passangers
-
ఆకతాయి పనితో కదులుతున్న ట్రైన్ నుంచి దూకిన ప్రయాణికులు
కదులుతున్న ట్రైన్లో మంటలు చెలరేగుతున్నాయనే అకతాయిలు చేసిన పుకార్లు ప్రయాణికులు ప్రాణాల మీదకు తెచ్చాయి. ఉత్తరప్రదేశ్ బిల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్లు ప్రయాణిస్తున్న ట్రైన్లో మంటలు చెలరేగుతున్నాయని పుకార్లు వ్యాపించాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు కదులుతున్న ట్రైన్ నుంచి బయటకు దూకారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు.మొరాదాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చే బిల్పూర్ స్టేషన్ సమీపంలోని హౌరా-అమృత్సర్ మెయిల్ జనరల్ కోచ్‌లో ఈ సంఘటన జరిగింది . గాయపడిన వారిని అన్వారీ (26), అఖ్తరీ (45), కుల్దీప్ (26), రూబీ లాల్ (50), శివ శరణ్ (40), చంద్రపాల్ (35)లుగా గుర్తించారు. ఆరుగురు ప్రయాణికులను షాజహాన్‌పూర్ మెడికల్ కాలేజీలో చేర్చినట్లు జీఆర్పీ స్టేషన్ ఇన్ఛార్జ్ రెహాన్ ఖాన్ వెల్లడించారు. రైల్వే స్టేషన్లో గందరగోళంరైలు బరేలీలోని బిల్పూర్ స్టేషన్‌కు చేరుకోగానే గందరగోళం నెలకొంది. రైలులో మంటలు చెలరేగిపోయాయనే పుకారుతో ప్రయాణికులు ఆందోళనకు గురైరయ్యారు. భయాందోళనతో ట్రైన్ చైన్ లాగారు. చాలా మంది ప్రయాణికులు ఇంకా కదులుతున్న రైలు నుండి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు.రైల్లో చోటు చేసుకున్న ఘటనపై రెహాన్ ఖాన్ మాట్లాడుతూ.. కొంతమంది ఆకతాయిలు గాల్లో మంటలు వ్యాపించాయనే పుకార్లు పుట్టించినట్లు మా దృష్టికి వచ్చింది. పుకార్లు చేసిన అనంతరం ట్రైన్ చైన్ లాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. -
‘వాటే లాజిక్ .. వాటే లాజిక్’.. ఇండిగో!
ఇటీవల కాలంలో పలు విమాన సంస్థలు ప్రయాణికులకు అందించే సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆహారంలో బొద్దింకలు, రాళ్లు ప్రత్యక్షమవుతున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఆయా ఘటనలపై సదరు విమానయాన సంస్థలు క్షమాపణలు చెప్పడం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జరిమానాలు విధిస్తున్నాయి. కానీ విమానయాన సేవల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు కొనుగోలు చేసిన శాండ్విచ్లో స్క్రూ ప్రత్యక్షమవ్వడంతో నెవ్వెరపోయింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. జ్యోతి రౌతేలా ఫిబ్రవరి 1న బెంగళూరు నుండి చెన్నైకి ఇండిగో ఫ్లైట్‌లో బయలుదేరింది. విమానంలోనే స్పినాచ్ కార్న్ చీజ్ శాండ్విచ్ను ఆర్డర్ పెట్టుకుంది. ఆ శాండ్ విచ్ను తినడకుండా అలాగే జర్నీ చేసింది. Got a screw in my sandwich byu/MacaroonIll3601 inbangalore సరిగ్గా చెన్నై విమానశ్రయంలో దిగిన తర్వాత జ్యోతి రౌతేలాను అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ భద్రతా తనిఖీల్లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇండిగో ఫ్లైట్‌లో ఆర్డర్ పెట్టిన శాండ్విచ్లో బోల్ట్ ఉండడం చూసి కంగుతిన్నది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. సంబంధిత విభాగంపై చర్యలు తీసుకోవాలని ఇండిగో అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇండిగో అధికారులు మాత్రం .. మీరు విమాన ప్రయాణంలో శాండ్ విచ్ తిని ఉంటే చర్యలు తీసుకోనే వాళ్లం. కానీ మీరు విమానం దిగిన తర్వాత శాండ్ విచ్లో బోల్ట్ ఉందని ఫిర్యాదు చేస్తే లాభం లేదని చెప్పడంతో నిర్ఘాంతపోయినట్లు చెప్పారు. ఈ విషయంపై నెటిజన్ల ఇండిగో తీరును విమర్శిస్తున్నారు. ప్రయాణికుల పట్ల ఇండిగో బాధ్యతా రహితంగా వ్యవహరించడం సరికాదని హితువు పలుకుతున్నారు. -
ఆ యాపిల్ వాచ్ లేకపోతే ఆ ప్రయాణికుడి ప్రాణం గాల్లోనే..!
యాపిల్ వాచ్‌లో ఉండే ఆధునిక టెక్నాలజీతో ఎందరో ప్రాణాలను రక్షించుకున్నారు. దీనిలో ఉండే క్రాష్ డిటెక్షన్ కాల్ ఫీచర్ ఏదైన ప్రమాదం ఎదురైతే అందులో సేవ్ చేసిన సన్నిహితుల మొబైల్‌కి అలర్ట్ మెసేజ్ ఇవ్వడమే గాక లోకేషన్‌ని కూడా షేర్ చేస్తుంది. ఈ ఒక్క ఫీచర్‌తో అనుకోని ప్రమాదంలో చిక్కుకున్న ఎందరో ప్రాణాలను రక్షించుకున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆ యాపిల్ వాచ్‌లోని హెల్త్‌కి సంబంధించిన సరికొత్త ఫీచర్ సాయంతో ఓ ప్రయాణికుడి ప్రాణాలను రక్షించాడు ఓ డాక్టర్. అసలేం జరిగిందంటే..'రోజుకి ఒక యాపిల్ తింట్ డాక్టర్ని కలవాల్సిన పని ఉండదు" అన్నది పాత సామెత. మీ వద్ద యాపిల్ వాచ్ ఉంటే మీ ప్రాణాలు సేఫ్‌లో ఉన్నట్లే అనేది నేటి సామెత కాబోలు. ఏంటీది అనుకోకండి... ఎందుకంటే..ఆ యాపిల్ వాచే ప్రాణాపయా స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ ప్రయాణికుడి ప్రాణాలను రక్షించింది. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ నుంచి ఇటలీలోని వెరోనాకు వెళ్తున్న ర్యాన్ ఎయిర్ విమానంలో చోటు చేసుకుంది. ఇగ్లాండ్‌లోని హియర్ఫోర్డ్ కౌంటీ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్న 43 ఏళ్ల వైద్యుడు ఆ ఉదంతాన్ని వివరించాడు. తాను సరిగ్గా జనవరి 9న ఇంగ్లాండ్ నుంచి ఇటలీలోని వెరోనాకు ర్యాన్ ఎయిర్ విమానంలో బయలుదేరుతున్నప్పుడూ ఈ అనూహ్య ఘటన చేసుకుందన్నారు. ఓ 70 ఏళ్ల మహిళ సడెన్‌గా ఊపిరీ పీల్చుకోవడంలో ఇబ్బందుపడుతుంది. దీంతో వెంటనే విమానంలోని సిబ్బంది అప్రమత్తమై ఈ విమానంలో ఎవరైన డాక్టర్ ఉన్నారా? అని అడిగాడు. దీంతో తాను వెంటనే స్పందించినట్లు రియాజ్ తెలిపారు. ఆ తర్వాత తాను ఆ మహిళ పరిస్థితి చూడటమే గాక ఆమె గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న రోగిగా గుర్తించాను. వెంటనే అక్కడే ఉన్న ఫ్లైట్ అటెండ్ యాపిల్ వాచ్‌ని అడిగి తీసుకున్నారు రియాజ్. ఆ వాచ్‌లో ఉన్న బ్లడ్ ఆక్సిజన్ యాప్ ఫీచర్ సాయంతో ఆ మహిళ శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విమానంలో ఆక్సిజన్ సిలిండర్ ఉందా? అని విమాన సిబ్బందిని అడిగి దాన్ని వెంటనే ఆమెకు అమర్చడం జరిగింది. ఇటలీలో దిగే వరకు ఆ ఆక్సిజన్ సాయంతో ఆమె ప్రాణాలను కాపాడగలిగారు రియాజ్. విమానం ఇటలీలో ల్యాండ్ అవ్వగానే ఆమె తక్షణ వైద్య సాయం అందించింది విమాన సిబ్బంది. ఆ మహిళ కూడా వెంటనే కోలుకోవడమే గాక ఆమె ప్రాణాపయ స్థితి నుంచి బయటపడిందన్నారు రియాజ్. ఒక రకంగా తనకు ఈ యాపిల్ గాడ్జెట్‌ని ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవాలనేది తెలిసిందన్నారు. అలాగే ఈ రోజుల్లో ఇలాంటి ప్రాథమిక గాడ్జెట్లతో ఇలాంటి అత్యవరసర పరిస్థితుల్లో ఒకరి ప్రాణాలను రక్షించడానికి దాన్ని ఎలా వినియోగించుకోవాలనే ఒక గొప్ప పాఠాన్ని నేర్పిందన్నారు రియాజ్. అరువు తెచ్చుకున్న యాపిల్వాచ్లోని ఈ ఫిచర్ ఒకరి ప్రాణాలను కాపాడిందన్నారు. ఇక్కడ బ్లడ్ ఆక్సిజన్ యాప్ ఓ రోగి ప్రాణం కాపాడటంలో అద్భుతమైన సహయకారిగా ఉపయోగిపడిందన్నారు రియాజ్. అయితే యాపిల్ కంపెనీ ఈ యాప్ విషయంలో మెడికల్ టెక్నాలజీ కంపెనీ అయిన మాసిమ్తో పేటెంట్ వివాదం ఎదుర్కొంటోంది. దీంతో యాపిల్ కంపెనీ తమ సీరిస్ 9 అల్ట్రా2 ఆపిల్ వాచ్‌లో బ్లడ్ ఆక్సిజన్ యాప్ ఉండదని గతవారమే వెల్లడించింది కూడా. (చదవండి: దేశంలోనే తొలి 'చేతి మార్పిడి' శస్త్ర చికిత్స! అదికూడా కిడ్నీ మార్పిడి..) -
ఆ విమానంలో ఇద్దరే ప్రయాణికులు! అదికూడా..
విమానంలో వెళ్తున్నప్పుడూ మనం మాత్రమే ఉండి మిగతా ప్రయాణికులు లేకపోతే ఆశ్చర్యంగా ఉంటుంది కదు. అందులోనూ విమానంలో అలా జరిగితే మాములుగా అనిపించదు. అదికూడా కేవలం మన కోసమే ఏదో కారు బుక్ చేసుకున్నట్లు విమానంలో వెళ్తున్నామా! అనిపిస్తుంది. అదికూడా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడే తెలిస్తే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది కదా! అలాంటి ఘటనే ఇక్కడ స్విట్జర్లాండ్‌కు వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..సీషెల్స్ నుంచి స్విట్జర్లాండ్‌కి వెళ్తున్న ఎమిరేట్స్ మిమానంలో ఇద్దరే ప్రయాణికులు. 25 ఏళ్ల జో డోయల్, ఆమె తల్లి 59 ఏళ్ల కిమ్మీ చెడెల్ మాత్రమే ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. మిగతా సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వారిద్దరు ఎకనామీ క్లాస్ క్యాబిన్లో ఉన్నారు. ఫ్లైట్ జర్నీ చేసేంతవరకు తామిద్దరమే ప్రయాణికులని వారివురికి తెలియదు. దీంతో ఒక్కసారిగా ఆ తల్లికూతుళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే బిజినెస్ క్లాస్‌లో నలుగురు ప్రయాణికులు ఉన్నారు గానీ వాళ్లు ప్రయాణిస్తున్న ఎకనామీ క్లాస్‌లో మాత్రం లేరు. తాము మాత్రమే ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్నామని తెలిసి ఆనందంగా ఆ విమానంలో ఉన్న ఫ్లైట్ అటెండెంట్లతో చాట్ చేస్తూ గడిపామని టిక్‌టాక్‌లో వెల్లడించింది జో డోయల్. "ఈ రోజు ఎమిరేట్స్ విమానంలో ఎగురుతున్న ఏకైక మహిళలు మేమే" అని క్యాప్షన్ పెట్టి మరీ వీడియో పోస్ట్ చేసింది. బహుశా క్రిస్మస్‌టైం, పైగా సీషెల్స్‌లో వర్షాకాలం కావడంతో ప్రయాణికులు లేరని చెప్పుకొచ్చింది. ఇద్దరే విమానంలో ప్రయాణించడం చాలా ఆనందంగా ఉందని రాసింది. ఇలాంటి ఘటన జరగడం తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు రెండు జరిగాయి. వారు కూడా ఇలానే సంబరపడ్డారు. పైగా ఏదో ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న ఫీల్ కలిగిందని వారు చెప్పుకొచ్చారు కూడా. (చదవండి: మిసెస్ ఇండియాగా 55 ఏళ్ల మహిళ! గెలుపుకి ఏజ్‌తో పనిలేదని ప్రూవ్ చేసింది!) -
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ హెచ్చరిక!
రైల్వే ప్రయాణికులకు ముఖ్యగమనిక. మొబైల్ యాప్స్ పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని ఐఆర్సీటీసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈజీ మనీ కోసం రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు ఐఆర్సీటీసీ పేరుతో ఫేక్ యాప్స్‌ను తయారు చేస్తున్నారు. వాటిల్లో ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ అనే యాప్ ఉంది. ఆ యాప్‌ను వినియోగించవద్దని కోరింది. సైబర్ కేటుగాళ్లు ఫిషింగ్స్ లింక్స్ సాయంతో డబ్బుల్ని కాజేస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్ టికెటింగ్, ఇతర రైల్వే సంబంధిత సేవల్ని అందించే ఐఆర్సీటీసీ యూజర్లను అప్రమత్తం చేసింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్‌లో, ఐఓఎస్ వినియోగదారులు యాపిల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న అధికారిక ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ యాప్‌లను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. తద్వారా మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చని సలహా ఇచ్చింది. Alert: It has been reported that a malicious and fake mobile app campaign is in circulation where some fraudsters are sending phishing links at a mass level and insisting users download fake ‘IRCTC Rail Connect’ mobile app to trick common citizens into fraudulent activities.… — IRCTC (@IRCTCofficial) August 4, 2023 అంతేకాకుండా, ఒరిజినల్ ఐఆర్సీటీసీ, ఫేక్ ఐఆర్సీటీసీ యాప్స్‌లను గుర్తించాలని తెలిపింది. యాప్ పనితీరు, ఇంటర్ఫేస్, లాగిన్ వివరాలు, చెల్లింపు సమాచారం, వ్యక్తిగత డేటా వంటి గోప్యమైన వివరాలను దొంగిలించే అవకాశం ఉందని సూచించింది. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ.. కొంతమంది మోసగాళ్లు భారీ స్థాయిలో యాప్ వినియోగదారులకు ఫిషింగ్ లింక్‌లను పంపుతున్నట్లు తేలింది. యూజర్లను మోసం చేసేలా నకిలీ 'ఐఆర్ సీటీసీ రైల్ కనెక్ట్' మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేయాలని ప్రోత్సహిస్తున్నారనే ప్రచారంలో ఉంది. అప్రమత్తంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. -
వరద ధాటికి నదిలో చిక్కిన బస్సు... ప్రయాణికుల ఆర్తనాదాలు.. వీడియో వైరల్..
డెహ్రాడూన్: ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కుంభవృష్టి అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో నది దాటడానికి ప్రయత్నించి ఓ బస్సు వరదలో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు బస్సు కీటికీల్లోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. Watch | Bus Tries To Cross River In Uttarakhand, Starts Tilting, Passengers Jump Out pic.twitter.com/anspZg5PiX — NDTV (@ndtv) July 9, 2023 ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో నది దాటడానికి ప్రయత్నించి ఓ బస్సు వరదలో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు బస్సు కీటికీల్లోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. -
వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఫుడ్ బాగాలేదని ప్రయాణీకులు సీరియస్
-
కోరమాండల్ ట్రైన్ లో ఏపీ వాసులు...
-
దిగుతున్న టైంలో విమానం డోర్ లాక్ అయ్యింది!..పాపం ఆ ప్రయాణికుడు..
విమానం గమ్యస్థానానికి చేరకోగానే ప్రయాణికులు దిగిపోవడం సర్వసాధారణం. ఐతే ఓ విమానంలో చివరిగా దిగుతున్న ప్రయాణికుడు దిగే సమయంలో సడెన్‌గా డోర్లు లాకయ్యాయి. ఆ విమానం తిరిగి మరో జర్నీకి రెడీ అవతుండగా అసలు విషయం బయట పడింది. పాపం ఆ ప్రయాణికుడుని బయటకు తీసుకొచ్చేందుకు పైలట్ కాక్‌పీట్ విండో గుండా వెళ్లాల్సి వచ్చింది. ఈ అరుదైన ఘటన అమెరికాలోని శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశయంలో శాక్రమెంటోకు వెళ్లే సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఓ ప్రయాణికుడు అనుకోకుండా ఇరుక్కుపోయాడు. నిజానికి సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ శాన్ డియాగో విమానాశ్రయం చేరుకోగానే ప్రయాణికులంతా దిగిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో బోర్డింగ్ ప్రక్రియలో ఇతర ప్రయాణికులు, ఫ్లైట్ అటెండెంట్లు ఆన్‌బోర్డ్‌లో ఉండగా.. చివరగా దిగుతున్న ప్రయాణికుడు ఫార్వార్డ్ లావేటరీ డోర్‌ని తెరిచాడు. అంతే ఒక్కసారిగా విమానం డోర్ లాక్ అయ్యిపోయింది. దీంతో ఆప్రయాణికుడు ఆ విమానంలో అలానే ఉండిపోయాడు. ఇంతలో మరో ట్రిప్‌కి విమానం సిద్దమయ్యే నిమిత్తం పైలట్లు ఆ విమానాన్ని ఆపరేట్ చేసేందుకు రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పైలట్ డెక్ కాక్‌పీట్ వద్ద ఉండే విండో గుండా వెళ్లి ఆ ప్రయాణికుడిని బయటకు తీసుకొచ్చాడు. ఆ ప్రయాణికుడు ఒక్కడే ఆ విమానం నుంచి చివరిగా బయటకు వచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోను అదే విమానంలో ప్రయాణించేందుకు వెళ్తున్న రెక్స్ రోడ్ అనే మరో ప్రయాణికుడు ఆ దృశ్యాలను నెట్టింట షేర్ చేయడంతో ఈ విషమం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ అనుహ్య ఘటనతో తాము తొమ్మది నిమిషాలు ఆలస్యంగా బయలుదేరినట్లు తెలిపాడు. ప్రతిస్పందనగా సదరు ఎయిర్‌లైన్స్ ట్విట్టర్లో మీరు ఎప్పుడూ చూడని అరుదైన దృశ్యం అని పేర్కొంది. No joke… yesterday last passenger got off plane with no one else on board, he shut the door. Door locked. Pilot having to crawl through cockpit window to open door so we can board. @SouthwestAir pic.twitter.com/oujjcPY67j — Matt Rexroad ✌🏼🇺🇸 (@MattRexroad) May 25, 2023 (చదవండి: తొలిసారిగా సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనున్న చైనా!) -
ల్యాండింగ్ టైంలో ఊపిరాడటం లేదని ఆ డోర్ తెరిచాడు..అంతే విమానం..
ఇటీవల విమానంలో ప్రయాణికుల అనుచితన ప్రవర్తన, వికృత చేష్టలకు సంబంధించి పలు దిగ్బ్రాంతికర ఘటనలు చూశాం. కొందరూ అన్ని తెలిసి తప్పులు చేస్తే, మరికొందరూ తెలిసి తెలియని తనంతో అమాయకత్వంతో అనుచిత ఘటనలకు పాల్పడి కటకటాల పాలయ్యారు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి విమానంలో ప్రమాదకర ఘటనకు పాల్పడ్డాడు. అతడు చేసిన పనితో విమానంలోని మిగతా ప్రయాణకులు స్వల్ప గాయల బారినపడ్డారు. అసలేం జరిగందంటే.. దక్షిణ కొరియా ఎయిర్‌బస్ ఏ321లో ఈ అనుచిత ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు ఊపిరాడటం లేదంటూ గాల్లో విమానం ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచాడు. దీంతో విమానంలోని ఇతర ప్రయాణికులు 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత వెంటనే వైమానికి భద్రతా సిబ్బంది 33 ఏళ్ల సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ విమానంల దక్షిణ ద్వీపం జెబు నుంచి డేగు నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు విచారణలో..ఆ వ్యక్తి తనకు ఊపిరాడనట్లు అనిపించడంతో విమానం నుంచి త్వరితగతిన నిష్క్రమించాలని అనుకుని ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. ఆ విమానంలో ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీకి వెళ్లే టీనేజ్ అథ్లెట్లతో సహా మొత్తం 194 మంది ప్రయాణికులను తీసుకువెళ్తోంది. ఆ విమానం డేగు విమానాశ్రయం వైపుకి వెళ్లే క్రమంలో..సరిగ్గా 700 అడుగుల ఎత్తులో ఉండగా సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీంతో ఆ విమానం కుదుపుకి గురై..అందులోని కొందరూ ప్రయాణికులు శ్వాస తీసుకోవడం తరహా చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భద్రతా సిబ్బంది విమానం ల్యాండ్ అయిన వెంటనే అస్వస్థతకు గురైన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి పాల్పడ సదరు ప్రయాణికుడు ఇటీవలే ఉద్యోగం కోల్పోయాడని, ఒత్తిడికి లోనవ్వడంతోనే ఇలా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. అతను ఇతర ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసేలా ప్రవర్తించినందుకు గానూ సుమారు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడించారు అధికారులు. (చదవండి: ఆ రాయిని మండిస్తే చాలు.. ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ వస్తాయ్!) -
ట్రైయిన్‌లో మరో అసభ్యకర ఘటన.. మద్యం మత్తులో టికెట్ ఎగ్జామినర్..
ఇటీవల ట్రైయిన్‌లో టికెట్ కలెక్టర్ల వరుస అనుచిత ప్రవర్తన ఘటనలు మరువక మునుపే ఓ ప్యాసింజర్ రైలులో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. మద్యం మత్తులో టికెట్ ఎగ్జామినర్ ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో నిలంబూరు నుంచి కొచ్చవేలి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో జరిగింది. దీంతో రైల్వే పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ చేశారు. వివరాల్లోకెళ్తే.. రైలు రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ నిలంబూర్ కొచువేలిలోని అలువా స్టేషన్ దాటిన తర్వాత ఈ అనూహ్య ఘటన జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలికి ఆర్ఏసీ టికెట్ వచ్చింది. దీంతో ఆమె ఎస్4లో కూర్చొని ఉండగా ఒక టిక్కెట్ ఎగ్జామినర్ (టీఈ) వచ్చి ఆమె పక్కనే కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆమె చేతిని గట్టిగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె వెంటనే తిరువనంతపురంలోని రైల్వే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెతోనూ 35 ఏళ్ల టీఈతోనూ మాట్లాడి విచారించి, సదరు టీఈని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత టీఈకి వైద్య పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఆ మహిళ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. కోర్టు అతనికి 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీని విధించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: బహుభార్యత్వంపై కొరడా ఝళిపిస్తున్న అస్సాం! సీఎం కీలక ప్రకటన) -
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..ప్రయాణికురాలు సజీవదహనం
మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో రిక్షాలో మంటలు చెలరేగడంతో ఓ మహిళ ప్రయాణికురాలు అక్కడికక్కడే సజీవ దహనమైంది. ఈ ఘటన థానేలోని ఘోడ్‌బందర్ రోడ్డులోని గైముఖ్ ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు. ఆటో రిక్షా డివైడర్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన మహిళను గుర్తించాల్సి ఉందన్నారు. ఆమె వాహనంలో ఇరుక్కుపోవడంతోనే సజీవ దహనమైనట్లు తెలిపారు. ఆ ఆటో రిక్షి థానే నగరం నుంచి భయందర్ వైపు వెళ్తుండగా నియంత్రణ కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో డ్రైవర్ రాజేష్ కుమార్‌కు(45) తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: కింగ్ చార్లెస్ పట్టాబిషేకం కోసం ముంబై డబ్బావాలాలు గిఫ్ట్‌లు కొనుగోలు) -
అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు
ఇటీవల విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలను చూశాం. వాటిని తలదన్నేలా విమానంలో మరో దారుణ ఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కెయిర్న్స్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 20న కెయిర్న్స్ నుంచి నార్తర్న్ టెరిటరీ ఆఫ్ ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఘోరంగా ప్రవర్తించారు. ఆ విమానంలో ఆ ముగ్గురు ప్రయాణికుల మద్య వివాదం తలెత్తింది. దీంతో వారంతా దారుణంగా కొట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్నది విమానం అన్న స్ప్రుహ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఆ బృందంలోని 23 ఏళ్ల మహిళ, మరో 22 ఏళ్ల ప్రయాణికుడు చాలా దారుణంగా కొట్లాడుకున్నారు. ఇతర ప్రయాణికులకు భయం కలిగించేలా.. విమానంలోని ఫర్నిచర్ డ్యామేజ్ అయ్యేలా పోట్లాడుకున్నారు. విమాన సిబ్బంది సైతం వారిని నియంత్రించడంలో విఫలం కావడంతో విమానాన్ని క్వీన్ల్యాండ్స్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించాల్సి వచ్చింది. చివరికి విమానం టేకాఫ్ అయినప్పుడూ కూడా ఆ గుంపు ఏ మాత్ర తగ్గలేదు. మరోసారి గొడవపడ్డారు. వారి రగడ కారణంగా విమానం కిటికి అద్దం కూడా పగిలిపోయింది. దీంతో విమానం దిగిన వెంటనే ఆ సముహన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కాగా, ప్రయాణికుడి వద్ద మాదక ద్రవ్యాలను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు సదరు విమానంలో నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Departing Cairns today.. Just someone trying to glass someone. More fighting amongst themselves. Complete disregard for other passengers and the plane. I wonder if there were any consequences. #VoteNO 🇦🇺 #VoiceToParliament pic.twitter.com/v5iKWbWRtM — Jet Ski Bandit (@fulovitboss) April 20, 2023 (చదవండి: పియానో వాయించిన చిన్నారికి ప్రధాని మోదీ ఫిదా.. వైరలవుతున్న వీడియో) -
తప్పతాగి.. విమానంలో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన!
న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ భారతీయుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. అయితే విమానయాన సంస్థ, విమానంలోని ప్రయాణీకుల వాంగ్మూలాలను రికార్డ్ చేసి, నిందితులను లా ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించాయని దేశ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ తెలిపింది. ప్రయాణికుడిపై ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఫిర్యాదు చేసిన తర్వాత పౌర విమానయాన చట్టంలోని నాన్-కాగ్నిజబుల్ నేరాల కింద చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ఈ ఘటనపై సహ ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఏఏ292 విమానం ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. వరుసగా మూడోసారి గత ఏడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా న్యూయార్క్-ఢిల్లీ విమానంలో బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి వృద్దిరాలిపై మూత్రం పోశాడు. డిసెంబర్ 6 న ఎయిర్ ఇండియా ప్యారిస్-న్యూఢిల్లీ విమానంలో ఓప్రయాణికుడు ఖాళీ సీటుపై, దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. ఇలా వరుస ఘటనలపై డీజీసీఏ చర్యలు తీసుకున్నప్పటికీ తాజాగా మరో ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. -
విమానంలో పెద్దాయన పాడుపని..ఫ్లైట్ అటెండెంట్‌కి బలవంతంగా..
ఇటీవల విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలకు సంబంధించి ఏదో ఒక ఘటనను తరుచుగా వింటున్నాం. అవన్నీ మరువకే మునుపే అచ్చం అలాంటి మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో సదరు ప్రయాణకుడు కటకటాల పాలయ్యాడు కూడా. ఈ ఘటన డెల్టా ఎయిర్‌లైన్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 10న మిన్నెసోటా నుంచి అలస్కాకు ప్రయాణిస్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో 61 ఏళ్ల డేవిడ్ అలాన్ బర్క్ అనే వృద్ధ ప్రయాణికుడు ఫ్లైట్ అటెండెంట్ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాడు. ఆ వృద్ధ ప్రయాణకుడు ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ సీటులో కూర్చొన్నాడు. అక్కడే ఓ మగ ఫ్లైట్ అటెండెంట్ పనిచేస్తున్నాడు. సాదారణంగా ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు టేకాఫ్ చేయడానికి ముందు ఫ్లైట్ అటెండెంట్ నుంచి డ్రింక్స్‌ని స్వీకరిస్తారు. అయితే ఆ అటెండెంట్ ఆ వృద్ధ ప్రయాణికుడు బర్క్‌కి నచ్చిన రెడ్ వైన్ ఆల్కాహాల్ని అందించలేదు. దీంతో ఆ ప్రయాణికుడు ఒకింత అసహనానికి గురయ్యాడు. ఆ తర్వాత భోజన ఆర్డర్లను తీసుకోవడానికి ఆ ఫ్టైట్ అటెండెంట్ వస్తుండగా.. ఆ ప్రయాణికుడు బర్క్ అతనిని అందంగా ఉన్నావంటూ బలవంతంగా ముద్దు పెట్టుకునే యత్నం చేశాడు. దీంతో ఫ్లైట్ అటెండెంట్ ఒక్కసారిగా గురయ్యాడు. పాపం ఆ అటెండెంట్ ఆ ప్రయాణికుడి కాంప్లీమెంట్కి ధన్యావాదాలు చెబుతూ వద్దు సార్ అంటూ వెనక్కి వెళ్లే యత్నం చేసిన మెడపై ముద్దు పెట్టే యత్నం చేశాడు. వాస్తవానికి ఆ ప్రయాణకుడు రెస్ట్‌రూమ్‌కి వెళ్లేందుకు లేచాడని ఆ తర్వాత తాను ఎదురపడగానే అతను ఇలా అనుచితంగా ప్రవర్తించినట్లు సిబ్బంది పేర్కొన్నారు. దీంతో ఆ ఫ్టైట్ అటెండెంట్ డెల్టా ఎయిర్‌లైన్స్‌కి జరిగిన విషయాన్ని ఫోన్ కాల్ ద్వారా తెలయజేసి ఫిర్యాదు చేశారు. అలాగే అతను తాగిన మత్తుమలోనే అలా ప్రవర్తించాడని, పైగా పైలట్ భోజనం ట్రైని కూడా పగలుగొట్టి భయబ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించాడని ఫిర్యాదు చేశాడు ఫ్లైట్ అటెండెంట్. ఆ ప్రయాణికుడు నిద్రపోయే ముందు మరో రెండు గ్లాస్‌ల రెడ్వైన్ని అడిగినట్లు సమాచారం. ఈ మేరకు ఆ విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే అధికారులు ఆ వికృత వృద్ధ ప్రయాణికుడిరి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ నెల ఏప్రిల్ 27న కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. (చదవండి: సెప్టెంబర్‌లో భారత్‌కు బైడెన్) -
ప్రయాణికులతో మర్యాదగా మెలగండి ! ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హితవు
ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని కండక్టర్లకు సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సూచించారు. సంస్థకు కండక్టర్లు, డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లని, క్షేత్రస్థాయిలో జాగ్తత్తగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. చిన్న పొరపాట్ల వల్ల ఆర్టీసీ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు. ఆర్టీసీ బ్రాండ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా సంస్థ అభివృద్ధికి పాటుపడాలని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డిపోల్లో కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ ఏప్రిల్ ఛాలెంజ్ ఫర్ ట్రైనింగ్(టాక్ట్) శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు సజ్జనర్ హైదరాబాద్ బస్ భవన్ నుంచి వర్చ్‌వల్‌గా.. ఈ శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న కండక్టర్లతో ముచ్చటించారు. శిక్షణ జరుగుతున్న తీరు, శిక్షణలో చెబుతున్న విషయాల ఉపయోగం, తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. "మనం ప్రయాణికుల కేంద్రంగానే పనిచేయాలి. ప్రయాణికులతో ఎట్టి పరిస్థితుల్లోనూ దురుసుగా ప్రవర్తించొద్దు. బస్సులోకి రాగానే వారిని నమస్తే అంటూ చిరునవ్వుతో పలకరించాలి. కొత్త ప్రయాణికులను మన సంస్థ వైపు మెగ్గుచూపేలా వ్యవహారించాలి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విధులు నిర్వహించాలి. విధి నిర్వహణలో స్వీయ క్రమశిక్షణను కలిగి ఉండాలి." అని కండక్టర్లకు సజ్జనర్ హితవు పలికారు. గత ఏడాదిన్నర కాలంలో సంస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) 69గా ఉంది. దానిని 75కి పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే సంస్థలో ప్రతి ఒక్క సిబ్బందికి టాక్ట్ పేరుతో శిక్షణ ఇస్తున్నాం. ఆ లక్ష్యానికి అనుగుణంగా అందరూ పనిచేయాలి." అని సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ శిక్షణ స్పూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. సంస్థ లాభాల బాటలో పయనించేలా పాటుపడాలన్నారు. ఇటీవల రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలోని దాదాపు 6 వేల మంది డ్రైవర్లకు టాక్ట్ శిక్షణను ఇచ్చామని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో సంస్థలోని సిబ్బంది అందరికీ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. కాగా, టాక్ట్ పేరుతో తమకు అందిస్తోన్న ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉందని కండక్టర్లు సంస్థ ఎండీ సజ్జనర్‌కు చెప్పారు. తమలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని వివరించారు. ప్రయాణికుల మీదనే సంస్థ ఆధారపడి ఉందనే విషయాన్ని తాము మరిచిపోమన్నారు. ఓఆర్‌ను 75కి పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, ఓఎస్డీ(ఐటీ అండ్ డీ) యుగంధర్, సీటీఎం(ఎం అండ్ సీ) విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. (చదవండి: రాష్ట్రం మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి.. వర్షాలకు అవకాశం) -
రైల్వే ప్రయాణికులకు IRCTC అలెర్ట్..
-
గాల్లో ఉండగానే హాట్ ఎయిర్ బెలూన్‌లో ఎగిసిపడ్డ మంటలు..ప్రయాణికులు..
హాట్ ఎయిర్ బెలూన్లలో పయనిస్తూ ఆకాశపు వీధిని చూడటం అనేది ఒక త్రిల్. సాహస క్రీడలంటే ఇష్టపడే వారు ఈ బెలుస్లలో పయనించడానికి ఎంతో ఇష్టపడతారు. అచ్చం అలానే కొందరు పర్యాటకులు ఒక హాట్ ఎయిర్ బెలూన్‌లో పయనిస్తుండగా విషాదం చోటు చేసుకుంది. ఏమోందో ఏమో! ఒక్కసారి మంటలు చుట్టుముట్టాయి. దీంతో బెలూన్ గోండోలాలో ఉన్న ప్రయాణికులు భయంతో దూకేయగా..మరికొందరూ ఆ మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒక చిన్నారి ముఖానికి తీవ్ర గాయాలు కాగా, దూకేయడంతో తొడ ఎముక ఫ్రాక్చర్ అయ్యింది. భాదితులను 39 ఏళ్ల మహిళ, 50 ఏళ్ల వృద్ధురాలిగా గుర్తించారు. ఇంకా ఇతర ప్రయాణకులెవరైనా ఆ బెలున్ గోండోలాలో ఉన్నారనే తెలియాల్సి ఉంది. మెక్సికో నగరానికి ఈశాన్యంగా ఉన్న టియోటిహుకాన్ అనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రం వద్ద ఈ హాట్ హెయిర్ బెలూన్లను టూరిస్టుల కోసం ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Mexico 🇲🇽 ! Breaking news!🚨🚨 Saturday, April 01, 2023, in the morning hours. a hot air balloon catches fire and collapses in Teotihuacan, 2 people are reportedly dead. The events occurred this morning in the vicinity of the Pyramid of the Sun and the area was cordoned off. pic.twitter.com/DlzJdv2oHH — Lenar (@Lerpc75) April 1, 2023 (చదవండి: అమెరికాలో టోర్నడో బీభత్సం) -
Ticket Checker Pees :టీసీపై సస్పెన్షన్ వేటు విధించిన రైల్వే మంత్రి
రైలులో ప్రయాణిస్తున్న మహిళపై టీసీ మూత్ర విసర్జనకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి టీసీపై సస్పన్షన్ వేటు విధించమని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన జరిగిన రోజు సదరు నిందితుడు టీసీ సెలవులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఉత్తర మద్య రేల్వేకి రాసిన లేఖలో..మహిళలను అగౌరవపరిచే ప్రవర్తన తీవ్ర దుష్ప్రవర్తన కిందకు వస్తుంది. వ్యక్తిగా అతనికే కాకుండా సంస్థగా మొత్తం రైల్వేలకు చెడ్డపేరు వచ్చేలా చేశాడు. రైల్వే ఉద్యోగిగా అతని అనుచిత ప్రవర్తనకు గానూ అతన్ని విధుల నుంచి తొలగించడమే సరైన శిక్ష అని భావిస్తున్నా. అందువల్ల అతడిని తక్షణమే విధుల నుంచి తొలగించండి అని లేఖలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన లేఖను కూడా రైల్వే మంత్రి అశ్వనీ ట్విట్టర్లో షేర్ చేశారు. కాగా అకాల్ తఖ్ ఎక్స్‌ప్రెస్ ఏ1 కోచ్‌లో ఒక మహిళ తన భర్తతో కలసి ప్రయాణిస్తుంది. ఇంతలో మద్యం మత్తులో ఉన్న టీసీ అర్థరాత్రి నిద్రిస్తున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఆమె కేకలు పెట్టడంతో వెంటనే ఆమె భర్త, ప్రయాణికులు స్పందించి..అతడికి దేహశుద్ధి చేసి రైల్వే పోలీసులకు అప్పగించారు. (చదవండి: మోదీజీ ఆ ఆస్కార్ క్రెడిట్‌ని తీసుకోకండి: ఖర్గే సెటైరికల్ పంచ్) -
విమానంలో స్మోకింగ్.. పట్టుబడ్డాక యాక్టింగ్‌తో పిచ్చెక్కించిన ప్రయాణికుడు?
విమానంలో అభ్యంతరకరంగా ప్రవర్తించడం, ఇతర ప్రయాణికులపై మూత్రవిసర్జన చేయడం, అడ్డుకున్న సిబ్బందిపై దాడికి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికాలో నివసించే రమాకాంత్ అనే ప్రయాణికుడు ఎయిరిండియా విమానంలో వీరంగం సృష్టించాడు. ఎయిరిండియాకు చెందిన ఓ విమానం లండన్ నుంచి ముంబైకి బయల్దేరింది. విమానం గాల్లో ఉండగా రమాకాంత్ బాత్రూంలో స్మోక్ చేశాడు. వద్దని వారించినా క్రూ సిబ్బంది, ఇతర ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల మేరకు..విమానంలో స్మోకింగ్ చేయడం చట్టరిత్యా నేరం. అయినా నిబంధనల్ని ఉల్లంఘించిన రమాకాంత్.. ఎయిరిండియా విమానం టాయిలెట్లో ధూమపానం చేశాడు. అలారం మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది సదరు ప్రయాణికుడి చేతిలో సిగరెట్ ఉండటాన్ని గమనించారు. విమానంలో స్మాకింగ్ చేయకూడదని వారించడంతో చేతిలో ఉన్న సిగరెట్‌ను పక్కకు విసిరేశాడు. విమానంలో జిమ్మిక్కులు అనంతరం క్రూ సిబ్బందిపై గట్టిగా కేకలు వేస్తూ నానా హంగామా చేశాడు. అతన్ని నచ్చజెప్పిన సిబ్బంది తన సీట్లో కూర్చోబెట్టారు. కొద్ది సేపటికి విమానం గాల్లో ఉండగా అత్యవసర ద్వారాన్ని (emergency door) తెరిచేందుకు యత్నించాడు. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో కేకలు వేయడంతో.. జిమ్మిక్కులతో వింతగా ప్రవర్తించాడు. మళ్లీ అరవడం మొదలు పెట్టాడు. తలను అటూ ఇటూ ఊపుతూ విమాన సిబ్బందిని, ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేశారు. ప్రయాణికుల్లో ఉన్న ఓ డాక్టర్ అతని ఆరోగ్యంపై ఆరా తీశాడు. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా’ అని పరీక్షించాడు. అతని వద్ద ఎలాంటి మెడిసిన్ లభ్యం కాలేదు. ఈ - సిగరెట్ మాత్రమే ఉన్నట్లు ఎయిరిండియా క్రూ సిబ్బంది సహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదుతో 37ఏళ్ల రమాకాంత్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 336 (ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించేలా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం), ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1937,22 (పైలట్-ఇన్-కమాండ్ ఇచ్చిన చట్టబద్ధమైన సూచనలను నిరాకరిండం), 23 (దాడి, ఇతరుల భద్రతకు హాని,విధులకు భంగం కలిగించడం), 25 (ధూమపానం చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనారోగ్య సమస్యలపై ఆరా నిందితుడు భారతీయ సంతతికి చెందినవాడని, అయితే అమెరికా పౌరుడని గుర్తించేలా అమెరికా పాస్ పోర్ట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడా? లేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అని నిర్ధారించేందుకు వైద్య పరీక్షల కోసం నిందితుడి బ్లడ్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. -
ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్‌లైన్‌కు భారీ పెనాల్టీ
ప్రయాణికులను ఎక్కించుకోకుండా టేకాఫ్ అయ్యిన మరో ఎయిర్‌లైన్‌కు డీజీసీఏ భారీ పెనాల్టీ విధించి గట్టి షాక్ ఇచ్చింది. ఎయిర ఇండియా మూత్ర విసర్జన ఘటనలో సీరియస్ అయ్యినా డీజీసీఏ సదరు ఎయిర్‌లైన్‌కు గట్టిగా జరిమానా విధించిన షాకింగ్ ఘటన మరువక మునుపే మరో ఎయిర్‌లైన్‌కి పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించింది డీజీసీఏ. ఈ మేరకు జనవరి 9న ఉదయం 6.30కి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన జీ8, 116 గో ఫస్ట్ విమానం 55 మంది ప్రయాణికులను వదిలేసి టేకాఫ్ అయ్యింది. ఈ విషయమై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ సదరు ఎయిర్‌లైన్‌కి నోటీసులు పంపి వివరణ ఇవ్వమని కోరింది. ఐతే సదరు ఎయిర్‌లైన్ ప్రయాణికులను ఎక్కించే విషయంలో టెర్మినల్ కో ఆర్డినేటర్, కమర్షియల్ సిబ్బందికి మధ్య సరైన కమ్యూనికేషన్, సమన్వయం లేకపోవడంతో ఈ తప్పిదం చోటు చేసుకుందని వివరించింది. దీంతో డీసీజీఏ ప్రయాణికులను ఎక్కించుకోవడంలో బహుళ తప్పిదాలు ఉన్నాయంటూ రూ. 10 లక్షలు జరిమాన విధించింది. ఇదిలా ఉండగా గోఫస్ట్ ఎయిర్‌లైన్ ఈ అనుకోని పర్యవేక్షణ ఘటనకు ఇబ్బందిపడ్డ నాటి ప్రయాణికులకు క్షమాపణల చెప్పింది, పైగా బాధిత ప్రయాణికులకు వచ్చే ఏడాదిలోపు భారత్‌లో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఒక ఉచిత టిక్కెట్‌ను కూడా అందించింది. ఈ ఘటన జరిగినప్పుడూ ఫ్లైట్‌లో ఉన్న సిబ్బందిని కూడా తొలగించారు. (చదవండి: పాక్‌కు భారత్ నోటీసులు..సింధు జలాల ఒప్పందం మార్చకుందామా!) -
విమానంలో మూత్ర విసర్జన: రాజీ కుదిరిందని ఫిర్యాదు చేయలేదు
ఎయిర్ ఇండియాలోని బిజినెస్ క్లాస్‌లో జరిగిన మూత్ర విసర్జన ఘటనపై బాధితురాలు టాటా గ్రూప్ చైర్మన్‌కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై డైరక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఇండియాని వివరణ కోరగా..వారి మధ్య రాజీ కుదరడంతో ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. తమ విమాన సిబ్బంది బాధిత మహిళకు సదరు వ్యక్తితో క్షమాపణలు చెప్పించినట్లు తెలిపింది. అంతేగాక సదరు వ్యక్తి తాను ఫ్యామిలీ మ్యాన్నంటూ అరెస్టు చేయొద్దని ఆమెను వేడుకోవడంతో ఆమె ఫిర్యాదు ఉపసంహరించుకున్నారని, అందువల్లే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా...నవంబర్ 27ను న్యూయార్క్ నుంచి ఢిల్లీ విమానంలో జరిగిన ఘటనపై బాధిత మహిళ లేఖ రాయడంతో.. ఎయిర్ ఇండియా జనవరి 4న మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు ఫిర్యాదు చేసింది. పైగా ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ముంబై వ్యాపారవేత్త శంకర్ మిశ్రాగా వెల్లడించింది. ఆ వ్యక్తి విషయమై ఎయిర్‌పోర్ట్‌లో ఎలర్ట్ ప్రకటించిడమే గాకుండా పోలీసులు ఆ వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపింది. అంతేగాదు ఎఫ్ఐఆర్లో భాగమైన ఆ లేఖలో భాధిత మహిళ.. విమాన సిబ్బంది సదరు వ్యక్తితో క్షమాపణలు చెప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ అతనితో మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలిపింది. పైగా అతన్ని సిబ్బంది తన వద్దకు తీసుకువచ్చారని...అతను ఏడుస్తూ..క్షమాపణలు చెప్పడమే గాక తనకు కుటుంబం ఉందని, తన భార్య, బిడ్డ బాధపడకూడదంటే.. మీరు ఫిర్యాదు చేయకూడదంటూ తనని వేడుకున్నాడని తెలిపారు. వికృత ఘటనకు పాల్పడిన ఆ వ్యక్తితో చర్చించేలా చేయడంతో.. తాను దిక్కుతోచని స్థితిలో పడిపోయానని చెప్పింది. అతను అలా కన్నీళ్లు పెట్టుకోవడంతో..తాను అరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేయలేకపోయానని లేఖలో తెలిపింది. ఐతే అతను చేసింది క్షమించరాని నేరం అని, అలాగే విమాన సిబ్బంది సరైన అవగాహన లేనివారని, అందువల్లే ప్రయాణికుల భద్రత కాపాడటంలో విఫలమయ్యారని ఆరోపణలు చేశారు. అంతేగాదు విమానంలో ప్రయాణికులకు ఎంత మోతాదు వరకు ఇవ్వాలే సరైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ఈ సున్నితమై ఘటనపై క్రియాశీలకంగా వ్యవహరించడంలో కూడా విఫలమైందటూ ఆమె లేఖలో వివరించారు. (చదవండి: నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..!) -
నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..!
ఒక వ్యక్తి ఫ్లైట్ జర్నీలో ఉండగా గుండె పోటుకి గురయ్యాడు. దీంతో భారత సంతతికి చెందిన వ్యక్తి ఐదుగంటలు శ్రమించి అతన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. విమానంలో తగిన వైద్య పరికరాలు లేకపోయినప్పటికీ.. ఆయన్ను రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేయడంతో...సదరు పేషెంట్ కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ఘటన లండన్ నుంచి భారత్‌కి వెళ్లే విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బర్మింగ్‌హామ్‌లో కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ , భార సంతతి డాక్టర్ విశ్వరాజ్ వేమల సుమారు 10 గంటల పాటు ఫ్లైట్ జర్నీలో ఉండగా.. ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో 43 ఏళ్ల వ్యక్తి రెండు సార్లు తీవ్ర గుండెపోటుకి గురయ్యాడు. దీంతో విమాన సిబ్బంది ఈ విషయం గురిచి డాక్టర్ విశ్యరాజ్ తెలియజేశారు. ఈ మేరకు విశ్వరాజ్ అతన్నిరక్షించేందుకు విమానంలో పరిమిత పరిధిలోనే ఉన్న వైద్య సామాగ్రితో అతని ప్రాణం కాపాడేందుకు శతవిధాల యత్నించారు. వాస్తవానికి ఆయన లండన్‌లో ఉన్న తన తల్లిని తిరిగి భారత్‌లోని తమ స్వస్థలం బెంగళూరుకి తీసుకువెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. విమాన సిబ్బంది ఒక వ్యక్తికి గుండె పోటు వచ్చిందంటూ తన వద్దకు పరిగెత్తుకు వచ్చినట్లు విశ్వారాజ్ తెలిపారు. విమానంలో ఉన్న పరిమిత పరిధిలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ సాయంతో అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఐతే అతను స్ప్రుహలోకి రావడానికి సుమారు గంట సమయం పట్టిందని, తనతో మాట్లాడుతుండగానే మరోసారి గుండెపోటుకి గురైనట్లు తెలిపాడు. దీంతో విమానంలో ఉన్న మిగతా ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరిలో ఆ వ్యక్తి గురించే ఒకటే టెన్షన్ మొదలైంది. అందరం అతను ఐదుగంటల వరకు ప్రాణాలతో ఉండేలా ప్రయత్నించాం. ఆ ప్రయాణికుడు విషయమై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పైలెట్ ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.తామంతా ముంబైలో దిగుతుండగా అందరిలోనే అతను బతకే ఉండాలంటూ ఒకటే ఆందోళన చెందినట్లు తెలిపారు. ఎట్టకేలకు ముంబైలో దిగినప్పుడూ.. ఆ ప్రయాణికుడు సదరు డాక్టర్ విశ్వారాజ్తో మాట్లాడటమే కాకుండా కన్నీటితో కృతజ్ఞతలు తెలిపాడు. అదీగాక ముంబైలోని ఎయిర్పోర్ట్ అత్యవసర సిబ్బంది అతన్ని సురక్షితంగా కాపాడటమే గాక అతను కూడా పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు డాక్టర్ విశ్వరాజ్ వేముల తన జీవితాంతం ఈ ఘటన మర్చిపోలేనంటూ..ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. (చదవండి: ఘోర ప్రమాదం..ఏకంగా నెత్తిమీద ఉన్న చర్మంతో సహా ఊడి..) -
ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు...దెబ్బకు ఎయిర్పోర్ట్ క్లోజ్
సాధారణంగా విమానంలో ఏ ప్రయాణికుడి వద్దనైన విమానాశ్రయానికి తీసుకురాని వస్తువులు దొరికితే అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరుగుతుంది. అంతేగానీ ఎయిర్ పోర్ట్‌ని క్లోజ్ చేయరు. కానీ ఇక్కడొక ప్రయాణకుడి లగేజ్ బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు కారణంగా....మొత్తం ఎయిర్‌పోర్ట్‌నే క్లోజ్ చేశారు. వివరాల్లోకెళ్తే...స్కాట్లాండ్లోని విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద ప్యాకేజీ కనిపించింది. దీంతో వందలాదిమంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ డెస్క్ వద్ద క్యూలో నిలబడి ఉన్నారు. దీంతో విమానాల్లో వెళ్లాల్సిన మరికొంతమంది ప్రయాణికులు కార్ పార్కింగ్‌లోనే నిలబడిపోయి ఉండాల్సి వచ్చింది. విమానాశ్రయంలో సిబ్బంది లగేజీలపై దర్యాప్తు చేస్తున్నందున ఆలస్యమవుతుందని ఎయిర్పోర్ట్ అధికారి తెలిపారు. ఐతే ప్రయాణికుడి లగేజీలో అనుమానాస్పద వస్తువు కారణంగానే.. సిబ్బంది అప్రమత్తమైనట్లు తెలిపారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడంతో మరింతమంది ప్రయాణికులు క్యూలో పడిగాపులు పడాల్సి వచ్చింది. మరోవైపు విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణకుల రద్దీ ఎక్కువ అవ్వడంతో తనిఖీలు చేయడం మరింత ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. అందువల్లే తాము ముందు జాగ్రత్తగా టెర్మినల్ భవనాన్ని మూసివేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అంతేగానీ ఎయిర్‌పోర్ట్‌ని మొత్తం ఖాళీ చేయించలేదని చెప్పారు. (చదవండి: కరోనా విషయమై అగ్రరాజ్యం గుట్టు బట్టబయలు..వెలుగులోకి షాకింగ్ నిజాలు) -
గంటల తరబడి నిరీక్షణ తర్వాత ట్రైయిన్ ఎంట్రీ..ఒక్కసారిగా ప్రయాణికుల రియాక్షన్
వాస్తవానికి మనం ఏదైనా ఊరు లేదా యాత్రకు వెళ్లేటప్పుడూ ట్రైయిన్/బస్సు లేదా విమానం కోసం ఒక్కోసారి గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. సరిగ్గా ఆ రోజు వాతావరణం బాగోకపోవడమో లేక ఆ వాహనాల్లో సమస్య తలెత్తడం వంటి తదితర కారణాల రీత్యా ఆలస్యమైపోతుంది. దీంతో ఎవరికైనా సహజంగా కోపం, చిరాకు వంటివి వచ్చేస్తాయి. దెబ్బకు మళ్లీ ఎక్కడకి వెళ్లకూడదు అనుకునేంత చిర్రెత్తుకొస్తుంది. అచ్చం అలాంటి ఘటన ఒక రైల్వేస్టేషన్‌లోని ప్రయాణకులకు ఎదురైంది. అ లాంటి ఇలాంటి లేటు కాదు ఏకంగా 9 గంటలకు పైగా ట్రైయిన్ కోసం నిరీక్షించారు. అన్ని గంటలు అంటే కచ్చితంగా బాబోయ్ అసలు ట్రైయిన్ వస్తుందా రాదా! అన్నంత చిరాకొచ్చి వెళ్లిపోవాలనుకుంటాం. కానీ ఇక్కడ రైల్వేస్టేషన్లో వందలమంది ప్రయాణికులు ట్రైయిన్కోసం అలా పడిగాపులు కాచి ఉన్నారే తప్ప అసహనంగా కూడా లేరు. ఎట్టకేలకు తొమ్మిది గంటల ఆలస్యం తర్వాత ట్రైయిన్ రానే వచ్చింది. అంతే ప్రయాణకులంతా ఒక్కసారిగా విజిల్స్ వేస్తే ఏదో సాధించేసినట్లుగా ఫీలవుతూ హయిగా ఆ రైలు ఎక్కేసారు. అంతేకాదు దూరం నుంచి చిన్న లైటు వెలుగుతో హారన్ వేయిగానే ఎదురుచూస్తున్న ప్రయాణికుల మొహాలు చిచ్చబుడ్డిల్లా వెలిగిపోయాయి. ఐతే ఇంతకీ అదే ఏ స్టేషన్ ఎక్కడ జరిగిందనేది తెలయాల్సి ఉంది. అందుకు సబంధించిన వీడియోని హార్దిక బొంతు అనే సోషల్ మీడియా వినియోగదారుడు ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఐతే నెటిజన్లు మాత్రం ఇండియాలో ప్రజలు ఏ సమస్యనైనా ఇలానే సహనంతో నవ్వుతూ ఎదుర్కొంటారు, ఇదే ఈ దేశంలోని అసలైన అందం అని కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. Our train got late by 9 hours. This is how people reacted when it arrived. pic.twitter.com/8jteVaA3iX — Hardik Bonthu (@bonthu_hardik) November 27, 2022 (చదవండి: ఎంతపనిచేసింది ఆ దోమ..నాలుగు వారాల కోమా, ఏకంగా 30 సర్జరీలా!)