంగా సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ 'కేజీఎఫ్'ని కాపీ కొట్టాలనుకోవడం ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)Experience the thrilling tale of Dhruva, where patriotism meets passion 🔥❤️! Watch #Martin now! 🎥👊 ▶️https://t.co/MviUsUzc3u pic.twitter.com/tgi24PYIdm— ahavideoin (@ahavideoIN) November 19, 2024 -
ఓటీటీలో రివేంజ్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
ఓటీటీలో సడెన్‌గా థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే సుమారు మూడు నెలల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఏడాది ఆగష్టులో విడుదలైన 'రేవు' అనే చిన్న సినిమా.. థియేటర్లలో ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఓటీటీలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది. ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే చాలు. చిన్న సినిమాలు అయినా సరే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. కొత్త నటీనటులైనా సరే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే ఇటీవలే కొత్తవాళ్లతో తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు సక్సెస్ సాధించింది. అలాగే అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన చిత్రం రేవు. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా నిర్మించారు.యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన 'రేవు' గురువారం (నవంబర్ 14) నుంచి తెలుగు ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదే విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా ఒక పోస్టర్‌తో వెళ్లడించారు. 'రేవు: ది బ్యాటిల్ ఫర్ ద సీ' సినిమా మత్స్యకారుల నేపథ్యం చుట్టూ జరగుతుంది. కథలో చేపలవేట పేరుతో రివేంజ్ డ్రామాను చక్కగా తెరకెక్కించారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఈగో వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చక్కగా తెరపై ఆవిష్కరించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమి రెడ్డి, హేమంత్ ఉద్భవ్, అజయ్, సుమేధ్ మాధవన్, యేపూరి హరి తదితరులు నటించారు.కథేంటంటే...సముద్ర నేపథ్యంలోని సినిమాలు టాలీవుడ్లో గతంలో చాలానే వచ్చాయి. కోస్తాతీరంలోని మత్స్యకారుల జీవనం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే రేవు. పాలరేవు అనే గ్రామంలో అంకాలు (వంశీరామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) అనే ఇద్దరు మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు. చేపల వేట విషయంలో వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది. అయితే వీరి మధ్యలో మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. చేపల వేటలోకి నాగేశు(యేపూరి హరి) ఎంట్రీ ఇచ్చి వీరి జీవనాధారాన్ని దెబ్బతీస్తాడు. మరీ నాగేశ్‌ను అంకాలు, గంగయ్య అడ్డుకున్నారా? పాలరేవులో చేపల వేటపై ఆధిపత్యం కోసం వీరిద్దరు ఏ చేశారన్నదే అసలు కథ? -
ఓటీటీకి టాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
సినీ ప్రియులు ఇప్పుడంతా ఓటీటీల వైపే చూస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు అభిమానులు ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగానే ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్‌ను అందిస్తున్నాయి. అలా మరో యూత్‌ఫుల్ కామెడీ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో తెరకెక్కించిన ఈ కామెడీ వెబ్‌సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్.. ఒక్కొక్కరు ఒక్కో ఆణిముత్యం అనేది ఉపశీర్షిక.బిగ్‌బాస్ రన్నరప్ అఖిల్ లీడ్ రోల్లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. తెలుగు రియాలిటీ బిగ్‌బాస్‌లో రెండు సార్లు రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ సీజన్ 4తో పాటు బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో అతడికి టైటిల్ చేజారింది. బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ అఖిల్‌కు పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రాలేదు.తాజాగా వేరే లెవెల్ ఆఫీస్ అంటూ ఈ సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు అఖిల్. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ నెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో అఖిల్ సార్ధక్, మహేష్ విట్టాతో పాటు పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, యూట్యూబ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు 50కి పైగా ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.తమిళ రీమేక్‌గా వేరే లెవెల్ ఆఫీస్..తమిళంలో విజయవంతమైన వేర మారి ఆఫీస్‌కు రీమేక్‌గా ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సిరీస్ సీజన్- 2 ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్-1 యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీవితం ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించినట్లు పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. View this post on Instagram A post shared by OTT Updates (@upcoming_ott_release) -
తెలుగులో సరికొత్త వెబ్ సిరీస్.. డైరెక్టర్‌గా టాలీవుడ్ కమెడియన్!
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సరికొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. పౌరాణిక నేపథ్యంలో ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ(అదిరే అభి) దర్శకత్వంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్‌కు చిరంజీవా అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ టాలీవుడ్ మైథలాజికల్ వెబ్ సిరీస్ డిసెంబర్లో స్ట్రీమింగ్ రానుందని ప్రకటించారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేయనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే భక్తి కోణంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ వెబ్ సిరీస్‌ను రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ నిర్మించారు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్‌కు అచ్చు రాజమణి సందీతమందిస్తున్నారు. -
ఓటీటీలో సైకో థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ఈ ఏడాది జులై 26న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో హీరో రక్షిత్ తండ్రి వెంకట సత్య దర్శకుడిగా పరిచయం అయ్యారు.తెలుగు క్రైమ్ థ్రిల్లర్‌గా విడుదలైన ఈ చిత్రం సుమారు నాలుగు నెలలకు ఓటీటీలో విడుదల కానుంది. ఈ మూవీలో పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించడంతో కాస్త ఆసక్తి కలిగించింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. నవంబర్ 2నుంచి ‘ఆపరేషన్ రావణ్’ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా తెలుగు ప్రకటించింది. ఈమేరకు తాజాగా ఒక ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది.కథేంటంటే.. ఆమని(సంగీర్తన విపిన్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. స్థానిక మంత్రి(రఘు కుంచె) చేసే అవినీతిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఓ స్టోరీ రెడీ చేస్తుంది. అయితే ఆ స్టోరీని టీవీ చానెల్ సీఈఓ(మూర్తి) టెలికాస్ట్ చేయకుండా జాప్యం చేస్తుంటాడు. అంతేకాకుండా అది పక్కకి పెట్టి ఓ సీరియల్ కిల్లర్ కేసుని కవర్ చేయమని ఆమనికి ఆదేశిస్తాడు. ఆమెకు అసిస్టెంట్‌గా అప్పుడే ఉద్యోగంలో చేరిన రామ్(రక్షిత్ అట్లూరి)ని పంపిస్తాడు. రామ్ ఓ నిజాన్ని దాచి ఆమని కోసం ఆ చానెల్లో ఉద్యోగిగా చేరతాడు. ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు నగరంలో ఆ సీరియల్ కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటాడు.ఇలాంటి సమయంలో తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది సుజాత(రాధికా శరత్ కుమార్). పోలీసులతో పాటు ఆమని, రామ్‌లు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరుపుతుంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఆ సీరియల్ కిల్లర్ ఆమనిని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను హత్య చేస్తున్నాడు? పెళ్లికి రెడీ అయిన సుజాత కూతుర్ని కిడ్నాప్ చేసిందెవరు? సీరియల్ కిల్లర్ నుంచి తన ప్రియురాలు ఆమనిని రామ్ ఎలా రక్షించుకున్నాడు? సుజాతకు ఆ సీరియల్ కిల్లర్‌తో ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోకి క్రేజీ సినిమా.. కండోమ్ కంపెనీపై కేసు పెడితే?
మరో తెలుగు సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. మిడిల్ క్లాస్ కథల్లో ఎక్కువగా కనిపించిన సుహాస్ లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. దసరాకి థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఎప్పుడు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?సుహాస్ 'జనక అయితే గనక' సినిమా కాన్సెప్ట్ బాగుంది. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. కానీ థియేటర్లలో సరిగా ఆడలేదు. మూవీ సాగదీసినట్లు అనిపించిందనే టాక్ రావడంతో తేడా కొట్టేసింది. థియేటర్లలో సరిగా ఆడలేదు కానీ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చేస్తుంది. నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నా ఉద్దేశం అదికాదు.. 'బిగ్‌బాస్ 8' వివాదంపై మెహబూబ్ వీడియో)'జనక అయితే గనక' విషయానికొస్తే.. తండ్రి అయితే ఖర్చులు పెరుగుతాయనే భయపడే ఓ కుర్రాడు, భార్య నెల తప్పిందని చెప్పడంతో షాకవుతాడు. తాను కండోమ్ ఉపయోగించినప్పటికీ తండ్రి కావడం ఇతడిని ఆలోచనలో పడేస్తుంది. దీంతో సదరు కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.చెప్పుకోవడానికి కాస్త వల్గర్ అనిపిస్తుంది కానీ ఏ మాత్రం గీత దాటకుండా సున్నితమైన హాస్యంతో సినిమా తీశారు. కాసేపు అలా సరదాగా నవ్వుకునే సినిమా చూద్దానుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ది కేరళ స్టోరీ ఫేమ్ ఆదా శర్మ, విశ్వంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్). ఈ ఏడాది మే 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంత చేసుకుంది. ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి కృష్ణ అన్నం దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నెల 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా.. దెయ్యం కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కిచారు. రిలీజైన దాదాపు ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. -
'ప్రకృతిని కట్ చేస్తే ప్రళయమే'.. ఆసక్తిగా తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్!
పవన్ సిద్ధు, తేజస్వి, అనన్య శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందించిన వెబ్ సిరీస్ 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్-2'. తెలుగులో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మరోసారి ఓటీటీ ప్రియులను అలరించేందుకు అరుణ్‌కుమార్ సీజన్ 2 వచ్చేస్తోంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. తాజాగా సీజన్-2 ట్రైలర్ రిలీజైంది. సీజన్-1లో హర్షిత్ రెడ్డి హీరోగా కనిపించగా.. ఇందులో పవన్ సిద్ధు నటించారు.ఈ వెబ్ సిరీస్‌లో కార్పొరేట్ వరల్డ్‌లో ఓ యువకుడు ఎలా రాణించాడనే కథాంశంతో తెరకెక్కించారు. ఫుల్ కామెడీతో పాటు కార్పొరేట్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది. అయితే ఇందులో డైలాగ్స్, సీన్స్ ఓటీటీ ప్రియులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిిరీస్కు ఆదిత్య కేవీ దర్శకత్వం వహించారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళం సినిమాలకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటోంది. గతంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నాయి. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు లాంటి టాలీవుడ్ ప్రియులను అలరించాయి. తాజాగా మరో మలయాళ మూవీ తెలుగు ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తోంది.మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేవలం మలయాళం భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్ వేదికగా పంచుకుంది. కాగా.. ఈ ఏడాది జూన్‌లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రంలో షేన్ నిగమ్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆంటో జోస్ పెరీరా, అబీ ట్రెసా పాల్ తెరకెక్కించారు.Don't miss the heartwarming journey of #littlehearts. Premieres October 24th on aha. pic.twitter.com/GRHtwgghY7— ahavideoin (@ahavideoIN) October 21, 2024 -
మరో ఓటీటీలోకి వచ్చేసిన రెండు థ్రిల్లర్ సినిమాలు
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలానే రెండు మూవీస్ వచ్చేశాయి. కాకపోతే ఇవి ఇప్పటికే ఒకదానిలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా వేరే వాటిలోనూ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఒకటి తెలుగు స్ట్రెయిట్ మూవీ కాగా, మరొకటి డబ్బింగ్ బొమ్మ. ఇంతకీ ఇవేంటి? ఏ ఓటీటీల్లో ఉన్నాయి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!)తెలుగమ్మాయి చాందిని చౌదరి పోలీస్‌గా నటించిన బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'యేవమ్'. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. ఇదివరకే ఆహా ఓటీటీలో ఉండగా.. ఇప్పుడు సన్ నెక్స్ట్‌లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఇందులో హాట్ బ్యూటీ అషూరెడ్డి కూడా కీలక పాత్రలో నటించింది.మరోవైపు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'శబరి'. కూతురిని కాపాడుకోవడం కోసం ఓ తల్లి పడే తపన చుట్టూ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో సినిమా తీశారు. సస్పెన్స్‌తో పాటు ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. కొన్నిరోజుల క్రితం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఐదు భాషల్లో రిలీజ్ కాగా.. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చేశారు. ఈ వీకెండ్ ఏమైనా థ్రిల్లర్ మూవీస్ చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటే వీటిని ట్రై చేసి చూడండి.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
ఓటీటీలో 'మ్యాడ్' ఫేమ్ అనంతిక థ్రిల్లర్ సినిమా
'మ్యాడ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనీల్‌కుమార్ తమిళ్ నటించిన రైడ్ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానున్నడంతో ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా గతేడాదిలో థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో శ్రీదివ్య ప్రధాన హీరోయిన్గా నటించిగా.. విక్రమ్ ప్రభు హీరోగా మెప్పించారు.రైడ్ టైటిల్‌తో కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా ఆహా ఓటీటీలో అదే పేరుతో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 19 నుంచి ఈ మూవీ అందుబాటులో ఉండనుందని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. కన్నడలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా 'తగారు'కు రీమేక్‌గా రైడ్ తెరకెక్కించారు.అనంతిక సనీల్‌కుమార్ కోసమే ఈ చిత్రాన్ని చూసేందుకు తెలుగు ప్రేక్షకుల ఆసక్తిచూపుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌తో మ్యాడ్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీకి టాలీవుడ్లో మంచి ఆదరణే లభించింది. ఆమె చేతిలో మ్యాడ్ స్క్వేర్, 8 వసంతాలు మూవీస్ ఉన్నాయి. తక్కువ సమయంలోనే మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ బ్యానర్లో ఆమె ప్రధాన పాత్రలో ఛాన్స్ దక్కించుకుంది. -
ఓటీటీకి తెలుగు వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన అలరించిన టాలీవుడ్ వెబ్ సిరీస్. గతేడాది జూన్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. 2016లో హిందీలో వచ్చిన 'అఫీషియల్ చుక్యాగిరి' అనే వెబ్ సిరీస్‌కు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కార్పొరేట్ వరల్డ్‌లో ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడు.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనేదే అసలు కథ. తొలి సీజన్ ఐదు ఎపిసోడ్లుగా తెరకెక్కించారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ సీజన్-2 అలరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. కాగా.. ఈ సిరీస్ మొదటి సీజన్లో హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ కీలక పాత్రలు పోషించారు. అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్ బ్యానర్లపై బి.సాయికుమార్, శరణ్ సాయికుమార్ నిర్మించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
మరో ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ లెవెల్ క్రాస్. జూలైలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలో దర్శనమిచ్చింది.తాజాగా ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఆసిఫ్ అలీ హీరోగా నటించారు. ఈ మూవీకి అర్బాజ్ అయూబ్ దర్శకత్వం వహించారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు లెవెల్ క్రాస్ సినిమా చూసేయండి.Unlikely love. Shattered trust. Eternal consequences. Stream #LevelCross on #Aha ▶️https://t.co/NCGmg0REO0 pic.twitter.com/0H57F28kFt— ahavideoin (@ahavideoIN) October 15, 2024 -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు
దసరా హడావుడి అయిపోయింది. సొంతూళ్లకు వెళ్లిన వాళ్లందరూ తిరిగి పనుల్లో బిజీ అయిపోయారు. ఇక పండగ సందర్భంగా థియేటర్లలో అరడజను సినిమాలు రిలీజయ్యాయి. దీంతో పెద్దగా చెప్పుకోవడానికి ఈ వారం కొత్త మూవీస్ ఏం లేవు. ఉన్నంతలో కల్లు కాంపౌండ్, వీక్షణం, సముద్రుడు అనే చిన్న చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. ఓటీటీలో మాత్రం 25 సినిమాలు/వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి.(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత)ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం లేవు. స్నేక్స్ అండ్ ల్యాడర్స్, 1000 బేబీస్ అనే డబ్బింగ్ సిరీస్‌లు మాత్రమే ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా అయితే లాఫింగ్ బుద్ధా అనే కన్నడ మూవీ మాత్రం చూడొచ్చులే అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇవే. ఒకవేళ వీకెండ్ వచ్చేసరికి కొత్తగా ఏమైనా సడన్ సర్ప్రైజ్ ఇస్తాయేమో చూడాలి?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (అక్టోబర్ 14-20వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్మైటీ మాన్స్టర్ వీలిస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14రేచల్ బ్లూమ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 15స్వీట్ బాబీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 16గుండమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17జూరాసిక్ వరల్డ్ కేవోస్ థియరీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్ఓస్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 18ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18అమెజాన్ ప్రైమ్ద ప్రదీప్స్ ఆఫ్ పిట్స్‌బరో (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబర్ 18కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) - అక్టోబర్ 18లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ) - అక్టోబర్ 18స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) - అక్టోబర్ 18హాట్స్టార్రీతా సన్యల్ (హిందీ సిరీస్) - అక్టోబర్ 141000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18రైవల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18రోడ్ డైరీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18జియో సినిమాక్రిస్పీ రిస్తే (హిందీ మూవీ) - అక్టోబర్ 18హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 19హిస్టీరియా (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 19ఆపిల్ ప్లస్ టీవీస్రింకింగ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 16బుక్ మై షోబీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: కిర్రాక్ సీత పారితోషికం ఎంతంటే?) -
ఓటీటీలో దూసుకుపోతున్న టాలీవుడ్ మూవీ
శివ, శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బాలు గానీ టాకీస్. ఈ చిత్రానికి విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని శ్రీనిధి సాగర్ నిర్మించారు.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. ఆహా స్ట్రీమింగ్కు వచ్చిన ఈ చిత్రం ఏకంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. సరికొత్త కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలు గాని టాకీస్ ఆహాలో టాప్- 2లో ట్రెండ్ అవుతోంది. విలేజ్ రివేంజ్, ఎమోషనల్ డ్రామాగా ఎంతో నేచురల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఓటీటీ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. తన మేకింగ్‌తో విశ్వనాథ్ ప్రతాప్ అందరినీ మెప్పించారు. -
ఓటీటీలో 'బిగ్ బాస్' తెలుగు బ్యూటీ డైరెక్ట్ చేసిన సినిమా స్ట్రీమింగ్
బిగ్ బాస్ తెలుగుతో గుర్తింపు తెచ్చుకున్న సంజన అన్నే హీరోయిన్గా నటించిన 'క్రైమ్ రీల్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లోకి వచ్చిన మూడు నెలల తర్వాత ఇప్పుడు నెట్టింట స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రానికి డైరెక్టర్ కూడా సంజననే కావడం విశేషం. ఆమె ఇప్పటికే తెలుగులో 'నీకు నాకు పెళ్లంట' అనే సినిమాలో హీరోయిన్గా మెప్పించింది. ఆపై 'నేను రాజు నేనే మంత్రి' సినిమాలో సంజన ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.బిగ్‌బాస్ సీజన్ 2 తర్వాత సంజన అన్నే పెద్దగా కనిపించింది లేదు. అయితే, సోషల్‌మీడియాలో ఆమె ట్రెండింగ్‌లోనే ఉంటూ వచ్చింది. అలా సుమారు నాలుగేళ్ల తర్వాత క్రైమ్ రీల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా అకట్టుకోలేదు. తాజాగా ఆహా ఓటీటీలో క్రైమ్ రీల్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.నేటి సమాజంలో యువత సోషల్ మీడియా వలలో చిక్కుకొని తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటుందో ఒక మంచి సందేశం ఇస్తూ.. క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా సంజన నటించగా.. సిరి చౌదరి,అభి, భరత్ కీలక పాత్రల్లో నటించారు. -
సూపర్ హీరోగా బాలకృష్ణ.. వీడియో రిలీజ్
రెండు రోజుల క్రితం హీరో బాలకృష్ణ గురించి ఓ వార్త బయటకొచ్చింది. సూపర్ హీరోలా నటిస్తారనే టాక్ వినిపించింది. అయితే ఇదంతా తర్వాత చేయబోయే సినిమా కోసం ఏమోనని అభిమానులు, నెటిజన్లు అనుకున్నారు. కానీ అదంతా 'అన్‌స్టాపబుల్ 4' కోసమని ఇప్పుడు తేలింది. దసరా సందర్భంగా నాలుగో సీజన్‌కి సంబంధించిన ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య.. సూపర్ హీరోగా కనిపించాడు.(ఇదీ చదవండి: పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?)కంటెంట్ పరంగా చూస్తే నాలుగున్నర నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో బాగుంది. కానీ సూపర్ హీరో పాత్రని యానిమేటెడ్ వేషంలో చూపించినప్పుడు.. దీనికి బాలయ్య గొంతు అయితే నప్పింది గానీ ఫేస్ కట్ విషయంలో ఎక్కడా బాలకృష్ణలా అనిపించలేదు. ఎవరో వ్యక్తికి ఈయన డబ్బింగ్ చెప్పినట్లు అనిపించింది. చివర్లో యధావిధిగా కనిపించిన బాలయ్య.. అన్‌స్టాపబుల్ షో కొత్త సీజన్ గురించి ప్రకటించారు.'అన్‌స్టాపబుల్' తొలి సీజన్ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. బాలకృష్ణలో కొత్త యాంగిల్‌ని ఆవిష్కరించింది. కానీ రెండు, మూడో సీజన్లు మాత్రం అనకున్నంత సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఈసారి వేరే లెవల్ ఉండబోతుందని చెప్పారు. అక్టోబరు 24 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది. మరి బాలకృష్ణ చెప్పినట్లు ఉంటుందా? అనేది చూడాలి. తొలి ఎపిసోడ్‌కి దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' టీమ్ రాబోతుంది.(ఇదీ చదవండి: సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'.. దిల్ రాజు ప్రకటన) -
ఈ వారం ఓటీటీల్లో 34 సినిమాలు రిలీజ్.. అవేంటంటే? (ఫొటోలు)
-
రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలో 'గొర్రె పురాణం'
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల అయింది. అయితే, విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. టాలీవుడ్లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే నటుడిగా సుహాస్‌కు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వచ్చినప్పటికీ అనుకున్నంతగా కలెక్షన్లు సాధించలేదు.'గొర్రె పురాణం' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆహా అధికారికంగా సోషల్‌మీడియా ద్వారా వెళ్లడించింది. అక్టోబర్ 10 నుంచి తమ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆహా ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. టాలీవుడ్లో వరుస సినిమాలతో సుహాస్ బిజీగా ఉన్నారు. సుహాస్ కొత్త సినిమా 'జనక అయితే గనక' దసర సందర్భంగా అక్టోబర్ 12న థియేటర్లో విడుదల కానుంది.కథేంటంటే..టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్‌లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు.ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ వారం దసరా సందడి మొదలైపోయింది. దేవి నవరాత్రుల ఉత్సవాలతో అంతా బిజీగా ఉన్నారు. ఇక సినీ ప్రియులను అలరించేందుకు చిత్రాలు రెడీగా ఉన్నాయి. ఈ పండుగకు థియేటర్లలో సందడి చేసేందుకు రజినీకాంత్ వెట్టైయాన్, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, సుహాస్ జనక అయితే గనక, గోపిచంద్ విశ్వం లాంటి సినిమాలు ఈ దసరాకు సినీ ప్రేక్షకులను అలరించనున్నాయి.ఇక అంతా పండుగ మూడ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు ఇంట్లోనే చూడాలనుకుంటారు. అలాంటి వారికోసం ఓటీటీల్లోనూ అలరించేందుకు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలు లేకపోయినా.. కాస్తా చూడాలనిపించేవైతే ఉన్నాయి. వాటిలో ఇటీవల హిట్‌గా నిలిచిన శ్రద్ధాకపూర్ స్త్రీ-2, అక్షయ్‌కుమార్ సర్ఫీరా, సుహాస్ గొర్రెపురాణం, అమలాపాల్ లెవెల్ క్రాస్ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.నెట్‌ఫ్లిక్స్‌ది మెహండెజ్ బ్రదర్స్(క్రైమ్ డాక్యుమెంటరీ)- అక్టోబర్ 07యంగ్ షెల్డన్ (ఇంగ్లీష్) అక్టోబరు 8ఖేల్ ఖేల్ మే(హిందీ సినిమా)- అక్టోబర్ 09స్టార్టింగ్ 5(వెబ్ సిరీస్)- అక్టోబర్ 09గర్ల్ హాంట్స్ బాయ్- అక్టోబర్ 10మాన్స్టర్ హై 2 (ఇంగ్లీష్) అక్టోబరు 10ఔటర్ బ్యాంక్స్ సీజన్-4 పార్ట్-1(వెబ్ సిరీస్)- అక్టోబర్ 10టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్(యానిమేటేడ్ సిరీస్)- అక్టోబర్ 10లోన్‌లి ప్లానెట్- అక్టోబర్ 11అప్ రైజింగ్ (కొరియన్ సిరీస్) -అక్టోబర్ 11ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ షో) -అక్టోబర్ 12 సోనీ లివ్జై మహేంద్రన్ (మలయాళం)-అక్టోబర్ 11రాత్ జవాన్ హై- (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 11 డిస్నీ ప్లస్ హాట్స్టార్సర్ఫీరా(బాలీవుడ్ సినిమా)- అక్టోబర్ 11వారై (తమిళ సినిమా)- అక్టోబర్ 11 అమెజాన్ ప్రైమ్ వీడియోసిటాడెల్: డయానా- అక్టోబర్ 10 జియో సినిమాగుటర్ గూ (హిందీ)- అక్టోబర్ 11టీకప్ (హాలీవుడ్)- అక్టోబర్ 11 యాపిల్ టీవీ ప్లస్డిస్క్లైమర్- అక్టోబర్ 11 ఆహాలెవెల్ క్రాస్- (మలయాళ సినిమా)- అక్టోబర్ 11(రూమర్ డేట్)గొర్రె పురాణం-(తెలుగు సినిమా)- అక్టోబర్ 11(రూమర్ డేట్) -
ఓటీటీలో అమలాపాల్ 'లెవల్ క్రాస్' థ్రిల్లర్ సినిమా
అమలాపాల్ తాజాగా నటించిన మలయాళ సినిమా 'లెవల్ క్రాస్'. ఈ మూవీలో ఆసిఫ్ అలీ హీరోగా నటించగా.. షరాఫుద్దీన్ కీలక పాత్రలో నటించాడు. జులై 26న విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అర్భాఫ్ అయూబ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది.'లెవెల్ క్రాస్' చిత్రానికి మలయాళ టాప్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, 12th మ్యాన్, నెరు, వంటి చిత్రాలతో మంచి గుర్తింపు ఉంది. అయితే, జీతూ జోసెఫ్ శిష్యుడిగా దృశ్యంతో పాటు పలు సినిమాలకు అర్ఫాజ్ అయూబ్ దర్శకుడిగా పనిచేశారు. ఇప్పుడు లెవెల్ క్రాస్ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఓటీటీలో ఎప్పుడు..?సుమారు రూ. 10 కోట్లకు పైగానే లెవల్ క్రాస్ సినిమా కోసం ఖర్చు చేశారు. IMDb రేటింగ్ 7.2తో ఒక వర్గం ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పించింది. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్ వర్షన్లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ఆహా ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వార ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ తేదీని వెళ్లడించలేదు. కానీ, అక్టోబర్ 11న దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. -
ఓటీటీలోకి రానున్న 'గొర్రె పురాణం'.. అధికారిక ప్రకటన
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల అయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. టాలీవుడ్లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే నటుడిగా సుహాస్‌కు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వచ్చినప్పటికీ అనుకున్నంతగా కలెక్షన్లు సాధించలేదు.'గొర్రె పురాణం' సినిమాలో ఒక జంతువునే ప్రధాన పాత్రధారిగా పెట్టుకుని అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు దర్శకులు. తాను భిన్నమైన కథలను ఎంచుకుంటానని మరోసారి సుహాస్ ఈ చిత్రంతో నిరూపించాడు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. అయితే, ఎప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొస్తారనేది మాత్రం వెళ్లడించలేదు. అక్టోబర్ 6న ఓటీటీలోకి రావచ్చని టాక్ నడుస్తోంది. లేదంటే, అక్టోబర్ 11న తప్పకుండా ఓటీటీలో రిలీజ్ అవుతుందని సమాచారం.కథేంటంటే..టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్‌లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు.ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో హారర్, థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కళింగ' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. టాలీవుడ్లో 'కిరోసిన్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ధృవ వాయు ఇందులో హీరోగా నటించాడు. అయితే, కళింగ చిత్రానికి దర్శకుడిగా కూడా ధృవ వాయు పనిచేశారు. ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటించిగా మీసాల లక్ష్మణ్, ఆడుకాలం నరేన్, బలగం సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.హారర్ ఎలిమెంట్స్‌కు కాస్త ఫాంటసీ అంశాలను చేర్చి ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. సెప్టెంబర్ 13న విడుదలైన కళింగ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు సుమారు రూ. 5కోట్ల మేరకు కలెక్షన్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ కూడా ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి కళింగ విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 2 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందన ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.కథేంటి..?కళింగ అనే ప్రాంతం. ఈ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లినోళ్లు ప్రాణాలతో తిరిగి రారు. ఇదే ఊరిలో ఓ అనాథ లింగ (ధృవ వాయు). అదే ఊరిలో ఉండే పద్దు (ప్రగ్యా నయన్) ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈమె తండ్రి వీళ్ల ప్రేమకు అడ్డుచెబుతాడు. ఊరిపెద్ద దగ్గరున్న పొలం తనఖా విడిపిస్తేనే పెళ్లి చేస్తానని అంటాడు. కొన్ని గొడవల కారణంగా ఊరికి దగ్గరలోని అడవిలోకి లింగ, అతడి స్నేహితుడు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అడవిలో ఏముంది? చివరకు ఏమైందనేదే స్టోరీ. -
ఓటీటీలో హిట్ సినిమా '35- చిన్న కథ కాదు' స్ట్రీమింగ్
'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పించింది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలయింది. అయితే, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్ను మేకర్స్ ఇచ్చారు.నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే, '35–చిన్న కథ కాదు' సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానున్నట్లు ఆహా ప్రకటించింది. అక్టోబర్ 2న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్‌మీడియాలో ఆహా ప్రకటించింది.కథేంటంటే..తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్‌లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు.కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. దీంతో అరుణ్‌కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్‌కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్‌కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. Chinna Katha Kaadu ❤️Beautiful Blockbuster #35Movie coming soon on aha @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @Nanduemani @RanaDaggubati @nikethbommi pic.twitter.com/PG7nMLqFYf— ahavideoin (@ahavideoIN) September 27, 2024