RTC MD
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్.. స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్!
ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ పాటపాడిన అంధగాయకుడిపై తమన్ ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని ఆయన అన్నారు. అతని ప్రతిభకు ఫిదా అయిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలుగు ఇండియన్ ఐడల్‌లో పాడే అవకాశం కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. అతడితో కలిసి తానూ పాడుతానంటూ పోస్ట్ చేశారు.అంతకుముందు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆ బాలుడి వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..! ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై స్పందించిన ఎస్ఎస్ తమన్ ఆ బాలుడికి తెలుగు ఇండియన్ ఐడల్‌లో పాడే అవకాశమిస్తానని తమన్ ట్వీట్ చేశారు.తమన్‌కు సజ్జనార్ కృతజ్ఞతలుఆర్టీసీ బస్సులో పాటపాడిన బాలుడికి అవకాశమిచ్చినందుకు తమన్‌కు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తోన్న ఈ అంధ యువకుడికి తెలుగు ఇండియన్ ఐడల్‌లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. అలాగే ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్‌కు మరింతగా గుర్తింపు దక్కుతుందని అన్నారు. భవిష్యత్‌లో తన మధురమైన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దులను చేస్తూ ఈ యువకుడు ఉన్నతంగా ఎదుగుతారని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు. అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తోన్న ఈ అంధ యువకుడికి @ahavideoIN నిర్వహిస్తోన్న తెలుగు ఇండియన్ ఐడల్ లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు @MusicThaman గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్‌కు మరింతగా గుర్తింపు ద… https://t.co/9Z4HR44QFF— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 14, 2024 I will make sure he Performs in #TeluguIndianIdolS4@ahavideoIN pls consider as my request and order 📢❤️🎧⭐️▶️💥Will have his Special Performance and I will perform along with him ❤️✨🙌🏿What a Talent what perfect pitching 🖤God is sometimes harsh But we humans are there… https://t.co/CqjEU0QHfc— thaman S (@MusicThaman) November 13, 2024 -
వెర్రి వేషాలపై వీసీ సజ్జనార్ సీరియస్
హైదరాబాద్: దీపావళి సందర్భంగా.. హైటెక్‌సిటీ ప్రాంతంలో కొందరు యువకులు ఇష్టారీతిన బాణసంచా కాలుస్తూ బైక్‌లపై విన్యాసాలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీనిపై ఐపీఎస్ అధికారి, టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగపూట ఇదేం వికృతానందమని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.‘‘దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం. ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం దీపావళి. పండగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!?’’ అని సజ్జనార్ ప్రశ్నించారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024 ఆయన పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. కొంతమంది యువకులు తాత్కాలిక ఆనందం కోసం తమ జీవితాలను రిస్క్‌లో పెట్టుకుంటున్నారన్నారు. ఈ చేష్టలతో మిగతా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ చదవండి: ఏడాది క్రితం అదృశ్యమై.. ఆధార్‌తో దొరికాడు -
TSRTC: పల్లె వెలుగులు ఎక్కువగా వాడుకోండి: సజ్జనార్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద.. మహిళలకు అందుబాటులోకి తెచ్చిన ఉచిత ప్రయాణ సదుపాయం పలు ఇబ్బందులకు కారణం అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తున్నాం. మరోవైపు ఫ్రీ జర్నీ కల్పిస్తూనే.. బస్సుల సంఖ్యను తగ్గించదనే విమర్శ టీఎస్ ఆర్టీసీ ఎదుర్కొంటోంది. అయితే అలాంటిదేం లేదని.. బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఒక ప్రకటన చేశారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. అయితే అది మరోలా ఉంటోందని చెబుతున్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరుతూ ఓ వీడియోను ఉంచారు. మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని అన్నారయన. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని, దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. -
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో " స్ట్రెయిట్ టాక్ "
-
హైదరాబాద్: అయోమయంలో ఆర్టీసీ.. చేతులెత్తేసిన జీహెచ్ఎంసీ!
ఏళ్లకు ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్న గ్రేటర్ ఆర్టీసీ ఏ రోజుకు ఆ రోజు జీవన్మరణ పోరాటం చేస్తోంది. ప్రతి రోజు రూ.కోట్లల్లో నష్టాలను చవి చూస్తోంది. ఒకప్పుడు మహానగరంలో అతిపెద్ద ప్రజా రవాణా సంస్థగా వెలుగొందిన ఆర్టీసీ ప్రాభవం క్రమంగా కనుమరుగవుతోంది. ప్రభుత్వ సాయం అందితే తప్ప బస్సు చక్రం కదలలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో ఆర్టీసీ నిర్వహణను జీహెచ్ఎంసీకి అప్పగించనున్నట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఏడాది లోపే ఆ ప్రతిపాదన అటకెక్కింది. దీంతో ఆర్టీసీ మనుగడ కోసం తిరిగి ఒంటరి పోరాటాన్ని నమ్ముకొంది. -సాక్షి, హైదరాబాద్ సుదీర్ఘమైన కార్మికుల సమ్మె, రెండేళ్లుగా పట్టిపీడించిన కోవిడ్ మహమ్మారి వంటి పరిణామాలు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌ను మరింత కుంగదీశాయి. కొద్ది కొద్దిగా కోలుకుంటున్న తరుణంలో పెరిగిన డీజిల్ ధరల భారం మరోసారి శరాఘాతంగా మారింది. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఎంతో ఆశగా ఎదురు చూడడం, ఆ తరువాత తీవ్రమైన నిరాశకు గురకావడం ఆర్టీసీకి తప్పడం లేదు. మరి కొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. మరోసారి సాయం కోసం ఆర్టీసీ పడిగాపులు కాస్తోంది. చేతులెత్తేసిన జీహెచ్ఎంసీ... గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజా రవాణా సదుపాయాన్ని జీహెచ్ఎంసీ పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు సిటీ బస్సులను, సిబ్బందిని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని భావించారు. కానీ బస్సుల నిర్వహణ భారంగా మాతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావించారు. ఆర్ధిక సాయానికి మాత్రమే ముందుకు వచ్చారు. రెండు దశల్లో సుమారు రూ.300 కోట్ల వరకు నిధులు అందజేశారు. కానీ ఆ తరువాత ఏటేటా నిధులు ఇచ్చి ఆర్టీసీని ఆదుకొనేందుకు జీహెచ్ఎంసీ నిరాకరించింది. ముంబయి వంటి నగరరాల్లో ప్రజా రవాణా, విద్యుత్ సదుపాయం వంటివి బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండగా, జీహెచ్ఎంసీ మాత్రం అలాంటి ప్రతిపాదనకు చేతులెత్తేయడం గమనార్హం. ఆదాయానికి రెట్టింపు నష్టాలు... నగరంలో సుమారు 2650 బస్సులకు పైగా ఉన్నాయి. రోజుకు 20 లక్షల మందికి రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నట్లు అంచనా. గతంలో 3850 బస్సులు ఉండేవి. 34 లక్షల మంది పయనించేవారు ప్రతి రోజు 42 వేల ట్రిప్పులు తిరిగేవి.కానీ బస్సుల సంఖ్య తగ్గిపోవడం, ప్రయాణికుల ఆదరణ కూడా క్రమంగా తగ్గడంతో 12 వేలకు పైగా ట్రిప్పులను తగ్గించారు. కోవిడ్ మూడో దశ తరువాత సిటీ బస్సులకు ప్రయాణికుల ఆదరణ కొంత మేరకు పెరిగింది. కానీ బస్సుల నిర్వహణ మాత్రం భారంగానే ఉంది. ఆర్టీసీలో కార్మికుల సుదీర్ఘమైన సమ్మెకు రోజుకు రూ.