Flights
-
అమెరికాలో నిలిచిపోయిన విమానాలు.. కారణం ఇదే!
క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ఈ తరుణంలో యూఎస్‌లో.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines) తన అన్ని విమానాలను నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.విమాన సేవలను నిలిపివేయడానికి సాంకేతిక సమస్యలే కారణమని అమెరికన్ ఎయిర్‌లైన్స్ చెబుతోంది. అయితే కొందరు సైబర్ దాడి వల్ల ఈ పరిస్థితి నెలకొని ఉండవచ్చని చెబుతున్నారు.క్రిస్మస్ (Christmas) పండుగకు ముందు ఇలా జరగడంతో.. పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు 'మేము ఇంటికి వెళ్లాలా వద్దా చెప్పండి. విమానాశ్రయంలో గంటల తరబడి వేచి ఉండేలా చేయకండి' అని అన్నారు.మీరు మీ ఇళ్లకు సురక్షితంగా వెళ్లేందుకు మా బృందం పనిచేస్తోంది. మీ సహనానికి ధన్యవాదాలు అంటూ.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ నెటిజన్ ప్రశ్నకు రిప్లై ఇచ్చింది.Our team is working to get this rectified so that you can be safely on your way to your family. Your continued patience is appreciated.— americanair (@AmericanAir) December 24, 2024 -
డైరెక్ట్ ఫ్లైట్స్ కోసం భారత్‌తో చర్చలు
ముంబై: పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా నేరుగా విమానాలను ప్రవేశపెట్టడానికి భారత ప్రభుత్వంతోపాటు మూడు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు దక్షిణాఫ్రికా పర్యాటక మంత్రి పచ్యూషా డె లో తెలిపారు. ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా మధ్య కనెక్టింగ్ విమానాశ్రయాలతో ఎమిరేట్స్, కెన్యా ఎయిర్వేస్, ఎయిర్ మారిషస్, ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్, ఎతిహాద్ ఎయిర్వేస్, ఎయిర్ సీషెల్స్, రువాండ్ ఎయిర్, ఖతార్ ఎయిర్వేస్ ద్వారా విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. ‘భారతీయ ప్రయాణికుల కోసం దక్షిణాఫ్రికాను పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి, ఏవైనా సమస్యలను పరిష్కరించేందుకు, పర్యాటకాన్ని పెంచడానికి మేము ఇక్కడ ఉన్నాము. దక్షిణాఫ్రికా–భారత్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసుల విషయంలో సమస్య ఉంది. భారతీయ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్‌తో రెండు దేశాల మధ్య నేరుగా విమాన సరీ్వసుల ప్రయోజనాలపై వారిని ఒప్పించబోతున్నాను. ఈ విమానయాన సంస్థలు పర్యాటకుల దృక్కోణం నుండి మాత్రమే కాకుండా వాణిజ్యం, వ్యాపార కోణం నుండి కూడా ఈ ప్రత్యక్ష విమానాలతో పొందగల ప్రయోజనాలను దక్షిణాఫ్రికా టూరిజం వివరిస్తుంది’ అని ఆమె వివరించారు. ఎల్రక్టానిక్ వీసా సౌకర్యాలతో.. దక్షిణాఫ్రికా ప్రభుత్వం భారతీయ ప్రయాణికులకు ఎలక్ట్రానిక్ వీసా సౌకర్యాలతో సుదీర్ఘ ప్రక్రియ సమస్యను పరిష్కరించిందని పచ్యూషా వివరించారు. ఈ–వీసాతో భారతీయ యాత్రికులు ఇప్పుడు దక్షిణాఫ్రికాకు రావడం చాలా సులభం అని చెప్పారు. దక్షిణాఫ్రికాకు అగ్రస్థానంలో ఉన్న మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉందని, ఈ ఏడాది చివరినాటికి కోవిడ్‌కు ముందున్న స్థాయికి చేరుకోవాలని తాము భావిస్తున్నామని తెలిపారు. ‘2019లో మేము 95,000 మంది భారతీయ ప్రయాణికులను స్వాగతించాము. 2023లో ఈ సంఖ్య 79,000కి తగ్గింది. ఈ సంవత్సరం జనవరి–సెపె్టంబర్ మధ్య 59,000 మంది భారతీయులు ఇప్పటికే దక్షిణాఫ్రికాను సందర్శించారు. పర్యాటకుల సంఖ్య పరంగా ఈ సంవత్సరం కోవిడ్ పూర్వ స్థాయికి దగ్గరగా ఉండాలని మేము ఆశిస్తున్నాము’ అని ఆమె తెలిపారు. -
హైదరాబాద్ నుంచి విస్తారా విమానాలు!
ఎయిర్ ఇండియాలో విలీనమైనప్పటికీ విస్తారా ఎయిర్వేస్కు చెందిన ఏ320 విమానాల సేవలు కొనసాగనున్నాయి. వీటిని దేశంలోని ఐదు కీలకమైన మెట్రో-టు-మెట్రో రూట్లలో నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ముంబైకి ఈ విమానాలు నడుస్తాయి.ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్, ముంబై-బెంగళూరు, ముంబై-హైదరాబాద్ మార్గాల్లో ఏ320 విమానాల సేవలు ఉంటాయని, బిజినెస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ క్లాస్‌లలో ప్రయాణం చేయొచ్చని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. ఈ విమాన సర్వీసులు ఏ12 కోడ్‌తో ప్రారంభమవుతాయని, టికెట్ల బుకింగ్ సమయంలో గమనించాలని సూచించింది.టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో విస్తారా విలీన ప్రక్రియ ఈనెల ప్రారంభంలోనే పూర్తయింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 208 విమానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 67 వైడ్ బాడీ విమానాలు ఉన్నాయి. -
దక్షిణ కొరియాలో మంచు తుఫాను.. మూసుకుపోయిన రహదారులు
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో కురుస్తున్న భారీ హిమపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. భారీ మంచు తుఫాను కారణంగా వందలాది విమానాలు రద్దు అయ్యాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఈ మంచు తుఫాను గత 50 ఏళ్లలో సంభవించిన అత్యంత భారీ విపత్తుగా చెబుతున్నారు. సియోల్ పరిసర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల మేర మంచు కురిసిందని దక్షిణ కొరియా వాతావరణశాఖ తెలిపింది. 1972, నవంబర్ 28న సియోల్‌లో 12 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. ఈ మంచు తుఫాను ప్రభావం దేశంలోని పలు ప్రాంతాలలో కనిపించింది. 눈 대박이다... 버스 40분 남아서 역까지 걸어오고 전철도 지연되서 기다리는중.. 차들이 오르막길 못 올라가 버스도 사고나서 승객들 다.내림... pic.twitter.com/jZ1OnGVsYz— 🇰🇷숼🇰🇷 (@sowol_sy) November 27, 2024దేశంలోని మధ్య, తూర్పు, నైరుతి ప్రాంతాలలో దాదాపు 10 నుండి 23 సెం.మీ. మేరకు హిమపాతం కురిసింది. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో 220 విమానాలు రద్దు కాగా, 90 బోట్లను ఓడరేవులోనే ఉంచాలని అధికారులు ఆదేశించారు. సియోల్‌లోని రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ట్రాఫిక్ స్థంభించింది. రోడ్లపై కూలిపోయిన చెట్లను తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు.. ఏడు విమానాలు రద్దు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. పొల్యూషన్ కారణంగా ఏర్పడిన పొగమంచు విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత(విజిబులిటీ) తగ్గడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 8.30 గంటల వరకు దాదాపు 160 విమానాలు ఆలస్యంగా నడిచాయి.ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం విమానాలు బయలుదేరే సమయంలో సగటున 22 నిమిషాల ఆలస్యం జరిగింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండటంతో ఐదు విమానాలను (జైపూర్-04, డెహ్రాడూన్-01) దారి మళ్లించారు. ప్రస్తుతం అన్ని విమాన కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని విమనాశ్రయ అధికారులు పేర్కొన్నారు.ఎకనామిక్ టైమ్స్ వార్తల ప్రకారం దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గినందున సోమవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఏడు విమానాలను రద్దు చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల రాకపోకలపై ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రస్తుతం ఢిల్లీలో ఏర్పడిన పొగమంచు విజిబులిటీని ప్రభావితం చేస్తోంది. ఫలితంగా విమాన షెడ్యూళ్లలో జాప్యం జరగవచ్చు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు విమాన రాకపోకల స్థితిని ఒకసారి చెక్ చేసుకోవాలి’ అని తెలియజేసింది. స్పైస్‌జెట్ కూడా ఇదే విధమైన సూచన చేసింది. ఢిల్లీలో ప్రస్తుతం గాలి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 481కి చేరింది. కాలుష్యం కారణంగా ఏర్పడిన అధ్వాన్న పరిస్థితుల దృష్ట్యా నేటి (సోమవారం) నుంచి ఢిల్లీలో గ్రాప్-4 నిబంధనలను అమలు చేశారు.ఇది కూడా చదవండి: Gujarat: ర్యాగింగ్‌కు ఎంబీబీఎస్ విద్యార్థి బలి -
ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శీతాకాల షెడ్యూల్లో భాగంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి తన విమాన సర్వీసులను గణనీయంగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పట్టణాల నుంచి వారానికి 173 విమాన సర్వీసులు నడుస్తుండగా, 250కు (45 శాతం అధికం) పెంచుతున్నట్టు తెలిపింది.విశాఖపట్నం, విజయవాడ, గ్వాలియర్‌తో హైదరాబాద్‌కు నేరుగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, హైదరాబాద్ నుంచి బెంగళూరు, కోచికి సర్వీసులు పెరగనున్నట్టు ప్రకటించింది. సర్వీసుల పెంపు ఈ ప్రాంతాల వారికి సౌలభ్యంగా ఉంటుందని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ పేర్కొన్నారు. ప్రతి వారం 200 సర్వీసులతో తమ నెట్ వర్క్‌లో హైదరాబాద్ మూడో అతిపెద్ద కేంద్రంగా ఉన్నట్టు చెప్పారు.హైదరాబాద్ నుంచి నేరుగా 17 దేశీయ విమానాశ్రయాలకు, సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లకు సర్వీసులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ నుంచి ఎయిర్ ఇండియా ఒక్కటే అంతర్జాతీయ సర్వీసులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి ప్రతి వారం 28 విమాన సర్వీసులను దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎయిర్ ఇండియా నడుపుతోంది. ఇక దేశవ్యాప్తంగా ఈ శీతాకాల సీజన్లో ఎయిర్ ఇండియా 400 రోజువారీ విమాన సర్వీసులు నిర్వహించనున్నట్టు తెలిపింది. గతేడాది ఇదే సీజన్లో 325 రోజువారీ సర్వీసులు నిర్వహించింది. -
హైదరాబాద్ లో అలెర్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
-
గుడ్ న్యూస్ సార్! ఈ రోజు కేవలం 25 బెదిరింపులే వచ్చాయ్! వాళ్లకే బోర్ కొట్టి తగ్గించుకుంటూ వస్తున్నారు!
-
వైజాగ్-విజయవాడ: నేటి నుంచి రెండు విమాన సర్వీసులు
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్-విజయవాడ మధ్య ఈ నెల 27వ తేదీ నుంచి కొత్తగా రెండు విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ నగరాల మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక విమానం నడుపుతోంది. ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఆదివారం నుంచి రెండో విమాన సర్వీస్‌ను ఇండిగో ప్రారంభించనుంది. ఈ విమానం సాయంత్రం 7.30గంటలకు గన్నవరం నుంచి వైజాగ్ వెళ్లి, తిరిగి రాత్రి 9.50 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. ఇదేరోజున ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ కూడా విశాఖ– విజయవాడ మధ్య కొత్త సర్వీస్‌ను నడపనుంది. దీనికోసం 180 మంది సామర్థ్యం కలిగిన బోయింగ్ 737 విమానాన్ని కేటాయించింది. ఈ విమానం వైజాగ్ నుంచి ఉ.10.35 గంటలకు గన్నవరం చేరుకుని తిరిగి రాత్రి 7.55కు వైజాగ్ బయలు దేరుతుంది. విజయవాడ–వైజాగ్ మధ్య ప్రారంభ టికెట్ ధరను రూ.3,014గా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ నిర్ణయించింది. -
మరో 25 విమానాలకు బెదిరింపులు
న్యూఢిల్లీ/ముంబై: దేశీయ విమానయాన సంస్థల విమానాలకు బాంబు బెదిరింపులు ఆగేలా కనిపించడం లేదు. శుక్రవారం మరో 25కు పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో బాంబులు పెట్టామని, పేల్చాస్తామంటూ బెదిరింపులు అందాయి. పూర్తి తనిఖీల అనంతరం ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఉత్తుత్తి బెదిరింపులేనని అధికారులు తేల్చారు. కోజికోడ్–దమ్మమ్ (సౌదీ)సర్వీసు సహా మొత్తం ఏడు విమానాలకు హెచ్చరికలు అందాయని ఇండిగో సంస్థ తెలిపింది. విస్తారా, స్పైస్‌జెట్ సంస్థలకు చెందిన ఏడేసి విమానాలు, ఎయిరిండియాకు చెందిన ఆరు విమానాలకు బెదిరింపులు అందినట్లు సమాచారం. దీంతో, గత 12 రోజుల్లో 275కు పైగా విమానాలకు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా బాంబు హెచ్చరికలు అందాయి. వీటి వెనుక ఉన్న వారిని గుర్తించి, చర్యలు తీసుకునేందుకు సహకరించాల్సిందిగా కేంద్రం ఎక్స్, మెటా నిర్వాహకులను కోరింది. -
బాంబు బెదిరింపులు: సోషల్‌మీడియా సంస్థలపై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలకు తెరపడటం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొద్దిరోజులుగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులు అందరినిషాక్ గురిచేస్తున్నాయి. దాదాపు 10 రోజుల్లో 170కి పైగా విమాన సర్వీసులకు హెచ్చరికలు వచ్చాయి. వీటిపై విమానయానశాఖ విచారణ చేపడుతున్ప్పటికీ, ఎయిర్‌లైన్స్ యాజమాన్యం తనిఖీలు చేస్తున్నా బెదిరింపులు మాత్రం ఆగం లేదు.అయితే బెదిరింపులు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా వస్తుండటంతో తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వశాఖ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిత్వశాఖ సంయుక్త కార్యద్శి సంకేత్ ఎస్ భోంద్వే.. విమానయానసంస్థ అధికారులు, ఎక్స్, మెటా వంటిఇ సోషల్ మీడియా ప్రతినిధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్ వంటి మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నియంత్రించడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.కాగా గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 120కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న కూడా ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియాకు చెందిన 30 విమానాలకు ఇలాంటి బెదిరింపులు అందాయి. అయితే అధికారులు అప్రమత్తమై భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించారు. ఈ పరిస్థితిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రయాణీకుల భద్రతపై రాజీ పడకుండా ప్రభుత్వం దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలాంటి బూటకపు బెదిరింపులను ప్రసారం చేసే వారిపై నో ఫ్లై లిస్ట్‌తో సహా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత విమానయాన భద్రతా నిబంధనల సవరణకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.ఇవి బూటకపు బెదిరింపులే అయినప్పటికీ వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. బెదిరింపుల దాడి వెనుక కుట్ర దాగి ఉంటుందా అని ప్రశ్నించగా.. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి చెప్పారు.ఇప్పుడే ఏ విషయం చెప్పలేమని, దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని కోరారు. -
మరో 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు
భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం ఆగడం లేదు. వరుసగా వస్తున్న ఈ బాంబు బెదిరింపు ఘటనలు అటు విమానయాన అధికారుల్లో, ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 10 రోజుల్లో దాదాపు 100కుపైగా విమానాలకు బెదిరింపులు అందాయి. వీటిపై విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆగడం లేదు.తాజాగా మంగళవారం మరో 10 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు. ప్రధానంగా అంతర్జాతీయ మార్గాల్లో ఈ బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ బెదిరింపులు జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు వెళ్లే విమానాలను లక్ష్యంగా చేసుకుని వచ్చినట్లు తెలిపారు. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించింది, ప్రయాణీకులందరినీ సురక్షితంగా దింపి,తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.మంగళూరు నుంచి ముంబైకి వెళ్లే విమానం, అహ్మదాబాద్ నుంచి జెద్దాకు వెళ్లే విమానం, లక్నో నుంచి పుణె, హైదరాబాద్ నుంచి జెడ్డా, ఇస్తాంబుల్ నుంచి ముంబై, ఢిల్లీ నుంచి డమ్మాం, బెంగళూరు నుంచి జెడ్డా, ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ, కోజికోడ్ నుంచి జెడ్డా, ఢిల్లీ నుంచి జెడ్డా వెళ్లే విమానాలకు ఈ బెదిరింపులు అందినట్లు అధికారులు తెలిపారు. తమ ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ... వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యతకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు విమానయాన సంస్థల విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి కూడా 30 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి ఇండియన్ ఎయిర్‌లైన్‌కు చెందిన 30 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.ఇండిగో ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన నాలుగు విమానాలకు సోమవారం భద్రతా హెచ్చరికలు అందాయని తెలిపారు. ఈ జాబితాలో 6ఈ 164 (మంగుళూరు నుండి ముంబై), 6ఈ 75 (అహ్మదాబాద్ నుండి జెడ్డా), 6ఈ 67 (హైదరాబాద్ నుండి జెడ్డా), 6ఈ 118 (లక్నో నుండి పూణే) ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయా విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా అక్కడి నుండి తరలించారు.ఇదేవిధంగా ఎయిర్ ఇండియా విమానాలకు కూడా బెదిరింపులు వచ్చినట్లు ఆ సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. నిర్దేశించిన ప్రోటోకాల్‌ను అనుసరించి, సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారని, భద్రతా సంస్థల మార్గదర్శకాల ప్రకారం అన్ని భద్రతా విధానాలను అమలు చేశామన్నారు.విస్తారా ప్రతినిధి మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన కొన్ని విమానాలకు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తమయ్యారని, అన్ని భద్రతా విధానాలను అమలు చేశారన్నారు.గడచిన వారం రోజుల్లో 120కి పైగా భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే బాంబు బెదిరింపులను కేవలం వదంతులుగా తేలికగా తీసుకోలేమని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. కాగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. నేరస్తులను నో-ఫ్లై జాబితాలో ఉంచే యోచనలో ఉందని సమాచారం. ఇది కూడా చదవండి: ఉద్యోగుల తొలగింపు అవాస్తవం: ఫోన్‌పే -
5 రోజుల్లో 125 విమానాలకు బాంబు బెదిరింపులు
-
విమానాలకు బాంబు బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నాం
-
మరో 25 విమానాలకు బాంబు బెదిరింపు
ముంబై/న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం దేశీయ విమానయాన సంస్థలకు చెందిన 25 సర్వీసులకు బాంబు పెట్టామనే హెచ్చరికలు అందాయి. దీంతో, ఈ వారంలో ఇప్పటి వరకు విమానాలకు అందిన బాంబు బెదిరింపుల సంఖ్య 90 దాటింది. అయితే ఇవన్నీ వట్టివేనని తేలిందని అధికారులు వివరించారు. ఆదివారం హెచ్చరికలు అందిన వాటిలో ఇండిగో, విస్తార, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా విమానాలున్నాయి. తమ జెడ్డా–ముంబై, కోజికోడ్–దమ్మమ్, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, పుణె–జోధ్‌పూర్ సర్వీసులకు ఆన్లైన్లో బెదిరింపులొచ్చాయని ఇండిగో తెలిపింది. ఢిల్లీ–ఫ్రాంక్ఫర్ట్, సింగపూర్–ముంబై, బాలి–ఢిల్లీ, సింగపూర్–ఢిల్లీ, సింగపూర్–పుణె విమానాలకు బెదిరింపులందాయని విస్తార వెల్లడించింది. అహ్మదాబాద్–ముంబై, ఢిల్లీ–గోవా, ముంబై–బగ్డోగ్రా, ఢిల్లీ–హైదరాబాద్, కొచ్చి–ముంబై, లక్నో–ముంబై విమాన సర్వీసులకు బాంబు పెట్టామనే హెచ్చరికలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆన్లైన్లో వచ్చాయని ఆకాశ ఎయిర్ వివరించింది. అదేవిధంగా, ఎయిరిండియాకు చెందిన ఏడు విమానాలకు కూడా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. వీటిపై ఆ సంస్థ స్పందించలేదు. -
70 విమానాలకు బాంబు బెదిరింపులు.. ఎయిర్‌లైన్స్ సీఈఓలతో భేటీ
భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం తీవ్ర కలకలం రేపుతోంది. అటు దేశీయంగా నడిచే వాటితోపాటు విదేశాలకు వెళ్తున్న అనేక ఎయిర్‌లైన్స్ వరసగా బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన ఆరు రోజుల్లో ఏకంగా 70 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయంటే.. వీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు అధికారులు, కపౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నకిలీ బెదిరింపులపై దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పరిస్థితులో మార్పు కనిపించడం లేదు.ఈ క్రమంలో తాజాగా ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (బీసీఏఎస్) అప్రమత్తమైంది. విమానయాన సంస్థల సీఈఓలతో శనివారం సమావేశమైంది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే బెదిరింపులను ఎదుర్కోవడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) అనుసరించాలని సీఈవోలను కోరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్న వేళ.. ప్రయాణికులకు అసౌకర్యం, క్యారియర్లకు నష్టం కలగకుండా ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించింది. బెదిరింపులు, వాటి పట్ల తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాలని కోరింది.ఇక గత వారం రోజులుగా 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు 30కి పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు జరిపిన విచారణలో బెదిరింపులు వచ్చిన బెదిరింపులు వాటిలో ఐపీ (ఇంటర్నెట్ ప్రోటోకాల్) చిరునామాలు లండన్, జర్మనీ, కెనడా, యూఎస్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
24 గంటల్లో.. 11 విమానాలకు బాంబు బెదిరింపులు
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 11 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరుసపెట్టి బెదిరింపులు రావడం ప్రయాణికుల్లో తీవ్ర భయాన్ని రేకెత్తిస్తోంది. విమానాల టేకాఫ్‌కు ముందు ఇటువంటి బెదిరింపులు రావటంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి దారి మళ్లిస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే విస్తారా విమానానికి బాంబు బెదిరింపుతో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. జైపూర్-దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బెదిరింపు వచ్చింది. అయితే అది నకిలీ అని తేలింది. వీటితోపాటు మరో ఐదు ఆకాశా ఎయిర్ విమానాలు, ఐదు ఇండిగో విమానాలకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయి.దుబాయ్-జైపూర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కారణంగా విమానాశ్రయం నుంచి టేకాఫ్ చేసేందుకు ఆలస్యం అయింది. ఈరోజు ఉదయం 6:10 గంటలకు టేకాఫ్ షెడ్యూల్ చేయగా.. 7:45కి దుబాయ్‌కి బయలుదేరింది. మరోవైపు ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించిన విస్తారా విమానం ఆ తర్వాత లండన్‌కు బయలుదేరింది.కాగా గత సోమవారం నుంచి దాదాపు 50 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.దీంతో పౌర విమానయాన మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. నకిలీ బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేదుకు సిద్ధమైంది. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బూటకపు కాలర్లను ఐదేళ్లపాటు నో-ఫ్లై లిస్ట్‌లో ఉంచడం వంటి అనేక చర్యలు తీసుకుంటామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజేసీఏ) తెలిపింది. అయితే నకిలీ బాంబు బెదిరింపుల వల్ల తమకు జరిగిన నష్టాన్ని నిందితుల నుంచి వసూలు చేయాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. -
విమానాలకు వరుస బాంబు బెదిరింపులు.. అనుమానితుల జాడ గుర్తింపు
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన పలు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 12 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనలు అటు విమానయాన సంస్థలు, ఇటు ప్రయాణికుల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి.అయితే విమానాల్లో బాంబు బెదిరింపులును కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే అంశంపై చర్చిందేందుకు రవాణాపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బుధవారం భేటీ అయ్యింది.తొలుత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రిత్వ శాఖ అధికారులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఈ అంశంపై చర్చించి ఆ వివరాలను కమిటీకి వెల్లడించారు. ఈ ఘటనల్లో కొంతమంది అనుమానితుల జాడ గుర్తించినట్లు, కీలక సమాచారాన్ని సేకరించామని చెప్పినట్లు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అబద్దపు బెదిరింపు కాల్స్ చేసిన వారిని 'నో-ఫ్లై లిస్ట్'లో చేర్చాలని, అదేవిధంగా విమానాల్లో ఎయిర్ మార్షల్స్ సంఖ్యను పెంచడం వంటి చర్యలను ప్రబుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులుకాగా బుధవారం బెంగళూరు వెళ్తున్న అకాశా ఎయిర్ ఫ్లైట్, ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇకమంగళవారం ఏకంగా పలు సంస్థలకు చెందిన ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానం, జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో విమానం, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్ విమానం, సిలిగురి-బెంగళూరు అకాశ ఎయిర్ విమానం, అలయన్స్ ఎయిర్ అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానం, మధురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సహా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.సోమవారం రెండు ఇండిగో, ఎయిరిండియా విమానాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు పోలీసులతో కలిసి బెదిరింపుల వెనుక ఉన్న నిందితులను కనిపెట్టడానికి పని చేస్తోంది -
ఈసారి విమానం ఎక్కేవారిదే ఆనందం!
సాధారణంగా దీపావళి పండుగ సీజన్లో విమాన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక విశ్లేషణ ప్రకారం.. ఈ దీపావళి సీజన్ విమాన ప్రయాణికులకు మరింత ఆనందం కలిగిస్తోంది. కారణం.. అనేక దేశీయ రూట్లలో సగటు విమాన ఛార్జీలు గత సంవత్సరంతో పోలిస్తే 20-25 శాతం తగ్గాయి.ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం.. దేశీయ మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు 20-25 శాతం శ్రేణిలో క్షీణించాయి. ఇవి 30 రోజుల ఏపీడీ (ముందస్తు కొనుగోలు తేదీ) వన్-వే సగటు ఛార్జీల ధరలు. దీపావళి సీజన్ విమాన టికెట్ల కొనుగోలు సమయాన్ని గతేడాది నవంబర్ 10-16 తేదీల మధ్య పరిగణించగా ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్య జరిగిన కోనుగోళ్లను పరిగణనలోకి తీసుకున్నారు.విశ్లేషణ ప్రకారం బెంగళూరు-కోల్‌కతా విమానానికి సగటు విమాన ఛార్జీలు గరిష్టంగా 38 శాతం క్షీణించాయి. గత ఏడాది రూ.10,195 నుండి ఈ ఏడాది రూ.6,319కి తగ్గాయి. చెన్నై-కోల్‌కతా మార్గంలో టిక్కెట్ ధర రూ.8,725 నుంచి రూ.5,604కి 36 శాతం తగ్గింది.ఇదీ చదవండి: ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే!ముంబై-ఢిల్లీ విమానాల సగటు విమాన ఛార్జీలు రూ.8,788 నుంచి రూ.5,762కి 34 శాతం తగ్గాయి. అదేవిధంగా ఢిల్లీ-ఉదయ్‌పూర్ రూట్లో టికెట్ ధరలు రూ.11,296 నుంచి రూ.7,469కి 34 శాతం క్షీణించాయి. ఢిల్లీ-కోల్‌కతా, హైదరాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-శ్రీనగర్ మార్గాల్లో 32 శాతం క్షీణత ఉంది. -
గగనతలం మూసి మళ్లీ తెరిచిన ఇరాన్
టెహ్రాన్:ఇరాన్‌పై దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో ఇరాన్ అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం(అక్టోబర్7) ఉదయం 6 గంటల దాకా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల నుంచి విమానాలను ఇరాన్ రద్దు చేసింది .అయితే విమానాల భద్రతకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకున్న తర్వాత విమాన సర్వీసులన్నింటినీ పునరుద్ధరించినట్లు సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు.అక్టోబర్ 7 సందర్భంగా ఇజ్రాయెల్ దాడి చేస్తుందేమోనన్న అనుమానంతోనే ఇరాన్ తన గగనతలంలో విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.గతేడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి వేల మందిని చంపేశారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ అటు హమాస్ ఇటు హెజ్బొల్లా గ్రూపులపై దాడులు చేస్తూనే ఉంది. ఈ తీవ్రవాద గ్రూపులన్నీ ఇరాన్ స్నేహితులే కావడం గమనార్హం. ఇదీ చదవండి: ఏడువైపులా శత్రువులతో పోరాడుతున్నాం: ఇజ్రాయెల్ -
హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ - కాన్పూర్, హైదరాబాద్-అయోధ్య మధ్యన వారానికి 4 రోజుల సర్వీసులు నడపనున్నారు. రేపటి(శనివారం) నుంచి హైదరాబాద్ - ప్రయాగరాజ్ మధ్యన, హైదరాబాద్-ఆగ్రా మధ్యన వారానికి 3 రోజుల సర్వీసును ప్రారంభించనున్నారు.హైదరాబాద్ నగరం నుంచి ఒక్క నెలలోనే 7 నూతన సర్వీసుల ప్రారంభం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నూతన సర్వీసులు ఆయా నగరాల మధ్యన ప్రయాణికుల డిమాండ్‌ను నెరవేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కిషన్‌రెడ్డి ప్రయాణికులను కోరారు.ఇదీ చదవండి: ఈ దుఃఖం తీర్చేదెవరు? -
మనోడే.. విమానంలో తిప్పేద్దాం
సాక్షి, అమరావతి : ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలిచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఖజానా ఖాళీ అంటున్న కూటమి ప్రభుత్వం.. తమ కార్యకర్తలకు జేబులు నింపడానికి అడ్డగోలుగా ప్రత్యేక జీవోలే ఇస్తోంది. ప్రజల సొమ్ముతో కార్యకర్తలు జల్సా చేసేలా ఒకే రోజు మూడు జీవోల్ని విడుదల చేసింది. మంత్రులతో పాటు వారి ఓఎస్డీలు, పీఏలు, వ్యక్తిగత సిబ్బంది కూడా విమానాల్లో ప్రయాణించడానికి అనుమతించింది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఒక జీవో జారీ చేశారు. మంత్రి ఓఎస్డీ, పీఎస్, అడిషనల్ పీఎస్, పీఏలు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు మంత్రితో పాటు ప్రయాణించడానికి అనుమతించారు. జీతభత్యాలతో సంబంధం లేకుండా మంత్రి కార్యాలయ సిబ్బంది ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా మంత్రులు బయటి వ్యక్తులను ప్రైవేటు కార్యదర్శులుగా, వ్యక్తిగత సహాయకులుగా నియమించుకోవడానికి అనుమతించడమే కాకుండా, వారి వేతనాలను రెట్టింపు చేస్తూ మరో జీవో జారీ చేశారు. మంత్రి వ్యక్తిగత సహాయకుడి వేతనం రూ.18 వేల నుంచి రూ.36 వేలకు, ప్రైవేటు కార్యదర్శి వేతనం రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రులకు 96 మంది ప్రైవేటు సిబ్బంది ప్రతి మంత్రికి నలుగురు చొప్పున మొత్తం 24 మంత్రులకు 96 మంది ప్రైవేటు సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతిస్తూ సురేష్ కుమార్ మరో జీవో ఇచ్చారు. ప్రతి మంత్రి ఒక ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో)తో పాటు స్వర్ణాంధ్ర విజన్ నిర్వహణకు ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ను నియమించుకోవచ్చు. సోషల్ మీడియా నిర్వహణకు ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్‌ను నియమించుకోవచ్చు. ఈ విధంగా కూటమి కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలను సృష్టించి, ప్రభుత్వ సొమ్మును దుబారా చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఎయిర్ ఇండియాలోకి విస్తారా: ఆ రోజే చివరి ఫ్లైట్
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా (Vistara).. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలోకి విలీనం కానుంది. 2024 నవంబర్ 11న విస్తారా తన చివరి విమానం నడపనుంది. అంతకంటే ముందు (సెప్టెంబర్ 3) సంస్థ టికెట్ రిజర్వేషన్లను కూడా ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌కు మళ్ళించనున్నట్లు సమాచారం. అయితే విమాన ప్రయాణాలు మాత్రం నవంబర్ 11వరకు కొనసాగుతాయి.విస్తారా సంస్థ.. ఎయిర్ ఇండియాలో విలీనం కావడానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంటే ఎయిర్ ఇండియాలో విలీనం కానున్న విస్తారాలో.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ 25.1 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ & ఏఐ ప్రిఫిక్స్‌తో విస్తారా నెట్వర్క్.. విమానాలు కొనసాగుతాయి. విస్తారా సిబ్బంది.. విస్తారా విమానాలను 2025 ప్రారంభం వరకు ఎయిర్ ఇండియా కింద నిర్వహిస్తారు. అయితే సర్వీస్ లెవల్స్, భోజనం, ఇతరత్రా కార్యకలాపాలు ఎయిర్ ఇండియా పాలసీ ప్రకారం ఉంటాయి.ఇప్పటికే విస్తారా ఫ్లైట్ టికెట్ నవంబర్ 11 తరువాతకు బుక్ చేసుకుని ఉంటే.. ఎయిర్ ఇండియాలో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రయాణానికి ఏ లోటు లేదు. కానీ మీరు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవచ్చు. -
విమానంలో స్మోకింగ్.. పాత బోర్డింగ్ పాస్‌లో ఆప్షన్
విమాన ప్రయాణం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఒకప్పుడు విమానంలో స్మోకింగ్ అనేది.. డ్రింక్ చేసినంత ఈజీగా ఉండేదని, సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫోటోల ద్వారా తెలుస్తోంది.సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలను గమనించినట్లయితే.. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు స్మోకింగ్ లేదా నాన్ స్మోకింగ్ క్యాబిన్ ఎంచుకోవచ్చని తెలుస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో విమానంలో స్మోకింగ్ కూడా చేసుకోవచ్చా? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.బోర్డింగ్ పాస్‌లను గమనిస్తే.. లండన్ హీత్రూ నుంచి మొరాకోలోని కాసాబ్లాంకాకు వెళ్తున్న విమానంలో "నాన్-స్మోకింగ్ క్యాబిన్" అని ఉండటం చూడవచ్చు. ఒకప్పుడు విమానాల్లో కూడా స్మోకింగ్ చేసుకోవచ్చనే విషయం ఈ ఫోటోలు చూసేవరకు చాలామందికి తెలియకపోవచ్చు.ఈ టికెట్స్ ఎప్పటివనే విషయం వెల్లడికాలేదు. కానీ ఇవి 1955 - 2009 మధ్య టికెట్స్ అయి ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. ఇది నమ్మశక్యంగా లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ టికెట్స్ మీద కనిపించే AFSL అనేది 'ఎయిర్ ఫ్రాన్స్ సర్వీసెస్ లిమిటెడ్' అని ఒకరు పేర్కొన్నారు. ఇవి 1996లో ప్రారంభమై 2009లో రద్దు చేశారు. ప్రస్తుతం విమానాల్లో స్మోకింగ్ నిషేదించారు.