ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్‌.. స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌! | Tollywood Music Director SS Thaman Responds On Blind Singer In TGSRTC Bus, Tweets Goes Viral On Social Media | Sakshi

SS Thaman: అతనికి తప్పకుండా అవకాశమిస్తా: ఎస్ఎస్ తమన్

Nov 14 2024 9:34 AM | Updated on Nov 14 2024 11:21 AM

Tollywood Music Director SS Thaman Responds On Blind Singer In TGSRTC Bus

ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ పాటపాడిన అంధగాయకుడిపై తమన్‌ ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని ఆయన అన్నారు. అతని ప్రతిభకు ఫిదా అయిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్‌ తెలుగు ఇండియన్ ఐడల్‌లో పాడే అవకాశం కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. అతడితో కలిసి తానూ పాడుతానంటూ పోస్ట్‌ చేశారు.

అంతకుముందు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆ బాలుడి వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మ‌నం చూడాలే కానీ.. ఇలాంటి మ‌ట్టిలో మాణిక్యాలు ఎన్నో..! ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు క‌దా..! ఒక అవ‌కాశం ఇచ్చి చూడండి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై స్పందించిన ఎస్ఎస్ తమన్ ఆ బాలుడికి తెలుగు ఇండియన్ ఐడల్‌లో పాడే అవకాశమిస్తానని తమన్ ట్వీట్ చేశారు.

తమన్‌కు సజ్జనార్‌ కృతజ్ఞతలు

ఆర్టీసీ బస్సులో పాటపాడిన బాలుడికి అవకాశమిచ్చినందుకు తమన్‌కు  ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా పోస్ట్ చేశారు. అద్భుత‌మైన కంఠంతో పాట‌లు ఆల‌పిస్తోన్న ఈ అంధ యువ‌కుడికి తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌లో అవ‌కాశం ఇచ్చేలా చూస్తాన‌ని ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు తమన్‌ గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అంటూ పోస్ట్ చేశారు. అలాగే  ఈ అవ‌కాశంతో అద్భుత‌మైన త‌న టాలెంట్‌కు మ‌రింత‌గా గుర్తింపు ద‌క్కుతుందని అన్నారు. భవిష్యత్‌లో త‌న మ‌ధుర‌మైన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దుల‌ను చేస్తూ ఈ యువకుడు ఉన్న‌తంగా ఎదుగుతార‌ని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement