బ్లాక్ దందా అనే మాట గుర్తుందా. గతంలో ఈ మాటలు ఎక్కువగా సినిమా థియేటర్ కేంద్రాలలో వినేవాళ్లం. తన అభిమాన హీరో, హీరోయిన్ సినిమా కోసం ప్రేక్షకులు అదనంగా ఖర్చు పెట్టి కొనేవాళ్లు. తాజాగా ఈ తరహా పరిస్థితులు విమానయాన రంగంలోకి వచ్చాయని ఓ సర్వే అంటోంది. ఇటీవలే విమానాల్లో ప్రయాణికుడు కోరుకున్న చోట సీటు కావాలంటే అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోందట! అసలు ఏవియేషన్ రంగంలో ఏం జరుగుతోందో ఓ లుక్కేద్దాం.
లోకల్ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వేలో గడిచిన 12 నెలల్లో మూడింటా ఒక వంతు ప్రయాణీకులు తమకు నచ్చిన చోట కూర్చోవడం కోసం ఎయిర్‌లైన్స్‌కు అదనపు నగదును చెల్లించినట్టు తేలింది. దేశంలోని 351 జిల్లాలో ఈ సర్వే నిర్వహించగా.. ఇందులో 30వేల మంది ప్రయాణికులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో పాల్గొన్న వారిలో మూడో వంతు ప్రయాణికులు తాము ప్రయాణించిన విమానయాన సంస్థ ఉచిత సీటును ఎంచుకునే ఆప్షన్ ఇవ్వలేదని వెల్లడించారు.
నిర్దిష్ట సీట్లకు, లగేజ్‌కు, ఎయిర్‌లైన్ లాంజ్‌ను ఉపయోగించుకునేందుకు ప్రయాణికుల నుంచి దేశీ ఎయిర్‌లైన్స్ అదనపు చార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ 2015లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కాస్త ఎక్కువ జాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో బుకింగ్ లేదా వెబ్ చెకిన్ చేసేటప్పుడు కొందరు ప్రయాణికులు ముందు వరుసల్లోనూ, ఎమర్జెన్సీ వరుసల్లోనూ సీట్లకు ప్రాధాన్యమిస్తుంటారు.
ఇందుకోసం ఎయిర్‌లైన్స్ రూ. 200–1,500 వరకూ అదనంగా చార్జి చేస్తుంటాయి. ఇలాంటి ప్రాధాన్య సీట్లతో పాటు తగినంత స్థాయిలో ఉచిత సీట్లను కూడా ఎయిర్‌లైన్స్ అందుబాటులో ఉంచాల్సి ఉంది. మరోవైపు కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు డిమాండ్ ఉందంటూ ఎక్కువగా కూడా వసూలు చేస్తున్నాయని ప్రయాణీకులు చెప్తున్నారు.
చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
Comments
Please login to add a commentAdd a comment