న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ భారతీయుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. అయితే విమానయాన సంస్థ, విమానంలోని ప్రయాణీకుల వాంగ్మూలాలను రికార్డ్ చేసి, నిందితులను లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అప్పగించాయని దేశ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ తెలిపింది.
ప్రయాణికుడిపై ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఫిర్యాదు చేసిన తర్వాత పౌర విమానయాన చట్టంలోని నాన్-కాగ్నిజబుల్ నేరాల కింద చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ఈ ఘటనపై సహ ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఏఏ292 విమానం ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత సీఐఎస్‌ఎఫ్ అధికారులు ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.
వరుసగా మూడోసారి
గత ఏడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా న్యూయార్క్-ఢిల్లీ విమానంలో బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి వృద్దిరాలిపై మూత్రం పోశాడు. డిసెంబర్ 6 న ఎయిర్ ఇండియా ప్యారిస్-న్యూఢిల్లీ విమానంలో ఓప్రయాణికుడు ఖాళీ సీటుపై, దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. ఇలా వరుస ఘటనలపై డీజీసీఏ చర్యలు తీసుకున్నప్పటికీ తాజాగా మరో ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment