విమాన టికెట్లపై సంస్థలు ప్రత్యేకంగా ఫ్యూయెల్ ఛార్జీను వసూలు చేస్తూంటాయి. అయితే గత మూడునెలలుగా విమానాల్లో వాడే జెట్ ఇంధనం/ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధరను కేంద్రం తగ్గిస్తోంది. అందులో భాగంగా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన వినియోగదారుల కోసం టికెట్లపై విధించే ఫ్యూయెల్ ఛార్జీలను తొలగించినట్లు ప్రకటించింది. గురువారం నుంచే తొలగింపు నిర్ణయం అమల్లోకి వచ్చిందని సంస్థ తెలిపింది.
కేంద్ర తీసుకుంటున్న నిర్ణయంతో తన వినియోగదారులకు సైతం మేలు జరగాలని ప్రత్యేక ఛార్జీని తొలగించినట్లు ఇండిగో తెలిపింది. అయితే, ఏటీఎఫ్ ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది. కాబట్టి టికెట్ల ధరలనూ అందుకు అనువుగా సవరిస్తామని సంస్థ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: తీవ్ర ఒడిదుడుకుల్లో చమురు మార్కెట్లు
విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరను ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు జనవరిలో 4 శాతం తగ్గించాయి. ఇప్పటి వరకు దిల్లీలో కిలోలీటరు ధర రూ.1,06,155.67 కాగా, రూ.4162.50 తగ్గించడంతో రూ.1,01,993.17కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment