సాక్షి, హైదరాబాద్ : దాదాపు రెండు నెలల వరకు తెలంగాణలో సాగిన ఆర్టీసీ సమ్మెలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగాలు కల్పించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక ఉద్యోగ కల్పన పథకం కింద 38 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇందులో 16 మంది జూనియర్ అసిస్టెంట్, 12 మంది కండక్టర్లు, 8 మంది సెక్యూరిటీ కానిస్టేబుళ్లు, ఇద్దరు శ్రామికులుగా ఉన్నారు. వీరికి శిక్షణా తరగతులను ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ బుధవారం ప్రారంభించారు. జూనియర్ అసిస్టెంట్‌కు 13 వారాలు, కండక్టర్లకు 3 వారాలు, సెక్యూరిటీ కానిస్టేబుల్స్‌కి 8 వారాలు, శ్రామికులకు 2 వారాల శిక్షణను ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment