Tesla Model Y: ప్రపంచ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కారుగా ప్రసిద్ధి చెందిన 'టెస్లా' (Tesla)లో అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఇరుక్కున్నారు. అప్పటి పరిస్థితుల్లో ఎంతో చాక చక్యంగా బయటపడినట్లు ఫీనిక్స్ టీవీ స్టేషన్ ద్వారా వెల్లడించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
73 సంవత్సరాల పియోరియా ప్రాంతానికి చెందిన 'రిక్ మెగ్గిసన్' అనే వ్యక్తి ఫీనిక్స్ టీవీ స్టేషన్‌లో మాట్లాడుతూ.. ఒక రోజు టెస్లా బ్రాండ్ కారు మోడల్ 'వై' లోపలు చిక్కుకున్నాడు. ఆ సమయంలో కారు డోర్స్ ఓపెన్ కాలేదు, ఆఖరికి విండోస్ కూడా కిందటికి దించలేక ఇబ్బంది పడినట్లు తెలిసింది. కారులోని సిస్టం (కంప్యూటర్) దెబ్బతినటం వల్ల గ్లోవ్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదని ఆసమయంలో లోపల చాలా వేడిగా ఉన్నట్లు వెల్లడించాడు.
ఇదీ చదవండి: సంతకం చేయలేకపోయిన ఉద్యోగి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
టెస్లా మోడల్ Yలోని 12 వోల్ట్స్ బ్యాటరీ కారునిలో డోర్స్, విండోస్ వంటి వాటికి పవర్ డెలివరీ చేస్తుందని, అందులో ఏర్పడిన సమస్య వల్ల ఆ రోజు లోపల సుమారు 20 నిముషాలు చిక్కుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటలు జరిగే అవకాశం ఉంది. కావున కంపెనీ దీనిని తప్పకుండా పరిష్కరించాల్సి ఉందని వెల్లడించాడు.
ఇదీ చదవండి: పొట్టి మొక్క సాగుతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా!
మెగ్గిసన్ కారులో చిక్కుకున్న తరువాత ఇందులోని ఎమర్జెన్సీ లాక్ గురించి తెలుసుకుని బయటపడినట్లు సమాచారం. నిజానికి టెస్లా కారులో ఇలాంటి సందర్భం ఎదురైతే వినియోగదారులు డోర్ కింది భాగంలో ఒక ఎమర్జెన్సీ లాక్ లాంటిది ఉంటుంది. అయితే దీనిని కనుక్కోవడం అంత సులభమేమి కాదు. ఇది వెనుక డోర్ దగ్గర ఉంటుంది. దీని గురించి తప్పకుండా వినియోగదారుడు తెలుసుకోవాలి. లేకుంటే అనుకోని ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment