kids
-
Sankranti 2025 : అసలు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?
దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు అడుగుపెట్టే సమయంలో వచ్చే అందమైన పండుగ సంక్రాంతి. ఊరూ వాడా అంతా సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా మొదలైపోయాయి. తెల్లవారుఝామున భోగి మంటలతో ఆరంభమై మకర సంక్రాంతి, పొంగళ్లు, కనుమ, ముక్కనుమ మూడు రోజుల పాటు ముచ్చటైన వేడుకలతో పల్లెలన్నీ కళకళ లాడతాయి. ఈ వేడుకల్లో ప్రధానమైంది భోగిపళ్లు. పిల్లలకు భోగి పళ్లు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? ఎలా పోయాలి? ఈ విషయాలు తెలుసుకుందాం రండి.సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు..చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే రేగుపళ్లు పోయడం ద్వారా చాలా రోగాల నుంచి రక్షణ లభిస్తుందంటారు పెద్దలు. అంతేకాదు వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం పోతుందని ప్రతీతి. సూర్యుడికి ప్రతీకగా, పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారనీ, అలాగే ఆరోజన పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోస్తే సంవత్సరం మొత్తం శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.రేగి పండును అర్కఫలం అని కూడా అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లుతాడు. అందుకే ఆ లోక నాయరాణుని కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్ల పోసే వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తారు. భోగి రోజు వచ్చిందంటే... ఇంట్లో చిన్నపిల్లలందరికీ భోగి పళ్లు పోసే వేడుక నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతారు అమ్మమ్మలు, అమ్మలు. ఎలాగా పిల్లలందరికీ భోగి రోజు పొద్దున్నే భోగి మంటల సందడి ఉంటుంది. పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకొని, తలారా స్నానాలు చేసి, కొత్త బట్టలు వేసుకొని భోగిమంటల విభూదిని దిద్దుకుంటారు.నోటి తీపి చేసుకుంటారు. ఇక భోగి పళ్లు పోస్తున్నామంటూ ముత్తుయిదువలను పేరంటానికి ఆహ్వానిస్తారు. సాయంత్రం ఇంట్లో 10 ఏళ్ల లోపు పిల్లలందరికీ కొత్త బట్టలు తొడిగి ముస్తాబు చేస్తారు. రేగి పళ్లు, పూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు, నానబెట్టిన సెనగలు, అక్షింతలు మొదలైనవి కలిపి ఉంచుతారు. అందరు రాగానే, తూర్పు ముఖంగా కానీ, ఉత్తరముఖంగా చిన్నారులను కూర్చోపెడతారు. ఎలా పోయాలి? ఇంట్లోని పెద్దవాళ్లు (అమ్మమ్మ, నానమ్మ) తల్లి కలిపి ఉంచుకున్న భోగిపళ్లను మూడు గుప్పిళ్లతో పిల్లల శిరస్సు చుట్టూ దిష్టి తీసినట్టు తలచుట్టూ తిప్పి పోయాలి. అంటే మూడు సార్లు సవ్య దిశలో, మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి తలమీద పోయాలి. ఆ తరువాత పేరంటాళ్లు కూడా ఇలాగే చేయాలి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని పిల్లల్ని నిండు మనస్సుతో దీవించాలి.ఈ సందర్భంగా "ఓం సారంగాయ నమః" అనే నామం చెప్పాలని పెద్దలు చెబుతారు.ముత్తయిదువలకు పండూ ఫలం కానుకగా ఇస్తారు. ఇలా కార్యక్రమం పూర్తైన తర్వాత వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వదిలిపెడతారు. పిల్లలకు దిష్ట పోవాలని తీసినవి కాబట్టి, ఈ రేగు పళ్లును ఎవరూ తినకూడదని కూడా చెబుతారు.విశిష్టతశ్రీమన్నారాయణుడు రేగుచెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ ఫలాన్ని తింటూనే తపస్సు చేశాడని చెబుతారు. రేగుపళ్లను అర్కఫలం అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్య భగవానుడు. సూర్యుడితో సమానంగా రేగుపళ్లను భావించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ భోగిపళ్లు పోస్తారు. రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలు కూడా ఉండడంతో చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయట. -
ఇద్దరు పిల్లలను చంపి ఐటీ ఉద్యోగుల ఆత్మహత్య!
సాక్షి బెంగళూరు: అపత్కాలంలో నమ్మించిన వాళ్లే మోసం చేశారు. ఆ మోసాన్ని తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఇద్దరు బిడ్డలకు విషం ఇచ్చి చంపడమే కాకుండా.. ఆ తర్వాత దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఆర్‌ఎంవీ ఎక్స్టెన్షన్ రెండో లేఅవుట్లో రెండేళ్లుగా ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌కు చెందిన అనూప్‌కుమార్ (38), ఆయన భార్య రాఖీ (35) నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల అనుప్రియా అనే కుమార్తె, రెండేళ్ల ప్రియాంక్ అనే కుమారుడున్నారు. అనూప్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన కుమార్తె అనుప్రియాకు మానసికంగా సరిగా లేకపోవడంతో ఇంటి పనికోసం, తన పాపను చూసుకునేందుకు ఇద్దరు పనివారిని పెట్టుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ సోమవారం ఉదయం ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి చంపేసి ఆ తర్వాత దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం పనివారు ఉదయాన్నే వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వెంటనే తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్లి చూడగా వారి హత్యోదంతం బయటపడింది. అనూప్ కుమార్‌కు ఉద్యోగం లేకపోవడంతో దంపతులు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు తనని ఆపత్కాలంలో ఆదుకుంటాయని ఉద్దేశ్యంతో తెలిసిన బంధువు ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టారు. బంధువులు మోసం చేశారు. పిల్లలకు చుట్టుముడుతున్న అనారోగ్య సమస్యలకు తట్టుకోలేక తనువు చాలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.👉ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
10 రోజుల తర్వాత బోరుబావి నుంచి చేతన వెలికితీత
జైపూర్ : రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీ జిల్లాలో 10 రోజుల క్రితం బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి చేతనను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.గత డిసెంబర్ 23న మధ్యాహ్నం కోట్‌పుత్లీ జిల్లా కిరాత్‌పురా గ్రామానికి చెందిన చేతన ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. 10 నిమిషాల తర్వాత బాలిక ఏడుపు విన్న కుటుంబ సభ్యులు బోరుబావిలో పరిశీలించారు. చేతన అందులో పడిపోయినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు చిన్నారిని వెలికి తీసేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఓవైపు పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తూనే.. మరోవైపు తవ్వకాలు ప్రారంభించారు. ఇలా ఆరుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏడు సారి బుధవారం రెస్య్క్యూ సిబ్బంది చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు.ఈ సందర్భంగా చేతన తాత దయారామ్ మాట్లాడుతూ.. చిన్నారిని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు అవిశ్రాంత కృషిని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఓపెన్ బోర్వెల్లను కవర్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. बोरवेल में फंसी बच्ची के हाथों में हलचल कैमरे में दिख रही है. #Jaipur https://t.co/7BBzFMGzHk pic.twitter.com/RD66L65NAY— Avdhesh Pareek (@Zinda_Avdhesh) December 23, 2024 -
ప్రాపర్టీ ఎంపికలో పిల్లలూ కీలకమే..
‘మా వాడికేం తెలుసు, వాడింకా చిన్నపిల్లోడే..’ ‘పెద్దవాళ్ల నిర్ణయాల్లో చిన్నోడివి తలదూర్చటం ఎందుకు..?’ ‘నీకింకా నిర్ణయం తీసుకునేంత వయస్సు రాలేదులే..’..పిల్లల విషయంలో మన పెద్దల అభిప్రాయాలివీ. కానీ, నేటి జనరేషన్ పేరెంట్స్ ఇలాంటి మాటలకు టాటా చెప్పేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్టీ(Property) ఎంపికలో పిల్లలే అంతిమ నిర్ణేతలయ్యారు. పిల్లల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఉన్న ప్రాజెక్ట్‌లకే తల్లిదండ్రులు జై కొడుతున్నారు. దీంతో ప్రాజెక్ట్ ఎలివేషన్ నుంచి వసతుల వరకూ పిల్లలను ఆకట్టుకునే ప్రత్యేక థీమ్‌లు, క్లబ్‌హౌస్‌లతో నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. ఇల్లంటే నాలుగు గోడలు కాదు.. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఉండాలి. అందుకే మూస ధోరణిలో నిర్మించే ప్రాజెక్ట్(Project)లను కొనుగోలుదారులు ఆదరించడం లేదు. ఇది వరకు అంతగా పట్టించుకోని చిన్నారుల అవసరాలే ఇప్పుడు గృహ కొనుగోలు నిర్ణయాలను చాలా వరకు ప్రభావితం చేస్తున్నాయి. విదేశీ తరహాలో నిర్మాణం, ఆధునిక వసతులు ఉండే ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే మొగ్గు చూపిస్తున్నారు. అవును.. సొంతిల్లు కొంటున్నామంటే ఇప్పుడు పిల్లల అభిరుచులు, అవసరాలు తీరడం కూడా ముఖ్యమే. – సాక్షి, సిటీబ్యూరోపెద్దలు వృత్తి, ఉద్యోగ రీత్యా అధిక సమయం బయటే గడుపుతారు. వాస్తవానికి ఇంట్లో ఎక్కువ సమయం గడిపేది చిన్నారులే. పాఠశాల సమయం మినహా మిగతా సమయం ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో, పరిసరాల్లో వీరి అవసరాలు తీరే వసతులు ఏ మేరకు ఉంటున్నాయనేది కీలకం. సౌకర్యాలంటే ప్రత్యేకంగా వారికంటూ ఒక గది, అందులో నచ్చేట్లుగా ఉండే రంగులు, ఇంటీరియర్(interior) మాత్రమే కాదన్నది నేటితరం పిల్లల భావన. బయట పరిసరాలు వీరిని ఎక్కువ ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి కేవలం బాల్యం వరకే కాదు పెరిగి పెద్దయ్యే వరకూ చుట్టుపక్కల తగిన వసతులు ఉండేలా చూడటం పెద్దల బాధ్యత. కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం ఇల్లు కొనేటప్పుడు పిల్లల గురించి పరిగణలోకి తీసుకోవడం మర్చిపోవద్దు.కిడ్స్ థీమ్‌లతో ప్రాజెక్ట్‌లు..నివాస సముదాయంలోని క్లబ్‌హౌస్‌లు కమ్యూనిటీ లివింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు పిల్లలకు మంచి అలవాట్లు పెంపొందేందుకు సహాయపడతాయి. దీంతో నిర్మాణ సంస్థలు డిస్నీ, హ్యారీపోర్టర్ వంటి కిడ్స్ థీమ్(Kids Theme)లతో కూడిన ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. వీటిల్లో చిన్న పిల్లలు ఆడుకునే క్రమంలో కిందపడిపోయినా గాయాలు కాకుండా మృదువైన ఆట పరికరాలు, ఇంటరాక్టివ్ అండ్ ఎడ్యుకేషనల్ టాయ్స్ ప్లే ఏరియాలు, ఆర్ట్, డ్యాన్స్ ఇతరత్రా హాబీల శిక్షణ తరగతుల కోసం యాక్టివిటీ జోన్లు, చిట్టడవి, శాండ్ పిట్స్, ట్రీ బెంచ్, మినీ సాకర్ ఫీల్డ్, యాంపీ థియేటర్ వంటి ఇతరత్రా వసతుల జోన్లను కల్పిస్తున్నారు.మంచి కమ్యూనిటీ, ప్లేగ్రౌండ్ఒకవైపు విశాలమైన ఆట స్థలాలు, వినూత్నమైన ఎలివేషన్లతో పిల్లలను ఆకట్టుకుంటే.. మరోవైపు ప్రాజెక్ట్‌లోనే క్రచ్, ప్లేగ్రౌండ్, మంచి కమ్యూనిటీ వంటి వాటితో తల్లిదండ్రులనూ కట్టిపడేస్తున్నారు బిల్డర్లు. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలో మీటర్ల దూరం ఉండే స్కూల్‌కు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే అపార్ట్మెంట్ కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రాజెక్ట్‌లోనే స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి వసతులే కాదు, ఇందులోనే కమ్యూనిటీ మంచి సర్కిల్, ప్లేగ్రౌండ్ వంటివి ఉంటేనే కొనేందుకు ముందుకొస్తున్నారు. పార్కులు, థియేటర్లు, మాల్స్, రెస్టారెంట్లు ఉన్నాయో లేవో కూడా కొనుగోలుదారులు చూస్తున్నారని నిర్మాణదారులు అంటున్నారు. ధరలపై ప్రభావం..వసతులన్నీ ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ఉంటుంది. సహజంగానే దీని ప్రభావం ధరలపై ఉంటుంది. పేరున్న పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రజా రవాణా, మాల్స్ ఉన్నట్లయితే ఎక్కువ మంది ఆ చుట్టుపక్కల నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతుంటారు. దీంతో కొత్త నిర్మాణాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ చూపెట్టి ఆయా ప్రాంతంలో ఉన్న ధరల కంటే ఎక్కవ ధరకు విక్రయించేవారు ఉంటారు. నాణ్యమైన నిర్మాణం, గడువులోగా పూర్తి చేసే నిర్మాణదారులనే అంతిమంగా ఎంపిక చేసుకోవాలి.అభిరుచుల కోసం క్లబ్‌హౌస్‌లు..ప్రస్తుతం మార్కెట్లో చాలా ప్రాజెక్ట్‌లు పిల్లల వసతులపై దృష్టిపెడుతున్నాయి. వారు ఆటలాడుకునేందుకు ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తున్నాయి. తక్కువ లోతులో ఈత కొలనులు నిర్మిస్తున్నాయి. పెద్దలకే కాదు పిల్లల కోసం వేర్వేరు ప్లే కోర్టులను తమ ప్రాజెక్ట్‌లో చేరుస్తున్నాయి. తక్కువ స్థలంలో నిర్మాణాలు చేపడుతూ ఖాళీ స్థలం ఎక్కువ ఉండేలా పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పిస్తుంటారు. ఈ దృష్ట్యా కొన్ని నిర్మాణ సంస్థలు అపార్ట్మెంట్లలోనే ట్యూషన్ గదులను నిర్మిస్తున్నాయి. వ్యాపకాలు, అభిరుచులకు పదును పెట్టేలా చిన్నారుల కోసం ప్రత్యేకంగా క్లబ్‌హౌస్‌లను నిర్మించడం నేటి పోకడ. ఉద్యోగాలకు వెళ్లిన తల్లిదండ్రుల కంటే పిల్లలు పాఠశాల నుంచి ముందుగానే ఇంటికి చేరుకుంటారు. అమ్మానాన్న వచ్చే వరకు వీరు క్లబ్ హౌస్‌లో ఇతర నైపుణ్యాలను పెంపొందించుకునే కార్యక్రమాల్లో పాల్గొనే సదుపాయం కల్పిస్తున్నాయి.నేటి పేరెంట్స్ నిర్ణయంలో మార్పులుమెట్రో నగరాల్లో భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయక తప్పని పరిస్థితి. దీంతో పిల్లలకు సమయం కేటాయించలేని పరిస్థితి. అందుకే కనీసం నివాసం ఉండే ప్రాజెక్ట్‌లోనైనా పిల్లల అవసరాలు, అభిరుచులను తీర్చేవిధంగా ఉండాలని భావిస్తున్నారు. చిన్నారులకు భద్రమైన, ఆధునిక వసతులను అందించే ప్రాజెక్ట్‌లను కోరుకుంటున్నారు.– వంశీకృష్ణ, డైరెక్టర్, ప్రైమార్క్ డెవలపర్స్ -
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. నిందితులు ఎవరంటే?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. గత శుక్రవారం ఢిల్లీలోని పలు స్కూళ్లకి బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ బెదిరింపు మెయిల్స్ చేసింది విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు.సాధారణంగా స్కూల్స్, కాలేజీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందు కోసం విద్యార్థులు రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. కానీ వారిలో కొంత మంది విద్యార్థులు పరీక్షల ముందు రోజు బుక్ తీసి మమ అనిపిస్తుంటారు. సరిగ్గా చదవక.. స్కూల్‌కో,లేదంటే కాలేజీకి వెళ్లి పరీక్ష రాయాల్సి వస్తుందనే భయంతో ఆరోగ్యం సరిగా లేదని, ఊరెళుతున్నామని ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటుంటారు.ఇదిగో ఢిల్లీలోని రోహిణి జిల్లాకు చెందిన స్కూల్ విద్యార్థులు కూడా అంతే. పరీక్ష రాయాల్సి వస్తుందని స్కూల్లో బాంబు తామే పెట్టామని బెదిరించినట్లు ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు.తాజాగా రోహిణి జిల్లాలో రెండు స్కూల్స్‌కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బెదిరింపు ఈ-మెయిల్స్ విచారణ చేపట్టారు. తమ విచారణలో ‘ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రెండు వేర్వేరు పాఠశాలలకు ఇ-మెయిల్స్ పంపినట్లు తేలింది’అని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులిద్దరూ స్కూల్లో పరీక్ష రాయాల్సి వస్తుందని బెయిరింపు ఇ - మెయిల్స్ పంపినట్లు వెల్లడించారు. విద్యార్థులు కావడంతో, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. #BreakingNews | #DelhiBombThreat : Major update has come in that students were behind the bomb threat that has been sent to 2 schools.@_pallavighosh | @shankar_news18 decodes#delhibombthreat #delhi #schools pic.twitter.com/FGAquLsFzV— News18 (@CNNnews18) December 22, 2024 11 రోజులుగా వందకు పైగా బాంబు బెదిరింపులుఢిల్లీ పోలీసులు గత 11 రోజులుగా 100కి పైగా పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు పంపడంపై దర్యాప్తు చేపట్టారు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉపయోగించి ఇ-మెయిల్స్ పంపడంతో నేరస్థులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.ఢిల్లీలో బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం మే నుండి, నగరంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలను లక్ష్యంగా చేసుకుని 50కి పైగా బాంబు బెదిరింపు ఇ-మెయిల్లు వచ్చాయి. ఈ కేసుల్లో పోలీసులు ఇంకా ఎలాంటి పురోగతి సాధించలేదు. -
కంజెనిటల్ గ్లుకోమా: ఒకసారి వస్తే.. జీవితాంతం పరీక్షలు చేయించుకోవాల్సిందేనా?
కంటిలో ఉండే ఓ ద్రవం తాలూకు ఒత్తిడి పెరగడం వల్ల కంటి నరం (ఆప్టిక్ నర్వ్) దెబ్బతిని చూపు కోల్పోయే పరిస్థితిని గ్లుకోమా (నీటికాసుల జబ్బు) అంటారన్న విషయం తెలిసిందే. చిన్న పిల్లల్లోనూ పుట్టుకతో వచ్చే కారణాలతో గ్లుకోమా వస్తే, దాన్ని కంజెనిటల్ గ్లుకోమాగా చెబుతారు. గతంలో కాస్త అరుదుగా కనిపించే ఈ కేసులు ఇటీవల విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కంజెనిటల్ గ్లుకోమా అంటే ఏమిటి, దాని లక్షణాలూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల వంటి అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. కన్ను ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతూ... కంటిలో ప్రవహించే ‘యాక్వస్ హ్యూమర్’ అనే ఒక ద్రవం సరైన రీతిలో ఎప్పటికప్పుడు ఒక డ్రైనేజ్ యాంగిల్ ద్వారా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. కొంతమంది చిన్నారుల్లో ఈ యాక్వస్ హ్యూమర్ ప్రవహించాల్సిన డ్రైనేజీ యాంగిల్ సరిగా అభివృద్ధి కాదు. దాంతో యాక్వస్ హ్యూమర్ బయటకు ప్రవహించలేక అక్కడే చిక్కుబడి΄ోతుంది. దాంతో కంటిలో ఒత్తిడి పెరిగి, కంటి నరంపైన కూడా ఒత్తిడి పెరిగి కంటి నరం దెబ్బతింటుంది. ఇలా కంటిలోని యాక్వస్ హ్యూమర్ బయటకు వెళ్లలేక ఒత్తిడి పెరిగి చూపు కోల్పోయే పరిస్థితినే ‘కంజెనిటల్ గ్లుకోమా’ లేదా చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే గ్లుకోమా అంటారు. ఎప్పుడు బయటపడుతుంది?కంజెనిటల్ గ్లుకోమా ముఖ్యంగా రెండు రకాలు. మొదటిది ప్రైమరీ కంజెనిటల్ గ్లుకోమా, రెండోది సెకండరీ కంజెనిటల్ గ్లుకోమా. ప్రైమరీ కంజెనిటిల్ గ్లుకోమాలో ఇతరత్రా అబ్నార్మాలిటీస్ ఉండవు. సెండకరీ కంజెనిటల్ గ్లుకోమాలో కార్నియాకు, ఐరిస్లకు సంబంధించిన అబ్ నార్మాలిటీస్ కూడా ఉంటాయి. ఇక ప్రైమరీ కంజెనిటల్ గ్లుకోమాలో వయసును బట్టి మరో మూడు రకాలుంటాయి. అవి... పుట్టుకతోనే వస్తే దాన్ని కంజెనిటల్ గ్లుకోమా. పుట్టిన మూడేళ్లప్పుడు (0 – 3) బయట పడేవి ఇన్ఫెంటైల్ గ్లుకోమా. మూడేళ్ల తర్వాతది జువెనైల్ గ్లుకోమా. లక్షణాలు... కొన్ని లక్షణాలను బట్టి పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా ఉందేమోనని సాధారణంగా అనుమానిస్తుంటారు. ఉదాహరణకు పిల్లల కంట్లోంచి అదేపనిగా ఎక్కువగా నీరు స్రవిస్తున్నా, కొద్ది΄ాటి వెలుతురునూ పిల్లలు భరించలేక΄ోతున్నా లేదా కాంతి పడగానే కన్ను గట్టిగా మూయడం లేదా కనుగుడ్డు పెద్దదిగా మారడం, కంట్లోని నల్ల΄ాప మసకగా మారిపోతున్నా పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా ఉందేమోనని అనుమానించాలి. వీటన్నింటిలోనూ కనుగుడ్డు పరిమాణం (సైజ్) పెద్దగా మారి΄ోతుండటాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఈ లక్షణాలతో పాటు పిల్లలు అదేపనిగా ఏడుస్తుండటం, తరచూ వాంతులు చేసుకుంటుండటం, ముఖ్యంగా తిన్న వెంటనే ఇలా జరుగు తుంటే తక్షణం కంటి వైద్యనిపుణులకు తప్పనిసరిగా చూపించాలి. నిర్ధారణ ఇలా... ∙కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్‌ను కొలవడం ∙కంట్లోని నల్ల΄ాప వ్యాసాన్ని కొలవడం ∙కంటోని నల్ల΄ాప ఎంత స్పష్టంగా ఉందో చూడటం ∙కనుగుడ్డు మొత్తం పరిమాణం (యాగ్జియల్ లెంగ్త్)కొలవడం కంటి నరం, కంటి డిస్క్‌కు జరిగిన నష్టాన్ని తెలుసుకోవడం కంటిలో దృష్టిలోపాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడం ∙యాక్వియస్ హ్యూమర్ బయటకు వెళ్లే డ్రైనేజీ యాంగిల్‌ను అంచనా వేయడం కోసం ‘గోనియోస్కోపీ’ అనే పరీక్షను నిర్వహించడం. సర్జికల్ చికిత్సలు... ఇందులో యాంగిల్ సర్జరీ, ఫిల్టరేషన్ సర్జరీ, డ్రైయినేజ్ సర్జరీ అనే మూడు అంశాల కోసం సర్జరీలు జరుగుతాయి. యాంగిల్ సర్జరీ కోసం గోనియాటమీ, ట్రాబెక్యులాటమీ అనే శస్త్రచికిత్సలు చేస్తారు. కార్నియా స్పష్టంగా (క్లియర్‌గా) ఉన్నవాళ్లలో గోనియాటమీ అనే శస్త్రచికిత్స చేస్తారు. ఇందులో 70% వరకు మంచి ఫలితాలే వస్తాయి ∙కార్నియా మసకగా ఉన్నవాళ్లలో ట్రాబ్యెక్యులాటమీ అనే శస్త్రచికిత్స చేస్తారు ∙ఇంకా కొంతమందిలో ఫిల్టరింగ్ ఆపరేషన్స్ అనే ట్రాబెక్యులెక్టమీ, క్లియరెక్టమీ అనే శస్త్రచికిత్సలూ చేస్తారు ∙డ్రైయినేజ్ ప్రొసీజర్ కోసం షంట్ సర్జరీ / వాల్వ్ సర్జరీ అనేది చేస్తారు ∙చికిత్స కోసం పిల్లలను బాగా ఆలస్యంగా తీసుకువచ్చినప్పుడు వాళ్లలో క్రైయో లేదా డయోడ్ లేజర్ అనే ప్రక్రియలతో చికిత్స అందిస్తారు. ఈ చికిత్సలకు తోడు... పిల్లల్లో రెఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నప్పుడు వాళ్లకు కంటి అద్దాలు ఇస్తారు. కొందరిలో ఒక కన్ను మూసి, ఒక కన్ను తెరచి ఉంచే ప్యాచింగ్ /ఆంబ్లోపియా చికిత్సలు అందిస్తారు. జెనెటిక్స్ విభాగంలోని ఇప్పుడు వచ్చిన పురోగతితో ఈ తరహా జెనెటికల్ సమస్యలకు మూడు రకాల జన్యువులు కారణం అని తెలుసుకున్నారు. తల్లిదండ్రుల్లో ఈ జన్యువులు ఉంటే, పుట్టిన పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. ఒకసారి గ్లుకోమా శస్త్రచికిత్స అయ్యాక... ఆ పిల్లలు క్రమం తప్పకుండా జీవితాంతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. వంశపారంపర్యమా... కాదా?ఇది పూర్తిగ వంశ పారంపర్యమే అని చెప్పలేకపోయినప్పటికీ... తల్లిదండ్రులిద్దరిలోనూ గ్లుకోమా ఉంటే... వారి పిల్లల్లో ఛైల్డ్‌హుడ్ గ్లుకోమా వచ్చే అవకాశాలు 10 శాతం వరకు ఉంటాయి. ఒకవేళ తలిదండ్రులిద్దరిలో ఒకరికి గ్లుకోమా ఉంటే వారి తొలిచూలు, మలిచూలులో పుట్టిన పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా వచ్చే అవకాశాలు 5 శాతం మందిలో ఉంటాయి. ఒకవేళ పుట్టిన తొలిచూలు, మలిచూలు పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా ఉంటే... ఆ తర్వాత పుట్టే పిల్లల్లో గ్లుకోమా వచ్చే అవకాశాలు 25 శాతం మేరకు ఉంటాయి. కంజెనిటల్ గ్లుకోమా నిర్ధారణ అయితే... దానికి శస్త్రచికిత్స చేయడమన్నదే ప్రధానంగా అందించాల్సిన చికిత్స. గ్లుకోమా ఉన్నట్లు తేలగానే డాక్టర్లు ఇచ్చే చుక్కల మందులు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే. ఇవి కంట్లో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడమే కాకుండా కార్నియల్ క్లారిటీ కోసం ఉపయోగపడతాయి. ఈ కార్నియల్ క్లారిటీ వల్ల చిన్నారులకు ఏ ఆపరేషన్ ఉపయోగపడుతుందో నిర్ధారణ చేయవచ్చు. ఈ శస్త్రచికిత్సలో... కంట్లో యాక్వియస్ హ్యూమర్ వల్ల పెరుగుతున్న ఒత్తిడంతా తొలగి΄ోయేలా... ఆ ద్రవాన్నంతా బయటకు పంపుతారు (అంటే డ్రైయిన్ చేస్తారు). అయితే... కంట్లోని ఆ ఒత్తిడి తొలగించడానికి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ శస్త్రచికిత్సా విధానాలు (మల్టిపుల్ సర్జికల్ ప్రొసిజర్స్) అవసరం పడవచ్చు. డాక్టర్ రవికుమార్ రెడ్డి సీనియర్ కంటి వైద్య నిపుణులు -
వామ్మో ఇదేం సంస్కృతి..! ‘డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్’ అంటున్న యువత..
పూర్వం వయస్సు మీద పడుతున్నా పెళ్లికాకపోతే ‘ఏమి ఇంకా పెళ్లి చేయలేదా’.. అనేవారు. పెళ్లయ్యాక ‘ఏమి ఇంకా పిల్లలు కాలేదా’ అని దెప్పిపొడిచేవారు. కానీ నేటి యువజంటల్లో కొందరు మాకు పిల్లలే వద్దని తెగేసి చెబుతున్నారు. పెళ్లి చేసుకుంటాం.. గానీ ఇప్పుడే పిల్లలను కనేది లేదని అంటున్నారు. ‘చదువు, ఉద్యోగం పేరుతో ఇన్నాళ్లు కష్టపడుతూనే ఉన్నాం. కనీసం ఇప్పుడైనా ఎంజాయ్ చేస్తాం. మాకు కావాలనుకున్నప్పుడు మాత్రమే పిల్లలను కంటాం’అని భీష్మించుకుని కూర్చుంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు మాత్రమే ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నగరానికి కూడా పాకుతోంది. పెళ్లి చూపుల్లో అమ్మాయి, అబ్బాయి ఇష్టపడితే కట్నకానుకలు మాట్లాడుకోవడం ఒకప్పుటి మాట. ఇప్పుడు కొన్ని షరతులు.. అంటూ కొత్త కొత్త అంశాలు పెద్దల ముందు ఉంచుతున్నారు. ముఖ్యంగా అమ్మాయి తరఫు వాళ్లు తగ్గేదేల్యా.. అంటున్నారు. నిన్నటి వరకు ‘ఇంట్లో అత్తామామలు, ఆడబిడ్డలు ఉండకూడదని.. ఇంటికి మాటిమాటికి చుట్టపు చూపుతో బంధువులు రాకూడదని... మా పిల్ల వారికి చాకిరి చేయలేద’ని తెగేసి చెప్పేవారు. కానీ ఇప్పుడు కొందరు ‘అమ్మాయిని ఇస్తాము గానీ మా పిల్ల ఇంకా ఇప్పుడే చిన్నది...ఇప్పుడిప్పుడే పిల్లలను కనాలని ఇష్టం తనకు లేదని, ఈ అంగీకారానికి అబ్బాయి ఒప్పుకుంటేనే పెళ్లి అని చెబుతున్నారు. స్కూల్, ఇంటర్, డిగ్రీ/బీటెక్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతూ ఎలాంటి ఎంజాయ్ చేయలేదని, ఇప్పుడు పెళ్లి, ఆ తర్వాత పిల్లలు అంటే.. సరదాలు, సంతోషాలు ఇంకెప్పుడు అంటూ చెబుతున్నారు. ఈ అంగీకారమేదో బాగుందని ఒప్పుకుంటున్న మగరాయుళ్లూ ఉన్నారు. ఈ మేరకు ఇద్దరి అంగీకారంతో వివాహాలు హాయిగా జరిగిపోతున్నాయి. కానీ ఏ ఒక్కరూ పైకి ఈ విషయం బయటకు మాత్రం చెప్పడం లేదు. వివాహమయ్యాక వీకెండ్లో ఇద్దరూ హాయిగా విహారయాత్రల పేరిట ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చినచోటకు వెళ్లడం, నచ్చినది తినడం, నచ్చిన ప్రదేశాలు చూడటం, ఇష్టమొచ్చిన హోటళ్లలో బస చేయడం వంటి సరదాలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి సంస్కృతిని ఆంగ్లంలో ‘డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్’ (డింక్)గా పిలుస్తారు. ఈ లైఫ్స్టైల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదించాలి...కానీ పిల్లలు మాత్రం వద్దు. ఆ ఇద్దరు సంపాదించిన డబ్బుతో ఎంజాయ్ చేస్తారు. వారి జీవితానికి వారే రాజు...వారే రాణి అన్నమాట. ఈ డింక్ లైఫ్ స్టైల్ 1980 దశకంలో జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో ప్రారంభమైందని చెబుతారు. గత దశాబ్ద కాలంగా మన దేశంలోని మెట్రో సిటిలైన న్యూఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కత లాంటి నగరాల్లో ప్రారంభమైంది. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలకు వెళ్లిన మన ప్రాంత యువతీయువకులు డింక్ సంస్కృతికి అలవాటు పడుతున్నారు. ఈ కారణంగా ఈ సంస్కృతి ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని చెప్పొచ్చు. డింక్ లైఫ్‌స్టైల్ గురించి సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం జరుగుతున్న తీరుతో కొందరు ఔత్సాహిక యువతీయువకులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడం మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరినా వారికి ఇష్టం లేకపోయినా, కంపెనీకి వారి పని నచ్చకపోయినా ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత ఇంకో ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది యువతీయువకులు ఒకే కంపెనీలో రెండు, మూడేళ్లు మించి పనిచేయడం లేదు. వారు మారడమో, కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగించడమో చేయడం వల్ల వారు కంపెనీలు మారుతున్నారు. ఈ క్రమంలో వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. కొంత కాలం వేచి చూసి ఉద్యోగం వల్ల కావాల్సినంత కూడబెట్టుకున్నామని భరోసా కలిగాక పిల్లలు, వారి పెంపకం గురించి ఆలోచించే వారు ఎక్కువయ్యారు. పిల్లలను పెంచడమూ భారంగా...! కొందరు యువతీయువకులు పిల్లలను పెంచడాన్ని కూడా భారంగా భావిస్తున్నారు. మెట్రో సిటీల్లో వారిద్దరే ఉంటుండటంతో ఒకవేళ పిల్లలు కన్నా వారిని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. పిల్లలను కనేందుకు, వారిని పెంచేందుకు తరచూ సెలవులు పెట్టాల్సి రావడం, ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టాల్సి ఉండటం నేటి కొందరు యువతీయువకులకు ఇష్టం ఉండటం లేదు. పిల్లలు పెద్దగైతే మెట్రో సిటీల్లో వారి చదువులు, వారిని పెంచేందుకు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని భయపడుతున్నారు. కొంత కాలం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసి సంపాదించి, కూడబెట్టి, ఎంజాయ్ చేసిన తర్వాత మాత్రమే పిల్లలను కనాలనే ఆలోచనతో ఉంటున్నారు. ఈ మేరకు కొందరు తల్లిదండ్రులకు కూడా తెలియకుండా భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుని పిల్లలను ఇప్పుడే వద్దనుకుంటున్నారు.నచ్చిన జీవితాన్ని ఆనందించేందుకే...!ఒకప్పుడు ప్రొఫెషనల్ కోర్సులు కేవలం ఉన్నత వర్గాల పిల్లలు మాత్రమే చదివేవారు. కానీ దివంగత సీఎం వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి వంటి నగరాలకు వెళ్తున్నారు. ఆ క్రమంలోనే వారికి తగినట్లే మెట్రో సిటీల్లో ఉద్యోగం చేసేవారో, లేక ఉన్నత చదువులు చదివిన వారో ఎంచుకుంటున్నారు. ఇద్దరూ అక్కడే కలిసి ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు. ప్రొఫెషనల్ కోర్సులు చదవాలంటే ఆషామాషీ కాదు. పాఠశాల, ఇంటర్, ప్రొఫెషనల్ కోర్సుల్లో ఎక్కడా టైమ్ వేస్ట్ చేయకుండా, విలాసాల జోలికి వెళ్లకుండా చదువుతూ ఉన్నత స్థానాలకు ఎదగాలి. ఈ క్రమంలో ఉద్యోగం వచ్చేంత వరకు వారి జీవితంలో ఎంజాయ్ అనే పదం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగంసంపాదించాక కూడా ఎంజాయ్ లేకపోతే ఎలాగంటూ పిల్లల కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ‘డింక్’తో దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు చైనా వంటి దేశాల్లో యువత కంటే వృద్ధులే అధిక సంఖ్యలో ఉండటంతో అక్కడ అభివృద్ధి రేటు క్రమంగా క్షీణిస్తోంది. ఈ కారణంగా ఒకప్పుడు పిల్లలే వద్దని చెప్పిన ఆ దేశం ఇప్పుడు ఎంత మంది పిల్లలనైనా కనండని చెబుతోంది. ఎందుకంటే పిల్లలు కనకపోతే ఆ దేశాభివృద్ధి ఆగిపోతుంది. ఏ దేశానికైనా యువతీయువకులే ఆయువుపట్టు. అభివృద్ధికి వారే మూలాధారాలు. యువత ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో డింక్ అనే లైఫ్‌స్టైల్ పేరుతో యువతీయువకులు పిల్లలు వద్దంటేæ ఈ దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. జననాల రేటు తగ్గిపోయి కొంతకాలానికి ఈ దేశంలో వృద్ధు్దల సంఖ్య ఎక్కువై పనిచేసే యువత సంఖ్య తక్కువ అవుతుంది. అప్పుడు మళ్లీ పేద దేశంగా మన దేశం మారిపోతుంది. సంతానోత్పత్తి అనేది ప్రకృతి ప్రసాదించిన వరం. సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజమూ మనజాలదు. ఇంట్లో, కుటుంబంలో పిల్లలు ఉండటాన్ని తల్లిదండ్రులకే కాదు అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులకు ఎంతో మానసికోల్లాసాన్ని కలిగిస్తుంది. మార్కెట్లో ఒడిదుడుకులే కారణం సమాజంలో డింక్ లాంటి సంస్కృతులు రావడానికి మార్కెట్లోని ఒడిదుడుకులే కారణం. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ప్రైవేటు కంపెనీలు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు లేవు.ప్రైవేటు ఉద్యోగాలు చేయాలంటే మెట్రోసిటీలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో మళ్లీ పిల్లలు, వారి బాధ్యతలు అంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతామనే భయంతో నేటి యువత ఉన్నారు. ఈ క్రమంలో వారిలో డింక్ లాంటి ఆలోచనలు రావడంలో తప్పేమీలేదు. – జీఆర్ శర్మ, ఎన్హెచ్ఎం ఉద్యోగి, కర్నూలువ్యక్తిగత స్వేచ్ఛ కోరుకుంటున్నారు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తూ పిల్లలు ఇప్పుడే వద్దనే జంటలు ఇటీవల ఎక్కువయ్యారు. దీనికి ఆర్థిక ప్రాధాన్యత కూడా ఒక కారణం. ఆర్థికంగా స్థిరపడటం, వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడం ప్రధాన అంశాలు. ఇది ఒక కొత్త జీవనశైలి. దీనికి సామాజిక ఒత్తిడి కూడా ఒక కారణం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఇంట్లో పిల్లలను పెద్దలే ఎక్కువగా చూసుకునేవారు. ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటున్నాయి. పిల్లలను కంటే వారి ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. – డాక్టర్ ఎం.మల్లికార్జున, అసోసియేట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు30 ఏళ్ల తర్వాత పిల్లలను కంటే ఆరోగ్య సమస్యలు సాధారణంగా 25 నుంచి 30 ఏళ్లలోపు మహిళలు ప్రసవం అయితే వారికి జని్మంచే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. 30 నుంచి 35 ఏళ్ల మధ్య గర్భం దాల్చితే వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. నెలలు నిండకుండా బిడ్డ జని్మంచడం, బీపీ, థైరాయిడ్, షుగర్ వంటివి రావడం జరుగుతాయి. వివాహమైన వెంటనే పిల్లలను కనకూడదన్న ఆలోచన మంచిదే గానీ మరీ ఆలస్యమైతేనే ఇబ్బంది. కొంత మంది ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఎగ్ ఫ్రీజింగ్, సెమన్ ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు. దీనివల్ల వారు అనుకున్న వయస్సులో పిల్లలను కనేందుకు వీలు చేసుకుంటున్నారు. – డాక్టర్ పి.శిరీషారెడ్డి, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, కర్నూలు (చదవండి: -
ఆమె... ఒక హి‘స్టోరీ’ : ఎవరీ గోపీ సిద్ధి
ఆ అవ్వని చూస్తే కర్ణాటక వాసి అని ఎవరూ అనుకోరు. ‘ఆఫ్రికన్’ అనే అనుకుంటారు. గోపీ సిద్దీ పూర్వీకులు వందల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి ఇండియాకు తీసుకురాబడ్డారు. ఇక్కడికి వచ్చిన తరువాత స్థానిక సంస్కృతులతో కలిసిపోయినప్పటికీ, తమ మూల సంస్కృతిని కాపాడుకుంటున్నారు. సిద్దీస్ జాతి ప్రజలు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలతో పాటు తమ సంస్కృతిని తన కథల ద్వారా లోకానికి చాటుతోంది గోపి సిద్దీ.తులసికొండ (కర్నాటక) ప్రాంతానికి చెందిన కుంటగని గ్రామానికి చెందిన గోపి సన్నా సిద్దీ జనాలకు ఒక వింత. ఒక పురాగాథ. విలువైన కథల చెట్టు. గోపి సిద్దీస్ అనేది ఆఫ్రికన్ సంతతికి చెందిన ఒక ప్రత్యేక జాతి. బానిసలు, కిరాయి సైనికులుగా, నావికులుగా వీరిని భారతదేశానికి తీసుకువచ్చారు. కాలక్రమంలో వీరు స్థానిక భాషలు నేర్చుకున్నారు. ఇక్కడి సంస్కృతిలో భాగం అయ్యారు. అదే సమయంలో తమ ఆఫ్రికన్ వారసత్వ మూలాలను కాపాడుకున్నారు. సంగీతం నుంచి నృత్యరూపాల వరకు అందులో ఎన్నో ఉన్నాయి.ఈ సిద్దీలు కర్నాటక, మహారాష్ట్రలలో ఎక్కువగా కనిపిస్తారు. గోపి సిద్దీ బాల్యంలో కొత్త ప్రాంతానికి వెళితే... ‘ఆఫ్రికన్’ ‘నీగ్రో’ అని పిలిచేవారు. ‘అలా ఎందుకు పిలుస్తున్నారు?’ అని అడిగితే తమ పూర్వీకులు ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చారు అని తల్లి చెబుతుండేది. ఎప్పుడూ ఏవో కథలు వినిపించే గోపి సిద్దీకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. భర్త ఆమెను వదిలేసి మూడు దశాబ్దాలు దాటింది. ఆక్రమణదారుల చెర నుంచి తన వ్యవసాయ భూమిని తిరిగి పొందాలి... ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ తన కథల పుస్తకాలను ప్రచురించాలనే ఉత్సాహం, ఉక్కు సంకల్పంలో మాత్రం మార్పు లేదు. తన పుస్తక ప్రచురణ కోసం నగలు కూడా తాకట్టు పెట్టింది.తమ జాతి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు తనలో నుంచి రచయిత్రి బయటికి రావడానికి కారణం అయ్యాయి. ‘స్వేచ్ఛ గురించి తపించే దృఢమైన వ్యక్తిత్వం గోపి సిద్దీ సొంతం. జీవితంలో ఆమె ఎన్నో పోరాటాలు చేసింది. గోపి సిద్దీ కథల్లో బాధ మాత్రమే కాదు జ్ఞానం కూడా ఉంటుంది. పర్యావరణ స్పృహ ఉంటుంది. తన తాతల కాలం నుంచి వింటూ పెరిగిన కథలు అవి. తనకు పరిచయం అయిన వారికల్లా ఆ కథలను చెబుతుంది. ఆమె శక్తిమంతమైన రచయిత్రి’ అంటుంది ‘బుడా ఫోక్లోర్’ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకు రాలైన సవితా ఉదయ్.పది సంవత్సరాల క్రితం తన ఇంట్లో పని చేయడానికి ఒక పనిమనిషిని వెదుకుతున్న సమయంలో ఉదయ్‌కు గోపీతో పరిచయం ఏర్పడింది. మారుమూల గ్రామానికి పరిమితమైన గోపి సిద్దీ జీవిత కథను తన డాక్యుమెంటరీ ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు బెంగళూరుకు చెందిన నిశాంత్ గురుమూర్తి. తన స్వచ్ఛంద సంస్థ ‘బుడా ఫోక్లోర్’ ద్వారా జానపదల కథానిలయమైన గోపి సిద్దీతో కర్ణాటక అంతటా పాఠశాల విద్యార్థులతో కథా సెషన్లు నిర్వహిస్తోంది సవితా ఉదయ్. కొంకణీ, కన్నడ భాషలలో ఆమె చెప్పే కథలకు పిల్లలు ఫిదా అవుతుంటారు.ఆ బాధ భరించలేనంత!భాషపరమైన అడ్డంకులు ఉన్నప్పటికి పట్నం పిల్లలు నా కథలను ఇష్టపడుతుంటారు. వారి అభిమానం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కథలు చెప్పడం పూర్తయిన తరువాత నన్ను ఆ΄్యాయంగా కౌగిలించుకొని వీడ్కోలు చెబుతారు. బరువెక్కిన హృదయంతో ఇంటికి వస్తాను. వారిని విడిచి ఇంటికి వస్తుంటే... ఒక్కోసారి ఆ బాధ భరించలేనంతగా ఉంటుంది. – గోపి సిద్దీ -
రెండుసార్లు నోబెల్ పొందిన ఏకైక మహిళ
ఆమె పుట్టింది రష్యా దేశంలోని వార్సాలో. ఐదుగురు పిల్లల్లో ఈ పాప చిన్నది. పదేళ్ల వయసులో తల్లి క్షయ వ్యాధితో మరణించింది. దీంతో తోబుట్టువులే ఆమెను పెంచారు. చిన్ననాటి నుంచి ఆమెకు విజ్ఞాన శాస్త్రమంటే చాలా ఇష్టం. ఆ విషయాల గురించి ఆ పాప తెలుసుకుంటూ ఉండేది. ఇంట్లో పేదరికం కారణంగా ఆమె ఎక్కువగా చదువుకోలేకపోయింది. తనకొచ్చిన చదువుతో ఉపాధ్యాయురాలిగా మారింది. విశ్వవిద్యాలయానికి వెళ్లాలనే ఉద్దేశంతో 1891లో ఫ్రాన్స్‌కు వెళ్లి అక్కడ సోర్బోన్ యూనివర్సిటీలో చేరింది. అక్కడ భౌతిక, గణిత శాస్త్రాలను చదివింది. 1894లో ప్యారిస్ నగరంలో శాస్త్రవేత్త పియరీ క్యూరీని కలుసుకుంది. ఏడాది తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పరిశోధనలు చేశారు. యురేనియంపై పలు ప్రయోగాలు చేసి కీలకమైన విషయాలు కనుక్కున్నారు. ఆ సమయంలోనే రేడియో ధార్మికతను కనిపెట్టారు. ఆ పరిశోధనలకుగానూ 1903లో ఆమెతోపాటు ఆమె భర్త పియర్, హెన్రీ బెక్వెరెల్లకు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇచ్చారు. 1906లో పియరీ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. జీవితంలో మరోసారి ఆమెను విషాదం చుట్టుముట్టింది. అయినా కుంగిపోక పరిశోధనలు కొనసాగించింది. ప్రపంచానికి ఎన్నో కొత్త విషయాలు నేర్పింది. రేడియో ధార్మికతను కొలిచే సాధనాన్ని రూపొందించినందుకు 1911లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకుందామె. ఇలా రెండు వేర్వేరు విభాగాల్లో నోబెల్ బహుమతి అందుకున్న ఏకైక మహిళ ఆమె. ఆమె కనిపెట్టిన రేడియో ధార్మికత ఇవాళ అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో దానికి కీలకపాత్ర ఉంది. తన జీవితమంతా పరిశోధనలకే అంకితం చేసిన ఆమె పేరు ‘మేరీ క్యూరీ’. ఆమెనే ‘మేడమ్ క్యూరీ’ అని కూడా అంటారు. తన జీవితంలో ఆమె ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా ఏనాడూ వెనకడుగు వేయకుండా కష్టపడి అనుకున్నది సాధించారు. ఆమె స్ఫూర్తితో మీరూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి. -
పిల్లల కథ: విజయపురిలో విశ్వనాథుడు
విజయపురిలో విశ్వనాథుడనే పండితుండేవాడు. ఆయన వద్ద పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన అనేక తాళపత్ర గ్రంథాలుండేవి. ఆయన వాటిని చదవడమేగాక జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. అంతేగాక తను కూడా కావ్యాలను రాస్తుండేవాడు. అయితే పేదరికం ఆయన్ను బాగా పీడిస్తుండేది. అయినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఒకసారి ఆయనకు అనారోగ్యం చేసింది. పట్టణానికి వెళ్లి వైద్యం చేయించుకోమని సలహా ఇచ్చాడు నాటువైద్యుడు. పట్టణంలో వైద్యం అంటే డబ్బుతో పని. ఆయన భార్యకేమీ పాలుపోలేదు. డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియ లేదు. దిగాలుగా ఉన్న ఆమెతో పక్కింటామె ‘మీ ఇంట్లో తాళపత్ర గ్రంథాలు బోలెడున్నాయికదా! ఊళ్లో వాటినెవరికయినా అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో పట్టణంలో వైద్యం చేయించవచ్చు’ అన్నది. ‘ఈ ఊళ్లో గ్రంథాలు కొని, చదివే వాళ్లున్నారా?’ అని సందేహపడింది పండితుడి భార్య. ‘అది నిజమేకానీ ప్రయత్నిస్తే తప్పులేదు కదా!’ అంది పక్కింటామె. ఆ ఉపాయం నచ్చి, తాళపత్ర గ్రంథాలను భుజానికెత్తుకుని ఊరంతా తిరిగింది పడింతుడి భార్య. ఒక్కరూ ఒక్క గ్రంథం కొన్న పాపాన పోలేదు. నొప్పి పెడుతున్న భుజాలతో చివరకు ఆ ఊళ్లోని వడ్డీ వ్యాపారి అనంతయ్య ఇంటికి వెళ్లింది. ‘మా ఇంట్లో చదివేవారు ఎవరూలేరమ్మా! అలా అని నేను కాదంటే నీ అవసరం తీరేదెలా? నేనీ పుస్తకాలు కొనను కానీ, తాకట్టు పెట్టుకుంటాను. మీకు ధనం సర్దుబాటు కాగానే నా బాకీ తీర్చి, మీ గ్రంథాలను మీరు తీసుకుపొండి’ అన్నాడు. ఆ మాటకు పండితుడి భార్య సరేనంది. ఆమెకు కావలసిన పైకం ఇచ్చి, తాళపత్ర గ్రంథాలను జాగ్రత్తగా దాచి పెట్టాడు వడ్డీ వ్యాపారి. ఆ ధనంతో భర్తకు వైద్యం చేయించింది. త్వరలోనే ఆయనకు నయమైంది. ఇదిలా ఉండగా ఆ రాజ్యాన్నేలే ఆనందవర్ధనుడు.. కొడుకు అలోకవర్ధనుడికి పట్టాభిషేకం చేశాడు. అలోకవర్ధనుడికి గ్రంథపఠనం అంటే మహా ఇష్టం. తన పఠనానికి అనుకూలంగా అంతఃపురంలో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. రాజ్యమంతటా గ్రంథ సేకరణకు చాటింపు వేయించాడు. గ్రామాల నుంచి పాత తాళపత్ర గ్రంథాలున్నవారంతా రాజధానికి వచ్చి తమ వద్ద ఉన్న గ్రంథాలను ఇవ్వసాగారు. వడ్డీవ్యాపారి అనంతయ్య తన దగ్గరున్న గ్రంథాలను రాజుకు ఇవ్వలేదు. ఆనోటా ఈనోటా ఆ విషయం రాజుగారి చెవిన పడింది. ఆయన భటులను పంపి అనంతయ్యను సభకు రప్పించాడు. గ్రంథాల గురించి అడిగాడు.‘గ్రంథాలు నా దగ్గరున్న మాట వాస్తవమే ప్రభూ! అయితే వాటికి నేను యజమానిని కాదు. అవి ఒక పండితుడివి. అతని వైద్యానికి అవసరం అయితే వాటిని నా వద్ద తాకట్టు పెట్టుకుని ధనం ఇచ్చాను. గ్రంథాలను తాకట్టు పెట్టుకోవడం మీకు కొత్తగా ఉండవచ్చు. నేను అలా ఎందుకు చేశానంటే.. నేనిచ్చే« ధనం వల్ల పండితుడికి వైద్యం లభించడమే కాదు, అలా ఆ గ్రం«థాలను భద్రపరచడం వల్ల అవి భవిష్యత్ తరాలకూ అందుతాయని ఆలోచించాను. అందుకే వాటిని తాకట్టు పెట్టుకున్నాను’ చెప్పాడు వడ్డీవ్యాపారి. అతని పెద్ద మనసుకు రాజు ఎంతగానో సంతోషించాడు. తనకు అవసరం లేకపోయినా భవిష్యత్‌లో చదువరులకు గ్రంథాలను అందించాలన్న ఆలోచనతోపాటు, సాటి మనిషిని ఆదుకోవాలన్న మంచి మనసు కూడా వ్యాపారికుండటం అలోకవర్ధనుడిని ఆనందపరచింది. పండితుడి అప్పును రాజు తీర్చడమేకాక, ఆ వ్యాపారికి ‘గ్రంథమిత్ర’ అనే బిరుదును ఇచ్చి ఘనంగా సత్కరించాడు. తరవాత పండితుడి భార్యనూ సన్మానించి, ఆ పండితుడికి తన కొలువులో ఉద్యోగం ఇచ్చాడు రాజు. ఆ గ్రంథాలన్నింటినీ గ్రంథాలయానికి చేర్చి, జాగ్రత్త చేశాడు. -
పిల్లలకు సోహెల్ మీడియా
సోషల్ మీడియా.. ప్రపంచాన్ని శాశిస్తున్న ప్రచారమాధ్యమం. ఫేస్బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), స్నాప్‌చాట్, టిక్‌టాక్.. వంటి ఫ్లాట్‌ఫామ్‌లు కొంతకాలం కిందట అనుసంధాన వేదికలుగా మాత్రమే పనిచేశాయి. ప్రశంసలందుకున్నాయి. కానీ రానురాను పరిస్థితి మారింది. అశ్లీల కంటెంట్, నకిలీ వార్తల వ్యాప్తి, సైబర్ బుల్లీయింగ్ మాధ్యమాలను ముంచెత్తాయి. ఇవి ఎన్నికలనూ శాసిస్తున్నాయి. పెద్దలమాట సరేసరి.. పిల్లలపై ఇవి చూపుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇటీవలే ఆ్రస్టేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించింది. దేశంలో పెద్ద దుమారమే రేపింది. అయినా ఆ్రస్టేలియా తరహాలోనే పలు దేశాలు కఠినమైన ప్రైవసీ చట్టాలు, మైనర్లపై నిషేధం వంటి విధానాల ద్వారా సోషల్ మీడియాను ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నించాయి. ఆయ దేశాల వివరాలు, అవి చేస్తున్న ప్రయత్నాలు ఓసారి చూద్దాం. ఆ్రస్టేలియాసోషల్ మీడియా మినిమమ్ ఏజ్ బిల్లు ప్రకారం ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ యజమాని మెటా నుంచి టిక్‌టాక్ వరకు మైనర్లు లాగిన్ కాకుండా నిరోధించాలని బిల్లు తీసుకొచ్చింది. వీటి అమలును ఉల్లంఘిస్తే 32 మిలియన్ డాలర్ల వరకు జరిమానాలు విధించనుంది. ఏడాదిలో ఈ నిషేధం అమల్లోకి రానుంది. జనవరి నుంచి అమలు చేసే పద్ధతులపై ట్రయల్ ప్రారంభమవుతుంది. స్పెయిన్16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధించే బిల్లును స్పెయిన్ జూన్‌లో ప్రవేశపెట్టింది. దీని అమలు, వయస్సు ధ్రువీకరణ వంటివాటిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం విధానాలను రూపొందించాల్సింది ఉంది.దక్షిణ కొరియా ఈ దేశం 2011లోనే సిడ్రెల్లా చట్టం రూపొందించింది. దీని ప్రకారం 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారు అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఆన్‌లైన్‌గేమ్స్ ఆడకూడదు. ఒక దశాబ్దం తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ‘చాయిస్ పర్మిట్’వ్యవస్థను ఏర్పాటు చేసింది. వారి పిల్లలు ఎప్పుడు ఆడుకోవాలో నిర్ణయించే అధికారాన్ని తల్లిదండ్రులకు ఇచ్చింది. అతికొద్ది మంది మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగించారు. 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదించారు. దీనిని యువజన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును ‘సిండ్రెల్లా’చట్టం మాదిరిగా యువతను నియంత్రించే వివక్షాపూరిత ప్రయత్నమని విమర్శిస్తున్నాయి. ఫ్రాన్స్ గత ఏడాదే ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. సోషల్ మీడియా వినియోగదారుల వయస్సును ధ్రువీకరించాలని, 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారికి తల్లిదండ్రుల అనుమతిని పొందాలని ఫ్రాన్స్ 2023 జూన్‌లో చట్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే సోషల్ నెట్‌వర్క్‌కు ప్రపంచ ఆదాయంలో ఒక శాతం వరకు జరిమానా విధిస్తారు. ఈ చట్టం ఈయూ చట్టానికి అనుగుణంగా ఉందని యూరోపియన్ కమిషన్ ఇంకా ధ్రువీకరించలేదు. దీంతో అమలులోకి రాలేదు. ఇటలీఇక్కడ 14 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే తల్లిదండ్రుల సమ్మతి అవసరం. ఆపై వయసున్న వారిపై ఎలాంటి నిషేధాలు లేవు. ఎవరి సమ్మతీ అవసరం లేదు. జర్మనీఈ దేశ నిబంధనల ప్రకారం 13 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగించాలి. ఈ నియంత్రణలు సరిపోవని, ప్రస్తుత చట్టాలను సక్రమంగా అమలు చేయాలని బాలల రక్షణ న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి దీనికంటే ముందుకెళ్లే ఉద్దేశంలో ఆ దేశం లేదు. బెల్జియం 13 ఏళ్లు నిండిన పిల్లలకు మాత్రమే సోషల్ మీడియాలో అకౌంట్ ఉండాలని, అది తల్లిదండ్రుల అనుమతితోనే చేయాలని 2018లో బెల్జియం చట్టం చేసింది.నార్వేఇక నార్వేలో సోషల్ నెట్‌వర్క్‌లకు ఉపయోగించడానికి కనీస వయస్సు 13 సంవత్సరాలు. అయినా 12 ఏళ్ల పిల్లల్లో ఎక్కువ మంది, తొమ్మిదేళ్ల పిల్లల్లో సగానికిపైగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో కనీస వయోపరిమితిని 15 సంవత్సరాలుగా నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల అమలులో విఫలమైన నేపథ్యంలో సమర్థవంతమైన మార్గాలను అన్వేíÙస్తోంది. నెదర్లాండ్స్ ఇక్కడ సోషల్ మీడియాను ఉపయోగించడానికి వయో పరిమితి లేదు. పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి అక్కడి ప్రభుత్వం తరగతి గదుల్లో మొబైల్ పరికరాలను నిషేధించింది. ఇది 2024 జనవరి నుంచి అమల్లో ఉంది. అయితే డిజిటల్ పాఠాలకు, వైద్య అవసరాలు, వైకల్యాలు ఉన్నవారికి మినహాయింపులు వర్తిస్తాయి.చైనా2021 నుంచి మైనర్లకు యాక్సెస్ ఆంక్షలు అమలు చేస్తున్న చైనా ఇందుకు మంచి ఉదాహరణ. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. దీంతో సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిరోధించడం ఇక్కడ సులభం. టిక్‌టాక్ వంటి చైనీస్ డౌయిన్‌లో 14 ఏళ్లలోపు వినియోగదారులకు పరిమితి ఉంది. రోజుకు 40 నిమిషాలు మాత్రమే వినియోగించాలనే నిబంధన ఉంది. పిల్లలు అంతకంటే ఎక్కువసేపు ఆన్లైన్లో గేమ్స్ ఆడటానికి కూడా అనుమతి లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆస్ట్రేలియాలో సోషల్‌మీడియా బ్యాన్.. వారికి నో లాగిన్
మెల్బోర్న్:సోషల్‌మీడియా వాడకంపై ఆస్ట్రేలియా ఆంక్షలు విధించింది. తమ దేశంలో 16 ఏళ్లలోపు చిన్న పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై నిషేధం విధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆస్ట్రేలియా దిగువసభ సుదీర్ఘచర్చ అనంతరం పాస్ చేసింది.పిల్లలు సోషల్‌మీడియా వాడకుండా నిషేధించడంపై దేశ ప్రధాని ఆంథోని అల్బనీస్ స్పందించారు.తమ దేశంలో పిల్లల భద్రత ప్రశ్నార్థకంలో పడకుండా సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్‌మీడియా నిషేధం బిల్లు పాసవ్వడంతో ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్,టిక్‌టాక్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలలో ఇక నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు లాగిన్ అవడానికి వీల్లేదు.ఈ మేరకు ఆయా ప్లాట్‌ఫాంలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.లేదంటే ఆయా కంపెనీలు భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.ఈ నిషేధాన్ని జనవరి నుంచి ట్రయల్ పద్ధతిలో అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయి నిషేధం అమలులోకి రానుంది. -
విషాదం.. ఆ స్వీట్ వాయిస్ ఇక వినిపించదు!
పెద్దలకు సినిమాలంటే ఎంత ఇష్టమో.. పిల్లలకు కార్టూన్ చిత్రాలంటే ఇష్టం. అలా చిన్నపిల్లలు ఇష్టపడేవాటిలో డోరమాన్, నింజా హటోరి పాత్రలు ప్రధానంగా వినిపిస్తాయి. ఆ క్యారెక్టర్స్‌కు చిన్నపిల్లల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ పాత్రలకు కిడ్స్ అంతలా కనెక్ట్ అయ్యారు. ఈ కార్టూన్ సిరీస్‌లకు యానిమేషన్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.ఇంత క్రేజ్ ఉన్న నింజా హట్టోరి, డోరేమాన్ల పాత్రలకు వాయిస్ అందించిన యానిమేషన్ లెజెండ్ జుంకో హోరీ మరణించారు. జపాన్‌కు చెందిన ఆమె నవంబర్ 18న మరణించినట్లు ఆమె టాలెంట్ ఏజెన్సీ ప్రొడక్షన్ బావోబాబ్ ఈ వారంలో ప్రకటించింది. వృద్ధాప్య సమస్యలతోనే జుంకో హోరీ మరణించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని నవంబర్ 25న తెలిపారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకే ఆలస్యంగా ప్రకటన విడుదల చేశామని పేర్కొన్నారు. దయచేసి అభిమానులు ఆమె ఇంటిని సందర్శించడం మానుకోవాలని ప్రకటనలో వెల్లడించారు. -
పిల్లల్లో దొడ్డికాళ్లు, కారణాలు తెలుసుకోండి!
పిల్లల్లో మోకాళ్ల వద్ద దూరం ఎక్కువగా ఉండి, చిన్నారుల అరికాళ్లు దగ్గరగా ఉంచినప్పుడు ఈ రెండు కాళ్లూ బయటివైపునకు విల్లులా ఒంగి ఉండే కండిషన్‌ను ఇంగ్లిష్‌లో బౌడ్ లెగ్స్, వైద్యపరిభాషలో జీనూవేరమ్ అంటారు. తెలుగు వాడుక భాషలో ఈ కండిషన్‌ను ‘దొడ్డికాళ్లు’ అంటుంటారు. నిజానికి పుట్టిన పిల్లలందరూ చిన్నతనంలో కొన్నిరోజుల పాటు ఎంతోకొంత దొడ్డికాళ్ల (బౌడ్ లెగ్స్) కండిషన్‌ను కలిగి ఉంటారు. శిశువు తన పిండ దశలో దగ్గరగా ముడుచుకుని (ఫోల్డెడ్ పొజిషన్లో) ఉండటమే దీనికి కారణం. అందువల్ల అప్పుడే పుట్టిన పిల్లల్లో కాళ్లు ఇలా ఉండటం చాలా సాధారణం. పిల్లలు నడక మొదలు పెట్టాక, వాళ్లు తమ కాళ్లపై కొంత బరువు మోపుతుండటం మొదలుకావడంతో... అంటే... ఒకటిన్నర–రెండు సంవత్సరాలప్పటి నుంచి వాళ్ల కాళ్లు మామూలుగా కావడం మొదలవుతుంది. దాదాపు మూడేళ్ల వయస్సు వచ్చేసరికి కాళ్లు రెండూ నార్మల్ షేప్‌కు వస్తాయి. ఒకవేళ చిన్నారుల్లో వారు మూడేళ్లు పైబడ్డాక కూడా బౌడ్ లెగ్స్ (సివియర్ బౌడ్ లెగ్స్) కండిషన్ ఎక్కువగా కనిపిస్తుంటే అందుకు కారణాలు ఏమై ఉంటాయా అని ముందుగా ఆలోచించాలి. అంటే ఆ పరిస్థితికి... రికెట్స్ వంటి వ్యాధులు గానీ; లేదా లెడ్ (సీసం), ఫ్లోరైడ్స్ వంటి విష పదార్థాల ప్రభావం ఎక్కువ కావడం గానీ; లేదా ఎముకల షేప్ మారడం (బోన్ డిస్ప్లేసియాస్) వంటివి గానీ కారణం కావచ్చా అని ఆలోచించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాలతోనే ఒకవేళ బౌడ్ లెగ్స్ వచ్చి ఉంటే, దాన్ని కాస్తంత తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ జీనూవేరమ్ కండిషన్ ఉన్న పిల్లలకు ఎక్స్‌రే, రక్తపరీక్షల వంటివి చేసి కారణాలను నిర్ధారణ చేయాలి. కారణం తెలిశాక తగిన చికిత్స అందించాలి. అయితే మొదట్లో ఈ బౌడ్ లెగ్స్ కండిషన్ కనిపిస్తున్నప్పటికీ చిన్నారుల్లో మూడేళ్ల వయసు వచ్చే వరకు ఈ సమస్య గురించి ఆలోచించాల్సిన లేదా ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. మూడేళ్ల తర్వాత కూడా అలాగే ఉంటే మాత్రం అప్పుడు పిల్లల నిపుణులను లేదా ఆర్థోపెడిక్ నిపుణులను తప్పక సంప్రదించాలి. -
సంతానం లేని వారికి ఒయాసిస్ ఫెర్టిలిటీ ఓ వరం
హనుమకొండ : సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కల్పిస్తూ వారి కళ్ళల్లో ఆనందాన్ని అందిస్తుంది ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ అని డాక్టర్ జలగం కావ్య రావు అన్నారు. హనుమకొండ బ్రాంచ్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కావ్య రావు, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ అంజనీ దేవి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ భోజరాజు రోహిత్, డాక్టర్ ప్రసన్నలు హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ కావ్య రావు మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ ప్రొవైడర్ అయిన ఒయాసిస్ ఫెర్టిలిటీ, హన్మకొండ ఫెర్టిలిటీ సెంటర్, 2017 నుండి ప్రజలకు సేవలందిస్తున్న వరంగల్ శాఖ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూతన మొదటి వార్షికోత్సవాన్ని వేడుకగా చేసుకుంది. జంటలు సంతానోత్పత్తి సవాళ్లను అధిగమించడానికి, అధునాతన, సైన్స్ ఆధారిత చికిత్సల ద్వారా వారి తల్లిదండ్రులవ్వాలనే వారి కలలను నెరవేర్చుకోవడానికి ఒయాసిస్ ఫెర్టిలిటీ తిరుగులేని నిబద్ధతను ఈ మైలురాయి చాటిచెబుతుంది. ఒయాసిస్ ఫెర్టిలిటీ కోఫౌండర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి. రావు, కిరణ్ లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ సైన్ టిఫిక్హెడ్, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మంత్రవాది గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సైన్ టిఫిక్ హెడ్ అండ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మంత్రవాది మాట్లాడుతూ ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా తల్లిదండ్రులవ్వాలనే కలను సాధించడంలో ఎన్నో జంటలకు సహాయం చేశాం. అంతేగాకుండా, మా ఫెర్టిలిటీ కేర్ సేవలు ఎగ్, మరియు స్పెర్మ్ ఫ్రీజింగ్ వసతి ద్వారా భార్య భర్తలు లేదా నేటి తరం వారు వారి భవిష్యత్తు కోసం సంతానోత్పత్తిని కాపాడుకునే ఎంపికను అందించడం ద్వారా కుటుంబ ప్రణాళిక గురించి అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా వారికి సాధికారికత ఇస్తాయి అని అన్నారు. వయస్సు, మెడికల్ హిస్టరీ, జీవనశైలికి సంబంధించిన అనుకూలీకరించిన సంతానోత్పత్తి పరిష్కారాలను అందించడం ద్వారా హన్మకొండ కేంద్రం ఒక సంవత్సరంలోపుగానే ఫెర్టిలిటీ వైద్యంలో అగ్రగామిగా మారింది. ఈ మైలురాయి సాధించడంపై ఒయాసిస్ ఫెర్టిలిటీ రీజినల్ మెడికల్ హెడ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జలగం కావ్యరావు మాట్లాడుతూ హన్మకొండలోని ఒయాసిస్ ఫెర్టిలిటీ ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచ స్థాయి సంతానోత్పత్తి చికిత్సలకు మాత్రమే కాకుండా పునరుత్పత్తి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడానికి కట్టుబడి ఉంది. ఈ చికిత్సల్లో 70% విజయం సాధించడం మా క్లినికల్ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకు సుమారు 6000 మంది జంటలకి సంతాన సాఫల్యత అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా సంతానం పొందిన ఆయా దంపతుల కుటుంబాలు పిల్లలు హాజరవ్వడంతో వారి అనుభవాలను ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యులు సిబ్బంది, పిల్లలు, తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
ఆ స్కూల్లో ఫీజు తీసుకోరు
మామూలుగా అయితే స్కూల్లో టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్తారు. హోంవర్క్ రాసుకురమ్మని చెప్తారు. పరీక్షలు పెట్టి మార్కులు వేస్తారు. పైగా ఇవన్నీ చేసినందుకు ప్రైవేటు స్కూళ్లలో ఫీజు తీసుకుంటారు. అయితే థాయ్‌లాండ్‌లో ఉన్న ‘మెషై పట్టానా స్కూల్’(mechai pattana school) లో మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఈ బడినే ప్రపంచవ్యాప్తంగా "Bamboo Sc-hool' అని కూడా అంటారు. ఇక్కడ పిల్లలకు పాఠాలతోపాటు సేవ చేయడం నేర్పిస్తాను. సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తారు. తోటివారిని ఎలా గౌరవించాలో, వృద్ధులతో ఎలా నడుచుకోవాలో, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో.. ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పినందుకు వారు ఫీజేమీ తీసుకోరు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి 400 చెట్లు నాటితే చాలు. థాయ్‌లాండ్‌కు చెందిన మెషై విరవైద్య అనే ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది 2008లో ఈ పాఠశాలను ్రపారంభించారు. స్కూళ్లలో పెరుగుతున్న పేద, ధనిక తారతమ్యం, పాఠశాలలు కేవలం పుస్తకాలు బట్టీ వేసే ప్రదేశాలుగా మారిపోవడం వంటివి గమనించి తాను ఈ స్కూల్‌ని స్థాపించినట్లు ఆయన వివరిస్తారు. బడిలో అందరూ ఒకచోట చేరి సంస్కారాన్ని, సామాజిక సేవనీ, పౌరబాధ్యతలనూ నేర్చుకోవాలని అంటారు. దానికి తగ్గట్టే ఈ పాఠశాల విధివిధానాలను ఆయన రూపొందించారు. ఇక్కడ మామూలు తరగతులతోపాటు కూరగాయలు పండించడం, పశువుల్ని పెంచడం, కళాకృతులు తయారు చేయడం, వంటలు చేయడం వంటివి నేర్పిస్తారు. దీంతోపాటు విద్యార్థులను బృందాలుగా ఏర్పరిచి, వారికొక నాయకుణ్ని నియమిస్తారు. వారిని సమన్వయం చేసుకుంటూ, వారిలో స్ఫూర్తి నింపుతూ సాగేలా అతనికి తర్ఫీదు ఇస్తారు. ఇక్కడ బాధ్యతలన్నీ విద్యార్థులే తీసుకుంటారు. కొత్తవారిని స్కూల్లో చేర్చుకోవడం, కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకోవడం వంటి పనుల కోసం ‘స్టూడెంట్ బోర్డ్’ పని చేస్తుంది. స్కూల్‌కి కావాల్సిన వస్తువులు కొనడం, ఇచ్చిన నిధుల్ని సక్రమంగా ఖర్చుచేయడం కూడా వారి బాధ్యతే. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారు ఫీజు చెల్లించనవసరం లేదు. అయితే పాఠశాలల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రతి విద్యార్థి ఏడాదిలో 400 గంటలు సమాజ సేవ చేయాలి. అది ఇక్కడ కచ్చితమైన నిబంధన. స్త్రీలను ఎలా అర్థం చేసుకోవాలి, వారి మానసిక పరిస్థితి, శారీరక ఇబ్బందులేమిటనే అంశాలపై ఇక్కడి విద్యార్థులకు ప్రత్యేక తరగతులుంటాయి. దీనివల్ల వారిలో తోటివారి పట్ల అవగాహన, ఆత్మీయత పెరుగుతాయని మెషై విరవైద్య వివరిస్తున్నారు. -
బెల్ట్‌లు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్ ఖురాన్! బాల్యం భారంగా మారకూడదంటే..
కొందరు తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో పిల్లల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. అది వారిని సత్ప్రవర్తన వైపుకి మళ్లించకపోగా..చిన్న వయసులోనే తట్టుకోలేని బాధలకు లోనవ్వుతారు. అందరూ ఒకలా తీసుకోరు. ఒక్కో పిల్లవాడి ఆలోచనా తీరు వేరుగా ఉంటుంది. చెడు అలవాట్ల బారిన పడకూడదని కొంతమంది తల్లిదండ్రులు అతి జాగ్రత్తతో చిన్నారులను తిట్టడం, కొట్టడం వంటివి చేస్తారు. వాళ్లు మంచిగా మారడం అటుంచి ఇంటి నుంచి పారిపోయి.. ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. ఇలా తానుకూడా బాల్యంలో వేధింపులకు గురయ్యానని బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురాన్ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. అంతపెద్ద స్టార్ కూడా ఒక్కసారిగా బాల్యం అనగానే వేధింపులే గుర్తుకొచ్చాయి. అంటే అవి నీలి నీడల్లా ఆయన్ను ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. ఇలా చిన్నారుల బాల్యం చేదు జ్ఞాపకంగా మారకూడదంటే..నటుడు ఆయుష్మాన్ ఖురాన్ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగంగా మాట్లాడారు. తండ్రి తనని బెల్టులు, చెప్పులతో దారుణంగా కొట్టేవాడనంటూ.. చిన్నతనంలో తాను అనుభవించిన బాధను చెప్పుకొచ్చారు. చిన్ననాటి ఆ గాయం తానింకా మర్చిపోలేదన్నారు. అయితే తాను మాత్రం తన పిల్లలకు అలాంటి తండ్రిని కానని, చాలా భిన్నంగా ఉంటానని అన్నారు. ఆయుష్మాన్‌కి ఇద్దరు పిల్లలు. తన బాల్యంలా వేధనాభరితంగా గడిచిపోకూడదని వారితో ఫ్రెండ్లీ ఫాదర్‌గా ఉంటానన్నారు. ఇక్కడ ఆయుష్మాన్ తన బాల్యంలో కలిగిన చేదు జ్ఞాపకాలు అతడి మనుసులో చాలా బలంగా నాటుకుపోయాయి. కానీ ఆయన తాను మంచి తండ్రిగా ఉండాలని భావించడం హర్షణీయం. ఎందుకంటే తనలా తన పిల్లలు కాకూదని అనుకోవడమే గాక ఎవరి బాల్యం అలా గాయాలతో నిండిపోకూడదని కోరుకున్నారు ఆయుష్మాన్. ఇలా అందరూ సానుకూలంగా తీసుకునే యత్నం చేయరు.చిన్నారుల సైకాలజీ ప్రకారం..బాల్యంలో జరిగే ప్రతిదీ వారి మనుసులో బలంగా నాటుకుంటుంది. వారు ఎదిగే క్రమంలో చుట్టూ ఉండే వాతావరణం, పరిచయమై కొత్త వ్యక్తులు అంతా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఈజీగా చెడు అలవాట్లు లేదా వ్యసనాల బారినపడే అవకాశం ఉంది. దీన్ని తల్లిదండ్రులు ఓ స్నేహితుడి మాదిరిగా దగ్గరకు తీసుకుని వివరించి..వాటి వల్ల ఎదురయ్యే నష్టాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అంతే తప్ప భయబ్రాంతులకు గురిచేసేలా కొట్టడం, తిట్టడం, లేదా పనిష్మెంట్లు ఇవ్వడం చేయకూడదు. ఇలా ప్రపంచమంతటా బాల్యంలో వేధింపులకు గురైన వారెందరో ఉన్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.అలాంటి పిల్లలను వారి సన్నిహితులో, బంధువులో లేక తల్లిదండ్రులో ఎవరో ఒకరైనా దగ్గరకు తీసుకోవాలి. లేదంటే వారు నిరాశ నిస్ప్రుహలకు లోనై ఎందుకు పనికరాని వారుగా లేదా ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోతారని చెబుతున్నారు నిపుణులు. వేధింపులకు గురయ్యే చిన్నారుల తీరు..చదువులో వెనుకబడటంచురుగ్గా లేకపోవడంఆత్మవిశ్వాసం లేకపోవడంవేలు నోట్లో పెట్టుకోవడం లేదా పక్కతడిపే అలవాటు వారి ముఖం ఆందోళన, బాధతో ఉండటంఏకాగ్రత లోపించటంనలుగురితో కలవకపోవడంతదితర లక్షణాలు కనిపంచగానే వారిని మానసిక నిపుణుల వద్దకు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇప్పించాలి. అక్కడ వారికి ఆత్మవిశ్వాసం పెరిగేలే థెరపీలు ఇవ్వడం వంటివి చేస్తారు నిపుణులు. ఇక్కడ చిన్నారులు తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు ఇలా ఎవ్వరి వల్ల అయినా వేధింపులకు గురైతే.. వెంటనే తన తల్లిదండ్రులు లేదా తనను ప్రేమగా చూసేవారి వద్ద మనసు విప్పి మాట్లాడేలా చేయడం తదితర విషయాలను నేర్పించడమే గాక తల్లిదండ్రులతో పిల్లలకు సాన్నిహిత్యం ఏర్పడేలా ఇరువురు ఎలా వ్యవహరించాలో తెలియజేస్తారు. అలాగే మొండిగా ఉండే పిల్లలను కూడా దారిలో పెట్టాలని కొట్టడం చెయ్యకూడదు. ఓపికతో వ్యవహరించడం లేదా మానసిక నిపుణులను సంప్రదించి సరైన మార్గంలో పయనించేలా చేయాలి తల్లిదండ్రులు. అంతే తప్ప బాల్యం అంటే భారంగా గడిపిన బాధకరమైన క్షణాలుగా మిగలకూడదని అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: నేహా ధూపియా అనుసరించే గ్లూటెన్-ఫ్రీ డైట్ అంటే..!) -
జాగ్రఫీ బోధించే గ్లోబ్..!
పెద్దలకు, పిల్లలకు నచ్చే ఆట బొమ్మలు చాలా అరుదు. అలాంటి వాటిలో ఈ ఆర్బూట్ ఎర్త్ ఒకటి. ఇదొక గ్లోబ్ బొమ్మ మాత్రమే కాదు, వర్చువల్ వరల్డ్ జాగ్రఫీ టీచర్ కూడా! ఈ గ్లోబ్‌ను ఐప్యాడ్‌కు లేదా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని వాడాలి. ఈ బొమ్మ ప్యాకేజీ బాక్స్‌లో మొత్తం పది అంగుళాల ఇంటరాక్టివ్ ఏఆర్ వరల్డ్ గ్లోబ్, పాస్‌పోర్ట్, వివిధ స్టాంప్స్, దేశాల జెండాలు, జంతువుల స్టిక్కర్లలతో పాటు ఒక హెల్ప్ గైడ్ ఉంటుంది. గ్లోబ్‌ను యాప్ ద్వారా ఐప్యాడ్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని, ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నయినా ఎంచుకుంటే, అప్పుడు అది పూర్తి యానిమేషన్ చిత్రాలతో ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలన్నింటినీ చూపిస్తుంది. ఇందులో జాగ్రఫీకి సంబంధించిన చిన్న చిన్న టాస్క్‌లు కూడా ఉంటాయి. వాటిని ఈ గ్లోబ్‌తో పాటు ఇచ్చే స్టాంపులు, స్టిక్కర్లతో పూర్తి చేయవచ్చు. ప్రపంచంలోని ఏ దేశాన్ని అయినా ఇట్టే గుర్తుపట్టేలా చిన్నారులకు నేర్పిస్తుంది ఈ గ్లోబ్. మూడు నుంచి ఐదేళ్ల వయసు గల పిల్లలకు ఇదొక మంచి బహుమతి. దీని ధర రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది. వివిధ ఆన్లైన్ స్టోర్స్‌లలో దొరుకుతుంది. (చదవండి: ఈ యూజర్ ఫ్రెండ్లీ మిషన్‌తో అవాంఛిత రోమాలకు చెక్..!) -
మై లిటిల్ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!
చిన్నపిల్లలకు కథలు చెబుతుంటే, నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. దీనికోసం చాలామంది తల్లిదండ్రులు మొబైల్లో వారికి కావాల్సినవి పెట్టి పడుకోబెడుతుంటారు. ఇది చాలా ప్రమాదం. పైగా కొన్ని పరిశోధనలు నిద్రపోవడానికి ముందు అరగంట సమయం పిల్లల మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని నిర్ధారించాయి. మొబైల్ వల్ల పిల్లల నిద్రకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ‘మై లిటిల్ మార్ఫీ’నీ రూపొందించారు. ఇందులో చిన్నారుల ప్రశాంతమైన నిద్ర కోసం 128 కథలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే 32 రకాల ధ్యానాలు, పిల్లి, కుక్క, ఏనుగు వంటి 16 జంతువుల ధ్వనులు, సముద్ర కెరటాలు, గాలి, నీటి తుంపరలు, మంటల చిటపట శబ్దాలతో పాటు ‘మై లిటిల్ మార్ఫీ’ కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేసిన 16 శ్రావ్యమైన సంగీత స్వరకల్పనలు ఉన్నాయి. ఇవే కాకుండా, ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో రికార్డ్ చేసిన ప్రకృతి శబ్దాలున్నాయి. ఇలా మొత్తం మై లిటిల్ మార్ఫీ 192 సెషన్లను 5 థీమ్‌లుగా విభజించింది. పడుకునే ముందు మన కిష్టమైన సెషన్ , ఆ సెషన్ వ్యవధిని ఎంచుకుంటే చాలు. అది వింటూ హాయిగా నిద్ర పోవచ్చు. చిన్నారులకే కాదు ఈ పరికరం అన్ని వయసుల వారికీ అనుకూలంగా ఉంటుంది. ఇందులో అద్భుతమైన నాణ్యతతో వాయిస్ రికార్డింగ్ చేసుకునే వీలుండటం విశేషం. దీనిని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే సుమారు మూడు గంటల పాటు పనిచేస్తుంది. అంటే మొత్తం ఎనిమిది కథలు, పదహారు పాటల వరకు వినొచ్చు. ధర 8 వేల నుంచి 9 వేల రూపాయల వరకు ఉంది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!) -
చవితి చంద్రుడు.. పున్నమి చంద్రుడు
అక్బర్ పాదుషా ఆస్థానంలో చేరిన అనతి కాలంలోనే బీర్బల్ ఆయనకు తలలో నాలుకలా మారాడు. బీర్బల్ చమత్కారాలను అక్బర్ పాదుషా అమితంగా ఇష్టపడేవాడు. తన తెలివితేటలతో బీర్బల్ ఎన్నో చిక్కు సమస్యలను పరిష్కరించి, మొఘల్ సామ్రాజ్యంలోనే అమిత మేధావిగా గుర్తింపు పొందాడు.బీర్బల్ తెలివి తేటలను అక్బర్ పాదుషా గుర్తించి, అతడిని తన ఆంతరంగికుడిగా చేసుకున్నాడు. మిగిలిన మంత్రులు చెప్పే మాటల కంటే బీర్బల్ మాటకు అక్బర్ పాదుషావారు ఎక్కువ విలువ ఇచ్చేవాడు. ఇదంతా ఆస్థానంలోని మిగిలిన మంత్రులకు, ఇతర ఉన్నత రాజోద్యోగులకు కంటగింపుగా ఉండేది. అదను చూసి బీర్బల్‌ను దెబ్బతీయడానికి ఎప్పటికప్పుడు విఫలయత్నాలు చేస్తుండేవారు. అసూయపరుల ప్రయత్నాలు ఎలా ఉన్నా, బీర్బల్ పేరు ప్రతిష్ఠలు మాత్రం అంతకంతకు పెరగసాగాయి. మొఘల్ సామ్రాజ్యంలోనే కాదు, బీర్బల్ ప్రఖ్యాతి పొరుగు దేశాలకూ పాకింది. బీర్బల్ ప్రఖ్యాతి ఆ నోటా ఈ నోటా పర్షియా రాజు వరకు చేరింది. బీర్బల్ తెలివితేటలను ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో ఆయన బీర్బల్‌కు తమ దేశానికి ప్రత్యేక అతిథిగా రావాలంటూ ఆహ్వానం పంపాడు. అక్బర్ పాదుషా అనుమతితో బీర్బల్ పర్షియాకు ప్రయాణమయ్యాడు. పర్షియా రాజ్యంలో అడుగుపెడుతూనే బీర్బల్‌కు ఘనస్వాగతం లభించింది. పర్షియా రాజు బీర్బల్‌కు ఘనంగా అతిథి మర్యాదలు చేశాడు. అడుగడుగునా చక్కని విడిది వసతులు, రుచికరమైన విందులు ఏర్పాటు చేశాడు. పర్షియా రాజ్యంలోకి అడుగుపెట్టినది మొదలుకొని, పర్షియా రాజభటులు, ఉద్యోగులు బీర్బల్‌ను అంటిపెట్టుకుని ఉంటూ ఆయనకు కావలసిన ఏర్పాట్లన్నీ సజావుగా జరిగేలా చూసుకున్నారు. దగ్గర ఉండి మరీ వారు బీర్బల్‌ను రాజధానికి తీసుకువచ్చారు. రాజధానికి చేరుకున్న రోజు బీర్బల్ విశ్రాంతికి విలాసవంతమైన అతిథిగృహంలో ఏర్పాట్లు చేశారు. మరునాడు బీర్బల్ రాజోద్యోగులు వెంటరాగా పర్షియా రాజు దర్బార్‌లోకి అడుగుపెట్టాడు. బీర్బల్‌ను పర్షియా రాజు తన పక్కనే ఉన్నతాసనం మీద కూర్చోబెట్టుకుని, కుశల ప్రశ్నలు వేశాడు.‘బీర్బల్గారు! మీ వంటి మేధావి మా మిత్రుడైన అక్బర్ ఆస్థానంలో మంత్రిగా ఉండటం మాకూ గర్వకారణమే! మీకు నచ్చినన్ని రోజులు మా రాజ్యంలో అతిథిగా ఉండండి. రాజ్యం నలుమూలలా మీకు నచ్చినట్లు సంచారం చేయవచ్చు. అందుకు తగిన ఏర్పాట్లు చేయిస్తాను. మా రాజ్యంలోని పరిస్థితులను గమనించి, మెరుగు పరచుకోవలసిన అంశాలేమైనా ఉంటే సలహాలు ఇవ్వండి’ అని అన్నాడు.పర్షియా రాజ్యంలో కొన్నాళ్లు గడిపాక, బీర్బల్ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తన రాజ్యానికి తిరిగి బయలుదేరాలనుకుంటున్నానని పర్షియా రాజుకు తెలియజేశాడు. బీర్బల్ తిరుగు ప్రయాణానికి ముందురోజు అతడి గౌరవార్థం పర్షియా రాజు ఘనంగా విందు ఏర్పాటు చేశాడు. పర్షియా రాజ దర్బారులోని మంత్రులు, సేనానాయకులు, ఉన్నతోద్యోగులు, రాజ్యంలోని కులీనులు, పెద్ద పెద్ద వర్తకులు ఆ విందులో పాల్గొన్నారు. విందులో కబుర్లాడుకుంటుండగా, పర్షియా మంత్రుల్లో ఒకరు వచ్చి బీర్బల్తో మాటలు కలిపాడు. ‘బీర్బల్ మహాశయా! మా రాజుగారి గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగాడు.‘మీ రాజావారికేం? ఆయన పున్నమి చంద్రుడు’ అని బదులిచ్చాడు బీర్బల్.‘మరి మీ రాజావారి గురించి ఏమంటారు?’ అడిగాడా మంత్రి.‘మా రాజావారు చవితి చంద్రుడు’ అన్నాడు బీర్బల్. అక్బర్ పాదుషాను చవితి చంద్రుడితోను, తనను పున్నమి చంద్రుడితోను పోలుస్తూ బీర్బల్ అన్న మాటలకు పర్షియా రాజు పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. సాగనంపేటప్పుడు బీర్బల్‌కు అనేక విలువైన కానుకలు ఇచ్చాడు. అక్బర్ పాదుషాకు అందజేయమంటూ మరిన్ని కానుకలనిచ్చాడు. వాటిని మోసుకుపోవడానికి గుర్రబ్బగ్గీలను, సేవకులను ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికాడు.బీర్బల్ ఢిల్లీకి చేరుకున్నాడు. అక్బర్ పాదుషా దర్బారులోకి అడుగుపెట్టాడు. అక్బర్ పాదుషా చిర్రుబుర్రులాడుతూ కనిపించాడు. బీర్బల్‌కు ఏమీ అర్థంకాలేదు.పర్షియా రాజు వద్ద బీర్బల్ అన్న మాటలు వేగుల ద్వారా అప్పటికే అక్బర్ పాదుషా చెవికి చేరాయి.అక్బర్ పాదుషా ఇక ఉక్రోషాన్ని అణచుకోలేక నేరుగా విషయంలోకి వచ్చేశాడు.‘మా గురించి ఏమనుకుంటున్నావు బీర్బల్? పొరుగు రాజు వద్ద పరువు తీస్తావా?’ అన్నాడు కోపంగా.‘పొరుగు రాజు వద్ద నేను మిమ్మల్ని పొగిడాను జహాపనా!’ అన్నాడు బీర్బల్.‘చాలు, చాలు! ఇక బొంకకు. అక్కడ నువ్వన్న మాటలన్నీ నాకు తెలుసు. పర్షియా రాజు పున్నమి చంద్రుడా? నేను చవితి చంద్రుణ్ణా? ఇదేనా నన్ను పొగడటం?’ మరింత కోపంగా అన్నాడు అక్బర్ పాదుషా.‘జహాపనా! నిజమే, ఆయన పున్నమి చంద్రుడు. పున్నమి తర్వాత చంద్రుడు క్షీణించడం ప్రారంభిస్తాడు. తమరు చవితి చంద్రుడు. భవిష్యత్తులో తమరు ఇంకా వృద్ధిలోకి వస్తారు. అందుకే అలా పొగిడాను. నా అదృష్టం బాగులేదు కనుక నన్ను తమరు అపార్థం చేసుకున్నారు’ అన్నాడు బీర్బల్.బీర్బల్ వివరణతో అక్బర్ సంతోషించాడు. తన మెడలోని హారాన్ని బహూకరించి సత్కరించాడు. -
బాల్యమొక స్ఫూర్తి
బాల్యం అనేది ప్రతీ ఒక్కరి జీవితానికి భవిష్యత్ పాఠశాల. చిన్నారులు ఎదిగే క్రమంలో వారి ఆలోచనలపై చూపించే ప్రభావమే వారి జీవిత గమ్యాలను నిర్దేశిస్తాయి. పిల్లల చిన్నప్పటి అభిరుచులే వారి లక్ష్యాలుగా మార్పు చెందుతాయి. ఈ ప్రయాణంలో కొందరు చిన్నారులు చదువులపై ఆసక్తి కనబరిస్తే మరి కొందరు సంగీతం, క్రీడలు, డాన్స్, పెయింటింగ్, సాహస కృత్యాలు ఇలా తదితర అంశాలపై మక్కువ చూపుతుంటారు. ఒకవైపు వారి చదువులను కొనసాగిస్తూనే ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్‌లో రాణిస్తుంటారు. పసిప్రాయంలోనే ఇలాంటి విభిన్న రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యాలతో రాణించిన కొందరు చిన్నారులను చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. బాల్యం నుంచే తమకంటూ కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుని అటు చదువులను ఇటు వారి ప్రయత్నాలను కొనసాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న బాలతారల ఆలోచనలను తడిమి చూద్దామా..? చిన్న వయసులో..పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు అచ్చు గుద్దినట్టు ఈ పాప సరిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే 9 ఏళ్ల వయసులోనే తన కంటే నాలుగేళ్లు పెద్ద వాళ్లతో తలపడి, గెలుపొంది ఔరా అనిపించుకుంటోంది. బ్యాడ్మింటన్ ఆటలో అద్భుతాలు సృష్టిస్తోంది లట్టాల శాన్వి. నగరంలోని మణికొండకు చెందిన శాని్వకి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న శాని్వ.. ఆటపై పూర్తిగా ఫోకస్ పెట్టేందుకు చదువు కూడా మానేసింది. రోజులో కనీసం 8 గంటల పాటు ఆటపైనే శ్రద్ధ పెడుతూ ప్రాక్టీస్ చేస్తోంది. ఒలంపిక్స్‌లో దేశం తరఫున ఆడి బంగారు పతకాన్ని సాధించడమే తన జీవిత లక్ష్యమని చెబుతోంది. ఇటీవల అసోంలో జరిగిన జాతీయస్థాయి అండర్–13 ర్యాంకింగ్ టోర్నమెంట్లో సింగిల్స్, డబుల్స్ విభాగంలో మెయిన్ డ్రాకు అర్హత పొంది సంచలనం సృష్టించింది.హైదరాబాద్నునంబర్ వన్ స్థానంలో.. అతి సాధారణ కుటుంబం మాది. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. మేము ఏది చేసినా మా కుటుంబానికి గుర్తింపు రావాలి. మా అమ్మా నాన్నలకు మంచి పేరు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నగరంలోని యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో సుహేమ్ షేక్ అందిస్తున్న సహకారంతో ఈ సెయిలింగ్‌లో రాణించాను. వైఎఐ నార్త్ ఈస్ట్ రేగట్ట 2023 ఆప్టిమిస్టిక్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. వైఎఐ సికింద్రాబాద్ యూత్ క్లబ్ రేగట్ట 2023లో సిల్వర్ పతకం సాధించాను. వైఏఐ యూత్ నేషనల్లో ఆప్టిమిస్టిక్ విభాగంలో కాంస్యం గెలుపొందాను. మా ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ను నంబర్ వన్ స్థానంలో తీసుకువచ్చారు. నాతోపాటు నా సహోదరి కూడా సేలింగ్లోనే జాతీయ స్థాయిలో పలు పతకాలను సాధించింది. – లహరి, జాతీయస్థాయి సెయిలర్టీం ఇండియాకు ఆడటమే..క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం.. ప్రస్తుతం నేను హిమాయత్‌నగర్‌లోని స్లేట్ ది స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. బాగ్‌లింగంపల్లిలోని స్పాట్ లైట్ అకాడమీలో క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నాను. ఈ మధ్యనే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అండర్–17 విభాగంలో ఎంపికయ్యాను. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ఆడటమే లక్ష్యంగా క్రికెట్లో రాణిస్తున్నాను. సిటీలో జరిగిన పలు టోర్నమెంట్లలో మంచి స్కోర్ సాధించాను. అందరిలా కాకుండా విభిన్న క్రీడల్లో రాణించడానికి నాన్న అందించే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేను. ఇటు చదువులు, అటు క్రికెట్లో సమస్వయం చేసుకుంటూ ముందుకు సాగడానికి నాన్న విశేషంగా కృషి చేస్తున్నాడు. – వరీష సలార్ సినిమాతో గుర్తింపు.. ప్రతి విషయాన్ని వినూత్నంగా ఆలోచించడం నాకిష్టం. చిన్నప్పటి నుంచి విభిన్న కళల్లో ఆసక్తి కనబర్చేవాడిని. అనంతరం సినిమాలు, నటనపై మక్కువ పెరిగింది. ఏ చిన్న ఆడిషన్స్ ఉన్నా వెళ్లేవాడిని. ఈ ప్రయత్నంలో పలు మంచి ప్రాజెక్టుల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించే అవకాశం వచి్చంది. ప్రముఖ సినీ హీరో అజిత్, త్రిష నటించిన గుడ్, బాడ్, అగ్లీ సినిమా, ప్రభాస్ సలార్ వంటి సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి. మరికొద్ది రోజుల్లో రానున్న వరుణ్ తేజ్ సినిమా మట్కాలో మంచి రోల్ చేస్తున్నారు. అంతేగాకుండా జగపతిబాబు తదితర టాలీవుడ్ స్టార్స్‌తో మరికొన్ని ప్రాజెక్ట్‌లు చేస్తున్నాను. సినిమాలతో పాటు చదువులోనూ రాణిస్తున్నాను. సినిమాల ప్రభావం నా చదువులపై పడకుండా చూసుకుంటున్నాను. భవిష్యత్తులో వైవిధ్యమైన క్యారెక్టర్లు చేసే మంచి హీరోగా రాణించాలని ఉంది. – కార్తికేయ దేవ్, ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్హ్యాపీగా.. సాగుతున్న కెరీర్ ఓరి దేవుడా, సలార్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో చైల్డ్ ఆరి్టస్ట్‌గా నటించాను. ప్రభాస్ వంటి ప్యాన్ ఇండియన్ స్టార్‌తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలతో పాటు చదువు, క్రీడల్లోనూ ముందంజలో ఉన్నాను. సినిమాలతో మొదలై కెరీర్ హ్యాపీగా ముందు సాగుతోంది. సామాజిక బాధ్యతలను ప్రతిబింబించేలా, చిన్నారుల హక్కులను తెలియజేసేలా మంచి ప్రాజెక్టులను చేసే యోచనలో ఉన్నాను. ప్రస్తుతం మరో రెండు పెద్ద ప్రాజెక్టుల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాను. మ్యాథ్స్ ఇంగ్లిష్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. అంతేగాకుండా సంగీతంపైన కూడా ఆసక్తి. నేను పాటలు చాలా బాగా పాడగలను. – ఫర్జానా, చైల్డ్ ఆర్టిస్ట్ -
చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుందా..?
కొందరు చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుంది. దాంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలువుతుంది. తమకు దగ్గరి వాళ్లలో లేదా తమ బంధువుల్లో ఇలాగే జరిగిందనీ, మాటలు రావడం కొందరిలో ఇలాగే ఆలస్యమవుతుంటుందని సముదాయించడం మామూలే. ఇలా పిల్లలకు మాటలు రావడంలో ఆలస్యం జరగడానికి కారణాలేమిటి, ఆ సమస్యలను అధిగమించడం ఎలా అన్న అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.పిల్లల్లో సాధారణంగా 10 నెలలు లేదా ఏడాది నాటికి కొన్ని కొన్ని ముద్దుమాటలు (బాబ్లింగ్) మొదలవుతుంది. రెండేళ్ల వయసు నాటికి తమ భావాలను చాలావరకు కమ్యూనికేట్ చేయ గలుగుతుంటారు. మూడేళ్లకు దాదాపుగా అన్ని మాటలూ వచ్చేస్తాయి. కానీ కొందరు పిల్లల్లో మాట రావడం కాస్త ఆలస్యమవుతుంది. వినికిడి వ్యవస్థ బాగుందని తెలిశాక... అలా మాటలు రావడం ఆలస్యమైన పిల్లల్లో చాలామంది సాధారణంగా స్కూల్లో చేర్చే వయసు నాటికి తమంతట తామే మాట్లాడగలుగుతారు. కారణాలు... పిల్లల్లో మాటలు రావడం ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిల్లో... వినడానికి అవసరమైన వినికిడి వ్యవస్థ, అలాగే మాట్లాడటానికి అవసరమైన వోకల్ కార్డ్స్, మాట్లాడేందుకు ఉపయోగపడే గొంతులోని కండర నిర్మాణం... ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, కొందరిలో సహజంగానే మాటలు రావడం ఆలస్యమవుతుంటుంది. అలాగే చిన్నారుల్లో వారి భాష ఓ స్థాయి పరిణతికి రావడంలో జరిగే ఆలస్యం (లాంగ్వేజ్ మెచ్యురేషన్ డిలే) కావడం కూడా దీనికి కారణం. చాలావరకు వంశ΄ారంపర్యంగా ఇలా జరుగుతుంటుంది. అమ్మాయిలతో ΄ోలిస్తే ఈ సమస్య అబ్బాయిల్లోనే ఎక్కువ.కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలకు సూచిక... కొందరు చిన్నారుల్లో మాటలు రావడంలో ఆలస్యం జరగడం అనేది కొన్ని సందర్భాల్లో అండర్లైయింగ్ ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఇలా మాటలు రాక΄ోవడం చాలా రకాల ఆరోగ్య సమస్యలను సూచించే ఒక లక్షణం కావచ్చు. ఉదా: వినికిడి లోపాలు, మానసికమైన సమస్యలూ, ఆటిజం వంటి కండిషన్, భాషను అర్థం చేసుకోవడం, అభివ్యక్తీకరించడంలో సమస్యలు... మొదలైనవాటిల్లో ఏదో ఒకదానివల్ల మాటలు రావడం ఆలస్యం కావచ్చు.కొన్నిసార్లు అది ఎదుగుదల సమయంలో వచ్చే ఇతర ఆరోగ్య లోపాల వల్ల కూడా అయి ఉండవచ్చు. ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ డిజార్డర్ ఉన్న పిల్లలు భాషను ఒక కమ్యూనికేటివ్ సాధనంగా వాడటంలో విఫలమవుతారు. అయితే వారిలోని తెలివితేటలు, వినికిడి, ఉద్వేగభరితమైన ఫీలింగ్స్... తదితర విషయాల్లోనూ మామూలుగానే ఉంటారు. తమ సంజ్ఞలు, సైగల ద్వారా కమ్యూనికేషన్ అంతా సాధారణంగానే చేస్తు్తంటారుగానీ, మాటలు లేదా పదాలు పలకడం (వర్బల్ ఎక్స్ప్రెషన్స్) ద్వారా తమ అభి్ర΄ాయాలను వెల్లడించడం మాత్రం చాలా పరిమితంగా ఉంటుంది.ఈ పిల్లల విషయంలో పరిష్కారాలేమిటి? ఇలాంటి పిల్లల విషయంలో... వారు మాటలు నేర్చుకోవడం / మాట్లాడటం అనే ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతోందో తెలుసుకోవడం తప్పనిసరి. ఇందుకు పూర్తిస్థాయి ఇవాల్యుయేషన్ అవసరం. ఇందుకోసం... ‘ఎర్లీ లాంగ్వేజ్ మైల్స్టోన్ స్కేల్ టెస్ట్’, ‘స్టాన్ఫోర్డ్ ఇంటెలిజెన్స్ టెస్ట్’, ఆడియోమెట్రీ, బ్రెయిన్ స్టిమ్యులస్ రెస్పాన్స్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల వల్ల మాటలు రాక΄ోవడానికి కారణాలేమిటి, ఆ కారణాల తీవ్రత ఎంత, వాటి ప్రభావాలు ఏ మేరకు ఉన్నాయన్న పలు విషయాలు తెలుస్తాయి. ఇలాంటి పిల్లలున్నవారు ఒకసారి మీ కుటుంబ పిల్లల డాక్టర్‌కూ అటు తర్వాత అవసరాన్ని బట్టి స్పీచ్ థెరపిస్ట్కూ చూపించాలి. ఒకసారి సమస్యనూ, తీవ్రతనూ తెలుసుకుంటే... ఆ తర్వాత ‘స్పీచ్ పాథాలజిస్ట్’లు పిల్లలకు మాటలు వచ్చే శిక్షణను మొదలుపెడతారు. తల్లి దండ్రులకూ కొంత శిక్షణ అవసరం... ఇలాంటి పిల్లలకు మాటలు నేర్పే విషయంలో తల్లిదండ్రులు చాలా ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. వాళ్లకూ కొంత శిక్షణ అవసరమవుతుంది. తల్లిదండ్రులు పూర్తి సహనంతో ఉంటూ, భాష విషయంలోతామూ పిల్లల స్థాయికి చేరుకుని, వాళ్లకు మాటలు నేర్పాలి. తల్లిదండ్రులు నిత్యం ఆ పిల్లలను ఉత్సాహపరుస్తూ... వారికి భాషతోటు ఇతర నైపుణ్యాలూ నేర్పడానికి సంసిద్ధంగా ఉండాలి.(చదవండి: నలుపు తగ్గేదెలా..?) -
బెడ్ వెట్టింగ్
సాధారణంగా పిల్లల్లో 95 శాతం మంది దాదాపుగా ఐదారేళ్ల వయసు వచ్చేసరికి నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ (బ్లాడర్ కంట్రోల్) సాధిస్తారు. కానీ నాలుగు శాతం మంది పిల్లల్లో ఇది కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా కొద్దిమందిలో అంటే... ఒక శాతం (1%) మందిలో పెద్దయ్యాక కూడా నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ సాధించడం సాధ్యం కాకపోవచ్చు. దాంతో కాస్తపెద్దయ్యాక కూడా... అంటే 10 – 12 ఏళ్లు వచ్చాక కూడా కొందరు పిల్లలు రాత్రివేళ పక్క తడుపుతుంటారు. ఇలా పిల్లలు రాత్రిపూట నిద్రలో మూత్రవిసర్జన చేసే సమస్యను వైద్యపరిభాషలో ‘నాక్టర్నల్ అన్యురిసిస్’ అంటారు. ఇది అబ్బాయిల్లో ఎక్కువ. ఇది కుటుంబంలో ఎవరికైనా ఉంటే... అలాంటి కుటుంబాల్లో 50 శాతం మందిలో... వాళ్ల పిల్లల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది.అన్యురిసిస్ సమస్యలోనూ రెండు రకాలు ఉంటాయి. మొదటిది ‘ప్రైమరీ అన్యురిసిస్. రెండోది సెకండరీ అన్యురిసిస్. ప్రైమరీ అన్యురిసిస్ : చిన్నారులు ఒక్క రోజు కూడా విడవకుండా ప్రతిరోజూ పక్క తడుపుతుంటే దాన్ని ‘ప్రైమరీ అన్యురిసిస్’ అంటారు. సెకండరీ అన్యురిసిస్ : ఇలా రాత్రుళ్లు పక్క తడిపే పిల్లలు కొన్నాళ్ల పాటు పక్కతడపకుండా బాగానే ఉండి, కొంతకాలానికి వాళ్లలో సమస్య మళ్లీ తిరగబెట్టడాన్ని ‘సెకండరీ అన్యురిసిస్’గా చెప్పవచ్చు. ఇలా సెకండరీ అన్యురిసిస్ సమస్య రావడానికి తల్లిదండ్రుల మధ్య సయోధ్య లేకపోవడం, ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోవడం, కుటుంబంలోకి తమ్ముడో, చెల్లెలో వచ్చినప్పుడు కలిగే ఈర్ష్య (సిబ్లింగ్ జెలసీ) వంటి కారణాలతో పిల్లల్లో నెలకొన్ని మానసిక ఆందోళన వంటి అంశాలను ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.ప్రైమరీ అన్యురిసిస్కు కారణాలు... ప్రైమరీ అన్యురిసిస్కు పిల్లల్లో నాడీ సంబంధమైన వికాసం కాస్త ఆలస్యంగా జరుగుతుండటం అంటే న్యూరోనల్ మెచ్యురేషన్ డిలే, మూత్రం ఉత్పత్తి కాస్త ఎక్కువగా జరుగుతుండటం (ఇన్క్రీజ్డ్ యూరిన్ ్ర΄÷డక్షన్), బ్లాడర్ సామర్థ్యం కాస్త తక్కువగా ఉండటం (డిక్రీజ్డ్ బ్లాడర్ కెపాసిటీ)తో పాటు జన్యుపరమైన అంశాలు కూడా ఇందుకు కారణమవుతాయి.ఇతర కారణాలు...ఇలా పెద్దయ్యాక కూడా రాత్రి నిద్రలో పక్కతడిపే సమస్య ఉన్న 20 శాతం మంది పిల్లల్లో యూరినరీ ట్రాక్ అబ్నార్మాలిటీస్, బ్లాడర్ డిస్ఫంక్షన్, నిద్రకు సంబంధించిన రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్), యాంటీ డైయూరెటిక్ హార్మోన్ (ఏడీహెచ్) లోపాలు, మానసికమైన కారణాలు, మలబద్ధకం, కొన్ని సందర్భాల్లో అడినాయిడ్స్ వల్ల నిద్ర సంబంధమైన సమస్యలు (స్లీప్ ఆప్నియా) వంటివి ఉన్నప్పుడు కూడా రాత్రివేళల్లో తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు. పిల్లల్లో ఈ సమస్య ఉంటే మూత్రపరీక్షలతో పాటు హార్మోనల్ స్టడీస్ చేయించడం, బ్లాడర్ అనాటమీ అండ్ ఫంక్షనల్ టెస్ట్ చేయించడం అవసరం. వాటిని బట్టి ఇది హార్మోన్లకు సంబంధించిన సమస్యా, కాదా అని తెలుసుకోవచ్చు.ఈ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ∙నిద్రలో మూత్రవిసర్జన చేసే పిల్లలను కించపరచడం, శిక్షించడం వంటివి అస్సలు చేయకూడదు. ∙సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్రవాహారం చాలా తక్కువగా ఇవ్వడం, నాలుగు దాటాక కెఫిన్, చక్కెర ఉన్న పదార్థాలు పూర్తిగా ఇవ్వకపోవడం అవసరం. రోజులో తీసుకునే ద్రవపదార్థానికి 20 శాతానికి మించి 5 గంటల తర్వాత ఇవ్వకూడదు. ∙పడుకునేముందు ఒకసారి మూత్రవిసర్జన చేయించడం, నిద్రపోయిన గంటలోపు లేపి మళ్లీ ఒకసారి మూత్రవిసర్జన చేయించడం వల్ల పక్క తడిపే అవకాశాలను తగ్గించవచ్చు.మేనేజ్మెంట్ / కేర్...ఇటీవల అందుబాటులోకి వచ్చిన అలారం వంటి పరికరాలతో బ్లాడర్‌పై నియంత్రణ సాధించేలా ప్రాక్టీస్ చేయించాలి. దీంతోపాటు డెస్మోప్రెసిన్, ఇమెప్రమిన్ వంటి కొన్ని మందులు బాగా పనిచేస్తాయి. అలాంటి పిల్లలను కొన్ని స్ప్రేల సహాయంతో సామాజిక ఉత్సవాలకు నిర్భయంగా తీసుకెళ్లవచ్చు. అలాంటి చర్యల వల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ∙ఈ సమస్యకు హార్మోన్లోపాలు కారణం అయితే 3–6 నెలలపాటు మందులు వాడటం వల్ల ఈ సమస్యను 50 శాతం మందిలో సమర్థంగా అదుపు చేయవచ్చు. ∙ -
లిటిల్ చెఫ్స్: వంటలు నేర్చుకోవడం వల్ల పిల్లలు..!
ఉన్నత లక్ష్యాలను సాధించే తెగువే కాదు.. ప్రాథమిక అవసరాలను తీర్చుకునే నైపుణ్యమూ తెలుసుండాలి! వాటిల్లో వంట మొదటిది! అందుకేనేమో ఇప్పుడు పదసంపదలోకి ఫుడ్ లిటరేట్స్ అనే పదం చేరింది! చదువు, ఆట, పాటలతో పాటు పాకం కూడా తప్పక నేర్చుకోవలసిన విద్య అయింది! అర్బన్ స్కూళ్లలో, న్యూక్లియర్ కుటుంబాల్లో కుకింగ్ అనేది జెండర్ – న్యూట్రల్ యాక్టివిటీ అయింది! ఇదివరకు.. ఏ ఇంట్లో అయినా ఆడుకోవడానికి ఆడపిల్లలకైతే వంట పావులు.. మగపిల్లలకైతే కార్లు, బ్యాట్, బాల్ బొమ్మలుండేవి. ఇప్పుడు ఆ సీన్ అంతగా కనపడట్లేదు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో.. కరోనా తర్వాత. కరోనా లాక్ డౌన్ అందరికీ అన్నీ వచ్చుండాలనే పాఠం నేర్పింది. ఎమ్సెట్ ఎంట్రెన్స్ కంటే ముందు కిచెన్‌లోకి ఎంటర్ కావాలని చెప్పింది. అందుకే కరోనా తర్వాత చాలా కార్పొరేట్ స్కూళ్లు కుకింగ్నీ సిలబస్‌లో చేర్చాయి. అయితే లింగవివక్షను చెరిపేయడానికి చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్ (విద్యారణ్యతోపాటు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు) వంటి నగరాల్లోని చాలా స్కూళ్లు ఎప్పటి నుంచో కుకింగ్ క్లాసెస్‌ను తమ కరిక్యులమ్‌లో భాగం చేశాయి. కరోనా కష్టంతో పట్టణాలు, మధ్యతరగతి కుటుంబాలూ ఈ విషయంలో అలెర్ట్ అయ్యాయి. ఊహ తెలిసినప్పటి నుంచే పిల్లలకు వంట గదిని పరిచయం చేస్తున్నాయి. వంటసామాగ్రితో స్నేహం చేయిస్తున్నాయి. దీనివల్ల పిల్లల పదసంపద పెరుగుతుంది. ప్రయోగాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. వస్తువులను గుర్తించే జ్ఞానం అలవడుతుంది. కొలతలు అర్థమవుతాయి. మోతాదు మించినా, తగ్గినా వచ్చే ఫలితాల పట్ల అవగాహన కుదురుతుంది. బాధ్యత, బ్యాలెన్స్‌లు తెలుస్తాయి. సర్దుబాటు అలవాటవుతుంది. టీమ్ వర్క్, ఆ స్పిరిట్ బోధపడతాయి. ఎదుటివారికి సాయపడే గుణం అబ్బుతుంది. ఇతరులను జడ్జ్ చేయకూడదనే స్పృహా కలుగుతుంది. ఇలా కిచెన్ ఇటు అకడమిక్స్‌కు, అటు జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను బోధిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కాస్మోపాలిటన్, మెట్రో నగరాల్లో కొన్ని సంస్థలు పిల్లల కోసం కుకింగ్ వర్క్ షాప్స్‌ని కూడా నిర్వహిస్తున్నాయి. లిటిల్ షెఫ్స్‌తో టీవీ చానళ్లు కుకింగ్ షోస్‌నూ ప్రసారం చేస్తున్నాయి. అల్లరి పిల్లల్ని సంభాళించడానికి కిచెన్‌ని మించిన ప్లేస్ లేదంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఇల్లు పీకి పందిరేసే పిల్లలను పేరెంట్స్ తమ అసిస్టెంట్స్‌గా వంటగదిలోకి పట్టుకెళ్లి.. వారి ముందు క్యాబేజ్ లాంటి కూరగాయలను పెట్టి.. దాని ఆకులను వేరు చేయమని పురమాయించాలని చెబుతున్నారు. అలాగే ఒక టబ్‌లో వాళ్ల చేత నీళ్లు పోయించి, అందులో కాసింత ఉప్పు వేయించి.. వాళ్ల చేతికి కూరగాయలిచ్చి ఆ టబ్‌లో వేయించాలి. వాళ్ల చిట్టి చిట్టి అరచేతులతో చిన్న చిన్న ఉల్లిపాయలను ప్రెస్ చేయించాలి. తడిపిన చపాతి పిండిని వాళ్ల ముందు పెట్టి.. చిన్న చిన్న లడ్డూలు చేయమనాలి. ఈ యాక్టివిటీస్‌తో వాళ్లు కుదురుగా ఉండటమే కాకుండా చాలా విషయాలు నేర్చుకుంటారు. చిన్నపాటి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవుతుందంటున్నారు నిపుణులు. అలా చిన్నప్పుడే వంటింట్లో గరిట పట్టుకుని, తమ వంటల ఘుమఘుమలతో ఇంట్లో వాళ్లనే కాదు ఇరుగు పొరుగునూ ఆశ్చర్యపరుస్తున్న ఆ బాలనలభీములను పరిచయం చేసుకుందాం.. వైభవి మెహ్రోత..ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్‌కు చెందిన ఈ అమ్మాయికిప్పుడు పదహారేళ్లు. కానీ తొమ్మిదేళ్ల వయసులోనే అమ్మ చేయి పట్టుకుని వంటింట్లోకి అడుగుపెట్టింది.. వంటలో అమ్మకు చేయందించేందుకు. పోపు దినుసుల దగ్గర్నుంచి పసుపు, ఉప్పు, కారం వంటివన్నీ ఎంత మోతాదులో పడితే వంటకు రుచి వస్తుందో పర్ఫెక్ట్గా తెలుసుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కూర ఉడుకుతుండగానే దాని వాసన చూసి చెప్పగలదు అందులో ఏం తక్కువైంది, ఏం ఎక్కువైందన్నది! బేకింగ్‌లో వైభవీని మించిన వారు లేరు. ‘లాక్డౌన్ టైమ్‌లోనే నాకీ పర్ఫెక్షన్ వచ్చింది. లాక్డౌన్లో మా చుట్టుపక్కల వాళ్లకు, చుట్టాలకు కేక్స్ చేసి పంపేదాన్ని సరదాగా! ఆ ప్రాక్టీస్‌తో కేక్స్ చేయడంలో పర్ఫెక్ట్ అయిపోయాను. నా ఫేవరిట్ అండ్ కంఫర్ట్ ఫుడ్ చాక్లెట్ కేక్!’ అని చెబుతుంది వైభవీ. హోమ్ బేకరీ, తర్వాత ఒక కేఫ్నీ పెట్టాలనేది ఈ యంగ్ షెఫ్ ఆలోచన, లక్ష్యం! ’ 'vabhavi's bake diaries' పేరుతో ఆమెకో యూట్యూబ్ చానల్ కూడా ఉంది. సునిధి మెహతా..మహారాష్ట్ర, పుణేకి చెందిన ఈ అమ్మాయికిప్పుడు పద్నాలుగేళ్లు. కానీ నాలుగేళ్ల వయసులోనే వంట మీద ఆసక్తి పెంచుకుంది. సునిధి వాళ్ల మేనత్త బ్రౌనీస్ చేస్తుంటే కళ్లింతింత చేసుకుని చూస్తుండేదట. ఆ పిల్ల ఇంట్రెస్ట్ గమనించిన మేనత్త ఆ అమ్మాయి చేయి పట్టుకుని అన్నీ చేయించేదట. ఇదంతా చూసి సునిధి వాళ్ల నాన్న .. కూతురికి అక్షరజ్ఞానం వచ్చాక వంటల పుస్తకాన్ని తెచ్చిచ్చాడట. ‘అదే నా ఫస్ట్ అండ్ ఫరెవర్ ఫేవరిట్ గిఫ్ట్’ అంటుంది బ్రౌనీలు, బిస్కట్స్, స్వీట్స్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన సునిధి. ‘బ్రౌన్ సుగర్, దాల్చిన నాకిష్టమైన ఇన్‌గ్రీడియెంట్స్. నా ఫేవరిట్ అండ్ కంఫర్ట్ ఫుడేమో పానీపూరీ. ఎప్పటికైనా కేక్ అండ్ కాఫీ స్టోర్ పెట్టాలన్నదే నా గోల్’ అని చెబుతుంది. రణవీర్ కల్బాగ్..మహారాష్ట్ర, పుణేకి చేందిన రణ్వీర్కిప్పుడు పద్నాలుగేళ్లు. కానీ అయిదేళ్ల వయసులోనే సాస్ తయారీకి ఏప్రాన్ వేసుకున్నాడు. రణ్వీర్ వాళ్ల నాన్న ప్రొఫెషనల్ చెఫ్. ప్రతి ఆదివారం ఇంట్లో వాళ్ల నాన్నే వంట చేస్తాడు. దాంతో రణ్వీర్ కూడా నాన్నకు సాయంగా వంటింట్లోకి దూరేవాడు. అలా వంట మీద ఇష్టం ఏర్పడింది ఆ అబ్బాయికి. ‘మాస్టర్ బేకింగ్ లేదా మిక్సాలజిస్ట్.. నా ఎయిమ్’ అని చెబుతాడు. స్వీట్స్ అంటే ప్రాణం పెడతాడు. ‘అందుకే బటర్ అండ్ సుగర్ అంటే చాలా ఇష్టం. అవి రెండు కలిసి చేసే మ్యాజిక్ అలాంటిది మరి!’ అంటాడు.మేధా భట్..కర్ణాటక, మంగళూరుకు దగ్గర్లోని ఆర్యపు అనే చిన్న పల్లెటూరికి చెందిన ఈ అమ్మాయికిప్పుడు పదిహేనేళ్లు. కానీ మూడవ తరగతిలో ఉన్నప్పుడే డిసైడ్ అయింది పెద్దయ్యాక రెస్టరటర్ అవ్వాలని. తను పెట్టబోయే హోటల్‌కి పేరు కూడా రెడీచేసి పెట్టుకుంది ‘తందురుస్తీ హోటల్’ అని. ఆమెకు స్ఫూర్తి వాళ్లమ్మ చూసే యూట్యూబ్ వంటల చానళ్లు. ఆ చానళ్లలో రకరకాల దినుసులన్నీటితో చక్కటి డిష్‌ని తయారుచేయడం చూసి ఆశ్చర్యపోయేదట మేధా. ‘చిటికెడు ఉప్పుతో వాళ్లు బాండిడు కూరకు రుచి తేవడం నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉండేది’ అంటూ ఇప్పటికీ సర్ప్రైజ్ అవుతుంది. మేధా తన ఎనిమిదో ఏట పోపుల పెట్టె పట్టుకుంది. ‘నిజానికి మేధా హైపర్ యాక్టివ్ కిడ్. వంట వల్లే తను నెమ్మది అయింది. ఇప్పటికీ మేధాను చూస్తుంటే నాకు వండరే! ఒక్క క్షణం కాలు నిలువని పిల్ల.. అంత ఓపిగ్గా వంట ఎలా చేయగలుతుంది అని!’ అంటుంది మేధా వాళ్లమ్మ. చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్‌డేలకు కస్టమైజ్డ్ కేక్స్ చేస్తున్న మేధాకు చాక్లెట్, బంగాళదుంప అంటే ఇష్టం. (చదవండి: ఐదేళ్లకే పుస్తకాన్ని రచించి రికార్డు సృష్టించింది..!) -
చిన్నారుల ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం తల్లిదండ్రులు చేయాల్సినవి..
పిల్లల ఆరోగ్యం కోసం, భవిష్యత్తులో వారిలో ఆరోగ్యకరమైన అలవాట్లు పాదుకునేలా చేయడానికి తల్లిదండ్రులు చేయాల్సినవి, వారికి నేర్పాల్సినవి ఇవి... పళ్లు ఉదయం, సాయంత్రం ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయించాలి. బ్రష్ వెనక్కి ముందుకి కాకుండా, పళ్లపై బ్రష్‌ను గుండ్రంగా తిప్పుతున్నట్లుగా బ్రష్ చేయించడం అలవాటు చేయాలి. స్నానంప్రతిరోజూ స్నానం చేయించాలి. స్నానానికి గోరువెచ్చని నీళ్లు మంచివి. జుట్టుపిల్లల జుట్టును రోజూ పరిశుభ్రమైన దువ్వెనతో దువ్వాలి. అమ్మాయి జుట్టును మరీ టైట్‌గా దువ్వకూడదు. ఒకరి దువ్వెన మరొకరు వాడకూడదు.గోళ్లు చేతివేళ్ల గోళ్లను, కాలివేళ్ల గోళ్లను ప్రతివారం నెయిల్ కట్టర్‌తో కత్తిరిస్తూ ఉండాలి. మరీ లోపలికి కాకుండా చిగురు తగలకుండా జాగ్రత్తగా కత్తిరించాలి.దుస్తులుపిల్లలకు ఎప్పుడూ ఫ్రెష్ దుస్తులు తొడగాలి. ఆడుకుని చెమటతో తడిసినవాటిని ఎప్పటికప్పుడు మార్చాలి. ఉతికిన బట్టలు ఎండలో సరిగా ఆరకపోతే అవి కాస్త వాసన వేస్తుంటాయి. అలాంటివి తొడగకూడదు. నిద్రపిల్లలు ప్రతిరోజూ ఒకేవేళకు నిద్రపోయేలా అలవాటు చేయాలి. వాళ్లను కంటినిండా నిద్రపోనివ్వాలి. నిద్రలోనే వాళ్ల మెదడు వికాసం, చదివినది గుర్తుపెట్టుకునేలా మెదడులో స్థిరపడటం జరుగుతాయి.(చదవండి: నలత లేకుండా చలాకీగా..!)