సాధారణంగా పిల్లల్లో 95 శాతం మంది దాదాపుగా ఐదారేళ్ల వయసు వచ్చేసరికి నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ (బ్లాడర్ కంట్రోల్) సాధిస్తారు. కానీ నాలుగు శాతం మంది పిల్లల్లో ఇది కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా కొద్దిమందిలో అంటే... ఒక శాతం (1%) మందిలో పెద్దయ్యాక కూడా నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ సాధించడం సాధ్యం కాకపోవచ్చు. దాంతో కాస్తపెద్దయ్యాక కూడా... అంటే 10 – 12 ఏళ్లు వచ్చాక కూడా కొందరు పిల్లలు రాత్రివేళ పక్క తడుపుతుంటారు. ఇలా పిల్లలు రాత్రిపూట నిద్రలో మూత్రవిసర్జన చేసే సమస్యను వైద్యపరిభాషలో ‘నాక్టర్నల్ అన్యురిసిస్’ అంటారు. ఇది అబ్బాయిల్లో ఎక్కువ. ఇది కుటుంబంలో ఎవరికైనా ఉంటే... అలాంటి కుటుంబాల్లో 50 శాతం మందిలో... వాళ్ల పిల్లల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది.
అన్యురిసిస్ సమస్యలోనూ రెండు రకాలు ఉంటాయి. మొదటిది ‘ప్రైమరీ అన్యురిసిస్. రెండోది సెకండరీ అన్యురిసిస్. ప్రైమరీ అన్యురిసిస్ : చిన్నారులు ఒక్క రోజు కూడా విడవకుండా ప్రతిరోజూ పక్క తడుపుతుంటే దాన్ని ‘ప్రైమరీ అన్యురిసిస్’ అంటారు.
సెకండరీ అన్యురిసిస్ : ఇలా రాత్రుళ్లు పక్క తడిపే పిల్లలు కొన్నాళ్ల పాటు పక్కతడపకుండా బాగానే ఉండి, కొంతకాలానికి వాళ్లలో సమస్య మళ్లీ తిరగబెట్టడాన్ని ‘సెకండరీ అన్యురిసిస్’గా చెప్పవచ్చు. ఇలా సెకండరీ అన్యురిసిస్ సమస్య రావడానికి తల్లిదండ్రుల మధ్య సయోధ్య లేకపోవడం, ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోవడం, కుటుంబంలోకి తమ్ముడో, చెల్లెలో వచ్చినప్పుడు కలిగే ఈర్ష్య (సిబ్లింగ్ జెలసీ) వంటి కారణాలతో పిల్లల్లో నెలకొన్ని మానసిక ఆందోళన వంటి అంశాలను ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
ప్రైమరీ అన్యురిసిస్‌కు కారణాలు...
ప్రైమరీ అన్యురిసిస్‌కు పిల్లల్లో నాడీ సంబంధమైన వికాసం కాస్త ఆలస్యంగా జరుగుతుండటం అంటే న్యూరోనల్ మెచ్యురేషన్ డిలే, మూత్రం ఉత్పత్తి కాస్త ఎక్కువగా జరుగుతుండటం (ఇన్‌క్రీజ్‌డ్ యూరిన్ ్ర΄÷డక్షన్), బ్లాడర్ సామర్థ్యం కాస్త తక్కువగా ఉండటం (డిక్రీజ్‌డ్ బ్లాడర్ కెపాసిటీ)తో పాటు జన్యుపరమైన అంశాలు కూడా ఇందుకు కారణమవుతాయి.
ఇతర కారణాలు...
ఇలా పెద్దయ్యాక కూడా రాత్రి నిద్రలో పక్కతడిపే సమస్య ఉన్న 20 శాతం మంది పిల్లల్లో యూరినరీ ట్రాక్ అబ్‌నార్మాలిటీస్, బ్లాడర్ డిస్‌ఫంక్షన్, నిద్రకు సంబంధించిన రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్), యాంటీ డైయూరెటిక్ హార్మోన్ (ఏడీహెచ్) లోపాలు, మానసికమైన కారణాలు, మలబద్ధకం, కొన్ని సందర్భాల్లో అడినాయిడ్స్ వల్ల నిద్ర సంబంధమైన సమస్యలు (స్లీప్ ఆప్నియా) వంటివి ఉన్నప్పుడు కూడా రాత్రివేళల్లో తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు.
పిల్లల్లో ఈ సమస్య ఉంటే మూత్రపరీక్షలతో పాటు హార్మోనల్ స్టడీస్ చేయించడం, బ్లాడర్ అనాటమీ అండ్ ఫంక్షనల్ టెస్ట్ చేయించడం అవసరం. వాటిని బట్టి ఇది హార్మోన్లకు సంబంధించిన సమస్యా, కాదా అని తెలుసు
కోవచ్చు.
ఈ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
∙నిద్రలో మూత్రవిసర్జన చేసే పిల్లలను కించపరచడం, శిక్షించడం వంటివి అస్సలు చేయకూడదు. ∙సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్రవాహారం చాలా తక్కువగా ఇవ్వడం, నాలుగు దాటాక కెఫిన్, చక్కెర ఉన్న పదార్థాలు పూర్తిగా ఇవ్వకపోవడం అవసరం. రోజులో తీసుకునే ద్రవపదార్థానికి 20 శాతానికి మించి 5 గంటల తర్వాత ఇవ్వకూడదు. ∙పడుకునేముందు ఒకసారి మూత్రవిసర్జన చేయించడం, నిద్రపోయిన గంటలోపు లేపి మళ్లీ ఒకసారి మూత్రవిసర్జన చేయించడం వల్ల పక్క తడిపే అవకాశాలను తగ్గించవచ్చు.
మేనేజ్‌మెంట్ / కేర్...
ఇటీవల అందుబాటులోకి వచ్చిన అలారం వంటి పరికరాలతో బ్లాడర్‌పై నియంత్రణ సాధించేలా ప్రాక్టీస్ చేయించాలి. దీంతోపాటు డెస్మోప్రెసిన్, ఇమెప్రమిన్ వంటి కొన్ని మందులు బాగా పనిచేస్తాయి.
అలాంటి పిల్లలను కొన్ని స్ప్రేల సహాయంతో సామాజిక ఉత్సవాలకు నిర్భయంగా తీసుకెళ్లవచ్చు. అలాంటి చర్యల వల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ∙ఈ సమస్యకు హార్మోన్‌లోపాలు కారణం అయితే 3–6 నెలలపాటు మందులు వాడటం వల్ల ఈ సమస్యను 50 శాతం మందిలో సమర్థంగా అదుపు చేయవచ్చు.
∙
Comments
Please login to add a commentAdd a comment