aeroplane
-
చిరిగిన సీటు ఇస్తారా..?ఎయిర్ఇండియాపై మంత్రి ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియాపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టిన చౌహాన్ తర్వాత దానిని డిలీట్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.ఎయిర్ఇండియా ప్రయాణికులను మోసం చేస్తోంది.ఇటీవల తాను భోపాల్ నుంచి ఢిల్లీ రావడం కోసం ఎయిర్ఇండియా విమానం ఏఐ436లో ఒక సీటు బుక్ చేసుకున్నాను.తీరా విమానం ఎక్కి చూస్తే ఆ సీటు చినిగిపోయి కిందకు నొక్కుకొనిపోయి ఉంది. ఈ విషయమై విమానం సిబ్బందిని అడిగితే ఈ సమస్య ఇప్పటికే మేనేజ్మెంట్ దృష్టిలో ఉందని, ఆ సీటు ఎవరికీ విక్రయించొద్దని సమాచారమిచ్చినట్లు చెప్పారు’అని శివరాజ్‌సింగ్ చౌహాన్ వెల్లడించారు.ఈ వ్యవహారంపై ఎయిర్ఇండియా సంస్థ వెంటనే స్పందించింది. మంత్రి చౌహాన్‌కు క్షమాపణలు చెప్పింది.కాగా ఎయిర్ఇండియా విమానయాన సంస్థ గతంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేది. ఈ సంస్థను టాటా గ్రూపు టేక్ఓవర్ చేసి ప్రస్తుతం నిర్వహిస్తోంది. తమ ఆధ్వర్యంలో నడిచే మరో విమానయాన సంస్థ ఎయిర్ విస్తారాను కూడా టాటాలు ఇటీవలే ఎయిర్ఇండియాలో విలీనం చేశారు. -
త్వరలో అమెరికా నుంచి వచ్చే జాబితాలో ఎంతమంది..?
న్యూఢిల్లీ:అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తోంది. ఇప్పటికే మిలిటరీ విమానంలో 104 మంది భారతీయులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే విమానంలో వచ్చిన వారికి సంకెళ్లు వేసి తీసుకురావడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం(ఫిబ్రవరి7) ఒక కీలక ప్రకటన చేసింది. త్వరలో మరో 487 మంది భారతీయ పౌరులను దేశం నుంచి తరలించాలన్న ఆదేశాలున్నాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ విషయాన్ని తమకు అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయని మిస్రీ చెప్పారు.అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించిన వారిని తొలుత అమెరికా తిప్పి పంపిందన్నారు. వారంతా అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమించారని అక్కడి ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అయితే భారతీయులను మిలిటరీ విమానంలో అవమానించే తరహాలో తీసుకురావడంపై దేశంలో రాజకీయ దుమారం రేపింది. కాగా, బుధవారం అమెరికా నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన సైనిక విమానంలో 105 మంది వలసదారులున్నారు. వీరిలో హరియాణా రాష్ట్రానికి చెందిన వాళ్లు 33 మంది ఉన్నారు. గుజరాత్(33), పంజాబ్(30), మహారాష్ట్ర(3), ఉత్తరప్రదేశ్(3), చండీగఢ్(2) రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు.అమెరికా తిరిగి పంపిన వారిలో 19 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు, ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న బాలికలున్నారు. ఇక్కడికొచ్చాక భారత అధికారులు పోలీసు వాహనాల్లో ఈ వలసదారులను స్వస్థలాలకు తరలించారు. -
అమెరికా విమానంలో.. ఆ రాష్ట్రాల వారే ఎక్కువ..!
అమృత్సర్:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల్లో భాగంగా అమెరికా పంపించిన ప్రత్యేక విమానంలో భారత్‌కు తిరిగి వచ్చిన వలసదారుల్లో ఎవరెవరున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం(ఫిబ్రవరి5) మధ్యాహ్నం 1.45గంటలకు అమృత్‌సర్‌లోని గురురామ్దాస్జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వలసదారులతో వచ్చిన అమెరికా విమానం ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.విమానంలో మొత్తం 205 మంది భారతీయలను అమెరికా నుంచి పంపించి వేశారని ప్రచారం జరిగింది. అయితే విమానంలో 104 మంది మంది భారతీయులే ఉన్నారు. 45 మంది దాకా అమెరికా అధికారులు కాగా, 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అయితే 104మంది భారతీయుల్లో మొదటి స్థానంలో గుజరాత్,హర్యానాకు చెందిన వారు ఎక్కువగా ఉండగా తర్వాతి స్థానంలో పంజాబ్‌కు చెందిన వారు ఉన్నారు.విమానంలో వచ్చిన వారిలో 4 ఏళ్ల వయసున్న చిన్నారి కూడా ఉండడం గమనార్హం. అమెరికా నుంచి అందరు భారతీయులకు స్వాగతం పలికామని, మన దేశానికి చెందిన వారిని ఇలా పంపించి వేయడం దురదృష్టకరమని పంజాబ్ డీజీపీ వ్యాఖ్యానించారు. అమెరికాలో భారత అక్రమ వలసదారుల ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. ఈ లెక్కన మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా అలా ఉంటోంది భారతీయులే. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ట్రంప్‌తో ఆయన ఈ అంశంపైనా చర్చించే అవకాశాలున్నాయి -
తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు
-
Trichy: ఎయిరిండియా విమానం.. సేఫ్ ల్యాండింగ్
చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్ పోర్టు ఎయిరిండియా విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. శుక్రవారం సాయంత్రం 5. 40 గంటలకు తిరుచ్చి నుంచి షార్జా బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్యలు ఉన్నాయని గుర్తించిన వెంటనే పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో AXB613 ఎయిరిండియా విమానం రెండు గంటలకుపైగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం అధికారులు సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావటంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.The Air India Express Flight IX 613 from Tiruchirapalli to Sharjah has landed safely at Tiruchirapalli airport. DGCA was monitoring the situation. The landing gear was opening. The flight has landed normally. The airport was put on alert mode: MoCA https://t.co/5YrpllCk2m pic.twitter.com/Q8O5N6zRo6— ANI (@ANI) October 11, 2024 There is no need to panic. Air India Express flight IX 613 is safely defueling by circling the airport, and once the fuel reaches the required level, a safe landing will be made. This is a standard safety procedure. #airindiaexpress #airindia #trichy #trichyairport pic.twitter.com/P8PDzhSfXJ— IOTA INFO (@iota_info) October 11, 2024అంతకు ముందు.. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సేఫ్ ల్యాండింగ్ కోసం అధికారులు ప్రయత్నాలు చేశారు. మిగతా విమానాలన్నీ ఇతర ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. విమానంలో ఉన్న ఇంధనాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో తిరుచ్చి ఎయిర్‌పోర్టులో హైఅలెర్ట్ ప్రకటించారు. పెద్దసంఖ్యలో అంబులెన్స్, పారా మెడికల్ సిబ్బందని ఏర్పాటు చేశారు.విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తిరుచ్చి గగనతలంపై తిరుగుతున్న విమానం 45 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. హైడ్రాలిక్ వైఫల్యం గురించి పైలట్ తిరుచ్చి ఎయిర్ స్టేషన్‌ను అప్రమత్తం చేశారని అధికారులు తెలిపారు.#WATCH | Tamil Nadu: Air India flight from Trichy to Sharjah faced a technical problem (Hydraulic failure) and is rounding in air space to decrease the fuel before landing at Trichy airport. More than 20 Ambulances and fire tenders are placed at the airport to make sure no big… pic.twitter.com/rEiF6mSZz2— ANI (@ANI) October 11, 2024 -
విమానంలో భారీ కుదుపులు.. ఏడుగురికి గాయాలు
బీజింగ్: సింగపూర్ నుంచి చైనాలోని గంగ్జూ పట్టణానికి వెళుతున్న స్కూట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం భారీ కుదుపులకు గురైంది. కదుపుల కారణంగా విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒక వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చించాల్సి వచ్చింది.గంగ్జూ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం భారీ కుదుపులకు గురైనట్లు సిబ్బంది తెలిపారు. ఫ్లైట్ రాడార్ వివరాల ప్రకారం 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 25వేల అడుగులకు వచ్చేసింది. వేగం కూడా ఒక్కసారిగా 500 నాట్స్ నుంచి 262 నాట్స్‌కు తగ్గింది. తర్వాత మళ్లీ 35 వేల అడుగుల ఎత్తుకు వెళ్లి 500 నాట్స్ వేగంతో ప్రయాణించింది. -
ఢిల్లీ-వైజాగ్ విమానానికి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ-విశాఖపట్నం ఎయిర్ఇండియా విమానానికి మంగళవారం(సెప్టెంబర్3) అర్ధరాత్రి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. అయితే ఈ బెదిరింపు ఆకతాయిలు చేసిన పనిగా అధికారులు తేల్చారు. విమానంలో బాంబు ఉందని తొలుత ఢిల్లీ పోలీసులకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో వారు తమను అప్రమత్తం చేసినట్లు వైజాగ్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. 107 మందితో ప్రయాణించిన విమానం విశాఖపట్నంలో షెడ్యూల్ ప్రకారం ల్యాండ్ అయింది.విమానం ల్యాండ్ అయి ప్రయాణికులందరు దిగిన తర్వాత తనిఖీలు నిర్వహించామని, అందులో పేలుడు పదార్ధాలేవీ లేవన్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది. -
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. టేకాఫ్ నిలిపివేత
పనాజి: గోవా డబోలిమ్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌కు సిద్ధమైన ఎయిర్ఇండియా విమానానికి పక్షి ఢీకొట్టింది. దీంతో విమానం గాల్లోకి ఎగరలేదు. ఈ ఘటన బుధవారం(ఆగస్టు14) తెల్లవాారుజామున 6.45గంటలకు జరిగింది. సౌత్‌గోవాలోని డబోలిమ్ విమానాశ్రయం నుంచి విమానం ముంబై వెళ్లాల్సిఉంది. రన్‌వేపైనే విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో టేకాఫ్ నిలిపివేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానానికి ఏవైనా రిపేర్లు అవసరమా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
విమానంలో మహిళ పట్ల జిందాల్ స్టీల్ సీఈవో పైత్యం : స్పందించిన సంస్థ
జిందాల్ గ్రూప్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు విమానంలో తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ కోలకతాకు చెందిన ఒక మహిళ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో శుక్రవారం ఒక పోస్ట్ పెట్టింది. దీంతో జిందాల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ నవీన్ జిందాల్ స్పందించారు. నిందితుడైన ఉద్యోగిపై "కఠినమైన చర్యలు" తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోల్‌కతా నుంచి అబుదాబీ వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు బాధితురాలు వెల్లడించింది. ఆమె అందించిన వివరాల ప్రకారం కోల్‌కతా నుంచి బోస్టన్‌కు అబుదాబీకి ఎతిహాద్ ఎయిర్వేస్కు చెందిన ట్రాన్సిట్ విమానంలో బయలుదేరింది. విమానంలో ఆమె పక్కన కూర్చున్న 65 ఏళ్ల వ్యక్తి తాను జిందాల్ స్టీల్ సీఈఓ దినేష్ కుమార్ సరయోగిని తాను పరిచయం చేసుకున్నాడు. కుటుంబం, నేపథ్యంలో అంటూ మెల్లిగా మాటలు కలిపాడు. తాను ఒమన్‌లో నివసిస్తున్నానని, కానీ తరచూ ప్రయాణిస్తుంటా అని చెప్పాడు. తన కొడుకులు పెళ్లిళ్లు అయ్యి, అమెరికాలో స్థిరపడ్డారు అంటూ కబుర్లు చెప్పాడు. ఇక ఆ తరువాత అతగాడి అసలు రూపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. ఆమెను అసభ్య చిత్రాలు చూడమని బలవంతం చేశాడు ఈ షాక్ నుంచి తేరుకునే లోపలే శరీరం చుట్టూ చేతులేసి అసభ్యకరంగా తాకాడు. దీంతో అక్కడినుంచి తప్పించుకుని వాష్‌రూమ్‌కి పారిపోయి విమానంలోని సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. విమానం అబుదాబీలో దిగే సమయానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అయితే తనకు బోస్టన్‌కు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతుందనే భయంతో లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మరోవైపు నిందితుడిపై అబుదాబి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.అయితే తనలాంటి పరిస్థితి మరి ఏ మహిళకు రాకూడదనే ఉద్దేశంతో సోషల్‌మీడియా వేదికగా బహిరంగంగా వెల్లడిస్తున్నట్టు తెలిపింది. దీనిపై స్పందించిన జిందాల్ గ్రూప్ చైర్మన్ ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి వాటిని కంపెనీ అస్సలు సహించదని స్పష్టం చేశారు. -
‘‘ఎడ్ల బండైనా ఎక్కుతాను.. ఎయిర్ ఇండియా విమానం ఎక్కను’’
బెంగళూరు: టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా విమానంలో ఎదురైన చేదు అనుభవంపై ఓ ప్రయాణికుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ ఎయిర్ఇండియా విమానం ఎక్కబోనని, దానికంటే ఎడ్లబండి నయం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య కొండవార్ అనే ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగి ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు. బెంగళూరు నుంచి పుణెకు వెళ్లడానికి ఎయిర్ఇండియా విమానం ఎక్కినపుడు ఎదురైన సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ‘నాకు గొప్ప గుణపాఠం చెప్పినందుకు థ్యాంక్యూ. చివరకు ఎడ్లబండి అయినా ఎక్కుతాను కానీ ఇంకెప్పుడు మీ విమానంలో ప్రయాణించను. అవసరమైతే డబుల్ పే చేసి టైమ్‌కి వచ్చే విమానాల్లో వెళ్తాను. Dear @AirIndiaX , Thank you for teaching me a very valuable lesson last nightNever and I mean it with all seriousness - I am never flying Air India Express or Air India in my life again - I will pay 100% extra cost if needed but will take other airlines that are on time (only…— Aditya Kondawar (@aditya_kondawar) June 25, 2024 జూన్ 24 రాత్రి 9.50 గంటలకు టేకాఫ్ కావాల్సిన విమానం అర్ధరాత్రి 12.20 గంటలు దాటిన తర్వాత బయల్దేరింది. ఎక్కిన తర్వాత విమానం మొత్తం ఒకటే వాసన. సీట్లు చాలా మురికిగా ఉన్నాయి. వాటి నిండా మరకలే. నాకు టాటా గ్రూప్‌పై అమితమైన గౌరవం ఉంది. అలాగే వారినుంచి ఎప్పుడూ నాణ్యమైన సేవలను ఆశిస్తాను. కానీ నా అనుభవం మాత్రం భయంకరం’అని పోస్టులో తెలిపారు. ఈ పోస్టుపై ఎయిర్ ఇండియా స్పందించింది. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా పరిధిలోలేని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని దయచేసి గమనించండి. మీకు ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. ఎయిరిండియాలో ప్రయాణించొద్దనే నిర్ణయంపై పునరాలోచించండి’అని కోరింది. -
ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత.. విమానంలో సాంకేతిక లోపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్డోగ్రా వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో విమానం బయలుదేరడం రెండు గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏసీ పనిచేయకపోవడంతో విమానంలో గాలి లేక కొందరు అస్వస్థతకు గురయ్యారు. విమానం డోర్ మూసివేయడంతో వేడి తీవ్రత ఎక్కువైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. ‘ప్రయాణికుల భద్రతకు ఇండిగో ప్రాధాన్యతనిస్తుంది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’అని తెలిపింది. -
Bihar: ఒకే విమానంలో ఢిల్లీకి నితీశ్, తేజస్వి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(జూన్5) సాయంత్రం జరిగే ఎన్డీఏ,కూటమిల సమావేశాల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి నేతలు బయలుదేరారు. ఎవరి కూటమి సమావేశంలో ఆ కూటమికి చెందిన నేతలు పాల్గొంటారు. ఇదే విషయమై అయితే బిహార్‌లో మాత్రం ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమి భేటీలో పాల్గొనేందుకు సీఎం నితీశ్‌కుమార్, ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ఒకే విమానంలో ఢిల్లీకి బయలుదేరడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ పరిణామంతో ఎవరు ఎవరిని ఏ కూటమి వైపు తీసుకెళ్తారనే చర్చ మొదలైంది. అయితే తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని జేడీయూ నేత కేసీ త్యాగి ఇప్పటికే స్పష్టం చేశారు. తాను ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరానని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ క్లారిటీ ఇచ్చారు. -
నిలిచిపోయిన విమానం.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 8 గంటలు ఆలస్యమైంది. ప్రయాణికులు ఎక్కిన తర్వాత విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఎంతకూ కదలకపోవడంతో క్యాబిన్ లోపల వారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.తర్వాత కొద్ది సేపటికి విమానం నుంచి ప్రయాణికులను దిగాల్సిందిగా సిబ్బంది కోరారు. విమానం నుంచి దిగిన వారంతా ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులైతే అలసిపోయారు. విమానంలో ఎయిర్‌కండీషన్ కూడా పనిచేయకపోవడంతో తమ పరిస్థితి మరీ దయనీయంగా మారిందని ప్రయాణికుల్లోని ఓ జర్నలిస్టు ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ఈ పోస్టును విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్యాగ్ చేశారు.ఎయిర్ఇండియా ప్రైవేటైజేషన్ పూర్తగా ఫెయిలైందనడానికి ఇది నిదర్శనమని ఫైర్ అయ్యారు. ఈ పోస్టుకు స్పందించిన ఎయిర్ఇండియా సంస్థ తమ విమానం ఆలస్యమవడంపై విచారం వ్యక్తం చేసింది. ఇటీవలే ముంబై నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ఇండియా విమానం కూడా ఆరు గంటలు ఆలస్యమైంది. ఈ విమానంలో కూడా ఏసీ లేకుండా ప్రయాణికులు ఆరు గంటల పాటు ఇబ్బందులు పడుతూ కూర్చోవాల్సివచ్చింది. -
విమానంలో నగ్నంగా పరుగెత్తిన ప్రయాణికుడు
పెర్త్: ఆస్ట్రేలియాలోని ఓ విమానంలో ఒక ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు. అంతటితో ఆగకుండా సిబ్బందిని కిందకు తోసేసి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో జరిగింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి మెల్బోర్న్కు వీఏ 696 విమానం సోమవారం(మే27) రాత్రి బయలుదేరింది. పెర్త్‌లో విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరిగెత్తాడు. అడ్డుకున్న సిబ్బందిని తోసేశాడు. అతడి చేష్టలతో తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. విమాన సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎయిర్‌పోర్టుకు చేరుకుని నగ్నంగా పరుగులు తీసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
అవును! అతను.. విమానాల్లో లోకం చుట్టిన వీరుడు..!
విమానాల్లో అత్యధిక దూరం ప్రయాణించిన ఈ పెద్దమనిషి పేరు టామ్ స్టూకర్. అమెరికాలోని న్యూజెర్సీవాసి. ప్రస్తుతం ఇతడి వయసు 69 ఏళ్లు. విమాన ప్రయాణాల మీద మక్కువతో 1990లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నుంచి 2.90 లక్షల డాలర్లకు (రూ.2.41 కోట్లు) లైఫ్‌టైమ్ పాస్ తీసుకున్నాడు.ఇక అప్పటి నుంచి తోచినప్పుడల్లా విమానాల్లో దేశాదేశాలను చుట్టేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు ఇతగాడు విమానాల్లో ఏకంగా 20 మిలియన్ మైళ్లకు (3.21 కోట్ల కిలోమీటర్లు) పైగా ప్రయాణాలు చేశాడు. ప్రపంచంలోనే అత్యంత విరివిగా విమాన ప్రయాణాలు చేసే వ్యక్తిగా రికార్డులకెక్కాడు. లైఫ్‌టైమ్ పాస్ కోసం అప్పట్లో తాను పెద్దమొత్తమే చెల్లించినా, అలా చెల్లించడం వల్ల ఇప్పటి వరకు లెక్కిస్తే తనకు 2.44 మిలియన్ డాలర్లు (రూ.20.30 కోట్లు) మిగిలినట్లేనని టామ్ చెప్పడం విశేషం. అతి తక్కువ లగేజీతో తాను ప్రయాణాలు చేస్తానని, చేసే ప్రయాణాల కంటే, ప్రయాణాల్లో మనుషులను కలుసుకోవడం తనకు చాలా ఇష్టమని అతడు చెబుతాడు.ఇవి చదవండి: అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే! -
ఇండిగో టికెట్ ధర తగ్గింపు.. కారణం ఇదే..
విమాన టికెట్లపై సంస్థలు ప్రత్యేకంగా ఫ్యూయెల్ ఛార్జీను వసూలు చేస్తూంటాయి. అయితే గత మూడునెలలుగా విమానాల్లో వాడే జెట్ ఇంధనం/ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధరను కేంద్రం తగ్గిస్తోంది. అందులో భాగంగా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన వినియోగదారుల కోసం టికెట్లపై విధించే ఫ్యూయెల్ ఛార్జీలను తొలగించినట్లు ప్రకటించింది. గురువారం నుంచే తొలగింపు నిర్ణయం అమల్లోకి వచ్చిందని సంస్థ తెలిపింది. కేంద్ర తీసుకుంటున్న నిర్ణయంతో తన వినియోగదారులకు సైతం మేలు జరగాలని ప్రత్యేక ఛార్జీని తొలగించినట్లు ఇండిగో తెలిపింది. అయితే, ఏటీఎఫ్ ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది. కాబట్టి టికెట్ల ధరలనూ అందుకు అనువుగా సవరిస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: తీవ్ర ఒడిదుడుకుల్లో చమురు మార్కెట్లు విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరను ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు జనవరిలో 4 శాతం తగ్గించాయి. ఇప్పటి వరకు దిల్లీలో కిలోలీటరు ధర రూ.1,06,155.67 కాగా, రూ.4162.50 తగ్గించడంతో రూ.1,01,993.17కు చేరింది. -
బ్రిడ్జి కింద ఇరుక్కున్న ఎయిరిండియా విమానం.. భారీగా ట్రాఫిక్‌జామ్
Airplane Viral Video: బీహార్‌లో నిన్న శుక్రవారం ఒక విచిత్రమైన ఘటన జరిగింది. మోతీహరి ప్రజలు సరికొత్త అనుభూతిని ఎదుర్కొన్నారు . నడిరోడ్డుపై ఎయిరిండియా విమానం సందడి చేసింది. అయితే ఓ బ్రిడ్జి కింద అది ఇరుక్కుపోవడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడగా.. కొందరు మాత్రం తమ ఫోన్లకు పని చెప్పారు. అయితే అదేం ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న విమానం కాదు. కాలపరిమితి ముగిసి.. పాడైపోయిన ఎయిరిండియా ఏ320 విమానం. ఆ భారీ విమానాన్ని ముంబై నుంచి అసోంకు ఓ ట్రక్కులో తరలించే యత్నం చేశారు. అయితే మోతీహరి పిప్రాకోటి ప్రాంతానికి చేరుకున్నాక.. అక్కడి ఓవర్ బ్రిడ్జి కింద ఆ విమానంతో కూడిన ట్రక్కు దాటేందుకు ఇబ్బంది ఎదురైంది. దీంతో.. ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రక్కు డ్రైవర్ పొరపాటు వల్లే ట్రాఫిక్ విఘాతం ఏర్పడిందని అధికారులు తెలిపారు. मुंबई से ले जाते समय एक्स-एयर इंडिया A320 का धड़ मोतिहारी में एक पुल के नीचे फंस गया#AirIndia #Motihari #Mumbai #HindiNews #BreakingNews #Bihar #biharnews #PlaneVideo #Motihari #MotihariAirplaneStuck #viralvideo pic.twitter.com/YYoBFGNKCd — Khushbu_journo (@Khushi75758998) December 30, 2023 పోయిన నెలలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి ఓ ఘటనే జరిగింది. ఓ పాత విమానాన్ని కొచ్చిన్ నుంచి ట్రాలీ లారీపై హైదరాబాద్ తరలిస్తుండగా బాపట్ల జిల్లాలోని ఓ అండర్ పాస్ వద్ద ఇరుక్కుపోయింది. పాత విమానాన్ని హోటల్‌గా మార్చాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌కు చెందిన ‘పిస్తాహౌస్’ దీనిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో దీనిని హైదరాబాద్ తరలిస్తుండగా బాపట్ల మేదరమెట్ల బైపాస్‌లోని అండర్ పాస్ వద్ద విమానాన్ని తరలిస్తున్న ట్రాలీ ఇరుక్కుపోయింది. దీంతో.. విమానానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా దానిని అండర్ పాస్ నుంచి బయటకు తెచ్చారు. -
Video: ఏడు గంటలు ఆలస్యంగా విమానం.. ప్రయాణికులు రచ్చ రచ్చ!
ఢిల్లీ: విమానం ఆలస్యం కావడంపై ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులు రచ్చ రచ్చ చేశారు. సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. ఏకంగా ఏడు గంటలు విమానం ఆలస్యం గురించి తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని పేర్కొంటూ సహనం కోల్పోయిన ప్రయాణికులు సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పైస్‌జెట్‌కు చెందిన SG-8721 విమానం ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సి ఉంది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు రావాల్సి ఉంది. కానీ ఏకంగా ఏడు గంటలు ఆలస్యంతో విమానాశ్రయానికి వచ్చింది. దీంతో సహనానికి కోల్పోయిన ప్రయాణికులు సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఆలస్యం గురించి తమకు ముందే ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగారు. మధ్యాహ్నం 3:00 సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. #WATCH | Delhi | "Today at about 3:10 pm, it came to notice that a group of passengers bound for Patna by Spicejet airline flight no. SG-8721/STD were creating nuisance at domestic boarding gate 54. On query, it was learnt that the flight was delayed for more than 7 hrs as the… pic.twitter.com/bugwhjdYOK — ANI (@ANI) December 1, 2023 ప్రయాణికుల ఆందోళనలతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది వారిని అదుపు చేశారు. విమానం ఆలస్యం కావడంపై ఎయిర్‌లైన్స్ కూడా స్పందించింది. నిన్న రాత్రి షెడ్యూల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఆలస్యంపై ముందుగానే ప్రయాణికులకు తెలియజేశామని స్పష్టం చేసింది. దీని ప్రకారం తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ప్రయాణికులను ఇప్పటికే కోరామని ఓ ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం ప్రారంభం -
"విమానాన్నే ఇల్లుగా మార్చేశాడు"..అందుకోసం ఏకంగా..
ఇంతకుమునుపు విన్నాం ఓ సాధారణ కూలీ ఏకంగా విమానంలాంటి ఇల్లుని నిర్మించాడని. అందుకోసం ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చాడు. కానీ ఇక్కడొక వ్యక్తికి అసలు విమానాన్నే ఇల్లుగా మార్చుకుంటే అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను కార్యరూపం ఇచ్చి మరీ తన సృజనాత్మకతకు జోడించి విలాసవంతమైన ఇల్లుగా మార్చాడు. చూస్తే అక్కడ విమానం ఆగిందేమో అనుకునేలా ఆ ఇల్లు ఉంటుంది. లోపలకి చూస్తే ఇల్లులా ఉంటుంది. అద్భతం కదా! అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, ఆ విమానం ఎక్కడది? తదితర సందేహాలు వచ్చేస్తున్నాయా!..ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం!. అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బ్రూస్ క్యాంపెబెల్కి చిన్నప్పటి నుంచి పాత వస్తువులను కొత్తవాటిగా మార్చడం అతని ప్రత్యేకత. సరుకులు రవాణా చేసే విమానమే ఇల్లుగా మార్చాలనే ఓ డ్రీమ్ ఉంది. హెయిర్ స్టయిలిస్ట్ జాన్ ఉస్సేరీ.. బోయింగ్ 727 విమానాన్ని కొనుగోలు చేసి ఇల్లుగా మార్చకుందని, ఆమె ఇల్లు అగ్రిప్రమాదంలో కాలిపోవడంతో ఇలా వినూత్నంగా ఆలోచించి రూపొందించదని విన్నాడు. అదే క్యాపెంబెల్కు విమానాన్ని ఇల్లుగా మార్చే ఆలోచనకు పురికొల్పింది. అందుకోసం క్యాపెంబెల్ ఒరెగాన్లోని హిల్స్‌బోరో అడవుల్లో 10 ఎకరాల భూమిని 23 వేల డాలర్లు(రూ. 19 లక్షలు)కు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒలింపిక్ ఎయిర్వేస్ నుంచి బోయింగ్ 727 విమానాన్ని లక్ష డాలర్లకు(రూ. 85 లక్షలకు) కొనుగోలు చేశాడు. అయితే ఆ విమానాన్ని ఒరెగాన్లోని అడవులకు తీసుకువచ్చే రవాణా ఖర్చులు మాత్రం తడిసిమోపడయ్యాయి. అయిన వెనుకడుగు వేయలేదు క్యాంప్‌బెల్. చేయాలనుకుంది చేసే తీరాలని గట్టి సంకల్పంతో ఉన్నాడు క్యాంప్‌బెల్. ఇక ఆ విమానాన్ని ఎన్నో ప్రయాసలు పడి ఆ అడవులకు చేర్చాక దాన్ని ఇల్లులా మర్చే పనికి ఉపక్రమించాడు. ఎలాగో విమానంలో సీట్లు టాయిలెట్లు ఉంటాయి కాబట్టి ఇక వాషింగ్ మిషన్, షింక్ వంటివి, కిచెన్‌కి కావల్సిన ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటే చాలని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ విధంగానే దాన్ని అత్యంత విలాసవంతమైన ఇల్లులా మార్చేశాడు. క్యాంపెబెల్ వంట చేసేందుకు మైక్రోవేవ్, టోస్టర్‌ని ఉపయోగిస్తాడు. అద్భుతమైన భారీ "ఎయిర్‌ప్లేన్ హోం" చూపురులను కట్టేపడేసేంత ఆకర్షణగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇకెందుకు ఆలస్యం మీరు కూడా క్యాంపెబెల్లా ప్లేన్హోం లాంటి లగ్జరీ ఇల్లును కట్టుకునేందుకు ట్రై చేయండి మరీ. (చదవండి: అక్కడ వరదలా.. వీధుల గుండా "వైన్ ప్రవాహం"..షాక్‌లో ప్రజలు) -
తిరుమల ఆలయంపై విమానం సంచారం...తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీటీడీ
-
సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రయాణికులను వదిలేసి ఇండిగో విమానం టేకాఫ్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో విమానయాన సంస్థల నిర్లక్ష్యం ప్రయాణికులకు సంకటం కలిగిస్తోంది. 6 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా ఇండిగో విమానం వెళ్లిపోయింది. బెంగళూరు నుంచి మంగళూరుకు వెళ్లే ఇండిగో 6ఈ 6162 విమానంలో ప్రయాణించడానికి 6 మంది టికెట్లు బుక్ చేసుకుని విమానాశ్రయంలో వేచి ఉన్నారు. కానీ విమానం 12 నిమిషాలు ముందుగా టేకాఫ్ తీసుకుంది. దీంతో 6 మంది ఆ సంస్థ సిబ్బందిని నిలదీయడంతో వారిని మరో విమానంలో మంగళూరుకు పంపించారు. -
ఆ విమానంలో ప్రయాణం.. గంటన్నరపాటు నరకం అంటున్న ప్యాసింజర్లు
ఇటీవల విమాన ప్రయాణికులకు సంబంధించిన అంశాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రయాణికులు అసభ్యకరంగా ప్రవర్తించడమో, లేదా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమో లాంటి ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అనంతరం వీటిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే వీటిని పునరావృతం కాకుండా మాత్రం చేయలేకపోతున్నారు అధికారులు. తాజాగా ఇండిగో విమానంలోని ప్యాసింజర్లు గంటకు పైగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఇండిగో విమానంలో చండీఘడ్ నుంచి జైపూర్ వెళుతుండగా ఈ పరిస్థితి ఎదురైనట్టు సమాచారం. దీనిపై పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ రాజా వార్రింగ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముందంటే... విమానంలో ఏసీలు పనిచేయకపోవడంతో తాము 90 నిమిషాల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. తొలుత తాము విమానంలోకి వెళ్లేందుకు దాదాపు 15 నిమిషాల వరకు సెగలు కక్కుతున్న వాతావరణంలో క్యూలో నిలబడాల్సి వచ్చిందన్నారు. ఆ తరువాత ఏసీ ఆన్‌లో లేనప్పటికీ విమానాన్ని టేకాఫ్ చేసినట్లు చెప్పారు. అమరీందర్ సింగ్ దీనిపై స్పందిస్తూ.. ‘‘విమానం బయలుదేరిన సమయం నుంచి ప్రయాణం ముగిసే వరకూ ప్రయాణికులందరూ ఏసీ లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంత పెద్ద సమస్యను ఎవరు పట్టించుకోలేదు. శ్వేదం తుడుచుకునేందుకు మా అందరికీ ఎయిర్‌హాస్టస్ బోలెడన్ని టిష్యూ పేపర్లు ఇచ్చింది. ప్రయాణికులు తమ వద్ద ఉన్న పేపర్లు, టిష్యులతో విసురుకుంటూ కనిపించారు’’ అసలు విమానంలో ఈ పరిస్థితి ఏంటో నాకు అర్థంకావడంలేదన్నారు. కాగా ఈ ట్వీట్‌ను డీజీసీఏ, ఏఏఐలను కూడా ట్యాగ్ చేశారు. కొంద మంది ప్రయాణికులు 90 నిమిషాలు నరకం అనుభవించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం సంభవించడం ఇది మూడవది. శుక్రవారం ఢిల్లీ వెళ్లే ఇండిగో విమానాన్ని పాట్నాలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానం టేకాఫ్ అయిన మూడు నిమిషాల తర్వాత ఈ అత్యవసర ల్యాండింగ్ జరిగింది. ఈ విమానం ఉదయం 9.11 గంటలకు పాట్నాలోని జై ప్రకాష్ నారాయణ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి రాంచీకి తిరిగి వస్తున్న మరో విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన అరగంట తర్వాత, పైలట్ ఈ విషయాన్ని ప్రకటించాడు. విమానాన్ని తిరిగి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువెళుతున్నట్లు చెప్పాడు. Had one of the most horrifying experiences while traveling from Chandigarh to Jaipur today in Aircraft 6E7261 by @IndiGo6E. We were made to wait for about 10-15 minutes in the queue in the scorching sun and when we entered the Plane, to our shock, the ACs weren't working and the… pic.twitter.com/ElNI5F9uyt — Amarinder Singh Raja Warring (@RajaBrar_INC) August 5, 2023 -
విశాఖ విమానాశ్రయం రన్‌వే రీ సర్వీసింగ్.. 4 నెలల పాటు ఆంక్షలు
సాక్షి, విశాఖపట్నం: రక్షణశాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం అంతార్జాతీయ విమానాశ్రయంలో పదేళ్లకోసారి నవీకరణ పనులు జరగనున్నాయి. రన్‌వే పునరుద్ధరణ కోసం పనులు జరుగుతున్న నేపథ్యంలో రాత్రి సమయంలో విమానాలు నాలుగు నెలలకు పైగా నిలిపివేయనున్నారు. దాదాపు నాలుగు నెలలపాటు (నవంబర్ 15 నుంచి మార్చి నెలాఖరు వరకు) రీ-సర్వీసింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మూసివేయాలని నేవీ ప్రతిపాదించింది. దీంతో విశాఖ - సింగపూర్ విమానంతో పాటు , 12 సర్వీసులు నిలిచిపోతాయి. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమాన సేవలతో పాటు కోల్‌కతా, పుణె విమాన సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. మరో వైపు విశాఖ ఆర్ధిక వ్యవస్థ, వివిధ వ్యాపారాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో విమానాశ్రయాన్ని రాత్రి 10.30 నుంచి ఉదయం 6.30 వరకు పరిమితం చేస్తే కొంతవరకు ఉపశమనం ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా వైజాగ్ ఎయిర్‌పోర్టు భారత నావికాదళం అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. నేవీకి సంబంధించిన యుద్ధ విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఐఎన్ఎస్ డేగా రన్‌వే నుంచే కార్యకలాపాలు సాగిస్తాయి. పౌర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కూడా ఈ రన్ వే మీదుగానే జరుగుతాయి. నావికాదళం ప్రతి పదేళ్లకు ఓసారి తమ రన్‌వేలకు రీ-సర్ఫేసింగ్ పనులను చేపడుతుంది. చదవండి: వైజాగ్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ -
ప్రపంచంలోనే తొలిసారిగా విద్యుత్‌తో నడిచే విమానం
ప్రపంచంలోనే తొలి విద్యుత్ విమాన సేవలు మరో రెండేళ్లలో ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ నుంచి ఎడిన్బర్గ్ వరకు ఈ విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. కాలుష్యానికి దారితీసే పెట్రో ఇంధనాల వాడుకను పూర్తిగా నిలిపివేయాలనే లక్ష్యంతోనే పూర్తి విద్యుత్ విమాన సేవలను ప్రారంభించేందుకు ‘ఎకోజెట్’ సంస్థ సన్నాహాలు చేస్తోంది. బ్రిటిష్ సంపన్నుడు డేల్ విన్స్ ఈ కంపెనీని నెలకొల్పారు. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు భూరి విరాళాలు అందిస్తూ వస్తున్న డేల్ విన్స్, కర్బన ఉద్గారాలను విడుదల చేయని విమాన సేవలను అందించడానికి స్వయంగా రంగంలోకి దిగారు. ఈ విమాన సేవలు సౌతాంప్టన్–ఎడిన్‌బర్గ్‌ల మధ్య 2025 నుంచి ప్రారంభం కానున్నాయని విన్స్ ప్రకటించారు. ‘ఎకోజెట్’ రెండు రకాల విమానాల ద్వారా ఈ సేవలను అందించనుంది. పంతొమ్మిది సీట్ల సామర్థ్యం గల విమానాలు, డెబ్బయి సీట్ల సామర్థ్యం గల విమానాలు ఈ సేవల కోసం ‘ఎకోజెట్’ వాహనశ్రేణిలో కొలువుదీరనున్నాయి. ఈ విమానాల్లోని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తవుతుంది. ఈ విద్యుత్తుతోనే విమానాలు నిరాటంకంగా రాకపోకలు సాగించగలుగుతాయి. ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా పాత విమానాలకు మరమ్మతులు చేసి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ను అమర్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నామని ‘ఎకోజెట్’ అధికారులు చెబుతున్నారు. ఈ విమానాల వల్ల పర్యావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల పరిమాణం ఏడాదికి 90వేల టన్నుల వరకు తగ్గుతుందని వారు అంటున్నారు. -
విమానంలో టాయిలెట్ వాడొద్దన్న సిబ్బంది.. మహిళ ఏం చేసిందంటే..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ మహిళను టాయిలెట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు అందులోని ఫ్లైట్ అటెండెంట్లు. రెండు గంటలపాటు ఓపిక పట్టిన ఆ మహిళ ఇంక ఆపుకోలేక విమానం ఫ్లోర్ మీదే మూత్రవిసర్జన చేసింది. క్యాబిన్ క్రూ బృందంలోని ఒకరు ఈ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో ఫ్లైట్లలో జరుగుతున్న విచిత్ర సంఘటనలు కొన్ని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఓ ప్రయాణికుడు ఫుల్లుగా తాగి తోటి ప్రయాణికుడి మీద మూత్రం పోయడం, ప్రయాణికులను మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయిన పైలట్.. ఇలా వరుసగా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా స్పిరిట్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్‌లో జరిగిన అలాంటి ఓ సంఘటన హెడ్ లైన్స్ లో నిలిచింది. జులై 20న స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆఫ్రికన్ అమెరికా మహిళ ఒకరు తనకు టాయిలెట్ అర్జెంటని అక్కడి సిబ్బందితో చెప్పగా వారు ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే అనుమతించడం కుదరదని చెప్పారు. అలాగే ఆమెను నీళ్లు ఎక్కువగా తాగమని లేదంటే మూత్రవిసర్జన చేసినప్పుడు ఫ్లైటంతా దుర్వాసన వస్తుందని కూడా ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఆమె చాలాసేపు ఓపికపట్టి కూర్చుంది. ఆలా రెండు గంటలు ఓపిగ్గా ఎదురు చూసిన తర్వాత కూడా సిబ్బంది టాయిలెట్‌కు అనుమతించకపోవడంతో ఆమె ఫ్లోర్ మీదనే మూత్రవిసర్జన చేసింది. అనంతరం ఫ్లైట్ సిబ్బంది ప్రశ్నించగా.. మీ అనుమతి కోసం ఎంతసేపు ఆగాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సదరు మహిళ. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు ఇష్టానుసారంగా స్పందిస్తున్నారు. ఫ్లైట్ సిబ్బంది తీరు అమానుమని కొందరంటే.. మా పెంపుడు పిల్లి చాలా శుభ్రాన్ని పాటిస్తుందని మరొకరు కామెంట్ చేశారు. ఎవరో ఎదో అన్నారని కాదుగానీ టాయిలెట్ విషయంలో ఇరుపక్షాల్లో నిర్లక్ష్యం సరికాదని అత్యధికులు స్పందించడం కొసమెరుపు. 🇺🇸 ÉCART CIVILISATIONNEL : 20/07/2023 Une Afro-américaine à bord d'un vol @SpiritAirlines urine sur le sol parce qu'elle ne veut pas attendre qu'ils ouvrent les toilettes après le décollage. Les hôtesses de l'air, quant à elles, lui disent qu'elle devrait boire de l'eau "parce… pic.twitter.com/EQbPGy0NFK — Valeurs Occidentales (@ValOccidentales) July 21, 2023 ఇది కూడా చదవండి: భారత సైనికులకు ఇటలీ ఘన నివాళి -
రోజు కూలీ.. విమానం లాంటి ఇంటిని కట్టుకున్నాడు
విమానంలో ప్రయాణించాలనే ముచ్చట చాలామందికే ఉంటుంది. కానీ, అతడికి విమానంలో నివాసం ఉండాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. ఎగిరే విమానంలో నివాసం ఏర్పరచుకోవడం ఎలాగూ కుదిరే పని కాదు కనుక విమానంలాంటి ఇంటిని నిర్మించుకున్నాడు. తన కలల నివాసాన్ని నిర్మించుకోవడానికి కంబోడియాకు చెందిన ఆండ్ క్రాచ్ పోవ్ దాదాపు ముప్పయ్యేళ్లు కష్టపడ్డాడు. మొత్తానికి ఇన్నాళ్లకు నేలకు ఇరవై అడుగుల ఎత్తున ఎగురుతున్న విమానంలాంటి భవంతిని నిర్మించుకున్నాడు. దీని నిర్మాణం కోసం తన పదమూడో ఏట నుంచి డబ్బు కూడబెట్టడం ప్రారంభించాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఖర్చుల కోసం ఇచ్చిన చిల్లర డబ్బు మొదలుకొని పెద్దయ్యాక భవన నిర్మాణాలు సహా రకరకాల పనులు చేసి 7.84 కోట్ల రియెల్స్ (రూ.15.63 లక్షలు) పోగు చేశాడు. ఆ డబ్బుతోనే ఈ ఇంటిని నిర్మించుకుని, తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. భవన నిర్మాణంలో అనుభవం ఉన్న పోవ్ ఈ ఇంటిని నిర్మిస్తున్నప్పుడు చుట్టుపక్కల జనాలు ఇతడిని ఒక పిచ్చోడిలా చూశారు. నిర్మాణం పూర్తవుతున్న దశలో ఈ ఉదంతం పోవ్ నివాసం ఉండే సీమ్ రీప్ ప్రావిన్స్‌లో సంచలన వార్తగా మారింది. తన ఇంటికి దగ్గర్లోనే ఒక కాఫీ షాపును ఏర్పాటు చేయాలనుకుంటున్నానని, త్వరలోనే అసలు విమానంలో ఎగరాలనే తన కలను కూడా నిజం చేసుకుంటానని పోవ్ మీడియాకు చెబుతున్నాడు. -
విమాన ప్రయాణం.. మధ్యలో లేచి డబ్బులు కావాలంటూ
కొన్ని కార్యక్రమాలకు విరాళాలు సేకరించడం మనకు తెలిసిన విషయమే. ఇలాంటివి సాధారణంగా రోడ్లపైనో లేదా బస్సుల్లో సేకరిస్తూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వీటికి భిన్నంగా ఏకంగా విమానంలో విరాళాలు అడుగడం ప్రారంభించాడు. అయితే అతను నెట్టింట ఫేమ్ కోసం ఇలా చేశాడా లేదా నిజంగానే విరాళాల కోసం ఇలా చేశాడో తెలియదు గానీ.. ఈ వీడియో మాత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంతగా క్షీణించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడి ప్రజలకు రెండు పూటలా భోజనం తినడం కూడా కష్టంగా మారిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఓ పాకిస్తాన్ వ్యక్తి విమానంలో ప్రయాణిస్తుండగా.. సడన్‌గా లేచి విరాళాల కోసం ప్రసంగాన్ని ప్రారంభించాడు. ‘మేము మదర్సా కట్టడం కోసం విరాళాలు సేకరిస్తున్నాం. మీరు డబ్బు ఇవ్వదలచుకుంటే నా వద్దకు వచ్చి ఇవ్వనవసరం లేదు. నేనే మీరు కూర్చున్న చోటుకు వస్తాను. నేనేమీ భిక్షాటన చేయడం లేదు. నాకు సాయం చేయండి’ అంటూ అభ్యర్థించడం మొదలు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మరో వైపు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అటు ఐఎంఎఫ్‌తో పాటు స్నేహపూర్వక దేశాల నుంచి రుణాలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి సమయంలో ఈ వీడియో వైరల్ అవడంతో దీనిపై పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. Viral video whereby a Pakistani can be seen begging in a flight; Says I am not a beggar but need money to make a madrasas in Pakistan. pic.twitter.com/hUB3ZzVJGn — Megh Updates 🚨™ (@MeghUpdates) July 13, 2023 చదవండి ఇలా అయ్యిందేంటి.. ముఖానికి సర్జరీ.. అక్కడ వెంట్రుకలు మొలుస్తున్నాయ్! -
ఆఫర్ అంటే ఇది.. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే టమాటాలు ఫ్రీ!
చెన్నై: సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు చిత్రవిచిత్రమైన ఆఫర్లతో పాటు బోలెడు డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. ఏదేమైనా మార్కెట్లో పోటీని తట్టుకుని ముందుకు సాగాలనుకుంటున్నాయి. అందుకే మార్కెటింగ్ పరంగా ట్రెండింగ్ అంశాలపై ఫోకస్ పెడుతున్నాయి కొన్ని సంస్థలు. ప్రస్తుతం టమాటా ఊహించని ధర పలుకుతూ అందరికీ షాకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ దేశీయ విమాన సంస్థ తమ వద్ద ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న వారికి టమాటాలు ఫ్రీ అంటూ ఆఫర్‌ను ప్రకటించాయి. మదురైలో దేశీయ విమాన టిక్కెట్ బుకింగ్‌కు కిలో టమాటా, అంతర్జాతీయ విమాన బుకింగ్‌కు 1.5 కిలోల టమాటాలు ఇవ్వనున్నట్లు ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటింంది. వివరాలు.. తమిళనాడులో టమాటా ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో తక్కువ ధరకు టమాటాలను పంపిణీ చేస్తోంది. ఈ స్థితిలో మదురైలోని ఓ ట్రావెల్ సంస్థ ఇక్కడ విమాన టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటన విడుదల చేసింది. డొమెస్టిక్ ఫ్లైట్ బుకింగ్‌కు కిలో టమాట, విదేశీ విమానాలకు 1.5 కిలో ఉన్నట్లు పేర్కొంది. కాగా కొత్త ఆఫర్‌కు ప్రయాణికుల నుం మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ ప్రకటించడం గమనార్హం. చదవండి: ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
తప్పిన ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై దొర్లిన విమానం!
బెంగళూరు: బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఓ విమానం సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా వెనక్కి మళ్లింది. అంతేకాకుండా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా.. రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. వివరాల్లోకి వెళితే.. హాల్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్న ప్రీమియర్ 1ఏ విమానం వీటీ-కేబీఎన్‌లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విమానం టేకాఫ్ అయిన తర్వాత నోస్ ల్యాండింగ్ గేర్‌ను వెనక్కి తీసుకోలేనందున ఎయిర్‌టర్న్‌బ్యాక్‌లో చిక్కుకుంది. దీంతో విమానాన్ని తక్షణమే వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రన్‌వేపై నీరు నిలిచింది. ఆ నీటిలోనే విమానం ముందుకుసాగింది. అయితే విమానపు నోస్ ల్యాండింగ్ గేర్ సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ముందుకు దొర్లింది. అయితే అదృష్టవశాత్తు చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు. ప్రయాణికులెవరూ లేరని డీజీసీఏ తెలిపింది. Bengaluru | A Fly By wire Premier 1A aircraft VT-KBN operating flight on sector 'HAL Airport Bangalore to BIAL' was involved in Airturnback as the nose landing gear couldn't be retracted after take off. The aircraft safely landed with the nose gear in Up position. There were two… pic.twitter.com/53zmaaKKEn — ANI (@ANI) July 11, 2023 చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
విమానం టేకాఫ్ అవుతున్న టైంలో ఉన్నారా? అంతే సంగతి..
విమానం టేకాఫ్ అవుతుండగా సమీపంలో ఎవరూ ఉండరు. ఎందుకంటే దాని ఇంజన్ నుంచి వచ్చే గాలి ఫోర్స్‌కి తాళ్లలేం. అందుకే ఎయిర్ పోర్ట్ అధికారులు విమానం టేకాఫ్ అవుతుందనంగా ఎవర్నీ రానీయరు, వారు ఉండరు. కానీ ఇక్కడో బృందం విమానం టేకాఫ్ అవుతుండగా అక్కడే ఉంది. ఆ విమానం ఇంజిన్ దెబ్బకు ఒక్కసారిగా వారంతా చెల్లా చెదురుగా అయిపోతారు. ఏదో పెద్ద గాలి తుఫానులా ..వారందర్నీ పడగొడుతున్నట్లు ఉంటుంది. నిజానికి వారంతా ఆ విమానం రన్‌వేకి సరిహద్దు సమీపంలో ఉండి ఫోటోలు తీసుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలో విమానం ఆకాశంలోకి ఎగిరేందుకు సిద్ధం అవుతుంది. ఇక అంతే ఆ విమానం వెనుక ఉన్న ఇంజన్ నుంచి వచ్చే శక్తివంతమైన గాలికి అక్కడున్నవారంతా నిలబడటమే కష్టమైంది. ఏమవుతుందో తెలుసుకునేలోపే చెదిరిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. Just downloaded my Skiathos videos from last week, here’s a small preview of the absolute chaos when people underestimate the power of aircraft engines! pic.twitter.com/ll2g9nY8AA — Callum Hodgson (@avgeekcal) June 21, 2023 (చదవండి: స్టీలు ఇల్లు..ఈజీగా మడతేసి తీసుకుపోవచ్చు!) -
ఎలా వస్తాయ్ వీళ్లకీ ఐడియాలు! ఇంటి అద్దె ఎక్కువని.. విమానంలో జాబ్‌కు వెళ్తోంది!
ప్రజలు సొంతూళ్లను వదిలి ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరాలకు వలసపోతున్నారు. అయితే ఉద్యోగాలైతే దొరుకుతున్నాయి గానీ నివసించేందుకు సొంత ఇళ్లు అంటేనే.. అనుకున్నంత ఈజీ కాదు. సరే పోనీ అద్దె ఇంట్లో ఉంటూ బతుకు బండిని ముందుకు నడిపిద్దామని అనుకుంటే.. నగరాల్లో అద్దెలా భారం భయాన్ని పుట్టిస్తోంది. దీంతో చేసేదేమి లేక తక్కువ అద్దె చూసుకుని.. పని చేస్తున్న కంపెనీకి కిలీమీటర్ల దూరం అయినా..ట్రాఫిక్ జామ్‌లో గంటల సమయాన్ని వృథా చేసుకుంటూ జీవనాన్ని గడిపేస్తుంటాం. ఇదంతా మనకి తెలిసిన కథే.. అయితే ఓ యువతి చేసిన పనికి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. అద్దె భరించలేక.. విమాన ప్రయాణం ఒక యువతి ఇంటి అద్దె భరించలేక విమానంలో ఉద్యోగానికి మరొక రాష్ట్రానికి వెళ్ళొస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సోఫియా సెలెంటానో అనే 21 ఏళ్ల యువతి న్యూజెర్సీలోని ఓగిల్వీ హెల్త్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేస్తోంది. కానీ ఆ నగరంలో అపార్ట్మెంట్ల అధిక ధర పలుకుతూ ఆకాశాన్నంటుతున్నాయి. కనీసం ఆ నగరం శివారు ప్రాంతం ఉండాలంటే కూడా.. కనీసం నెలకు 3400 డాలర్లు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రెండునెలల తన ఇంటర్న్‌షిప్ కాలంలో సోఫియా వారానికి ఒక రోజే ఆఫీసుకు వెళ్లాలట. అందుకని ఆమె తాను ఇంటర్న్‌షిప్ చేస్తున్న ప్రదేశం నుంచి దాదాపు 700 కి.మీ దూరంలో తక్కువ అద్దెకు రూం తీసుకుంది. ఆఫీసుకు వారానికి ఒక రోజు కాబట్టి విమానం ప్రయాణాన్ని ఎంచుకుంది. ఎందుకంటే.. రెండు నెలల్లో మొత్తంగా 8 రోజులు ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా అందుకు విమాన టికెట్, క్యాబ్ ఖర్చులు అంతా కలిపి 2,250 డాలర్లే ఖర్చవుతుందట. న్యూజెర్సీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం కంటే.. ఇదే నయమని తాను ఈ దారిని ఎంచుకుంది. అందుకోసం తాను తెల్లవారుజాము 3 గంటలకే లేవాల్సి వస్తోందని, రాత్రి పొద్దుపోయాక ఇల్లు చేరుతున్నట్లు ఆమె తెలిపింది. టిక్‌టాక్‌లో ఆమె మాట్లాడిన తర్వాత తన కథ వెలుగులోకి వచ్చింది. చదవండి: Hayden Bowles Success Story: 17కు వ్యాపారం.. 19కి సెటిల్.. 22కు రిటైర్మెంట్.. అమెరికా కుర్రాడి సక్సెస్ స్టోరీ! -
దేశం దాటి ప్యాసింజర్లకు సారీ చెప్పిన ఎయిర్‌లైన్స్ అధినేత
ఇటీవల ఎయిర్‌లైన్స్ సంస్థల పేర్లు ఏదో ఒక రూపంలో తరచూ వార్తల్లో వినపడుతున్నాయి. సిబ్బంది లేదా ప్యాసింజర్ల ప్రవర్తన సరిగా లేకపోవడం కారణంగా పలు ఘటనలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా తమ సిబ్బంది చేసిన పనికి ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ అధినేత దేశం దాటి వెళ్లి మరీ క్షమాపణలు చెప్పడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. జపాన్ రాజధాని టోక్యో శివారులోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టార్లక్స్ JX803 విమానంలో ప్రయాణీకులు మొదట మే 6న మధ్యాహ్నం 3.45 గంటలకు ఎక్కవలసి ఉంది. సాయంత్రం 5.30 గంటలకు, బోర్డింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈలోగా, JX801 విమాన ప్రయాణీకులు కూడా వేచి ఉన్న JX803 ప్రయాణికులతో చేర్చారు. కొన్ని కారణాల వల్ల రెండు విమానాలను విలీనం చేస్తున్నట్లు స్టార్లక్స్ సిబ్బంది ప్రయాణికులకు తెలియజేశారు. చివరికి రెండు విమానంలోని ప్రయాణికులను ఒకదానిలో చేర్చారు. అయితే అందులోని సిబ్బంది పనివేళలు ముగియడంతో రెండో విమానం కూడా ఆలస్యమైంది. చివరికి అర్ధరాత్రి అయ్యాక విమానం రద్దయిందని విమాన సిబ్బంది ప్రయాణికులకు తాపీగా చెప్పారు. దీంతో ప్రయాణీకులు ఆ రాత్రంతా విమానాశ్రయంలోనే గడపవలసి వచ్చింది. మరుసటిరోజు వీరిని మరో విమానంలో పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్టార్లక్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ చాంగ్ కు వీ హుటాహుటిన తైవాన్ నుంచి జపాన్‌కు బయలుదేరారు. మే 7వ తేదీ ఉదయం నరిటా విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులను స్వయంగా కలిసి క్షమాపణలు తెలియజేయడంతో పాటు వారి టికెట్ నగదును పూర్తిగా రీఫండ్ ఇస్తామన్నారు. చదవండి: ‘మూన్ కింగ్’గా మళ్లీ శని గ్రహం.. 83 నుంచి 145కు చంద్రుల సంఖ్య -
ఒక్క యాడ్‌తో సెలబ్రిటీగా మారింది.. ఏం జరిగిందో ఏమో భావోద్వేగ పోస్టు పెట్టి మృతి!
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య ప్రకటనలో కనిపించి సెలబ్రిటీగా మారిన ట్రాన్స్‌జెండర్ ఫ్లైట్ అటెండెంట్ కైలీ స్కాట్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టి ప్రాణాలు తీసుకున్నారు. ఆమె కొలరాడోలోని తన ఇంటిలో గత సోమవారం చనిపోయింది. స్కాట్ మరణించడానికి ముందు తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పోస్ట్‌లలో.. తన స్నేహితులు, కుటుంబ సభ్యులను ఉద్దేశించి భావోద్వేగ పోస్ట చేసింది. ‘మనం పంచుకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకోవాలని’ కోరింది. ‘నేను నా చివరి శ్వాసను తీసుకుంటూ, ఈ భూమి నుండి నిష్క్రమిస్తున్నాను. నేను నిరాశపరిచిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను’ అని స్కాట్ పేర్కొంది. ‘మీతో ఉండలేకపోయాను, క్షమించండి, నేను ఇష్టపడే వారికి తోడుగా ఉండలేకపోతున్నాను, మిమ్మల్ని వదలి వెళ్ళడం లేదని దయచేసి అర్థం చేసుకోండంటూ’ తన ఆవేదనను పోస్ట్ రూపంలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌లో స్కాట్ తన ప్రియమైన వారిలో కొందరి పేర్లను కూడా పేర్కొంది. స్కాట్ తల్లి, ఆండ్రియా సిల్వెస్ట్రో, లేఖను పోస్ట్ చేసిన తర్వాత తన కుమార్తె మరణించినట్లు ధృవీకరించింది. ఫేస్బుక్ పోస్ట్‌లో.. సిల్వెస్ట్రో ఇలా వ్రాశారు.. "కైలీ స్కాట్... నువ్వు నా కుమార్తెగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నీ నవ్వు చాలా అందంగా ఉండేది. నీ హృదయం మాలో ఎవరికీ అర్థం కానంత పెద్దది” అని తెలిపారు. కాగా, స్కాట్ మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విమానంలో తాగి రచ్చ చేసిన ప్యాసింజర్లు.. చివరకు..
దుబాయ్ నుంచి ముంబై వచ్చిన ఇండిగో విమానంలో తప్పతాగి రచ్చ రచ్చ చేశారు ఇద్దరు ప్యాసింజర్లు. తోటి ప్రయాణికులతో దరుసుగా ప్రవర్తించారు. మద్యం మత్తులో మితిమీరి రెచ్చిపోయారు. అడ్డుకోబోయిన విమాన సిబ్బందిని కూడా లెక్కచేయకుండా దుర్భాషలాడారు. మద్యం బాటిళ్లను వారి వద్ద నుంచి తీసేసేందుకు ప్రయత్నించగా.. గొడవకు దిగారు. బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ ప్యాసింజర్లను దత్తాత్రేయ బపార్డేకర్, జాన్ జార్జ్ డిసౌజాగా గుర్తించారు. యాజమాన్యం వీరిపై ఫిర్యాదు చేయడంతో విమానం ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఆ తర్వాత వారు బెయిల్‌పై విడుదల అయినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఇద్దరు గల్ప్ దేశంలో ఏడాదిగా పని చేసి ఇంటికి తిరిగి వస్తున్న సందర్భంగా మందుబాటిళ్లు కొనుగోలు చేసి విమానంలోనే పార్టీ చేసుకున్నారు. ఇబ్బందిగా ఉందని చెప్పిన తోటి ప్యాసింజర్లతో వాగ్వాదానికి దిగడంతో విమానంలో గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే విమానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఏడాదిలో ఏడోసారి కావడం గమనార్హం. ఈ నెల మొదట్లోనే లండన్-ముంబై విమానంలో సిగరెట్ తాగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే జనవరిలో ఢిల్లీ నుంచి పట్నా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్యాసింజర్ మద్యం తాగి రచ్చ చేశాడు. గతేడాది డిసెంబర్లో కొంతమంది ప్యాసింజర్లు విమానంలోనే ఘర్షణకు దిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చదవండి: ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన సొంత చెల్లి అని తెలిసి భర్త షాక్..! -
అమిత్ షా విమానంలో సాంకేతిక సమస్య.. హైదరాబాద్‌లోనే కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎస్‌ఏలోనే ఉన్నారు. ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో కొచ్చి వెళ్లకుండా ఆగిపోయారు.. దీంతో అమిత్ షా ప్రయాణం వాయిదా పడింది. మరో విమానం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి బయల్దేరనున్నారు. కాగా హకీంపేటలోని ఆదివారం జరిగిన సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. 53 ఏళ్లుగా దేశసేవలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు, సీఐఎస్ఎఫ్కి కావాల్సిన అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చడంలో అన్ని రకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. -
విమానంలో బుల్లెట్ల కలకలం.. 218 మంది ప్యాసింజర్లలో టెన్షన్ టెన్షన్
సియోల్: 218 మంది ప్యాసింజర్లు, 12 మంది సిబ్బందితో టేకాఫ్‌కు సిద్ధమైన విమానంలో లైవ్ బుల్లెట్లు కన్పించడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన విమానయాన సంస్థ టేకాఫ్ క్యాన్సల్ చేసుకుని ఫ్లైట్‌ను తిరికి టెర్మినల్‌కు తీసుకెళ్లింది. ప్రయాణికులతో పాటు సిబ్బందిని కిందకు దింపేసింది. దక్షిణకొరియాలోని ఇంచెవాన్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడి వద్ద 9ఎంఎం బుల్లెట్లు రెండు దొరకడంతో సిబ్బంది భయాందోళన చెంది టేకాఫ్ రద్దు చేసింది. అయితే పకడ్బంధీగా తనిఖీలు నిర్వహించినా బుల్లెట్లు విమానంలోకి ఎలా చేరాయో తెలియడం లేదని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, విమానయాన సంస్థ కూడా దీన్ని పర్యవేక్షిస్తోందని తెలిపారు. బుల్లెట్లు కన్పించిన కారణంగా ఉదయం 7:45కు టేకాఫ్ కావాల్సిన విమానం మూడు గంటలకుపైగా ఆలస్యంగా 11:00 గంటలకు టేకాఫ్ అయ్యింది. ఎలాంటి ఉగ్రముప్పు లేదని అధికారులు నిర్ధరించుకున్న తర్వాతే విమానం తిరిగి బయలుదేరింది. దక్షిణ కొరియాలో కఠినమైన తుపాకీ చట్టాలు అమలులో ఉన్నాయి. ఎవరైనా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. 75,300 డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. అయినా విమానంలోకి బుల్లెట్లు ఎలా తీసుకెళ్లారో అంతుచిక్కడం లేదు. చదవండి: చిలీలో రూ.262 కోట్ల దోపిడీకి యత్నం -
వైరల్ వీడియో: ఈ పెళ్లికొడుకు చాలా రిచ్.. బంధువుల కోసం విమానం బుక్ చేశాడు..
-
ఈ పెళ్లికొడుకు చాలా రిచ్.. బంధువుల కోసం విమానం బుక్ చేశాడు..
బంధుమిత్రులను తన పెళ్లికి తీసుకెళ్లేందుకు ఏకంగా విమానాన్నే బుక్ చేశాడు ఓ పెళ్లికొడుకు. వాళ్లతో కలిసి ఆకాశమార్గంలో ప్రయాణించి ఇంటికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. ఈ వరుడి పేరు భువన్. చాలా రిచ్. అందుకే ఖర్చు గురించి ఆలోచించకుండా విమానం మొత్తాన్ని బుక్ చేశాడు. ఇతనితో పాటు ప్రయాణించిన బంధువులు ఫుల్ జోష్‌లో కన్పించారు. కెమెరాకు లవ్ సింబల్‌తో పోజులిచ్చారు. View this post on Instagram A post shared by Bhuwan and Shagun - #ShuBh (@theshubhwedding) భువన్ కూడా తన హావభావాలతో నవ్వులు పూయించాడు. చేతులకు మెహిందీ కూడా పెట్టుకున్నాడు. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు. నువ్వు రిచ్ ఆ కాదా చెప్పనవసరం లేదు, ఇలా విమానం బుక్ చెస్తే చాలు అందరికీ అర్థమయిపోతుంది అని ఓ నెటిజన్ స్పందించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ జీవితంలో ఇంత డబ్బు ఉంటే చాలు హ్యాపీగా బతికేయొచ్చు అని రిప్లై ఇచ్చాడు. చదవండి: పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన వధువు.. వీడియో వైరల్.. -
ఉద్యోగులకు బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఇండియా.. దాదాపు 8 వేల మందికి
ముంబై/న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా తన ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ ఆఫర్ ఇచ్చింది. శాశ్వత ఉద్యోగులకు ‘ఎంప్లాయీస్ షేర్ బెనిఫిట్ (ఈఎస్‌బీ) స్కీమ్, 2022’ కింద 98 కోట్ల షేర్లను కేటాయించనుంది. 2022 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియా నియంత్రణ టాటా గ్రూపు చేతికి వెళ్లడం తెలిసిందే. ఈ స్టాక్ ఆప్షన్ పథకం కింద 8,000 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నట్టు ఎయిర్ ఇండియా ఉద్యోగి ఒకరు తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా చేసుకున్న షేరు కొనుగోలు ఒప్పందం ప్రకారం.. ప్రైవేటీకరించే నాటికి సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఎంప్లాయీ షేర్ బెనిఫిట్ పథకాన్ని ఆఫర్ చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇందులో ఉండే దీర్ఘకాల ప్రయోజనాల గురించి ఉద్యోగులకు తెలియజేస్తామని పేర్కొంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పనిచేసే శాశ్వత ఉద్యోగులు అందరికీ ఈ పథకం కింద అర్హత ఉంటుంది. కొనుగోలు చేసే నాటికి ఒక్కో షేరు పుస్తక విలువ 87–90 పైసలు ఉంటే, తాజా పథకంలో భాగంగా ఒక్కో స్టాక్ ఆప్షన్‌ను 27 పైసలకు ఆఫర్ చేసినట్టు తెలిసింది. చదవండి: Union Budget 2023: 6 నెలల నుంచి మొదలు, బాబోయ్ బడ్జెట్ తయారీ వెనుక ఇంత కథ నడుస్తుందా! -
విమాన ప్రయాణం.. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయమంటారు, ఎందుకో తెలుసా?
గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తే కాలక్షేపానికి మొబైల్ వాడకం సాధారణమే. అదే విమానంలో ప్రయాణం అంటే మాత్రం మన స్మార్ట్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని లేదా ఎరోప్లేన్ మోడ్ లో పెట్టమని చెప్తుంటారు. అసలు బస్సు, రైలు, బైకు వీటిలో ప్రయాణించేటప్పుడు లేని ఈ నిబంధన కేవలం విమాన ప్రయాణంలోనే ఎందుకు పాటించాలి. మీ సెల్యులార్ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరం విమానానికి నిజంగా ప్రమాదం కలిగించగలదా?అలా చేయడం వెనుకు దాగున్న సైంటిఫిక్ కారణాల పై ఓ లుక్కేద్దాం! విమాన ప్రయాణంలో మొబైల్ స్విచ్ ఆఫ్.. విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ప్యాసింజర్లు వారి మొబైల్స్‌ను స్విచ్ ఆఫ్ చేయమని అందులోని సిబ్బంది చెప్తుంటారు. అయితే విమానంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం నిషేధించలేదు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA). కానీ ప్లైట్ అటెండెంట్స్ మాత్రం ఈ నిబంధన పాటించమని చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణం సెల్ ఫోన్స్, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలే (Radio Frequencies). ఇవి విమానంలోని నావిగేషన్ కు ఉపయోగించే రేడియో తరంగాలు దాదాపుగా ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. దాంతో కాక్ పిట్ లో ఉండే ఏరోనాటికల్ వ్యవస్థకు ఇది అంతరాయం కలిగిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విమాన ప్రయాణం సజావుగా సాగాలన్నా, మన స్మార్ట్‌ఫోన్ ఉపయోగించలన్నా ఈ రెండు సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడి పని చేస్తాయి. అందుకే విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో మీ ఫోన్స్ ను స్విచ్ ఆఫ్ చేయమని చెప్పేది. ఇప్పటి వరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ కారణంగా ఈ తరహా ప్రమాదాలు జరగలేదు. కాకపోతే.. విమాన ప్రయాణంలో టేకాఫ్, ల్యాండింగ్ అనే ప్రక్రియ చాలా కీలకమైంది. అందుకే ముందు జాగ్రత్తగా ఇలా ఫోన్స్ ను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అనేక విమానయాన సంస్థలు తమ విమానాల్లో వై-ఫై సేవలను కూడా ప్రారంభించాయి. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
డిసెంబర్లో పెరిగిన విమాన ప్రయాణికులు
దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 2022 డిసెంబర్ నెలలో 1.29 కోట్లుగా ఉంది. 2021 డిసెంబర్‌తో పోల్చినప్పుడు 15 శాతం పెరిగింది. కానీ 2019 డిసెంబర్ గణాంకాల కంటే ఒక శాతం తక్కువ. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఏవియేషన్‌పై ఓ నివేదిక విడుదల చేసింది. దేశీ ఏవియేషన్ పరిశ్రమ పట్ల ప్రతికూల అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్టు ఇక్రా తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల రద్దీ 9.86 కోట్లుగా (986 లక్షలు) ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 63 శాతం అధికం కాగా, 2019లో ఇదే కాలంతో పోల్చినా 9 శాతం వృద్ధి కనిపిస్తోంది. గత నెలలో ఎయిర్‌లైన్స్ సంస్థలు దేశీ మార్గాల్లో అధిక సర్వీసులను నడిపించగా, కరోనా ముందు నాటితో పోలిస్తే ఇప్పటికీ 7 శాతం తక్కువగానే ఉన్నాయి. 2022 డిసెంబర్లో ప్యాసింజర్ లోడ్ (ప్రయాణికుల భర్తీ రేటు) 91 శాతంగా ఉంటే, 2021 ఇదే నెలలో 80 శాతం, 2019 డిసెంబర్లో 88 శాతం చొప్పున ఉంది. కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకున్నందున 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీ ప్రయాణికుల రద్దీలో వేగవంతమైన పునరుద్ధరణను చూస్తున్నట్టు ఇక్రా తెలిపింది. అయితే ఏటీఎఫ్ ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలు క్షీణించినందున ఎయిర్‌లైన్స్ సంస్థల ఆదాయాల రికవరీ నిదానించొచ్చని పేర్కొంది. పెరిగిపోయిన వ్యయాల ఫలితంగా రూ.15,000–17,000 కోట్ల నష్టాలు నమోదు చేయవచ్చని ఇక్రా అంచనా వేసింది. 2021–22లో నికర నష్టాలు రూ.23,500 కోట్ల కంటే తక్కువేనన్న విషయాన్ని గుర్తు చేసింది. రుణాల ఒత్తిళ్లు సమీప కాలంలో భారత ఎయిర్‌లైన్స్ సంస్థలపై రుణ ఒత్తిళ్లు కొనసాగుతాయని ఇక్రా తెలిపింది. నిర్వహణ పనితీరును మెరుగుపరుచుకోవడం లేదా ఈక్విటీ రూపంలో నిధులు తీసుకురావడం వంటి చర్యలు చేపట్టనంత వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని పేర్కొంది. ఏటీఎఫ్ ధరలు అదే పనిగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగొచ్చని అంచనా వేసింది. ఎయిర్‌లైన్స్ సంస్థల ఆదాయాలు పెరిగినా కానీ, ఏటీఎఫ్ ధరల ప్రభావాన్ని అవి పూడ్చుకోలేవని పేర్కొంది. కనుక సమీప కాలంలో దేశీ ఎయిర్‌లైన్స్ ఆర్థిక పనితీరు ఒత్తిడితో కొనసాగుతుందని తెలిపింది. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం వల్ల లీజ్ అద్దెలు, నిర్వహణ వ్యయాల రూపంలో వాటి మొత్తం వ్యయాలపై గణనీయమైన భారం పడుతున్నట్టు పేర్కొంది. ఇంధన ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నందున.. ఈ తరుణంలో మార్కెట్ వాటాను పెంచుకోవాలన్న ఎయిర్‌లైన్స్ సంస్థల ఆకాంక్షలు వాటి మార్జిన్ల విస్తరణ అవకాశాలను పరిమితం చేస్తుందని వివరించింది. -
ఇండిగో ఎయిర్‌లైన్స్ పరిమిత ఆఫర్.. కేవలం రూ. 2218లకే విమాన ప్రయాణం!
దేశీయ విమానాల్లో ప్రయాణించే వారికి శుభవార్త చెప్పింది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఏయిర్ లైన్స్. ప్యాసింజర్లను ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్‌ని తీసుకొచ్చింది. కేవలం రూ. 2218 (వన్ వే ఛార్జీ) ప్రారంభ ధరతో విమానంలో ప్రయాణించడానికి గొప్ప ఆఫర్‌తో ప్రయాణికులకు అందించనుంది. ఇండిగో సంస్థ ప్రకటించిన ఈ వింటర్ సేల్ ఆఫర్ డిసెంబర్ 1న ప్రారంభం కాగా డిసెంబర్ 6 తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో టికెట్స్‌ను బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దేశంలో ఏ ప్రదేశానికైనా త్వరలో మీరు వెళ్లాలనుకుంటే ఈ 6 రోజుల్లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ విండో ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉండగా, డిసెంబర్ 6 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ప్రకారం జనవరి 10 నుంచి ఏప్రిల్ 13 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. ఇది పరిమిత సీట్లకు మాత్రమే. ఈ ఆఫర్లో విమానాశ్రయ ఛార్జీలు, ప్రభుత్వ పన్నులపై తగ్గింపు వర్తించదు. మరో విషయం ఏంటంటే ఇండిగో దేశీయ నెట్‌వర్క్‌లోని వివిధ రంగాలలో నాన్‌స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. గ్రూప్ బుకింగ్‌లపై ఈ ఆఫర్ వర్తించదు. ఈ ఆఫర్‌ను బదిలీ చేయడం, నగదుగా మార్చడం వంటివి సాధ్యం కాదు. ఇండిగో అందించే ఈ ఆఫర్ పూర్తిగా బెస్ట్ ఎఫర్ట్ ప్రాతిపదికన అందిస్తోంది. పరిస్థితుల బట్టి ముందస్తు నోటీసు లేకుండా, కారణం చెప్పకుండా ఈ ఆఫర్‌ను ఎప్పుడైనా రద్దు చేసే లేదా సవరించే హక్కును ఇండిగో సంస్థకు ఉంది. Winter sale alert! Domestic fares starting at ₹2,218. Hurry, book before 06-Dec-22 for travel between 10-January-23 and 13-April-23. Book now https://t.co/uwwNJostmC pic.twitter.com/TibbaAsWy0 — IndiGo (@IndiGo6E) December 2, 2022 చదవండి: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ! -
ఆఫీస్‌కి రావాలంటే అవి తప్పనిసరి.. ఎయిర్ ఇండియా కొత్త రూల్స్
టాటా గ్రూప్.. ఈ సంస్థకు ఉన్న పేరు ప్రఖ్యాతలు, మార్కెట్లో వాటికున్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక వ్యాపారంలో అడుగుపెడితే తమ సంస్థ మార్క్ పని తీరుతో లాభాల బాట పట్టించడం టాటా గ్రూప్ ప్రత్యేకత. ఇటీవల భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ఈ సంస్థ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థను కూడా మిగిలిన సంస్థల మాదిరి లాభాలవైపు నడిపేందుకే వ్యూహాలు రచిస్తోంది టాటా గ్రూప్. ఈ క్రమంలోనే యాజమాన్యంలో ఎయిర్ ఇండియా కొత్త రూపు సంతరించుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా విమానాల్లో పనిచేసే క్యాబిన్ క్రూ, సిబ్బంది అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉండేలా వారి ఆహార్యంలో మార్పులు తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే పురుషులు, మహిళా సిబ్బంది వస్త్రధారణకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. అందులో కొన్నింటిని తెలుసుకుందాం.. పురుషుల కోసం ►హెయిర్ జెల్ వాడకం తప్పనిసరి. ► బట్టతల లేదా జుట్టు ఎక్కువగా ఊడిపోయిన వారు పూర్తిగా గుండు చేయించుకోవాలి. ఇక ప్రతి రోజూ షేవ్ చేసుకుంటూ ఉండాలి. ►తెల్లవెంట్రకలు ఉన్నవారు సహజ సిద్దంగా ఉండేలా వారి జుట్టుకు రంగు వేసుకోవాలి. ఫ్యాషన్ రంగులు, హెన్నా వంటివి వేసుకోకూడదు. మహిళల కోసం ►ముత్యాల చెవిపోగులు ధరించకూడదు. ఫ్లైట్ అటెండెంట్లు డిజైన్ లేకుండా బంగారం లేదా డైమండ్ ఆకారపు చెవిపోగులు మాత్రమే ధరించాలి. ►రింగ్స్ వెడల్పు 1 cm కంటే ఎక్కువగా ఉండకూడు. అది కూడా చేతికి ఒకటి మాత్రమే. ►అమ్మాయిలు కూడా జుట్టు నెరిసిపోతే సహజ షేడ్స్ లేదా కంపెనీ హెయిర్ కలర్ షేడ్ కార్డ్‌లో ఉండే రంగు వేసుకోవాలి. చదవండి: షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్? -
ఆర్టీసీ బస్సుకు తగిలిన ‘విమానం’ రెక్క.. పలువురికి గాయాలు
తిరువనంతపురం: రోడ్డుపై వెళ్తున్న బస్సుకు విమానం రెక్క తగిలి ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆకాశంలో వెళ్లే విమానం.. రోడ్డుపై వెళ్తున్న బస్సుకు ఎలా తగిలిందని అనుకుంటున్నారా? అయితే, ఇక్కడ విమానం లేదు. ట్రక్కులో తరలిస్తున్న ఓ పాత విమానం రెక్క.. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు తగిలింది. ఈ సంఘటన కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని బలరామపురంలో బుధవారం రాత్రి జరిగింది. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. విమానం రెక్క తరలిస్తున్న ట్రెయిలర్ ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంది. దీంతో రహదారిని కొన్ని గంటల పాటు మూసివేశారు అధికారులు. ఇదీ చదవండి: ‘ఈ విచారణలేందుకు.. వీలైతే నేరుగా అరెస్ట్ చేయండి’.. జార్ఖండ్ సీఎం సవాల్ -
విదేశీ ప్రయాణానికి గిరాకీ
ఇటీవల విదేశీ ప్రయాణానికి డిమాండ్ బాగా పెరుగుతోంది. కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడం.. వివిధ దేశాలు పర్యాటకులను ఆకర్షించడానికి ప్యాకేజీలను ప్రకటిస్తుండటంతో ప్రయాణీకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి 50,710 మంది ప్రయాణించారు. 2021–22 ఆరు నెలల కాలంలో ప్రయాణించిన 12,930 మందితో పోలిస్తే విదేశీ ప్రయాణీకుల సంఖ్యలో 292 శాతం వృద్ధి నమోదైందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్ల కాలంలో ఈ రెండు విమానాశ్రయాల నుంచి 411 విమాన సర్వీసులు నడవగా అంతకుముందు ఏడాది కేవలం 139 సర్వీసులు మాత్రమే నడిచాయి. రాష్ట్రంనుంచి ఇలా విదేశీ ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతుండటంతో సర్వీసుల సంఖ్య పెంచడానికి ఎయిర్‌లైన్స్ సంస్థలూ ముందుకొస్తున్నాయి. కోవిడ్ ముందున్న పరిస్థితికంటే మెరుగు మరోవైపు.. ఏపీలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య కోవిడ్ ముందున్న పరిస్థితి కంటే మెరుగైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్ల కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రయాణీకుల సంఖ్యలో 90.93 శాతం వృద్ధి నమోదైంది. 2021–22లో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి 11,91,326 మంది ప్రయాణిస్తే ఈ ఏడాది ఆర్నెల్ల కాలంలో ఏకంగా 22,74,641 మంది ప్రయాణించారు. రానున్న కాలంలో సర్వీసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రయాణీకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: ట్రెండ్ మారింది.. పెట్రోల్, డీజల్,గ్యాస్ కాదు కొత్త తరం కార్లు వస్తున్నాయ్! -
విమాన రంగానికి బిగ్ రిలీఫ్.. భారీగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా సెప్టెంబర్‌లో 1.03 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 సెప్టెంబర్‌తో పోలిస్తే ప్యాసింజర్ల సంఖ్య 64.61 శాతం పెరగడం గమనార్హం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. గత నెలలో ఆకాశ ఎయిర్ మినహా మిగిలిన దేశీయ విమానయాన సంస్థలు 76.6 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. ఆకాశ ఎయిర్ దేశీయంగా తన సేవలను 2022 ఆగస్ట్ 7 నుంచి ప్రారంభించింది. 77.5 శాతం సగటు సామర్థ్యంతో సెప్టెంబర్‌లో విమానయాన సంస్థలు సర్వీసులను నడిపించాయి. ఆగస్ట్‌లో ఇది 72.5 శాతం నమోదైంది. ప్రయాణికుల్లో 57 శాతం మంది ఇండిగో విమానాల్లో జర్నీ చేశారు. విస్తారా, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఆసియా ఫ్లైట్స్‌లో 24.7 శాతం మంది ప్రయాణించారు. చదవండి: ట్రైన్ జర్నీ క్యాన్సిల్ అయ్యిందా? రైల్వే ప్రయాణికులకు శుభవార్త -
ఫ్లైట్ టికెట్స్: ఆ సీట్లకు భారీ డిమాండ్.. పైసలు ఖర్చవుతాయ్!
బ్లాక్ దందా అనే మాట గుర్తుందా. గతంలో ఈ మాటలు ఎక్కువగా సినిమా థియేటర్ కేంద్రాలలో వినేవాళ్లం. తన అభిమాన హీరో, హీరోయిన్ సినిమా కోసం ప్రేక్షకులు అదనంగా ఖర్చు పెట్టి కొనేవాళ్లు. తాజాగా ఈ తరహా పరిస్థితులు విమానయాన రంగంలోకి వచ్చాయని ఓ సర్వే అంటోంది. ఇటీవలే విమానాల్లో ప్రయాణికుడు కోరుకున్న చోట సీటు కావాలంటే అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోందట! అసలు ఏవియేషన్ రంగంలో ఏం జరుగుతోందో ఓ లుక్కేద్దాం. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వేలో గడిచిన 12 నెలల్లో మూడింటా ఒక వంతు ప్రయాణీకులు తమకు నచ్చిన చోట కూర్చోవడం కోసం ఎయిర్‌లైన్స్‌కు అదనపు నగదును చెల్లించినట్టు తేలింది. దేశంలోని 351 జిల్లాలో ఈ సర్వే నిర్వహించగా.. ఇందులో 30వేల మంది ప్రయాణికులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో పాల్గొన్న వారిలో మూడో వంతు ప్రయాణికులు తాము ప్రయాణించిన విమానయాన సంస్థ ఉచిత సీటును ఎంచుకునే ఆప్షన్ ఇవ్వలేదని వెల్లడించారు. నిర్దిష్ట సీట్లకు, లగేజ్‌కు, ఎయిర్‌లైన్ లాంజ్‌ను ఉపయోగించుకునేందుకు ప్రయాణికుల నుంచి దేశీ ఎయిర్‌లైన్స్ అదనపు చార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ 2015లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కాస్త ఎక్కువ జాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో బుకింగ్ లేదా వెబ్ చెకిన్ చేసేటప్పుడు కొందరు ప్రయాణికులు ముందు వరుసల్లోనూ, ఎమర్జెన్సీ వరుసల్లోనూ సీట్లకు ప్రాధాన్యమిస్తుంటారు. ఇందుకోసం ఎయిర్‌లైన్స్ రూ. 200–1,500 వరకూ అదనంగా చార్జి చేస్తుంటాయి. ఇలాంటి ప్రాధాన్య సీట్లతో పాటు తగినంత స్థాయిలో ఉచిత సీట్లను కూడా ఎయిర్‌లైన్స్ అందుబాటులో ఉంచాల్సి ఉంది. మరోవైపు కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు డిమాండ్ ఉందంటూ ఎక్కువగా కూడా వసూలు చేస్తున్నాయని ప్రయాణీకులు చెప్తున్నారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
హమ్మయ్యా.. గాల్లో తేలుతున్నారు, మళ్లీ పాత రోజులొస్తున్నాయ్!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికుల సంఖ్య తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి చేరవచ్చని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. తద్వారా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ ట్రాఫిక్ 75 శాతం మేర వృద్ధి సాధించవచ్చని సూచనతప్రాయంగా తెలిపింది. అంతర్జాతీయ రూట్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నందున.. దేశీ రూట్లలో ప్రయాణాలు ఇందుకు ఊతంగా ఉండగలవని క్రిసిల్ వివరించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికుల సంఖ్య దాదాపు 34 కోట్లుగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లో (ఆగస్టు వరకు) అప్పటి గణాంకాలతో పోలిస్తే 88 శాతం మేర ప్యాసింజర్ ట్రాఫిక్ నమోదైనట్లు క్రిసిల్ పేర్కొంది. బిజినెస్ ట్రావెల్ సెంటిమెంటు, అంతర్జాతీయంగా ప్రయాణాలు పెరుగుతుండటం, విమానాలు పూర్తి సామర్థ్యాలతో పని చేయడం మొదలయ్యే కొద్దీ మిగతా నెలల్లో ఇది ఇంకా పుంజుకోగలదని వివరించింది. అయితే, ఎయిర్ ట్రాఫిక్ రికవరీ, ఆదాయ అంచనాలు మొదలైనవన్నీ స్థూల ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయని క్రిసిల్ పేర్కొంది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! కరోనా ముందు ఏటా 12 శాతం వృద్ధి.. 2015–2020 మధ్య విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 12 శాతం వార్షిక వృద్ధి చెందుతూ వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతీయ కనెక్టివిటీ స్కీములతో చిన్న పట్టణాలకు కూడా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం మొదలైన అంశాలు ఇందుకు తోడ్పడ్డాయని నివేదికలో క్రిసిల్ పేర్కొంది. అయితే, ఆ తర్వాత 2021 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి తెరపైకి రావడంతో ఎయిర్ ట్రాఫిక్ ఒక్కసారిగా పడిపోయింది. పలు వేవ్‌లు, ప్రయాణాలపై ఆంక్షల కారణంగా 2021–22లో పాక్షికంగానే రికవర్ అయింది. 2019–20తో పోలిస్తే ప్యాసింజర్ ట్రాఫిక్ 55 శాతానికే పరిమితమైంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
80 ఏళ్లు దాటాక గిన్నిస్ రికార్డు.. విమానం ఎక్కి, అక్కడ్నుంచి దూకేసి..
80 ఏళ్లు దాటాక మీరేం చేస్తుంటారు? ఓపికుంటే.. వాకింగ్‌కు వెళ్తారు లేదా మనుమలు, మనవరాళ్లతో ఆడుకుంటూ ఉంటారు..అంతేగా..అదే వయసులో ఉన్న వీళ్లేం చేశారో తెలుసా? విమానం ఎక్కేసి.. అక్కడ్నుంచి దూకేశారు. తద్వారా గిన్నిస్ రికార్డు సాధించేశారు. జంపర్స్ ఓవర్ ఎయిటీ సొసైటీకి చెందిన ఈ 8 మంది అమెరికాలోని ఒర్లాండోలో స్కైడైవ్చేసి.. ఇలా సర్క్యులర్ ఫార్మేషన్ ఫీట్‌ను చేశారు. 80 ఏళ్లు దాటినవారిలో ఇంతమంది కలిసి ఒక స్కైడైవ్ ఫార్మేషన్ చేయడం ఇదే మొదటిసారట. ఇప్పటివరకూ ఆరుగురు కలిసి చేసినదే రికార్డుగా ఉంది. -
Sakshi Cartoon 02-10-2022
-
విమానంలో రచ్చ రచ్చ చేసిన ప్రయాణికుడు.. వీడియో వైరల్
విమానం టేకాఫ్ అయ్యాక తనను కిందకు దింపమని రచ్చ రచ్చ చేశాడు ఓ ప్రయాణికుడు. బట్టలు విప్పేసుకుని హల్చల్ చేశాడు. విమానం కిటికీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. సీట్లను పదే పదే తన్నాడు. ఆపేందుకు ప్రయత్నించిన తోటి ప్రయాణికులపైనా దాడి చేశాడు. పాకిస్థాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానంలో గతవారం ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 14న పెషవార్ నుంచి దుబాయ్‌కు వెళ్తున్న పీకే-283 విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ ప్యాసెంజర్ విచిత్రంగా ప్రవర్తించసాగాడు. విమానంలో ప్రయాణికులు నడిచే ఫ్లోర్‌పై బోర్లా పడుకుని ప్రార్థనలు చేయాలని ఇతరులకు సూచించాడు. సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా ఊరుకోలేదు. వారితో దురుసుగా ప్రవర్తించి బెంబేలెత్తించాడు. ప్రయాణికుడి చేష్టలకు విసిగిపోయిన సిబ్బంది నిబంధనల ప్రకారం అతడ్ని సీటుకు కట్టేశారు. అతడు మరోసారి విమానం ఎక్కకుండా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. ప్యాసెంజర్ ప్రవర్తనకు సంబంధించిన వీడియోను తోటి ప్రయాణికుడు ఒకరు ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. #Video A passenger created extreme trouble on a Pakistan International Airlines (PIA) Peshawar-Dubai PK-283 flight as he suddenly started punching seats and kicking the aircraft’s window. pic.twitter.com/bUZ0ZTVNxw — Ghulam Abbas Shah (@ghulamabbasshah) September 19, 2022 చదవండి: బ్రిటన్ రాణి అంత్యక్రియలు.. ప్రపంచదేశాల అధినేతలు హాజరు -
నడి రోడ్డు పై ల్యాండ్ అయిన విమానం: వీడియో వైరల్
ఇటీవల కాలంలో పైలెట్లు విమానాలను దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిన లేక ఏదైన ప్రమాద సంభవిస్తుందన్న అనుమానం వచ్చినా పైలెట్లు విమానాన్ని అత్యవసరంగా సురకక్షితమైన ప్రదేశంలో దించేస్తారు. అచ్చం అలానే ఇక్కడొక పైలెట్ కూడా విమానాన్ని అత్యవసర ల్యాండిగ్ చేశాడు గానీ, అదీ కూడా రద్దీగా ఉండే హైవే పై ల్యాండ్ చేయడం విశేషం. వివరాల్లోకెళ్తే...యూఎస్‌లోని నార్త్ కరోలినాలో వాహనాల రద్దీ మధ్య ఒక విమానం ల్యాండ్ అయ్యింది. విన్సెంట్ ఫ్రేజర్ అనే పైలెట్ తన మామతో కలిసి స్వైన్ కౌంటీలోని ఫోంటాన్ లేక్ నుంచి సింగిల్ ఇంజన్ విమానాన్ని నడుపుతున్నాడు. ఐతే అకస్మాత్తుగా ఇంజన్ పనిచేయడం మానేయడం మొదలైంది. దీంతో అతను సమీపంలోని హైవే పై సురకక్షితంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఫ్రేజర్ గతేడాదే పైలెట్‌గా లైసెన్సు పొందాడు. ఫ్లోరిడాకు చెందిన మెరైన్ అనుభవజ్ఞుడు, కానీ అతనికి 100 గంటలకు పైగా విమానన్ని నడపగల అనుభవం మాత్రం లేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. WATCH: New video shows a plane making an emergency landing on a Swain County highway Sunday morning. Hear from the pilot tonight on @WLOS_13 at 5 & 6! Video courtesy of Vincent Fraser. pic.twitter.com/hcxOGUUGgP — Andrew James (@AndrewJamesNews) July 7, 2022 (చదవండి: నాలాగే ఒంటరిగా ఉండండి!... అంటూ పిలుపునిచ్చిన మంత్రి!) -
చైనాలో మరో విమాన ప్రమాదం.. ఒక్కసారిగా మంటలు రావడంతో
బీజింగ్: చైనాలోని సౌత్‌వెస్ట్ నగరం చాంగ్కింగ్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ప్రాణ నష్టం జరగలేదు. వివరాల ప్రకారం.. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం చైనాలోని సౌత్‌వెస్ట్ చాంగ్కింగ్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం ఉదయం టిబెట్‌లోని న్యింగ్చికి వెళ్లాల్సి ఉంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అందులో సాంకేతిక సమస్య ఉన్నట్లు పైలెట్ గుర్తించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే సంబంధిత అధికారుల వద్ద అనుమతి తీసుకుని వెంటనే ల్యాండ్ చేశారు. కానీ విమానం ల్యాండింగ్ చేసిన తరువాత అది కంట్రోల్ తప్పి రన్‌వే దాటి వెళ్లిపోయింది. దీంతో పాటు విమానం రెక్కలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే అప్రమత్తంగా ఉన్న విమానాశ్రయ సిబ్బంది అందులోని ప్రయాణికులని, సిబ్బందిని సురక్షితంగా కాపాడగలిగారు. ఘటనలో కొందరు స్వల్పంగా గాయపడగా అస్పత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. కాగా, రన్‌వేపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపటివరకు విమాన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. According to reports, at about 8:00 on May 12, a Tibet Airlines flight deviates from the runway and caught fire when it took off at Chongqing Jiangbei International Airport.#chongqing #airplane crash #fire pic.twitter.com/re3OeavOTA — BST2022 (@baoshitie1) May 12, 2022 చదవండి: Russia-Ukraine War: రష్యా సైన్యాన్ని తరిమికొడుతున్నాం -
విమానాలు నిలిపేసిన ఏరోఫ్లోట్
న్యూయార్క్: రష్యాకు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ఏరోఫ్లోట్ అన్ని రకాల అంతర్జాతీయ విమానాలను ఈ నెల 8నుంచి నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. బెలారస్‌కు మాత్రం తమ విమానాల రాకపోకలు సాగుతాయని తెలిపింది. విదేశీ విమానాలను అద్దెకు తీసుకునే రష్యా వైమానిక సంస్థలు ప్రయాణికుల, సరుకుల రవాణాను కొన్నాళ్లు నిలిపివేయాలని ఇటీవలే రష్యా విమానయాన నియంత్రణా సంస్థ రోసావైట్సియా సూచించింది. రష్యాపై ఆంక్షలు విధించడంతో లీజుకిచ్చిన విదేశీ విమానాలను వెనక్కు స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయని తెలిపింది. ఇందుకనుగుణంగానే ఏరోఫ్లోట్ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి నగదు రిఫండ్ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే రష్యాకు చెందిన ఎస్7 సంస్థ అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. (చదవండి: నూతన చట్టంతో మీడియా పై ఉక్కుపాదం మోపిన రష్యా) -
విమానంలో మహిళకు కరోనా పాజిటివ్.. 5 గంటలు బాత్రూమ్లోనే
న్యూయార్క్ : కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి పేరు మార్చుకొని ఒమిక్రాన్ రూపంలో మరోసారి తన పంజా విసురుతోంది. యూరప్ దేశాల్లో కోవిడ్ ప్రభావం మరింత ఆందోళనకరంగా ఉంది. రోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కవ ఒమిక్రాన్ ఎక్కువ సోకుతుండటంతో విమాన ప్రయాణాలపై అన్ని దేశాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారికి, విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్‌పోర్టు సిబ్బంది తప్పకుండా కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మహమ్మారిని అదుపు చేయడం సాధ్యపడడం లేదు. తాజాగా అమెరికాలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శంగా నిలిచింది. విమానం ఎక్కేముందే కోవిడ్ టెస్టు చేయించుకున్న ఓ మహిళకు ఫ్లైట్‌లో ఉండగానే పాజిటివ్‌గా తేలింది. దీంతో సదరు మహిళ నుంచి ఇతర ప్రయాణికులకు వైరస్ సోకకుండా ఉండేందుకు మహిళను 5 గంటల పాటు విమానం బాత్రూమ్లోనే ఐసోలేట్ చేశారు. చదవండి: టాప్ ఎంఎన్సీల్లో సీఈవోలు.. కానీ జీతం ఒక డాలరే.. ఎందుకో తెలుసా? డిసెంబర్ 19న చికాగో నుంచి ఐస్లాండ్కు 150మంది ప్రయాణికులతో ఓ విమానం బయల్దేరింది. విమానం బయలు దేరిన కొంత సమయానికి మిచిగాన్కు చెందిన మారీసా ఫోటీయో అనే మహిళ టీచర్‌కు అసౌకర్యంగా అనిపించింది. పాటు గొంతులో నొప్పి మొదలవ్వడంతో విమాన సిబ్బంది ప్రయాణంలోనే ఆమెకు కోవిడ్ టెస్ట్ నిర్వహించారు. ఆ ర్యాపిడ్ టెస్టులో ఆమెకు పాజిటివ్ అని తేలింది. జర్నీ మొదలైన గంటలోపే మారిసాకు పాజిటివ్ అని తేలడంతో తన సీటును వదిలేసి విమానం బాత్రూంకు వెళ్లిపోయింది. చదవండి: ఒమిక్రాన్‌తో డెల్టాకు చెక్!? పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి అయిదు గంటల పాటు మారిసా బాత్రూంలోనే స్వీయ నిర్బంధంలో ఉండిపోయింది. ఆ నాలుగు గంటలు నరకయాతన అనుభవించానని మారిసా తనకు ఎదురైన దారుణ పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా మారీసా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంది. అంతేగాక విమానం ఎక్కేముందు అయిదుసార్లు కోవిడ్ టెస్ట్ చేయగా నెగెటీవ్ రావడం గమనార్హం. -
వావ్! అద్భుతహ! ఇది కదా ల్యాండింగ్ అంటే
సాక్షి, హైదరాబాద్: గాల్లోకి ఎగిరే పక్షిని చూసే రైట్ బ్రదర్స్‌కి మనం కూడా గాల్లో ఎగరాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కదా అనంత దూరాలకు సైతం క్షణాల్లో రెక్కలు కట్టుకుని ఎగిరిపోయేలా చేసింది. ఓర్విల్లే రైట్, విల్బర్ రైట్ సోదరులు అభివృద్ధి చేసిన విమానం ప్రపంచ విమానయాన రంగానికి పునాదులు వేసింది. రైట్ బ్రదర్స్ కృషికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న రైట్ బ్రదర్స్ డేను నిర్వహించుకుంటాం. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఈ నెలలోనే రానున్న రైట్‌బ్రదర్స్ డే తరుణంలో యాదృచ్చికంగా ఎరిక్ సోలేం అనే యూజర్ షేర్ చేసిన వీడియో అద్భుతంగా నిలుస్తోంది. విమాన ప్రయాణానికి బాటలు వేసిన పక్షి అత్యంత సురక్షితంగా, అద్భుతంగా నీటిలోకి ల్యాండ్ అయిన తీరు విశేషం. దీంతో అద్భుతమంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేసుకోండి. విమానం నుంచి ల్యాండ్ అయిన గొప్ప అనుభూతిని సొంతం చేసుకోండి. Awesome! Look at this elegance and flight control! 🥰 pic.twitter.com/X9WsrrulUZ — Erik Solheim (@ErikSolheim) December 4, 2021 -
విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని.. 3 గంటల ప్రయాణం
విమాన ప్రయానం అంటే ప్రయాణికులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా విమానం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు క్షుణంగా పరిశీలిస్తారు. అయితే తాజాగా ఓ వ్యక్తి విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఏకంగా మూడు గంటల ప్రయాణం చేశాడు. విమానం మరో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా ఆ వ్యక్తిని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చదవండి: Thailand Monkey Festival: ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ! అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ల్యాండింగ్ గేర్‌లో సదరు వ్యక్తి దాక్కున్నాడు. విమానం గాటిమాలా నుంచి మియామి ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. అక్కడ విమానం ల్యాండైన అనంతరం అతన్ని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకొని ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. మూడు గంటలపాటు విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ప్రయాణించినా.. ఈ వ్యక్తికి ఎటువంటి గాయాలూ కాలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. This man arrived to MIA in the landing gear of plane from a Guatemala flight. The flight was about two hours and thirty minutes and witness says he was unharmed😳✈️| #ONLYinDADE pic.twitter.com/qMPP5jjDvb — ONLY in DADE (@ONLYinDADE) November 27, 2021 -
కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!
న్యూఢిల్లీ: మనం ఎక్కడికైన వెళ్తున్నప్పుడూ అనుకోకుండా ఎవరైన మనకు ఇష్టమైన స్నేహితులో, బంధువులో ఎదురైతే మన ఆనందానికి అవధులే ఉండవు కదా. అందులోకి మనకు మరింత ఇష్టమైన వాళ్లైతే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఓ తల్లి కూతుళ్లు ఒక విమానంలో ప్రయాణిస్తుంటారు. (చదవండి: జుట్టుతో లాగేస్తోంది.. ఇది చమురు ధరల ఎఫెక్టేనా?) ఇంతలో తాను ప్రయాణిస్తున్న అదే విమానంలో వాళ్ల నాన్న పైలెట్‌గా రావడం చూసి ఒక్కసారిగా ఆ పాప డాడీ అని అరుస్తుంది. ఈ మేరకు ఆ పాప తల్లి నాన్న కూడా మనతో పాటే ఈ విమానంలోనే వస్తారని చెప్పడంతో ఐలవ్ యూ పప్పా అంటూ ఆనందంతో గెత్తులేస్తుంది. అయితే ఆ పాప తల్లి ప్రియాంక మనోహత్ ఈ సంఘటనను వీడియో తీసి నా చిన్నారి తల్లి షనాయ్ మోతిహర్కి ఈ వీడియో అంకితం అంటూ ట్యాగ్ లైన్ జోడించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు చిన్నారి షెనాయ నాన్న చూడగానే ఎంతలా సంబరపడింది అని ఒకరు, ఇది ఒక అపరూపమైన ఘటం అని మరోకరు అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి. మీరూ ఓ లుక్ వేయండి. (చదవండి: టైంకి ఎయిర్‌పోర్ట్‌కి చేరాలంటే ట్రాక్టర్‌పై వెళ్లక తప్పదు) -
ఘోరం: రష్యాలో విమానం కూలి 16 మంది దుర్మరణం
మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. తతర్‌స్తాన్‌లో ప్రావిన్సుల్లో జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 23 మంది ఉన్నట్లు సమాచారం. పారాచ్యూట్ జంపర్లతో ఎల్ 410 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ప్రమాదం నుంచి ముగ్గురు బయటపడినట్లు స్థానికి మీడియా తెలిపింది. ఇటీవల ఆగస్టు 12న తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ద్వీపకల్పంలో క్రొనొటస్కే నేచుర్ రిజర్వ్ కురిల్ సరస్సు వద్ద హెలికాప్టర్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. తాజాగా ప్రమాదం గురించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. Avião IghtLight L- 410 com 20 paraquedistas e 2 tripulantes caiu no Tartaristão, Rússia. pic.twitter.com/mVoMJXcpbo — JOÃO (@Joo00556315) October 10, 2021 చదవండి: Xi Jinping: తైవాన్ విలీనం తప్పనిసరి! -
పెంపుడు కుక్క విమాన ప్రయాణం.. అందుకోసం మహిళ ఏకంగా..
ఇంట్లో పెంపుడు జంతువులంటే చాలా వరకు కుక్కనే పెంచుకుంటారు. ఇక కొందరైతే వాటిని జంతువుల్లా కాకుండా తమ సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తుంటారు. మరో రకంగా చెప్పాలంటే కుక్కలు మనుషులకు మంచి నేస్తాలు అంటారు. అందుకే కొందరు ఖర్చు ఎక్కువైనా విదేశి జాతి కుక్కలను ప్రత్యేకంగా దిగుమతి చేసుకుని మరీ పెంచుకుంటారు. తాజాగా ఓ మహిళ తన పెట్ డాగ్ కోసం ఏకంగా విమానంలోని బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేసింది. ఇలా మొత్తం బిజినెస్ క్లాస్ క్యాబిన్ లగ్జరీలో ఓ పెంపుడు జంతువు ప్రయాణించడం కోసం బుక్ చేసిన మొదటి సందర్భం కూడా ఇదే. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ మహిళ.. తన పెంపుడు కుక్క మాల్టెస్ విమాన ప్రయాణం కోసం ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్ టికెట్లన్నీ కొనేసింది. అందుకోసం ఆమె ఏకంగా 2.5 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. బిజినెస్ క్లాస్‌లో ముంబై నుంచి చెన్నై వరకు వీఐపీలా మాల్టెస్ ఒక్కటే ప్రయాణించిన లక్కీ డాగ్ అనే చెప్పాలి. ఆ విమానంలో ఒక బిజినెస్ క్లాస్ సీటు కోసం వన్-వే ఛార్జీ సుమారు రూ. 20,000 ఉంటుంది. ఆ పెట్ డాగ్ గత బుధవారం ఉదయం 9 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ఏఐ-671 ముంబై నుంచి బయలుదేరి 10.55 గంటలకు చెన్నైకు చేరింది. అయితే.. ఎయిర్ఇండియా పాలసీ ప్రకారం.. వారి విమానాల్లో జంతువులకు అనుమతి ఉంది. ఒక ప్రయాణీకుడు రెండు పెంపుడు జంతువులతో ప్రయాణించే వెసలుబాటు ఉంది. జంతువుల పరిమాణం ఆధారంగా, వాటిని క్యాబిన్లో లేదా కార్గో హోల్డ్‌లో ఉంచవచ్చు. అయితే బిజినెస్ క్లాస్‌లో, పెంపుడు జంతువులు చివరి వరుసలో కూర్చుంటాయి. ప్రయాణీకుల క్యాబిన్లో పెంపుడు జంతువులను అనుమతించే ఏకైక దేశీయ క్యారియర్ ఎయిర్ ఇండియా. -
మనిషి పుర్రెతో విమానం ఎక్కబోయి..
భోపాల్: ఓ సాధ్వీ మనిషి పుర్రె, ఎముకలు ఉన్న బ్యాగ్‌తో విమానం ఎక్కబోయి అధికారులకు దొరికిపోయింది. ఈ ఘటన ఇండోర్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధ్వీ యోగ్‌మాతా సచ్దేవ్ అనే మహిళ.. ఉజ్జయినీ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఇండోర్ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. ఈ క్రమంలో లగేజ్ స్కానింగ్ వద్ద భద్రతా సిబ్బంది ఆమె బ్యాగ్ తనిఖీ చేయగా.. అందులో పుర్రె, ఎముకలు కనిపించడంతో వారు ఆశ్చర్యపోయారు. అనంతరం సిబ్బంది ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్కి ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపై విచారణ జరపగా.. గంగలో నిమజ్జనం కోసం తన తోటి సన్యాసి అస్తికలను హరిద్వార్‌కు తీసుకువెళుతున్నట్లు చెప్పింది. దీంతో ఎయిర్‌పోర్టు మేనేజ్మెంట్ వాటిని తీసుకుని ప్రయాణించడం కుదరదని ఆమెను ఆపేశారు. చివరికి వాటిని వేరే సాధువులకి ఇచ్చి రోడ్డు మార్గం ద్వారా హరిద్వార్‌కు పంపి, సాధ్వీ మరొక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. చదవండి: ఆఫీసులకు రండి.. మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్! -
హృదయ విదారకం: విమాన టైర్లలో మానవ శరీర భాగాలు, అవయవాలు
కాబూల్: తాలిబన్లు అఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్నప్పటి నుంచి అక్కడి పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య జరిగిన పోరులో అమాయక ప్రజలు బలవుతున్నారు. తాజాగా అమెరికా దీనికి సంబంధించి ఒక హృదయ విదారక ఘటనను వెల్లడించింది. గతంలో తాలిబన్ల చీకటి పాలన రోజులు మళ్ళీ మొదలు కానుందని భావించిన ఆఫ్గన్ ప్రజలు వాటి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాబూల్ విమానాశ్రయం నుంచి ఆదివారం ఎగిరిన అమెరికా వైమానికదళ కార్గో విమానంపై ఎక్కేందుకు జనం ఎగబడిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో టర్మాక్‌పై కూర్చున్న కొందరు విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత కింద పడ్డారు. ఆ హృదయ విదారక దృశ్యాలు మనల్ని కలిచివేశాయి. అయితే సీ-17 గ్లోబ్‌మాస్టర్ సైనిక విమానం లో ఖాళీ లేక కొందరు ఆఫ్గన్లు విమానం వీల్ భాగంలో దాక్కున్నారు. సుమారు 600 మందికి పైగా వెళ్లిన ఆ విమానం ఖతార్‌లోని ఆల్ ఉబెయిద్ ఎయిర్‌బేస్‌లో దిగింది. ఆ విమానం అక్కడ దిగిన తర్వాత వైమానిక దళ అధికారులకి మరో షాక్ తగిలింది. విమాన చక్రం భాగంలో మానవ శరీరభాగాలు, అవయవాలు కనిపించాయని అధికారులు తెలిపారు. సరుకులతో వచ్చిన తమ విమానం కాబూల్‌లో ల్యాండ్ అయిన కొద్ది సేపట్లోనే వందలాది మంది విమానం ఎక్కారో తమకు తెలియదని అమెరికా అధికారులు తెలిపారు. అక్కడి పరిస్థితి పూర్తిగా అదుపుతప్పుతున్నట్లు కనిపించడంతో వెంటనే సీ-17 విమానాన్ని కాబూల్ నుంచి తరలించామన్నారు. కాబూల్ విమానాశ్రయంలో వెలుగు చూసిన ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు అమెరికా వైమానిక దళం తెలిపింది. విమానాశ్రయం వద్ద ఏర్పడ్డ గందరగోళంలో పలువురు మృతిచెందగా, ఎంత మంది అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. చదవండి: కోర్టు తీర్పును టైప్ చేస్తున్న స్టెనోగ్రాఫర్.. అంతలోనే.. -
అఫ్గాన్ల దుస్థితికి అద్దం పడుతున్న దృశ్యాలు!
కాబూల్: అఫ్గనిస్తాన్‌లో ప్రస్తుతం తాలిబన్ల రాకతో భీతిల్లుతున్న అక్కడి ప్రజలు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దేశం విడిచి పారిపోతున్నారు. కాబూల్ విమానాశ్రయం నుంచి వచ్చిన ఓ అమెరికా విమానంలోని దృశ్యం.. అఫ్గన్ ప్రజల దుస్థితికి అద్దం పడుతోంది. అందులో.. ప్యాసింజర్ రైలులా ఏకంగా 640 మంది ఒకే విమానంలో ప్రయాణించారు. గతంలో తాలిబన్ల అరాచక పాలన చవి చూసిన ప్రజలు మళ్లీ ఆ చీకటి రోజులు రాబోతున్నాయని భయపడుతున్నారు. దీంతో ఒక్కసారిగా అఫ్గన్ వాసులు సోమవారం దేశం విడిచి వెళ్లేందుకు కాబుల్ విమానాశ్రయానికి పోటెత్తారు. దీంతో ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో కాస్త ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. బస్సుల్లో సీట్ల కోసం అన్నట్టుగా అఫ్గన్లు విమానాల్లో చోటు కోసం రన్‌వేపై పరుగులు తీశారు. విమాన0 లోపలికి ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే యూఎస్ కు చెందిన ఓ విమానంలో దాదాపు 640 మంది ప్రజలు ఎక్కేసారు. అలా ఆ విమానంలో అంత మంది ప్రయాణించడం ఇదే మొదటి సారి కూడా. వారి వద్ద ఎలాంటి వస్తువులు, లగేజీ కన్పించలేదు. తాలిబన్ల నుంచి తప్పించుకునే క్రమంలో తమ ప్రాణాలు మాత్రం చాలని అన్నీ వదులుకుని ఇతర దేశాలకు పారిపోతున్నారు. దీంతో ఈ విమానం రైల్లో జనరల్ బోగీని తలపించింది. ఈ ఫొటోలను అమెరికా అధికారిక మీడియా సంస్థ ‘డిఫెన్స్ వన్’ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
కాక్‌పిట్‌లోకి వెళ్లే ప్రయత్నం; విమానం నుంచి దూకేశాడు
లాస్ ఏంజిల్స్: కదులుతున్న విమానం నుంచి ఓ ప్రయాణికుడు కిందకు దూకేసిన ఘటన లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. వివరాలు.. సాల్ట్ లేక్ సిటీకు వెళ్లాల్సిన యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ విమానం 5365ను స్కై వెస్ట్ నిర్వహిస్తోంది. కాగా సాయంత్రం 7 గంటల తర్వాత డోర్ తీసేందుకు ప్రయత్నించిన యువకుడు విమానంలో నుంచి బయటకు దూకేశాడు. అంతకముందు పైలట్లు ఉన్న కాక్‌పిట్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.ఆ తర్వాత సర్వీస్ డోర్ ఓపెన్ చేయాలనుకోగా.. చివరికి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కావడంతో అక్కడినుంచి దూకేశాడు. ఇది గమనించిన ఎయిర్పోర్ట్ అధికారులు అతన్ని కస్టడీలోకి తీసుకుని ట్యాక్సీవేలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో విమానం టేకాఫ్ తీసుకొని మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. అతను విమానం నుంచి దూకేయడం వెనుక ఉన్న కారణాలు తెలియరాలేదు. కాగా ఈ ఘటనపై ఎఫ్‌బీఐ విచారణ చేయనుంది. చదవండి: వార్నీ.. మంచం కింద ఇంత పెద్ద సొరంగమా..! -
ఎంత అదృష్టమో..! విమానంలో ఒక్కడే పాసింజర్
చండీగఢ్: మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పడు ఎంటువంటి ఇబ్బంది లేకుండా.. కూర్చోవడానికి ఓ సీటు దొరికి సౌకర్యవంతంగా ఉండాలి అనుకుంటాం. కానీ అది వీలు పడదు. ఎందుకంటే మనం ఒక్కరమే వెళ్లాలి అనుకుంటే బోలెడు ఖర్చు చేస్తే కానీ కుదరు. అయితే, ఖర్చేమీ లేకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక్కరమే వెళితే! ఆ కిక్కే వేరు. అలాంటి అవకాశం చాలా కొద్ది మందికే వస్తుంది. అటువంటింది ఓ వ్యక్తికి ఏకంగా విమానంలో ఒంటరిగా ప్రయాణించే అవకాశం దక్కింది. అవును మీరు విన్నది నిజమే. దుబాయ్ కి చెందిన ఓ భారతీయ వ్యాపార వేత్త ఎయిర్ ఇండియా విమానంలో ఒంటరిగా ప్రయాణించాడు. సామాజిక కార్యకర్త, వ్యాపార వేత్త అయిన ఎస్.పి.సింగ్ ఒబెరాయ్ బుధవారం అమృత్ సర్ నుంచి దుబాయ్‌కి ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత.. అందులో తాను ఒక్కరే ప్యాసింజర్ అని గుర్తించి ఆశ్చర్యపోయాడు. మూడు గంటల పాటు నడిచే ఈ విమానంలో ఒంటరిగా ప్రయాణించడం మహారాజులా అనిపించిందని ఒబెరాయ్ తెలిపాడు. అమృత్ సర్ నుంచి దుబాయ్‌కి జరిగిన ఈ ప్రయాణంలో చాలా అనుభూతిని పొందానని,. ఫ్లైట్ లోని ఉద్యోగులంతా తనను ఎంతో ప్రత్యేకంగా ట్రీట్ చేశారని.. ఖాళీ ఫ్లైట్ లో తన ఫొటోలు కూడా తీశారని చెప్పాడు. విమానంలో ఒక్కరే ప్యాసింజర్ ఉండడం వల్ల మొదట ఈ ఫ్లైట్ ఎక్కేందుకు ఒబెరాయ్ కి అనుమతి లభించలేదట. తరువాత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి చెందిన ఆఫీసర్లతో మాట్లాడించిన తర్వాత ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతిచ్చారట. ‘నా దగ్గర గోల్డెన్ వీసా కూడా ఉంది, నా దగ్గర అన్ని రకాల ట్రావెల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎట్టకేలకు ఏవియేషన్ మినిస్ట్రీ సివిల్ అనుమతి’ విమానంలోకి అనుమతించారు. చదవండి:కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో పాస్‌పోర్ట్ వివరాలను సమర్పించడం ఎలా? -
ఫ్లైట్‌లో దంపతుల ముద్దులు.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టస్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ఒక కపుల్ విమానంలో చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. విమానంలో ఉన్నామన్న సంగతి మరిచి వారిద్దరు ముద్దుల్లో మునిగిపోయారు. అయితే ఇది చూసిన తోటి పాసింజర్ సివిల్ ఏవియేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మే 20న చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే కరాచీ- ఇస్లామాబాద్‌కు వెళ్తున్న పీఏ-200 ఫ్లైట్‌లో ఒక కపుల్ నాలుగో వరుసలో కూర్చున్నారు. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఆ దంపతులు ఒకరికి ఒకరు ముద్దులు ఇచ్చుకోవడం ప్రారంభించారు. వారి వెనకాలే కూర్చున్న ఒక వ్యక్తి వారి చర్యలకు ఇబ్బంది పడి ఎయిర్ హోస్టస్‌ను పిలిచి చెప్పాడు. ఆమె వెళ్లి మీ చర్యలతో చుట్టుపక్కల వాళ్లకు అభ్యంతరం ఉందని.. ఇలాంటివి చేయకూడదని వివరించింది. అయినా వారు పట్టించుకోకుండా తమ పనిలో మునిగిపోయారు. దీంతో ఎయిర్ హోస్టస్ వారికి బ్లాంకెట్ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయింది. అయితే బిలాల్ ఫరూక్ ఆల్వీ అనే అడ్వకేట్ కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ దంపతులు చేసే పనిపై ఎలాంటి చర్యలు తీసుకోని విమాన సిబ్బందిపై సివిల్ ఏవియేషన్ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో సీఏఏ విమాన సిబ్బందితో ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలని మందలించారు. అయితే అప్పటికే ఈ వార్త సోషల్ మీడియాకు పాకడంతో వైరల్‌గా మారింది. విమానంలో కపుల్ చేసిన పనిపై ఫిర్యాదు చేసిన అడ్వకేట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో మీమ్స్, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. చదవండి: వైరల్: వేలంలో 213 కోట్లు పలికిన ‘‘ది సాకురా’’ Live scenes from Airblue. pic.twitter.com/FkVbzpLXfT — 𝕾 🇵🇸 (@seennzoned) May 25, 2021 Air-host to other Passengers after giving blanket to kissing couple on #AirBlue pic.twitter.com/OqtwTxoiJw — Junaid Khawar (@jjkhawar) May 25, 2021 Air Hostess gives blanket to kissing couple in #Airblue flight. Single me: pic.twitter.com/gUvNWAiBVY — Malik Muzamil (@mozammalnawaz) May 26, 2021 #Airblue Guy on seat no. 5 : pic.twitter.com/K6F01ah5Wc — ابرار ابنِ عزیز (@ballisays) May 25, 2021 -
వైరల్ వీడియో: పెళ్లితో ఒక్కటైన జంట.. భూమ్మీద కాదండోయ్!
-
ఊహల్లోనే ఇవి సాధ్యం.. కానీ చేసి చూపించారు
కారు అయితే రోడ్డుపై వెళుతుంది...అదే విమానం అయితే ఆకాశంలో వెళ్లాలనేది అందరికి తెలిసిన విషయమే. అలాంటిది కారును, విమానాన్ని ఏకకాలంలో వాడుకునేందుకు కుదరదు. అది ఊహల్లో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ అలాంటి ఊహను మనకు నిజం చేసి చూపించారు స్లోవేకియా ఎయిర్‌లైన్స్ అధికారులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని స్లోవేకియా సంస్థ క్లీన్విజన్ తయారుచేసింది. ఇటీవలే టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు.(చదవండి : టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం) కారు రన్‌వేపై వెళ్లేటప్పుడు విమానంలాగా రెక్కలు వచ్చి, ఒక్కసారిగా గాల్లోకి లేచింది. భూమినుంచి 1,500 అడుగుల ఎత్తులో స్లోవేకియా మీదుగా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిని ఎయిర్కార్గా పిలుస్తున్నారు. గాలిలో ఎగిరే కారును చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఎయిర్‌కార్‌ను రెండు సీట్లున్న ఈ కారు మోడల్ బరువు 1,100 కిలోలు. 200 కిలోల అదనపు లోడ్ మోయగలదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బీఎండబ్ల్యూ 1.6 ఎల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఈ కార్-ప్లేన్ 140 హెచ్‌పీ శక్తిని కలిగి ఉంటుంది. 1,000 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదు.(చదవండి : 50 అడుగుల అనకొండ.. వీడియో వైరల్) -
లవర్ మీద కోపం ఉంటే ఇలా చేస్తారా?
బీజింగ్ : విమానంలో ప్రయాణిస్తున్న 29 ఏళ్ల మహిళ మద్యం మత్తులో విమానం కిటికీని పగలకొట్టడంతో పైలట్ అత్యవసరంగా విమానం ల్యాండ్ చేసిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వారం కిందట చోటుచోసుకోగా తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. లూంగ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 8528 నార్త్ వెస్ట్రన్ చైనా ప్రావిన్స్‌లోని జీనింగ్ నుంచి ఈస్ట్ చైనాలోని యాన్చెంగ్కు బయలుదేరింది. చైనాకు చెందిన ఎంఎస్ లీ పూటుగా మద్యం తాగి విమానంలో ఎక్కి కూర్చుంది. కొద్దిసేపటి తరువాత పక్కనే ఉన్న కిటికీపై అదే పనిగా పంచ్‌ల వర్షం కురిపించింది. దీంతో అక్కడున్న తోటి ప్రయాణికులు ఆమెను వారించేందుకు యత్నించగా వారిని నెట్టివేస్తూ మరీ కిటికీ అద్దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించింది. విమానంలో ఉన్న సిబ్బంది ఆమెను సీటు నుంచి బలవంతంగా లేపడానికి యత్నించడం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. ఈ విషయం పైలట్‌కు చేరవేయడంతో అతను ఉన్నపళంగా సెంట్రల్ చైనా ఫ్రావిన్సులోని జిన్జెంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండిగ్ చేశాడు.సిబ్బంది సమాచారంతో అప్పటికే అక్కడికి చేరుకున్నఎయిర్‌పోర్ట్ అధికారులు ఎంఎస్ లీని జెంజోహు పోలీసులకు అప్పగించారు.(కరోనా: మగవాళ్లలోనే ఎందుకు మరణాలు ఎక్కువ?) తన బాయ్‌ఫ్రెండ్ మీద ఉన్న కోపంతో విమానంలోని కిటికీని బద్దలు కొట్టడానికి ప్రయత్నించిందని పోలీసులు పేర్కొన్నారు. విమానం ఎక్కడానికి ముందే బోర్డింగ్ సమయంలో 250 మి.లీ కలిగిన రెండు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసిందని తెలిపారు. చైనీస్ గ్రేయిన్ ఆల్కాహాల్ అయిన బైజీహులో 35-60 శాతం మద్యం ఉంటుంది. లవర్ తనను మోసం చేశాడనే అసహనంతోనే లీ కిటికీని పగలగొట్టడానికి యత్నించిందని పేర్కొన్నారు. పబ్లిక్ ప్లేస్‌లో ఇష్యూ చేసిన కారణంతో లీపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆమెను ఎంతకాలం రిమాండ్‌లో ఉంచాలి, విమానానికి జరిగిన నష్టానికి జరిమానా విధించాలా వద్దా అనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లీ చేసిన తప్పుకు చైనా సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు ఆమె పాస్‌పోర్టును రద్దు చేసి బ్లాక్ లిస్ట్‌లో చేర్చే అంశంపై కూడా ఎలాంటి స్పష్టత రాలేదు.(24 గంటల్లో 10,667 కేసులు.. 380 మరణాలు) -
విజయవాడలో విహంగ విందు
ఆకాశంలో విమానాన్ని చూస్తూ కలల్లో విహరించే రోజులు పోయాయి. లోహ విహంగాల్లోనే చక్కర్లు కొట్టే రోజులు వచ్చేశాయి. పెరిగిన ఆర్థిక స్థితిగతులు, విమానయాన సంస్థల మధ్య పోటీతో మొదటి తరగతి రైలు ప్రయాణ చార్జీలతోనే విమానాల్లో దేశీయంగా ప్రయాణం చేసేయవచ్చు. అయితే విమానాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం, కాసేపు విశ్రాంతి తీసుకోవడం, పిల్లలతో కలిసి గేమ్స్ ఆడుకోవడం ఇవన్నీ సాధ్యమేనంటారా... అంటే సాధ్యమేనంటున్నారు విజయవాడ ట్రేడ్ వర్గాలు.. నగరవాసులకు అతి త్వరలో విమాన రెస్టారెంట్ అందుబాటులోకి రానుంది. దక్షిణభారతంలోనే మొట్టమొదట విజయవాడలోనే ఈ రెస్టారెంట్ ఏర్పడనుండడం విశేషం. సాక్షి,విజయవాడ : మారుతున్న కాలానుగుణంగా ప్రతి విషయంలో ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారు. ఈ ఫీవర్ రెస్టారెంట్ల విషయంలో అధికంగా ఉంది. ఇప్పటి వరకు రైలు భోగిల్లాగా, బస్సు ఆకారాల్లో, నీటిపైన తేలియాడే రెస్టారెంట్లను చూశాం. దీనికి భిన్నంగా ఏకంగా విమాన రెస్టారెంట్ కల్చర్ నగరంలో అడుగు పెట్టబోతుంది. దేశంలో నాలుగుచోట్ల మాత్రమే అందుబాటులో ఉన్న ఈ రెస్టారెంట్లు ప్రస్తుతం దక్షిన భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా విజయవాడరూరల్ మండలం నిడమానూరులో ఆగస్టు చివర్లో అందుబాటులోకి రానుంది. చేరుకోవడానికే 50 రోజులు ఎయిర్ఇండియాకు చెందిన 44 మీటర్ల పొడవు కలిగిన బోయింగ్ 737 విమానాన్ని నగరానికి తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఓ భారీ ట్రైలర్ ట్రక్‌లో సుమారు 50 రోజుల పాటు రోడ్డు మార్గంలో నలుగురు నిపుణులైన ట్రక్ డైవర్ల సారథ్యంలో ప్రయాణించి చివరికి నిడమానూరు చేరుకుంది. ఈ విమానం ఖరీదుకు కోట్ల రూపాయలు వెచ్చించగా ఢిల్లీ నుంచి నగరానికి తీసుకురావడానికే రూ.12లక్షలకు పైగా ఖర్చు చేయడం విశేషం. గేమింగ్ జోన్ సైతం.. ప్రస్తుతం ఈ విమానాన్ని రెస్టారెంట్‌కు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. ఇంటీరియర్స్‌ను చెక్కతో డిజైన్ చేస్తున్నారు. బాడీ మొత్తం ఆకర్షణీయమైన రంగులతో ముస్తాబు చేయనున్నారు. కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు సెంట్రల్ ఏసీ ఫుడ్ కోర్టు స్టాల్స్‌తో పాటు పిల్లలు గేమ్స్ ఆడుకునేందుకు గేమింగ్ జోన్‌కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 189 ప్యాంసింజర్స్ కెపాసిటీ కలిగిన ఈ బోయింగ్ విమాన రెస్టారెంట్లో 80 మంది సౌకర్యవంతంగా కూర్చునే విధంగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా విమాన రెక్కలపై కూడా సీటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తుండటం విశేషం. చవులూరించే డిష్‌లు భోజనప్రియుల కోసం ఈ విమాన రెస్టారెంట్లో కొత్త కొత్త వెజ్, నాన్‌వెజ్ రుచులు అందించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. నార్త్, వెస్ట్ బెంగాల్, చైనీస్, ఆంధ్రా, గోదావరి రుచులతో పాటు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డిష్‌లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందు కోసం ఆయా ప్రాంతాల నుంచి పేరుగాంచిన చెఫ్‌లతో నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నారు. -
విమానంలో భయంకర చర్య, వైరల్ వీడియో
అమెరికాలోని మిన్నెపోలీస్కు చెందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక పబుద్ధుడు కలకలం రేపాడు. విమానంలో ఉన్నట్టుండి ఒక ప్రయాణికుడు లైటర్ సహాయంతో దర్జాగా సిగరెట్ ముట్టించాడు. దీంతో పక్క వరుసలో కూర్చున్న మహిళా ప్రయాణికురాలు బిత్తరపోయింది. మిగిలిన ప్రయాణికులు కూడా భయాందోళనకు లోనయ్యారు. చివరకు ఫ్లైట్ అడెంటెండ్కు ఫిర్యాదు చేశారు. విమానం ఎక్కిన దగ్గరనుంచి అతను వింతగా ప్రవర్తిస్తున్నాడని సహ ప్రయాణికురాలు ఆరోపించారు. అందుకే సిగరెట్ ముట్టించగానే వీడియో తీసానని పేర్కొన్నారు. ఈ భయంకరమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చట్ట విరుద్ధంగా లైటర్‌ను విమానంలోకి ఎలా తీసుకొచ్చాడు.. ధూమపానం ఎలా చేశాడు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. -
విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు
టెహ్రాన్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో మంగళవారం పెనుప్రమాదం తప్పింది. ల్యాండవుతున్న ఓ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని సురక్షితంగా కిందకు దించేశారని అధికారులు తెలిపారు. ఇరాన్ ఎయిర్ సంస్థకు చెందిన ఫాకర్ 100 విమానంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సాంకేతిక కారణాల వల్ల ల్యాండింగ్ గేర్ సరైన సమయంలో తెరచుకోలేదని.. అందువల్లే ప్రమాదం సంభవించినట్లు అధికారుల భావిస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసి వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. విమానాశ్రయంలోని అంబులెన్సులు గాయాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు.. ప్రమాదానికి గల కారణాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. Plane catches fire at Tehran's Mehrabad airportpic.twitter.com/VToujBXdZI — Matilda Effect (@matilda_effect) March 19, 2019 -
కలను ఇలా నిజం చేసుకున్నాడు!
బీజింగ్: ప్రతి మనిషికీ ఒక కల ఉంటుంది. దాన్ని నిజం చేసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో దారి వెతుక్కుంటారు. అయితే మన స్తోమతకు మించిన కలలు కంటే మాత్రం అవి ఎప్పటికీ అలాగే మిగిలిపోతాయి. కానీ చైనాకు చెందిన ఓ రైతు మాత్రం తన తాహతుకు మించిన కలను సైతం నిజం చేసుకున్నాడు. ఇంతకీ విషయమేంటంటే... చైనాకు చెందిన జుయీ అనే రైతుకు జీవితంలో ఎలాగైనా ఓ విమానం కొనుక్కోవాలనే ఆశ ఉండేది. అయితే, ఏ దేశంలో అయినా రైతుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కదా. మహా అయితే కొంచెం ఖరీదైన కార్లు మాత్రమే కొనగలరు. ఇక విమానమంటే అసాధ్యమే. దీనికి జుయీ సైతం అతీతుడు కాదు. అందుకే ఎలాగైనా తన కలను నిజం చేసుకోవాలనుకున్న జుయీ ఏకంగా విమాన ఆకారంలో ఓ నిర్మాణం చేపట్టాడు. ఎయిర్‌బస్ ఏ320 విమానాన్ని పోలి ఉండే నమూనా తయారు చేయించుకుంటున్నాడు. రెండేళ్ల నుంచి సాగుతున్న ఈ నిర్మాణం దాదాపు తుదిదశకు చేరింది. దీనికోసం జుయీ ఇప్పటి వరకూ 2.6 మిలియన్ యువాన్లు (సుమారు రూ.2 కోట్లు) వెచ్చించాడు. 124 అడుగుల పొడవు, 118 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ విమానం గాలిలోకి ఎగరలేకపోయినా.. తన కల నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉందని జుయీ చెబుతున్నాడు. నిర్మాణం పూర్తయ్యాక దీనిలో ఓ రెస్టారెంటును పెడతానని అంటున్నాడు. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
చెన్నై: తిరుచ్చి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానం రన్‌పైకి వెళ్లే సమయంలో సిగ్నల్ టవర్‌ను తాకుతూ వెళ్లింది. విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం తిరుచ్చి నుంచి దుబాయ్ వెళ్లాల్సి ఉంది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆకాశయానంలో అనుకోని కష్టం
మన దేశంలో విమానయాన భద్రతకు సంబంధించి అనుసరిస్తున్న విధానాల్లో లోపాలున్నాయని అమెరికాకు చెందిన ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) రెండు నెలలక్రితం చెప్పింది. వచ్చే 65 రోజుల్లోగా వాటిని సరిదిద్దుకోవాలని కోరింది. ఈలోగానే వెంట్రుకవాసిలో ఒక పెద్ద ప్రమాదం తప్పిపోయింది. గురువారం ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ బోయింగ్ 737 శ్రేణి విమానంలో ఒక్కసారిగా పీడనం పడిపోవటంతో అందులోని 168 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. వారిలో 30 మందికి ముక్కుల్లోంచి, చెవుల్లోంచి నెత్తురు స్రవించింది. విమానంలో గాలి పీడనాన్ని నియంత్రించే మీట నొక్కటం మరిచిపోవటంవల్ల ఈ పరిణామం ఏర్పడింది. ఇలాంటి పొరపాట్ల పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 2005లో సైప్రస్ నుంచి గ్రీస్‌లోని ఏథెన్స్కు 115 మందితో వెళ్తున్న హెలియోస్ ఎయిర్వేస్ బోయింగ్ విమానంలో ఇలాంటి పొర బాటే జరిగి అది కుప్పకూలింది. పైలెట్లు మీట నొక్కడం మర్చిపోవటమే కాక పీడనం తగ్గుతున్నా గమనించలేకపోయారు. అంతే కాసేపటికి హైపోక్సియా (ఆక్సిజెన్ లోపించటం) ఏర్పడి వారు స్పృహ కోల్పోయారు. విమానాన్ని ఆటో పైలెట్ పద్ధతిలో ఉంచటంతో అది ఇంధనం అయిపోయేంతవరకూ గాల్లో ఎగిరి గ్రీస్ పర్వతాల్లో కూలిపోయింది. ఆ ప్రమాదంలో సిబ్బంది సహా 121 మంది మరణించారు. విమానయాన భద్రత వ్యవహారాలను దేశంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వ ర్యంలోని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) పర్యవేక్షిస్తుంది. ఆ సంస్థ అనుసరిస్తున్న నియంత్రణ విధానాలు సంతృప్తికరంగా లేవని ఎఫ్ఏఏ తేల్చింది. ఎఫ్ఏఏకన్నా ముందు అంతర్జా తీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ) సైతం ఈ తరహా అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. విమా నయాన భద్రత పర్యవేక్షణలో భారత్ స్థితి పాకిస్తాన్, నేపాల్ దేశాలతో పోల్చినా నాసిరకంగా ఉన్న దని వ్యాఖ్యానించింది. వైమానిక భద్రతలో మన స్కోరు 65.82 నుంచి 57.44కు పడిపోయిందని అది తేల్చింది. దేశంలోని వివిధ విమానాశ్రయాలకు రోజూ వేలాది విమానాల రాకపోకలు సాగు తుంటాయి. ఇంతవరకూ ఈ మాదిరి ఘటన ఎప్పుడూ జరగలేదు. విమానం ఇంజిన్ ఆన్ చేసే ముందు క్యాబిన్లో ఒత్తిడి ఏమేరకు ఉందో పైలెట్లు చూసుకుంటారు. టేకాఫ్‌కు ముందు గాలి పీడ నాన్ని నియంత్రించే బటన్ నొక్కుతారు. దాంతో ఇంజిన్ నుంచి వేడి గాలి ఏసీ వ్యవస్థలోని హీట్ ఎక్స్చ్ంజర్లోకి ప్రవేశిస్తుంది. ఆ వ్యవస్థ దాన్ని చల్లగా మార్చి కేబిన్‌లోకి పంపుతుంది. పర్యవసా నంగా కేబిన్‌లో ఉష్ణోగ్రత, పీడనం నియంత్రణలో ఉంటాయి. ఇదంతా నిత్యం యధావిధిగా సాగి పోతుంది. కానీ జెట్ ఎయిర్వేస్ విమానం ప్రధాన పైలెట్ దీన్ని మరిచిపోయారు. విమానం గాల్లో 10,000 అడుగులు లేచాక పది నిమిషాల్లోనే ఆ ప్రభావం ప్రయాణికుల అనుభవంలోకొచ్చింది. ఆక్సిజెన్ స్థాయి పడిపోయింది. వెంటనే పొరపాటు గ్రహించి విమానాన్ని వెనక్కి తీసుకురావటంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. దీనంతటికీ 23 నిమిషాలు పట్టింది. 30మంది అస్వస్థులయ్యారు. ముక్కు, చెవుల్లోంచి రక్తం వచ్చినవారు కొందరైతే, కొందరికి దాంతోపాటు వినికిడి లోపం కూడా ఎదురైంది. దీన్ని గుర్తించటంలో ఇంకా ఆలస్యమై ఉంటే ముందు ఊపిరితిత్తులకు, తర్వాత మెదడుకు ఇబ్బందులు ఎదురై శాశ్వత అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. బీపీ, హృద్రోగ సమస్యలున్నవారికి ప్రాణాలకే ముప్పు కలగొచ్చు. ప్రధాన పైలెట్‌కు విమానాల్ని నడపడంలో 14 ఏళ్ల అనుభవం ఉంది. అయినా ఈ ఘటన చోటుచేసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలికాలంలో ఎయిరిండియా విమానాన్ని మాల్దీవుల్లోని మాలే విమానాశ్రయంలో నిర్దేశిత స్థలంలో కాక నిర్మాణంలో ఉన్న వేరే రన్‌వేపై దించటం వివాదాస్పదమైంది. పైలెట్ చేసిన తప్పిదం కారణంగా విమానం ప్రధాన చక్రాలు దెబ్బతిన్నాయి. అనుకోనిదేమైనా జరిగుంటే విమానంలోని 136మంది ప్రయాణికులకు ముప్పు ఏర్పడేది. ఢిల్లీ నుంచి 370మంది ప్రయాణికులతో న్యూయార్క్ వెళ్లిన మరో ఎయిరిండియా విమానం పదిరోజులక్రితం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ విమానానికున్న బహువిధ వ్యవస్థలు ఒక్కసారిగా విఫలం కావటం, వాతావరణ పరిస్థితి బాగులేక పోవటం, అన్నిటికీ మించి విమానంలో ఇంధనం దాదాపు అడుగంటడం వంటివి ఒకేసారి చుట్టుము ట్టాయి. అయితే పైలెట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో మాట్లాడి అనుమతి తీసుకుని జాగ్రత్తగా కిందకు దించాడు. సుదూర ప్రాంతాలకెళ్లే విమానంలో ఇలా బహువిధ వ్యవస్థలు విఫలం కావటం అసాధారణమైన విషయం. విమానం గాల్లోకి లేచాక అందులో ఎదురయ్యే ఏ సమస్య విషయంలోనైనా విమాన సిబ్బంది వ్యవహరించే తీరు చాలా ముఖ్యమైనది. వారు ఏమాత్రం కంగారు పడినట్టు కనిపించినా, సమయస్ఫూర్తితో వ్యవహరించకపోయినా ప్రయా ణికుల్లో ఉండే కంగారు మరింత పెరుగుతుంది. ఎఫ్ఏఏ ఆడిట్లో బయటపడిన అంశాలపై మన డీజీసీఏ శ్రద్ధ పెట్టి గట్టి చర్యలు తీసుకోవడం తప్ప నిసరి. ఆ సంస్థ నిబంధనల ప్రకారం అది ఎత్తిచూపిన లోటుపాట్లపై 30 రోజుల్లోగా నివేదిక పంపాలి. ఆ తర్వాత ఎఫ్ఏఏ ప్రతినిధి బృందం మరో నెలరోజుల్లో వచ్చి ఏ తరహా చర్యలు తీసుకు న్నదీ సమీక్షిస్తుంది. దాని ప్రమాణాలకు అనుగుణంగా లేదన్న అభిప్రాయం కలిగితే కొత్తగా మన దేశం నుంచి వెళ్లే విమానాలను అనుమతించటం నిలిపేస్తారు. ఇప్పుడు నడుస్తున్న విమానాలకు కఠినమైన తనిఖీలు మొదలవుతాయి. పర్యవసానంగా విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ తనిఖీలన్నీ పూర్తయి ప్రయాణికులు దిగి విమానాశ్రయ ప్రాంగణంలోకి చేరుకోవటానికి బోలెడు సమయం పడుతుంది. దాంతో ఆ దేశానికెళ్లే ప్రయాణికులు మన విమానయాన సంస్థల్ని ఎంచుకోవటం మానుకుంటారు. తరచు సమస్యలెదురవుతున్నపుడు, ఎఫ్ఏఏ, ఐఓసీఏ వంటి సంస్థలు లోపాలు ఎత్తిచూపినప్పుడు సమీక్షించి అవసరమైన మార్పులు చేపట్టడం అవసరం. ఈ విషయంలో నిర్లక్ష్యం మంచిది కాదు. -
మెక్సికోలో కూలిన విమానం
-
ఛీ.. విమానంలో ఇదేం పాడుపని!
మెక్సికో : హాలీడే ట్రిప్ వెళ్తున్న ఓ జంట తమ వెనుక సీట్లో జరిగిన తతంగాన్ని వీడియో తీసింది. ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. విమానం చివరి సీట్లో కూర్చున్న జంట ఎవరేమనుకుంటే మాకేంటి అన్నట్లుగా శృంగారంలో పాల్గొన్నారు. మెక్సికోకు వెళ్తుండగా విమానంలో జరిగిన ఈ తతంగాన్ని కీలీ టుల్లీ ట్విటర్లో పోస్ట్ చేయగా విషయం వెలుగుచూసింది. కీలీ టుల్లీ పేరెంట్స్ మెక్సికోకు హాలీడే ట్రిప్‌కు మిలే మై క్లబ్ ఎయిర్‌లైన్స్‌లో వెళ్తున్నారు. ఇంతలో వారి వెనుక కూర్చున్న వాళ్లు ముద్దులు పెట్టుకున్నట్లు గమనించారు. చివరి సీట్లలో కూర్చున్న మరో జంట తమ వ్యక్తిగత చర్యలను కానిచ్చేశారు. అయితే కీలీ టుల్లీ పేరెంట్స్ వెనుక జరుగుతున్న చర్యను తమ మొబైల్లో వీడియో తీశారు. మా అమ్మానాన్న టూర్ వెళ్తుంటే ఇలాంటి దృశ్యాన్ని చూడాల్సి వచ్చిందంటూ కిలీ టుల్లీ పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన కొందరు.. ఎవరైనా మిలే హై క్లబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అంటూ కామెంట్ చేశారు. వాళ్లు అంత బరితెగించారా అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అతి పెద్ద విమానం.. అంతరిక్ష ప్రయాణం..!!
కొలరాడో, అమెరికా : ప్రపంచంలోనే అతి పెద్ద విమానం ‘స్ట్రాటో లాంచ్’ అతి త్వరలోనే తొలిసారి గగనయానం చేయనుంది. దాదాపు ఫుట్‌బాల్ మైదానమంత భారీ రెక్కలు కలిగిన ఈ విమానానికి రెండు కాక్‌పిట్స్, 28 చక్రాలు, ఆరు ఇంజన్లను అమర్చారు. సాధారణంగా ఆరు ఇంజన్లలతో 747 జంబో జెట్లను నడపొచ్చు. భవిష్యత్‌లో ఈ విమానం ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడానికి, అంతరిక్ష యానానికి వెళ్లే ప్రజలను భూమి నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్ట్రాటోస్పియర్కు చేర్చడానికి ఉపయోగపడనుంది. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు పాల్ అలెన్ కలలకు రూపం స్ట్రాటో లాంచ్. కొలరాడోలో జరిగిన 34వ స్పేస్ సింపోజియంలో ఈ వేసవిలో విమానం తొలిసారి గగనతల విహారానికి వెళ్లనుందనే ప్రకటన వెలువడింది. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు స్ట్రోటో లాంచ్ కొన్ని రాకెట్లను మోసుకెళ్లనుంది కూడా. ప్రస్తుతం ఉన్న అన్ని టెక్నాలజీల కన్నా అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోని స్ట్రాటో లాంచ్ ద్వారా ప్రయాణించొచ్చని పాల్ అలెన్ తెలిపారు. -
విమానం నేలకూల్చేందుకు కుట్ర
కాన్బెర్రా: విమానంపై ఉగ్రదాడి కుట్రను ఆస్ట్రేలియా పోలీసులు భగ్నం చేశారు. సిడ్నీ సబర్బన్‌లో పలు చోట్ల దాడులు చేసిన పోలీసులు కుట్ర పన్నిన ఉగ్రవాదులను ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్నబుల్ ఓ ప్రకటన చేశారు. గురువారం నుంచి సిడ్నీ ఎయిర్‌పోర్టులో భద్రతను పెంచామని, అందుకు కారణం ఉగ్రదాడి జరుగుతుందని ఇంటిలిజెన్స్ రిపోర్టులు అందడమేనని తెలిపారు. మిగిలిన ఎయిర్‌పోర్టుల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకూ నలుగురిని అరెస్టు చేశారని, మిగిలిన వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నట్లు తెలిపారు. -
టేకాఫ్ సమయంలో పక్షి ఢీ కొట్టడంతో..
రాంచీ: టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో పక్షి ఢీకొనడంతో ఎయిర్ ఏసియా ఇండియా విమానం వెనక్కు వచ్చింది. జార్ఖండ్‌లోని రాంచీ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఈ విమానం ఎయిర్‌పోర్టు(బిర్సామండా)లో టేకాఫ్ తీసుకుంటున్న క్రమంలో పక్షి ఢీకొంది. దీంతో విమానం సిబ్బంది వెంటనే ప్రయాణాన్ని రద్దు చేసి ప్రయాణికులను రన్‌వే మీదకు దింపారు. ఈ సమాచారాన్ని విమాన సంస్థ ఎండీ, సీఈఓ అమర్ అబ్రాల్ తెలిపారు. అయితే ఈ సంఘటన కారణంగా ప్రయాణికులెవరికీ ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదన్నారు. వారికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. అక్కడ అత్యవసర ఏర్పాట్లు ఏమీ లేకపోవడంతో విమానం ఇంకా రాంచీ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయింది. పక్షి ఢీకొనడంతో విమానం రెక్కలు బాగా దెబ్బతిన్నాయి. సంఘటన జరిగిన సమయంలో విమానంలోనుంచి పొగలు వచ్చాయని, దాంతో ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా బయటకు తెచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.