వాషింగ్టన్: అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ మహిళను టాయిలెట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు అందులోని ఫ్లైట్ అటెండెంట్లు. రెండు గంటలపాటు ఓపిక పట్టిన ఆ మహిళ ఇంక ఆపుకోలేక విమానం ఫ్లోర్ మీదే మూత్రవిసర్జన చేసింది. క్యాబిన్ క్రూ బృందంలోని ఒకరు ఈ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇటీవలి కాలంలో ఫ్లైట్లలో జరుగుతున్న విచిత్ర సంఘటనలు కొన్ని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఓ ప్రయాణికుడు ఫుల్లుగా తాగి తోటి ప్రయాణికుడి మీద మూత్రం పోయడం, ప్రయాణికులను మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయిన పైలట్.. ఇలా వరుసగా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా స్పిరిట్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్లో జరిగిన అలాంటి ఓ సంఘటన హెడ్ లైన్స్ లో నిలిచింది.
జులై 20న స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆఫ్రికన్ అమెరికా మహిళ ఒకరు తనకు టాయిలెట్ అర్జెంటని అక్కడి సిబ్బందితో చెప్పగా వారు ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే అనుమతించడం కుదరదని చెప్పారు. అలాగే ఆమెను నీళ్లు ఎక్కువగా తాగమని లేదంటే మూత్రవిసర్జన చేసినప్పుడు ఫ్లైటంతా దుర్వాసన వస్తుందని కూడా ఉచిత సలహా ఇచ్చారు.
దీంతో ఆమె చాలాసేపు ఓపికపట్టి కూర్చుంది. ఆలా రెండు గంటలు ఓపిగ్గా ఎదురు చూసిన తర్వాత కూడా సిబ్బంది టాయిలెట్‌కు అనుమతించకపోవడంతో ఆమె ఫ్లోర్ మీదనే మూత్రవిసర్జన చేసింది. అనంతరం ఫ్లైట్ సిబ్బంది ప్రశ్నించగా.. మీ అనుమతి కోసం ఎంతసేపు ఆగాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సదరు మహిళ. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు ఇష్టానుసారంగా స్పందిస్తున్నారు.
ఫ్లైట్ సిబ్బంది తీరు అమానుమని కొందరంటే.. మా పెంపుడు పిల్లి చాలా శుభ్రాన్ని పాటిస్తుందని మరొకరు కామెంట్ చేశారు. ఎవరో ఎదో అన్నారని కాదుగానీ టాయిలెట్ విషయంలో ఇరుపక్షాల్లో నిర్లక్ష్యం సరికాదని అత్యధికులు స్పందించడం కొసమెరుపు.
🇺🇸 ÉCART CIVILISATIONNEL : 20/07/2023 Une Afro-américaine à bord d'un vol @SpiritAirlines urine sur le sol parce qu'elle ne veut pas attendre qu'ils ouvrent les toilettes après le décollage. Les hôtesses de l'air, quant à elles, lui disent qu'elle devrait boire de l'eau "parce… pic.twitter.com/EQbPGy0NFK
— Valeurs Occidentales (@ValOccidentales) July 21, 2023
ఇది కూడా చదవండి: భారత సైనికులకు ఇటలీ ఘన నివాళి
Comments
Please login to add a commentAdd a comment