తమన్‌ చిలిపి పనులను బయటపెట్టిన తల్లి | Indian Idol 3 Telugu: Thaman Mother Shares Her Son Childhood Memories | Sakshi
Sakshi News home page

తమన్‌ చేసిన చిలిపి పనులను బయటపెట్టిన తల్లి!

Published Sat, Aug 31 2024 3:34 PM | Last Updated on Sat, Aug 31 2024 4:16 PM

Indian Idol 3 Telugu: Thaman Mother Shares Her Son Childhood Memories

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రసవత్తరంగా జరుగుతోంది. ప్రతి వారం ఎపిసోడ్ అభిమానులకు థ్రిల్ పంచుకున్నాయి. ఇప్పుడీ మెగా మ్యూజిక్ షోలో మరో స్పెషల్ మూమెంట్. ఈ షోకి జడ్జ్ గా ఉంటున్న సెన్సేషనల్ కంపోజర్ తమన్ అమ్మ గారు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. దీనికి సంబధించిన  ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. తమన్  గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఘంటసాల సాయి శ్రీనివాస్ అలియాస్ తమన్ చిన్నప్పటి ముచ్చట్లు చెప్పారు.  

తమన్ చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో కన్నా మైదానంలోనే ఎక్కువగా ఉండేవాడని, తనకి అస్సలు భయం లేదని, స్కూళ్లలో గొడవలు వచ్చేవని చెప్పారు. తొటి పిల్లల టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చేసి తినేసేవాడని కంప్లయింట్ లు ఉండేవని అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఐతే తను హార్డ్ వర్క్‌ చేస్తాడని, వర్క్  అయ్యే వరకు తిండి కూడా పట్టించుకోడని, సంగీతం క్రికెట్ తనకి మరో ప్రపంచం లేదని .. ఇలా చాలా సంగతులు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement