Urination Incident
-
డయాబెటిస్ లేకపోయినా..తరచు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందా?
తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తే దాన్ని కిడ్నీ సమస్యగా అనుమానించాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారిలో సహజంగానే ఇలా జరుగుతుంది. కనుక ఆ వ్యాధి ఉందో, లేదో చెక్ చేయించుకోవాలి. ఒకవేళ డయాబెటిస్ లేకపోయినా మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందంటే.. దాన్ని కిడ్నీ సమస్యగా అనుమానించాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ముఖం అంతా వాపులకు గురై ఉబ్బిపోయి కనిపిస్తుంది. కాలి మడమలు, కాళ్లు, పాదాలు, చేతులు ఉబ్బిపోయి కనిపిస్తాయి కిడ్నీ సమస్యలు ఉంటే తీవ్రమైన అలసట వస్తుంది. కొందరిలో రక్తహీనత సమస్య కూడా ఏర్పడుతుంది చర్మం పొడిగా మారి దురదలు పెడుతుంది ∙నోటి దుర్వాసన ఉంటుంది ∙కిడ్నీ సమస్యలు ఉంటే కొందరిలో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కొందరికి తల తిరిగినట్లు అనిపిస్తుంది కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో వెన్ను నొప్పి వస్తుంటుంది వాంతి వచ్చినట్టుగా... వికారంగా అనిపిస్తుంది కిడ్నీ సమస్యలు ఉంటే శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది కిడ్నీ సమస్యలు ఉన్నవారు వేడి వాతావరణంలో ఉన్నప్పటికీ చలిగా అనిపిస్తుంది. కొందరు వణుకుతారు. పైన తెలిపిన లక్షణాలు కనుక ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి వారి సలహా మేరకు సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అవసరం అయితే మందులను వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను తినాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. (చదవండి: ఆరోగ్య చిట్కాలు చెప్పనున్న సమంత.. అందుకోసం..!) -
బాలున్ని చితకబాది.. ఒంటిపై మూత్రం పోసి..
లక్నో: ఉత్తరప్రదేశ్, మీరట్‌లో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ బాలునిపై దాడి చేసి మూత్రం పోశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 13న బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో బాలునిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆ రోజు రాత్రి బాధితుడు ఇంటికి కూడా వెళ్లలేదు. మరునాడు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. కానీ యూరినేషన్ ఘటనను మాత్రం బయటకు వెల్లడించలేదు. తాజాగా బాలునిపై మూత్రం పోసిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విషయం బయటకు వచ్చింది. వీడియో బయటకు వచ్చిన తర్వాత బాధితుడు పోలీసులకు అసలు విషయాన్ని బయటపెట్టాడు. కొందరు దుండగులు తనను బందించి శరీరంపై మూత్రం పోశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనకు పాల్పడినవారిలో బాలుని స్నేహితులు ఉన్నారని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వీడియో ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. బాలురు గొడవ పడటానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇదీ చదవండి: Lightning Strikes In Gujarat: అకాల వర్షాలు.. పిడుగుపాటుకు 20 మంది మృత్యువాత -
రైలులో మద్యం మత్తులో...
ఝాన్సీ: ఇటీవల విమానంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన సంఘటన గురించి విన్నాం. అలాంటి ఘటనపై ఉత్తరప్రదేశ్‌లో రైలులో జరిగింది. 19 ఏళ్ల రితేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఏసీ కంపార్ట్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తూ కింది బెర్తుపై నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. అతడిని అరెస్టు చేశామని ఆరీ్పఎఫ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. అయితే, అతడు ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని తేలినట్లు చెప్పారు. మూత్ర విసర్జన ఘటన జరగ్గానే దంపతులు రైలులో ఉన్న టీటీఈకి ఫిర్యాదు చేశారు టీటీఈ ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు సమాచారం చేరవేశాడు. రైలు ఝాన్సీ స్టేషన్‌కు చేరుకోగా పోలీసులు రితేశ్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. రైల్వే చట్టం ప్రకారం జరిమానా చెల్లించిన రితేశ్‌ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. -
సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. మద్యం మత్తులో దంపతులపై..
లక్నో: ఇటీవలి కాలంలో విమానాల్లో కొందరు వ్యక్తులు తోటి ప్రయాణీకులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు చూశాం. పక్కన వారితో మూత్ర విసర్జన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే ఇప్పుడు రైలులో చోటుచేసుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు అభ్యంతరకంగా ప్రవర్తించాడు. పీకలదాకా మద్యం తాగి తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు. అయితే, యూపీకి చెందిన ఓ వృద్ధ దంపతులు ఢిల్లీ వెళ్లేందుకు గత బుధవారం సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. వీరు ఏసీ బోగీలో ప్రయాణిస్తుండగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు.. లోయర్ బెర్త్‌లో పడుకున్న ఆ దంపతులపై, వారి వస్తువులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. దీంతో, వారు ఒక్కసారిగా షాకయ్యారు. A drunk passanger allegedly urinated on an elderly woman travelling with her husband in Nizamuddin-bound 12447 Uttar Pradesh Sampark Kranti express. The passanger was deboarded at Jhansi railway station. He was later booked and arrested. pic.twitter.com/H7jggmhJaO — Piyush Rai (@Benarasiyaa) October 6, 2023 మరోవైపు.. ఈ దారుణ ఘటనను గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే కోచ్ అటెండెంట్, టీటీఈకి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దంపతులకు సాయం చేశారు. అనంతరం.. ఘటనకు పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఝాన్సీ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితుడిని ఢిల్లీకి చెందిన రితేశ్‌గా గుర్తించారు. మహోబాలో రైలెక్కిన అతడు అప్పటికే మద్యం తాగి ఉన్నాడని తోటి ప్రయాణికులు తెలిపారు. రితేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక, ఈ ఘటనలో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
Hyderabad Metro: మూత్ర విసర్జన కోసం మరో ప్లాట్‌ఫాంకు..
ఖమ్మంలీగల్: నిత్యం వేల నుంచి లక్షల మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రోకు ఊహించని జరిమానా పడింది. ఓ ప్రయాణికుడ్ని ఇబ్బంది పెడుతూ.. అతని మెట్రోకార్డు నుంచి 10రూ. కట్ చేసినందుకు ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే.. నాలుగేళ్ల కిందటి నాటి ఈ ఘటనలో తీర్పు తాజాగా వెల్లడైంది. ఖమ్మంకు చెందిన న్యాయవాది వెల్లంపల్లి నరేంద్రస్వరూప్ 2019 జనవరి 10న హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఎల్బీ.నగర్ మెట్రో రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించాక తూర్పు వైపు దారిలో టాయిలెట్లు లేక మరోవైపు వెళ్లాడు. ఈక్రమంలో మెట్రో అధికారులు జారీ చేసిన కార్డు మరోసారి స్వైప్ చేయాల్సి వచ్చింది. ఆపై పాత మార్గానికి వచ్చేందుకు ఇంకో సారి స్వైప్ చేశాడు. ఈమేరకు కార్డు నుంచి రూ.10 మినహాయించుకుంది హైదరాబాద్ మెట్రో. అయితే, తాను రైలు ఎక్కాల్సిన మార్గంలో టాయిలెట్లు లేక వెళ్లినందున అదనంగా డబ్బులు తీసుకున్నారని, రోజు వేలాది మందికి ఇలాగే జరుగుతోందని నరేంద్ర ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసును పరిశీలించి వసూలు చేసిన రూ.10 తిరిగి ఇచ్చేయడమే కాకుండా.. అసౌకర్యానికి రూ.5వేలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5వేలు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత బుధవారం తీర్పు ఇచ్చారు. సదరు పరిహారాన్ని 45 రోజుల్లోగా బాధితుడికి అందించాలని హైదరాబాద్ మెట్రోను ఆదేశించారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులకు కనిపించేలా డిస్ప్లే బోర్డులు పెట్టాలని హైదరాబాద్ మెట్రోకు సూచించింది ఖమ్మం వినియోగదారుల కమిషన్. -
'యూరిన్ పోసి.. ఎమ్మెల్యే కాళ్లు నాకించారు..' దళితునిపై దారుణం..
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. రక్షించాల్సిన పోలీసే ఓ దళిత వ్యక్తిపై అమానవీయంగా ప్రవర్తించాడు. బాధితునిపై యూరిన్ పోశాడు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే కాళ్లు నాకించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై క్రై బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపాల్ మీనా, పోలీసు అధికారి శివకుమార్ భరద్వాజపై కేసు నమోదు చేశారు. తాను పొలంలో పనిచేస్తుండగా.. పోలీసులు వచ్చి ఓ గదిలోకి తీసుకెళ్లారని బాధితుడు(51) ఫిర్యాదులో తెలిపారు. అక్కడ డీఎస్పీ శివ కుమార్ భరద్వాజ తనపై యూరిన్ పోసి అవమానించాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే గోపాల్ మీనా ఆ ప్రాంతానికి రాజని.. అతని మాటకు ఎదురులేదని చెప్తూ ఎమ్మెల్యే బూట్లు నాకించారని పోలీసులకు తెలిపాడు. తన ఫోన్‌ను లాక్కున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు తెలిపాడు. మొదట పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను నేరుగా కోర్టునే ఆశ్రయించినట్లు తెలిపాడు. ఫిర్యాదు చేసిననాటి నుంచి బెదిరింపులు వస్తున్నాయని నిందితులకు భయపడే జూన్ 30న ఈ ఘటన జరగగా.. జులై 27న ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెల్లడించాడు. తన కుటుంబ సభ్యులను కూడా వేదిస్తున్నారని తెలిపాడు. అయితే.. దళిత వ్యక్తిపై నిందితులు ఈ ఘటనకు పాల్పడటానికి కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు.. -
దారుణం: 'మీ పైసలు తియ్యలే..!' మూత్రం తాగించి.. మిరపకాయలతో..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ నగర్లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేశారనే అనుమానంతో ఇద్దరు బాలరను బలవంతంగా యూరిన్ తాగిస్తూ, వారి ప్రైవేటు భాగాల్లో పచ్చి మిరపకాయలను రుద్దారు దుండగులు. జిల్లాలోని పత్రా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంకటి చౌరాహా ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులను తాడుతో కట్టేశారు. వారి వయస్సు 10 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుంది. బాటిళ్లలో నింపిన యూరిన్‌ను బలవంతంగా పిల్లలచే తాగించారు. బూతులు తిడుతూ పచ్చి మిరపకాయలను వారి ప్రైవేట్ శరీర భాగాల్లో రుద్దారు. పసుపు రంగులో ఉండే ఏదో ద్రావణాన్ని కూడా బాధితుల శరీరంలోకి ఎక్కించినట్లు వీడియోలో చూపబడిందని పోలీసులు తెలిపారు. బాధితులు అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ పాశవిక ఘటనపై స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తును చేపట్టారు. నిందితులను గుర్తించినట్లు వెల్లడించారు. ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సిద్దార్థ తెలిపారు. ఇదీ చదవండి: అవయవ మార్పిడికి దేశంలో 56 వేల మంది వెయిటింగ్ -
విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం పోసిన విద్యార్థులు
జైపూర్: తోటి విద్యార్థిని పట్ల కొందరు విద్యార్థులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె మంచినీళ్ల బాటిల్లో మూత్రం పోశారు. ఈ ఘటన రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లా లుహారియా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక స్కూలులో చదువుకుంటోంది. శుక్రవారం కొందరు విద్యార్థులు ఆమె మంచి నీళ్ల బాటిల్లో మూత్రం కలిపారు. ఇది తెలియని బాలిక ఆ నీళ్లు తాగింది. దుర్వాసన రాగా ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది. తన పుస్తకాల బ్యాగులో ప్రేమ లేఖ కూడా ఉన్నట్లు తెలిపింది. స్పందించకపోవడంతో కుటుంబసభ్యులకు తెలిపింది. వారు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తహశీల్దారు, పోలీసులకు కూడా వారు తెలిపారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అనుమానితుల ఇళ్లపై రాళ్ల దాడికి దిగారు. -
విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం..
జైపూర్: రాజస్థాన్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ విద్యార్థులు తమ క్లాస్‌మెట్ బాలిక వాటర్ బాటిల్లో యూరిన్ కలిపారు. ఆ విషయం తెలవని బాలిక ఆ నీటిని తాగింది. అంతేకాకుండా ఈ విషయాన్ని తెలుపుతూ రాసిన లవ్ లెటర్ని కూడా బాలిక తన బ్యాగులో గుర్తించింది. ఈ ఘటనపై స్థానికులు దుండగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్వారా జిల్లాలోని లుహారియా గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. పాఠశాలలో లంచ్ బ్రేక్‌లో ఓ విద్యార్థిని తాగే వాటర్ బాటిల్లో కొంత మంది విద్యార్థులు మూత్రం కలిపారు. ఆ విషయం తెలియక ఆ బాలిక వాటిని తాగేసింది. దుర్వాసన పసిగట్టిన బాలిక.. తన బ్యాగులో ఉన్న లవ్ లెటర్లో పేర్కొన్న ఆ విషయాన్ని నిర్ధారించుకుంది. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా.. ఆయన సరైన చర్యలేవీ తీసుకోలేదు. ఈ వ్యవహారంపై స్థానికులు సోమవారం పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. ఆనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. నిందితులపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై దాడి చేయడానికి జనం వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో లాఠీఛార్జీ కూడా జరిగింది. ఈ ఘటనలో జనం రాళ్లు రువ్వుకున్నారు. అయితే.. బాధితులు ఇప్పటికీ ఫిర్యాదు చేయలేదని ఏఎస్పీ జ్ఞాణశ్యామ్ శర్మ తెలిపారు. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం! -
ట్రాన్స్జెండర్ల పైశాచికం.. గుండు కొట్టించి.. ఆపై మూత్ర విసర్జన చేసి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఐదుగురు ట్రాన్స్‌జండర్లు కలిసి ఓ వ్యక్తికి గుండు కొట్టింటారు. అనంతరం అతనిపై మూత్రం పోశారు. అంతేకాకుండా బాధితుని వద్ద నుంచి రూ.10 వేలు దోచుకెళ్లారు. జులై 26న ఈ ఘటన జరిగింది. కాగా.. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు రాఫికుల్.. నిందితురాలి ఇంట్లో పనిచేసేవాడు. ఇటీవల అక్కడ పని మానేసి మరో ట్రాన్స్జండర్ ఇంట్లో పనిచేయడం ప్రారంభించాడు. ఈ మార్పుపై కోపాన్ని పెంచుకున్న నిందితురాలు.. రాఫికుల్ని మార్గమధ్యలో పట్టుకుని గుండు కొట్టించింది. అనంతరం అతనిపై మూత్రం పోశారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా మూత్రం తాగాలని ఒత్తిడి చేసినట్లు వెల్లడించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసుల దృష్టికి వెళ్లింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్.. -
ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన
లక్నో: మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఓ వ్యక్తి గిరిజనుడిపై మూత్రం పోసిన సంఘటన మరువక ముందే ఆగ్రాలో అలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది. అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఉన్న ఓ వ్యక్తిపై మూత్రం పోస్తూ వీడియో తీసుకున్నాడు మరో ప్రబుద్ధుడు. మానవత్వానికి కళంకంగా నిలిచే సంఘటనలు ఒకదాని వెంట మరొకటి చోటు చేసుకంటూనే ఉన్నాయి. సమాజంలో ఇప్పటికీ వివక్షలు చాపకింద నీరులా ప్రబలుతూనే ఉన్నాయి. మొన్న మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి అమానుషంగా గిరిజనుడిపై మూత్రం పోసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగడంతో సదరు నిందితుడు కటకటాల పాలవడమే కాకుండా అతని ఇల్లు కూడా నేలమట్టం చేశారు. ఒకపక్క ఇటువంటి చర్యలపై చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొంతమంది వాటిని ఖాతరు చేయడం లేదు. మధ్యప్రదేశ్ ఉదంతం గురించి తెలిసి కూడా ఆగ్రాలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిద్రిస్తున్న మరో వ్యక్తిని కాలితో నిర్దాక్షిణ్యంగా తన్నుతూ ముఖం మీద మూత్రం పోశాడు. దీన్ని అతని స్నేహితుడు వీడియో తీశాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మూత్రం పోసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని వెతుకులాట కొనసాగుతోందని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వీడియో ఇప్పటిది కాదని మూడు నాలుగు నెలల క్రితం వీడియో అని ఇప్పుడు వైరల్ అయ్యిందని చెబుతూ మూత్రం పోసిన వ్యక్తిని ఆదిత్యగా, వీడియో తీసిన వ్యక్తి అటుస్ గా గుర్తించినట్టు తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్ -
విమానంలో టాయిలెట్ వాడొద్దన్న సిబ్బంది.. మహిళ ఏం చేసిందంటే..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ మహిళను టాయిలెట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు అందులోని ఫ్లైట్ అటెండెంట్లు. రెండు గంటలపాటు ఓపిక పట్టిన ఆ మహిళ ఇంక ఆపుకోలేక విమానం ఫ్లోర్ మీదే మూత్రవిసర్జన చేసింది. క్యాబిన్ క్రూ బృందంలోని ఒకరు ఈ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో ఫ్లైట్లలో జరుగుతున్న విచిత్ర సంఘటనలు కొన్ని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఓ ప్రయాణికుడు ఫుల్లుగా తాగి తోటి ప్రయాణికుడి మీద మూత్రం పోయడం, ప్రయాణికులను మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయిన పైలట్.. ఇలా వరుసగా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా స్పిరిట్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్‌లో జరిగిన అలాంటి ఓ సంఘటన హెడ్ లైన్స్ లో నిలిచింది. జులై 20న స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆఫ్రికన్ అమెరికా మహిళ ఒకరు తనకు టాయిలెట్ అర్జెంటని అక్కడి సిబ్బందితో చెప్పగా వారు ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే అనుమతించడం కుదరదని చెప్పారు. అలాగే ఆమెను నీళ్లు ఎక్కువగా తాగమని లేదంటే మూత్రవిసర్జన చేసినప్పుడు ఫ్లైటంతా దుర్వాసన వస్తుందని కూడా ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఆమె చాలాసేపు ఓపికపట్టి కూర్చుంది. ఆలా రెండు గంటలు ఓపిగ్గా ఎదురు చూసిన తర్వాత కూడా సిబ్బంది టాయిలెట్‌కు అనుమతించకపోవడంతో ఆమె ఫ్లోర్ మీదనే మూత్రవిసర్జన చేసింది. అనంతరం ఫ్లైట్ సిబ్బంది ప్రశ్నించగా.. మీ అనుమతి కోసం ఎంతసేపు ఆగాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సదరు మహిళ. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు ఇష్టానుసారంగా స్పందిస్తున్నారు. ఫ్లైట్ సిబ్బంది తీరు అమానుమని కొందరంటే.. మా పెంపుడు పిల్లి చాలా శుభ్రాన్ని పాటిస్తుందని మరొకరు కామెంట్ చేశారు. ఎవరో ఎదో అన్నారని కాదుగానీ టాయిలెట్ విషయంలో ఇరుపక్షాల్లో నిర్లక్ష్యం సరికాదని అత్యధికులు స్పందించడం కొసమెరుపు. 🇺🇸 ÉCART CIVILISATIONNEL : 20/07/2023 Une Afro-américaine à bord d'un vol @SpiritAirlines urine sur le sol parce qu'elle ne veut pas attendre qu'ils ouvrent les toilettes après le décollage. Les hôtesses de l'air, quant à elles, lui disent qu'elle devrait boire de l'eau "parce… pic.twitter.com/EQbPGy0NFK — Valeurs Occidentales (@ValOccidentales) July 21, 2023 ఇది కూడా చదవండి: భారత సైనికులకు ఇటలీ ఘన నివాళి -
మూత్రవిసర్జన ఘటన.. ఊహించని ట్విస్ట్
ఇవాళ ప్రభుత్వం మాకు న్యాయం చేసింది. సంతోషం.. కానీ కొన్నాళ్ల పోయాక ఈ ఘటన నుంచి మీడియా, పోలీసులు, ప్రజలందరి దృష్టి మళ్లిపోతుంది. అప్పుడు మా పరిస్థితి ఏంటి.. భయంతో బతకాల్సిందేనా?.. అంటూ తన పూరి గుడిసె ముందు కూర్చుని కళ్లలో భయంతో ప్రశ్నిస్తున్నాడు 35 ఏళ్ల దశ్మత్ రావత్. మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాలో చోటుచేసుకున్న హేయనీయమైన ఘటన.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుబ్రి గ్రామానికి చెందిన గిరిజనుడైన దశ్మత్ రావత్‌పై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేయడం.. ఆ వీడియో కాస్త విపరీతంగా వైరల్ కావడం తెలిసిందే. ఈ ఘటన పెనుదుమారం రేపగా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితుడి ఇంటికి సంబంధించి కొంత పోర్షన్‌ను అక్రమ కట్టడంగా పేర్కొంటూ బుల్డోజర్ కూల్చేయించింది. ప్రవేశ్‌ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టింది కూడా. ఇక ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ కోరడంతో ఈ ఘటన ఇంకా హైలెట్ చర్చగా మారింది. అయితే ఈ ఘటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు ప్రవేశ్ శుక్లాను విడిచిపెట్టాలంటూ దశ్మత్ రావత్.. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ‘జరిగిందేదో జరిగింది. అతను తన తప్పు తెలుసుకున్నాడు. ఇకనైనా అతన్ని క్షమించి వదిలిపెట్టాలి అని మీడియా ద్వారా రావత్ ప్రభుత్వాన్ని కోరాడు. అతను చేసింది తప్పే కదా అని మీడియా అడగ్గా.. ‘‘అవునూ.. అతను చేసింది ముమ్మాటికీ తప్పే. అది నేనూ ఒప్పుకుంటా. అతను మా ఊరి పూజారి. అందుకే అతన్ని విడుదల చేయమని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా’’ అని రావత్ చెబుతున్నాడు. పైగా ఆ ఘటన ఈ మధ్య జరిగింది కాదని.. ఎప్పుడో 2020లో జరిగిందని చెప్పాడను. అది 2020లో. ఓ రాత్రిపూట పదిగంటల సమయంలో ఓ దుకాణం వద్ద నేను కూర్చున్నా. అతను నా దగ్గరకు వచ్చి నాపై మూత్రం పోశాడు. ఆ సమయంలో నేను అతని ముఖం కూడా చూడలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. తన తప్పు తాను తెలుసుకున్నాడతను. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటోంది ఒక్కటే.. అతన్ని విడిచిపెట్టి మా ఊరికి మంచి రోడ్డు వేయమని అని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడతను. ఇప్పుడంటే ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, మీడియా తనకు ధైర్యం చెబుతుందని, కొన్నాళ్లకు అందరూ విషయం మర్చిపోయిన తర్వాత వాళ్లు మామీద కక్ష సాధిస్తే ఎవరు బాధ్యులని ఆందోళన వ్యక్తం చేశాడు. తాము, తమ పిల్లలు సంతోషంగా ఉండాలంటే మాకు ఎవరితో గొడవలు వద్దని అన్నాడు. అందుకే జరిగిందేదో జరిగింది నిందితుడిని వదిలేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపాడు. మరోవైపు రోజు 100, 200 రూపాయలు సంపాదిస్తేనేగానీ తమ కుటుంబం గడవదని.. అలాంటిది ఊరిలో ఎవరితో తమకు శత్రుత్వం వద్దని భార్య ఆశా సైతం వాపోతోంది. ऐसे पापी दुनिया में बहुत हैं मुख्यमंत्री शिवराज सिंह चौहान किसका _ किसका पैर धोएंगे !#ArrestGoluGurjar#GoluGurjar #MPNews #SidhiUrineCase #SidhiMP #Gwalior #शिवराज pic.twitter.com/vdkrDzO890 — Viral Notebook (@NotebookVi42149) July 8, 2023 ఇదిలా ఉంటే.. మూత్ర విసర్జన ఘటన పెనుదుమారం రేపడం వెనుక రాజకీయ విమర్శలు కారణం అయ్యాయి. నిందితుడు బీజేపీకి చెందిన వ్యక్తి అంటూ కాంగ్రెస్.. కాదు కాంగ్రెస్‌వి ఉత్త ఆరోపణలే అని బీజేపీ పరస్పరం విమర్శించుకున్నాయి. ఇక బాధితుడు రావత్ కాళ్లను సీఎం చౌహాన్ కడగడాన్ని కూడా కాంగ్రెస్ డ్రామాగా అభివర్ణించింది. ప్రభుత్వంపై బ్రహ్మణ సంఘాల మండిపాటు నిందితుడు శుక్లా ఇంటి పోర్షన్‌ను అక్రమ భాగమంటూ కూల్చివేయడంపై బ్రహ్మణ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. శుక్లా చేసింది పాపపు పనే అయినప్పటికీ.. ఆయన కుటుంబ సభ్యులను శికక్షించాల్సిన అవసరం ఏముందంటూ నిరసన చేపట్టారు. ఇదిలా ఉంటే.. ఐపీసీ సెక్షన్లతో పాటు ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు నేషనల్ సెక్యూరిటీ చట్టం కింద ప్రవేశ్ శుక్లాపై కఠినమైన నేరారోపణలు నమోదు అయ్యాయి. आदिवासी व्यक्ति की सरकार से अपील गांव के ब्राह्मण हैं छोड़ दीजिए जो हुआ सो हुआ...#news #news14today #news #ShivrajSinghChouhan #mutrakand #aadiwasi pic.twitter.com/La1cijtI1b — NEWS14TODAY (@news14_today) July 8, 2023