
147 మంది చిన్నారులకు ఉచిత వసతి, విద్య
32 మంది అనాథ విద్యార్థులకు ఆసరా
సైగల భాషలో నిష్ణాతులతో శిక్షణ
వారికి వినికిడి సామర్థ్యం లేదు. పెదాలు కలిపి మాట్లాడలేని దివ్యాంగులు. అయితేనేం.. తమ వైకల్యాన్ని జయించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ.. తమలాంటి వారికి సేవలు అందించాలనే ఉన్నత సంకల్పంతో పీపుల్ విత్ హియరింగ్ ఇంపెయిర్డ్ నెట్‌వర్క్ (ఫిన్) సంస్థ స్థాపించి ఉచిత సేవలు అందిస్తున్నారు. బధిర చిన్నారులకు అండగా నిలిచి వారి ఉజ్వల భవిష్యత్తుకు నిరి్వరామ కృషి చేస్తున్నారు. బధిరుల్లో మనోధైర్యాన్ని నింపి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఫిన్ ఆశ్రమ పాఠశాల జానకి, బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో కొనసాగుతోంది. – మలక్‌పేట
ఏడుగురు బధిరులతో కలిసి 2007లో ఫిన్ సంస్థను మూసారంబాగ్ కృష్ణ తులసినగర్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ స్వచ్ఛంద సంస్థలో 147 మంది బధిర చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలగా రూపుదిద్దుకుని గ్రామీణ ప్రాంతాలకు చెందిన సింగిల్ పేరెంట్ బధిర పిల్లలను చేర్చుకుని, వారికి ఉచితంగా విద్య, వసతి కల్పిస్తున్నారు. హైదరాబాద్ సీడబ్ల్యూసీ అధికారులు 32 మంది అనాథలను కూడా ఇక్కడే చేర్పించారు. వారి పోషణ, చదువు ఫిన్ సంస్థ చూసుకుంటోంది. దీనికి అధ్యక్షులుగా జానకి, సెక్రటరీగా బాలకృష్ణారెడ్డి, కోశాధికారి బాబుజాన్, జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు నవీన్, మెంబర్లుగా శ్రీనివాస్, కరీమా వ్యవహరిస్తున్నారు
దాతల సహకారంతోనే
ఫిన్ సంస్థ దాతల సహకారంతో నడుస్తోంది. పిల్లలు, సిబ్బంది ఉండటానికి పరి్మనెంట్ భవనం లేక ఇబ్బందులు పడుతున్నాం. అద్దె భవనాల్లో కిరాయి భరించలేని పరిస్థితి. 2015లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం క్వార్టర్స్ కేటాయించింది. ఇది తాత్కాలికమే. ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలి. కేజీ టు పీజీ వరకూ బధిరులకు క్వాలిటీ విద్యను అందించాలనేదే లక్ష్యం. – వి.జానకి, బాలకృష్ణారెడ్డి, ఫిన్ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు
ప్రభుత్వ క్వార్టర్స్‌లో..
మలక్‌పేట ప్రభుత్వ క్వార్టర్స్ ఎంఎస్ 71,72లో ఫిన్ ఆశ్రమ పాఠశాల నడుస్తోంది. అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 2015లో అప్పటి తెలంగాణ రాష్ట్ర బీవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ చొరవతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ క్వార్టర్స్ ఇప్పించింది. 27 మంది సిబ్బందితో ఒకటి నుంచి 7వ, తరగతి వరకూ సైగల భాషలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. బధిరులైన పేదలకు వివాహాలు జరిపిస్తున్నారు. ఇప్పటి వరకూ 16 జంటలకు పెళ్లిళ్లు జరిపించారు.
సైగల భాషలో డిజిటల్ క్లాసులు..
సైగల భాషలో నిష్ణాతులైన వారిచేత డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. వాటితో పాటు స్కిల్ డెవలప్‌మెంట్‌లోనూ శిక్షణ ఇస్తున్నారు. అల్లికలు, బ్యుటీషియన్, టైలరింగ్, సాఫ్ట్ స్కిల్స్‌తో పాటు యోగ, కరాటే, స్పోర్ట్స్, చెస్, డ్యాన్స్‌లో తరీ్ఫదు ఇస్తున్నారు. ఇక్కడ చదువుకున్న దాదాపు 30 మంది బధిర విద్యార్థులు ఉద్యోగాలు, స్వయం ఉపాధిలో స్థిరపడ్డారు. సీడబ్యూసీ అధికారులు చేరి్పంచిన ఏడుగురు చిన్నారుల చిరునామా గుర్తించి సొంత ఇంటికి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment