Technology
-
మొదటిసారి మెషిన్స్ మధ్య యుద్ధం: వీడియో వైరల్
ఏఐ రోబోట్స్ వచ్చిన తరువాత.. టెక్నాలజీలో కీలక మార్పులు సంభవించాయి. ప్రస్తుతం చాలా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా సాగుతోంది. అదే సమయంలో డ్రోన్ల వినియోగం కూడా విరివిగానే ఉంది. వీటిని వ్యవసాయ, వాణిజ్య మొదలైన రంగాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇటీవల ఈ రెండింటి (డ్రోన్, ఏఐ రోబోట్) మధ్య ఓ చిన్న యుద్ధం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. ఒక రోబోట్ డాగ్ (Robotic Dog), ఎగురుతున్న డ్రోన్ (Drone) మీద దాడి చేయడం చూడవచ్చు. రోబోట్ డాగ్ మీద అమర్చిన బాణాసంచాతో దాడి చేస్తూనే ఉంది. ఆ సమయంలో డ్రోన్ కూడా రోబోటిక్ కుక్కను చుట్టుముట్టింది. కానీ అది మాత్రం డ్రోన్ ఎటువైపు వెళ్తే.. అటువైపు బాణ పరంపర కురిపించింది.రోబోటిక్ కుక్కను, డ్రోన్‌ను ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక్కడ కనిపించే డ్రోన్ డీజేఐ టీ-సిరీస్ అగ్రికల్చర్ మోడల్, రోబోటిక్ డాగ్ హాంగ్జౌకు చెందిన రోబో డెవలపర్ యూనిట్రీ రోబోటిక్స్ ఉత్పత్తి చేసిన గో సిరీస్ అని తెలుస్తోంది. మెషీన్స్ మధ్య మొదటిసారి జరిగిన యుద్ధం అంటూ ఒక ఎక్స్ యూజర్ వీడియో షేర్ చేశారు.ఇదీ చదవండి: లవ్‌లో బ్రేకప్ అయినవాళ్లకే జాబ్.. ప్రముఖ కంపెనీ ఆఫర్నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో యుద్దాలు ఇలాగే ఉంటాయని ఒకరు అన్నారు. ఇలాంటి సంఘటనలు భయాన్ని కలిగిస్తాయని మరొకరు, చాలా దేశాల్లో ఇలాంటి టెక్నాలజీలు వాడుకలో ఉన్నాయని ఇంకొకరు అన్నారు. అయితే వీడియోలో కనిపించే ఈ సంఘటన చైనాలో జరిగినట్లు సమాచారం.The First War of Machines: Video of a battle between a drone and a robot dog goes viral in ChinaThe firefight was conducted using fireworks. It is unclear whether the devices were being controlled by someone, and the location of the footage remains undisclosed. pic.twitter.com/1vrdlVND0l— NEXTA (@nexta_tv) January 27, 2025 -
డీప్ సీక్ నేర్పుతున్న పాఠం
సాంకేతిక రంగంలో, అందులోనూ కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో ఇది సరికొత్త విప్లవం. కేవలం 200 మంది ఉద్యోగులతో, కోటి డాలర్లు వెచ్చించి, చైనాకు చెందిన చిన్న స్టార్టప్ కంపెనీ డీప్ సీక్ చేసిన మేజిక్ అగ్రరాజ్యపు బడా సంస్థల్ని సైతం ఆలోచనలో పడేసింది. డీప్ సీక్ ఇటీవల విడుదల చేసిన రెండు ‘స్వేచ్ఛా వినియోగ’ (ఓపెన్ సోర్స్) ఏఐ ప్రోగ్రామ్‌లు, ఛాట్బోట్లు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, ఈ 27న అప్డేట్ వచ్చిన డీప్ సీక్ గురించే చర్చ. భారత్‌లోనూ యాపిల్ యాప్ స్టోర్లలో ఛాట్ జీపీటీ, గూగుల్ జెమినీలను దాటేసి, అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్ ఇవాళ ఇదే. ఆర్1, వీ3 అల్గారిథమ్‌లను తక్కువ ఖర్చుతోనే తీర్చిదిద్దినట్టుగా చెబుతున్న డీప్‌సీక్ ఇప్పుడు ఏఐ వినియోగ సామర్థ్యంలో ఛాట్ జీపీటీ, గ్రోక్, క్లాడ్, లామా లాంటి తోటి ప్రత్యర్థుల సరసన పెద్ద గీతగా నిలబడింది. భారీగా పెట్టుబడులు పెడితే తప్ప, ఏఐలో సంచలనాలు సాధ్యం కావన్నది భ్రమ అనీ, ఆలోచన, ఆచరణ ఉంటే అద్భుతాలు అసాధ్యమేమీ కాదనీ నిరూపించింది. ట్రంప్ అధ్యక్షపీఠమెక్కిన వారం రోజులకే అమెరికా ఆభిజాత్యానికి డీప్ సీక్ దెబ్బకొట్టినట్టయింది. ఆగ్నేయ చైనాలోని హాంగ్జౌకు చెందిన అనామక ఇంజనీర్ల బృందం తమ సాంకేతికతతో ఈ స్థాయి విజయం సాధించడం అనూహ్యం. అనేక అత్యుత్తమ అమెరికా సంస్థలు అపారమైన పెట్టుబడులు, వనరులతో రూపొందించిన ఏఐ నమూనాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో, పరి మిత వనరులతో చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఇలా ప్రపంచాన్ని కుదిపేయడం విశేషం. ఆవిష్కృతమైన వారం రోజుల్లోనే డీప్ సీక్ సరికొత్త వెర్షన్ వీ3 అనేక సంక్లిష్టమైన, సూక్ష్మమైన ప్రశ్నలకు ఓపెన్ ఏఐ తాలూకు ఛాట్ జీపీటీ కన్నా మెరుగ్గా జవాబులివ్వడం గమనార్హం. సందర్భో చితంగా, కచ్చితత్వంతో, అంతకు మించి సృజనాత్మకంగా అప్పటికప్పుడు సమాధానాలివ్వడంలో డీప్ సీక్ ముందంజలో ఉంది. వివిధ భాషల్లోకి నిర్దుష్టమైన అనువాదాలు అందించడంలోనూ అగ్ర రాజ్యపు బడాబాబుల యాప్లన్నిటినీ అధిగమించేసింది. డీప్ సీక్ ఛాట్ బోట్ జవాబుల నాణ్యతను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రశంసిస్తున్నారంటే అది చిన్న విజయమేమీ కాదు.లెక్కతీస్తే డీప్ సీక్ సాధించిన విజయాలు అనేకం. ఓపెన్ ఏఐ కొన్ని వందల కోట్ల డాలర్ల ఖర్చు చేస్తే, కేవలం 60 లక్షల డాలర్లతో డీప్ సీక్ తన ఏఐ వేదికను అభివృద్ధి చేసిందని కథనం. అలాగే, అత్యాధునిక ఎన్విడియా ఏ100 చిప్స్‌ను చైనాకు విక్రయించడంపై షరతులున్న నేపథ్యంలో, వాటిపై ఆధారపడకుండా చౌక రకం, తక్కువ శ్రేణి వాటితోనే ఇంతటి విజయం సాధించింది. పైపెచ్చు, ఓపెన్ ఏఐకి పూర్తి భిన్నంగా డీప్ సీక్ అనేది... డెవలపర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా వాడు కొని, దాన్ని తమ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకొని, మరింత పెంపొందించుకోవడానికీ వీలున్న ‘స్వేచ్ఛా వినియోగ’ సాఫ్ట్వేర్. ఇన్ని ప్రత్యేకతలున్నందున డీప్ సీక్ ప్రభావం తక్షణమే విస్తృతంగా కనిపించింది. అమెరికాలోని ఏఐ సంస్థల స్టాక్ మార్కెట్ ప్రపంచం తలకిందులైపోయింది. ఓపెన్ ఏఐ తాలూకు ఛాట్ జీపీటీని సైతం రెండో స్థానానికి నెట్టి, యాపిల్ వాళ్ళ యాప్ స్టోర్ జాబితాలో ఈ చైనీస్ యాప్ ఏకంగా అగ్రేసర స్థానాన్ని అధిష్ఠించడం గణనీయమైన అంశం.మొత్తానికి ఈ స్టార్టప్ తన ‘డీప్ సీక్–ఆర్1’ మోడల్‌తో ప్రపంచ ఏఐ చిత్రాన్నే మార్చేసింది. ఏఐకి సంబంధించిన ఆర్థిక, సాంకేతిక చలనసూత్రాలను తిరగరాసింది. అదే సమయంలో రాజకీ యంగా, మరీ ముఖ్యంగా చైనాకు సున్నితమైన 1989 నాటి తియానన్మెన్ స్క్వేర్ ఊచకోత ఘటన, అరుణాచల్ ప్రదేశ్ లాంటి అంశాలపై జవాబిచ్చేందుకు ఇది నిరాకరించడం విచిత్రం. అంటే, ఆధునిక ప్రపంచంలో ఒకరకంగా సాంకేతిక పురోగతితో పాటు జనానికి ఏది చెప్పాలి, ఏది చూపాలి,ఎంత వివరించాలనే అంశాన్ని ఈ కొత్త సాధనాలతో నిర్ణయించేలా సెన్సార్షిప్లూ పెరగనున్నాయన్న మాట. పారదర్శకత, ఏఐ వ్యవస్థల్లో సిసలైన స్వేచ్ఛ ఎంత అన్న నైతిక ప్రశ్నలకు ఇది తావి స్తోంది. ఇంతటి సంచలనాత్మక ఏఐ మోడల్ సైతం చైనా ప్రభుత్వ సెన్సార్షిప్ సంకెళ్ళలో బందీగా, ప్రభుత్వ నియంత్రణలో పాలక వర్గాల ప్రచారానికే పరిమితమనే భావన కలుగుతోంది. ఏమైనా, పదే పదే ‘ఆత్మనిర్భర భారత్’ అంటూ పెడబొబ్బలు పెట్టే మన పాలకులకు డీప్ సీక్ విజయం కళ్ళెదుటి పాఠం. ప్రపంచానికి పెద్దన్నగా భావిస్తూ, అమెరికా అనేక ఆంక్షలు పెట్టి, సుంకాలు విధించినా చైనా తన సొంత కాళ్ళపై నిలబడడం ఎవరికైనా స్ఫూర్తిదాయకం, ఆదర్శం. అవరో ధాలను అధిగమించి, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఏఐ, పర్యావరణ సానుకూల టెక్నాలజీ లాంటి అనేక అంశాల్లో డ్రాగన్ సాధించిన విజయం అసామాన్యం. దూరదృష్టితో కూడిన విధాన నిర్ణయాలు, వాటి సమగ్ర ఆచరణ వల్లనే పొరుగునున్న చైనాకు ఇది సాధ్యమైంది. ఆ మార్గాన్ని మనమూ ఇప్పటికైనా చిత్తశుద్ధితో అనుసరించాలి. భారత్‌లోనూ ప్రతిభకు కొదవ లేదు. మన విద్యార్థులు, ఐటీ రంగ నిపుణులు అందరూ పొలోమని అమెరికా వైపు చూడడానికీ, ఆ సంస్థల వైపు ఆకర్షితులు కావడానికీ కారణాలను అన్వేషించాలి. ప్రతిభావంతుల్ని ఇక్కడే స్థిరపడేలా చేసి, వారి సేవలను జన్మభూమికి ఉపకరించేలా చూసుకోవాలి. హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్‌ను మంచి చేసుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్న మనం డీప్ సీక్ ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అదే సమయంలో నియంత్రణ, సెన్సార్లకు అతీతంగా సరికొత్త సాంకేతికతల్ని ఎదగనిచ్చేలా చైతన్యవంతమైన చట్టాలు చేయాలి. నైతికత, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పునాదిపై నూతన శకానికి దారులు వేయాలి. -
ఆటోమొబైల్‌కు ఇంధనం కావాలి
అమ్మకాల వృద్ధి బలహీనతను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగంలో జోష్ నింపేందుకు బడ్జెట్లో పలు రకాల ప్రోత్సాహక చర్యలకు చోటు కల్పించాలని పరిశ్రమ గట్టిగా డిమాండ్ చేస్తోంది. 2025 బడ్జెట్‌పై ఆటోమొబైల్ పరిశ్రమ ఎన్నో అంచనాలతో ఉంది. వినియోగదారుల చేతుల్లో ఆదాయం మిగులు దిశగా చర్యలు చేపట్టాలని, ఇది వాహన విక్రయాల వృద్ధికి ఊతం ఇస్తుందని భావిస్తున్నాయి.ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుండడంతో చార్జింగ్ వసతులు సహా, ఈవీ ఎకోసిస్టమ్ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అదే సమయంలో పర్యావరణ అనుకూల గ్రీన్ టెక్నాలజీలకు, ప్రత్యామ్నాయ ఇంధనాలకు విధానపరమైన మద్దతు అవసరమని పేర్కొన్నాయి. ⇒ పాత వాహనాల తుక్కు విధానానికి బడ్జెట్లో మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. దీనివల్ల కొత్త తరం వాహనాల డిమాండ్ పెరుగుతుంది. ⇒ ఈవీల తయారీకి ప్రోత్సాహకాల పరంగా బలమైన మద్దతు అవసరం. కేవలం వినియోగదారులకే కాకుండా, పర్యావరణ అనుకూల పరిష్కారాలను అనుసరించే వ్యాపార సంస్థలకూ ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ⇒ ఆవిష్కరణలకు, టెక్నాలజీకి ఊతమిచ్చేలా పీఎల్ఐ పథకాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలి. ⇒ఈవీ కొనుగోలు, ఈవీ సదుపాయాలకు సంబంధించి రుణాలపై అధిక వడ్డీ రేట్లు సవాలుగా మారాయి. వీటిని అందుబాటులోకి తీసుకురావాలి. రుణ వితరణ పరిస్థితులను సులభతరంగా మార్చాలి. ⇒ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు, సురక్షిత రహదారుల కోసం బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్పూర్తిస్థాయి గ్రీన్ టెక్నాలజీలకు, ప్రత్యామ్నాయ ఇంధనాలకు ప్రాచుర్యం కల్పించేందుకు ఫలితాన్నిచ్చే విధానాలను ప్రభుత్వం తీసుకురావాలి. దీనివల్ల ఒకటికి మించిన మొబిలిటీ పరిష్కారాలను పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకురావచ్చు. – విక్రమ్ గులాటీ, టయోటా కిర్లోస్కర్ మోటార్ కంట్రీ హెడ్భిన్నమైన ఆటోమోటివ్ టెక్నాలజీలకు సానుకూలమైన పన్నుల విధానంపై దీర్ఘకాలిక దృష్టి అవసరం. వివిధ రకాల వాహనాలకు, విడి భాగాలకు సులభతర జీఎస్టీ రేట్లను ప్రకటించాలి. ఉత్పత్తుల అభివృద్ధికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇందుకు గణనీయమైన పెట్టుబడులు అవసరం అవుతాయి. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – పియూష్ ఆరోరా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా సీఈవోవినియోగదారుల వ్యయాలను ప్రోత్సహించే దిశగా బడ్జెట్లో చర్యలు ఉంటాయని ఆశిస్తున్నాం. అలాగే, ఈవీల వినియోగాన్ని పెంచేందుకు తగిన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమ అవసరాలను తీర్చే దిశగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై పెట్టుబడులు పెట్టాలి. – జ్యోతి మల్హోత్రా, వోల్వో కార్ ఇండియా ఎండీ -
శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు.. రేపటి నుంచే టెస్టింగ్!
ఇప్పటికి కూడా మారు మూల ప్రాంతాల్లో, ప్రకృతి విపత్తులు జరిగిన సమయాల్లో సెల్ఫోన్లకు సిగ్నల్స్ లభించవు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ఇబ్బందులకు ఇలాన్ మస్క్ (Elon Musk) స్టార్‌లింక్ పరిష్కారం చూపెట్టనుంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా.. సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్ అందించడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి టెస్టింగ్ కూడా ఈ నెల 27న ప్రారంభించనుంది.శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్ అందే విధంగా.. స్టార్‌లింక్ (Starlink) ఇంటర్నెట్ కనెక్షన్ బీటా టెస్టును ప్రారంభించనుంది. ఈ విషయాన్ని మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఇది సక్సెస్ అయితే ప్రపంచంలో ఎక్కడా నెట్వర్క్ సమస్య ఉండదని పలువురు చెబుతున్నారు. ఎందుకంటే, భూమిపైన ఉన్న సెల్ టవర్లతో పనిలేకుండానే.. సెల్ఫోన్లకు శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్ లభిస్తాయి.డైరెక్ట్-టు-సెల్ శాటిలైట్ సర్వీస్ఇది మొబైల్ ఫోన్లను నేరుగా శాటిలైట్‌కు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులను తెస్తుంది. ఇది వరకు సెల్ టవర్లను ఫిక్స్ చేసేవారు. కాబట్టి కొన్ని మారుమూల ప్రాంతాల్లో.. లేదా దట్టమైన అడవుల్లో సిగ్నల్స్ లభించవు. అయితే డైరెక్ట్-టు-సెల్ శాటిలైట్ సర్వీస్ ద్వారా మీరు ఎక్కడున్నా.. సిగ్నల్స్ లభిస్తాయి. ఆపత్కాల పరిస్థితుల్లో కూడా ఇది మీ కమ్యూనికేషన్‌ను కొనసాగించడానికి అనుమతిస్తుంది. బీటా పరీక్షలు విజయవంతమైన తరువాత ఈ సేవలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.Starlink direct from satellite to cell phone Internet connection starts beta test in 3 days https://t.co/ygAjtTN8SY— Elon Musk (@elonmusk) January 24, 2025ఇదీ చదవండి: ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్ -
మన జీనోమ్ డేటా రెడీ
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు వైద్యుడి వద్దకు వెళ్తే మణికట్టు పట్టుకొని నాడీ కొట్టుకునే తీరును చూసి మన శరీరంలో అనారోగ్య సమస్య ఏమిటో చెప్పేవారు. ఇప్పుడు కాలం మారింది. కొత్త వ్యాధులు మనుషులపై దండెత్తుతున్నాయి. వాటికి విరుగుడుగా కొత్త మందులనూ శాస్త్రవేత్తలు కనిపెడుతూనే ఉన్నారు. మనకు భవిష్యత్తులో రాబోయే వ్యాధులేమిటో కూడా ముందుగానే చెప్పేసే టెక్నాలజీ వచ్చింది. అందుకు పునాది జీనోమ్ సీక్వెన్స్. జన్యు క్రమాన్ని విశ్లేషించటం ద్వారా మని షిలో రాబోయే దీర్ఘకాలిక అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు. అందుకే జన్యు క్రమ విశ్లేషణ ప్రపంచవ్యాప్తంగా ప్రాధా న్యత పెరిగింది. అనేక దేశాలు తమ పౌరుల జన్యుక్రమాలను విశ్లేషించి డేటాను భద్రపరుస్తున్నాయి. అదే కోవలో భారత ప్రభుత్వం కూడా మనదేశంలోని జనాభా సమూహాల (పాపులేషన్ గ్రూప్స్) జన్యు క్రమాలను విశ్లేషించేందుకు ‘జీనోమ్ ఇండియా’ ప్రాజెక్టును చేపట్టింది. మొదటి దశలో భాగంగా 83 జనాభా సమూహాల జన్యువుల వివరాలు సేకరించి, ఆ డేటా ను హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ‘ఇండియన్ బయలాజికల్ డేటా సెంటర్’లో భద్రపరిచారు. మనదేశంలో దాదాపు 4,600 జనాభా సమూహాలున్నాయి. వీటిల్లో 83 అంటే 2% గ్రూపుల జన్యు వివరాల సేకరణ పూర్తయింది. ఈ డేటాను భారతీయ శాస్త్రవేత్తలతోపాటు ప్రపంచంలో ఏ పరిశోధకులైనా తమ పరిశోధన కోసం వాడుకొనేందుకు అందుబాటులో ఉంచారు. వ్యాధుల చికిత్సలో భారతీయులకు సరిపడే మందుల తయారీకి, కొత్త చికిత్సల రూపకల్పనకు ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది.భిన్నమైన జన్యు వేరియెంట్లుకేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం మద్దతుతో చేపట్టిన జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా పరిశోధకులు 10 వేల మానవ జన్యువులను క్రోడీకరించారు. వీటిలో 2.7 కోట్ల అత్యంత అరుదైన వేరియెంట్స్‌ను గుర్తించి వివరాలు రికార్డు చేశారు. పైగా వాటిల్లోనూ 70 లక్షల వేరియెంట్స్ వివరాలు ప్రపంచంలో మరెక్కడా లేనివి. తాజా డేటాను విశ్లేషించి జన్యుపరంగా భారతీయులకే ప్రత్యేకంగా ఉన్న కొన్ని మొండి వ్యాధుల మూలాలను తెలుసుకోవచ్చు. అలాగే జన్యు ప్రత్యేకతల కారణంగా ఒక్కొక్కరిలో ఒక్కోలా వ్యక్తమయ్యే వ్యాధులకు చికిత్స కోసం ప్రత్యేక వ్యక్తిగత మందులను తయారుచేయవచ్చు. ‘ఈ జ్ఞానసంపద కేవలం వైజ్ఞానిక పరిశోధనలకే కాకుండా, ఇతరత్రా రంగాల్లో అత్యున్నత పరిశోధనలకూ, ప్రజలందరి ఆరోగ్య సంరక్షణకూ ఉపయోగపడుతుంది’ అని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు. నంబరింగ్‌తో రికార్డుమనదేశంలో భిన్న జాతులు, వర్గాలు, కులాల జనాభా జీవిస్తున్నారు. ఇది చాలా సున్నితమైన సామాజిక నిర్మాణం. అందుకే ఈ ప్రాజెక్టులో డేటాను జాతులు, కులాల పేర్లతో కాకుండా కొన్ని సాంకేతిక పదజాలాలు, అంకెలతో సూచించేలా ఏర్పాట్లు చేశారు. విస్తారంగా ఉన్న జనాభాలో ఇప్పటికి ఈ డేటాబేస్ కొద్ది గ్రూపుల తాలూకు వివరాలకే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో సేకరించాల్సిన అనేక గ్రూపుల వివరాలకోసం ఓ ముందడుగు పడినట్లు అయ్యిందని నిపుణులు అంటున్నారు. దీన్ని జీనోమ్ డేటాబేస్ సేకరణలో మొదటి దశగా చెప్పవచ్చని, తర్వాత దేశం రెండో దశలో అడుగుపెట్టినట్లుగా భావించాలని పేర్కొంటున్నారు. గ్లోబల్ జీనోమ్ డేటాబేస్‌లో భారతీయుల వివరాలు అరకొరగానే ఉండటంతోకొత్తగా సేకరించిన ఈ వివరాలు మనకు చాలా కీలకంగా మారనున్నాయి. అందరూ వాడుకోవచ్చు జీనోమ్ ఇండియా ప్రాజెక్టు ‘డేటాబేస్’ను అందరికీ అందుబాటులో ఉంచారు. దీనిని ఉపయోగించుకోవాలని భావించే శాస్త్రవేత్తలు తమ పరిశోధన వివరాలను తెలుపుతూ ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుంది. ఆ దర ఖాస్తులను పరిశీలించేందు కు ఒక నిపుణుల పానెల్‌ను ఏర్పాటుచేశారు. ఆ ప్యానెల్ దరఖాస్తులను పరిశీలించి డేటాను వాడుకొనేందుకు అనుమతి ఇస్తుంది.ఇది మన బయోటెక్ సంపద.. జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా సేకరించిన డేటా మన బయోటెక్ సంపద. ఇలాంటి డేటాబేస్ ఏర్పాటు చేసుకోవడం ఓ చారిత్రక పరిణామం. బయోటెక్నాలజీ ఆధారంగా రూపొందించే అనేక నూతన సాంకేతిక ఉపకరణాల తయారీకి, ఉత్పత్తులకు ఇది తోడ్పడుతుంది. – నరేంద్రమోదీ, ప్రధానమంత్రి.సుదీర్ఘ ప్రక్రియ..‘జీనోమ్ ఇండియా’ ప్రాజెక్టుకు అవసరమైన వనరులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. ఈ ప్రాజెక్టు మొదటి దశను 2020లో ప్రారంభించారు. మొదటి దశ పూర్తి కావడంతో, ఇక ప్రాజెక్టు రెండో దశను మొదలుపెట్టాల్సి ఉంది. మొదటి దశలో పది వేల మంది వివరాలు సేకరించారు. రెండో దశలో పది లక్షల మంది జన్యువులను సేకరిస్తారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం వ్యాధులకు మెరుగైన ఔషధాలు తయారుచేయటమేనని అధికారులు తెలిపారు. రెండో దశ వివరాల సహాయంతో ప్రమాదకర క్యాన్సర్లకు చికిత్సలను కనిపెట్టడం, నాడీ సంబంధ వ్యాధులకు పరిష్కారాలు వెదకటం, అత్యంత అరుదుగా వచ్చే వ్యాధులకు చికిత్స వంటి అనేక అంశాలను చేపడుతారని సమాచారం. -
మనుషులతో.. మరమనుషులు: మారథాన్‌కు అంతా సిద్ధం!
మారథాన్ అంటే.. ఓ ఐదు కిలోమీటర్లు లేదా పది కిలోమీటర్లు ఇలా.. మనుషులు పరుగెడుతుంటారని అందరికీ తెలుసు. కానీ మనుషులు, రోబోట్లు పాల్గొనే.. ప్రపంచంలోనే మొట్టమొదటి మారథాన్‌ను నిర్వహించేందుకు చైనా సిద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఏప్రిల్‌లో జరగనున్న ఈ మారథాన్ బీజింగ్‌లోని డాక్సింగ్ జిల్లాలో నిర్వహించనున్నారు. 21 కిమీ మేర డజన్ల కొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు 12,000 మంది మానవ అథ్లెట్లతో పోటీపడతాయని.. ఇందులో మానవులు లేదా రోబోట్ అనే దానితో సంబంధం లేకుండా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు.త్వరలో జరగనున్న మారథాన్‌లో పాల్గొనే రోబోట్లను 20 కంటే ఎక్కువ కంపెనీలు అభివృద్ధి చేశాయి. రోబోట్లు మనుషులు మాదిరిగా కనిపించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. రోబోట్లు తప్పనిసరిగా 0.5 మరియు 2 మీటర్ల ఎత్తులో నిలబడాలి. కనీసం హిప్-టు-ఫుట్ ఎక్స్టెన్షన్ 0.45 మీటర్లు ఉండాలి. రిమోట్ కంట్రోల్, ఆటోమాటిక్ రోబోట్లు రెండూ ఈ రేసులో పాల్గొనవచ్చు. రోబోల పనితీరు సజావుగా సాగటానికి కావలసిన బ్యాటరీలను ఆపరేటర్లు భర్తీ చేసుకోవచ్చు.మారథాన్‌లో పాల్గొనే రోబోట్లలో.. చైనా ఎంబాడీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా అభివృద్ధి చేసిన టియాంగాంగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఉంది. ఇది గంటకు సగటున 10 కిమీ వేగంగా ముందుకు వెతుందని సమాచారం. ఇది గతంలో కూడా హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు మొత్తం రేసులో హ్యూమనాయిడ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి అవుతుంది.చైనా హ్యూమనాయిడ్ రోబోలను ఎందుకు అభివృద్ధి చేస్తోందిచైనాలో వృద్ధాప్య జనాభా పెరిగిపోవడంతో.. శ్రామిక శక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్న.. ఆర్ధిక వృద్ధిని పెంచాలన్నా శ్రామిక శక్తి అవసరం. దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం.. చైనీస్ క్లయింట్లు 2023లో 2,76,288 రోబోట్లను లేదా ప్రపంచంలోని మొత్తంలో 51 శాతం ఇన్స్టాల్ చేసారు. త్వరలో వీరు రోబోట్లతో స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్ -
ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ' (ChatGPT) యూజర్లకు చాలా ఉపయోగపడుతోంది. ఏ ప్రశ్న అడిగినా.. దాదాపు ఖచ్చితమైన, వేగవంతమైన జవాబును ఇస్తోంది. ఇప్పటికే ఎన్నెన్నో అద్భుతాలు చేసిన చాట్‌జీపీటీ.. తాజాగా ఓ మనిషికి ఉన్న రోగాన్ని సైతం కనిపెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. కొన్ని రోజుల క్రితం నేను వ్యాయామం చేసాను. ఒళ్ళంతా చాలా నొప్పులుగా.. ఏదో యాక్సిడెంట్ అయిన ఫీలింగ్ కలిగింది. రెండు రోజులైనా ఆరోగ్యం కుదుటపడలేదు. నాకున్న లక్షణాలను చాట్‌జీపీటీకి వివరించాను. లక్షణాల ఆధారంగా రాబ్డోమయోలైసిస్ (Rhabdomyolysis) ఉన్నట్లు వెల్లడిస్తూ.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సిపార్సు చేసింది.చాట్‌జీపీటీ చెప్పింది నిజమా? కాదా? అని నిర్దారించుకోవడానికి నేను ఆసుపత్రికి వెళ్ళాను. డాక్టర్లు కూడా టెస్ట్‌లు చేసి రాబ్డోమయోలైసిస్ ఉందని నిర్థారించారు. నా ల్యాబ్ ఫలితాలను విశ్లేషించడానికి కూడా.. నేను ChatGPTని ఉపయోగించాను. అది వైద్య బృందం చెప్పిన దానితో సమానంగా చెప్పింది. సరైన సమయానికి చికిత్స తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాను.చాట్‌జీపీటీ సామర్థ్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో కూడా.. చాట్‌జీపీటీ ఇతరుల ప్రాణాలను కాపాడటం సంఘటనల గురించి విన్నాను. ఇప్పుడు చాట్‌జీపీటీ నన్ను కూడా కాపాడింది.ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాట్‌జీపీటీ లక్షణాల ఆధారంగా రోగ నిర్దారణ చేయడం చాలా గొప్పగా ఉందని పలువురు ప్రశంసించారు. వైద్య సలహా కోసం కూడా దీనిని ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు.రాబ్డోమయోలైసిస్రాబ్డోమయోలైసిస్ అనేది ఓ అరుదైన సమస్య. విశ్రాంతి తీసుకోకుండా ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల.. కండరాలు కలిగిపోతాయి. దీంతో రక్తంలోకి విడుదలయ్యే ప్రోటీన్లు కిడ్నీలలో పేరుకుపోతాయి. ఇది పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఇది ప్రాణాంతకం కూడా.ఇదీ చదవండి: ఆరోగ్యం కోసం నవవిధ మార్గాలు - చాట్‌జీపీటీ సలహాలు -
సోషల్ ఇన్ ఫ్లుయెన్సర్ కీ రోల్
సాక్షి, హైదరాబాద్ : కొత్త టెక్నాలజీ సర్వత్రా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు’ (social influencers) వివిధ అంశాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రతిరోజూ ఒక కొత్త ఆవిష్కరణలు, కొత్త వస్తువులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తుల విక్రయాలు పెంచుకునేందుకు ఉత్పత్తి, మార్కెటింగ్ సంస్థలు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. కొత్త ఉత్పత్తులు కొనుగోలు చేసేలా వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు నూతన పంథాను అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్, డిజిటల్ మీడియా (Digital Media) ఇతర మాధ్యమాల ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, (Instagram) ఎక్స్ (ట్విట్టర్).. ఇలా వివిధ రకాల ప్లాట్‌ఫామ్స్‌పై యువతరంతోపాటు వివిధ వయసుల వారు అధిక సమయమే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వారి కొనుగోలు చేస్తున్న వస్తువులు, వివిధ కంపెనీల వస్తువులకు వారు చేస్తున్న ‘ఎండార్స్మెంట్స్’కు ఎక్కడ లేని ప్రాధాన్యం ఏర్పడింది. కొందరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్నే తమ వృత్తిగానూ ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. నేటి ఆధునిక సమాజంలో మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా...కంపెనీలు కూడా మార్కెటింగ్ వ్యూహాలను మార్చేస్తున్నాయి. గతంలో ఏదైనా ఒక యాడ్ ఏజెన్సీ ద్వారానో, మరో రూపంలోనో తమ ఉత్పత్తులను ప్రచారం చేసి ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేసేవి. ఎవరెంత...?మెగా ఇన్ఫ్లుయెన్సర్లు : సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో 10 లక్షలు.. ఆపై ఫాలోవర్లు కలిగి ఉన్నవారుమాక్రో ఇన్ఫ్లుయెన్సర్లు : సామాజిక మాధ్యమాల్లో 5 లక్షలు.. ఆపై ఫాలోవర్లు కలిగిన వారుమిడ్టైర్–ఇన్ఫ్లుయెన్సర్లు : 50 వేల నుంచి 5లక్షల దాకా ఫాలోవర్లు ఉన్నవారుమైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు : 10 వేల నుంచి 50 వేల వరకు ఫాలోవర్లు కలిగి ఉన్నవారునానో–ఇన్ఫ్లుయెన్సర్లు : 10 వేల వరకు ఫాలోవర్లు కలిగిన వారువేగంగా విస్తరిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్గతానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రముఖుల ద్వారా వినూత్న పద్ధతుల్లో ప్రచారానికి దిగుతున్నాయి. ప్రజాసంబంధాల వ్యవస్థకు కొత్త భాష్యం చెప్పేలా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది వేగంగా విస్తరిస్తోంది. వివిధ బ్రాండ్లకు సంబంధించి టార్గెట్ వినియోగదారులను చేరుకునేందుకు ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కంపెనీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. డిజిటల్, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, లక్షలాది మంది ఫాలోవర్లు కలిగిన వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖుల ద్వారా వివిధ కస్టమర్లను చేరుకునే ప్రయత్నాలను ఇప్పుడు తీవ్రతరం చేశాయి. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ పర్సనాలిటీలుగా పేరుగాంచిన వ్యక్తుల ద్వారా వినియోగదారులకు ఆకర్షించడం ద్వారా పబ్లిక్ రిలేషన్స్ క్యాంపెయిన్‌ను ఉధృతం చేస్తున్నాయి. వివిధ ప్రముఖ బ్రాండ్ల వస్తువులను ఈ సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారనే భావన వారి ఫాలోవర్లలో కలగని విధంగా చాప కింద నీరులా తమ లక్ష్యాన్ని సాధించేస్తున్నాయి. వివిధ రంగాల ప్రముఖులు ఇచ్చే ప్రకటనలు, ఆయా సందర్భాల్లో ఇచ్చే సందేశాల ద్వారా ఆయా వస్తువుల కొనుగోలుకు సంబంధించి ‘బ్రాండ్ మేసేజ్’లను ఇచ్చేస్తున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు నేరుగా ఆయా ఉత్పత్తులను ఎండార్స్ చేయడం ఒక పద్ధతి కాగా, వాటి ప్రస్తావన లేకుండా ఏదైనా ఒక సామాజిక అంశం, ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామం లేదా ఇతర అంశాలపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం ద్వారా వారు తమ ఫాలోవర్లను ప్రభావితం చేస్తున్నారు. ఇలా ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో ఆయా వస్తువులకు సంబంధించిన ప్రచారం చేయడం ద్వారా...వాటిని కొనుగోలు చేస్తే మంచిదని, ఫలానా వస్తువును సెలబ్రిటీ వాడుతున్నాడు కాబట్టి అది నాణ్యమైనది, మిగతా వాటి కంటే మెరుగైనదనే భావన కస్టమర్లలో ఏర్పడేలా వారి ఉవాచలు, వ్యాఖ్యలు, ప్రకటనలు వంటివి ఉపయోగపడుతున్నాయి. వివిధ రూపాల్లో ప్రచారం, ఆయా వస్తువుల గురించి ప్రస్తావన వంటి ద్వారా ప్రజాభిప్రాయం రూపుదిద్దుకునేలా ఇన్ఫ్లుయెన్సర్లు చేయగలుగుతున్నారు.భారత్‌లోనే ఎక్కువభారత్‌లో మధ్యతరగతి జనాభా అధికంగా ఉండడంతోపాటు ఈ తరగతి ప్రజలు ఎక్కువగా డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతుండడంతో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌కు అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇండియన్ రిటైల్ మార్కెట్ అనేది అనేక రెట్లు పెరుగుతుండడంతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు వేగంగా విస్తరించింది. ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులను చేరుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అనేవి అందివచ్చిన అవకాశాలుగా కలిసొస్తున్నాయి. ఈ కస్టమర్లను చేరుకొని, ఆయా వస్తువులు కొనుగోలు చేసేలా ఆకర్షించేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోపాటు స్థానిక మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా తమ వంతు పాత్రను చురుగ్గా పోషిస్తున్నారు.వార్తలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించే తీరు, అందుకు అనుగుణంగా వీడియో ఫుటేజీ, సోషియో–పొలిటికల్ డేటా విశ్లేషణ వంటి వాటితో ప్రజలకు దగ్గర అయ్యారు. యువతను నేరుగా చేరుకునేలా చేసే వ్యాఖ్యానాలు, ఆయా అంశాలపై విషయ పరిజ్ఞానం ఆకట్టుకుంటోంది. తన పనితీరుతో తన మెయిన్ చానల్‌కు లక్షలాది మంది ఫాలోవర్లతోపాటుపెద్దసంఖ్యలో యూజర్లతో రికార్డు సృష్టించాడు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 6 నెలల కాలంలోనే 60 లక్షల ఫాలోవర్లు పెరిగారు. రాఠీ వైరల్ వీడియోలను తమిళం, తెలుగు, బెంగాలి, కన్నడ, మరాఠీలోకి కూడా డబ్ చేస్తున్నారు – ధృవ్ రాఠీ (యూట్యూబర్, ఎడ్యుకేటర్)పర్యావరణం, నదులు, మన నేల వంటివాటిపై ప్రజల్లో చైతన్యం పెంచేలా ప్రయత్నిస్తున్నారు. ‘సేవ్ ద సాయిల్’పేరిట ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన నిర్వహించే టాక్‌షోలు లక్షలాది మందిని చేరుకుంటున్నాయి. సంస్కృతి పేరిట సంప్రదాయక కళలు, సంగీత రీతులను జనసామాన్యం చెంతకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. – సద్గురు జగ్గీవాసుదేవ్ (ఇషా హెడ్)ఓ ప్రముఖ జాతీయ న్యూస్‌చానల్‌లో పనిచేసి బయటకు వచ్చిన ఈయనకు లెక్కకు మించి అభిమానులున్నారు. ఆయన నిర్వహిస్తున్న యూట్యూబ్ చానళ్లు బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం వాటికి 11 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. తన చానల్ ద్వారా నిజాలను వెల్లడించడంతోపాటు, అధికారంలో ఉన్న వారి పనితీరుపైనా విమర్శల వర్షం కురిపించడం ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది.– రవీశ్‌కుమార్ (జర్నలిస్ట్)తాను నిర్వహిస్తున్న పాడ్కాస్ట్ల ద్వారా ఫాలోవర్లకు, ముఖ్యంగా యువతకు చేరువయ్యారు. రన్వీర్ షో అకా టీఆర్ఎస్ పేరిట నిర్వహించిన షోలకు ఆర్నాల్డ్ షావర్జనిగ్గర్,. ఇస్రో చైర్మన్ డా. సోమ్‌నాథ్, ఆధ్యాత్మిక గురువు గౌర్ గోపాల్‌దాస్, మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్నాథ్ షిండే వంటి వారు హాజరయ్యారు. తాను నిర్వహిస్తున్న 9 యూట్యూబ్ చానళ్ల ద్వారా 2.2కోట్ల మందిని చేరుకుంటున్నట్టుగా ఆయనే చెబుతుంటారు. ఇన్ఫ్లుయెన్సర్ సంస్కృతిని బాగా ప్రచారంలోకి తెచ్చేందుకు దోహదపడుతున్నారు. మాంక్ ఎంటర్టైన్మెంట్ కోఫౌండర్‌గా ఓ కొత్త మీడియా కంపెనీని ప్రారంభించి, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.– రన్వీర్ అల్లాబాడియా అలియాస్ బీఆర్బైసెప్స్ (యూట్యూబర్) భారత్‌లోనే అత్యధికంగా పేరుగాంచిన కమేడియన్లలో ఒకడిగా నిలిచారు. తన హ్యుమర్‌తో కథలు చెప్పే విధానం, కవిత్వంతో కలగలిపి వివిధ అంశాలను వివరించడం, పూర్తి ప్రామాణికంగా వ్యవహరించడం ఆయన్ను అభిమానులకు దగ్గర చేసింది. ఇప్పటిదాకా వెయ్యికి పైగా షోలు చేశారు. లండన్ రాయల్ అల్బర్ట్ హాల్లో షో నిర్వహించిన ఆసియాకు చెందిన కమేడియన్‌గా పేరు సాధించారు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్కేర్ గార్డెన్‌లోనూ షో నిర్వహించారు. చాచా విదాయక్ హై హమారే...వెబ్ సిరిస్‌ను అమెజాన్ ప్రైమ్ కోసం రూపొందించారు. – జకీర్‌ఖాన్ (బాద్షా ఆఫ్ కామెడీ) -
ఫోన్ పోయిందా? ఇలా చేస్తే.. కనిపెట్టేయొచ్చు
ప్రస్తుతం చాలామంది యాపిల్ ఐఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ఇవి కొంత ఖరీదైనవే అయినప్పటికీ.. ఆసక్తి కారణంగానో లేదా ఇతర కారణాల వల్ల ఆండ్రాయిన్ ఫోన్ యూజర్స్ కూడా ఐఫోన్లకు మారిపోతున్నారు. అయితే అంత ఖరీదైన ఫోన్లు పొతే? ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీ ఐఫోన్ పోగొట్టుకున్నా.. దొంగతనానికి గురైనా.. ఏ మాత్రం గాబరా పడకుండా? కొన్ని చర్యలు తీసుకుంటే మళ్ళీ పొందే అవకాశం ఉంటుంది.'ఫైండ్ మై' యాప్ ఉపయోగించండిమొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు 'ఫైండ్ మై' యాప్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఐఫోన్లో ఈ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకుని సెట్ చేసుకోవాలి. ఇది మీ ఫోన్‌ను ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. అంతే కాకుండా మీ మొబైల్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ.. దగ్గరగా ఉన్నప్పుడు యాప్ ద్వారా సౌండ్ ప్లే చేయవచ్చు.లాస్ట్ మోడ్‌ను యాక్టివేట్ చేసుకోండిమీ ఫోన్ బయట పోయిందని లేదా దొంగతనానికి గురైంది మీరు విశ్వసిస్తే, లాస్ట్ మోడ్ ఉపయోగించుకోవాలి. దీనికోసం మీరు 'ఫైండ్ మై' యాప్‌ను ఓపెన్ చేసి లేదా iCloud.comలో సైన్ ఇన్ చేసిన తరువాత.. 'మార్క్ యాజ్ లాస్ట్' లేదా 'లాస్ట్ మోడ్' ఎంచుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత ఏదైనా ఒక సందేశాన్ని లేదా కాంటాక్ట్ వివరాలను పంపించవచ్చు. అప్పుడు మీ ఫోన్ దొరికిన వారు మళ్ళీ మీకు తీసుకు వచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది.మీ డేటాను సంరక్షించుకోవాలిమొబైల్ ఫోన్లో మీ వ్యక్తిగత డేటా ఏదైనా ఉంటే.. దానిని సంరక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఫోన్ డేటాను రిమోట్‌గా తొలగించడానికి 'ఫైండ్ మై' యాప్ లేదా iCloudని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది ట్రాకింగ్‌ను నిలిపివేస్తుంది, డేటా రికవరీ కూడా సాధ్యం కాదు. మీ అకౌంట్స్ యాక్సిస్ ఇతరుల చేతుల్లోకి పోకుండా ఉండటానికి appleid.apple.comలో మీ Apple ID పాస్‌వర్డ్‌ను మార్చుకోవచ్చు.సిమ్ బ్లాక్ చేయాలిమీ ఫోన్ పోయిందని తెలుసుకున్న తరువాత.. మీ సిమ్ కార్డును బ్లాక్ చేసుకోవడం ఉత్తమం. దీనికోసం మీ సిమ్ కార్డుకు సంబంధించిన సంస్థను సంప్రదించాలి. మీ ఫోన్ పోయిందని సంస్థకు తెలియాజేస్తూ.. సిమ్ కార్డును బ్లాక్ చేయమని చెప్పాలి. అంతే కాకుండా డివైజ్‌ను కూడా బ్లాక్‌లిస్ట్ చేయొచ్చు. ఇలా చేస్తే.. ఎవరైనా ఫోన్ దొంగలించి ఉంటే, దానిని ఇతరులకు విక్రయించలేరు.పోలీసులకు తెలియజేయండిమీ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే.. వెంటనే పోలీసులకు తెలియజేయండి. మొబైల్ ఫోన్ IMEI నెంబర్ సాయంతో పోలీసులు పోయిన ఫోన్‌ను కనుగొనే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఇలా తెలుసుకోండిముందుగానే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలిమీరు ఫోన్ కొనుగోలు చేసిన వెంటనే.. ఫైండ్ మై ఫోన్‌ను ఎనేబుల్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. స్ట్రాంగ్ పాస్‌కోడ్ లేదా బయోమెట్రిక్ సెట్ చేసుకోవాలి. డేటాను కూడా ఎప్పటికప్పుడు ఐక్లౌడ్ లేదా కంప్యూటర్‌కు బ్యాకప్ చేయాలి. వీటితో పాటు AirTags వంటి ట్రాకింగ్ యాక్ససరీస్ ఉపయోగించడం కూడా ఉత్తమం. -
2030 నాటికి కోటి మందికి ట్రైనింగ్: రూ.25 వేలకోట్ల పెట్టుబడి
టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న తరుణంలో దిగ్గజ కంపెనీలు సైతం భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే 'మైక్రోసాఫ్ట్' (Microsoft) ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ వంటి మౌలిక సదుపాయాల విస్తరణ కోసం భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు (రూ.2,57,18,55,00,000) పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) పేర్కొన్నారు.బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో సత్య నాదెళ్ల ఈ భారీ పెట్టుబడి గురించి ప్రకటించారు. ఇప్పటి వరకు కంపెనీ ఇంత పెద్ద పెట్టుబడిని భారతదేశంలో మునుపెన్నడూ పెట్టలేదు. కానీ టెక్నాలజీ విస్తరణ, ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భవిష్యత్ ఆవిష్కరణలలో ఏఐ కీలకం. కాబట్టి భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు పెట్టుబడికి సంబంధించిన ప్రకటన చేసినందుకు, నేను చాలా సంతోషిస్తున్నాను అని సత్య నాదెళ్ళ అన్నారు. అంతే కాకుండా మన దేశంలో కంపెనీ మరింత విస్తరిస్తోంది. ఇది ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తుందని ఆయన అన్నారు. 2030 నాటికి 10 మిలియన్ల (కోటి మందికి) మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.సత్య నాదెళ్ల భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' (Narendra Modi)తో తన సమావేశం, అక్కడ చర్చించిన విషయాలను కూడా పంచుకున్నారు. సోమవారం ప్రధాని మోదీని కలిసి.. భారతదేశం టెక్ ల్యాండ్‌స్కేప్ కోసం మైక్రోసాఫ్ట్ విజన్ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా టెక్నాలజీ, ఏఐ వంటి వాటితో పాటు కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలను గురించి కూడా చర్చించినట్లు వివరించారు.Thank you, PM @narendramodi ji for your leadership. Excited to build on our commitment to making India AI-first and work together on our continued expansion in the country to ensure every Indian benefits from this AI platform shift. pic.twitter.com/SjfiTnVUjl— Satya Nadella (@satyanadella) January 6, 2025ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా.. ఇతర కంపెనీలు ఉన్నాయి.ఇప్పటికే ఏఐను అభివృద్ధి చేయడంలో భాగంగా.. 2024 డిసెంబర్ చివరి రోజుల్లో 10 శాతం ఉద్యోగులను గూగుల్ తొలగించింది. ఏఐ.. ఉద్యోగుల మీద ప్రభావం చూపుతుందని, లెక్కకు మించిన ఉద్యోగాలు కనుమరుగవుతాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మరికొందరు ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం లేదని, ఈ టెక్నాలజీ వారి నైపుణ్యాన్ని పెంచుతుందని వాదించారు. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ వల్ల కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు ఇందులో శిక్షణ పొందుతున్నారు.ఇదీ చదవండి: ఈ ఏడాది ప్రపంచ రూపురేఖలను మార్చే ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లు!మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా.. యువత కూడా సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అప్పుడే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని గత ఏడాది 'నిర్మల సీతారామన్' కూడా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, నిపుణులు చెబుతున్నారు. కాబట్టి యువత తప్పకుండా.. కొత్త టెక్నాలజీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఎక్కడైనా మనగలగవచ్చు. -
మడిచే స్క్రీన్.. వాక్ చేయించే షూస్!
టెక్నాలజీ పెరుగుతున్న ఈరోజుల్లో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. వైవిధ్యంగా ఆలోచిస్తూ కంపెనీలు తమ వినియోగదారులకు అవసరాలు తీర్చేందుకు అనువైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇలాంటి ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు, వాటిని ప్రదేర్శించేందుకు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES) వేదికగా మారింది. 2025వ సంవత్సరానికిగా ఇది లాస్‌వెగాస్(Los Vegas)లో జనవరి 7 నుంచి 10 వరకు జరుగుతుంది. గతేడాదిలోని కొన్ని ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం.మడిచే స్క్రీన్, ప్రొజెక్టర్అరోవియా కంపెనీ ‘స్ప్లే’ అనే ఫోల్డబుల్ స్క్రీన్, ప్రొజెక్టర్‌ను ఆవిష్కరించింది. మడిచేందుకు వీలుగా దీన్ని తయారు చేశారు.The world's largest consumer tech event, CES 2025, kicks off this week.While we wait, here the top 10 reveals from last year’s CES:1. Arovia's "SPLAY" is a Mix of a Projector and a Foldable Screenpic.twitter.com/mgThrmbvkG— Angry Tom (@AngryTomtweets) January 5, 2025ట్రాన్స్పరెంట్ ఎల్ఈడీ స్క్రీన్2024 సీఈఎస్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి పారదర్శక మైక్రో ఎల్ఈడీ స్క్రీస్ను శాంసంగ్ కంపెనీ ఆవిష్కరించింది. క్రిస్టల్ క్లియర్ డిస్ ప్లే దీని సొంతం.2. Samsung introduces the world's first transparent MicroLED screenpic.twitter.com/5G3HKKpDaB— Angry Tom (@AngryTomtweets) January 5, 2025బ్లాక్‌బెరీ కీబోర్డ్గతంలో మొబైల్ ఫోన్లను తయారు చేసిన బ్లాక్‌బెరీ కంపెనీ సీఈఎస్ 2024లో వినూత్న ఆవిష్కరణ చేసింది. టచ్ ఫోన్‌ను తాకకుండా టైపింగ్ చేసేందుకు వీలుగా ఫిజికల్ కీబోర్డును ఆవిష్కరించింది. ఫోన్లోని కొన్ని సెన్సార్ల సాయంతో ఇది పని చేస్తుంది.3. Want the old Blackberry physical keyboard back?pic.twitter.com/gedSBWKhwS— Angry Tom (@AngryTomtweets) January 5, 2025వేగంగా వాక్ చేయించే షూస్షిఫ్ట్ రొబోటిక్స్ సంస్థ మూన్‌వాకర్స్ ఎక్స్ పేరుతో వేగంగా వాక్ చేయించేందుకు వీలుగా ఉండే షూస్‌ను ఆవిష్కరించింది. ఈ షూస్‌తో గంటకు 7 మైళ్లు(12 కి.మీ) వాక్ చేసే సదుపాయం ఉంటుంది.4. $1,400 Moonwalkers X by Swift that go 7 mphpic.twitter.com/H4I51qDXok— Angry Tom (@AngryTomtweets) January 5, 2025ఎగిరే కారుచైనాకు చెందిన ఎక్స్‌పెంగ్ ఏరోహెచ్‌టీ అనే కంపెనీ ‘ఫ్లైయింగ్కార్’ను ఆవిష్కరించింది.5. Chinese electric e-car maker XPeng Aeroht unveiled a "flying car"pic.twitter.com/VsnwdQvwlR— Angry Tom (@AngryTomtweets) January 5, 2025స్మార్ట్ టాయిలెట్కోలర్ కంపెనీ సెన్సార్లతో పని చేసే స్మార్ట్ టాయిలెట్‌ను ఆవిష్కరించింది. ఇది వృద్ధులు, అనారోగ్యం బారిన పడినవారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.7. $8,500 smart toilet from Kohlerpic.twitter.com/omGaeB4tM2— Angry Tom (@AngryTomtweets) January 5, 2025 -
డ్రైవర్ అవసరంలేని ట్రాక్టర్ ఇది
చూడటానికి కొంచెం విచిత్రంగా కనిపించే ఈ వాహనం రోబో ట్రాక్టర్ (Robot Tractor). ఇది ఎలాంటి నేలనైనా నిమిషాల్లో ఇట్టే దున్నేస్తుంది. సమతలమైన నేలల మీదనే కాదు, ఎగుడు దిగుడు నేలల మీద కూడా సునాయాసంగా ప్రయాణిస్తుంది.ఈ రోబో ట్రాక్టర్ నడపడానికి డ్రైవర్ కూడా అవసరం లేదు. జపానీస్ కంపెనీ ‘కుబోటా ట్రాక్టర్ కార్పొరేషన్’ (Kubota Tractor Corporation) ఇటీవల ఈ రోబో ట్రాక్టర్‌ను ‘కుబోటా ఆల్ టెరేన్ రోబో–కేఏటీఆర్’ పేరుతో రూపొందించింది. దీనికి అధునాతన సెన్సర్లు, శక్తిమంతమైన కెమెరా అమర్చడం వల్ల ఇది అవరోధాలను గుర్తించి, తన దిశను ఎంపిక చేసుకోగలదు.ఇది డీజిల్తోను, బ్యాటరీతోను కూడా పనిచేయగలదు. ఈ ట్రాక్టర్ సునాయాసంగా 130 కిలోల బరువును కూడా మోసుకురాగలదు. చిన్న చిన్న పొలాల్లో వాడటానికి అనువుగా తీర్చిదిద్దిన ఈ ట్రాక్టర్‌కు సీఈఎస్-2024 (CES-2024) ప్రదర్శనలో సందర్శకుల ప్రశంసలు లభించాయి. -
అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!
టెక్నాలజీ పెరుగుతోంది, సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా స్కాములకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా 'జంప్డ్ డిపాజిట్ స్కామ్' (Jumped Deposit Scam) పేరుతో ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా చాలామంది ప్రజలు భారీగా డబ్బు కోల్పోతున్నారు. ఇంతకీ ఈ కొత్త స్కామ్ ఏమిటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.జంప్డ్ డిపాజిట్ స్కామ్జంప్డ్ డిపాజిట్ స్కామ్ అనేది యూపీఐ (UPI) వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. బాధితులను ఆకర్శించడానికి.. నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల్లో రూ.5,000 లేదా అంతకంటే తక్కువ జమచేస్తారు. ఖాతాలో డబ్బు జమ అయినట్లు ఒక నోటిఫికేషన్ SMS రూపంలో వస్తుంది. ఆ సమయంలో బాధితుడు బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ ఓపెన్ చేసి.. పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే, నేరగాడికి యాక్సెస్ లభిస్తుంది. దీంతో ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు మాయమైపోతుంది.జంప్డ్ డిపాజిట్ స్కామ్‌ను ఎదుర్కోవడం ఎలా?➤గుర్తు తెలియని నెంబర్ నుంచి మీ ఖాతాలో చిన్న మొత్తం జమ అయితే.. వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయవద్దు. 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వేచి చూడండి. ఆ తరువాత స్కామర్ అభ్యర్థ గడువు ముగిసిపోతుంది.➤ఒకవేళా మీ ఖాతాలో డబ్బు జమ అయిన తరువాత.. బ్యాలన్స్ చెక్ చేసుకునే సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే తప్పు పిన్ ఎంటర్ చేయండి. దీంతో స్కామర్ అభ్యర్థ క్యాన్సిల్ అవుతుంది.➤బ్యాంక్ బ్యాలెన్సును సంబంధించిన యాప్ నోటిఫికెషన్స్ లేదా మెసేజస్ వస్తే.. మీరు నేరుగా బ్యాంకును సంప్రదించి, మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు.➤ఎప్పుడూ మీ యూపీఐ పిన్ నెంబర్ ఇతరులకు షేర్ చేయవద్దు లేదా చెప్పవద్దు. పిన్ నెంబర్ గోప్యంగానే ఉండాలి.➤జంప్డ్ డిపాజిట్ స్కామ్‌కు సంబంధించిన కేసులు.. ఇటీవల చాలా ఎక్కువవుతున్నాయి. కాబట్టి ఇలాంటి తరహా మోసాల గురైతే.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. -
అగ్రిటెక్ రంగంలో భారీగా కొలువులు
ముంబై: అగ్రిటెక్ రంగంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 60–80 వేల పైచిలుకు కొలువులు రాగలవని టీమ్‌లీజ్ సర్విసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ (సీఎస్‌వో) సుబ్బురత్నం తెలిపారు. ఏఐ డెవలప్మెంట్, టెక్నాలజీ, పర్యావరణహిత వ్యవసాయ సొల్యూషన్స్, సప్లై చెయిన్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉండగలవని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా అగ్రిటెక్ రంగంలో సాంకేతిక నిపుణులు, ఆపరేషన్స్ సిబ్బంది, మేనేజర్లు మొదలైన హోదాల్లో 1 లక్ష పైగా ఉద్యోగులు ఉన్నట్లు సుబ్బురత్నం వివరించారు. వ్యవసాయం ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉండగలవన్నారు. ఇక హైదరాబాద్, బెంగళూరు, పుణె, గురుగ్రామ్లాంటి నగరాలు అగ్రిటెక్ స్టార్టప్‌లకు కీలక కేంద్రాలుగా మారగలవని సుబ్బురత్నం చెప్పారు. హైబ్రిడ్ ఉద్యోగాలు.. అగ్రిటెక్ రంగం ప్రధానంగా సాంకేతిక ఆవిష్కరణలు, అనలిటిక్స్ వంటి అంశాలపై దృష్టి పెడుతుంది కాబట్టి ఈ ఉద్యోగాలు సీజనల్‌గా ఉండవని పేర్కొన్నారు. సీజన్లో నాట్లు వేయడం నుంచి కోతల వరకు వివిధ రకాల పర్యవేక్షణ కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బంది .. ఆఫ్–సీజన్లో డేటా విశ్లేషణ, పరికరాల నిర్వహణ మొదలైన వాటిపై పని చేస్తారని చెప్పారు. సాధారణంగా అగ్రిటెక్ ఉద్యోగాలు హైబ్రిడ్ విధానంలో ఉంటాయన్నారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి, డేటా అనలిటిక్స్, పర్యవేక్షణ బాధ్యతలను ఎక్కడి నుంచైనా నిర్వర్తించవచ్చని .. కానీ మెషిన్ ఆపరేటర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వారు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుందని సుబ్బురత్నం చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థ ఈవై నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశీయంగా వ్యవసాయంలో కేవలం 1.5 శాతమే టెక్నాలజీ వినియోగం ఉంటోందని, ఈ నేపథ్యంలో అగ్రిటెక్ కంపెనీలకు 24 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రకారం 2022 నాటికి భారత్‌లో సుమారు 450 అగ్రిటెక్ స్టార్టప్‌లు ఉన్నట్లు వివరించారు. -
స్మార్ట్‌ఫోన్ స్పీడ్ పెంచే బెస్ట్ టిప్స్
ప్రస్తుతం మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ కొన్నప్పుడు ఉన్న స్పీడ్.. కొన్ని రోజుల ఉపయోగించిన తరువాత బహుశా ఉండకపోవచ్చు. దీనికి కారణం అనవసరమైన యాప్స్ కావొచ్చు.. లేదా అవసరం లేని డేటా స్టోరేజ్ కూడా కావొచ్చు. అయితే మీ స్మార్ట్‌ఫోన్ మళ్ళీ వేగంగా పనిచేయాలంటే.. కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఈ టిప్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.క్యాచీ అండ్ డేటాను క్లియర్ చేయాలి (Clear Cache and Data)మొబైల్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి.. యూజర్ అనేక యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ, కొన్ని సార్లు అవసరం లేదు అనుకుని వాటిని డిలీట్ చేస్తూ ఉంటాడు. వాటిని తాత్కాలికంగా డిలీట్ చేసినప్పటికీ.. అవి బ్యాక్ఎండ్లో స్టోరేజ్ అవుతూనే ఉంటాయి. అవన్నీ ఎక్కువవ్వడం వల్ల స్పీడ్ తగ్గుతుంది. వీటన్నింటినీ మీ మొబైల్ ఫోన్ సెట్టింగ్‌లలోకి వెళ్లి క్లియర్ చేసుకోవాలి. అప్పుడే స్మార్ట్‌ఫోన్ స్పీడ్ పెరుగుతుంది.ఉపయోగించని యాప్స్ అన్ఇన్స్టాల్ చేయాలి (Uninstall Unused Apps)కొన్ని సార్లు మొబైల్ ఫోనులో ఉపయోగించని లేదా అనవసరమైన యాప్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అన్ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ప్రతి యాప్ ఫోన్లో కొంత స్టోరేజిని ఆక్రమిస్తుంది. మరికొన్ని యాప్స్ అయితే ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన వెంటనే వాటి స్టోరేజ్‌ని విస్తరించే అవకాశం ఉంది. ఇవన్నీ మొబైల్ స్పీడ్ తగ్గిస్తాయి.అనవసరమైన బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్లను డిసేబుల్ చేయాలి (Disable Unnecessary Background Processes)మీరు ఉపయోగిస్తున్న మొబైల్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని యాప్స్ ఆటోమేటిక్‌గా రన్ అవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని యూజర్లు కూడా అంత వేగంగా గుర్తించలేరు. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి.. డిలీట్ చేయడం లేదా ఇనాక్టివ్ చేయడం వంటివి చేయాలి.పర్ఫామెన్స్ బూస్టర్ (Performance Booster) ఉపయోగించడంపర్ఫామెన్స్ బూస్టర్‌ని ఉపయోగించడం వల్ల ఫోన్లోని అనవసరమైన ఫైల్లు.. అనవసరమైన డేటాను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. కొన్ని ఫోన్లలో ఈ బూస్టర్ యాప్‌లు ముందే ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఒకవేళా మీ మొబైల్ ఫోనులో లేదంటే ప్లే స్టోర్‌కి వెళ్లి ఈ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. -
ఐఐటీ మద్రాసులో టెక్ ఫెస్టివల్స్
సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసులో జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేశంలోనే అతి పెద్ద విద్యార్థి ఉత్సవంగా టెక్ ఫెస్టివల్స్‌లో ఒకటైన శాస్త్త్ర 26వ ఎడిషన్ నిర్వహించనున్నారు. 80 ఈవెంట్లు, 130 స్టాల్స్‌తో జరగనున్న ఈ కార్యక్రమానికి 70,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా విద్యార్థులచే నిర్వహించే ఈ బృహత్తర కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్‌కు చెందిన 750 మంది విద్యార్థులు వివిధ సంస్థాగత సేవలో పనిచేయనున్నారు. సోమవారం క్యాంపస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శాస్త్ర 2025 గురించి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ శ్ఙ్రీశాస్త్ర వంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో నిర్వహణ నైపుణ్యాలు, నిబద్ధత, బాధ్యత వంటి విలువైన లక్షణాలను పెంపొందించేందుకు వలుందన్నారు. ఒక సాధారణ ప్రయోజనం కోసం పెద్ద బృందాలలో పని చేసే సామర్థ్యంతో పాటూ ఐఐటీ మద్రాస్ విద్యార్థులు అనేక ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు, స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యక్తులను ఈవెంట్‌కు ఆహ్వానించే అవకాశం విద్యార్థులకు దక్కినట్లయ్యిందన్నారు. శాస్త్ర 2025కు సహకారంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ రామకృష్ణన్ మాట్లాడుతూ, వాస్తవ–ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి, ఆవిష్కరణ , ప్రోత్సాహం, సహకారం, అకాడెమియా నైపుణ్యాలు, జ్ఞానమార్పిడికి ఓ ప్రత్యేక వేదికగా శాస్త్ర నిలవబోతోందన్నారు.వివిధ ఈవెంట్లు..ఏఐ రోబోటిక్స్, స్థిరమైన సముద్ర సాంకేతికతలు వంటి అత్యాధునిక రంగాలలో సహకార పరిశోధన, నైపుణ్య అభివృద్ధికి దోహదకరంగా నిలవనున్నట్లు వివరించారు. శాస్త్ర వంటి ప్రధానమైన సాంకేతిక ఈవెంట్‌తో భారతదేశ సాంకేతిక, శాసీ్త్రయ సామర్థ్యాలను పెంపొందించే స్టీమ్ కెరీర్లను ప్రోత్సహిస్తూ స్థిరమైన సముద్ర అన్వేషణ, వాతావరణ స్థితిస్థాపకత కోసం పరిష్కారాలను అన్వేషించడానికి, తరువాతి తరాన్ని ప్రేరేపించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. అటానమస్ డ్రోన్ డెలివరీని కలిగి ఉండే శాస్త్ర ఏరియల్ రోబోటిక్స్ ఛాలెంజ్ ఇందులో కీలకం కానున్నట్టు పేర్కొన్నారు. డ్రోన్లు తమ ప్రోగ్రామింగ్, సెన్సార్ సామర్థ్యాలను ప్రదర్శిస్తూ, లక్ష్యాన్ని గుర్తించడానికి స్వయం ప్రతిపత్తితో నావిగేట్ చేస్తాయన్నారు. అలాగే రోబో స్కోర్ ఈవెంట్, ఆల్గో ట్రేడింగ్, పెట్రి–డిష్ ఛాలెంజ్ వంటి కార్యక్రమాలు విద్యార్థులకు ప్రయోజనకరం కానున్నట్లు వివరించారు. ఐఐటీ మద్రాస్ డీన్ (విద్యార్థులు) ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్. గుమ్మడి మాట్లాడుతూ శాస్త్ర సమ్మిట్, రీసెర్చ్ కాన్ఫరెన్స్‌లో రెండు కొత్త అంశాలను పరిచయం చేయబోతున్నామన్నారు. ఇందులో ఒకటి ఫ్యూచర్ సిటీస్ మరొకటి స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ అని వివరించారు. ఐఐటీ మద్రాస్‌లోని సహ–కరిక్యులర్ అడ్వైజర్ డాక్టర్ మురుగయన్ అమృతలింగం, మాట్లాడుతూ వార్షిక టెక్నికల్ ఈవెంట్ అయిన శాస్త్ర విద్యార్థులచే నిర్వహించే టెక్నో–మేనేజిరియల్ పండుగలలో ఒకటిగా పేర్కొన్నారు. ఈ 26వ వార్షిక కార్యక్రమం బహుళ సాంకేతిక , వ్యాపార డొమైనన్లలో విభిన్నమైన ఈవెంట్లు, వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలతో పాటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్, అటానమస్ రోవర్ ఛాలెంజ్‌లు, సాయుధ దళాల ప్రదర్శనలు, రోబోట్ యుద్ధాలు, ఇతర ప్రాంతాలలో వర్క్‌షాప్‌ల నిర్వహణకు కూడా వేదికగా నిలవనున్నట్టు తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యా ర్థులు, టెక్నో ఔత్సాహికులు తరలిరావాలని ఆహ్వానించారు. సహ–కరిక్యులర్ అఫైర్స్ సెక్రటరీ సుఖేత్ కల్లుపల్లి మాట్లాడుతూ ఇది సాంకేతిక ఆవిష్కరణల వేడుక అని, ఇన్స్టిట్యూట్ ఓపెన్ హౌస్ సందర్భంగా ఐఐటీ మద్రా స్లోని ల్యాబ్‌లు, సెంటర్లను రెండు రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంచే విధంగా ఒక అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నంబి నారాయణన్ , గణిత శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్సుజాత రామదురై, రుచిరా వంటి వారు ఈ వేడుకలో ప్రత్యేక ప్రసంగం చేయబోతున్నారని వివరించారు. ఈ సమావేశంలో స్టూడెంట్ కోర్ సుధన్, అనుమల సాథ్విక్ తదితరులు పాల్గొన్నారు. -
సరికొత్త సైబర్ మోసాలు!
ఇది టెక్నాలజీ కాలం.. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు ప్రతి పని సాంకేతికతతో ముడిపడి ఉంటోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే మన గుప్పిట్లో ఉన్నట్టు..ఇదంతా నాణేనికి ఒక వైపు..సాంకేతికత ఎంతగా పెరిగిందో.. దాని వల్ల ముప్పు అంతే పొంచి ఉంటోంది. ముఖ్యంగా సాంకేతికత ఆధారంగా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. కళ్లకు కనిపించని సైబర్ నేరగాళ్లు ఎక్కడో కూర్చుని ఇక్కడి మన బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. 2024 ఒక్క ఏడాదిలోనే తెలంగాణ వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము రూ.1,866.9 కోట్లు అంటేనే ఈ తరహా మోసాల బారిన పడుతున్నవారు ఎంత పెద్ద సంఖ్యలో ఉంటున్నారో అర్థమవుతుంది. ఎంత విద్యాధికులైనా.. విజ్ఞానం ఉన్నా..అత్యాశ, అమాయకత్వం, అవగాహన లోపం లాంటి వాటితో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుపోతున్నారు.మరి ఇలాంటి వారినుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? సైబర్ నేరగాళ్లకు మన కష్టార్జితం చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న మోసాలు ఏంటి? నేరగాళ్లు ఎలా మోసం చేస్తున్నారు? ఇలా అనేక కోణాల్లో సైబర్ మోసాలపై పలువురు సైబర్ భద్రత నిపుణులు, పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. విలువైన సూచనలు ఇస్తున్నారు. వీటిపై ‘సాక్షి’అందిస్తున్న ప్రత్యేక కథనం మీ కోసం.. – సాక్షి, హైదరాబాద్శ్రీధర్ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో ఆయన ఫోన్‌కు వీడియో కాల్ వచ్చింది. పోలీస్ యూనిఫాంలో ఉన్న అవతలి వ్యక్తి.. మేం ముంబై పోలీస్...మీ బ్యాంకు ఖాతాల నుంచి విదేశాల్లోని సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలకు డబ్బులు వెళ్లాయి. మీపై మనీలాండరింగ్ చట్టాల కింద కేసు నమోదైంది. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం. మీరు ఇంకెవరితో ఫోన్లు మాట్లాడొద్దు..ఇంటినుంచి బయటికి వెళ్లొద్దు. అని బెదిరిస్తూనే చివరకు మిమ్మల్ని ఈ కేసు నుంచి బయటపడేయాలంటే, మేం చెప్పిన ఖాతాలో డబ్బులు వేయాలి..’అని చెప్పారు. ఆందోళనకు గురైన శ్రీధర్ మరో ఆలోచన లేకుండా వాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశారు. అయితే పదేపదే డబ్బులు అడగడంతో ఇది సైబర్ మోసగాళ్ల పనై ఉంటుందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసం 1డిజిటల్ అరెస్టు డిజిటల్ అరెస్టు అనేది లేనేలేదు డిజిటల్ అరెస్టు... ఈ మధ్య కాలంలో ఎంతో ఎక్కువగా వింటున్న..జరుగుతున్న సైబర్ మోసం. ఫోన్ నంబర్, పూర్తి పేరు, అడ్రస్ ఇలా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఏదో ఒక రూపంలో సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు..అది వాడి మోసానికి తెర తీస్తున్నారు. మన ఫోన్లో ముంబై పోలీస్ అనో ఇతర పోలీస్ అనో రావడం, అవతలి వ్యక్తులు పోలీస్ యూనిఫాంలోనే ఉండడం.. మన పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ పక్కాగా చెబుతుండటంతో నిజమైన పోలీసులేనేమో అని భయపడేందుకు అవకాశం ఉంటోంది. నిజానికి డిజిటల్ అరెస్టు అన్నది లేనే లేదు. వారి మాటలు నమ్మితే.. నేరగాళ్లు అసలు కథ మొదలెడతారు. ఎలా మోసగిస్తారు..? : మనీలాండరింగ్ కేసులో మీపేరుంది.. మీ చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్‌తో ఉన్న పార్శిల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. మీ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపారు. మీ ఫోన్ నంబర్‌తో అనుమానితులకు ఫోన్లు వెళుతున్నాయి.. ఇలాంటివి చెబుతూ వీడియో కాల్స్ చేస్తారు. బెదిరిపోవద్దు..‘డిజిటల్ అరెస్టు సైబర్ మోసంలో.. నేరగాళ్లు మీపై ఏదో ఒక నేరారోపణ చేసి బెదరగొడతారు. మీ ఫోన్ నంబర్, మీ ఆధార్ నంబర్, మీ అడ్రస్ ఇలాంటి వివరాలు నేరంలో ఉన్నట్టు కంగారు పెడతారు. మనీలాండరింగ్, డ్రగ్స్ కేసు, కస్టమ్స్ కేసు, పోటా యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీ) కింద కేసు..లేదంటే మీపైన ఒక మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది..ఇలాంటి వాక్యాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు వెంటనే పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ ఒత్తిడిని క్రియేట్ చేస్తారు. ఆందోళన పెంచేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులెవరికీ ఫోన్ చేయొద్దంటారు. మీరు మాట్లాడటం కొనసాగించే కొద్దీ ఇదేవిధంగా కంగారు పెడుతూ మెల్లగా ఈ నేరంలోంచి బయటపడేందుకు మీకు సహాయపడతామంటారు. నేరం నుంచి తప్పించుకోవాలన్నా..మీ పేరును ఈ నేరం నుంచి తొలగించాలన్నా..మేం అడిగినంత డబ్బులు పంపాలంటూ బేరాలు మొదలు పెడతారు. మీరు భయంతో అంగీకరిస్తే బ్యాంకు ఖాతాల నంబర్లు ఇస్తారు. వీలైనంతగా మీ వద్ద డబ్బు గుంజే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి పోలీసులెవరూ ఇలా ఫోన్లలో బెదిరించరని, డిజిటల్ అరెస్టు అనేది లేనే లేదని తెలుసుకోవాలి. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి. మనకు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వస్తే సాధ్యమైనంతవరకు మాట్లాడకుండా ఉండటమే మంచిది..’అని సైబర్ భద్రత నిపుణుడు అద్వైత్ కంభం వివరించారు. ప్రణయ్.. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతడి పీఐఐ వివరాలు థర్డ్‌పార్టీ నుంచి సేకరించే సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ ప్రొఫైల్ నకిలీది క్రియేట్ చేసి..దాని ద్వారా ప్రణయ్ స్నేహితులు, బంధువులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపారు. కొద్దిరోజుల తర్వాత ప్రణయ్ నకిలీ ఫేస్బుక్ ఖాతా నుంచి ‘నా భార్య అనారోగ్యంతో ఉంది.అత్యవసర సర్జరీ కోసం ఆసుపత్రిలో చేర్పించాను. నా ఆన్లైన్ బ్యాకింగ్ పనిచేయడం లేదు. అర్జంట్‌గా నేను చెప్పిన నంబర్‌కు రూ.50 వేలు పంపించు. నేను సాయంత్రం వరకు తిరిగి ఇచ్చేస్తాను..’అంటూ ప్రణయ్ ఆఫీస్ కొలీగ్ నాగేందర్‌కు మెసేజ్ వచ్చింది. అత్యవసరంలో ఉన్నాడు కదా అని డబ్బులు పంపాడు. సాయంత్రం ప్రణయ్‌కు కాల్ చేస్తే కానీ నాగేందర్‌కు తెలియలేదు..అది ఫేక్ అని..మోసం2ఐడెంటిటీ థెఫ్ట్అంటే ఏమిటి..? పర్సనల్ ఐడెంటిఫయబుల్ ఇన్ఫర్మేషన్ (పీఐఐ) అంటే మన ఫోన్ నంబర్, పేరు, ఫొటోగ్రాఫ్, ఈ–మెయిల్..వీటి ద్వారా జరిగే మోసాలను ఐడెంటిటీ థెఫ్ట్ మోసాలుగా చెప్పవచ్చు. మన ఫొటోలను, లేదా వీడియోలను వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌తో మారి్ఫంగ్ ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేస్తారు. అవి నిజమైనవి కాదు అన్నది గుర్తుపట్టలేనంతగా చేస్తారు. వీటిని ఉపయోగించి సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం ద్వారా లేదంటే మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలతో మోసానికి తెరతీస్తారు. ఎలా మోసగిస్తారు..? మన వివరాలను వినియోగించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు.. లేదా కొద్దిపాటి మార్పులతో మన ఈ–మెయిల్‌ను పోలినట్టుగా ఈ –మెయిల్స్ క్రియేట్ చేసి.. వాటిని వినియోగించి మోసాలకు పాల్పడతారు. నిజమైన వ్యక్తులే అవసరంలో ఉండి డబ్బులు అడుగుతున్నట్టుగా నమ్మిస్తారు. సామాన్యులు, ప్రముఖులూ బాధితులే..: ప్రసాద్ పాటిబండ్ల, సైబర్ భద్రత నిపుణుడు, ఢిల్లీఐడెంటిటీ థెఫ్ట్ సైబర్ మోసానికి ప్రముఖ రాజకీయ నాయకులు, కీలక అధికారులు, జడ్జీలు, ఇతర రంగాల సెలబ్రెటీలు ఎక్కువగా గురవుతున్నారు. మరోవైపు సామాన్యులకు సైతం ఈ ఐడెంటిటీ థెఫ్ట్ ముప్పు తప్పడం లేదు. ఉదాహరణకు.. మాజీ ఎంపీ సోయం బాపూరావు పేరిట గత ఐదేళ్లుగా గుర్తు తెలియని వ్యక్తి ‘ఎక్స్’ ఖాతాను రన్ చేస్తున్నాడు. ఒక అభ్యంతరకరమైన పోస్టు పెట్టిన తర్వాత ఆయన అప్రమత్తం అయి చూసుకుంటే తన పేరిట ‘ఎక్స్’ ఖాతా ఉన్నట్టు తెలిసింది. కొందరు ప్రభుత్వ అధికారులకు వారి పై అధికారుల పేరిట డబ్బులు పంపాలని వాట్సాప్‌లో, ఫేస్బుక్లో మెసేజ్ వచ్చిన సందర్భాలున్నాయి. ప్రొఫైల్ ఫొటో అధికారిదే ఉండడంతో చాలామంది డబ్బులు పంపి మోసపోయారు. ఇలా ఒక వ్యక్తి ఫొటో, పేరు, వివరాలు వాడి మోసగించడమూ ఐడెంటిటీ థెఫ్ట్ట్గా చెప్పొచ్చు. భవిష్యత్తులో ‘ఏఐ’ముప్పు..: ఇప్పుడు టార్గెటెడ్ వ్యక్తుల వీడియోలు ఏఐ టూల్స్ వాడి ఫేక్‌వి సృష్టిస్తున్నారు. ఇది భవిష్యత్తులో మరింత ముప్పు గా మారబోతోంది. వైరివర్గాన్ని దెబ్బతీసేలా వదంతులు క్రియేట్ చేసేందుకు కూడా ఈ ఐడెంటిటీ థెఫ్ట్ను వాడే అవకాశం ఉంది. కొద్దిపాటి మార్పులతో ఫేక్ ఈ–మెయిల్ అడ్రస్‌లు క్రియేట్ చేసి వాటి ద్వారా మోసాలు వ్యాపార రంగంలో జరుగుతున్నాయి. ఐడెంటిటీ థెఫ్ట్ బారినపడకుండా ఉండాలంటే మన వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా యా ప్స్‌లో వీలైనంత తక్కువగా ఉపయోగించడం ఉత్తమం. సోషల్ మీడియా యాప్స్‌లో మన వివరాలు, ఫొటోలకు ప్రొఫైల్ లాక్స్ పెట్టుకోవాలి. అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు.మోసం 3స్టాక్స్‌లో పెట్టుబడులు శ్రీనివాస్ ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగి. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతుండగా..తన వాట్సాప్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అందులో స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన సమాచారం ఉంది. ఆ మెసేజ్లోని లింక్ ద్వారా ఆ వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు. అందులో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై సభ్యుల చర్చను వారం పాటు గమనించాడు.ఆ తర్వాత శ్రీనివాస్ సైతం కొద్ది మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టాడు. మొదట పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నట్టుగా యాప్‌లో చూపారు. ఇలా తన పెట్టుబడి రూ.50 లక్షలకు చేరిన తర్వాత డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే రాకపోవడంతో మోసమని గుర్తించి సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశాడు.ఎక్కువగా జరుగుతున్న మోసం ఇటీవల కాలంలో అత్యంత ఎక్కువగా జరుగుతున్న సైబర్ మోసాల్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి (స్టాక్స్‌లో పెట్టుబడుల పేరిట మోసం). సోషల్ మీడియాలో ఇచ్చే ప్రకటనల్లో స్టాక్ మార్కెట్లో పేరున్న సంస్థల్లా నమ్మకాన్ని నెలకొల్పుతారు. తక్కువ రిస్క్ తో అధిక రాబడులు వస్తున్నట్టుగా నకిలీ యాప్‌లో మనకు చూపుతుంటారు.పెట్టుబడి తక్కువ సమయంలోనే రెండింతలు, మూడింతలు అవుతున్నట్టుగా అంకెల్లో మార్పులు చేస్తూ నకిలీ లేదా థర్డ్‌పార్టీ యాప్‌లలోకి డబ్బును మళ్లిస్తారు. ఆ డబ్బును సైబర్ దొంగలు వాళ్ల బ్యాంకు ఖాతాల్లోకి తరలించుకుంటారు.మోసం4పార్ట్‌టైం ఉద్యోగాలు హర్షిణి గృహిణి..ఇద్దరు పిల్లలు. బీటెక్ పూర్తయిన తర్వాత ఉద్యోగం చేయాలనుకున్నా కుటుంబ బాధ్యతలతో చేయలేకపోయింది. ఓ రోజు ‘ఇంటివద్దే ఉంటూ పార్ట్‌టైం జాబ్‌తో నెలకు వేలల్లో సంపాదించండి..అంటూ ఫేస్బుక్లో ఒక యాడ్ చూసింది. అందులోని నంబర్లకు ఫోన్ చేసి, వారు అడిగిన వివరాలన్నీ ఇచ్చింది. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలకు లైక్‌లు కొట్టడం, షేర్ చేయడం వంటి టాస్్కలు ఇచ్చారు.కొద్దిరోజులపాటు డబ్బులు తన అకౌంట్లో జమ అవడంతో నమ్మకం పెరిగింది. కొద్ది రోజుల తర్వాత స్టాక్మార్కెట్లో మేం చెప్పిన యాప్స్‌లో పెట్టుబడులతో పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని ఆశపెట్టారు. ఆ మాటలు నమ్మిన హర్షిణి తన సంపాదనతోపాటు కుటుంబ సభ్యులకు చెందిన డబ్బులు పెట్టుబడిగా పెట్టి దాదాపు రూ.25 లక్షల వరకు మోసపోయింది. ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్లు లేకుండా ఎలా? ఎలాంటి ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చుని కూడా రోజుకు వేలల్లో సంపాదించుకోవచ్చంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ‘ఎక్స్’ వాట్సాప్‌లలో నౌకరీ, షర్, మాన్స్టర్ వంటి వెబ్సైట్ల పేరిట నకిలీ ప్రకటనలతో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులు, గృహిణులు, తాత్కాలిక ఉద్యోగాలు ఉండి అదనపు సంపాదన కోసం ప్రయత్నించే వారిని టార్గెట్ చేస్తున్నారు. తొలుత పార్ట్‌టైం జాబ్స్‌తో మొదలుపెట్టి నెమ్మదిగా పెట్టుబడులు పెట్టేలా ఒత్తిడి చేస్తారు. తర్వాత మోసానికి తెరతీస్తారు. నిజమా.. కాదా.. అన్నది నిర్ధారించుకోవాలి ఇంటి దగ్గర ఉండే సంపాదించుకోవచ్చన్న ఆశతో కొందరు వీటిబారిన పడుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్.. ఇలా సోషల్ మీడియా వేదికల ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ తరహా ప్రకటనలు ఇస్తున్నారు. మొదట రూ.10 వేలు, రూ.20 వేలు పెట్టుబడి పెట్టించి దాన్ని రెట్టింపు అయినట్టు చూపిస్తారు. ఈ లాభాలు డ్రా చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఇంకా లాభాలు వస్తాయి..రూ. లక్షల్లో పెట్టండి అని ప్రోత్సహిస్తారు..ఇలా మెల్లగా అవతలి వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టగలడో అంతా అయ్యే వరకు ఇలానే ప్రోత్సహిస్తారు.ఎప్పుడైతే అవతలి వ్యక్తి డబ్బులు విత్‌డ్రాకు ట్రై చేస్తారో అప్పుడు అసలు మోసం బయటపడుతుంది. అప్పటికే మనం పెట్టిన డబ్బులు సైబర్ నేరగాళ్లు ఇతర ఖాతాల్లోకి మళ్లించి అక్కడి నుంచి డ్రా చేసుకోవడం లేదా..క్రిప్టోకరెన్సీ రూపంలో విదేశీ ఖాతాల్లోకి మళ్లించడం చేసేస్తారు. ఈ మోసాలబారిన పడకుండా ఉండాలంటే సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే పార్ట్ టైం జాబ్స్ ప్రకటనలు నమ్మకూడదు. అవకాశం ఉంటే వ్యక్తిగతంగా వాళ్లు చెబుతున్న అడ్రస్‌కు వెళ్లి నిజంగానే ఆ ఆఫీస్ ఉందా..? లేదా...? నిర్ధారించుకున్న తర్వాతే అందులో చేరాలి. – కవిత, డీసీపీ, సైబర్ క్రైం, హైదరాబాద్ సిటీమోసం5ఫేక్ కస్టమర్ కేర్, అడ్వరై్టజ్‌మెంట్ ఫ్రాడ్స్ దిలీప్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. శామీర్‌పేట్‌లో ఉంటారు. ఇంట్లోని ఏసీ పనిచేయకపోవడంతో కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయాలనుకున్నారు. వెంటనే గూగుల్లోకి వెళ్లి సదరు కంపెనీ పేరుతో కస్టమర్ కేర్ నంబర్ అని గూగుల్ సెర్చ్ చేశారు. దానిలో వచ్చిన నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అవతలి వ్యక్తి ‘మీకు కల్గిన అసౌకర్యానికి చింతిస్తున్నాం సార్..మీ ఇంటికి టెక్నీషియన్‌ను పంపుతాం. మీ ఇంటి అడ్రస్, ఇతర వివరాలు ఇవ్వండి. మీ మొబైల్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అందులోని వెబ్‌లింక్ ఓపెన్ చేయండి. తర్వాత మీకు వచ్చిన ఓటీపీ చెబితే..మీ సర్వీసింగ్ రిక్వెస్ట్ కన్ఫర్మేషన్ అవుతుంది..’అని ఎంతో మర్యాదగా చెప్పింది. ఆమె చెప్పినట్టే చేశారు దిలీప్. కాసేపటికి అతడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతున్నట్టు మెసేజ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మోసం ఎలా ఉంటుంది?..: ఆన్లైన్లో ఫుడ్ఆర్డర్ అయినా..? క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన సమస్యలైనా..? ఇలా ఏ అవసరం అయినా వెంటనే కస్టమర్ కేర్‌కు లేదంటే ఆ సంస్థకు కాల్ చేసి ఫిర్యాదు చేయడం సహజం. సరిగ్గా ఇదే తమకు అనుకూలంగా మల్చుకుని సైబర్ మోసాలకు తెరతీస్తున్నారు. గూగుల్ సెర్చ్‌లు వద్దు ‘సైబర్ నేరగాళ్లు నిజమైన సంస్థల పేర్లతో నకిలీ వెబ్ పేజీలను క్రియేట్ చేస్తున్నారు. ఎస్ఈఓ (సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్)టెక్నిక్‌లు వాడి సైబర్ నేరగాళ్ల వెబ్పేజీనే ముందు మనకు కనబడేలా చేస్తున్నారు. అందులోని నంబర్‌కు మనం కాల్ చేస్తే నిజంగా ఆ సంస్థ ప్రతినిధిలా మాట్లాడుతూ, మన బ్యాంకు వివరాలు తీసుకోవడంతోపాటు ఓటీపీలు సైతం చెప్పించుకుని మోసాలకు పాల్పడతారు. అందుకే, కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్‌లో, యూ ట్యూబ్‌లో వెతకడం శ్రేయస్కరం కాదు. మీకు కావాల్సిన సంస్థ అధికారిక వెబ్సైట్లోకి, యాప్‌లోకి వెళ్లి మాత్రమే నంబర్లను తీసుకోవాలి..’అని సైబర్ భద్రత నిపుణులు నల్లమోతు శ్రీధర్ వివరించారు. అత్యాశతోనే అనర్థాలు.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న అత్యాశతో చాలా మంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ బారిన పడుతున్నారు. పెట్టుబడి పెట్టేముందు అ సంస్థ నిజమైనదేనా..? అన్నది తప్పకుండా ధ్రువీకరించుకోవాలి. అత్యధిక లాభాలంటూ వాస్తవ విరుద్ధంగా ఇచ్చే హామీలు ఉంటే తప్పకుండా అనుమానించాలి. తొందరపెట్టినా, ఆఫర్ చేజారిపోతుందని కంగారు పెట్టినా నమ్మవద్దు. అవసరమైతే మీకు తెలిసిన వారి నుంచి సలహాలు తీసుకోవాలి. అప్పటికే ఇన్వెస్ట్ చేస్తున్న వారి సూచనలు తీసుకోవాలి. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. లేదా స్థానిక సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. – శ్రీబాల, డీసీపీ, సైబర్ క్రైమ్స్, సైబరాబాద్అప్రమత్తంగా ఉండండిసైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తరఫున ప్రజలను కోరుతున్నాం. ఆన్లైన్లో వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ప్రతిసారీ జాగ్రత్తగా ఉండండి. అనుమానాస్పద వెబ్ లింక్‌లపై క్లిక్ చేయవద్దు. నిర్ధారించుకోకుండా డబ్బులు ఎవరికీ పంపవద్దు. మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే టీజీసీఎస్బీ హెల్ప్‌లైన్ 1930 లేదా cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. – శిఖా గోయల్, డైరెక్టర్, టీజీసీఎస్బీమరికొన్ని రకాల సైబర్ మోసాలు..ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్..ఆరోగ్యశ్రీ, ఫేక్ ఇన్సూరెన్స్ పేరిట గేమింగ్ ఫ్రాడ్స్..ఆన్లైన్ గేమింగ్, కలర్ కోడింగ్ ఆన్లైన్ రమ్మీ, స్పిన్నింగ్ వీల్ పేరిట సైబర్‌మోసం. లాటరీ ఫ్రాడ్స్..ఆన్లైన్లో లాటరీ వచ్చిందని, మీ పేరిట భారీ డిస్కౌంట్ ఆఫర్ అంటూ.. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్..మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి మోసం..సెల్ టవర్ ఇన్స్టాలేషన్ ఫ్రాడ్..మీ ఇంటి పరిధిలో సెల్ టవర్ ఇన్స్టాల్ చేసేందుకు ఆఫర్ ఉందని చెబుతారు. ఐవీఆర్ కాల్స్‌తో మోసం: మీరు అనుమానాస్పద నంబర్లకు ఫోన్లు చేశారని, మీ సిమ్‌కార్డు కొద్ది సమయంలోనే బ్లాక్ అవబోతుందని, ట్రాయ్, టెలికమ్ సర్వీస్ ప్రొవైడర్ల పేరిట ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) కాల్స్‌చేసి బెదిరించి మోసాలు.. కేవైసీ అప్డేషన్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఆధార్‌తో లింకేజీ చేయడం, కార్డు యాక్టివేషన్, కార్డు లిమిట్ పెంచడం, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు, రివార్డు పాయింట్లు డబ్బుగా మార్చుకోవాలని.. ఇలాంటి అంశాలతో మోసగిస్తారు. ఓఎల్ఎక్స్లో వస్తువులు అమ్ముతామని, లేదంటే కొంటామని నకిలీ అడ్రస్‌లు, ప్రూఫ్‌లతో మోసగిస్తారు.ఫోన్ నంబర్ ఇవ్వడమే తప్పు సాధారణంగా దొంగలు ఇంట్లోకి రాకుండా పెద్ద, పెద్ద తాళాలు వేస్తాం.. ఇంటికి నాలుగు మూలల సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటాం..అవసరమైతే కుక్కలను పెంచుకుంటాం. కానీ, కనిపించని సైబర్ దొంగల చేతికి మాత్రం ‘సమాచారం’అనే తాళాలు మనమే ఇస్తున్నాం. మందుల దుకాణం, సూపర్ మార్కెట్, మాల్స్, వస్త్ర దుకాణాలు, ఫుడ్‌కోర్టులు ఇలా ఎక్కడపడితే అక్కడ అవసరానికి మించి మన ఫోన్ నంబర్‌ను ఇస్తున్నాం. కొన్నిసార్లు అనివార్యంగా కూడా మన వివరాలు ఇవ్వక తప్పడం లేదు. ఇదే పెద్ద తప్పు అని గుర్తించాలంటున్నారు సైబర్ భద్రత నిపుణులు. ఇలా మనం ఇచ్చే సమాచారాన్ని కొన్ని సంస్థలు కాల్ సెంటర్లకు, థర్డ్‌పార్టీకి అమ్ముతున్నాయని మరవొద్దు. మన ఫోన్ నంబర్, పేరు తెలిస్తే మిగిలిన వివరాలు కనిపెట్టడం సైబర్ నేరగాళ్లకు పెద్ద కష్టమేమీ కాదు.. సులువుగా డబ్బులు సంపాదించాలనుకునే ప్రజల అత్యాశనే సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మార్చుకుంటున్నారు.గుడ్డిగా నమ్మొద్దు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని, మీకు ఫలానా బ్యాంకు నుంచి ఆఫర్ ఉందని, మీకు లాటరీలు వచ్చాయని..ఇలా ఏదో ఒక సాకుతో వచ్చే ఎస్ఎంఎస్లు, ఈ–మెయిల్స్‌లోని వెబ్ లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అప్రమత్తతే ఆయుధం అన్నది మరవొద్దు. సైబర్‌మోసగాళ్లు ఇచ్చే మోసపూరిత ప్రకటనలు, మెసేజ్‌లు, ఈ మెయిల్స్‌ను గుడ్డిగా నమ్మకుండా.. ఆలోచించి, నిర్ధారించుకోవాలి. -
ఎక్కడున్నా మొక్కపై నిఘా!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల కోసం పంట పొలాల్లో తిరగాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా వెళ్లి మొక్కల తీరును పరిశీలించి డేటాను సేకరించాలి. కానీ, పంటలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అధ్యయనం చేయ గల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్రిశాట్లో ఉన్న ప్రత్యేక పరిశోధన క్షేత్రంలో వినియోగిస్తున్నా రు. పంటల వద్దకు వెళ్లకుండానే తామున్న చోట నుంచే పంటల తీరును పరిశీలించేందుకు వీలుండే ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ‘హై థ్రోపుట్ ఫినోటైపింగ్ ఫెసిలిటీ’అనే అధునాతన ల్యా బ్ ద్వారా ఇతర దేశాల్లో ఉన్న సైంటిస్టులు కూడా ఇక్కడి పంటల తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతోంది. ప్రస్తుతానికి ఈ ఆధునిక ప్రయోగశాలలో జొన్న పంటపై పరిశోధన జరుగుతోంది. అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ.. ఇక్రిశాట్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని రామచంద్రాపురంలో ఉన్నప్పటికీ.. దీని ప్రాంతీయ కార్యాలయాలు కెన్యా, మాలి, నైజీరియా, మలావీ, ఇథియోఫియా, జింబాబ్వే తదితర ఆఫ్రికా దేశాల్లో ఉన్నాయి. ఆయా దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు సైతం ఇక్కడి పరిశోధన క్షేత్రంలో పెరుగుతున్న మొక్కలను వీక్షించేందుకు, పరిశీలించేందుకు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. మొక్క ప్రతిస్పందనపై క్షణక్షణం నిఘా హైథ్రోపుట్ ఫినోటైపింగ్ ఫెసిలిటీ కేంద్రంలో ప్రస్తుతం జొన్న పంటకు సంబంధించి ఐదు వేల మొక్కలను పెంచుతున్నారు. ఈ సెంటర్ మొక్క ప్రతి స్పందనను క్షణక్షణం రికార్డు చేస్తుంది. ఈ డేటాను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తుంది. మొక్క పత్రహరితానికి సంబంధించిన ఫ్లోరోసెన్స్, మొక్క 3డీ మాడలింగ్, ఆర్జీబీ ఇమేజింగ్, హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్, థర్మల్ ఇమేజింగ్.. ఇలా మొక్కను పూర్తిస్థాయిలో స్కాన్ చేయగల ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. నీటి వాడకానికీ లెక్క ఉంటుంది.. మొక్క ఎప్పడు ఎంత నీటిని వాడుకుంటుందనే వివరాలు కూడా ఈ ల్యాబ్‌లో రికార్డు అవుతాయి. మొక్క ట్రే కింద ప్రత్యేకంగా లోడ్ సెన్సార్ ఉంటుంది. మొక్కకు పట్టిన నీళ్లు ఎన్ని ఆవిరయ్యాయి? ఎంత వినియోగమైంది? అనే వివరాలను సేకరిస్తుంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మొక్క ఎంత ఒత్తిడికి గురవుతుంది? మొక్కల ఎదుగుదల ఎలా ఉంటుంది? అనే అంశాలను ఇమేజ్, వీడియో రూపంలో కూడా రికార్డు చేస్తుంది.మొక్కలు ఎంత నీళ్లు ఇస్తే తట్టుకోగలవు. నీళ్లు లేకపోతే ఎంత మేరకు అనుగడ సాధించగలవు? అనే అంశాలను పరిశీలించేందుకు వీలుంటుంది. తద్వారా నీటి కొరతను తట్టుకునే వెరైటీలు, అధిక వర్షాలకు తట్టుకునే వెరైటీలను కనుగొనే అవకాశం ఉంటుందని ఇక్రిశాట్ రిసెర్చ్ స్కాలర్ కల్పన తెలిపారు. -
కిరాణా దుకాణాలకు టెక్నాలజీ ప్లాట్‌ఫామ్
క్విక్ కామర్స్(quick commerce) సంస్థల మాదిరిగానే కిరాణా దుకాణాలకు ప్రత్యేకంగా ఆన్లైన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తీసుకురావాలని ది ఫెడరేషన్ ఆఫ్ రిటెయిలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FRAI) ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే క్విక్ కామర్స్ సంస్థల ద్వారా వస్తున్న పోటీని తట్టుకోలేక కిరాణా దుకాణాలు కుదేలవుతున్నాయని చెప్పింది. వీటికితోడు రిటైల్(Retail) అవుట్లెట్లు పెరుగుతున్నాయని పేర్కొంది. కొత్త కంపెనీలు రిటైల్ స్టోర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయని, ఇప్పటికే ఆన్లైన్ షాపింగ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు క్విక్‌కామర్స్ సేవలు ప్రారంభిస్తున్నాయని వివరించింది.ఈ నేపథ్యంలో కిరాణాదారులకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఎఫ్ఆర్ఏఐ తెలిపింది. క్విక్ కామర్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు సంప్రదాయ కిరాణా దుకాణాలకు ప్రత్యేక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం కల్పించాలని చెప్పింది. ఇప్పటికే మార్కెట్లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో(Zepto) వంటి క్విక్ కామర్స్ సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం కిరాణా దుకాణాలకు తోడ్పాటు అందించాలని తెలిపింది.ఇదీ చదవండి: ఎకానమీపై ఆర్బీఐ బులెటిన్ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఏఐ గౌరవ అధికార ప్రతినిధి అభయ్ రాజ్ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వంటి కొత్త టెక్నాలజీలు, కిరాణా దుకాణాలకు క్విక్ కామర్స్ పోటీను తట్టుకునేలా పరిష్కారం అందిస్తాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎఫ్ఆర్ఏఐలో 42 రిటైల్ సంఘాలు ఉన్నాయి. 80 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి రిటైలర్లకు ఈ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. -
ఎక్స్ యూజర్లకు షాక్!.. భారీగా పెరిగిన ధరలు
ఇలాన్ మస్క్ (Elon Musk) యాజమాన్యంలోని.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (Twitter) తన ప్రీమియం ప్లస్ ధరల పెంపును ప్రకటించింది. డిసెంబర్ 21 నుంచే ప్రపంచంలోనే చాలా దేశాల్లో ప్రీమియం ప్లస్ ధరలను పెంచిన ఎక్స్.. ఇప్పుడు తాజాగా భారత్‌లోనూ పెంచినట్లు వెల్లడించింది.ఇప్పటికే ప్రీమియం ప్లస్ (Premium Plus) ప్లాన్ ఎంచుకున్న వారు మినహా.. మిగిలినవారు కొత్త ధరల ప్రకారమే చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. యునైటెడ్ స్టేట్స్లో.. నెలవారీ ప్రీమియం ప్లస్ రేటు 16 డాలర్ల నుంచి 22 డాలర్లకు పెరిగింది. అదే సమయంలో వార్షిక చందా కూడా 168 డాలర్ల నుంచి 229 డాలర్లకు చేరింది.భారత్‌లోనూ ఈ ప్రీమియం ప్లస్ ధరలు రూ. 1,300 నుంచి రూ. 1,750కి పెరిగింది. అంటే ఈ ధరలు 35 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. యాన్యువల్ సబ్స్క్రైబర్లు కూడా ఇప్పుడు 18,300 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ధరల పెరుగుదలకు ముందు.. యాన్యువల్ సబ్స్క్రైబర్లు రూ. 13,600 మాత్రమే చెల్లించాల్సి ఉండేది.పెరిగిన ఎక్స్ ప్రీమియం ప్లస్ ధరలు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే ప్రీమియం ప్లస్ ధరలు పెరిగినప్పటికీ.. భారతదేశంలో బేసిక్, స్టాండర్డ్ ప్రీమియం ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఈ ప్లాన్స్ సబ్స్క్రైబర్లు మునుపటి మాదిరిగానే 243 రూపాయలు, 650 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియోప్రస్తుత సబ్స్క్రైబర్ల ధరల నిర్మాణాన్ని కూడా ఎక్స్ స్పష్టం చేసింది. మీ తదుపరి బిల్లింగ్ సైకిల్ 20 జనవరి 2025లోపు ప్రారంభమైతే, మీరు పాత ధరనే చెల్లిస్తే సరిపోతుంది. ఆ తరువాత కొత్త రేటు వర్తిస్తుంది. సర్వీస్‌ల పెంపుదల కారణంగానే ధరల పెంచినట్లు సంస్థ వెల్లడించింది. ప్రీమియం ప్లస్ సబ్స్క్రైబర్లు యాడ్-ఫ్రీ బ్రౌజింగ్‌ను పొందవచ్చు. అంతే కాకుండా గ్రోక్ ఏఐ చాట్‌బాట్, రాడార్ వంటి కొత్త ఫీచర్లకు యాక్సెస్ చేయవచ్చు. -
ట్రంప్ ప్రభుత్వంలో మరో భారతీయ అమెరికన్‌కు చోటు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్‌గా 'శ్రీరామ్ కృష్ణన్'ను నియమించారు. గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్బుక్, స్నాప్‌లో పనిచేసిన కృష్ణన్.. ఇక వైట్ హౌస్ ఏఐ & క్రిప్టో జార్‌గా ఉండే 'డేవిడ్ సాక్స్'తో కలిసి పని చేయనున్నారు.''దేశానికి సేవ చేయడం, ఏఐలో అమెరికా నాయకత్వానికి సన్నిహితంగా పనిచేయడం నాకు గర్వకారణంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు'' అంటూ.. శ్రీరామ్ కృష్ణన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.🇺🇸 I'm honored to be able to serve our country and ensure continued American leadership in AI working closely with @DavidSacks. Thank you @realDonaldTrump for this opportunity. pic.twitter.com/kw1n0IKK2a— Sriram Krishnan (@sriramk) December 22, 2024''శ్రీరామ్ కృష్ణన్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా నియమించినందుకు సంతోషిస్తున్నాము" అని ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా అన్నారు.I am pleased to announce the brilliant Team that will be working in conjunction with our White House A.I. & Crypto Czar, David O. Sacks. Together, we will unleash scientific breakthroughs, ensure America's technological dominance, and usher in a Golden Age of American Innovation!…— Trump Posts on 𝕏 (@trump_repost) December 22, 2024ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?చెన్నైలో పుట్టిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా తన కెరియర్ను ప్రారంభించారు. చెన్నైలో పుట్టిన నాకు సిలికాన్ వ్యాలీకి మారినప్పుడు కల్చర్ మొత్తం చాలా భిన్నంగా అనిపించినట్లు వెల్లడించారు.విండోస్ అజూర్ వ్యవస్థాపక సభ్యుడిగా మైక్రోసాఫ్ట్‌లో కెరీర్ ప్రారంభించిన శ్రీరామ్.. తరువాత మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్బుక్, స్నాప్ వంటి వాటిలో కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. కాగా ఇప్పుడు ఈయన వైట్ హౌస్‌లో పనిచేయనున్నారు. -
ప్రపంచంలో అతిచిన్న కెమెరా ఇదే
ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఇమేజ్ సెన్సర్ చిప్. అమెరికన్ కెమెరాల తయారీ కంపెనీ ‘ఓమ్నివిజన్’ కెమెరాల్లో ఉపయోగించే ఈ ఇమేజ్ సెన్సర్ చిప్‌ను ‘ఓవీఎం 6948’ పేరుతో ఇటీవల రూపొందించింది.‘చిప్ ఆన్ టిప్’ అనే ప్రచారంతో అందుబాటులోకి తెచ్చిన ఈ చిప్ ప్రపంచంలోనే అత్యంత చిన్న ఇమేజ్ సెన్సర్ చిప్‌గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. దీని పొడవు 0.65 మి.మీ., వెడల్పు 0.65 మి.మీ., మందం 1.158 మి.మీ. అంటే, దాదాపు ఒక పంచదార రేణువంత పరిమాణంలో ఉంటుంది.ఇది 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఫొటోలు తీయడానికి ఉపయోగపడుతుంది. ఎండోస్కోప్ సహా వివిధ వైద్య పరికరాల కెమెరాల్లో ఉపయోగించడానికి ఇది అత్యంత అనువుగా ఉంటుంది. ఇది సెకనుకు 30 ఫ్రేముల సామర్థ్యంతో వీడియోలు కూడా తీయగలదు. -
మోకాలికి ఏఐ కవచం.. ఎందుకో తెలుసా?
పరుగులు తీసేటప్పుడు, ఒక్కోసారి నడిచేటప్పుడు జారిపడే సందర్భాల్లో.. కేవలం 60 మిల్లీ సెకండ్లలోనే మోకాలి చిప్పకు, దాని లిగమెంట్లకు గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి లండన్‌కు చెందిన ‘హిప్పోస్’ అనే స్టార్టప్ కంపెనీ మోకాలికి ఏఐ కవచాన్ని తాజాగా రూపొందించింది.ఈ ఏఐ కవచాన్ని ధరించిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడుతున్నట్లయితే.. ఏఐ ఎయిర్‌బ్యాగ్ 30 మిల్లీ సెకండ్లలోనే తెరుచుకుని, గాయాలను నివారిస్తుంది. మోకాలికి ధరించే ఈ ఏఐ ఎయిర్ బ్యాగ్ పనితీరును ‘హిప్పోస్’ కంపెనీ నిర్వాహకులు లండన్‌లోని పలు ఫుట్‌బాల్ క్లబ్బులకు చెందిన క్రీడాకారులపై ప్రయోగించి, సంతృప్తికరమైన ఫలితాలను సాధించారు.ఇదీ చదవండి: పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియోఏఐ కవచాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ‘హిప్పోస్’ నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అందువల్ల క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం 6.42 లక్షల డాలర్లు (రూ.5.43 కోట్లు) వరకు నిధులు సమకూరాయని ‘హిప్పోస్’ సంస్థ తెలిపింది. ఈ మోకాలి కవచాల ధర ఒక్కో జత 129 డాలర్లు (రూ.10,929) అవుతుందని, ప్రీఆర్డర్ల ద్వారా నిధులు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ‘హిప్పోస్’ వ్యవస్థాపకులు కైలిన్ షా, భావీ మెటాకర్ చెబుతున్నారు. -
పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియో
సూపర్ స్టార్ 'రజనీ కాంత్' రోబో సినిమా వచ్చిన తరువాత.. బహుశా రోబోలు ఇలాగే ఉంటాయేమో అని చాలామంది భావించారు. అయితే ఇటీవల టెస్లా రూపొందించిన నడిచే రోబోకు సంబందించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పుడు చైనా కంపెనీ ఏకంగా పరుగెత్తే రోబోను తయారు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.చైనీస్ కంపెనీ ‘రోబో ఎరా’ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసింది. ‘స్టార్1’ పేరుతో రూపొందించిన ఈ రోబో శరవేగంగా పరుగులు తీయగలదు. ఇది గంటకు 8 మైళ్లు (12.98 కి.మీ.) వేగంతో పరుగెడుతోంది. ఈ రోబోకు హైటార్క్ మోటార్లు, ఏఐ సెన్సార్లు అమర్చడం వల్ల.. ఇది ఎలాంటి ఎగుడు దిగుడు దారుల్లోనైనా అదే వేగంతో పరుగెతూనే దాటేస్తుంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు‘రోబో ఎరా’ చూడటానికి సగటు మనిషి పరిమాణంలోనే 5.6 అడుగుల ఎత్తు, 64.86 కేజీల బరువుతో ఉంటుంది. ఇలాంటి పరుగుల రోబోలను ‘టెస్లా’ కంపెనీ ‘ఆప్టిమస్’ పేరుతోను, ‘బోస్టన్ డైనమిక్స్’ కంపెనీ ‘అట్లాస్’ పేరుతోను రూపొందించాయి. అయితే, ‘రోబో ఎరా’ తాజాగా రూపొందించిన ‘స్టార్ 1’ వాటి కంటే వేగంగా పరుగులు తీయగలగడంతో, అత్యంత వేగవంతమైన రోబోగా రికార్డు సాధించింది. -
ఏఐకి సవాళ్లు.. హ్యాకింగ్ రిస్కులు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ(ఏఐ) గణనీయంగా ప్రాచుర్యంలోకి వస్తున్నప్పటికీ దీన్ని వినియోగించుకోవడంలో కంపెనీలు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. హ్యాకింగ్, సైబర్ దాడులు వంటి రిస్కులే ఏఐ వినియోగానికి అతి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయని ఒక సర్వేలో 92% మంది భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రైవసీ రిస్కులు కారణమని 91% మంది, నియంత్రణపరమైన అనిశ్చితి కారణమని 89% మంది తెలిపారు. డెలాయిట్ ఏషియా పసిఫిక్ రూపొందించిన ‘ఏఐ ఎట్ క్రాస్‌రోడ్స్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడి అయ్యాయి.ఇదీ చదవండి: ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికి ఆటో స్పేర్పార్ట్స్ఏఐ సంబంధ రిస్కులను ఎదుర్కొనడంలో తమ సంస్థలకు తగినంత స్థాయిలో వనరులు లేవని 50 శాతం మంది పైగా టెక్ వర్కర్లు తెలిపారు.గవర్నెన్స్‌పరంగా పటిష్టమైన విధానాలను పాటించడం, నిరంతరం కొత్త సాంకేతికతల్లో శిక్షణ పొందాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోందని డెలాయిట్ వివరించింది.ఏఐ వినియోగంపై కంపెనీలకు ఆశావహ భావం కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.నైతిక విలువలతో ఏఐను వినియోగించేందుకు 60% మంది ఉద్యోగులకు నైపుణ్యాలు ఉన్నాయని తెలిపింది.ఉద్యోగాల్లో నైపుణ్యాలపరంగా ఉన్న అంతరాలను తొలగించేందుకు 72% సంస్థలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయని నివేదిక వివరించింది.విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న టెక్ కంపెనీలకు సంబంధించిన 900 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాల్గొన్నారు.