emergency door
-
వందే భారత్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్
సేలం: వందే భారత్ రైలు అత్యవసర డోర్ తెరుచుకున్న వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులను శుక్రవారం సస్పెండ్ చేశారు. చైన్నె– కోయంబత్తూరు మధ్య వందే భారత్ రైలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 26న ఈ రైలు అత్యవసర డోర్ తెరుచుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చైన్నెకు చెందిన రిటైర్డ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పౌలేష్ (70), ఆయన భార్య రోజ్ మార్గరేట్ ఈరోడ్‌కు ఈ రైలులో ఈ నెల 26న ప్రయాణించారు. సాయంత్రం 6.05 గంటలకు వందే భారత్ రైలు సేలం చేరుకుని ప్లాట్‌ఫామ్ 4 వద్ద ఆగింది. ఈ సమయంలో పౌలేష్ తన సీటు నుంచి లేచి రైలు ఎమర్జెన్సీ డోర్ దగ్గర నిలబడ్డాడు. అప్పుడు అకస్మాత్తుగా డోర్ తెరుచుకోవడంతో పౌలేష్ అవతలివైపు ఉన్న 5వ ప్లాట్‌ఫారమ్‌పై పడి మృతిచెందాడు. ఈ ఘటనపై సేలం రైల్వే డివిజనల్ మేనేజర్ పంకజకుమార్ సిన్హా విచారించారు. సీ3 కంపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇందులో సేలం రైల్వే స్టేషన్‌న్‌లోని 4వ ప్లాట్‌ఫారమ్‌లో వందే భారత్ రైలు ఆగి ఉన్న సమయంలో 5వ ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న ఇద్దరు రైల్వే ఉద్యోగుల పనితీరుపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరు మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు బలవంతంగా అత్యవసర డోర్ తెరిచినట్టు తేలింది. ఆ కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వెలుగుచూసింది. దీంతో సేలం రైల్వేస్టేషన్‌న్‌లో పాయింట్స్మన్లుగా పనిచేస్తున్న తామరైసెల్వన్, అదిమీనాగా గుర్తించారు. వీరిని సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన చర్యలకు డివిజనల్ మేనేజర్ పంకజ్ కుమార్ సిన్హా ఆదేశించారు. -
టెస్లా కారులో ఈ సీక్రెట్ తెలుసుకోండి! లేకుంటే..
Tesla Model Y: ప్రపంచ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కారుగా ప్రసిద్ధి చెందిన 'టెస్లా' (Tesla)లో అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఇరుక్కున్నారు. అప్పటి పరిస్థితుల్లో ఎంతో చాక చక్యంగా బయటపడినట్లు ఫీనిక్స్ టీవీ స్టేషన్ ద్వారా వెల్లడించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 73 సంవత్సరాల పియోరియా ప్రాంతానికి చెందిన 'రిక్ మెగ్గిసన్' అనే వ్యక్తి ఫీనిక్స్ టీవీ స్టేషన్లో మాట్లాడుతూ.. ఒక రోజు టెస్లా బ్రాండ్ కారు మోడల్ 'వై' లోపలు చిక్కుకున్నాడు. ఆ సమయంలో కారు డోర్స్ ఓపెన్ కాలేదు, ఆఖరికి విండోస్ కూడా కిందటికి దించలేక ఇబ్బంది పడినట్లు తెలిసింది. కారులోని సిస్టం (కంప్యూటర్) దెబ్బతినటం వల్ల గ్లోవ్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదని ఆసమయంలో లోపల చాలా వేడిగా ఉన్నట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: సంతకం చేయలేకపోయిన ఉద్యోగి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు! టెస్లా మోడల్ Yలోని 12 వోల్ట్స్ బ్యాటరీ కారునిలో డోర్స్, విండోస్ వంటి వాటికి పవర్ డెలివరీ చేస్తుందని, అందులో ఏర్పడిన సమస్య వల్ల ఆ రోజు లోపల సుమారు 20 నిముషాలు చిక్కుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటలు జరిగే అవకాశం ఉంది. కావున కంపెనీ దీనిని తప్పకుండా పరిష్కరించాల్సి ఉందని వెల్లడించాడు. ఇదీ చదవండి: పొట్టి మొక్క సాగుతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! మెగ్గిసన్ కారులో చిక్కుకున్న తరువాత ఇందులోని ఎమర్జెన్సీ లాక్ గురించి తెలుసుకుని బయటపడినట్లు సమాచారం. నిజానికి టెస్లా కారులో ఇలాంటి సందర్భం ఎదురైతే వినియోగదారులు డోర్ కింది భాగంలో ఒక ఎమర్జెన్సీ లాక్ లాంటిది ఉంటుంది. అయితే దీనిని కనుక్కోవడం అంత సులభమేమి కాదు. ఇది వెనుక డోర్ దగ్గర ఉంటుంది. దీని గురించి తప్పకుండా వినియోగదారుడు తెలుసుకోవాలి. లేకుంటే అనుకోని ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. -
సడెన్‌గా విమానం డోర్ ఓపెన్.. ప్రముఖ సింగర్ టీమ్‌కు తప్పిన ప్రమాదం
బ్రెసీలియా: ఇటీవలి కాలంలో విమానం గాల్లో ఉన్న సమయాల్లో ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ అవడం తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే బ్రెజిల్లో చోటుచేసుకుంది. ఇక, ఈ విమానంలో ఉన్న బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్‌తో పాటు వారి బ్యాండ్ బృందానికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఎన్హెచ్ఆర్ టాక్సీ ఏరియోకు చెందిన ఎంబ్రేయర్ -110 విమానం గాల్లో ఉన్న సమయంలో డోర్(కార్గో డోర్) తెరుచుకుంది. దీంతో, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంభయంగా కూర్చున్నారు. కాగా, ఈ విమానంలో బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ గాయకుడు, పాటల రచయిత టియెర్రీ తన బృందంతో కలిసి ఈ విమానంలో ప్రయాణించారు. అయితే, మారన్ హావోలోని సావో లూయిస్‌లో ప్రదర్శన అనంతరం టియెర్రీ, అతని బ్యాండ్ సభ్యులు ఈ విమానంలో ప్రయాణించారు. ఈ సమయంలో డోర్ ఓపెన్ కావడంతో వారంతా కంగారు పడ్డారు. వారి మ్యూజిక్ పరికరాలు చెడిపోతాయేమోనని టెన్షన్‌కు గురయ్యారు. అయితే, విమానం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం, విమాన సంస్థకు చెందిన అధికారులు స్పందిస్తూ.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పేర్నొన్నాడు అలాగే, ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రయాణికులు, బ్యాండ్ సభ్యులందరూ సురక్షితంగా ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఇక, డోర్ తెరుచుకున్న సమయంలో విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు దీన్నంతా వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీగా ఉందని ఒకరు కామెంట్స్ చేయగా, భయకరంగా ఉందని మరో వ్యక్తి కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: విదేశీయులకు షాకిచ్చిన కువైట్.. 66 వేల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు -
ల్యాండింగ్ టైంలో ఊపిరాడటం లేదని ఆ డోర్ తెరిచాడు..అంతే విమానం..
ఇటీవల విమానంలో ప్రయాణికుల అనుచితన ప్రవర్తన, వికృత చేష్టలకు సంబంధించి పలు దిగ్బ్రాంతికర ఘటనలు చూశాం. కొందరూ అన్ని తెలిసి తప్పులు చేస్తే, మరికొందరూ తెలిసి తెలియని తనంతో అమాయకత్వంతో అనుచిత ఘటనలకు పాల్పడి కటకటాల పాలయ్యారు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి విమానంలో ప్రమాదకర ఘటనకు పాల్పడ్డాడు. అతడు చేసిన పనితో విమానంలోని మిగతా ప్రయాణకులు స్వల్ప గాయల బారినపడ్డారు. అసలేం జరిగందంటే.. దక్షిణ కొరియా ఎయిర్‌బస్ ఏ321లో ఈ అనుచిత ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు ఊపిరాడటం లేదంటూ గాల్లో విమానం ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచాడు. దీంతో విమానంలోని ఇతర ప్రయాణికులు 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత వెంటనే వైమానికి భద్రతా సిబ్బంది 33 ఏళ్ల సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ విమానంల దక్షిణ ద్వీపం జెబు నుంచి డేగు నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు విచారణలో..ఆ వ్యక్తి తనకు ఊపిరాడనట్లు అనిపించడంతో విమానం నుంచి త్వరితగతిన నిష్క్రమించాలని అనుకుని ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. ఆ విమానంలో ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీకి వెళ్లే టీనేజ్ అథ్లెట్లతో సహా మొత్తం 194 మంది ప్రయాణికులను తీసుకువెళ్తోంది. ఆ విమానం డేగు విమానాశ్రయం వైపుకి వెళ్లే క్రమంలో..సరిగ్గా 700 అడుగుల ఎత్తులో ఉండగా సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీంతో ఆ విమానం కుదుపుకి గురై..అందులోని కొందరూ ప్రయాణికులు శ్వాస తీసుకోవడం తరహా చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భద్రతా సిబ్బంది విమానం ల్యాండ్ అయిన వెంటనే అస్వస్థతకు గురైన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి పాల్పడ సదరు ప్రయాణికుడు ఇటీవలే ఉద్యోగం కోల్పోయాడని, ఒత్తిడికి లోనవ్వడంతోనే ఇలా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. అతను ఇతర ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసేలా ప్రవర్తించినందుకు గానూ సుమారు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడించారు అధికారులు. (చదవండి: ఆ రాయిని మండిస్తే చాలు.. ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ వస్తాయ్!) -
ప్రయాణికుడి దెబ్బకు 200 మందికి టెన్షన్.. ఏం జరిగిదంటే?
సియోల్: ఇటీవలి కాలంలో కొందరు విమాన ప్రయాణికులు అతిగా ప్రవర్తిస్తున్నారు. కొందరు విమానంలో గాల్లో ఉన్న సమయంలో డోర్ ఓపెన్ చేయడం, మరికొందరు ఎదుటి వారితో వాగ్వాదానికి దిగడం వంటివి తరచుగా చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఏషియానా విమానంలో చోటుచేసుకుంది. విమానం ఆకాశంలో ఉన్న సమయంలో ఓ ప్యాసింజర్ ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేశాడు. దీంతో, కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. దక్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన డోర్‌ను ఓ ప్యాసింజెర్ తెరిచాడు. ఏ321 విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఆ విమాన్ డోర్‌ను తీశాడు. దక్షిణ దీవి జేజూ నుంచి డేగూ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో, అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని డేగు విమానాశ్రయంలో దించారు. కాగా, సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేస్తున్న సమయంలో ప్రయాణికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ డోర్ ఓపెన్ అయ్యింది. ఇక, విమానం గాలిలో ఉన్న సమయంలో డోర్ ఓపెన్ కావడంతో అందులో ఉన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, సదరు వ్యక్తి డోర్ ఎందుకు ఓపెన్ చేశాడన్నది తెలియరాలేదు. మరోవైపు.. ఉల్సన్‌లో జరుగుతున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు చాలా మంది అథ్లెట్లు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. శ్వాస కోస ఇబ్బందులు తలెత్తిన్న ప్రయాణికులను హాస్పిటల్‌కు తరలించినట్లు రవాణాశాఖ తెలిపింది. కాగా, విమానంలో డేగు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే డోర్ ఓపెన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 🚨 Un pasajero ha abierto una salida de emergencia del #A321 HL8256 de #AsianaAirlines en pleno vuelo. El vuelo #OZ8124 entre Jeju y Daegu del 26 de mayo se encontraba en aproximación cuando una de las salidas de emergencia sobre el ala fue abierta por un pasajero. El avión… pic.twitter.com/G0rlxPNQuW — On The Wings of Aviation (@OnAviation) May 26, 2023 ఇది కూడా చదవండి: బ్రిటన్ ప్రధాని నివాసంపైకి కారుతో దాడికి యత్నం?.. రిషి సునాక్ సేఫ్! -
గాల్లో విమానంలో అనూహ్య ఘటన
బెంగళూరు: మద్యం మత్తులో విమానం అత్యవసర ద్వారం తెరిచేందుకు యత్నించిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీలోని కాన్పూర్‌కు చెందిన ప్రతీక్(30) ఇండిగోకు చెందిన 6ఈ308 ఢిల్లీ–బెంగళూరు విమానం 18ఎఫ్ సీట్లో కూర్చున్నాడు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికి మత్తులో ఉన్న ప్రతీక్ తోటి ప్రయాణికుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగక అత్యవసర ద్వారం తెరిచేందుకు రాగా సిబ్బంది అతడిని వారించారు. వినిపించుకోకపోవడంతో అతడ్ని బలవంతంగా కూర్చోబెట్టారు. విమానం బెంగళూరుకు చేరుకున్నాక పైలట్ అతడిని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతీక్‌పై ఐపీసీ సెక్షన్లు 290, 336లతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ చట్టంలోని 11(ఏ) కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
విమానం ల్యాండింగ్ అవుతుందనంగా.. ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం..
మసాచుసెట్స్‌లోని లియోమిన్‌స్టర్‌కు చెందిన 33 ఏళ్ల వ్యక్తి లాస్ ఏంజిల్స్ నుచి బోస్టన్‌కు యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తుండగా.. ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు యత్నించాడు. దీంతో ఆ వ్యక్తిని బోస్టన్‌లో విమానం ల్యాండ్ అయిన వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు యూఎస్ ఎయిర్‌లైన్స్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి టోర్రెస్ అనే వ్యక్తిగా గుర్తించారు. టోర్రెస్ లాస్ఏంజిల్స్ నుంచి బోస్టన్‌కు వెళ్తుండగా..విమానం ల్యాండింగ్ అవ్వడానికి దాదాపు 45 నిమిషాల ముందు ఎమర్జెన్సీ డోర్ అన్‌లాక్ చేసి కొంచెం దూరం వరకు ఓపెన్ చేశాడు. దీంతో సరిగ్గా అదే సమయంలో విమాన సిబ్బందికి కాక్‌పిట్‌లో అలారం వచ్చింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది విమానం తనిఖీ చేయడం ప్రారంభించారు. వారంతా విచారిస్తుండగా..ఫస్ట్ క్లాస్ కోచ్ విభాగాల మధ్య ఉన్న స్టార్‌బోర్డ్ సైడ్ డోర్ అన్‌లాక్ అయ్యి కొద్ది దూరం జరిగినట్లు ఉంది. దీంతో వారు ఆ డోర్‌ని లాక్‌చేసి వచ్చి ఈ విషయాన్ని పైలెట్‌కి తెలిపారు. ఫ్లైట్ సిబ్బంది మేము ఆ డోర్ వద్ద టోర్రెస్ అనే వ్యక్తి ఉండటం గమనించామని చెప్పారు. అతను తాను చేసిన విషయాన్ని మరోకరికి చెప్పడం కూడా చూశామని చెప్పడంతో వారు టెర్రెస్ని ఈ విషయమై కొంచెం గట్టిగా అడిగారు. అంతే అతను కోపంతో విమానా సహాయకురాలిని మెటల్ చెంచాతో మెడపై మూడు సార్లు పొడిచాడు. దీంతో ప్రయాణికులు టోర్రెస్ని విమాన సిబ్బంది సాయంతో అడ్డుకుని అదుపుచేసి.. బోస్టన్‌లో విమానం దిగిన వెంటనే భద్రతా బలగాలు అతన్ని అప్పగించారు. ప్రమాదకరమైన ఆయుధంతో సిబ్బంది, ఫ్లైట్ అటెండెంట్‌పై దాడి చేసేందుకు యత్నించినందుకు అతనికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు సుమారు రూ. 2 లక్షలు పైనే జరిమాన విధించే అవకాశం ఉందని సదరు ఎయిర్‌లైన్ డిపార్ట్మెంట్ పేర్కొంది. (చదవండి: సెల్ఫోన్లకు ఫ్రీ బీర్లు ఆఫర్.. ఎగబడ్డ జనం.. వ్యాపారి అరెస్ట్) -
Tejasvi Surya: ఎందుకీ మౌనం?!
బెంగళూరు: విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, దానికి ప్రయాణికుడు చెప్పిన ‘సారీ’తో సరిపెట్టుకున్న ఇండిగో సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం.. వ్యవహారంపై విమర్శలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంలో ఉంది బీజేపీ యువ ఎంపీ కావడం వల్లే ఇలా.. ఎలాంటి చర్యలు లేకుండా వ్యవహారం చల్లారిపోయిందని రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 10వ తేదీన ఇండిగో విమానం నెంబర్ 6ఈ 733లో చెన్నై నుంచి తిరుచిరాపల్లికి వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు బోర్డింగ్ జరుగుతున్న టైంలో ఎమర్జెన్సీ ద్వారాన్ని తెరిచాడు. ఆ ఘటనకు సంబంధించి క్షమాపణలు చెప్పడంతో.. అక్కడికక్కడే ఆ విషయాన్ని వదిలేసింది ఇండిగో. ఘటన జరిగిన రెండు గంటలకుపైగానే ఆలస్యంగా నడిచింది విమానం. ఇండిగో ప్రకటన ద్వారా.. ఈ విషయం తాజాగా(మంగళవారం) వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ప్రయాణికుడు కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అంటూ గత రాత్రి నుంచి మీడియా, సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ మొదలైంది. మరోవైపు ఈ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుని.. కర్ణాటక కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అతని(తేజస్వి సూర్య) ప్రవర్తన ఎప్పుడూ అలాగే చిన్నపిల్లలాగా, చిల్లరగా ఉంటుందని పేర్కొంది. అలా అత్యవసర ద్వారం తెరవడం శిక్షార్హమైన నేరం. విమానయాన అధికారులు ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదంటూ వరుసగా ట్వీట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. గతంలో జనాలను నిరక్షరాస్యులంటూ నిర్లక్ష్యపూరిత కామెంట్లు చేసిన ఇదే తేజస్వి సూర్య.. ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నాడంటూ నిలదీస్తోంది కాంగ్రెస్. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఏం బదులు ఇచ్చేవాడంటూ మండిపడుతోంది. పిల్లలకు బాధ్యతలు ఇస్తే ఇలాగే ఉంటుందంటూ ఎద్దేశా చేసింది కాంగ్రెస్. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా సైతం ఈ వ్యవహారంపై మండిపడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇంకోవైపు శివ సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని ట్విటర్ ద్వారా కోరుతున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆరోజు విమానంలో తేజస్వి సూర్య ఉన్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కూడా ఉన్నారు. ఇంకోవైపు విమర్శలు మొదలై.. 24 గంటలు గడుస్తున్న సదరు యువ ఎంపీ స్పందించకపోవడం గమనార్హం. బెంగళూరు సౌత్‌లోని ఎంపీ కార్యాలయం కూడా మీడియా ప్రశ్నకు బదులు ఇవ్వడం లేదు. మరోవైపు కర్ణాటక బీజేపీ సైతం ఈ విమర్శలను తేలికగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.! -
విమానంలో టాయిలెట్ డోర్ ఓపెన్ చేయబోయి..
ఇస్తామాబాద్ : విమానాన్ని దూరం నుంచి చూసే వాళ్లు ఎక్కువ కానీ దాంట్లో ప్రయాణించే వారు చాలా తక్కువ. విమానం లోపలి భాగం ఎలా ఉంటుంది.. దాంట్లో ఉన్న సదుపాయాలు ఏంటి.. అనే విషయాలు అందరికి తెలియకపోవచ్చు. తొలిసారి విమాన ప్రయాణం చేసే వారికి కూడా అన్ని విషయాలు తెలియవు. దాని వల్ల కొన్ని సార్లు ప్రయాణికులకూ ఇబ్బందులు కలుగుతాయి. తాజాగా తొలిసారి విమానం ఎక్కిన ఓ పాకిస్తానీ మహిళ చేసిన పని ప్రయాణికుల్లో ఆందోళ కలిగించింది. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ సిటీ నుంచి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వెళ్తున్నపాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కు చెందిన విమానం టేకాఫ్ తీసుకోవడానికి రన్ వేపై వేగం అందుకుంటుండగా ఓ మహిళ తన సీట్లోంచి హడావుడిగా లేచి నేరుగా వెళ్లి ఎమర్జెన్సీ డోర్ తీశారు. దీంతె విమానం తలుపు తెరుచుకొని వార్నింగ్ అలారం మోగింది. ముందుజాగ్రత్తగా ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నాయి. ఇక విమానంలో ఉన్న ఇతర ప్రయాణికుల సంగతి చెప్పనక్కర్లేదు. భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో అర్థంకాక హడలిపోయారు. దాంతో విమానాన్ని సిబ్బంది నిలిపివేసి ప్రయాణికులను ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి పంపారు. ఇక, ఆ మహిళను ప్రశ్నించగా, తాను టాయిలెట్ కు వెళ్లాలనుకుని డోర్ తెరిచానని, అది ఎమర్జెన్సీ డోర్ అనుకోలేదని తెలిపారు. ఏదైతేనేమి, ఆ మహిళ చేసిన పనికి పీఐఏ విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది. -
బస్సు ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోవడంతో..
తిరుపతి: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులోని అత్యవసర ద్వారం అకస్మాత్తుగా తెరుచుకుంది. దీంతో పక్కనే కూర్చుని ఉన్న మహిళ అందులో నుంచి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరుపతిలోని అలిపిరి వినాయక ఆలయ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. టీటీడీలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న వాణి(35) ఆర్టీసీ బస్సులో వెళ్తూ ప్రమాదవశాత్తు అత్యవసర ద్వారం తెరుచుకుంది. దీంతో ఆమె అక్కడ నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వినోదం కోసం ఎమర్జెన్సీ తలుపు తీశాడు!!
ముంబై: జెట్ ఎయిర్వేస్ విమానాయాన సంస్థకు ప్రయాణికుల నుంచి చిత్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి. విచిత్రమైన కారణాలతో ఇద్దరు ప్రయాణికులు విమానంలో నిబంధనలు ఉల్లంఘించడంతో వారిపై జెట్ ఎయిర్వేస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జర్మనీకి చెందిన స్టీవ్ టిట్ష్లెర్ ఆదివారం అబుధాబి నుంచి జెట్ ఎయిర్వేస్ (9 డబ్యూ 585) విమానం ఎక్కి ముంబై వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో విమానం పార్క్ చేసి ఉండగా అతడు ఉన్నట్టుండి ఎమర్జెన్సీ తలుపు తీశాడు. దీనిని చూసి ఆందోళన చెందిన విమాన సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎందుకు తలుపు తీశావని ఆయనను అడిగారు. స్టీవ్ చెప్పిన సమాధానం విని వారు బిత్తరపోయారు. కేవలం వినోదం కోసం తాను ఎమర్జెన్సీ తలుపు తీసినట్టు ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఆయనను అరెస్టుచేసి సహర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. జెట్ ఎయిర్వేస్లో ఆయన ఢిల్లీలోకి వెళ్లాల్సి ఉన్నా అందుకు అనుమతించలేదు. ఆయనపై విమానాయాన చట్టం 1937లోని సెక్షన్ 29, ఐపీసీ సెక్షన్ 336 ప్రకారం కేసు నమోదుచేశారు. వాష్‌రూమ్‌లో స్మోకింగ్! రవి ధాంకర్ ఆదివారం సింగపూర్ నుంచి ముంబై వచ్చాడు. జెట్ ఎయిర్వేస్ (9డబ్ల్యూ 09) విమానంలో వచ్చిన అతను విమానంలోని వాష్‌రూమ్‌లో సిగరెట్ తాగుతూ దొరికిపోయాడు. ఆయన బాగా మద్యం మత్తులో ఉన్నట్టు కనిపించాడని, విమానం బాత్రూమ్ వద్ద అతను పొగ తాగుతుండగా సహచర ప్రయాణికులు గుర్తించి సిబ్బందికి తెలిపారని విమానాయాన సంస్థ అధికారులు తెలిపారు. విమానం ముంబైలో దిగగానే అతనిని సహర్ పోలీసు స్టేషన్‌కు తరలించి.. కేసులు నమోదుచేశారు.