ఇటీవల విమానంలో ప్రయాణికుల అనుచితన ప్రవర్తన, వికృత చేష్టలకు సంబంధించి పలు దిగ్బ్రాంతికర ఘటనలు చూశాం. కొందరూ అన్ని తెలిసి తప్పులు చేస్తే, మరికొందరూ తెలిసి తెలియని తనంతో అమాయకత్వంతో అనుచిత ఘటనలకు పాల్పడి కటకటాల పాలయ్యారు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి విమానంలో ప్రమాదకర ఘటనకు పాల్పడ్డాడు. అతడు చేసిన పనితో విమానంలోని మిగతా ప్రయాణకులు స్వల్ప గాయల బారినపడ్డారు.
అసలేం జరిగందంటే.. దక్షిణ కొరియా ఎయిర్‌బస్ ఏ321లో ఈ అనుచిత ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు ఊపిరాడటం లేదంటూ గాల్లో విమానం ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచాడు. దీంతో విమానంలోని ఇతర ప్రయాణికులు 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత వెంటనే వైమానికి భద్రతా సిబ్బంది 33 ఏళ్ల సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
ఆ విమానంల దక్షిణ ద్వీపం జెబు నుంచి డేగు నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు విచారణలో..ఆ వ్యక్తి తనకు ఊపిరాడనట్లు అనిపించడంతో విమానం నుంచి త్వరితగతిన నిష్క్రమించాలని అనుకుని ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. ఆ విమానంలో ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీకి వెళ్లే టీనేజ్ అథ్లెట్లతో సహా మొత్తం 194 మంది ప్రయాణికులను తీసుకువెళ్తోంది. ఆ విమానం డేగు విమానాశ్రయం వైపుకి వెళ్లే క్రమంలో..సరిగ్గా 700 అడుగుల ఎత్తులో ఉండగా సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు.
దీంతో ఆ విమానం కుదుపుకి గురై..అందులోని కొందరూ ప్రయాణికులు శ్వాస తీసుకోవడం తరహా చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భద్రతా సిబ్బంది విమానం ల్యాండ్ అయిన వెంటనే అస్వస్థతకు గురైన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి పాల్పడ సదరు ప్రయాణికుడు ఇటీవలే ఉద్యోగం కోల్పోయాడని, ఒత్తిడికి లోనవ్వడంతోనే ఇలా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. అతను ఇతర ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసేలా ప్రవర్తించినందుకు గానూ సుమారు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడించారు అధికారులు.
(చదవండి: ఆ రాయిని మండిస్తే చాలు.. ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ వస్తాయ్!)
Comments
Please login to add a commentAdd a comment