కోటి వరకు నష్టం వస్తే ఇప్పుడు అది రోజుకు రూ.2.35 కోట్లకు చేరుకుంది.కోటిన్నర ఆదాయం లభిస్తే అంతకు రెట్టింపు నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఇలా ప్రతి నెలా సుమారు రూ. 75 కోట్ల నష్టాలను ఆర్టీసీ మూటగట్టుకొంటోంది. ఏడాది కాలంలో రూ.850 కోట్ల వరకు చేరినట్లు అంచనా. ప్రతి రోజు డీజిల్ పైనే రూ.1.4 కోట్ల వరకు ఖర్చు చేయవలసి వస్తుందని అధికారులు తెలిపారు. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు మెట్రో రైలు, ఓలా, ఉబెర్, రాపిడో వంటి యాప్ ఆధారిత రవాణా సదుపాయాలు నగర ఆర్టీసీకి తీవ్రమైన పోటీనిస్తున్నాయి. కొత్త బస్సుల కొనుగోళ్లకు నిధుల కొరత... సుమారు 300 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లకు ఆర్టీసీ తాజాగా సన్నాహాలు చేపట్టింది. కానీ నిధుల కొరత అతి పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం ఆదుకొంటే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోళ్లకు ప్రభుత్వం తగిన నిధులు కేటాయించడం ఒక్కటే పరిష్కారం. ప్రగతి చక్రం తిరిగి పరుగులు పెట్టాలంటే కొత్త బస్సులు రోడ్డెక్కాల్సిందే. -
భక్తుల వద్దకే మేడారం బస్సులు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం 51 ప్రాంతాల నుంచి 3,845 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ బస్సులు అమ్మవారి గద్దెలకు చేరువగా వెళతాయని చెప్పారు. భక్తులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ఐదారు కిలోమీటర్ల దూరంలో వాటిని నిలిపి ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తు చేశారు. మేడారం జాతర నేపథ్యంలో శుక్రవారం ఆయన బస్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. చదవండి: మేడారంలో ‘గుడిమెలిగె’ 30 మంది భక్తులు ఒకేచోట ఉంటే.. వారి చెంతకే బస్సును పంపుతామని, కావాల్సిన వారు 040–30102829 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. మేడారంలో 50 ఎకరాల్లో బేస్ క్యాంపు, తాత్కాలిక బస్టాండ్, క్యూలైన్లు, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్ల వసతి ఏర్పాటు చేశామని వివరించారు. మేడారం జాతర వివరాలు, బస్సుల సమగ్ర సమాచారం, సమీపంలో ఉండేందుకు హోటల్ వసతి, చార్జీలు, ఇతర విభాగాల వివరాలతో.. కిట్స్ కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు. -
సంక్రాంతికి 6,970 ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: సంక్రాంతి రద్దీకి తగ్గట్టుగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు 6,970 ప్రత్యేక బస్సులు నడపనున్నామని ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు వీటిని నడుపుతామన్నారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 7 నుంచి 14 వరకు 3,755 సర్వీసులు, 15 నుంచి 18 వరకు మరో 3,215 సర్వీసులను నడుపుతామన్నారు. గతేడాది కంటే 35శాతం అదనపు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని ద్వారకా తిరుమలరావు సూచించారు. ప్రత్యేక సర్వీసు బస్సులన్నీ ఓ వైపు ఖాళీగా వెళ్లి మరోవైపునుంచి ప్రయాణికులతో వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కాబట్టి ప్రత్యేక సర్వీసు బస్సులకే ఒకటిన్నర రెట్లు అధిక చార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని చెప్పారు. సాధారణ సర్వీసు బస్సులలో సాధారణ చార్జీలే వసూలు చేస్తామన్నారు. ప్రయాణికుల సమాచారం కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ 0866–2570005ను అందుబాటులో ఉంచామని చెప్పారు. -
ఆర్టీసీని కించపరిచే ప్రకటన తొలగించండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సును కించపరిచేలా సినీ హీరో అల్లు అర్జున్‌తో ఓ యాప్ ఆధారిత బైక్ టాక్సీ అగ్రిగేటర్ రూపొందించిన ప్రచార చిత్రాన్ని ప్రదర్శన నుంచి తొలగించాల్సిందిగా నాంపల్లిలోని సిటీసివిల్ కోర్టు ఆదేశించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఆ బైక్ టాక్సీ సంస్థ పనితీరు ఉత్తమంగా ఉంటుందని చూపించే క్రమంలో ఆర్టీసీ బస్సులను తక్కువ చేసేలా ప్రచార చిత్రాన్ని రూపొందించి యూట్యూబ్‌లో ప్రసారం చేస్తుండటాన్ని తప్పుపడుతూ ఇటీవల ఆర్టీసీ ఎండీ పరువునష్టం దావా హెచ్చరికలతో ఆ సంస్థకు, నటుడు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. అయినా ప్రసారాలను నిలిపివేయకపోవటంతో ఆర్టీసీ నాంపల్లి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆర్టీసీకి అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీ చేసిందని సజ్జనార్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నోటీసుల అనంతరం స్వల్పంగా ప్రచార చిత్రంలో మార్పు చేసినా.. ఆర్టీసీ బస్సును అలాగే చూపించటాన్ని తప్పుపడుతూ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ ప్రచార చిత్రాన్ని ప్రసారం నుంచి తొలగించాలని, వీడియో అసలు, సవరించిన యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని గూగుల్ ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ని కోర్టు ఆదేశించినట్టు వెల్లడించారు. -
సజ్జనార్ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో
-
TSRTCలో కొత్త జోష్
-
సజ్జనార్ కీలక నిర్ణయం.. ఇక బస్సులపై ఈ పోస్టర్లు కనిపించవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సులపై అశ్లీల పోస్టర్లను నిషేధిస్తూ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అభ్యంతరకరమైన, ఆశ్లీల చిత్రాలు హైదరాబాద్ నగర బస్సులపై కనిపించవని ఆయన స్పష్టం చేశారు. ఓ సినిమాకు సంబంధించిన అశ్లీల పోస్టర్ ఆర్టీసీ బస్సుపై ఉండటాన్ని అభిరామ్ నేత అనే నెటిజన్ బుధవారం ట్విటర్లో పోస్టు చేశాడు. దీనికి టీఎస్ఆర్టీసీ ఎండీ ఆఫీస్‌ను ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో సజ్జనార్ స్పందించారు. ఇవి మన బస్సులూ.. ఇదీ మన బహిరంగ ప్రచారం..💁@tsrtcmdoffice @TSRTCHQ ఎవర్ని రెచ్చగొడుతున్నాం..? ఏం కోరుకుంటున్నాం? : సినిమాని వినోదంలా చూడమని సొల్లు కబుర్లు మాత్రం ఎవరూ చెప్పొద్దూ..! pic.twitter.com/ck9QZwGxby — ABHIRAM NETHA (@AbhiramNetha) September 15, 2021 సంస్థ దీనిపై చర్యలు తీసుకుంటుందని.. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులపై అశ్లీల పోస్టర్లు కనిపించకుండా చర్యలు తీసుకుంటామని ఆయన రీట్వీట్ చేశారు. చెప్పినట్లుగానే ఆర్టీసీ బస్సులపై అసౌకర్యంగా, అభ్యంతరకరంగా ఉండే పోస్టర్లను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. సజ్జనార్ చర్యపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. In order to Prevent #disfigurement & objectionable Posters on #RTC Buses #MD @TSRTCHQ Sri #VCSajjanar #IPS has Passed instructions to all Officers to Remove all such Kind of Posters immediately #ActNow#Revolution #publictransport@TelanganaCMO @KTRTRS @puvvada_ajay @DonitaJose pic.twitter.com/Zhfn9ImKj4 — TSRTC MD Office (V.C Sajjanar IPS) (@tsrtcmdoffice) September 16, 2021 -
ఏపీ ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు నియామకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకాతిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీ ఠాకూర్ రిటైర్ కావడంతో ఆ స్థానాన్ని ద్వారకా తిరుమలరావు భర్తీ చేయనున్నారు. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఎన్.సంజయ్ నియమకాన్ని ఖరారు చేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వలు జారీ చేశారు. చదవండి: 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన -
అంతర్రాష్ట్ర సర్వీసులపై చర్చ
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించే విషయంపై చర్చించేందుకు సోమవారం రెండు ఆర్టీసీల ఎండీలు సమావేశం కానున్నారు. బస్‌భవన్‌లో గాని.. ఎర్రంమంజిల్ ఆర్టీసీ ఎండీ కార్యాలయంలో గాని ఈ భేటీ జరగనుంది. తొలుత ఓ పర్యాయం విజయవాడలో, ఆ తర్వాత బస్‌భవన్ లో ఈడీల స్థాయిలో సమావేశాలు జరిగాయి. కానీ చర్చలు పూర్తిగా కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు టీఎస్ఆర్టీసీ కంటే లక్ష కిలోమీటర్ల మేర ఎక్కువగా అంతర్రాష్ట్ర ట్రిప్పులు తిరుగుతున్నాయి. దీన్ని తెలంగాణ ఆర్టీసీ తప్పుపడుతోంది. రెండు ఆర్టీసీలు సమంగా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేలా ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. దీనికి ఏపీఎస్ ఆర్టీసీ సమ్మతించినా... సమంగా చేసే విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. లక్ష కిలోమీటర్ల మేర తెలంగాణ బస్సులు కూడా ఏపీ పరిధిలో తిప్పితే సరిపోతుందని ఏపీ ఆర్టీసీ పేర్కొంటోంది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నందున, అదనంగా అన్ని కిలోమీటర్ల మేర బస్సులు తిప్పటం కుదరదని, ఏపీ అంతమేర తక్కువగా తిప్పాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. మధ్యేమార్గంగా తాము 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, తెలంగాణ 50 వేల కి.మీ. మేర పెంచుకుంటే సరిపోతుందని ఏపీ అధికారులు ప్రతిపాదించారు. దీనికీ తెలంగాణ అధికారులు సమ్మతిచడం లేదు. ఈ నేపథ్యంలో సయోధ్య కుదిరేలా ఇరు ఆర్టీసీల ఎండీలు భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రుల భేటీ సోమవారం ఉంటుందంటూ వార్తలు వెలువడ్డాయి. దీన్ని తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖండించారు. ఎండీల స్థాయిలోనే సమావేశం కోసం మాత్రమే అంగీకరించామని వెల్లడించారు. -
ఏపీఆర్టీసీ కార్మికులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. అర్టీసీ కార్మికులకు కరోనా బీమా వర్తింపజేయాలని యాజమాన్యం బుధవారం నిర్ణయం తీసుకుంది. కార్మిక పరిషత్ నేతలు నిన్న(మంగళవారం) ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబును కలిసి బీమా కల్పించాలంటూ కార్మికులు వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు 50 లక్షల రూపాయల కోవిడ్ బీమా వర్తింపచేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. (మోడల్ హౌస్‌ను పరిశీలించిన సీఎం జగన్) అలాగే ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని ఆర్టీసీ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ ఎండీ ఆదేశాలు జారీ చేయడంతో కార్మికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కరోనాతో ఇప్పటివరకు మరణించిన 36 మంది ఆర్టీసీ కార్మికులకు కూడా ఈ బీమా వర్తింప చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం మృతుల వివరాలతో సహా ధ్రువపత్రాలను ఈ నెల 28లోపు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపాలని ఏండీ కృష్ణబాబు జిల్లాల ఆర్ఎంలను ఆదేశించారు. దీంతో కార్మిక పరిషత్ సహా ఇతర సంఘాల కార్మికులు ఎండీకి ధన్యవాదాలు తెలిపారు. (ఆ పరీక్షలను సవాల్‌గా తీసుకోండి: పెద్దిరెడ్డి) -
ఏపీఆర్టీసీ కార్మికులకు శుభవార్త
-
ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ నియమితులయ్యారు. అలాగే ఏపీఐఐసీ ఎండీగా రజిత్ భార్గవ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీగా ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వహించిన కృష్ణబాబు రిలీవ్ అయ్యారు. -
కొత్త ఉద్యోగులకు శిక్షణ ప్రారంభించిన ఆర్టీసీ ఎండీ
సాక్షి, హైదరాబాద్ : దాదాపు రెండు నెలల వరకు తెలంగాణలో సాగిన ఆర్టీసీ సమ్మెలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగాలు కల్పించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక ఉద్యోగ కల్పన పథకం కింద 38 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇందులో 16 మంది జూనియర్ అసిస్టెంట్, 12 మంది కండక్టర్లు, 8 మంది సెక్యూరిటీ కానిస్టేబుళ్లు, ఇద్దరు శ్రామికులుగా ఉన్నారు. వీరికి శిక్షణా తరగతులను ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ బుధవారం ప్రారంభించారు. జూనియర్ అసిస్టెంట్‌కు 13 వారాలు, కండక్టర్లకు 3 వారాలు, సెక్యూరిటీ కానిస్టేబుల్స్‌కి 8 వారాలు, శ్రామికులకు 2 వారాల శిక్షణను ఇస్తున్నారు. -
ఈనెల7న ఆర్టీసీ ఎండీ కోర్టుకు హాజరుకావలని ఆదేశం
-
ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’
-
ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని ముందే చెప్పినట్టు ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ తెలిపారు. చర్చలు జరుగుతుండగా మళ్లీ వస్తామని చెప్పి ఆర్టీసీ జేఏసీ నేతలే వెళ్లిపోయారని అన్నారు. వారు మళ్లీ తిరిగి వచ్చినా చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన 21 అంశాలపై చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు. రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా మాట్లాడుతూ.. ‘26 డిమాండ్లపై చర్చించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు అన్నారు. విలీనంపై కూడా చర్చ జరపాలని పట్టుబట్టారు. విలీనంపై చర్చ సాధ్యంకాదు అన్నాం. దాంతో సభ్యులతో చర్చించుకుని వస్తామన్నారు. ఇప్పటివరకు రాలేదు’అని చెప్పారు. కాగా, ఎర్రమంజిల్‌లోని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 22వ రోజుకు చేరింది. (చదవండి : ఆర్టీసీ చర్చలు : ‘మొబైల్ ఫోన్లు లాక్కున్నారు’ -
ఆర్టీసీ సమ్మె : చర్చలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఏర్పాటైన అధ్యయన కమిటీ కేసీఆర్‌కు నివేదిక అందించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కార్మికులతో చర్చలకు ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం రేపు (శనివారం) చర్చలు జరిపే అశకాశం ఉంది. ఈడీల స్థాయిలో ఆర్టీసీ కార్మికులతో రేపు ఉదయం 11 గంటలకు బస్ భవన్లో చర్చలు జరగనున్నాయి. ఆర్థికపరమైన 12 అంశాలపై చర్చించే అవకాశముంది. హైకోర్టు ఆదేశాలమేరకు.. విలీనం మినహా 21 డిమాండ్ల సాధ్యసాధ్యాలపై మూడు రోజుల క్రితం ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఆరుగురు ఈడీలతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అధ్యయన కమిటీ రెండు రకాల నివేదికలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రతి అంశానికి రెండు రకాల సమాధానాలు అధికారులు సిద్ధం చేసినట్టు సమాచారం. కోర్టుకు సమగ్ర వివరాలు అందించేలా కమిటీ సభ్యులు రిపోర్టు తయారు చేశారు. ఈ నివేదికను 28న జరిగే విచారణలో ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించనుంది. ఆర్టీసీకి అద్దెబస్సుల అవసరంపై కూడా కమిటీ సభ్యులు మరో నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది. -
సమ్మె విరమిస్తేనే చర్చలు!
సాక్షి, హైదరాబాద్: మూడు రోజుల్లో ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రక్రియ పూర్తి చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కార్మికులతో సంప్రదింపులకు ఆర్టీసీ ఎండీ కసరత్తు చేస్తున్నారు. అయితే, కార్మిక సంఘాలు ముందు భేషరతుగా సమ్మె విరమించుకుంటేనే చర్చలకు అవకాశం ఉంటుందనే సంకేతాలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఓ సారి చర్చ జరిగింది. రెండు రోజుల క్రితం హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై స్పందిస్తూ, కార్మిక సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమ్మెలో ఉన్న వారు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని, భవిష్యత్తులో వారితో ఎలాంటి చర్చలు ఉండవని సీఎం తేల్చి చెప్పినప్పటికీ, హైకోర్టు మాత్రం కార్మికులతో చర్చించాల్సిందేనని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. తదుపరి వాయిదా ఈనెల 28న ఉన్నందున, అప్పటి వరకు చర్చల సారాంశాన్ని కోర్టుకు విన్నవించాల్సి ఉంది. హైకోర్టు ఎండీని నేరుగా ఆదేశించినందున, చర్చలు చేపట్టకుంటే కోర్టు ధిక్కరణ కిందకు వచ్చే అవకాశం ఉంది. దీంతో కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో శుక్రవారం రాత్రి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ ప్రగతి భవన్‌కు వెళ్లారు. కానీ సీఎం వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో భేటీ సాధ్యం కాలేదు. మరోవైపు, హైకోర్టు ఆదేశానికి సంబంధించిన పూర్తి పాఠం ప్రతి అధికారులకు అందలేదు. దానిని చూసిన తర్వాతనే స్పందించాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, చర్చలు జరపాలంటూ కోర్టు స్పష్టంగా చెప్పినందున ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ మరో పక్క అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బంద్‌కు వివిధ వర్గాల మద్దతు లభించడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. కానీ దీనిని అంగీకరించవద్దని ప్రభు త్వం భావిస్తోంది. విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో.. సమ్మె నేపథ్యంలో పొడిగించిన సెలవులు కూడా ఆదివారంతో పూర్తి అవుతున్నాయి. దీంతో సోమవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా బస్సుల సంఖ్య పెంచాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. -
ఆర్టీసీ సమ్మె: సీఎస్, ఆర్టీసీ ఎండీకి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపుపై జాతీయ బీసీ కమిషన్ శనివారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీకి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న ఢిల్లీలో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆర్టీసీలోని 20 వేలకు పైగా బీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించిందని, దీనిపై తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ కల్వకుర్తి ఆర్టీసీ జేఏసీ ....జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కమిషన్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, సంబంధిత ఫైళ్లు, కేస్ డైరీలు సహా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజు కూడా కొనసాగింది. ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. చదవండి: ఆర్టీసీ సమ్మె : 23న ఓయూలో బహిరంగ సభ -
డిపో మేనేజర్లతో ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్
-
ఆర్టీసీ చార్జీలు 30 శాతం పెంచాల్సిందే..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) చార్జీలను గత నాలుగేళ్లుగా పెంచలేదని, ఏడాదికి 7.5 శాతం చొప్పున మొత్తం 30 శాతం మేర చార్జీలు పెంచేందుకు ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదనలు పంపిస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) ఎన్వీ సురేంద్రబాబు చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడ ఆర్టీసీ హౌజ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తక్షణ అవసరం కింద రూ.3,717.95 కోట్లను ప్రభుత్వం 2019–20 బడ్జెట్లో చేర్చి, సాయమందిస్తే తప్ప ఆర్టీసీ అప్పులు, నష్టాల నుంచి బయటపడే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఏడాదికి రూ.650 కోట్ల నష్టాన్ని ఆర్టీసీ భరించాల్సి వస్తోందన్నారు. 2015–16లో సంస్థకు రూ.735 కోట్లు నష్టం రాగా, 2016–17లో ఈ నష్టం రూ.789 కోట్లకు చేరిందన్నారు. 2017–18లో రూ.1,209 కోట్ల మేర ఆర్టీసీ నష్టపోయిందని వివరించారు. ప్రతి కిలోమీటర్‌కు రూ.6.53 నష్టం ఆర్టీసీకి బ్యాంకు అప్పులు, ఇతరత్రా బకాయిలన్నీ కలిపి రూ.6,445 కోట్ల మేర ఉన్నాయని సురేంద్రబాబు వెల్లడించారు. పల్లెవెలుగు బస్సుల వల్ల రూ.1,409 కోట్ల నష్టం వస్తోందన్నారు. కాలం చెల్లిన బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ నడపబోమని, 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులన్నింటినీ మార్చాలంటే మొత్తం 1,666 కొత్త బస్సులు అవసరమవుతాయని తెలిపారు. ఇందుకు రూ.666 కోట్లు కావాలన్నారు. బస్సును నడిపితే కిలోమీటర్‌కు రూ.6.53 చొప్పున నష్టం వస్తోందని అన్నారు. మోటార్ వెహికల్(ఎంవీ) ట్యాక్స్‌ల రూపంలో ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,409 కోట్లు చెల్లిస్తోందని వివరించారు. పొదుపు చర్యలతో ఆదాయం పెంచాం.. 2018–19లో ఆర్టీసీ 78 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) సాధించిందని సురేంద్రబాబు గుర్తుచేశారు. అంతర్గత పొదుపు చర్యల ద్వారా సంస్థ ఆదాయం పెంచామని చెప్పారు. 2018–19లో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రూ.554 కోట్ల సాయం అందిందని పేర్కొన్నారు. ఎంవీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, పల్లెవెలుగు బస్సుల వల్ల వచ్చే నష్టాలను ప్రభుత్వమే భరించాలని కోరారు. ఆర్టీసీలో ఉద్యోగులను తొలగించడం లేదని, పదవీ విరమణ తర్వాత ఖాళీలను భర్తీ చేయకుండా.. ఉన్న సిబ్బందినే సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసులపై ప్రతిరోజూ వారితో చర్చలు జరుపుతామని అన్నారు. రాజకీయ పార్టీల్లాగా ఓటర్లు తమకు ఓటేయరేమోనన్న ఆలోచనలతో కార్మిక సంఘాలతో ప్రతి అంశాన్ని తాము చర్చించలేమని సురేంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయా జిల్లాల అధికార యంత్రాంగం కోరిన మేరకే బస్సులు కేటాయిస్తున్నామని, ఇందుకు గాను ఆర్టీసీకి డబ్బుల చెల్లింపులో జాప్యం జరిగినా కచ్చితంగా చెల్లిస్తారని చెప్పారు. -
‘ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే ప్రభుత్వానిదే బాధ్యత’
సాక్షి, విజయవాడ : ఆర్టీసీ యూనియన్ నేతలలో ఎండీ సురేంద్రబాబు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాదాపు గంటకు పైగా జరిగిన చర్చల్లో కార్మిక సంఘాల డిమాండ్లకు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అంగీకరించలేదు. దీంతో చర్చల మధ్య నుంచే ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, దామోదర్ రావులు బయటకు వచ్చారు.అనంతరం జేఏసీ నాయకులు మీడీయాతో మాట్లాడుతూ.. వేతన సవరణపై మీటింగ్‌లో చర్చించామని చెప్పారు. 50శాతం ఫిట్మెంట్ డిమాండ్ చేస్తే 20శాతానికి మించి ఇవ్వలేమని ఎండీ తేల్చిచెప్పారని, దానికి తాము అంగీకరించలేదన్నారు. తాము చేపట్టబోయే సమ్మేను విరమించే ప్రసక్తే లేదన్నారు. బుధవారం ఉదయం జేఏసీ సమావేశం నిర్వహించి సమ్మె తేదిని ప్రకటిస్తామని చెప్పారు. ఒకవైపు చర్చలు జరుతూనే మరోవైపు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు. తమది న్యాయమైన డిమాండ్లు అని, వాటిని సాధించుకునే వరకు పోటాటం చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రాబోయే బడ్జెట్లో ఆర్టీసీకి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. -
‘ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే ప్రభుత్వానిదే బాధ్యత’
-
ఐఏఎస్సా.. ఐపీఎస్సా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి త్వరలోనే కొత్త ఎండీ రానున్నారు. ఓ యువ ఐఏఎస్ అధికారిని పూర్తిస్థాయి ఎండీగా నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని సమాచారం. ఆర్టీసీ ఎండీ రమణారావు పదవీకాలం మేలో పూర్తయింది. తరువాత ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. కానీ, ఆ బాధ్యతలను ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మకు అప్పగించారు. రోడ్లు–భవనాలు, రవాణాశాఖకు ఆయన కమిషనర్‌గా వ్యహరిస్తూనే.. ఆర్టీసీ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. ఆర్టీసీ బాధ్యతలనుంచి తనను తప్పించాల్సిందిగా శర్మ ప్రభుత్వాన్ని కొంతకాలంగా విన్నవిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో యువ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా పేరును, మరో డీజీపీ ర్యాంకు స్థాయి ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ పేర్లు తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో పలు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన రాహుల్ బొజ్జా పరిపాలన దక్షత కలిగిన అధికారిగా మంచిపేరు సంపాదించారు. ప్రస్తుతం రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా ఉన్న కృష్ణ ప్రసాద్‌కు రోడ్డు రవాణారంగంపై మంచి పట్టు ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వం ఎవరినీ ఖరారు చేయలేదు. వీరిద్దరిలో ఒకరి పేరు ఖరారు చేస్తూ త్వరలోనే ఆదేశాలు రావొచ్చని ఆర్టీసీలో చర్చ నడుస్తోంది. -
ఉద్యోగులు బాగుంటేనే సంస్థ బాగుంటుంది
సాక్షి, విజయవాడ : ఉద్యోగులు బాగుంటేనే సంస్థ బాగుంటుందని ఏపీఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సులు నష్టాల్లో నడుస్తున్నా సామాజిక బాధ్యతతో తిప్పుతున్నామని తెలిపారు. గత రెండు నెలలుగా కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాల్ని చేపట్టామని, సెలవుల్లో విషయంలో ఇబ్బంది లేకుండా అదనపు సిబ్బందిని సమకూర్చామని పేర్కొన్నారు. దాదాపు 20,200 మందికి పెన్షన్లు పెండింగ్‌లో ఉన్న విషయం గుర్తించామన్నారు. కార్మికులకు పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వాలని, జూన్ నెలలో రిటైరయ్యే వారికి అదేరోజున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని ఆదేశించానని సురేంద్రబాబు అన్నారు. పాత బకాయిలు క్లియర్ చేసే పనిలో ఉన్నాం.. పాత బకాయిలు క్లియర్‌చేసే పనిలో ఉన్నామని సురేంద్రబాబు తెలిపారు. కార్మికులను చార్జిమెమోలతో వేధించే విధానానికి స్వస్తి పలికి సరికొత్త విధివిధానాలను రూపొందించామని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా వేళలు మార్చడంద్వారా ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందన్నారు. విద్యార్థుల బస్‌పాస్‌లను నెలవారీ కాకుండా త్రైమాసికం, వార్షిక విధానానికి వెసులుబాటు కల్పించామన్నారు. రెండు వందల కోట్లతో 850 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని, డిమాండ్ ఉన్న రోజుల్లో టికెట్ల ధరలు పెంచుతామని పేర్కొన్నారు. పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీకి భారంగా మారాయని, టికెట్ల ద్వారానే కాకుండా ఇతన మార్గాల ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఆర్టీసీ స్థలాల్ని వాణిజ్యపరంగా వినియోగంలోని తీసుకువస్తామన్నారు. -
ఆర్టీసీలో షాడో ఎండీ!
► ప్రతి పనికీ ఆయన కటాక్షం కావాల్సిందే.. ► ఈడీలు చెప్పినా ఎండీని కలిసేందుకు అనుమతి ససేమిరా ► షాడో దెబ్బకు విలవిలలాడుతున్న ఉద్యోగులు సాక్షి, అమరావతి బ్యూరో: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది ఆర్టీసీలో ఎండీ పేషీలో పనిచేసే ఓ కీలక అధికారి వ్యవహారం. షాడో ఎండీగా చలామణి అవుతున్న ఈయన కొన్నేళ్లుగా పేషీలోని తిష్ట వేయడంతో వేసుక్కూర్చుకున్నారు. ఆయన కనుసన్నల్లోనే పాలనా వ్యవహారాలు నడిపిస్తున్నారు. చిన్నస్థాయి ఉద్యోగులు ఎండీని కలవాలంటే ముందుగా షాడో ఎండీని ప్రసన్నం చేసుకోవాల్సిందే. ప్రతి పనికీ ఓ రేటు.. రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్‌గానీ ఇతరత్రా ఉద్యోగులు ఏదైనా పని మీద కార్యాలయంలోకి వస్తే షాడో ఎండీ ప్రతి పనికీ రేటు పెట్టి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్నా.. కనికరం లేదు ఇటీవల శ్రీకాకుళానికి చెందిన ఆర్టీసీ చిరుద్యోగి తాను పని చేసే డిపోలో ఓ అధికారితో వాదనపడ్డాడు. దీంతో ఆయనను సన్పెండ్ చేశారు. ఉద్యోగం పోవడంతోపాటు పక్షవాతానికి గురయ్యారు. కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. ఉద్యోగం లేక కుటుంబ పోషణ కరువై ఎండీకి తనగోడు విన్నవించుకునేందుకు వచ్చాడు. కానీ షాడో ఎండీ రెండు రోజుల వరకు ఎండీని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. అతని దీనస్థితి చూసి ఇతర ఉద్యోగులు ఎండీని కలిసేందుకు అవకాశం ఇప్పించారు. బస్సులో డ్యూటీ చేసేందుకు ఇబ్బంది కావడంతో ఆన్‌డ్యూటీపై ఆర్టీసీ కార్యాలయంలోనే పని చేసేందుకు ఎండీ అవకాశం కల్పించినా, చివరకు షాడో ఎండీని ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చింది. గతంలో రాయలసీమ ప్రాంతం నుంచి ఇద్దరు శ్రామిక్ ఉద్యోగులు అనారోగ్యం పాలయ్యారు. డిపోల్లో కాలుష్యం వల్ల కిడ్నీలు దెబ్బతిన్నాయి. వారు పని చేసే డిపోలోనే అటెండర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో అందులో పని చేసుకొనేందుకు ఓడీ కోసం ఎండీని కలిసేందుకు వచ్చారు. నాలుగు రోజులపాటు పడిగాపులు కాసినా ఎండీని కలిసే అవకాశం షాడో ఎండీ కల్పించలేదు. దీంతో ఊసూరుమంటూ వెళ్లిపోయారు. ఇలా సుమారు 40 మందికిపైగా అనారోగ్య బాధితులు తమ గోడును చెప్పుకొనేందుకు ఎండీ కార్యాలయం చుట్టూ తిరిగి వేసారి వెళ్లిపోయారు. ఉత్తరాంధ్రాకు చెందిన ఓ చిరుద్యోగి విధి నిర్వహణలో మద్యం సేవించినట్లు బ్రీత్ ఎనలైజర్లలో వచ్చింది. కానీ ఆ ఉద్యోగి మద్యం సేవించలేదు. చివరకు బ్రీత్ ఎనలైజర్‌లో సాంకేతిక లోపంలో అలా వచ్చినట్లు తేలింది. కానీ ఆ ఉద్యోగిని మాత్రం సస్పెండ్ చేశారు.ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడింది. తనకు జరిగిన అన్యాయం గురించి ఎండీకి చెప్పుకోనేందుకు వచ్చినా అవకాశం రాలేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన రిటైడ్ ఉద్యోగులు, ప్రమాద బాధిత ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎండీని కలిసేందుకు వస్తుంటారు. ఇక్కడకొచ్చాక రోజుల తరబడి ఎండీ వద్దకు వీలులేక పస్తులతో అల్లాడుతున్నారు. ఈడీల స్థాయి మాటా బేఖాతరు ఆర్టీసీలో ఎండీ స్థాయి అధికారి కలిసి సమస్యలు చెప్పుకొనేందుకు ఇతర జిల్లాల నుంచి ఎంతో మంది ఉద్యోగులు వస్తుంటారు. వారికి ఎండీ కలిసే అవకాశం లేకపోవడంతో స్థానిక అధికారుల వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. వారు ఎండీని కలిసేందుకు సిఫార్సు చేసినా షాడో ఎండీ అడ్డుకుంటున్నారు. అధికారి మంచి వారైనా.. ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ఏ చిన్న సమస్య వచ్చినా ఎండీనే పెద్ద దిక్కు. తన దృష్టికి వచ్చిన సమస్యలను బాస్ పరిష్కరిస్తారని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే ఇలాంటి షాడో ఉద్యోగులతో ఎండీపైనా దురాభిప్రాయం ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు. -
ఆర్టీసీలో సంస్కరణలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : రాష్ట్ర ప్రజల రవాణా అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా ఆర్టీసీలో సంస్కరణ తీసుకురావడానికి కార్యాచరణ రూపొం దిస్తున్నామని ఆర్టీసీ ఎండీ ఎం.మాలకొండయ్య తెలిపారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాలోని ఏలూరు ఆర్టీసీ డిపో, గ్యారేజ్, ఏలూరు కొత్త బస్టాండుల్లో ఆయన క్షేత్ర పరిశీలన చేశారు. ఆర్టీసీ ఇప్పటికే కోట్లాది రూపాయల నష్టాల్లో నడుస్తోందని, అప్పులకు వడ్డీల కింద రూ.240 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. సంస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని చెప్పారు. టికెట్ల ద్వారా 85 శాతం ఆదాయం సంస్థకు టికెట్ల ద్వారానే అత్యధికంగా 85 శాతం ఆదాయం వస్తోందని, ఇతర మార్గాల ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని ఎండీ మాలకొండయ్య చెప్పారు. రవాణా ఆదాయాన్ని మరో 2 శాతమన్నా పెంచగలిగితే సంస్థకు రూ.200 కోట్ల ఆదాయం అదనంగా లభిస్తుందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించడానికి ఆర్టీసీలో కూడా త్వరలో ప్రయోగాత్మకంగా స్వైపింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ రవాణాను నియంత్రించాలని పోలీస్, రవాణా శాఖాధికారులను కోరామన్నారు. బీవోటీ పద్ధతిపై స్థలాల లీజు జిల్లాలో ఆర్టీసీకి తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల ద్వారా నష్టం వస్తోందని, వాటిని నియంత్రించే అవకాశంపై ఆయనను ప్రశ్నించగా ఏ రీజియన్‌కు ఆదాయం వచ్చినా మొత్తం సంస్థకే వస్తుంది కాబట్టి వాటిని నియంత్రించడానికి అవకాశం లేదన్నారు. బిల్డ్, ఆపరేట్, ట్రాన్సఫర్ (బీవోటీ ) పద్ధతిపై ఆర్టీసీ స్థలాలను అద్దెలకు ఇచ్చి ఆదాయం పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఏలూరు కొత్త బస్టాండ్ ప్రాంగణంలోని అతిపెద్ద స్థలాన్ని సీఎంఆర్ సంస్థకు బీవోటీ పద్ధతిన లీజుకు ఇచ్చామని తెలిపారు. బైపాస్ బస్సులపై అధ్యయనం బైపాస్ బస్సులు నగరంలోకి రాకపోవడం వల్ల ఏలూరు ప్రజలు చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రాత్రి 11 గంటల తర్వాత బైపాస్ బస్సుల్లో వచ్చే ప్రయాణికులు ఆశ్రం కళాశాల వద్ద దిగి నగరంలోకి రావడానికి ఆటోలు దొరక్క పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసురాగా బైపాస్ బస్సులను రాత్రి 11 గంటల నుంచి వేకువజామున 4 గంటల వరకూ నగరంలోకి వచ్చేట్లు చేయడానికి గల అవకాశాలపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకుడు ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాదరావు మాట్లాడుతూ ఆర్టీసీకి ప్రైవేట్ అక్రమ వాహనాల కారణంగా ఏటా రూ.200 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని, అలాగే ఆర్టీసీ బస్సులకు వినియోగించే డీజిల్ ఆయిల్‌పై 14 శాతం పన్ను వసూలు చేస్తుండటంతో మరో రూ.200 కోట్లు సంస్థకు భారంగా పరిణమించిందని చెప్పారు. ఆర్టీసీ ఈడీ అడ్మినిస్ట్రేషన్ కె.వెంకటేశ్వరరావు, ఈడీ ఆపరేషన్స జి.జయరావు, విజయవాడ జోన్ ఈడీ ఎన్.వెంకటేశ్వరరావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి, రీజినల్ మేనేజర్ ఎస్.ధనుంజయరావు, డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎస్.మురళీకృష్ణ, డెప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ ఎం.నాగేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా నగదురహితం ఏలూరు (మెట్రో): జిల్లాలో నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా నగదు రహిత చెల్లింపులకు వీలుగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ఎం.మాలకొండయ్య చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను మాలకొండయ్య మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రతి బస్సులోనూ క్యూ ఆర్ కోడ్‌ను ఏర్పాటు చేస్తామని, కేవలం సాధారణ ఫోన్ ద్వారా కండక్టర్ ప్రజల నుంచి నగదురహిత విధానం ద్వారా ప్రయాణికులకు టికెట్లు అందించే ప్రక్రియను సులువుగా అమలు చేయవచ్చన్నారు. ఆర్టీసీ ఈడీఏ వెంకటటేశ్వరరావు, ఆపరేషన్స ఈడీ జయరావు, సీడీఎం బ్రహ్మానందరెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం ధనుంజయరావు పాల్గొన్నారు. -
ఆర్టీసీను గట్టెక్కెంచే బాధ్యత అందరిదీ
– ఆర్టీసీ ఎండీ ఎం మాలకొండయ్య అనంతపురం న్యూసిటీ : ఆర్టీసీని గట్టెక్కించే బాధ్యత అందరిపై ఉందని ఆర్టీసీ ఎండీ ఎం మాలకొండయ్య అన్నారు. ఆదివారం ఆయన స్థానిక డిపోను తనిఖీ చేశారు. రీజియన్‌లో సంస్థ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆక్యుపెన్సీ రేషియో పెంచడంతో పాటు వన్‌మాన్ సర్వీసులను తిప్పాలని ఈడీ ఆపరేషన్స్ జయరావు డీఎం బాలచంద్రప్పకు సూచించారు. పలు ఎక్స్‌ప్రెస్ బస్సులను ఎండీ పరిశీలించారు. మూలనపడ్డ సీజ్ అయిన వాహనానలు చూసి ఎన్ని రోజులుగా ఇక్కడున్నాయని అధికారులను ఆయన ప్రశ్నించారు. రోజుకు రూ 27 లక్షల నష్టం.. ఈడీ అనంతపురం డిపో రోజుకు రూ 27 లక్షల నష్టం వస్తోందని ఈడీ ఆపరేషన్స్ జయరావు అన్నారు. కార్మికులు ప్రతి స్టేజులో ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకుంటే నష్టాల నుంచి గట్టెక్కించవచ్చన్నారు. అక్రమ రవాణాకు ఎస్పీ, ఆర్టీఏ అధికారుల సహకారం తీసుకుందామన్నారు. మన సంస్థ కోసం ఓ ఉద్యమంలో కార్మికులందరూ పని చేస్తే మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. ఆర్ఎం చిట్టిబాబు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులున్నా రీజియన్‌లో మరో డిపోను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. తాడిపత్రి డీఎం ఆవుల నరేంద్రరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ గౌడ్, కంట్రోలర్లు శివలింగప్ప, ఆర్టీసీ వైద్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఎండీ ఆకస్మిక తనిఖీ
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్‌లను ఆర్టీసీ ఎండీ సాంబశివరావు శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంప్లెక్స్‌లలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. వనరులను వినియోగించుకుని, సంస్థ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. నిరుపయోగంగా ఉన్న పెద్దాపురం ఆర్టీసీ భవన సముదాయాన్ని కల్యాణమంటపం, గోదాములుగా మార్చే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
చంద్రబాబుతో ఆర్టీసీ ఎండీ సమావేశం
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆస్తులు, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై సమీక్ష జరుపుతున్నారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బెజవాడ బస్టాండ్‌కు 5జీ వైఫై!
-
బెజవాడ బస్టాండ్‌కు 5జీ వైఫై!
ప్రారంభించిన ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తొలి 15 నిమిషాలే ఉచితం విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు 5జీ వైఫై హంగులు అందివచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న 3జీ, 4జీ కన్నా అప్డేట్గా 5జీ వైఫై అందించడం విశేషం. ఈ సేవలను రానున్న 3 నెలల్లో జిల్లా కేంద్రాల్లో ఉన్న బస్టాండుల్లో అందుబాటులోకి తేనున్నారు. క్వాడ్జెన్, బీఎస్ఎన్ఎల్, ఏపీఎస్ ఆర్టీసీ సంయుక్త ఆధ్వర్యంలో క్యూఫై లైఫ్ ః 5జీ సేవలను ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు సోమవారం ప్రారంభించారు. విజయవాడ బస్‌స్టేషన్‌కు రోజుకు 1.50 లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 17 వైఫై ఆపరేట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో వైఫై పాయింట్ పరిధిలో 400 మంది సేవలు పొందేలా డిజైన్ చేశారు. బ్రౌజింగ్లోకి వెళ్లి యూజర్ నేమ్, మొబైల్ నంబర్ నమోదు చేసుకున్నాక వచ్చే పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఈ సేవలు పొందవచ్చు. తొలి 15 నిమిషాలే ఉచితం.. బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన వైఫై సేవలు ఒక యూజర్‌కు తొలి 15 నిమిషాలే ఉచితంగా అందిస్తారు. అనంతరం ఈ సేవలను స్క్రాచ్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేయాలి. బస్టాండ్‌లోని అవుట్లెట్లలో రూ.30, 60, 90 స్క్రాచ్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు. కనెక్ట్కాక తికమక ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వైఫై సేవలను ప్రారంభించి.. నగర పోలీస్ కమిషనర్ వేంకటేశ్వరరావుతో 5జీ కాల్ మాట్లాడిన కొద్ది సేపటికే వినియోగదారులు వైఫై సేవలు అందక తికమకపడ్డారు. అదేమంటే వైఫై యూజర్ నేమ్, పాస్ట్‌వర్డ్ విషయంలో అవగాహన లేకపోవడమే కారణమని తెలిసింది. యూజర్ నేమ్, మొబైల్ నంబర్, పాస్ట్‌వర్డ్ ఎంటర్ చేసే అవగాహన లేకుంటే వైఫై సేవలు అందని ద్రాక్షే. హైదరాబాద్‌లో రోజూ 3 వేల మంది యూజర్లు హైదరాబాద్‌లోనూ తామే వైఫై సేవలందిస్తున్నామని, ఇటీవల నక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన వైఫై జోన్లో రోజుకు 3 వేల మంది యూజర్లు ఉపయోగించుకుంటున్నారని క్వాడ్జెన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో-బెంగళూరు) సతీష్ బెనర్జీ ‘సాక్షి’కి చెప్పారు. బీఎస్ఎన్ఎల్తో కలసి 9 రాష్ట్రాల్లో వైఫై సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. బస్టాండ్‌లో వైఫై సేవలు ఏపీలో మాత్రమే ఏర్పాటు చేశామన్నారు. -
చార్జీల పెంపు తప్పదు: ఆర్టీసీ ఎండీ
⇒ బెజవాడ బస్టాండులో నేటినుంచి వై-ఫై సేవలు ఒంగోలు: ఫిట్‌మెంట్‌వల్ల రూ.960 కోట్ల భారం పడిందని, అందువల్ల చార్జీల పెంపు అనివార్యమని ఆర్టీసీ మేనేజింగ్ డెరైక్టర్ నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. అయితే అదెంతనే విషయం ప్రభుత్వంతో చ ర్చల అనంతరం ప్రకటిస్తామన్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపోను ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ అనేక డిపోలు నష్టాల్లో ఉన్నాయన్నారు. అవన్నీ లాభాలు గడిస్తేనే ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కుతుందన్నారు. అక్రమ రవాణా అరికట్టడమే అందుకు మార్గమని చెప్పారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండులో సోమవారం నుంచి వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. -
'ఆర్టీసీ ఎండీ చర్చలను తప్పుదోవ పట్టిస్తున్నారు'
హైదరాబాద్: ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చర్చలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఎన్‌ఎంయూ నేతలు ఆరోపించారు. ఆదివారం తెలంగాణ మంత్రులు నాయిని, ఈటెలను టీఎన్‌ఎంయూ నేతలు కలసిశారు. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న కార్మికులపై ఎండీ అనుసరిస్తున్న వైఖరిని వారు ఈ సందర్భంగా మంత్రుల ఎదుట దుయ్యబట్టారు. అనంతరం రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వద్దకు కార్మిక సంఘాల నేతలు చర్చలకు వెళ్లారు. అయితే కోర్టు తీర్పును గౌరవించి సమ్మెను విరమించాలని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి కార్మిక సంఘా నేతలకు విజ్ఞప్తి చేశారు. అప్పుడే చర్చలు జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 12న ప్రభుత్వ వాదనలు కోర్టులో వినిపిస్తామని మహేందర్‌రెడ్డి వెల్లడించారు. -
ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు రద్దు
హైదరాబాద్ : యూనియన్ నేతలపై ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు రద్దు చేసింది. అలాగే వేతనాల నుంచి కార్మిక సంఘాల సభ్యత్వ రుసుం వసూలకు స్వస్తి చెప్పింది. అంతేకాకుండా యూనియన్ కార్యకలాపాలలో తిరిగే నేతలకు ఆన్‌డ్యూటీతో పాటు ఇతర సౌకర్యాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘాల పదవీ కాలం జనవరి 3వ తేదీని ముగిసిన విషయం తెలిసిందే. -
ఆర్టీసీ ఎండీ దిష్టిబొమ్మకి శవయాత్ర చేశారు
వరంగల్ : వరంగల్ బస్టాండ్‌లో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తారంటూ ఆర్టీసీ ఎండీ దిష్టిబొమ్మకు శవయాత్ర చేపట్టి, అనంతర దగ్దం చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు కార్మికులు యత్నించారు. అయితే వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణాలో ఆర్టీసీ లాభాల్లో ఉందని, తెలంగాణ ఉద్యమ పోరాటలో ముఖ్యపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను విస్మరించటం మంచి పద్ధతి కాదన్నారు. మరోవైపు ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సమ్మె విరమించాలని ఆర్టీసి ఎండి పిలుపు
-
సమ్మె విరమించండి: ఆర్టీసీ ఎండీ సాంబశివరావు
-
కార్మికులు సమ్మె విరమించకుంటే కఠిన చర్యలు: ఆర్టీసీ ఎండీ
హైదరాబాద్ : కార్మికులు గురువారం మధ్యాహ్నంలోపు సమ్మె విరమించకుంటే కఠిన చర్యలు తప్పవని ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు హెచ్చరించారు. ఎల్లుండి జరగనున్న ఎంసెట్ ప్రవేశ పరీక్ష నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 10700 బస్సు సర్వీసులకు 350 బస్సులు... ఆంధ్రప్రదేశ్‌లో 11282 సర్వీసులకు 1218 బస్సులు తిరుగుతున్నాయని వివరించారు. 333 మంది డ్రైవర్లలో 150 మంది విధులకు హాజరయినట్లు చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులు రేపటిలోగా విధులకు హాజరైతే వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. -
సమ్మె విరమించండి: ఆర్టీసీ ఎండీ సాంబశివరావు
హైదరాబాద్: సమ్మెను విరమించాలని ఆర్టీసీ కార్మికులకు ఆ సంస్థ ఎండీ ఎన్ సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లో బస్ భవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుతం పెళ్లీళ్ల సీజన్, అలాగే వివిధ ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల, తిరుపతికి బస్సులు నడిపేందుకు కార్మిక సోదరులు మినహాయింపు ఇచ్చారని అదే విధంగా విద్యార్థులు, ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సమ్మె విరమించి... బస్సు సర్వీసులను నడపాలని ఆయన కార్మికు సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 12 వేల ఆర్టీసీ బస్సులు ఉంటే వాటిలో 2 వేలు అద్దె బస్సులు ఉన్నాయని సాంబశివరావు ఈ సందర్బంగా గుర్తు చేశారు. సదరు అద్బె బస్సులు తిప్పు కోవాలని ఇప్పటికే వాటి యజమానులకు చెప్పామని ఆయన వివరించారు. -
ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయ మార్గాలు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని డిపోల మేనేజర్లకు ఎండీ సాంబశివరావు ఆదేశాలిచ్చారు. ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని, ఆర్టీసీ నుంచి పదవీ విరమణ చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. భారీ వాహనాల లెసైన్సు కలిగిన వారు ఆయా డిపోల్లో సంప్రదించాలని కోరారు. కండక్టర్ల తాత్కాలిక విధులకు పదో తరగతి పాసైన వారు సంప్రదించాలని, రోజుకు రూ.800 వేతనం అందిస్తామన్నారు. డ్రైవర్లకు రూ.వెయ్యిగా నిర్ణయించారు. రిజర్వేషన్లు చేయించుకున్న వారికి తిరిగి డబ్బు వాపసు చేయడమో.. లేదా సమయానికి ప్రయాణీకుల్ని ఆయా ప్రాంతాలకు పంపేందుకు నిర్ణయించారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు కల్పించేందుకు డిపోల అధికారులు పోలీసులను సంప్రదించాలని ఆదేశించారు. -
మరో నెల రోజుల్లో ఆర్టీసీ విభజన పూర్తి: ఆర్టీసీ ఎండీ
హైదరాబాద్: మరో నెల రోజుల్లో ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తవుతుందని ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు బుధవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఏపీ, తెలంగాణ నుంచి పూర్తి స్థాయిలో రవాణా వ్యవస్థ వేరు పడుతందని తెలిపారు. ఈ ఏడాది మార్చినాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 1000 బస్సులు, అలాగే తెలంగాణకు 1300 బస్సులు రానున్నాయని ఎండీ పూర్ణచంద్రరావు చెప్పారు. -
'ఆర్టీసీ విభజన ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తాం'
హైదరాబాద్: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో విభజన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని ఆ సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఇప్పటికీ విభజన ప్రక్రియ కొనసాగుతుందున్నారు. శుక్రవారం ఆర్టీసీ భవన్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆర్టీసీ ఆస్తుల పంపకంపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుందని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే జూలై 1 వ తేదీన ఆర్టీసీ నిపుణుల కమిటీ సమావేశం కానుందని ఆయన స్పష్టం చేశారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికను త్వరలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామన్నారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఆర్టీసీని విభజన జరుగుతుందని ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. -
'జూలై 1న ఆర్టీసీ విభజన'
రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో విభజన ప్రక్రియ కొనసాగుతోందని ఆ సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. బుధవారం ఆర్టీసీ భవన్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆర్టీసీ ఆస్తుల పంపకంపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుందని ఆయన వివరించారు. ఆ కమిటీ తన నివేదికను త్వరలో తమకు అందజేయనుందని తెలిపారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా జూలై 1వ తేదీన ఆర్టీసీని విభజిస్తామని ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. -
ఆర్టీసీలో.. ఈనెల జీతంతో డీఏ
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. ఈ నెల జనవరి నుంచి అందాల్సిన 8.1 శాతం కరువు భత్యా(డీఏ)న్ని ఈ నెల జీతంతో కలిపి చెల్లించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలావుంటే, ఆర్టీసీలోని 1792 మంది కండక్టర్లను, 1955 మంది డ్రైవర్లను క్రమబద్ధీకరిస్తూ త్వరలో ఉత్తర్వులు ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. పద్మాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది జనవరిలో క్రమబద్ధీకరించిన 9,518 మందికి రావాల్సిన బకాయిలను చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఆర్టీసీకి రూ.76 కోట్లు మంజూరు కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీ బస్సు పాసుల రీయింబర్స్మెంట్, వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం వాయిదాలు, వడ్డీ చెల్లింపుల కోసం ప్రభుత్వం ఆర్టీసీకి రూ.76.65 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
మా నాన్నబస్సు కండక్టర్: ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు
హైదరాబాద్: ' మా నాన్న ఆర్టీసీ కండక్టర్. అయినా కూడా మమ్ముల్ని కష్టపడి చదివించారు. నేను ఈ స్థాయికి చేరడానికి నాన్న కృషే నని' ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన జె. పూర్ణచంద్రరావు తెలిపారు. ఏకే ఖాన్ కు స్థానం చలనం కల్గడంతో పూర్ణ చంద్రరావు శనివారం ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నాన్న రాధాకృష్ణ మూర్తి ఆర్టీసీ కండక్టర్ చేసినా కూడా పిల్లల పట్ల బాధ్యాయుతంగా ఉండేవారన్నారు. ఆయన రుణం తీర్చుకునేందుకు అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉందని పూర్ణ చంద్రరావు తెలిపారు. 1988 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావును ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మొహంతి గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఇన్నాళ్లూ ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలను నడిపించిన సారథి ఏకే ఖాన్.. అవినీతి నిరోధక శాఖకు బదిలీ అయ్యారు. -
ఏసీబీ డీజీగా ఏకే ఖాన్‌కు అదనపు బాధ్యతలు
ఆర్టీసీ ఎండీ ఎ.కె.ఖాన్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్‌గా రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న బి. ప్రసాదరావు రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. దాంతో ఆ పదవి ఖాళీ అయింది. దీంతో ఏసీబీ డీజీగా ఏకే ఖాన్‌కు పూర్తి స్థాయిలో అదనపు బాధ్యలు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.