
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఇప్పటికే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ స్థితిని గురించి హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా స్టాక్ మార్కెట్ క్రాష్ సూచికలు స్టాక్‌లలో భారీ పతనాన్ని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
''స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చూసిస్తున్నాయి. స్టాక్‌లలో భారీ పతనం గురించి హెచ్చరిస్తున్నాయి. అయితే బంగారం, వెండి, బిట్‌కాయిన్ యజమానులకు శుభవార్త'' అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాలు పెట్టుబడిదారుల్లో కొంత భయాన్ని రేకెత్తించాయి. ఈ కారణంగానే స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ సమయంలో స్థిరమైన రాబడి కోరుకునేవారు మాత్రం బంగారం, వెండి వంటివాటిలో మాత్రమే కాకుండా బిట్‌కాయిన్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది మంచి రాబడని తీసుకొస్తుందని. రాబోయే ఆర్ధిక మాంద్యం సమయంలో ఇవే కాపాడతాయని కియోసాకి పేర్కొన్నారు.
Stock market crash indicators warning of massive crash in stocks.
Good news for gold, silver, and Bitcoin owners.
Bad news for Baby Boomers with 401 k.
Take care.
— Robert Kiyosaki (@theRealKiyosaki) August 11, 2025
డొనాల్డ్ ట్రంప్ గ్రేట్!
అమెరికన్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన 401(కె) రిటైర్మెంట్ ప్లాన్ల బ్యాలెన్స్‌లలో ఉన్న నిధులను డిజిటల్ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. దీనిని రాబర్ట్ కియోసాకి ప్రశంసించారు. బిట్‌కాయిన్ కొనుగోలుకు ప్రజలు తమ రిటైర్మెంట్ పొదుపును ఖర్చు చేయడానికి ట్రంప్ అనుమతించడం గొప్ప వార్త. ఆయన గొప్ప అధ్యక్షుడు, గొప్ప నాయకుడు. మీరు బిట్‌కాయిన్ సేవ్ చేస్తున్నారా?’ అని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే?