
అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుందని, బంగారం ధరలు భారీగా పెరుగుతాయని చెప్పిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు తాజాగా రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి హెచ్చరికను జారీ చేశారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
1998లో వాల్ స్ట్రీట్ కలిసి హెడ్జ్ ఫండ్ LTCM: లాంగ్ టర్మ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్‌ను బెయిల్ చేసింది. 2008లో సెంట్రల్ బ్యాంకులు వాల్ స్ట్రీట్‌ను బెయిల్ అవుట్ చేయడానికి కలిసి వచ్చాయి. 2025లో, చిరకాల స్నేహితుడు జిమ్ రికార్డ్స్, సెంట్రల్ బ్యాంకులను ఎవరు బెయిల్ అవుట్ చేయబోతున్నారని అడుగుతున్నాడు?, అని రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సంక్షోభానికి మాజీ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కారణమని ఆయన ఆరోపించారు. ప్రతి సంక్షోభం పెద్దదిగా మారుతుంది, ఎందుకంటే అవి సమస్యను ఎప్పటికీ పరిష్కరించవు. 971లో నిక్సన్ యూఎస్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించినప్పుడు ప్రారంభమైన సమస్య.. 1.6 ట్రిలియన్ డాలర్ల స్టూడెంట్ లోన్ ద్వారా ప్రేరేపితమైంది.
ఇదీ చదవండి: ప్రభుత్వ పథకంతో రోజుకు రూ. 10వేలు సంపాదించొచ్చా?: పీఐబీ క్లారిటీ..
నేను (రాబర్ట్ కియోసాకి) 25 సంవత్సరాల క్రితం రిచ్ డాడ్ పూర్ డాడ్‌లో చెప్పినట్లుగా.. ''ధనవంతులు డబ్బు కోసం పని చేయరు'', ''పొదుపు చేసేవారు ఓడిపోతారు''. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం డబ్బును ఆదా చేయడం కాదు. రాబోయే సంక్షోభం నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం.. బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లను ఆదా చేయడం మాత్రమే. ప్రత్యామ్నాయ మార్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
2012లో రిచ్ డాడ్స్ ప్రాఫసీలో నేను హెచ్చరించిన క్రాష్ ప్రారంభమైంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లను ఆదా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రాబోయే సంక్షోభం నుంచి కాపాడుకోండని రాబర్ట్ కియోసాకి తన సుదీర్ఘ ట్వీట్ ముగించారు.
In 1998 Wall Street got together and bailed out a hedge fund LTCM: Long Term Capital Management.
In 2008 the Cental Banks got together to bail out Wall Street.
In 2025, long time friend, Jim Rickards is asking who is going to bail out the Central Banks?
In other words each…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 18, 2025