ప్రియమైన వారి గుండె చప్పుడు కోసం.. లవ్‌ లాకెట్‌ | Lub Dub Love Locket Price Details And Specifications Inside | Sakshi
Sakshi News home page

ప్రియమైన వారి గుండె చప్పుడు వినిపించే.. లవ్‌ లాకెట్‌

Mar 23 2025 11:15 AM | Updated on Mar 23 2025 11:39 AM

Lub Dub Love Locket Details

ప్రేమికులు తరచు చెప్పుకునే మాట.. ‘నా హృదయ స్పందన నువ్వేనని’. మరి ఇప్పుడు మీ ప్రియమైన వారి గుండె చప్పుడును ఎల్లప్పుడూ మీరు వినేందుకు వీలుగా రూపొందించినదే ఈ లాకెట్‌. ఇదొక లవ్‌ లాకెట్‌. దీనిని ధరించిన వారు తమ గుండె చప్పుడును తమ ప్రియమైన వ్యక్తితో పంచుకోవచ్చు.

ఇందుకోసం రెండు లాకెట్లను నేరుగా ఇద్దరు వాడుకోవచ్చు. ఒకరి వద్దే లాకెట్‌ ఉంటే, మొబైల్‌ యాప్‌లో వారి కాంటక్ట్‌ను సేవ్‌ చేసుకొని వాడాలి. లాకెట్‌లో ఉండే బటన్‌ను నొక్కినప్పుడు, మీరు ఎంచుకున్న వారికి మీ గుండె చప్పుడు ఆడియోను చేరవేస్తుంది. ధర రూ. పది నుంచి ఇరవై వేల వరకు ఉంది. వివిధ రంగుల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement