Rich Dad Poor Dad
-
భయపడుతున్న‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత.. ఎందుకంటే..
ప్రముఖ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ టి కియోసాకి ప్రస్తుత మార్కెట్ అనిశ్చితులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 18 నుంచి వరుసగా పతనమవుతున్న అమెరికా మార్కెట్లను ఉద్దేశించి ‘చరిత్రలోనే భారీ పతనం రాబోతోందని భయంగా ఉంది. ఇది 1929 స్టాక్ మార్కెట్ పతనాన్ని కూడా అధిగమించగలదు’ అని తెలిపారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో కీలక వివరాలు పోస్ట్ చేశారు.‘మార్కెట్ బుడగలా ఎగిసిపడుతోంది. రాబోయే మార్కెట్ క్రాష్ చరిత్రలోనే అతిపెద్దది కావచ్చని భయమేస్తుంది. జర్మనీ, జపాన్, అమెరికా మార్కెట్లు ఇప్పటివరకు కీలకంగా వ్యవహరించాయి. దురదృష్టవశాత్తు అసమర్థ నాయకులు పెట్టుబడిదారులను ఉచ్చులోకి నెట్టారు. ఈ క్రాష్ గురించి నేను నా పుస్తకం ‘రిచ్డాడ్స్ ఫ్రొఫెసీ’లో రాశాను. ఇది 1929 గ్రేట్ డిప్రెషన్‌కు దారితీసిన పతనం కంటే పెద్దదిగా ఉండబోతుంది. ఈ సందర్భంలో కలవరపడటం, భయపడటం సాధారణం. కానీ అలా చేయకండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. 2008 మార్కెట్ పతనం సమయంలో భయాందోళనకు గురికాకుండా అమ్మకానికి ఉన్న ఆస్తుల వివరాలు సేకరించి అందులో పెట్టుబడి పెట్టాను. డీప్ డిస్కౌంట్ల్లో వాటిని పొందాను. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ మార్కెట్ భయాలు మీ జీవితకాలంలో అవకాశంగా మారొచ్చు. మార్కెట్ అంశాలు ఎంత తీవ్ర రూపం దాల్చినా మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అందుకు అనుగుణంగా మెరుగైన అవకాశాలు ఎంచుకొని పెట్టుబడి పెట్టండి. నేను రియల్ ఎస్టేట్, బంగారం, వెండి, బిట్కాయిన్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తాను’ అన్నారు.THE EVERYTHING BUBBLE is bursting. I am afraid this crash may be the biggest in history.Germany, Japan, and America have been the engines up to now. Unfortunately our incompetent leaders led us into a trap….giant crash.I wrote about this crash in my book RICH DAD’s…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 11, 2025ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి రెండు రోజుల్లో రూ.6,875 కోట్ల నష్టంనాస్డాక్ కాంపోజిట్ ఇటీవల 4 శాతానికి పైగా పడిపోగా, ఎస్ అండ్ పీ 500 దాదాపు 2.7 శాతం దిగజారింది. ఇది ఫిబ్రవరిలో దాని ఆల్ టైమ్ హై నుంచి 8.5 శాతం తగ్గింది. అమెరికా వాణిజ్య విధానాలతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. సుంకాల ప్రభావంపై అమెరికా, కెనడా, మెక్సికోలోని ఆర్థికవేత్తల్లో ఆందోళన పెరుగుతోందని రాయిటర్స్ నివేదికలు చెబుతున్నాయి. కెనడా, అమెరికా, మెక్సికో దేశాల్లో నిర్వహించిన సర్వేలో భాగంగా 74 మంది ఆర్థికవేత్తల్లో 70 మంది ఆర్థిక మాంద్యం ముప్పు పెరిగిందని, ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణానికి అవకాశం ఉందని చెబుతున్నారు. గోల్డ్ మన్ శాక్స్ తన 2025 అమెరికా వృద్ధి అంచనాను దిగువకు సవరించింది. -
చరిత్రలోనే అతిపెద్ద స్టాక్‌మార్కెట్ క్రాష్ రాబోతోందా?
ప్రఖ్యాత రచయిత, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తకాన్ని రచించిన రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) స్టాక్ మార్కెట్‌కు (stock market) సంబంధించి సంచలన జోస్యం చెప్పారు. "చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్" వచ్చే ఫిబ్రవరిలో సంభవిస్తుందని ఆయన అంచనా వేశారు. ఈ మేరకు ఆయన అందర్నీ అప్రమత్తం చేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. రాబోతున్న ఈ మహా పతనం సాంప్రదాయ పెట్టుబడి మార్కెట్లను అతలాకుతలం చేస్తుందని, అయితే వెంటనే మేల్కొని అప్రమత్తమయ్యేవారికి ఇది ఒక పెద్ద అవకాశంగా తాను చూస్తున్నట్లు కియోసాకి పేర్కొన్నారు. తన 2013 నాటి రిచ్ డాడ్ పుస్తకంలోనూ కియోసాకి రాబోయే స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి హెచ్చరించారు. గతంలో వచ్చిన అన్ని పతనాలు దీని ముందు దిగదుడుపే అని కూడా అందులో చెప్పారు.2025 ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్ భారీ క్రాష్ సంభవించే అవకాశం ఉందని కియోసాకి తాజాగా చేసిన ట్వీట్.. ఆ పుస్తకంలోని జోస్యం నిజమవుతోందని సూచిస్తోంది. అయినప్పటికీ, దీని ద్వారా వినాశనం జరుగుతుందని కియోసాకి ఏమీ భావించడం లేదు. ఈ క్రాష్ గొప్ప కొనుగోలు అవకాశాన్ని అందిస్తుందని నమ్ముతున్నారు. "ఈ క్రాష్‌లో అన్నీ విక్రయానికి వస్తాయి" అని వివరించారు. మార్కెట్ పతనం సమయంలో కార్లు, ఇళ్లు వంటివి తక్కువ ధరకు వస్తాయంటున్నారు.ఇది మంచి వార్తే..కియోసాకి ప్రకారం ఇది మంచి వార్త. స్టాక్, బాండ్ మార్కెట్ల నుండి మూలధనం ప్రత్యామ్నాయ పెట్టుబడులలోకి, ముఖ్యంగా బిట్‌కాయిన్‌లోకి ప్రవహిస్తుంది. పెట్టుబడిదారులు సురక్షితమైన, మరింత లాభదాయకమైన ఎంపికలను వెతుకుతున్నందున, క్రిప్టోకరెన్సీ భారీ వృద్ధిని అందుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. బిట్‌కాయిన్, బంగారం, వెండి వాటిలో పెట్టుబడులు పెట్టాలని కియోసాకి చాలా కాలంగా తన ఫాలోవర్లకు సూచిస్తున్నారు.భవిష్యత్తు క్రిప్టోకరెన్సీదే..సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి క్రిప్టోకరెన్సీ ఆదరణ పొందుతున్న నేపథ్యంలో బిట్‌కాయిన్‌ను సురక్షిత స్వర్గంగా కియోసాకి అభివర్ణిస్తున్నారు. మార్కెట్ అస్థిరత సమయంలో బిట్‌కాయిన్ వృద్ధికి ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుందని, ముఖ్యంగా స్టాక్‌లు, బాండ్లు వంటి సాంప్రదాయ ఆస్తులు తమ ఆకర్షణను కోల్పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. బిట్‌కాయిన్‌లో అతి చిన్న యూనిట్ అయిన సతోషి ఉన్నా కూడా గణనీయమైన సంపదకు దారితీస్తుందని కియోసాకి నొక్కిచెబుతున్నారు. 100 మిలియన్ల సతోషిలు కలిపితే ఒక బిట్‌కాయిన్. కియోసాకి అంచనా వేసిన మార్కెట్ క్రాష్ సమయం సమీపిస్తున్న కొద్దీ ఇన్వెస్టర్లలో గుబులు పుడుతుంటే ఆయన జోస్యం నిజమవుతుందా లేదా అని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది.In RICH DADs PROPHECY-2013 I warned the buggiest stock market crash in history was coming. That crash will be in February 2025.Good news because in a crash everything goes on sale. Cars and houses on sale now.Better news billions will leave the stock and bond markets and…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 27, 2025